ఋణకర్తా పితా శత్రుః
మాతా చ వ్యభిచారిణీ ।
భార్యా రూపవతీ శత్రుః
పుత్రః శత్రురపండితః ॥"
అప్పులపాలు చేసే తండ్రి, ప్రవర్తన లేని తల్లి, కేవలం సౌందర్యంపై ధ్యాస ఉండి బాధ్యతలు విస్మరించే భార్య మరియు విద్యాహీనుడైన కొడుకు శత్రువులతో సమానము అని అర్థము
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
ఋణకర్తా పితా శత్రుః
మాతా చ వ్యభిచారిణీ ।
భార్యా రూపవతీ శత్రుః
పుత్రః శత్రురపండితః ॥"
అప్పులపాలు చేసే తండ్రి, ప్రవర్తన లేని తల్లి, కేవలం సౌందర్యంపై ధ్యాస ఉండి బాధ్యతలు విస్మరించే భార్య మరియు విద్యాహీనుడైన కొడుకు శత్రువులతో సమానము అని అర్థము
🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️
పవిత్రమైన_బృందావనం_మంత్రాలయం...
(రాఘవేంద్ర స్వామి ఆరాధన దినోత్సవ సందర్భంగా)
అదొక ఆధ్యాత్మిక బృందావనం. రాఘవేంద్రస్వామి ప్రత్యక్షంగా అవతరించి, వేంచేసిన దివ్య స్థలం మంత్రాలయం. ఈ క్షేత్రం ఎన్నో విశేషాలకు ప్రసిద్ధి, ప్రతీతి. అవేమిటంటే..
#పాదోదకం... #పావనం
రోజూ రాఘవేంద్ర స్వామి మూల బృందావ నానికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక జలాలను మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా ఇస్తారు. బృందావనాన్ని హరి మందిరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ ఏడు వందల సాల గ్రామాలను ప్రతిష్ఠించారు. ఎందరో మహానుభావులూ ఇక్కడే కొలువై ఉన్నారని భక్తులు నమ్ముతారు. ఒకసారి రాఘవేంద్ర స్వామి బృందావనానికి అభిషేకం చేస్తే ఎందరో గురువులకు, సాల గ్రామాలకు అభి షేకాలు చేసినట్టు అవుతుంది. అలాంటి జలం అత్యంత పవిత్రమైనది. చాలా వ్యాధులను ఈ మంత్ర జలం నివారిస్తుందని చెబుతారు. ఈ పాదోదకాన్ని తాగడానికి మాత్రమే కాకుండా భక్తులపై ప్రోక్షణం కూడా చేస్తారు. దీనివల్ల పిశాచ బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
#మంత్రాక్షితల
రాఘవేంద్రస్వామి దర్శనం అనంతరం భక్తులు పీఠాధిపతి ఇచ్చే మంత్రాక్షితల కోసం బారులు తీరుతారు. ఈ అక్షింతల్లో పసుపు, సున్నం కలుపు తారు. అందుకే ఇవి ఎర్రగా ఉంటాయి. రాఘ వేంద్ర స్వామి మఠం పీఠాధిపతిగా ఎవరున్నా భక్తులకు అక్షింతలను ఇచ్చే సంప్రదాయం రాఘ వేంద్ర స్వామి కాలం నుంచి కొనసాగుతోంది. ఆనాడు ఆ యతీంద్రులు వాడిన పాత్రల్లోనే నేటికీ వాటిని తయారు చేసి భక్తులకు ఇస్తుండటం విశేషం. మఠంలో అంత పవిత్రతను కాపాడు కుంటూ వస్తున్నారు.
#మృత్తిక_మహిమ
రాఘవేంద్రస్వామి బృందావనంపై ఉంచే మృత్తిక చాలా విశిష్టమైనదని నమ్మకం. దీని విష యంలో ఒక కథ ఉంది. గురు రాఘవేంద్రులు బృందావన ప్రవేశానికి ముందు మంత్రాలయంలో ఉన్నప్పుడు, ఓ బ్రాహ్మణ భక్తుడు స్వామి వద్దకు వెళ్లి, ‘స్వామీ! నా కుమారుడి ఉపనయనానికి ధనం కావాలి’ అని అడిగాడు. ఆ సమయంలో స్వామి తుంగభద్ర నడి ఒడ్డున స్నానం కోసం ఉన్నారు. రోజూ మృత్తికతో స్నానం చేసే స్వామి తుంగభద్ర తీరంలోని ఆ మట్టినే భక్తుడికి ఇచ్చారు. దానిని ఆ భక్తుడు తీసుకుని వెళ్తూ దారి తప్పి మరో గ్రామానికి చేరుకున్నాడు. అక్కడు గురు రాఘ వేంద్రుడు ఇచ్చిన మృత్తిక సాయంతో ఓ ధన వంతుడి సంతానాన్ని హరిస్తున్న పిశాచిని ఆ భక్తుడు హరిస్తాడు. అప్పుడా ధనవంతుడు సంతో షంతో ఆ పేద భక్తుడి ఇంట్లో ఉపనయన కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించాడు. అంతటి మహిమ ఉన్న ఆ మృత్తికను నేటికీ మంత్రా లయంలో పూజిస్తున్నారు. రాఘవేంద్ర స్వామి తాకిన ఆ ప్రదేశంలో ఇప్పుడు తులసి వనం ఏర్పాటు చేశారు. ఏటా ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి రోజున స్వామి ఉత్సవమూర్తిని తీసుకెళ్లి అక్కడి మృత్తికకు ప్రత్యేక పూజలు చేసి ఊరే గింపుతో తెచ్చి స్వామి మూల బృందావనంపై ఉంచుతారు. ఇతర ప్రాంతాల్లో రాఘవేంద్ర స్వామి ఆలయాల స్థాపనకు ఈ మృత్తికను వినియోగి స్తారు. అలాగే ఈ మృత్తికను భక్తులు తీసుకెళ్లి ఇళ్లలో ఉంచుకుంటారు.
#మంచాలమ్మ_దర్శనం
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగా మఠం ముందు ఉండే గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో బృందావనం ప్రవేశం చేయక ముందు అమ్మవారిని దర్శించి ‘నేను ఇక్కడే కొలువై ఉంటాను. ముందుగా నీకు నైవేద్యం, దర్శనం అయిన తరువాతే నా బృందావనాన్ని భక్తులు దర్శించుకుంటారు’ అని చెప్పినట్టు మఠం పండితులు చెబుతారు
✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️
సమస్య "వాడెదవని రసముబీల్చి పాడెదఁ బ్రీతిన్."
(మాన్యశ్రీ భాస్కరభట్ల శ్రీరామశర్మ గారిచ్చిన సమస్యకు నాపూరణ.)
నాడైనను నేడైనను
వాడిగ శ్రీరామ జపము భవ్యపథంబై,
తోడుగ నిల్చును, మధురము,
"వాడెదవని రసము బీల్చి పాడెదఁ బ్రీతిన్."
(వాడెదవ-చెరకు యొక్క చివరిభాగం,ఇక్ష్వగ్రం)
సురభి శంకరశర్మ.
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
*🌹06సెప్టెంబర్26🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం*
*తిథి : దశమి* రా 07.29 వరకు ఉపరి *ఏకాదశి*
*వారం :ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : ఆరుద్ర* రా 07.52 వరకు ఉపరి *పునర్వసు*
*యోగం : సిద్ధి* మ 09.45 వరకు ఉపరి *వ్యతీపాత*
*కరణం : వణజి* ఉ 08.41 *భద్ర* రా 07.29 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 07.00 - 10.00 & 11.00 - 12.00 మ 02.00 - 04.30*
అమృత కాలం : *ఉ 10.33 - 12.03*
అభిజిత్ కాలం : *ప 11.41 - 12.30*
*వర్జ్యం :శేషం ఉ06.49 వరకు*
*దుర్ముహూర్తం:సా04.38-05.27*
*రాహు కాలం : సా 04.44- 06.17*
గుళికకాళం : *మ 03.11 - 04.44*
యమగండం : *మ 12.06 - 01.38*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మిధునం*
సూర్యోదయం :*ఉ 06.03*
సూర్యాస్తమయం :*సా 06.26*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.55 - 08.23*
సంగవ కాలం : *08.23 - 10.51*
మధ్యాహ్న కాలం : *10.51 - 01.20*
అపరాహ్న కాలం : *మ 01.20-03.48*
*ఆబ్ధికం తిధి : శ్రావణ బహుళ దశమి*
సాయంకాలం : *సా 03.48- 06.17*
ప్రదోష కాలం : *సా 06.17 - 08.36*
రాత్రి కాలం : *రా 08.36 - 11.42*
నిశీధి కాలం : *రా 11.42 - 12.29*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.08*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🙏 *ఓం నమో సూర్యదేవాయ నమః*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🌞🌞🌞🌞🌷🌹