ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
25, డిసెంబర్ 2023, సోమవారం
విష్ణుచిత్తుని చరితము
విష్ణుచిత్తుని చరితము
(ఆముక్త మాల్యద )
సీ. తలను పక్షంబులన్ దాచియు బాతువుల్
కేదారభూములన్ సేద దీర
నారెకులదిగాంచి యాశ్చర్యమున్ జెంది
'నగరమందున్నట్టి నైష్ఠికులగు
జన్నికట్టు లచట స్నానమ్ము లొనరించి
పంచెలన్ బిండి తా నుంచి' రనియు
నవ్వాని వారల యావాసమున్ జేర్చ
మదియందు దలచియు మమత తోడ
తే. నికటమున కేగి చూడగా నేల నున్న
బాతువులు రెక్క లల్లార్చి పారిపోయె
వింత గాంచిన పొలమున నింతు లెల్ల
గల గలా నవ్విరప్పుడు గట్టి గాను. 06*
సీ. సంధ్యాసమయవేళ సరసులం దిరిగెడి
హంసలు గూళ్లకు నరుగుటకును
కదలగా నవ్వాని కంఠ గరుద్థ్వనుల్
వినువీథి గప్పెను వింత రీతి
నగరమం దప్పుడే నగధారి గుడియందు
సంధ్యార్చవేళలన్ సందడిగను
మ్రోసెడు భేరుల మురజల సవ్వడుల్
నలుదిశల్ వ్యాపించె నగరమందు
తే. రయమునన్ సాగు స్వేత మరాళ తతుల
కదలు రెక్కల సవ్వడుల్ కంఠరవము,
భేరి కాహళ, వాద్యాల తీరు నొప్పి
భ్రమలు కల్పించె పట్టణవాసులకును. 07*
✍️గోపాలుని మధుసూదనరావు 🙏
భగవద్గీత అవతరించిన మాసం.
భగవద్గీత అవతరించిన మాసం. అన్నదాతకు భౌతిక ఫలాలు, భక్తులకు ఆధ్యాత్మిక ఫలితాలు అందే కాలం. గోదాదేవి రంగనాథునిలో ఐక్యమైన మాసం. ధర్మరాజుకు విష్ణుసహస్రనామాలు వినిపించిన పుణ్యకాలం... అదే ధనుర్మాసం. అతి శ్రేష్ఠమైన మాసం. భగవదారాధన అంటే నిష్ఠలు, నియమాలు, దీక్షలు, ఉపవాసాలు అనుకుంటాం. కానీ భక్తే గాక స్వచ్ఛమైన ప్రేమతోనూ దేవుణ్ణి వశం చేసుకోవచ్చని నిరూపించేదే గోదాదేవి వృత్తాంతం. అదే ధనుర్మాస వైశిష్ట్యం. మనల్ని ఉజ్జీవింప చేసేందుకు గోదాదేవి మానవ కన్యగా అవతరించింది. సాత్త్వికము, సులభము అయిన వ్రతాన్ని అందించింది. భగవంతుణ్ణే భర్తగా పొందింది.
శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే మహాభక్తుని కుమార్తె గోదాదేవి. కృష్ణుడి లీలలు తిలకిస్తూ ఆడుతూపాడుతూ పెరిగింది. యుక్తవయసు వచ్చేసరికి భక్తి కాస్తా ప్రేమగా మారింది. తన స్నేహితురాళ్లను గోపికలుగా, విల్లిపుత్తూరును గోకులంగా తలచేది. తండ్రి దేవుని కోసం తెచ్చే పుష్పమాలలను ధరించి, తనలో కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకనాడు విష్ణు చిత్తుని కంటపడింది. కూతురివల్ల అపచారం జరిగిందని వేదన చెందాడు. కానీ, కృష్ణుడు కలలో కనిపించి, గోదాదేవి ధరించిన పూలమాలలు అర్పించడం అపచారమేం కాదు, తనకు ఆనందం కలుగుతోంది అన్నాడు. దాంతో గోదా ప్రేమ మరింత పెరిగి, కృష్ణుని భర్తగా పొందాలని సంకల్పించింది. ద్వాపరంలో గోపికలు చేసిన కాత్యాయనీ వ్రతం ఆచరించింది. రోజుకో పాశురాన్ని (భక్తిగీతం) రచించి, గానం చేసింది. ఆ ప్రేమకు కృష్ణుడు లొంగక తప్పలేదు. గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, రంగనాథునిగా అవతరించి పెళ్లి చేసుకుంటానని విష్ణుచిత్తునికి స్వయంగా చెప్పాడు. శ్రీరంగంలో పెళ్లికూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా కలియుగంలోనే మకర సంక్రాంతికి ముందురోజు భోగినాడు జరిగింది.
గోదాదేవి లక్ష్మీస్వరూపమని, తులసివనంలో స్వయంవ్యక్తమైనందున భూదేవి అవతారమని, భగవంతునికి సమర్పించే పుష్పమాలను తాను ధరించినందున ఆముక్తమాల్యద అంటారు. ఆమె తమిళంలో రచించిన పాశురాలే ‘తిరుప్పావై’ దివ్య ప్రబంధం. ద్రావిడంలో ‘తిరు’ అంటే పవిత్రం, ‘పావై’ అంటే వ్రతం. వేదాలు, ఉపనిషత్తుల సారభూతమే ఈ తిరుప్పావై.
కాలానికి కొలమానాలు
సూర్యుడు ఆయా రాశుల్లో ప్రవేశించే సమయం సంక్రమణం. ఆయా రాశుల్లో సంచరించే కాలం సౌరమాసం. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే సమయం ధనుస్సంక్రమణం. ఆ రాశిలో ఉండే కాలం ధనుర్మాసం. సంవత్సరంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు భాగాలు. సూర్యుని సంచారం రెండు విధాలు. భూమధ్యరేఖకు ఉత్తర దిశలో సంచరించే కాలం ఉత్తరాయణం, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయనం. మనకు ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక్కరోజు. ‘అయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత్’ మకర సంక్రమణం మొదలు ఆరు మాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. అనంతరం కర్కాటక సంక్రమణం నుంచి ఆరునెలలు దక్షిణాయన సమయం రాత్రి. ‘గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్’ మన జుట్టు మృత్యువు చేతిలో ఉన్నట్లుగా భావిస్తూ ధర్మాన్ని ఆచరించాలి. ఉత్తరాయణంలో దైవీశక్తులు మేల్కొని ఉంటాయి. పుణ్యకార్యాలు, దానధర్మాలకు అనువైన కాలం. కురుక్షేత్ర యుద్ధంలో కుప్పకూలినా భీష్మాచార్యులు ఉత్తరాయణం వచ్చే వరకు ఊపిరి వదల్లేదు. ధర్మరాజుకు విష్ణుసహస్రనామాలు వినిపించిన పుణ్యకాలం ఇదే.
ఎంతో మహత్తరమైన ఉత్తరాయణానికి ముందు వచ్చే ధనుర్మాసం బ్రాహ్మీముహూర్తం లాంటిది. రోజులో పగటివేళ రజోగుణం, రాత్రి తమో గుణం, బ్రాహ్మీముహూర్తంలో సత్త్వగుణం వృద్ధిలో ఉంటాయి. సాత్త్విక ఫలాలు ఆశించేవారు అందుకు తగిన వ్రతాలు ఆచరించడానికి అనువైన కాలం. చాంద్రమానం ప్రకారం ఈ కాలం మార్గశీర్షమాసం అవుతుంది. భగవద్గీతలో ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు శ్రీకృష్ణుడు. రైతు శ్రమకు ఫలితం అందే కాలమిది. భౌతిక, ఆధ్యాత్మిక ఫలాల్ని అందించే పరమ పవిత్ర కాలం.
సిరినోముతో మంచి భర్త
ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి, శ్రీకృష్ణుని లేదా శ్రీరంగనాథులను అర్చించాలి. తిరుప్పావై పాశురాలను రోజుకొక్కటి గానం చేయాలి. పొంగలి నివేదించాలి. ఈ మాసంలో ఒక్కపూట భోజనం, బ్రహ్మచర్యం శ్రేష్ఠం. గోదాదేవి, శ్రీరంగనాథుల కల్యాణం చేయాలి. మనసు, వాక్కు, శరీరం అనే త్రికరణాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. భగవంతుని నామ కీర్తనం, పుష్పమాలా కైంకర్యాలతో సులభ భక్తి మార్గాన్ని సూచించి గోదాదేవి మార్గదర్శకురాలు అయ్యింది. ధనుర్మాస వ్రతం, మార్గశీర్ష వ్రతం, శ్రీవ్రతం, సిరినోముగా పిలుచుకునే ఈ నోము ఆచరిస్తే మనసుకు నచ్చే వ్యక్తిని భర్తగా పొందుతారని పెద్దలు చెబుతారు.
శాస్త్రీయదృక్కోణం
వైజ్ఞానికంగానూ ఈ వ్రతానికి ప్రాముఖ్యముంది. ఈ మాసం చలికాలమైనందున రాత్రి భాగం అధికం. ఉదయాన్నే ప్రసాదంగా పొంగలి, దధ్యోదనం తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. నెయ్యి, లవంగాలు, మిరియాలు ఉష్ణపదార్థాలు. వీటివల్ల దేహం సమశీతోష్ణంలో ఉండి, చర్మవ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. పెసలు బుద్ధికారకుడైన బుధునికి, బియ్యం మనఃకారకుడైన చంద్రునికి ప్రత్యేకించినవి. ఈ సాత్త్వికాహారాల ప్రభావంతో బుద్ధి వికసిస్తుంది. చలికాలంలో చర్మానికి పగుళ్లు వంటి ఇబ్బందుల నుంచి రక్షణ లభిస్తుంది. సూర్యోదయానికి ముందే లేవడంతో స్వచ్ఛమైన గాలులతో శ్వాసక్రియ వేగవంతమై కొత్త ఉత్సాహం కలుగుతుంది.
ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి ‘ముక్కోటి ఏకాదశి’ వస్తుంది. ఆరోజు బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనమున శ్రీమహావిష్ణువుని దర్శించుకుంటారు. స్వామి వారికి ఆ రోజు తులసి మాలను సమర్పిస్తారు. ఈ నెల రోజులు వైష్ణవ దేవాలయాలు కళకళలాడుతూ ఉంటాయి. ఉదయం, సాయంత్ర సమయాలలో స్త్రీలు తులసికోటను అందంగా అలంకరించి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయడం వలన మనోవాంఛలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు..
*ఈ సందేశాన్నీ యధావిధిగా ఫార్వర్డ్ చేస్తున్నాను*
శ్రీమద్భగవద్గీత
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *ప్రధమ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *అర్జున విషాద యోగము*
. *శ్లోకము 1*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*ధృతరాష్ట్ర ఉవాచ:*
*ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ: |*
*మామకా: పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||*
*ధృతరాష్ట్ర ఉవాచ —* ధృతరాష్ట్రుడు పలికెను;
ధర్మ క్షేత్రే — ధర్మ భూమి;
కురు-క్షేత్రే — కురుక్షేత్రం వద్ద;
సమవేతాః — చేరియున్న;
యుయుత్సవః — యుద్ధ కాంక్షతో;
మామకాః — నా పుత్రులు;
పాండవా — పాండు పుత్రులు;
చ — మరియు;
ఏవ — నిజముగా;
కిం — ఏమి;
అకుర్వత — చేసినారు;
సంజయ — ఓ సంజయా.
*ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను:*
ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
శ్రీమద్భగవద్గీత విస్తారముగా ప్రకటింపబడు ఆస్తిక విజ్ఞానశాస్త్రము. అది గీతామహాత్మ్యము నందు సంగ్రహించబడినది. భగవద్గీతను కృష్ణభక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసికొనుటకు యత్నించవలెనని దాని యందు తెలుపబడినది.
గీతను అర్జునుడు శ్రీకృష్ణభగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసికొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురుశిష్యపరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసికొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేదజ్ఞానమును, ప్రపంచామునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందు గల విషయమునే గాక అన్యత్రా గోచరించని విషయములను సైతము పాటకుడు భగవద్గీత యందు గాంచగలడు. అదియే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత.
పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణభగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రమై విరాజిల్లుచున్నది.
మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర, సంజయ సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్త్వశాస్త్రమునకు మూలసిద్ధాంతములై యున్నవి. అనాదియైన వేదకాలము నుండియు తీర్థస్థలముగా ప్రసిద్ధినొందిన కురుక్షేత్రమునందు ఈ తత్త్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది.ఈ భూమిపై శ్రీకృష్ణభగవానుడు స్వయముగా ప్రత్యక్షమైనప్పుడు మానవాళి నిర్దేశనార్థము దీనిని పలికెను.
కురుక్షేత్రరణరంగమున శ్రీకృష్ణభగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రమను(ధర్మాచారములు నిర్వహింపబడు స్థలము) పదము ప్రాధాన్యత సంతరించుకొన్నది.
కౌరవుల తండ్రియైన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశామును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై యుండెను. కనుకనే తన సందేహమున అతడు “వారు ఏమి చేసిరి?” అని కార్యదర్శియైన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలెనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యము కలదు.
జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంచింపలేదు. అదియును గాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలియగోరెను. కాని దేవతలకు సైతము పూజనీయస్థానముగా వేదములలో తెలుపబడియున్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధపరిణామముపై స్థలప్రభావమును గూర్చి అతడు మిగుల భీతినొందెను. సస్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండుసుతులకు అది అనుకూల ప్రభావమును చూపునని అతడెరిగి యుండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను. కనుకనే యుద్ధరంగమందలి పరిస్తితిని గూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని అడిగెను.
పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమునకు చెందినవారు. కాని కేవలము తన పుత్రులనే కురుసంతానముగా పలికి పాండుసంతానమును వంశము నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనస్సును విశదపరచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవుల యెడ ధృతరాష్ట్రునికి గల సంబంధము దీని ద్వారా ఎవరైననను అవగతము చేసికొనవచ్చును.
పంటపొలము నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి, ధర్మపితయైన శ్రీకృష్ణభగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రమగు కురుక్షేత్రము నుండి కలుపుమొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు, యధిష్టరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్టుతులు కాగాలరనియు ఆది నుండియే ఈ విధముగా ఊహించబడినది. చారిత్రిక మరియు వైదిక ప్రాముఖ్యమే గాక “ధర్మక్షేత్రము” మరియు “కురుక్షేత్రము” అనేది పదములకు గల విశేషార్థమిదియే.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామకర్మ - నిష్కామకర్మ
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
🪷 *కామకర్మ - నిష్కామకర్మ* 🪷
ఏ కోరిక లేకుండా, ఎటువంటి ఫలితం ఆశించకుండాచేసే కర్మ ‘నిష్కామ కర్మ!’
కోరికలు నెరవేరడం కోసం చేసేవి ‘కామ్య కర్మలు.’ కామ్య కర్మలకు నియమాలు ఎక్కువ. నిష్కామ కర్మ చేయడానికి తిథి, వార, నక్షత్రాలు చూడవలసిన పని కూడా లేదు.
ఏదీ కోరకపోవడంలో ఎంతో సౌలభ్యం ఉంది. విశ్వం లో ఒక నియమం ఏమంటే ఎంతటి ఉపాసకులకయినా అవసరాలు మాత్రమే తీరుతాయి. ఆశలు తీరవు.
సాధన పరాకాష్టకు చేరితే, ఏదీ ఆశించని స్థితి వస్తుంది. అలాంటి వారిని ఉద్దేశించే వేమన... ```"ఆశలుడిగినట్టి అయ్యలు ధన్యులు" ```అన్నాడు.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
భగవద్గీత
భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే. భగవద్గీత అనగా భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. అంతే భగవంతుని చేత చెప్పబడింది. ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవత్ తత్వము, భగవంతుడిని చేరే మార్గాలు, మనిషి పరమపదాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌధానికి చేర్చే 18 సోపానాలని వేదాంత కోవిదులు చెబుతారు. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత ఈ మూడింటినీ కలిసి ‘ప్రస్థాన త్రయం’ అంటారు. ప్రాస్థానం అనగా ప్రయాణం. మనిషి పరమపద ప్రయాణానికి కావలిసిన సాధన సంపత్తుల గురించి, నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించివీటిలో పుష్కలంగా ఉంది. నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు.
లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగామ్. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరింపబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని ‘మోక్ష సప్తసతి’ అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి. బ్రహ్మసూత్రాలను మననం చేయాలి. భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీత వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమ పదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగాములకు, వయసు మళ్ళినవారికి ఉపయోగపడే గ్రంథమనే అభిప్రాయం చాలమందిలో పాతుకుపోయింది. కానీ, ఇది నిజం కాదు. గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. ఇది స్పృశించని అంశమంటూ లేదు. అందుకే ఇది ప్రపంచంలోనే మకుటాయమానమైన సాహిత్య ఉద్గ్రంథం. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆధారం చేసుకునే నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు.
గీతలో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి? సన్మార్గాన ఎలా నడవాలి? సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది, లోక కల్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం ‘పారాయణ గ్రంథం’ కాదు, ‘అనుష్టాన గ్రంథం’ (అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించదగ్గది). భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యశాస్త్రం, ఆహారవిజ్ఞానశాస్త్రం, నైతికధార్మిక శాస్త్రం. ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం. మనిషి జీవితానికి సంబంధించి అన్ని విషయాలను ఇది చర్చించింది. అందువల్లే భగవద్గీతను ‘మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం’ అని అన్నారు. గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. భగవద్గీతలో ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై ఉన్న ప్రకృతి గుణాలైన సత్వ, రాజ, స్తమములను నిత్య జీవితంలో జయించడం, ద్వంద్వాములను నిగ్రహించడం, సదాచారం, సమబుద్ధి, సత్ప్రవర్తన పెంపొందించుకోవడం, సత్వగుణాలను అలవర్చుకోవడం, నిష్కామ కర్మానుష్టానం ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడం, సాత్విక ఆహార నియమాలను పాటించడం, రాజసిక, తామసిక పదార్థాలను విసర్జించడం, ధ్యాన యోగ సాధన ద్వారా నిరంతర దైవచింతన, జ్ఞానాన్ని పొందగోరువారు పాటించాల్సిన నియమాలు, ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడగలగడం….ఇంకా ఎన్నో విషయాలు విపులీకరించి ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు.ప్రస్తుత మానవ జీవితమ పూర్తిగా భౌతిక దృక్పథానికే పరిమితమైంది. స్వార్థమే పరమావధిగా తలుస్తూ, మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నాడు. ఈ దృక్పథం మారాలంటే, మనసులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కోరుకునేవారు తమ దైనందిన వ్యవహారాల్లో ‘గీత’కూ చోటు కల్పించాలి. అప్పుడు స్వీయాభివృద్ధితో పాటు సమాజభివృద్ధి ఎలా సాధ్యామవుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు.
నేల ఉశిరిక చెట్టు
నేల ఉశిరిక చెట్టు గురించి సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .
నేల ఉశిరిక చెట్టును సంస్కృతంలో భూమ్యామలి , తమాలి , తాలి , తమాలికా , ఉచ్చట అని పిలుస్తారు . ఆంగ్లము నందు Phyllanthus Amarus అని పిలుస్తారు . దీనిలో చాలారకాలు ఉన్నాయి . మనం ఔషధాల కొరకు ఉపయోగించునది సన్నని తెలుపుగల జీలగ ఆకుల వంటి ఆకులు , ఆకుల కింద సన్నని గట్టి కాయలు గల దానిని కొందరు , పొడవుగా కొంచం నలుపు రంగుగా ఉండు ఆకులు కలిగి , ఆకుల కింద కాయలు గల దానిని కొందరు వాడుదురు. రెండింటిలో జీలగ ఆకుల వంటి కురచ ఆకులది శ్రేష్టము. ఈ మొక్కలో సర్వాంగములు ఔషధోపయోగమే . ఇది ఎల్లప్పుడూ విరివిగా దొరుకును . దీనిలో ఎరుపు , తెలుపు కాడలు కలిగినవి కూడా ఉండును. ఎరుపు కాడ కలిగినదానిని రసవాదం నందు ఉపాయోగిస్తారు. తెల్ల కాడ కలిగిన దానితో సత్తు , వంగము , తాళకం వంటి లోహాలను భస్మం చేయుటకు ఉపయోగిస్తారు .
ఔషధోపయోగములు -
* రక్తప్రదరం అనగా స్త్రీలలో అధిక రక్తస్రావం కావడం . ఈ సమస్య ఉన్నవారు నేల ఉశిరిక గింజలను బియ్యపు కడుగుతో నూరి రెండు లేక మూడు దినములు సేవించిన రక్తప్రదరం తగ్గును. వేడి చేసే వస్తువులు తినకూడదు.
* వరసగా వచ్చు ఎక్కిళ్లు నివారణ కొరకు నేల ఉశిరిక చూర్ణమును పంచదారతో కలిపి తినినను లేక నేల ఉశిరిక రసమును రసం ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా లోపలికి నశ్యము చేసినను ఎక్కిళ్లు ఆగిపోవును .
* కంటి సమస్యలతో ఇబ్బంది పడువారు నేల ఉశిరిక , సైన్ధవ లవణం రాగిరేకు యందు కాంజీకంతో నూరి నేత్రముల చుట్టూ పట్టువేసిన నేత్ర బాధలు అన్నియు శమించును . ఈ కాంజీకం ఆయుర్వేద దుకాణాల్లో లభ్యం అగును.
* వ్రణాలతో ఇబ్బంది పడువారు నేల ఉశిరిక రసంలో పసుపు చూర్ణం కలిపి పుండ్లపైన రాయుచున్న అవి మాడిపోవును.
* స్త్రీలకు ఋతు సమయంలో వచ్చు నొప్పికి 25 గ్రాముల నేల ఉశిరిక రసములో 40 మిరియపు గింజల చూర్ణం కలిపి మూడోవ రుతుదినమున సేవించిన రుతుశూల , సరిగ్గా ఋతురక్తం జారీ కాకపోవటం వంటి సమస్యలు తగ్గును.
* ఉబ్బుకామెర్ల సమస్యతో బాధపడువారు నేల ఉశిరిక నీడన ఎండించి చూర్ణం చేసినది లేదా నేల ఉశిరి సమూల రసం పెరుగులో కలిపి కాని గోమూత్రంలో కలిపి కాని లోపలికి ఇవ్వవలెను . రసము మోతాదు 25 గ్రాములు .
* శరీరం పైన లేచు దద్దుర్లకు దీని ఆకును పుల్లటి మజ్జిగతో నూరి శరీరానికి పూసిన శరీరం పైన దద్దురులు నయం అగును.
* మధుమేహంతో బాధపడువారు నేల ఉశిరి రసం , మంచి పసుపు, నేరేడు గింజల చూర్ణం కలిపి శనగ గింజలంత మాత్రలు చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున వాడుచున్న మధుమేహం అదుపులోకి వచ్చును.
* జిగట విరేచనాలతో ఇబ్బంది పడువారు నేల ఉశిరి చూర్ణం , మెంతులు చూర్ణం కలిపి అరచెంచా చొప్పున మజ్జిగలో కలిపి తీసుకొనుచున్న జిగట విరేచనాలు తగ్గును.
* శరీరంలో రక్తహీనత వల్ల వొళ్ళంతా తెల్లగా పాలిపోయే పాండురోగ రోగులు నేల ఉశిరి వేర్లను 10 గ్రా మోతాదుగా మెత్తగా నూరి రసం తీసి అరగ్లాసు నాటు ఆవుపాలలో కలిపి రెండుపూటలా ఆహారానికి గంట ముందు సేవిస్తుంటే క్రమంగా పాండురోగం హరించిపోయి రక్తవృద్ధి, రక్తశుద్ది జరుగును.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ క్రింద ఇచ్చిన నెంబర్ నందు సంప్రదించగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
శ్రీమద్భగవద్గీత
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *ప్రధమ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *అర్జున విషాద యోగము*
. *శ్లోకము 1*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*ధృతరాష్ట్ర ఉవాచ:*
*ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ: |*
*మామకా: పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||*
*ధృతరాష్ట్ర ఉవాచ —* ధృతరాష్ట్రుడు పలికెను;
ధర్మ క్షేత్రే — ధర్మ భూమి;
కురు-క్షేత్రే — కురుక్షేత్రం వద్ద;
సమవేతాః — చేరియున్న;
యుయుత్సవః — యుద్ధ కాంక్షతో;
మామకాః — నా పుత్రులు;
పాండవా — పాండు పుత్రులు;
చ — మరియు;
ఏవ — నిజముగా;
కిం — ఏమి;
అకుర్వత — చేసినారు;
సంజయ — ఓ సంజయా.
*ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను:*
ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
శ్రీమద్భగవద్గీత విస్తారముగా ప్రకటింపబడు ఆస్తిక విజ్ఞానశాస్త్రము. అది గీతామహాత్మ్యము నందు సంగ్రహించబడినది. భగవద్గీతను కృష్ణభక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసికొనుటకు యత్నించవలెనని దాని యందు తెలుపబడినది.
గీతను అర్జునుడు శ్రీకృష్ణభగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసికొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురుశిష్యపరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసికొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేదజ్ఞానమును, ప్రపంచామునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందు గల విషయమునే గాక అన్యత్రా గోచరించని విషయములను సైతము పాటకుడు భగవద్గీత యందు గాంచగలడు. అదియే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత.
పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణభగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రమై విరాజిల్లుచున్నది.
మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర, సంజయ సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్త్వశాస్త్రమునకు మూలసిద్ధాంతములై యున్నవి. అనాదియైన వేదకాలము నుండియు తీర్థస్థలముగా ప్రసిద్ధినొందిన కురుక్షేత్రమునందు ఈ తత్త్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది.ఈ భూమిపై శ్రీకృష్ణభగవానుడు స్వయముగా ప్రత్యక్షమైనప్పుడు మానవాళి నిర్దేశనార్థము దీనిని పలికెను.
కురుక్షేత్రరణరంగమున శ్రీకృష్ణభగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రమను(ధర్మాచారములు నిర్వహింపబడు స్థలము) పదము ప్రాధాన్యత సంతరించుకొన్నది.
కౌరవుల తండ్రియైన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశామును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై యుండెను. కనుకనే తన సందేహమున అతడు “వారు ఏమి చేసిరి?” అని కార్యదర్శియైన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలెనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యము కలదు.
జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంచింపలేదు. అదియును గాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలియగోరెను. కాని దేవతలకు సైతము పూజనీయస్థానముగా వేదములలో తెలుపబడియున్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధపరిణామముపై స్థలప్రభావమును గూర్చి అతడు మిగుల భీతినొందెను. సస్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండుసుతులకు అది అనుకూల ప్రభావమును చూపునని అతడెరిగి యుండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను. కనుకనే యుద్ధరంగమందలి పరిస్తితిని గూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని అడిగెను.
పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమునకు చెందినవారు. కాని కేవలము తన పుత్రులనే కురుసంతానముగా పలికి పాండుసంతానమును వంశము నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనస్సును విశదపరచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవుల యెడ ధృతరాష్ట్రునికి గల సంబంధము దీని ద్వారా ఎవరైననను అవగతము చేసికొనవచ్చును.
పంటపొలము నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి, ధర్మపితయైన శ్రీకృష్ణభగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రమగు కురుక్షేత్రము నుండి కలుపుమొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు, యధిష్టరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్టుతులు కాగాలరనియు ఆది నుండియే ఈ విధముగా ఊహించబడినది. చారిత్రిక మరియు వైదిక ప్రాముఖ్యమే గాక “ధర్మక్షేత్రము” మరియు “కురుక్షేత్రము” అనేది పదములకు గల విశేషార్థమిదియే.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
డిసెంబర్-25-సోమవారం
శుభోదయం
Happy Christmas
*డిసెంబర్-25-సోమవారం
*స్వస్తిశ్రీ శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం,, హేమంతు ఋతువు*మార్గశిర మాసం శుక్లపక్షం*
తిథి: చతుర్దశి 4.58am
ఇందువాసరే
నక్షత్రం: రోహిణి 09;41 pm
వర్జ్యం: 03:25 am – 05:03 am
దుర్ముహుర్తం: 12:47 pm - 01:38 pm
03:20 pm - 04:11 pm
రాహుకాలం: 07:30 am - 09:00 am
యోగం: సాధ్యము 05:41 am
కరణం: తైతుల 05:55 am, గరజి 05:48 pm
సూర్యోదయం : 06:47
సూర్యాస్తమయం : 05:44
* క్రిస్టమస్ *
యోగ గోసేవ మూర్తి
విశిష్ట సేవ రత్న
జనరల్ సెక్రెటరీ
సద్గురు యోగ అసోసియేషన్
Yoga Murthy KVSK channel
విజయవాడ
స్వామివారితో
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*శ్రీ స్వామివారితో నా సంభాషణ..*
1973 జనవరి నెల మొదటివారం లో సంక్రాంతి సెలవుల్లో కనిగిరి నుంచి మొగలిచెర్ల రావడం జరిగింది..ఆసరికే శ్రీ స్వామివారు, మాలకొండ నుంచి మొగలిచెర్ల లోని మా ఇంటికి రావడమూ.. కొద్దికాలం పాటు ఇంటి వద్ద గడపడమూ..అమ్మా నాన్న గార్లతో పాటు మా నాయనమ్మ సత్యనారాయణమ్మ గారికి కూడా ఆధ్యాత్మిక బోధ చేయటమూ..ఆ తదుపరి హఠాత్తుగా ఒక తెల్లవారుఝామునాడు ఇంటి వద్దనుంచి బయలుదేరి, ఫకీరుమాన్యం లో తాను ఆశ్రమం నిర్మించుకోదలచిన ప్రదేశానికి వెళ్లిపోవడమూ జరిగిపోయింది..నాన్న అమ్మగార్లు ఆ విషయమై కొద్ధి మనస్తాపం చెందినా.. శ్రీ స్వామివారు తీసుకున్న నిర్ణయాన్ని ఆపలేకపోయారు..శ్రీ స్వామివారు బస చేయడానికి తాత్కాలికంగా ఒక పాకను రెండురోజుల్లో వేయించారు నాన్నగారు..ఆ పాకలో బస చేస్తూ..ఆశ్రమం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ వున్నారు..
శ్రీ స్వామివారికి రోజూ ఆహారం మా ఇంటివద్దనుంచే తీసుకెళ్లి ఇచ్చేవారు..ఆహారం అంటే రకరకాల పదార్ధాలతో కూడినది కాదు..బియ్యంలో కొద్దిగా పెసరపప్పు వేసి వుడికించి చేసేది..నేను మొగలిచెర్ల వచ్చిన మరుసటి రోజు శ్రీ స్వామివారికోసం వండిన ఆ ఆహారాన్ని తీసుకెళ్లి ఇచ్చేసి రమ్మని అమ్మ నాతో చెప్పింది..సరే అని ఆ చిన్న స్టీలు డబ్బా తీసుకొని ఫకీరు మాన్యం లో ఉన్న శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళాను..
నేను వెళ్ళేసరికి శ్రీ స్వామివారు, పాక బైట పచార్లు చేస్తూ వున్నారు..నన్ను చూసి నవ్వుతూ.."అమ్మ నిన్ను పంపించిందా?.." అన్నారు.."అవును" అని తలాడించాను..నేనిచ్చిన డబ్బా తీసుకొని పాకలో ఒక మూల పెట్టి మళ్లీ బైటకు వచ్చారు..
"ఇప్పుడు ఏం చదువుతున్నావు?.." అన్నారు.
"ఎనిమిదవ తరగతి.." అన్నాను..
"ఏ ఊళ్ళో?.." అన్నారు..
"కనిగిరి లో " అన్నాను..
శ్రీ స్వామివారు పాకలోకి వెళ్లి.."దా!..ఇక్కడ కూర్చో.." అని పాకలో ఉన్న బల్ల చూపారు..వెళ్లి అక్కడ కూర్చున్నాను..కూర్చున్నానే కానీ..ఏమి మాట్లాడాలో తెలియని ఒకానొక అయోమయ స్థితిలో వున్నాను..శ్రీ స్వామివారిని చూసాను..నిర్మలంగా..చిరునవ్వుతో నన్నే చూస్తున్నారు..
"మీ ముగ్గురికీ మీ అమ్మగారు స్తోత్రాలు ఏవైనా నేర్పించిందా?.." అన్నారు..
"నాకు హనుమాన్ చాలీసా..లక్ష్మీనరసింహ స్వామి అష్టోత్తరం చేసుకోమని చెప్పి, అవి నేర్పించింది.." అన్నాను..
"మరి రోజూ చేస్తున్నావా?.." అన్నారు..తలూపాను..నిజానికి అప్పుడప్పుడూ ఆ రెండు స్తోత్రాలూ చేసుకోకుండా ఎగ్గొట్టిన రోజులు కూడా ఉన్నాయి..కానీ శ్రీ స్వామివారితో ఆమాట చెప్పలేదు..
"అంత ఖచ్చితంగా చేసేటట్లు గా లేవే!.." అన్నారు నవ్వుతూ..పసిగట్టేశారు..సిగ్గుతో తలొంచుకున్నాను..
"హనుమాన్ చాలీసా రోజూ చెయ్యి..అలాగే లక్ష్మీ నృసింహ స్వామి ది కూడా..ఏమరుపాటు లో ఉండొద్దు..అమ్మ చెప్పినవి ఎంతో మహత్తు కలవి.. నీకు ఇప్పుడు అర్ధం కాదులే..పిల్ల తరహాగా ఉండొద్దు.." అని చెప్పారు..
మరో రెండు నిమిషాల పాటు శ్రీ స్వామివారు ఏమీ మాట్లాడలేదు..నేను ఇక అక్కడ కూర్చోలేక, "వెళ్ళొస్తాను స్వామీ.." అన్నాను..సరే నన్నట్లు నవ్వుతూ తలూపారు..పాకలోంచి బైటకు వచ్చి ఇంటిదారి పట్టాను..
ఆరోజు నుంచీ సంక్రాంతి పండుగ అయిపోయి, నేను తిరిగి కనిగిరి వెళ్ళేదాకా..ప్రతిరోజూ శ్రీ స్వామివారికి ఆహారాన్ని తీసుకెళ్లి ఇచ్చే బాధ్యత అమ్మ నాకే అప్పచెప్పింది..నేనూ అలవాటు పడిపోయాను..మూడోరోజు నా కళ్ళ ముందు ఒక సంఘటన జరిగింది..
భూతమూ.. వైద్యమూ..రేపటి భాగంలో..
సర్వం..
శ్రీ దత్తకృప!.
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699
*రాశి ఫలితాలు*
25-12-2023
*రాశి ఫలితాలు*
*ఇంధు వాసరః (సోమవారం )*
మేషం
చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది.
--------------------------------
వృషభం
ముఖ్యమైన వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్త్రీ సంబంధిత సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారమున అవరోధాలు తప్పవు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
---------------------------------
మిధునం
వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతి వ్యవహారాన్ని పెద్దలతో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
--------------------------------
కర్కాటకం
బంధుమిత్రుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాలలో ఎంత శ్రమపడిన ఫలితం అంతగా కనిపించదు.
----------------------------------
సింహం
ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.
-------------------------------------
కన్య
వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంతాన విద్య విషయాలలో మరింత కష్ట పడవలసి వస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికి నిదానంగా పూర్తవుతాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చే విషయంలో పునరాలోచన చేయుటం మంచిది.
---------------------------------
తుల
స్థిరస్తి క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూరప్రాంత బంధు మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
------------------------------------
వృశ్చికం
దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించటం మంచిది. నిరుద్యోగులు లభించిన అవకాశాలను చేజారకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి.
-----------------------------------
ధనస్సు
కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. భాగస్వామ్య వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వాహన ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.
-----------------------------------
మకరం
బంధు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.
--------------------------------
కుంభం
ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రు సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఉద్యోగమున ఇతరులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
--------------------------------
మీనం
దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు కలసివస్తాయి.
--------------------------------
సోమవారం, డిసెంబరు 25, 2023
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
సోమవారం, డిసెంబరు 25, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంత ఋతువ
మార్గశిర మాసం - శుక్ల పక్షం
తిథి:చతుర్దశి తె5.12వరకు
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:రోహిణి రా9.48 వరకు
యోగం:శుభం తె4.59వరకు
కరణం:గరజి సా5.16 వరకు తదుపరి వణిజ తె5.12 వరకు
వర్జ్యం:మ1.49 - 3.25 తె3.30 - 5.08
దుర్ముహూర్తము:మ12.21 - 1.05 &
మ2.32 - 3.16
అమృతకాలం:సా6.36 - 8.12
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి: ధనుస్సు చంద్రరాశి : వృషభం
సూర్యోదయం:6.31
సూర్యాస్తమయం: 5.28
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
పంచాంగం
**********
*శుభోదయం*
***********
సంధ్యా వందన
మరియు ఇతర
పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ.25.12.2023
సోమ వారం (ఇందు వాసరే)
*********
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
హేమంతృతౌ
మార్గశీర్ష మాసే శుక్ల పక్షే చతుర్దశ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
ఇందు వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
*ఇతర పూజలకు*
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
హేమంతృతౌ మార్గశీర్ష మాసే *శుక్ల పక్షే చతుర్దశ్యాం*
భాను వాసరే అని చెప్పుకోవాలి.
*ఇతర ఉపయుక్త విషయాలు*
సూ.ఉ.6.31
సూ.అ.5.28
శాలివాహనశకం 1945 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం.
కల్యబ్దాః 5124 వ సంవత్సరం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు
మార్గశిర మాసం
శుక్ల పక్షం చతుర్దశి తె. 4.59 వరకు.
సోమ వారం.
నక్షత్రం రోహిణి రా.9.42 వరకు.
అమృతం రా. 6.31 ల 8.07 వరకు.
దుర్ముహూర్తం మ. 12.21 ల 1.05 వరకు.
దుర్ముహూర్తం మ. 2.33 ల 3.17 వరకు.
వర్జ్యం మ. 1.43 ల 3.19 వరకు.
వర్జ్యం తె. 3.21 ల 4.58 వరకు.
యోగం సాధ్యం
ఉ. 6.25 వరకు.
యోగం శుభం తె. 4.49 వరకు.
కరణం గరజి సా.5.15 వరకు.
కరణం వణిజ తె.4.59 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.
రాహు కాలం ఉ. 7.30 ల 9.00 వరకు.
గుళిక కాలం మ. 1.30 ల 3.00 వరకు.
యమగండ కాలం ఉ.10.30 ల 12.00 వరకు.
***********
పుణ్యతిధి మార్గశిర శుద్ధ చతుర్దశి.
********
పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,
(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)
S2,/C92, 6 -3 -1599/92,C
Vanasthalipuram, Hyderabad
500 070.
.**********
*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*
వారి
*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*
*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును*
*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*
*సంప్రదించండి*
ఫోన్(చరవాణి) నెం లను
*9030293127/9959599505
*.**************
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
**************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏