10, ఫిబ్రవరి 2026, మంగళవారం

రక్తహీనత

 రక్తహీనత గురించి సంపూర్ణ వివరణ  -


     మనుష్యునికి రక్తహీనత ఉన్నప్పుడు పూర్తి బలహీనం అవుతారు . ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువుగా ఉండును.  ఇప్పుడు దీని గురించి మీకు సంపూర్ణంగా వివరిస్తాను.


 *  ముఖం పాలిపోయినట్లు , త్వరగా అలసిపోవడం , చిరాకు , కోపం , అసహనం ఎక్కువుగా ఉంటుంది.


 *  ఆయాసం , ఙ్ఞాపకశక్తి తగ్గిపోవటం , మతిమరుపు ఎక్కువుగా ఉండును. నాలుక మంటగా ఉండును.


 *  ఐరన్ లోపించటం వలన వచ్చే రక్తహీనత ఎక్కువుగా ఉండును.


 *  సరైన ఆహారం తీసుకోకపోవటం , సరైన వ్యాయామం చేయకపోవటం వలన కూడా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవును .


 *  వ్యాధినిరోధక శక్తి తగ్గటం వలన అంటువ్యాధులు వీరికి త్వరగా వచ్చే అవకాశం కలదు. అందువలన ఆహారం నందు ఐరన్ ఎక్కువుగా ఉన్నవి తీసికొనవలెను.


 *  శరీరానికి కావలసిన ఐరన్ లభించుటకు పండ్లు , పుట్టగొడుగులు , ఆకుకూరలు , తీగకు కాసే కాయగూరలు , ఖర్జురము , తేనె , సోయాబీన్స్ , బీన్స్ సమృద్దిగా తీసుకోవాలి .


 *  వైట్ బ్రెడ్ , స్వీట్స్ , పంచదార , వేపుళ్లు , నిల్వపచ్చళ్ళు , మైదాపిండి మొదలగునవి వాడరాదు.


 *  కూరలలో నిమ్మకాయ పిండుకోవాలి. ఐరన్ శరీరం గ్రహించాలి అంటే C విటమిన్ అవసరం ఉంటుంది. ఐరన్ టాబ్లెట్స్ వాడటం కంటే ఆహారం ద్వారా సహజంగా ఐరన్ శరీరానికి అందించడం ఉత్తమం .


 *  తేనె వాడితే కొద్దిరోజుల్లొనే మార్పు వస్తుంది. ఖర్జురములో ఐరన్ బాగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజుకి 10 నుంచి 12 వరకు తినాలి.


 *  రక్తహీనత ఉండటం వలన మెడనొప్పి , తలనొప్పి వస్తుంది.


 *  మద్యపానం , ధూమపానం ఈ సమస్యను మరింతగా ఎక్కువుగా చేస్తాయి .


 రక్తహీనత కొరకు నేను ప్రయోగించిన అనుభవయోగం  -


        ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ నందు ఒక స్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి ఉదయం మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు ఇవ్వడం జరిగింది . ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఒక ఆపిల్ పండు తినిపించడం చేశాను . కేవలం నలభై రోజులలోనే శరీరం నందు సంపూర్ణంగా రక్తం వృద్ది అయ్యినది.  దానిమ్మ జ్యూస్ కొరకు ఉపయోగించే కాయలు తియ్యగా పెద్ద సైజు తో ఉండేవి తీసుకోండి . దానిమ్మ జ్యూస్ తాగలేనివారు ఆపిల్ జ్యూస్ నందు కూడా గోధుమగడ్డి చూర్ణం కలుపుకుని తాగవచ్చు . 


మరిన్ని అనుభవపూర్వక, రహస్య ఆయుర్వేద ఔషధ యోగాలు గురించి మరింత వివరణాత్మక సమాచారం నా గ్రంధాల యందు వివరించాను. వాటిని క్షుణ్ణముగా చదవగలరు.


గమనిక  ~ 


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

WILL DEED.

WILL - DEED is one of the important document in one's life. Because this is the one and only document to be executed in the last time of a person's life in his last minute. Many people does not recognize the importance of Will Deed, due to which after the demise of the head of the family the children (Successors) will face many problems. It is always better to execute a WILL DEED. in an early date.

how to execute WILL DEED ? 

to get legal assistance you can contact a senior Advocate. 

write a comment below this post  with your phone number.  your comment will be kept secretly.  you will get reply personally to your watts app phone.  why late.  contact now confidently.  

ఓక సాధారణ వ్యక్తిగా



 ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం *ఓక సాధారణ వ్యక్తిగా ఎదురు చూస్తున్నారు,* ఈయనే పూరీ *శంకరాచార్య స్వామి నిశ్చలానంద్.* ఆయన తెలివితేటల గురించి కొంచెం పరిచయం, > ఇస్రో ఎప్పటికప్పుడు తన *కన్సల్టెన్సీ సాయం తీసుకుంటుంది.* అమెరికన్ స్పేస్ ఏజెన్సీ కూడా అతని కన్సల్టెన్సీని తీసుకుంది. అలాగే అడ్వైజరీ బోర్డులో అతని పేరు రాసి ఉంది. ప్రపంచబ్యాంకు ఆయన సహాయం తీసుకుని ఆర్థిక విషయాలను ఎలా పరిష్కరించాలనే విషయంలో *వేదగణిత సహాయంతో సమస్యలను పరిష్కరించింది*. * ఆక్స్ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్ నుండి గణిత శాస్త్రజ్ఞులు ఇతని సేవలను తీసుకుంటారు. భారతదేశంలో IIT మరియు IISc కూడా అతనితో టచ్‌లో ఉన్నాయి. ఈ మహర్షి చాలా సాదాసీదా జీవితం గడుపుతారు. ఇది అతనికి చాలా చిన్న పరిచయం. *అతను అనేక శాస్త్రీయ పుస్తకాలను వ్రాసాడు.* దీన్ని బట్టి ఋషులు మరియు *ఋషులు అయిన మన పూర్వీకులు ఎంత నేర్చుకున్నారో ఆలోచించండి.* మీరు ఖచ్చితంగా గోవర్ధన్ మఠం యొక్క వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా అభ్యర్థించడమైనది. > మానవ జీవితాన్ని *సంతోషకరమైన ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు.* వీరు కీర్తిని కోరుకోరు మరియు వీరికి ఏదీ లేదు, ఇది నా హిందూ దేశ ఔన్నత్యం జయహో....🚩

మాఘ పురాణం* 23 వ అధ్యాయము

  


             *మాఘ పురాణం*

                  ➖➖➖✍️

             23 వ అధ్యాయము 


మాఘ పురాణం ఇరవై మూడవ అధ్యాయంలో, ఇంద్రుడు పారిజాత పుష్పాల మోహంలో పడి, స్వర్గానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, శ్రీహరి పాదాలకు నమస్కారం చేయకుండా, ఆయన నిర్మాల్యాన్ని దాటి పుష్పాలను కోయడానికి ప్రయత్నించడం వల్ల, దేవతలు తమ శక్తిని కోల్పోయి భూమిపై పడిపోతారు. 

అక్కడ వారిని చూసిన సత్యజిత్తు, వారి దుర్మార్గాన్ని గుర్తించి, వారికి ఆహారం ఇవ్వకుండా నిరాహార దీక్షతో శ్రీహరిని పూజించి దేవతలకు శక్తి తిరిగి రావాలని కోరుకుంటాడు. 

ఇదే సమయంలో, నారదుడు శ్రీహరిని దర్శించి దేవతల దురవస్థ గురించి తెలియజేస్తాడు. 

శ్రీహరి, నారదునితో, తాను ఎందుకు దేవతలను శిక్షించాల్సి వచ్చిందో వివరించి, ఏకాదశి నాడు ఉపవాసం, జాగరణ, మంత్ర జపం ద్వారా శక్తిని తిరిగి పొందవచ్చని చెబుతాడు.

ఈ అధ్యాయంలో మరో కథ కూడా ఉంది. నలుగురు బ్రాహ్మణ కన్యలు ఒక విద్యార్థిని వివాహం చేసుకోమని బలవంతపెట్టడం వల్ల, కోపంతో ఆ విద్యార్థి వారిని పిశాచులుగా మారాలని శపిస్తాడు. తరువాత, వారు మాఘమాసంలో గయలోని త్రివేణిలో స్నానం చేయడం ద్వారా పిశాచ రూపం నుండి విముక్తి పొందుతారు. చివరగా, మాఘమాసంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి, పుణ్యం లభిస్తుంది, శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని ఈ అధ్యాయం తెలియజేస్తుంది. 



*నారదుని దౌత్యము – దేవతల దైన్యము:*```

గృత్నృమద మహర్షి జహ్నువుతో నిట్లనెను. “పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడు విచారించెను. పారిజాత పుష్పము పైనున్న ఇష్టము అధికముగా అగుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను గూడ తనతో తీసికొనివచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు దీసికొని పోదలచిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కిదాటిరి. ఫలితముగా దివ్యశక్తులను గోల్పోయిరి. శక్తి విహీనూలు అయినారు, ఇంద్రాదులు ఇంకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పారిజాత వృక్షమును పెకలింపదలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటడము వలన వారును శక్తి హీనులై పడియుండిరి.

మరునాటి ఉదాట్యమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను జూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ‘ఇంద్రాది దేవతలారా! మీరు మానవులమైన మాకంటె గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యమునేల చేసితిరి. మీరు నాకు తెలియకుండ పుష్పములను దొంగతనముగా తీసికొని పోదలచుట దోషము కాదా?’ అని ప్రశ్నించెను. 


ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేల పైన ఉన్న మాంసమునకు ఆశపడి భూమిపై వ్రాలి యవమానము నందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో యెట్టిదో చెప్పుమని యడిగిరి. 


సత్యజిత్తు వారికేమియు సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను.


ఇంద్రుడు మొదలగువారు ఆహారము లేక దుఃఖపడుచు నచట పదునొకండు దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు. కామధేనువు ఇచ్చు మధుర క్షీరమును లేదు. కల్పవృక్షము, చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష్యభోజ్యములును లేవు. మిక్కిలి దీనులై యుండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన యేర్పడినది యెట్లు తొలగునో తెలియక దీనులైయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యధా పూర్వకముగ పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడ పదకొండు దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక, శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున తిరుగుచు దేవతల దురవస్థను గమనించెను. వారికి ఎట్టి సహాయము చేసిన వారి దురవస్థ పోవునో అతనికి తెలియలేదు. నేరుగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి యిట్లు స్తుతించెను..```

*నారదకృత విష్ణుస్తుతి ఆర్తత్రాణపరాయణాయభవతే నారాయణాయాత్మనే*

*గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయచ॥*


*మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సాజ్యప్రదే*

*శ్రీమత్పంకజపత్ర మేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః॥*                


*అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయచ*

*సర్వలోక నిధానాయ నమస్తే గరుడ ధ్వజ॥*


*నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే*

*భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ॥*


*నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన*

*సర్వేశ సర్వగస్త్యంహి సర్వాధారస్సురేశ్వర॥*

*సర్వంత్వమేవ వృజసి నత్త్వ రూపస్త్యమవహి*

*పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్స్నాతనః॥*

*పరబ్రహ్మసి విష్ణుస్త్యం బ్రహ్మసి భగవాన్ భవః*

*సృష్తిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ॥*

*త్రిగుణోసిగుణాధార స్త్రిమూర్తిస్త్యం త్రయీరమః*

*ఆ సీత్త్యన్మాయయా సర్వం జగత్ స్థావర జంగమం॥*

*త్వమేనైకార్ణవేజాతే జగత్యస్మిన్ జగత్పతే*

*జగత్ సహృత్యసకలం ప్రిత్వా భాబేహనే తు భాసకః॥*

*త్వమేవ సర్వలోకానాం మాతాత్వం నా పితా విభో*

*గురుస్త్యం సర్వభూతానాం శిక్షకస్పుదాయకః॥*

*ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం*

*ప్రసీదపాలయవిభో నమస్తే సురవల్లభ॥*```

నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి యేమియు నెరుగనివానివలె ‘నారదా!స్వాగతము! ఇప్పుడెందులకీ స్తుతి? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో అది యెట్టిదైనను దేవాదులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పుమ’ని యడిగెను. 


నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడుపనిని చేసి ఆపదపాలైరి. భూమియందు పారిజాతమను వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించు చుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్ట పడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో బాటు వెళ్లి 

ఆ పారిజాత వృక్షము వద్ద 

అగ్ని సమీపమున రెక్కలు కాలి పడిన మిడుత వలె దేవతా గణములతో పడియున్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదునొకండు దినముల నుండి నిరాహారులై దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తీ! నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలయు’నని నారదుడు కోరెను.


నారదుని మాటలను విని శ్రీహరి ‘నారదా! అమృత కలశము నుండి తొణికి పడిన రెండు బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను, తులసిగాను అయినది. అనగా ఆ రెండును అమృతము నుండి పుట్టినవి. రెండూ మిక్కిలి పవిత్రములు, సత్యజిత్తను వాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అదియొక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను, తులసి దళములను అమ్మి,  ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచూ ఉండెను. నన్ను పూజించుచుండెను, ఇట్టి ఉత్తమునికి, దీనులకును జీవనాధారమగు పుష్పసంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకాదీనుడగు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగలాలసుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును గూడ దాటెను త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వారి అనుచరులు శక్తిహీనులై తోటలో పడి యున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసి కాని, తెలియక కాని దాటిన, తొక్కిన ఎంతటి వాడు అయినను అంతటి శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు.

ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు నేమి చేయవలెనో తెలియక తానును భార్యతో బాటు నిరాహారుడై నన్నర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు పదకొండు దినములు దేవతలు అమృత పానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని జూచి భార్యతోబాటు నిరాహారుడై యుండెను. దేవతల పుష్తికై నన్ను ప్రతిదినము అర్చించుచూనే ఉన్నాడు. నేడు పదకొండవ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడ ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణమొనర్చినచో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు ఏవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దానినిచ్చెదను’ అని విష్ణువు సమాధానమునిచ్చెను. 


నారదుడును ఏమియును మాటలు ఆడలేక తన దారిన పోయెను” అని గృత్నృమద మహాముని జహ్నువునకు చెప్పెను.


బ్రాహ్మణ కన్యల విమోచనము కొంత కాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండిరి. నలుగురకు నలుగురు  కుమార్తెలు ఉండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళకు ఆ గ్రామము లోనున్న కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్ధి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్మల్ని వివాహము చేసుకోమని బలవంతము చేయగా, ఆ బ్రాహ్మణ విద్యార్థికి అతని విద్య పూర్తి కానందున వారి కోర్కె నిరాకరించెను. అంత నా కన్యలు కోపంతో “నీవు పిశాచివి కమ్మని” శపించగా ఆ విద్యార్ధి కూడా “మీరు కూడా పిశాచులగుదురు గాక”యని ప్రతి శాపము ఇచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి. కొంత కాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. 


ఆ సిద్ధుడు “వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపం తొలగి పోవును” అని చెప్పగా వారు అట్లు చేయుటచే ఆ నలుగురకూ యధా రూపములు కలిగినవి. అట్లు జరుగుట మాఘస్నానమే కారణము.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


    శ్లో𝕝𝕝   *యత్ర మిత్రత్వ మిఛ్ఛంతి*

             *తత్ర త్రీణి నకారయేత్*

             *వాగ్వాదం అర్థ సంబంధం*

             *పరోక్షే దారభాషణమ్||*


తా𝕝𝕝 *లోకంలో ఇద్దరిని దురదృష్టవంతులు గా చెప్తారు ...* 


*ఒకటి - తల్లి పాలు తాగనివాడు*,

*రెండు - మంచి మిత్రుల్ని సంపాదించుకోలేని వాడు.*..

*స్నేహం చిరకాలం నిలుపుకోవాలంటే మూడు విషయాలలో జాగ్రత్త వహించాలి....* 

*ఒకటి... స్నేహితులతో వాదులాడరాదు*

*రెండు... ధన సంబంధపు లావాదేవీలు పనికిరావు*

*మూడు... స్నేహితుడు లేని సమయంలో అతని భార్యతో మాట్లాడరాదు....* 


*ఈ మూడు విషయాలలో జాగ్రత్త పాటిస్తే మంచి మిత్రునిగా ఉండిపోతారు...*


*సుహృత్ గా కీర్తింపబడతారు ఈ జగత్ లో.........*


✍️🌹💐🌸🙏

బరువు తగ్గాలని చూస్తున్నారా..?*

 



*అధిక బరువు తగ్గాలని చూస్తున్నారా..?*

           ➖➖➖✍️


*అయితే ఈ ఆయుర్వేద సూత్రాలను పాటించండి..!* 


అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అధిక బరువు చాలా సులభంగా పెరుగుతారు. కానీ బరువు తగ్గడం చాలా అవస్థగా అనిపిస్తుంది. బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, వేళకు నిద్రించడం చేస్తారు. ఈ క్రమంలోనే సరైన జీవనశైలిని పాటిస్తేనే బరువును తగ్గించుకోవడం తేలికవుతుంది. అయితే బరువు తగ్గేందుకు పలు ఆయుర్వేద సూత్రాలు కూడా ఎంతో మేలు చేస్తాయి. 

వాటిని పాటించడం వల్ల కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, ఇంకా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. 

కరక్కాయ పెచ్చులు.. బరువు తగ్గాలని చూస్తున్న వారు ఆయుర్వేద ప్రకారం రోజూ ముల్లంగి రసాన్ని తాగుతుంటే ఎంతో ఫలితం ఉంటుంది. 


ముల్లంగి రసాన్ని పూటకు 3 టీస్పూన్ల చొప్పున రోజుకు 3 సార్లు తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. బరువు తగ్గేందుకు ఈ రసం సహాయం చేస్తుంది. అలాగే కరక్కాయ పెచ్చులను చూర్ణం చేయాలి. దాన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని అందులో అంతే మోతాదులో తేనె లేదా వేడి నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేస్తున్నా కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా రేగు చెట్టు ఆకులను చిన్న ముద్దగా చేసి ఉలవచారు లేదా శనగలతో చేసిన చారుతో కలిపి తీసుకోవాలి. ఇది కూడా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి రోజూ ఉదయం పరగడుపునే ఒక తమలపాకులో 5 మిరియాల గింజలను చుట్టి తిని వెంటనే ఒక గ్లాసు నీటిని తాగాలి. ఈ చిట్కా కూడా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. 


తేనె.. ఆముదం ఆకులను కాల్చి బూడిద చేసి నిల్వ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిటికెడు చొప్పున తీసుకుని అందులో చిటికెడు ఇంగువ పొడిని కలిపి రెండు పూటలా బియ్యం కడిగిన నీళ్లతో కలిపి తీసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వాయు విడంగాల చూర్ణాన్ని తేనెతో కలిపి రెండు పూటలా తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇక బరువు తగ్గేందుకు గాను పలు ఆయుర్వేద సూచనలను కూడా పాటించాల్సి ఉంటుంది. రోజూ ఆహారంలో అన్ని రుచులు కలిసిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అన్ని రుచులు ఉన్న ఆహారాలుగా రోజూ తినాలి. చక్కెర, ఉప్పు, నూనెలను తక్కువగా తినాలి. భోజనం చేసినప్పుడు ఉదరంలో కొద్దిగా ఖాళీ ఉండేట్లు చూసుకోవాలి. ఆహారం అయిన తర్వాత మధ్యలో ఎక్కువ సేపు భోజనం చేయాలి. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. 


ఆముదపు నూనెలు.. బరువు తగ్గాలని చూస్తున్నవారు వ్యాయామానికి ముందు 2 టీస్పూన్ల తేనెను ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరత్వరగా కరిగిపోవడానికి సహాయం చేస్తుంది. అలాగే హైపర్ థైరాయిడ్ ఉంటే ఆముదపు నూనెను రోజూ టీస్పూన్, ఓట్స్, బార్లీ, చిరుధాన్యాలు, పెసలకి సంబంధించినవి తినాలి. డ్రై ఫ్రూట్స్ వంటివి తింటుంటే ఫలితం ఉంటుంది. అదేవిధంగా పచ్చి కూరగాయల సలాడ్లు ఎక్కువగా తినాలి. గోరు వెచ్చని నీళ్లను తాగాలి, ఉదయం. అలాగే పడుకునే ముందు రోజూ నీళ్లు తాగాలి. ఈ చిట్కా కూడా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ✍️

*🅰️🅿️SRINU*

(ఇవి కేవలం మీ అవగాహన కోసం మాత్రమే! మీ డాక్టర్ని సంప్రదించి 

వారి సలహాతో మాత్రమే వాడాలి.)

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

నక్షత్రం: హస్త (Hasta)*

 



           *నక్షత్ర స్తోత్ర మాలిక*

                ➖➖➖✍️

                 13 వ రోజు


*నక్షత్రం: హస్త (Hasta)*


*అధిపతి*_ *చంద్రుడు* (Moon)


*ఆరాధించాల్సిన దైవం.  సవిత (సూర్యుడు)* / *గాయత్రీ మాత.*


*హస్త నక్షత్ర జాతకులు మరియు బుద్ధి బలం, చేసే పనులలో నేర్పు (Skills) పెరగాలని కోరుకునే వారు పఠించాల్సిన స్తోత్రం.*


🙏 *శ్రీ గాయత్రీ స్తోత్రం (విశ్వామిత్ర కృతం*) 🙏



*ఆదిశక్తే జగన్మాతః భక్తకామదుఘేఽనఘే* ।

*సర్వశక్తిస్వరూపే చ గాయత్రి నమోఽస్తు తే* ॥ 1 ॥


*ఋగ్వేదరూపే గాయత్రి ప్రాతఃసంధ్యే ప్రకీర్తితే* ।

*బ్రహ్మలోకప్రదే దేవి గాయత్రి నమోఽస్తు తే* ॥ 2 ॥


*యజుర్వేదస్వరూపే చ మధ్యం దినే స్థితేఽనఘే* ।

*విష్ణులోకప్రదే దేవి గాయత్రి నమోఽస్తు తే* ॥ 3 ॥


*సామవేదస్వరూపే చ సాయంసంధ్యే విభావరీ* ।

*శివలోకప్రదే దేవి గాయత్రి నమోఽస్తు తే* ॥ 4 ॥


*సర్వవర్ణే సర్వశక్తే సర్వజ్ఞే సర్వమంగళే* ।

*సర్వదేవమయే దేవి గాయత్రి నమోఽస్తు తే* ॥ 5 ॥


*వరదే గీతశాస్త్రజ్ఞే సర్వపాపవినాశిని* ।

*వేదమాతర్నమస్తుభ్యం గాయత్రి నమోఽస్తు తే* ॥ 6 ॥


*హంసవాహేఽక్షసూత్రజ్ఞే పుష్పమాలే జటాధరే* ।

*ఓంకారరూపే గాయత్రి గాయత్రి నమోఽస్తు తే* ॥ 7 ॥


*ధ్యాయేత్ కుమారీం గాయత్రీం వేదమాతరం ఈశ్వరీమ్* ।

*నిత్యం భక్త్యా పఠేద్యస్తు స యాతి పరమాం గతిమ్* ॥ 8 ॥



*విశేషం*


● *సవితృ దేవత*.


*గాయత్రీ మంత్రం సాక్షాత్తు ఈ నక్షత్ర దేవత అయిన 'సవిత'ను ఉద్దేశించి చేసినదే. అందుకే హస్త నక్షత్రం రోజున గాయత్రీ మంత్రాన్ని (లేదా పైన ఇచ్చిన స్తోత్రాన్ని) జపించడం వల్ల అద్భుతమైన తెలివితేటలు, మనోధైర్యం లభిస్తాయి*.


● *హస్త*. (చేయి) ఈ నక్షత్రం మన చేతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు లేదా వృత్తి విద్యలలో రాణించాలనుకునే వారు ఈ రోజున ఈ స్తోత్రం పఠించడం శుభకరం.✍️

.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

కీళ్ళు నరిగెనంచు

 కీళ్ళు నరిగెనంచు కీళ్ళన్ని మార్చేస్తె

పార్ట్లు బోయెనంచు పార్ట్లు మార్చ

సొంత పార్ట్లు బోతె సుఖమేల వచ్చురా

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: ఇంగ్లీషు వైద్యంలో పాడైన కీళ్ళనో, పాడౌతున్న అవయవాలనో బాగుచేసి సరి చేయగలిగే మందులు లేకపోవడం వలన సహజ కీళ్ళను తొలగించి, కృత్రిమ కీళ్ళను బిగించడం, మన శరీర భాగాలను బాగు చేయలేక, హోమియో, యోగా, ఆయుర్వేదం లాంటి వేరే వైద్య విధానాలలో బాగౌతుందని తెలిసినా, అక్కడికి పోనివ్వకుండా పేషెంట్లను భయపెట్టి, సర్జరీల పేరుతో దండిగా డబ్బు గుంజగలిగే అవకాశాన్ని వదులుకోలేక, సొంత అవయవాలు పీకి పారేసి, వేరే వ్యక్తుల అవయవాలు వేసి కుట్టేస్తే సమస్యలు క్షణాల్లో తీరిపోతాయనుకుంటే అది ఒక పిచ్చి భ్రమ మాత్రమే! జరిగే ఆపరేషన్లలో, అవయవ మార్పిడిలో నూటికి 90% అనవసరమైనవీ, కేవలం సర్జరీలు చేసే హాస్పిటళ్ళకు ధన దాహాన్ని తీర్చేవి మాత్రమే! మనది కాని అవయవాలను కానీ, కృత్రిమ వస్తువులను కానీ మన శరీరము ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటుంది! సహజమైన అవయవాలైతే మందులకు స్పందిస్తాయి, సరౌతాయి! కానీ కృత్రిమమైనవి మందులకు స్పందించకపోవడం వలన, శరీరం వాటిని వ్యతిరేకించడం వలన జీవితాంతం వాటితో సమస్యలను, నరకాన్ని అనుభవిస్తూ, డబ్బు ఖర్చుపెట్టి క్షణాల్లో ఆనందాన్ని పొందెయ్యాలనుకునే వీళ్ళ కలలు కల్లలౌతాయి! ఆరోగ్యమనేది డబ్బుతో కొనుక్కునేది కాదు! కష్టపడి, ఓర్పుతో సొంత అవయవాలను కాపాడుకుంటేనే సుఖం దొరుకుతుంది! 

సకురు అప్పారావు చెప్పేది నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, కరోనా లాంటి వైరస్ ల వ్యాప్తిని అరికట్టడానికి, రకరకాల జ్వరాలకూ ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

పంచాంగం 10.02.2026

 ఈ రోజు పంచాంగం 10.02.2026 

Tuesday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస కృష్ణ పక్ష అష్టమి తిథి భౌమ వాసర విశాఖ నక్షత్రం ధ్రువ యోగః కౌలవ తదుపరి తైతుల కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు. 

  


శ్రాద్ధ తిథి: నవమి


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 26*


*మోదితమధుకరవిశిఖం స్వాదిమసముదాయసారకోదండమ్।*

*ఆదృతకాంచీఖేలనమాది మమారుణ్యభేదమాకలయే॥*


*భావము :*


*చేత చెరకు విల్లును, దానికి కావలసిన పుష్పబాణములను ధరించి, కాంచీపురము నందు క్రీడించుటకు ఇష్టపడే మాతను మనసులో ధ్యానిస్తున్నాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।

స్మృతిభ్రంశాద్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ।। 63 ।।


ప్రతిపదార్థ:


సమ్మోహః — విచక్షణ కోల్పోవుట; సమ్మోహాత్ — విచక్షణా రాహిత్యం నుండి; స్మృతి — జ్ఞాపక శక్తి; విభ్రమః — భ్రమ; స్మృతి-భ్రంశాత్ — స్మృతి భ్రమ వలన; బుద్ధి-నాశః — బుద్ధి నశించును; బుద్ధి-నాశాత్ — బుద్ధి నష్టం వలన; ప్రణశ్యతి — వ్యక్తి పతనమగును.


 తాత్పర్యము :


 కోపం అనేది విచక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది, అది స్మృతి (జ్ఞాపకశక్తి) భ్రమని కలుగ చేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమౌతాడు.


 వివరణ:


ఉదయం పూట పొగమంచు సూర్య కాంతిని కప్పివేసి తగ్గించినట్టు, కోపము వివేకాన్ని క్షీణింపచేస్తుంది. కోపంలో జనులు తప్పిదాలు చేసి, దానికి తరువాత చింతిస్తారు, ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ధి, భావోద్వేగాలచే కప్పి వేయబడుతుంది. జనులు అంటారు, ‘అతను నాకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడు, నేను ఎందుకు అతనితో ఇలా మాట్లాడాను? నాకు ఏమైంది?’ అని. నిజానికి ఏమైందంటే, క్రోధం వలన విచక్షణా జ్ఞానం లోపించింది అందుకే పెద్దవారిని దూషించే తప్పిదం జరిగింది.


బుద్ధి మబ్బుకమ్మినప్పుడు అది స్మృతి (జ్ఞాపక శక్తి) భ్రంశను కలుగ చేస్తుంది. ఆ వ్యక్తి ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ కోల్పోయి, భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకోపోతాడు. అక్కడి నుండి ఇక అధో-పతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ధి వినాశనాన్ని కలుగచేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది కాబట్టి, అదే నశించినప్పుడు, వ్యక్తి సర్వ నాశనమైపోతాడు. ఈ విధంగా, దైవత్వం నుండి అధార్మికతకు పతనం అయ్యే ప్రక్రియ, ఇంద్రియ విషయముల చింతన నుండి బుద్ధి విధ్వంసం వరకు విశదీకరించబడింది.

కాలం - అనుకూలం*

  *కాలం - అనుకూలం*

ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.

తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)

卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐

🌟 ఫిబ్రవరి 10 2026 🌟

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం


తిథి: *అష్టమి ఉ.7.27 కు* తదుపరి *నవమి 11 ఉ.9.26 కు*

వారం: *భౌమవారము (మంగళవారం)*

నక్షత్రం: *విశాఖ ఉ.8.15 కు* తదుపరి *అనూరాధ 11 ఉ.10.51 కు*

యోగం: *ధ్రువ రా.1:42 కు* తదుపరి *వ్యాఘాత 11 రా.2:29 కు*

కరణం: *తైతుల రా.8:43 కు* తదుపరి *వణిజ 11 రా.11:12 కు*

రాహుకాలం: *మ. 03.00 - 04.30 కు*

దుర్ముహూర్తం: *ఉ. 9.05 - 9.50 కు, రా. 11.14 - 12.04 కు*

వర్జ్యం: *మ.12.39 - 2.26 కు*

అమృతకాలం: *రా. 11.11 - 12.59 కు*

సూర్యోదయం: *ఉ. 6.48 కు*

సూర్యాస్తమయం: *సా. 6.11 కు*


*గురుబోధ:*

మానవులు ఏ విధమైన జాతికి, ప్రాంతానికి చెందినవారైనా సరే ఉదయం స్నానం చేసి, తూర్పు దిక్కునకు తిరిగి, దేవపూజ చేయవలసిందే. ఉదయం నిద్రలేచే పద్ధతిని అనుసరించి, జీవులకు, ఆయువు, ద్వేషం, మరణం, పాపం, భాగ్యం, వ్యాధి, పుష్టి, శక్తి అనేవి లభిస్తాయి. నిద్ర లేవడం ఆలస్యం అవుతున్న కొద్దీ ఆయువు తగ్గుతుంది. ద్వేషభావన పెరుగుతుంది. మరణం దగ్గర పడుతుంది. పాపాలు పెరుగుతాయి. భాగ్యం తరుగుతుంది. వ్యాధి అధికమౌతుంది. పుష్టి, శక్తి తగ్గిపోతాయి. కాబట్టి రాత్రి త్వరగా నిద్రపోయి, ఉదయం తొందరగా నిద్రలేచేవారికి శుభపరంపరలు పెరుగుతాయి.


*పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అమృత ప్రవచనాలు* 

*👉🏻 ఫిబ్రవరి 11, 2026 (ఉదయం); 🗓️సమయం: ఉ|| 10 గం.ల నుండి మ.12 గం.ల వరకు "భగవత్ రామానుజాచార్య స్వామి మరియు అష్టాక్షరీ మంత్ర వైశిష్ట్యం" 📍వేదిక: శ్రీ తల్పగిరి రంగనాథస్వామివారి దేవాలయం, రంగనాయకుల పేట, నెల్లూరు*

*👉🏻 ఫిబ్రవరి 11 2026 (సాయంత్రం); 🗓️ సమయం: సా|| 6:30 గం.ల నుండి రా.8:30 గం.ల వరకు "శ్రీ రామాయణ వైశిష్ట్యం" , 📍వేదిక: వేంకటేశ్వర స్వామి ఆలయం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు*


https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

10-02-2026 మంగళవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

10-02-2026 మంగళవారం రాశి ఫలితాలు


మేషం


నూతన ఋణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన కలుగుతుంది.

---------------------------------------


వృషభం


వ్యాపారపరంగా భాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి. సంతానం విద్యా విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

---------------------------------------


మిధునం


చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


కర్కాటకం


చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి.

---------------------------------------


సింహం


అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు నుండి ఊహించని ఆహ్వానాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


కన్య


కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు రావలసిన అవకాశాలు చేజారుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

---------------------------------------


తుల


సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

---------------------------------------


వృశ్చికం


పాత ఋణాలు తీర్చగలుగుతారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు పెద్దల సహాయం పొందుతారు.

---------------------------------------


ధనస్సు


అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో మరోసారి నిరాశ తప్పదు.

---------------------------------------


మకరం


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాలలో స్థిర నిర్ణయాలు చేయలేరు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

---------------------------------------


కుంభం


కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.

---------------------------------------


మీనం


రాజకీయవర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయికతో ఆనందం కలుగుతుంది. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

---------------------------------------

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం - అష్టమి / నవమి - విశాఖ / అనూరాధ -‌‌ భౌమ వాసరే* (10.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కశ్యపుని భార్యలైన

 కశ్యపుని భార్యలైన ఈ కద్రువ వినతలమధ్య ఒకరికొకరు పోటీతత్త్వం ఉండేది. 


కద్రువ వినతపై ఆధిపత్యం వహించాలనే తత్త్వాన్ని కలిగి ఉండేది. ఎలాగైనా వినతచేత తాను ఊడిగం చేయించుకోవాలని ఆలోచించేది. 


అటువంటి ఆలోచనతో....

ఒకసారి కద్రువ వినతతో... ఒక పందెమునకు ఒప్పించినది. 


ఈ పందెంలో భాగంగా కద్రువ వినతతో... "ఇంద్రుని గుఱ్ఱము పూర్తిగా తెలుపు కాదు. దాని తోక నల్లగా ఉంటుంది." అన్నది. దానికి వినత... "అదేమీకాదు. క్షీరసాగరమథనంలో పుట్టిన ఇంద్రుని వాహనాలైన ఐరావతంతో సహా అన్నీ పూర్తిగా తెల్లనివే. అదేవిధంగా ఇంద్రుని గుఱ్ఱము కూడా తెల్లనిదే..." అంటుంది. దానిమీద మాట మాట పెరిగి కద్రువ... నా మాటను నేను నిరూపిస్తాను. నీ మాటను నీవు నిరూపించుకోగలవా? ఈ పందెంలో ఎవరు ఓడిపోతే వారు రెండవవారికి దాస్యం చెయ్యాలి. అని అంటుంది. వినత కూడా దానికి సరే అంటుంది. 


ఆ ఇంద్రాశ్వము ఉదయంవేళలో పచ్చికమేయటానికి వస్తుంది. కనుక ఆ సమయంలో పరిశీలిద్దాము అని కద్రువ చెబుతుంది. 


ఈ క్రమంలో... కద్రువ తన సంతానమైన నాగులను పిలచి "మీరు వెళ్ళి ఇంద్రాశ్వము యొక్క తోకకు చుట్టుకొని మా పందెం ముగిసేవరకు ఉండండి." అని నాగులను ఆజ్ఞాపించగా.. కద్రువసంతానమైన నాగులు అట్లాగే చేస్తాయి. 


మరునాడు నాగులు చుట్టుకొన్న ఇంద్రాశ్వమును కద్రువ వినతకు చూపి ఇంద్రాశ్వము తోక నల్లగా ఉన్నదని ఋజువు చేసి వినతను తనకు దాసీగా మార్చుకుంటుంది  


ఇదంతా కద్రువకు నాగులు పుట్టి వినతకు సంతానం కలిగే మధ్యకాలంలో జరిగినవృత్తాంతము. 


ఆ తరువాత వినతకు పుట్టిన గరుత్మంతుడు తన తల్లిని కద్రువ దాస్యం నుండి విడిపిస్తాడు. వినత యొక్క సంతానంలో విశిష్ఠమైనవాడు కనుక గరుత్మంతుడు వైనతేయుడుగా ప్రసిద్ధి చెందాడు.

మీ 

*~శ్రీశర్మద*

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


    శ్లో𝕝𝕝   *యత్ర మిత్రత్వ మిఛ్ఛంతి*

             *తత్ర త్రీణి నకారయేత్*

             *వాగ్వాదం అర్థ సంబంధం*

             *పరోక్షే దారభాషణమ్||*


తా𝕝𝕝 *లోకంలో ఇద్దరిని దురదృష్టవంతులు గా చెప్తారు ...* 


*ఒకటి - తల్లి పాలు తాగనివాడు*,

*రెండు - మంచి మిత్రుల్ని సంపాదించుకోలేని వాడు.*..

*స్నేహం చిరకాలం నిలుపుకోవాలంటే మూడు విషయాలలో జాగ్రత్త వహించాలి....* 

*ఒకటి... స్నేహితులతో వాదులాడరాదు*

*రెండు... ధన సంబంధపు లావాదేవీలు పనికిరావు*

*మూడు... స్నేహితుడు లేని సమయంలో అతని భార్యతో మాట్లాడరాదు....* 


*ఈ మూడు విషయాలలో జాగ్రత్త పాటిస్తే మంచి మిత్రునిగా ఉండిపోతారు...*


*సుహృత్ గా కీర్తింపబడతారు ఈ జగత్ లో.........*


✍️🌹💐🌸🙏

వినాశకాలే విపరీత బుద్ధిః

  వినాశకాలే విపరీత బుద్ధిః


దేవుళ్ల కోసం గళం ఎత్తుతామా లేదా అనే మన భక్తికి కూడా పరీక్షే!


​హిందూ పురాణాల ప్రకారం, శివుడు మరియు విష్ణువు ఇద్దరితోనూ తలపడిన రాక్షసులు కొందరు ఉన్నారు. ప్రధానంగా ఈ ముగ్గురి గురించి చెప్పుకోవచ్చు:


​1. గజాసురుడు:

ఈ రాక్షసుడు బ్రహ్మ దేవుడి నుంచి అపారమైన వరాలు పొంది, అహంకారంతో దేవలోకాన్ని హింసించేవాడు.

​విష్ణువుతో: గజాసురుడిని అణచడానికి విష్ణుమూర్తి ప్రయత్నించగా, గజాసురుడు తన భక్తితో విష్ణువును మెప్పించి, ఆయనను తన ఉదరంలోనే ఉండిపోమని కోరుతాడు.


​శివుడితో: విష్ణువును విడిపించడానికి శివుడు 'గంగిరెద్దుల వాడి'గా వచ్చి, గజాసురుడిని తన నాట్యంతో మురిపించి సంహరిస్తాడు. చనిపోయే ముందు గజాసురుడు తన శిరస్సు లోకపూజ్యం కావాలని కోరగా, శివుడు ఆ తలను వినాయకుడికి అమరుస్తాడు.


​2. జలంధరుడు:

సముద్రుడు మరియు గంగ కలియక వల్ల పుట్టిన వీడు అత్యంత శక్తివంతుడు.


​శివుడితో: జలంధరుడు శివుడితో నేరుగా యుద్ధం చేస్తాడు. అయితే, జలంధరుడి భార్య బృంద యొక్క పాతివ్రత్య శక్తి వల్ల శివుడు కూడా అతడిని సంహరించలేకపోతాడు.


​విష్ణువుతో: విష్ణుమూర్తి మాయాజాలంతో బృంద పాతివ్రత్యాన్ని భంగం చేస్తాడు. ఆ శక్తి క్షీణించిన తర్వాతే శివుడు తన పాదాంగుష్ఠంతో పుట్టించిన సుదర్శన చక్రంతో జలంధరుడిని అంతం చేస్తాడు.


​3. బాణాసురుడు (హరిహర యుద్ధం):

శివకేశవుల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరగడానికి కారణమైన రాక్షసుడు ఇతడు.


​శివుడి పక్షం: బాణాసురుడు పరమ శివభక్తుడు. కృష్ణుడు (విష్ణు అవతారం) తన మనవడైన అనిరుద్ధుడిని రక్షించడానికి బాణాసురుడి కోటపై దాడి చేసినప్పుడు, తన భక్తుడిని కాపాడుకోవడానికి శివుడు అడ్డు వస్తాడు.


​యుద్ధం: ఇక్కడ శివుడు, కృష్ణుడి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. దీనినే "హరిహర యుద్ధం" అంటారు. అంతిమంగా కృష్ణుడు బాణాసురుడి అహంకారాన్ని అణచి, శివుడి కోరిక మేరకు అతడిని ప్రాణాలతో వదిలేస్తాడు.

పురాణాల అంతరార్థం ప్రకారం శివుడు, విష్ణువు ఇద్దరూ ఒక్కటే. భక్తులను పరీక్షించడానికి లేదా లోక కల్యాణం కోసం వారు ఇలాంటి లీలలు ప్రదర్శిస్తుంటారు.


​కలియుగంలో శ్రీ క్షేత్రాలైన తిరుమల మరియు శ్రీశైలంలో కల్తీ ప్రసాద అపచారాలను చేసింది కాక, రాక్షస ప్రవృత్తి గలవారు తిరిగి భక్తుల మీదే మాటల యుద్ధం చేస్తున్నారు. ఏడు కొండల్లో రెండు కొండలు మాత్రమే నీవి అన్న అహంకారుడిని శివయ్య తన నల్లమల పాదాల చెంత కూల్చి అహంకారాన్ని భస్మం చేశాడు. అయినా ఆ పేరున పుట్టిన రాక్షస మంద నేడు ఏకంగా శివకేశవులు ఇద్దరితో పెట్టుకున్నారు. తమకు జరిగిన అపచారాలకు కలియుగంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎలా స్పందిస్తాయో అని ఆ హరిహరులే వేచి చూస్తున్నారు కాబోలు. చిన్న చిన్న లోపాలతో మన వ్యవస్థలు విఫలమైతే, అంతిమంగా ఆ దైవమే నిర్ణయం తీసుకుంటుంది. ధర్మం దిగజారినప్పుడు, అధర్మానికి అంటకాగే కర్ణుడైనా నేలకూలక తప్పదు. అదే కర్మ సిద్ధాంతం. ఎవరి కర్మకు వారే బాధ్యులు.


​"వినాశకాలే విపరీత బుద్ధిః" అన్నట్లుగా, వినాశనం దగ్గరపడినప్పుడు మనుషులు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తిస్తారు. కానీ అంతిమంగా ధర్మమే జయిస్తుంది. భక్తుల ఆవేదన ఆ హరిహరులకు చేరకపోదు. ఈ విషయంలో సామాన్య భక్తులుగా మనం చేయగలిగే పోరాటం 'ధర్మాన్ని విడవకుండా ఉండటం' మరియు మన దైవాల కోసం గళం ఎత్తడం.


​"ధర్మో రక్షతి రక్షితః" — ధర్మాన్ని మనం కాపాడితే, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. #చాకిరేవు

భాగవతం వింటే బాగవుతాం'

  'భాగవతం వింటే బాగవుతాం'

*శ్రీ పోతన భాగవత మధురిమలు*

 

(6-214-ఆ)

తవిలి గుణుల చేతఁ దత్త్వబుద్ధులచేత

నిగిడి కానరాని నెలవువాని

మొదలఁ దాన కలిగి ముక్తి మానావధి

రూపమైనవాని ప్రాపుఁ గందు.


*భావము:-* సుగుణవంతులకు కాని, తత్త్వవేత్తలకు కాని తెలియరాని ఉనికి కలవాడు, మొదటినుండి ఉన్నవాడు, మోక్షానికి పరమావధి అయిన రూపం కలవాడు అయిన ఆ భగవంతుని ఆశ్రయిస్తున్నాను.


శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం తో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

శఙ్కరాచార్యుల చరిత్రను

  ఆది శఙ్కరాచార్యుల చరిత్రను, వారు స్థాపించిన చతురామ్నాయ పీఠములు మరియు ఇతర మఠముల గురించి అసందర్భముగా వివేచన విచారణ చేయకుండా మతికి తోచినట్లు విదేశాలకు వెళ్ళి సన్యాస దీక్ష పతిత్వ దోషాన్ని పొందిన తెన్కలై శాఖకు చెందిన త్రిదండి సన్యాసి చినజియర్ మాటలు పూర్తిగా అసంబద్ధం, అహేతుకం, అజ్ఞానజ ఊహాజనితం. శఙ్కరవైభవంలో కొట్టుకుపోతామనే భయంతో చేసిన తాలు ధాన్యపు మాటలుగా ఎంచి నిర్దాక్షిణ్యంగా ఖండించదగ్గ మాటలు.


ప్రాచీన శంకరవిజయాలతో పాటు ఆధునిక శంకర విజయం వరకూ అన్నిటా పీఠ స్థాపనల ప్రతిపాదన, శంకరుల ముమ్మారు భారత పర్యటన అన్ని విషయాలూ సుస్పష్ఠంగా గ్రంథస్థం చేయబడ్డాయి.


2500 సం పూర్వం మాహిష్మతి (మధ్యప్రదేశ్)నేలిన పాండవుల వారసుడు మహారాజా సుధన్వ చౌహాన్ గారి కాలంలో ఆదిశఙ్కరుల ఆదేశంతో వారు వేసిన శాసనాలతోనే చతురామ్నాయ మఠాల విషయం తెలుస్తున్నది.


జయజయ శఙ్కర హర హర శఙ్కర

శివుడి గుణం !!అత్యంత సుకుమారం!!

  శివుడి గుణం !!అత్యంత సుకుమారం!!


ఈశ్వరా!! పరమేశ్వరా!!


చుాడరా ఇటు చుాడరా!! అనే పాట వింటుాంటే ...శివుడు గురించి ఒక ఆధ్యాత్మిక భావన ఒకటి కలుగుతుంది .రెండు కన్నుల మనిషి బ్రతుకును..గుండెకన్నుతో చుాడరా..


ఎదుట పడని వేదనలను.నుదుటి కన్ను తో చుాడరా.....ఈశ్వరా...పరమేశ్వరా!!ఆది మరియూ అంత్యం అయిన శివుడు గురించి .. . ..పురాణాల్లో వేదాల్లోనుా, ఉపనిషత్తుల్లోను కవులు, నాయనార్లు ఇంకా శివయ్య గాఢ భక్తులు....వేల కొలది సాహిత్యం సృష్టించి వుంటారు...!! పద్యాల కధల స్తోత్రాల రుాపంలో మాటల రుాపంలో పాటల రుాపంలో ..వారి దయ కరుణ ను వర్ణించి వుంటారు....కాని ఒక పరమాణువు లాంటి నేను అలా వర్ణ నలు చేయలేను...అంత ప్రజ్ఞ , జ్ఞానము నాకు లేవు కానీ కొంచెం మాత్రమే శివుడు గురించి తెలుసు...అదిమాత్రమే శివుడు కి సమర్పించగలను....!!మెదట శివుడంటే మాములుగా అందరిలా వుండేదాన్ని...కానీ ఆయన ప్రేమ త త్వం ప్రేమ కోసం ఆయన పడే ఆరాటం బాధ దుఃఖం ఒక సిరియల్ లో చుాసాను....అప్పుడు నుండి శివుడంటే ఎక్కువ ఇష్టం గా మారింది....!!


మనిషి, దేవుడిని కుాడా అనుభవం లోనే పొందాలి....అప్పుడె ఇష్టం గా మారుతుంది శివయ్య కి మనస్వఛ్చమైన మనసునచ్చితే వాళ్ళ కోసం ఏదో ఒకటి మేలు చేస్తాడు అదే శివుడి గొప్పతనం .!!ఎందుకంటే పక్కన పార్వతీ మాత వుంటుంది మాత ప్రేమ దేవత ఆమె స్పుార్తి తోడు సహాయంతో శివుడు ఎప్పుడు ఇతరులకు సహాయం చేయడం కోసం ఆరాటపడుతారు.కాని అదే పార్వతీ మాత పక్కన లేకుంటే ఆయనే దుఃఖభారంతో ఏ సహాయం చేయలేక నిర్లిప్తంగా వుంటారు.పిచ్చివారిలా తన శక్తి కుాడా తనకు గుర్తు రాదు..పార్వతీ మాత జగన్మాత ...సృష్టి మెుత్తం ఆమె బిడ్డలు ..అంటుంది....ఆమె మీద ప్రేమ తో ఆమెకి ఇష్టం అయిన సృష్టి ని ఆయన ప్రేమిస్తారు....!! ప్రేమించకుంటే మాత తన ను వదిలేస్తుందని భయం శివయ్య కి....!! అందుకే జీవుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు.

గద్వాల సంస్థానం

  గద్వాల సంస్థానం – మరొక చారిత్రక ఘటన: నల్ల సోమనాద్రి (పెద సోమభూపాలుడు) యొక్క వీరత్వపు యుద్ధం మరియు ఉప్పేరు నవాబుపై విజయం!

గద్వాల సంస్థాన చరిత్రలో మహారాణి అదిలక్ష్మీ దేవమ్మ ధైర్యం ఒకటైతే, మరొకటి నల్ల సోమనాద్రి (పెద సోమభూపాలుడు, క్రీ.శ. 1663–1713) యొక్క అసమానమైన వీరత్వం మరియు యుద్ధ నైపుణ్యం. ఇతడే గద్వాల సంస్థానానికి నిజమైన ఆధారస్తంభం – కోట నిర్మాణం, రాజ్య విస్తరణ, ఆలయాలు, బావులు (లింగమ్మ బావి, చొక్కమ్మ బావి) చేయించినవాడు. కానీ ఆయన పేరు ఎక్కువగా చెప్పబడేది ఒక భీకర యుద్ధం వల్ల – ఉప్పేరు నవాబు సయ్యద్ దావూద్ మియాపై సాధించిన అద్భుత విజయం!

ఘటన ఏమిటి?

సంస్థాన స్థాపన సమయంలో (1660ల చివరి) సోమనాద్రి గద్వాల ప్రాంతంలో రాజధాని స్థాపించాలనుకున్నాడు. అప్పటికే ఆ ప్రాంతం ఉప్పేరు (Uppidukota) నవాబు సయ్యద్ దావూద్ మియాకు చెందినదిగా చెప్పి, అతడు అడ్డుపడ్డాడు. సోమనాద్రి శాంతియుతంగా ఒప్పందం చేసుకుని, భూమి తీసుకున్నాడు – కానీ నవాబు ఒప్పందాన్ని తిరస్కరించి, యుద్ధం ప్రకటించాడు.

నవాబు మూడు వైపుల నుంచి (రాయచూరు, ప్రాగటూరు, ఉప్పేరు నవాబుల సైన్యాలు) దాడి చేశాడు. యుద్ధం అరగిద్ద (ప్రస్తుత గట్టు మండలం సమీపంలో) దగ్గర భీకరంగా సాగింది. సోమనాద్రి తన చిన్న సైన్యంతోనే మూడు దిశల నుంచి వచ్చిన శత్రు సైన్యాలను ఎదుర్కొన్నాడు.

• రాయచూరు నవాబు బసర్ జంగ్ మొదట పలాయనం చేశాడు.

• ప్రాగటూరు నవాబు హైదర్ సాహెబ్ కూడా ఓడిపోయి వెనక్కి తిరిగాడు.

• ఏకాకిగా మిగిలిన సయ్యద్ దావూద్ మియా ఓటమిని అంగీకరించి, తన యుద్ధ చిహ్నాలు (నగారా, పచ్చ జెండా బంగారు చేతులతో కూడినది, ఏనుగులు) సోమనాద్రికి సమర్పించాడు. ఇంకెప్పుడూ జోలికి రానని ఒప్పుకున్నాడు!

ఈ విజయం తర్వాత సోమనాద్రి గద్వాల కోటను బలోపేతం చేశాడు. ఆ ఫిరంగి (ఎల్లమ్మ ఫిరంగి) ఇప్పటికీ గద్వాలలో ఉంది – ఆ యుద్ధ గెలుపుకు సాక్ష్యంగా! మరో ముఖ్య యుద్ధం 1687లో దర్రూర్ ఫోర్ట్పై బిజాపూర్ సైన్యంపై గెలిచి, ఆ గ్రీన్-గోల్డ్ స్టాండర్డ్ స్వాధీనం చేసుకున్నాడు. ఈ విజయాల వల్ల మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 1696లో ఆయనకు “రాజా” బిరుదు ఇచ్చాడు.

ఈ ఘటన ఎందుకు ఆసక్తికరం?

ఇది కేవలం యుద్ధం కాదు – ఒక చిన్న సంస్థానం తన స్వాతంత్ర్యాన్ని, గౌరవాన్ని ఎలా కాపాడుకుందో చూపిస్తుంది. నల్ల సోమనాద్రి వ్యూహాత్మకత, ధైర్యం వల్ల గద్వాల “విద్వద్గద్వాల”గా మారింది – సాహిత్యం, కళలు, వీరత్వం కలిసిన ప్రాంతంగా. ఆయన మనవడు చిన సోమభూపాలుడు కవిగా ప్రసిద్ధి చెందాడు.

గద్వాల సంస్థానం ఇలాంటి వీర గాథలతో నిండి ఉంది – శతాబ్దాలుగా స్వతంత్రతను కాపాడుకున్న ఒక అద్భుత చరిత్ర! ఈ యుద్ధం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే, గద్వాల కోట శిథిలాలు, ఎల్లమ్మ ఫిరంగి చూడండి – అక్కడ ఇప్పటికీ ఆ వీరత్వం గుర్తుచేస్తుంది.

జగద్గురు బోధలు-145

  9-2-26

ఓం జగద్గురుభ్యోనమః

జగద్గురు బోధలు-145

(JAGATHGURU BHODALU VOL-7)

4)శంకరావతారము

మూడవ భాగము


ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్ శ్రియ మిచ్ఛేద్ధుతాశనాత్|

ఈశ్వరాత్ జ్ఞాన మన్విచ్ఛేత్ జ్ఞానదాతా మహేశ్వర:||


జ్ఞానదాత, జ్ఞానస్వరూపి మహేశ్వరుడే. ఈశ్వరుని కొక్కనికే సర్వజ్ఞుడని పేరు. అమరకోశం కూడా అట్లే చెప్పింది. 'ఈశానః సర్వవిద్యానాం' అని వేదము. లోకాలను పాలించుటకు పరమాత్మయే ఈశ్వరుడై ఉన్నాడు.


నశించిపోయిన జీవబ్రహ్మాభేదయోగాన్ని పునరుద్ధరించడానికై శ్రీకృష్ణులు అవతరించారు. ఆ అవతరణం ద్వాపరాంతంలో జరిగింది. పిమ్మట కలి పుట్టినది. ఆ యోగము తిరుగనష్టమై పోయినది. ఏవో డెబ్బదిరెండు దుర్మతాలు లోకంలో అల్లుకొన్నాయి. ఏ దుర్మతమైనా దానికి ఆరంభంలో జీవం ఎక్కువ. కాని అవి చిరకాలం నిలువలేవు. తొందరలోనే అంతరిస్తూ ఉంటాయి. కరుణానిధియైన పరమేశ్వరునితో ఏమీభేదంలేకుండా ఏకంకావడమే వేదాలు చెప్పే పరమార్థం. అదే అద్వైతం. ఆ అద్వైతముపై విశ్వాసం కృతయుగంలో పరిపూర్ణంగా ఉండేది. ద్వాపరంలో ఆ విశ్వాసం కొంత సన్నగిల్లినది. కాని కలిలో అధర్మం బాగా విజృంభిచి, ధర్మం చాలా క్షీణించింది. అందుచే అద్వైతవిశ్వాసం ఎక్కువగా లోపించింది.


శ్రీకృష్ణావతారంలో కొంతసేపుమాత్రమే అర్జునునకు జ్ఞానోపదేశం చెయ్యడం జరిగింది. మిగిలిన కాలం అంతా అయన రాజ్యవిషయాలను చక్కదిద్దడంలో గడిపేరు. రాజ్యాలలో ధర్మం సుప్రతిష్టితం కావడానికి వలసిన ముక్తులన్నీ ఆయన ఆచరించారు. పంచపాండవులు ప్రార్థిస్తే కౌరవసభకు దూతగా వెళ్ళేరు. ఇలా ఎన్నో పనులు నిర్వర్తిస్తూ జ్ఞానోపదేశానికి కొద్దిసమయం మాత్రమే వినియోగించేరు. అది ద్వాపరయుగం. ఆనాడు కలిలోవలె ధర్మం అనగా అద్వైతవిశ్వాసం బాగా క్షీణించనూలేదు, దుర్మతాలు ఎక్కువ విజృంభించనూ లేదు. కాగా ఆనాటికా పని చాలి ఉన్నా కలిలో ఆ మాత్రంచేస్తే చాలదు. ఇక్కడ పూర్తి జ్ఞానోపదేశంలోనే అవతారకాలం అంతానడవాలి. జ్ఞానోపదేశం తప్ప వేరోకపనిలేని అవతారం కలికి అవసరమైనది.


ఇక్కడ కొందరు శంకిస్తూ ఉంటారు. ఏమని అంటే అయ్యా! కలిలో అధర్మాలు ప్రబలుతాయని ధర్మం క్షీణిస్తుందని పురాణాలు చెప్పిన మాటయేకదా! ఇక వేదాలు నశిస్తున్నాయనీ అధర్మం పెరిగిపోతోందనీ గోల చేయడం ఎందుకు? దీనివల్ల ప్రయోజనం ఏమున్నది? పురాణాలు చెప్పినమాటలు దబ్బరలు కావని మీరే అంటున్నారు కదా!- అని ఆక్షేపిస్తారు వారు.


జోస్యం విషయంలోకూడా వారి ఆక్షేపణ ఈ తీరుగానే ఉంటుంది. దానిని గూర్చి వారి ఆక్షేపణ ఏమంటే-జోస్యం వట్టి నిరర్థకవిషయం. మనకు దుఃఖం రానున్నదని జోస్యం ద్వారా తెలిసింది. దానివల్ల ఎప్పుడో రాబోయే దుఃఖాన్ని తలచుకొని ఇప్పటినుండీ ఏడవవలసి వస్తోంది. అలా కాక మనకు ఏదో గొప్ప సుఖం కలుగనున్నదని జోస్యంద్వారా తెలిసింది. అప్పుడు రాబోయే సుఖాన్నిగూర్చి ముందే తెలియడంద్వారా వాస్తవంగా సుఖం కలిగిన సమయంలో ఎక్కువ ఆనందం అనుభవించలేకున్నాము. ఈ సుఖం ఎలాగూ రావలిసినదే. వచ్చినది, అంతే! అన్నభావంతో ఎక్కువగా ఆనందించలేము. కాగా జ్యోస్యం రానున్న సుఖాన్ని గూర్చి చెప్పినా లేక దుఃఖాన్ని గూర్చి చెప్పినా మనకు కలిగే ప్రయోజనం లేదు సరికదా; నష్టం ఉన్నదని వారి ఆక్షేపణ.


మరి అయితే ఆ పురాణాలలో కలిరాబోతోంది, ధర్మం క్షీణిస్తుంది, అధర్మం విజృంభిస్తుంది-అనే మాటలు ఎందుకు చెప్పినట్లు? ముందుగా ఈ హెచ్చరిక చేయడంవల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? పై ఆక్షేపణచూస్తే కొందరకు సమాధానం వెంటనే స్ఫురించదు.


కాని పరిశీలిస్తే ఆ హెచ్చరిక నిష్ర్పయోజనం కాదని, దానివల్ల ప్రయోజనం ఉందని తేలుతుంది.


ఒకచోట దొంగల భయం ఎక్కువగా ఉన్నది. ఆ దొంగలు గజదొంగలు. ఎంత జాగ్రత్తగా భద్రం చేసినా సొత్తు ఎత్తు పోతున్నారు. ఇది అచట నున్న వారికందరికీ తెలిసినదే. అయితే మాత్రం - మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు మన కన్నులుగప్పి సొత్తు అపహరిస్తూనే ఉన్నారు. ఇక మనం జాగ్రత్తపడి ప్రయోజనం ఏముంది? ఇంటిలో ఉన్న యీ సొత్తు అంతా వాకిటిలోనే పారవేద్దాం- అని తలచేవారు ఉంటారా! ఉండరు. జాగ్రత్తకలిగి ఉంటే ఏదో కొంతైనా రక్షించుకోవచ్చునను కొంటారేగాని సొమ్మును నడివీధిలో పారవేయరు.


అలాగే కలిలోని ధర్మవిషయములో కూడ ఎక్కువ జాగ్రత్త అవసరమని తెలియజేయడానికే పురాణాలు అలా హెచ్చరించాయి. అదీ కాక కలిలోని అధర్మప్రవాహాన్ని ఎదురిస్తూ ఆచరించిన ధర్మం అల్పమైనా ఇతర యుగాలలో ఆచరించపడినదాని కంటె కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిపక్షాన్ని ఎదురించి నిలుచుటలోనే శూరుడు యశ మార్జిస్తాడు. అందుచే లోకం ఎంత పరిహసిస్తూ ఉన్నా లక్ష్య పెట్టక ధైర్యంతో ధర్మాన్ని ఆచరిస్తే ఎంత కలి అయినా చిత్తశుద్ధి కలుగుతుందనడానికి సందేహం లేదు.


'కలిః సాధుః' అని ఒక వాక్యము. అనగా కలికాలము సాధువైన కాలము అని అర్థం. ఇదెలా! వెనుకచెప్పిన మాటలకిది విరుద్ధం కాదా! అనిపిస్తుంది. ఇది వేరొక దృష్టితో చెప్పినమాట. మిగిలిన యుగాలలో ఎంతోకాలం తపస్సుచేస్తేగాని లభించని ఫలితం కలిలో అల్పకాలం చేసిన తపస్సు ద్వారా పొందవచ్చును. అది దృష్టియందుంచుకొని 'కలిః సాధుః' అన్నారు. ఈశ్వరుడుకూడ ఈ యుగంలో తన్నెవరును ఆశ్రయింపవచ్చుటలేదే! అని, ఎవరైనా తనవద్దకు వెదకుకుంటూ వస్తారా! అనీ అట్టివారిని తానే వెదకుతూ ఉంటాడు. తనను గూర్చి కొంచెంగా అన్వేషించేవానిని కూడా చక్కగా అనుగ్రహిస్తారు. అందుచే కలిలో అధర్మం ఎక్కువుగా ఉండేమాట నిజమైనా ఇచట ఆచరితం అయ్యే ధర్మానికి విలువ ఎక్కువైనందున వేదధర్మాలను ఎవరూ విడచిపెట్టకూడదు.


కలి ప్రారంభంలో కట్టతెగిన ప్రవాహంవలె అధర్మం లోకాన్ని ముంచి ఎత్తింది. ఈ అధర్మ ప్రవాహాన్ని నిలుపడానికి సంకల్పించి పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణవంశంలో అవతరించేడు. సర్వవిద్యలకు అధిపతి అయిన సదాశివుడు జ్ఞానోపదేశానికై అవతరించారు. అదియే శంకరావతారము ఆయన ఈ అవతారము జ్ఞానప్రధానమైనది- విష్ణువు యొక్క అవతారాలన్నీ క్షాత్రప్రధానాలు.

--- “జగద్గురు బోధలు” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

శ్రీ మహాపెరియవ శరణం పరమాచార్యా రక్ష రక్ష

జయ జయ శంకర | హర హర శంకర

జయ జయ శంకర | హర హర శంకర

*సర్వే జనాః సుఖినోభవంతు 

Sekarana from `కంచి కామకోటి పీఠం (JAGATHGURU BHODALU VOL-7)నుండి

కశ్యపుని భార్యలలో "దితి" "అదితి" అనువారు ముఖ్యులు

 కశ్యపుని భార్యలలో "దితి" "అదితి" అనువారు ముఖ్యులు. దితియందు, అదితియందు కశ్యపప్రజాపతి సంతానాన్ని పొందటం జరిగినది. 


దితి యొక్క సంతానము కనుక వారు దైత్యులు అని పిలువబడ్డారు. వీరందరికీ ఆసురీలక్షణాలు ఉండటంచేత అసురులని, రాక్షసగుణాలు కలవారగుటచేత రాక్షసులని వ్యవహరించబడ్డారు. 


అదితియందు కశ్యపప్రజాపతికి కలిగిన సంతానము అగుటచేత ఆదిత్యులు అని పిలువడ్డారు. "సుర" అను పానీయమును త్రగువారు కనుక "సురలు" అని పిలువబడ్డారు. వీరే దైవీగుణములు కలిగి ఉండుటచేత దేవతలు అని వ్యవహరించబడుతున్నారు. 



కశ్యపునకు "దితి అదితి" మాత్రమే కాకుండా ఇంకా అనేకవేలమంది భార్యలు కలరు. వారిలో "వినత, కద్రువ" కూడా ముఖ్యులు. 


ఈ వినత కద్రువలకు చాలాకాలం సంతానం కలుగలేదు. సంతానంకోసం వీరు కశ్యపుని ప్రార్థించగా....  కొద్దికాలానికి ఈ వినత కద్రువలిద్దరూ గర్భం ధరించారు. 


కొద్దికాలంలో కద్రువగర్భము నిండి అనేకవేలమంది నాగులను సంతానంగా పొందినది. ఆ సంతానమే సర్పజాతి అయినది. 


వినతకు మాత్రం గర్భం ధరించి 500ల ఏండ్లు అయినా గర్భం కొనసాగుతున్నదే తప్ప, ఇంకా సంతానానికి ఆమె నోచుకోలేదు. తన సవతికి సంతానం కలిగి ఆమె ఆనందంతో ఉన్నది. నాకింకా సంతానం కలుగలేదే...  అని విచారించి విచారించి కోరికను ఆపుకోలేక భర్త అయిన కశ్యపునే... ఇంకెప్పుడు సంతానం కలుగుతుంది? అని అడిగింది. దానికి కశ్యపుడు...  కొద్దిరోజులు ఓపికవహించమని చెప్పాడు. ఆవిధంగా వేచి చూస్తుండగా మరొక 500 ఏండ్లకు వినత ప్రసూతి అయినది. కాని ఆమె రెండు అండములకు జన్మనిచ్చినది. దానితో వినత "సంతానం కలుగుతుందనుకుంటే అండములు పుట్టాయని హతాశురాలై మరలా కశ్యపుని చేరి తన బాధను తెలుపుకొన్నది. 


దానికి కశ్యపుడు మరలా...  కొద్దిరోజులు వేచి ఉండు. నీకు మంచి సంతానం కలుగుతుంది. అని చెప్పగా...  వినత ఆ అండాలను జాగ్రత్తగా సాకుతూ వేచిచూస్తూ ఉన్నది. మరలా 500 ఏండ్లు గడచిపోయాయి. వినతకు ఆత్రం ఆగటంలేదు. మరలా కశ్యపుని అడగటం ఆయన వేచి ఉండమనటం ఇలా కాలం గడుస్తుండగా మరలా 500 ఏండ్లు గడచిపోయాయి. తనకు పుట్టిన అండములు పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయి. 


ఇక తన మనసును అదుపుచేసుకోలేక...  "త్వరగా సంతానాన్ని చూడాలి. తన సవతి ఏమో తన సంతానంతో ఆనందంలో మునిగి తేలుతోంది. నేనుకూడా ఆ నందాన్ని పొందాలి." అనే తానత్రయంతో తహతహతో ఒకరోజున ఒక అండాన్ని పగులగొట్టి చూచింది. 


ఆ పగులగొట్టిన అండంలో తన కుమారుడు శిరస్సునుండి పాదాలవైపు ఒక్కొక్క శరీరాంగం అభివృద్ధి చెందుతూ...  నడుక్రింద వరకు శరీరాన్ని పొంది ఉన్నాడు. ఊరువుల నుండి పాదాలవరకు అభివృద్ధి చెందవలసి ఉన్నది. అటువంటి స్థితిలో ఉన్న కుమారుడు అరుణచ్ఛాయలతో ధగధగా మెరసిపోతూ అండమునుండి బయటకు వచ్చాడు. ఆవిధంగా జగజ్జేగీయమానంగా వెలిగిపోతున్న కుమారుని చూచి సంతోషించాలో ఊరువులు లేకుండా పుట్టాడని దుఃఖించాలో వినతకు అర్థంకాలేదు. అటువంటి పరిస్థితిలో వినత దగ్భ్రమకు లోనై కుమారుని చూస్తుండగా...  ఊరువులు లేకుండా పుట్టిన ఆ కుమారుడు తన తల్లిని ఓదార్చి...  "నాకు జన్మనివ్వటానికి తొంతదపడితే తొందరపడ్డావు. ఇకపు నేను ఊరువులు లేకుండానే ఇలా గడపవలసి ఉంటుంది. కనుక ఆ రెండవ అండంలో తమ్ముడు పెరుగుతున్నాడు. దయచేసి ఆ అండాన్ని తొందరపడి పగులగొట్టకు. పూర్తిగా ఎదిగిన తరువాత అందులోనుండి తమ్ముడే బయటకు వస్తాడు. అప్పటివరకు వేచి ఉండు." అని తన తల్లికి చెప్పి తాను సూర్యలోకానికి వెళ్ళిపోతాడు. ఊరువులు లేకుండా జన్మించటం వలన అతడు "అనూరుడు" అని పిలువబడ్డాడు. 


ఆ తరువాత మరొక 1000 ఏండ్లకు రెండవ అండము నుండి గరుత్మంతుడు జన్మించాడు. 


గ్రూపులోని అందరికీ అవగాహన కల్పించటంకోసం ఈ కథను తెలియజేయటం జరిగింది. 

మీ 

*~శ్రీశర్మద*

పంచాంగం