21, జనవరి 2025, మంగళవారం

బుధవారం🪷* *🌷22, జనవరి, 2025🌷* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🪷బుధవారం🪷*

*🌷22, జనవరి, 2025🌷*  

    *ధృగ్గణిత పంచాంగం*

  

  *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - కృష్ణపక్షం*

*తిథి : అష్టమి* మ 03.18 వరకు ఉపరి *నవమి*

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం : స్వాతి* రా 02.34 వరకు ఉపరి *విశాఖ*

*యోగం  : శూల* రా 04.38 తె వరకు ఉపరి *గండ*

*కరణం : కౌలువ* మ 03.18 *తైతుల* రా 04.31 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు* 

      *ఉ 06.30 - 08.30 సా 04.00 - 05.00*

అమృత కాలం  : *సా 04.41 - 06.29*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం : శేషం ఉ 07.42 వరకు*

*దుర్ముహూర్తం : ప 11.56 - 12.42*

*రాహు కాలం : మ 12.19 - 01.44*

గుళికకాళం : *ఉ 10.54 - 12.19*

యమగండం : *ఉ 08.04 - 09.29*

సూర్యరాశి : *మకరం*

చంద్రరాశి : *తుల*   

సూర్యోదయం :*ఉ 06.40*

సూర్యాస్తమయం :*సా 05.59*

*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం          :  *ఉ 06.40 - 08.55*

సంగవ కాలం         :      *08.55 - 11.11*

మధ్యాహ్న కాలం  :      *11.11 - 01.27*

అపరాహ్న కాలం   : *మ 01.27 - 03.43*

*ఆబ్ధికం తిధి        : శూన్యం*

సాయంకాలం        :  *సా 03.43 - 05.59*

ప్రదోష కాలం         :  *సా 05.59 - 08.31*

రాత్రి కాలం : *రా 08.31 - 11.54*

నిశీధి కాలం          :*రా 11.54 - 12.44*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.58 - 05.49*

________________________________

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ సరస్వతి స్తోత్రం🪷*       

       *(అగస్త్య కృతం)*


*సరస్వతి నమస్తుభ్యం* 

*వరదే కామరూపిణి*

*విద్యారంభం కరిష్యామి* 

*సిద్ధిర్భవతు మే సదా*


    *🌷ఓం సరస్వత్యై నమః 🌷* 


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🪷🪷🌹🌷

 🌹🌷🪷🪷🪷🪷🌷🌹

⚜ శ్రీ వెంకటాచలపతి ఆలయం

 ⚜ కేరళ  : త్రివేండ్రం 


⚜ శ్రీ వెంకటాచలపతి ఆలయం



💠 శ్రీ వెంకటాచలపతి దేవాలయం కేరళలోని త్రివేండ్రంలో ఉంది మరియు దీనిని శ్రీనివాసర్ కోవిల్, పెరుమాళ్ కోవిల్, అయ్యంగార్ కోవిల్ లేదా దేశికర్ సన్నిధి అని కూడా పిలుస్తారు. 


💠 వెంకటాచలపతి ఆలయం 1898లో నిర్మించబడింది మరియు అప్పటి నుండి ఈ ఆలయాన్ని సందర్శించడానికి అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వస్తుంటారు.


💠  శ్రీ వేంకటాచలపతి దేవాలయం కేరళలోని సర్వోనత వైష్ణవ వడగలై సంప్రదాయం (వైష్ణవులు)కి అంకితం చేయబడిన ఏకైక ఆలయం.  అంతేకాకుండా, శ్రీ వేంకటాచలపతి ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి, వైకుంఠ ఏకాదశి, తిరు ఆదిపూరం మరియు ఆది స్వాతి వంటి వైష్ణవ పండుగలతో పాటు, పొంగల్, దీపావళి, విషు మరియు ఓనం వంటి ఇతర జాతీయ పండుగలు కూడా ప్రసిద్ధి చెందాయి.


🔆 ఆలయ చరిత్ర


💠 తిరుమల నాయకర్ రాజు పాలనలో ఒక సమూహం దేశం చుట్టూ తీర్థయాత్రకు వెళ్ళింది.

 వారి పర్యటనలో వారు దట్టమైన అడవి వద్ద ఆగారు. 

వంట కోసం బండిలోని రాయిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా కదలలేదు. 

వారిలో ఎవరైనా తప్పు చేసి ఉంటారని భావించి, వారు భగవంతుని కీర్తనలు పాడటం ప్రారంభించారు. 

రాయిని తొలగించలేని ప్రదేశంలో వెంకటాచలపతి దేవుడు ఉన్నాడని సమూహంలోని ఒక వ్యక్తి చెప్పాడు. అది విని ఆ రాయి చుట్టూ చిన్న మట్టి వేదిక చేసి దానిపై దీపం పెట్టి స్వామిని పూజించారు. 

తర్వాత తమ అనుభవాన్ని రాజుకు తెలియజేశారు. 


💠 రాజు వెంకటాచలపతికి ఆలయాన్ని నిర్మించి, రోజూ పూజలు చేసేవాడు. 

ఈ ఆలయ దైవం శ్రీ వేంకటాచలపతి. వీరవనల్లూర్‌కు చెందిన ఒక శ్రీరంగ అయ్యంగార్ సుమారు 100 సంవత్సరాల క్రితం తన ఇంటి సమీపంలోని చెరువులో విగ్రహాన్ని చూశారని చెబుతారు.


💠 'పాంచరాత్ర ఆగమం'లోని 'పద్మసంహితై' (మూడు సంహితలలో ఒకటి) ప్రకారం 40వ అజ్కియ సింగర్ శ్రీ రంగనాథ శతగోప యతీంద్ర మహదేశికర్ ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

 జీయర్ సూచనల మేరకు, శ్రీరంగ అయ్యంగార్ కుటుంబంలో పెద్ద కుమారుడు ఆలయ ప్రధాన పూజారి మరియు గత మూడు తరాలుగా దాని పరిపాలనా బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నాడు. 

ఆలయంలో నిత్య పూజలు వడగళై పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి.


💠 శ్రీ వేంకటాచలపతి ఆలయంలో భార్యాభర్తలు 9 విశిష్ట భంగిమల్లో ఉంటారు. ఆలయంలో పూజించబడే ఉప దేవతలలో నవనీత కృష్ణ, పెరియ తిరువడి ( గరుడ ) ఉన్నారు.

 

💠 ఒక పౌరాణిక కథనం ప్రకారం, ఒక రాజు ఈ పవిత్ర స్థలంలో భగవంతుడిని ప్రేమించినప్పటి నుండి కోల్పోయిన చూపును తిరిగి పొందాడు. 

ఇది విన్న భక్తులు వేలాదిగా ఆలయాన్ని సందర్శించడం ప్రారంభించారు.

 

💠 ఈ ఆలయం అన్ని రకాల మానవ సమస్యలను పరిష్కరిస్తుంది, ముఖ్యంగా ప్రజల జీవితంలో సూర్య మరియు చంద్ర గ్రహణాల నుండి ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరిస్తుంది.

 కొత్తగా పెళ్లయిన జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి మరియు సామరస్యం కోసం విజయదశమి రోజున ఆలయాన్ని సందర్శిస్తారు. 


💠 గర్భ గృహంలో ఆలయ ప్రధాన దైవం శ్రీ వేంకటాచలపతి పెరుమాళ్. గర్భగుడిలో అలమేలు మంగై తాయార్ మరియు పద్మాసిని తాయార్ విగ్రహాలు ఉన్నాయి. 

నవనీత కృష్ణర్ (సంతాన గోపాలన్), పెరియా తిరువడి మరియు గరుడర్ దేవతలకు కూడా ఆలయాలు ఉన్నాయి .


💠 ఈ ఆలయంలో అనేక శతాబ్దాల క్రితం ఈ భూమిని పాలించిన కులశేఖర ఆళ్వార్ విగ్రహం కూడా ఉంది. 

భక్తుడైన వైష్ణవుడు అయిన రాజుకు గౌరవ సూచకంగా, కులశేఖర ఆళ్వార్ విగ్రహంతో పాటు నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, బాష్యకారర్ ( రామానుజర్ ) విగ్రహాలు ఉన్న సన్నిధిని నిర్మించారు .



💠 ఈ ఆలయ  ఆకర్షణీయమైన లక్షణం గరుడ వాహనం, ఇక్కడ గరుడ విగ్రహంపై ఉంచిన ప్రధాన దేవతను పద్మనాభస్వామి ఆలయంలో తీర్థవారి సమయంలో విష్ణువును బయటకు తీసి పల్లకిని పోలి ఉండే గొప్పగా అలంకరించబడిన పల్లకిపై ఊరేగింపుగా తీసుకువెళ్లతారు.

పురటాసి మాసంలోని అన్ని శనివారాల్లో గరుడవాహనం బయటకు తీస్తారు.


💠 మార్గశిర్షం మాసంలో ముఖ్యమైన పండుగ తిరుప్పావై పఠనం. 

ఈ పద్యాలను పెరుమాళ్ యొక్క ముఖ్యమైన భక్తురాలైన "అండాళ్" స్వరపరిచారు. 

దీని పక్కనే వైకుంట ఏకాదశి పండుగ వస్తుంది, దీనిలో పెరుమాళ్ శయన అలంగారంలో (తిరుప్ పార్కాడల్‌లో లాగా) దర్శనమిస్తారు.


💠 పులియోగరే (చింతపండు అన్నం), దధ్యోనం (పెరుగు అన్నం), పొంగల్, చక్కరై పొంగల్, ఎల్లోదరై (నువ్వుల అన్నం), ఖీర్, అమృత కలశం మరియు చక్కరై సుండాల్ వంటివి ఇక్కడ సమర్పించే నైవేద్యాలు



💠 ఆలయానికి 1 కి.మీ దూరంలో తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్  ఉంది.

సమస్యాపూరణం

 *పద్య భారతి*


*సమస్యాపూరణం*


*పాపులపాదధూళి కడు పావన మాయెను వేదభూమిలో*


*ఉత్పలమాల*


ద్వాపరమందుధర్మమది దారిని తప్పుచు నుండ కేశవుం

డాపదఁ దొల్గఁజేసెను, దురాత్ముల నాశమొనర్చె , *లేదికన్* 

 *పాపులపాదధూళి*, కడుపావన మాయెను, వేదభూమిలో

గోప కులాంబుధీశు మదిఁ గొల్చుట భాగ్యము మానవాళికిన్


       *ఆదిభట్ల సత్యనారాయణ*

అజీర్ణ రోగం

 అజీర్ణ రోగం గురించి సంపూర్ణ వివరణ  - వివిధ రకాల ఆహారాల వలన కలుగు అజీర్ణాలకు విరుగుళ్లు  -


  అజీర్ణం సర్వరోగాలకు మూలకారణం . తినినటువంటి ఆహారం జీర్ణం కాకున్నా అనేక రోగాలు శరీరం నందు సంభంవించును. అజీర్ణవ్యాధికి మందాగ్ని కారణం. ఎక్కువుగా నీరు తాగుట, సమయం కాని సమయంలో భుజించటం భుజించటం, మలమూత్రాలను నిరోధించుట, రాత్రిసమయంలో మేల్కొని పగలు సమయంలో నిద్రించుట , తక్కువుగా భుజించుట  మొదలైన కారణాల వలన మనుష్యునికి ఆహారం జీర్ణం కాక అజీర్ణరోగం కలుగును.


           ఈర్ష్య, భయం , క్రోధము, లోభము , శోకము, దైన్యము, వైరం వంటివి కలిగినప్పుడు భుజించిన అన్నం చక్కగా జీర్ణం కాదు. భుజించిన ఆహారం జీర్ణం కాకమునుపే మరలా భుజించినచో అజీర్ణరోగం కలుగును.


  అజీర్ణవ్యాధి నాలుగు  రకాలుగా ఉండును. అవి 


          1 -  ఆమాజీర్ణం .


          2 -  విదగ్ధాజీర్ణం .


          3  -  విష్టబ్దాజీర్ణం.


          4 -  రసాజీర్ణము 

 *  ఆమాజీర్ణ లక్షణాలు  -


       ఆమాజీర్ణం నందు దేహము జడముగా ఉండటం , చెక్కిళ్ళు , కనులు వాచుట , తిన్నది తినినట్లే కక్కుట ఇట్టి లక్షణములు కలుగును .


 *  విదగ్ధాజీర్ణ లక్షణాలు -


        విదగ్ధాజీర్ణం నందు పులిత్రేపులు , భ్రమ , దప్పిక, మూర్చ మొదలగునవి కలుగును. పైత్యవికారం కలుగును. పొగతోకూడిన ఆమ్లసహిత వాంతి అగును. చెమట మరియు తాపము కలుగును.


 *  విష్టబ్దాజీర్ణ లక్షణాలు -


        నొప్పి , పొట్ట ఉబ్బుట వంటి వాతవేదనలు మలము , అపానవాయువు బయటకి వెడలకుండా ఉండటం , శరీరం మొద్దుబారుట, మోహము వంటి లక్షణాలు విష్టబ్దాజీర్ణం నందు కలుగును .


 *  రసాజీర్ణం -


         అన్నద్వేషం , గుండెలు బరువుగా ఉండటం, శరీరం జడమగు లక్షణాలు కలుగును.


        పైన చెప్పిన ఆమాజీర్ణరోగం సంభవించినప్పుడు వేడినీరు తాగుట, విదగ్ధాజీర్ణం నందు పొట్టకు చెమట పట్టునట్లు చేయుట , కాపడం పెట్టుట , విషభ్దాజీర్ణం సంభవించినపుడు విరేచనౌషధములు పుచ్చుకొనుట , రసాజీర్ణం నందు పడుకొనుట వంటి ఉపచారాలు చేయవలెను .


 ఆహారపదార్థాల అతిగా భుజించటం వలన కలిగిన ఆజీర్ణాలకు విరుగుళ్లు  -


 *  నేయి వలన కలిగిన అజీర్ణానికి వేడినీరు , నూనె వలన కలిగిన అజీర్ణానికి బియ్యపుకడుగు తాగవలెను. గోధుమ వలన కలిగిన అజీర్ణానికి దోసకాయ తినవలెను . అరటిపండ్లు , మామిడిపండ్లు తినడం వలన కలిగిన అజీర్ణానికి నెయ్యిని తాగవలెను.


 *  కొబ్బరికాయ తినడం వలన కలిగిన అజీర్ణానికి బియ్యపు కడుగు , మాంసం వలన కలిగింది అజీర్ణానికి కలిని , నారింజపండ్ల వలన కలిగిన అజీర్ణానికి బెల్లం , చారకాంద గడ్డ వలన అజీర్ణానికి అరిక బియ్యం సేవించిన అజీర్ణం శమించును .


 *  రొట్టె, పూరి మున్నగు పిండి వంటల చేత కలిగిన అజీర్ణానికి నీరును తాగవలెను. చారపప్పు వలన కలిగిన అజీర్ణానికి కరక్కాయ , మినుములు వలన కలిగిన అజీర్ణానికి కలకండ , పాల వలన కలిగిన అజీర్ణానికి మజ్జిగ , పుచ్చకాయ వలన కలిగిన అజీర్ణానికి వేడినీరు తాగవలెను.


 *  చేప మాంసం వలన కలిగిన అజీర్ణానికి మామిడిపండు , మద్యము వలన కలిగిన అజీర్ణానికి తేనె కలిపిన నీరు , పనస కు అరటి , అరటి కు నెయ్యి , నెయ్యికి నిమ్మపండ్ల రసం , నిమ్మపండ్ల రసమునకు ఉప్పు , ఉప్పునకు బియ్యపు కడుగు విరుగుడు .


 *  దానిమ్మ, ఉసిరిక, తాటిపండు, తుమికి, మాదిఫలం , చింతకాయ వీటివలన కలిగిన అజీర్ణము నకు పొగడపండ్లు , ఇప్ప, మారేడు , ఖర్జురము , వెలగ వీనివలన కలిగిన అజీర్ణమునకు వేపగింజలను నీటితో నూరి తాగిన తగ్గును. మాదిఫలం వలన కలిగిన అజీర్ణమునకు తెల్లావాలు వేయించి పొడి గొట్టి తినిన శమించును .


 *  రేగుపండుకు వేడినీరు , ఉశిరికకు ఆవాలు , ఖర్జురము , పెద్ద ఈతపండ్లు , ద్రాక్ష వీనికి నూనెయు , తాటిపండుకు మిరియాలు విరుగుడు పదార్థములు . మాంసం , పనస అజీర్ణమునకు మామిడి జీడియు , పులగము, బర్రెపాలు , చనుబాలు వీనియొక్క అజీర్ణమునకు సైన్ధవలవణం , అటుకులు జీర్ణమునకు పిప్పళ్లు , మరియు ఓమము , రెండుపప్పులు గల ధాన్యము అనగా శెనగలు మున్నగువాటి అజీర్ణమునకు మంచినీరు నశించేయును.


       పైన చెప్పిన విధముగా ఆయా ఆహారపదార్ధాల అతిసేవనం వలన ఏర్పడిన అజీర్ణాలకు విరుగుళ్లు తప్పక తీసికొనవలెను. 



  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

కాకరకాయ ఉపయోగాలు

 కాకరకాయ ఉపయోగాలు  - 


     కాకరకాయలో రెండు రకాలు కలవు. పెద్ద కాకర , పొట్టికాకర అని పిలుస్తారు . పెద్ద కాకర కాయలో రెండురకాలు కలవు. అవి ఆకుపచ్చ కాకర మరియు తెల్లకాకర కాయల రకం ఒకటి . 


           వంకాయలో తెల్ల కాకర కాయలు అపథ్యమై ఉండగా కాకర కాయల్లో తెల్లనివి అత్యంత శ్రేష్టమైనవి. కాకరకాయ స్వస్థకరం అయినది. రసాయనిక గుణం కలది. జీర్ణశక్తిని కలిగిస్తుంది. కాకరకాయలు పైత్యశాంతిని కలిగించును. ఎముకలలో మూలుగుకు బలాన్ని చేకూర్చే గుణం కలదు. 


                  కాకరకాయ గురించి ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంధం "సర్వఔషధి గుణకల్పం " ఈవిధంగా వివరిస్తుంది. " కాకర కాయ కొంచం కాకచేయును .సర్వరోగాలను  పోగొట్టును . నేత్రాలకు మేలు చేయును . లఘువుగా ఉండును. అగ్నిదీప్తిని ఇచ్చును " అని వివరణాత్మకంగా ఇచ్చెను . మరొక ప్రసిద్ద గ్రంథం " ధన్వంతరి నిఘంటువు " నందు కూడా కాకరకాయ విశేషగుణ ధర్మాల గురించి వివరణలు ఉన్నాయి . దానిలో కాకరకాయ శీతవీర్యం , తిక్తరసం కలిగి ఉండును. గట్టిపడిన మలాన్ని బేధించును. లఘువుగా ఉండి వాతాన్ని కలుగచేయకుండా ఉంటుంది. పెద్దకాకర కొంచం వేడిచేయును . రుచిని పుట్టించి సర్వరోగాలను పోగొడుతుంది . నేత్రాలకు మేలుచేయును . అగ్నిదీపనకరమై ఉండును. అని కాకర యొక్క విశేష గుణాల గురించి వివరించెను .  


               కుక్క , నక్క మొదలగు జంతువులు కరిచినప్పుడు పైకి కట్టడానికి , లోపలికి సేవించడానికి కాకర ఆకు , కాయ , పండు మంచి ఉపయోగకరములై ఉండును . కాకరకాయలు సాలెపురుగు విషాన్ని కూడా విరిచేస్తాయి. కాకర చేదుగా ఉండటం వలన రక్తశుద్ధి చేయును . కాకర కాయల కూర వీర్యస్తంభనమైనది. 


        చర్మవ్యాధులు ఉన్నవారు కాకరకాయను తరుచుగా వాడటం వలన రక్తశుద్ధిని కలుగచేయును . పొడుగు కాకరకాయలు అగ్నిదీప్తిని కలిగించును. లేత కాకరకాయల కూర త్రిదోషాలను హరించును . ముదురు కాయల కూర విరేచనకారి. పొట్టి కాకరకాయలు కూడా ఇంచుమించు ఇదే గుణాన్ని కలిగి ఉండును. కాని ఇవి మిక్కిలి చేదుగా ఉండును. ఆకలిని పుట్టిస్తాయి. 


                కాకరకాయలు ముక్కలుగా కోసి ఎండబెట్టి వరుగు చేసి నిలువచేసుకొంటారు . ఈ వరుగు నేతితో వేయించుకొని తింటే చిరుచేదుగా ఉండి త్రిదోషాలను పోగోట్టును కొన్ని ప్రాంతాలలో కాయలనే కాకుండా పండిన కాకరకాయలు ను కూడా కత్తిరించి వరుగు చేసి నిలువచేస్తారు . ఈ వరుగు కఫవాతాన్ని తగ్గించి పిత్తాన్ని పెంచును. జఠరాగ్ని పెంపొందింపచేయును . కాసను తగ్గించును. రుచిని పుట్టించును. 


             కాకరకాయలను శరీరం నందు వేడి కలిగినవారు వాడకుండా ఉంటే మంచిది . శరీర బలానికి మందు తీసుకునేవారు పెద్ద కాకరకాయతో చేసిన వంటకాలు వాడకూడదు. అలా వాడటం వలన బలం పెంచే మందు శరీరానికి పట్టదు. 


    కాకరకాయకు విరుగుడు వస్తువుల్లో ప్రధానం అయినది పులుసు . అందుకే కాకరపులుసు , పులుసుపచ్చడి దోషరహితం అయి ఉంటుంది. కాకరకాయ పులుసుతో పాటు నెయ్యి , ఆవాలు , దోసకాయ కూడా విరుగుడు వస్తువులు . 



  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

రహస్య గ్రంథాలు

 ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు -  వాటి గురించి విశేషాలు .


     మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు . వీరు తమయొక్క విజ్ఞానాన్ని గ్రంధరూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకటం లేదు .  నాకున్న పరిఙ్ఞానం మరియు కొన్ని పురాతన గ్రంధాలను పరిశోధించి వారు రాసిన గ్రంథాలు వేటికి సంభంధించినవో వాటిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను . 


 *  బృహద్యంత్ర సర్వస్వము  - 


         ఈ గ్రంథమును భరద్వాజ మహర్షి రచించెను . ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా " విమానాధికారణము" అను ఒక అధ్యాయం కలదు. ఇందు అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు . ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి , భయంకర వాయుగుండాల గురించి , అమిత విద్యుత్ శక్తి నుండి , అత్యుష్ణము , అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు ( అద్దములు ) గురించి వివరించారు 


                   ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ , సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడును.


                 ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియమ్ గ్లాసులు , పొటాషియం గ్లాసులు మాత్రమే . కాని మన ప్రాచీనులు అద్దం తయారుచేసేప్పుడు సువర్ణం , పాదరసం , అయస్కాంతం , ముత్యములు మొదలగునవి కలిపెదరు . అంతే కాకుండా కొన్నిరకాల దివ్యోషదాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు.  


          అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది.


 *  ఆగతత్వలహరీ  - 


         ఇందు వ్యవసాయం , అనేక వృక్షాల వర్ణనలు , వాటి చికిత్సా పద్దతులు కలవు. ఈ గ్రంథం అశ్వలాయన మహర్షి రచించెను .


 *  అవతత్వ ప్రకరణం  - 


          ఈ గ్రంథాన్ని కూడా అశ్వలాయన మహర్షి రచించారు . దీనిలో స్నానఫలాలు జలాల్లో రకాల గురించి వివరించారు . 


 *  అండ కౌస్తభం  - 


           ఇది పరాశర కృతం . బ్రహ్మాండ చరిత్ర 

జీవకోటి విమర్శ మొదలగునవి వివరించబడినవి.


 *  అంశు బోధిని - 


           ఇది భరద్వాజ మహర్షి రాశారు. ఇందు గ్రహములు వేధించు పద్దతులు  , ప్రకాశం ( light ) , ఉష్ణం ( heat ) , ధ్వని ( sound ) , తంత్రీ వార్తావిధి ( టెలిఫోనీ ) , విమాన నిర్మాణ విధి ,విద్యుతశక్తి ప్రయోగాలు కలవు.


 *  ఆకాశ తంత్రం  - 


            ఇది భరద్వాజ మహర్షి రచించారు . ఇందు ఆకాశం యొక్క 7 విధములు , ఆకాశక్షేత్ర విభాగములు , ఆకాశంలోని శక్తి సంయోగ విధములు , ఆకాశం నందలి అగ్ని, కాంతి, గ్రహ కక్ష్యలు , భూములు , నదులు మొదలగు వాటి వివరణలు కలవు.


 *  ఋక్ హృదయ తంత్రం  - 


            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు రోగములు , చికిత్సలు విశేషముగా వివరించబడి ఉన్నాయి.


 *   ఔషధీ కల్పం  - 


            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు ఔషధముల ప్రభావములు . చిరకాలం జీవించుటకు యోగాలు , గుళికా యోగములు, ఆయుర్వృద్ది మొదలగునవి కలవు.


 *  కరక ప్రకరణము  - 


             ఇది అంగీరస మహాముని రచించెను . ఇందు మేఘములలొని మార్పులు , జీవరాశుల ఉత్పతి విధానం , సూర్యరశ్మిలోని మార్పులు మేఘములకు సంబంధము , నవరత్నములు పుట్టుటకు సంబందించిన సూర్యరశ్మి విభాగాలు కలవు.


 *   కర్మాబ్దిసారము  - 


             ఇది ఆపస్తంబ మహర్షిచే రచించబడెను . ఇందు కర్మలు , చేయవలసిన విధులు , వాటి ప్రాముఖ్యత , వాటి ఫలములు , శారీరక , మానసిక ఫలములు మొదలైనవి కలవు.


 *   కౌముదీ  - 


               ఇది సోమనాథ కృతం ఇందు బ్రహ్మాండం గురించి విపులంగా రాసి ఉన్నది.


 *   ఖేట సర్వస్వము  - 


              ఇది జైమినీ మహర్షి చే రచించబడెను . ఇందు ఆకాశ విభాగములు , అందలి గ్రహకక్షలు మొదలగునవి కలవు.


 *  ధాతు సర్వస్వము  - 


             ఇది బోధాయన మహర్షిచే రచించబడెను . ఇందు ధాతువులు , వాటి ఉత్పత్తులు , గనులు , గనుల నుండి

లోహములు తీయు పద్దతి , విషములు , విషహరణోపాయములు , భస్మములు , గంధకం , పాదరసం మొదలగువాటి వర్ణన కలదు . 


 *  ధూమ ప్రకరణం  - 


           ఇది నారద మహర్షి కృతం . ఇందు వివిద ధూమములు , వాటిని కొన్ని రకాల అద్దములచే పట్టుట వాటిని కొన్నిరకాల ఆమ్లములచే పరిశోధించుట . ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకొనుట అనగా ఆయాపదార్థాలలోని విషగుణములను తెలుసుకొనుట తద్వారా శరీరాన్ని , బుద్ధిని పోషించుకొనుట ఈ విషయాలన్నీ కలవు.


 *  నామార్థ కల్పం  - 


           ఇది అత్రి మహర్షిచే రచించబడెను. ఇందు 84 లక్షల శక్తులు వాటి నామాలు , నామార్థాలు కలవు.


 *  ప్రపంచ లహరీ  - 


             ఇది వశిష్ట మహర్షి చే రచించబడెను . ఇందు అణువుల వలన బ్రహ్మండా నిర్మాణమా లేక బ్రహ్మతత్వం వలనా ? అని చర్చ కలదు. అణువు ల విమర్శ కూడా కలదు.


 *  బ్రహ్మాండ సారం  - 


               ఇది వ్యాస మహర్షిచే రచించబడెను . ఇందు బ్రహ్మాండ చరిత్ర కలదు.


 *  మేఘోత్పత్తి ప్రకరణం  - 


              ఇది అంగీరస మహర్షి కృతం . ఇందు మేఘములు , మెరుపులు , పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణణలు కలవు.


 *  లోక సంగ్రహము  - 


              ఇది వివరణాచార్య కృతం . ఇందు 1714 భాషలు , జీవజాతులు , వాటి పుట్టుక , ఆహార నియమాలు , మతములు మొదలగు వివరములు కలవు. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం కలదు.


 *  లోహ తంత్రము  - 


              ఇది శాక్త్యాయన మహార్షి చే రచించబడెను . ఇందులో లోహోత్పత్తి మొదలగు విషయాలు కలవు.


 *  వాయుతత్వ ప్రకరణము  - 


              ఇది శాక్త్యాయన మహర్షి కృతం . ఇందులో 84 వేల రకాల వాయువులు , వాటి పొరలు , భూమి మీద  ఆయా వాయువుల యొక్క ప్రభావములు , అవి వృక్ష సంపద పైన ఎట్లు పనిచేయుచున్నవి ? ఈ వాయువులను కనిపెట్టుటకు తగిన యంత్ర సాధనాలు మొదలగునవి కలవు. 


 *  వైశ్వనర తంత్రము - 


              ఇది నారద మహర్షి కృతం . ఇందు 128 రకాల అగ్నులు , వాటి రంగులు , గుణములు , ఉపయోగములు , కొలతలు తరతమ బేధములు కలవు.


 *  శక్తి తంత్రము  - 


            ఇది అగస్త్య మహార్షి చే రచించబడినది. ఇందు విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్ధ్యము , రూపాకర్షని , రసాకర్షిణి , గంధాకర్షిణి , స్పర్శాకర్షిణి , శబ్దాకర్షిణి , ధైర్యాకర్షిణి , శరీరాకర్షిణి , ప్రాణా కర్షిణీ  మొదలగు ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణనం , సెకనుకు 1 , 86 ,000 మైళ్ళ వేగముతో ఇప్పుడు టెలివిజన్ , రేడియో ప్రసారాలు ఎలా పోవుచున్నవో అదే విధముగా విధ్యుత్ శక్తి సహాయముతో రసము , గంధకం , స్పర్శము చివరికి శరీరం కూడా అంతే వేగముతో ప్రయాణించగల విధివిధానాలు చెప్పెను . బహుశా వాయువేగంతో మనిషి ఎలా ప్రయాణించాలో తెలియచేశారు అనుకుంటా . 


 *  శుద్ద విద్యాకల్పం  - 


         ఇది అశ్వలాయన మహర్షి కృతం . ఇందు ప్రపంచోత్పత్తి నిర్ణయము కలదు.


 *  సమరాంగణ సూత్రధారము  - 


         ఇది భోజమహారాజుచే రాయబడినది. ఇందు అనేక యంత్రములు కలవు. ఈ యంత్రములు యందు ఉపయోగించు పంచభూత బీజముల విధానములు , విమాన నిర్మాణ విధానములు , ద్వని ( సైరన్ ) యంత్రము చేయు పద్ధతులు , బొమ్మలచే యుద్ధము , నాట్యము , సంగీతము , ద్వార రక్షణము మొదలగు విచిత్రములు కలవు.


           పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమాన శాస్త్రంలో అశని కల్పం , అంశుమ తంత్రం , ఉద్బిజ్జతత్వ సారాయణము , దర్పణకల్పము , దర్పణశాస్త్రం , దర్పణ ప్రకరణం , ద్రావక ప్రకరణం , మణికల్ప ప్రదీపిక , మణి ప్రకరణము , మణి రత్నాకరం , ముకుర కల్పము , యంత్ర కల్పము ,  యంత్ర కల్పతరువు , లోహతత్వ ప్రకరణం , లోహ ప్రకరణం , లోహ రత్నాకరం , లోహ రహస్యము , లోహ శాస్త్రం , విమాన చంద్రిక , విష నిర్ణయాధికారం , వ్యోమయాన తంత్రం , శక్తి తంత్రము , శక్తి బీజము , శక్తి కౌస్తుభం , సమ్మోహన క్రియాకాండం , సౌదామినీకలా మొదలగు 150 గ్రంథాలు కలవు. అదియే కాక  అగస్త్య, అత్రి , అంగీర, ఆపస్తంబ , ఈశ్వర , కపర్ది , గర్గ, గాలవ,  గోభిల , గౌతమ, నారద , పరాశర, భరద్వాజ , వశిష్ట , వాల్మీకి , వ్యాస , శౌనక , సిద్ధనాధ  మొదలగు 140 మంది గ్రంథకర్తలు కలరు. ఋషులు అంటే ముక్కులు మూసుకుని మూలన  కూర్చుని తపస్సు చేసుకునే వారు కాదు. వీరు గొప్ప వైజ్ఞానికులు .భారతదేశంలో అధికారంలో ఉన్న వారు వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాము. కాని మన ప్రాచీన విఙ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు. దీనిపై మీకో ఉదాహరణ చెప్తాను. 1936 వ సంవత్సరం లో  1936 వ సంవత్సరం వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితా ని                 "రసరత్న సముచ్ఛయ" అనే పేరుతో ముద్రించారు . ఒక కేటలాగ్ లాగా అది మనదేశంలో దాని విలువ 1 రూపాయి . జర్మనీ దేశంలో మన భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ 5000 రూపాయిల చొప్పున అమ్ముడు అయినది.  ఇది మన భారతీయ వైఙ్ఞానిక విలువ కాని అది మరుగున పడుతుంది. మనం అయినా కాపాడుకొని మన తరవాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి.


  మరెన్నో విలువయిన విషయాలు గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

మనవారి మేధ*

 *మనవారి మేధ*


తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేశం (రెప్ప పాటుకాలం)

3 నిమేశాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్ట

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము, ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ...లక్ష సంవత్సరాలు


4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=త్రేతా యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం


పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం (చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట

             (--భాగవతాదారితం )


ఎంతో గర్వంగా చెప్పుకునే హిందువులకే సొంతం ఈ లెక్కలు మరేదైనా మతం లో కానరాదు. విదేశీయులు మాత్రమే కనుగొన్న ట్లుగా చెప్పుకనేటటువంటి ఎన్నో విషయాలు మన యోగులు మునులు ఏనాడో కనుగొనినారు. అందుకు మనమందరము గర్వరడాలి.

అతి సామాన్య కుటుంబం..

 అతి సామాన్య కుటుంబం...

.

సిగ్గుపడిపోతూ, ముడుచుకుపోతూ, వేరెవరిదో ఇచ్చిన చొక్కా, ప్యాంట్‌తో,  ముతక చెప్పులతో బీదరికమే నా నేపధ్యం అంటూ చెప్పకనే చెప్పే అతడి బాల్య చిత్రమిది.. 

.

Bscలో మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించారు. గణితం మరియు భౌతిక శాస్త్రంలో ప్రత్యేక అర్హత పొందాడు....

.

తండ్రి మరణించినప్పుడు, ఆయన సన్యాస దీక్ష ప్రమాణంతో ముడిపడి ఉన్నకారణంగా, తండ్రి అంతిమ సందర్శన కూడా పొందలేకపోయారు. 

.

సోదరుడు భారతీయ సైన్యంలో  సాధారణ సైనికుడు. కాశ్మీర్ ఫ్రంట్‌లో నియుక్తి చేయబడినారు. ఉద్యోగ బాధ్యతగా దేశ రక్షణ కోసం చేసిన ప్రమాణాన్ని నెరవేర్చుతున్న కారణంగా,  సోదరుని కలిసే అవకాశాలు మృగ్యమయ్యాయి. సోదరి, బావగారు టీ దుకాణం ఏర్పాటు చేసుకుని జీవితం కొనసాగించేవారు..

.

ఆయన మాత్రం కాషాయం ధరించారు. నేలపై నిద్ర. చలి కాలమైన ఎండా కాలమైన అన్నింటి కీ ఉన్నది ఒక్కటే వస్త్రం.  తెల్లవారుజామున గోసేవ, గో పూజ నిత్య కృత్యం. ఆ సామాన్యుడు బాబా గోరఖ్‌నాధ్ మఠాధీసుడు.


నేడు, దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రి ఆయన. 


నేడు  యూపీ వృద్ధి రేటు నిరంతర ప్రవర్ధమానంగా ఉంది. దేశంలోని రెండవ ఆర్ధిక రాష్ట్రంగా అవతరిస్తున్నది. రాష్ట్రంలో  24 గంటల విద్యుత్, ప్రజలలో రక్షణ భావం పెరగడం ఇవి అన్నీ ఆయన తన పాలనతో సాధించిన విజయాలు..


నిస్వార్థం, నిగర్వి, ప్రతీ క్షణం, ప్రతీ పనీ ప్రజాహితంగా చేసే మహనీయుడు. భరతమాతకి కీడుని తలపెట్టే తలని తీసేందుకు వెనకాడని సాహసి. సర్వస్పర్పి. సర్వసమదర్శి. భారతీయ కాషాయానికి, రామ రాజ్యానికి ప్రతీక

.

ఆయనే  52 ఏళ్ళ యోగి ఆదిత్యనాథ్...

.

కంకంటి పాపరాజు పాత్రచిత్రణ!

 శు భో ద యం🙏


కంకంటి పాపరాజు పాత్రచిత్రణ!


తెనుగున వెలసిన ఉత్తరరామాయణము కావ్యములలో  కంకంటి వారిరచనకే ప్రచారమధికము. దానికి వారి రచనావిధానమే ననుట యదార్ధము.

        సీతాపరిత్యాగఘట్టమున

వాల్మీకి ఆశ్రమమున ఆశ్రమునొందిన సీతజీవన విధానమును చదివినవారు కంటతడిబెట్టకుండ నుండుటరిదియే!


"*రంగారు బంగారు చెంగావులు ధరించు*

శృంగారవతి నారచీర లూనె.

భూజనంబులు మెచ్చు భోజనంబులొనర్చు

కమలాక్షి 

కందమూలములు నమలె.

చంద్రకాంత విశాల 

చంద్రశాలల నుండు

జవ్వని 

మునిపర్ణ శాల నుండె.

మరులుతో 

శ్రీరామునురముపై బవళించు

బాలికామణి 

యొంటి పవ్వళించె.

కనుసన్నల 

శుద్ధాంత కాంత లాచరించు

సేవలు మెచ్చని 

కాంచనాంగి, యొగ్గె 

ముని ముగ్ధ కాంతా కృతోపచార విధికి, 

నెంచ,న సాధ్యంబు 

విధికి గలదె?


       🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సత్యం--ఋతం

 సత్యం--ఋతం 

సత్యం అంటే అందరికీ తెలుసు,  కానీ మనకు తెలిసిన సత్యం వేరు, వేదంలో ఆ పదానికి చెప్పిన అర్థం వేరు. 

  ఋతం అంటే ఏమిటి?  ఋతం అనే పదం ఒక్క వేదం లో మాత్రమే వస్తుంది.  కానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది.

సత్యం, ధర్మం లకు ఎంత ప్రాశస్త్యత ఉందో, ఋతానికీ అంతే ప్రాశస్త్యత ఉంది. 

శాస్త్రములలో విధించిన కర్మలను మన బుద్ధి శక్తితో బాగా విశ్లేషించి, అంతటితో ఆగకుండా, ఆయా కర్మలు మహాత్ములు ఎవరైనా చేశారా అన్నది వివేచించి పోల్చి చూసి, ’ ఇది చేయవచ్చును,  లేదా.. ఇది చేయకూడదు ’ అని నిశ్చయించుకొనుటే ఋతం 

ఆ నిశ్చయాన్ని వాక్, కర్మేంద్రియాలతో ఆచరణలో పెట్టడాన్ని సత్యం అంటారు .

ఈ ఋతము, సత్యము, స్వాధ్యాయము, ప్రవచనము--[ ఇవి కాక, తపము, దమము, శమము, లాంటి మరికొన్ని ఉన్నాయి. వాటిని ఇక్కడ చేర్చలేదు ]  ఇవన్నీ కూడా తప్పక ఆచరించవలసినవి అని ఉపనిషత్ చెపుతుంది. ఎందుకు చెపుతుంది అంటే, బ్రహ్మము గూర్చిన జ్ఞానము,  ఉపాసనల వల్ల బ్రహ్మప్రాప్తి కలుగుచున్నపుడు మిగతావాటిని ఉపేక్షిస్తారేమో అని  అలా ఉపేక్షించకూడదు అని చెపుతుంది. 

ఇప్పుడు పైవాటిలో " ప్రవచనము " ఒక్క దాన్ని మాత్రమే తీసుకుందాము. 


*ప్రవచనము కూడా బ్రహ్మజ్ఞాని ముఖ్య కర్తవ్యాలలో ఒకటి. అంటే ప్రవచనము చెప్పేవాడు జ్ఞాని అయి ఉండాలి. అది ప్రథమ నియమము. అదికాక, ఇతర అనుష్ఠానములు చక్కగా చేస్తుండాలి. అతడే ప్రవచనానికి అర్హుడు.  కాబట్టి, వేదాభ్యాసము, స్వాధ్యాయము, ఋతము, తపస్సు, సత్యము ఇవన్నీ ఆచరిస్తున్నవాడే ప్రవచనాలు చెప్పుటకు అర్హుడు.*  


ఆ ప్రవచనాల్లో చెప్పే విషయాలు పై కర్మలద్వారా ఆచరించబడి చక్కగా తెలుసుకొని ఉండాలి. 

ఋతం అంటే, ఏది కర్తవ్యము, ఏది కాదు అన్న జ్ఞానము కదా... ఇదే కదా ప్రవచనాల్లో చెప్పేది?   ఈ జ్ఞానమెలా వస్తుంది?  ఏది చేస్తే శ్రేయస్సు కలుగుతుందో--- అది మంచిది. అదే కర్తవ్యము. ఏది చేస్తే మొదట సుఖంగా అనిపించినా, తర్వాత క్లేశాన్ని కలిగిస్తుందో-- అది చేయరానిది. దీనికొక పేరుంది. అదే ప్రేయస్సు. 

శ్రేయస్సు--ప్రేయస్సు అని రెండున్నాయని తెలిసింది కదా

శ్రేయస్సంటే మంచిది, ఎప్పటికీ శుభాన్ని కలిగించేది. ప్రేయస్సంటే మంచిది కాదు, మొదట సుఖాన్ని ఇచ్చినా తర్వాత అశుభాన్ని, కష్టాన్ని, క్లేశాన్ని కలిగించేది. 

ఈ శ్రేయస్సు--ప్రేయస్సు లను గురించి నేను అనువాదం చేసిన " మహా దర్శనము " చదివినవారికి విదితమే. 

శ్రేయస్సు అనేది మనకు నచ్చకపోవచ్చు. కానీ చివరికి శుభాన్నే కలిగిస్తుంది

ప్రేయస్సు మనకు బాగా నచ్చుతుంది.. కానీ చివరికి దుఃఖాన్ని మిగిలిస్తుంది.

ఇదంతా తెలిసినవాడే సరైన ప్రవచనకారుడు. ఋతాన్ని, స్వాధ్యాయాన్ని, ప్రవచనాన్ని అజాగ్రత్త చేయకూడదు అని కూడా వేదము చెబుతుంది.  ఇతర లాభాలు,  ప్రయోజనాల కోసం మోహము చెంది, ఋతమేది, సత్యమేది, శ్రేయస్సేది, ప్రేయస్సేది అని పట్టించుకోకుండా స్వంతలాభం కోసం అశాస్త్రీయమైన దాన్ని చెప్పేవాడికి అమిత దుఃఖం మిగులుతుంది. 

// జై జగదంబే //

మహాభారతం

 మహాభారతం - శాంతి పర్వం 🙏

                   ఐదవ భాగం 

 ఎందరు ఎంత చెప్పినా ధర్మరాజు మనసు మారలేదు. అప్పుడు వ్యాసుడు ధర్మరాజు తో " ధర్మరాజా ! అర్జునుడి మాటలు అక్షరసత్యాలు. అన్ని ధర్మములలోకి గృహస్థధర్మం గొప్పది. మానవులకే కాక పశుపక్ష్యాదులకు అది ధర్మమే. క్షత్రియులకు గృహస్థధర్మము తప్ప మిగిలిన తపస్సు, ఇంద్రియనిగ్రహం, బ్రహ్మచర్యం ఆచరణ యోగ్యం కాదు. ధనం సంపాదించకుండా ఉండటం, ప్రజారక్షణ మరవడం, యుద్ధం చేయకుండా పారిపోవడం క్షత్రియులకు మహాపాతకం. ఇది వేదవాక్కు కనుక వేదమార్గాన నడిచి ఈ భూమిని జనరంజకంగా పాలించు. ధర్మజా ! నీవు గురువుల వద్ద విద్యను అభ్యసించి ధర్మసూక్ష్మాలను చక్కగా ఎరిగిన వాడివి నీవు వర్ణాశ్రమ ధర్మములు తెలియని వాడివా ! భూమిని పాలించే రాజుకు దండనీతి తప్ప వేరు మార్గం లేదు. నీకు సద్యుముడు ఎలా దండనీతిని అమలు పరచి దుష్టులను శిక్షించి చివరకు మోక్షం పొందాడో తెలియాలి. ఆ కథ నీకు వివరిస్తాను.


పూర్వం బహుదానదీ తీరంలో లిఖితుడు, శంఖుడు అనే ఇద్దరు బ్రాహ్మణ సహోదరులు ఉన్నారు. ఇద్దరూ ధర్మతత్పరులు. వారి ఆశ్రమంలో కాయలు, పండ్లు సమృద్ధిగా ఇచ్చే వృక్షాలు అనేకం ఉన్నాయి. ఒక రోజు శంఖుడు ఇంట్లో లేనప్పుడు లిఖితుడు ఆశ్రమంలో ఉన్న చెట్ల నుండి బాగా పండిన పండ్లలను కోసి తింటున్నాడు. అప్పుడు శంఖుడు అక్కడకు వచ్చి " ఈ పండ్లు ఎక్కడివి " అని అడిగాడు. లిఖితుడు " మీ చెట్లో కోసుకున్నాను " అన్నాడు. శంఖుడు " నా అనుమతి లేకుండా నా చెట్టు నుండి పండ్లు కోయవచ్చా ! అది దొంగతనం కాదా ! నీకు పాపం అంటింది. రాజదండనతో కాని ఆపాపం పోదు " అన్నాడు. వెంటనే లిఖితుడు రాజు వద్దకు వెళ్ళి వార్తాహరుల ద్వారా తన రాకను తెలియజేసి రాజును మంత్రులతో వెలుపలకు రప్పించాడు . సుద్యుమ్నుడు " విప్రోత్తమా ! మీరు ఇక్కడకు వచ్చిన కారణమేమి ? ఆజ్ఞాపించిన మీరు చెప్పినట్లు చేస్తాను " అని అన్నాడు. అందుకు లిఖితుడు " రాజా ! మీరు మాటతప్పక నేను చెప్పినట్లు చేయాలి. నేను నా సోదరుడి ఆశ్రమం లోని పండ్లను దొంగిలించాను. దానికి మీరు తగిన శిక్ష విధించి నన్ను పాప విముక్తిడిని చెయ్యండి " అని ప్రార్థించాడు. ఆమాటలకు చాలాబాధను అనుభవించిన రాజు ఇక తప్పదనుకుని లిఖితుడి చేతులు నరకమని దండన విధించాడు. లిఖితుడు రాజుకు దీవించి వెళ్ళాడు. అతడికి దండన అమలుజరిగింది. లిఖితుడు శంఖుడి వద్దకు వెళ్ళి తన తెగినచేతులు చూపి " నేను దండన అనుభవించాను " అన్నాడు. శంఖుడు సంతోషించి " లిఖితా ! ఎవరూ ధర్మమార్గం, తప్పకుడదు. నీ జీవితం ధన్యమైంది. నీవు బహుదానదికి వెళ్ళి దేవతర్పణములు, పితృతర్పణములు విడిచి పెట్టు. లిఖితా ! కల్లుత్రాగడం, గురుపత్నిని కామించడం, బ్రాహ్మణుల సొత్తు అపహరించడం ఇవి మహా పాతకములు. ఈ మహా పాతకములలో ఏ ఒక్కటి ఎవరు చేసినా అది బ్రాహమణుడైనా దండనార్హుడే. రాజు చేత దండింపబడిన వారు పుణ్యలోకాలకు పోతాడు. నీవు కూడా రాజదండన అనుభవించావు కనుక పుణ్యలోకాలకు పోతావు. అందుకు నీవు సంతోషించు " అన్నాడు. వెంటనే లిఖితుడు బహుదా నదికి వెళ్ళి తెగిన చేతులతో దేవతర్పణములు పితృతర్పణములు విడిచాడు. అతడు ఆశ్చర్యపడేలా అతనికి తిరిగి చేతులు వచ్చాయి. లిఖితుడు ఆనందంగా శంఖుని వద్దకు పరిగెత్తి పోయి శంఖుడికి తన చేతులు చూపాడు. శంఖుడు " ఇందుకు ఆశ్చర్యం ఎందుకు ? ఇది దైవకృప చేత నా తపోమహిమ చేత కలిగింది. నీవు నిర్మల మనస్కుడవు కనుక నీకు దైవానుగ్రహం కలిగింది. నిన్ను దండిచిన సుద్యుమ్న మహారాజు తన పితృదేవతలతో సహా పుణ్యాత్ములైయ్యారు " అన్నాడు.


వ్యాసుడు ఇంకా ధర్మరాజుతో " ధర్మజా ! నీవు కూడా తగిన విధంగా ప్రజారక్షణ కావించుము. నీ తమ్ములు చెప్పిన మాటలు వేదవాక్కు. రాజనీతి దండన చేత తప్ప మరొక విధంగా నిర్వర్తించబడ లేదు. కనుక నీవు శోఖమును వదిలి గొప్పగొప్ప యాగములు, యజ్ఞములు చేసి చక్కగా రాజ్యాన్ని పాలించు. ధర్మనందనా ! నీ తమ్ములు నీ భార్య నీమాట మన్నించి పన్నెండేళ్ళ అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేసి కష్టములు అనుభవించారు. ఇప్పుడు నీవు వారి మాట మన్నించి వారికి సుఖశాంతులు కలుగచెయ్యి. విరాగి అయి అడవులకు వెళ్ళి దేవతలకు పితృదేవతలకు బాధ కలిగించకు. నీకు న్యాయశాసస్త్రం బాగా తెలుసు. ప్రజల మనోభిష్టం తెలుసుకుని శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేసి దండనీతిని అమలు పరచే రాజుకు అన్నీ శుభాలే కలుగుతాయి. ప్రజల ఆదాయం నుండి ఆరవ భాగం పన్నుగావసూలు చెయ్యి. ప్రజలన్ము కన్నలబిడ్డల వలె పాలించు. ఇదే మోక్షముకు మార్గం చూపుతుంది. నీ మనసులో ఉన్న భయం సంశయం వదిలి పెట్టు. కాని ధర్మరాజా రాజు అహంకరించి కామ క్రోధవశుడై ప్రజాకంటకంగా పాలిస్తే అతడికి ప్రజలు చేసే పాపంలో నాల్గవభాగం లభిస్తుంది. శత్రువులను నిర్మూలించడం క్షత్రియ ధర్మం, పాపాత్ములైన రాజులతో సంధి చేసుకోవడం దోషం, శత్రువులతో సంధి చేసుకుని తన రాజ్యంలో కొంత భాగం ఇవ్వడం మంచిదికాదు. యుద్ధం చేసి రాజ్యరక్షణ చేయడం క్షత్రియ ధర్మమం. కనుక నీవు యుద్ధం చేసినందుకు చింతింప పని లేదు. దుర్యోధనుడితో సంధి చేసుకోక పోవడం వలన ఈ ఘోర యుద్ధం సంభవించింది అనుకోవడం నీ అవివేకం పూర్వం హయగ్రీవుడనే రాజు యుద్ధములు చేసి శత్రువులను జయించి, దుండగులను శిక్షించి. సన్మార్గులను రక్షించి, యజ్ఞయాగాదులు చేసి, ప్రజారంజకంగా పాలించి తుదకు సద్గతి పొందాడు. కనుక యుద్ధములు రాజులకు కీడు చెయ్యవు. యుద్ధంలో చావడం, చంపడం సహజం కనుక నీవు అనుమానం వదిలి సమర్ధులైన రాజోద్యోగులను నియమించి రాజ్యకార్యములు నిర్వహించుము " అన్నాడు.


ఇన్ని చెప్పినా కలత వీడని ధర్మరాజును చూసి అర్జునుడి గుండెలు రగిలిపోతున్నాయి. కాని మనసులో కోపందాచి నిలబడి ఉన్నాడు. ధర్మరాజు వ్యాసుడితో " ఓ మహర్షీ ! ఈ యుద్ధంలో ఎంతోమంది స్త్రీలు తమభర్తలను, కుమారులను, సోదరులను పోగొట్టుకున్నారు. వారి విలాపములు శోకసంతాపములు నా హృదయానికి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో నేను ఈ రాజ్యమును ఎలా ఏలగలను ? " అన్నాడు.


వ్యాసుడు " ధర్మరాజా ! సుఖదుఃఖములు నీ వశంలో ఉన్నట్లు మాట్లాడుతున్నావు. దుఃఖాలు పొమ్మంటే పోవు, సుఖాలు రమ్మంటే రావు, ఈ లోకంలో అనుభవించే సుఖదుఃఖములకు హేతువు వారు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలే. అయినా ఈ సుఖదుఃఖములు శాశ్వతం కాదు. సుఖం వెంట దుఃఖం, దుఃఖం వెంట సుఖం వస్తూపోతూ ఉంటాయి. దుర్మార్గులకైనా కాలం కలిసివస్తే అనంత సుఖాలు ప్రాప్తిస్తాయి. ఎంతటి సుగుణవంతుడికి అయినా కాలం కలిసి రాకున్న సంపద లభించదు. కాలం కలిసి రాకున్న మంత్ర తంత్రములు పని చెయ్యవు. వర్షం, తాపం, చీకటి, వెన్నెల దైవ కల్పితములు. కమలం వికసించండం, చెట్లు పుష్పించుట, కాయలుకాయడం, పండ్లుపండడం ఋతు ధర్మం కాల మహిమ. జననం, వృద్ధిపొందుట, క్షీణించుట, మరణించుట కాల ధర్మమే. వీటి కొరకు నీవు దుఃఖించుట అవివేకం.

                  సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

మోద మహానుభోగమున ముఖ్యమునైనది దు:ఖమే కదా*

 *మోద మహానుభోగమున ముఖ్యమునైనది దు:ఖమే కదా*

ఈ సమస్యకు నాపూరణ. 


సాదర భావయుక్తము నసాధ్యము  సాధ్యము లౌను చూచినన్


వాదములేల? సోదరుడ!  వాస్తవ మెంచి  సయోధ్యగా జనన్


మోద మహానుభోగమున  ముఖ్యమునైనది - దు:ఖమే కదా!


వేదిని నీరు గార్చునది - విక్లబమేర్పడు విడ్వరం బగున్.


(వేది =జ్ఞాని

విక్లబము =భయపడు, తొట్రువడు

విడ్వరము =ఉపద్రవము)


అల్వాల లక్ష్మణ మూర్తి.

16.01.2025,గురువారం శ్రీ క్రోధి నామ సంవత్సరం

 🙏జై శ్రీమన్నారాయణ🙏

16.01.2025,గురువారం


శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - బహుళ పక్షం

తిథి:తదియ తె4.25 వరకు

వారం:బృహస్పతివాసరే 

(గురువారం)

నక్షత్రం:ఆశ్లేష మ12.03 వరకు

యోగం:ఆయుష్మాన్ రా2.14 వరకు

కరణం:వణిజ సా4.06 వరకు తదుపరి విష్ఠి తె4.25 వరకు

వర్జ్యం:రా12.43 - 2.24

దుర్ముహూర్తము:ఉ10.19 - 11.04 మరల మ2.45 - 3.29

అమృతకాలం:ఉ10.23 -12.03

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.0 - 7.30

సూర్యరాశి:మకరం

చంద్రరాశి: కర్కాటకం

సూర్యోదయం:6.39 సూర్యాస్తమయం:5.41


'ఎలా ఉన్నారు' అని మనం అడిగితే మిత్రుడు “ఏదో, అలా గడిచిపోతోంది' అన్నాడంటే, అతడి మెదడు స్తబ్ధంగా ఉందన్నమాట. వివేకం మందగించిందని, జ్ఞాపకశక్తి కూడా కోల్పోతున్నాడని అవగతం అవుతుంది. ఈ కోల్పోతున్న వాటన్నింటిని నిలబెట్టుకోవాలంటే కొత్తది వినాలి, కొత్తది చూడాలి, కొత్తది చదవాలి. అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపిస్తే మన ఆలోచనల్లో నూతనత్వం, ఆచరణలో వేగం తగ్గిపోతున్నాయని గమనించవచ్చు. కొందరికి మంచి ఆలోచనలు ఉంటాయి. తెలివి ఉంటుంది. ప్రణాళిక రచనా నైపుణ్యమూ ఉంటుంది. కానీ పని ప్రారంభించరు. ఆలోచనల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల అతడికి లాభం లేదు. సమాజానికి మేలు జరగదు. ఇలా అన్నీ తెలిసి, ఏదీ చేయనివాడు, ఏదీ తెలియనివాడితోనే సమానం. మేధావులు మౌనంగా ఉంటే జాతికి ద్రోహం జరుగుతున్నట్లే!

సరదాగా నవ్వుకోవటానికి.

 సరదాగా నవ్వుకోవటానికి.😄

#భార్య భర్తల మీద ఏదన్నా ఒకటి రాయాలనుకున్నాను. 

భార్య, భర్తల మధ్య జరిగిన సంభాషణ మీ ముందు పెడతాను.

♦భార్య: మీకు ఏమి పని లేదా? మొదట చాగంటి గారి మహా భాగవతం విన్నారు, అది అయిపోంగానే మాడుగుల వారిది విన్నారు, 

తరువాత గరికిపాటి వారిది, ఇప్పుడు సుందర చైతన్యానంద స్వామి వారిది. ఎవరు చెప్పినా అదే మహా భాగవతం కథ కదా!

 ఒకరిది వింటే సరిపోదా?

♦భర్త: నువ్వు మినప్పిండి రుబ్బి మొదటి రోజు కొంచెం పిండిలో ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీలు వేస్తావు,

 రెండో రోజు గారెలు, మూడో రోజు వడలు, నాలుగవ రోజు సాదా దోశలు, అయిదో రోజు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లి దోశ, 

ఆరో రోజు పొటాటో కూర వేసి మసాలా దోశ, 

ఏడో రోజు ఇంత టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఊతప్పమ్, 

ఎనిమిదో రోజు అదే పిండితో గుంట పునుగులు, 

తొమ్మిదో రోజు పుల్ల మజ్జిగ కలిపి పుల్లట్లు వేస్తూ ఉంటే నేను 

రేపు అనేది ఉందో లేదో అని ఆత్రంగా తినటం లేదా!

వీటన్నిట్లో ఉన్నది మినప్పిండి అని తెలిసినా ఎంజాయ్ చేస్తున్నామా లేదా? 

♦మహా భాగవతం కూడా అంతే! 

♦చాగంటి వారు చెప్పేదాంట్లో భక్తి పాలు ఎక్కువ - అందుకు వినాలి, ♦మాడుగల వారిది  ఎందుకంటే - ఆయన అమృత తుల్యమైన కంఠం లో పోతన గారి పద్యం వినటానికి,

♦ గరికిపాటి వారు ప్రస్తుతo సమాజం లో జరుగుతున్న వాటిని మేళవిస్తారు కాబట్టి ఆయనది వినాలి, 

♦చివరకు సుందర చైతన్యానందుల వారిది వినాలి - ఎందుకంటే  కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు ఆయన చెప్పే దాంట్లో పైన చెప్పినవి అన్నీ ఉంటాయి. 

♦ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పంథా. అన్నీ ఎంజాయ్ చేయాలి.

♦భార్యకు ఏమి అర్థం కాలా. తను చేసే పనిని భాగవతం తో పోల్చి పొగిడారా లేక ఒకే పిండితో వారం రోజులు టిఫిన్ చేసి పెడుతున్నాను అని ఎత్తి పొడుపుగా అన్నారా! ఆలోచనలో పడింది.🤔

కుంభ మేళా

 🔔 *కుంభ మేళా* 🔔


*మహా కుంభ మేళా కు వెళ్లేవారి కోసం మరిన్ని వివరాల* 


1.తెలుగు వాళ్లు అందరు మహాకుంభ  మేళా సందర్శనకి వెళ్లి వారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్లండి ,బస్సు ద్వారా వెళ్తే  16 Km దూరం లో పోలీస్ లు ఆపేస్తారు, అక్కడ నుండి నడుచుకుంటూ మేళా కి వెళ్ళాలి.


2.కుంభం మేళా లకు వెళ్లినవారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళా ని సెక్టార్ లు గా, కాటున్ పాండ్స్ గా, ఘాట్స్ గా విభజించారు వాటిపై అవగాహన పెంచుకుని వెళ్ళండి, లేక పోతే అస్సలు ఏమి అర్ధం కాదు, ఎటు వెళ్లి ఎటు వస్తారో మీకు అర్ధం కాదు.


3.మొత్తం 24 సెక్టర్స్ ఉంటాయి 

4.16-17కాటున్ పాండ్స్ ఉంటాయి. (నదికి మధ్యలో బ్రిడ్జి ల నిర్మించారు వాటినే కంటూన్ పాండ్స్ అంటారు )


4.ప్రయాగ రాజ్ ని మూడు గా విభజించారు 


A.జ్యూస్సి ,B.

 హరిలాగంజ్ C.సంగం 


5.నది కి కుడి వైపు జ్యూస్సి ఉంటుంది దీనిలో సెక్టర్ (12 నుండి 21 వరకు ఉంటాయి.


6.హరిలాగంజ్ ఇది నదిదాటి ఎడమ వైపు నా ఉంటుంది దీనిలో సెక్టార్ (5,11,10,9,8,7,6,18,19)ఉంటాయి.


7.ముఖ్యం మైంది, సంగం దీనిలో ఇది మెయిల్ రోడ్ కి దగరలో ఉంటుంది దీనిలో సెక్టార్ 3,4,ఉంటాయి.


8.మిగతావి 22,23, చాలా దూరం లో ఉంటాయి.


*వసతి సదుపాయం* 


9.సెక్టర్ 6 లో TTD వాళ్లు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు తప్పకుండా చూడండి. కానీ అక్కడ stay చేయనివ్వరు, స్వామి వారికీ బంగారు ఆభరణాలు ఉండడం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకొనివ్వరు.


10.మీరు అక్కడ హిందీ వాళ్లవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు వున్నాయి చక్కగా అక్కడ పడుకోవచ్చు. (.ముఖ్యం గా సెక్టార్ 18లో స్టే చేయవాచ్చు నదికి 100 మీటర్లు లో ఉంటాయి.)


11.సెక్టర్ 19,18,20 ఈ సెక్టర్స్ లో నాగసాధువు లు, అఘోరాలు, వుంటారు వాళ్ళు దగ్గరికి వెళ్తే ఏంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండ మంటారు ఇష్టముంటే ఉండొచ్చు.


12.సెక్టార్ 1లో ప్రవైట్ సదుపాయాలు ఉంటాయి రోజు కి 200 రూపాయలు 


13.అన్ని సెక్టార్ లో పెయిడ్ వసతులు కలవు రోజుకి 1000 -2000 తీసుకుంటారు( 4 మెంబర్స్ వరకు ఉండొచ్చు )..


భోజనం సదుపాయాలు 


14.మీకు అన్ని సెక్టార్ లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి (ఉత్తర భారతదేశం వంటకలు అన్ని అక్కడ ఫ్రీ గా తిన్నవచ్చు…


హెల్ప్ లైన్ 


16.మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగునా పోలీస్ లు మీమల్ని గైడ్ చేస్తారు.


17.మేళా లో అయితే పోలీస్ లు అడుగడుగునా మన కు ఎటువైపు వేళలో చాలా బాగా చెప్తారు.


స్నానం ఎలా ??


18 ఎవరైతే కేవలం పుణ్య స్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నాన ఘాట్ లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా.


19 2-3days వుండే వాళ్లు మాత్రమే ఎదో ఒక సెక్టార్ నదికి దగ్గరో వుంటుంది అక్కడే ఉండడం మంచిది, లేకపోతే నదికి, సెక్టార్ కి దూరమైత్ తప్పిపోయే అవకాశం కలదు 


నాగసాధువులు, అఘోరాలు, అఖడా లను చూడవచ్చు, వాళ్ళు ఆశీర్వదాలు తీసుకో వలనంటే సెక్టార్ 19,18,20 లో వుంటారు.


ఫ్యామిలీ తో వెళ్తే మాత్రం అక్కడ అన్ని తెలుసుకుని వెళండి, లేకపోతే చాలా ఇబ్బంది పాడుతారు.

ఒంటరి గా కంటే నలుగురు గా వెళ్తే చాలా మంచిది.


ఎన్నికోట్లమంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం ప్రయాగం రాజ్.

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

తృటి అంటే ఏమిటి?

 తృటి అంటే ఏమిటి?

➖️🌺➖️🌺➖️🌺➖️

మనం అప్పుడప్పుడు వింటుంటాం.. పత్రికలలో చదువుతుంటాం..

 

" తృటి లో తప్పిన ప్రమాదం "  అని.. అసలీ తృటి అంటే ఏమిటి?

➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️

🌺మన పూర్వీకులు మన కాలాన్ని ఎన్ని భాగాలు గా విడదీసారొ,వాటి పేర్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


తృటి =సెకండ్ లో 1000 వంతు

➖️🙏➖️🙏➖️🙏➖️🙏➖️


100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేశం అంటే రెప్ప పాటుకాలం నిముషం కాదు.. 

3 నిమేశాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్ట

12 కష్టాలు = ఒక నిముషం 

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము,ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల.

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు


🌺4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం


🌺8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం


🌺12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం


🌺17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం


🌺పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)


🌺71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం


🌺14 మన్వంతరాలు=ఒక కల్పం


🌺200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు


🌺365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం


🌺100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి


🌺ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట


🌺మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట


అదన్నమాట సంగతి.. 

మనము మన విజ్ఞానాన్ని తెలుసుకుందాం..

భావి తరాలకు తెలుపుదాం........

శ్రీ కార్త్యాయని దేవి ఆలయం

 🕉 మన గుడి : నెం 994


⚜ కేరళ  : చేర్యాల, అల్లెప్పి


⚜ శ్రీ కార్త్యాయని దేవి ఆలయం



💠 చెర్తల (చేర్యాల) అనేది ప్రస్తుత కేరళలోని అలపుజ సమీపంలోని పట్టణం . 

ఇక్కడ కార్త్యాయని ఆలయం ఉంది. 


💠 కార్త్యాయనీ దేవి ఆలయం, చేర్యాలలో ప్రధాన దేవత కార్త్యాయనీ దేవి మరియు అయ్యప్పన్ అయిన 'ధర్మ శాస్తా' ఉప దేవత కూడా ఈ ఆలయంలో ప్రాముఖ్యతను కలిగి ఉంది.  ఇక్కడ శివుడు మరియు కృష్ణుడు కూడా పూజింపబడతారు. 


💠 ఈ ఆలయానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. విల్వమంగళం సావ్మియార్ తిరువనంతపురంలోని అనంతపద్మనాభ ఆలయాన్ని ప్రతిష్ఠించి గురువాయూర్‌కు తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. 

అతను ఇప్పుడున్న చేర్యాలకు చేరుకుని ఒక తంబక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ ప్రదేశంలో ఉన్న అనేక చెరువుల్లో అనేక హంసలు ఈత కొట్టడం గమనించాడు. అకస్మాత్తుగా అతను తంబాక చెట్టుకు కట్టి ఊయల ఊపుతూ ఒక దివ్య స్త్రీని చూశాడు. అతను ఆమెను కార్త్యాయనీ దేవతగా గుర్తించాడు మరియు ఆమె దగ్గరకు వెళ్లాడు, ఆ తర్వాత ఆమె సమీపంలోని చెరువులోకి దూకింది. 


💠 విల్వమంగళతు స్వామి ఆమె కోసం చెరువులో వెతికినా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు కూడా అతను ఆమెను అదే స్థలంలో చూశాడు మరియు ఈసారి ఆమె రెండవ చెరువులో దూకింది. 

ఇది ఆరు రోజుల పాటు కొనసాగింది. 

7వ రోజు, స్వామియార్ దేవి జుట్టును పట్టుకుని, ఆమె మునిగిపోయేలోపు ఆమెను పైకి లాగాడు. అతను ఆమె మెడను బహిర్గతం చేస్తూ ఆమె తల పైకి లాగగలడు. 

అలాగే, అతను పట్టుకున్న అనేక వెంట్రుకలు లేచిపోయాయి. 


💠 7వ ట్యాంక్ మలయాళంలో 'చెర్' అని పిలువబడే మురికి బురదతో నిండి ఉంది. 

ఈ సంఘటన కారణంగా ఆ ప్రదేశానికి చేర్యాల అని పేరు వచ్చింది. (ఇది కొబ్బరికాయల తయారీకి గొప్ప కేంద్రం కావడంతో బ్రిటిష్ వారు షెర్తాలా అని కూడా పిలిచేవారు) ప్రస్తుత విగ్రహానికి తల మాత్రమే కనిపిస్తుంది. వెంట్రుకలు బయటకు తీయబడిన ఈ రంధ్రాలను మీరు చూడవచ్చు.

 కాబట్టి అభిషేకం తర్వాత, తలని ఏర్పరుచుకునే విగ్రహం యొక్క ఈ భాగాన్ని వస్త్రాన్ని ఉపయోగించి తుడుచుకుంటారు. అలాగే అమ్మవారికి పుష్పాంజలి ఘటిస్తున్నప్పుడు ఈ భాగాలను ఒక గుడ్డతో కప్పుతారు. ఆమెను పట్టుకోలేకపోవడంతో స్వామియార్‌కు ఆమెపై కోపం వచ్చినట్లు తెలుస్తోంది. కాబట్టి, ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ, ఎడవం (మే-జూన్) నెలలో, ప్రజలు పూరం పండుగ సందర్భంగా దేవతను ఆటలాడుకుంటారు.


💠 'చేర్తల కార్త్యాయనీ దేవి' దేవత 'మాంగల్య దాయిని'గా ప్రసిద్ధి చెందింది, ఆమె తన భక్తులకు క్షేమం మరియు శ్రేయస్సును అందిస్తుంది మరియు యువతుల వివాహానికి అడ్డంకులను తొలగిస్తుంది.


💠 అరట్టు (తొట్టిలో స్నానం చేయడం) పండుగను ఎడవం (మే-జూన్) నెలలో 8 రోజుల పాటు జరుపుకుంటారు. 

ప్రతి రోజు అమ్మవారిని వేరే చెరువులో ముంచి ఎనిమిదవ రోజున ఆమెను విష్ణువు మరియు శివునితో కలిసి ఆలయానికి తీసుకువస్తారు .


💠 సాధారణంగా కేరళలోని ఇతర దేవాలయాలలో, వార్షిక పండుగ సమయంలో, 'ఆరట్టు' అనేది సంవత్సరానికి ఒకసారి జరిగే ఆచారం.  

చొట్టానికర దేవి ఆలయంలో, పండుగ సమయంలో ప్రతి రోజు ఆరాట్టు జరుగుతుంది.  మలయాళ మాసం వృచికంలో కార్తీక నక్షత్రం రోజు కూడా బాగా జరుపుకుంటారు.


💠 గర్భగుడిలోని అమ్మవారు నేల మట్టం క్రింద ప్రతిష్టించారు. అందువలన 'స్వయంభూ' అని నమ్ముతారు. 

విగ్రహం శివలింగం రూపంలో ఉంటుంది మరియు ఖచ్చితమైన రూపం లేదు. కార్త్యాయనీ దేవి కాకుండా, శివుడు , విష్ణువు , గణపతి , ధర్మశాస్త , నాగదేవతలు మొదలైన అనేక ఉప దేవతలు ఉన్నారు. ఈ ఆలయంలో కవుడయోన్ అని పిలువబడే ధర్మశాస్తాకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అతనికి ఇక్కడ తాడి అనే ప్రత్యేక నైవేద్యాన్ని ఇస్తారు .


💠 భక్తులు కార్త్యాయనీ దేవతకు నైవేద్యంగా కోళ్లను అందజేస్తారు. కాబట్టి మీరు ఈ ఆలయంలో అనేక కోళ్లను చూడవచ్చు. 


💠 అర్చన, రక్త పుష్పాంజలి (పుష్ప నైవేద్యాలు), స్వయంవర పుష్పాంజలి, ముజ్జుకప్పు (దేవుని చందనం పేస్ట్‌తో అలంకరించడం),  మొదలైన ఉపచారాలు చేస్తారు. 

శాస్తా స్వామికి 'నీరాజనం' మరియు 'ఆల్తాడి' అని పిలువబడే ప్రత్యేక నైవేద్యాన్ని నిర్వహిస్తారు.

 'వాళిపాడు' (నైవేద్యం) 'ఆల్తాడి'ని భక్తులు తమ శారీరక రుగ్మతలు తొలగిపోతాయనే నమ్మకంతో సమర్పిస్తారు.

 ' తలప్పోలి ' కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన నైవేద్యంగా చెప్పవచ్చు: ఒక పుష్పంతో అలంకరించబడిన పళ్ళెంలో వెలిగించిన నూనె దీపం ఉంచబడుతుంది మరియు స్త్రీలు వాటిని దేవి ఊరేగింపులతో పాటు తీసుకువెళతారు.


💠 ఈ ఆలయంలో రెండు విశిష్టమైన మరియు విచిత్రమైన ప్రసాదాలు ఉన్నాయి. వాటిని ఇరట్టి మరియు తాడి అని పిలుస్తారు. 

ఇరట్టి దాని తయారీలో ఉపయోగించే బెల్లం కంటే రెట్టింపు పరిమాణంలో ఉండే నెయ్యి పాయసం తప్ప మరొకటి కాదు. 

తాడిని ఈ క్రింది పద్ధతిలో తయారు చేస్తారు:

బియ్యం పిండి, బెల్లం మరియు కొబ్బరి పొడి పొడి అల్లం మరియు ఇతర మసాలా దినుసులతో కలుపుతారు. ఇది తరువాత పేస్ట్ రూపంలో తయారు చేయబడుతుంది.

  

💠 కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయానికి 101 కి.మీ దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం


రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం 123-*

 *తిరుమల సర్వస్వం 123-*

*తాళ్ళపాక అన్నమాచార్యుడు 11*


 *కార్యాలయ అధికారి నిర్వాకం* 


 విధివశాత్తూ, 1931వ సంవత్సరంలో మలయప్పస్వామి వారికి అప్పటి గద్వాల మహారాణి వారు వజ్రకిరీటం తయారు చేయించాలని సంకల్పించింది. ఆ కిరీటం తయారీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చెన్నపట్టణానికి తరలి వెళ్లారు. ఆ వ్యవధిలో ముద్రణా కార్యాలయాన్ని వేరే ప్రదేశానికి తరలించాల్సి రావడం వల్ల; దేవస్థానానికి చెందిన ముద్రణాలయ అధికారి ఒకరు, శాస్త్రిగారు మూడు టేకు పెట్టెలలో పదిలపరచిన వ్రాతప్రతులను చిత్తు కాగితాలుగా భ్రమించి, వాటిని తగులబెట్టించి, ఖాళీ పెట్టెలను కొత్త కార్యాలయానికి క్షేమంగా చేరవేశాడు. అలా శాస్త్రిగారి శ్రమ చాలా భాగం బూడిదలో పోసిన పన్నీరై పోగా, వారు అంతకుముందే పొందుపరచిన. మూడు సంపుటాలలో గల అతి కొద్ది సంకీర్తనలు మాత్రం మనకు మిగిలాయి.


 భాండాగారంలో బయటపడ్డ రాగిరేకుల లోని రకాలను, ఈ కీర్తనలను వెలుగులోకి తీసుకురావటం కోసం ఇంకెందరో మహానుభావులు చేసినట్టి అవిరళ కృషిని, తి.తి.దే. వారు చేపట్టిన *"అన్నమాచార్య ప్రాజెక్టు"* అనబడే బృహత్తర కార్యక్రమం గురించి సవివరంగా తెలుసుకుందాం.


 అన్నమాచార్యుని రచనలను వెలుగులోకి తెచ్చి, ఆధ్యాత్మిక-ధార్మిక-నైతిక విలువలతో కూడిన ఆ అమూల్యమైన సాహిత్యసంపదను తెలుగు జాతికి అందించిన వారందరినీ తలచు కోవడం, తెలుగువారిగా మనందరి కర్తవ్యం! ఒక్కొక్కరు చేసిన కృషి సంక్షింప్తంగా చెప్పుకున్నా ఒక్కో ఉదంతమవుతుంది. "చంద్రునికో నూలుపోగు" అన్న చందంలో, అతి క్లుప్తంగా, వారందరినీ కొన్ని వాక్యాల్లో పరిచయం చేయడానికే ఈ చిన్ని ప్రయత్నం.



 *పండిత విజయ రాఘవాచార్యులు* 


 సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు తయారుచేసిన కీర్తనల వ్రాతప్రతులు టేకు పెట్టెలలో భద్రపరచినంత వరకు పూర్తిగా భస్మీపటలమై పోగా, వారు ఇతరత్రా ప్రదేశాల్లో పదిలపరచి నటువంటి అతికొద్ది వ్రాతప్రతులను మాత్రం పండిత విజయ రాఘవాచార్యులు గారు ప్రచురించి వెలుగులోకి తెచ్చారు.



 *శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు* 


 ఆ తర్వాత 1945వ సంవత్సరంలో, తి.తి.దే. వారి ప్రాచ్యకళాశాలలో తెలుగుభాషా విభాగానికి అధ్యక్షునిగా ఉన్న శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రి గారు, సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చేపట్టిన మహాయజ్ఞాన్ని పునఃప్రారంభించి, రాగి రేకుల యందు నిక్షిప్తమై ఉన్న వేలాది కీర్తనలను జనబాహుళ్యం లోనికి తీసుకు వెళ్ళడంలో సఫలీకృతు లయ్యారు. అప్పటినుండి అన్నమాచార్య కీర్తనలు తిరుమల తిరుపతి దాటుకొని, ఆంధ్రదేశ మంతటా మాత్రమే కాకుండా, ఖండఖండాంతరాలకు విస్తరించి అన్నమయ్య ప్రతిభను, తెలుగునేల సౌభాగ్యాన్ని ప్రపంచమంతా చాటిచెప్పాయి.

ప్రభాకరశాస్త్రి గారు రాగిరేకుల నన్నింటిని రచయితల వారిగా వర్గీకరించి, కీర్తనలను రెండు సంపుటాలుగా ప్రచురించారు. *"అన్నమాచార్య చరిత్ర - పీఠిక"* అనే గ్రంథాన్ని రచించి, అప్పటివరకు మరుగున పడి ఉన్న అన్నమాచార్యుని జీవితచరిత్రను ప్రాభవాన్ని వెలుగులోకి తెచ్చారు.



 *శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు* 


 ఆ తర్వాత 1951వ సంవత్సరంలో, రాగిరేకుల లోని మరికొన్ని కీర్తనలను పఠన యోగ్యమైన ఈ నాటి తెలుగుభాష లోకి అనువదించే బృహత్తర కార్యాన్ని తి.తి.దే. వారు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారికి అప్పగించారు. వారు వేలాది కీర్తనలను దాదాపు 20 సంపుటాలుగా ప్రచురించి, వాటిలో 108 కీర్తనలకు స్వరాలు సమకూర్చి, వాటిని వినసొంపుగా తీర్చిదిద్దారు. ఇంతే కాకుండా , అన్నమయ్య సాహిత్యంలో అంతర్లీనంగా ఉన్న కొన్ని కన్నడ, తమిళ, సంస్కృత శబ్దాలను అందుబాటులో ఉన్న నిఘంటువుల సహాయంతో ఆంద్రీకరించారు. అన్నమాచార్యుడు తన


 ఆ కీర్తనలను రాగయుక్తం చేసిన ముప్ఫయ్యొక్క రాగాలను కూడా వెలుగులోనికి తెచ్చి తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. రాగయుక్తంగా పాడగలిగే సంగీతపరిజ్ఞానం లేని వారు, ఆ కీర్తనలను కేవలం పద్యాలుగా చదువుకొని; అందులోని చమత్కారాలను, సందేశాలను, సూక్తులను అర్థం చేసుకోగలిగినా చాలుననే లక్ష్యంతో రెండు దశాబ్దాలపాటు వారీ మహా యజ్ఞాన్ని చేపట్టారు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

12-09-గీతా మకరందము

 12-09-గీతా మకరందము

          భక్తియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII ఒకవేళ మనస్సు దైవమందు స్థిరముగ నిలవనిచో  అప్పుడేమిచేయవలెనో చెప్పుచున్నారు-


అథ చిత్తం సమాధాతుం 

న శక్నోషి మయి స్థిరమ్ అభ్యాసయోగేన తతో 

మామిచ్ఛాప్తుం ధనంజయ.


తా:- అర్జునా! ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నాయందు స్థిరముగ నిలుపుటకు నీకు శక్తిలేనిచో అత్తరి అభ్యాసయోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము. (అభ్యాసముచే ఆ స్థితిని యెట్లయినను సాధింపుమని భావము).


వ్యాఖ్య- మొదట తెల్చిన సాధన చేయలేనివారికి భగవానుడు మరికొన్ని ప్రత్యామ్నాయపద్ధతులను సూచించుచున్నారు. ఆహా భక్తులపై, సాధకులపై సర్వేశ్వరునకు ఎంతటి కరుణ! మనస్సుచేతనే బంధము, మనస్సుచేతనే మోక్షము జీవునకు కలుగుచున్నవి*. కాబట్టి మోక్షము పొందుటకు ఆ మనస్సు ఏదోవిధముగ అధిష్ఠానమగు పరమాత్మయందు (దైవమందు) లయించియే తీరవలెను. ఇక్కారణముననే గీతాచార్యులు మనస్సు దైవమందు నిలుకడను బొందనిచో అభ్యాసముచే యెట్లయినను దానిని నిలుకడబొందులాగున చేయవలయునని, (అది తప్ప మోక్షమునకు వేరుదారి లేదని) తెలియజేయుచున్నారు. ప్రతివారును ఏదియోవిధముగ తమ మనస్సును బహిర్ముఖముగ పోనీయక, దృశ్యవిషయములపై వ్రాలనీయక, ఆత్మయందు (దైవమునందు) స్థాపన చేయవలెను. ఒకవేళ ప్రారంభస్థితిలో అట్లు మనస్సు ధ్యేయమందు నిలుకడను బొందనిచో అభ్యాసముచే మెల్లమెల్లగా ఆ స్థితిని ఎట్టెనను సాధించియే తీరవలెను. మనస్సు ఆత్మయందు లయించి, ఆత్మరూపమున శేషించుటయే మోక్షము. కావున ఆ స్థితిని ప్రయత్నపూర్వకముగ అభ్యాసము ద్వారా ప్రతివారును సాధించవలెను. "యతో యతో నిశ్చరతి .....(6-26)” అని 6వ అధ్యాయమున భగవానుడు  తెలియజేసినరీతి చపలమనస్సును నెమ్మదిగా వశమొనర్చుకొని ఆత్మయందు (దైవమందు) స్థాపించవలెను. ఇట్టి అభ్యాసమునుగూర్చియే ఈ శ్లోకమందు తెలియజేయబడినది,


అభ్యాసయోగేన - ఈ అభ్యాసమనుయోగము కర్మయోగ, భక్తియోగ, ధ్యానయోగ, జ్ఞానయోగాదులన్నిటితోను కూడియుండవలెను. అన్ని యోగములకును 6వ శ్లోకమున తెలుపబడిన అనన్యయోగము, ఈ శ్లోకమందు తెలుపబడిన ఈ అభ్యాసయోగము ఆవశ్యకమైయున్నది. దీనితో చేరినపుడే తక్కిన యోగములన్నియు అభివృద్ధిని, వికాసమును బొందగలవు.


కొందరు సాధకులు గురువుల యొద్దకు వెళ్ళి" అయ్యా! ధ్యానకాలమున నా మనస్సు దైవమందు స్థిరముగ నిలుచుటలేదే? ఏమి చేయవలెను?" అని యడుగుచుందురు. అందులకు ప్రత్యుత్తరముగ వారు భగవానుడీశ్లోకమున తెలిపినదానినే చెప్పుదురు. "నాయనలారా! మనస్సు నిలువనిచో, అభ్యాసము చేసి యెట్లయినను నిలుచులాగున చేసికొనుడు, వేఱుదారిలేదు" అని వారు బోధించుదురు. మనోనిగ్రహమును గూర్చి 6 వ అధ్యాయమున "అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే" అను వాక్యము ద్వారా భగవానుడీ అభ్యాసమునే నొక్కిచెప్పిరి. కాబట్టి ప్రతివారును తమ మనస్సు ధ్యానకాలమున నిలుకడను బొందనిచో నిరుత్సాహపడక భగవాను డిచట బోధించిన రీతిగ అభ్యాసముచే దానిని ఎట్లయినను నిలుకడబొందునట్లు చేయవలెను. మోక్షమునకు వేరుమార్గములేదు.


ప్ర:- మనస్సును దైవమందు స్థిరముగ నిలుపుడని చెప్పిరే, అట్లు మనస్సు నిలవనిచో ఏమి చేయవలెను?

ఉ:- అభ్యాసముచే ఆ స్థితిని యెట్లయినను సాధించవలెను.

--------------

* మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః

{ అమృతబిందూపనిషత్తు - 10)

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము తృతీయాశ్వాసము*


*262 వ రోజు*


*భీమసేనుని పరాక్రమం*


ఇది చూసిన ధర్మరాజు భీముని చూసి " అర్జునుడు భీష్ముని ఎదుర్కొంటున్నాడు. నీవు వెళ్ళి ద్రోణాదులతో పోరుతున్న ఘటోత్కచుని రక్షించు " అన్నాడు. సుయోధనుడు ఒక అర్ధచంద్రాకార బాణమును ఘటోత్కచునిపై వేసాడు. సింహ నాదం చేసుకుంటూ అక్కడుకు చేరిన భీమసేనుని ధనస్సును సుయోధనుడు ఖండించాడు. మరొక నారాచ బాణమును ప్రయోగించి భీముని వక్షష్తలము మీద కొట్టాడు. ఆ దెబ్బకు భీమసేనుడు దిమ్మెర పోయాడు. అది చూసిన ద్రౌపదీ సుతులు సుయోధనుని ఎదుర్కొన్నాడు. ఇంతలో అభిమన్యుడు, ఘటోత్కచుడు వారికి సాయం వచ్చారు. అందరూ కలిసి సుయోధనునిపై నిశితమైన శరవర్షం కురిపించారు. కృపాచార్యుడు, బాహ్లికుడు, భూరిశ్రవనుడు మొదలైన కురు వీరులు పాండుకుమారులను ఎదుర్కొన్నారు. ఇంతలో భీమసేనుడు తేరుకుని తిరిగి శత్రువుల మీద లంఘించాడు. ద్రోణుడు క్రూర శరములతో భీమసేనుని కొట్టాడు. భీమసేనుడు నారాచబాణముతో ద్రోణుని గుండేకు గురిపెట్టి కొట్టాడు. ఆ బాణముల ధాటికి ద్రోణుడు మూర్చిల్లాడు. తండ్రి అవస్థ చూసిన అశ్వత్థామ, సుయోధనులు తమ బలగంతో వచ్చి భీమసేనుని ఎదుర్కొని శక్తి వంతమైన బాణములు భీమునిపై ప్రయోగించారు. భీముడు రథము నుండి కిందకు దూకి ఆ బాణములను తన గదాయుధంతో చిన్నాభిన్నం చేస్తున్నాడు. ఇంతలో ద్రోణుడు తేరుకుని వచ్చి భీమునిపై శరపరంపర కురిపించాడు. ఇది గమనించిన అభిమన్యుడు, ఘతోత్కచుడు, ద్రౌపదీ సుతులు భీమునికి సాయంగా వచ్చారు. భీమసేనుని మిత్రుడు నీలుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ వాడి అయిన బాణములు ప్రయోగించి నీలుని తీవ్రంగా గాయపరిచాడు. ఇది చూసిన ఘటోత్కచుడు అశ్వత్థామ మీద శరవర్షం కురిపించాడు. ద్రోణుడు ఘటోత్కచుని క్రూరమైన బాణములతో నిలువెల్లా కొట్టాడు. ఘటోత్కచుడు మాయా యుద్ధం ప్రారంభించాడు. తన అపూర్వ మాయా శక్తితో ద్రోణుడు, సుయోధనుడు, కృపాచార్యుడు మొదలైన వారు తన బాణములకు తీవ్రంగా గాయపడి రక్తం ఓడుతున్నట్లు కౌరవ సేనలకు తెలిసేలా చేసాడు. అది చూసిన కౌరవ సేనలు పారిపోసాగారు. అది చూసిన భీష్ముడు " ఆగండి ఇది అంతా రాక్షస మాయ అందరూ క్షేమంగానే ఉన్నారు అని ఎంత చెప్పినా వినక సేనలు యుద్ధ భూమి విడిచి పారిపోసాగాయి. ఇది చూసిన సుయోధనుడు " తాతా ! మీరు ద్రోణాచార్యులు యుద్ధభూమిలో ఉండగానే ఇంత అవమానం జరిగింది కదా. ఇంత కంటే తలవంపులు ఏమున్నాయి. నేను ఒంటరిగానే పాండవులను ఎదుర్కొంటాని విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాను " అన్నాడు. భీష్ముడు " సూయోధనా ! నీవొక్కడివి పాండవులను ఎలా ఎదుర్కొంటావు రాక్షస మాయలు ఎదుర్కోడానికి మేము లేమా నీవు నిశ్చింతగా ఉండు " అని భగదత్తుని చూసి " భగదత్తా ! రాక్షస మాయలు నీ వద్ద పని చేయవు. నీవు పోయి ఘతోత్కచుని ఎదిరించు " అన్నాడు. భీష్ముని మాటలకు భగదత్తుడు పొంగి పోయి సుప్రీతకం అనే ఏనుగును ఎక్కి తన సేనలతో ఘటోత్కచుని ఏదుర్కొన్నాడు. ఇది చూసి కౌరవ సేనలు ధైర్యము తెచ్చుకుని తిరిగి చేరాయి. సాయం సమయం అయింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

పంచాంగం

 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏


      🌼 *శుభోదయం* 🌺


🌴 *మహనీయులమాట* 🌴


బాహ్యప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే. కానీ అంతఃప్రపంచాన్ని వశం చేసుకోవడం అంతకంటే వీరోచితం.


🌳 *నేటిమంచిమాట* 🌳


బుధ్ధిని ఉన్నత విషయాలతో, అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోండి. రేయింబవళ్ళు వాటినే స్మరించండి. అప్పుడే అద్భుతాలు సాధించగలరు.

               

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃


🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌻పంచాంగం🌻

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ    ... 19 - 01 - 2025,

వారం ...  భానువాసరే ( ఆదివారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

ఉత్తరాయనం,

హేమంత ఋతువు,

పుష్య మాసం,

బహుళ పక్షం,


తిథి     :  *పంచమి* ఉ7.03వరకు,

నక్షత్రం :  *ఉత్తర* సా5.23 వరకు,

యోగం :  *అతిగండ*  రా2.07 వరకు,

కరణం  :  *తైతుల* ఉ7.03 వరకు

                  తదుపరి *గరజి* రా8.01 వరకు,


వర్జ్యం                :  *రా2.38 - 4.24,*

దుర్ముహూర్తము :  *సా4.15 - 4.59,*

అమృతకాలం     :  *ఉ9.31 - 11.16,*

రాహుకాలం        :  *సా4.30 - 6.00,*

యమగండం       :  *మ12.00 - 1.30,*

సూర్యరాశి          :  మకరం,

చంద్రరాశి            :  కన్య,

సూర్యోదయం     :  6.39,

సూర్యాస్తమయం:  5.43,


               *_నేటి మాట_*


       *భగవంతుని అనుగ్రహము*

   మానవుడు తాను దేనినైనా పొందగల్గాలంటే తన ప్రయత్నంతో పాటు దైవ సంకల్పము కూడా ఉండి తీరాలి. 

    మనం ప్రయత్నం చేసినప్పటికీ అంతా దేవుని సంకల్పం ప్రకారమే జరిగి తీరుతుంది. 

    ఒకవేళ మన ప్రయత్నంతో దేనినైనా పొందగలిగితే అది కూడా పూర్తిగా మన ప్రయత్నం వలన కానే కాదు! మన ప్రయత్నం పట్ల దేవుడు సంతుష్టుడై తన అనుగ్రహం కురిపించుట చేతనే మనం దానిని పొందగలిగాము తప్ప మనమేదో అద్భుతం చేశామని కాదు!!!. 

    దేవుని సంకల్పం లేనిదే గాలి కూడా వీయదు, గడ్డి కూడా కదలదు.. 


    కనుక నేనే చేశాను, నాదే ఇదంతా, నన్ను మించినవారు లేరు... ఇలాంటి అహంకారం వదిలేసి భగవంతుని యందు భక్తి విశ్వాసాలతో ఉంటూ ఆయన సంకల్ప శక్తిని గుర్తిస్తూ నడుచుకోవాలి. 

     తద్వారా భగవంతుని అనుగ్రహ, ఆశీస్సులు సదా మనపై ఉంటాయి. 

     అపుడు మనం సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు.


              *_🌻శుభమస్తు🌻_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

Panchaag