11, జులై 2021, ఆదివారం

కర్మణ

 కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః ।

అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ।। 17 ।।

కర్మణ — చేయవలసిన (విహిత) కర్మలు; హి — నిజముగా; అపి — కూడా; బోద్ధవ్యం — తెలుసుకొనుము; బోద్ధవ్యం — అర్థం చేసుకొనుము; చ — మరియు; వికర్మణః — నిషిద్ధ కర్మలు; అకర్మణః — అకర్మలు; చ — మరియు; బోద్ధవ్యం — అర్థం చేసుకొనుము; గహనా — గంభీరమైనది; కర్మణ — పనుల; గతిః — నిజమైన మార్గము.

కర్మ, వికర్మ, అకర్మ - నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి – వీటి గురించి ఉన్న యదార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది.

పని అనేది శ్రీ కృష్ణుడి చే మూడు రకాలుగా వర్గీకరించబడినది – కర్మ, వికర్మ మరియు అకర్మ.

కర్మ: ఇంద్రియ నియంత్రణ మరియు చిత్త శుద్దికి దోహదపడే విధంగా ఉండే శాస్త్ర విహితమయిన మంగళప్రద పనులు.

వికర్మ: శాస్త్రములచే నిషేధింపబడిన ఆశుభకర మయిన పనులు; ఇవి హాని కారకమయినవి మరియు ఆత్మ అధఃపతనానికి దారితీసేవి.

అకర్మ: ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. వీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు ఇవి జీవాత్మ ను బంధించవు.

By   C. Bhargava SARMA advocate hydrated

సంస్కృత మహాభాగవతం*



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  డెబ్బది తొమ్మిదవ అధ్యాయము*


*బలరాముడు బల్వలుని సంహరించి, తీర్థయాత్రలను కొనసాగించుట - భీమదుర్యోధనుల గదాయుద్ధమును నివారించుటకు ప్రయత్నించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*79.1 (ప్రథమ శ్లోకము)*


*తతః పర్వణ్యుపావృత్తేఙ్ ప్రచండః పాంసువర్షణః|*


*భీమో వాయురభూద్రాజన్ పూయగంధస్తు సర్వశః॥11560॥*


*శ్రీశుకుడు నుడివెను*  పరీక్షిన్మహారాజా! ఒకానొక పర్వదినమున భయంకరమైన సుడిగాలులు వీచెను. తీవ్రముగా దుమ్ములు చెలరేగెను. అంతటను దుర్గంధములు వ్యాపించెను.


*79.2 (రెండవ శ్లోకము)*


*తతోఽమేధ్యమయం వర్షం బల్వలేన వినిర్మితమ్|*


*అభవద్యజ్ఞశాలాయాం సోఽన్వదృశ్యత శూలధృక్॥11561॥*


పిమ్మట బల్వలుడు యజ్ఞశాలయందు మలమూత్రాది అపవిత్ర పదార్థములను వర్షించెను. అనంతరము అతడు శూలమును చేబూని కనబడెను.


*79.3  (మూడవ శ్లోకము)*


*తం విలోక్య బృహత్కాయం భిన్నాంజనచయోపమమ్|*


*తప్తతామ్రశిఖాశ్మశ్రుం దంష్ట్రోగ్రభ్రుకుటీముఖమ్॥11562॥*


ఆ బల్వలుడు ముక్కలైన నల్లని కాటుక కొండవలె మహాకాయమును కలిగియుండెను. అతని కేశములు, మీసములు కాచబడిన రాగిరంగులో ఉండెను. అతని ముఖము భయంకరమైన కోఱలతో, బొమముడులతో ఒప్పుచుండెను.


*79.4 (నాలుగవ శ్లోకము)*


*సస్మార ముసలం రామః పరసైన్యవిదారణమ్|*


*హలం చ దైత్యదమనం తే తూర్ణముపతస్థతుః॥11563॥*


అతనిని చూచినవెంటనే బలరాముడు శత్రుసైన్యములను చీల్చి చెండాడగల ముసలాయుధమును, దైత్యులను హతమార్చుటలో సమర్థమైన హలాయుధమును స్మరించెను. అవి క్షణములో ఆయనను చేరెను.


*79.5 (ఐదవ శ్లోకము)*


*తమాకృష్య హలాగ్రేణ బల్వలం గగనేచరమ్|*


*ముసలేనాహనత్క్రుద్ధో మూర్ధ్ని బ్రహ్మద్రుహం బలః॥1564॥*


అప్పుడు బ్రహ్మద్రోహియగు ఆ బిల్వలాసురుడు ఆకాశమున సంచరించుచుండగా చూచి బలదేవుడు మిగుల క్రుద్ధుడై అతనిని తన హలాగ్రముచే లాగి, అతని మూర్ధమపై (మాడుపై) ముసలాయుధమతో బలముగా మోదెను.  


*79.6 (ఆరవ శ్లోకము)*


*సోఽపతద్భువి నిర్భిన్నలలాటోఽసృక్సముత్సృజన్|*

 .

*ముంచన్నార్తస్వరం శైలో యథా వజ్రహతోఽరుణః॥11565॥*


ఆ దెబ్బతో బల్వలుని నొసలు ముక్కలైపోయెను. అప్పుడు అతడు నోట రక్తము గ్రక్కుచు, ఆర్తనాదములొనర్చుచు, వజ్రాయుధ ప్రహారమునకు దెబ్బతిని, గైరికాది ధాతువులచే ఎర్రబారియున్న కొండవలె నేలపై పడిపోయెను.


*79.7 (ఏడవ శ్లోకము)*


*సంస్తుత్య మునయో రామం ప్రయుజ్యావితథాశిషః|*


*అభ్యషించన్మహాభాగా వృత్రఘ్నం విబుధా యథా॥11566॥*


*79.8 (ఎనిమిదవ శ్లోకము)*


*వైజయంతీం దదుర్మాలాం శ్రీధామామ్లానపంకజామ్|*


*రామాయ వాససీ దివ్యే దివ్యాన్యాభరణాని చ॥11567॥*


పిమ్మట మహాత్ములు, నైమిశారణ్యవాసులు ఐన మునీశ్వరులు బలరాముని స్తుతించి, దేవతలు ఇంద్రునకువలె, ఆ మహానుభావునకు అభిషేకమొనర్చిరి, శుభాశీస్సులనొసంగిరి. ఇంకను ఆ మహర్షులు వాడిపోని కమలములతో ఒప్పారుచుండెడి వైజయంతీమాలను, దివ్యములైన రెంఢు వస్త్రములను, అమూల్యములగు ఆభరణములను ఆ బలదేవునకు కానుకలుగా సమర్పించిరి


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి డెబ్బది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

భాగవత పద్యాలు ప్రార్ధనా శ్లోకాలు:*

 🙏

*బమ్మెర పోతనామాత్యులు రచించిన భాగవత పద్యాలు ప్రార్ధనా శ్లోకాలు:*

👇👇👇👇👇👇👇

1.   తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నా

యిల్లంబందున నుండి జ్రుంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో

బిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ

ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భరతీ పూర్ణేందు బింబాననా.


2.  అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె

ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను లో 

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా 

యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ .


3.  శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర 

క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో 

ద్రేక స్తంభకు గేళి లోలవిలసద్రుగ్జాల సంభూత నా 

నాకంజాత భవాండకుంభకు మహనందాంగనాడింభకున్.


4.  శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా

హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం

దార సుధా సయోధి సీత తామర సామర వాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భరతీ!!


5.  చేతులారంగ శివుని బూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని 

దయయు సత్యంబు లోనుగా దలపడేని, గలుగ నేటికీ దల్లుల కడుపుజేటు.


6.  పలికెడిది భాగవతమట

పలికించు విభుండు రామభాద్రుండట నే 

పలికిన భవహరమగునట 

బలికెద వేరొండు గాధ పలుకగనేల !!


7.  భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు

శూలికిన దొమ్మి చూలికైన

విభుద జనుల వలన విన్నంత కన్నంత

దెలియ వచినంత దేటపారుతు.


8.  శారద నీరదేందు ఘనసార పటీర మరాళమల్లికా

హారతుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం

దార సుధాపయోధి సితతామరసామర వాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడుకల్గు భారతీ!!

*************************************** 

కుంతీ స్తుతి::

9.  కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ

నందగోపకుమరాయ గోవిందాయ నమోనమః

నమః పంకజనాభాయ నమః పంకజమాలినే

నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే.


10.  యాదవులందు పాండుసుతులందునధీశ్వర నాకు మోహ వి

చ్చేదము సేయుమయ్య ఘనసింధువు చేరెడి గంగ భంగి నీ

పాదసరోజ చింతనముపై ననిశంబు మదీయబుధి న

త్యాదర వృత్తితో గదియునట్ట్లుగ జేయుగాదయ్యయీశ్వరా!


11. శ్రీకృష్ణా! యడుభూషణా నరసఖా శృంగార రత్నాకరా!

లోకద్రోహినరెంద్రవంశదహనా లోకేశ్వరా దేవతా

నీక బ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణ సంధాయకా!

నీకున్ మ్రొక్కెద త్రుంపవే భావలతల్ నిత్యానుకంపానిధీ!!

***************************************

12.హరిమయము విశ్వమంతయు హరివిశ్వమయుండు సంశయము పనిలేదా

హరిమయము కానిద్రవ్యము పరమాణువులేదు వంశపావన వింటే.


13.విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండఖిలనేత విశ్నుజుండీ

విశ్వములో తానుండును విశ్వము తనలోన చాల వేలుగుచునుండన్.

***************************************

14.నారదుడు ధర్మరాజుతో అన్న మాటలు:

కమోత్కంఠత గోపికల్ భయమునన్ గంసుండు వైరక్రియా

సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్

ప్రేమన్ మీరలు భక్తినేము నిదె చక్రింగంటి మెట్లైన ను

ద్ధామధ్యానగారిష్టు‌డైన హరి జెందెన్ వచ్చు ధాత్రీశ్వరా.

*************************************** 


ప్రహ్లాదోపఖ్యనం లోని పద్యాలు:

15.పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీ

లానిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత 

శ్రీ నారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం

ధానుండై మరచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భూవరా!!


16.మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వూవునే మదనములకు

నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు

లలిత రసాల పల్లవఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు

పూర్ణేందు చంద్రికా స్ఫురిత చాకోరకంబరుగునే సాంద్రనీహారములకు

అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పానవిశేషమత్త

చిత్తమేరీతి నిరతంబు జేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయనేల!


17.చదివించిరి నను గురువులు చదివితి ధర్మర్ధముఖ్యసస్త్రంబులు నే

చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!


18.కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ 

సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయి కి మ్రొక్కు శిరము శిరము

విష్ణునా కర్ణించు వీనులు వీనులు, మధు వైరి దవిలిన మనము మనము

భగవంతువలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు

కుంభీనీధవు జెప్పెడి గురుడు గురుడు తండ్తి! హరి జేరుమనేడి తండ్రి తండ్రి.


19.కంజాక్షునకునుగాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భాస్మి గాక

వైకుంఠుబొగడని వక్త్రంబు వక్రమే ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక

హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక

కమలేశుజూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములు గాక

చక్రిచింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబు గాక

విష్ణుభక్తీలేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువు గాక!


20. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్

బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్రా!


21.కలడంబోధి గలండు గాలి గలదాకసంబునుం గుంభినిన్

గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్

గలదడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులందంటన్

గలడీశుండు కలండు తండ్రి! వేదకంగానేల నీ యా యెడన్

22. ఇందుగలండందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి! వింటే.


23. నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు మనవాకారము కే

సరి యకారము నున్నది, హరి మాయా రచితమగు యదార్ధము చూడన్.


24. హరికిం పట్టపుదేవివి హరిసేవానిపుణమతివి హరిగాతివి సదా

హరి రతివి నీవు సని నరహరి రోషము డింపవమ్మ హరివరమధ్యా!

***************************************

గజేంద్ర మోక్షము పద్యాలు:

25. ఎవ్వనిచేజనించు జగమెవ్వని లోపలనుండు లీనమై

యెవ్వని యందు డిందు, పరమేశ్వరుడెవ్వడు, మూలకరణం

బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వా

డెవ్వడు, వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్.

26. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నాలోకం బాగు పెం

జీకటి కవ్వల నేవ్వడేకాకృతి వెలుగు నతని నేసేవింతున్.


27. కలడందురు దీనులయెడ కలడందురు పరమ యోగి గణముల పాలన్

కలడందురన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడో లేడో.


28. కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు

నా కడ్డపడరాడె నలి నసాధువులచే బడిన సాధుల కడ్డపడెడువాడు

చూడడే నా పాటు చూపుల జూడక చూచువారల గృప చూచువాడు

లీలతో నా మొరాలింపడే మెురుగుల మెురలెరుంగుచు తన్ను మొరగువాడు

అఖిల రూపులు తన రూపమైన వాడు నాది మధ్యాంతములు లేక యడరువాడు

భక్త జనముల దీనుల పాలివాడు వినడె చూడడె తలపడే వీగరాడే.


29. లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యె బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువులున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్

రావే యీశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!


30. అలవైకుంఠ పురంబులో నగరిలోనామూల సౌధంబు దా

పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో

త్పలపర్యంకరమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై.


31.సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం చేదోయి సంధింప డే

పరివారంబునుజీర డభ్రగపతిం బన్నింప డాకర్ణి కాం

పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావానోత్సాహియై.


32. తనవెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దానివె

న్కను బక్షీంద్రుడు వాని పొంతను ధనుఃకౌమొదకీ శంఖ చ

క్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుడురావచ్చి రొ

య్యన వైకుంఠపురంబునం గలుగు వారాబాల గోపలమున్.


33. చనుదెంచెన్ ఘనుడల్లవాడె హరి పజ్జం గంటిరే లక్ష్మి శం

ఖ నినాదంబదె చక్రమల్లదె భుజంగధ్వంసియున్ వాడె క్ర

న్నన నేతెంచె నటించు వేల్పులు "నమో నారాయణాయే"తి ని

స్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థా వక్రికిన్ జక్రికిన్.

***************************************

వామనవతారం:

34. వాడుగా! యెవ్వరివాడ వెవ్వడవు సంవాస స్థలం బెయ్యెది

య్యెడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్

కడుధన్యాత్ముడనైతి నీ మఖము యోగ్యంబెయ్యె నా కోరికల్

కడతేరెన్, సుహుతుంబులయ్యె శిఖులుం కళ్యాణమిక్కాలమున్.


35. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో

హరులో రత్నములో రధంబులో విమృష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో

ధరణీఖండమో కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా.


36. గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ ముంజియో దండమో

వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షు లశ్వంబు లె

క్కడ నిత్యోచిత కర్మమెక్కడ? మదాకాంక్షామితంబైన మూ

డడుగుల్ మేరయ త్రోవకిచుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

 

37. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతింబొందరే

వారేరీ? సిరిమూట గట్టుకుని పోవంజాలిరే భూమిపై

పెరైనం గలదే శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై

యీరే కోర్కులు వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా?


38. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంబుపై

పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మ

ర్యాదం జెందు కరంబు క్రిందగుట మీదై నాకరంబుట మేల్

గాదె రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నా పాయమే?


39. ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపై

నంతై తోయదమండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై

నంతై చంద్రునికంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై

నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్దియై.


40. రవిబింబం బుపమింప బాత్రమగు చత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతమై గళాభారణమై, సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటియై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుడు తాబ్రహ్మన్డమున్ నిండుచోన్.


41.ఎవ్వని కరుణింప నిచ్ఛయించితి వాని యఖిల విత్తంబునేనపహరింతు

సంసారగురుమద స్తబ్ధుడై యెవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు

నతడెల్ల కాలంబు నఖిల యోనులయందు పుట్టుచు దుర్గతి పొందు పిదప

విత్తవయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి

ఏకవిధమున విమలుడై యెవ్వడుండు వాడు నాగూర్చి రక్షింపవలయువాడు

స్తంబలోభాభిమాన సంసార విభవమత్తుడై చేడనొల్లడు మత్పరుండు.

***************************************

 దశమ స్కంధం:

42. ఆదౌదేవకీదేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం

మాయాపూతనజీవితాపహరణం, గోవర్ధనోద్ధారణం

కంసచ్ఛేదన కురవాదిహననం కౌంతేయసంరక్షణం

ఎతద్భాగవతం పురాణకథితం, శ్రీకృష్ణ లీలామృతం!!


43. విష్ణుకథారాతుడగు నరు విష్ణుకథల్ చెప్పుమనుచు, వినుచుండు నరున్

విష్ణుకథాసంప్రశ్నము విష్ణుపదీజలము భంగి విమలుల జేయున్.


44. అన్నావు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో

మన్నన సేయుటో మధుర మంజుల భాషల నాదరించుటో

మిన్నుల మ్రోతలే నిజాము మేలని చంపకుమన్న మాని రా

వన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్.

***************************************

హరియను రెండక్షరములు

హరియించు పాతకంబు నంబుజనాభా

హరి నీ నామస్మరణము

హరి హరి పొగడంగ తరమె హరి శ్రీకృష్ణా !!


నీ పాద కమల సేవయు నీ పాదర్చకులతోడి నెయ్యము నితాం

తాపార భూతదయయును దాపస మందార నాకు దయసేయగదే.

👍

పద్మావతీ శ్రీనివాసం

 *పద్మావతీ శ్రీనివాసం*


అలిమేలుమంగమ్మకి అలసటగా అనిపించింది. మగతకళ్ళను నలుపుకోని, *ఇంకా రాడేం నా నామాలస్వామి* అంటూ పలవరించింది. ఆ రోజు శుక్రవారం కావటంతో, ఆమెకీ భక్తుల తాకిడి ఎక్కువగానేవుంది. నిద్ర ముంచుకొస్తోంది. అయినా మునుపు ఏండుకొండలవాడు వచ్చినప్పుడు శుక్రవారం తప్పక వస్తానని చేసిన ప్రమాణం గుర్తుంది.ఎందుకే ఈ ఎదురుచూపులు.

బద్దకంగా లేచి నాలుగు అడుగులు వేసి గుమ్మందాకా వచ్చింది ఆ తల్లి. కనుచూపు సాగినంతవరకు పరికించి ఏడుకొండలవైపు చూసింది. ఏముంది... ఆయన జాడ లేదు సరికదా, ఇసుకేస్తే రాలనట్లు జనం కనిపించారు. ఇంకా వస్తున్నారు.. బస్సుల్లో, కార్లలో, కాలినడకన.. జనం జనం జనం. ఒక పక్క ఒక గుంపు *గోవిందా.. గోవిందా* అని అరిస్తే, అటువైపు వున్నాడేమో అని చూసింది. ఇంతలో మరోవైపు *ఏడుకొండలవాడా వేంకటరమణా...* అని మరో భక్తసమూహం కేకపెడితే, పోనీ అటువైపు కానీ వెళ్ళాడా అని చూసింది. ఎక్కడా ఆయన జాడే లేదు.


అలిమేలుమంగమ్మ మరికాస్త పరికించి, తిరుమల కొండపైకి దృష్టి సారించింది.ఇంకా పవళింపు సేవకి టికెట్లు ఇస్తున్నారు. *నారాయణా... ఇంకా సేవలు వున్నాయా? భక్తపక్షపాతం కాకపోతే ఎప్పుడూ వాళ్ళ సేవలేకానీ, మిమ్మల్ని సేవించి తరించే అవకాశం నాకు ఇవ్వవు కదా?* అంటూ నిట్టూర్చింది. చేసేదిలేక భారంగా అడుగులేసుకుంటూ లోపలికి వచ్చింది. ఆమె శ్రీవారు వస్తే అలంకరించాలనుకున్న వజ్రాలపతకం, పట్టుపీతాంబరం ఆపక్కనే తిరునామం తీర్చిదిద్దడానికి సర్దుకున్న సరంజామా అన్నింటినీ ఒక్కసారి చూసుకుంది.

*ఏం లాభం.. రావటమే ఆలస్యం... ఇంక వీటన్నింటికీ తీరికేది? అసలు ఆయన సక్రమంగా భోజనం చేసి ఎన్నాళ్ళైందో..* అనుకున్నది. ఆ ఆలోచన రాగానే, ఆయన కోసం ఏర్పాటు చేసిన భోజనాల సంగతి గుర్తొచ్చింది. *అయ్యో గోవిందా... అన్నీ చల్లంగా చల్లారిపోయి వుంటాయి...* అంటూ ఒక్కక్క పాత్రపైన మూత తీసి చూసింది. పులిహోర, చక్కర పొంగలి, దద్దోజనం, పాయసం ఇవికాక సాధకాలు, భక్ష్యాలు అన్నీ స్వహస్తాలుతో ప్రేమ రంగరించి మరీ చేసింది ఆ తల్లి. *అలిసిపోయి వస్తాడు... ఇక రుచిపచి కూడా తెలియదైపోయే... ఇంకా అందులో రంగరించిన ప్రేమని ఎక్కడ గుర్తిస్తాడు?* అనుకుంది పద్మావతి.


ఆ వంటకాల సువాసనలు ఆఘ్రాణించిన తరువాత అమ్మ కడుపులో ఆకలి రెండింతలైంది. *మధుసూధనా... త్వరగా రావయ్యా స్వామీ...* అంటూ చనువుగా అంది అక్కడే కూర్చుంటూ. *అంజనాద్రి వరకైనా వచ్చాడో లేక ఇంకా మాడవీధులైనా దాటలేదో...* అనుకుంటూ, ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి జారుకుంది ఆ అన్నులమిన్న.


స్వామి పరుగులమీద వున్నాడు. అప్పుడెప్పుడో గజేంద్రుడు పిలిచినప్పుడు ఇలా పరిగెత్తాడు. ఈ మధ్య దాదాపు ప్రతిరోజూ ఇదే జరుగుతోంది.అప్పుడన్నా నయం, వచ్చిన దారి సులువైన గగనమార్గం... వద్దన్నా వెంటపరుగెత్తిన పరివారం. మరి ఇప్పుడో... కఠినమైన గుట్టలు, రాళ్ళు నిండిన కొండ దారి. ఇక పరివారమా? అంతా గుళ్ళోనే జోగుతున్నారు. పైగా స్వామీ వెళ్ళేది దేవేరి దగ్గరకేనని వాళ్ళకీ తెలుసు. అందుకే వెంట వస్తామని కూడా అనరు.


*పోనీ నేను రానా స్వామీ*  అంది కౌముది అనే గద నిద్రకళ్ళతోనే.

*నువ్వొస్తే నాకు మోత బరువు తప్ప ఉపయోగం ఏముంది? ఆ గరుత్మంతుడు  వస్తే ఉపయోగం కానీ*  అన్నాడు ఒక మూల నిద్రపోతున్న గరుత్మంతుణ్ణి చూసి.

*పాపం అలసిపోయాడు స్వామీ* అంది కౌముది.

తప్పేదేముంది. దేవేరికి ఇచ్చిన మాట... ఆ మాట జవదాటి అలమేలుకి అలక తెస్తే ఆ అలక తీర్చేందుకు ఎన్ని పారిజాతాలు కావాలో, ఏమేమి సేవలు చెయ్యాలో.

*సరే నేను బయలుదేరుతున్నా... గుడి జాగ్రత్త...* అన్నాడు ద్వారపాలకులని చూస్తూ.

*అలాగే స్వామీ* అన్నారు జయవిజయులు ద్వారబంధం పక్కనే కూలబడుతూ.

స్వామి వడివడిగా నడవసాగాడు.


పద్మావతీవల్లభుడు తిరుచానూరులో గుడికి చేరేసరికి అంతా చీకట్లు కమ్ముకున్నాయి. దేదీప్యమానమైన వెలుగులతో, అంతకు రెండింతలు వెలిగే చంద్రబింబంలాంటి ముఖంతో అలుమేలుమంగ ఎదురొస్తుందని వూహించిన శ్రీనివాసుడు హతాసుడయ్యాడు.

*ఈ చీకట్లు కారణం దేవేరి అలక కాదుకదా?* అంటూ సందేహించాడు. అడుగులు వడివడిగా వేస్తూ, గుడి గడపలు దూకుతూ లోపలికి అడుగుపెట్టాడు. వెంకటేశ్వర పట్టపురాణి కఠినమైన రాతిపై వళ్ళు తెలియక నిద్రపోతోంది. ఆయన రాకతో పాటే లోపలికి ప్రవేశించిన సుగంధ వీచికలను ఆఘ్రాణించి చటుక్కున లేచి కూర్చున్నది అలుమేలుమంగమ్మ.


*వచ్చారా స్వామీ... ఏమిటింత ఆలస్యం? చూడండి మీకోసం వండినవన్నీ చల్లారిపోయాయి...*  అంది ఆమె నిద్రతో చదిరిన సింధూరాన్ని సర్దుకుంటూ.

*వాటి సంగతి సరే... ముందు కాస్త స్థిమిత పడనీ..* అంటూ అక్కడే వున్న ఒక రాతి స్థంభాన్ని ఆనుకొని కూర్చున్నాడు దేవదేవుడు.

*అయ్యో... అక్కడ కూర్చున్నారేమండీ... అవునులే పగలంతే నిలబడే వుంటారయ్యే... కాళ్ళు నొప్పులు పుట్టాయేమో...* అంటూ పాంకోళ్ళను తొలగించింది.

*పైగా నీ కోసం పరుగులుపెట్టి వచ్చాను కదా...* అన్నాడు ఆయన. ఆమె తన కోమల హస్తాలతో సుతారంగా ఆయన పాదాలను నొక్కజూసింది.

శ్రీనివాసుడు ఆమెను వారించి – *వద్దు దేవీ, కొత్త పట్టుబట్టలు కట్టారు, అవి కొంచెం గరుకుగా వున్నాయి, నీ చేతులు కందేనేమో..* అన్నాడు.

జలజాక్షి మనోహరంగా నవ్వి – *ఇదంతా ప్రేమే.*  అంది సిగ్గుపడుతూ. శ్రీనివాసుడూ నవ్వాడు. ఆలయమంతా వెలుగు పరుచుకుంది.

ఇంతలో గుమ్మం దగ్గర అలికిడి.. *ఎవరదీ.?*  అన్నాడు గోవిందుడు. – *నేను చూస్తానుండండి... ఇంత రాత్రివేళ ఎవరో..*  అంటూ గబగబా గర్భాలయం వెలుపలికి వచ్చింది ఆమె. ఎవరో నలుగురు సాధువులు.

*ఏమిటయ్యా ఇంత రాత్రివేళ?* అంది కోపంగా.

*నీకు తెలియనిదేముంది తల్లీ.. పైన స్వామివారి దర్శనం దుర్లభమైపోతోంది...క్షణకాల దర్శనం.. చూసినా చూడనట్టే వుంటోంది...* *ఒక్కసారి తనివితీరా చూద్దామని సాయంత్రం నుంచీ ఇక్కడే వేచి వున్నాము.* అన్నాడొక సాధువు భక్తిగా.

*ఓరి అసాధ్యులారా... ఇక్కడికీ దాపురించారా? మాకిద్దరికీ ఏకాంతమనేది ఒకటి వుండనిస్తారా లేదా?* అంది నిష్టూరంగా.

*తప్పే అమ్మా... కానీ ఏం చెయ్యగలం, స్వామివారితో నిముషం గడపాలంటేనే ఎంతో డబ్బు కావాలి... సాధువులం.. సామాన్యులం.. మా దగ్గర అంతంత డబ్బు ఎక్కడ వుంటుంది..* అంటూ ప్రాధేయపడుతూ నమస్కరించారు.

*మరి... ఆయనేమన్నా సామాన్యుడా... కాసులులేనిది వడ్డీకాసులవాడు ఎలా కనిపిస్తాడు...*  అంటూ వాళ్లని పంపించే ప్రయత్నంలో వుండగా, వారి ముఖంలో కనిపించిన భక్తితాదాత్మత చూసి ఆగిపోయింది. వెనకకు తిరిగి చూస్తే వెనకే వెంకటేశ్వరుడు.

*దేవదేవా... ఆపద్భాందవా... మీ దర్శనం కోరిన ఈ అల్పులకు సతీసమేతంగా దర్శనమిచ్చావా స్వామీ... గోవిందా.. గోవిందా..* అంటూ నమస్కరించారు. స్వామి చిరునవ్వు నవ్వి, అభయహస్తం చూపించారు.

*సరే.. చూశారుగా.. ఇక అష్టోత్తరనామాలు చదవక కదలండి... లేదంటే తెల్లారిపోగలదు..* అంటూ స్వామి హస్తాన్ని అందుకోని లోపలికి నడిచింది పద్మావతి.

*ఏమిటి స్వామీ మీరు... నేను పంపిస్తున్నానా... అసలు మీరు ఇంట్లో లేరని చెప్పాలనుకుంటుంటే ఇంతలోనే మీరు వచ్చి నిలబడ్డారు...*

*పోనీలే దేవీ, పాపం సాధువులు..*

*బాగానే వుంది... నేను కాబట్టి సరిపోయింది... ఒకప్పుడు మీరిలాగే సాధువని, ఋషి అనీ ఒకాయన కాళ్ళుపడితే  లక్ష్మీదేవి ఏం చేసిందో గుర్తులేదా?* అంది అటువైపు తిరుగుతూ.

*అది లక్ష్మి, ఇది పద్మావతి... అది తెలుసు కనుకే ఇంత ధైర్యం..* అన్నాడు స్వామి. ఆమె ఆ మాటకు ఆమె సంతోషపడి, ఆయన వైపు తిరుగుతూ –

*అయ్యో స్వామీ... మాటల్లో పడి మీ భోజనం సంగతే మర్చిపోయాను... రండి తిందురుగానీ..* అంది.

*నీకు చెప్పనేలేదు కదూ పద్మా... నా భోజనం తిరుమలలోనే అయ్యింది... ఇంత రాత్రివేళ తింటే కష్టమనీ అక్కడే కానిచ్చాను..* అంటూ పొట్ట నెమురుకున్నాడు గోవిందుడు.

*అంతేలెండి... ఇక్కడ ఇంతింత నెయ్యిపోసి మీకిష్టమని చక్కరపొంగలి, పాయసాలు చేస్తే ఇవి మీకెందుకు నచ్చుతాయి... ఆ పైన మిషన్లు చేసిన లడ్లు తిని వస్తారు..*  అంది ఆమె కోపంగా. తిరుమలేశునికి తిరిగి సమాధానం చెప్పడనికి ఏ సాకు దొరకలేదు. ఇంతలోనే అలుమేలుమంగ దగ్గరగా వచ్చి –

*ఇదంతా ఎందుకు స్వామీ... మీరు సంపాదనలో పడ్డ తరువాత... క్షణం తీరిక దొరుకుతోందా... మనం ఏకాంతంగా అలా వ్యాహ్యాళికి వెళ్ళి ఎన్నిరోజులైంది? కనీసం కడుపారా సమయానికి భోజనం చేసి ఎన్ని రోజులైంది? చెప్పండి*  అంది కించిత్ బాధపడుతూ.

*నువ్వు చెప్పిన మాటా నిజమే మంగా... నాడు వకుళమ్మ ఇంటిలో పేదవాడిగా వున్నప్పుడు పొందిన సుఖం, సంతోషం, ఆనందం మళ్ళీ పొందలేదు.* అన్నాడాయన సాలోచనగా.

*మనం మళ్ళీ ఆ రోజులకి వెళ్ళిపోదామండీ...* అంది ఆమె ఆశగా.

*ఆ రోజు మీ నాన్న ఆకాశరాజు డబ్బులేని నన్ను కాదంటాడనే కదా ఈ ఝంజాటంలో పడ్డాను... ఇప్పుడు మనం వద్దనుకున్నా వదులుకోలేను... వదులుకున్న మరుక్షణం కుబేరుడు తగులుకుంటాడు..*

*హూ.. ఇంకా తీరలేదా ఆ అప్పు...* అంది ఆమె కోపంగా.

*నేనేమైనా సొంతానికి వాడుకున్నానా... మన పెళ్ళికి చేసినదే కదా..* నచ్చచెప్పబోయాడు వడ్డికాసులవాడు.

*ఎన్ని యుగాలనాటి పెళ్ళి... ఎన్ని లక్షలకోట్లమంది నిలువుదోపిడీలు... ఇంకా తీరలేదే... ఈ సుడిగుండం నుంచి బయటపడి మనం సుఖంగా వుండే రోజే లేదా... కలియుగ దైవమై కూడా ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేరా స్వామీ....*  అంది ఆమె.

*నువ్వే చెప్పావుగా కలియుగదైవాన్నని, ఈ కలియుగ ధర్మం పాటించక తప్పుతుందా... ఈ యుగంలో వుండేదంతా మానవులు... మానవుడే సర్వశక్తిమంతుడు... అందువల్ల ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టే బాధ్యతని కూడా మానవులకే వదిలేశాను.. ఆ కారణంగానే వారందరినీ ఇలాంటి చట్రంలోనే ఇరికించాను... రోజల్లా చాకిరీ చెయ్యాల్సిన కార్పొరేట్ వుద్యోగాలు ఇచ్చాను, ఎంత కట్టినా తీరని హోం లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ ఇచ్చాను... ఎక్కడైనా ఏ ఒక్కరైనా ఈ అప్పుల సుడిగుండాలని దాటి బయటపడతాడేమోనని ఆశగా చూస్తున్నాను... అంతా చేసిన అప్పుల కిస్తు కట్టడానికి చాకిరీలు చేస్తున్నారే తప్ప దాన్ని దాటి ఒక్కడైనా రావటంలేదు... అంతా మనలాగే ఇబ్బంది పడుతున్నారే తప్ప పరిష్కారం కనుక్కోలేక పోయారు...* అని ఆయన చెప్తుండగా కొండపై నుంచి మేలుకొలుపుగా పాడే సుప్రభాతం వినపడింది.

ఇక తప్పదన్నట్లు శ్రీనివాసుడు అలిపిరి వైపు అడుగులేశాడు. అలుమేలుమంగ నిరాశగా చూసింది.

(ఆదివారం ఆంధ్రజ్యోతి, 11 డిసెంబర్ 2011)

(ఈ వ్యాస రచయిత ఎవరో కానీ చాలా బాగా వచ్చిందీ వ్యాసము)

భారతీయులు ప్రపంచములోనే చాలా గొప్పవారు

 భారతీయ ధర్మమే చాలా గొప్పది,  భారతీయులు ప్రపంచములోనే చాలా గొప్పవారు. ఎలాగో మీరే చూడండి.*


1)సూర్యుడి నుంచి వెలువడుతున్న *ఓంకారమని*  నాసా ఎందుకు పేర్కొన్నట్టు? 🚩


2) మన దేశీయ *గోమూత్రం* మీద అమెరికా 4 పేటెంట్లను పొంది క్యాన్సర్ ను నివారించే మందును కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తోంది. ఎందుకు!?🚩


3) న్యూజెర్సీ *"సిటాన్ హాలు"* యూనివర్సిటీలో *భగవద్గీత* తప్పనిసరిగా చదవాలన్న నియమం ఎందుకుంది?🚩


4) ముస్లిం దేశమైన  ఇండోనేసియా తన దేశ విమానయాన సంస్థకు *"గరుడ ఇండోనేషియా ఎయిర్లైన్స్"* అని, జాతీయ ఎంబ్లెమ్ కు *"గరుడ పంచశిల"* అని విష్ణు వాహనమైన గరుత్మంతుని పేర్లేందుకు పెట్టుకుంది?🚩


5) ఇండోనేషియాలో అతిపెద్ద నోటైన ఇరవై వేల రూపయా మీద *వినాయకుడి బొమ్మ* ఉంటుందేం?🚩


6) అమెరికా మాజీ అధ్యక్షుడు *బారక్ ఒబామా* తన జేబులో ఎప్పుడూ *హనుమంతుడి* చిత్రపటాన్ని పెట్టుకొని ఉంటాడెందుకూ?🚩


7) యోగ, ప్రాణాయామాలకు* ఈరోజు ప్రపంచంలో అంత గుర్తింపెందుకుంది? 🚩


8)వేల సంవత్సరాల క్రితమే భారతీయ యోగులు *భూమి గుండ్రంగా* ఉందని చెప్పారేం? 🚩


9) *లుప్త', 'హంస'* అంటే సంస్కృతంలో కనుమరుగవుతున్న  హంస. విమానం ఆకాశంలో పైపైకి ప్రయాణిస్తున్నకొద్దీ కనుమరుగవుతూ ఉంటుంది. ఈ అర్థం వచ్చేలా జర్మనీ విమానయాన సంస్థకు *'లుఫ్తాన్సా'* అని పేరెందుకు పెట్టారు?🚩


10) ఆఫ్ఘసిస్తాన్ లోని పర్వతాలను *"హిందూకుష్"* పర్వతాలని ఎందుకంటారు?🚩


11) వియత్నాంలో నాలుగు వేల సంవత్సరాల నాటి *శ్రీమహావిష్ణు విగ్రహం* ఎలా కనిపించింది?🚩


12) అమెరికా శాస్త్రవేత్త *డా. హోవార్డ్ స్టెయిన్గెరిల్* పరిశోధన చేసి *గాయత్రీ మంత్రం క్షణానికి 10 వేల ధ్వని తరంగాలను వెలువరిస్తుందని తేల్చారు.* దీనివల్ల ఈ మంత్రం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మంత్రమని తెలిసింది. ఎందుకు?🚩


13) స్వామి దయానంద సరస్వతి రాసిన "సత్యార్థ ప్రకాశ్"* చదివి భాగపత్ (యూపీ)లోని బార్వాలా మసీదు ఇమాం 1983లో *"మహేంద్ర పాల్ ఆర్య"* పేరుతో హిందువుగా మారారెందుకు? అప్పటినుంచి వేలమంది ముస్లింలను హిందువులుగా మారుస్తూ.. డా. జకీర్ నాయక్ ను ఎన్నిసార్లు చర్చకు పిలిచినా ఆయన వచ్చే సాహసం చేయలేదేం?🚩


14) హిందువులు చేసే యజ్ఞం మూఢనమ్మకమే అయితే, యజ్ఞం చేస్తూండిన ఒక్క  *"కుష్వాహా"* కుటుంబమే భోపాల్ గ్యాస్ ప్రమాదం బారిన పడకుండా ఎలా తప్పించుకుంది? 🚩


15) ఆవు పేడతో చేసిన పిడకల మీద ఆవునెయ్యి వేసి కాలిస్తే ప్రతి 10 గ్రాములకి ఒక టన్ను ఆక్సిజన్ విడుదల అవుతుంది.* వాయువును శుద్ధి చేస్తుంది. మరి ఇదంతా ఏంటి?🚩


16) అమెరికా నటి, నిర్మాత *జూలియా రాబర్ట్స్* హిందూ ధర్మాన్ని స్వీకరించి రోజూ గుడికి వెళ్తుందెందుకు?🚩


17) రామాయణం మిథ్య అయితే, *ప్రపంచంలోని రాళ్ళలో* రామసేతువు నుంచి విడివడినవి మాత్రమే ఎందుకు *నీటిపై తేలుతున్నాయి?🚩*


18) మహాభారతం కల్పితమైతే, ఉత్తర భారతంలో *80 అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరం నేషనల్ జాగ్రఫిక్, భారత సైన్యం బృందానికి ఎలా కనిపించింది? 🚩*


19) *5000 సంవత్సరాల పురాతనమైనది,* మహాభారత కాలం నాటిది అయిన విమానం అమెరికా సైన్యానికి కాందహార్ (ఆఫ్ఘనిస్తాన్)లో ఎలా దొరికింది? 🚩


20) అలెగ్జాండర్ మనదేశం నుండి పిడికెడు మట్టి కూడా తీసుకెళ్లాడా?


అందుకే, ప్రియమైన భారతీయులారా ఆత్మ బంధువులారా... భారతీయునిగా పుట్టినందుకు గర్వించండి.


భారతీయునిగానే మరణించండి.


మన భారతదేశ గొప్పతనాన్ని మనకన్నా విదేశీయులు బాగా గుర్తిస్తున్నారు. 


మనదేశం యొక్క గొప్పతనాన్ని   పొగడకపోయినా కనీసం మనదేశాన్ని మనమే కించపరకాకుండా ఉంటే చాలు. మన తెలివితేటలు, మన శక్తియుక్తులు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన ముందు తరాలవారు తెలియచేశారు.


భారతీయులు ఎవరికీ తీసిపోరు, వారికి ఎవరూ సాటిరారు.


పొగడరా నీతల్లి భూమిభారతిని,నిలపరా నీజాతి నిండు గౌరవమును.


భారతీయునిగా పుట్టినందుకు గర్వించు.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


🙏🇮🇳🇮🇳జై భారత్ 🇮🇳🇮🇳

🙏జై హింద్

మనం విన్న పెద్దల మాటలు

 *బాల్యంలో మనం విన్న పెద్దల మాటలు*


నిన్న మధ్యాహ్నం భోజనం చేస్తుంటే పొలమారింది. నెత్తి మీద కొట్టుకుని మంచినీళ్లు తాగుతుంటే "ఎవరో తలుచుకుంటున్నట్లున్నారు. బహుశా పెద్ద మనవడేమో?" అంది మా ఆవిడ.


"అయుండొచ్చు"అన్నాను నేను కాస్త నిమ్మళించాక.


అన్నం తిని సోఫాలో కూచోగానే, చిన్నప్పటి మా ఇంటి భోజనాల సీను జ్ఞాపకం వచ్చింది. ఇప్పటిలా టేబుల్స్ లేవు గదా, ఇంట్లో ఉన్నవాళ్ళం అందరం బావి దగ్గిరకు వెళ్లి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాకే, నేల పీటల మీద బాసింపట్టు వేసుకుని కూచుని భోంచేసేవాళ్ళం. 


వంటకన్నీ ఇత్తడి గిన్నెలే ఉండేవి ఎక్కువగా. కంచాలు,గ్లాసులు మాత్రం స్టీలువి ఉండేవి. మంచినీళ్ళు తాగే చెంబులు కంచువి కూడా ఉండేవి. చాలా పాత్రల మీద ఎంతో గుండ్రంగా తెలుగు అక్షరాలతో పేర్లు చెక్కి ఉండేవి. బొగ్గు కుంపట్ల మీదే వంటంతా...


అమ్మ పక్కనే కూచుని వడ్డిస్తూ ఉండేది.

"ఇంకొంచెం కలుపుకో, నెయ్యి వేసుకున్నావా" అంటూ అందరినీ కనుక్కుంటూ వడ్డించేది.


ఒకవేళ భోంచేస్తున్నప్పుడు ఎవరికైనా పొలమారితే గానీ, పచ్చడి కారానికి వెక్కిళ్ళు వస్తేగాని, పక్కనే కూచున్న అమ్మ కొన్ని నీళ్లు తీసుకుని వారి నెత్తి మీద జల్లి


 "నీ పేరేంటి, ఏ ఊళ్ళో పుట్టావు చెప్పు?"

అని అడిగేది.


నేను అయితే అడ్డతీగల అని, మా అక్కయితే కాకినాడ అని చెప్పేవాళ్ళం. కాస్త స్థిమిత పడ్డాక నా పేరుకి, ఊరు పేరు కి, ఎక్కిళ్ళకి ఏమి సంబంధం అని ఆడిగితే, "ఏమో తెలీదు గానీ నీకు వెక్కిళ్ళు పోయాయా లేదా" అని తిరిగి ప్రశ్న వేసేది అమ్మ. నిజంగానే గమ్మత్తుగా వెక్కిళ్ళు ఆగిపోయేవి.


ఇలాగే ఇంకో కిటుకు ఉండేది అమ్మ దగ్గిర. "మీ ఫ్రెండ్ రాము గాడి సైకిల్ పోయిందిట గదా" అనో "పక్కింటి పిన్నిగారు ఇంట్లో బిందె ఎవరో ఎత్తుకుపోయారుట" అంటూ ఏవో వింత వార్తలు చెప్పేది.


"నిజమా??"అంటూ మన దృష్టి అటు వెళ్ళేది. ఈ లోపల వెక్కిళ్ళు, పొలమారడం తగ్గిపోయేవి ఆశ్చర్యంగా.


అమ్మ నవ్వేసి " ఊరికే...నీ దృష్టి మళ్ళిద్దామని"అనేది నవ్వుతూ


అలాగే అన్నం తినేటప్పుడు అస్సలు మాట్లాడవద్దు అనేవారు పెద్దలు. మాట్లాడుతూ తింటే అన్నం వంటికి పట్టదుట.


అన్నం తింటూ మధ్యలో కంచం దగ్గిరనుంచి లేవకూడదు అనేవారు.


కంచంలో ఏమీ వదిలేయకుండా తినాలి, వృధా చేయకూడదు, కంచంలో చేయి కడగకూడదు అని చిన్నప్పటినుంచే తెలుసుకున్న తరం మనది.


 మనతో కూచున్న అందరూ అన్నం తినడం అయ్యాకే లేచి చేయి కడుక్కునేవాళ్ళం.


అమ్మ మాత్రం అందరం తిన్నాక,

నాన్నగారు తిన్న పళ్ళెంలోనే తానూ

తినేది.


రాత్రిపూట ఉప్పు అని అడిగేవారు కాదు పెద్దవాళ్ళు. ఎందులోనైన ఉప్పు తగ్గినా, మజ్జిగ లోకి కావలసి వచ్చినా, "కాస్త చవి చూపించు" అనేవారు. కంచములో ఒక పక్కకి వేసేవారు గానీ చేతిలో వేసేవారు కాదు.


అలాగే రాత్రి పూట ఉసిరికాయ పచ్చడి నిషేధం. తినకూడదు అనేవారు.


వడియాలు పెట్టాలంటే ఆ బూడిద గుమ్మడికాయ మీద మగవాళ్ల చేతికి కత్తి ఇచ్చి ఒక చిన్న గాటు పెట్టించే తరవాత ఆ కాయని ముక్కలు చేసేది అమ్మ


చీకటి పడితే చెట్టు మీద చేయి వేయవద్దు అనేవారు. పూలు గానీ పళ్ళు గానీ , కరివేపాకు గానీ, సూర్యాస్తమయం ముందే కోయాలి అనేవారు. 


పసిపిల్లలు ఉయ్యాలలో లేనప్పుడు ఖాళీ ఉయ్యాల ని ఊపవద్దు అనేవారు. 


 ఆడపిల్లలు బియ్యం తింటుంటే నీ పెళ్లి సమయానికి పెద్ద వాన వస్తుంది అని భయపెట్టి ఆ అలవాటు మానిపించేవారు.


ఉరుములు,మెరుపులు, పిడుగులతో వర్షం వస్తుంటే ఉరిమినప్పుడల్లా "అర్జున, పల్గుణ, పార్థ, కిరీటి" అని అంటూ దండం పెట్టుకుని మమ్మల్నీ అలా చేయమనేది అమ్మ.


వినాయకచవితి నాడు సాయంత్రం చుట్టుపక్కల అందరి ఇళ్ళకి వెళ్లి ఆ ఇంటి వినాయకుడిని చూసి రమ్మనేవారు. ఎంతమంది వినాయకులకు మొక్కితే అంత బాగా చదువు వస్తుంది అనేవారు.


నాన్నగారూ ఏదైనా పని మీదో, లేక ఏదైనా ఊరి కో ప్రయాణమవుతుంటే శకునం చూసి మరీ

రోడ్ ఎక్కేవాళ్ళు.


 "పాలమ్మాయి వస్తోంది. మంచిది వెళ్ళిరండి"అని అమ్మ అనేది. ఎవరూ ఎదురు రాకపోతే అమ్మ గానీ, అక్క గానీ అటు వెళ్లి ఇటు ఇంట్లోకి శకునంగా రావడం కూడా జరిగేది మధ్యేమార్గంగా.


గడప మీద కూచోకూడదు అని చెప్పేవారు. ఏదైనా ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా గడప దాటి చేయమనేవారు.


ఆడపిల్లలు జుట్టు విరబోసుకుని ఉండకూడదు అనేవారు. 


దొడ్లో కాకి ఆగకుండా కావు కావుమంటుంటే చుట్టాలు వస్తారు అనుకునేవాళ్ళం. అలాగే ఎవరైనా చుట్టాలు అనుకోకుండా వస్తే "రండి రండి" అని సంతోషంగా ఆహ్వానిస్తూనే "పొద్దున్న కాకి అరచినప్పుడే అనుకున్నా ఎవరో ఇంటికి వస్తారని..." అనేవాళ్ళం.


ఒక కాకి చనిపోతే దాని చుట్టూ పది కాకుల గుంపు చేరి కావు కావుమంటూ వాటి సంఘీభావమో, సంతాపమో తెలియచేస్తే వాటి స్నేహాభావాన్ని మెచ్చుకున్నాము. ఆబ్దికాలలో కాకి పిండం తిన్న కాకులను మన పితృదేవతలలాగా భావించి శిరస్సు వంచి మరీ దండం పెట్టేవాళ్ళం.


ఇప్పటి తరానికి ఇవన్నీ చాదస్తాలు, పిచ్చి నమ్మకాలు లాగ అనిపించవచ్చు గానీ ఇవన్నీ వింటూ, చూస్తూ, ఆచరిస్తూ పెరిగిన తరం మనది. ఎందుకు అని ఎదురుతిరగలేదు,

ఇప్పటివారిలా వితండవాదం చేయలేదు, చాదస్తాలు అని కొట్టి పారేయ్యలేదు.

పెద్దల మాట చద్దిమూట అనుకుంటూ ఆచరించాము.హాయిగా ఆనందంగా పెరిగాము...


కాదంటారా???


అవునంటే మీరు విన్న మీ మీ పెద్దల మాటలు మరిన్ని ఇక్కడ పంచుకోండి.


🙏🙏🙏🙏🙏

National Mathematics Day

 ✖➕➖➗

Today is National Mathematics Day 

( I.e. Birth Day of Srinivasa Ramanujam )

See This Absolutely Amazing Mathematics Given By Great Mathematician *रामानुजम*

1 x 8 + 1 = 9

12 x 8 + 2 = 98

123 x 8 + 3 = 987

1234 x 8 + 4 = 9876

12345 x 8 + 5 = 98765

123456 x 8 + 6 = 987654

1234567 x 8 + 7 = 9876543

12345678 x 8 + 8 = 98765432

123456789 x 8 + 9 = 987654321

1 x 9 + 2 = 11

12 x 9 + 3 = 111

123 x 9 + 4 = 1111

1234 x 9 + 5 = 11111

12345 x 9 + 6 = 111111

123456 x 9 + 7 = 1111111

1234567 x 9 + 8 = 11111111

12345678 x 9 + 9 = 111111111

123456789 x 9 +10= 1111111111

9 x 9 + 7 = 88

98 x 9 + 6 = 888

987 x 9 + 5 = 8888

9876 x 9 + 4 = 88888

98765 x 9 + 3 = 888888

987654 x 9 + 2 = 8888888

9876543 x 9 + 1 = 88888888

98765432 x 9 + 0 = 888888888

And Look At This Symmetry :

1 x 1 = 1

11 x 11 = 121

111 x 111 = 12321

1111 x 1111 = 1234321

11111 x 11111 = 123454321

111111 x 111111 = 12345654321

1111111 x 1111111 = 1234567654321

11111111 x 11111111 = 123456787654321

111111111 x 111111111 = 12345678987654321


Please Share This Wonderful Number Game With Your Friends, Colleagues & Children.🙏👏

ఆదివారం_పవిత్రదినం

 #ఆదివారం_పవిత్రదినం!!


🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


*ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని శ్లోకాలు...!!


అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే | 

సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||

 

స్త్రీ తైల మధుమాంసాని 

యే త్యజంతి రవేర్దినే |

న వ్యాధి శోక దారిద్ర్యం , 

సూర్యలోకం స గచ్చతి ||


తాత్పర్యం: 


మాంసం తినడం..! మద్యం తాగడం..!

స్త్రీతో సాంగత్యం..! క్షవరం చేసుకోవటం..!

తలకు నూనె పెట్టుకోవడం..!


ఇలాంటివి ఆదివారం నాడు  నిషేధించారు!!

కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..!! ఈ కర్మలు చేసినవాడు  జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు... !! దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు.. ఆనారోగ్యం కూడా..!!


ఇలాంటి పవిత్రమైన రోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..!!


మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!


 ఎందుకంటే.. అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు.. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!


అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!


ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!


ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు.. అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! చేస్తున్నాము..!!


మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ...ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి...!!


అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు (Thomas Babington Macaulay, ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు.. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు..!! ఆదివారం నాడు చర్చిలు కలకలలాడతాయి.! మన హిందూ దేవాలయాలు వెలవెల బోతాయి.!!


పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!


మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. మధ్యాన్ని తాగేవారు కాదు..!!


కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది!!


ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.! ఇప్పటికైనా కళ్ళు తెరవండి.! విదేశీ సంస్కృతిని విడనాడండి.! #స్వదేశీ_సాంప్రదాయాలను పాటించండి..!!


యోగ చేయండి.! ప్రాణాయామం చేయండి.! #సూర్య_నమస్కారాలు చేయండి.! #సూర్యోపాసన చేయండి.!! ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి..!!


ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!! కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!


ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు

ఆదివారం సెలవు ఉండటం అనేది అతి పెద్ద కారణం కావచ్చు అనుకుంటా.


ఈ విషయం పై బాగా చర్చ జరగాలి 


మార్పు రావాలి


 స్వస్తి..!!


#హిందూ_ధర్మం_వర్థిల్లాలి..!!  #జయహో_భారత్..!!


🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

శ్రీ వారాహి నవరాత్రులు

 _*నేటి నుండి శ్రీ వారాహి నవరాత్రులు ప్రారంభం*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*ఆషాఢమాసం - శ్రీ వారాహి నవరాత్రి* 



*ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు.* 


*అమ్మవారి వైభవం*


మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ , గజ , తురగ , సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి.  అందుకే ఆవిడను దండనాథ అన్నారు.


లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వారాహీ దేవి.  లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు.  ఆమెకు ప్రత్యేక రథం ఉంది  దానిపేరు కిరి చక్రం.  ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి , రథసారథి పేరు స్థంభిని దేవి.  ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ , మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు. 


*కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |*

*జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||*


*భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |*

*నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||*


*భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |*

*మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||*

*విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |*


అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ , అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు.  విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది.  ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు.


వారాహీ అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు , శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి , వాడిని సంహరించి , భూదేవిని రక్షిస్తాడు.  స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని , అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది , లేదా పరిష్కరిస్తుంది. 


అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో , అష్ట భుజాలతో , శంఖ , చక్ర , హల(నాగలి), ముసల(రోకలి), పాశ , అంకుశ , వరద , అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది.   ఇది మహావారాహి (బృహద్వారాహి) యొక్క స్వరూపం.  ఇంకా లఘువారాహి , స్వప్నవారాహి , ధూమ్రవారాహి , కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.


అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే , ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే , రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.  అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి , సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత. 


పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే , ఉగ్రం వారాహి.   శ్రీ విద్యా గద్యంలో *"అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే"*  అని లలితను కీర్తిస్తారు.   దేవీ కవచంలో *"ఆయూ రక్షతు వారాహి"* అన్నట్టు.   ఈ తల్లి ప్రాణ సంరక్షిణి.   ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం


ప్రకృతి పరంగా చూసినట్లైతే   ఈ సమయంలో వర్షం కురుస్తుంది    రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు.  దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది.



వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు.  కానీ వారాహీ చాలా శాంతస్వరూపిణి.  వెంటనే అనుగ్రహిస్తుంది , కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది , అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం , క్రోధం , లోభం , మోహం , మదం , మాత్సర్యం , అహంకారం , అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు , అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.


*1. ఓం శ్రీం హ్రీం క్లీం వరాహై మమ వాక్మే ప్రవేశయా వాకు పాలితాయ ||*

*మమ మాతా వరాహి మమ దారిద్ర్యం నాశాయ నాశాయ హుం భట ||*


*2. ఓం శత్రు శంకరి సంకటహరణీ మమ మాత్రే హ్రీం దుం వం సర్వారిష్టం నివారాయ నివారాయ హుం భట్ ||*


*3. ఓం క్లీం వారాహి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షాయా వర్షాయా స్వాహా ||*


*4. ఓం శ్రీం పంచమి సర్వసిద్ధి మాతా మమ గృహామి ధనం ధన్యాం సమృద్ధిం దేహి దేహి నమః ||*



*5. ఓం హ్రీం భయానకరీ అతి భయంకరి ఆశ్చర్యా భయంకరీ సర్వ జన భయంకరీ ||*

*సర్వ భూత ప్రేత పిశాచ భయంకరీ సర్వ భయం నివారాయ శాంతిర్ పావతు మే సదా ||*

*సర్వ భూత ప్రేత పిశాచ భయంకరీ సర్వ భయం నివారాయ శాంతిర్ పాదుమే సదా ||*


అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి  బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ముఖ్య ప్రాణ రక్షిణి.


*హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామములు*



☘  పంచమి                   

☘  దండనాథా                                                     

☘  సంకేతా

☘  సమయేశ్వరి

☘  సమయ సంకేతా

☘  వారాహి

☘  పోత్రిణి

☘  వార్తాళి

☘  శివా

☘  ఆజ్ఞా చక్రేశ్వరి

☘  అరిఘ్ని



*దేశం సుభిక్షంగా ఉండాలని...మనమంతా చల్లగా ఉండాలని...ధర్మం వైపు మనం నడవాలని...అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం*


*ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా* 

*ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ*


*సర్వం శ్రీవారాహి(దండిని) చారణారవిందార్పణమస్తు ||*

వచ్చే 72 గంటలు భారతదేశానికి భారీగా ఉంటుంది *

 * వచ్చే 72 గంటలు భారతదేశానికి భారీగా ఉంటుంది *

 * WHO ICMR భారతదేశాన్ని హెచ్చరించింది *


 భారతీయులు మెరుగుపడకపోతే భారతదేశం "థర్డ్ స్టెప్" అంటే "కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్" లోకి ప్రవేశిస్తుందని WHO ICMR తెలిపింది.

 భారతదేశం మూడవ దశకు లేదా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కు వెళితే, భారతదేశంలో ప్రతిరోజూ * 50000 (యాభై వేల) మరణాలు సంభవించవచ్చు, ఎందుకంటే భారతదేశ జనాభా సాంద్రత ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ?


  పౌరులందరూ దయచేసి ఏదైనా చేయమని అభ్యర్థించారు * 72 నుండి 108 గంటలు అస్సలు బయటకు రావద్దు * ఎందుకంటే రేపు భారతదేశం 3 వ దశకు వెళ్ళవచ్చు, దయచేసి ప్రతి ఒక్కరూ లోపల ఉండటానికి ప్రేరేపించండి.


 * సముచితంగా భావిస్తే, దీన్ని భారతదేశం అంతటా విస్తరించే విధంగా భాగస్వామ్యం చేయండి *


 * నగరాల్లోని ఆసుపత్రుల్లో చోటు లేదు, రెకమండేషన్స్, హోదా,గుర్తింపు,డబ్బు అస్సలు పనిచేయడం లేదు!  ఏకైక పరిష్కారం మిమ్మల్ని మీరు మాత్రమే రక్షించుకోవడం. *

 * కుటుంబ సభ్యులందరూ దయచేసి గమనించండి: *

 * 01 కడుపులను ఖాళీగా ఉంచకండి *

 * 02 ఉపవాసం చేయవద్దు *

 * 03 రోజూ ఒక గంట సూర్యరశ్మిని ఆస్వాదించండి.

 * 04 ఎసి ఉపయోగించవద్దు *

 * 05 వెచ్చని నీరు త్రాగండి, గొంతు తడిగా ఉంచండి *

 * 06 ముక్కుకు  ఆవ నూనె రాయండి *

 * 07 ఇంట్లో హారతి కర్పూరం కాల్చండి *

 * 08 ప్రతి కూరగాయకు అర టీస్పూన్ పొడి అల్లం జోడించండి *

 * 09 దాల్చినచెక్క వాడండి *

 * 10 రాత్రి కప్పు పాలతో ఒక స్పూన్ పసుపు త్రాగాలి 

 * 11 వీలైతే ఒక చెంచా చ్యవన్ ప్రాష తినండి.

 * 12 ఇంటిలో కర్పూరం మరియు లవంగాలతో పొగ వేయండి. 

 * 13 ఉదయం టీలో లవంగం వేసి మరిగించి తాగండి 

 * 14 పండ్లలో ఎక్కువ నారింజ మాత్రమే తినండి 

 * మీరు కరోనాను ఓడించాలనుకుంటే, దయచేసి ఇవన్నీ చేయండి. *

 * పాలలో పసుపు మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

హాయ్ ఫ్రెండ్స్..! 

 * Possible అయితే ఈ పోస్ట్‌ను వీలైనంత వరకు భాగస్వామ్యం చేయాలని నేను ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను *


 ధన్యవాదాలు

గుండెపొటు గురించి సంపూర్ణ వివరణ

 గుండెపొటు గురించి సంపూర్ణ వివరణ  -  


    ఉపిరితిత్తులలో శుభ్రమైన రక్తమును అన్ని భాగాలకు సరఫరా చెసి చెడురక్తమును మరలా ఊపిరితిత్తులకు పంపించు సాధనం గుండె . ఇది ఒక పంపుసెట్ వలే పనిచేయును . శుభ్రపడిన రక్తమును తీసుకువెళ్ళునవి ధమనులు , చెడురక్తమును తీసుకెళ్ళునవి సిరలు అంటారు. నూనె , చక్కెర, తియ్యటివి , డాల్డా , నెయ్యి , మాంసం , చేపలు , గుడ్లు మొదలైన వాటిని అత్యధిక మోతాదులో విపరీతముగా వాడుట వలన ధమనులలో కొవ్వు ఏర్పడును . దీనిని కొలెస్టరాల్ అని పిలుస్తారు . 


                   ఈ కొలెస్టరాల్ పెద్ద రక్తనాళాల్లో పేరుకుని పొవడం వలన రక్తనాళం లోపలి వ్యాసార్థం తగ్గి గుండె పనిచేయుటకు కావలసినంత రక్తం సరఫరా కాదు . రక్తము నందలి ఉండు ఆక్సిజన్ గుండెకు అందకపోవడం వలన రక్తం గ్రహించుటకు గుండె అధికశ్రమ చేయవలసి ఉంటుంది. దీనివలన ఎడమవైపు రొమ్ములో నొప్పి కలుగును. దీనిని గుండెపొటు అంటారు. ఈ నొప్పి ఒక్కోసారి భరింప శక్యం కానంతగా ఉండును. ఇది ఎడమవైపు రొమ్ము నుండి ఎడమ భుజానికి అచట నుండి ఎడమ చేతి మణికట్టుకు కూడా పాకుతుంది. ఈ నొప్పితో ఊపిరి ఆడదు . చేతులు , కాళ్లు చల్లగా ఉండును. అధికంగా చెమటలు పట్టును . 


                  ఇది అత్యంత ప్రమాదకరం అయినది. ఇది ప్రాణాలు తీయుటలో మనదేశంలో మూడొవ స్థానము నందు కలదు. శారీరక శ్రమ ఎక్కువ చేయు వారిలో ఇది ఎక్కువ కనిపించును. 


  ఈ వ్యాధి నివారణోపాయాలు  - 


 *  నూనె , నెయ్యి , డాల్డాతో  తయారుచేసిన తీపి పదార్దాలు , చాకోలెట్స్ , అతి కారపు పదార్దాలు , మాంసం , చక్కెరలు వాడకూడదు . 


 *  తాజా ఆకుకూరలు , కూరగాయలు , ముఖ్యముగా ఎర్ర ఉల్లిగడ్డ , వెల్లుల్లి , సోయాబీన్స్ మొదలైన వాటిని విరివిగా వాడవలెను . 


 *  వెల్లుల్లి శ్వాసకోశ వ్యాధుల నివారణలో ఎంతో ప్రాముఖ్యత వహించును. TB వ్యాధి నివరణలో కూడా వాడతారు. రక్తమును శుభ్రపరచడంలో అత్యంత గుణకారిగా పనిచేయును . రక్తనాళాలను శుభ్రపరచును. రక్తమును పలుచబరిచి రక్తనాళాలలో సులభముగా ప్రసరించుటకు తోడ్పాటు అందించును. 


 *  ప్రతినిత్యం 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు తేనె లేదా బెల్లములో వేసి నలిపి తింటుంటే శ్వాసకోశ , హృదయ వ్యాధులు నివారణ అగును. 


 *  పీచుపదార్థం పుష్కలంగా కలిగిన ఆహారపదార్దాలు , అతిగా పాలిష్ పట్టని బియ్యం , పైన పొట్టు తియ్యని ఆపిల్ , కమలాలు , బత్తాయి కొనల పైన ఉండు తెల్లని పొరతో సహా తినవలెను . 


 *  ఎర్ర ఉల్లిగడ్డ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చును. సోయాచిక్కుడు , విటమిన్ E , క్యాల్షియం , మెగ్నీషియంలు గుండెపొటు రాకుండా కాపాడును . 


            మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలు..


*సమాధి..సాక్ష్యం..*


దళిత కుటుంబానికి చెందిన చిన్నయ్య సాధారణ రైతు..తనకున్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు..నిజానికి అతని ఆదాయం అంతంత మాత్రమే.. ఉన్నంతలోనే గుట్టుగా సంసారాన్ని పోషించుకుంటున్నాడు..అతనికి, ఆతని కుటుంబానికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మీద అచంచల భక్తి విశ్వాసాలున్నాయి..తమకు ఏ కష్టం కలిగినా..నేరుగా శ్రీ స్వామివారి సమాధిని దర్శించి మొక్కుకునేవారు..


ఒక సంవత్సరం తన పొలంలో పొగాకు పంట వేసాడు..అదృష్టం బాగుండి..నాణ్యమైన పొగాకు చేతికొచ్చింది..ఇప్పుడు చిన్నయ్యకు ఒక చిక్కు వచ్చింది..పొగాకు అమ్ముకోవాలంటే..అతని పేరుతో బారెన్ రిజిస్టర్ అయి ఉండాలి..అదీకాక, అమ్మకం తాలూకు డబ్బులు కూడా నేరుగా బారెన్ ఉన్న వ్యక్తి యొక్క  బాంక్ ఖాతాకు కు జమ అవుతాయి...అందువల్ల తనను తెలిసిన ఒక అగ్రకుల మోతుబరి రైతు సహాయాన్ని అర్ధించాడు..తాను పండించిన పొగాకును ఆ రైతు పేరుతో అమ్మకం చేసిపెట్టి, తన పొగాకు అమ్మకం తాలూకు డబ్బులు బాంక్ లో జమ అయిన తరువాత..తనకు ఇవ్వమని అడిగాడు..ఆ రైతూ ఇందుకు ఒప్పుకున్నాడు..


అనుకున్న ప్రకారమే అమ్మకం జరిగింది..డబ్బులూ బాంక్ లో జమ అయ్యాయి..చిన్నయ్యకు సహాయం చేస్తానన్న మోతుబరికి దుర్బుద్ధి మొదలయింది..బాంక్ లో తన అకౌంట్ కు జమ అయిన చిన్నయ్య తాలూకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొడితే..ఆ డబ్బు తనకు మిగులుతుంది కదా..పైగా ఆ అమ్మిన పొగాకు చిన్నయ్య దే అనే ఋజువు ఎక్కడా లేదు..తన పేరుతోనే అమ్మకం చేసాడు..తన అకౌంట్ కే డబ్బూ జమ అయింది..చిన్నయ్యకు తనతో వైరం పెట్టుకునే స్తోమత లేదు..పైగా చిన్నయ్య దగ్గర ఆధారాలూ లేవు..ఇకనేం!..డబ్బు ఇవ్వకుండా ఎగ్గొడితే సరి!..ఇదే ఆలోచన చేసి..ఆ రైతు నిశ్చింతగా కూర్చున్నాడు..


ఓ వారం తరువాత చిన్నయ్య తనకు రావాల్సిన ధనం గురించి రైతు ను అడిగాడు.."నీకు నేను డబ్బు ఇవ్వడమేమిట్రా?..పిచ్చి పిచ్చిగా మాట్లాడకు!.." అని గట్టిగా కేకలు వేసి..చిన్నయ్యను తరిమేశాడు.. చిన్నయ్యకు ఏమీ పాలుపోలేదు..ఊళ్ళో పెద్ద మనుషుల వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు..ఎవ్వరూ కూడా సహాయం చేయలేమన్నారు..


దిక్కుతోచని చిన్నయ్య.."అయ్యా..మీరందరూ పెద్దవారు..నా పొగాకు అమ్మకం తాలూకు డబ్బు , ఫలానా పెద్దమనిషి వద్ద ఉన్నాయి..ఇందుకు ఋజువు నేను చూపలేను..కానీ ఒక్కసారి, ఆ దత్తాత్రేయ స్వామి సమాధి వద్దకు ఆయన వచ్చి..నాకు డబ్బులు ఇవ్వక్ఖరలేదు అని ప్రమాణం చేయమనండి.. అలా ప్రమాణం చేస్తే..నేనూ ప్రమాణం చేస్తాను..ఆ స్వామే నిర్ణయిస్తాడు..ఈ ఒక్క సహాయం చేయండి.." అన్నాడు..పెద్దమనుషులకు ఈ మాట నచ్చింది..రైతు కు చెప్పి పంపారు..


"ఆ స్వామి వద్దే ప్రమాణం చేస్తాను..ఆయనేమన్నా సమాధి లోంచి లేచి వచ్చి సాక్ష్యం చెపుతాడా?.." అనుకున్న ఆ పెద్దమనిషి.. తాను ఈ పద్దతికి ఒప్పుకుంటున్నట్లు చెప్పి పంపాడు..


ఆరోజు సాయంత్రమే చిన్నయ్య, ఆ రైతు ఇద్దరూ..మొగలిచెర్ల ఫకీరు మాన్యం లో గల శ్రీ స్వామివారి సమాధి మందిరం వద్దకు వచ్చారు..ఊళ్లోని పెద్దలూ వచ్చారు..ముందుగా చిన్నయ్య శ్రీ స్వామివారి సమాధి కి నమస్కారం చేసి..బావి వద్దకు వెళ్లి ఆ నీళ్లను తలమీద పోసుకొని..తడి బట్టలతో మందిరం లోకి వచ్చి, హారతి పళ్లెం వద్ద చేతులు జోడించి.."ఆ స్వామి మీద ప్రమాణం చేస్తున్నా.." అంటూ..తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పాడు..


ఇక రైతు వంతు వచ్చింది..అప్పటిదాకా ఎంతో గంభీరంగా వున్న ఆయన ముఖం లో మార్పు రాసాగింది..వళ్ళంతా వణుకు పుట్టింది..ఒక్క సారిగా నిస్సత్తువ ఆవరించింది.."సమాధి లోంచి స్వామి లేచి వచ్చి సాక్ష్యం చెపుతాడా?" అని తాననుకున్న మాటలకు సమాధానంగా ఆ స్వామి తన లోపలినుంచి తన చేతే నిజం చెప్పమని ఒత్తిడి చేస్తున్న భావన కలుగసాగింది..ఇక ఆగలేకపోయాడు..తాను ప్రమాణం చేయలేనని..చిన్నయ్యకు అణా పైసలు తో సహా డబ్బు చెల్లిస్తానని చెప్పాడు..అంతే కాదు..అప్పటికప్పుడే తన మనిషిని ఊళ్ళోకి పంపి, డబ్బు తెప్పించి చిన్నయ్యకు ఇచ్చేసాడు..అతని లో వచ్చిన మార్పు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది..


చిన్నయ్య ఒక్కటే చెప్పాడు.."నమ్మిన వాళ్ళను స్వామి కాపాడతాడు!.." 


అప్పటి నుంచీ..స్వామి వద్ద ప్రమాణం చేయడమంటే..న్యాయం నిలబడుతుంది అని అందరికీ తెలిసివచ్చింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699.)

పునరపి జననం పునరపి మరణం

 పునరపి జననం పునరపి మరణం :-

కర్మ ఫలం ను మూడు విధాలుగా చెబుతారు. అనేక జన్మ ల నుండి పెరిగిన కర్మ జాలమును సంచిత కర్మము నుండి ఈ జన్మము నందు అనుభవించ వలసిన కర్మ ను ప్రారబ్ధం అని, ఈ జన్మ మందు చేయబడి ముందు జన్మముల యందు అనుభవించ వలసిన కర్మ ను ఆగామి అని చెబుతారు

           చేసిన ఏ పని వ్రధాపోదు. ప్రతి పనికి మంచో, చెడో ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మానవుడు అనుభవించక తప్పదు. కొన్ని ఫలితాలను అప్పటి కప్పుడే అనుభవిస్తాడు. కొన్ని కర్మల ఫలితాలు ఈ జన్మ లో అనుభవించ లేక పోవచ్చును. మనిషి మరణించినా కర్మ ఫలం నశించదు. అది జీవాత్మను వాసనా రూపంలో అంటిపెట్టుకుని కొనసాగుతూనే ఉంటుంది.

      అందుచేత అనేక జన్మలలో అనుభవానికి రాకుండా మిగిలిపోయిన సంచిత కర్మఫలం విధిగా జీవుడిని, మరొక జన్మ ఎత్తేటట్టు చేస్తుంది. ఈ జన్మ మొదలు అయిన దగ్గర నుండి శరీరాన్ని విడిచి పెట్టేవరకూ అనుభవించిన కర్మను ప్రారబ్ధం అంటారు. ఈ ప్రారబ్ద కర్మను ఎవ్వరూ తప్పించలేరు. ఈ జన్మలో జీవుడు కొన్ని కర్మలు చేస్తాడు. ఆ కర్మఫలాలో కొన్ని అనుభవించాక ఇంకా కొన్ని మిగిలిపోయి పెద్ద పెద్ద గుట్టలు గా పెరిగిపోతాయి. వాటిని అనుభవించడానికి మరొక జన్మ ఎత్తవలసి ఉంటుంది. పాత కర్మల అనుభవాలు తరిగిపోతూంటే, కొత్తవి పెరిగిపోతూంటాయి. అదొక నిరంతర చక్రం దానికి ఆది, అంతం లేదు. అందుకే మానవుడు జనన, మరణ పరంపర అనే చక్రం లో పడి తిరుగుతూ ఉంటాడు. అదే కర్మ సిద్ధాంతం. కర్మ ఫలం అనుల్లంఘనీయం. సత్కర్మలు వల్ల ఉత్తమ గతులు, దుష్కర్మ వల్ల అధమ గతులు ప్రాప్తిస్తాయి. ఏ కర్మ అయినా పునహ్ పునర్జన్మల కు కారణం అవుతుంది. సేకరణ

అవధూత శ్రీ రంగన్న బాబు

 🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹

*శ్రీపాద రాజం శరణం ప్రపద్యే*

_"శ్రీరామ జయ రామ జయజయ రామ"_

*అవధూత శ్రీ రంగన్న బాబు గారి లీలా సంపుటి* 


_*💉ఆపరేషన్ కు ✂️ఆటంకం తొలగించిన అవధూత 💊*_

నోరి వెంకటేశ్వర్లు గారి  చివరి కుమారుడు 🙎🏻‍♂️బహుశః రఘు అని జ్ఞాపకము. అతనికి ఏదో చిన్న శస్త్ర✂️ చికిత్స (చిన్న వయసులో) అవసరమై హాస్పిటల్లో 🏥 చేర్చారు. ఆ విషయం బాబు గారికి తెలుసు. అయితే ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు పిల్లవానికి రక్తం 🩸 తక్కువగా ఉన్నదని, వృద్ధి అయిన తర్వాత శస్త్రచికిత్స చేయవలెనని, అందుకై ప్రత్యేక చికిత్స చేస్తున్నారు. శస్త్ర చికిత్స చేయుటకు ఆలస్యం ఎందుకు జరుగుతున్నదో బాబు గారు తెలుసుకొని, _*వెంటనే ఆసుపత్రికి వెళ్లి పిల్లవాని పై హస్త చాలనము చేసిరి.*_ తర్వాత డాక్టర్🩺 గారు చూచి,  కావలసినంత రక్తము 🩸ఉన్నదని గ్రహించి మరుసటి రోజున ఆపరేషన్✂️ చేయుటకు సంసిద్ధులైరి. _డాక్టర్ గారు  పిల్లవాని రక్తములో కలిగిన అభివృద్ధికి కారణం తెలిసి 🤔 ఆశ్చర్యచకితులైనారట._

🙏 *అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త*🙏

_*"జయ జయ సాయిరాం"*_

🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹

భగవద్గీత ఏం చెబుతుంది

 అసలు భగవద్గీత ఏం చెబుతుంది?

ధర్మాధర్మాల గురించి చెబుతుంది.

కర్తవ్యం గురించి చెబుతుంది.

నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.

ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.

సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.

ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.

పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.

ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.

స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.🙏

జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.

ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.🙏

ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.

మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.

పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.💐

ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.

కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.

నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. 

గీత చదువుకో

రాత మార్చుకో...ధన్యవాదములు జై శ్రీ కృష్ణ 🙏💐💐💐

ప్రపంచంలోనే ఏకైక ఆలయం

 ఇది ప్రపంచంలోనే ఏకైక ఆలయం


ఒక వెయ్యి 1 (1001) శ్రీయంత్ర ప్రతిష్ఠితమైన శ్రీచక్రములతో పరివేష్టితమై వున్న అద్భుతమైన మహా శ్రీచక్ర మహామేరు ఆలయం.


ఈ దేవాలయంలో సహస్రాక్ష అమ్మవారు కొలువై ఉన్నారు.


ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం 

ఈ దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని కుంచాల కూర్మయ్యపేటలో ఈ దేవాలయం ఉంది.  


అక్కడే శ్రీ చక్ర ఆకారంలో 108 అడుగుల పొడవు 108 అడుగుల వెడల్పు 54 అడుగుల ఎత్తుతో ఈ ఆలయాన్ని నిర్మించారు.


అమ్మవారికి  1001 శ్రీ చక్రాలకు మరియు   శ్రీచక్ర మహామేరువుకు మహా హారతి సమర్పణ దర్శించండి

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸