1, మే 2021, శనివారం

తెలుసా

 🙏


💐ని బలం ఎంతో తెలుసా💪


తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది. చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది. కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు ఆ తామర రేకలను ముడుచుకుంటాయి. అయ్యో నన్ను ఏదో  

బంధించేసింది అని చెప్పేసి ఆ తామర

రేకల్లోనే ఇరుక్కుని చనిపోతుంది

అయితే మహా మహా వృక్షాలకు రంద్రం చేయగలిగిన దాని సామర్థ్యం ఆ తామర రేెకులను తొలచలేదా? ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా? గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవడమో, మకరందం గ్రోలే మత్తులోనో... లేక నన్నేదో బంధించింది అన్న భావననో దాని శక్తిని బలహీన పర్చింది. ఆ భావనను నమ్మడమే దాని బలహీనత. నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న దాన్ని నమ్మింది... అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది.


మన జీవితంలో వచ్చే సమస్యలూ అంతే,

సమస్య బలమైంది కాదు.. మనశక్తిని మనం మర్చిపోవడమే దాని బలం అదే బలహీనత. మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే, గుర్తించడమే, నమ్మడమే దాని బలం.


"కరోనా మహమ్మారి" అనేది కూడా నీ శక్తి

కంటే బలమైంది కాదు...

దాని బలం తామర రేకు అంత...

నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంత...

తెలుసుకో అదే..జీవిత సత్యం..


        *ధైర్యం గా ఉండండి*

        *కరోనాని జయించండి*

                        💐

యధార్ధ సంఘటన

 యధార్ధ సంఘటన 


అది 1970 వ సంవత్సరం. తిరువనంతపురం ( నేటి త్రివేడ్రం) సముద్రపు ఒడ్డున ఒక పెద్దమనిషి భగవద్గీత పఠనములో ఉన్నాడు. అక్కడికి ఒక నాస్తికుడైన ఒక కుర్రవాడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు. 


ఆ కుర్రాడు ఈ పెద్దమనిషినితో  " ఈకాలంలో కూడా  ఇలాంటి పుస్తకాలు చదవడం వలన , మీరంతా  మూర్ఖులుగా మిగులుతున్నారు.  మాకు సిగ్గుగా ఉన్నది" అని రెచ్చగొడుతూ మాట్లాడము మొదలుపెట్టాడు.  


  పైగా " మీరే కనుక ఇలాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు పుస్తకాలు చదువుతూంటే, మనదేశం ఈపాటికి చాలా అభివృద్ధి సాధించి ఉండేది " అని ఆవేశంతో అన్నాడు. 


ఆ పెద్దమనిషి ఆ కుర్రవాని పరిచయం అడిగాడు.  అప్పుడా కుర్రవాడు " నేనొక కలకత్తానుండి వచ్చిన  సైన్స్ పట్టభద్రుడిని. ఇక్కడ భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్లో పనిచేయటానికి వచ్చాను " అని గర్వంగా చెప్పాడు. 


  " మీరు వెళ్ళి ఈ భగవద్గీత లాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు మీద పుస్తకాలు చదవమని, ఇలాంటి పుస్తకాలు చదవడం వలన జీవితంలో సాధించేది ఏదీ ఉండదని "  ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. 


ఆ పెద్దమనిషి నవ్వి, అక్కడనుండి వెళ్ళడానికి ఉపక్రమించాడు. ఆయన అలా లేవగానే నలుగురు రక్షక దళ భటులు ఆయనను చుట్టుముట్టి, ఆయనకు రక్షణగా నిలబడ్డారు. ఆయన కోసం ఒక అధికార  ఎర్రబుగ్గ కారు వచ్చింది. ఇదంతా చూసి, ఆ కుర్రవాడు భయపడి, ఆ పెద్దమనిషిని " మీరెవరూ " అనడిగాడు. ఆ పెద్దమనిషి తనపేరు " విక్రం సారాభాయి" చెప్పాడు. అంటే, అప్పటికి ఆ కుర్రవానికి తను  పనిచేయబోయే సంస్థకు ఆయన చైర్మన్ అని అర్ధం అయ్యింది. 


 ఆ సమయానికి భారతదేశంలో 13 రీసెర్చ్ సంస్థలు, విక్రం సారాభాయి పేరుమీద నడుస్తున్నాయి. అణువిజ్జాన  పధకాలు రచించే సంస్థకు ఆయన అధిపతి. ఆయనను ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా దానికి నియమించింది. 


   అప్పుడు ఆ కుర్రవాడు వలవలా ఏడుస్తూ, ఆయన కాళ్ళమీద పడ్డాడు. అప్పుడు కీ.శే. విక్రం సారాభాయి చెప్పిన గొప్ప విషయం ఇది. 


    " ఈ విశ్వంలో ప్రతి వస్తువు పరమాత్మచే సృష్టించబడినదే. అది పురాణకాలం కావచ్చును.  మహాభారత సమయం కావచ్చు. ప్రస్తుత సమయం కావచ్చును. మిత్రమా !! దైవాన్ని ఎప్పుడూ మరువకు. "  అని బోధించాడు.   


ఇప్పటి నాస్తికులు  ప్రతిదీ హేతువాదం ,   అంటూ డాంబికముగా కరాళ  నృత్యాలు చేయవచ్చును. కానీ  సైన్సును అభివృద్ది చేసినది మటుకు ఆస్తికులే అని చరిత్ర చెపుతోంది.  దైవం నిత్య సత్యం. భగవద్గీత ఒక అమోఘమైన విజ్జాన శాస్త్రము. దానిని ఎవరూ తప్పుబట్టలేరు. దానిలో చెప్పినది ఆచరించి ప్రపంచంలో ఎందరో లాభము పొందుతున్నారు. ప్రపంచములో ఉన్న సమస్యల కన్నిటికీ భగవద్గీతలో పరిష్కారాలున్నాయి. 


శ్రీమత్భగవద్గీత  సకలశాస్త్ర సారం ! 


శ్రీ కృష్ణం వందే జగద్గురుం !!

చర్మవ్యాధుల గురించి

 చర్మవ్యాధుల గురించి సంపూర్ణ వివరణ  - 


 చర్మవ్యాధులు రావడానికి గల కారణాలు  - 


  *  విరుద్ధములగు అన్నపానములు తినటం అనగా పాలతో తయారైన సేమ్యా , కోవా , ఐస్ క్రీం తిని పెరుగన్నం తినటం లేదా చల్లని కూల్ డ్రింక్ ని  వేడిఅన్నం , కూరలు కలిపి తినటం ఇలాంటి ఆహారపు అలవాట్లు పాటించటం . 


 *  మలమూత్రాలను ఆపడం , అదేవిధముగా వాంతి వంటి సహజ వేగాలను బలవంతముగా నిరోధించడం . 


 *  భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయుట , ఎండలో తిరుగుట చేయరాదు . 


 *  ఎండలో తిరిగి వచ్చి చల్లని నీరు తాగరాదు . 


 *  అతిగా శ్రమపడి వచ్చి వెంటనే నీటిని సేవించరాదు . 


 *  అజీర్ణముగా ఉండగా మరలా భుజించరాదు . అనగా ముందు తిన్నది సంపూర్ణముగా అరగక ముందు మరలా భోజనం చేయరాదు . 


 *  కొత్తబియ్యపు అన్నం , పెరుగు మరియు చేపలు కలిపి తినరాదు . 


 *  అధికంగా పులుపు , ఉప్పు తినరాదు . 


 *  మినుములు , ముల్లంగితో చేయబడిన వంటలు , పాలు నువ్వులతో చేసిన వంటలు ఎక్కువుగా తీసుకొనుట 


 *  తినిన ఆహారం జీర్ణం కాకముందే దాంపత్యములో పాల్గొనుట చేయరాదు . 


 *  పగలు నిద్రించరాదు . పగలు నిద్రించుట వలన శరీరం నందు శ్లేష్మము పెరిగి దానివలన రక్తప్రసరణకు అవరోధము కలిగి చర్మమునకు రక్తప్రసరణ సరిగ్గా జరగక చర్మవ్యాధులు సంభవించును . ఎండాకాలం కొంచంసేపు పగలు నిద్రించవచ్చు . 


        పైన చెప్పినవిధముగా విరుద్ధమైన ఆహారం , పనులు చేయుటవలన శరీరంలో చర్మము , రక్తము , మాంసము , లింప్ గ్రంథులు దోషమును పొంది రకరకాల చర్మవ్యాధులు కలుగును. 


  చర్మవ్యాధులు రావడానికి పూర్వము కనిపించు లక్షణములు  - 


 *  స్పర్శజ్ఞానం క్రమేపి తగ్గిపోవుట . 


 *  చెమట ఎక్కువుగా పట్టుట లేదా చర్మవ్యాధి ప్రదేశము నందు అసలు చెమట పట్టకపోవును . 


 *  శరీరవర్ణము మారి నల్లబారిపోవుట . 


 *  దద్దుర్లు . 


 *  పోట్లు . 


 *  అలసట , వడలినట్లు అగుట. 


 *  వ్రణములు లేచి అధికభాధతో కూడి శీఘ్రముగా  

      జనించి త్వరగా మానకుండా ఉండటం. 


 *  తాపము ( చర్మం అంతా మంటలు ) . 


  అసాధ్య చర్మవ్యాధి లక్షణములు  - 


 *  రోగి బలహీనుడుగా ఉండి దప్పిక , మంట ,   అగ్నిమాంద్యములతో కూడి క్రిములు ఏర్పడిన అసాధ్యము . 


 *  చర్మవ్యాధి ఏర్పడి 10 సంవత్సరాలు దాటిన     

      అసాధ్యము . 


  చర్మవ్యాధుల యందు చికిత్సాక్రమము  - 


        శరీరము నందలి వ్యర్ధపదార్ధముల వలన చర్మవ్యాధులు వచ్చును . కాబట్టి వానిని వివిధరకాల పద్ధతుల ద్వారా వాంతి , విరేచనం మొదలగు శోధన పద్ధతులను ఉపయోగించి వ్యర్ధాలను బయటకి పంపుతూ ఔషధాలను ఇయ్యవలెను . 


  చర్మవ్యాధుల యందు పథ్యము  - 


  *  తేలికగా అరిగెడి ఆహారం తీసికొనవలెను . 


  *  త్రిఫలములు - ఉశిరి , కరక్కాయ , తానికాయ 

       విరివిగా వాడవలెను . 

  

  *  త్రిఫలా ఘృతము కూడా వాడవచ్చు . 


  *  పాతధాన్యములు వాడవలెను . 


  *  యవలు , చామలు , కొర్రలు , కందికట్టు , పెసర 

       కట్టు , మేకమాంసం వాడవలెను . 


  *  బీరకాయ , పొట్లకాయ , దోసకాయ , పెరుగు 

      తోటకూర , పొన్నగంటికూర , మెంతికూర , ఆవు 

       నెయ్యి , తెల్ల గలిజేరుకూర , తేనె , నీరుల్లి . 


           పైన చెప్పిన పదార్ధాలు ఆహారంలో తప్పక భాగం చేసుకొనవలెను . 


  చర్మవ్యాధుల యందు అపథ్యము  - 


 *  చింతపండు పులుపు , అతిగా కారం , ఆవాలు , 

      గుమ్మడి , వెల్లుల్లి , పెరుగు , పాలు . 


 *  బెల్లం , కల్లు , సారాయి , నువ్వులు .


 *  మినుములు , చెరుకురసము , పానకము .


 *  చేపలు , నీటిపక్షులు , కోడి మాంసం , పావురం .


 *  అతిగా వ్యాయామం , స్త్రీసంభోగం చేయరాదు .  


          పైన చెప్పినవిధముగా ఆహారపు అలవాట్లు పాటిస్తూ సరైన వైద్యుడి పర్యవేక్షణలో ఔషధాలు సేవించుచున్న చర్మవ్యాధుల నుంచి త్వరగా బయటపడగలరు. ఇక్కడ మనం ముఖ్యముగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయము ఏమిటంటే వ్యాధి సంప్రాప్తినిచ్చిన తరువాత ఔషధాలు సేవించుట కంటే వ్యాధి రాకుండా చూసుకోవడమే అత్యంత ప్రధానమైనది. 


    


          మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

అంతర్ కాంతి

 అంతర్ కాంతి   శీర్షిక                                        సందర్భం..మేడే..

రచన రవికుమార్

బిడియల్


ఉదయమెప్పుడు                           మార్గనిర్దేశం..

అంతర్గత చీకట్లు తొలిచే కాంతి కేతనం..

గత భావాల   సంభావ్యతల అన్వేషించి ఎర్రని పాదాలఫై సరిహద్దులు లేని ప్రపంచం లోనికి అడుగులువేద్దాం..


భూమి తనచుట్టుతానుతిరుగుతూ డాలర్ చుట్టు తిరుగాడే..

సంపదే ప్రాధాన్యలో

సంస్కరణ సూర్యోదయ నీరీక్షణ..


భావదాస్యాల ఉగ్రభూతాల

మారణహోమంలో..

జీసస్ పరిశుధ్ద సోత్రాలు..

రాముని రాతి శిల్పాలతో ప్రార్ధనలు..

అల్లా అపరప్రేమఆలాపల్లో 

కుభేరవైభవం ప్రక్కన కుచేల నాగరికత ప్రగతి..


సమైక్య జీవనం..వాట్సాఫ్

ఫేస్ బుక్ సందేశాల్లో..

కాల పురుగుల ఫబ్ జీగేమ్

కార్పొరేట్ మొసలి ధనార్జన

చదువులు సంక్షోబాలు

రక్షణరాజకీయాల ..

గ్లోబలీకరణ భావకాలుష్యకాసారాల్లో..

మైళ్లదూరం మనుషులు

దగ్గరవుతూ..

మనసులు సమాచార కల్పనలో.. విసంగజీవులవుతూ

టెక్నాలజీ వ్యక్తి కేంద్ర విలాసాలకు.. పునరాతిజననం..


జన్మిస్తూనే తనకుతాను కోల్పోవడం..

మేడే స్ఫూర్తితో నేడే సంఘటిత మవుదాం..

కుంకుమ రేకుల కాంతుల

మనలో నింపుకొని పయణమవుదాం..

శ్రీ శ్రీ జయంతి

 *నా అభిమాన కవిదిగ్గజం మహాకవి శ్రీ శ్రీ జయంతి సందర్భంగా...*


కరోన రోగపు

కరాళనృత్యం

కన్నుల ముందర 

కథకళి చేస్తూ

కర్కషరోగపు 

కబంధ హస్తం

కన్నూమిన్నూ

ఎరుగని జనులను

కబళించేస్తూ..

కాటికి తోస్తూ..

కాలచరిత్రను 

ఖననం చేస్తూ

మహామహులకే

మరణాన్నిస్తూ

ధరాతలమ్మున

సర్వవ్యాప్తమై

మానవజాతిని 

అగ్నిశిఖలకై

ఆహుతినిస్తూ..

ఆజ్యం పోస్తూ...

మృత్యుఘంటికల

మ్రోగించేస్తూ...

ఇలాతలంలో

జనావళంతా

ప్రమోదకాంక్షల

పరాకాష్టకై

ప్రమాదరేఖల

పరిధిని దాటి

భయకంపితులై

భయవిహ్వలులై

పరుగులు పరుగులు

పరుగులు తీస్తే.....

మనిషికి స్వాంతన

ఎక్కడ?ఎక్కడ??????




*....బోర్పట్ల విరాట్ స్వరూపాచార్య సిద్ధాంతి*

ఏకం సత్.

 ఏకం సత్. ఉన్నది వకటే అన్నప్పుడు యీ విశ్వంలో పదార్ధం లేక శక్తిని లేక అయస్కాంత చలన శక్తియా? దీనిని లెక్కింప  శక్తి కొలమానం అశ్వ చలన శక్తి యని. అయిన సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఏక చక్ర రధం రూఢం సూర్యశక్తియని తెలియుచున్నది. ఏక చక్ర అనగా వకే వృత్తాకరంగా వున్న సమస్తం శక్తి రెండుగా రాహు కేతు తత్వ శక్తిగా మారి అపై ఐదు రంగులుగల  గాయత్రీ రంగులైన ముక్తా  విద్రుమ, హేమ నీల ధవళ రూపమై ఆపై గ్రహ శక్తి అది రూప గుణ లక్షణముగా మారు చున్నది. ఏడు రంగుల ఏడు గ్రహముల శక్తిగా మారు చున్నది. అది విబ్జాయర్ అని ఆధునికుల విషయం. సప్త సప్త మహా సప్త యని సప్త ద్వీప పరివృత్తమై యున్న శక్తిని కొలుచుట సాధ్యమా. పరిశీలన చేసిన అది అనంత మని పరిమాణ రూపం లేనిదని అదే వ్యాప్తంగా విషు విష్ణు  తత్వ మని తెలియుచున్నది. ఏడు గ్రహముల శక్తికి మూలం రాహు కేతు మూలమైన శక్తియే.మూల శక్తి లక్షణము తెలియుట అసాధ్యం. మహా సౌర నిర్ణయం కూడా రాహువు తత్వం తెలియక కేతు తత్వమే మూలమని భాసయత్ ప్రకాశించిన తరువాతనే తెలిసినది. అదియును అసంపూర్ణమే.ప్రకాశవంతవంతమైన తరువాతనే పదార్ధరూపం. జీవునికి చైతన్యరూప జీవునిగా దేహ సంబంధమైనదని  తెలియుట వక్క మానవునికే తప్ప యితర జీవ జాలము లకు తెలియదు. అదియే ప్ర ఙ్ఞానమని తెలియును. ఉత్తమమైనది మానవ జన్మయే. మరలా అది వచ్చునో రాదో.వచ్చినా పురుషుడు పురుషుడుగా వచ్చుట అసంభవం స్ర్రీ స్త్రీగా వచ్చుట కూడా అసంభవం. దీనికి సాధనయే మూలం. అసలు జీవుడుగా ధరించకుండుటకు సాధన తప్ప వేరు మార్గం లేదు. తస్మాత్ జాగృత జాగ్రతః ఎల్లప్పుడు జాగ్రత్తగా వుండుట కుదరదు. మాయవలన. మాయనుండి వచ్చుటవలన మాయ గానే వెడలుట సృష్టి ధర్మం. దీనికి అతీతముగా వెడలుటయే మెూక్షమని, తిరిగి రాకుండుటయే యని తెలియుట. దీనినే పునరావృత్తి రహితయని లలితా సహస్రం తెలుపు చున్నది. తెలుసుకుంటూ నే వుందాం. ఆచరిస్తూ నే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*శ్రీ స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు..*


*(పదునాలుగవ రోజు)*


శ్రీ స్వామివారు ఏర్పేడు వ్యాసాశ్రమంలో చేరి, కొంతకాలం సాధన చేసిన అనంతరం, చిత్తూరు జిల్లాలోని పాపానాయుడుపేట గ్రామంలో "బాలబ్రహ్మం" గారి వద్ద ఉపదేశం పొంది..తిరిగి స్వగ్రామం  ఎర్రబల్లె చేరారు..అక్కడనుంచి మాలకొండ కు వెళ్లి, అక్కడ తన తపోసాధన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు..


శ్రీ స్వామివారి తల్లి, సోదరులు అప్పటికే మానసికంగా సిద్ధపడిపోయారు..తమ బిడ్డ ఇక ఏవిధంగానూ సాధారణ జీవనం గడిపే అవకాశం లేదని వారికి తేటతెల్లంగా అవగతం అయింది..మాలకొండ క్షేత్రం తమ గ్రామం నుంచి రమారమి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది..శ్రీ స్వామివారు సాధన చేసుకుంటున్నప్పుడు ఆహారం మితంగా తీసుకునేవారు..కేవలం కొద్దిగా బియ్యం, అందులో కొద్దిగా పెసరపప్పు కలిపి ఉడికించుకొని దానినే ఆహారంగా స్వీకరించేవారు..అదికూడా తాను సాధన నుంచి లేచిన తరువాతే..శ్రీ స్వామివారు ఆహారం తిన్నా..తినకుండా వున్నా..తల్లి సోదరులు మాత్రం ఆయనకు అవసరమైన బియ్యం, పెసరపప్పు ఇతర వెచ్చాలు మాలకొండకు చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు..అలా ఎన్నాళ్ళు జరగాలి అని వారు అనుకోలేదు..ఎంతకాలం పాటు శ్రీ స్వామివారు తపస్సు చేసుకుంటున్నా..అంతకాలం పాటు తాము ఈ ఆహారపదార్ధాలు సమకూర్చాలని నిశ్చయం చేసుకున్నారు..


ఇక..క్రమం తప్పకుండా శ్రీ స్వామివారికి చేర్చే బాధ్యత ఎవరు తీసుకోవాలి?..ఒకరోజుతో తీరిపోయే విషయం కాదు..ఎంతకాలం అని ఎవరూ నిశ్చయంగా తేల్చి చెప్పలేరు..కానీ అక్కడ ఆయన తపోసాధన లో వున్నంతకాలం..తాము ఇక్కడనుండి పంపాలి..ఎలా?..ఆరోజుల్లో బస్సు సౌకర్యం కూడా లేదు..సైకిల్ మీద..తప్పిందా..ఇక కాలి నడకే..ఎర్రబల్లె నుంచి, వెలిగండ్ల గ్రామం మీదుగా మన్నేరు నది దాటి..మొగలిచెర్ల గ్రామం మీదుగా మాలకొండ చేరాలి..


శ్రీరాముడు వనవాసం చేయాలని నిర్ణయం తీసుకోగానే..సీతాదేవి కూడా నారవస్త్రాలు ధరించి ఆయనను అనుగమించింది..ఆ దంపతులు ఇద్దరూ గుమ్మం దగ్గరకు వచ్చేసరికి, లక్ష్మణుడు కూడా నారవస్త్రాలు ధరించి వారితో కలిసి వనవాసానికి బైలుదేరాడు..రాముడు వారించినా...అన్నగారి సేవే పరమార్ధం అని చెప్పాడు..ఆవిధంగానే నడచుకున్నాడు.. అదే విధంగా..శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్య కూడా..తల్లికి సోదరులకు అభయం ఇచ్చాడు.."అన్నయ్య కు వస్తువులు చేర్చే బాధ్యత నాది.." అప్పుడు పద్మయ్య వయసు కేవలం పదహారు మాత్రమే!..


ప్రతి ఇరవై రోజులకూ ఎర్రబల్లె లో బయలుదేరి మాలకొండ దాకా బియ్యం పప్పులు మోసుకుంటూ..(ఒక్కొక్కసారి సైకిల్ ఉండేది కాదు..కాలి నడకే శరణ్యం) వచ్చి, పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారి కోసం ఎదురుచూస్తూ వుండేవాడు..శ్రీ స్వామివారు సాధన పూర్తి చేసుకొని పద్మయ్య ను చూసి నవ్వేవారు..ఆ నవ్వు చూడగానే పద్మయ్యకు తాను అప్పటిదాకా పడిన శ్రమ అంతా ఎగిరిపోయేది..అతి కొద్దిసేపు మాత్రమే శ్రీ స్వామివారు పద్మయ్య తో గడిపేవారు..కానీ పద్మయ్యకు ఆ కొద్దిపాటి దర్శనమే కొండంత సంతోషాన్ని ఇచ్చేది..


ఒకరోజు..పద్మయ్య మాలకొండకు వచ్చి, శ్రీ స్వామివారి రాకకోసం పార్వతీదేవి మఠం వద్ద ఎదురుచూస్తూ వున్నాడు.. ఇంతలో శ్రీధరరావు గారు కూడా అక్కడికి వచ్చారు..ఇరవై ఏళ్లు కూడా లేని ఈ యువకుడెవరా అని శ్రీధరరావు గారు ఆలోచించి..ఆమాటే అడిగేశారు.. తాను ఫలానా అని, ఇలా స్వామివారికి తమ్ముణ్ణి అనీ..స్వామివారికి తమ ఇంటినుంచి వెచ్చాలు తీసుకొచ్చి ఇస్తూవుంటాననీ చెప్పాడు..శ్రీధరరావు గారు కూడా తనను పరిచయం చేసుకున్నారు..ఆనాటి నుండి..పద్మయ్య కు మొగలిచెర్ల గ్రామం లోని శ్రీధరరావు గారిల్లు ఒక మజిలీగా మారిపోయింది..ప్రభావతి గారు కూడా పద్మయ్య ను తమ బిడ్డల్లో ఒకరిగా ఆదరించారు..


పద్మయ్య ది నిస్వార్థ సేవ..శ్రీ స్వామివారిని అన్నయ్య గా కాదు..సాక్షాత్ దైవస్వరూపంగానే కొలిచాడు.. శ్రీ స్వామివారు సిద్ధిపొంది నేటికి దాదాపుగా 42 ఏళ్ళు అవుతోంది..పద్మయ్యనాయుడి మదిలో నేటికీ అదే దైవభావం..


"నేనే కోరికలు కోరలేదు..కానీ ఈరోజు నేను ఈమాత్రపు స్థితిలో ఉన్నానంటే..ఆయన ఆశీర్వాదమే కారణం "అంటూ ఉంటారు..శ్రీ స్వామివారిని తలుచుకున్నప్పుడల్లా..పద్మయ్య భావోద్వేగానికి లోనవుతూ ఉంటాడు..శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి..అలాగే మహాశివరాత్రి నాడు జరిగే ఉత్సవానికి కుటుంబసమేతంగా మొగలిచెర్ల ఆశ్రమానికి క్రమం తప్పకుండా వచ్చి, శ్రీ స్వామివారి సమాధి వద్ద కొద్దిసేపు గడిపి వెళ్లడం పద్మయ్య పెట్టుకున్న నియమం..


శ్రీ స్వామివారి సేవలో ఆనాటి నుంచీ ఈ క్షణం వరకూ తరిస్తున్న  ధన్యజీవి పద్మయ్య నాయుడు..


శ్రీ స్వామివారి ఆశ్రమ సన్నాహాలు..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

సంతోషం

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*"మాస్క్"* పెట్టుకుంటున్నారు. *సంతోషం* 👌


బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా

 *"భౌతిక_దూరం"* పాటిస్తున్నారు. *సంతోషం*.. 👌


బలవర్ధకమైన " *ఆహారం* " తీసుకుంటున్నారు. *సంతోషం*.. 👌


*"ప్రాణాయామం"* లాటి యోగా క్రియలు చేస్తున్నారు. *సంతోషం*


చాలా *సంతోషం* .....


చాలామంచి పని చేస్తున్నారు.. *సంతోషం*...


🤗కానీ...

మీరు *"తెలుగు_TV_న్యూస్_చానళ్ళు"* కూడా చూస్తే, 


మీరు *పైన చెప్పినవెన్ని*  చేసినా ప్రయోజనం వుండదు......


చేసినవన్నీ *బూడిద* లో పోసినట్టే.....


ఎందుకంటే, మన *తెలుగు చానళ్ళ* ల్లో వచ్చే *కరోనా* వార్తలు చూడ్డం వలన......


వాళ్ళు చెప్పే మాటల వల్ల...


*"వంటింటి పోపు"* కు మీకు... దగ్గు  వచ్చినా.....


మీకు *"కరోనా"* వచ్చిందనే ఓ భయానికి లోనై.......


మానసికంగా బలహీనమై మీరు *"రోగానిరోధక శక్తి"* ని సర్వం కోల్పోయి, 


అప్పుడు నిజంగానే 'కరోనా' భారిన పడవచ్చు.....


*కనుక మొట్టమొదటగా తెలుగు TV వార్తా చానళ్లు చూడ్డం ఆపేయండి*.....


*మన తెలుగు TV వార్తా చానళ్ళు గనుక చూస్తే*, 


ఎక్కడో నట్టనడి సముద్రంలో ఓ ద్వీపంలో ఒక్కరే పూర్తి ఒంటరిగా పూర్తిగా మానవ సమాజానికి అత్యంత దూరంగా వున్నప్పటికీ, 

మీకు *'కరోనా'* సోకవచ్చు.....

*వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి.*....


హెచ్చరిక :  


*ప్రస్తుత సమయంలోనే కాదు*,


*ఎప్పుడు... ఎక్కడ తెలుగు TV చానళ్లు చూసిన ప్రమాదమే.*.....


విస్తృత *జనబాహుళ్యం* క్షేమం కోరి ఈ మాటలు చెప్పడమైనది...️✊️