4, జూన్ 2023, ఆదివారం

రామాయణం

 20.

రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...



          వాల్మీకి రామాయణం

                20 వ  భాగం:

                ➖➖➖✍️



మరుసటి రోజూ ఉదయాన్నే దశరథుడు జనక మహారాజుతో ఇలా అన్నాడు "మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న, మా వంశాభివృధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు" అన్నారు.


“అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజుగారి పూర్వీకుల గురించి చెప్తాను” అని వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టాడు...


“మొదట బ్రహ్మగారు జన్మించారు, ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు, మరీచికి కాశ్యపుడు, ఆయనకిసూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువ, పృథువకి త్రిశంకువు, త్రిశంకువుకి ధుంధుమారుడు, ధుంధుమారుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు, పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు, ఈ అసితుడు వరకు రాజ్యపాలనం చేశారు, ఈ అసితుడు హైహయ, తాలజంఘా, శశబింద్వ అనే వంశాల వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయాడు, తరువాత ఆయన హిమాలయ పర్వతాలకి తన ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు, ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది మరొక భార్యకి సంతానం కలగలేదు. వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకి విష ప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన చ్యవన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విష ప్రయోగం చేసిందని చెప్పారు. విషప్రయోగం జరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని (గరము అంటె విషం) పేరు పెట్టారు. ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యలలో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరులని కపిల మహర్షిభస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు(ఒకసారి ఈ ప్రవృద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయనని శపించాడు, అప్పుడా రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కుల గురువుని శపించద్దు అనింది, కాని అప్పటికే తన కమండలంలోని నీళ్ళు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్ళని తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు, అందుకని ఆయనని కల్మషపాదుడు అని పిలిచారు), ప్రవృద్ధుడికి శంఖణుడు, శంఖణుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నభాగుడు, నభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు. ఇది దశరథుడి వంశం, ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి, యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు" అని వశిష్ఠుడు చెప్పాడు.


ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు… "మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి, నిమికి మిథి(ఈయన నిర్మించినదే మిథిలా నగరం), మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధణుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతుకిదేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రథుడికి శూరుడు, మహావీరుడు అని ఇద్దరు కుమారులు, మహావీరుడికి సుధృతి, సుధృతికి ధృష్టకేతువు, ధృష్టకేతువుకి హర్యశ్వుడు, హర్యశ్వుడికి మరుడు, మరుడికి ప్రతీంధకుడు, ప్రతీంధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢ, దేవమీఢకి విబుధుడు, విబుధుడికి మహీధ్రకుడు, మహీధ్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు, జనకుడికి సీతమ్మఅయోనిజగా లభించింది, తరవాత ఊర్మిళ పుట్టింది" అని జనకుడు చెప్పుకున్నాడు.


సాంకాశ్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజుడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. 


కుశధ్వజుడు వచ్చాక.......


వీర్య శుల్కాం మమ సుతాం సీతాం సుర సుత ఉపమాం।

ద్వితీయాం ఊర్మిలాం చైవ త్రిః వదామి న సంశయః॥


“నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని, ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శ్రుతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను” అని జనకుడు దశరథుడితో అన్నాడు. 


దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తరువాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము, పితృకార్యము చెయ్యమన్నాడు.


నేటికి రెండు రోజుల తరువాత ఉత్తర ఫాల్గుణి నక్షత్రంతో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు.


దశరథుడు గోదానము, పితృకార్యము మొదలైన కర్మలను పూర్తిచేసాడు. తరువాత ఆయన నాలుగు లక్షల గోవులు,(బంగారు కొమ్ములు కలిగినవి) ఒక్కో కుమారుడితో లక్ష గోవుల్ని దానం చేయించాడు. అలాగే బ్రాహ్మణులకి బంగారము, వెండి దానం చేశాడు. వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చెయ్యమన్నారు.


దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు.


“మిమ్మల్ని అక్కడెవరన్నా ద్వారపాలకులు ఆపుతున్నారా, దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు, మీరు తిన్నగా వచ్చేయండ”ని జనకుడన్నాడు.


అగ్నివేది సిద్ధం చేశాక, అందులో అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు, అక్షతలని సమాహొరణం చేయించారు, గంధ పుష్పాలని వేశారు. 


జనక మహారాజు ఆ అగ్నిహోత్రం దగ్గర నిలబడ్డారు, రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహోత్రం దగ్గర నిలుచుని ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు. అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు…


ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ |

ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా |

పతివ్రతా మహభాగా ఛాయ ఇవ అనుగతా సదా ||


“రామయ్యా! నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమే సీత, ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామ పత్నిగా ఇవ్వడంలేదు, నీతోపాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను, కాబట్టి నన్ను క్షమించు, ఈమెని నువ్వు పుచ్చుకో, నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో(సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహుర్తం, మనం జీలకర్ర-బెల్లం పెడతాం సుముహుర్తానికి), ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది, నా భర్త అని నీ కోసమే చేస్తుంది. రామా! మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు, నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే, అది నీ వల్లే రామా, ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి, ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది, ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది. [ఇదంతా పై శ్లోకం యొక్క రహస్యార్ధం]. ✍️

రేపు...21వ భాగం...

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*

నిజమైన ధనవంతుడు!*

 

       *నిజమైన ధనవంతుడు!*

                 ➖➖➖✍️

                                                                                     *”మీ కంటే ధనవంతుడు ఉన్నాడా?”...బిల్ గేట్సని ఎవరో అడిగారు.*


*”ఒకవ్యక్తి,.... ఉన్నాడు” అని సమాధానమిచ్చి - ఇలా చెప్పాడు…*


*“నేను డబ్బు, పేరు  సంపాదించక ముందు రోజులలో  - ఒక నాడు ‘న్యూయార్క్ ఎయిర్ పోర్ట్‘ లో దిగాను.*


*దినపత్రిక  కొందామని  చేతిలోకి తీసుకుని సరైన చిల్లర నావద్ద లేకపోవడం వలన తిరిగి పేపరును అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను.*


*“పర్లేదు... మీవద్ద చిల్లర లేక పోయినా, ఈ పేపర్ తీసుకోండి” .... అని బలవంతంగా నాచేతిలో పెట్టాడు. నేను తీసుకోకతప్పలేదు.*

 

*మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా -  మళ్ళీ అదే ఎయిర్ పోర్ట్ లో అదే పేపర్ కుర్రాడి వద్ద మళ్ళీ దిన పత్రిక కొనాలని ప్రయత్నిస్తే, దురదృష్టం కొద్దీ అప్పుడూ, నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది.*


*ఆ కుర్రాడు నాచేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ ...*

 

*“ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందు వల్ల నేనేమీ పెద్దగా నష్టం పోను, ఆ ఖరీదును నా లాభం లోంచి మినహాయించు కుంటాను” అన్నాడు.*


*ఆ తర్వాత పందొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు, పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రాడి కోసం వెదికాను.*


*నెలన్నర తర్వాత అతి కష్టం అతడు దొరికాడు.*


*“నేనెవరో తెలుసా, నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి” అడిగాను.*


*“మీరు తెలుసు...బిల్ గేట్స్.... ఒకసారి కాదు రెండు సార్లు ఇచ్చాను” అన్నాడు.*


*చాలా సంతోషించాను, ఇంతకాలం తర్వాత కూడా నేను గుర్తున్న నందుకు.....*


*ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు, నీకు ఏమి కావాలో అడుగు, నీ జీవితంలో పొందాలనుకున్నది  ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను“ అన్నాను.*


*“సర్... *

*మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి  ఎలా సరితూగుతుంది?” అతడు ప్రశ్నించాడు.*


*“ఎందుకు సరితూగదు?”  నేను ఆశ్చర్య పోయాను.*


*“నేను పేదరికంతో బాధ పడుతూ, దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేసాను.”*


*“ఈ రోజు మీరు ప్రపంచం లోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు... ఎలా సరితూగుతుంది?”*


 *క్షణకాలం నామైండ్ బ్లాంక్ అయింది. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది.*


*అతడు ఇతరులకు సహాయం చెయ్యాలి అనుకుంటే, తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు. *

*అవును... నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు. *


*అప్పుడు నాకు అనిపించింది- కుప్పలు కుప్పలు డబ్బు ఉండే కంటే...*


*ఇతరులకు సహాయ పడాలనే హృదయం కలిగి ఉండటమే  - నిజమైన ఐశ్వర్యం.*


*ఇతరులకు సహాయ పడటానికి కావలసింది అదే.*✍️        

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


మంచితనంతో

 


*మన మంచితనంతో…*

       *ఇతరులను మార్చలేమా?*

                  ➖➖➖✍️


*సంత్‌ రవిదాసు నిరంతరం భగవన్నామ స్మరణలో నిమగ్నమై ఉండేవాడు. చెప్పులు కుడుతూ జీవనం సాగించేవాడు. ఒక చిన్న కుటీరంలో నివసించేవాడు. తనకు ఉన్నంతలోనే అతిథులకూ, అభ్యాగతులకూ సేవలు అందించేవాడు.*


*ఒకసారి రవిదాసు కుటీరానికి ఒక సాధువు వచ్చాడు. రవిదాసు సేవానిరతికి మెచ్చుకొని, తన జోలె నుంచి ఒక పరసువేదిని తీశాడు. ఆ పరసువేదితో ఒక ఇనుప పనిముట్టును తాకి... దాన్ని బంగారంగా మార్చాడు. “ఈ పరసువేది నీ దగ్గరే ఉంచుకో, అవసరమైనప్పుడల్లా ఉపయోగించి బంగారాన్ని పొందు. నీ దారిద్య్రం తీరుతుంది” అని రవిదాసుకు చెప్పాడు.* 


*కానీ రవిదాసు అందుకు అంగీకరించలేదు.*


*అప్పుడు సాధువు ఆ పరసువేదిని కుటీరం పైకప్పులో పెట్టి,      “నీకు ఇష్టమైనప్పుడే దాన్ని తీసుకో!” అని చెప్పి వెళ్ళిపోయాడు.* 


*అయితే రవిదాసు దాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు.*


*పదమూడు నెలల తరువాత ఆ సాధువు మళ్ళీ వచ్చి, పరసువేది గురించి రవిదాసును అడిగాడు.*


*”స్వామీ! మీరు దాన్ని ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటుంది చూడండి” అన్నాడు రవిదాసు.* 


*జెన్‌ సాహిత్యంలోనూ అలాంటి నిస్వార్థపరుడైన ఒక గురువు కనిపిస్తాడు. ఆ గురువుకు సొంత ఇల్లు లేదు. ఎక్కడో పాడుపడిన ఆలయంలోనో, కొండ గుహలోనో, చెట్టు కిందో... ఎక్కడ ఏకాంతం లభిస్తే అక్కడ ఉండేవాడు.*


*క్రమంగా ఆయన గొప్పతనం ప్రజలకు తెలిసింది. ఆయన దర్శనం కోసం చెట్లూ, పుట్టలూ, గుట్టలూ వెతుకుక్కుంటూ వెళ్ళేవారు. *


*ఆ గురువు గొప్పతనం ఆ నోటా, ఈ నోటా రాజుకు చేరింది. రాణితో సహా వచ్చి ఆ గురువును రాజు దర్శించుకున్నాడు.*


*గురువు బోధించిన మంచి విషయాలు విన్నాక... గురువు పాదాల మీద ఆ రాజ దంపతులు మోకరిల్లారు.*


*వజ్రాలు పొదిగిన ఒక బంగారు పాత్రను ఆ గురువుకు రాణి ఇచ్చి, దయతో స్వీకరించాలని ప్రాధేయపడింది. *


*”నేను భిక్షాటనతో జీవించేవాణ్ణి. ఈ బంగారు పాత్రతో భిక్ష చెయ్యలేను. దీన్ని జాగ్రత్తగా దాచుకోలేను. వద్దు!” అన్నాడు ఆ గురువు.*


*”పరవాలేదు స్వామీ! ఇది పోతే మరొకటి, అది పోతే ఇంకొకటి ఇస్తాను” అంది రాణి. ఆ పాత్రను అక్కడే ఉంచి, రాజ దంపతులు వెళ్ళిపోయారు.* 


*కొంతసేపటి తరువాత ఒక దొంగ వచ్చాడు. గురువు  ఆ గిన్నెను చూపి, “నాయనా దాన్ని తీసుకుపో! దాంతో నాకేమీ పని లేదు” అన్నాడు.* 


*గురువు ఆ గిన్నె విలువ తెలియని అమాయకుడేమో అనుకొని,  “అది చాలా విలువైనది స్వామీ!” అన్నాడు దొంగ.* 


*అంతేకాదు, “నేనొక దొంగను” అని కూడా చెప్పాడు.* 


*అప్పుడు గురువు  “ఇది నాకు అవసరం లేదు. తీసుకువెళ్ళు. కానీ ‘నేను దొంగను’ అని ఎప్పుడూ అనుకోకు. ప్రతివారిలోనూ బుద్ధత్వం ఉంటుంది. కాబట్టి నువ్వూ బుద్ధుడివే” అంటూ ఆ పాత్రను అతని చేతికి ఇచ్చి పంపాడు.*


*మూడు రోజుల తరువాత ఆ దొంగ తిరిగి వచ్చి, గురువుకు ఆ బంగారు పాత్రను తిరిగి ఇచ్చాడు.  “అయ్యా! దీన్ని ఎవరూ కొనలేదు. ఇక దీంతో నాకేం పని, నువ్వే ఉంచుకో!” అన్నాడు.* 


 *”సరే! ఆ పాత్రను అక్కడ ఉంచు. ఎవరికీ పనికిరాని ఆ పాత్రను రాణిగారికే ఇచ్చేస్తాను. మరి ఇప్పుడు మరో దొంగతనం చేయడానికి వెళ్తావా?” అని అడిగాడు గురువు.* 


*“భలేవాడివయ్యా నువ్వు! ఎక్కడో, ఏదో దొంగతనం చేసి బతికేవాణ్ణి. నువ్వేమో ‘నీవు బుద్ధుడివి’ అని నాతో చెప్పావు. అప్పటి నుంచి ‘బుద్ధుడు దొంగతనాలు చేస్తాడా?’ అనే ప్రశ్నే నన్ను వెంటాడుతోంది. దొంగతనం చేయబుద్ధి కావడం లేదు. మనస్సు ఒప్పుకోవడం లేదు. నేనూ భిక్షాటనతోనే జీవిస్తాను!” అంటూ ఆ గురువు పాదాల మీద తన శిరస్సు ఉంచి నమస్కరించాడు.*


*నిర్మలమైన మనస్సు ఉన్న వారి మాటలు, చేతలు, నిస్వార్థత ఎలాంటి కఠినాత్ములలోనైనా ఊహించని పరివర్తన తేగలవనడానికి ఈ కథ ఒక ఉదాహరణ.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


వేసవిలో ఆహారం

 *డాక్టర్స్ కేర్ మాస పత్రిక నుండి     వేసవిలో ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.*

          *చెమట రూపంలో ఎక్కువగా శరీరంలోని నీరు విసర్జన కావడంతో నీరసం వచ్చేస్తుంది. దీన్ని అధిగమించేందుకు ఎక్కువగా ద్రవహారం తీసుకోవాలి. వీటి వల్ల విటమిన్లు సమృద్ధిగా అందుతాయి. ఎండ దెబ్బకు వచ్చే నీరసాన్ని చిటికెలో నివారించే వీలు చిక్కుతుంది. దీనికితోడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ బయటి తిండ్లకు దూరంగా ఉంటే వేసవిలో అనారోగ్య సమస్యలు రాకుండా గట్టెక్కొచ్చు. ఈ కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినకూడదు.. తాగకూడదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?*


*1) మజ్జిగ :  వేసవికాలంలో తీసుకోవాల్సిన బెస్ట్‌ ఫుడ్స్‌లో మజ్జిగ ఒకటి. రోజులో తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ తాగుతుండటం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. అంతేకాదు... శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి, సాధారణ జలుబు, దగ్గును నివారించేందుకు మజ్జిగ దోహదం చేస్తుంది.*..

*2) పుదీనా: ఇది మనకు చాలా సులభంగా దొరుకు తుంది. చౌకైనది కూడా. ఇదొక హెల్దీ హెర్బ్‌. పెరుగులో కొద్దిగా పుదీనా చేర్చి రైతాను తయారుచేసుకోవచ్చు . పుదీనాతో మంచి ఫ్లేవరబుల్‌ చట్నీలు చేసుకోవచ్చు . ఇది వేసవిలో బాడీ టెంపరేచర్‌ను తగ్గించడంలో గ్రేట్‌ గా సహాయపడుతుంది*.


*3)  ఉల్లిపాయలు: ఉల్లిపాయలో అమేజింగ్‌ కూలింగ్‌ ప్రొపర్టీస్‌ ఉన్నాయి . అందుకే వీటిని రెగ్యులర్‌ డైట్‌ లో చేర్చుకోవాలి. కర్రీస్‌, సలాడ్స్, రైతాలు, చట్నీస్‌లో చేర్చుకోవడం వల్ల మీ శరీరాన్ని చల్లగా మార్చుతుంది . ఎర్ర ఉల్లిపాయల్లో క్విర్సిటిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక నేచురల్‌ యాంటీ అలర్జిన్‌ . వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది.*


*4) పుచ్చకాయ : వేసవిలో తీసుకోవాల్సిన ఆహారాల్లో మరో బెస్ట్‌ ఫుడ్‌ పుచ్చకాయ. ఈ రెడ్‌ కలర్‌ జ్యూస్‌ ఫ్రూట్‌ లో 90శాతం నీళ్లు, 10శాతం ఫ్లెష్‌ ఉంటుంది . వేసవిలో ఈ పండు తినడం వల్ల మీ శరీరాన్ని పూర్తిగా హైడ్రేషన్‌లో ఉంచుతుంది*.


*5)  కర్బూజా : వేసవికి మరో బెస్ట్‌ ఫుడ్‌ మస్క్‌ మెలోన్‌ (కర్బూజా). వేసవిలో డైలీ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన మరో ఆహారం ఇది. ఇందులో ఉండే వాటర్‌ కంటెంట్‌ మీకు చెమట పట్టకుండా నివారిస్తుంది*.


*6) జామకాయ: జామకాయలో విటమిన్‌ 'సీ' పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి వేసవిలో ఆరోగ్యంగానూ, శక్తిమంతం గానూ ఉంచు తాయి. జామకాయలో ఉండే ప్రోటీన్లు ఎక్కువ శక్తిని అందిస్తాయి*.


*7) కొబ్బరి బోండాం: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి బోండాం నీరు దోహదం చేస్తుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే చర్మ రుగ్మతలనుs  పారదోలుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను నివారిస్తుంది.*


*8) నిమ్మకాయ: శరీరంలోని విషాలను బయటకు పంపిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్‌ చేయడానికి సహాయపడుతుంది*.


*9) కీరదోసకాయ: కీరదోసకాయలో ఆరోగ్యానికి కావాల్సిన పోషక విలువలు సమృద్ధిగా లభ్యమ వుతాయి. వేసవిలో ఈ కాయను తీసుకోవడం చాలా శ్రేష్టం. దీనిని సలాడ్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత తేమ అంది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది.*


*10) ఫైనాపిల్‌: ఇందులో నీటితో కూడిన యాంటి ఆక్సిడెంట్స్‌, ఫైబర్‌ అధికంగా ఉం టుంది. కాబట్టి ఫైనాపిల్‌ తరచూ తీసు కోవడం ఉత్తమం. ఇందులో విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి* .✍️

రత్నాలను ఎలా సేకరిస్తారు?*

 

      *రత్నాలను ఎలా సేకరిస్తారు?*m

                  ➖➖➖✍️



*ఒకసారి, ఒక న్యాయస్థానం తన సైనికులకు అర కిలో సున్నపురాయి పొడి తినమని శిక్ష విధించేది.*


*తమలపాకులతో (తాంబూలం) సున్నపురాయి పొడిని తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తున్నప్పటికీ, అర కిలో సున్నాన్ని ఒకేసారి నాకడం ద్వారా మానవులు బతికే అవకాశం లేదు.*


*కాబట్టి, అలాంటి శిక్ష పొందారంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు చేసి ఉండాలి!*


*ఒక సైనికుడు సున్నం కొని మరుసటి రోజు న్యాయస్థానంలో నాకాలి, కాబట్టి అతను దానిని కొనడానికి తమలపాకు దుకాణానికి వెళ్ళాడు.*


*అయితే అంత సున్నం అడిగేసరికి దుకాణదారుడు ఖంగుతిన్నాడు.*


*దుకాణదారుడికి ఏదో సందేహం వచ్చి, ఇంత పెద్ద మొత్తంలో సున్నం కొనడానికి కారణం అడిగాడు.*


*శిక్షగా మరుసటి రోజు కోర్టులో సున్నం నాకవలసి ఉందని ఆ వ్యక్తి చాలా విచారంగా చెప్పాడు.*


*దానికి దుకాణదారుడు, "ఫర్వాలేదు. నేను నీకు సహాయం చేస్తాను. ముందుగా వెళ్లి అర కిలో నెయ్యి తీసుకురా " అని బదులిచ్చాడు.*


*సైనికుడు ఆశగా చూసి, వెంటనే వెళ్లి నెయ్యి కొనుక్కొచ్చాడు.*


*అతనికి అరకిలో సున్నం ఇస్తుండగా, దుకాణదారుడు "రేపు న్యాయస్థానంకు వెళ్లే ముందు ఈ నెయ్యి తాగు, ఆపై               నీ శిక్ష ప్రకారం సున్నం తిను.*


*ఆ తర్వాత, ఆలస్యం చేయకుండా వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళు. ఇది నిన్ను రక్షించడంలో సహాయపడవచ్చు." అని చెప్పాడు.*


*మునిగిపోతున్న వ్యక్తి  ఒక గడ్డిపోచనైనా పట్టుకుంటాడు!*


*సైనికుడు చాలా ఆశలతో ఇంటికి వెళ్ళాడు, మరుసటి రోజు అతను దుకాణదారుడు చెప్పినట్లు చేశాడు.  అర కిలో నెయ్యి తాగి ఇంటి నుంచి వెళ్ళాడు. శిక్షగా, అతను ప్రజలతో నిండిన న్యాయస్థానంలో అర కిలో సున్నం కూడా తిన్నాడు.*


*సున్నం తిన్న వెంటనే శిక్ష పూర్తవడం వల్ల, జీవితంలోని చివరి క్షణాలను కుటుంబంతో గడుపుతాడని అతనిని ఇంటికి పంపేశారు.*


*ఇంటికి చేరుకున్న వెంటనే సున్నం మొత్తం నెయ్యితో కలిపి వాంతి చేసుకున్నాడు.*


*కొంత బలహీనంగా అనిపించినా, మరుసటి ఉదయం నాటికి బాగానే ఉన్నాడు.*


*మాములుగా తన ఉద్యోగవిధికి సమయానికి ఆస్థానం చేరుకున్నాడు.*


*అందరికీ అతను ముందు రోజు సున్నపుపొడిని తిన్నాడని తెలుసు, కానీ ఎలా బతికిఉన్నాడా అని అందరూ ఆశ్చర్యపోయారు.*


*వెంటనే, ఈ వార్త రాజభవనం అంతటా వ్యాపించింది, ఈ విషయం అక్బర్‌కు కూడా చేరింది.*



*అక్బర్ కూడా ఆశ్చర్యపోయాడు, వెంటనే ఆ సైనికుడిని ఆస్థానానికి పిలిచాడు.*


*అక్కడికి చేరుకోగానే అక్బర్ అతను ఎలా బతికాడో ఆ రహస్యాన్ని చెప్పమన్నాడు.*


*దుకాణదారుడి గురించి, నెయ్యి, వాంతుల గురించి అతను నిజాయితీగా మొత్తం కథను వివరించాడు.*


*దుకాణదారుడి తెలివిని, దూరదృష్టిని చూసి అక్బర్ ఆశ్చర్యపోయాడు.*


*అతను ఆ దుకాణదారుని తన ఆస్థానానికి పిలవడమే కాకుండా, ‘వజీర్-ఎ-ఆజం’ పదవి మీద తన రాజ్యసభలో సభ్యునిగా కూడా నియమించాడు.*


*ఆ దుకాణదారుడి పేరు మహేష్ దాస్, కానీ అక్బర్ అతని పేరును ‘బీర్బల్‌’ గా మార్చాడు, అంటే "సమర్థవంతమైన మనస్సు కలిగిన వ్యక్తి" అని అర్ధం.* 


*ఇది మాత్రమే కాకుండా, అతనికి 'రాజు'  అనే బిరుదుతో కూడా సత్కరించారు.*


*అతను అక్బర్ ఆస్థానంలోని తొమ్మిది రత్నాలలో ఒకడిగా పేరు పొందాడు.*


*జీవితంలో మన పురోగతి వాస్తవానికి మనం ఏ రకమైన వ్యక్తులతో అనుబంధం కలిగి ఉంటామో దానిపై ఆధారపడి ఉంటుంది.*


*ఎందుకంటే మనం ఉన్న వాతావరణం నేరుగా మన జీవనశైలిని ప్రభావితం చేస్తుంది, మన జీవనశైలి మన విధిని రూపొందిస్తుంది.*



*నిజమైన ప్రతిభను గుర్తించేందుకు నిష్పక్షపాత దృష్టిని, వారిని బహిరంగంగా గౌరవించే, అంగీకరించే ఉదార హృదయాన్ని మనం అలవర్చుకోవాలి.*



♾️♾♾♾♾♾♾♾♾


*రాళ్ళ సందుల మధ్య పువ్వు దాగిఉన్నా, తేనెటీగ దానిని కనుగొంటుంది?*

*మన హృదయాలను అలాంటి పువ్వులలాగా ఎలా తయారు చేసుకోగలం?*✍️


*అనుభూతి -  ఇతరుల అంతర్గత ప్రతిభను గుర్తించి, గౌరవించే ఉదార హృదయాన్ని కలిగి ఉన్నందుకు నేను  కృతజ్ఞతతో ఉంటాను.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


రైలు చేసిన హత్యలు.

 రైలు చేసిన హత్యలు.


సాయంత్రం సమయం అది

పట్టాలపై పరిగెత్తుతున్న రైలు

గమ్యం చేరాలనే ప్రయాణికుడు

ఏ తప్పిదమో గతి తప్పింది.


రైలు వెళ్ళే మార్గం మళ్ళింది

లూపు లైనున వెళ్ళింది

అనుకోని ప్రమాదం జరిగింది

మరో రైలును డీకొన్నది.


ఎగసిన బోగీలు ఒకదానిపై మరొకటి

క్షణాలలో మరో రక్త పిపాసిగా మారి

వందల మంది ప్రాణాల్ని బలిగొంది

చరిత్రలో విషాద దినంగా మారింది.


అంతలోనే మరో విపత్కరం

ప్రమాదంతో మరో ప్రమాదం

నేల కూలిన రైలు బోగీలు

పడేను ప్రక్క ట్రాకున..

అంతలో మరో రైలు వచ్చేను.


చూసే లోపే రైలుబండి డీకొనే

చావు రక్కసి విలయం చేసే

మృత్యువు వికటహాసమాయే

అచట విలయతాండవమాడే.


శ్వాసలన్నీ బలిపీఠాన కొట్టుమిట్టాడే

ఎర్రని నెత్తురు వరదయై పారేనే

క్షణ భంగురాన శవాలుగా మారే

ఎందరో క్షతగాత్రులుగా అయ్యే.


రైల్వే చరిత్రలో పెను ప్రమాదం

జాతి మొత్తం విషన్న వదనం

ఊపిరొదిలిన అభాగ్యులు

వారికి అర్పించాలి నివాళులు.


కాదిది తప్పొప్పుల కాలం

సహయ సహాకారాల‌ సమయం

ఆపన్న హస్తాలు చాటు

ఆపదలో అండగా నిలువు.


ఈ విపత్కర సమయంలో

బాధిత కుటుంబాలకు అండగా

మానవత్వం చూపుదాం

మనిషిగా గమనం చేద్దాం.


రైలు చేసిన హత్యల్లో అశువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తూ..


బాధాతప్త హృదయంతో..


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

శ్రీ రుద్రం విశిష్టత :

 శ్రీ రుద్రం విశిష్టత :

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మే నని తెలియజేస్తుంది. శ్రీ రుద్రాన్ని రుద్రాప్రస్న అని కూడా అంటారు. వేద మంత్రాలలో ఏంటో ఉత్కృష్టమైనది. శ్రీ రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చే మొదటి భాగం, యజుర్వేదంలో ౧౬వ అధ్యాయంలో ఉంటుంది. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వాళ్ళ దీనిని చమకం అంటారు. ఇది ౧౮వ అధ్యాయంలోఉంది.

చమకం నమకం చైవ పురుష సూక్తం తథైవ చ |

నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||

నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతీ దినం చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.

నమకం విశిష్టత :

నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.

అనువాకం – 1:

తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.

అనువాకం – 2 :

ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.

అనువాకం – 3:

ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారనంకు కూడా చదువుతారు.

అనువాకం – 4:

ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:

అనువాకం – 5:

ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృషి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.

అనువాకం – 6:

ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.

ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షనకు కూడా చదువుతారు.

అనువాకం – 7:

నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న ర్ద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.

అనువాకం – 8:

ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.

అనువాకం –9:

ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ స్కక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.

అనువాకం – 10:

ఈ అనువాకంలో మల్ల రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపసమించి, పినాకధారియైనా, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.

అనువాకం – 11:

ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్తి దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.


*చమకం విశిష్టత:*

నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. 

జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం.

సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేడు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే.


                           స్వస్తి!

ఏరువాక పున్నమి*

 *నేడు ఏరువాక పున్నమి*


*ఏరువాక పౌర్ణమి అనగానేమి దాని  ప్రత్యేకత ఏంటి?*🎋 



*ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి*!

🍁వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు భూమి పూజ చేయడం వేదకాలం నుంచి వస్తోన్న ఆచారం. ఇందుకోసం పెట్టిన ముహూర్తమే ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమి రోజే ఏరువాక పౌర్ణమి జరుపుకుంటారు..దీని ప్రత్యేకత ఏంటంటే..


🍁వ్యవసాయాన్ని ఓ యజ్ఞంగా భావిస్తారు. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేసి దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఈ వేడుకను జ్యేష్ఠ పౌర్ణమిరోజే ఎందుకు జరుపుకుంటారంటే. ఏరువాక అనే మాట అందరికీ తెలిసినదే! కానీ ‘ఏరువాక’ అనే పదానికి అర్ధం చాలామందికి తెలియదు. ఏరు అంటే ఎద్దులను పూన్చి దుక్కి దున్నడానికి సిద్దపరచిన నాగలి. దుక్కిదున్నే పనిని శాస్త్రోక్తంగా ప్రారంభించడాన్ని ‘ఏరువాక’ అని పేరు అంటే వ్యవసాయ పనుల ప్రారంభించడం అని అర్థం. 


జ్యేష్ఠ పౌర్ణమి రోజే ఏరువాక ఎందుకు!

🍁సస్యానికి అధిపతి చంద్రుడు ఇంకా చెప్పాలంటే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమనాడు మొదటిసారి పొలాన్ని దున్నడం సెంటిమెంట్.


భారతీయ జీవన విధానానికి వ్యవసాయం మూలస్తంభం 

🍁భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి వ్యవసాయం మూలస్తంభం లాంటిది. దానికి తొలి పనిముట్టు నాగలి, ముఖ్య వనరు వర్షం. ఆ వర్షం కురిసే కాలం మొదల య్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ 'కృషిపూర్ణిమ' దీనికే హలపూర్ణిమ, ఏరువాక పున్నమి అనే పేర్లతో పిలవబడుతుంది. 'ఏరు' అంటే నాగలి అని, 'ఏరువాక' అంటే దుక్కి ప్రారంభం అనీ అర్థాలున్నాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం, నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం జ్యేష్ఠ పూర్ణిమ పర్వదిన ముఖ్యాంశాలు.


రైతులు ఈ పండుగను ఎందుకు జరుపుతారు..? 

🍁రైతులు ఈ పండుగ జరపడానికిగల కారణాన్ని పరిశీలిస్తే - నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు ( మంచు, ఎరువు, సూక్ష్మధాతువులు ) పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. పై కారణాలన్నింటివల్ల జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ పర్వదినాన్ని జరుపుతారు.


పంటపొలం దైవక్షేత్రం!

🍁పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తారు, వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం..అందుకే దీన్న యజ్ఞంలా పవిత్రంగా భావించి చేస్తారు. అందుకే పొలం గట్లపై చెప్పులేసుకుని నడుస్తారు కానీ పొలాలు లోపలకు దిగేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకోరు. ఏందుకంటే ఆ క్షేత్రం దైవసమానంగా భావిస్తారు. అందుకే వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జ్యేష్ఠ పూర్ణిమరోజు రైతులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి పూజిస్తారు. వాటికి భక్ష్యాలు సమర్పించి మేళతాళాలతో ఊరేగిస్తారు.


ఏరువాకకి ఎన్ని పేర్లో!

🍁ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో అంటారు, కన్నడంలో కారణి పబ్సం అని జరుపుకుంటారు. అధర్వణవేదం ఏరువాకను 'అనడుత్సవం'గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు లాంటి మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణుపురాణం ఏరువాకను సీతాయజ్ఞంగా వివరించింది. సీత అంటే నాగలి అని అర్థం. 


'వప్ప మంగళ దివసం'

'బీజవాపన మంగళ దివసం'

'వాహణ పుణ్ణాహ మంగళమ్'

'కర్షణ పుణ్యాహ మంగళమ్


🍁అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. 


🍁కొన్ని ప్రాంతాలలో ఊరు బయట, గోగునారతో చేసిన తోరాలు కడతారు. రైతులంతా అక్కడికి చేరి చెర్నాకోలతో ఆ తోరాలను కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకొచ్చి ఎద్దుల మెడలో కడతారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయం, పశు సంపద వృద్ది చెందుతుందని నమ్ముతారు.

పర్వతము

 🪷


సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*గిరిర్మహాన్ గిరేరబ్ధః*

*మహాన్ అబ్ధేః నభో మహత్౹*

*నభసోsపి మహద్బ్రహ్మ*

*తతోsప్యాశా గరీయసీ॥*



తా𝕝𝕝 

"పర్వతము గొప్పది.... పర్వతము కంటే సముద్రము పెద్దది....సముద్రము కంటే ఆకాశము గొప్పది.......ఆకాశము కంటే పరబ్రహ్మము గొప్పది..... ఆ *పరబ్రహ్మము కంటే ఆశా ఇంకా గొప్పది..... అనగా ఆశకు అంతు ఉండదు.

తెలుగోడి తెలుగ్గోడు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

తెలుగోడి తెలుగ్గోడు!- సరదా కోసం 

( తెలుగు వెలుగు వ్యాసం ) 


రుగ్వేదంలో ఆంధ్రులున్నారు. రామాయణంలో సీతకోసం ఆంధ్రదేశంలో వెదకడం ఉంది. పోతన భాగవతం ప్రకారం బలి సంతానంలో ఆఖరివాడు ఆంధ్రుడే. యుధిష్ఠిర చక్రవర్తి పట్టాభిషేకోత్సవానికి హాజరైన రాజులలో ఆంధ్రరాజూ ఒకడు. పురాణమో, పుక్కిటపురాణమో.. ఒక లెక్కప్రకారం ఆంధ్రులంతా విశ్వామిత్ర మహర్షి సంతానమే. విశ్వామిత్రుడు విశిష్టిమైన వ్యక్తి. గురువునుమించి ఎదగాలన్న తపన  ఆయనది. ఎన్నో ఉద్యమాలకు ఆయన  స్ఫూర్తిప్రదాత.  సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపరవిధాత. త్రిశంకుస్వర్గనిర్మాత. గాయత్రీమంత్ర ఆవిష్కర్త. వంకాయ, టెంకాయ, గోంగూరవంటి విడ్డూరాలన్నీ ఆయన ప్రసాదాలే.  తెలుగువాడికి అందుకే అవంటే అంత ప్రీతి. దీక్ష.. కక్ష తెలుగువాళ్లందరికీ విశ్వామిత్ర మహర్షినుంచే వారసత్వపు లక్షణాలుగా సంక్రమించాయేమోనని అనుమానం.  

రామాయణంలోని కిష్కింధ  ఆంధ్రదేశంలోని ఓ అంతర్భాగమేనని  వాదన ఉంది. ఆ లెక్కన మనమందరం కిష్కింధవాసులమే! అన్నదమ్ముల మత్సరం వాలిసుగ్రీవులనుంచి అబ్బిన జబ్బేమో! వాయుపుత్రుడి లక్షణాలూ తెలుగువాడికి ఎక్కువే మరి!

స్వామిభక్తి తెలుగువాడికి మరీ విపరీతం. స్వామికార్యం తరువాతే వాడికి ఏ స్వకార్యమైనా. ఆరంభశూరత్వం, అత్యుత్సాహం ఆంధ్రుల గుత్తసొత్తు. చూసి రమ్మంటే కాల్చి వస్తేనే వాడికి తృప్తి! కొమ్మ తెమ్మంటే కొండను  పెకలించుకొచ్చాడంటే వాడు కచ్చితంగా తెలుగువాడే. ఆ రావడంలోకూడా ఆలస్యమవడం వాడి ప్రత్యేక లక్షణం. కోటిలింగాలు తెమ్మని రాములువారు  ఆజ్ఞాపిస్తే ఆంజనేయులుగారు ఏమి చేసారు? ఒకటి తక్కువగా తెచ్చుకొచ్చారు! ఆర్భాటంగా మొదలుపెట్టి అసంపూర్తిగా చుట్టబెట్టడం తెలుగన్నకు  మొదట్నుంచీ అలవాటే!  స్వశక్తియుక్తులు మరొకడు పనిగట్టుకొని పొగిడితేగాని గుర్తెరగలేని బోళాతనం తెలుగువాడిది. సముద్రాలు లంఘించే శక్తిగలిగివుండీ ఏ స్వామివారి పాదాల చెంతో విశ్రాంతి కోరుకోవడం తెలుగువాడికి అనాదిగా వస్తున్న బలహీనత.


' తెలుగువాడివి అన్నీ అవలక్షణాలేనా?' అని ఉసూరుమనుకోవాల్సిన అవసరం లేదు.  వనవాసంలో రామసోదరులను ఆదరించిన శబరితల్లి తెలుగుతల్లే! చేసిన ఘనకార్యం  చెప్పుకొనే  సంప్రదాయం  అప్పట్లో లేదు. ఇంకెంతమంది కడుపునింపిందో  ఆ అన్నపూర్ణమ్మ తల్లి అందుకే మనకి తెలీదు. తెలుగుమహిళకు భోజనం వడ్డించడమంటే మహాసరదా కదా! పేరుకే అన్నపూర్ణమ్మ  కాశీనివాసి. అసలు మసలేదంతా మన తెలుగునేల నలుచెరగులే కదా! డొక్కా సీతమ్మలు, మంగళగిరి బాలాంబలు అడుగడుక్కీ తారసిల్లే పూర్ణగర్భలండీ తెలుగురాష్ట్రాలు రెండూ!


ఉద్యమమైనా సరే.. ఉప్పు సత్యాగ్రహమైనా సరే సొంతముద్రంటూ లేకుండా తెలుగువాడు ఒక్కడుగు ముందుకు కదలడు. బౌద్ధాన్ని సంస్కరించి మరీ ప్రచారం చేసిన నాగార్జునుడు మన  తెలుగువాడే! తెలుగువాడికి కొత్తొక వింత. పాతొక రోత. అందాకా నెత్తికెత్తుకొన్న జైనం శైవంరాకతో హీనం అయిపోయింది! ఆనక వాడు  వైదికం మోజులోపడ్డాక శైవం రాష్ట్రాల  శీవార్లలోకి పారిపోయింది !


అటు ఆర్యులు.. ఇటు ద్రవిడులు! ఇద్దరూ ముద్దే మనకు! రెండు సంస్కృతుల పండుగలు  మనం సంబరంగా చేసుకొంటాం! పోతరాజు కృష్ణుణ్ణి తెలుగుదేవుడు చేసేసాడు. రామదాసు ఇక్ష్వాకులవాసిని సతీసోదరసమేతంగా భద్రగిరికి కట్టేసాడు.  కృష్ణరాయలు పాండిత్యప్రకర్షతో రంగధాముణ్ణి తెలుగుపెళ్ళికొడుకుగా తయారుచేసాడు. కరుణ శ్రీ పాపయ్యశాస్త్రి భక్తిప్రవత్తులకు బద్ధుడైనట్లు బుద్ధభగవానుడు తెలుగు చిరునామా స్వీకరించాడు. అందరూ కావాలనుకొనే తత్వం తెలుగువాడిది. అయినా అతగాడే ఎవరికీ అక్కర్లేదు! భారతంలో తెలుగువాడి ఊసు ఆట్టే లేకపోయినా 'వింటే భారతమే వినాలి' అంటూ టాంటాం కొట్టుకొనే రకం తెలుగువాడు!


సాహసంలో మాత్రం? మనం వెనుకంజా? తైలంగ సామ్రాజ్యాన్ని స్థాపించాం. సుమిత్రా, జావా ద్వీపాల్లో వలస రాజ్యదీపాలను వెలిగించాం. సయాడోని సిచియా వంటి  సుదూర ప్రాంతాల్లో నిబద్ధతతో బౌద్ధదర్మాన్ని ప్రచారం చేసి వచ్చాం. ఈజిప్టురాణికి చీనాంబరాలు కట్టబెట్టిన ఘనత మన  తెలుగువాడిదే! అజంతా, అమరావతి, సాంచి క్షేత్రాలలో అసమాన శిల్పకళావైభవాన్ని సృజించిన కళాతపస్వి మన తెలుగుయశస్వి. ధాన్యకటక విశ్వవిద్యాలయం స్థాపించి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన గురువులు మన తెలుగువారు. మానవనాగరికత మణికిరీటంలో నిరంతరం వెలుగులు చిమ్మే కోహినూరు వజ్రాలు కదుటండీ మన తెలుగువారు!

మేధస్సులోమాత్రం మనమేమన్నా అధమస్థులమా? హైదవం క్షీణదశలో  దక్షిణాది గోదావరీతటంనుంచే మహాతత్త్వవేత్త శంకరాచార్యులు ప్రభవించించింది. స్వధర్మ పునరుత్థనార్థం జన్మించిన పుణ్యమూర్తి విద్యారణ్యుడూ తెలుగు పురుషుడే! ఆయన తోడాబుట్టిన సాయనుడు వేదాలకు  భాష్యం చెప్పిన ఉద్దండుడు.  ఉత్తరాది కావ్యాలకు  వ్యాఖ్యానాలు చేసిన మల్లినాథుడుది తెలుగునాడు. జగన్నాథ పండితరాయలు హస్తిన ఎర్రకోట  యవనసుందరి అంకపీఠంపైన తెలుగుప్రతిభను సుప్రతిష్ఠంచిన ఘనుడు.   దేశదేశాల తాత్వికకేతనం విజయవంతంగా ఎగురువేసిన తెలుగు జ్ఞాననికేతనం రాధాకృష్ణపండితుడు. అంతర్జాతీయంగా కీర్తిప్రతిష్టలార్జించిన కోడి రామ్మూర్తి, సి.కె.


నాయుడు, ఎల్లాప్రగడ సుబ్బారావు మన తెలుగువెలుగులేనంటే  తెల్లబోతాం మనం.

గొప్పవాళ్లెప్పుడూ తెలుగువాళ్లు కారనీ.. తెలుగువాళ్లయుంటే గొప్పవాళ్లే అవలేరనీ మన తెలుగువాళ్లకో గొప్ప నమ్మకం. బొంబాయి చేరితేగాని కాశీనాధుని నాగేశ్వర్రావు పంతులుగారు నాలుగు కాసులు కళ్లచూడలేదు. తమిళదేశం చెప్పిందాకా  బాలమురళి గానగాంధర్వుడని  మనం ఒప్పుకోలేదు! అమెరికా గుర్తించిందాకా నాదెళ్ల సత్య ప్రతిభ మన కళ్లపడలేదు! తెలుగువాడు పైకిరావాలంటే పైకన్నా పోవాలి. దేశందాటి పైకన్నా పోయిరావాలి! ఎందుకిలా?


తెలుగువాడి వెటకారం వాడి  మరీ అంత అత్యధికమా?! మహామాత  కాళీదేవత ప్రత్యక్షమయితే మరోడయితేసాగిలపడి మొక్కేవాడు. ఆమె అంగసౌష్టవంచూసి ఫక్కున నవ్వాడంటే తెనాలి రామలింగడు తెలుగువాడు కావడమే కారణం! వేలెడంత లేకపోయినా జానెడంతవాణ్ణి చూసి ‘మూరెడంతైనా లేడ’ని మూతి మూడువంకర్లు తిప్పాడంటే నిక్షేపంగా వాడు తెలుగుజాతికి చెందిన ఘనుడే  అయివుండాలి.

.

పాకశాస్త్రంలో తెలుగింటి  ప్రావీణ్యమే వేరు. తెలుగు తాళింపు దినుసులు మరే ఇతర ప్రాంతాలలో కనిపించవు. తెలుగు వర్ణమాలా ఓ వంటింటి పోపుపెట్టె వంటిదే సుమా! సాతాళించగల చేవ ఉండాలేగాని.. తెలుగువంటకంలా తెలుగురచనా ఒక నవరసాల విందు.

గంగాజలం తెచ్చి కృష్ణ, గోదావరి, తుంగభద్రల్లో కలగలపడమే తెలుగుదనం కలివిడిదనం. తాగునీటినిసైతం ‘మంచి’నీరుగా పిలిచే మంచి నైజం తెలుగువాడి సొంతం! తెలుగుభాషకూ మంచినీరులా మేధోదాహార్తిని తీర్చే సత్తా ఉంది. శబ్దానికి  పూర్తిన్యాయంచేసే శక్తి ఇటాలియన్  తరువాత  ఒక్క తెలుగక్షరంలోనే ఉంది! ఇది ఆధునిక భాషాశాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్న మాట. కంప్యూటర్ వేగాన్ని అందిపుచ్చుకోగల 'బైట్ స్ సామర్థ్యం తెలుగులిపికి అలంకారప్రాయం- అని  సాఫ్టువేరు నిపుణులు వెలిబుస్తున్న అభిప్రాయం.  


ఏ పలుకునైనా తనలో మంచినీళ్ల ప్రాయంగా కలుపుకోగల కలివిడితనం తెలుగువర్ణమాలకు ప్రత్యేకం. ద్రవిడ సంస్కారి చిన్నయసూరిచేత చక్కని వచన రచన చేయించిందీ తెలుగు పలుకుబడే! తెలుగుమాట తేటతనానికి దాసోహమయే బ్రౌన్ దొర నిఘంటువు నిర్మాణానికి పూనుకొన్నది!  జిజ్ఞాసకు తగ్గ ఉపజ్ఞ తెలుగుభాషామతల్లి  ప్రజ్ఞ.

'ఆంధ్రదేశపు మట్టి.. అది మాకు కనకంబు' అని ఆ మహామహులు తలవంచినే చోటుకే  ఇప్పుడు మనం తలవంపులు తెస్తున్నాం. అదీ విచారం!


పరాయితనం భుజానమోసే ఔదార్యంలోనే తెలుగువాడెందుకో ముందునుంచీ తరించిపోతున్నాడు! సగటు తెలుగు నాలుకకు  తెలుగు పదాల మాధుర్యం వెగటు?! ఆదిలో  సంస్కృతం, మధ్యలో హిందూస్తానీ, ఇప్పుడు ఆంగ్లం! వట్టి తెలుగుమాత్రమే తెలిసుంటే అది  వాజమ్మతనానికి నిదర్శనం! ‘గొప్పోళ్ళు చాలామందికి తెలుగురాదు. కాబట్టి తెలుగురాకపోవడమే గొప్పదన’మనుకొనే తెలివితక్కువతనం రోజురోజుకీ ఎక్కువవ్తుతున్నది కూడా  తెలుగునాటనే ! ‘విజ్ఞానమంటే కేవలం ఇంగ్లీషుమాట. పాండిత్యమంటే కేవలం సంస్కృత పదాల ఊట’. ఇదీ  ప్రతి సగటు తెలుగునోటా నేడు వినిపిస్తున్న వంత పాట! పరాయిభాషల రుచి నోటికి పట్టాలన్నా పసిదశలో బిడ్డకు తల్లిభాష పాలు పట్టాలా వద్దా? చావగొట్టినా సొంతభాషరాని చవటకి చావచితక్కొట్టినా పరాయి భాష వంటపట్టదని భాషాశాస్త్రవేత్తలే మొత్తుకొంటున్నారు కదా !


భోజనాలయంలోకి వెళ్ళినప్పుడు 'వాటర్' 'చట్నీ' అంటేనేకానీ వడ్డించేవాడి తలకెక్కదా?! కొట్లాట్టానికి అక్కరకొచ్చే సొంతభాష న్యాయస్థానాల్లో ఫిర్యాదులిచ్చేందుకు ఎందుకు చేదవుతున్నదో ?! రోగాలకే కాదు.. వాటి నిదానానికి  వాడే మందులకూ  నోరుతిరగని లాటిన్ పేర్లా ?! రైలు, రోడ్డు, పోస్టు, సైకిలు, ఫోను, సెల్ఫోను.. నిత్యవ్యవహారంలో నలిగే కొన్ని పదాలకు ప్రత్యామ్నాయం  లేక వాడుకలో ఉన్నాయంటే..ఏదో అర్థం చేసుకోవచ్చు. పుస్తకం, కలం, ప్రేక్షకుడు, సంతోషంవంటి పదాలకూ బుక్కు, పెన్ను, ఆడియను(నిజానికి ఆడియను అన్న మాటే తప్పు), హ్యాపీసు వంటి సంకర పదాలను వాడే తిక్కసంకరయ్యలు  ఎక్కువయిపోతున్నారు ! భేషజంకోసం, అతిశయంకోసం పరాయిభాషాపదాలను వేలంవెర్రిగా వాడే గురజాడ గిరీశాలు తలుగునాట రోజురోజుకూ ముదిరిపోతున్నారు!  ఆత్మగౌరవం ప్రాణప్రదంగా భావించే తెలుగువాడికెవడికైనా   ఇది చివుక్కుమనిపించే  అంశం.


తెలుగుగడ్డమీద తెలుగుబిడ్డ మెడలో ‘తెలుగు పలకను' అంటూ పలకలా?! తెలుగులో ఏడ్చిన నేరానికి పసిదాని అరచేతికి వాతలా?!

పేరుకేనా మనది ప్రజాస్వామ్యం? పాలితుడి పలుకుమీద పాలకులకెందుకో ఇంత కోపం?!  జన్మతః జిహ్వమీద కొలువైన శబ్దదేవత కదా తల్లిభాష!  జంతుతతులకన్నా విలక్షణంగా బతుకును తీర్చిదిద్దే ఆ భాషామతల్లి  అంటే తెలుగువాడికి తగునా అంత చులకన?! తల్లిమీద, తల్లిభాషమీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి?!

✍కర్లపాలెం హనుమంతరావు


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

చారిత్రాత్మక కథాస్రవంతి🌹* . ♦️ *ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 80*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 80*


పాటలీపుత్ర దుర్గము చంద్రగుప్త సేనల వశమైనది. 


నందులు మరణించినందున ప్రస్తుతానికి చేయునది లేక రాక్షసామాత్యుడే స్వయంగా చాణక్య చంద్రగుప్తులకు స్వాగతం పలికాడు. ఆ సందర్భంలో అతడు కావాలనే తన మిత్రుడైన పర్వతకుని విస్మరించాడు. 


చాణక్య చంద్రగుప్తులకు ఒక ప్రత్యేక భవనం విడిదిగా ఏర్పాటు చేయబడింది. పర్వతక, వైరోచన, మలయకేతులకు మరొక భవనం, ఇతర రాజన్యులకు వారి వారి అంతస్థుల ననుసరించి విడిది భవనాలు ఏర్పాటు చెయ్యబడ్డాయి. 


పాటలీపుత్ర దుర్గము, నగరంలోని ముఖ్యస్థావరాలన్నింటి రక్షణ బాధ్యతలను చంద్రుని స్వంత రాజ్యములైన పాంచాల, సింహపురి సేనలు స్వీకరించాయి. చాణుక్యుని స్వంత గూఢచారులు అన్ని ముఖ్య ప్రాంతములందూ భటులుగా, దాసులుగా, పరిచారకులుగా, అనేక విధాలైన మారవేషాలలో కుదురుకొని యుద్ధానంతర విశేషాలను, ప్రజాభిప్రాయాలనూ వైరీవర్గపుటెత్తుగడలను గమనించసాగారు. 


రాజభవనమైన సుగాంగ ప్రాసాదములో ప్రవేశించడానికి మంచి ముహూర్తాలు లేనందున చంద్రగుప్తునికి వేరొక భవనము విడిది అయింది. ఈ ఏర్పాట్లన్నీ దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించిన రాక్షసామాత్యుడు చీకటి పడే వేళకు తన నిజగృహమునకు చేరుకున్నాడు. 


ఇక మగధ సామ్రాజ్య విజయానంతరం 'చంద్రగుప్తుని త్రోసిరాజని' తామే మగధను ఆక్రమించగలమన్న ఆశతో, సంతోషంతో పర్వతక బృందము ఆ రాత్రి మధ్యపానీయముల మత్తులో మునిగితేలారు. ఆ విజయానికి తామే కారకులమన్న సంబరంలో పండగ చేసుకుంటున్న పర్వాతక బృందము ఆ యుద్ధంలో అధికంగా నష్టపోయినది తమ సైనికులేననీ, తమవద్ద ఇప్పుడు తమ రక్షణకు అవసరమైనంత స్వీయసైనిక బలంలేదన్న విషయాన్ని కూడా గమనించలేని స్థితిలో వారున్నారు. 


ఆ రాత్రి ఎవరి ఆలోచనల్లో వారున్నారు. అందరివీ రహస్య మంత్రాంగాలే కనుక ఎక్కడా చడీ చప్పుడూ లేదు. రాక్షసామత్యుడు తన గృహంలోని ఏకాంత మందిరంలో ఒంటరిగా ఆలోచనా సముద్రంలో మునిగిపోయాడు. 


"ఆహా ! ఆ చాణక్య హతకుడు అనంతపనీ చేశాడు. ఆనాడు చేసిన ప్రతిజ్ఞ తీర్చుకోవడానికి మా మిత్రులని తమ మిత్రులుగా మార్చుకొని వారి చేతనే దండయాత్ర జరిపించి ఫలితములను తాను పొందుతున్నాడు. కోటలోపలనుంచి కూడా పధకం ప్రకారం సైనిక తిరుగుబాటు జరిపించాడంటే... ఆ చాణక్యుని ప్రజ్ఞయే.. ప్రజ్ఞ.. మరినేనో... నందుల నాశనాన్ని కళ్లారా చూస్తూ ఏమి చెయ్యలేని అసమర్ధుడిగా మిగిలిపోయాను, మహాపద్మనందుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వ్యర్థుడినయ్యాను... పైగా, ఆ చంద్రుడి చేతచిక్కిన నన్ను చంపక "గురువాజ్ఞ ప్రకారం ప్రాణదానం చేస్తున్నా"నని పలికితే... భరించి... సహించి... దిక్కుమాలిన ప్రాణాలు కాపాడుకుని... ఆ చంద్రునికే కోటలోనికి స్వాగతమిచ్చినాను గదా... చీఛీ... ఇంకెందులకీ పౌరుషహీనమైన బ్రతుకు..." 


పరాభవ పరాజయ పరితప్త హృదయంతో కుమిలిపోతున్న రాక్షసుడు ఆవేదనతో తనలో తాను క్షోభిస్తూ "నందులను రక్షిస్తాననీ, మగధ సింహాసనం నందులదేనని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నేనూ ఒక మనిషినేనా .... ? కాదు... మాటంటే ... మాటే... చంద్రగుప్తుడికి సింహాసనం దక్కరాదు. చాణక్యుని ఆటలు ఈ రాక్షసామాత్యుని ముందు సాగనివ్వరాదు... నందులు హతమైనా... నేను ఇచ్చిన మాటకోసం ... నందవంశజుడు ఎవరో ఒకర్ని తెచ్చి... ఎవరో ఒకర్ని ...." అంటూ ఆవేశపడుతున్న వాడల్లా చప్పున ఆగి "ఆ ! వున్నాడు... రాక్షసామాత్యుని మాట చెల్లించడానికి ... ఆ మాట పుచ్చుకున్నవాడే ... ఇంకా జీవించి ఉన్నాడు ... అతడే... మగధకి మహారాజు..." అని అరిచాడు బిగ్గరగా సంతోషాన్ని పట్టలేక. 


మరుక్షణం తేరుకుని తన మాటలెవరైనా విన్నారేమోనని తలతిప్పి చూశాడు. అది తన గృహంలోని ఏకాంత మందిరం అని గుర్తుకుతెచ్చుకున్నాక అతని మనస్సు కుదుటపడింది. 


"ఎలాగైనా అతడిని ఒప్పిస్తాను... ఎన్ని కష్టాలు పడైనా సరే ... అతడినే మగధకు రాజును చేస్తాను ... ఈ రాక్షసామాత్యుడి తడాఖా ఏమిటో ఆ చాణక్యుడికి రుచి చూపిస్తాను" అనుకుంటూ అప్పటికప్పుడే, ఆ నిశిరాత్రి వేళ తన నివాసంలోంచి బయటపడి శోణనదీ తీరం వైపుగా, ఒంటరిగా, రహస్యంగా సాగిపోయాడు రాక్షసామాత్యుడు. 

(ఇంకా ఉంది)...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శాస్త్రములు

.. శాస్త్రములు


వ్యాకరణము


షడంగాలలోని శిక్ష వేదభగవానునికి నాసికాస్థానం. వ్యాకరణం ముఖం. అనగావాక్కు. వ్యాకరణా లెన్నోవున్నా, ప్రధానమైనది పాణినీయం. పాణినీయానికి వరరుచివార్తికమూ పతంజలిమహరి భాష్యము వ్రాశారు. వ్యాకరణానికీ, ఇతర శాస్త్రాలకూ భేదమేమిటంటే ఇతరశాస్త్రాల భాష్యాలకన్నా సూత్రాలకేగౌరవం. వ్యాకరణవిషయం అట్లాకాదు. సూత్రాల కన్నా వార్తికానికీ, వార్తికానికన్న భాష్యానికీ గౌరవం అధికం. 


''సూచనాత్ సూత్రమ్'' పాణిని వ్యాకరణం సూత్రరూపంలోవున్నది. అన్నిశాస్త్రాలకూ భాష్యాలున్నా వ్యాకరణ భాష్యానికే మహాభాష్యమన్న గౌరవం. 


చోళమండలంలో శివాలయాలు ఎక్కువ. శివాలయాలలో 'వ్యాకరణదాన మంటపాలు' అని మంటపాలుంటవి. శివాలయానికిన్నీ, వ్యాకరణానికిన్నీ ఏమి సంబంధం? 


నృత్తావసానే నటరాజరాజో 

ననాద ఢక్కాం నవపంచ వారమ్. 

ఉద్ధర్తుకామః సనకాదిసిద్ధా 

నేతద్విమర్శే శివసూత్రజాలమ్ || 


పరమేశ్వరుడు మహానటుడు. ఆయన ఢక్క నుండి సూత్రాలేర్పడినవి. వానికి మాహేశ్వరసూత్రాలని పేరు. 


బొంబాయిలో నిర్ణయసాగర ప్రెస్ అనే ముద్రణాలయం ఒకటివుంది. వారు కావ్యమాల అని పేరుపెట్టి వరుసగా ప్రాచీనకావ్యాలను ప్రకటించేవారు. ఆ గ్రంథాలలో కొన్ని వెనుకటి సంస్కృతి శాసనాలనుగూర్చి వేంగినాటికి చెందిన తామ్రశాసనాన్నిగూర్చి, ప్రకటించినగ్రంథం చదవటం తటస్థించింది, కృష్ణా కావేరీ మధ్యప్రదేశమే వేంగినాడు. తెనుగు చోళులకున్నూ, తంజావూరు చోళులకున్నూ వియ్యమూ నెయ్యమూ ఉండేది. బృహదీశ్వరాలయం నిర్మించిన రాజరాజ నరేంద్రుడు చోళుడే. వేంగినాటికి చెందిన కులోత్తుంగచోళుడు చోళరాజ్యానికి వచ్చినప్పుడు ఆంధ్రదేశంలో వేదాన్ని మరింత ప్రచారంలోనికి తేదలచి చోళదేశపు ద్రావిడ బ్రాహ్మణులలో 500 కుటుంబాలను తనతోపాటు వేంగినాటికి తీసుకొనిపోయి కాపురం పెట్టించాడట. ఆంధ్రదేశంలో ద్రావిడశాఖకు చెందిన బ్రాహ్మణులు ఈ కుటుంబపరంపరలోనివారే. 


నిర్ణయసాగరంవారు ప్రచురించిన గ్రంథంలోని శాసనం ఈ ఐదువందల బ్రాహ్మణకుటుంబాలవారి గోత్రాలేమిటో ఆ కుటుంబాలలోనివారు ఏఏ శాస్త్రాలలో నిపుణులో వారు ఏ ఏ కార్యాలు చేయవలసియుండిరో వారికి ఏ ఏ చోట భూవసతులు కల్పింపబడెనో విశదీకరించినది. కోరినవారికి వేదములూ, శాస్త్రములూ చెప్పడమే వారి పని. ''రూపావతారవక్తుః ఏకో భాగః'' అన్న వాక్యం ఆ శాసనంలో కనిపించింది. ''రూపావతారం'' చెప్పేవారికి ఒకభాగం అని దీని అర్థం. రూపావతారం అనేది ఒక వ్యాకారణశాస్త్రం. 


ప్రస్తుతం వ్యాకరణగ్రంథాలలో అధికప్రచారం కలది 'సిద్ధాంతకౌముది'. అప్పయదీక్షితులవారి శిష్యుడైన భట్టోజీ దీక్షితులు దీనిని వ్రాసినవారు. ఇదిపాణినిసూత్రాలకు వ్యాఖ్యానం. భట్టోజీదీక్షితులు అద్వైతమతానుసారియైన 'తత్వకౌస్తుభం' అనేమరొక గ్రంథం, అప్పయదీక్షితులవారి ఆజ్ఞానుసారం మధ్వమతం ఖండిస్తూ 'మధ్వమత విధ్వంసన' మన్న ఇంకొక గ్రంథమున్నూ వ్రాశారు. 


సిద్ధాంతకౌముది వ్యాప్తికికాకముందు రూపావతారమే ప్రచారంలోవున్న వ్యాకరణం. రూప మనగా శబ్దంయొక్క మూలస్వరూపమే. రూపావతారమనగా శబ్దముయొక్కమూలస్వరూపవ్యక్తీకరణం. నిర్ణయసాగరంవారుప్రచురించిన తామ్ర శాసనం వేగినాటిలో రూపావతార వైయాకరణులకు కల్పించిన భూవసతులను పేర్కొన్నది. ఆరోజులలో వ్యాకరణానికి అంత ప్రాధాన్యం. వేగినాటికి వలసవెళ్ళిన బ్రాహ్మణులలో కొందరికి 'షడంగవిదు' లన్న బిరుదులున్నవి. వారిపేళ్ళుసహితము అరవపేర్లే. 'అంబలకూత్తాడువన్ భట్టన్' ''తిరువరంగముడై యాన్ భట్టన్' అన్న ద్రావిడనామములను ఇందు చూడవచ్చును. 


వీరందరూ స్మార్తులే. కాని పైన చెప్పిన పేళ్ళలో మొదటిది శివనామం, రెండవది వైష్ణవం. తిరువంగముడై యార్ పేరు వైష్ణవమేగాని నామధారి స్మార్తుడే. ఆ పేరుకు సంస్కృతము రంగస్వామి. తిరువంబల కూత్తాడువన్ అన్న పేరు నటరాజ శబ్దానికి తమిళం. కుత్తాడుట అనగా నాట్యంచేయటం. మనం చేయవలసిన నాట్యాలన్నీ ఈనటరాజేచేస్తున్నట్లున్నది. నటరాజునృత్యం అందరూ చూడలేరు. తపోధనులైన సనకాదులు పతంజలి, వ్యాఘ్రపాదులు దైనీసంపద కలవారు కనుక, దివ్యచక్షువులతో దానిని విలోకిస్తున్నారు. ఒక్కజ్ఞానచక్షువు లున్నవారే, ఆనటరాజతాండవాన్ని దర్శించగలరు. కృష్ణభగవానుల విశ్వరూపాన్ని ఒక్క అర్జునుడు, సంజయుడుమాత్రం చూడగలిగినవారు. సంజయునకు వ్యాసభగవానుల ప్రసాదం, అర్జునునకు ''దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగ మైశ్వరమ్'' అని కృష్ణపరమాత్మయే దివ్యచక్షువు ప్రసాదించాడు. 


మనకండ్లలో లెన్సువంటి సాధన మొకటివున్నదనిన్నీ, దానిసాయంచేతనే మనంచూడగల్గుచున్నామనిన్నీ శాస్త్రజ్ఞులు చెప్పుతున్నారు. వస్తువులన్నీ ఒక నిర్ణీతపరిమాణంలో మనకు కనబడటానికి ఆ కళ్ళలోని లెన్సే కారణం అన్నమాట. ఈ దృశ్యప్రపంచంలోని వస్తువులను మరింత ఘనపరిమాణంలో చూడాలని మనం తలచుకొంటే దానికి తగ్గ లెన్సు మన చక్షువులకు అమర్చుకోవాలి. అందుచే మనము చూచేదంతా సత్యమే అని చెప్పగలమా? రూపంయొక్క ఘనపరిమాణం మనదృష్టిని అనుసరించి ఉంది. దీనినే వేదాంతం దృష్టి, సృష్టివాదమని అంటున్నది. 


సనకాదులది సత్యదృష్టి, అందుచేతనే నటరాజునాట్యం చూచి ఆనందిస్తున్నారు. ఆనృత్యంలో ఉదయించిన శబ్దాలు, శివస్వరూపాన్ని ఏకభోగంగా అనుభవించడానికి వీలుగా ఉన్నవి. వానిభక్తిసూత్రాలుగా నందికేశ్వరుడు గ్రహించి భాష్యం చేశాడు. ఆనృత్య సందర్భంలో పాణిని కూడా ఉన్నాడట. 


పాణినికథ బృహత్కథలో ఉన్నది. ప్రాకృతభాషలు ఆరు. వానిలో పైశాచి ఒక్కటి. బృహత్కథ పైశాచిలో గుణాఢ్యుడు వ్రాశాడు. 


'చిత్రార్థాం న బృహత్కథా మచకథమ్'కువలయానందము. ఈబృహత్కధను క్షేమేంద్రుడు సంస్కృతములో సంక్షిప్తంగా రచించాడు. దీని ననుసరించి సోమదేవభట్టు కథాసరిత్సాగరం సంతరించాడు. 


మగధదేశంలో పాటలీపుత్రంలో (ప్రస్తుతం పాట్నా) వరోపాధ్యాయులు, ఉపవరోపాధ్యాయులని ఇరువురు పండితులుండేవారు. వీరిలో ఉపవరోపాధ్యాయులు చిన్న. అతని కొమారై ఉపకోసల. వరోపాధ్యాయులవారిశిష్యులే వరరుచి, పాణిని, ఈశిష్యద్వయంలో పాణిని మందబుద్ధి. చదు వెక్కలేదు. వరోపాధ్యాయు లాతని జూచి'నాయనా నీవు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి, ఈశ్వరానుగ్రహం పొందితేకాని, నీకు చదువు ఎక్కేటట్టు లేదు. అందుచే వెళ్ళి తపస్సుచెయ్యి' అని ఆదేశించారు. అంతటితో హిమాలయాలకు వెళ్లి పాణిని ఉగ్రతపస్సుచేత ఈశ్వరునిమెప్పించిఈశ్వరప్రసాదం పొందాడు. పై పెచ్చు నటరాజు తాండవాన్ని చూడగల పుణ్యంకూడా సంపాదించుకొన్నాడు. నృత్తావసానసమయంలో పుట్టిన శబ్దాలను పదునాలుగు సూత్రాలుగా గ్రహించి అష్టాధ్యాయి. 


'అఇఉణ్, ఋఈక్, ఏఓజ్, ఐఔచ్, హయవరట్, లణ్, ఞమఞణనమ్, ఝభఞ్, ఘఢధష్, జబగడదశ్, ఖఫఛఠధ, చటతవ్, కపయ్, శషసర్, హల్-' అనేవి ఈపద్నాల్గు సూత్రాలు. 


అచ్చులకు ఆకారము ఆది. ఈ మాహేశ్వర సూత్రాలలో 'అ' అనేది మొదటవది. 'హల్' చివరిది. వీనిమధ్యలో ఇమిడిఉన్న అచ్చులనూ, హల్లులనూ 'అల్' అ్సనేది సూచిస్తుంది. 'అలోంత్యస్య' అనేదొక పాణినిసూత్రం. లోకములో శబ్దశాస్త్రాలను ఏర్పరచినది పరమేశ్వరుడుకనుక శివాలయాలలో వ్యాకరణదానమంటపాలు నిర్మించే వాడుక ఏర్పడినది. 


దాదాపు నాలుగువందల సంవత్సరములకు పూర్వం తంజావూరు రఘునాథుడనే నాయకవంశమునకు చేరిన రాజు పాలించేవాడు. అతనికాలములో యజ్ఞనారాయణదీక్షితులు అన్న శివభక్తులొక రున్నారు. వారు 'సాహిత్యరత్నాకరం' అనే గ్రంథం వ్రాశారు. అందలి శివస్తోత్రమిది. 


అజ్ఞాతప్రభవై ర్వచోభి రఖిలై రాలంబి ధర్మప్రభా(థా) 

హేతుత్వం వివిధాధ్వరక్రమకృతి ష్వేకాయన శ్చోదనైః. 

తేషా మధ్వరకర్మణా మధిపతిం త్వా మీశ నారాధయన్ 

ధర్మా నర్జయితుం న శ క్ష్యతి జనో దక్షో ప్యదక్షోఽథవా|| 


మనం ధర్మాన్ని అనుష్ఠించాలన్నా, చేసిన కర్మలు ఫలించాలన్నా భగవంతుని కృప అవసరం. వేదవాక్కుఎక్కడ ప్రభవమైనదో ఎవరికీ తెలీదు. ఆవేదం 'ధర్మం ఇది' అని నిర్ధారిస్తున్నది. అనేక అధ్వరాలనూ, నానావిధకర్మలనూచేయుమని ఆజ్ఞ ఇస్తున్నది. యజ్ఞకర్మాధిపతివి నీవు. యజ్ఞేశ్వరుడవు నీవు. నిన్ను ఆరాధించకపోతే ఇవన్నీ ఇట్లా ఫలితాన్ని ఇస్తవి? 


''ఆవో రాజాన మధ్వరస్య రుద్రం హోతారం'' అని తైత్తిరీయ సంహిత. ఎవడు ఎంత కుశలుడైనా, దక్షుడైనా పరమేశ్వరుని ఆరాధన లేకపోతే వానికౌశలం నిరుపయోగమై పోతుంది. వానికి ఏ కార్యమూ సిద్ధించదు. దీనికి దక్షుడే సాక్ష్యం. 


ఈ శ్లోకానికి ముందున్నది వ్యాకరణమును గూర్చి. 

అదౌ పాణినినా(వా) దతొఽక్షర సమామ్నాయోపదేశేనయః 

శబ్నానా మనుశాసనం వ్యకలయ చ్ఛాస్త్రేణ సూత్రాత్మనా, 

భాష్యంతస్యచ పాదహంసకరవైః ఫ్రౌఢాశయం తం గురుం 

శబ్దార్థప్రతిపత్తిహేతు మనిశం చంద్రార్థచూడంభజే|| 


అక్షర సమామ్నాయము వ్యాకరణము. వేదములు ఈశ్వరనిశ్వాసాలు. ఈశ్వరునిచేతిలోని ఢక్కానాదమేశబ్దాను శాసనం. 


నీవు చేయి ఆడించావు; సూత్రా లేర్పడినవి. పాదవిన్యాసం చేశావో లేదో భాష్య మేర్పడినది. 


వ్యాకరణభాష్యం వ్రాసిన పతంజలి ఆదిశేషుని అవతారం. ఆయన పరమేశ్వరుని మ్రోల పాదాక్రాంతుడైయున్నందున ఆయన వ్రాసిన భాష్యం మహేశ్వర పాదవిన్యాసములో నుంచి పుట్టింది. ఇట్లా శబ్దార్థాలు రెండున్నూ పరమేశ్వరునిచే సృష్టింపబడినవి. వ్యాకరణం పరమేశ్వరుని సృష్టి, ''శబ్దార్థ ప్రతిపత్తిహేతు మనిశం చంద్రార్థచూడం భజే.''                        


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కాలుష్యం కోరలు1అంశం. శీర్షిక: *భావిశ్వాసబాధ్యతకై.*

 కాలుష్యం కోరలు1అంశం.

శీర్షిక: *భావిశ్వాసబాధ్యతకై.* 

డా.వేదులశ్రీరామశర్మల'శిరీష',కాకినాడ.9866050220.

*విచ్చలవిడివిహార0మనోభావ ఉద్వేగంముసుగులో,

పచ్చదనాలవికాసం కాక మనుగడ భావికి ముప్పులే.

వ్యర్ధాలువృధాలవికృతాలవి     న్యాసం అవనికి అనర్ధమే,

యదార్ధ0విస్మరించేవిజ్ఞానం నివుర్లో విధ్వంసంనిప్పులే.

కాంక్షలు కోరలుచాచిన విలాసం ప్లాస్టిక్అసురవిషాదమై,

క్షామాల కల్లోలంచట్రంలో సంక్షేమ0ఊపిర్లకి ఉరినే.

ఆశల కోటలుదాటినకల్మషాల కోరికల ఆరాటాలతో,

ఆశయంబీటలుఅకాలంబాటలై

కాలుష్యాల మంటలకోలాటమే.

విశ్వాసం విజ్ఞతనుచుట్టుముట్టి విలాసోత్సవం విలాపమే.

శ్వాసలవిజ్ఞాన0ని విద్వేషం కమ్ముకుని వినాశవిజయమే.

గ్రీడ్లు గ్రీష్మ మై గుణపాఠం నేర్వక పయనం అగమ్యమే.

నీడలుతోడవ్వనిబాట గమనం ఓర్పుకి దిశ అయోమయమే.

వనరుల ఆత్మవిశ్వాసం కొరతై

వ్యవస్ధ ఊపిర్లకి ఉషస్సులు,

ఆధారాలలేమి నిస్సారజీవమై ఉనికిఅసమత్వమే.

బతుకుబాధ్యతల్ని భార మంటూ విస్మరించి,

మెతుకుభయాలమై భావిబాట

అతలాకుతల విలయమే.

వికాసంచాపక్రి0దనీరై విజ్ఞానం మాటు విపత్తుము0పులమే.

విధులుమరచిననిధులలాలసమైన వేడుకల్లో,

నిగనిగలచాటు దగాల వికృతం కాలుష్యవిషమ వేదికనే.

వస్తు వా0ఛల వేష0మాటు విషవాయువులకోరికకాట్లై,

వాస్తవంప్రకృతిమర్చివిపరీతాల

వికృతం క్రీనీడలమే.

పంచభూతాలనిస్వార్థంకిరుణం  తీర్చలేని కృతజ్ఞతకాక,

ప్రపంచంగురుతర0కిగుణపాఠం  నేర్వక అకాలదారుణమే.

*డా.వేదుల శ్రీరామశర్మ"శిరీష",కాకినాడ.9866050220

ఈ రోజు పదము

 180వ రోజు: (భాను వారము) 04-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


నమ్మకము వలయు నరునిపై నరునకు 

నమ్మలేనినాడు వమ్ముబ్రతుకు 

గుడ్డినమ్మకమ్ముగొడవలు సృష్టించు 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


ప్రజలకు ఇతరులపై నమ్మకము అత్యావశ్యకము. గుడ్డి నమ్మకము గొడవలు సృష్టించును. కావున ఎవరిని ఎంతవరకు ఏఏ విషయాలలో నమ్మ వచ్చునో అంచనా వేసుకొని మెలగవలయును. 

 

ఈ రోజు పదము. 

గుఱ్ఱపు జీను: పర్యయాణము, పర్యాణము, పల్యయణము, పల్లవ, టంగరు.

*నేను ఎవరు

 *

*నేను ఎవరు?*

🌷🌹🌷🌹🌷


*మనసు - ఒక సముద్రం...* 

*ఆలోచనలు - అలలు...*


*కష్టాలు కన్నీళ్లు - ఆటు పోట్లు..*


*ఆలోచనలు మనసు తీరాన్ని తాకినప్పుడు అలజడి...*

  

*ఆలోచన కోరికగా మారి, కార్య రూపం దాలుస్తుందా లేదా అనే తీవ్ర ఉద్రిక్తత - పెద్ద అల రూపంలో...*


*ఫలించిన కోరిక వెంట దుఃఖం - ఒక అల రూపంలో...*


*తీరని కోరిక వెంట దుఃఖం - మరొక అల రూపంలో...*


*కోరిక తీరినా, తీరకపోయినా ఆలోచనలు రావడం మానవు...*


*ఇలా ఆలోచనలతో అనుక్షణం మధన పడే మనసుకు శాంతి కలిగేదెలా?*


*ఉవ్వెత్తున ఎగిసిపడుతూ,  మనసును అల్లకల్లోలం చేసే ఆలోచనలు.*

  

*ఇవి ఆగేదెలా?*

 

*తీరానికి ఎంత దగ్గరగా ఉంటే అంత అలజడి...* 


*ఆ అలజడి, అశాంతి దూరం కావాలంటే, మనసు తీరంలో కాకుండా మనసు లోతుల్లోకి వెళ్ళాలి...*

 

*ఎలా?*

 

*అది ధ్యానం తోనే సాధ్యం.*

 

*ధ్యానం అంటే మనసు లోతుల్లోకి ప్రయాణం చెయ్యటమే...*

 

*ఎంత లోతుకు వెళితే అంత ప్రశాంతత...*

 

*అక్కడ సముద్రం మధ్యన అలలు నీరుగా మారి, ఎలా ప్రశాంతంగా ఉంటుందో...* 

*అలా మనసు పొరలు దాటి లోతుల్లోకి వెళితే, ఆలోచనలు అనుభూతులుగా మారి, ప్రశాంతత నిండిఉంటుంది...*


*ఆ ప్రశాంతతే ఆనందం...* 


*అదే అంతరాత్మ..*


*ఆ ప్రశాంతతే దైవం...*


*అదే ఆత్మ స్వరూపం..* 


*కొత్తగా తెచ్చిపెట్టుకునే ప్రశాంతత కాదది...*


*ఎప్పుడూ అక్కడే ఉంటుంది...*

 

*ఆ ప్రశాంతతే నేను....*


*అదే నేను ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం...* 


*దాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళాలి...* 


*అక్కడే ఉండిపోవాలి...* 


*అదే ముక్తి.. మోక్షం...* 


*అంతే...*

  

*అదే మనం చెయ్యగలిగిన, చెయ్యవలసిన సాధన.* 


*మానవ జన్మకు సార్థకత...*


ఓం అరుణాచల శివ

🙏🙏🙏🙏🙏🙏

*నలభై మందికి వంట చెయ్యి!*

 


     *నలభై మందికి వంట చెయ్యి!*

                 ➖➖➖✍️


```పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని కార్వేటినగరంలో మకాం చేస్తున్నప్పుడు స్వామివారి దర్శనానికి శ్రీమతి పట్టమ్మాళ్ వచ్చారు. తన మూడవ కుమార్తెను వెంటపెట్టుకుని వచ్చి తను కాశీ వెళ్లడానికి స్వామివారి ఆశీస్సులను కోరింది. స్వామివారు “కాశీకు వెళ్తున్నావా” అని అడిగి, “కంచిలో శంకరి పాట్టి అని నా భక్తురాలు ఒకామె ఉంది. తనని నీతోపాటు తీసుకునివెళతావా?” అని అడిగారు. 

వారు సరేనన్నారు. 


మహాస్వామివారు సంతోషంతో ప్రసాదం 

ఇచ్చి “నువ్వు నాకు ఒక పని చెయ్యగలవా? మట్టపల్లిలోని వేంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి నలభై మందికి వంట చెయ్యగలవా?” అని అడిగారు. అంతమందికి తను ఎందుకు వండాలో 

అర్థం కాకపోయినా స్వామివారి మాటను ఎలా కాదనగలదు? కొంతమందిని సహాయంగా తీసుకుని మట్టపల్లి వేంకటేశ్వర ఆలయానికి వెళ్ళి వంట చేసింది.


వంట పూర్తయ్యి చాలాసేపయినా కూడా తినడానికి ఎవరూ రాలేదు. విషయం పరమాచార్య స్వామివారికి తెలపడానికి స్వామివారి వద్దకు వెళ్ళగానే కొన్ని కార్లల్లో తిరుపతి వెళ్తున్న కొంతమంది భక్తులు కూడా అక్కడకు వచ్చారు. మహాస్వామి వారు కార్వేటినగరంలో ఉన్నారని తెలుసుకుని స్వామివారి దర్శనానికి వచ్చారు వారంతా. స్వామివారు వారిని ఆశీర్వదించి “ఈమె మీకు ఆహారం పెడుతుంది. అందరూ భోజనం చేసిన తరువాత తిరుపతికి బయలుదేరండి” అని ఆదేశించారు స్వామివారు. వారంతా సుష్టుగా భోజనం చేసి ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భోజనం చెయ్యడానికి సరిగ్గా ముప్పైఅయిదు మంది వచ్చారు. ఏనాడూ, ఎప్పుడూ మహాస్వామివారి లెక్క తప్పుపోదు. స్వామివారు పట్టమ్మాళ్ ని పిలిచి, “ఎవరూ రాలేదని చెప్పావు, ఇప్పుడు చూశావా? నువ్వు కాశీ వెళ్తున్నట్టు చెప్పావు కదా, అక్కడకి వెళ్లడానికి ముందు సమారాధన చేసినట్టు అవుతుందని నేను ఇలా చేశాను!” అని అన్నారు స్వామివారు. 

కరుణకు అవతలి దరిలేని దైవం పరమాచార్య.```


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


http://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


వాల్మీకి రామాయణం*

 19.

రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.


            *వాల్మీకి రామాయణం*

                 *19 వ  భాగం:*

                    ➖➖➖✍️


*”ఆ శివ ధనుస్సుని తెప్పిస్తే     మా పిల్లలు ఒకసారి చూస్తారు” అని విశ్వామిత్రుడు అన్నాడు.* 


*అప్పుడా ఎనిమిది చక్రాలు కలిగిన మంజూషని లాక్కొని వచ్చారు.*


*”ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి, వింటినారిని లాగి కట్టడం జరుగుతుందా, సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకొచ్చాము చూడండి,”  అని జనకుడు అన్నాడు.*


*అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు.*


*అప్పుడు రాముడు ఆ మంజూషని తెరువగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది.*


*క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుస్సు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తరువాత ఎక్కుపెడతాను” అని విశ్వామిత్రుడిని అడిగాడు.*


*ఆయన “అలాగే ఎక్కుపెట్టు!” అన్నాడు.*


```ఆరోపయత్ స ధర్మాత్మా స లీలం ఇవ తత్ ధనుః।

ఆరోపయిత్వా మౌర్వీం చ పూరయామాస వీర్యవాన్।

తత్ బభంజ ధనుర్ మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః॥```


*రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా, కష్టం లేకుండా పైకి ఎత్తి, నారి కడదామని లాగేసరికి, వంగిన ఆ ధనుస్సు మధ్యలో "ఫడేల్" అని గట్టి శబ్దంతో విరిగిపోయింది.*


*పిడుగులు పడే శబ్దంతో ఆ శివ ధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్చపోయారు.*


```భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథ ఆత్మజః।

అతి అద్భుతం అచింత్యం చ అతర్కితం ఇదం మయా॥```


*అప్పుడు జనకుడు "మహానుభావా  విశ్వామిత్రా! నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలు ఇద్దరినీ తీసుకొచ్చావు, రాముడు దశరథాత్మజుడు, ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి, తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది" అన్నాడు.*


*అయితే ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజుగారి దగ్గరికి పంపించి, రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మని వీర్య శుల్కగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండ”ని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. * 


*వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా, వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది.*


*అక్కడకి చేరుకున్నాక, మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్ళగా, వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు జరిగినదంతా చెప్పారు. “మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివ ధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా, శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే, మీ కుమారులను చూసుకోవడానికి  మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడ”ని ఆ రాయబారులు చెప్పారు.*


*వెంటనే దశరథుడు తన గురువులతో, పురోహితులతో సమావేశమై ‘జనకుడి నడవడి ఎటువంటిది’ అని అడిగాడు.* 


*అప్పుడు వాళ్ళు, "మహానుభావా దశరథా! విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు, శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు" అన్నారు.* 


*వెంటనే దశరథుడు “మనం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా రేపే బయలుదేరదా”మన్నాడు.* 


*కోశాధికారులని పిలిచి… “రత్నాలు, వజ్రాలు, ధనపు మూటలు పట్టుకొని ముందు బయలుదేరండ”న్నాడు, “రథాలని, చతురంగ బలాలని సిద్ధం చెయ్యమ”న్నాడు, “పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామ”న్నాడు.* 


*మరుసటి రోజున అందరూ బయలుదేరారు.*


*ఇక్ష్వాకువంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన ముగ్గురు పత్నులని దశరథుడు తీసుకెళ్ళలేదు.*


*దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే, జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి, “మీరు రావడం వల్ల నేను, నా రాజ్యము పవిత్రమయ్యాయి” అని లోపలికి రమ్మన్నాడు.* 


*”నా కూతురైన సీతమ్మని వీర్య శుల్కగా ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టినవాడికి ఇస్తానన్నాను, నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు, అందువలన ‘నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి’ అని అనుకుంటున్నాను, కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు” అన్నాడు.*


```ప్రతిగ్రహో దాతృ వశః శ్రుతం ఏతత్ మయా పురా।

యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్ కరిష్యామహే వయం॥```


*అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు "అయ్యయ్యో జనకా, అలా అంటావేంటి, అసలు ఇచ్చేవాడు ఉంటే కదా  పుచ్చుకునేవాడు ఉండేది, పదే పదే నీ కోడలిని చేసుకో అని అంటావు. నీ కుమార్తెని నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు, ఔదార్యం నీది, దాతవి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను" అని అన్నాడు.*


*”ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందామ”న్నారు.*


*దశరథుడితో పాటు వచ్చిన భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులతో కలిసారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళ నలుగురూ సంతోషంగా మాట్లాడుకున్నారు.* 


*దశరథుడితో పాటు వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, కాశ్యపుడు, వామనుడు మొదలైన వాళ్ళు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు. ఇంతమంది గొప్పవాళ్ళతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది.*✍️

రేపు… 20వ భాగం…

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*

*షట్ చక్రవర్తులు

  *షట్ చక్రవర్తులు:



           1. సత్య హరిశ్చంద్రుడు.

                  ➖➖➖✍️


హరిశ్చంద్రో నలోరాజా పురుకుత్సః పురూరవాః సగరః కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తినః 


అంటే హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు కార్తవీర్యార్జునుడు అనే ఈ ఆరుగురిని కలిపి షట్చక్రవర్తులు అంటారు. 


పురాణాలు వీరిని అత్యంత విశిష్ఠులైనవారిగా కీర్తించాయి. అటువంటి వారి గురించి తెలుసుకోవడం స్ఫూర్తిదాయకం. ముందుగా హరిశ్చంద్రుడి గురించి తెలుసుకుందాం…


సత్యసంధతలో ఆదర్శవంతమైన వాడు, మానవాళికంతటికీ మార్గదర్శకుడు హరిశ్చంద్రుడు. 


సత్యహరిశ్చంద్రుడి కథ మార్కండేయ పురాణంలో ఉంది. త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు. సూర్యవంశ రాజుల్లో సుప్రసిద్ధుడు. అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు. ఆయన భార్య చంద్రమతి. కుమారుడు లోహితాస్యుడు. 


ఏకపత్నీ వ్రతుడుగా, సత్యసంధుడుగా హరిశ్చంద్రుడికి తిరుగులేని పేరుంది. 


ఒకనాడు దేవేంద్రుడి సభలో జరిగిన ఒక సంఘటన హరిశ్చంద్రుడి జీవితాన్ని ఎన్నో పరీక్షలకు గురిచేసి, మరెన్నో మలుపులు తిప్పింది. అదేమంటే... ఇంద్రసభలో సత్యం తప్పక పలికేవారు ఎవరున్నారు? అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది. 


అప్పుడు అక్కడ ఉన్న వశిష్ఠుడు వెంటనే భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. 


కానీ విశ్వామిత్రుడు లేచి హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలకుడు కాడని, ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని అన్నాడు. 


అలా విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవటానికి ఒక రోజున హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని, దానికి ఎంతో ధనం అవసరమవుతుందనీ, ఆ ధనం కావాలని అడిగాడు. 


అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేశాడు. 


కానీ విశ్వామిత్రుడు ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని, అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్లిపోయాడు. 


కొంతకాలానికి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్లాడు. 


అప్పుడు విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను హరిశ్చంద్రుడి దగ్గరకు పంపాడు. ఆ కన్యలు తమ అందచందాలతో, సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుడిని ఆకర్షించాలని చూశారు. 


హరిశ్చంద్రుడు వారి ఆకర్షణలో పడక వారికి బహుమానాలు ఇచ్చి పంపించాలనుకున్నాడు. అయితే ఆ కన్యలిద్దరూ తమకు బహుమానాలు అక్కర లేదని, తమను వివాహం చేసుకోమని కోరారు. 


కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్నీవ్రతుడినని, రెండోసారి పెళ్లిచేసుకోవటం ధర్మం కాదని వారికి నచ్చజెప్పి, సున్నితంగా ఆ కన్యలను పంపించాడు. 


విశ్వామిత్రుడు ఆ ఇద్దరు కన్యలను వెంటపెట్టుకొని వచ్చి హరిశ్చంద్రుడిని వారి కోరిక తీర్చమన్నాడు.


తన రాజ్యాన్నయినా వదులుకుంటాను కానీ, ఏకపత్నీవ్రతాన్ని విడిచి పెట్టి అధర్మానికి పాల్పడనని చెప్పాడు హరిశ్చంద్రుడు. 


వెంటనే విశ్వామిత్రుడు తనకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్లిపొమ్మన్నాడు. 


హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి కట్టుబట్టలతో నగరం నుంచి బయలుదేరాడు. 


అప్పుడే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు. 


ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని, కొంత సమయమిస్తే ధనాన్ని చెల్లిస్తానని విశ్వామిత్రుడిని వేడుకున్నాడు హరిశ్చంద్రుడు. 


విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తనకు రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకోవటానికి నక్షత్రకుడు అనే తన శిష్యుడిని  పంపాడు. 


హరిశ్చంద్రుడి వెనుకనే బయలు దేరిన నక్షత్రకుడు ఆ రాజును ఎన్నెన్నో కష్టాలపాలు చేశాడు. ‘సొమ్ము ఇస్తానని అనలేదు అని’ ఒక్క అబద్ధం చెబితే చాలు, తాను వెంటనే వెళ్లిపోతానన్నాడు. 


కానీ హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నెన్నో కష్టాలనుభవిస్తూ చివరకు కాశీ నగరానికి చేరాడు. అక్కడ ‘కాలకౌశికుడు’ అనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మి దాంతో వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. 


అయినా ఇంకా విశ్వామిత్రుడి అప్పు ఎంతో మిగిలి ఉంది. 


అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహుడు అనే ఒక కాటికాపరికి తానే స్వయంగా అమ్ముడు పోయి ఆ ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. 


అయినా హరిశ్చంద్రుడి కష్టాలు తీరలేదు. 


హరిశ్చంద్రుడి భార్య అయిన చంద్రమతి కుమారుడితో కలిసి కాలకౌశికుడి ఇంట్లో పనులు చేస్తోంది. అడవికి దర్భల కోసం వెళ్లిన ఆమె కుమారుడు లోహితాస్యుడు పాము కరిచి మరణించాడు. 


దాంతో కుమారుడికి  అంత్యక్రియలు చేయటానికి శవాన్ని తీసుకొని చంద్రమతి శ్మశానికి వెళ్లింది. 


అక్కడ వీరబాహుడికి సేవకుడిగా, కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయాలంటే, కాటి సుంకం చెల్లించి తీరాలని పట్టుబట్టాడు. 


తన దగ్గర చిల్లిగవ్వ కూడా ధనం లేదని, కాటి సుంకం కట్టలేనంది చంద్రమతి. 


అప్పుడు హరిశ్చంద్రుడు ‘అయితే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమ’ని అన్నాడు. 


ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది. తన మెడలోని మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరొకరెవరికీ కనపడదని, అది తనకు వరమని కనుక కాటికాపరిగా ఉన్న వ్యక్తి హరిశ్చంద్రుడే అయివుంటాడనుకుని అప్పుడు తన విషయాన్నంతా హరిశ్చంద్రుడికి చెప్పింది.


ధర్మం తప్పని హరిశ్చంద్రుడు మంగళసూత్రం అమ్మి ధనం తీసుకురమ్మని ఆమెను నగరానికి పంపాడు. 


అంత రాత్రివేళ చంద్రమతి నగరంలోకి వెళుతుండగా ఇంకొక కష్టం వచ్చి పడింది. కాశీరాజు కుమారుడిని ఎవరో దొంగలు చంపి, అతడి దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతుండగా రాజభటులు ఆ దొంగలను తరుముకు రాసాగారు. ఆ దొంగలు పరుగెత్తుతూ వచ్చి వారికి దారిలో ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన సొమ్ములు పడవేసి పారిపోయారు. 


అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతే రాకుమారుడిని హత్యచేసి ధనాన్ని దొంగిలించిందని భావించి ఆమెను బంధించి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు.


రాజు ఆమెకు మరణదండన విధించటంతో రాజభటులు ఆమెను కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరకే తీసుకువచ్చి శిక్ష అమలు చేయమన్నారు. 


ఆమె తన భార్య అని తెలిసినా, నిరపరాధి అని తెలిసినా రాజాజ్ఞను అమలు పరచడం కోసం హరిశ్చంద్రుడు ఖడ్గం ఎత్తి చంద్రమతి శిరస్సును తెగవేయబోయాడు. 


విచిత్రంగా ఆ ఖడ్గం ఒక పూలదండలాగా మారి చంద్రమతి మెడలో పడింది. 


వెంటనే దేవతలంతా అక్కడ ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడులాంటి ఋషులు అక్కడకు వచ్చి చేరి అబద్ధం ఆడని, ధర్మం తప్పని హరిశ్చంద్రుడిని ఎంతగానో ప్రశంసించారు. 


విశ్వామిత్రుడు తాను ఓడిపోయానని ఒప్పుకోవటంతో హరిశ్చంద్రుడి మీద దేవతలంతా పుష్పవృష్ఠి కురిపించారు. 


ఇలా హరిశ్చంద్రుడు సర్వమానవాళికి ఆదర్శ పురుషుడయ్యాడు. సత్య నిరతిని తప్పక సత్యహరిశ్చంద్రుడిగా పేరు పొందాడు. ✍️

                 - డి.వి.ఆర్‌. భాస్కర్‌.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


కృపావర్షానికి కారణం:

 

           *కృపావర్షానికి కారణం:*

                   ➖➖➖✍️


*ఒక్కడే అయినప్పటికీ, సందర్భాన్నిబట్టి పరమాత్మ అనేక నామరూపాల్లో అలరారుతుంటాడు.*


*ఉన్నాడని నమ్మేవారికి ఉన్నట్లుండేవాడు, లేడనేవారి మనోభావాలకు విఘాతం కలగకుండా వారినీ కాపాడేవాడు కాబట్టే ద్వైదీభావాత్మకుడు.* 


*సత్వ-రజస్‌-తమస్‌ అనే మూడు గుణాలున్నవారినీ వారికి తగినట్లు అనుగ్రహాన్ని, ఆగ్రహాన్ని చూపేవాడు కాబట్టి త్రిగుణాత్మకుడు.*


*నాలుగు దిక్కులా నిండి ఉన్నవాడు, నాలుగు వేదాలూ ప్రస్తుతించేవాడు,  సమయాన్ని, భక్తుల మనోభావాల్ని బట్టి ప్రవర్తించేవాడు. అందువల్ల చతురుడు.* 


*పంచభూతాల్లో ఆత్మస్వరూపంగా ఉంటూ వాటిని నియంత్రించేవాడు. కనుక, పంచభూతాత్మకుడు.*


*అరిషడ్వర్గాలకు అతీతుడు. అవతారాన్ని బట్టి సప్తరుషుల మన్ననలు సైతం అందుకునేవాడు. ఇలా ఆ పరమాత్మ ఒక్కడే అయినా అనేక రూపుడు.* 


*‘ఏకం సత్‌ బహవో వదంతి విప్రాః’ (బ్రహ్మపదార్థం ఒక్కటే... అయినప్పటికీ అవసరాన్ని బట్టి అనేక రూపాలుగా కనిపిస్తుంది) అని వేదాంతులు చెప్పడానికి కారణం అదే.*


*ఆయన జీవులందరి సంరక్షణార్థం అందరికీ చేరువలో, చెంతనే ఉంటాడు. కానీ ఎవరూ అంత సులభంగా గుర్తించలేరు. చేరుకోలేరు.*


*యోగులైనా, భక్తులైనా పొందలేని ఆయన సాక్షాత్కారాన్ని అమాయకులు, అతి సామాన్యులు అత్యంత సులభంగా పొందగలుగుతున్నారు. దానికి కారణం వారి భక్తి తత్పరత.*


*పరమాత్మ గురించి, ఆయన అనుగ్రహం గురించి అంతగా తపన పడవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించేవారికి భాగవతం అతి సున్నితమైన సమాధానం ఇస్తుంది.*


*‘దాహార్తి తీర్చుకునేందుకు నీరు, క్షుద్బాధ తీరడానికి ఆహారం, శరీర తాపం తగ్గడానికి చల్లని గాలి... ఇలా సృష్టిలో ప్రతి అంశానికీ ఒక పరిష్కార మార్గం ఉన్నట్లే  ఆధ్యాత్మిక (గత జన్మ వాసనా బలంతో సంక్రమించిన),  ఆదిభౌతిక (ఈ జన్మలో చేసిన కర్మ ఫలితం), ఆదిదైవిక (దైవ సంబంధమైన) కష్టాలు తొలగిపోవాలంటే ఒక సరళమైన తరుణోపాయం ఉండాలి.* 


*ఆ మార్గమే భగవదన్వేషణ, ఆరాధన. ఇదే తప్ప అన్య మార్గం లేదు.*


*ఆ పరమాత్ముని మనసా (తలంపుతో), వాచా (వాగ్రూపంలో), కర్మణా (ఆయనకే చేస్తున్నాననే భావనతో తోటివారికి సేవ చేయడం రూపంలో) కొలిచిన వారిని వాటికి ప్రతిగా సదాచార వర్తనులు, మనోనిగ్రహపరులు, పరిశుద్ధాంతరంగులు అయ్యేటట్లు అనుగ్రహిస్తాడు.*


*ఆ దైవానుగ్రహం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. యోగాభ్యాసంతో ఆత్మదర్శనం చేసిన యోగులకు ఆత్మ స్వరూపుడు.*


*వేదాల్లో చెప్పినట్లు కర్మల చేత ఆరాధించినవారికి కామిత ఫలదాత.*


*స్మృతుల (పురాణాల)లో చెప్పిన విధంగా ధర్మాచరణ రూపంలో ఆరాధించినవారికి ధార్మిక ఫలప్రదాత.*


*ఉపనిషత్తుల్లో చెప్పిన విధంగా ఉపాసనాత్మక జ్ఞానం కలిగినవారికి ఆ రూపంగా మోక్షాన్ని ఒసగేవాడు.*


*ఎవరు ఏ మార్గాన త(కొ)లచినా, అది మనస్ఫూర్తిగా చేసినదై ఉండాలి. అలా తమ తమ ధర్మాలు తప్పకుండా నడుచుకుంటూ, సమభావంతో ఉంటూ ఆయన్నే నమ్మి జీవించేవారు- సూర్యుడి రాకతో పెనుచీకటి అంతరించిన విధంగా అన్ని బంధాల నుంచీ విముక్తులవుతారు.*


*ఇంతాచేసి అందరికీ అందినట్లనిపించినా ఎవరికీ అందనంత దూరంలోనే ఉంటాడు.*


*ఈ విషయాన్ని, దానికి కారణాన్ని గురించి ఆయనే స్వయంగా ఒక సందర్భంలో గోపికలతో ఇలా చెప్పాడు…  ‘నన్ను సేవించే వారికందరికీ కావలసినవన్నీ ఇస్తాను. సేవించనివారినీ అలాగే ఆదరిస్తాను. అవసరాన్ని బట్టి అంశ, అనుప్రవేశ, ప్రవృత్తి-నివృత్తి రూపాల్లో దర్శనమిస్తాను. అంతేకానీ, నా పూర్ణరూపాన్ని ప్రత్యక్షంగా చూపను... అందుకే అందరికీ అందినవాడిలా అనిపించినా ఎవరికీ అందనివాణ్ని’ అని.* 


*ఆ మాటలకు తగినట్లే విష్ణురూపుడైన ఆ పరమాత్మతో ఎవరూ పొందలేని సాన్నిహిత్యాన్ని సాధారణ గోపాలకులు పొందారు.*


*కల్మషం లేనివారి స్వచ్ఛమైన మనోభావాలు, ప్రేమానురాగాలే భగవానుడి కృపావర్షానికి కారణాలు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


నవ్వుతూ బతకాలిరా..!

 


       *నవ్వుతూ బతకాలిరా..!*

               ➖➖➖✍️


*‘తొండము నేకదంతమును తోరపు బొజ్జయు...' అంటూ వినాయకుణ్ని వర్ణించాడొక కవి.*


*తొండమే తప్ప నోరు లేనప్పుడు, ఆయన నవ్వితే తెలిసేదెలా... అనే ప్రశ్నకు ‘మెల్లని చూపుల మందహాసమున్' కంటితోనే నవ్వుతాడని బదులిచ్చాడు.*


*నిజానికది హృద్యమైన విద్య. రాముడికీ తెలుసది. 'నోరు తెరిచి మాట్లాడక ముందే రాముడి కళ్లు నవ్వుతూ పలకరిస్తాయి...         ఆయన స్మితపూర్వభాషి' అన్నారు వాల్మీకి మహర్షి.* 


*'నల్లనివాడు పద్మ నయనంబులవాడు కృపారసంబు పై చల్లెడువాడు...' మాత్రమే కాదు- కృష్ణుడు.* 

*‘నవ్వురాజిల్లెడు మోమువాడు కాబట్టి తాము మనసు పడ్డామన్నారు గోపికలు.*


*'తలనిండ పూదండ దాల్చిన రాణి... మొలక నవ్వులతో నన్ను మురిపిస్తోంది' అన్నారు కవి దాశరథి. నవ్వనేది ఆషామాషీ దినుసు కాదు-* *'సహజాతంబది సర్వమానవ మనస్సంతాప నిర్వాపకంబు (ఆవేదనను తొలగిస్తుంది) ఇహలోకంబున పారిజాతమది' అని తేల్చారు అబ్బిరెడ్డి శతావధాని.*


*పురాణకవులు మొదలు ఆధునిక అవధాన కవుల దాకా మొహానికి నవ్వే అందం, అలంకారమనేది ఏకాభిప్రాయం.*


*రౌద్ర గంభీరమూర్తిగా తోచే పరమశివుణ్ని సైతం పగలబడి నవ్వించాడు నంది తిమ్మన.* *శివపార్వతుల కల్యాణం జరుగుతోంది. అయ్యవారి తలపై అమ్మవారు తలంబ్రాలు పోస్తూ ఉలిక్కిపడింది.* *ఎందుకంటే అక్కడ అప్పటికే గంగమ్మ ఒబ్బిడిగా సర్దుకొని ఉంది. ఆ గంగాజలంలో తన ప్రతిబింబాన్నే గమనించి 'వేరొక్క తొయ్యలి (స్త్రీ) యంచున్ మదినెంచు పార్వతి అసూయావ్యాప్తిని' చూసి పరమశివుడు ఫక్కున నవ్వాడన్నాడు-* *పారిజాతాపహరణ కావ్యంలో.* 

*ఇది చదవగానే కనీసం మనసులోనైనా మందహాసం మెరిసిందంటే- మనలో కొంత హాస్యప్రవృత్తి ఉందని లెక్క. అది మంచి ఆరోగ్య హేతువు. *


*'నాలో హాస్యప్రవృత్తే లేకుంటే- నేను ఏనాడో ఆత్మహత్యకు సిద్ధపడేవాణ్ని' అన్న మహాత్మాగాంధీ మాటలు గుర్తున్నాయా?*


*నవ్వుతూ బతకాలన్నది- సాధారణ నినాదం కాదు, సరైన జీవన విధానం. పగలంతా చాకిరీ చేసిచేసి ఈసురోమంటూ ఇల్లు చేరే పెనిమిటికి ఇల్లాలి చిరునవ్వే వాజీకరణం.*

*అనారోగ్యాలను పారదోలే జీవరసాయనం. నిజానికి నవ్వు ఏనాడో చికిత్స స్థాయికి ఎదిగింది.*

*'పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధ లే*


*నవ్వులు సర్వదుఃఖ దమనంబులు...' అని వైద్యశాస్త్రం గుర్తించింది.* *రచయితలు సైతం ఈ వాస్తవం గ్రహించారు. 'రవ్వంత సడి లేని రసరమ్య గీతాలు' అంటూ నవ్వులను సినీకవులు అభివర్ణించారు!* 


*ఆకలితో నకనకలాడుతున్న పిల్లవాడు తెగించి హోటల్లో దూరాడు. తృప్తిగా తిన్నాడు. డబ్బులు అడిగితే లేవన్నాడు. కోపం ముంచుకొచ్చిన యజమాని పిల్లవాణ్ని లాగి గూబమీద కొట్టాడు. కుర్రాడు కిందపడ్డాడు. హాస్యరసం సత్తా ఎరిగిన ముళ్లపూడి వంటి రచయిత- పిల్లవాణ్ని పైకి లేపి 'అయ్యా, ప్రతిరోజూ ఇదే లెక్కన నేను భోజనానికి రావచ్చా!' అని అడిగిస్తాడు.* 


*ఇదీ ఒక రకమైన సాహితీ వైద్యమే! స్ఫూర్తిమంతమైన ఆర్తిని గుండెకు హత్తించే మంత్రదండం- హాస్యప్రవృత్తి.*


*కొంతకాలంగా మనిషి మొహమ్మీది దరహాసాన్ని కొవిడ్ మహమ్మారి తుడిచిపెట్టేసింది. హాస్యప్రవృత్తిని అణిచేసింది. ఈ నేపథ్యంలో డెన్మార్క్ కు చెందిన ఓ సూపర్ బజార్ యజమానికి అద్భుతమైన ఆలోచనతట్టింది. లోపలికి రావాలంటే షాపు అద్దాల తలుపు దగ్గర ఆగి ఫకాల్న నవ్వాలి. అలా నవ్వితేనే- సెన్సర్స్ అమర్చిన తలుపు తెరుచుకుంటుంది. ప్రజలకు ఈ కొత్త ఊహ నచ్చి ఉత్తిపుణ్యాన వచ్చి, మందహాసాల నుంచి అట్టహాసాల వరకు రకరకాల నవ్వుల పువ్వులు విరజిమ్ముతున్నారట. వారికి ఆరోగ్యం చేకూరుతోంది. యజమానికి వ్యాపారం పెరుగుతోంది. తెలివొకడి సొమ్మా మరి!*✍️

            ….ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ.

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


ఆరోగ్యం

 

మన ఆరోగ్యం….


*మీరు పెద్దయ్యాక ఎక్కువగా మాట్లాడండి*


 * రిటైర్ అయినవారు (సీనియర్ సిటిజన్లు) ఎక్కువగా మాట్లాడాలని వైద్యులు చెబుతున్నారు, ఎందుకంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతానికి మార్గం లేదు.  ఎక్కువ మాట్లాడటం ఒక్కటే మార్గం*


 *సీనియర్ సిటిజన్లతో ఎక్కువగా మాట్లాడటం వల్ల కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయి*


 *మొదట: మాట్లాడటం మెదడును సక్రియం చేస్తుంది మరియు మెదడును చురుకుగా ఉంచుతుంది, ఎందుకంటే భాష & ఆలోచన ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి, ముఖ్యంగా త్వరగా మాట్లాడేటప్పుడు, ఇది సహజంగా వేగంగా ఆలోచించే ప్రతిబింబం మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.  మాట్లాడని వృద్ధులు జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశం ఉంది*


 *రెండవది: మాట్లాడటం వల్ల చాలా ఒత్తిడి తగ్గుతుంది, మానసిక అనారోగ్యాన్ని దూరం చేస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.  మనం తరచు ఏమీ అనకుండా గుండెల్లో పెట్టుకుని ఊపిరి పీల్చుకుంటాం._నిజమే!  కాబట్టి!  సీనియర్లు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తే బాగుంటుంది*


 *మూడవది: మాట్లాడటం వలన చురుకైన ముఖ కండరాలు & అదే సమయంలో, గొంతు వ్యాయామం & ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది, అదే సమయంలో, ఇది కళ్ళు & చెవులు క్షీణించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు మైకము & వంటి గుప్త ప్రమాదాలను తగ్గిస్తుంది.  చెవిటితనం*


 *క్లుప్తంగా చెప్పాలంటే, పదవీ విరమణ పొందినవారు, అంటే సీనియర్ సిటిజన్లు * అల్జీమర్స్ రాకుండా ఉండాలంటే వీలైనంత ఎక్కువ మాట్లాడటం మరియు వ్యక్తులతో చురుగ్గా సంభాషించడం ఒక్కటే మార్గం.  దీనికి వేరే చికిత్స లేదు.*

  

 *కాబట్టి, ఎక్కువగా మాట్లాడుదాం మరియు బంధువులు మరియు స్నేహితులతో ఎక్కువగా మాట్లాడేలా ఇతర సీనియర్లను ప్రోత్సహిద్దాం*


 * సహాయకరంగా మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు;  వృద్ధ పౌరుల జీవితంపై సంభావ్య ప్రభావం కారణంగా*

 కాబట్టి సీనియర్ సిటిజన్లకు ☝🏻 షేర్ చేయండి.✍️

                                -సేకరణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



ఆచార్య సద్బోధన

 


             *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️


```*రాగ ద్వేషాలను విడిచి మనస్సును స్వాధీనపరచుకొని ఇంద్రియాలను తన ఆధీనంలో పెట్టుకుని సుఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ప్రశాంతంగా ఉండి శాంతిని పొందుతాడు.


*అలాంటి వానికి సమస్త దుఃఖాలు అంతరిస్తాయి.


*నిర్మలమైన మనస్సు గల వాని బుద్ధి వెంటనే ప్రశాంతతను పొందుతుంది.


*ఇంద్రియ నిగ్రహం లేనివానికి బుద్ధి నిలకడగా ఉండదు.


*సంయమన శక్తి  లేనివానికి                  ఆత్మ నిష్ఠ ఉండదు.


*ఆత్మ భావన లేనివానికి శాంతి మిగలదు.


*శాంతి లేని వానికి సుఖం లభించదు.


*అందుకే రాగద్వేషాలకు అతీతంగా, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని జీవనం సాగించాలి.```✍️

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


మనోనిగ్రహం

 మనోనిగ్రహం


గీత మాటిమాటికీ సమత్వం బోధిస్తుంది.కష్టంకాని, సుఖంలోకాని ఏవిధమైన ఉద్వేగమూ ఉండరాదని చెపుతుంది. ''దుఃఖే ష్వనుద్విగ్న మనాః సుఖేషు విగతస్పృహః'' ఈ స్థితి మనకు రావాలంటే మనం పరిపూర్ణంగా ఈశ్వరుని శరణుజొచ్చితేకాని రాదు. ఈవిషయంలో భగవానులు చక్కగా నిస్సందేహమైన ఆదేశాలు ఇస్తున్నారు. 'యుక్త ఆసీత మత్పరః' 'మామేకం శరణం వ్రజ' 'వాసుదేవ స్సర్వమితి' అన్నిటినీ సమభావంలో చూడలేక కోరికలతో క్రోధాలతో తన మనస్సు రెపరెప లాడుతూంటే, సమర్పణబుద్ధితో తన ధర్మాన్ని చేయలేనివాడు అయుక్తుడని అంటుంది గీత. అయుక్తునికి బుద్ధీలేదు, భావనాలేదు. భావనఅంటే భక్తితోడి శరణాగతి. ఎప్పుడైతే వానికి భావన లేకపోయిందో, వానికి శాంతిసైతమూలేదు శాంతిలేనివానికి సుఖమెక్కడిది? 'అశాంతస్య కుతస్సుఖం' ఈగీతోపదేశాన్ని అనుసరించే, త్యాగయ్య 'శాంతములేక సౌఖ్యమూలేదు' అని గానంచేశారు. ప్రాపంచిక సుఖాలపై తరచు మళ్ళే మనస్సు నిత్యసౌఖ్యాన్ని తెలుసుకోలేక, చిల్లిపడిన నేతికడవవలె ఎన్నడూ నిండక భంగపడుతుంది. గీతాశాస్త్రంలో మనం చూచే యోగం పరోక్షజ్ఞానానికీ, అపరోక్షజ్ఞానానికీ రెంటికే అవసరమని తేలుతున్నది. 


ఐతే గీతలో యోగసందర్భంగా ఉపయోగింపబడిన సమత్వానికి అర్థం ఏకత్వంకాదు. రాజూ, రౌతూ సమమనికాదు దానికి అర్థం. సుఖదుఃఖాలను సమభావంగా చూడటమే దాని ఉద్దేశం. సారాంశమేమిటంటే నియతకర్మలను చేయుమనీ, ఆ చేయడమున్నూ ఫలాభిసక్తి లేక భక్తితో ఆర్ద్రమైన హృదయంతో చేయుమనీ, కర్మ పూర్తికాగానే అది ఈశ్వరార్పితం చేయుమనిన్నీ, ఈఆదేశాలు పాటించాలంటే ఇంద్రియనిగ్రహం ఉండాలి. విషయ ప్రపంచంనుండి ఇంద్రియాలను విముఖంచేయాలి. అట్లుకాక విషయాలను చూచినదే తడవుగా మనస్సు కళ్ళెంలేని గుఱ్ఱమువలె పరుగిడిపోతే దానిసాయంతో ఆత్మచింతనగానీ, సత్యదర్శనంగానీ చేయలేము. ఇంద్రియాలచే ఉద్విగ్నమైన మనస్సు ప్రజ్ఞ తప్పిపోయి తుపానులో చిక్కుకొన్న నావవలె అల్లలాడిపోతుంది. 'వాయుర్నావమివాంభసి' మనస్సుకూ, ప్రజ్ఞకూ గీతలో చేయబడిన తారతమ్యం మనం గుర్తించాలి. మనస్సుచేసే పనులను అనుసరించి ఒకొకపుడు బుద్ధి అనీ చిత్తము అనీ వేర్వేరుపదాలతో దానినే వాడుతూంటారు. అంతర్ముఖధ్యానం చేసేది ప్రజ్ఞ గీతలో మనస్సు సముద్రంతోనూ, ప్రజ్ఞ నావతోనూ, ఇంద్రియోద్వేగం తుపానుతోనూ పోల్చబడ్డది. 


ఇంద్రియ నిగ్రహమనే అస్థి భారంపై, స్థితప్రజ్ఞత్వమనే సౌధం కట్టబడింది. ఇంద్రియాలనుఆంతర్ముఖంచేస్తే ఆత్మైకత్వసిద్ధి కలుగుతుంది. ఎన్నినదులు వచ్చి తనలో పడుతున్నా నిశ్చలంగా ఉంటుంది సముద్రం. 'ఆపూర్వమాణ మచల ప్రతిష్ఠం' ఆవిధంగా ఒకని మనస్సు పరివర్తితమైతే అతడు జ్ఞాని. అట్టివాడు నిత్యా నిత్య వివేచనంతో వ్యాపకబ్రహ్మాన్ని అనుసంధానించి ఆ ఆనందానుభూతితో జీవాత్మ పరమాత్మైక్యాన్నిసాధిస్తాడు. ప్రాపంచకుడుదేనిని నిజమని అనుకొంటాడో జ్ఞానికి అదిమిథ్య. అందుచేతనే భగవానుడు అర్జునునికి నీకుతగిన కర్తవ్యం నీవు చేయుమని చెప్పడం. యుద్ధంచేయడం రాజ్యం కోసం కాదు, మనో నిగ్రహంకోసం. మనోనిగ్రహం లాభించిందంటే నైష్కర్మ్యం సిద్ధించి బ్రహ్మనిర్వాణానికి దారితీస్తుంది. ఆత్మ పరమాత్మల ఐక్యమే బ్రహ్మనిర్వాణం.                        


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శక్తిమంతమైనవి

 శరీరే జర్జరీ భూతే

వ్యాధిగ్రస్తే  కళేబరే  ll

ఔషధం జాహ్నవీతోయం

వైద్యో నారాయణో హరిః ll


ఈ శ్లోకం లోని నిగూఢమైన అర్థం: గంగాస్మరణ, నారాయణ స్మరణ శక్తిమంతమైనవి. ఈ శ్లోకం చదివిన వారికి వైద్యునిలో ఉన్న 'ప్రతిభా' రూపమైన నారాయణ శక్తి అనుకూలిస్తుంది. సరియైన స్ఫూరణతో శ్రీహరి వైద్యుని ప్రేరేపిస్తాడు. వైద్యుని లోని వైద్యశక్తి పరమేశ్వరుడైన శ్రీహరి రూపమే కదా! హరిస్మరణతో అది మనల్ని బాగు చేసేలా ప్రేరేపించబడుతుంది. అలాగే గంగా స్మరణతో ఔషధం పవిత్రమై, ప్రభావశాలి అవుతుంది. పరానికీ, ఇహానికీ పనికి వచ్చే ప్రయోజనాలను ఇచ్చే పరంపరాగత శ్లోకమిది.


*సేకరణ*

*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

మహనీయుల మంచి మాటలు.*

 

>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<<                                                      

*"చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు. కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే! ప్రాణం కోల్పోవడం కాదు.                ధైర్యం కోల్పోవడమే!!."*

   

*"ఏదో ఒక ఆదర్శాన్ని కలిగిఉన్న వ్యక్తి వంద పొరపాట్లు చేస్తే ఏ ఆ దర్శమూలేనివాడు వేయి పొరపా ట్లు చేస్తాడు.                          అందుకే ఒక ఆదర్శాన్ని కలిగిఉం డడం మంచిది."*


*ఏ తప్పు తెలియని ఒక మనిషి ని అవమానిస్తే! ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది.                                                               కానీ దాని ఫలితాన్ని ఎప్పుడో ఒ కప్పుడు అనుభవించితీరతారు*


*"చెడ్డవారి దురాగతాల కంటే! మంచివారి మౌనమే! అత్యంత విషాదకరం."*

   

*"పరిస్థితులను బట్టి వదులుకోవ డం అలవాటు చేసుకోవాలి. అది వస్తువుఅయినా,మనిషిఅయినా,బంధంఅయినా,కోపంఅయినా,ద్వేషం అయినా."*


*పరిస్థితిని బట్టిఆలోచనలు,అల వాట్లుమారితేబాగుంటుంది.కానీ విలువలువ్యక్తిత్వంఎప్పుడూమా రకూడదుపరిస్థితులుఎలాఉన్నా నువ్వు మంచి వ్యక్తిత్వంతోఉండ డమే జీవితంలోసాధించవలసిన గొప్ప విజయం.!!*


*"విత్తనం మంచిదైతేమొక్కఎక్క డైనా మొలకెత్తుతుంది. అలాగే! ఆలోచనలుమంచివైతే! ఎన్ని అ డ్డంకులు ఎదురు వచ్చినాతప్పక విజయం లభిస్తుంది!!."*

       

*"ఎదుటివారి మంచితనాన్ని చే తకానితనంగా అనుకోకూడదు. మంచితనంవారి వ్యక్తిత్వం. చేతకానితనం అనుకోవడంమన మూర్ఖత్వం."*


*నాగరికత అనేది మానవ జీవన గమనంలోనిఅత్యున్నతసాఫల్య ము. సంస్కృతి అనేది అత్యుత్త మ స్థితి.*


*ఇప్పుడు మనమేమోఆవిషయా న్ని గ్రహించలేక మనసంస్కృతిని పాతచింతకాయ పచ్చడిఅని దా న్నివదిలి నాగరికత అన్నపేరుతో ఏవేవి మనకి సంబంధించినవి కా దో! వాటినే నాగరికత అని నేర్చు కుంటున్నాం.!!*


*అదితప్పని మనం గ్రహించిన నాడే! మనం మనధర్మం మననా గరికతకు నిజమైనవారసులం.!!*

        *సర్వేషాంశాన్తిర్భవతు.*

శరణమప్ప అయ్యప్ప

 శరణమప్ప అయ్యప్ప


పరమాచార్య స్వామి వారిని దర్శించడానికి రెండు బస్సుల్లో శబరిమలకు వెళ్ళే భక్తులు వచ్చారు. వారిని స్వామివారు “ఇప్పటిదాకా ఎన్ని పుణ్యక్షేత్రాలు చూశారు? ఇంకా ఏ ఏ క్షేత్రాలు దర్శిద్దామనుకుంటున్నారు?” అని అడిగారు. 


వారు ఇప్పటిదాకా యాత్రలో భాగంగా దర్శించిన క్షేత్రాలను చెప్పి, ఇంకా కేరళలోని వైక్కం, గురువాయూర్, చోటానికర దర్శించుకోవాలి అని చెప్పారు. చివరగా శబరిమలకు చేరుకుంటాము అని చెప్పారు.


మహాస్వామివారు కొద్దిసేపు అలోచించి తిరుచ్చిలోని మాతృభూతేశ్వర ఆలయం (రాక్ ఫోర్ట్ దేవాలం శివుడు), తిరువనైక్కావల్ అఖిలాండేశ్వరి, శ్రీరంగం రంగనాథుడు, మధురై మీనాక్షి, తిరుప్పరకుండ్రం మురుగన్, తిరునల్వేలి నెల్లియప్పర్, తిరుకుర్తాళం కుర్తాళనాథర్ ని దర్శించుకుని శబరిమలకు చేరుకొమ్మని ఆదేశించారు. 


కాని అందరికీ అలా వెళ్ళడం కుదరక ఒక బస్సువారు మాత్రం పరమాచార్య స్వామివారు చెప్పినట్టు, మరొక బస్సు ముందుగా అనుకున్నట్టు వెళ్ళాలని నిర్ణయించుకుని యాత్రను కొనసాగించారు. పదిరోజుల తరువాత శ్రీమఠానికి వార్త అందింది. 


పరమాచార్య స్వామివారు చెప్పినట్టు వెళ్ళిన బస్సు శబరిమల అయ్యప్పస్వామి దర్శనం ముగించుకుని క్షేమంగా ఊరు చేరింది. కాని మరొక బస్సు మధ్యదారిలోనే అపఘాతానికి గురై చాలామందికి తీవ్రమైన దెబ్బలు తగిలాయి. ఒకరో, ఇద్దరో ప్రాణాలు కూడా కోల్పోయారు. వారి శబరిమల చేరకనే వెనుతిరిగి వెళ్ళిపోయారు. 


అలా కాపాడబడినవారు ప్రతి సంవత్సరం శబరిమల యాత్ర సందర్భంగా కంచికి విచ్చేసి, మహాస్వామివారిని దర్శించుకుని, స్వామి వద్ద అయ్యప్ప శరణుఘోష చేసి సాష్టాంగ దండ ప్రణామాలను అర్పించి వెళ్తారు. శరణుఘోష పూర్తి అయ్యేదాకా స్వామివారు కనులు మూసుకుని ధ్యానమగ్నులై ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు.


భక్తికి, భక్తులకి ఎప్పుడూ పరమాచార్య స్వామివారి సహాయం తప్పకుండా ఉంటుంది. 


_/\_ ఓం స్వామియే శరణం ఆయ్యప్ప || పరమాచార్య తిరువడిగలే శరణం _/\_


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం