23, ఆగస్టు 2020, ఆదివారం

ఓ కమలాప్త!

ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వర మనోహర! యో విమలప్రభావ! రా
వే! కరుణింపవే! తలఁపవే! శరణార్థిని నన్నుగావవే!
**************

శ్రీ ఆంజనేయ షోడశరత్నమాలికా స్తోత్రం


1) గిరిరాజకన్యకాగర్భసంభూతాయ
  గణేశకుమారదేవదివ్యప్రభావాయ
   ఘనశ్రేష్ఠవైరాగ్యసుసంపన్నాయ
  ఆంజనేయాయ మహాబలాయ ||

2) ఘననవవ్యాకరణవినీతాయ
   రామనామాంకితదేహాయ
   సీతాన్వేషణతత్పరాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||

3) దుర్లభసంజీవనపర్వతోద్ధారకాయ
   అంగదజాంబవంతాదిపూజితాయ
   రామానుజప్రాణరక్షకాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||

4) సీతామనోదుఃఖనివారకాయ
   అహిమహిరావణసంహరాయ
   అశేషబలశౌర్యప్రదాయకాయ 
   ఆంజనేయాయ మహాబలాయ ||

5) నాగవల్లీదళమాలాధరాయ
    గంధమాదనశైలనివాసాయ
    సకలదేవతాగణపూజితాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

6) సుగ్రీవభయవారకరాజ్యదాయ
   మంత్రయంత్రతంత్రస్వరూపాయ
   భక్తమనోరథక్షిప్రప్రదాయకాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||

7) దానవభయంకరవజ్రాంగదేహాయ
   బహుభాషాకోవిదమృదుభాషణాయ
   మహిమోపేతప్రజ్ఞాశీలపంచాననాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||

8) బ్రహ్మవిద్యాదాయకగురుస్వరూపాయ 
   పాండవమధ్యమరధధ్వజాగ్రవాసాయ
   వారధిబంధనసమయసహాయకాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||

9) ఉష్ట్రవాహనారూఢాయ
  సువర్చలాసమేతాయ
  శ్రీవిద్యాఉపాసకాయ
  ఆంజనేయాయ మహాబలాయ ||

10) యజ్ఞహవిష్యస్వీకృతపవమానస్వరూపాయ 
    సుందరపావనకదళీవననివాసవిగ్రహాయ
    వరబలగర్వితరావణదర్పాపహారాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

11) వశిష్ఠకుంభోద్భవగౌతమాదిపూజితాయ
    భూతప్రేతపిశాచసంఘభయనివారకాయ
    బాలభానుకందుకభావితబాలభీమాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

12) ప్రహస్తాక్షయకుమారాదిదానవసంహరాయ 
    అష్టసిద్ధినవనిధిప్రదాయకభక్తసులభాయ
    అతీవబలపరాక్రమప్రదర్శకగదాధరాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

13) రామపాదుకాశిరోధార్యభరతసమానాయ
    రామకథాశ్రవణపులకాంకితధన్యశరీరాయ
    రాజ్యపదవీకాంక్షరహితనిర్మలమానసాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

14) సూక్ష్మభావగ్రాహ్యపింగళాక్షాయ
    మైనాకస్నేహపూర్వకఆహ్వానస్వీకృతాయ
    రామసుగ్రీవస్నేహవారధిబంధనాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

15) భక్తసంక్షేమప్రదసింధూరాంకితవిగ్రహాయ
       వేదవేదాంతపూజితమృదుపల్లవపదాయ
       లంకావిదాహకఅశోకవనభంజనాయ
       ఆంజనేయాయ మహాబలాయ ||

16) కేయూరమణిమాణిక్యాభూషణమకరకుండలాయ
      సకలపాపౌఘవారణనిజభక్తహృదయమందిరాయ
      సహస్రారస్థితఆనందామృతరసపానమత్తభృంగాయ
      ఆంజనేయాయ మహాబలాయ ||

సర్వం శ్రీ ఆంజనేయదివ్యచరణారవిందార్పణమస్తు
****************

--- వినాయకునికి పద్యాల నైవేద్యం ---------


వినాయకచవితి తెలుగువాళ్ళకి ఆహ్లాదకరమైన పండగ. వినాయకుడంటే తెలుగువాళ్ళందరికీ ఒక రకమైన ఆప్యాయత. ఎందుకో మరి! అతని రూపమే చిత్రం! అతని వాహనం మరీ విచిత్రం! ఇష్టమైన పిండివంటలు సరే సరి! మరే దేవుణ్ణైనా మనం గడ్డితో పూజిస్తామా! అతనితో ఎన్ని సరదాలు, మరెన్ని సరాగాలు! ఆ చనువుతోనే కాబోలు నిన్న రాత్రి ఎలక గుఱ్ఱాన్నెక్కి సరాసరి నా కల్లోకి వచ్చేసి పిచ్చాపాటీ మొదలుపెట్టాడా స్వామి!

వినాయకుడు: రేపు వినాయకచవితి గుర్తుందా!

నేను: అయ్యో ఎంత మాట! నాకు గుర్తులేకపోవడమేమిటి, మాకు సెలవు కూడానూ!

వినాయకుడు: అయితే మరి నాకేం నైవేద్యం పెడుతున్నావ్?

నేను: అదీ...మరీ...స్వామీ... మా ఆవిడ ఉండ్రాళ్ళో ఏవో చేస్తానంది. ఆవిడ దయా మీ ప్రాప్తం!

వినాయకుడు: అది కాదోయ్! నువ్వు పెట్టే నైవేద్యమేవిటీ అని అడుగుతున్నా...

నేను: నేనా? ఏంటంటున్నారు స్వామీ?

వినాయకుడు: అదేనయ్యా, నీ బ్లాగులో పండగలకీ పబ్బాలకీ పద్యాలు వేస్తున్నావు కదా! ఆ తెలుగు పద్యాల ప్రసాదం గురించి నేనడుగుతున్నది.

నేను: ఓ, అదా! అయినా మా తెలుగు పద్యాలు మీకు ఆనతాయా అని...

వినాయకుడు: అదేంటయ్యా అలా అంటావ్! అసలు నాకు సంస్కృతశ్లోకాల కన్నా తెలుగు పద్యాలే ప్రీతిపాత్రం తెలుసా!

నేను: అవునా స్వామీ! అదేం?

వినాయకుడు: నన్ను తల్చుకోగానే అందరికీ గుర్తుకొచ్చే సంస్కృత శ్లోకం ఏంటో చెప్పు.

నేను: శుక్లాంబరధరం విష్ణుం...

వినాయకుడు: అవునా! మరి నన్ను తల్చుకోగానే గుర్తుకొచ్చే మీ తెలుగు పద్యం ఏవిటి?

నేను: తోండము నేకదంతమును...

వినాయకుడు: ఊ...పూర్తిగా చదువు.

నేను:
తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్
కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!

వినాయకుడు: చూసావా! నువ్వు చదివిన ఆ సంస్కృత శ్లోకం నేనుకూడా చాలా కాలంనుంచీ నా గురించే అనుకుంటున్నాను. కానీ కొంతమంది అది నాది కాదు, అసలందులో నాగురించి ఏవిటుందని సందేహం వెలిబుచ్చారు. దాంతో నాక్కూడా అనుమానం వచ్చేసింది, అది నా గురించేనా అని. అదే మీ తెలుగు పద్యం చూడు. స్పష్టంగా, వివరంగా నా గురించి ఎంత చక్కగా చెప్తోందో! అందికే మీ తెలుగు పద్యాలంటే నాకిష్టం!

నేను: బావుంది స్వామీ! మీకు తెలుగు పద్యాలిష్టమని విని చాలా ఆనందంగా ఉంది!

వినాయకుడు: మీ తెలుగు కవులు ఎన్నెన్ని రకాలుగా నన్ను ప్రస్తుతించారు! అవన్నీ గుర్తు చేసుకుంటే నా బొజ్జ నిండిపోతుందనుకో!

నేను: అలాగా!

వినాయకుడు: అవునయ్యా! అతనెవరూ... జిగిబిగి కవిత్వం రాసాడు. ఆ... అల్లసాని పెద్దన. అతను బలే గడుసువాడు సుమా! నా గురించి బలే పద్యాన్ని రాసాడు. ఏదీ ఆ పద్యం ఒక్కసారి చదివి వినిపించూ.

నేను:
అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!

వినాయకుడు: తస్సాదియ్యా! కవంటే ఇతనేనయ్యా. నాక్కూడా ఎప్పుడూ రాలేదిలాంటి అల్లరి ఆలోచన! దీనికి మీ విమర్శకులేవో చాలా లోతైన విశ్లేషణలు చేస్తారు. అసలిది నా గురించే కాదనీ ఏదో వేదాంతం చెప్తారు. కానీ నాకవేవీ పట్టవు. నా గురించి అలాటి చమత్కారమైన ఆలోచన చేసాడు చూడూ! అది నాకు బలే బలే అద్భుతంగా అనిపించింది.

నేను: అవును స్వామీ! పెద్దనవలె కృతిసెప్పిన పెద్దనవలె అని అందుకేగా మేం అనుకునేది! అయితే ఇంతకన్నా ముందే కేతన కవి ఇలాంటిదే మరో చిత్రమైన ఆట మీచేత ఆడించాడు స్వామీ!

వినాయకుడు: అవునా! ఎందులో? ఏదీ ఆ పద్యం కూడా వినిపించు మరి.

నేను: ఈ పద్యం దశకుమారచరిత్రములోది. వినండి.
గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా
మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం
పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!

వినాయకుడు: ఓరి మీ అసాధ్యంగూలా! మీ తెలుగుకవులు భలే వాళ్ళయ్యా! నా చేత ఎన్నెన్ని చిత్రమైన చేతలు చేయించారూ! నా రెండు చేతులతోనూ మా నాన్న రెండు కళ్ళూ మూసేసి, మా నాన్న మూడో కంటిని నా మూడో చేత్తో, "హస్తంతో", అంటే తొండంతో మూసేసానా! ఆ నిప్పుకంటి జోలికి వెళితే నా తొండమేం గానూ!

నేను: పొండి స్వామీ మీరు మరీను! పరమేశ్వరుని చిత్తం చిగురిస్తే, ఆ కన్ను మంటలు కురిపిస్తుందా ముద్దులు కురిపిస్తుంది కానీ.

వినాయకుడు: ఆలా అంటావా! అయితే ఓకే. ఇంతకీ, నన్ను మొట్టమొదట కావ్యంలో ప్రత్యేకంగా స్తుతించిన కవి ఎవరో చెప్పు?

నేను: నన్నెచోడుడు అనుకుంటాను స్వామీ!

వినాయకుడు: ఓహో! అతనే కదూ మా తమ్ముడు పుట్టుకగురించి కుమారసంభవం తెలుగులో రాసిన కవి. ఏదీ అతను రాసిన పద్యం వినిపించు.

నేను: చిత్తం.
తను వసితాంబుదంబు, సితదంతముఖం బచిరాంశు, వాత్మ గ
ర్జన మురుగర్జనంబు, గర సద్రుచి శక్రశరాసనంబునై
చన మదవారివృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నా
జను గణనాథు గొల్తు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్!

వినాయకుడు: బావుందయ్యా! నన్ను కాస్తా నల్లనివాణ్ణి చేసేసి వర్షాకాలంతో పోల్చాడే యీ కవి! మరి నేను పుట్టింది వానాకాలంలోనే కదా! ఇంకా ఎవరెవరు ఏం చమత్కారాలు చేసారో త్వరగా వినిపించు.

నేను: కాస్త ప్రౌఢమైన చమత్కారమేదో చేసిన కవి ఒకడున్నాడు స్వామీ. అతను రామరాజభూషణుడు, ఉరఫ్ భట్టుమూర్తి. ఆ పద్యం నాకు సరిగా అర్థం కాలేదు. మీరే వివరించాలి!

వినాయకుడు: ఏవిటి నేనా! ఇప్పుడంత సమయం లేదే. సరే చదువు చూద్దాం.

నేను:
దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహముం
గంతుద్వేషికి గూర్చి శైలజకు దద్గంగాఝరాచాంతి న
త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతంబు ల్వెలయింపజాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్!

వినాయకుడు: అబ్బో, యీ భట్టుమూర్తి చాలా ఘటికుడయ్యా! వాక్యాలని అటూ ఇటూ చేసి అన్వయం కష్టం చేసిపారేసాడు! మధ్యలో శ్లేష ఒకటి!
నా తొండంతో ముందు గంగ నీళ్ళన్నీ పీల్చేసి సవతిపోరు లేకుండా మా అమ్మ పార్వతికి ఆనందాన్ని ఇచ్చానట! తర్వాత నా దంతంతో వెండి కొండని ఒక్కసారి కదిలిస్తే, ఆ ఊపుకి, మా తల్లి పార్వతి మా తండ్రి శివదేవుని దగ్గరగా హత్తుకొందిట. ఆ రకంగా తండ్రికి ఆనందాన్ని కలిగించేనట. ఇలా తల్లిదండ్రులిద్దరికీ ఆనందాన్ని చేకూర్చి నేను వాళ్ళ కుమారులలో అగ్రస్థానాన్ని (కుమారస్వామికి అన్ననే కదా!) సంపాదించానట. దానికి నన్ను ప్రశంసిస్తున్నాడోయ్ మీ భట్టుమూర్తి!

నేను: బాగా వివిరించారు స్వామీ! స్వయంగా మీ నోటితో దీని వివరణ వినడం పరమానందంగా ఉంది!

వినాయకుడు: అది సరేగానీ, ఇన్నేసి చమత్కారాలు గుప్పించిన పద్యాలు కాకుండా, వినసొంపుగా హాయిగా మనసుకి హత్తుకొనే పద్యాలు ఎవరూ రాయలేదా?

నేను: ఎందుకు రాయలేదు స్వామీ! అలాటివాటికి పెట్టింది పేరు పోతన, ఆ తర్వాత కొంతవరకూ మొల్ల.

వినాయకుడు: అయితే తొందరగా వినిపించు మరి!

నేను: పోతన తనకి సహజమైన అంత్యప్రాసలతో రాసిన పద్యం ఇదిగో:

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
సాదికి దోషభేదికి బ్రసన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషికసాదికి సుప్రసాదికిన్!

వినాయకుడు: ఆహా! పోతన పద్యంలో తీయని మకరంద ధార జాలువారుతునే ఉంటుంది. మరి మొల్ల పద్యమో?

నేను: చిత్తం సిద్ధం!

చంద్రఖండ కలాపు జారు వామనరూపు
గలిత చంచలకర్ణు గమల వర్ణు
మోదకోజ్జ్వలబాహు మూషికోత్తమవాహు
భద్రేభవదను సద్భక్తసదను
సన్ముని స్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు
ననుదినామోదు విద్యాప్రసాదు
బరశువరాభ్యాసు బాశాంకుశోల్లాసు
నురుతరఖ్యాతు నాగోపవీతు

లోకవందిత గుణవంతు నేకదంతు
నతుల హేరంబు సత్కరుణావలంబు
విమల రవికోటితేజు శ్రీవిఘ్నరాజు
బ్రథిత వాక్ప్రౌఢికై యెప్డు ప్రస్తుతింతు!

వినాయకుడు: చాలా బావుంది! సీసంలోని తూగు మరే పద్యానికొస్తుంది! అన్నట్టు సీసమనగానే గుర్తుకొచ్చింది. అసలుసిసలు తెలుగుకవి, మీ శ్రీనాథ కవిసార్వభౌముడు నా గురించేమీ రాయలేదా?

నేను: అయ్యో పొరపాటైపోయింది స్వామీ! మరచిపోయాను. ఇదిగో మీ గురించి అతను రాసిన సీసం!

కలితశుండాదండ గండూషితోన్ముక్త
సప్తసాగర మహాజలధరములు
వప్రక్రియా కేళివశ విశీర్ణ సువర్ణ
మేదినీధర రత్నమేఖలములు
పక్వ జంబూఫల ప్రకటసంభావనా
చుంబిత భూభృత్కదంబకములు
వికట కండూల గండక దేహమండలీ
ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు

శాంభవీశంభు లోచనోత్సవ కరములు
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోపశాంతి గావించు గాత!

వినాయకుడు: అబ్బబ్బా! ఏవి ధారా, ఏవి ధారా! ఇందుకేగా ఇతన్ని ప్రసిద్ధ ధారాధుని అని పిలిచేది. సెభాష్!
అవునూ, నువ్వందరూ పాతకవులనే చెప్తున్నావ్, ఆధునిక కాలంలో నా గురించి పట్టించుకున్న కవే లేడా ఏంటి?

నేను: అయ్యో లేకేం స్వామీ! పైన చెప్పిన కవులందరూ తమ కావ్యాల్లో ఒక పద్యంలో మిమ్మల్ని స్తుతిస్తే, ఏకంగా ఒక పద్య ఖండికనే మీకు సమర్పించిన ఆధునిక కవి ఒకరున్నారు. అతనే, కరుణశ్రీ అలియాస్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. తన ఉదయశ్రీలో మీకు "నమస్తే" చెప్పారు.

వినాయకుడు: అవన్నీ వినడానికి ఇప్పుడు నాకు సమయం చాలదు. అవతల మీవాళ్ళందరూ నన్ను ఎన్నెన్ని రూపాల్లో తయారుచేసారో, ఎన్నెన్ని పిండివంటలు చేసారో చూడ్డానికి వాహ్యాళికి వెళ్ళాలి. నువ్వు కూడా తొందరగా నిద్రలేచి పూజ చేసుకోవాలి కదా! మచ్చుకి ఒక్క పద్యం వినిపించు చాలు. ఆనక మిగతావి వింటాను.

నేను: సరే అలాగే స్వామీ! చిత్తగించండి.

ఎలుకగుఱ్ఱము మీద నీరేడు భువనాలు
పరుగెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
"నల్లమామా!" యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుఱ్ఱ
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోముపంట

అమరులందగ్ర తాంబూలమందు మేటి
ఆఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!

వినాయకుడు: నేను విష్ణుమూర్తిని "నల్ల మామా" అని ఆటపట్టిస్తానా! ఆహా బలే అయిడియా ఇచ్చాడే ఇతను! ఎంతైనా మీ తెలుగుకవులకి సరసం ఎక్కువే సుమీ!
మొత్తానికివాళ పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం చేసినట్టుంది! బావుంది నీ పద్య నైవేద్యం!
కాకపోతే ఇన్ని పద్యాలు చూసి నాకొకటే లోటుగా అనిపిస్తోంది.

నేను: లోటా! ఏవిటి స్వామీ?

వినాయకుడు: మీ తెలుగు కవులు ఇందరిగురించి కావ్యాలు రాసి, నా గురించి మాత్రం రాయలేదే అని వెలితిగా అనిపిస్తోంది. మా తమ్ముడు కుమారస్వామి గురించి కూడా వెయ్యేళ్ళ కిందటే ఎవరో రాసారని చెప్పావే, మరి ఇన్నాళ్ళై నా కథని ఎవరూ కావ్యంగా ఎందుకు రాయలేదు?

నేను: అవును స్వామీ! మీరు చెప్పే దాకా నాక్కూడా తట్టలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యంగానే ఉంది.

వినాయకుడు: పోనీలే. ఇంతమంది రాసిన పద్యాలు చెప్పేవు కదా. సొంతంగా నువ్వొక్క పద్యం నా గురించి యిప్పుడు చెప్పకూడదూ. విని దానితోనే సంతృప్తి పడతాను.

నేను: అయ్యో అంత కన్నా మరో భాగ్యం ఉంటుందా! అవధరించండి!

శ్రీకంఠుని సతి ప్రేమకి
నాకారమ్మైన సామి! హరుని దయన్ నూ
త్నాకృతి దాల్చిన గజముఖ!
చేకూర్చుము సిద్ధి బుద్ధి స్థిరముగ మాకున్!

నేనిలా పద్యం చదివానో లేదో, అలా అదృశ్యమైపోయాడా గణనాథుడు! నా పద్య ప్రభావమేనో ఏమో! సరే పొద్దున్న యథావిథిగా పూజా కార్యక్రమాలు సాగించి, మా ఆవిడ చేసిన పిండివంటలు స్వామికి నైవేద్యం పెట్టి నేను తిని, ఇదిగో నా నైవేద్యాన్ని మీ ముందు పెట్టాను. ఆరగించండి మరి!
   (వాట్స్ ఆప్ సందేశం )
*********************

అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు


ప్రశ్నికుడు:-
1 . రైలు పట్టాలకూ,
     కాలి పట్టాలకూ
     అనుబంధం ఏమిటి?

అవధాని:-
రైలు పట్టాల మీద వుంటుంది,
కాలి మీద పట్టాలుంటాయి.

ప్రాశ్నికుడు:-
2 . కనలేని స్త్రీమూర్తి ఎవరు?

అవధాని:-
న్యాయస్థానములో వున్న
న్యాయదేవత. కళ్ళకు గంతలు కట్టి వుంటారు కదా!

ప్రా:-
3 . సోమవారాన్ని 'మండే'       అనెందుకంటారు?
అవ:-
ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము కదా సోమవారం పొద్దున్నే
పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా!
అందుకని 'మండే' అంటారు.
ప్రా:-
4 . ఒక పిల్లవాడు ఇంటినుండి పారిపోతే కనిపించుటలేదు అని ప్రకటిస్తారు కదా! దానికి పిల్లాడి స్పందన ఏమిటి?
అవ:-
కని-పెంచుట లేదు .
ప్రా:-
5 . ఈ రోజుల్లో పిల్లలు
     తల్లిని Head Cook గా
     చూస్తున్నారు .
     మరి తండ్రిని
     ఎలాచూస్తున్నారు?
అవ:-
ATM లాగా చూస్తున్నారు.
ప్రా:-
6 . సభలో ఎవరైనా
      ఆవులిస్తే మీరేమి చేస్తారు?
అవ:-
పాలిచ్చేవైతే అవధానం
అయ్యాక యింటికి తోలుకెళ్తా .
ప్రా:-
7 . మనిషికి
      ఆనందాన్నిచ్చే సిటీ ఏది?
అవ:-
'పబ్లిసిటీ '
ప్రా:-
8 . తుద+ తుద = తుట్టతుద,
      కడ  + కడ = కట్టకడ
      అవుతుంది కదా!
      అరటి + అరటి
      ఏమవుతువుంది?
అవ:-
అర టీ + అర టీ
ఫుల్ టీ అవుతుంది.
ప్రా:-
9 . క్రికెట్ ప్లేయరుకీ,
     అవధానికీ
     సామ్యం ఉందా?
అవ:-
వాళ్ళు  world play కి వెళ్తారు ,
మేము  words play కి వెళ్తాము.
ప్రా:-
10 . 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నాడు వేమన, ఇప్పుడు మీరేమంటారు?
అవ:-
"పురుషులందు
పుణ్యపురుషులు
ఏరయా? అంటాను.
ప్రా:-
11 . దేవుని గుడికి
        తాళం వెయ్యాలా?         
అవ:-
భజన జరిగే చోట
తాళం తప్పనిసరి.
ప్రా:-
12 . అద్దం ముందున్న
        ఆడువారికీ,
        మైకు ముందున్న
        అమాత్యులకీ
        తేడా ఏమిటి?
అవ:-
ఇద్దరికీ సమయం తెలియదు!

 చదివి ఆనందించండి - పద ప్రయోగ వినోదాన్ని పదిమందికీ పంచండి......ఇట్లు ఒద్దిరాజు రంగారావు..స్వచ్ఛమైన.నవ్వు నవ్వండి మన భాషను అందులోని గాంభీర్యాన్ని సొబగులను తెలుసుకోండి.👏

పూర్వ భారతము




 కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్
* లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
* తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
* పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం * మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
* నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్
* జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
* మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప ్రదేశ్
* శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
* దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
* పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
* మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
* నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
* వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
* నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
* రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
* సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర
* హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
* మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
* వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
* కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్
* మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్
* ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
* గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా
* కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
* పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
* కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్
* శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
* హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
* కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
* చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్
* కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా, మధ్యప్రదేశ్
* ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర
* కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
* పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
* కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్
* జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్
* కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
* మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
* విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
* శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
* ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
* నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
* జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
* కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్ See* బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
* గౌతమ బుద్ధుడు పరినిర్య ాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్
********************

లోకులు కాకులు.....



ఒక వూరులో ఒక పెంకుటింటి అరుగు పై కూర్చుని తీపి బూందీ తింటున్నాడో పిల్లవాడు. పొట్లంలో ఉన్నవి తినేసి ఖాలీ పొట్లం ఉండ చుట్టి విసిరేశాడు. దానిని చూసిన ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకుని వెళ్లి ఒక గోడపై వాలింది. కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి.

ఆనందం తో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి. అయితే.. అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది. అప్పుడు ఆ కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో వున్న బూరెను లాగింది. అది రాలేదు. మరోసారి ప్రయత్నించింది అమాయకంగా. దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది. అప్పుడు ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది.

ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఇంకో కాకి చూసింది. ఎగిరిపోయిన కాకి తెలివి తక్కువతానానికి నవ్వుకుంది. ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా..

మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి. ఉత్తుత్తి బూరె కోసం కాకి పాట్లు తలుచుకుని మళ్ళీ నవ్వింది. మూడో కాకి ఈ విషయం ఇంకో కాకికి చెప్పింది. 'అయినా కాకి నోట్లో బూరెను లాక్కోవడం తప్పు కదా' అంటూ ముగించింది. తన వర్ణనలో 'ఇది నిజం కాకి కాదు కాగితంలో కాకి చిత్రం' అనే విషయం చేర్చలేదు.

ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది. 'తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడానూ' అంటూ మరో మాట చేర్చింది. ఈ కాకులు అన్ని ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి.

వాటిలో ఓ కాకి అయితే 'కాకి కన్ను పొడిస్తే.. పాపం.. రక్తం కారిందట కూడానూ' అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది. మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్లి 'ఆ గోడపై రక్తపు చారికలు చూసాను' అంటూ వాపోయింది. మరో కాకి 'నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది' అంటూ చెప్పుకుని సానుభూతి పొందింది.

అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడి కాకిగా ముద్రవేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి. ఇవేమీ ఎరుగని మొదట కాకి సాయంత్రం తన గూటికి చేరుకుని తోటి కాకులును స్నేహంగా చూసింది. అప్పటిదాకా గుసగుసలాడుకున్న కాకులు చప్పున మాటలు ఆపి మూగ భావంగా తలలు తిప్పుకున్నాయి.

కాకికి ఏమి అర్థంకాలేదు. రెండు రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసులు తున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది.

"ఒక్కోసారి అంతే.. మన ప్రమేయం ఏమి లేకుండానే మనని సమాజం చెడ్డ వాళ్ళని చేసేస్తుంది. నీలాప నిందలు, పుకార్లమయం ఈ లోకం. మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధ పడక్కర్లేదు. సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకోండి చాలు. అలాంటి వందల మంది నీకేలా.." అంటూ ఓదార్చింది కొమ్మమీద ఒక కోయిలమ్మ..

సూక్తి... ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, అతనితో స్నేహం చేయకుండా, అతనిని పూర్తిగా పరిశీలించకుండా పుకార్లు నమ్మటం, పూర్తిగా పరిచయం లేని ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం వలన, ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోవటమే కాదు, అదే సమాజంలో నీ విలువ కూడా పోగొట్టుకుంటున్నావనే విషయాన్ని  గ్రహించాలి...

అందుకే.. లోకులు కాకులు అన్న సూక్తి ఊరుకునే రాలేదు సుమీ.
*****************

పద్యాలూ

కుదువంబెట్టినపట్టుచీరె చదువన్గూర్పంగశ్రద్ధన్ గురుల్
సదయుండాహనుమంతుడే బహువిధాసక్తుల్ మదిందీర్ప తా
నెదిరిం లెక్కయొనర్పనట్టి దృఢతే నిన్విశ్వమేమెచ్చగా
కొదమంసింగముజేసె సైమనును ఢీకొట్టం బ్రకాశాహ్వయా!

త్యాగమె నిజరూపముగా
యోగమ్మేన్యాయవాదనోద్యోగము, గాం
ధీ గమనమె నీబాటగ
సాగిన ధీరా ప్రకాశ సార్థకనామా!

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం
***********

అప్పుల పాలు అవ్వడం ఎలా...!?*

_1. మనకు ఏం అవసరం ఉన్నాయో ఎంత మేరకు అవసరం ఉన్నాయో మనకు తెలియకపోవడం మొదటి కారణం._

_2. Peer pressure. మన చుట్టుపక్కల వారిని చూసి వాళ్ళలాగా మనం గొప్పగా బ్రతకాలనుకోవటం, వాళ్ళలాగా బ్రాండెడ్ ఐటమ్స్ maintain చేస్తూ స్టేటస్ maintain చేయాలనుకోవటం (ఈ వ్యాధి అన్ని age groups లో ఉంది.) ఈ జబ్బు ఉన్నవారు తీవ్రమైన ఆత్మనూన్యత భావనలో ఉంటారు, వీరి సంతోషం, ఆనందం వస్తువులో ఉంటుంది కానీ నిజ జీవితంలో ఉండదు !_

_3. పండుగ ఆఫర్ ఉంది అంటే చాలు ఏదో ఒకటి కొని తీరాలని తాపత్రయం, అక్షయ త్రిత్యా నాడు బంగారం కొనకపోతే అదృష్టం పోతుందని అప్పు చేసి మరీ బంగారం కొనటం._

_4. ఇక విషయానికి వస్తే ముందుగా మనం వేసుకునే బట్టల గురించి మాట్లాడుకోవాలి. 70% wardrobe మనం use చేయము అంటే ఏదో ఆత్రంతో బట్టలు కొంటాం. కానీ 70% బట్టల్ని మనం use చేయం. ఈలోగా ఇంకో కొత్త model మార్కెట్లోకి వచ్చేస్తుంటుంది. ఆడవాళ్లు అయితే పట్టు చీరలు, designer wear బట్టలు చూసుకొని మురవటానికి, బీరువాలో మురిగిపోవటానికి, మహా ఐతే ఉతికి, డ్రై క్లీనింగ్ చేసి మళ్ళీ దాచిపెట్టుకోడానికి తప్ప దేనికీ ఉపయోగం లేదు._

_5. ఏదో బ్యాంక్ వాడు ఫోన్ చేసి sir/madam మీ పేరు మీద క్రెడిట్ కార్డ్ వచ్చింది.. zero percent interest అంటే వెనక ముందు ఆలోచించకుండా credit card తీసుకొని అవసరం లేకపోయినా షాపింగ్ చేయటం. Ex:- washing machines, mobiles, refrigirators, home appliances, gold లాంటిి luxury items కొనటం._

_6. మనకు రూపాయి లాభం లేకపోతే మనం ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టం. అలాంటిది అంత పెద్ద బ్యాంక్ వాడు మనకు ఇంటికి వచ్చి మరి credit card ఇస్తున్నాడు అంటే దాని వెనకాల ఉన్న కుట్ర మనకు అర్ధం అవ్వదు. ఎందుకంటే మనకు ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగాలని అనిపిస్తది._

_7. ఎవడో celebrity డ్రోన్ కెమెరా use చేసి పెళ్ళిని సినిమా లాగా shoot చేశాడు అని.. పెళ్ళి మళ్ళీ మళ్ళీ చేసుకోమ్ కదా అని.. మనం కూడా try చేయడం. ఇకపోతే పల్లెటూర్లలో రైతులు స్థోమతకి మించి కట్నం ఇవ్వటం.. పేరు కోసం పెళ్ళి grand గా చేయటం.._

_8. Consumerismని ప్రోత్సహించడానికి ఇలాంటివి చేస్తుంటారు అంటారు కానీ ఎంత మందికి తెలుసు ఇలా ఆఫర్లో వచ్చే వస్తువులు నాసిరకం సరుకు అని. వాటిని అమ్ముకోటానికి బ్యాంక్ లతో కలిసి companies చేసే కుట్ర అని. మనల్ని debt trap లోకి దించి జీవితాంతం addicted+psuedo lifestyle అలవాటు చేయడం అని._

_9. మనం ఎంత భావదరిద్రంతో బాధపడుతున్నాం అంటే లైఫ్ మొత్తం పక్క వాళ్ళని అనుకరించటం, అనుసరించటం, మన చుట్టాలు, కొలీగ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఏం చేస్తే మనం అలా చేయకపోతే పరువు పోతుందేమో అనే స్థాయికి చేరుకొంది పరిస్థితి !_

_10. Last but not the least, happiness of a person doesn't come out of Luxury's. Happiness is within you._

_Ex:- 5 crores value చేసే కారు ఉంటే ఏం లాభ
_మనతో స్వచ్ఛమైన మనసుతో ప్రయాణం చేసే వారు లేనప్పుడు, కోటి రూపాయల విలువైన bed ఉంటే ఏం లాభం ? నిద్ర సరిగా పట్టనపుడు. యాబై లక్షల విలువైన rolex watch ఉంటే ఎం లాభం? కుటుంబంతో, ఫ్రెండ్స్తో, తనతో తాను time spend చేయలేనప్పుడు !_
***************

వినాయకుడు

మొట్టమొదటిగా పూజింపబడవలసిన దైవం వినాయకుడు. ఎందుచేత ఆయన్ని అలా ప్రారంభంలో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఆయన విఘ్నకారకుడు. అలాగే విఘ్న నాశకుడు. ఆయనే విఘ్నాలు నశింప చేస్తాడు. అదేమిటి ఆయన విఘ్నాలు నశింపచేస్తాడు బాగానే ఉంది. కానీ విఘ్నాలు కలుగచేస్తాడు అన్నమాట అంత సమంజసంగా ఉంటుందా? అలా తత్త్వం ఎందుకుంటుంది? సాధారణంగా ఏదైనా కార్యక్రమం మనం ప్రారంభించినపుడు మనం చెప్పవలసిన శ్లోకం ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభించే ముందు ఆ రోజు దినచర్యని ప్రారంభించే ముందు పూజ కార్యక్రమము మొట్టమొదట చెప్పవలసిన శ్లోకం:
“సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమకేతుః గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజః
షోడశైతాని నామాని పఠేశృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే!!
ఇందులో విఘ్నేశ్వరుడికి 16నామాలు చెపుతారు. ఈ పదహారు నామాలు షోడశైతాని నామాని. విఘ్నేశ్వరుడికి ఎప్పుడూ కూడా 21 అంకెమీదే ఉంటాయి. ఏవైనా కూడా 21 అంకెమీదే ఉంటాయి. ఏకవింశతి పత్రాణి అని 21 పత్రులతో పూజ. అలాగే 21 రకముల పుష్పాలతో పూజ. అలాగే 21 సంఖ్యతో పిండివంటలు చేసి నివేదించడం అనే పధ్ధతి కూడా ఒకటి ఉంది. కానీ ఈ శ్లోకములో షోడశైతాని నామాని పఠేశృణుయాదపి అంటే 16 అంకె గురించి చెప్తున్నారు. మేము విఘ్నేశ్వరుడికి 16 నామాలు చెప్తున్నాము. ఈ 16 నామాలు కూడా మీరు చెప్పండి అని చెప్పట్లేదు. మీరు చెపితే మంచిది. చెప్పకపోతే కనీసం వినండి అంటున్నారు. మీరు చెప్పగలిగి ఉండాలి. యః పఠేశృణుయాదపి మీరు చెప్పగలిగి ఉండాలి. ఒకవేళ ఏ కారణం చేతనయినా మేము 16 నామాలు చెప్పలేము. మాకు నోరు తిరగదు అనో లేకపోతే మేము ధారణ చెయ్యలేము అనో చూసి చదవడం కూడా చేతకాదని అంటే ఇంట్లో ఈ 16 నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా ఈ 16 నామాలు చెప్పబడాలి. చెపితే మిగిలిన వాళ్ళు వినాలి. అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ పైకే చదవాలి అని గుర్తు. ఇంట్లో మిగిలిన వారు దీన్ని చదవలేరు అంటే యింటి యజమాని దీనిని పైకి చెప్పాలి. చెపితే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది. పూజ ప్రారంభం అయితే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది. పూజ ప్రారంభమైతే మిగిలిన వాళ్ళు వెళ్లి అక్కడ నిలబడడం కష్టం కాదుగా. పూజ మధ్యలో ఏదైనా అంగము అంటే మాకు తెలియదండీ ఆ సమయానికి ఏడో పనిలో ఉంటాము. ఎలా వెడతాము అనచ్చు. పూజ ప్రారంభం చేసి ఘంటారావం వినబడగానే వెళ్లి అక్కడ నిలబడడం పెద్ద విశేషం ఏమీ కాదు. కాబట్టి ప్రతిరోజూ మనం ఈ 16 నామాలు చెప్పాలి. కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి. 21కి కదా విఘ్నేశ్వరుడికి పూజకు వాడబడే సంఖ్య. మరి ఈ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికి 16మాత్రమే ఎందుకు వాడారు. షోడశైతాని నామాని 21ని 16 ఎందుకు చెయ్యవలసి వచ్చింది. చంద్రుడు షోడశకళా ప్రపూర్ణుడు. చంద్రుడికి 16కళలు. 16 కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా 16 సంస్కారములతో ఉంటుంది. చిట్టచివరి సంస్కారం అంత్యేష్టి సంస్కారం అంటారు. 16 సంస్కారములు నడుస్తాయి. మనిషికి పుట్టుకకు పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినపుడు జరిగేటటువంటి సంస్కారము సీమంతము అంటుంటారు. కానీ అసలు నిజానికి అది సీమంతోన్నయనము ఉత్సవము. పాపట భర్త తీస్తాడు. పాపట భర్త తీసేటటువంటి సంస్కారానికి ఆ పేరు. అక్కడ ప్రారంభం చేసి శరీరము పడిపోయిన తర్వాత చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో 16 నడుస్తాయి. మీరొక పూజ చేశారు అనుకోండి. షోడశోపచార పూజ అంటారు. 16 ఉపచారములు తప్పకుండా ఈశ్వరుడికి నడవాలి. ఎట్టి పరిస్థితులలోను ప్రతిరోజూ 16 ఉపచారములతో ఇంట్లో పూజ చేయాలి. అసలు న్యాయంగా కొన్ని వేల ఉపచారాలు అన్ని చాతకావాలంటే 64. 64 కూడా నావల్ల కాదంటే 5 ఉపచారాలు. పంచ సంఖ్యోప చారిణి. అయిదు కూడా చెయ్యలేను అంటే క్షమాపణ లేదు. ప్రతిరోజూ గృహస్థాశ్రమంలో ఐదు ఉపచారాలు ప్రతిరోజూ తప్పకుండా చెయ్యవలసిందే. ప్రతి యింటిలో కూడా దేవతార్చన జరిగినప్పుడు ఐదు ఉపచారములతో సింహాసనం అర్చింపబడాలి. గంధపుష్పదూపదీపనైవేద్యములు అని 5 జరగాలి.

ఆత్మ దర్శనం* 💥

*మన మనస్సు అవిశ్రాంత స్థితిలో ఉన్నంత వరకూ మనం మన ఆత్మ దర్శనం*
 *చెయ్యలెము.*

 *మనసుకు విశ్రాంతిని ఇచ్చినపుడే మన ఆత్మ మనకు గోచరం అవుతుంది.  అపుడే మనం ఇహపరలోకాల ఆనందాలను అనుభవించగలం.*

 *మన మనసు మనకు ఆలోచననూ, విచక్షణనూ, కోరికలనూ, అవగాహననూ, విమర్శనాత్మక దృష్టినీ,*

 *న్యాయాన్యాయ నిర్ణయాలను తీసుకునే శక్తినీ, ఎన్నింటినో ఇచ్చింది. దానివలన మనం ఈ భౌతిక ప్రపంచం లో జీవనం సాగిస్తూ దైవీ స్థితికి చేరుకోగలం!*

 *భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం మనసు.*

 *ఆయన తన మనసును*

 *ఉపయోగించి ఈ సృష్టిని సృష్టించాడు. మన మనసుకు సరిగా శిక్షణ ఇచ్చి* *ఉపయోగించుకుంటే అది మనం కోరుకున్న జీవితాన్ని సాధించేలా చేస్తుంది.*

 *ద్యానం, మంత్రం జపమూ చేస్తే అది మనలను ఆత్మ దర్శనం చెయ్యగలిగే స్థితికి చేరుస్తుంది. దాని నియంత్రణలో ఉంచుకోలేక పోతే అది మనలని వినాశనం వైపు నడిపిస్తుంది.*

 *ఒకేసారి అనేక విషయాలను ఆలొచించగలదు. ఒకే ఒక్క విషయం పై కూడా దృష్టి పెట్టగలదు.*

 *మనసుకు శిక్షణ ఇవ్వడం ద్వారా మనం ఎన్నో విజయాలను సాధించగలం. జీవిత లక్ష్యాలను సాధించగలం. దాని మానాన దానిని వదిలేస్తే*
( *శిక్షణ లేని మనసు ) అది మన వినాశనానికి హేతువులైన దురాశ, పగ, ప్రతీకారం, కామం, క్రోధం, గర్వం,* *అహంభావం ,  ఇటువంటి అధమ స్థాయి కోరికలకు బానిసలం అయ్యేలా చేస్తుంది.*

 *మన మనసులో కదిలే ఆలోచనలు మన సమయాన్ని , మన దృష్టినీ కోరుతాయి. అవి మన ప్రవర్తనని నిర్ణయిస్తాయి* . *మాయను అతిక్రమిస్తే ఆనందమనే భవనంలో హాయిగా విహారం చేయవచ్చును. ఇంత కధ నడిపించిన ఆ ఓక రూపాయి ఏమిటో కాదు, మనం చేసుకున్న పుణ్యం.*

 *జగన్నాటకం అనే సంత లోకి వచ్చిన ఈ జీవుడు ఆ దేవుడిని చేరుకునేలోపే మేల్కొంటే నిత్యానంద స్వరూపుడి దివ్య దర్శన భాగ్యం మనకు కలగతుంది.*
 *సర్వేజనా సుఖినోభవంతు.*💥

 *సే;వేముల*
*********************

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము

పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

16.1 (ప్రథమ శ్లోకము)

ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తదా|

హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యదనాథవత్॥6896॥

శ్రీశుకుడు వచించెను - "పరీక్షిన్మహారాజా! దేవతలు ఈ విధముగ స్వర్గమునుండి పారిపోయి దాగికొనగ దైత్యులు స్వర్గాధిపత్యమును పొందిరి. అంతట దేవమాతయైన అదితి అనాథవలె మిగుల దుఃఖించెను".

16.2 (రెండవ శ్లోకము)

ఏకదా కశ్యపస్తస్యా ఆశ్రమం భగవానగాత్|

నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్॥6897॥

"ప్రజాపతియైన కశ్యపుడు చాలదినములకు పిమ్మట ఒకనాడు తన తపస్సమాధి నుండి మేల్కొనెను. అప్పుడప్ఫుడతడు అదితి ఆశ్రమమునకు ఏతెంచెను. అచట సుఖశాంతులుగాని, ఏవిధమైన ఉత్సాహముగాని,…

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

649వ నామ మంత్రము

ఓం అదృశ్యాయై నమః

దర్శింప వీలుకాని సత్, చిత్, ఆనందం అను ఈ మూడు లక్షణములు కలిగి, అదృశ్యా అను నామముతో వశిన్యాదులచే స్తుతింపబడిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అదృశ్యా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును  ఓం అదృశ్యాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులను ఆ తల్లి వారి భక్తికి సంతసమంది సర్వాభీష్టములను సిద్ధింపజేసి, ఆత్మసాక్షాత్కారము కలిగించి తరింపజేయును.

పంచ లక్షణములైన అస్తి, భాతి, ప్రియం, రూపం నామం అను వాటిలో మొదటి మూడు పరమాత్మ లక్షణములు. ఈ మూడు లక్షణములే సత్, చిత్, ఆనందము అంటారు. ఈ లక్షణములు గల పరమాత్మ దృగ్గోచరము కాదు. అనగా ఈ చర్మచక్షువులతో చూడలేము.  కంటికి చూపు, చెవులకు వినికిడి, మిగిలిన ఇతర ఇంద్రియములకు ఆయా లక్షణములను ప్రసాదించునది ఆ పరమాత్మయే.  మనకున్న ఇంద్రియాలతో పరమాత్మ  గురుంచి తెలుసుకోలేము, కంటితో చూడలేము. అందుకే ఆ పరమేశ్వరి అదృశ్యా అను నామ మంత్రముతో  వశిన్యాదులచే ప్రస్తుతింపబడినది. ఇంతకు ముందు నామంలో ఆ జగన్మాతను లీలాక్లప్త బ్రహ్మాండ మండలా అని స్తుతించాము. అంటే బ్రహ్మాండాలన్నీ ఆ తల్లి చేతే సృష్టింపబడుతాయి, తనలోనే ఇముడుతాయి అని. అంటే ఎవరు ఆ తల్లిని చూడగలరు? ఒక్కరైనా చూడగలరా? చర్మచక్షువులతో, సామాన్యులకు అదృశ్య కదా ఆ తల్లి. చూడగలరు. చూసినట్లు భావించగలరు. ఎవరైతే మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథిని ఛేదించుకుంటూ, షట్చక్రములు దాటి, సహస్రారం చేరి అక్కడ అమ్మ కురిపించే సుధామృత  ధారలలో (సహస్రారాంబుజారూఢా, సుధాసారాభివర్షిణీ) తడిసిముద్దయిన సాధకుడు మాత్రమే అమ్మను చూశానని తృప్తినందుతాడు. గాన సాధకేతరులెవ్వరికైనా ఆ తల్లి అదృశ్యా అని మాత్రమే భావించాలి.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అదృశ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻🌻నేడు ఆది (భాను) వారము🌹🌹🌹ఆదివారమునకు దినాధిపతి సూర్యుడు🌻🌻🌻సూర్య వంశమునకు చెందిన రఘురాముని ఆరాధించు శుభదినము🌹🌹🌹ఓం నమో రామభద్రాయ🕉🕉🕉ఓం శ్రీసూర్యనారాయణాయ నమః
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

72వ నామ మంత్రము

ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః

భండుని, భండుని సైన్యాన్ని .వధించుటకు ఉద్యుక్తులయిన శక్తి సైన్యముల పరాక్రమాన్ని చూసి ఆనందించిన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ అఖిలాండేశ్వరిని   ఉపాసించు సాధకునకు అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదలు, ఆత్మానందానుభూతిని ప్రసాదించి భౌతికపరంగా కూడా సుఖసంతోషములతో జీవనం కొనసాగించి అంత్యమున పరమపదమును కటాక్షించును.

భండాసురుడు జీవాత్మ, పరమాత్మ రెండుగా భావించే అజ్ఞాని. అంతకన్నా కౄరుడు. అసుర ప్రవృత్తి గలవాడు. అహంభావి. అంటే పాంచభౌతిక శరీరమే నేను అనే మూర్ఖుడు. అరిషడ్వర్గములకు లొంగిపోయిన వాడు. ఈ జగత్తు, ఈ 
శరీరమే నిత్యమని భావించేవాడు. యథా రాజా తథా ప్రజా కదా అంటే తమ ప్రభువైన భండుడే అలాంటివాడయితే అతని సైన్యం మాత్రం అందుకు తీసిపోతారా? వారు అదే ప్రవృత్తి గలవారు. నిజానికి ద్వైదీభావన (జీవుడు, దేవుడు రెండు అను భావన), అరిషడ్వర్గములను, అహంకారము (నేను అంటే ఈ శరీరమే అను తత్త్వము) ఇలాంటి బాహ్యవృత్తులను నశింపజేసి వాటితో పూర్తిగా కలుషతమైన మనస్సును ప్రక్షాళనము చేయాలి. అప్పుడు స్వస్వరూప జ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞాని ముక్తుడవుతాడు. అందుకు భండుడనే బాహ్యప్రవృత్తిని నాశనం చేయడానికి పరమేశ్వరి సైన్యమనే అద్వైతశక్తులు ఉద్యుక్తులయాయి. అటువంటి సేనలను చూసి పరాశక్తి మనసు హర్షాతిరేకముతో నిండిపోయింది. అటువంటి తల్లికి వశిన్యాదులు జగన్మాతకు ఇచ్చిన అనంతకోటి నామాలలో  భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా కూడా ఒక నామమును చేర్చి, ఒక మహామంత్రముతో సమానముచేసి జగన్మాతను ప్రస్తుతించారు. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻🌻నేడు ఆది (భాను) వారము🌹🌹🌹ఆదివారమునకు దినాధిపతి సూర్యుడు🌻🌻🌻సూర్య వంశమునకు చెందిన రఘురాముని ఆరాధించు శుభదినము🌹🌹🌹ఓం నమో రామభద్రాయ🕉🕉🕉ఓం శ్రీసూర్యనారాయణాయ నమః
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము

పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

అదితిరువాచ

16.11 (పదకొండవ శ్లోకము)

భద్రం ద్విజగవాం బ్రహ్మన్ ధర్మస్యాస్య జనస్య చ|

త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్ గృహా ఇమే॥6906॥

అదితి పలికెను "మహాత్మా! ద్విజులు, గోవులు, ధర్మము మరియు ఈ దాసి అందరమూ కుశలమే. గృహస్థాశ్రమమే ధర్మార్థకామముల సాధనయందు పరమ సహాయకము.

16.12 (పండ్రెండవ శ్లోకము)

అగ్నయోఽతిథయో భృత్యా భిక్షవో యే చ లిప్సవః|

సర్వం భగవతో బ్రహ్మన్ననుధ్యానాన్న రిష్యతి॥6907॥

ప్రభూ! నిన్ను నేను నిరంతరము స్మరించుచునే యుందును. మరియు నీ క్షేమమునే కోరుచుందును. కనుక నేను అగ్నులను, అతిథులను, సేవకులను, మరియు యాచకులను  యథాశక్తిగా ఆదరించి, సత్కరించితిని.

16.13 (పదమూడవ శ్లోకము)

కో ను మే భగవన్ కామో న సంపద్యేత మానసః|

యస్యా భవాన్ ప్రజాధ్యక్ష ఏవం ధర్మాన్ ప్రభాషతే॥6908॥

స్వామీ! నీవంటి ప్రజాపతి ధర్మపాలనయందు నాకు ఉపదేశములను ఇచ్చుచుండగా నా మనస్సునందలి ఏ కోరికయైనను ఎట్లు తీరకుండును.

16.14 (పదకొండవ శ్లోకము)

తవైవ మారీచ మనఃశరీరజాః ప్రజా ఇమాః సత్త్వరజస్తమోజుషః|

సమో భవాంస్తాస్వసురాదిషు ప్రభో తథాపి భక్తం భజతే మహేశ్వరః॥6909॥

ఆర్యా! సత్త్వరజస్తమోగుణములు గల ప్రజలందరును నీ సంతానమే. కొందరు నీ సంకల్పము ద్వారా, మరికొందరు శరీరము ద్వారా ఉత్పన్నమైరి. అసురులు, దేవతలు అందరును నీ సంతానమే. అందరియెడ నీవు సమభావమున ఉందువనుటలో ఎట్టి సంశయమూలేదు. ఐనను సాక్షాత్తు పరమేశ్వరుడు గూడ తన భక్తుల అభిలాషలను నెరవేర్చుచునే యుండును.

16.15 (పదునైదవ శ్లోకము)

తస్మాదీశ భజంత్యా మే శ్రేయశ్చింతయ సువ్రత|

హృతశ్రియో హృతస్థానాన్ సపత్నైః పాహి నః ప్రభో॥6910॥

16.16  (పదునారవ శ్లోకము)

పరైర్వివాసితా సాహం మగ్నా వ్యసనసాగరే|

ఐశ్వర్యం శ్రీర్యశః స్థానం హృతాని ప్రబలైర్మమ॥6911॥

స్వామీ! నేను నీకు దాసిని నీవునా శ్రేయస్సునుగూర్చి ఆలోచింపుము. నీవు మర్యాదలను కాపాడుచుండువాడవు. శత్రువులు మన సంపదలను, నివాస స్థానములను గూడ లాగుకొనిరి. నీవు నన్ను రక్షింపుము. బలవంతులైన దైత్యులు మా ఐశ్వర్యములను, ధనమును, యశస్సును, కడకు నివాస స్థానమును గూడ హరించిరి. మమ్ములను మా ఇళ్ళనుండియే వెళ్ళగొట్టిరి. అందువలన నేను దుఃఖసాగరములో మునిగియున్నాను.

16.17 (పదునేడవ శ్లోకము)

యథా తాని పునః సాధో ప్రపద్యేరన్ మమాత్మజాః|

తథా విధేహి కల్యాణం ధియా కల్యాణకృత్తమ॥6912॥

మహాత్మా! నీవు తప్ప మా యశస్సును కోరెడివారు ఎవరున్నారు? నీవు నా హితైషివి. కనుక, నీ పుత్రులు కోల్పోయిన రాజ్యాదులను వారు తిరిగి పొందునట్లు ఏదైనా ఉపాయమును  ఆలోచించును. ఆ విధముగా నాకు శుభములను చేకూర్చును".

శ్రీశుక ఉవాచ

16.18 (పదునెనిమిదవ శ్లోకము)

ఏవమభ్యర్థితోఽదిత్యా కస్తామాహ స్మయన్నివ|

అహో మాయాబలం విష్ణోః స్నేహబద్ధమిదం జగత్॥6913॥

16.19 (పందొమ్మిదవ శ్లోకము)

క్వ దేహో భౌతికోఽనాత్మా క్వ చాత్మా ప్రకృతేః పరః|

కస్య కే పతిపుత్రాద్యా మోహ ఏవ హి కారణమ్॥6914॥

శ్రీశుకుడు వచించెను అదితి కశ్యప ప్రజాపతిని ఇట్లు ప్రార్థింపగా అతడు దరహాసము చేయుచు ఆమెతో ఇట్లనెను- "ఇది ఎంత ఆశ్చర్యకరము! భగవంతుని మాయ ఎంత బలీయమైనది! జగత్తు అంతయు మోహపాశముతో బంధింపబడి యున్నది పంచభూతములతో నిర్మింపబడిన, అనాత్మయైన ఈ దేహమెక్కడ? ప్రకృతికి అతీతమైన ఆత్మ ఎక్కడ? ఎవరికి ఎవ్వరును పతిగాని, పుత్రుడుగాని, బంధువుగాని కారు. ఈ అందరినీ మోహమే ఆడించుచున్నది.

16.20 (ఇరువదియవ శ్లోకము)

ఉపతిష్ఠస్వ పురుషం భగవంతం జనార్దనమ్|

సర్వభూతగుహావాసం వాసుదేవం జగద్గురుమ్॥6916॥

16.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

స విధాస్యతి తే కామాన్ హరిర్దీనానుకంపనః|

అమోఘా భగవద్భక్తిర్నేతరేతి మతిర్మమ॥6916॥

దేవీ! ఆ పరమపురుషుడు సకల ప్రాణుల హృదయములయందు విరాజిల్లు చుండువాడు. తన భక్తుల  దుఃఖములను తొలగించువాడు. జగద్గురువు, భగవంతుడు ఐన వాసుదేవుని ఆరాధింపుము. ఆ శ్రీహరి దీనదయాళువు. అతడు నీ కోరికలను తప్పక నెరవేర్చును. భగవద్భక్తి ఎన్నడును వ్యర్థముకాదని నా దృఢ విశ్వాసము. ఇంతకంటె మరియొక ఉపాయము లేనేలేదు'.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

పక్షిని చూసి నేర్చుకోవాలి




అర్జెంటినా నుండి #పార్న్_స్వాలొ  అనే చిన్న పక్షి తన జాతిని పెంచుకోడానికి  ఒక్కో సంవత్సరము  ఫిబ్రవరి  నెల లో మొదలై  8300 km ప్రయాణం చేసి మార్చ్  నెల చివరలో  కాలిఫోర్నియా  చేరుకుంటుంది ......

 కాలిఫోర్నియా లో ఒక సురక్షితమైన ప్రదేశంలో నివాసం ఏర్పరుచుకుంటాయి.  తన వంశాన్ని  వృద్ధి  చేసుకుని అక్టోబర్ లో తన పక్షి పిల్లలతో తిరుగు ప్రయాణం చేస్తాయి .....

ఇందులో వింత ఏముంది అంటారేమో ....

కానీ అవి దాదాపుగా 16600 km ప్రయాణం చేస్తాయి .... అవి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడ కూడా ఒక్క అడుగు భూమి కనిపించదు.
ప్రయాణం అంత సముద్రమార్గమే .....

అందుకే అవి అర్జెంటీనాలో  బయల్దేరే  ముందు , ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం  తీసుకుంటాయి .....  అవి అలసిపోయినప్పుడు , ఆకలివేసినప్పుడు , ఆ పుల్లను నీటిపైన వేసుకుని సేద తీరుతుంది ..... అలాగే దొరికిన ఆహారంతో  ఆకలి తీర్చుకుని  మళ్ళి ప్రయాణం మొదలెడుతుంది .

ఇలా ఒక చిన్న పుల్ల  ఆధారంతో ......
 చిన్న పక్షి అంత అంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది  అంటే అవి వాటిపైన పెట్టుకున్న నమ్మకం , పట్టుదల .

పక్షులువాటికే వాటిపైన అంత నమ్మకం ఉన్నప్పుడు ...... దేవుడు మనకు అన్ని అవయవాలు  ఇచ్చాడు మన మీద మనకు ఇంకెంత నమ్మకం ఉండాలి , ఇంకెంత పట్టుదల ఉండాలి

ప్రయత్నిద్దాం ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం సాధించలేనిది  ఏది లేదు కదా..
*****************

భగవద్గీత

భగవద్గీత
(నాకు నేనే శత్రువు ! నాకు నేనే మిత్రుడు!).....
....
మెసెడోనియా రాజైన అలెగ్జాండర్‌ జైత్రయాత్రకు బయలుదేరినప్పుడు తన దేశంలోని గొప్ప తత్త్వవేత్తలలో ఒకడయిన డియోజినస్ దగ్గరకు వెళ్ళాడు!
.
ఆయన ఉపదేశం పొందాలన్న ఆశతో!
.
 ఆ సమయంలో ఒక పెద్ద మర్రిచెట్టు క్రింద తనలో తానే ఆనందంగా హాయిగా నవ్వుకుంటూ  కాలుమీద కాలేసుకుని దర్జాగా సేదతీరుతున్నాడు ఆ మహాత్ముడు.
.
 అలెగ్జాండరు వినయంగా ఆయన దగ్గర నిలుచొని తనకేదయినా ఉపదేశించమని ప్రార్ధించాడు!.
.
అప్పుడు ఆ మహానుభావుడు అడిగాడు,
 "నీవిప్పుడు ఏం చేయదలచుకున్నావు?" అని!
.
ముందు పర్షియా ను జయిస్తాను  చెప్పాడు అలెగ్జాండర్
.
ఆ తరువాత ?
అని ప్రశ్నించాడు డియోజినస్,  ఈజిప్టు అని జవాబిచ్చాడు అలెగ్జాండర్.
.
 తరువాత?
.
 మెసపొటేమియా!
.
 ఇట్లా ఆయన అడగటం
ఈయన చెప్పటం !
.
ప్రపంచంలో ని రాజ్యాలన్నీ అయిపోయేదాకా చెపుతూనే ఉన్నాడు అలెగ్జాండర్‌!
.
ప్రపంచవిజేత అయిన తరువాత ఏం చేస్తావు?
అని అడిగాడు డియోజనస్!
.
మెసడోనియా తిరిగి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పాడు అలెగ్జాండర్.
.
ఈ సమాధానం విన్న వెంటనే డియోజినస్ తను పడుకున్న చోటినుంచి కాస్త పక్కకు జరిగి,

రా! నా ప్రక్కన పడుకో!
.
 విశ్రాంతి తీసుకోవడానికి నీవు అన్ని రాజ్యాలు జయించి అంత రక్తపాతం సృష్టించాలా!
.
అని అడిగాడు!..డియోజినస్.
.
ప్రపంచంలో ఇక జయించడానికి ఏమీలేదు అని అనుకునేంతదాక యుద్ధాలు చేస్తూనే ఉండాలి !
అని అనుకున్నాడు అలెగ్జాండర్‌!
.
అలానే! నేడు కొత్తరకం అలెగ్జాండర్లు బయలుదేరారు!
.
సంపాదన,సంపాదన,సంపాదన
ఒకటే సంపాదన ......
సంపాదించటమే విజయం !
అనే దృక్పధం పెరిగిపోయింది నేడు!
 అందులోని వత్తిడులు దానివల్ల వచ్చే రకరకాల రోగాలు!
.
Life style disorders అని పేరు పెట్టుకున్నాం!
.
ఒక మనిషికి ఎంతకావాలి?
.
ఈ ప్రశ్న దాదాపుగా మనమెవ్వరమూ ఇంతవరకూ వేసుకోలేదు అని అనుకుంటున్నా! ఎవరైనా వేసుకున్నారా?
.
లక్షాధికారి అయిన లవణమన్నమే కాని మెరుగు బంగారమ్ము మింగపోడు!...
.
ప్రపంచం అంతా జయించాడు!
అన్ని దేశాల సుందరీమణులు, అతిలోక సౌందర్యవతులు తనను వరించి వచ్చారు, అయినా రావణునికి కాంక్షతీరలేదు!
ఇంకేదో కావాలి!
 సీతమ్మను చెరబట్టాడు!
చివరకు రాముడి చేతిలో మొత్తం సబాంధవంగా హతుడయ్యాడు !.....
.
అలానే నోటి దురుసుతనం ప్రాణాంతకమవుతుంది!
.
తన మేనమామ కొడుకు,
తన బంధువు అని చూడకుండా పదిమందిలో కృష్ణుడిని అవమానించి ప్రాణం పోగొట్టుకున్నాడు శిశుపాలుడు!
.
తన పినతండ్రి పిల్లలు వాళ్ళు  ,  తనదగ్గర లేనిది ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది అని అనుక్షణం ఈర్ష్యా అసూయలతో మనసు పాడుచేసుకొని చివరకు వాటికే బలి అయిపోయాడు దుర్యోధనుడు!
.
కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు మనలను ఉన్నచోట ఉండనీయవు, !
.
ధగధగా మెరిసే రాగిచెంబులాంటి మనస్సుకు పట్టే మకిలి ఈ ఆరుభావనలు!
.
ఈ భావనలను "యోగసాధన" అనే చింతపండుతో నిత్యం తోమాల్సిందే !
.
ఏ ఒక్కక్షణం కూడా బద్ధకించకూడదు!
.
అందుకే ఆమార్గం "క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గమ్ పధః" అని కఠోపనిషత్తు చెపుతుంది!
.
That path is as sharp as Razor's edge.....
.
మనిషి తనలో చెలరేగే ప్రతి భావాన్ని నిశితంగా గమనించి ఆ భావం ఎక్కడనుండి పుడుతుందో దాని మూలంలోకి వెళ్లి ఎప్పటికప్పుడు పెరికివేయాలి!
.
 లేకపోతే కలుపుమొక్కలు పుడుతూనే ఉంటాయి!
.
మనలను మనమే ఉద్ధరించుకోవాలి!
.
 మనకు మనమే శత్రువు!
మనకు మనమే మిత్రుడు!
.
అని ఎంత అనునయంగా చెపుతున్నారో పరమాత్మ!
..
ఉద్ధరేదాత్మనాత్మానామ్ నాత్మనమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః......
.
భగవద్గీత చదవండి ! చదివించండి!
****************

ఋషి పంచమి

 సప్తఋషిభ్యో నమః 🙏🏼

భాద్రపద శుద్ధ పంచమిని రుషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు.

అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి.

ఋషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.

🌼 సప్తఋషి ధ్యాన శ్లోకములు 🌼
     
కశ్యప ఋషి : కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః||
     
అత్రి ఋషి : అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||    ఓం అనసూయా సహిత అత్రయేనమః||
     
భరద్వాజ ఋషి : జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||    ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||
     
విశ్వామిత్ర ఋషి : కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||     ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||
     
గౌతమ ఋషి : యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||    ఓం అహల్యా సహిత గౌతమాయనమః||
     
జమదగ్ని ఋషి : అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||     ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః
     
వసిష్ఠ ఋషి : శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా||    ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||
*****************

Who rides what Vahana (Animal or Bird)?

Following is the first list of Hindu Vahanas:

1.Ganesh/Vinayaka=Mouse

2.Kartikeya/Skanda/Murugan–Peacock

3.Shiva=Bull/ Nandhi

4.Raja Rajeswari= Lion

5.Vishnu= Garuda/Eagle

6.Bhairava=Dog

7.Sastha= Horse

8.Ayyappa= Tiger

9.Sani/Saturn= Crow

10.Kalki Avatar=Horse

11.Indra= Airavata/ Elephant

12.Lakshmi= Red Lotus, Owl

13.Sarasvati=White Lotus, Swan

14.Ganga Devi= Crocodile

15.Manamatha & Rathi= Parrot

16.Kubera= Man,Parrot or Horse

17.Vishnu= 7 headed Snake/ Sesha

18.Krishna=Banyan leaf

19.Brahma= Swan



20.Kartikeya=Rhino (Vietnam)

21.Chandi= Pig

22.Sindhi saint= Fish

23.Ganda Beranda Bird= Mannarkudi Rajagopalswamy

24.Varuna= Makara (Shark or Crcodile)

25.Agni / Fire= Ram

26.Durga= Antelope

27.Marut= Deer

28.Lakshmi in Nepal=Turtle, In Bengal=owl

29.Durga= Lion or Tiger

30.Chamundi- Owl

31.Asvini Devas= Donkey (also for Indra and Agni)

32.Dead Body= Niruthi

33.Sun= 7 Horse Chariot

34.Rahu/ Shasti= Cat

35.Rathi= Pigeon

Following Vahanas are used by different temples in Tamil Nadu

36.Surya Prabha (SUN)= Northern Districts of Tamil Nadu

37.Chandra Prabha (MOON)= Northern Districts of Tamil Nadu

38.Karpaka Vrksha= (Wish fulfilling Tree)

39.Kamadenu= Wish fulfilling Cow

40.Kailash Vahana= Siva



41.Bhupala Vahanam= Vishnu

42.Purusha Mrugam

43.Bhuta Vahanam= Shiva

44.Punnai Tree Vahana= krishna

45.Karampasu Vahanam (See Kamadhenu)

46.Goat Chariot=Pushan

47.7 Cow Chariot=Ushas

48.Kali= Yali (Yali is a mythical animal)

48.Snake= Manasa Devi

49.Seetala= Donkey

50.Viswakarma= Elephant



Nava Grahas (Nine Planets)

Sun=Chariot drawn by Seven Horses

Moon= Antelope chariot

Mars=Ram

Bhudan/ Mercury= Horse

Jupiter= Elephant

Venus= Horse/ Crocodile

Saturn / Saniswarea= Crow

Rahu= Lion/ Cat/Tiger

Ketu=Fish
***************

తెలుగు అనువాదం:

తీసా యంత్రము





మనసులో తలచుకొన్న ప్రశ్నలకి, సులభంగా, సమాధానాలు చెప్పే శాస్త్రమే ప్రశ్న శాస్త్రము. ఆ శాస్త్రంలో తీసా యంత్రము చాలా ముఖ్యమైనది.

ఈ తీసా యంత్రంలో మూడు భాగాలు ఉన్నాయి.

 మొదటిది తీసా యంత్రము. 
రెండవది 30 ప్రశ్న చక్రాలు. 
చివరిది 30 సమాధాన చక్రాలు. 

ప్రశ్న చక్రాలు బ్రహ్మ, విష్ణు, మహేష్, హనుమాన్, ఇంకా పంచ భూతాలు, ద్వాదశ రాశులు, నవ గ్రహాలు ఇత్యాది పేర్లతో మొత్తం 30 చక్రాలు ఉన్నాయి.

సమాధాన చక్రాలు కూడా అవే పేర్లతో ఒక్కొక్క చక్రంలో 15 సమాధానాలతో నిండి ఉన్నాయి.

తీసా అంటేనే 30 అని అర్థం ! హిందిలో “తీస్’’ అంటే ముఫ్ఫై అని అందరికీ తెలిసినదే కదా ! అలాగే సంస్కృతంలో “త్రింశ’’ అంటే ముఫ్ఫై అని అర్థం .అందుకే ఈ యంత్రాన్ని తీసా యంత్రము అని అంటారు.

ప్రశ్న చక్రాలు 

హనుమాన్ (1 ) నా మనో వాంఛ పూర్తి అవుతుందా లేదా ?

అగ్ని (2) నాకు ఈ సంవత్సరం ఎలా గడుస్తుంది ?
వాయువు(3) ఈ కార్యంలో లాభమా లేక నష్టమా ?
జలము (4) నాకు ఈ ప్రదేశంలో లాభం కలుగుతుందా లేక అన్య ప్రదేశంలో కలుగుతుందా ?
పృథ్వి (5) ఈ పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చునా లేదా ?
ఆకాశము (6) నా నష్ట ద్రవ్యము (పోయిన వస్తువు) దొరుకునా లేదా ?

మేషము (7) ఈ వ్యక్తిని నమ్మవచ్చా, కూడదా ?
వృషభము (8) ఈ యాత్ర వలన లాభమా లేక నష్టమా ?
మిథునము (9) నేను చేయదలచుకున్న పని సఫలమవుతుందా ,లేక విఫలమవుతుందా ?
కర్కాటకము(10) ఈ వివాహం చేసుకొంటే లాభమా , లేక నష్టమా ?
సింహము (11) ఈ వ్యాపారంలో భాగస్వామ్యం వల్ల ,లాభమా లేక నష్టమా?
కన్య (12) ఈ స్త్రీ గర్భంలో శిశువు పురుషుడా లేక స్త్రీ శిశువా?
తుల (13) ఇతని రోగము బాగవుతుందా , లేదా?
వృశ్చికము (14) ఈ వ్యాజ్యం (కోర్టు కేసు) నుండి ఈ వ్యక్తికి ముక్తి లభిస్తుందా ,లేదా?
ధనస్సు (15) ఈ రోజు నాకు ఎలా గడుస్తుంది ?
మకరము (16) ఈ వ్యక్తి ప్రేత భాధతో పీడింపబడుతున్నాడా , లేక రోగముతోనా?
కుంభము (17) ఈ స్థలము కొంటే లాభమా , నష్టమా?
మీనము (18) ఈ వైద్యునితో రోగము నయమగునా , లేదా?

సూర్యుడు (19) నా నివాస గృహంలో ఏవైనా దోషాలు కలవా?
చంద్రుడు (20) ఈ కేసు గెలుస్తానా లేదా ?
కుజుడు (21) ఈ వార్త నిజమగునా , కాదా?
బుధుడు (22) ప్రస్తుత కష్టము నుండి నాకు విముక్తి కలదా, లేక లేదా?
గురుడు (23) ఈ ఉద్యోగము వలన నాకు లాభమా, నష్టమా?
శుక్రుడు (24) ఈ పోటీ పరీక్షలలో నాకు విజయం లభిస్తుందా , లేదా?
శని (25) ఈ వస్తువు నాకు అచ్చుబాటు అవుతుందా,లేదా ?
రాహువు (26) ఈ తప్పిపోయిన పశువు ఏ దిక్కుగా వెళ్లింది?
కేతువు (27) ఈ వ్యక్తి జీవించి ఉన్నాడా, లేక మరణించాడా?

బ్రహ్మ (28) నాకు అప్పు దొరుకుతుందా, లేదా?
విష్ణువు (29) ఈ సంవత్సరంలో నాకు ప్రమోషన్’ దొరుకునా, లేదా?
మహేశ్వరుడు (30) నాకు సమీప భవిష్యత్తులో బదిలీ అవకాశం కలదా, లేదా?

సమాధాన చక్రాలు 

అగ్ని చక్ర ఫలాలు.:
(1) మీరు అదృష్టవంతులు.మీ కోరిక నెరవేరుతుంది. (2) మీ బదిలీ సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం లేదు. (3) ప్రమోషన్ దొరుకుతుంది, కాని సూర్యుని ఆరాధన చేయాలి. (4) ఉద్యోగ, వ్యాపారాలు చేయండి .అప్పు దొరుకుతుంది. (5) జీవించి ఉండడం సందేహంగానే ఉంది. (6) పశువు దక్షిణ దిశగా వెళ్లింది. దొరికే అవకాశం లేదు. (7) దీనిని కొంటే నష్టం కలుగుతుంది. (8) జయం కలుగుతుంది. కాని కుజుని ఆరాధన చేయండి. (9) ఈ ఉద్యోగం వల్ల లాభం కలుగుతుంది. (10) ఈ కష్టం నుండి శీఘ్రంగానే నివారణ కలుగుతుంది. శివుని ఆరాధన చేయండి. (11) ఈ వార్త జరిగినది నిజమే . (12) కేసు గెలవడం సందేహంగా ఉంది, కేతువుని ఆరాధన చేయండి, మంచి జరగ వచ్చు. (13) ఈ ఇల్లు అశుభం . (14) ఈ వైద్యునితో జబ్బు నయమవుతుంది . (15) అవును, లాభదాయకమే.

వాయు చక్ర ఫలితములు :
(1) ఈ సంవత్సరం సంతోష జనకంగా ఉంటుంది. (2) మీ కోరిక నెరవేరుతుంది . (3) అవును, బదిలీ జరిగే యోగం గోచరిస్తోంది . (4) ప్రస్తుతం ప్రమోషన్’ లభించే అవకాశం తక్కువగా ఉంది. (5) ఉద్యోగ వ్యాపారాలు చేయాలనుకొంటే అప్పు దొరుకుతుంది. (6) జీవించి ఉండడం అనుమానాస్పదంగా ఉంది. (7) పశువు దక్షిణ దిశగా వెళ్లింది. దొరికే అవకాశం తక్కువ. (8) కొనవద్దు, నష్టం కలగ గలదు. (9) సఫలత పొందగలరు. (10) ఉద్యోగం చేస్తే లాభిస్తుంది. (11) ఈ కష్టం నుండి ఆలస్యంగా నివారణ కలుగుతుంది. (12) ఈ వార్త అబద్ధం. (13) కేసు గెలవడం సందేహం. రాజీ చేసుకోండి . (14)ఈ ఇల్లు అచ్చుబాటు అవుతుంది. (15) ఈ వైద్యుని వల్ల రోగ నివారణ ఆలస్యంగా అవుతుంది.

జల చక్ర ఫలితములు :
(1) ఈ కార్యము వల్ల లాభం ఉంది. గురు ధ్యానం చేయండి. (2) ఈ సంవత్సరం కష్టదాయకంగా ఉంటుంది. కుజునికి శాంతి జరిపించండి. (3) మీ వాంఛ తీరే అవకాశం తక్కువగా ఉంది. (4) మీ సమీప భవిష్యత్తులో బదిలీ అయే అవకాశం లేదు. (5) అవును, ప్రమోషన్ ఆశించవచ్చు . (6) సమయం బాగు లేదు అప్పు దొరకదు. (7) జీవించి ఉండే అవకాశం తక్కువ. (8) పశువు ఉత్తర-పశ్చిమ దిశగా వెళ్లింది. దొరికే అవకాశం తక్కువ. (9) కొనండి, లాభం ఉంది. (10) అవును, సఫలత కలదు. (11) ఉద్యోగం చేస్తే లాభం కలుగుతుంది . (12) ఆలస్యంగా విపత్తు నుండి విరామం దొరుకుతుంది. (13) ఈ వార్త అబద్ధం . (14) కేసు గెలుస్తుంది. (15) ఈ ఇల్లు నిర్దోషంగా ఉంది. శుభం కలుగుతుంది.

ప్రుథ్వీ చక్ర ఫలితములు:
(1) అన్య ప్రదేశానికి వెళ్తే లాభం కలుగుతుంది. (2) ఈ కార్యంలో లాభం కలుగుతుంది. (3) మీకు ఈ సంవత్సరం సామాన్య శుభం. (4) కొంత పూర్తి అవుతుంది,కాని మరికొంత మిగిలి పోతుంది. (5) ఉద్యోగంలో త్వరలోనే బదిలీ అవుతుంది. (6) ప్రమోషన్’ ఆశించ వద్దు. (7) అప్పు దొరకదు. (8) జీవించి లేడు . ఆ పైన దేవుని దయ. (9) పశువు ఉత్తర దిశగా వెళ్లింది. వెతికితే దొరుకుతుంది. (10) కొనవద్దు, హాని జరుగును . (11) అవును, సఫలత కలుగుతుంది. (12) ఈ ఉద్యోగ విషయంలో నమ్మకం లేదు. (13) ఈ దినము బాగాలేదు, అశాంతి తొలగదు. (14) ఈ వార్త జరిగినది నిజమే. (15) దేవుని దయవల్ల జయం కలుగుతుంది.

ఆకాశ చక్ర ఫలితములు:
(1) పారిపోయిన వ్యక్తి దూరమవుతూ ఉన్నాడు. తిరిగి వచ్చుట కష్టము . (2) ఈ స్థలములో లాభం ఉంది. సంతోషించు. (3) ఈ పనిలో హాని కలుగును. (4) ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. (5) మీ కోరిక ఆలస్యంగా నెరవేరుతుంది . (6) అవును, మీకు బదిలీ శీఘ్రంగా అవుతుంది. (7) ప్రస్తుతం ప్రమోషన్’ గురించి ఆశించవద్దు. (8) అప్పు దుర్లభం . (9) అతను జీవించే ఉన్నాడు. (10) పశువు తూర్పు దిశగా వెళ్లింది, త్వరపడితే దొరుకుతుంది . (11) లాభం కలుగును, కొనవచ్చు. (12) సఫలత పొందే అవకాశం తక్కువ. (13) ఈ ఉద్యోగం వలన హాని ఎక్కువ , నీ అంతట నీవే వదలి వేస్తావు . (14) ఈ కష్టము నుండి విముక్తి ఆలస్యంగా లభిస్తుంది. (15) ఈ వార్త నిజమేనని అనిపిస్తోంది.

మేష చక్ర ఫలితములు:
(1) ఈ వస్తువు దొరుకుట సందేహము. (2) పారిపోయిన వ్యక్తి శీఘ్రముగా వచ్చును. (3) అన్య ప్రదేశమునకు వెళ్ళినచో లాభము కలుగును. (4) ఈ పనిలో లాభ నష్టములు మధ్యమముగా ఉన్నవి. (5) ఈ సంవత్సరము మీకు కష్ట దాయకము. రాహువునకు శాంతి చేయండి. (6) మీ కోరిక పూర్తికాదు (7) బదిలీ యోగము కలదు. (8) ప్రస్తుతము ప్రమోషన్’ లభించే అవకాశం లేదు. (9) ఒక మిత్రుని ద్వారా అప్పు లభిస్తుంది. (10) అతను జీవించే ఉన్నాడు. (11) పశువు ఉత్తర దిశగా వెళ్లింది, దొరికే అవకాశం ఉంది. (12) కొనవద్దు, హాని కలుగును. (13) సఫలత కష్టదాయకము . (14) ఈ ఉద్యోగం వలన లాభదాయకమే . (15) కష్టము నుండి విముక్తి ఆలస్యము.

వృషభ చక్ర ఫలితములు:
(1) అవును యితడు నమ్మకస్తుడే. (2) పోయిన వస్తువు తిరిగి దొరుకుతుంది. (3) పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చేందుకు ఆలస్యం అనివార్యం. (4) మీకు ఈ స్థలం లోనే లాభము ఉంది. (5) ఈ పనిలో లాభము మధ్యమము. (6) ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితములు:ఇస్తుంది.బుధుని పూజించండి. (7) మీ కోరిక పూర్తి అయే అవకాశం లేదు. (8) బదిలీ శీఘ్రంగా అవుతుంది. (9) ప్రమోషన్ అయే యోగము గోచరిస్తున్నది. (10) అప్పు దొరుకుతుంది. (11) అతను జీవించి ఉన్నాడు. (12) పశువు పూర్వోత్తర దిశగా వెళ్లింది.దొరకుట దుర్లభము. (13) కొనవద్దు, హాని ఉంది. (14) పరిశ్రమ ద్వారా సఫలత కలుగుతుంది. (15) ఈ ఉద్యోగం ద్వారా లాభం ఉంది.

మిథున చక్ర ఫలితములు:
(1) అవును, ఈ యాత్ర వలన లాభము ఉంది. (2) ఇతను విశ్వాస పాత్రుడు (3) ఈ వస్తువు దొరకుట కఠినం . (4) పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చును, నమ్మకం ఉంచండి. (5) అన్య ప్రదేశమునకు వెళ్ళినచో లాభము ఉంది. (6) ఈ పనిలో హాని ఉంది. (7) ఈ సంవత్సరం ప్రత్యేక దిశలోనూ విపరీతముగా ఉంది. కేతుగ్రహ శాంతి చేయండి. (8) ప్రస్తుతము మీ కోరిక నెరవేరదు. (9) బదిలీ యోగము కలదు, దేవుని పూజించండి. (10) అవును, ప్రమోషన్’ యోగము కలదు. (11) అప్పు దొరికే అవకాశము లేదు. (12) అతను జీవించి ఉండుట సందేహాస్పదంగా ఉంది. (13) పశువు ఉత్తర దిశగా వెళ్లింది. దొరుకుట దుర్లభము. (14) కొనవచ్చు, లాభము కలుగును. (15) అత్యంత పరిశ్రమ చేత సఫలత కలుగుతుంది.

కర్కాటక చక్ర ఫలితములు:
(1) సఫలత ప్రాప్తిస్తుంది. (2) ఈ యాత్ర వలన లాభాంశము తక్కువ. (3) ఇతను విశ్వాసపాత్రుడైనవాడు కాడు . (4) ఈ వస్తువు దొరుకుట కష్టము. (5) పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చుట ఆలస్యము. (6) అన్య ప్రాంతమునకు పోయిన యెడల లాభము కలదు. (7) ఈ పనిలో హాని ఉన్నది. (8) ఈ సంవత్సరము విశేష హానికరముగా ఉన్నది. శని పూజ చేయండి. (9) ఒక మిత్త్రుని సహాయము వలన మీ కోరిక నెరవేరుతుంది. (10) బదిలీ జరుగును కాని ఆలస్యము. (11) అవును, ప్రమోషన్’ ఈ సంవత్సరము ఉంది. (12) అప్పు దొరికే అవకాశము లేదు. (13) ఇతను జీవించి ఉండుట సందేహముగా ఉన్నది . (14) పశువు పశ్చిమ దిశగా వెళ్ళినది. వెతికినచో దొరుకును. (15) కొనవచ్చు, లాభము ఉంది.

సింహ చక్ర ఫలితములు:
(1) అవును, ఈ వివాహము లాభదాయకమే . (2) సఫలత కలుగును. (3) వెళ్ళవద్దు. హాని కలుగును. (4) ఇతను విశ్వాసపాత్రుడైన వాడే. (5) పోయిన వస్తువు దొరుకును. (6) పారిపోయిన వ్యక్తి తిరిగి రాడు (7) ఈ స్థలము వదలవద్దు, ఆలస్యముగానైనా లాభము కలుగుతుంది. (8) ఈ పనిలో హాని కలుగనున్నది. (9) ఈ సంవత్సరము మీకు దుఃఖ దాయకము. శనిని పూజించండి. (10) మీ కోరిక పూర్తి అవుతుంది. (11) ప్రస్తుతము బదిలీ అవకాశములు తక్కువ. (12) ప్రమోషన్’ ఈ సంవత్సరము దొరకదు. (13) సమయము బాగు లేదు, అప్పు దొరకదు. (14) ఇతను జీవించే ఉన్నాడు. (15) పశువు పశ్చిమ దిశగా వెళ్లింది. శీఘ్రంగా దొరుకుతుంది

కన్యా చక్ర ఫలితములు:
(1) భాగస్వామ్యంలో లాభం కలదు. (2) ఈ వివాహము మీకు హితకరము. (3) సఫలత సందేహాస్పదంగా ఉంది, రాహువు పూజ చేయండి. (4) ఈ యాత్ర వలన లాభము లేదు. (5) ఇతను నమ్మకమైన వాడు. (6) పోయిన వస్తువు దొరకదు. (7) పారిపోయిన వ్యక్తి ఇప్పట్లో రాదు. (8) అన్య ప్రాంతమునకు పొతే లాభము కలదు. (9) అవును, దిని వల్ల లాభము కలుగును. (10) ఈ సంవత్సరము మీకు లాభదాయకము. (11) మీ కోరిక నెరవేరుతుంది. (12) బదిలీ శీఘ్రముగా జరుగును. తూర్పు దిశగా కావచ్చును. (13) ప్రమోషన్’ దొరికే అవకాశము తక్కువ. (14) ఒక మిత్రుని సహాయముతో అప్పు దొరుకును. (15) ఇతను జీవించి ఉన్నాడు.

తులా చక్ర ఫలితములు:
(1) పుత్రుడు జన్మిస్తాడు. (2) భాగస్వామ్యం వలన లాభము ఉంది. (3) ఈ వివాహము వలన మీకు లాభము కలుగదు. (4) ప్రయత్న పూర్వక సఫలత కలుగనున్నది. (5) ఈ యాత్ర వలన లాభము ఉంది. (6) ప్రతీ వ్యక్తి పైన విశ్వాసము పెంచుకోవద్దు . (7) పోయిన వస్తువు దొరకదు. (8) పారిపోయిన వ్యక్తి వచ్చును, నిరీక్షించి ఉండండి. (9) మీకు ఈ ప్రాంతము లోనే లాభము ఉంది. (10) లాభము ఉంది. (11) ఈ సంవత్సరము మీకు అత్యుత్తమము, సంతోష జనకముగా ఉంది. (12) ఈ యీ కోరిక పూర్తి కానున్నది. (13) బదిలీ సమీప భవిష్యత్తులో ఉంది. (14) పమోషన్ ‘ శీఘ్రంగా కలుగును. (15) ఒక మిత్రుని సహాయము ద్వారా అప్పు దొరుకును.

వృశ్చిక చక్ర ఫలితములు
(1)అవును ఇతను రోగము నుండి విముక్తుడు అవుతాడు. (2)పుత్ర రత్నము కలుగ గలదు. (3)భాగస్వామ్యం వలన హాని కలిగే భయము కలదు. (4) మీకు ఈ వివాహము హితకరము (5) వెళ్లి ప్రయత్నమూ చేయండి, సఫలత కలుగుతుంది. (6) యాత్ర చెయ్యవద్దు. హాని కలుగును. (7) ఈ వ్యక్తిని నమ్మవద్దు. (8) పోయిన వస్తువు దొరికే ఆశ తక్కువ. (9) పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చుటకు ఆలస్యము కలదు. (10) ఈ స్థలము లోనే లాభము కలదు. (11) ఈ పనిలో లాభము కలదు. (12) మీకు ఈ సంవత్సరములో భాగ్యోదయము కలదు. (13) మీ కోరిక నెరవేరదు. (14) ప్రస్తుతము బదిలీ అవదు. (15) ప్రమోషన్’ యోగము రానున్నది.

ధనుష్’ చక్ర ఫలితములు:
(1) పాపము నుండి విముక్తి కలుగును. (2) పథ్యము పాటించక పొతే రోగము తిరుగ బెడుతుంది. (3) ఈ గర్భములో పుత్ర రత్నము జన్మించును . (4) భాగస్వామ్యంలో లాభము తక్కువ. (5) అవును, వివాహము హితకరము. (6) సఫలత సందిగ్ధముగా ఉంది.శని పూజ చేయండి. (7) ఈ యాత్ర వలన హాని కలుగును. (8) ఈ వ్యక్తి విశ్వశనీయత సందేహించ వలసినదిగా ఉంది. (9) పోయిన వస్తువు సురక్షితముగా ఉంది. ప్రయత్నము చేయుము, దొరుకును. (10) పారిపోయిన వ్యక్తి ఆలస్యముగా వచ్చును. (11) ఈ స్థానము లోనే లాభము ఉంది. (12) అవును, ఈ పనిలో హాని ఉంది. (13) మీకు ఈ సంవత్సరము అనేక ప్రకారమైన కష్టములు కలుగ గలవు. (14) మీ కోరిక పూర్తి అవుతుంది. (15) బదిలీ గురించి ఆశించకండి. దుర్గా ఆరాధన చేస్తే ఫలితం కలగవచ్చు.

మకర చక్ర ఫలితములు:
(1) ఒక సత్పురుషుని దర్శనం వలన మీకు కూడా లాభం కలుగుతుంది. (2) ఈ ఆరోపణ నుండి ఆలస్యముగా విముక్తి కలుగుతుంది. (3) అవును, రోగికి నయమవుతుంది. రాహువుకి శాంతి చేయండి. (4) ఈ గర్భస్థ శిశువు కన్యారత్నము అగును. (5) లాభము కలుగును, కాని కొన్ని నెలల సమయము పట్టవచ్చును. (6) ఈ వివాహము మీకు లాభదాయకమే . (7) సఫలత సందేహముగా ఉన్నది, శనికి శాంతి చేయండి. (8) ఈ యాత్రలో హాని జరుగును. (9) అవును, ఇతను నమ్మకస్తుడే. (10) పోయిన వస్తువు దొరకదు. (11) పారిపోయిన వ్యక్తి త్వరలోనే వచ్చును. (12) మీరు అన్య ప్రాంతంలో ప్రయత్నిస్తే లాభము కలుగును. (13) ఈ పనిలో హాని కలుగును. (14) ఈ సంవత్సరము మీకు లాభదాయకమే . (15) ఒక మిత్రుని సహాయము వలన మీ కోరిక నెరవేరును.

కుంభ చక్ర ఫలితములు:
(1) శారీరిక వ్యాధి మాత్రమే . (2) ఈ దినము నానా ప్రకార చింతలు, చికాకులతో గడచును. (3) రాహువునకు శాంతి చేయండి, విముక్తి కలుగుతుంది. (4) పుత్రుడు పుట్టును. (5) ఈ రోగిని బ్రహ్మ బాధ పీడిస్తోంది, తంత్రము ద్వారా చికిత్స చేయించండి. (6) లాభము కన్నా నష్టమే ఎక్కువ. (7) ఈ వివాహము హానికరముగా ఉంది. (8) సఫలత కఠినం, కుజునికి శాంతి చేయండి. (9) ఈ యాత్ర లాభదాయకం. (10) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడే. (11) పోయిన వస్తువు లభించ గలదు. (12) పారిపోయిన వ్యక్తి దూరంగా పోవుచున్నాడు, ఆలస్యముగా తిరిగి చేరును. (13) మీకు అన్య ప్రాంతమునందు లాభము కలుగును. (14) ఈ కార్యములో విజయము కలుగును . (15) ఈ సంవత్సరము మీకు విశేష లాభదాయకము.

మీన చక్ర ఫలితములు:
(1) కొనవచ్చును, లాభము కలుగును. (2) గుప్త రోగముతో పీడింప బడుతున్నాడు . (3) ఈ దినము చింత వ్యథలతో గడచును. (4) విముక్తి కలగుట కష్టము, బుధునికి శాంతి చేయండి. (5) మందులు ఇస్తూనే ఉండండి.రోగము నిమ్మలిస్తుంది శుక్రుని పూజ చేయండి. (6) పుత్రిక పుట్టును. (7) లాభము కలుగ వచ్చును. కాని శనికి శాంతి చేయండి. (8) ఈ వివాహము మీకు హితకరము . (9) సఫలతను పరిశ్రమతో సాధించండి . (10) లాభము కలుగును,యాత్ర సాగించండి. (11) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడే. (12) పోయిన వస్తువు దొరకుట కఠినం. (13) పారిపోయిన వ్యక్తి దూరమవుతూ ఉన్నాడు. తిరిగి వచ్చుట ఆలస్యమగును. (14) ఈ స్థానమునందే లాభము కలుగును. (15) ఈ పనిలో లాభము మధ్యమము .

సూర్య చక్ర ఫలితములు:
(1) కార్య సిద్ది,కలుగును .కాని ఆలస్యం కాగలదు. (2) కొనండి, లాభము కలుగును. (3) ప్రేత బాధ ఉంది. (4) సత్సంగము వలన లాభము కలుగును. (5) విముక్తి కలుగును.శుక్రునికి శాంతి చేయండి. (6) పథ్యము పాటించక పోతే, రోగము పెరుగును. (7) పుత్రిక పుట్టును. (8) లాభ ప్రాప్తికి కుజుని బాధ కలదు,శాంతి చేయండి. (9) ఈ వివాహము హితకరము . (10) సఫలత నిశ్చయం . (11) యాత్ర చేయవద్దు, హాని కలుగును. (12) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడు కాడు . (13) పోయిన వస్తువు ఒక స్త్రీ తీసినది, దొరకుట కష్టము. (14) పారిపోయిన వ్యక్తి, ఆలస్యముగా ఇంటికి చేరును. (15) ఈ స్థలము నందే లాభము కలుగును, కొంత కాలము సంతోషముగా గడపండి.

చంద్ర చక్ర ఫలితములు:
(1) మహా దోష రహితముగా ఉంది. (2) కార్యము యథా సంభవముగా జరుగుతుంది. (3) హాని కలుగును. (4) చేతబడి జరిగింది. (5) ఈ దినము సుఖముగా నడుచును. (6) విముక్తి కష్టము, శనికి పూజ చేయండి. (7) రోగము అసాధ్యమని తోచుచున్నది, శనికి శాంతి చేయండి. (8) పుత్రుడు పుట్టును, కాని మొండి పట్టుదల కలవాడు అగును. శనికి శాంతి చేయించండి. (9) భాగస్వామ్యం లాభదాయకమే . (10) ఈ వివాహము హితకరము . (11) సఫలత కలిగే అవకాశము ఉంది. (12) హాని కలుగును, ప్రయాణము చేయవద్దు. (13) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడు కాడు నమ్మవద్దు. (14) పోయిన వస్తువు దొరుకును ప్రయత్నము చేయుము. (15) పారిపోయిన వ్యక్తి ఆలస్యముగా చేరును.

కుజ చక్ర ఫలితములు:
(1) విజయము కలుగుతుంది. కాని గురునికి దాన జపములు చేయండి. (2) ఇంటిలో ఎటువంటి దోషములు లేవు. (3) కార్య సిద్ది కలుగుట యందు సందేహము ఉంది. (4) కొనండి, లాభము ఉంది. (5) గ్రహ బాధ ఉంది. కుజునికి శాంతి చేయండి. (6) ఈ దినము చింతాముక్తి కలుగును. (7) విముక్తి కఠినం, శనికి శాంతి చేయండి. (8) రోగి అవపథ్యము వలన రోగము పెరిగింది. కుజునికి శాంతి చేయండి. (9) పుత్రిక పుట్టును. (10) లాభము కలుగును, భాగస్వామ్యం చేయండి. (11) ఈ వివాహము హితకరము . (12) సఫలత కలుగుట యందు అడ్డంకులు కలవు, కేతువు పూజ చేయండి. (13) యాత్ర వలన హాని కలుగును. (14) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడే. 15) పారిపోయిన వ్యక్తి తిరిగి రాదు, వెతకుట వ్యర్థము.

బుధ చక్ర ఫలితములు:
(1) ఈ వార్త నిజమే. (2) కేసు గెలువ గలవు (3) ఈ ఇంటికి చోర భయము ఉంది.రాహువు పూజ చేయుము. (4) కార్య సిద్ది కలుగుట యందు సందేహములు ఉన్నాయి. (5) లాభదాయకంగా ఉంటుంది. (6) ఎవరో చేతబడి చేయించారు. (7) ఈ దినము చింత, వ్యథలతో గడచును. (8) విముక్తి కఠినం . కుజునికి శాంతి చేయండి. (9) రోగము నుండి ముక్తి కష్టము. చంద్రునికి పూజ చేయించండి. (10) పుత్రుడు పుట్టును. (11) పరదేశములో భాగస్వామ్యం చెయ్యండి.లాభము కలుగును. (12) ఈ వివాహము వలన హాని కలుగును. (13) సఫలత చాలా కష్టము. కుజుని పూజ చేయండి. (14) యాత్ర వలన లాభము కలుగును. (15) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడే.

గురు చక్ర ఫలితములు:
(1) ఈశ్వరుని అనుగ్రహం వలన మీకు ఈ కష్టము నుండి విముక్తి కలుగును. (2) ఈ వార్తలో నిజమున్నది. (3) రాహువునకు పూజ చేయించండి, అప్పుడే విజయము సిధ్ధించ గలదు. (4) ఈ ఇంటిలో ప్రేత బాధ కలదు, పాతిపెట్టిన ఎముకలు కూడా ఉన్నాయి. (5) చాల ప్రయత్నము,పొగడతలు,ప్రశంసలు వలన కార్య సిద్ది కలుగును. (6) కొనవద్దు, హాని కలుగును. (7) శారీరిక వ్యాధి కలదు, భయము పెరిగే అవకాశములు ఎక్కువ. (8) చింతించ వలసిన విషయమే. (9) ఆలస్యముగా విముక్తి కలుగ గలదు. చంద్రునికి పూజ చేయండి. (10) అవును ఇతను రోగముక్తుడు కాగలడు. (11) పుత్రిక పుట్టును. (12) స్వప్నమునండు కూడా భాగస్వామ్యం గురించి ఆలోచించ వద్దు. (13) ఈ వివాహము మంచిది కాదు. (14) ప్రయత్న పూర్వక కార్య సిద్ది ఉంది. (15) ఈ యాత్ర వలన సామాన్య లాభము ఉంది.

శుక్ర చక్ర ఫలితములు:
(1) ఈ ఉద్యోగము వలన లాభము ఉంది. (2) అతి కష్టము మీద త్వరలోనే విముక్తి కలుగ గలదు. (3) ఈ వార్త అసత్యము. (4) బుదునికి శాంతి చేయుట వలన విజయము కలుగును. (5) ఈ ఇల్లు నిర్దోషముగా ఉంది. (6) కార్య సిద్ది కలుగుట యందు శని బాధ ఉంది. శాంతి చేయుము. (7) హానికరము కాగలదు, కొనవద్దు. (8) బ్రహ్మ దోషము ఉంది. (9) ఈ దినము సుఖ శాంతులతో గడచును. (10) అతను, విముక్తుడు కాగలడు, సూర్య శాంతి చేయుము. (11) పథ్యము చేయక పోవుట వలన రోగము పెరుగును, విశ్రాంతి దొరకదు. (12) పుత్రుడు పుట్టును, కాని కేతువునకు పూజ చేయుము. (13) భాగస్వామ్యం వలన లాభము కలిగే ఆశ లేదు. (14) ఈ వివాహము హితకరము . (15) సఫలత పొందే ఆశ ఉంది.

శని చక్ర ఫలితములు :
(1) సఫలతా ప్రాప్తి ఉంది. (2) ఈ ఉద్యోగము వలన లాభము ఉంది. (3) సమయము బాగులేదు, రాహువునకు శాంతి చేయుము. (4) ఈ వార్తలో కొంత నిజము ఉంది. (5) విజయము కలుగును. (6) ఇల్లు అశుభము, శని పూజ చేయండి. (7) వైద్యుడు కోపముతో ఉన్నాడు, రోగ ముక్తి కష్టము. (8) కొనవద్దు, హాని కలుగును. (9) భూత బాధ ఉంది. అతి కష్టము.చేత సాధ్యము కాగలదు . (10) ఈ దినము లాభదాయకంగా జరుగును. (11) కేతువునకు శాంతి చేసినచో విముక్తి కలుగును. (12) ఆలస్యముగా మంచి జరుగును. (13) పుత్రుడు పుట్టును, కాని ప్రసవము కష్టము కాగలదు . (14) లాభము ఉంది. భాగస్వామ్యం చేయుము. (15) ఈ వివాహము శుభ ఫలితములు ఇవ్వ గలదు.

రాహు చక్ర ఫలితములు:
(1) ఈ వస్తువును కొనుము, లాభము కలుగును. (2) సఫలత పొందే సంభవము ఉంది. (3) ఈ ఉద్యోగమును నమ్ముకోవద్దు, హాని కలుగ గలదు. (4) ప్రస్తుతము కష్టము నుండి విముక్తి కలుగదు . (5) ఈ వార్త యందు నిజము ఉంది. (6) కేసు బలహీనము, శనికి శాంతి చేయుము. (7) ఈ ఇల్లు సంతాన పక్షములో బాధాకరముగా ఉంది. (8) వైద్యుని వల్ల మీకు అనుకూలత కలగదు. (9) కొనండి, లాభము ఉంది. (10) శారీరిక దోషము ఉంది. విశేష ఉపచారము వలన మంచి కలుగును. (11) ఈ దినము సుఖ శాంతులతో గడుచును. (12) విముక్తి కలుగును, కాని కేతువునకు పూజ చేయండి. (13) రోగముక్తి కష్టము, కుజునికి శాంతి చేయండి. (14) పుత్రుడు పుట్టును,భాగ్యశాలి కాగలడు (15) భాగస్వామ్యం వలన లాభము పొందే అవకాశములు ఎక్కువ.

కేతు చక్ర ఫలితములు:
(1) పశువు దొరుకును, తూర్పు దిశగా వెళ్లినది . (2) కొనండి, లాభము ఉంది. (3) సఫలత కలుగుట యందు సందేహము ఉంది. రాహువునకు పూజ చేయండి. (4) నౌకరీ యందు ఆదాయ వ్యయములు సరి సమానము. (5) అవును, శీఘ్రముగా విముక్తి కలుగును. (6) ఈ వార్త అసత్యము. (7) సమయము బాగు లేదు. రాజీ చేసుకొండి, శనిని పూజించండి. (8) ఈ ఇల్లు ఋణ కారకము . (9) ఈ వైద్యునితో కార్యము కాగలడు. (10) కొనండి, లాభదాయకమే . (11) శారీరిక దోషము, నిదానముగా కుదురును. (12) ఈ దినము చింత, వ్యథలతో గడుచును. (13) విముక్తి కష్టము, కుజుని పూజించండి. (14) అవును, రోగికి త్వరలోనే నయమగును. (15) పుత్రుడు పుట్టును, కాని బుధునికి శాంతి చేయండి.

బ్రహ్మ చక్ర ఫలితములు:
(1) అవును, ఆ ప్రాణి లేక అతను జీవించే ఉంది. (2) పశువు దక్షిణ దిశగా వెళ్లినది. దొరుకుతుంది. (3) ఈ వస్తువు కొంటే హాని కలుగుతుంది. (4) సఫలత పొందగలరు. శనికి శాంతి చేయండి. (5) అవును, నౌకరీ వలన లాభం కలుగుతుంది. (6) సమయం బాగు లేదు, శనికి శాంతి చేయండి. (7) ఈ వార్త అబద్ధము. (8) కేసు దుర్బలము, కుజునికి శాంతి చేయండి. (9) ఇల్లు సమాన్య శుభము. (10) అధికారి వలన కార్యము సిధ్ధించ ఉంది. (11) కొనండి, లాభదాయకంగా ఉంటుంది. (12) ప్రేత బాధ ఉన్నది, రావి చెట్టుకి పూజ చేయండి. (13) చింత, వ్యథలు కలవు, రావి చెట్టుకి పూజ చేయండి. (14) అవును, ఈ ఆరోపణ నుండి విముక్తి పొందుట కష్టముగా ఉంది. (15) నిదానముగా రోగము నయమగును.

విష్ణు చక్ర ఫలితములు:
(1) ఒక మిత్రుని సహాయము వలన అప్పు పొందగలవు. (2) జీవించి ఉంది. (3) పశువు తూర్పు దిశగా వెళ్లింది. దొరికే అవకాశం తక్కువ. (4) లాభం కలుగుతుంది, కొనండి. (5) ప్రతియోగిత పరీక్షలో సఫలత కలుగుతుంది. (6) ఈ ఉద్యోగమునకు స్థిరత్వము లేదు. (7) సమయం బాగు లేదు, విముక్తి ఆలస్యము అగును. (8) ఈ వార్త అబద్ధము. (9) కేసు గెలువగలవు. (10) ఇల్లు శుభము సంశయము లేదు. (11) వైద్యుని ద్వారా రోగము కుదురును. (12) కొనవద్దు, హాని కలుగుతుంది. (13) శారీరిక దోషము, పార్థివ లింగ పూజ చేయండి. (14) ఈ దినము సుఖ,శాంతులతో గడవగలదు. (15) అవును, కొన్ని దినములలో విముక్తి కలుగును.

మహేష్’ చక్ర ఫలితములు:
(1) ఈ సంవత్సరము ప్రమోషన్’ యోగము ఉంది. (2) స్వయముగా అప్పు సాధించ లేవు. (3) జీవించి ఉండుట సందేహము. (4) పశువు దొరుకుట దుర్లభము, దక్షిణ దిశగా వెళ్లినది. (5) కొనండి. లాభము ఉంది. (6) సఫలత పట్ల సందేహము కలదు, శనికి శాంతి చేయండి. (7) నౌకరీ వల్ల హాని కలుగుతుంది. (8) ప్రస్తుతము సమయము బాగు లేదు, కుజునికి శాంతి చేయండి. (9) ఈ వార్త సత్యమైనదే. (10) గెలుపు మీదే అవుతుంది. (11) ఈ ఇల్లు శుభము, మరియు సిద్దిదాయకము అవుతుంది. (12) వైద్యుని వల్ల కార్యము అవుతుంది. (13) కొనవద్దు, హాని కలుగుతుంది. (14) శారీరిక వ్యాధి కలదు, నిదానముగా స్వస్థత కలుగుతుంది. (15) ఈ దినము సుఖము శాంతితో గడుచును.

హనుమాన్’చక్ర ఫలితములు:
(1) కొంత సమయము తరువాత బదిలీ కలుగ గలదు. (2) మీకు ప్రమోషన్’ కలుగుతుంది. (3) ఈ సమయములో అప్పు పుట్టుట సందేహము. (4) అతను జీవించి ఉన్నాడు, కాని రోగ గ్రస్తుడు. (5) పశువు పశ్చిమ దిశగా వెళ్లింది. ప్రయత్నమూ వలన దొరుకుతుంది. (6) కొనవద్దు, హాని కలుగుతుంది. (7) ప్రతియోగిత పరీక్షలలో సఫలత పొందుట అతి కష్టము. (8) ఈ నౌకరీ వలన హాని పొందే అవకాశము ఉంది. (9) కొంత సమయము తరువాత కష్టము నుండి నివారణ కలుగును. (10) అవును, ఈ వార్త నిజమే. (11) కేసు గెలువగలవు. (12) ఈ ఇల్లు శుభముగా లేదు. కేతువునకు శాంతి చేయండి. (13) కార్య సిద్ది ఆశించుట వ్యర్థము కాగలదు. (14) అవును దీనిని కొనండి, లాభము ఉంది. (15) ప్రేతబాధ ఉంది. తంత్రము ద్వారా నివారణ కలుగును.

    ఇక చక్రంలో ప్రశ్న సమాధానం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం

ఉదాహరణలు సవరించు

ప్రశ్న చక్రము ద్వారా మీరు అడగదలచుకొన్న ప్రశ్నను గుర్తించి, ఆ సంఖ్యను ఒకచోట వ్రాసి ఉంచండి. తరువాత తీసా యంత్రములో ఏదో ఒక గదిలో చేతి నడిమి వ్రేలిని గాని, లేక పెన్సిల్ తో గాని ఒక సంఖ్యని ఎంచుకొని దాని సంఖ్యని మొదట ఉంచిన సంఖ్యతో కలపండి. ఇప్పుడు ఆ మొత్తాన్ని బట్టి, సమాధాన చక్రమును గుర్తించండి. ఆ చక్రములో తీసా చక్రము ద్వారా ఎంచుకొన్న సంఖ్య ద్వారా మీకు కావలసిన సమాధానము తెలుసుకోండి . మీరు అడిగిన ప్రశ్న నా మనోకామన పూర్తి అవుతుందా లేదా ? దీని సంఖ్య 1 . తీసా చక్రములో ఎంచుకొన్న సంఖ్య 6 అనుకొందాం. ఈ రెండింటి మొత్తం 1+6=7 అయింది. ఇప్పుడు ఏడవ సమాధాన చక్రము అంటే మేష చక్రములో, ఆరవ సమాధానము చూడండి. మనోవాంఛ పూర్తి కాదు అని వచ్చింది.

ప్రశ్న
నేను ప్రతియోగిత పరీక్షలో గెలుస్తానా లేదా?
ప్రశ్న చక్ర సంఖ్య 24 . తీసా యంత్రములో ఎంచుకొన్న సంఖ్య 8 అనుకొండి ఈ రెండింటి మొత్తము 24+8=32 అయింది . ఈ సంఖ్య 30 కన్నా ఎక్కువ కదా ! అందు వలన అందులో నుంచి 30 తీసివేయాలి. 32 -30=2 అయింది రెండవ సమాధాన చక్రము, అగ్ని చక్రములో ఎంచుకొన్న సంఖ్య ఎనిమిదవ సమాధానం చూడండి. ``సఫలత కలుగుతుంది, కాని కుజుని పూజించండి.’’ అని ఉంది.
****************

విజ్ఞేశ్వరుడు


౧. జయ విఘ్నకృతామాద్య భక్త నిర్విఘ్నకారక!
అవిఘ్న విఘ్నశమన మహావిఘ్నైక విఘ్నకృత్!!
౨. జయ సర్వ గణాధీశ జయ సర్వ గణాగ్రణీః!
గణప్రణత పాదాబ్జ గణనాతీత సద్గుణ!!
౩. జయ సర్వగ సర్వేశ సర్వ బుద్ధ్యేక శేవథే!
సర్వమాయా ప్రపంచజ్ఞ సర్వ కర్మాగ్ర పూజిత!!
౪. సర్వమంగళ మాంగళ్య జయ త్వం సర్వమంగళ!
అమంగళోపశమన మహామంగళ హేతుక!!
౫. జయ సృష్టి కృతాం వంద్య జయస్థితి కృతా నత!
జయ సంహృతి కృత్ స్తుత్య జయ సత్కర్మసిద్ధిద!!
౬. సిద్ధవంద్య పదాంభోజ జయ సిద్ధి వినాయక!
సర్వ సిద్ధ్యేక నిలయ మహా సిద్ద్వృద్ధి సూచక!!
౭. అశేష గుణ నిర్మాణ గుణాతీత గుణాగ్రణీః!
పరిపూర్ణ చరిత్రార్థ జయ త్వం గుణవర్ణిత!!
౮. జయ సర్వ బలాధీశ బలారాతి బలప్రద!
బలాకోజ్జ్వల దంతాగ్ర బాలాబాల పరాక్రమ!!
౯. అనంత మహిమాధార ధరాధర విచారణ!
దంతాగ్రప్రోతదిజ్ఞాగజయ నాగవిభూషణ!!
౧౦. యే త్వం నమంతి కరుణామయ దివ్యమూర్తే!
సర్వైనసామపి భువో భువి ముక్తి భాజః!
తేషాం సదివ హరసీహ మహోపసర్గాన్!
స్వర్గాపవర్గమపి సంప్రదదాసి తేభ్యః!!
౧౧. యే విఘ్నరాజ భవతా కరుణా కటాక్షైః!
సంప్రేక్షితాః క్షితిటేల్ క్షణమాత్రమత్ర!
తేషాం క్షయంతి సకలాన్యపి కిల్బిషాణి!
లక్ష్మీః కటాక్షయతి తాన్పురుషోత్తమాన్ హి!!
౧౨. యేత్వాం స్తువంతి నత విఘ్న విఘాత దక్ష!
దాక్షాయణీ హృదయ పంకజ తిగ్మరశ్మే!
శ్రూయంత ఏవ త ఇహ ప్రథితా న చిత్రం
చిత్రం తదత్ర గణపా యదహో త ఏవ!!
౧౩. యే శీలయంతి సతతం భవతోంఘ్రి యుగ్మం
తే పుత్రా పౌత్ర ధనధాన్య సమృద్ధి భాజః
సంశీలితాంఘ్రి కమలా బహుభ్రుత్య వర్గైః
భూపాల భోగ్య కమలాం విమలాం లభంతే!!
౧౪. త్వం కారణం పరమకారణ కారణానాం!
వేద్యోsసి వేద విదుషాం సతతం త్వమేకః!
త్వం మార్గణీయ మసి కించన మూల వాచాం
వాచామగోచర చరాచర దివ్యమూర్తే!!
౧౫. వేదా విదంతి న యథార్థ తయా భవంతం
బ్రహ్మాదయోపి న చరాచర సూత్రధార!
త్వం హంసి పాసి విదధాసి సమస్తమేకః
కస్తే స్తుతి వ్యతికరో మనసాప్యగమ్య!!
౧౬. త్వద్దుష్టదృష్టి విశిఖైః నిహతాన్నిహన్మి
దైత్యాన్ పురాంధక జలంధర ముఖ్యకాంశ్చ!
కస్యాస్తి శక్తిరిహ యస్త్య దృతేsఫై తుచ్ఛం
వాంఛేద్విధాతుమిహ సిద్ధిద కార్యజాతం!!
౧౭. అన్వేషణే ఢుంఢిరయం ప్రథితోsస్తి ధాతుః
సర్వార్థ ఢుంఢితతయా తవ ఢుంఢినామ
కాశీ ప్రవేశమపి కో లభతేsత్ర దేహీ
తోషం వినా తవ వినాయక ఢుంఢిరాజ!!
౧౮. ఢుంఢే ప్రణమ్య పురతస్తవ పాదపద్మం
యో మాం నమస్యతి పుమానిహ కాశివాసీ!
తత్కర్ణమూల మధిగమ్య పురా దిశామి
తత్ కించిదత్ర న పునర్భవతాస్తి యేన!!
౧౯. స్నాత్వా నరః ప్రథమతో మణికర్ణికాయా
ముద్ధూళితాంఘ్రి యుగళస్తు సచైలమాశు
దేవర్షి మానవ పిత్రూనపి తర్పయిత్వా
జ్ఞానోదతీర్థమభిలభ్య భజేత్తతస్త్వాం!!
౨౦. సమోద మోదక భరైర్వర ధూపదీపై
ర్మాల్యైః సుగంధ బహుళైరనులేపనైశ్చ
సంప్రీణ్య కాశినగరీ ఫలదాన దక్షం
ప్రోక్త్వాథ మా క ఇహ సిధ్యతినైవ ఢుంఢే!!
౨౧. తీర్థాంతరాణి చ తతః క్రమవర్జితోsపి
సంసాధయన్నిహ భవత్కరుణా కటాక్షైః!
దూరీకృత స్వహిత ఘాత్యుపసర్గవర్గో
ఢుంఢే లభే దవికలం ఫలమత్ర కాశ్యాం!!
౨౨. యః ప్రత్యహం నమతి ఢుంఢి వినాయకం త్వాం
కాశ్యాం ప్రగే ప్రతిహతాఖిల విఘ్నసంఘః!
నో తస్య జాతు జగతీతలవర్తివస్తు
దుష్ప్రాపమత్ర చ పరత్రచ కించనాఫై!!
౨౩. యో నామ తే జపతి ఢుంఢివినాయకస్య
తమ్ వై జపంత్యనుదినం హృది సిద్ధయోsష్టౌ!
భోగాన్ విభుజ్య వివిధాన్ విబుధోప భోగ్యాన్
నిర్వాణయా కమలయా ప్రియతే స చాంతే!!
౨౪. దూరేస్థితోsప్యహరహస్తవ పాదపీఠం
యః సంస్మరేత్సకల సిద్ధిద ఢుంఢిరాజ!
కాశీ స్థితే రవికలం సఫలం లభేత్
నైవాన్యథా న వితథా మమ వాక్కదాచిత్!!
ఫలశ్రుతి
ఈ స్తోత్రమును పఠించెడు సజ్జనులను విఘ్నములు బాధింపవు. ఢుంఢిగణపతి సన్నిధియందు ఈ స్తుతిని చదివిన వారిని సర్వసిద్ధులు సేవించును. ఏకాగ్ర చిత్తముతో చదివిన వారు మానసిక పాపముల చేత బాధింపబడరు. ఢుంఢి స్తోత్రమును జపించువారికి పుత్ర, కళత్ర, క్షేత్ర, అశ్వ, మందిర, ధన, ధాన్యములు లభించును. సర్వసంపత్కరమగు ఈ స్తోత్రమును ముక్తికాముకులు ప్రయత్నపూర్వకముగా పఠించవలెను. ఈ స్తోత్రమును పఠించి వెళ్ళినయెడల కోరిన పనులు నెరవేరును.
*****************

విలువలు తెలిపే కధ

పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.

గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.

ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో, ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.

తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు. ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది. రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.

ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!

ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.

ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.

లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు, కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు.

🙏దయచేసి ఇలాంటి నీతికధలను తప్పకుండ ముందుతరాలకు పంచండి🙏
****************

Srimadhandhra Bhagavatham -- 97

బలరాముడు హస్తినాపురమును గంగలో త్రోయబూనుట
దుర్యోధనునకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు లక్షణ. ఆమెకు ఒకానొక సమయంలో వివాహమును నిర్ణయం చేశారు. కృష్ణ పరమాత్మ కుమారుడయిన సాంబుడు దుర్యోధనుని కుమార్తె అయిన లక్షణను తన వీరత్వమును ప్రకటించి ఆమెను తీసుకుని ద్వారకానగరం వైపుకి వచ్చేస్తున్నాడు. దుర్యోధనుడు అందరూ సైన్యంతో వెళ్లి అతనిని ప్రతిఘటించండి అని తన సైన్యమును ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్లి సాంబుడిని ప్రతిఘటించారు. సాంబుడు వారితో గొప్ప యుద్ధం చేశాడు. సాంబుడి ధనుస్సు విరిచేసి అశ్వములను కూలద్రోసి ఆయన సారధిని నిర్జించి సాంబుడిని, సాంబుడు తీసుకుపోతున్న కన్యయైన లక్షణను బంధించి తీసుకువచ్చి దుర్యోధనునకు అందజేశారు. ఆయన వాళ్ళిద్దరిని ఖైదు చేశాడు. ఈవార్త ద్వారకా నగరమునకు చేరింది. వెంటనే కృష్ణ భగవానుడు సర్వ సైన్యములతో దుర్యోధనుని మీదికి యుద్ధానికి బయలుదేరుతున్నాడు.
బలరాముడికి కౌరవులంటే కొంచెం పక్షపాతం ఉన్నది. దుర్యోధనుడు తన దగ్గర శిష్యరికం చేసినవాడు. ఈమాత్రం దానికి యుద్ధానికి వెళ్ళనవసరం లేదు నేను వెళతాను. దుర్యోధనునకు నాలుగుమంచి మాటలు చెప్పి లక్షణను మన కోడలిగా తీసుకువస్తాను’ అని చెప్పి పెద్దలతో కలిసి బయలుదేరి వెళ్లి ఊరిలోకి ప్రవేశించకుండా ఊరిబయట ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేశారు. బలరాముడు మహా బలవంతుడు. బలరాముడితో పాటు ఉద్ధవుడు కూడా వచ్చాడు. భాగవతంలో పరమాత్మ అవతార సమాప్తి చేసేటపుడు ఉద్ధవుడిని పిలిచి చాలా అద్భుతమైన వేదాంత బోధ చేస్తాడు.    బలరాముడు ఉద్ధవుడిని దుర్యోధనుని వద్దకు రాయబారిగా పంపాడు. ఉద్ధవుడు వెళ్లి ఒకమాట చెప్పాడు. ‘మీ అందరిచేత పూజింపబడవలసిన వాడయిన బలరాముడు పెద్దలయిన వారితో ఇవాళ ఈ పట్టణమునకు విచ్చేసి హస్తినాపురమునకు దూరంగా ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయనను సేవించ వలసినది’ అని చెప్పాడు. బలరాముడు వచ్చాడు అని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దలను తీసుకొని బలరాముడు విడిది చేసిన ఉద్యానవనమునకు వెళ్ళాడు. బలరామునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సేవించాడు. బలరాముడిని పొగిడాడు. బలరాముడు ‘నా తమ్ముడయిన శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు నీ కుమార్తెయిన లక్షణను చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే నీవు వానిని నిగ్రహించి ఖైదు చేశావని తెలిసింది. నీవు నా తమ్ముని కుమారుని, కోడలిని విడిచిపెట్టి నాతో పంపవలసింది’ అన్నాడు. వెంటనే దుర్యోధనుడు ‘ఏమి చెప్పావు బలరామా! కాలగతిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేమెక్కడ! యాదవులయిన మీరెక్కడ! మీరు పశువులను తోలుకునే వారు, రాజ్యాధికారం లేదు మీకు మా పిల్ల కావలసి వచ్చిందా! నీ మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తోందో తెలుసా? కాళ్ళకి తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలా ఉన్నది’ అని యయాతి శాపం చేత అసలు యాదవులయిన మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు. మీరు రాజులు ధరించే ఛత్ర చామరాదులన్నీ ధరిస్తున్నారు. రాజభోగములనన్నిటిని అనుభవిస్తున్నారు. ఇంతటి గౌరవమును పొందారు. కృష్ణుడిని చూసి మిమ్ములను చూసి ఎవరూ గౌరవించలేదు. మీరు దుర్యోధనుడి గురువుగారు అని కౌరవులతో మీకు సంబంధం ఉన్నది. మిమ్మల్ని గౌరవిస్తున్నారు. రానురాను ఆ గౌరవమును పక్కన పెట్టి మాతోనే వియ్యమందాలని కోరిక పుట్టిందే మీకు! ఇది జరిగే పని కాదు. మీ హద్దులో మీరు ఉండడం మంచిది’ అని చెప్పి దుర్యోధనుడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. బలరాముడు చెప్పిన జవాబు వినడానికి కూడా అక్కడ లేదు. ఆయనతో మాటలాడడమేమిటన్నట్లుగా వెళ్ళిపోయాడు. అపుడు బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దలను చూసి దుర్యోధనుని మాట తీరు మీరు చూశారు కదా! ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో చెప్తాను వినండి.
ఏ కృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చి నరకాసురుని వధించాలని అనుకున్నప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో, దేవేంద్రుడంతటి వాడు కూడా ఈవేళ భూలోకంలో తిరుగుతున్న కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో, ఏ పరమేశ్వరుని మందిరం కల్పవృక్షముల తోటయో, అక్కడకు వచ్చిన వారి కోరిక తీరకపోవడం అనేది ఉండదో, ఏ మహాత్ముడి కనుసైగ చేత అందరి కోరికలు తీరుతాయో, ఏ పరమేశ్వరుని పాదయుగళిని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవి తాపత్రయ పడుతుందో, నిరంతరము సేవిస్తోందో, ఏ పరమేశ్వరుని అంశభూతముగా నేను, చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించామో, అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడయిన శ్రీకృష్ణపరమాత్మ గొప్పతనం చేత ఇవ్వాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరమును ఏలగలుగుతున్నాడు’ అన్నది పరమ యథార్థము. ఇవాళ దుర్యోధనుడు మాకు కృష్ణుని వలన వైభవం రాలేదని అంటున్నాడు. ఇంతటి దుర్మార్గంగా మాట్లాడే వానికి తగిన బుద్ధి చెప్పి తీరాలని లేచి గంగానది ఒడ్డుకు వెళ్లి ఈ హస్తినాపురము నంతటిని నాగలితో పట్టి లాగి తీసుకువెళ్ళి గంగానదిలో కలిపివేస్తాను’ అని తన నాగలిని హస్తినాపుర నేల లోపలికంటా గుచ్చి లాగాడు. లాగితే సముద్రములో పడవ తరంగములకు పైకి తేలినట్లు ఇన్ని రాజసౌధములతో ఉండే హస్తినాపురము అలా పైకి లేచింది. దానిని గంగానదిలోకి లాగేస్తున్నాడు అంతఃపురము కదిలింది. దుర్యోధనుడు ఏమి జరిగిందని అడిగాడు. నీవు అన్న మాటకి బలరాముడు హస్తినాపురిని నాగలికి తగిలించి గంగలో కలుపుతున్నాడు’ అన్నారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి పెద్దలందరినీ తీసుకుని దుర్యోధనుడు బలరాముని వద్దకు పరుగుపరుగున వచ్చాడు.
 దుర్యోధనుడు బలరాముని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. నా తప్పు మన్నించండని ప్రార్థించాడు. బలరాముడి కోపం చల్లారింది. బలరాముడికి అనేకమైన కానుకలను ఇచ్చి లక్షణను సాంబుడిని రథము ఎక్కించి పంపించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు జీవితంలో ఈ విషయములను బాగా గుర్తుపెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది. ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది. ఆనాడు ఆ యుగంలో బలరాముడు తన నాగలితో ఎత్తిన భూమి మానవాళికి ఒక పాఠం చెప్పడానికి అలానే ఉండిపోయింది.
బలరాముడు తీర్థయాత్రకు జనుట
బలరాముడు ఒకసారి చాలా ఆశ్చర్యకరమయిన లీల చేశాడు. ఆయన సూతుడిని చంపివేశాడు. సూతుడు పురాణములను చెప్తూ ఉండే మహానుభావుడు. సత్త్వ గుణమునకు పేరెన్నిక గన్నవాడు. భగవత్కథలు చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపివేయడం ఏమిటి? అనగా బలరాముడంతటి మహాత్ముడు కూడా కోపమును నిగ్రహించుకొనక పోతే ఎంత పొరపాటు జరిగిపోతుందో ఈ కథలో మనకి చూపిస్తారు. ఒకనాడు నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు. అక్కడ ఆయన దగ్గర ఉన్న పెద్దలందరూ ఆయన ప్రవచనం వింటున్నారు. బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు అందరూ లేచి నమస్కారం చేశారు. ఒక్క సూతుడు మాత్రం నమస్కారం చేయలేదు. బలరాముడు చూసి ఇతనికి బుద్ధి చెప్పాలనుకుని సూతునికి దగ్గరగా వచ్చి అక్కడ ఒక దర్భనొక దానిని చేతిలోకి తీసుకొని ఆ దర్భతో సూతుని కంఠం మీద కొట్ట్టాడు. కొడితే సూతమహర్షి కంఠం తెగిపోయి కిందపడిపోయాడు. సభలో హాహాకారములు చెలరేగాయి. బలరాముడు ‘నాపట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు నేను ఆయన కంఠమును నరికేశాను’ అన్నాడు. అక్కడ పురాణమును వింటున్న వాళ్ళు ‘బలరామా! నీవలన జరుగకూడని అపచారం జరిగింది. సూతుడు ధర్మాధర్మ వివక్షత తెలిసి ఉన్నవాడు మహానుభావుడు. ఆయన లేవకపోవడానికి కారణాలు మేము చెప్తాము ‘నీకు తెలియని రహస్యములున్నాయా! నీకు తెలియని ధర్మ సూక్షములున్నాయా! ఆయనకు మేము బ్రహ్మాసనమును ఇచ్చాము. ఆయన బ్రహ్మయై కూర్చుని ఉండగా నీవు సభలోనికి వచ్చావు. బ్రహ్మగా కూర్చుని వాడు లేచి నిలబడవలసిన అవసరం లేదు. అందుకని సూతుడు కూర్చున్నాడు సూతునియందు దోషం లేదు. ఇప్పుడు నిన్ను పాపం పట్టుకుంది. నీవు చేసినది సామాన్యమయిన పాపం కాదు’ అని చెప్పారు.
  బలరాముడు తానుచేసిన పనికి చాలా బాధపడి ఇప్పుడు నేను ఏమి చేయాలి? మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి’ అని అడిగాడు. మహర్షులు ‘నేను అనంతుడను’ అని అన్నావు కదా! ఆ ఈశ్వరశక్తితో సూతుడికి మరల ప్రాణం పోయవలసింది అన్నారు. బలరాముడు ‘నిజమే సూతుడు బ్రతక వలసిన వాడు. లోకమునకు పనికివచ్చేవాడు. ఈ సూతుడిని నా యోగ శక్తిచేత బ్రతికిస్తాను’ అన్నాడు. ఇకపై సూతునకు రోగమనేది ఉండదు. బుద్ధియందు ధారణశక్తి చెడిపోవడం అనేది ఉండదు. అపారమైన విద్యాబలంతో ఉంటాడు. గొప్ప శక్తి కలవాడై ఉంటాడు. సామర్థ్యములను సూతునకిచ్చి పునఃజీవితమును ఇస్తున్నానని మరణించిన సూతుని బ్రతికించాడు. నేను చేసిన తప్పు పనికి నా మనస్సు బాధ తీరలేదు. మీరు ఇంకా ఏదయినా అడగండి చేసిపెడతాను అన్నాడు. పొరపాటు ప్రతివాడు చేస్తాడు. పొరపాటు చెయ్యడం తప్పుకాదు. మనుష్య జీవితంలో పొరపాటు చేయనివాడు ఉండడు. పొరపాటు చేసిన వాడు బలరాముడిలా ప్రవర్తించాలి. తప్పు తెలుసుకుని ఆ తప్పును అంగీకరించి దానిని సరిద్దిద్దుకోవాలి. అది జీవితమునకు వెలుగునిస్తుంది.
****************

దాతృత్వం

హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు.....
భోజనానికి ఎంత తీసుకుంటారు......
యజమాని చెప్పాడు...
చేపల పులుసుతో అయితే 50 రూపాయలు,
అవి లేకుండా అయితే 20 రూపాయలు....
ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులోనుండి నలిగి ,ముడతలుపడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు....
నా చేతిలో ఈవే ఉన్నాయి..
వీటికి ఎంతవస్తే అంతే పెట్టండిచాలు....ఉత్తి అన్నమైనా ఫరవాలేదు...
కాస్త ఆకలి తీరితే చాలు.
నిన్నటి నుండి ఏమీ తినలేదు...
ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి. గొంతు వణుకుతోంది....
హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు.
నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తు నిలబడ్డాను.... ఆయన కంటినుంది కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి.వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్నవ్యక్తి అడిగాడు....*

మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా...?,
* ఆయన ఆ మాట అడిగిన వ్యక్తివైపు చూసి కళ్ళు వొత్తుకుంటు ఇలాచెప్పారు...*
   * నా గత జీవితం గుర్తుకువచ్చి కన్నీళ్ళు వచ్చాయి.... నాకు ముగ్గురు పిల్లలు  ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి.....*
* ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి.... నేను కూడపెట్టిన ప్రతీ పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చుపెట్టాను. దానికోసం నేను నాయవ్వనాన్ని, 28 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను...*
* అన్నింటికి నా వెన్నుముకై నిలచిన నా భార్య నన్ను ఒంటరివాడినిచేసి ముందే వెళ్లి పోయింది....ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటినుండి నా కొడుకులు, కొడళ్లు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు.వాళ్లకు నేను భారమవ్వడం మొదలైనాను.
* ఎంత ఒదిగి ఉంటున్నా , నన్ను వాళ్ళు అంత దూరంపెట్టనారంభించారు....*
* నేను వృద్దుణ్ణి కదా....? కనీసం
నా వయస్సు కైనా గౌరవమివ్వచ్చుకదా....? అదీ ..లేదు...*
* వాళ్లందరు భోజనం చేసిన తరువాతనే నేను భోజనానికి వెళ్లే వాడిని, అయినా అప్పుడు కూడా తిట్లూ, చీత్కారాలు తప్పేవి కావు, భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది, మనవలుకూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ, నాన్న చూస్తే తిడతారనే భయంతో...*
* ఎప్పుడు ఒకటే సతాయింపు ఎక్కడికైనా పొయి బ్రతకవచ్చుకదా, అని...*
పగలనక, రాత్రనక, చెమటోడ్చి కష్టపడి, కంటినిండా నిద్ర పోకుండా, కడుపునిండా తినకుండా ఆమె, నేను కూడబెట్టిన డబ్బుతో ఒకొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇల్లు...., ఆమె జ్ఞాపకాలు, చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనీయడం లేదు...
* కానీ ఏం చేయను కోడలి బంగారం దొంగిలించాననే నెపం తో దొంగ అనే ముద్ర వేశారు...* కొడుకు కోప్పడ్డాడు, ఇంకా నయం కొట్టలేదు, అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అదికూడా జరగవచ్చు.* తండ్రి* పై చేయి చేసుకున్న * కొడుకు* అనే అపవాదు వాడికి రాకూడదని, బయటకు వచ్చాను.నాకు చావంటే భయం లేదు, అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరికోసం బ్రతకాలి....*?
ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు..
తనవద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు....
యజమాని  వద్దు చేతిలో ఉండనివ్వండి అన్నాడు....*
* ఎప్పుడైనా మీరు ఇక్కడకు రావచ్చు...*
* మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది..*
* ఐతే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడపెట్టి చెప్పాడు....*
* చాలా సంతోషం, మీ ఉపకారానికి....
ఏమి అనుకోకండి... ఆత్మాభిమానం, నన్ను విడవటంలేదు. వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకుని గమ్యంతెలియని బాటసారిలా... వెళ్ళిపోయాడు.
*ఆ వ్యక్తి నా మనసుకి చేసిన గాయం నేటికీ మానలేదు.
* అందుకే అంటారు ప్రతీ పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండు టాకు అవుతుందని .......*
పండుటాకులాంటి ఆ పెద్దలను పువ్వులలో పెట్టి చూసుకోవాలని, లేకుంటే మనకు అటువంటి ఒకరోజు వస్తుందని ఎవరు చింతించడం లేదు..???
*కావలసింది, అక్కరలేనిది అని తేడా లేకుండా ప్రతీది షేర్ చేసి MB అవగొట్టేవాళ్ళు, దీన్నికూడా షేర్ చెయ్యండి
ఎవరైనా ఒక్కళ్ళ మనసు మారినా.....* చాలు.*
* మార్పు మననుండే ప్రారంభం కానీయండి
***************