14, అక్టోబర్ 2020, బుధవారం

ఆయుర్వేద సంబంధ 31 పుస్తకాలు(

 *ఆయుర్వేద సంబంధ 31 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


31 పుస్తకాలు ఒకేచోట https://www.freegurukul.org/blog/ayurvedam-pdf


               (OR)


అందరికి ఆయుర్వేదం-స్వదేశీ వనములికా వేదం www.freegurukul.org/g/Ayurvedam-1


అందరికి ఆయుర్వేదం-స్వదేశీ ఆహార వేదం www.freegurukul.org/g/Ayurvedam-2


అందరికి ఆయుర్వేదం-స్వదేశీ సౌందర్య  వేదం www.freegurukul.org/g/Ayurvedam-3


అందరికి ఆయుర్వేదం-ఆయుర్వేద జీవన వేదం www.freegurukul.org/g/Ayurvedam-4


అందరికి ఆయుర్వేదం-సంవత్సర సంచిక-1 www.freegurukul.org/g/Ayurvedam-5


అందరికి ఆయుర్వేదం-సంవత్సర సంచిక-2 www.freegurukul.org/g/Ayurvedam-6


అందరికి ఆయుర్వేదం-సంవత్సర సంచిక-3 www.freegurukul.org/g/Ayurvedam-7


గృహ వైద్యం-4 www.freegurukul.org/g/Ayurvedam-8


వ్యాసప్రోక్త వైద్య శాస్త్రము www.freegurukul.org/g/Ayurvedam-9


మన్కి మిన్కి-ఆయుర్వేదం www.freegurukul.org/g/Ayurvedam-10


ఆయుర్వేదం ఆధునిక శాస్త్రీయ వికాసము www.freegurukul.org/g/Ayurvedam-11


చరక సంహిత-విమాన స్థానము www.freegurukul.org/g/Ayurvedam-12


చరక సంహిత-శారీర స్థానము www.freegurukul.org/g/Ayurvedam-13


చరక సంహిత-కల్ప స్థానము www.freegurukul.org/g/Ayurvedam-14


చరక సంహిత -చికిత్సా స్థానము www.freegurukul.org/g/Ayurvedam-15


అష్టాంగ హృదయము -సూత్ర స్థానము www.freegurukul.org/g/Ayurvedam-16


అష్టాంగ హృదయము -ఉత్తర స్థానము www.freegurukul.org/g/Ayurvedam-17


అష్టాంగ హృదయము -చికిత్స,కల్ప స్థానము www.freegurukul.org/g/Ayurvedam-18


అందరికి ఆయుర్వేదం-2008 www.freegurukul.org/g/Ayurvedam-19


అందరికి ఆయుర్వేదం-2009 www.freegurukul.org/g/Ayurvedam-20


అందరికి ఆయుర్వేదం-2010 www.freegurukul.org/g/Ayurvedam-21


అందరికి ఆయుర్వేదం-2011 www.freegurukul.org/g/Ayurvedam-22


అందరికి ఆయుర్వేదం-2012 www.freegurukul.org/g/Ayurvedam-23


అందరికి ఆయుర్వేదం-2013 www.freegurukul.org/g/Ayurvedam-24


అందరికి ఆయుర్వేదం-2014 www.freegurukul.org/g/Ayurvedam-25


అందరికి ఆయుర్వేదం-2015 www.freegurukul.org/g/Ayurvedam-26


వంట ఇల్లే వైద్యశాల www.freegurukul.org/g/Ayurvedam-27


ప్రకృతి వైద్యం www.freegurukul.org/g/Ayurvedam-28


ప్రకృతి వైద్య తత్త్వము www.freegurukul.org/g/Ayurvedam-29


ప్రకృతి గృహ వైద్యం www.freegurukul.org/g/Ayurvedam-30


గృహౌషద వనము www.freegurukul.org/g/Ayurvedam-31



ఆయుర్వేదం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link www.freegurukul.org/join

ఉత్తరాషాఢ నక్షత్రము

 ఉత్తరాషాఢ నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు


   నక్షత్రములలో ఇది 21వ నక్షత్రము. ఇది రవి గ్రహ నక్షత్రము, మానవ గణము, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు, మిగిలిన పాదాలు మూడింటికి శని. 


ఉత్తరాషాఢ నక్షత్రము మొదటి పాదము

ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు. వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవ గణానికి చెందిన వారు. కాబట్టి వీరు సమయానికి తగ్గ రీతిలో ప్రవర్తించ గల్గిగే చాకచక్యం కలిగి ఉంటారు. ఇక వీరికి ఆత్మవిశ్వాసం, అతిశయం కలగలుపుగా ఉంటాయి. ప్రభుత్వపరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. ప్రజానాయకులుగా, ప్రజాఅధికారులుగా రాణించగల నేర్పు వీరికి ఉంటుంది. అగ్ని సంబంధిత, పసుపు వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి.


ఈ జాతకులకు ఆటంకం లేకుండా విద్య సాగుతుంది. వీరికి ఐదు సంవత్సరముల వరకు రవిద శ ఉంటుంది. తరువాత పదేళ్ళ వరకు చంద్ర దశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. 15 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 22 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే, ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉండే అవకాశాలు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. 


40 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు క్రమంగా తగ్గుతాయి. సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సుఖం మళ్లీ మొదలవుతుంది. 56 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. 75 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.


ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదము 

ఈ జాతకులు మానవ గణానికి చెందిన వారు కనుక సమయానికి తగ్గ రీతిలో ప్రవర్తించ గల నేర్పు కలిగి ఉంటారు. ఇక వీరు తండ్రి పట్ల కొంత విముఖత కలిగి ఉంటారు. తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల, అతిశయం ఉంటుంది. ప్రభుత్వ పరిశ్రమలు, కర్మాగాలలో ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. వీరికి శ్రమించి పట్టుదలతో పని చేయగలరు. వీరు నిర్వహకులుగా చక్కగా పని చేయగలరు. పరిశ్రమలను స్థాపించి నిర్వహించగల సామర్థ్యం ఉంటుంది.  


ఇక ఈ జాతకులకు విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి 4 సంవత్సరముల వరకు రవి దశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్ర దశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. 14 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 21 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో కాస్త జాప్యం అయ్యే అవకాశం. 


39 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సుఖం మళ్లీ మొదలవుతుంది. 55 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.


ఉత్తరాషాఢ నక్షత్రము మూడవ పాదము  

వీరు తండ్రి మీద కొంత విముఖత కలిగి ఉంటారు. అయితే తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల మెండుగా ఉంటుంది. వీరికి ప్రభుత్వ పరిశ్రమలు, కర్మాగాలల్లోని ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమించి పని చేయగల నేర్పు ఉంటుంది. వీరు నిర్వహకులుగా చక్కగా పని చేయగలరు. పరిశ్రమలను స్థాపించి నిర్వహించగల నేర్పు ఉంటుంది. ఈ జాతకులకు స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి.  


వీరికి విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి రెండు సంవత్సరముల వరకు రవి దశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్ర దశ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో వీరికి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. 12 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగానే సాగిపోతుంది. 19 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. అయితే వివాహం విషయంలో జాప్యం జరిగే అవకాశం. 


37 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సుఖం తిరిగి మొదలవుతుంది. 53 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ సమయంలో ఖర్చులు అధికమవుతాయి. 72 సంవత్సరాల తరువాత వచ్చే బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.


ఉత్తరాషాఢ నక్షత్రము నాలుగవ పాదము 

వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. మానవ గణానికి చెందిన జాతకులు కనుక వీరికి సమయానుకూలంగా ప్రవర్తించగలిగే నేర్పు ఉంటుంది. ఇక వీరికి ఆత్మవిశ్వాసం, అతిశయం కలగలుపుగా ఉంటాయి. ప్రభుత్వపరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ రంగంలో పని చేయడం వీరికి అనుకూలం. ప్రజానాయకులుగా, ప్రజా అధికారులుగా వీరు సమర్ధతో పని చేయగలరు. మధ్యవర్తులుగా కూడా నేర్పుతో వ్యవహరించగలరు. అగ్ని సంబంధిత, పసుపు వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 


ఇక ఈ జాతకులకు విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి ఒక సంవత్సరముల వరకు రవిదశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్రదశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. 11 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 18 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే ఉన్నత విద్య విదేశాలలో కొనసాగే అవకాశం. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. అయితే వివాహం విషయంలో జాప్యం జరిగే అవకాశం. 


36 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సుఖం మళ్లీ ఆరంభమవుతుంది. 52 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. 71 సంవత్సరాల తరువాత వచ్చే బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.  


ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు 


రవిగ్రహ నక్షత్రమైన ఈ ఉత్తరాషాఢలో జన్మించిన జాతకులు ప్రలోభాలకు లొంగరు. వీరు సాధారణ స్థాయి నుంచి కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. లక్ష మందిలో ఒకరికి లభించే అరుదైన అవకాశం ఈ జాతకులకు లభిస్తుంది. చదువు, విజ్ఞానంలో తల్లిదండ్రుల కంటే మించిపోతారు. ఇక ఆర్థిక వ్యవహారాలు దాచుకోవడంలో వీరికి వీరే సాటి. తెలిసిన వాళ్ళకు అప్పు కూడా ఇవ్వరు. స్నేహాలు, పరిచయాలు వినోదంగా భావిస్తారు. సెంటిమెంట్స్‌ను కీలక సమయంలో లెక్కచేయరు.


మితంగా వ్యవహరించడం, ఇతరుల పట్ల వినయ విధేయతను కలిగి ఉండటం ఈ నక్షత్ర జాతకుల వ్యక్తిత్వం. బంధుత్వ బంధానికి కట్టుబడి ఉంటారు. బంధువుల కోసం కొన్ని నిందలు తమపై వేసుకుని కష్టనష్టాలు అనుభవిస్తారు. ఒక సమయంలో వీరు నేర ప్రవృత్తి నడవడిక కలిగిన వారికి అండగా నిలువవలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణమవుతాయి. ఉన్నత చదువులు వీరికి కలసి వస్తాయి. వ్యాపారంలో ఊహించని ఫలితాలను సాధిస్తారు....మీ... *చింతా గోపి శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం*(భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

రామాయణమ్. 92

 రామాయణమ్. 92

...

భరతుడి అరుపులు,కేకలు, పెడబొబ్బలతోఅంతఃపురం మారుమ్రోగిపోతున్నది.భరతుడి గొంతు గుర్తుపట్టిన కౌసల్య సుమిత్రతో అదిగో భరతుడు వచ్చినట్లున్నాడు ఆ గొంతు అతనిదే కదా అని ఆవిడ అంటూఉండగనే భరతశత్రుఘ్నులు పెత్తల్లి చెంతకు చేరారు.

.

ఆవిడ అప్పటికే భర్తృవియోగం ,పుత్రుడు దూరమవ్వటం అనే రెండు పదునైన దుఃఖాలు మనస్సును కోస్తూ ఉంటే మాటిమాటికీ సంజ్ఞతప్పి ఏడుస్తూ నేల మీదపడి దొర్లుతూ అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న కౌసల్యను చూడగనే భరతుడి హృదయంలో అంతులేని వేదన పుట్టింది.

.

నేలమీద పడి ఉన్న మహారాణి కౌసల్య మహాధానుష్కుడు,జగదేకవీరుడైన రాముడి కన్నతల్లిని అలా చూడలేక పోయాడు భరతుడు.వెంటనే జలజలకన్నీరు కారుస్తూ కౌసల్యను లేవనెత్తి ఆవిడను కౌగలించుకొన్నారు భరతశత్రుఘ్నులిరువురూ..

.

భరతుని చూడగనే కౌసల్య నాయనా ఏ శత్రుబాధలేని రాజ్యము నీకు లభించినదికదా ! ఏమి ఆశించి నా కొడుకుకు నారచీరలు కట్టబెట్టి నీ తల్లి వాడిని అడవులకు పంపింది .నా కొడుకున్నచోటికే నన్ను కూడ పంపివేయి. ఈ రాజ్యము హాయిగా నీవు ఏలుకోవచ్చు.

.

పుండును కెలికి సూదితో గుచ్చినట్లున్నాయి కౌసల్యామాత మాటలు .భరతుడి వేదన అంతకంతకూ హెచ్చింది .దానికి అంతం లేకుండా పోయింది...

.

పెద్దతల్లికి చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మా ఏ పాపము తెలియని నన్నెందుకు నిందిస్తావు.అన్నమీద నాకు గల ప్రేమ,భక్తి నీవెరుగనివా?

.

అమ్మా అన్నగారి అరణ్యవాసానికి నా సమ్మతి ఉన్నట్లయితే..

.

సూర్యభగవానుడి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసేవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది

.

జీతము ఇవ్వకుండా పని చేయించుకొన్న యజమానికి ఏ పాపము చుట్టుకుంటుందో అది నాకు కలుగుతుంది.

.

మాట ఇచ్చి తప్పినవాడికి ,ప్రజల రక్షణ మరచిన రాజుకు ఏ పాపము చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

రణరంగంలో పోరాడి మరణించక వెన్నుచూపి పారిపోయినవాడికి ఏ పాపం చుట్టుకుఙటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

ఆవులను కాలితో తన్నినవాడికి,పెద్దలను దూషించినవాడికి,మిత్రద్రోహము చేసిన వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

ఎదుటివాడు విశ్వాసముంచి చెప్పిన రహస్యాన్ని బహిర్గతపరచినవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

ఇంటిలోని భార్యాపిల్లలకు,అతిధులకు,బంధువులకు ఎవ్వరికీ పెట్టకుండా తానొక్కడే మృష్టాన్న భోజన మారగించే వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకొను గాక.

.

అమ్మకూడని వస్తువులు .లక్క,మధువు,లోహము,విషము,మాంసము అమ్మేవాడికి ఏ పాపము చుట్టుకుంటుందో అది చుట్టుకొను గాక.

.

నాకు ఆ ఉద్దేశ్యమే ఉండి నట్లయితే కుండ పెంకు చేతబట్టి చినిగిన గుడ్డలు కట్టి భిక్షమెత్తుకొంటూ ,పిచ్చివాడివాలే భూమి మీద తిరుగుదును గాక..

.

సంధ్యా సమయాలలో నిదురించే వాడికి కలిగే పాపము నాకు కలుగు గాక.

.

పరభార్యా సంగమము చేసిన వానికి ఎట్టిపాపము కలుగునో అట్టిపాపము నాకూ కలుగు గాక.

‌.

ఈ విధంగా కౌసల్యను ఓదర్చటానికి ప్రయత్నం చేస్తూ దుఃఖ భారంతో తానుకూడ నేలమీద పడిపోయాడు భరతుడు.

.

జానకిరామారావు వూటుకూరు

రోడ్డు మీద బోటులో


 

క్రొత్త





 

అన్నీ







 

నీటి లో







 

మేటి






 

నేటి బాధలు

















































 

మంచికథ...

 మంచికథ...👉


భర్త రిటైర్‌మెంట్‌ దగ్గరికొచ్చేసరికి శకుంతలకి దిగులు ఎక్కువైంది. కొన్ని రోజుల క్రితమే భర్త చెప్పిన మాటలు చెవుల్లో మోగుతున్నాయి. అప్పట్నుంచి ఆమెకు నిద్రకూడా సరిగా పట్టడంలేదు.

'రిటైరైన తర్వాత పెన్షన్‌ ఎంత వస్తుంది?' అని అడిగింది లక్ష్మణ్‌ని.

'పదిహేను వందలు వస్తుందేమో?' అన్నాడు లక్ష్మణ్‌. ఆమె గుండె గుభేలుమన్నది.

'అంతేనా?' అన్నది.

'ఔనే. నాది గవర్నమెంట్‌ ఉద్యోగం కాదుగా! కార్పోరేషన్‌లో ఉద్యోగం. మాకు పెన్షన్‌ నామమాత్రం. ప్రావిడెంట్‌ ఫండ్‌ పెన్షన్‌ అని వస్తుంది.'

'వేలు వస్తున్నప్పుడే సంసారం అంతంతమాత్రంగా నడుస్తున్నది. వందల్తో ఎట్లా బతికేది?' దిగులుగా అన్నది

'రిటైరైన తర్వాత వచ్చే డబ్బులు బ్యాంకులో వేసుకుని వడ్డీతో బతకాలి' అన్నాడు.

ఐతే ఆ డబ్బు బ్యాంకులో డిపాజిట్‌ చేసే పరిస్థితి కనిపించడం లేదు శకుంతలకు. నలుగురు పిల్లలకూ ఆ వచ్చే డబ్బు మీద కన్నుంది.

పెద్ద కొడుకు నరసింహారావు అడిగేశాడు గూడా.

'అమ్మా! ఎంతకాలం లారీ డ్రైవర్‌గా పనిచెయ్యనూ? వచ్చే జీతం ఖర్చులకే సరిపోవడంలేదు. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. చదువులకు చాలా డబ్బు అవసరం అవుతున్నది. నాన్న రిటైరైన తర్వాత వచ్చే డబ్బుతో స్వంత లారీ కొనుక్కుందాం. అప్పుడు అంతా లాభమే. నాన్న, నువ్వు నా దగ్గరేే ఉండొచ్చు. ఏమంటావు?'

'నేనేమంటాను. ఇంకా టైముందిగా? నాన్నతో మాట్లాడదాం.' అన్నది శకుంతల.

ఆమెకు ఆ లారీ వ్యాపారం మీద నమ్మకం లేదు. అది అందరికీ కలిసి రాదు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కిరాయిల డబ్బు కళ్లబడుతుంటే, అంతా మనదే అని విలాసాలకు అలవాటు పడి ఖర్చులు పెంచుకుంటారు. ఒక్కోసారి ప్రమాదాలూ జరుగుతుంటాయి. లారీ వ్యాపారంలో నష్టపోయిన కుటుంబాలు ఆమెకు చాలా తెలుసు.

రెండో కొడుకు శివరావు గూడా టెండర్‌ పెట్టాడు.

'అమ్మా! నాన్నకు రిటైరైన తర్వాత డబ్బు వస్తుందిగా. అది నాకు ఇవ్వమను. కాంట్రాక్టులు మొదలు పెడతాను. చాలా లాభాలు వస్తాయి.'

శివరావు ఒక కనస్ట్రక్షన్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. వాడికీ సొంత వ్యాపారం చెయ్యాలని బుద్ధి పుట్టడం ఏమిటో? అని శకుంతలకు అసహనంగా ఉంది. ఆ కంపెనీ పెద్దదే. పేరున్నదే. జీతం బాగానే వస్తున్నది. ఒక ఫ్లాట్‌ కొనుక్కుని ఉంటున్నారు గూడా.

'ముందు రిటైర్‌మెంట్‌ కానీ, డబ్బు చేతికి వచ్చేసరికి ఆరేడు నెలలు పడుతుంది. అప్పుడు చూద్దాం.' అన్నది కొడుకుతో.

పెద్ద కూతురు రామలక్ష్మి ఏం అడుగుద్దో అని శకుంతలకు లోలోపల భయంగా వుంది. మనుమరాలు శ్రావణి బి.టెక్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉంది. క్యాంపస్‌ సెలక్షన్లో జాబ్‌ వస్తే సరి. లేకపోతే అమెరికా వెళ్లి ఎమ్‌.ఎస్‌ చేస్తానంటోందట. ఆ సంగతి తన చెవిన వేసింది రామలక్ష్మి. కనీసం పదిలక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందట. ఆ పిల్లకు జాబ్‌ రాకపోతే కూతురు వచ్చి తమ మీద పడుతుంది.

'నాన్నకు డబ్బులు వచ్చాయిగా?' బ్యాంకులో వేస్తే ఏం వడ్డీ వస్తుంది. నా కూతురికి అప్పుుగా ఇవ్వండి. తర్వాత లక్షలు సంపాదిస్తుంది అనడం ఖాయం.

చిన్న కూతురు ఆలోచన ఏమిటో తెలీదు. పిల్లల మనసులో మెదులుతున్న ఆలోచనలు ఎప్పటికప్పుడు భర్తతో చెప్తూ ఉపశమనం పొందుతోంది శకుంతల.

'ఎప్పటి సంగతో కదా? చుద్దాంలే' అంటున్నాడు. లక్ష్మణ్‌

అతనికీ మనసులో ఆందోళనగానే ఉంది. చేతిలో ఉన్న డబ్బు పిల్లలకు ఇచ్చి పంచలో పడి అవమానాల పాలవుతున్న తల్లిదండ్రుల కథలు అతనికి ఎన్నో తెలుసు. తనకూ అదే గతి పట్టదన్న నమ్మకం ఏముంది?

ఎవరో అన్నట్టుగా భూమిని బంగారం పరిపాలిస్తున్నదట. డబ్బు ఉంటేనే విలువ లేకపోతే పనికిమాలిన వెధవ. ఆసంగతి తెలిసినా డబ్బు విషయంలో మోసపోతూ కష్టాలు పడుతూనే ఉంటాడు అమాయక చక్రవర్తి.


లక్ష్మణ్‌ ఆ రోజు రిటైరయ్యాడు. ఆ సందర్భంలో అతనికి శాలువా కప్పి, పూలదండ వేసి, మెమెంటో యిచ్చి కారులో ఇంటికి పంపారు ఆఫీసువాళ్లు. అది ఆఖరి మర్యాద. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లతో, మనవలతో ఇల్లు ఎంతో సందడిగా ఉంది. అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఉత్సాహంగా ఉన్నారు. ఆ రాత్రి డిన్నర్‌ చేస్తున్న వంటకాలతో ఆ వీధి అంతా ఘుమఘుమలాడి పోతోంది.

లక్ష్మణ్‌ కుటుంబంతో పాటు ఊళ్లో ఉన్న వియ్యంకులు, వియ్యపురాళ్లుగూడా ఆనందం పంచుకుంటూ కబుర్లాడుకుంటూ, జోక్స్‌ వేసుకుంటున్నారు. చాలా అరుదైన జీవితంలో ఒకేసారి వచ్చే పదవీ విరమణ సందర్భం అది. ఆత్మీయులంతా ఒక్కచోట కలవడం అందరికీ అరుదుగా దొరికే సమయం.

ఇంతలో ఇంటి ముందు కారు ఆగింది. లక్ష్మణ్‌ చిన్ననాటి స్నేహితుడు రాజారావు కారు దిగాడు.

'రా..రా..రాజా!' అంటూ లక్ష్మణ్‌ ఎదురు వెళ్లాడు.

'అంకుల్‌... రండీ..' అని పిల్లలు కూడా రాజారావుని ఆహ్వానించి హాల్లో కూర్చోబెట్టారు.

'అన్నయ్యా బాగున్నారా? మా ఇంటివైపు రావడమే లేదు.' అని శకుంతల పలకరించింది.

'ఏం రావడమమ్మా? ఎన్నిసార్లు కలిశాను వీడిని. సిగ్గులేదు మీ ఆయనకి.' సీరియస్‌గా అన్నాడు రాజారావు.

బిందెడు నీళ్లలో ఒక విషపు చుక్క పడినట్టు అక్కడ వాతావరణం కలుషితమైపోయింది. అక్కడున్న అందరిలో ఆనందం ఆవిరైపోయింది. అందరిలో ఆందోళన మొదలైంది.

'ఏమైంది అన్నయ్యా?' అన్నది శకుంతల నిర్ఘాంతపోయి.

'ఏమవ్వాలమ్మా! ఇద్దరి కూతుళ్ళ పెళ్ళిళ్లుచేశాడు. ఎట్లా చేశాడో మీకు తెలుసా! ఇద్దరు కొడుకులున్నారు సంపాదిస్తున్నారు. పెళ్లికి డబ్బు ఎలా? అని తండ్రిని అడిగారా? స్నేహితుడిని గదా! అని ఆదుకున్నాను. ఇవిగో ప్రామిసరీ నోట్లు ఎందుకు నాలుక గీచుకోవడానికి కూడా పనికిరావు. నేను చేసేది ఫైనాన్స్‌ వ్యాపారం. నాకు పార్టనర్స్‌ ఉన్నారు కదా! వాళ్లకి నేనేం చెప్పేది వీడు డబ్బు తీసుకోవడమే కానీ, వడ్డీ గూడా ఇచ్చి ఎరుగడు ఏదేదో సాకులు చెప్తాడు. కూతుళ్లు పురిటికి వచ్చారనీ, మనమరాలు పెద్దదైందనీ, పెళ్లానికి జబ్బు చేసిందనీ, చాలా ఖర్చయిందనీ చెప్తుంటాడు. కొడుకుల్ని అడుగుతాడో లేదో తెలీదు. ఆఖరికి రిటైరైన తర్వాత వచ్చే డబ్బుతో బాకీ తీరుస్తానన్నాడు.' ఘాటుగా చెప్పి ప్రామిసరీ నోట్లు శకుంతల చేతిలో పెట్టాడు.

గాలివాన వెలిసినట్లయింది. కానీ, ఎవరికీ సంతోషంగా లేదు. లక్ష్మణ్‌ అంత అప్పుున్నట్లు ఎవరికీ తెలీదు. మనిషి గుంభనంగా ఉంటాడు. అన్ని విషయాలు భార్యకీ చెప్పడు. కానీ, తన బాధ్యత బాగానే నెరవేర్చాడు అని బంధువులు చెప్పుకుంటారు. ఏ బంధువునీ కొడుకుల్నీ డబ్బు అడక్కుండా ఇద్దరు కూతుళ్లకు పెళ్ళి చేశాడు. ఇప్పుడే అందరికీ తెలిసింది స్నేహితుడు రాజారావు దగ్గర అప్పుుచేశాడని. ఎందుకు చేశావని ఎవరూ నిలదీసే పరిస్థితిలేదు.

ఆ రాత్రి డిన్నర్‌ ఎవరికీ రుచికరంగా లేదు. చప్పగా ఉంది తెల్లవారి ఎటువాళ్ళటు వెళ్లిపోయారు.

శకుంతల దిగులుగా ఉంది. పదిహేను వందలతో ఎట్లా బతకడం?

'ఎందుకే వెర్రి మొఖమా దిగులుపడుతున్నావ్‌? తిండికి లేక చచ్చిపోములే. నేనున్నాను కదా?' అని నవ్వాడు లక్ష్మణ్‌.

భర్త అంత ధీమాగా ఎట్టా ఉండగలుగుతున్నాడో? శకుంతలకు అర్థం కాలేదు.

'అదికాదు, పదిహేను వందలతో ఎట్లా బతుకుతాం?' అన్నది.

'మనకు ఇద్దరు కొడుకులున్నారు. చెరొక ఆరు నెలలు ఉందాం. మనకు డబ్బెందుకు? పదిహేను వందలే ఎక్కువ. అదిగూడా మనవలకు చాక్లెట్లు, బిస్కెట్లు కొనివ్వడానికే.' అన్నాడు లక్ష్మణ్‌.

కోట్లు కోట్లు ఆస్తి ఇచ్చిన తల్లిదండ్రులనే రోడ్డుమీదకు ఈడ్చిన వాళ్లని, బతికుండగానే శ్మశానంలో తల్లిని వదిలి వెళ్లిన బిడ్డల గురించి టీవీల్లో చూసిందీ, బైటపడని కథలెన్నో ఇటువంటివే. అసలు ఏ ఆస్తీలేదు ఇవ్వడానికి. కొడుకులు తమని జీవితాంతం ఆదరిస్తారా? శకుంతల మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి.

'రిటైర్‌మెంట్‌ డబ్బు వచ్చి వాళ్ళకి యిచ్చివుంటే అదివేరేగా వుండేది. రూపాయి ఇవ్వడం లేదు మనం. కొడుకు మనవాడైనా కోడలు పరాయిదే. ఎట్లా చూస్తారో మనల్ని?' అని అనుమానం వ్యక్తం చేసింది భర్త ముందు.

'ముందే అనుకోవడం ఎందుకు? వెళ్ళివుందాం. చూద్దాం. కనిపెంచి పెద్ద చేసిన తల్లదండ్రుల్ని ముసలితనంలో చూడాల్సిన బాధ్యత కొడుకులదే కదా? నేను ఒక్కడినే కొడుకుని అయినా మా అమ్మనానల్ని చివరివరకూ పోషించాను కదా!' అన్నాడు లక్ష్మణ్‌.

'మీ తరం వేరు. ఇప్పుడు అంతా మారిపోయింది. డబ్బుని బట్టే బంధాలు. ఎన్ని చూట్టం లేదూ?' అన్నది శకుంతల.


ఇద్దరి కొడుకుల దగ్గర చెరొక ఆర్నెల్లు వుందామని వెళ్ళిన లక్ష్మణ్‌ దంపతులు అనుమానపడినట్లే అయింది. పెద్దకొడుకు దగ్గర నెల రోజులు ఉండేసరికి గగనం అయింది. అప్పులు చేసి కూతుళ్లకీ పెట్టారని మొగుడు పెళ్ళాం ఇద్దరూ ముఖం మీదే విమర్శించడం మొదలుపెట్టారు. అక్కడ వుండలేక రెండో కొడుకు దగ్గరికి వెళ్ళారు. పది రోజులకే వాళ్ళ తత్వం తెలిసింది. తిరిగి ఇంటికి వచ్చేశారు.

లక్ష్మణ్‌ ఆరింటికే లేచి స్నానం చేసి టీ తాగి బయల్దేరాడు.

'నేను రాత్రికే వచ్చేది.' అన్నాడు.

'ఎక్కడికి వెళ్ళేది?'

'ఉద్యోగంలో చేరుతున్నాను. పదిహేను వందలతో ఎట్లా గడుస్తుంది మనకి?' అని నవ్వాడు లక్ష్మణ్‌.

'ఏం ఉద్యోగం?'

'రాజారావుకి హోటల్‌ వుందికదా! భారత్‌కేఫ్‌. అందులో స్టోర్‌ కీపర్‌ ఉద్యోగం. ఇప్పుడు వెళ్ళగానే టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం అక్కడే. రాత్రి కూడా తినొచ్చు గానీ, నీ కోసం ఇంట్లో తింటాను.' అన్నాడు లక్ష్మణ్‌.

శకుంతలకు సంతోషం కలిగింది. రాజారావు ఎంతైనా చిన్ననాటి స్నేహితుడు. అవసరంలో ఆదుకున్నాడు అనుకుంది. లక్ష్మణ్‌ వెళ్ళేసరికి రాజారావు హోటల్లోనే ఉన్నాడు. స్నేహితుడిని ఆలింగనం చేసుకుని లోపలకు తీసుకెళ్ళాడు.

'ఇదిగోరా నీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సర్టిఫికెట్‌. ఐదేళ్ళకు ఫిక్స్‌్‌ చేయించాను. నెల నెలా నీ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌కి వడ్డీ జమవుతుంది. పదిహేను లక్షలకు నెల నెలా పదివేలు వస్తుంది.' అంటూ సర్టిఫికెట్‌ లక్ష్మణ్‌ చేతిలో పెట్టాడు.

'నువ్వు ఐడియా ఇవ్వబట్టి సరిపోయింది. నీకు బాకీ ఉన్నట్టు దబాయించడంతో అంతా నీరు కారి పోయారు. లేకపోతే డబ్బంతా పంచుకునేవాళ్లు' అన్నాడు లక్ష్మణ్‌ చెమ్మగిల్లిన కళ్లతో.

'మనం ఎప్పుడూ గుప్పిటని మూసి ఉంచాలి. లోపల ఏముందో ఎవరికీ తెలియగూడదు. తెరిచామా? అయిపోతాం. గుర్తుంచుకో. డిపాజిట్‌ సంగతి ఎవరికీ చెప్పకు. పెదవి దాటితే పృధ్వి దాటుతుంది అంటారు. ఈ సర్టిఫికెట్‌, నీ బ్యాంక్‌ పాస్‌బుక్‌ ఇక్కడే బీరువాలో ఉంచు. హోటల్లో నా బదులు నువ్వే ఓనర్‌వి. ఇవిగో తాళాలు' అంటూ తాళాలు లక్ష్మణ్‌కి ఇచ్చాడు రాజారావు. 'రాజారావులాంటి స్నేహితుడు మీకున్నాడా?!!

హైద‌రాబాద్‌లో 191.8మిమీ వ‌ర్ష‌పాతం*

 *1903 త‌ర్వాత ఇదే తొలిసారి.. హైద‌రాబాద్‌లో 191.8మిమీ వ‌ర్ష‌పాతం*


*హైద‌రాబాద్‌: హైద‌రాబాద్‌లో ఇలాంటి వాన ఎన్న‌డూ చూడలేదు.  మేఘాలు ఊడిప‌డ్డ తీరు ఈ కాలంలో ఎన్న‌డూ చోటుచేసుకోలేదు.  గ‌త రెండు రోజులు‌గా కురిసిన వాన‌ల‌కు.. పాత రికార్డుల‌న్నీ బ్రేక్ అయ్యాయి. అక్టోబ‌ర్ నెల‌లో హైద‌రాబాద్‌లో ఈ రేంజ్‌లో వాన ప‌డ‌డం గ‌త వందేళ్ల‌లో ఇదే మొద‌టిసారి. 1903లో చివ‌రిసారి ఇలాంటి వ‌ర్షం కురిసిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ ఇవాళ చెప్పింది.  అయితే ఇవాళ ఉద‌యం 8.30 నిమిషాల‌కు హైద‌రాబాద్‌లో వ‌ర్షం నిలిచిపోయింది. ఆ స‌మ‌యానికి న‌గ‌రంలో గ‌త 24 గంట‌ల్లో సుమారు  191.8 మిల్లీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదు అయిన‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఇంత భారీ స్థాయి వాన కుర‌వ‌డం 1903 త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం విశేషం*.  


*ప్ర‌స్తుతం వాయుగుండం తెలంగాణ దాటి క‌ర్నాట‌క‌లోని గుల్బ‌ర్గా దిశ‌గా వెళ్తోంది.  డిప్రెష‌న్ వేగంగా మ‌హారాష్ట్ర దిశ‌కు ప‌య‌నిస్తున్న‌ట్లు ఐఎండీ అంచ‌నా వేస్తున్న‌ది.  రానున్న 12 గంట‌ల్లో వాయుగుండం మ‌రింత బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది.  దీని వ‌ల్ల మ‌ధ్య మ‌హారాష్ట్ర‌, కొంక‌న్‌, గోవా, క‌ర్నాట‌క‌, తెలంగాణ‌లో ప‌లు చోట్ల భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ డైర‌క్ట‌ర్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. మ‌హారాష్ట్ర‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డే ఛాన్సు ఉన్న‌ట్లు ఐఎండీ అంచ‌నా వేసింది*. 

శ్రీ కృష్ణ దేవరాయలు

 .

   ( శ్రీ కృష్ణ దేవరాయలు జీవిత చరిత్ర )

.

మొదటి హరిహర రాయలు 1336-1356

మొదటి బుక్క రాయలు 1356-1377

రెండవ హరిహర రాయలు 1377-1404

విరూపాక్ష రాయలు 1404-1405

రెండవ బుక్క రాయలు 1405-1406

మొదటి దేవరాయలు 1406-1422

రామచంద్ర రాయలు 1422

వీర విజయ బుక్క రాయలు 1422-1424

రెండవ దేవ రాయలు 1424-1446

మల్లికార్జున రాయలు 1446-1465

రెండవ విరూపాక్ష రాయలు 1465-1485

ప్రౌఢరాయలు 1485

సాళువ వంశము

సాళువ నరసింహదేవ రాయలు 1485-1491

తిమ్మ భూపాలుడు 1491

రెండవ నరసింహ రాయలు 1491-1505

తుళువ వంశము

తుళువ నరస నాయకుడు 1491-1503

వీరనరసింహ రాయలు 1503-1509

శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529

అచ్యుత దేవ రాయలు 1529-1542

సదాశివ రాయలు 1542-1570

ఆరవీటి వంశము

అళియ రామ రాయలు 1542-1565

తిరుమల దేవ రాయలు 1565-1572

శ్రీరంగ దేవ రాయలు 1572-1586

రామ రాజు

వేంకటపతి దేవ రాయలు 1586-1614

శ్రీరంగ రాయలు 1 1614-1614

రామదేవుడు 1617-1632

వేంకటపతి రాయలు 1632-1642

శ్రీరంగ రాయలు 2 1642-1646

శ్రీ కృష్ణదేవ రాయలు (పా. 1509- 1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు

పెనుకొండ లో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన

ఆంధ్ర భోజుడుగా మరియు కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు

న్యూనిజ్ ‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు. [1] ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడచు [2] . 240 కోట్ల వార్షికాదాయము ఉంది. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించాడు.

సాహిత్య పోషణ

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి

సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో

జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము,

సత్యవధూపరిణయము,

సకలకథాసారసంగ్రహము , జ్ఞానచింతామణి,

రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. [3] తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగొకొండ ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన , నంది తిమ్మన, ధూర్జటి , మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు , పింగళి సూరన ,

రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు

అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి పొందారు.

భక్తునిగా

కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించాడు. అంతేకాక ధూర్జటి , నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు. [4][5] అనేక దాన ధర్మాలు చేసాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.

నిర్మాణాలు

ఈయన చెన్నకేశవస్వామి వారి దేవాలయం కట్టించాడు.

కుటుంబము

కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవి,

చిన్నాదేవి ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు కమల). [6] కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన

శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు. [7] పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతిని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవిని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు. [8] చాగంటి శేషయ్య , కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు. [6][9] కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం[10] ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు

1524లో మరణించాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు

చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు,

అచ్యుత రాయలును వారసునిగా చేసాడు.

మతము, కులము

శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంట్ అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి [11][12] . శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22-23-24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన

పారిజాతాపహరణంలో మరియు శిలాశాసనాలలో లిఖించబడినది [13][14][15][16][17][18][19][20]

[21] .

సమకాలీన సంస్కృతిలో

శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం నేపథ్యంగా తెలుగులో అనేక సినిమాలు విడుదలైనవి. అందులో కొన్ని

మల్లీశ్వరి , మహామంత్రి తిమ్మరుసు , తెనాలి రామకృష్ణ మరియు ఆదిత్య 369

ఇవి కూడా చూడండి

శ్రీ కృష్ణదేవ రాయల రాజ సేవకులు

మూలాలు

1. ↑ Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258

2. ↑ రాయలవారి వంశము: http://www.eenadu.net/opiniondisplay.asp?myqry=opini2%2Ehtm&opid=2&reccount=2

3. ↑ Hinduism: An Alphabetical Guide By Roshen Dalal

4. ↑ Encyclopaedia of Indian Literature: devraj to jyoti, Volume 2 By Amaresh Datta

5. ↑ The Encyclopaedia Of Indian Literature (Volume Five (Sasay To Zorgot), Volume 5 By Mohan Lal

6. ↑ 6.0 6.1 Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature By William Joseph Jackson

7. ↑ Krishnadeva Raya: the great poet-emperor of Vijayanagara - G. Surya Prakash Rao

8. ↑ Encyclopaedia of Indian Literature: K to Navalram - Amaresh Datta, Sahitya Akademi

9. ↑ Courts of Pre-Colonial South India By Jennifer Howes

10. ↑ Readings in South Indian history - T. V. Mahalingam

11. ↑ Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258

12. ↑ History: UGC-NET/SET/JRF (Paper II and III), 1/e - By Amitava Chatterjee

13. ↑ సర్దేశాయి తిరుమలరావు -ది హిందూ ఆంగ్ల దినపత్రిక

14. ↑ యాదవాభ్యుదయ వాఖ్య - అప్పయ్య దీక్షిత

15. ↑ నరసభూపాలియము - భట్టు మూర్తి

16. ↑ అచ్యుతరాయాభ్యుదయము - రాజనాథ కవి

17. ↑ వరదాంబిక పరిణయం - తిరుమలాంబ

18. ↑ స్వరమేధకళానిధి - రామయామాత్య తొదరమల్ల

19. ↑ బాలభాగవతం - కోనేరునాథ కవి

20. ↑ వసుచరితము - భట్టు మూర్తి

21. ↑ విజయనగర సామ్రాజ్య మూలములు - యస్. కృష్ణస్వామి అయ్యంగార్ - మద్రాసు విశ్వవిద్యాలయము, 1919

లెటర్ టు ద ఎడిటర్, డా.సర్దేశాయి తిరుమలరావు, ద హిందూ ఆంగ్ల దినపత్రిక

హంపి నుండి హరప్పా దాకా -ఆచార్య తిరుమల రామచంద్ర,2013, జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

"శ్రీ కృష్ణదేవరాయలు"- గుత్తి చంద్రశేఖర్ రెడ్డి, బళ్ళారి తెలుగు సంఘము, తెలుగు మహాసభల సంచిక

విజయనగర రాజులు

సంగమ వంశము | సాళువ వంశము |

తుళువ వంశము | ఆరవీటి వంశము |

వంశ వృక్షము | పరిపాలనా కాలము |

సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము |

పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము

ఇంతకు ముందు ఉన్నవారు:

వీరనరసింహ రాయలు విజయనగర సామ్రాజ్యము

1509 

.

పచ్చళ్లు, పొడులు, తినుబండారాలు*

 *హైదరాబాద్ లో బ్రాహ్మణ పచ్చళ్లు, పొడులు, తినుబండారాలు*


బ్రాహ్మణ బంధువులకు నమస్కారం..

మీకు ఇంట్లో అవసరమైన అన్ని రకాల పచ్చళ్లు, పొడులు, తినుబండారాలు ( జంతికలు, చెక్కలు, మురుకులు...మొ.)

పరిశుభ్రమైన వాతావరణంలో మీరు ఆర్డరు ఇచ్చిన తర్వాత శుచిగా తయారు చేసి మీ ఇంటి వద్దకు డెలివరీ ఇవ్వగలము.

ఆనంద్ బాగ్, మల్కాజ్ గిరి, సఫిల్ గూడ,ఈస్ట్, వెస్ట్ మారేడ్ పల్లి, నేరేడ్ మెట్, సైనిక్ పురి, సాయినాధపురం, మౌలాలి హౌసింగ్ బోర్డు,వంటి ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేయగలము. హైదరాబాద్ లో మిగిలిన ప్రాంతాలకు రవాణా చార్జీలు అదనం. 

మీకు అవసరం అయిన ఎడల ఫోన్ చేయగలరు. లేనిచో మీకు తెలిసిన బ్రాహ్మణ గ్రూపుల్లో పోస్ట్ చేయగలరు. 


D.Prasad..

7093948119

Malkajgiri

Anandbagh, 

(Spencers)

సమస్యలు

 *సమస్యలు పరిష్కారాలు:-*


👉 ఎంత ప్రయత్నించినా మీ ప్రయత్నం ఫలితాలు లేదా మీ కృషికి తగిన ఆదాయం పొందలేకపోతే ఇంటి ముందు గానీ ఇరువైపులా గానీ , ఎండిన చెరువు, నదులు, సరస్సులు ఉండి ఉండాలి! అది కనబడకుండా ఉండాలంటే డోర్ కి కర్టెన్లు వేయాలి. అద్దె ఇల్లు అయితే వేరే ఇంటికి మారండి . అటువంటి చిత్రపటాలు కూడా ఇంట్లో ఉండకూడదు. 


👉 ఆర్థిక నష్టాలు తొలగాలంటే , నీళ్ళలో పచ్చిపాలను కలిపి ఇంట్లోని గదులంతటా చిలకరించి తుడిచి వేయండి. గడపను కూడా అదే నీటితో కడిగి పసుపు, కుంకుమ , పుష్పాలతో అలంకరించుకోవాలి. మిగిలిన నీటిని వృక్షాలకు పోయాలి . ధనలాభం కలుగుతుంది. 


👉 దారిద్ర్య బాధలు తొలగాలంటే చాతుర్మాసంలో ప్రతీ మాసంలో మీ జన్మనక్షత్రం రోజున వస్త్రాది దానాలు చెయండి.


👉 ఋణబాధలు తీరాలి అంటే లక్ష్మీదేవి చిత్రపటం ముందు 8 ప్రమిదలను ఆవునేతితో లేదా నువ్వులనూనెతో దీపారాధన చేసి ఒక్కో దీపం వద్ద ఒక్కోక్క తీపి పదార్థం నివేదనగా ఉంచి పూజ అనంతరం కుటుంబ సభ్యులు అందరూ మహాప్రసాదంగా తీసుకుని మిగిలిన పదార్థాలన్నీ పేదలకు పంచండి. ఋణబాధలు నుంచి విముక్తి కలిగి సంతోషకరమైన జీవితం పొందుతారు ఈ విధంగా 4 వారాలు చేయండి.


👉 శతృపీడలు అధికమైతే విభూది లింగమును పూజించి నదిలో నిమజ్జనం చేయడం మంచిది.


👉 అనవసరమైన ఖర్చులు పెరుగుతుంటే ప్రతీ మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణము చేయవలెను. అదే రోజు పేదవారికి ఏదైనా దానం చేయాలి. మరుసటి రోజు అంటే ఋధవారం కూడా జానపదులు పాడే వారికి కానీ , బుడబుక్కల వారికి గానీ లేదా గంగిరెద్దుల వారికి కానీ కొంత డబ్బు సహాయం చేయండి. ఈ విధంగా 7 మంగళవారాలు , 7 బుధవారాలు చేయడం వల్ల ఆకస్మికంగా ధనం ధాన్యం లభ్యం అవుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఆదాయం పెరుగుతుంది. 


👉 బ్యాంకు ఋణములు పొందుటకు ఎంత ప్రయత్నించినా ఫలితం అనుకూలంగా కనిపించకపోతే బుధ వారం రోజు రాత్రి శనగలను నానబెట్టి గురువారం ఉదయం కపిల గోవునకు తినిపించి గంగడోలును స్పురించండి.అలా రెండు సార్లు చేస్తే ప్రయోజనం ఉంటుంది .


👉 ఆదివారం రవిహోరలో ఉదయం 10:30, 11.00 గంట సమయంలో సేకరించిన తెల్లజిల్లేడు చెట్టు వేరును అష్టగంధంతో కలిపి తావీజు నందు బంధించి మెడ లేదా నడుముకు ధరిస్తే దారిద్ర్యం నశించి , శతృవులపై విజయం కలిగి వారి ద్వారానే ధనలాభం కలుగుతుంది.


*ఆదిరాజు ప్రసాద్ శర్మ*

*శ్రీ బాలా త్రిపురసుందరి పీఠం*

*విజయనగరం*

ధనాభివృద్ధికి

 లక్ష్మీ దేవి అనుగ్రహానికి ధనాభివృద్ధికి "వైజయంతి మాల" 


వైజయంతి విత్తనాలు శ్రీ కృష్ణుని జన్మస్ధానమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉన్న బ్రాజ్ అరణ్య ప్రాంతంలో లబిస్తాయి. వైజయంతి విత్తనాలు రాధ కృష్ణుల ప్రేమకు ప్రతిరూపమని భావిస్తారు.


క్షీరసాగర మథనంలో క్షీరసముద్రంలో లక్ష్మీదేవి మొదలైన ఎన్నో వస్తువులు పుట్టడం మహాలక్ష్మి పుట్టినవెంటనే ఆమెకు మంగళస్నానము చేయిస్తారు.


"కట్టంగ పచ్చని పట్టుపుట్టము దోయి ముదితకుఁ దెచ్చి సముద్రుఁడిచ్చె

మత్తాళినికరంబు మధు వాన మూఁగిన వైజయంతీమాల వరుణుఁడిచ్చెఁ"


లక్ష్మీదేవికి సముద్రుడు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు.


వైజయంతి మాల లక్ష్మీదేవి స్వరూపంగా దీపావళి రోజు పూజ చేసి బీరువాలోగానీ,మెడకు గాని ధరించవచ్చును. వైజయంతి మాలను దీపావళి రోజు గాని,శుక్రవారం రోజుగాని లక్ష్మీదేవి పటానికి గాని,శ్రీచక్రమేరువుకి గాని అలంకరించి లలితా సహస్త్రనామంతో గాని,లక్ష్మీ అష్టోత్తరంతో గాని కుంకుమార్చన చేసి వైజయంతీ మాలను మెడకు దరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వైజయంతిమాలను లక్ష్మీ దేవి అలంకరణలో గాని,పూజలో గాని తప్పనిసరిగా ఉపయోగించాలి.


వైజయంతి మాల పూసలను చిన్నపిల్లలకు చెవిపోగు,లాకెట్ లాగా చేపించి వేసిన బాలారిష్ట దోషాలు,నరదృష్టి,చొంగకార్చటం తగ్గుతుంది.


వైజయంతిమాలను వివాహం కానివారు నిత్యకళ్యాణం జరిగే దేవాలయంలో ఈ మాలను ధరించి కళ్యాణం చేపించుకున్న యెడల వారికి సత్వర వివాహం జరుగుతుంది.వైజయంతిమాలను దరించి రుక్మిణీ కళ్యాణం ఇంటిలోగానీ,దేవాలయంలో గాని చేపించుకొన్న వివాహ సంబంద ఆటంకాలు తొలగిపోతాయి.


దంపతుల మద్య తరచూ గొడవలు ఉన్న వారు వైజయంతిమాలను ధరించటం వలన వారి మద్య ఉన్న అపోహలు,గొడవలు తొలగిపోయి ఇద్దరు ఒకరికొకరు మంచి అవగాహనతో ప్రేమాను రాగాలతో దాంపత్య సౌఖ్యాలను అనుభవిస్తారు.


వైజయంతిమాలను వ్యాపార సంస్ధలలోని పూజ మందిరంలో దేవుడి పటాలకు,విగ్రహాలకు అలంకరించిన వ్యాపారాభివృద్ధితో పాటు ధనాభివృద్ధి కలుగుతుంది.


జాతకచక్రంలో శుక్రగ్రహ దోషాలు,సప్తమభావ దోషాలు ఉన్నవారు వైజయంతిమాలను ధరించటం మంచిది. శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు వైజయంతి మాలను మెడకు గాని,బ్రాస్ లెట్ గాగాని,లాకెట్ గాగాని ధరించిన శుక్రగ్రహ దోషాలు తొలగి పోతాయి.


వైజయంతిమాలను ధరించినవారికి సమగ్రమైన ఆలోచనా విదానంతో ప్రతి పనిని అంచనా వెయ్య గలిగే సామర్ద్యం కలిగివుంటారు.వైజయంతిమాలను దరించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనాభివృద్ధి కలుగుతుంది.

మహాలక్ష్మి

 శ్రీ మహాలక్ష్మి తంత్రం 


సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే అష్టఐస్వర్యాలు సిద్ధిస్తాయని భావిస్తారు. లక్ష్మీ కటాక్షంకోసం అనేక ప్రార్థనలు చేస్తారు.


అయితే కొన్ని విధాలుగా పూజిస్తే లక్ష్మీదేవిప్రసన్నమవుతుందట.


కుబేరుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే లక్ష్మీ సంతోషిస్తుందట. ప్రపంచంలోని అన్ని సంపదలు కుబేరుడు అధీనంలో ఉంటాయి. కుబేరుడు ఉండే స్థానంలో పరిశుభ్రతను పాటించాలి.


చిన్న కొబ్బరికాయలు అంటే సాధారణ వాటి కన్నా చిన్న పరిమాణంలో ఉండేవి. వీటిని శ్రీఫలంగా వ్యవహరిస్తారు. శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి సంబంధించిందని అర్థం.


అందుకే వీటితో పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లో కొలువుంటుందట. ఆకర్షణ కోసం పాదరసంతో శరీరంపై పచ్చబొట్టు, చిత్రాలను ప్రత్యేకంగా వేయించుకుంటారు.


మెర్క్యూరీ లక్ష్మీ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే దీనికి దేవి ఆకర్షితమవుతుంది. పిల్లలు ఆడుకునే గవ్వలు సముద్రం నుంచి లభిస్తాయి.


అలాగే లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుంచే ఉద్భవించింది కాబట్టి వీటిని పూజగదిలో ఉంచితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.


మోతీ శంఖాన్ని మంత్ర, తాంత్రిక పూజల్లో ప్రత్యేకంగా వినియోగిస్తారు. ఇవి చాలా అద్భుతమైన శంఖంగా నమ్ముతారు. వీటిని కూడా ఇంట్లో ఉంచితే శ్రీలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందట.


వెండితో తయారు చేసిన గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలు చాలా పవిత్రమైనవి. వీటిని రోజూ పూజిస్తే సిరిసంపదలకు లోటే ఉండదట.


తాంత్రిక శాస్త్రంలో శ్రీ యంత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. అన్ని యంత్రాలకు రాజుగా దీనిని పేర్కొంటారు. పూజ గదిలో ఈ యంత్రాన్ని ఉంచితే సిరి తరలివస్తుందట.


వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి పాదుకలు సరైన దిశలో ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీ శాశ్వతంగా ఉండిపోతుందట.


కలువ పూల విత్తనాలు దండను పూజకు వినియోగిస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి నడిచివస్తుందట. ఎందుకంటే లక్ష్మీ కమలంలో నివాసం ఉంటుంది.


దక్షిణ దిశగా నోరు ఉండే శంఖం పూజ గదిలో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ వెలుస్తుంది. తంత్ర శాస్త్రంలో దీనికి చాలా ప్రత్యేకత ఉంది.


*ఆదిరాజు ప్రసాద్ శర్మ*

హిందూ ధర్మం గురించి


 

వరద భీభత్సం









 

ప్రపంచం లో మొదటి సారి రోడ్డు దాటుతున్న సిగినల్


 

కావ్య కంఠ గణపతి ముని

 



కావ్య కంఠ గణపతి ముని ఒకసారి అరుణాచలం వెళ్లారు. వారితోపాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు. ఆయనకు జఠరాగ్ని ఎక్కువ. ఆ పిల్లాడు అన్నయ్యా ఆకలేస్తోంది అంటున్నాడు. ఆ రోజున ఏకాదశి తిధి. అందుకని ఆయన తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక డజను అరటిపళ్ళు కొన్నారు. వాడు అవన్నీ తినేశాడు. తినేసి ఒక గంట గడిచేసరికి మళ్ళీ అతడు అన్నయ్యా ఆకలేస్తోంది అన్నాడు. అపుడు గణపతి ముని బ్రాహ్మణుల ఇంటి ముందుకు వెళ్లి 'భవతీ బిక్షామ్ దేహీ' అంటూ ఎవరైనా అన్నం పెడితే తమ్ముడికి పెడదామని యాచన చేస్తున్నారు. ఆ రోజు ఏకాదశి. ఎవ్వరూ అన్నం పెట్టలేదు. వీడు ఏడుపు. అపుడు ఆయన ఒక శ్లోకం చదివారు. బ్రాహ్మణ గృహంలో ఎవరైనా అకస్మాత్తుగా వస్తే పెట్టడాడనికి కొద్దిగా అన్నం ఉండేటట్లుగా వండాలి."ఆఖరికి కలియుగంలో వీళ్ళ అన్న పాత్రలలో అన్నం కూడా లేదన్నమాట! ఒక్కడు కూడా అన్నం పెట్టలేదు" అని ఆయన అనుకున్నారు.


ఆయన ఒక ఇంటి ముందునుంచి వేడుతున్నారు. ఆ ఇంటి అరుగుమీద ఒక వృద్ధ బ్రాహ్మణుడు పడుకుని ఉన్నాడు. ఆయన గభాలున లేచి కావ్య కంఠ గణపతి మునిని పట్టుకుని అన్నాడు. 'నీవు బాగా దొరికావు. నా భార్య కు ఒక నియమం ఉంది. అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం పారణ చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేస్తుంది. కానీ భోజనం చేసేముందు ఆవిడకు ఒక నియమం ఉంది. ఆవిడ ఎవరైనా ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది. ఇవ్వాళ తిరువణ్ణ మలైలో యాత్రికులు కూడా దొరకలేదు. ఎవ్వరూ దొరకలేదు. నువ్వు ఆకలని తిరుగుతున్నావు. మా ఇంట్లో కి రా! అని తీసుకు వెళ్ళాడు. ఆ ఇంట్లోని ఇల్లాలు స్నానం చేసి రండి.భోజనం వడ్డిస్తాను' అంది.

కావ్యకంఠ గణపతి ముని, ఆయన తమ్ముడు గబగబా వెళ్లి స్నానం చేసి తడిబట్టతో వచ్చారు. ఆవిడ మడి బట్టను ఇచ్చింది. అవి కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. ఆవిడ షడ్రషోపేతమైన భోజనం పెట్టింది.

 భోజనం ఐన తరువాత ఆవిడ చందనం ఇచ్చింది. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే భోజనం అయ్యాక చందనం పెట్టాలి. వారు అది చేతులకి రాసుకుని లేవాలి. అది ఇంటి యజమానే తీస్తే దానివలన ఎంతో గొప్ప శ్రేయస్సు ను పొందుతాడు. వాళ్ళు చందనం రాసుకున్నాక ఆవిడ తాంబూలం ఇచ్చింది.

 వీళ్ళు కడుపునిండా తినేసారేమో కళ్ళు పడి పోతున్నాయి. 'అమ్మా , ఇంక ఎక్కడికీ తిరగలేం. ఈ రాత్రికి మీ అరుగుమీద పడుకుంటామమ్మా!' అన్నారు. ఆవిడ సరేనని ఆవిడ తలుపు వేసేసింది. వీళ్ళిద్దరూ పడుకుని నిద్రపోయారు. గాఢ నిద్ర పట్టేసింది. వీరు నిద్రించిన ఇల్లు అరుణాచలం లో అయ్యంకుంట్ల వీధిలో ఉంది. 


మరునాడు సూర్యోదయం అవుతుంటే వారికి మెలకువ వచ్చింది. ఇద్దరూ నిద్ర లేచారు. 'అమ్మయ్య రాత్రి ఈ తల్లి కదా మనకి అన్నం పెట్టింది' అనుకుని అరుగుమీద నుండి లేచి చూసారు. అది వినాయకుడి గుడి. అక్కడ ఇల్లు లేదు. వాళ్ళు తెల్లబోయి 'రాత్రి మనం షడ్రషోపేతమైన భోజనాలు తిన్నాము. ఇక్కడ రత్నకింకిణులు ఘల్లుఘల్లు మంటుంటే ఎవరో ఒక తల్లి మనకి అన్నం పెట్టింది. ఆ తల్లి ఇల్లు ఏది'అని చూసారు. కలకాని కన్నామా అనుకున్నారు. పక్కకి చూస్తే రాత్రి ఆవిడ ఇచ్చిన తాంబూలాలు ద్రవ్యంతో కూడా ఆ పక్కనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి, ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో , వాడు నోరు తెరచి అడగవలసిన అవసరం లేకుండా, వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెనుక తిరుగుతూ ఉంటాడు. వాడికి ఈశ్వరుని అనుగ్రహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. దానికి ప్రకటనలు అక్కర్లేదు. కాబట్టి అంత స్వచ్ఛమైన భక్తితో , అమ్మవారిపట్ల కృతజ్ఞతతో బ్రతికేవాడు ఎవడున్నాడో వాడిని అమ్మ యే కాపాడుతూఉంటుంది. ఈ స్థితికి ఎదిగితే వాడు చింతాకు పతాకాన్ని అమ్మవారి మెడలో పెట్టినట్టు.


సేకరణ: చాగంటి గారు

 మరొక కళాకారిణి కనుమరుగు అయింది.

ప్రముఖ కూచిపూడి నాట్య కారిణి

శోభానాయుడు ఇక లేరు.



శోభానాయుడు వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించింది. చిన్నతనంలోనే ఆమె నృత్య నాటకాల్లో పాత్రలు పోషించడం మొదలుపెట్టింది. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో ఆమె రాణించింది. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు. నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. ఆంధ్రప్రదేశ్‍కు చెందిన శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నది.


హైదరాబాదు లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ ద్వారా పిల్లలకు శిక్షణ నిస్తోంది. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్ర, జాతీయ పురస్కారాలను అందుకున్నారు.

*నీ కర్మ నిన్ను

 *నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది..*





కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.కృష్ణుడిరాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. 


ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగామారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.


. "ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు. 


ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి "ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. 


మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడు అంతరార్థం. 


మహాభారతం 

జ్ఞానం- వివేకం*

 *జ్ఞానం- వివేకం*


సహజసిద్ధమైన మేధతో కొన్ని విషయాల్లోనో, అనేక అంశాల్లోనో గట్టి పట్టు సాధించడం జ్ఞానం. విద్య, తల్లిదండ్రులు, గురువులు, లోకపరిశీలన వల్ల జ్ఞానం సమకూరుతుంది. శాస్త్రాలను క్షుణ్నంగా, లోతుగా విస్తృతంగా చదివి ఆకళింపు చేసుకున్నప్పుడే ఏ అంశమైనా కరతలామలకం అవుతుంది. ఈ జ్ఞానధారను ఎంత నిష్పత్తిలో, ఎప్పుడు, ఎక్కడ జీవితంలో ప్రవహింపజేయాలో ఎరుక కలిగి విచక్షణతో మసలుకోవడమే వివేకం. వివేకం లేని జ్ఞానం వృథా.

తెలివితేటలు పుట్టుకతో వస్తాయి. వివేకం అలవరచుకోవాలి. వివేకం పుస్తకాల్లో లభ్యం కాదు. 


నలుగురు విద్యార్థులు విద్యాభ్యాసం ముగించుకుని గురుకులాన్ని వీడారు. వారికి మార్గమధ్యంలో ఓ పులి కళేబరం కనిపించింది. మృతి చెందిన వాటికి ప్రాణం పోయగల విద్య వారికి తెలుసు. ప్రాణం పోసి దాని చేతిలో ముగ్గురు తమ ప్రాణాలు కోల్పోయారు. ఒకడు మాత్రం వివేకంతో వ్యవహరించి తనను తాను రక్షించుకోగలిగాడు. జ్ఞానాన్ని ప్రదర్శించడంలో యుక్తా యుక్త విచక్షణ చూపాలి. అదే వివేకంతో ప్రవర్తించడమంటే!


మహాభారతంలోని విదురుడు వివేకజ్ఞుడు. ధర్మసూక్ష్మాంశాలను అర్థం చేసుకున్నవాడు. అంతటి కురుసభలో భీష్మ, ద్రోణ, కృపాదులున్నా- అక్కడివారు మాట్లాడిన మాటల అంతరార్థాన్ని వివేకమనే నేత్రంతో చూసి విడమరచి చెప్పగల నేర్పరి. భీష్ముడంతటివాడే విదురుడి వివేకంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. పాండవులందర్నీ లక్క ఇంటిలో తుదముట్టించాలన్న దుర్యోధనుడి దుర్మార్గం నుంచి వారిని రక్షించి, తరవాతి కాలంలో వారికి ప్రాప్తించిన అరణ్యవాసం లోను, అజ్ఞాత వాసంలోను పాండవులను నడిపించింది విదురుడి వివేకనేత్రమే. ఇంతటి మహత్తర నయనాన్ని ధృతరాష్ట్రుడు తన పుత్రప్రేమ చేత చూడలేకపోయాడు. దాని ఫలితమే కురురాజ్యపతనం, వంశనాశనం.


వివేకవంతుడికి మంచి పట్ల, ధర్మం పట్ల అనురక్తి ఉండాలి. ప్రేమ, కరుణ, ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోగల మనసు కావాలి. న్యాయ కోసం పోరాడే ధైర్యం ఉండాలి. తనకెంతటి జ్ఞానమున్నా మిడిసిపడక, వినయంతో మెలగాలి. తాను చదివిన శాస్త్రాల సారాంశాన్ని త్రుటిలో స్ఫురణకు తెచ్చుకొని సందర్భానుసారంగా అన్వయించుకోగల శక్తి ఉండాలి. మంచి చెడులను నిశితంగా పరిశీలించి విశ్లేషించగలిగే నేర్పు, ఒడుపు ఉండాలి. ఈ లక్షణాల సమ్మేళనమే వివేకం.


‘జ్ఞానోదయాన్ని ఏడురోజుల్లో పొందవచ్చు’ అన్నాడు బుద్ధుడు ఒకసారి తన శిష్యులతో. వారిలో ఒకడు దానికేమి చేయాలని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ‘ఏకాగ్రత’ అని సమాధానమిచ్చాడు. ఆ శిష్యుడు సాధన ప్రారంభించాడు. కాని, ఆ సాధన విచ్ఛిన్నమవుతూ, పెడదార్లు పట్టసాగింది. అనవసర విషయాల పట్ల ఆలోచనలు మళ్ళసాగాయి. సమయం వృథాచేయక, సక్రమంగా సరిగ్గా ఉపయోగిస్తున్నాననుకుంటూ ముందుకు సాగాడు. ఏడు రోజుల్లో జ్ఞానోదయం కలగాలన్న ఆలోచనే మరచిపోయాడు. తాను వెళుతున్న మార్గం అతడికి అనేక విషయాలను బోధించసాగింది.


ఏకాగ్రత ఉన్నవ్యక్తి జ్ఞానిగా మారడానికి ఎక్కువ సమయం పట్టదన్నది బుద్ధుడి మాటల సారాంశం. వాటిలోని లోతును చూడటానికి శిష్యుడికి వివేకం చాలలేదు. బుద్ధుడి వివేకపూరితమైన మాటలు అర్థం కావడానికి అంత సమయం పట్టింది. శిష్యులకు జ్ఞానానికి వివేకం తోడు తప్పనిసరి. అప్పుడే అది రాణిస్తుంది!

(ఈనాడు అంతర్యామి)

✍🏻బొడ్డపాటి చంద్రశేఖర్‌

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది. 9985831828*

అరుణాసురుడు

 పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు.వుండేవాడు.అతడు మహా బలవంతుడు,అతడి ముక్కు,చెవులు,ముక్కు రంధ్రాలు,కళ్ళు అన్నీ చాలా భయంకరంగా కొండ గుహల్లా వుండేవి.అతడి బాహువులుమద్ది చెట్టు కొమ్మల్లాగా,జుట్టు పెద్ద పొదరిల్లు లాగ వుండి,శిరస్సు పర్వత శిఖరం లా ఎత్తుగా వుండేది.తనకు ఎవరితోనూ చావు లేకుండా వరం పొందటానికి అతడు బ్రహ్మను గూర్చి ఒక ఏకాంత ప్రదేశంలో తపస్సు చేయ నారంభించాడు.ఎండనూ,,వాననూ లెక్క చేయకుండా కనుబొమల నడుమ జ్యోతిని దర్శిస్తూ 

బాహ్య లోకాన్ని మరిచి,ఏకాగ్ర చిత్తం తో కాలి బొటన వేలిమీద నిలబడి రెండు చేతులూ పైకెత్తి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు.దానితో లోకాలు తల్లడిల్లి పోయాయి.అతడి తపాగ్ని జ్వాలలకు జగాలు దగ్ధమై పోతున్నాయి.దానితో బ్రహ్మ ప్రత్యక్ష మై వరం కోరుకోమన్నాడు.అరుణుడు ఆనంద పరవశుడై నాకు దేవతల చేత గానీ,రెండు కాళ్ళ జీవాలతో గానీ,నాలుగు కాళ్ళ జీవులతో గానీ.నరులచేత గానీ,మరణం లేకుండా వుండేటట్టు వరం ప్రసాదించు అని వేడుకున్నాడు.తధాస్తు అన్నాడు బ్రహ్మ.

వరగర్వం తో కన్నూ మిన్నూ గానకుండా సంచరించ సాగాడు అరుణుడు.శత్రువులైన దేవతల మీదికి దండెత్తి ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు.దిక్పాలకులందరినీ జయించి ముల్లోకాలకూ అధిపతి అయ్యాడు.అతడి దుష్కృత్యాలకు తాళలేక దేవతఃలందరూ జగజ్జనని ప్రార్థించారు.నీవుతప్ప మాకు ఎవరూ దిక్కులేరు అమ్మా నేవే మమ్మల్ని కాపాడాలి అని విధవిధాలుగా ఆమెను స్తోత్రం చేశారు.

వారిమీద దయ కలిగి అంబిక ప్రత్యక్ష మైంది.ఆమె కోటిసూర్యుల ప్రకాశం తో చూడ నలవికాని తేజస్సు తో 

ప్రకాశిస్తూ వుంది.ఆమె వారి కోరిక విని అరుణుడిని అంతం చేస్తానని అభయం యిచ్చింది.

వెంటనే అంబిక యుద్ధ సన్నాహం గావించింది.భూమ్యాకాశాలు దద్దరిల్లేలా వికటాట్టహాసం చేసింది.

ఆ ధ్వనులకు సముద్రాలు అల్లకల్లోల మయ్యాయి,రాక్షసుల హృదయాలు బ్రద్దలయ్యాయి.ప్రళయ కాలం లోని వైపరీత్యాలను తలపించే శబ్దాలు విని అరుణుడి మనస్సు వికలమైంది.ఆ ధ్వనులు వచ్చిన 

ప్రదేశానికి చతురంగ బలాలతో తరలి వచ్చాడు.ఉభయ సేనలు పోరు ప్రారంభించారు.పోరు ఘోరంగా సాగింది.రాక్షస బలాన్ని యెదిరించ లేక దేవతలు దీనావస్థ లో వుండటం చూసి పరాశక్తి సింహ నాదం చేస్తూ 

అసుర సైన్యాన్ని కుప్పలు కుప్పలుగా నరికివేసింది.రుద్రుడు అనేక రూపాలు దాల్చి వచ్చినట్లుగా అయి 

శత్రు మూకలను చెల్లాచెదరు చేసేసింది.అరుణుడు పంపిన అతని అమాత్యులనందరినీ తేజోమూర్తి యై ఎదుర్కొని అందరినీ నేల కూల్చింది.ఆమె చూడ శక్యం గాని తేజం తో విజ్రుభించడం చూసి అరుణుడు స్వయంగా ఆమెను ఎదుర్కొన్నాడు.ఒకరిపై ఒకరు ఎన్నో దివ్యాస్త్రాలను ప్రయోగించారు.జగదంబ వాడిని 

ఎన్ని మార్లు సంహరించినా అరుణుడు మరో రూపంతో వచ్చి యుద్ధం చేయసాగాడు.అది చూసి అంబిక ఆశ్చర్య పోయి వీడు అస్త్ర శస్త్రాల చేత చావడని తెలుసుకొని వెంటనే మహా భ్రామరీ రూపాన్ని ధరించి చూడనలవి కాని కాంతి పుంజాలను వెదజల్లుతూ పెద్ద గుహ వంటి నోటితో తన రెక్కలగాలికి పర్వత శ్రేణు లే కదిలేట్టు చేస్తూ చెవులు చిల్లులు పడేట్టు ఝంకారం చేస్తూ మహా వేగంగా అరుణు డిపై దాడి చేసింది.

దాంతో అరుణుడు నిశ్చేష్టు డయ్యాడు.వ్యాకులత చెందిన మనస్సుతో దిగ్భ్రాంతు డయ్యాడు.అదే సమయం లో దర్శన మాత్రం తోనే దీనావస్థ నొందిన ఆ దుష్ట రాక్షసుడిని భ్రమర రూపం లో నున్న అంబిక హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన నరసింహుని లాగ వాడి వక్ష స్థలం చీల్చి వేసింది.దాంతో వజ్రాయుధం తో 

రెక్కలు ముక్కలై నెల గూలిన పర్వతం లా భూమిపైకి ఒరిగాడు.

దేవతలు పూల వర్షం కురిపించారు.మహోగ్రమైన భ్రామరీ రూపానికి భయపడి బ్రహ్మాది దేవతలు రక్షించు తల్లీ ప్రసన్ను రాలివై సాక్షాత్కరించు నీ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించు అని వేడుకున్నారు.

వారి స్తుతికి ఆనందించి జగదంబ ఉగ్ర రూపాన్ని వదిలి జగన్మోహనాకార మైన దివ్య రూపంతో వారి ఎదుట ప్రత్యక్ష మైంది.వారు సంతోషించి తల్లీ!నీవు భూలోకం లో భక్తులను అనుగ్రహించడానికి ఎక్కడైనా ఒక 

చోట నిలువవలిసింది అని ప్రార్థించారు.అప్పుడా జగజ్జనని మీరు కోరిన విధంగా భూలోకం లో సర్వ తీర్థాలూ,నదీనదాలకూ నిలయమైన శ్రీశైల క్షేత్రం లో నివసిస్తాను.అని చెప్పింది.ఆమె అక్కడి శివుడిని మల్లికా పుష్పములతో పూజ చేసింది అందుకనీ ఆ స్వామికి మల్లికార్జునుడనే పేరు వచ్చింది.మామూలుగా కవులు మగవారిని తుమ్మెదలుగాను ఆడవారిని పువ్వులతోనూ పోలుస్తారు.కానీ యిక్కడ అమ్మవారు తుమ్మెద గానూ,అయ్యవారు మల్లికా పుష్పముల పేరు మీద మల్లికార్జునుడు గా ప్రసిద్ధులైనారు.

ఆవిధంగా శ్రీ మలికార్జున మహాదేవుడికి పడమర భాగాన చల్లని తల్లి భ్రమరాంబ గా వెలసి అనాదిగా భక్తుల కోరికలను తీరుస్తూ వారి కొంగు బంగారమై విలసిల్లింది.

అమ్మవారి ఆలయం వెనుక గోడల నుండి యిప్పటికీ భ్రమర ఝంకారం (తుమ్మెద నాదం)వినిపిస్తుందని భక్తుల నమ్మకం 

✍🏻 సుగుణ రూపునగుడి

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది. 9985831828*

చేలిని ఏరిగి

 *చేలిని ఏరిగి స్నేహం చేయలి*

🕉️🌞🌎🏵️🌼🚩


 *ఒకానొక అడవిలో ఓ మర్రిచెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తోంది. అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తోంది. ఒక వేటగాడు రోజూ రాత్రి ఆ చెట్టు దగ్గరకు వచ్చి, అక్కడ ఓ వలను పరచి వెళ్లేవాడు. రాత్రివేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి, ఉదయమే వచ్చి వాటిని చేజిక్కించుకుని చక్కగా పోయేవాడు. ఒక రోజు అనుకోకుండా ఈ రోజసుడు అనే పిల్లి పోయి పోయి ఆ వలలో చిక్కుకుపోయింది. పిల్లి వలలో పడింది కాబట్టి ఎలుక దానిచుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం వెతకసాగింది.* 


 *ఆహారం కోసం అటూఇటూ చూస్తున్న ఎలుక గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. కొద్ది దూరంలోనే ఒక ముంగిస, గుడ్లగూబ దానికి* *కనిపించాయి. అవి ఎలుకని గుటుక్కుమనిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు. అలా అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్లి ‘నేను ఈ వలని కొరికి నిన్ను రక్షిస్తాను. బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ, ముంగిసల బారి నుండి రక్షించవా!’ అని అడిగింది. పిల్లికి అంతకంటే ఏం కావాలి. వెంటనే అది సరేనంది. దాంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది. పిల్లి చెంతనే ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగిస, గుడ్లగూబ జారుకున్నాయి.* 


 *‘నేను నీ ప్రాణాలను రక్షించాను కదా! మరి తొందరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను* *బయటపడేయి,’ అని అడిగింది పిల్లి. ‘ఉండు ఉండు నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా! నిన్ను ఇప్పుడే బయటకు తీసుకువస్తే, నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను,’ అంటూ సంజాయిషీ ఇచ్చుకుంది ఎలుక. అన్నట్లుగానే మరుసటి ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని పుటుక్కున కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. ఇటు ఎలుకా తన కలుగులోకి దూరిపోయింది.* 


 *మర్రిచెట్టు కిందకి చేరుకున్న వేటగాడు కొరికివేసిన వలని చూసి తెగ బాధపడ్డాడు. తన ప్రయత్నం వృధా* *అయిపోయిందన్న బాధతో వెనుదిరిగి వెళ్లిపోయాడు. వేటగాడు అటు వెళ్లగానే పిల్లి కిందకి చూస్తూ ‘ఎలుక మిత్రమా! నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందాము,’ అంటూ పిలిచింది. దానికి ఎలుక నవ్వుతూ ‘మిత్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో, శత్రువు ఎప్పుడు మిత్రడు అవుతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులం అయిన మనమిద్దరి మధ్యా స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు* *సాయపడ్డానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు. కానీ ఏదో ఒక రోజున ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన నీకు రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా, ఆ స్నేహాన్ని విడువకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతోంది. నువ్వు నన్ను రక్షించావు. బదులుగా నేను నిన్ను రక్షించావు. మన బంధం ఇక్కడితో చెల్లు. ఇక మీదట నా జోలికి రాకు!’ అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక.* 


 *ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్ల మారుమాటాడకుండా వెనుదిరిగిపోయింది.* 

                         

 *భీష్ముడు చెప్పిన ఈ కథలోని పాత్రలు సహజశత్రువులైన పిల్లీ ఎలుకలే అయినా, ఇందులోని నీతి నిత్యజీవితానికి కూడా వర్తించి తీరుతుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు, కానీ తెలిసి తెలిసీ అపకారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తోంది. పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి, జీవితాన్ని పణంగా పెట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తోంది.* 


 *సర్వేజనాః సుఖినోభవంతు.* 

          .సేకరణ

..🕉️🌞🌎🏵️🌼🚩

నామ స్మరణ(



ఏ పనులు చేస్తున్నా నిత్యం నామ స్మరణ(జపం) చేసే వారి వెంట దేవుడు ఎప్పుడూ ఉంటాడు, తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కూడా దైవాన్ని మరువని వారి పిలుపు భగవంతుడు వింటాడు ఆ భక్తుడికి తనవద్దకు రావడానికి సమయం లేకున్నా తనను పిలుస్తూనే తలుస్తూనే ఉన్నాడు అని ఆ దైవమే భక్తుని వద్దకు వెళ్తాడు, నీ వెంటే ఉండే స్వామి నీకు కనపడకపోయినా నువ్వు నీ స్వామికి కనిపిస్తూనే ఉంటావు ఆ దృష్టి పడాలనే కదా ఎన్నో పాట్లు, అలా నీ ప్రతి కర్మలోనూ సాక్షి గా నిలుస్తాడు అలా ఉంటే ఏమవుతుంది నీ కష్టమైన పని తేలికగా ఉంటుంది నీవు భారంగా అనుకునే పని బాధ్యతగా మారుతుంది. మనము ఏది నిత్యం స్మరిస్తూ ఉంటామో ప్రకృతి దాన్ని మన చెంతకు చేరుస్తుంది.

కుళ్ళిపోవడానికి

 *కుళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుంది?*


మానవుడు -- 1 వారం

పేపర్ టవల్ - 2-4 వారాలు

అరటి తొక్క - 3-4 వారాలు

పేపర్ బాగ్ - 1 నెల

వార్తాపత్రిక - 1.5 నెలలు

ఆపిల్ కోర్ - 2 నెలలు

కార్డ్బోర్డ్ - 2 నెలలు

కాటన్ గ్లోవ్ - 3 నెలలు

ఆరెంజ్ పీల్స్ - 6 నెలలు

ప్లైవుడ్ - 1-3 సంవత్సరాలు

ఉన్ని సాక్ - 1-5 

సంవత్సరాలు


మిల్క్ కార్టన్లు - 5 సంవత్సరాలు

సిగరెట్ బుట్టలు - 10-12 సంవత్సరాలు

తోలు బూట్లు - 25-40 సంవత్సరాలు

టిన్డ్ స్టీల్ క్యాన్ - 50 సంవత్సరాలు

ఫోమేడ్ ప్లాస్టిక్ కప్పులు - 50 సంవత్సరాలు

రబ్బరు-బూట్ ఏకైక - 50-80 సంవత్సరాలు

ప్లాస్టిక్ కంటైనర్లు - 50-80 సంవత్సరాలు

అల్యూమినియం కెన్ - 200-500 సంవత్సరాలు

*ప్లాస్టిక్ సీసాలు - 450 సంవత్సరాలు*

*పునర్వినియోగపరచలేని డైపర్స్ - 550 సంవత్సరాలు*

*మోనోఫిలమెంట్ ఫిషింగ్ లైన 600 సంవత్సరాలు*

*ప్లాస్టిక్ సంచులు 200-1000 సంవత్సరాలు.*


మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము,దయచేసి ఈ సమాచారాన్ని మీ నెట్‌వర్క్‌లో మీకు వీలైనంతగా పంచుకోండి.


గ్లోబల్ గ్రీన్ హౌస్ ప్రభావానికి సంబంధించిన ప్రధాన కారణాలలో ప్లాస్టిక్ ఒకటి అని ప్రజలలో అవగాహన ఏర్పడుతుంది.


- దయచేసి హరిత పర్యావరణానికి మద్దతు ఇవ్వండి.

*ప్లాస్టిక్ ను వాడడం మానేద్దాం*                  

Save Nature

ఓం భయాపహాయై నమః.

 ౧౨౧. ఓం భయాపహాయై నమః.🙏


చం. భయ మిహ జీవితాంతమును, బంధములన్ విడ నేరమిన్ భువిన్,


భయము మనమ్మునే దొలుచు, పంకజ లోచన! నిన్ను నా మదిన్


నయమునఁ గొల్వ నీయదుగ, నమ్మితి నిన్, భయదూరుఁ జేసి, ని


ర్భయముగ కొల్వనిమ్ము నిను, భద్రతఁ గొల్పుచు నో *భయాపహా!*

🙏

అమ్మపాదమీలకు ప్రణమిల్లుచు

చింతా రామకృష్ణారావు.

3.3 వర్ణ ఎంపిక

 **అద్వైత వేదాంత పరిచయం**


3.3 వర్ణ ఎంపిక :


  మన వర్ణాన్ని మనం ఎన్నుకునే అధికారం ఉందా? దానికి జవాబు ముందు ఏ వర్ణం అని ప్రశ్న.

3.3.1 జాతివర్ణం :` జాతిపరంగా చూస్తే మనకి పుట్టుక విషయంలో మన ప్రమేయం లేదు. తల్లిదండ్రులను మార్చుకోలేము. దాని గురించి బెంగపడటం కూడా అనవసరం. ఎందుకంటే జాతిపరంగా అందరూ సమానమే.

3.3.2 గుణ వర్ణం :` గుణపరంగా చూస్తే మనకి అధమ స్థాయి నుంచి ఉత్తమ స్థాయికి ఎదిగే అవకాశముందని చెప్తుంది శాస్త్రం. ఒక వ్యక్తి గుణశూద్రునిగా ఉన్నాడనుకుందాం. అంటే పుట్టుకతోనే బద్ధకంగా, యాంత్రిక జీవనం గడుపుతున్నాడనుకుందాం. శాస్త్రం అటువంటి వ్యక్తి స్వార్థపరమైన కర్మలు చేయాలని సూచిస్తుంది. ఈ స్థాయిలో నిస్వార్థసేవ గురించి ఆలోచించనఖ్ఖరలేదు. అతను డబ్బు, పేరు, కుటుంబంకోసం పనిచేస్తాడు. చాలామంది గుడికి వెళ్ళేది స్వార్థచింతనతోనే కదా. తన లాభంలో పదిశాతం దేవునికి యిస్తామని కూడా అంటారు. కొంతమంది అలాగుణశూద్రుడు స్థాయి నుంచి గుణవైశ్యుడు అవుతారు. 

  శాస్త్రం యింకొంచెం పనిచేయి, నిస్వార్థంగా చేయి అంటుంది. అలా చేస్తే అతను గుణ క్షత్రియుడవుతాడు. చివరగా అతను గుణ బ్రాహ్మణుడవుతాడు. నిజానికి వేదం బోధించే సాధన లక్ష్యం ఈ గుణశూద్రుని స్థాయి నుంచి గుణబ్రాహ్మణుని స్థాయికి ఎదగటానికే. గుణబ్రాహ్మణుడు మోక్షానికి సంసిద్ధుడవుతాడు. అందుకని ఆ స్థాయికి ఎదిగే విషయంలో మన ప్రమేయం ఉంది.

3.3.3 కర్మ వర్ణం :` కర్మ పరంగా చూస్తే మనకి ఎన్నుకునే అవకాశం ఉంది. మనం జాతిపరంగా ఉన్న వృత్తిలో కొనసాగవచ్చు లేదా మన అభిరుచిని బట్టి ఎన్నుకోవచ్చు.జాతిపరంగా అయితే కొంత లాభంఉంది. చిన్నవయసునుంచే ఆ వృత్తి చేపట్టవచ్చు. దానికి సంబంధించిన అవగాహన బాగా ఉంటుంది. పెద్దవాళ్ళ నిరంతర తోడు ఉంటుంది గురుకులవాసం లాగా. అలాగే కొనసాగింది చాలా కాలం వరకూ. 

  రెండో పద్ధతి, మన యిష్టాన్ని బట్టి ఎన్నుకోవడం. అలా విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు అయ్యాడు. కాని మన యిష్టం ఏదో తెలుసుకోవటం ఎలా? ఇవాళ బ్రాహ్మణ గుణం ఉండవచ్చు. రేపు వైశ్యగుణం ఉండవచ్చు. ఇది తేల్చుకోలేకపోతే వంశపారంపర్యంగా వస్తున్నది ఉంటూనే ఉంది. అలా రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి, వ్యాపారవేత్తల పిల్లలు వ్యాపారాల్లోకి వచ్చారు.

  ఏదైనావృత్తి ఎన్నుకునేటప్పుడు మనం మనని కించపరచుకోనక్కర్లేదు. ఎందుకంటే అన్నీమంచివే. కాని, శాస్త్రం ఒకటే చెప్తుంది. ఏ వృత్తిని ఎన్నుకున్నా దాన్ని డబ్బుపరంగా ఎన్నుకోవద్దని. డబ్బుపరంగా ఎన్నుకుంటే పోటీ తత్త్వం పెరుగుతుంది. కొన్ని వృత్తుల జోలికి ఎవరూ పోరు.

  ఇప్పుడు, ఆధునిక యుగంలో శాస్త్ర అధ్యయనం చేసి, దాన్ని నలుగురికీ చాటి చెప్పాలనే తత్వమే అంతరించి పోతోంది. శాస్త్రాలు కేవలం గ్రంధాలయాలకే పరిమితమైపోతున్నాయి. ఆఖరికి పురోహితుడు కూడా తన కొడుకుని వేదపాఠశాలకి పంపటానికి ఇష్టపడటం లేదు. ముందు ముందు వేదాధ్యయనం చేసిన వ్యక్తి దొరకటం దుర్లభమవుతుందేమో.

జాతి బ్రాహ్మణులు :` బ్రాహ్మణులకు పుట్టినవారు.

గుణ బ్రాహ్మణులు : సత్వగుణ ప్రధానమైనవారు. వీరే జాతికి చెందినా సత్వగుణ ప్రధానులైతే గుణ బ్రాహ్మణులే. కర్మ బ్రాహ్మణులు : ఆధ్యాత్మిక చింతన కలిగి అధ్యయనం, అధ్యాపనం మరియు పూజాదిక కార్యములు చేయువారు.

జాతి క్షత్రియులు :` క్షత్రియులకు పుట్టినవారు.

గుణ క్షత్రియులు :` రాజసగుణ ప్రధానులు. వీరే జాతికి చెందినా రాజసగుణ ప్రధానులైతే గుణ క్షత్రియులే.

కర్మ క్షత్రియులు :` పరిపాలన, ప్రజారక్షణ మరియు సంఘసేవవంటి కార్యములు చేయువారు.


జాతి వైశ్యులు :` వైశ్యులకు పుట్టినవారు.

గుణ వైశ్యులు :` రాజస తామస గుణ ప్రధానులు. వీరే జాతికి చెందినా రాజస తామస ప్రధానులైతే గుణ వైశ్యులే.

కర్మ వైశ్యులు :` వ్యాపారము, వ్యవసాయము, గోరక్షణ, గోపోషణ చేయువారు.


జాతి శూద్రులు :` శూద్రులకు పుట్టినవారు.  

గుణ శూద్రులు :` తామస గుణ ప్రధానులు. వీరే జాతికి చెందినా తామసగుణ ప్రధానులైతే గుణ శూద్రులే.

కర్మ శూద్రులు :` పై మూడు వర్గాలకు సేవలు అందించే వారు.

  

  దీనికంతటికీ కారణం వృత్తిని డబ్బే ప్రధానంగా చేసి ఎన్నుకోవటమే. అందుకని అలా కాకుండా ఏ వృత్తిని ఎన్నుకున్నా, మన లక్ష్యం, మన గుణం మార్చుకుంటూ వచ్చి, గుణశూద్రునిస్థాయి నుంచి గుణబ్రాహ్మణుని స్థాయికి ఎదగాలి. దీన్ని వర్ణ వ్యవస్థ అంటారు.

🙏🙏🙏

సేకరణ