https://youtube.com/shorts/Hd4tbD3UBDc?si=9gg7M9ThLXf8pWWy
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
20, అక్టోబర్ 2023, శుక్రవారం
మహాభారతములో - ఆది పర్వము*
*మహాభారతములో - ఆది పర్వము*
*తృతీయాశ్వాసము*
*29*
*శర్మిష్ఠ దేవయానీ*
ఒక రోజు రాక్షసరాజ పుత్రి శర్మిష్ట గురు పుత్రి దేవయానివేయి మంది చెలికత్తెలతో వన విహారానికి వెళ్ళారు. అక్కడ కొలను తీరంలో వారు దుస్తులు విడిచి స్నానం చేస్తున్న తరుణంలో గాలికి బట్టలన్నీ కలసి పోయాయి. బయటకు వచ్చిన దేవయాని దుస్తులు శర్మిష్ట వేసుకుంది. కానీ దేవయాని తాను బ్రాహ్మణ కన్యనని ఒకరు విడిచిన దుస్తులు వేయనని చెప్పింది. శర్మిష్ట కోపగించి నా తండ్రి దగ్గర సేవచేసే బ్రాహ్మణుని పుత్రికి నా దుస్తులు పనికి రాలేదా అని నిందించి ఆమెను ఒక పాడు బడ్డ బావిలో త్రోసి చెలికత్తెలతో వెళ్ళి పోయింది. ఆ సమయానికి అటుగా వచ్చిన యయాతి మహారాజు ఆమెను రక్షించి ఆమె వృత్తాంతం తెలుసుకుని తనరాజ్యానికి వెళ్ళాడు. ఆ తరువాత దేవయాని అక్కడకు వచ్చిన తన చెలికత్తెతో తాను తిరిగి వృషపర్వుని రాజ్యానికి రానని తన తండ్రికి చెప్పమని చెమ్మంది. శుకృడు దేవయానిని ఎంత అనునయించినా విఫలం కావడంతో శుకృడు కూడా నగరాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. విషయం తెలిసి అక్కడకు వచ్చిన వృషపర్వుడు శుకృని దయలేకుండా తాము జీవించలేమని వారు ఏది కావాలన్నా ఇస్తానని వేడుకున్నాడు. శుకృని తరఫున దేవయాని శర్మిష్ట వేయి మంది చెలికత్తెలతో తనని సేవిస్తే తామిరువురు నగరంలో ఉంటామని చెప్పింది. వృషపర్వుడు అందుకు అంగీకరించాడు.
నా సనాతనము నకు
గరిక పాటంటెనే ఘనమైన గగనంబు....
గండభేరుండం బు గమన మందు....
నర్సింహ రావంటె న్యాయంబు ధర్మంబు....
ఉగ్ర నర్సింహుడు యుర్వియందు....
గరిక పాటి గారి ఘనమైన వాగ్ధాటి....
వర్ణించ వశమౌనె బ్రహ్మకైనా....
హరి హరాదుల కైన ఆ దేవతల కైన....
నీ కైన నా కైన ఎవరి కైనా....
మహానుభావుడు మాన్యుడు పూజ్యుడు....
మహా గొప్ప వాడు మరుపు రాడు....
ఉన్నదున్నట్లు గా మాట్లాడె మొనగాడు....
యా విష్ణు మూర్తి యవతార మితడు....
భారతీయుల కొరకు భగవంతుడే ఇతడు....
భారత సంస్కృతి కి బంధ మితడు....
పుణ్యుడై బుట్టిండు పురుషోత్తముడు ఇతడు....
హిందువుల బందువై హిందువైయ్యి....
సాక్షాత్తు యా కనక దుర్గ కొడుకు ఇతడు....
అమ్మను నమ్మిన ఆణిముత్యం....
మహా గొప్ప వాడు మంచి గుణ మున్నోడు....
మంచి మనసున్నోడు మహా శివుడు....
నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి....
నా సనాతనము నకు నా నమస్తే....
*శ్రీ చక్రం*
*ॐ* *శ్రీ చక్రం*
*6 వ ఆవరణ*
*6 th PERIPHERY*
*సర్వరక్షాకర చక్రము*
*SARVA RAKSHAKARA CHAKRAM*
*- PROTECTS DEVOTEES FROM ALL KINDS OF DIFFICULTIES.*
*ANTHARDARSANAM - INNER 10 TRIANGLES*
*పది ఊదారంగు త్రికోణాలు*
*The Yogini Devathas are*
1. *SARVAGJNA*
2. *SARVA SAKTHI*
3. *SARVA AISWARYAPRADA*
4. *SARVA GJNAANAMAYI*
5. *SARVA VYAADHIVINAASINI*
6. *SARVA AADHAARA SWARUUPA*
7. *SARVA PAAPAHARA*
8. *SARVA AANANDAMAYI*
9. *SARVA RAKSHSAA SWARUUPINI*
10. *SARVA EEPSITHA PHALA PRADAAYINI*
*It was mentioned in the 5th Periphery the five main vital forces and five secondary vital forces.*
*The following are controlled by the Yogini Devathas in this Periphery.*
1. *Main vital forces, Exhalation(rechaka), Inhalation(puraka), Soshaka, Thirst(daahaka), Plavaka.*
2. *Secondary vital forces(Agnis - fires) - Ksharaka, Udgaaraka, Kshobhaka, Jrimbhaka and Mohaka.These fires have the capacity of digesting all kinds of food.*
*In Gita Lord Krishna says "అహం వైశ్వానరో భూత్వా" - means "I am Vaiswaanara in beings".*
*The function of this deity is to digest 4 kinds of food material and supply energy to various parts of the body.*
https://youtu.be/xvXF78OOoSs
*=x=x=x=*
*— Raamaayanam Sarma*
*Bhadraachalam*
దసరా తర్వాత దీపావళి
ప్రతి సంవత్సరం దసరా తర్వాత సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు వస్తుంది? మీరు నమ్మకపోతే, క్యాలెండర్‌ను తనిఖీ చేయండి. రామచంద్రుడి సైన్యం శ్రీలంక నుండి కాలినడకన అయోధ్య చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణము లో చెప్పారు !!! కాబట్టి 504 గంటలను 24 గంటలు విభజించినచో, సమాధానం 21.00 21 రోజులు. నేను ఆశ్చర్యపోయాను. దీనిని ధృవీకరించడానికి, నేను ఉత్సుకతతో గూగుల్ మ్యాప్‌లో శోధించాను. శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ మరియు నడవడానికి తీసుకున్న సమయం 504 గంటలు అని. నేను షాక్ అయ్యాను !!!! ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ పూర్తిగా నమ్మదగినది. సంప్రదాయం ప్రకారం, త్రేతాయుగం నుండి మనము దసరా మరియు దీపావళిని జరుపుకుంటాము.
మీరు నన్ను నమ్మకపోతే, గూగుల్ సెర్చ్ చేయండి మరియు ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎంతో ఖచ్చితత్వంతో రాశాడు. మన హిందూ సంస్కృతి ఎంత గొప్పది. హిందూ సంస్కృతిలో జన్మించినందుకు గర్వపడండి!
జై శ్రీ రామ్ 🙏🙏🙏
🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷
స్వర్ణభస్మము
స్వర్ణభస్మము గురించి సంపూర్ణ వివరణ -
స్వర్ణం 5 రకాలుగా ఉండును. అవి
1 - సహజము .
2 - ప్రాకృతము .
3 - వహ్నిజము .
4 - ఖనిజము .
5 - సూతవేదజము .
బంగారము 16 వన్నెలు కలిగి ప్రకాశించుచుండును. ఇప్పుడు స్వర్ణములులోని రకాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను.
బ్రహ్మాండం అవతల కోడిగుడ్డు ఆకారమున ఉండును. దీనిని "ప్రాకృతం " అని అందురు. ఇది దేవతలకు కూడా సాధ్యం కాదు.
అగ్నివలన పుట్టినది కావున "వహ్నిజ"అని అంటారు. దీనిని సేవించిన కాయసిద్ధి కలుగును.
పర్వతముల యందు పుట్టు ( ఖనిజము ) బంగారము సేవించిన సర్వరోగములను హరించును . మేరుపర్వతము పైన పుట్టు బంగారమునకు " సహజము " అని పేరు .
పాదరసమును రసవాద ప్రక్రియల యందు చెప్పబడిన విధముగా శుద్ధియొనర్చి కొన్ని రహస్య ప్రక్రియలద్వారా బంగారం తయారుచేయుదురు. ఇది వేదముచే కలిగినది కావున " వేదజ " అని పేరువచ్చినది.
పైనచెప్పబడిన సహజము , వేదజము , ఖనిజము మూడునూ శుద్ది యొనర్చి సేవించిన అమృతముతో సమానమై అది సేవించు మానవులకు సమస్తరోగములను పోగొట్టును . శరీరముకు ఆరోగ్యాన్ని ఇచ్చి దీర్గాయువును కలుగచేయును .
* బంగారం యొక్క స్వచ్ఛత లక్షణము -
బంగారం స్వచ్చమైన ప్రకాశము కలిగి పచ్చగా పొరలు లేక పెళుసుదనము లేకుండా మెత్తదనం , చిక్కదనం మరియు బరువును కలిగి ఉండి ఆకురాయిపై రుద్దిన చక్కని కాంతి కలిగి ఉండి నిప్పున బాగా కాల్చి చల్లార్చిన ఎర్రనై కత్తిరించిన కపిలవర్ణమై ఉండవలెను . అట్టి లక్షణములు కలిగినది ఉత్తమ బంగారము . ఇటువంటి బంగారమును మాత్రమే రసాయనిక ఔషధముల యందు ఉపయోగించవలెను .
* స్వర్ణమును శుద్దిచేయు క్రమము -
నువ్వులనూనె , మజ్జిగ , ఆవుపంచితం , కలి , ఉలవల కషాయం వీని యందు ఒక్కొక దానియందు ఏడుసార్లు ముంచుచూ మరలా ఏడుసార్లు కాల్చుతూ మళ్ళీ ఒక్కొక్కదాని యందు ఏడుసార్లు ముంచుతూ చేసినచో స్వర్ణం శుద్ది అగును.
ఈ పద్ధతిలో ఒక్క స్వర్ణముకు మాత్రమే కాకుండా అన్నిరకాల లోహాలను శుద్ధిచేయవచ్చు .
* స్వర్ణభస్మం తయారుచేయు విధానం -
16 వన్నెలు కలిగిన స్వచ్చమైన బంగారంను తెచ్చి చాలా పలచటి రేకులుగా మార్చి ఆ రేకుల బరువుకు సమానం అగు రసభస్మమును గ్రహించి మాదిఫల రసములో వేసి బాగుగా నూరి ఆ నూరినదానిని పైన చెప్పిన బంగారు రేకులకు పట్టించి మూకుడు యందు ఉంచి పైన మరొక మూకుడు బోర్లించి లోపలకు ఏమి పోకుండా చుట్టూ చీలమన్ను వేసి ఆవుపిడకలతో పుటము పెట్టవలెను . ఈ విధముగా మూడుసార్లు పుటము పెట్టవలెను . ఇలా మూడుసార్లు పుటం పెట్టటం వలన స్వర్ణపు రేకులు భస్మం అగును. ఆ భస్మమును జాగ్రత్తగా సంగ్రహించి ఆ భస్మమునకు 4 వ వంతు పాదరస భస్మమును కలిపి నిమ్మపండ్ల రసమును పోసి నూరవలెను ఆతరువాత దానిని చిన్నచిన్న బిళ్లలుగా చేసి మళ్ళీ పైనచెప్పిన విధముగా మూకుడులో పెట్టి చీలమన్ను అంటించి 33 సార్లు పుటము పెట్టవలెను . ఇలా పుటములు పెట్టిన తరువాత స్వర్ణము కుంకుమపువ్వు కాంతి కలిగి సింధూరించి చక్కని భస్మం అగును.
* స్వర్ణ సింధూరం గుణములు -
పైన చెప్పబడిన విధముగా తయారుచేయబడిన స్వర్ణసింధురం అత్యంత శక్తివంతం అయినది. దీన్ని మించిన గొప్ప ఔషదం మరొక్కటి లేదు శాస్త్రప్రకారముగా దీనిని లోపలికి వాడుచున్న సకల క్షయలు , పూర్వజన్మ పాపములు వలన జనించిన రోగాలు , పిశాచ బాధలు నశించును. అంతులేని శక్తి దేహమంతయు వ్యాపించి అత్యంత శక్తువంతుడు అగును. దేహకాంతి , వీర్యపుష్టి , సూక్ష్మబుద్ధి కలిగించి మనిషికి దీర్గాయుష్షును కలిగించును.
స్వర్ణభస్మం కేవలం అనుభవవైద్యల సూచనతో మాత్రమే వాడవలెను . స్వర్ణసింధురం
మరియు స్వర్ణభస్మం వాడినవారి శరీరం నందు అత్యద్భుతమైన తేజస్సు కలుగును.
ఈ స్వర్ణభస్మ సహిత ఔషధము కొరకు నన్ను సంప్రదించగలరు .క్రింద ఇచ్చిన నంబరుకి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కాకస్య దంతః
కాకస్య దంతః
పూర్వం ఒక గ్రామంలో వీధి అరుగు మీద ఇద్దరు పండితులు కూర్చుని ఒక విషయాన్ని గురించి తర్కించుకుంటున్నారట అదేమిటంటే " కాకస్య దాంతః" అంటే కాకికి దంతాలు వుంటాయని రామశర్మ అనే పండితుడు కాకికి దంతాలు ఉండవని కృష్ణ శర్మ అనే పండితుడు చాలా ఆవేశంతో తరిస్తున్నారు. నారాయణ శర్మ అనే ఒక బ్రాహ్మడు అటువైపునుంచి నడుచుకుంటూ వెళుతున్నాడట. అది వారి కంట పడింది. అప్పుడు ఆ పండితులు ఇద్దరు నారాయణ శర్మను ఆపి తమ తర్కాన్ని విని సమాధానం చెప్పమన్నారు. నారాయణ శర్మకు కంఠంలో వెలగకాయ పడ్డట్లు అయ్యింది. ఎందుకంటే గ్రామంలో రామ శర్మ, కృష్ణ శర్మ ఇద్దరు కూడా ఉద్దండ పండితులు వేద, మీమాంస, తర్క, న్యాయ, జ్యోతి షాది శాస్త్రాలు కూలంకుషంగా చదివిన దిట్టలని ప్రతితీ కాబట్టి సామాన్యుడైన నారాయణ శర్మ వారి తర్కం విని వారి తగువు తీర్చటం అంటే మాటలా. అతని పని అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారయ్యింది..
కాకి కూడా ఘనాహారం అంటే పప్పులు, గింజలు మనుషులు తిన్నట్టు తింటాయి కాబట్టి కాకులకు తప్పకుండా దంతాలు ఉండి తీరాలిసిందే అని రామ శర్మ తన తర్కాన్ని చెబితే దానికి కృష్ణ శర్మ కాకికి వుండే ముక్కు చాలా చిన్నగా ఉంటుంది అందులో చిన్న నాలుక ఉంటుంది ఇక దంతాలు పట్టే అంత నోరే లేనప్పుడు ఇక దంతాలు ఉండటానికి అవకాశం ఎక్కడ వున్నది. నిజానికి కాకికి వున్న ముక్కుతోటె అంటే ఫై ముక్కు మరియు క్రింది ముక్కు మధ్యలో ఆహారాన్ని నమిలి తింటుంది అని కృష్ణ శర్మ వాదించాడు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఏమి మాట్లాడాలో తెలియక తెల్లమొహం వేయవలసి వచ్చింది నారాయణ శర్మకు. నిజానికి నారాయణ శర్మ వారిద్దరి లాగా పెద్దగా చదువుకొనక పోయినా కానీ చక్కటి యుక్తిపరుడు, ఎటువంటి సమస్యనైనా సాధించగల సాధకుడు. కొంచెం ముందు బెరుకుగా ఉన్న కాని వారిద్దరికీ తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
పండితులారా పితృకార్యాలలో కాకులకు అదే వికిర పిండం ఎందుకు పెడతారు ముందు చెప్పండి అప్పుడు మీ సందేహాన్ని నివృత్తి చేయగలరు అని వారి మనస్సును ప్రక్కత్రోవ పట్టించే ప్రయత్నం చేసాడు. అతని ప్రయత్నం కొంత ఫలించిందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో బాగా చదువుకున్నాం అనుకునే మేధావులు కూడా కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసుకొని వుండరు. ఇప్పుడు ఆ పండితుల ఇద్దరి పరిస్థితి అలాగే అయ్యింది. పేలబోయిన వారి ముఖములు కనిపించకుండా తెలివిగా ఇద్దరు మేము అడిగినదానికి నీవు అడిగిన దానికి సంబంధం ఏమిలేదు ముందుగా మా సందేహం తీర్చమని నారాయణ శర్మ ను ఒత్తిడి చేశారు.
నారాయణ శర్మ కూడా ఏమి తక్కువ తినలేదు పండితులారా వికిర పిండం తినాలంటే కాకి ఎలా తినాలి. అందుకే నేను ఆ ప్రశ్నను వేసాను అని అన్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు పండితులు కొంత వెనుకకు తగ్గవలసి వచ్చింది.. మాట మారుస్తూ వాళ్ళు ఇంతకూ నారాయణ శర్మ ఎందుకు ఇటువైపు వచ్చావు అని అన్నారు. అంటే మా గొడవ ఏదో మేము పడేవారం కదా మధ్యలో నీ వల్ల మేమిద్దరం తెలివి లేని వారిగా బయటపడవలసి వస్తున్నదే అన్నట్లుగా వున్నది వారి మాట.
నారాయణ శర్మ వారిద్దరిని ఉద్దేశించి పండితులారా మనం ఎన్నో లక్షల జన్మల నుంచి తపిస్తూ ఉండే ఆ ఈశ్వరుడు మనకు ఈ జన్మను ప్రసాదించారు. ఎంతో జ్ఞ్యానం కలిగి వున్నాము ఇప్పుడైనా మనం కళ్ళు తెరువక ఇంకా శుష్క వాదనలతోటి కాలయాపన చేస్తే మన జన్మకు అర్ధం ఏముంది మనకు శంకర భగవతపాదులవారు చక్కగా భజగోవిందాన్ని బోధించారు. కాబట్టి కాలాన్ని వృధా చేయకుండా చక్కగా పరమేశ్వరుని చేరే మార్గం ఎంచుకోవాలి అని అంటే వారిద్దరికీ కనువిప్పు అయ్యింది.
నాటి నుండి రామ శర్మ కృష్ణ శర్మ శుష్క సంభాషణలు చేయకుండా చక్కగా సాధన చేతుష్టయాన్ని అవలంబీనించి ముముక్షుకత్వం వైపు పయనించారు.
కాబట్టి భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ఓ సాధక మిత్రమా మనకు సమయం తక్కువగా వున్నది మోక్షపదం చాలా దూరంగా ఉన్నది ఈ క్షణం నుంచే మనం సాధన మొదలుపెడితే కానీ మోక్షాన్ని పొందలేము. తస్మాత్ జాగ్రత్త
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
ఇట్లు
మీ భార్గవ శర్మ
కాశీయాత్ర చేసి
*ప్ర: కాశీయాత్ర చేసి వస్తే కాలభైరవుని రూపంగా కుక్కకు గారెల దండ వెయ్యాలి. లేకపోతే కాశీయాత్ర ఫలించదని మా పురోహితులు చెప్తున్నారు. కుక్కను ముట్టుకుంటే స్నానం చేసే ఆనవాయితీ ఉన్న కుటుంబం మాది. కానీ ఇలా చేయకపోతే కాశీయాత్రాఫలం దక్కదంటున్నారు. ఏమి చేయాలో తెలియజేయండి.*
జ: మీ కుటుంబపు ఆనవాయితీ మంచిది. అది శాస్త్రబద్ధం. దానిని వదలకండి. కాశీయాత్ర చేసివస్తే కుక్కకు దండ వెయ్యాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాలభైరవునికి శునక వాహనం ఉందన్న మాట శాస్త్ర సమ్మతమే. ఆ శునకం దివ్యమైనది. కానీ కాలభైరవుడు శునకరూపుడు కాదు.
యాజ్ఞవరాహానికి, ఊరపందికి పూర్తిగా తేడా ఉంది. ఊరపందిని వరాహస్వామి అనడం పాపం. అలాగే ఈ పద్దతి కూడానూ. అయితే - శునకాలు బలిభుక్కులు - కాకులవలనే, పూజానంతరం నివేదిత పదార్థాలు కొద్ది భాగం తీసి, వేరే పాత్రలో పెట్టి, ఇంటి బయట వేరే శునకానికి వేస్తారు. ఇది బలినివేదన. బలి సందర్భంలో ఆ ప్రత్యేక దేవతలకిచ్చిన పదార్థాలను శునకానికి మాత్రమే ఇస్తారు. అది ఇంటి బయట - తాకకుండానే, అలాగే ఏవో గారెలు లాంటివి కుక్కకి పెడితే తప్పులేదు. కానీ మాల వేయడం, కుక్కని భైరవుడు అనుకోవడం తగదు.
అలాగని కుక్కని ఈసడించుకోనక్కర్లేదు. వాటిని చూడవలసిన విధంగా చూడాలి. ఇళ్లల్లో, దేవత మందిరాల్లో కుక్కలు తిరిగితే మంచిది కాదు - అంటారు పెద్దలు. ఇది శాస్త్ర ప్రమాణం.
మనం తాకకపోయినా, కాపలాగా ఇంటి బయట ఉంటే తప్పులేదు. దానికి ఆహారం పెట్టినా దోషం కాదు. భూత దయ అవసరమే, కానీ దేని మర్యాద దానిది.
పనితనముకంటే
*1967*
*కం*
వనితకు విశేష జ్ఞానము
పనితనముకు సాటి రాదు పరికించంగా.
పనితనమెరుగని పడతులు
ఘనజీవికనొందలేరు కనుగొన సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఆడపిల్లలకు పనితనముకంటే గొప్ప జ్ఞానం ఉండదు. పనితనం లేని స్త్రీలు గొప్ప జీవితాన్ని పొందలేరు.
*గమనిక*:-- ఈనాటి స్త్రీలకు ఇటువంటి మంచిమాటలు చెబితే శత్రువు గా పరిగణించే ప్రమాదం ఉంది, అటువంటి వారి కి క్షమాపణలు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
ఆలోచనాలోచనాలు
☺️ ఆలోచనాలోచనాలు 😊 ప్రభో! అది ఎలాగో ప్రదర్శించు! ఇవాళ నేను ఏదైనా మేలుచేయగలిగితే, జీవితంలో ఎవరికైనా సేవ.చెయ్యగలిగితే, ఒరులకు ఉపయోగపడేలాగా ఒక మంచిమాట చెప్పగలిగితే, ప్రభో! అది ఎలాగో ప్రదర్శించు! నేను లోపాలను సరిదిద్దగలిగితే, ఎవరైనా బలపడటానికి నేను తోడ్పడగలిగితే, చిరునవ్వు తో ,లేదా ఒక మధురమైన పాటతో మరొకరిని ఉత్సాహపరచగలిగితే, ప్రభో! అది ఎలాగో ప్రదర్శించు! కష్టాలలో ఉన్న వ్యక్తిని ఆదుకోగలిగితే, ఎవరి భారాన్నైనా కొద్దిగానైనా తగ్గించగలిగితే, ఎవరి కన్నీటిని తుడిచి అతడికి లేదా ఆమెకు ధైర్యం చెప్పగలిగితే, ప్రభో! అది ఎలాగో ప్రదర్శించు! ----- గ్రెన్ విల్ క్లెయ్ సెర్. ----౦ తృప్తికరమైన జీవనం ౦---- ఆనందదాయకంగా పనిచేయడానికి తగిన ఆరోగ్యం. అవసరాలకు మద్దతు నిచ్చేలాగ సంపద. కష్టాలనుండి కడతేరడానికి పోరాడటానికి తగిన శక్తి దేవుడి విషయాలను యదార్థీకరించడానికి తగిన విశ్వాసం. భవిష్యత్తును గురించి భయాందోళనలను తొలగించేలా తగినంత ఆశ. ఇతర ప్రాణులను ఆత్మీయంగా చూడగలిగే ప్రేమ. దీనుల బాధలపట్ల కరగిపోయేంతగా కారుణ్యం. ఇవే నా తృప్తికరమైన జీవితానికి కనీస అవసరాలు. ---- గోథే. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - Sharpen your mind! 1* Who spends the day at the window, goes to the table for meals and hides at night? 2* The answer I give is yes, but what I mean is no. What was the question? 3* First you eat me, then you get eaten. What amI? (For proper answers you have to wait 24 hrs only.). - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -. తెలుగు నుడికారం ( సామెతలు మరియు జాతీయాలు) 1* కంచెలేని చేను, తల్లి లేని బిడ్డా ఒకటే! 2* కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువే! 3* కాలు జారితే తీసుకోవచ్చు; నోరు జారితే తీసుకోలేం. 4* గోటితోపోయే పనికి గొడ్డలి ఎందుకు? 5* గుడ్డి కంటే మెల్ల మేలు. 6* కుక్క కాటుకు చెప్పుదెబ్బ. 7* ఏరు ఎన్ని వంకలు తిరిగినా చివరకు చేరేది సముద్రంలోనే; 8* ఏఱు దాటి తెప్ప తగలేసినట్లు. 9* గాలివానలో ఏనుగులే కొట్టుకపోయినయ్ అంటే మరి దోమలో అన్నాట్ట, ఒక బుద్ధిలేని పెద్దమనిషి. 10* తాటిచెట్టు ఎక్కించి నిచ్చెన లాగేసినట్లు. తేది 19--10--2023, గురువారం, శుభోదయం.
ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు.
*పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.*
*ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.*
*అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది.*
*ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా.? అని చెప్పడంతో..*
*ఆమె, మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది.*
*ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.*
*ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు. కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు.*
*రాజా.! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు.*
*కృష్ణా.! మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో. ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు.*
*తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు.*
*సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం. ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు.
నిందలు మోపుచున్నారంటే
*1968*
*కం*
పలువురు నొక్కరి పైననె
పలునిందలనుంచినంత పరికించదగున్
బలమెంతటిదో అతనిది
తెలివిగలిగియుండగ నిది తెలియును సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఎంతో మంది ఒక్కరి పైననే ఎన్నో నిందలు మోపుచున్నారంటే ఆ ఒక్కడు ఎంతటి బలవంతుడో అర్థం చేసుకోవచ్చు. ఇది తెలివైన వారి కే తెలుస్తుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
నవగ్రహా పురాణం🪐* . *59వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *59వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*సూర్యగ్రహ చరిత్ర - 2*
శని , సావర్ణి , తపతి - ముగ్గురూ బంగారు గిన్నెల్లో ఉన్న క్షీరాన్నం తింటున్నారు. వాళ్ళ దగ్గరగా కూర్చున్న ఛాయ కొసరి కొసరి వడ్డిస్తోంది...
శని తింటూ , తింటూ వాలుగా ద్వారం వైపు చూసి , ఛాయ వైపు అదోలా చూశాడు. ఛాయ ద్వారం వైపు చూసింది.
యమీ , యముడూ , వైవస్వతుడూ లోపలికి వస్తున్నారు.
*"ఇప్పుడెందుకు వచ్చారిక్కడికి ? నేను వచ్చి పిలిచేదాకా ఉద్యానవనంలోనే ఉండండి ! వెళ్ళండి !"* ఛాయ విసుగ్గా అంది.
*"ఆకలిగా ఉందమ్మా క్షీరాన్నం..."* యమి ముందుకు అడుగులు వేస్తూ అంది. *"ఆగు !"* ఛాయ అరిచింది. *"రావద్దని చెప్పానా ? వెళ్ళండి !"*
యమి భయపడుతూ , ఆగిపోయింది.
యముడు ఆవేశంగా ముందుకు వెళ్ళి యమి పక్కన నిలుచున్నాడు. సూటిగా ఛాయ వైపు చూశాడు. *"క్షీరాన్నం మాకు కూడా పెట్టాలి ! ఇప్పుడే !"*
*"యమా ! నా ఆజ్ఞనే ధిక్కరిస్తున్నావా ?”* ఛాయ హుంకరించింది.
*"నీ ఆజ్ఞను కాదు , అధర్మాన్ని ! అధర్మం ఎక్కడున్నా నేను ధిక్కరిస్తాను. తల్లివైనా సరే , నీ పక్షపాత ధోరణిని నేను సహించను. నీ ప్రేమలో , ఆ క్షీరాన్నంలో మాకూ వాళ్ళలాగే భాగస్వామ్యం ఉంది !"* యముడు వైవస్వతుడి చెయ్యి , యమి చెయ్యి పట్టుకుని ముందుకు అడుగులు వేశాడు. *"రా అన్నయ్యా ! రా , చెల్లీ !"*
*"ఈ యముడు ఎప్పుడూ ఇంతే అమ్మా ! ఆటపాటల్లో కూడా ధర్మం , ధర్మం అంటూ మమ్మల్ని ఏడిపిస్తాడు !"* శని యముడ్ని ఓరగా చూస్తూ అన్నాడు.
*"మీకు ఇప్పుడు క్షీరాన్నం పెట్టను. శనీ , సావర్ణి , తపతీ ముగ్గురూ తిన్నాక , ఏమైనా మిగిలితే అదే మీకు !"* ఛాయ నిష్కర్షగా అంది.
*"సావర్ణి , తపతీ ! వేగంగా ఆరగించండి ! అంతా మనమే తినేయాలి !"* శని ఉత్సాహంగా అన్నాడు. ఆదరాబాదరా జుర్రుకుంటూ.
*"తొందరేం లేదు నాయనా ! నెమ్మదిగా అంతా మీరే తినండి !”* ఛాయ అమిత శాంతంగా శనితో అంది.
యముడు తీక్షణంగా ఛాయను చూశాడు. *"అమ్మా ! ఇది అన్యాయం ! నువ్వు మమ్మల్ని కూడా వాళ్ళతో సమానంగా చూడాలి ! అది ధర్మం ! నువ్వు వడ్డించకపోతే , మేమే తీసుకుంటాం !"*
*“ఆగు ! ఆగరా అక్కడే !”* ముందుకు నడవ బోయిన యముణ్ణి చూస్తూ గర్జించింది. ఛాయ. *"సమానంగా చూడాలా ? చూడను ? ఏం చేస్తావ్ ?”*
యముడు ఆగ్రహంతో నిప్పులు కక్కుతూ చూశాడు. ఆవేశంతో ముందుకు వెళ్ళబోతూ , కాలు పైకెత్తి , దువ్వాడు. తన వైపు కాలు చూపిన యముణ్ణి ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసింది ఛాయ. ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
*"నువ్వు అహంకారివి ! నన్ను తన్నడానికి కాలు పెకెతావు ! ఫలితం అనుభవించు ! నీ పాదం తెగి పడి , క్రిములకు ఆహారం అవుగాక !"* ఛాయ కంఠం భీకరంగా ప్రతిధ్వనించింది.
యముడు నిశ్చేష్టుడై నిలిచిపోయాడు. అతని ముఖంలో ఆశ్చర్యం విశ్వరూపంలో ప్రత్యక్షమవుతోంది.
వైవస్వతుడూ , యమీ , శనీ , సావర్ణి , తపతీ అగ్నిగోళంలా ఉన్న ఛాయ ముఖాన్ని ఆందోళనతో చూస్తూ ఉండిపోయారు. ముందుగా ఆశ్చర్యం నుండి యముడు తేరుకున్నాడు.
*"అమ్మా ! నువ్వు... నన్ను శపిస్తావా !”* యముడి కంఠంలో ఇందాకటి ఆగ్రహం , ఆవేశం లేవు. వాటి స్థానాన్ని ఆశ్చర్యమూ , ఆవేదనా ఆక్రమించుకున్నాయి. *“నీ కొడుకును శపిస్తావా ?"*
*"శపిస్తాను ! నిన్ను సర్వనాశనం చేస్తాను. నువ్వు నా కొడుకు కావు ! నీ ముఖం నాకు చూపించకు !”* ఛాయ గర్జించింది.
యముడు ఛాయ ముఖంలోకి నిర్భయంగా చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తలవాల్చి ఒకసారి తన పాదం వైపు చూసుకొన్నాడు. మెల్లగా వెనుదిరిగి , అవతలకి అడుగులు వేశాడు. వైవస్వతుడూ , యమీ అప్రయత్నంగా యముణ్ణి అనుసరించారు.
ఆగ్రహావేశాలతో ఎగసిపడుతున్న ఛాయ వక్షభాగాన్ని ఆమె బిడ్డలు ముగ్గురూ భయంభయంగా చూశారు.
*"నిజమా , యమా ?! అమ్మ నిన్ను శపించిందా ?”* సూర్యుడు నమ్మలేకుండా అన్నాడు. *"సరిగా విన్నావా , నువ్వు ? తల్లి తన బిడ్డను శపించడం అనేది అసంభవం నాయనా ! అసంభవం !”*
*"నిజమే , నాన్నగారూ ! అమ్మ తమ్ముడి పాదం తెగిపడి క్రిములకు ఆహారమవుతుందని శాపం పెట్టింది !"* వైవస్వతుడు వినయంగా అన్నాడు.
*"శని తమ్ముడు పుట్టినప్పట్నుంచీ అమ్మ మా ముగ్గుర్నీ ఏడిపిస్తూనే ఉంది...”* యమి కన్నీళ్ళు తుడుచుకుంది.
సూర్యుడు కనుబొమలు ముడివేస్తూ ముగ్గుర్నీ కలయజూశాడు.
*“నాన్నగారూ...నా పాదం..."* యముడు భయంతో అన్నాడు. సూర్యుడు యముడి దగ్గరగా నడిచాడు. అతని తల మీద అరచేతిని ఉంచాడు.
*"భయపడకు నాయనా ! సంజ్ఞ శాపాన్ని నేను ఉపసంహరించలేను. ఆమె శాపం ఫలించినా , నీ పాదానికి ప్రమాదం రాకుండా చేస్తాను. నీ పాదంలో కొంత మాంసం తెగి పడుతుంది. దాన్ని క్రిములు ఆరగిస్తాయి. సంజ్ఞ శాపం ఆ విధంగా పరిహరించ బడుతుంది !"*
*"నాన్నగారూ !"* యముడి కళ్ళలో ఆనందబాష్పాలు తిరిగాయి.
సూర్యుడి ముఖంలోని ప్రశాంతత అంతర్థానమైంది. ఆయన వైవస్వతుడి వైపు తిరిగాడు. *"వైవస్వతా ! మీ అమ్మ మిమ్మల్ని సరిగా చూసుకోవడం లేదా ? నాకు యధార్ధం. కావాలి సుమా !"*
*"నిజమే నాన్నగారూ ! ఇద్దరు తమ్ముళ్ళూ , చెల్లీ జన్మించిన అనంతరం , అమ్మ ఎందుకో పూర్తిగా మారిపోయింది. వాళ్లను చూస్తే చిరునవ్వులు ! మమ్మల్ని చూస్తే కళ్లల్లో నిప్పులు !"*
*"తపతిని ఎప్పుడూ మెచ్చుకుంటుంది ! నన్ను ఎప్పుడూ నిందిస్తుంది !”* యమి దీనంగా అంది.
*"మాతో కలిసి మెలిసి ఉండవద్దని తమ్ముళ్లకూ , చెల్లికీ చెప్తుంటే నేను విన్నాను ! మమ్మల్ని చూస్తే అమ్మ నిప్పులు కక్కుతుంది ! ఇందాకా , శాపం పెట్టి , 'నువ్వు నా కొడుకువు కాదు, ఫో !' అంది నాన్నగారూ !"* యముడు చెప్పాడు.
*"శపిస్తాను ! నిన్ను సర్వనాశనం చేస్తాను ! అంది. అమ్మ యముణ్ణి !”* వైవస్వతుడు ఆందోళనతో అన్నాడు.
*"నాన్నగారూ ! అమ్మ నన్ను సర్వనాశనం..."* అగ్నిగోళంలా ఎర్రబడుతున్న తండ్రి ముఖాన్ని చూస్తూ ఆపేశాడు యముడు.
సూర్యుడు ఆగ్రహావేశాలతో వేగంగా ద్వారం వైపు నడిచాడు. వైవస్వతుడూ , యముడూ , యమీ ముఖాలు చూసుకొని ఆయన వెంట పరుగుపెట్టారు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*
. శ్రీమాత్రేనమః
*శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*
ది:20-10-2023
శా॥
వానల్దండిగ నీరమీయ కొలువై పండ్లుం బ్రసూనమ్ములున్
కానల్ సైతము నేత్రపర్వమవగా క్రాలేటి చంద్రాతప
మ్మేనాటం దరుగంగనట్టి రుచిమద్ధ్రీంకారశబ్దార్భటీ
గానమ్ముల్ వినిపింప పర్వమిలపై కాలూనె సంరంభమై -11
శా॥
వీటం బందిరులల్లి కొందఱు గృహంబే దేవళమ్మై సనన్
వాటమ్ముంగని కొందఱున్ స్థిరత దేవస్థానముం గొందఱున్
పీటల్వెట్టి కఠోరదీక్షల మహాప్రీతిం గలామగ్నులై
సాటింగాంచని బూజలీయ నలరే సర్వార్థదాత్రీ! నతుల్ -12
శా॥
మోహమ్మే భవబంధకారణము సంపూర్ణమ్ముగా బాపుమా!
దేహమ్మే బహుకర్మహేతువు నగున్ దేహమ్ము నీబోకుమా!
దేహింగూర్చి సమగ్రతం దెలిపి సందేహమ్ములం ద్రోలుమా!
మోహమ్మాదిగ శత్రుషట్కమును నిర్మూలించుమా! మాతరో! -13
(పీట=పీఠము; కలా=చిత్కళ)
"కవితాభారతి"
*~శ్రీశర్మద*
8333844664
*రాశి ఫలితాలు 20-10-2023
*20-10-2023*
*శుక్ర వారం*
*భృగు వాసరః*
*రాశి ఫలితాలు*
*మేషం*
ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. నూతన రుణాలు చేస్తారు. కొన్ని వ్యవవహారలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
*వృషభం*
నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
*మిధునం*
చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహ కలుగుతుంది. ధనపరంగా అనుకూలత పెరుగుతుంది.
*కర్కాటకం*
చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు.
*సింహం*
రుణదాతల ఒత్తిడులు చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధు మిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి.
*కన్య*
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
*తుల*
సోదరుల నుంచి ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.
*వృశ్చికం*
కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
*ధనస్సు*
ఆధాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. దూరపు బంధువులు నుండి అరుదైన ఆహ్వానలు ఆశ్చర్య పరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
*మకరం*
సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గం వారి నుండి అరుదైనా ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతల నుండి కొంత ఉపశమనము పొందుతారు.
*కుంభం*
వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు.
*మీనం*
నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
🕉️
సరస్వతీ స్తుతి*
*దేవీ నవరాత్రులు - సరస్వతీ స్తుతి*
సువక్షోజ కుంభాం సుధా పూర్ణ కుంభాం
ప్రసాదా వలంబాం ప్రపుణ్యా వలంబాం
సదాస్యేందుబింబాం సదానోష్టబింబాం
భజే శారదాంబా మజశ్రం మదంబాం
కటాక్షే దయార్ధ్రాం కరే జ్ఞానముద్రాం
కలాభిర్వి నిద్రాం కళా పైస్సుభద్రామ్
పురస్త్రీం వినిద్రాం పురస్తుంగ భద్రాం
భజే శారదాంబా మజశ్రం మదంబాం
లలామాంక ఫాలాం లసద్గాన లోలాం
స్వభక్తీ కపాలాం యశః శ్రీ కపోలాం
కరేత్వక్ష మాలాం కనత్ప్రత్న లోలాం
భజే శారదాంబా మజశ్రం మదంబాం
సుశీమంత వేణీం దృశానిర్జితైణీం
రమత్ కీరవాణీం సమద్వజ్ర పాణిం
సుధామందరాశ్యాం ముదాచింత్యవేణీం
భజే శారదాంబా మజశ్రం మదంబాం
సుశాంతాం సుదేహాం ద్రుగంతేకచాంతాం
లసత్సల్లతాన్గీ మనంతామ చింత్యాం
స్మరే తాపసై: సర్గ పూర్వస్థితాం తాం
భజే శారదాంబా మజశ్రం మదంబాం
కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే
మరాలే మదేభే మహోక్షేధి రూఢాం
మహత్యాం నవమ్యాం సదాసామరూపాం
భజే శారదాంబా మజశ్రం మదంబాం
జ్వలత్కాంతి వహ్నిం జగన్మోహనాంగీం
భజే మానసాంభోజ సుభ్రాంత భృంగీమ్
నిజస్తోత్ర సంగీత నృత్య ప్రభాంగీమ్
భజే శారదాంబా మజశ్రం మదంబాం
భవాంభోజ నేత్రాజ సంపూజ్య మానాం
లసత్ మందహాస ప్రభావక్త్ర చిహ్నాం
చలచ్చంచలా చారు తాటంక కర్ణాం
భజే శారదాంబా మజశ్రం మదంబాం
- ఆది శంకరాచార్యులవారు