26, జూన్ 2023, సోమవారం

*శ్రీ పతంజలి కృత శంభు నటన స్తోత్రం.

 *శ్రీ పతంజలి కృత శంభు నటన స్తోత్రం..!!*


1)సదంచితం ఉదంచిత నికుంచిత పదం

ఝలఝలం చలిత మంజు కటకం

పదంజలి దృగంజన అనంజనం

అచంచల పదం జనన భంజనకరం!!



2)కదంబ రుచిం అంబరవసం పరమం

అంబుద కదంబక విడంబక గళం

చిదంబుధిమణిం బుధ హృదంభుజ 

రవిం పర చిదంబర నటం హృది భజే!!



3)హరం త్రిపుర భంజనం 

అనంత కృతకంకణం

అఖండదయం అంత రహితం

విరించి సురసంహతి 

పురంధర విచింతిత పదం 

తరుణ చంద్ర మకుటం

పరం పద విఖండిత యమం 

భసిత మండిత తనుం

మదన వంచన పరం 

చిరంతనం అముం ప్రణవ సంచిత నిధిం 

పర చిదంబర నటం హృది భజే!!



4)అనంత అఖిలం జగత్

అభంగ గుణ తుంగం

అమతం ధృత విధుం సురసరిత్

తరంగ నికురుంబ ధృతి

లంపట జటం సమనఢంబ

శుహరం భవహరం

శివం దశ దిగంతుర

విజృంభితి కరం కరలసం

మృగశిశుం పశుపతిం

హరం శశి ధనంజయ

పతంగ నయనం

పర చిదంబర నటం హృది భజే!!



5)అనంత నవరత్న విలసత్కటక

కింకిణీ ఝలం ఝల ఝలం ఝలరవం

ముకుంద విధి హస్తగత మద్దళల యధ్వని

ధిమిధ్ధిమిత నర్తన పదం

శకుంతరత బర్హిరథ నందిముఖ 

దంతిముఖ భృంగిరిటి సంగ నికటం

సనంద సనక ప్రముఖ వందిత పదం

పర చిదంబర నటం హృది భజే!!



6)ఇతి స్తవం అముం భుజగ పుంగవ కృతిం 

ప్రతి దినం పఠతి యః కృత ముఖా

సదః ప్రభు పదద్వితయ దర్శనపదం

సులలితం చరణ శృంగ రహితం

సరః ప్రభవ సంభవ హరిత్పతి హరి

ప్రముఖ దివ్య నుత శంకర పదం

సగచ్ఛతి పరం నతుజను ర్జలనిధిం

పరమ దుఃఖ జనకం దురితదం!!...


శ్రీ పతంజలి కృత శంభు నటన స్తోత్రం...సంపూర్ణం...🙏🙏🙏

హనుమత్ కల్యాణం

 *హనుమత్ కల్యాణం..*🙏

🙏🙏🙏🙏🙏🙏🙏🙏


రామాయణంలో హనుమంతుని కల్యాణం విషయం లేదు కదా..

సువర్చలా వృత్తాంతం ఎక్కడిది..అని కొందరు ప్రశ్నిస్తారు..సమాధాన మేమిటంటే..హనుమంతుని చరిత్ర అంతా రామాయణంలో లేదు..కథకు అవసరమైన మేరకే వాల్మీకి స్వీకరించాడు.

అన్ని యుగాలలోనూ చిరంజీవిగా ఉన్న హనుమంతుని సంపూర్ణ చరిత్ర.. కేవలం త్రేతాయుగానికి చెందిన రామాయణం లో ఉండే అవకాశం లేదు..అలాగే హనుమంతుడు బ్రహ్మచారి అంటారు..ఈ వివాహం ఎలా జరిగిందనేది మరో ధర్మసందేహం..


బ్రహ్మచర్యం నాలుగు రకాలు:

గాయత్రం

బ్రహ్మం

ప్రజాపత్యం

బృహన్ అని వాటికి పేర్లు..

భార్యతో నియమ పూర్వక జీవితం గడిపే వారిని  ప్రజాపత్య బ్రహ్మ -- చారులంటారు..బ్రహ్మచర్య నియమాలను సరిగా అర్ధం చేసుకోగలగాలి..హనుమంతుడు భవిష్యద్ర్బహ్మ ఆయన బ్రహ్మస్తానం పొందిన వాడు.

సువర్చలాదేవి సరస్వతి స్థానం పొందుతుంది..దేవతల భార్యలంటే అర్ధం వారి శక్తులే..బ్రహ్మచర్య నిష్టాగరిష్టునికి ఉండే శక్తి వర్చస్సు సువర్చస్సు ఆమె యే సువర్చలా దేవి..


              కళ్యాణ వైభోగం


సువర్చలాపతిష్షష్ఠః అన్నారు..

హనుమంతునికి నవావతారాలు ఉన్నాయి..

వాటిలో ఆరోది సువర్చలాంజనేయ అవతారం..

సువర్చలా హనుమత్ ద్వాదశక్షరీ మంత్రం మంత్ర శాస్త్రంలో ఉంది..

ధ్వజదత్త, కపిలాది భక్తి ఉపాసకులకు సువర్చలాహనుమత్ సాక్షాత్కారం జరిగింది..

దేశం నలుమూలలా మాత్రమే కాకుండా విదేశాలలో కూడా సువర్చలాంజనేయ విగ్రహాలున్నాయి.


బందరు పరాసు పేటలో,శివాజీ గురువు సమర్ధ రామదాసుస్వామి

16వ శతాబ్దిలో ప్రతిష్ఠించినది. సువర్చలాంజనేయ

ఆలయమే అనేక హనుమాదాలయాలలో వైశాఖ, జ్యేష్ఠ, మాసాల్లో కల్యాణాలు నిర్వహించడం

సువర్చలాంజనేయుల ఉత్సవ మూర్తులను సిద్ధం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది..హనుమ- దుపాసకులు ఎందరో

హనుమత్కల్యాణం నిర్వహిస్తూ ఉంటారు..


మార్గశిర శుద్ధ త్రయోదశినాటి

హనుమద్ర్వత సమయంలో

సువర్చలాంజనేయ కలశాలను ఉంచి పూజిస్తారు..

సువర్చలా హనుమత్ గాయత్రి మంత్రం

జపించడం వల్ల వివాహం అయిన వారెందరో ఉన్నారు..

గృహస్ధులైన వారికి సువర్చలాంజనేయ సేవ సకల శ్రేయేభివృద్ధులనూ కలిగిస్తుంది..


సూర్యుని భార్య సంజ్ఞాదేవి..

ఆమె విశ్వకర్మ కుమార్తె..

సూర్య తాపాన్ని భరించలేక తన ఛాయను సృష్టించి/సూర్యుని సేవలో ఉంచింది..

తాను సముద్ర గర్బంలో అశ్వ రూపంలో తపస్సు చేసుకుంటుంది..

ఒక రోజు కుమార్తెను చూడడానికి వచ్చాడు..

సూర్యుని వద్ద ఉన్నది తన కుమార్తె కాదని గుర్తించి సూర్యునికి ఆ సంగతి తెలియచేసాడు..

అప్పుడు సంజ్ఞాదేవి సముద్ర గర్బంలో ఉండటం గ్రహించిన సూర్యుడు అశ్వ రూపంలోనే ఆమెను కలిశాడు..

అప్పుడు పుట్టిన వారే అశ్వినీదేవతలు..

సంజ్ఞాదేవి తన తేజస్సు భరించ లేకుండా ఉన్న కారణంగా మామ గారైన దేవశిల్పి విశ్వకర్మను రావించాడు..

లోహాన్ని ఒరిపిడి పెట్టినట్లు చేసి సూర్య తేజస్సును కొంత తగ్గించాడు..విశ్వకర్మ అలా ఒరిపిడి పెట్టిన‌ తేజస్సు నుంచి

విష్ణువుకు చక్రము.. శివునికి త్రిశూలం..మొదలైన ఆయుధాలను విశ్వకర్మ తయారుచేశాడు..ఇంకా కొంత సూర్యుని వర్చస్సు మిగిలింది..

దానికి బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ/చేశాడు.

ఆదిత్యనారాయణ..

శక్తి స్త్రీ స్వరూపం కాబట్టి ఆడపిల్ల అయింది.

ఆ సూర్యసర్చస్సుకు సువర్చస్సు -- సువర్చల అని పేరు పెట్టాడు బ్రహ్మదేవుడు.


ఈ సుగుణవతి ఎవరికి భార్య అవుతుంది..?

అని ఇంద్రాదులు ప్రశ్నించినప్పుడు..


సూర్యుని ఫలమనే బ్రాంతితో పట్టబోయినవానికి

ఈమే భార్య‌ కాగలదని  సమాధానం చెప్పాడు..

ఆయనే హనుమంతుడని అందరికీ తెలిసిన విషయమే..

ఆంజనేయుడు సూర్యుని వద్ద‌

విద్యాభ్యాసం చేశాడు.

ఏక సంథ్మాగ్రాహిగా వేదశాస్త్రాదులు ఇంద్రవ్యాకరణంతో సహా వ్యాకరణాలు నేర్చుకున్నాడు..

ఆయనలోని అసాధారణ ప్రజ్ఞకు సూర్యుడు చాలా సంతోషించాడు..


తస్య బుద్ధిం చ విద్యాం చ బల శౌర్య పరాక్రమాన్..!

విచార్య తస్మె ప్రదతౌ స్సస్య కన్యాం సువర్చలామ్..!!


హనుమంతుని బుద్ధి,విద్య బల పరాక్రమములు

చూచి మెచ్చిన సూర్యభగవానుడు

తన కుమార్తె అయిన సువర్చలను

హనుమంతునకు ఇచ్చి వివాహం చేయదలిచాడు..


కానీ హనుమంతుడు బ్రహ్మచర్య వ్రతం  

పాటించదలచానని చెప్పాడు..

నీ బ్రహ్మచర్య నిష్టకు భంగం కాని రీతిలో

ఈమెను స్వీకరించు అంటూ సూర్యభగవానుడు జ్యేష్ఠ శుద్ద దశమినాడు సువర్చలా హనుమంతునకు

కల్యాణం చేశాడు...


రామభక్తులకు రామాయణం..

కృష్ణభక్తులకు భాగవతం..ఎలా ప్రమాణమో.

హనుమద్బక్తులకు పరాశర‌ సంహిత అలా ప్రమాణం..

ఈ గ్రంథం చాలాకాలం వెలుగులోకి రానందువల్ల

సమాజానికి పూర్తి హనుమ చరిత్ర

ఆలస్యంగ అందింది.


శ్రీ రామ దూతం శిరసా నమామి...

.*సర్వేజనాసుఖినోభవంతు*🙏

కాలే కాఫీ - చల్లని మజ్జిగ

 కాలే కాఫీ - చల్లని మజ్జిగ


పరమాచార్య స్వామివారు కాఫీ తాగడాన్ని ఒప్పుకునేవారు కాదు. చాలామంది భక్తులకి కూడా ఆ అలవాటుని మాన్పించారు. అటువంటి సంఘటనే ఇది ఒకటి.


కాంచీపురంలో మహాస్వామి వారి దర్శనానికి చెన్నై నుండి దంపతులు వచ్చారు. భర్త బాగా ఎక్కువగా కాఫీ తాగుతారా అని ఆవిడని అడిగారు స్వామివారు. ఆఫీసుకు వెళ్లేముందు మూడుసార్లు, వచ్చిన తరువాత మూడుసార్లు తాగుతారని అక్కడ ఎన్నిసార్లు తాగుతారో తనకు తెలియదని చెప్పిందావిడ. వెంటనే కాఫీ తాగడం ఆపెయ్యాలని అందుకు బదులుగా మజ్జిగ త్రాగాలని స్వామివారు ఆదేశించారు.


చెన్నై తిరిగొచ్చిన తరువాత కేవలం రెండు రోజులపాటు మహాస్వామివారి ఆదేశాన్ని పాటించగలిగాడు. మూడవరోజు నుండి కాఫీ ఇవ్వాల్సిందిగా భార్యను ఒత్తిడి చేశాడు. ఇక చేసేదేమీ లేక ఆవిడ కాఫీ ఇచ్చింది. పరమాచార్య స్వామీ వారి ఆజ్ఞని దిక్కరిస్తున్నాననే బాధతో ఆ కాఫీని స్వామివారి పటం ముందు పెట్టి అలవాటుని మానుకోలేకపోతున్నానని స్వామికి క్షమాపణ చెప్పి సేవించేవాడు. ఇలా కొద్ది రోజులపాటు జరిగింది.


కొంతకాలం తరువాత ఆ దంపతులు మహాస్వామివారి దర్శనానికి కాంచీపురం వెళ్ళారు. వారిని చూడగానే స్వామివారు ఇక ఎప్పుడూ ఆ వేడి కాఫీ తనకు సమర్పించవద్దని, రోజూ ఆ వేడి కాఫీ వల్ల తమ నాలుక కాలిపోయిందని తెలిపారు. ఆ మాటలకు అతను నిశ్చేష్టుడయ్యాడు. తన ఇంట్లో ఉన్న స్వామివారి చిత్రపటం సామాన్యమైనది కాదని, రోజూ తను స్వామివారి ముందు పెడుతున్న కాఫీ కప్పు స్వామివారు నైవేద్యంగా భావించి స్వికరించారని తెలుసుకొని అతను ఆశ్చర్యపోయాడు. అంటే చిత్రపటంలో ఉన్న స్వామీ, ఇక్కడ కూర్చున్న స్వామీ ఒక్కరే అని అర్థం చేసుకుని తను చేసిన తప్పుకు క్షమాపణలు అడిగాడు.


కళ్ళ నీరు కారుస్తూ, స్వామివారికి సాష్టాంగం చేసి తన మూర్ఖత్వాన్ని మన్నించవలసిందిగా ఇక జీవితంలో ఎప్పుడూ కాఫీ ముట్టనని స్వామివారు ఆదేశించినట్టుగా మజ్జిగ తాగుతానని ప్రమాణం చేశాడు. స్వామివారు ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి కాఫీ తాగే అలవాటు వదిలివేసినంత కాలం నీకు మంచిదని చెప్పి పంపించారు.


--- దినమలర్, 23 ఫెబ్రవరి 2016


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

  .ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి మరు జన్మకు కారణమవుతాయి. అది ఎలాగో తెలుసుకుందాం.


ఒకసారి ఒక కాపలాదారుడు ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది, అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. 

ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు, రాజు అందుకు సమ్మతించాడు.


ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు. 

ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది! ... రాత్రి అయింది. 

అది మొదటి యామం, తప్పెట చేతపుచ్చుకొని ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు, రాజు అతణ్ణి వెంబడించసాగాడు, హెచ్చరిక చేసే సమయం వచ్చింది.

అప్పుడు మూగవాడు ఆ  బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు:


“కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః

జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః." 


మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు...

కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు. 

'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. 

ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది, కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు. 


మళ్ళా రెండవ ఝాము వచ్చింది, అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు: 


“జన్మదుఃఖం జరాదుఃఖం -

జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.”


పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక.


ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు, తృతీయ యామం వచ్చింది:


“మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః

అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః”


తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త! - అని చాటాడు. 

ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు, అయినా వెంబడిస్తూనే ఉన్నాడు...

ఇంతలో నాలుగవ యామం వచ్చింది, అప్పుడు ఆ బాలుడు...

 

“ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా 

ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.”


అని చాటింపు వేశాడు.


ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త జాగ్రత్త - అని చాటాడు...


ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది, అతడు సాధారణ ఊరి కాపరి కాడు. 

పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు.

కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.


మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు...

అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు. 

అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు, అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను, నా కోరిక తీర్చమని అతడిని అడుగు.”

తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. 

అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.


తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు.

అప్పుడు ఆ జీవన్ముక్తుడు, “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు.

అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. 

“అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. 

నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు. 

రాజు అమితాశ్చర్యపోయాడు, అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. 

ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు,

ఇలా కొంతకాలం గడిచింది.


దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు.

“ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు.

అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు.


నా ధర్మ నిర్వహణ జరగడం లేదు, మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది, ఇదే నా విచారానికి కారణం.”

బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. 

దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. 

అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. 

వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు. 

ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. 

అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది...


*అదేమంటే:..*

మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. 

అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి, చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది...

అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. 

ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది...


మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు...

అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. 

అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు...

దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.


ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. 

బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.


"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో 

అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు, అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు. 

అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు: ...

ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? 

నా గత జన్మలోమరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకిలా జన్మించాల్సి వచ్చింది.

భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు !!!...

కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను, నా అనుభవం ఒక పాఠమైనది.”


అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు. 

మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. 

సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. 

కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూన్నది...


నామస్మరణే సులభోపాయం, ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం గాక!

కావున మరణ సమయము ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కావున భగవన్నామ స్మరణ నిత్యము అన్ని వేళలలో ఏ పని చేస్తున్నా మానసికముగా చేస్తూ ఎదుటి మనిషిలో ఉన్న భగవంతుని  గౌరవిస్తూ ప్రవర్తిస్తే‌‌ తప్పకుండా అంత్యకాల నామ స్మరణ తప్పక లభిస్తుంది...


భగవద్గీత లో చెప్పినటుల‌ "అద్వేష్టా సర్వ భూతానాం" ఆచరించుతూ ఉంటేనే ఇది సాధ్యము. 

ఏ ఒక్కరి మీద ద్వేషము లేని వారికే ఇది సుసాధ్యము...

ఎందుకనగా తను వేరొకరిని ద్వేషించే సమయములో ఒకవేళ  మరణము సంభవస్తే అదే ద్వేషముతో పాము-కప్ప జన్మలను, మరియు గజ-కచ్చప (ఏనుగు-తాబేలు) జన్మలను పొంది అనేక యుగములు తగవులాడుకొనే అవకాసము ఉన్నదని పురాణములు చెప్పుచున్నవి. కావున మొట్టమొదలు మనము శత్రువులు అనుకునే వారిమీద మన అభిప్రాయములను సరిదిద్దుకుని "అద్వేష్టా సర్వభూతానాం" గా తయారు అవడము అత్యంతావశ్యకము.

త్రయంబకేశ్వర్

 ఈ పెందుర్తి శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలో ఒకటైన *త్రయంబకేశ్వర్*

నాసిక్ (మహారాష్ట్ర)

నమూనా ఇది.





త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు.

'త్రయంబకం యజామహే -

సుగంధిం పుష్టి వర్ధనమ్' అని మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.


గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. కుశ అంటే ధర్భ, వర్తం అంటే తీర్ధం అని అర్ధం. దీనిలో స్నానం చేయడం వలన సర్వపాపాలు, రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం.


గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకువచ్చే ప్రారంభంలో తన చేతినున్న ధర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన, ఆవర్తనమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలిడిందని పురణాల ప్రకారం కథనం.

దధీచి త్యాగం

 దధీచి త్యాగం

       


            

ఏ కాలంలోనైనా సరే, స్వార్ధ బుద్ధితో కోరుకునే వరాలు లోకానికే కాదు ఆఖరికి అలా కోరుకున్న వారికి కూడా మంచి చేయవని, నిస్వార్థంతో చేసిన స్వల్ప దానమైనా పది కాలాలపాటు చెప్పుకునే విధంగా వారి పేరు స్థిరపడిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ఉదాహరణ మహాబల సంపన్నుడైన వృత్రాసురుడు, దధీచి మహాముని జీవితాలు.


వృత్రాసురుడు మహా భయంకరాకారంగల, మహా శక్తి సంపన్నుడైన రాక్షసుడు. దేవతల పైన ద్వేషంతో తపస్సు చేసి కనీవినీ ఎరుగని విధంగా ఓ వారం పొందాడు, అదేంటంటే ఏదైనా లోహంతో తయారైన ఆయుధం వల్ల కూడా తనకు మరణం రాకూడదని, ఏ విధమైన లోహంతోనూ తయారు చేయని ఆయుధం తప్ప మరి ఏది తనను చంపడం కాదు కదా, కనీసం కొద్దిపాటి గాయం కూడా చేయని విధంగా వరం పొందాడు. ఆ వరానికి సహజ సిద్ధమైన రాక్షస బలం తోడు కావడంతో వాడిని ఎదిరించగలిగే వారెవరు లేకుండా పోయారు. వాడు మొదట ఇంద్రుడి మీద దండెత్తి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. అది చాలదన్నట్లు దేవతలందరినీ హింసించడం మొదలుపెట్టాడు. దేవేంద్రుడు ఏమీ చేయలేక దేవతలను వెంటబెట్టుకొని విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. అత్యంత బలమైన, పొడవైన ఎముకలతో, అత్యంత పదునైన ఆయుధాన్ని తయారు చేయించమని సూచించాడు విష్ణుమూర్తి. 

     


ఏనుగు, సింహం,పులి వంటి జంతువుల ఎముకలు బలిష్టంగా ఉంటాయి. కాబట్టి ఆయుధ తయారీకి పనికొస్తాయి అనుకుంటున్న దేవతలతో విష్ణువు ఇలా అన్నాడు. "మీ ఆలోచన సరైనది కాదు. బలంతో పాటు తపశ్శక్తి కూడా కలబోసుకున్న ఎముకలై ఉండాలి. భృగు మహర్షి కుమారుడు మహాతపస్సంపన్నుడైన దధీచి మహర్షి వెన్నెముక అందుకు బాగా ఉపయోగపడుతుందని దేవశిల్పి, దేవ గురువులను తీసుకుని వెంటనే దధీచి మునిని ఆశ్రయించమని" మార్గాంతరం చెప్పాడు విష్ణుమూర్తి.

దేవేంద్రుడు దేవ గురువైన బృహస్పతిని, దేవశిల్పి విశ్వకర్మను వెంటబెట్టుకొని దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. వారిని చూసి సంతోషంతో అతిథి మర్యాదలు చేయబోతున్న దధీచితో తాము వచ్చిన సంగతిని ఎలా అడగాలో అర్థంకాక సతమతం అవుతుండగా దధీచి మహర్షి వారిని గుచ్చి గుచ్చి అడగడంతో ఎట్టకేలకు చెప్పలేక చెప్పలేక విషయం చెప్పారు. ఎంతో సంతోషంతో వారికి తన అనుమతిని తెలిపాడు.అంతేగాక యోగశక్తితో తన ప్రాణాలను ఊర్ధ్వోత్కటనం చేసుకున్నాడు. లోకోపకారం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన దధీచి అవయవదానానికి ఆద్యుడయ్యాడు. అలా దధీచి మహర్షి వెన్నెముక నుంచి తయారైనదే వజ్రాయుధం. ఆ వజ్రాయుధంతోనే వృత్రాసురుడితో పోరాడి అవలీలగా విజయం సాధించాడు దేవేంద్రుడు. మంచితనానికి, త్యాగానికి మారుపేరుగా దధీచి మహర్షి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ వజ్రాయుధమే ఇంద్రుడికి ప్రధాన ఆయుధమైంది.


ఓం నమో నారాయణాయ

సీజను మొదలైంది

సీజను మొదలైంది 

మొన్నటిదాకా విపరీతమైన ఎండలు, రోజు కూలర్లు, ఏసీలు వెరాసి కరంటు బిల్లు వేలకు వేలు. గత మూడు రోజులనుంచి భగవంతుని దయవలన వాతావరణం చల్లబడ్డది. ప్రాణం కొంత ఊరట చెందింది.  అది సంతోషకరమైన విషయమే కానీ ఇప్పుడే రోగాల సీజను మొదలౌతుంది.  కాబట్టి అందరు ముందుజాగ్రత్తగా ఉండటం అవసరము. 

 ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన మందు 

మందు పేరు: కుటజారిష్ట 

కంపని : పతంజలి 

ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా వున్నా కూడా మనం తినే ఆహారం కలుషితం అవ్వటానికి ఆస్కారం వున్నది. బయటి తిండి తినకుంటే చాల మంచిది కానీ మనం టిఫిన్లు తినకుండా ఉంటామా చెప్పండి. వుండంకదా . ఏమాత్రం నీరు కలుషితమైనా వెంటనే మనకు వచ్చే అనారోగ్య సమశ్య విరోచనాలు, కడుపులో నొప్పి. విరోచనాలు నీళ్ల విరోచనాలే కావచ్చు లేక అజీర్తి విరోచనాలే కావచ్చు. కడుపులోనొప్పి మాత్రం తప్పకుండ ఉంటుంది. దీనినే మనం మెలిపెట్టినట్లు వున్నది అని అంటాము. ఆ బాధ అనుభవిస్తే కానీ తెలియదు. ప్రతి ఇంట్లో ఈ వర్షాకాలంలో అందరు కానీ కొంతమంది కానీ తప్పకుండ ఈ సమస్యతో బాధపడే వారే. 

మనం డాక్టరు దగ్గరికి వెళితే డాక్టారు ఫీజు 100 నుండి 200 తరువాత అయన వ్రాసే మందులు 400-500 వెరసి మనకు 5 నుండి 6 వందల వరకు ఖర్చు వస్తుంది. అవునా కాదా? మరి అతి తక్కువ ఖర్చుతో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనం ఇంట్లోనే చికిత్స చేసుకుంటే ఎట్లావుంటుంది. 

ఒక వేపు విరోచనాలు, పైన వాన డాక్టరు వద్దకు వెళ్లాలంటే స్కూటర్ మీద తడుసుకుంటూ వెళ్ళాలి. డాక్టరు అప్పోయింట్మెంట్ ఏ గంట కుర్చుంటేనో దొరుకుతుంది.  ఈ మధ్యలో రెండు మూడు సార్లు వెళ్లాల్సి వస్తుంది, ఆ కష్టం యెట్లా ఉంటుందో మనకు తెలియంది కాదు.  కాబాట్టి నేను చెప్పే ఈ మందు ఈ రోజే కొనుక్కొని తెచ్చుకుంటే ఇంట్లో ఎవ్వరికీ విరోచనాలు అయినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వాడి ఒక గంట రెండు గంటలలో ఉపశమనం పొందవచ్చు. ఏమంటారు. 

ఈ కుటజారిష్ట గూర్చి తెలుసుకుందాము. ఇది పూర్తిగా ఆయుర్వేదానికి సంబందించిన మందు వనమూలికలతో తయారుచేసింది. నూటికి తొంబైతొమ్మిది పళ్ళు సురక్షితమైనది. చిన్న పిల్లల దగ్గరనుండి వృద్ధుల వరకు ఇంట్లోని అందరు వాడదగిన మంచి మందు. మనం మాత్తర్లు కొనుక్కొంటే అవి కొన్ని వాడి మరల మిగిలినవి ఉపయోగించకుండా పారేసుకుంటాము.  మళ్ళి డాక్టరు దగ్గరికి వెళతాము. వెరసి మళ్ళి 5 వందల ఖర్చు తప్పదు. 

ఈ మందు ద్రవరూపంలో 450 మిల్లి లీటర్ల పరిమాణంలో దొరుకుతుంది ధర కేవలము Rs 95 అంటే 100 రూపాయల కన్నా తక్కువ. ఇంకొక విషయం మీరు ఒక్కసారి ఈ మందు కొని తెచ్చుకుంటే 10 సంవత్సరాలలోపు దీనిని వాడ వచ్చు. అంటే మీ అమ్మాయి డిగ్రీ చదువుతుంటే కొన్న సీసా  మీ అమ్మాయి పెండ్లి అయ్యి మనమరాలు/ మనమడు  పుట్టిన దాకా ఈ మందు క్షేమంగా మీ ఇంట్లో వుంచుకోవచ్చు. ఒకటి రెండు డోసులు తీసుకుంటే మీ విరోచనాలు వెంటనే కడతాయి చక్కటి స్వస్థత చేకూర్చుతుంది. కాక పొతే ఈ మందు చేదుగా ఉంటుంది. మందు ఒకటి రెండు చెంచాలు ఒక చిన్న గ్లాసులో పోసుకొని తగినంత నీటిని కలిపి సేవించండి. 

అందరు తక్కువ ఖర్చుతో మన స్వదేశీ విద్య విధానంలో, స్వదేశీ కంపెనీ ప్రొడక్టులతో ఆరోగ్యాన్ని చేకూర్చుకోవాలనే నా ఉద్యమాన్ని మీరు బలపరుస్తారనుకుంటా.  



కంపెనీ వారు ఇచ్చిన సమాచారం 

Kutajarishta brings relief to you from chronic indigestion problems, upset stomach, diarrhoea, fever, etc. Contaminated food and drinks constantly harm and weaken your digestive system. It is a time-tested formulation that soothes your stomach, heals the damages from contaminations and boosts your digestion. It has been clinically proven to have no side effects.

మందు వాడిన వారు వారి అనుభవాలను కింద కామెంటులో తెలుపగలరు.

శివాలయంలో చేసే చండీ ప్రదక్షిణం






 *వృషం చండం వృషం చైవ సోమసూత్రం పునర్వృషం।*

*చండం చ సోమసూత్రం చ పునశ్చండం పునర్వృషం॥*

*నవప్రదక్షిణోపేతం యః కుర్యాచ్చ ప్రదక్షిణమ్।*

*త్రింశత్ సహస్ర సంఖ్యాక ప్రదక్షిణఫలం భవేత్॥*

బడబాగ్ని కథ.

 నిత్యాన్వేషణ: 

సముద్ర గర్భంలో బడబాగ్ని ఉంటుందనిపురాణాలు చెప్తాయి. దీని వెనుక ఉన్న పురాణ కథలేమిటి?




ఒకానొకప్పుడు భృగు వంశస్థులు చాలా తపస్సు చేయడంతో వారికి ఆయుష్షు పెరుగుతుంది కానీ జ్ఞాన వృద్దులవటాన వైరాగ్యం ఎక్కువైంది. ఇక ఈ జన్మ చాలిస్తే బాగుంటుంది కానీ ఆత్మహత్య మహాపాపం కదా అని ఇంకేదో దారి వెదుకుతూ ఉంటే ఆనాటి రాజు హైహయ వంశీకుడైన కృతవీర్యుడనే రాజు భృగు వంశీకులకిచ్చిన బహుమతులను, ధనాన్ని తిరిగి రాజ్యానికి ఇవ్వమన్నారు వారసులు . శరీరత్యాగం కోసం ఎదురు చూస్తున్న బ్రాహ్మణులు ఇదే అదునని రాజుకివ్వకుండా భూమి లో దాచిపెట్టారు. హేహయులకు కోపం వచ్చి అందరినీ ఊచకోత కోశారు. ఆ హేహయులకు అందకుండా ఋచి అనే మునిపత్ని (చ్యవన మహర్షి కోడలు, అప్రవాన మహర్షి భార్య) తన పుత్రుని ఊరువులో దాచి పెంచుతుంది. ఐనా తల్లి ని వేధించవచ్చిన హేహయులకు తన తేజస్సు తో కళ్ళుపోయేలా చేశాడు ఔర్వుడు.

ఊరువులో నుంచి వచ్చాడు కాబట్టి ఔర్వుడని పేరు. మన్నింపమన్న రాజులందరికీ తిరిగి చూపు వచ్చేలా చేసినా., తన పూర్వులందరినీ ఊచకోత కోశారు అని తెలిసి కోపంగా యజ్ఞం మొదలు పెట్టారు. అది తెలిసిన పితృదేవతలు వచ్చి నీవు చేసే పని తప్పు. వైరాగ్యం తో మాకు మేమే రాజు కు కోపం వచ్చేలా చేసి ఈ లోకం వదిలాము. కాబట్టి ఈ యజ్ఞం ఆపు అన్నారు. ఔర్వుడు నాకు చాలా కోపం వచ్చింది దీన్నేం చేయమంటారని అడిగితే కోపం నిప్పు లాంటిది కాబట్టి సముద్రం లో వదలమన్న పితరుల సలహాతో తన కోపాన్ని (హయ)గుర్రం రూపంలో సముద్రం లోకి పంపాడు ఔర్వుడు. దీనినే బడబాగ్ని అంటారు.

అదీ బడబాగ్ని కథ.

ఉత్తమం

 .                       🕉️

                _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*వరం పర్వతదుర్గేషు*  

*భ్రాన్తం వనచరైస్సహ।*

*న మూర్ఖజనసమ్పర్కః* 

*సురేన్ద్రభవనేష్వపి॥*




తా||

సకలభోగాలుగల భవనంలో మూర్ఖులతో సహవాసం చేయడంకంటే ఆటవికులతో కలసి అడవుల్లోనో పర్వతప్రదేశాల్లోనో సంచరించడం ఉత్తమం.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 102*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 102*


"ఏమి శ్రేష్టి ! ప్రజలలో నీ గురించి చాలా మంచి అభిప్రాయం ఉన్నదని వింటున్నాం. వ్యాపారకంగా, వ్యవహారికంగా నమ్మకాస్తుల్లో నిన్ను మించినవాడు లేడట... కానీ, ఒక్క రాజభక్తిలో మాత్రం... ?" అంటూ నవ్వాడు చాణక్యుడు. 


చందనదాసు తోట్రుపాటు పడుతూ "ఆర్యులకు నా గురించి ఇన్ని మంచి అభిప్రాయాలు చెప్పిన వారెవరో గానీ, నా రాజభక్తిని ఎందుకు శంకించారో నాకు అర్థం కావడం లేదు. నేను రాజభక్తుడినే గానీ, రాజద్రోహిని కాను..." అన్నాడు నిబ్బరంగా. 


"కావా... ? నువ్వు ద్రోహివి కావా... ? రాజాద్రోహియై రాజ్యం విడిచి పారిపోయిన రాక్షసామాత్యుని భార్య పుత్రులకు నీ ఇంట రహస్యంగా ఆశ్రమం ఇవ్వడం రాజద్రోహం కాదా ?" గద్దించాడు చాణక్యుడు.


ఆ రహస్యం చాణక్యునికి తెలిసిపోయిందని గ్రహించి నిర్గాంతపోయాడు చందనదాసు. అంతలో కొందరు భటులు అక్కడికి వచ్చి "ఆర్యా ! చందనదాసు గృహాన్ని అణువణువునా గాలించాము. రాక్షసుల వారి భార్య పుత్రుల జాడ తెలియలేదు. ఈ చందనదాసు ఇక్కడికి వచ్చేముందే ఒక స్త్రీని, బాలుడిని ఎక్కడికో పంపించి వేశాడని చుట్టుప్రక్కల వారు తెలియజేశారు..." అని విన్నవించుకున్నారు. చందనదాసు పెదవులపై చిరుదరహాసం మెరిసి అదృశ్యమైపోయింది.


"శ్రేష్టి ! ఇప్పుడు అంగీకరిస్తావా, నువ్వు రాజద్రోహివని...? రాజద్రోహానికి శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో నీకు తెలుసా ? రాక్షస భార్యా పుత్రులను ఎక్కడికి దాటించావు ? వారిని ఎక్కడ దాచావు ? చెప్పు" గద్దించాడు చాణక్యుడు.  


చందనదాసు తల అడ్డంగా తిప్పి "ఏమో.... నాకు తెలియదు... తెలిసినా చెప్పను" అన్నాడు నిర్మొహమాటంగా. 


చాణక్యుడు పటపట పళ్ళు కొరుకుతూ "రాజద్రోహానికి తోడు అధికార ధిక్కారమా ?" గర్జించాడు. 


"మీరెలా అనుకున్న సరే ... ఏం చేసినా భయపడను కూడా... రాజద్రోహ నేరానికి భయపడి మిత్రద్రోహం చెయ్యను. నా మిత్రునికి మాటిచ్చాను. నా కంఠంలో ప్రాణముండగా వారి ఆచూకీ చెప్పను. వారిని మీకు అప్పగించను. నన్ను ఏం చేసుకుంటారో ..... మీ ఇష్టం ...." అని స్పష్టం చేశాడు చందనదాసు నిర్భయంగా. 


చాణక్యుడు గుడ్లురుముతూ "అలాగా..." అంటూ వెటకరించి, భటులవైపు చూస్తూ "ఈ చందనదాసుని భార్యబిడ్డలతో సహా కారాగారంలో బంధించండి. ఇతడి సర్వసంపదలను జప్తు చేసి కోశాగారమున జమ చెయ్యండి. రాక్షసుని కుటుంబ సభ్యులను అప్పగించిన నాడే యీతనికి విముక్తి... ఖైదు చెయ్యండి" అని ఆదేశించాడు కఠినస్వరంతో. చందనదాసు భార్యాబిడ్డలతో సహా కారాగారంలో బంధించబడ్డాడు. 


ఆ మర్నాటి ఉదయం తలారు శకటదాసుని శులారోహణం చేయించడానికి వధ్యస్థానానికి తీసుకువెళ్లారు. సరిగ్గా శూలారోహణం జరిపే సమయానికి మారువేషంలో ఉన్న సిద్ధార్థకుడు తలారుల మీదికి లంబించి ఖడ్గచాలనంతో వాళ్లని పారద్రోలి శకటదాసుని విడిపించి వెంటబెట్టుకుని నగరం విడిచి పారిపోయాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 శు భో ద యం🙏


పోతన పాత్ర చిత్రణ 


                    ఉ: కాటుక కంటినీరు చనుగట్ల పయింబడ నేలయేడ్చెదో?


                          కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! యోమదంబ! యో


                         హాటకగర్భురాణి! నిను నాకటికైఁ గొనిపోయి యల్ల క


                         ర్ణాట కిరాట కీచకులకమ్మ ;త్రిశుధ్ధిగ నమ్ము; భారతీ!


                                        -- చాటువు ;


                 ఉ: కోపము తోడ నీవు దధి భాండము భిన్నము సేయుచున్నచో


                        గోపిక త్రాటఁగట్టిన వికుంచిత సాంజన భాష్ప తోయ ధా


                        రా పరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం


                      బాపఁడవై నటించుట గృపాపర ! నామదిఁ జోద్యమయ్యెడిన్ ;


                                        భాగ-ప్రథ-స్కం: 181 పద్యం: కుంతి కృష్ణుని స్తుతించుట;


                                          ఆంధ్ర సాహిత్య క్షేత్రాన్నలంకరించిన కవితల్లజులలో పాత్ర చిత్రణ విషయమున కవులందరు నొకయెత్తు. బమ్మెరపోతన యొకయెత్తు. అతడుచిత్రించిన పాత్రలన్నియు శబ్దచిత్రములే! కానీ,అందుకొన్ని నిశ్చలనములు, మరికొన్ని చలనములు.

ఆపాత్రలు పోతనగారితో మాటగలిపిమాటాడినవే! మనకుగూడ నట్టి మనః పరిణామము గల్గినచో నవిమనతోగూడ మాటాడగలవు.

"పాత్రకు తగిన యాకారము. ఆకారమునకు దగిన ఆహార్యము. ఆహార్యమునకుదగిన వేషము.దానికితగనమాటలు .మాటలకు దగిన చక్కనిపదములకూర్పు. పోతన చిత్రణలోని విశేషములు.


                                        పైరెండుపద్యములలో మొదటిది పోతన సరస్వతి నోదార్చుట. ధనముపై నాశతో భాగవత గ్రంధమును నరాంకిత మొనరించునేమోనని యనుమానమంది చదువులతల్లి దీనవదనయై కన్నులనీరుగార దేవతార్చనా పీఠమున నున్నపోతనకన్నుల

కగుపించినదట! పోతనయామెరూపమును గాంచి నివ్వెరపోయెను,." అమ్మా! సరస్వతీమాతా! కాటుక తో దిగజారు కన్నీరు వక్షోజములపై బడగా నేలనమ్మా విలపింతువు? ఓహో! ధనాశతో నిన్నముకొందుననియా నీవిచారము. అటులెన్నటికి జరుగదు. త్రికరణ శధ్ధిగా జెప్పునామాటను నమ్ము. మనుట"-. ఇది నిశ్చలన చిత్రమే! ,ఆజగదంబ కన్నులనీరుగార్చుట. కన్నులకున్న కాటుక కరగి కన్నీట గలసి చనుగట్లపై బడుట. ఆహా! ఏమాచిత్రణము! మనోముకురమున గాంచగల్గినవాని జీవితము ధన్యము.


                                   ఇఁక రెండవ చిత్రము చలనము. బాలకృష్ణుని కొంటేపనులను దలచుకొని కుంతి కృష్ణుని ప్రస్తుతించుచు నాడిన మాటలు. ఆమాటలవెనుక నార్తియున్నది. అభిమానమున్నది. భక్తియున్నది. ఆప్యాయతను రంగరించి చిత్రించిన యీచిత్రము అపూర్వము.


                                    "కృష్ణా! యేమి చెప్పనయ్యా నాటి ముచ్చటలు. బాల్యమున నీవొకనాడొకగోపిక యింటికేగి. దధి భాండమును కోపముతో పగులగొడితివి. ఆగోపికయు కోపమున నిన్ను త్రాటితోగట్టివేయుచో, మొగమొక వంకకు వంచి,కన్నుల కాటుక కన్నీరుగార

దానినంతయు నిరుచేతులతో మొగమంతయు పులుముకొనుచు వేడినిట్టూర్పులను విడచుచు బాలునివలె నటించుట నేడుదలచికొనిన నాకు చోద్యమనిపించునయ్యా! కొంటె కృష్ణయ్యా! యెంత దొంగ నటన! భక్తిపాశములచే గట్టుబడు నీవు సామాన్యమగు త్రాట బంధింపఁబడుట నటన గాకమరేమి? "- యనిమేనత్తమాటలు.


                                  త్రాటగట్టబడుట , సాంజన భాష్పతోయ సిక్తమైన మోమును చేతులతో పులిమికొనుట. అప్పటి కృష్ణయ్య ఆ యాకారము. ఇవియన్నియు పోతన పాత్రచిత్రణము లోని మెళకువలు.చివరకు అంతవాడ వింతవాడ వైతివే యని యాశ్చర్యమును ప్రకటించుట. యతని రచన లోని చమత్కారము. 


                                                                  ఇదండీ పోతన గారి పాత్ర చిత్రణలోని గొప్పతనం!


                                                                                                   స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🙏🌷🌷🌷శు భో ద యం🙏


పోతన పాత్ర చిత్రణ 


                    ఉ:  కాటుక కంటినీరు  చనుగట్ల పయింబడ  నేలయేడ్చెదో?    కైటభ దైత్య మర్దనుని  గాదిలి కోడల!  యోమదంబ  హాటకగర్భురాణి!  నిను  నాకటికైఁ గొనిపోయి   యల్ల   క


                         ర్ణాట  కిరాట  కీచకులకమ్మ ;త్రిశుధ్ధిగ  నమ్ము; భారతీ!


                                        --    చాటువు ;


                 ఉ:  కోపము తోడ నీవు  దధి భాండము  భిన్నము  సేయుచున్నచో


                        గోపిక  త్రాటఁగట్టిన  వికుంచిత  సాంజన భాష్ప  తోయ   ధా


                        రా పరిపూర్ణ  వక్త్రముఁ  గరంబులఁ బ్రాముచు  వెచ్చనూర్చుచుం


                      బాపఁడవై  నటించుట  గృపాపర ! నామదిఁ   జోద్యమయ్యెడిన్ ;


                                        భాగ-ప్రథ-స్కం: 181 పద్యం: కుంతి కృష్ణుని స్తుతించుట;


                                          ఆంధ్ర సాహిత్య క్షేత్రాన్నలంకరించిన  కవితల్లజులలో  పాత్ర చిత్రణ విషయమున  కవులందరు నొకయెత్తు. బమ్మెరపోతన యొకయెత్తు. అతడుచిత్రించిన పాత్రలన్నియు  శబ్దచిత్రములే! కానీ,అందుకొన్ని నిశ్చలనములు, మరికొన్ని చలనములు.

ఆపాత్రలు పోతనగారితో మాటగలిపిమాటాడినవే! మనకుగూడ నట్టి మనః పరిణామము గల్గినచో నవిమనతోగూడ మాటాడగలవు.

"పాత్రకు తగిన యాకారము. ఆకారమునకు దగిన ఆహార్యము. ఆహార్యమునకుదగిన వేషము.దానికితగనమాటలు .మాటలకు దగిన చక్కనిపదములకూర్పు. పోతన చిత్రణలోని విశేషములు.


                                        పైరెండుపద్యములలో  మొదటిది పోతన సరస్వతి నోదార్చుట. ధనముపై నాశతో భాగవత గ్రంధమును  నరాంకిత మొనరించునేమోనని యనుమానమంది చదువులతల్లి  దీనవదనయై  కన్నులనీరుగార దేవతార్చనా పీఠమున నున్నపోతనకన్నుల

కగుపించినదట! పోతనయామెరూపమును గాంచి నివ్వెరపోయెను,."  అమ్మా! సరస్వతీమాతా! కాటుక తో దిగజారు కన్నీరు వక్షోజములపై బడగా  నేలనమ్మా  విలపింతువు? ఓహో!  ధనాశతో నిన్నముకొందుననియా నీవిచారము. అటులెన్నటికి జరుగదు. త్రికరణ శధ్ధిగా జెప్పునామాటను నమ్ము. మనుట"-. ఇది నిశ్చలన చిత్రమే! ,ఆజగదంబ కన్నులనీరుగార్చుట. కన్నులకున్న కాటుక కరగి కన్నీట గలసి చనుగట్లపై బడుట. ఆహా! ఏమాచిత్రణము! మనోముకురమున గాంచగల్గినవాని జీవితము ధన్యము.


                                   ఇఁక  రెండవ చిత్రము  చలనము. బాలకృష్ణుని కొంటేపనులను  దలచుకొని  కుంతి కృష్ణుని ప్రస్తుతించుచు నాడిన మాటలు. ఆమాటలవెనుక నార్తియున్నది. అభిమానమున్నది. భక్తియున్నది. ఆప్యాయతను రంగరించి చిత్రించిన యీచిత్రము అపూర్వము.


                                    "కృష్ణా! యేమి చెప్పనయ్యా నాటి ముచ్చటలు. బాల్యమున నీవొకనాడొకగోపిక యింటికేగి. దధి భాండమును కోపముతో  పగులగొడితివి. ఆగోపికయు కోపమున  నిన్ను త్రాటితోగట్టివేయుచో, మొగమొక వంకకు వంచి,కన్నుల కాటుక కన్నీరుగార

దానినంతయు  నిరుచేతులతో  మొగమంతయు పులుముకొనుచు  వేడినిట్టూర్పులను  విడచుచు బాలునివలె నటించుట     నేడుదలచికొనిన  నాకు చోద్యమనిపించునయ్యా! కొంటె కృష్ణయ్యా! యెంత దొంగ నటన! భక్తిపాశములచే గట్టుబడు నీవు సామాన్యమగు త్రాట బంధింపఁబడుట  నటన గాకమరేమి? "- యనిమేనత్తమాటలు.


                                  త్రాటగట్టబడుట , సాంజన భాష్పతోయ సిక్తమైన  మోమును  చేతులతో  పులిమికొనుట. అప్పటి కృష్ణయ్య ఆ యాకారము. ఇవియన్నియు పోతన పాత్రచిత్రణము లోని మెళకువలు.చివరకు అంతవాడ వింతవాడ వైతివే యని యాశ్చర్యమును ప్రకటించుట. యతని రచన లోని చమత్కారము. 


                                                                  ఇదండీ పోతన గారి పాత్ర చిత్రణలోని  గొప్పతనం!


                                                                                                   స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🙏🌷🌷🌷

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 102*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 102*


"ఏమి శ్రేష్టి ! ప్రజలలో నీ గురించి చాలా మంచి అభిప్రాయం ఉన్నదని వింటున్నాం. వ్యాపారకంగా, వ్యవహారికంగా నమ్మకాస్తుల్లో నిన్ను మించినవాడు లేడట... కానీ, ఒక్క రాజభక్తిలో మాత్రం... ?" అంటూ నవ్వాడు చాణక్యుడు. 


చందనదాసు తోట్రుపాటు పడుతూ "ఆర్యులకు నా గురించి ఇన్ని మంచి అభిప్రాయాలు చెప్పిన వారెవరో గానీ, నా రాజభక్తిని ఎందుకు శంకించారో నాకు అర్థం కావడం లేదు. నేను రాజభక్తుడినే గానీ, రాజద్రోహిని కాను..." అన్నాడు నిబ్బరంగా. 


"కావా... ? నువ్వు ద్రోహివి కావా... ? రాజాద్రోహియై రాజ్యం విడిచి పారిపోయిన రాక్షసామాత్యుని భార్య పుత్రులకు నీ ఇంట రహస్యంగా ఆశ్రమం ఇవ్వడం రాజద్రోహం కాదా ?" గద్దించాడు చాణక్యుడు.


ఆ రహస్యం చాణక్యునికి తెలిసిపోయిందని గ్రహించి నిర్గాంతపోయాడు చందనదాసు. అంతలో కొందరు భటులు అక్కడికి వచ్చి "ఆర్యా ! చందనదాసు గృహాన్ని అణువణువునా గాలించాము. రాక్షసుల వారి భార్య పుత్రుల జాడ తెలియలేదు. ఈ చందనదాసు ఇక్కడికి వచ్చేముందే ఒక స్త్రీని, బాలుడిని ఎక్కడికో పంపించి వేశాడని చుట్టుప్రక్కల వారు తెలియజేశారు..." అని విన్నవించుకున్నారు. చందనదాసు పెదవులపై చిరుదరహాసం మెరిసి అదృశ్యమైపోయింది.


"శ్రేష్టి ! ఇప్పుడు అంగీకరిస్తావా, నువ్వు రాజద్రోహివని...? రాజద్రోహానికి శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో నీకు తెలుసా ? రాక్షస భార్యా పుత్రులను ఎక్కడికి దాటించావు ? వారిని ఎక్కడ దాచావు ? చెప్పు" గద్దించాడు చాణక్యుడు.  


చందనదాసు తల అడ్డంగా తిప్పి "ఏమో.... నాకు తెలియదు... తెలిసినా చెప్పను" అన్నాడు నిర్మొహమాటంగా. 


చాణక్యుడు పటపట పళ్ళు కొరుకుతూ "రాజద్రోహానికి తోడు అధికార ధిక్కారమా ?" గర్జించాడు. 


"మీరెలా అనుకున్న సరే ... ఏం చేసినా భయపడను కూడా... రాజద్రోహ నేరానికి భయపడి మిత్రద్రోహం చెయ్యను. నా మిత్రునికి మాటిచ్చాను. నా కంఠంలో ప్రాణముండగా వారి ఆచూకీ చెప్పను. వారిని మీకు అప్పగించను. నన్ను ఏం చేసుకుంటారో ..... మీ ఇష్టం ...." అని స్పష్టం చేశాడు చందనదాసు నిర్భయంగా. 


చాణక్యుడు గుడ్లురుముతూ "అలాగా..." అంటూ వెటకరించి, భటులవైపు చూస్తూ "ఈ చందనదాసుని భార్యబిడ్డలతో సహా కారాగారంలో బంధించండి. ఇతడి సర్వసంపదలను జప్తు చేసి కోశాగారమున జమ చెయ్యండి. రాక్షసుని కుటుంబ సభ్యులను అప్పగించిన నాడే యీతనికి విముక్తి... ఖైదు చెయ్యండి" అని ఆదేశించాడు కఠినస్వరంతో. చందనదాసు భార్యాబిడ్డలతో సహా కారాగారంలో బంధించబడ్డాడు. 


ఆ మర్నాటి ఉదయం తలారు శకటదాసుని శులారోహణం చేయించడానికి వధ్యస్థానానికి తీసుకువెళ్లారు. సరిగ్గా శూలారోహణం జరిపే సమయానికి మారువేషంలో ఉన్న సిద్ధార్థకుడు తలారుల మీదికి లంబించి ఖడ్గచాలనంతో వాళ్లని పారద్రోలి శకటదాసుని విడిపించి వెంటబెట్టుకుని నగరం విడిచి పారిపోయాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అధికవేడిని హరించుటకు

 శరీరంలో అధికవేడిని హరించుటకు యోగాలు -


      కొన్ని సందర్భాలలో శరీరం అత్యథిక వేడికి గురవుతుంది. దీనికి కారణం సరైన సమయానికి భోజనం చేయకపోవడం , నిద్ర తక్కువపోవడం , సరైన ఆహారపదార్థాలు తీసుకోకపోవడం , మద్యపానం , ధూమపానం వంటి వాటివల్ల శరీరం అత్యధిక వేడికి గురగును. మూత్రం మంటగా రావటం , పసుపుపచ్చని మూత్రం , మూత్రం వాసన రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి . శరీరంలో అధికవేడి పెరిగినప్పుడు మూత్రపిండాలు మరియు కాలేయ సమస్యలు కలుగును.


        ఇప్పుడు నేను చెప్పబోవు యోగాలు పాటించటం వలన శరీరం నందలి అధికవేడి తగ్గును.


  అతివేడి నివారణా యోగాలు  -


 *  ఒక గ్లాసు నీటిలో చెంచాడు రుద్రజడ గింజలు లేక సబ్జాగింజలు పావు గంటసేపు నానబెట్టి అందులో కొంచం బెల్లంగాని , పంచదారగాని కలుపుకుని తాగాలి . అలా రోజూ చేస్తుంటే శరీరంలో అధికవేడి తగ్గును.


 *  కర్బుజా పండ్లుగాని , పుచ్చకాయలు ప్రతిరోజు విరివిగా తినుచున్న శరీరంలోని అధికవేడి నివారణ అగును.


 *  నిమ్మపండ్ల రసాన్ని సేవించుచున్న వేడితగ్గును . ప్రతిరోజు మూడునిమ్మపండ్ల రసం తాగవలెను .


 *  మజ్జిగని ప్రతిపూట తాగుచుండవలెను .


 *  పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజు తినవలెను .


 శరీరంలో అతివేడి తగ్గుటకు నేను ప్రయోగించిన సిద్దయోగం  -


         రాత్రి సమయంలో రెండు కప్పుల అన్నాన్ని ఒక గిన్నెలో వేసి అది మునిగేంత వరకు వేడివేడి పాలు పోయాలి . కొంచం గోరువెచ్చగా అయ్యిన తరువాత పెరుగు వేసి తోడుపెట్టవలెను . ఉదయానికి మంచిగా తోడుకొని ఉండును. దానికి కొంచం ఉప్పు కలిపి నీరుల్లిపాయను ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను ఇలా 20 నుంచి 30 రోజులపాటు చేయవలెను .


         పైన చెప్పిన విధముగా చేసినచో అతిత్వరగా శరీరం నందలి వేడి తగ్గును.


 శరీరం నందలి అతివేడి ఉన్నవారు తీసుకొకూడని ఆహారాలు  -


 కోడి మాంసం , పాతపచ్చళ్లు , మినుములు , ఉలవలు , మద్యము , చేప , కాకరకాయ , మసాలా పదార్థాలు  , అల్లం , వెల్లుల్లి , నూనె వేపుళ్లు , టీ , కాఫీ , గోధుమలు , కందులు , బెల్లం , శనగలు , వేరు శనగలు వంటి వాటికి దూరంగా ఉండవలెను .


     మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


 కాళహస్తి వేంకటేశ్వరరావు .


అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

ఘటస్థ - పటస్థ

 ఘటస్థ - పటస్థ


పరమాచార్య స్వామివారు చెక్కబల్లకు ఆనుకుని కాళ్ళు చాపుకుని కూర్చుని ఉండటం అందరూ చూసే అద్భుత దృశ్యం. ముఖ్యంగా స్వామివారు మేనాలో కూర్చుని దర్శనం ఇస్తున్నప్పుడు స్వామివారు కాళ్ళు చాపుకునే ఉంటారు.

“మహాస్వామి వారు కళ్ళు పెట్టుకోవడానికి ఒక మెత్తటి పాదపీఠం తయారుచేస్తే ఎలా ఉంటుంది?”


వెంటనే రబ్బరుతో తయారుచేసిన తేలికగా, మెత్తగా ఉన్న స్పాంజిని తీసుకుని వచ్చి పెద్దగా వలయాకారంగా కత్తిరించాను. దాన్ని వెల్వెట్టు గుడ్డతో కప్పి, ఎనిమిడ్ దళాల కమలం పువ్వు ఆకారంలో కుట్టాను. మధ్యలో వేరొక రంగుతో కుట్టి, చుట్టూతా లేసుతో చెక్కగా అలంకరించాను.


నేను స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు మేనాలో కూర్చుని ఉన్నారు.


నేను మా అమ్మగారు కలిసి స్పాంజితో చేసిన పాదపీఠాన్ని పరమాచార్య స్వామి వారికి సమర్పించాము (మేనా ముందర ఉన్న నేలపైన పెట్టాము). వెంటనే స్వామివారు “అష్టాదళం” అని అన్నారు. మేనా లోపల నుండి కాళ్ళను బయటకు తీసి, ఆ పాదపీఠంపై ఉంచారు. మాకు అంతో సంతోషం కలిగింది. ఇద్దరమూ పులకించిపోయాము. స్వామివారు “సరే అక్కడ ఉంచి వెళ్ళండి” అని అనకుండా భక్తితో సమర్పించిన ఆ పాదపీఠాన్ని తము స్వీకరిస్తున్నట్టుగా వెంటనే తమ పాదాలతో పావనం చేశారు. ఇంతకంటే భాగ్యం ఏముంటుంది?

పక్కనే ఒక సేవకుడు నిలబడి ఉన్నారు. “లలితా సహస్రనామ ధ్యాన శ్లోకం తెలుసునా?” అని అడిగారు స్వామివారు.


ఒక నిముషం పాటు ఆలోచించి, “అరుణాం కరుణా తరంగితాక్షీం . . .” మొదలుపెట్టాడు ఆ సేవకుడు.


“వేరొకటి”


“సింధూరారుణ విగ్రహాం . . .”


“హా అదే! చూడు, అక్కడ ఒక పండితుడు నిలబడి ఉన్నాడు కదా! తన వద్దకు వెళ్లి ఈ శ్లోకంలో వచ్చే ‘రత్నఘటస్థ-రక్తచరణాం’ అన్నదానికి అర్థం అడుగు” అని ఆదేశించారు.


ఆ సేవకుడు పండితుని వద్దకు వెళ్లి తిరిగొచ్చి స్వామివారితో ఇలా చెప్పాడు. “దాని అర్థాన్ని ఆయన, ‘అమ్మవారు తన ఎర్రని పాదాలను అమూల్యమైన రత్నములచే చెయ్యబడిన నీటి కుండపై ఉంచింది’ అని చెప్పారు పెరియవా”.

మేనా పక్కనే మరొక్క పండితుడు ఉన్నాడు. అతనివైపు చూసి మహాస్వామి వారు, “శాస్త్రిగారూ! చాలాకాలం నుండి నాకు ఒక సందేహం ఉంది. అదేంటంటే, ‘ఎందుకు అమ్మవారు తన పాదాలను ఘటం పైన ఉంచింది? అది ఇక్కడ అంత సరి లేదు అనిపిస్తోంది కదా?’” అని అన్నారు.


అందుకు ఆ పండితుడు అవునన్నట్టు తల పంకించాడు. “మరి దానికి నీవు ఏమని వివరణ ఇస్తావు” అని స్వామివారి నుండి అడిగించదలుచుకోలేదు ఆ పండితుడు.


“అది ఇక్కడ అంత అర్థవంతంగా లేదు కదా?”


“అవును పెరియవా”


“ఇప్పుడు ఈ పాదపీఠాన్ని చూడడంతో నా అనుమానం నివృత్తి అయ్యింది” అని స్వామివారు ఇలా విశ్లేషించారు.


“అమ్మవారు తన ఎర్రని పాదాలను ఇటువంటి పాదపీఠంపై ఉంచారు అన్నది సరిగ్గా ఉంటుంది. ‘ఘటస్థ’ అని ఉన్న చోట ‘పటస్థ’ అని ఉంచితే సరిపోతుంది అని అనిపిస్తుంది. ‘పటం’ అంటే బట్ట, అంటే మెత్తని పాదపీఠం. ఈ పదము ముందు ‘పాటస్థ’ అనే ఉన్నదేమో, అది వాడుకలో ‘ఘటస్థ’ అయి ఉండవచ్చు అని నా ఆలోచన. కాబట్టి మనమ ‘పాటస్థ’ అంటే ‘బట్టపై’ అంటే ‘మెత్తని ఉన్ని బట్టపై’(ఎందుకంటే అది అమ్మవారి లేలేత పాదాలకు ఇబ్బంది పెట్టదు) అనే సమ వాచకాన్ని మనం తీసుకోవాలి.”


ఇది విన మాకు కలిగిన ఆశ్చర్యానందాల నుండి బయటపడడానికి చాలా సమయమే పట్టింది.


ఈ వెల్వెట్ పాదపీఠం!


ఏ అర్హతా లేని, ఏమీ తెలియని నా సమర్పణ వల్ల మహాస్వామివారి అనుమానం నివృత్తి అయినది అని చెప్పటం ఒక్క పరమాచార్య స్వామివారికే సాధ్యం.

పరమాచార్య స్వామివారు కరుణ, ఆనందం వల్ల హృదయం ద్రవమై కళ్ళ నుండి వచ్చే నీరు, రెండూ ఆక్కడితో ఆగలేదు.


--- జానా కణ్ణన్, మైలాపూర్. మహాపెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 5


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

భద్రాచల మహిమ

 భద్రాచల మహిమ  🚩🚩🚩

**************************


భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శనచక్రం ఎవరూ తయారు చేసినది కాదు..


మరి ఇది ఎలా వచ్చిందంటే..??


భక్తరామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను తెప్పించి వారిచేత సుదర్శన చక్రాన్ని తయార చేయిస్తున్నాడు, కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో, లేదా సరిగా రాకపోవడమో జరుగుతోంది..


కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై "భక్తా.. సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు, అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను, అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు.." అని చెప్పాడు.


మరుసటి రోజు గజ ఈత గాళ్ళతో రామదాసు వెతికించాడు, కానీ కనిపించలేదు..


మళ్లీ రాముడు కలలో కనిపించి "అది నామీద అమితమైన భక్తిని పెంచుుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది.." అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రుని స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది..

ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం గర్భగుడిపై చూస్తున్నది..!!


ఇంతటి ప్రాశస్త్యం ఉన్నది కనుకనే భద్రాద్రి మహా పుణ్యక్షేత్రమై విలసిల్లుతుంది....!!

లయ-లయం

 లయ-లయం 

మనం తరచుగా ఈ రెండు పదాలను వింటూవుంటాము. "లయ" అంటే ఒక క్రమ పద్దతిలో నడిచే కదలిక కానీయండి శబ్దం కానీయండి దానిని మనం లయ అంటాము. ఉదాహరణకు మన శ్వాస , నడక, హృదయ స్పందన, కదిలే చక్రము ఏదైనా కానీయండి. ఇంకా ఇప్పటి ఆధునిక సైన్సు ప్రకారం చుస్తే విదుత్ పౌనపుణ్యం, లేక కంప్యూటర్ వేగాన్ని సూచించే పౌనపుణ్యం (హెర్డ్జి) ఇలా చుప్పుకుంటూ పొతే మనకు  అన్నీ కూడా లయబద్దంగానే గోచరిస్తాయి.  

బౌతికంగా ఇవి అయితే ఇక సంగీతము, నృత్యము ఈ శాస్త్రాలు పూర్తిగా లయమీదనే ఆధారపడి  వున్నాయి. ఈ విషయం ప్రతి వారికి తెలిసినదే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచం మొత్తం ఒక క్రమపద్ధతిలో వున్నది అదే లయ ప్రకారంగా వున్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లయ లేనిది ఈ జగత్తు లేనే లేదు. మన భూమిని కాకుండా ఖగోళాన్ని ఒక్కసారి గమనిస్తే మనకు అంతా లయప్రకారమే గోచరిస్తుంది. సూర్య, చంద్ర, నక్షత్ర గతులు కూడా పూర్తిగా లయ ప్రకారమే ఉన్నాయి.  మనకు తెలుసు భూమి తనచుట్టూ తానూ తిరగటానికి ఒక్కరోజు పడుతుంది అది ఒక లయ ఏ సమయంలోకూడా తన వేగాన్ని మార్చుకోదు అంటే ఒక సారి సగం రోజు ఇంకొకసారి రెండురోజులు అలా ఒకవేళ అదే జరిగితే భూప్రపంచం మొత్తం  నాశనం అవుతుంది.  అదే విధంగా చంద్రుడు భూమి చుట్టూ ఒక నెలరోజుల సమయంలో తిరుగుతాడు.  చంద్రగతి కూడా అనాదిగా అదే విధంగా వున్నది.  ఇలాగే సూర్య భగవానుడు కూడా ప్రతి గ్రహం, నక్షత్రం పాలపుంతలో ఒక క్రమ వేగంతో సంచరిస్తూవుంటాయి.  పూర్తి దృశ్యమాన జగత్తు  లయమీదనే ఆధారపడి వున్నది. ఇంకొక విషయంకూడా మనం గమనించాలి ఒక గ్రాహం ఇంకొకగ్రహంకు తాకకుండా పరి బ్రమించటం కూడా లయ మీదనే ఆధారపడి వున్నది. లయ తప్పితే గ్రహగతులు తప్పుతాయి అని వేరే చెప్పక్కరలేదు. 

ఒక వీధిలో వెళ్లే వాహనాలు వేటి లయ (speed) వాటికి ఉంటుంది ఎప్పుడైతే లయ మారుతుందో లేక లయ ఆగుతుందో అప్పుడు ప్రమాదాలు జరగటం మనం చూస్తూవున్నాము. ఒక మనిషి వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు అనుకోండి అంటే అతను ప్రతి అడుగు కూడా లయ బద్దంగా వేస్తూ వున్నాడని అర్ధం. ఒకవేళ అతను అలా కాకుండా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వేయాలన్న వేయలేడు తన వేగాన్ని మారుస్తే పర్యావసానంగా లయ మారుతుంది.  కానీ లయ మాత్రం ఉంటుంది. వేగంగా ప్రయాణిస్తే వేగవంతమైన లయ ఉంటుంది నిదానంగా ప్రయాణిస్తే తక్కువ వేగవవంతమైన లయ ఉంటుంది.  కానీ లయ మాత్రం ఎప్పుడు ఉంటుంది. మనిషి జీవితం మొత్తం ఒక లయ బద్దంగానే కొనసాగుతుంది. పుట్టినప్పటి నుండి చరమ దశ వరకు 

లయ బద్దంగా ఉండటమే ఒక నటన అదే ఈశ్వరుడు సృష్టించిన నాట్యం. అందుకే ఈశ్వరునికి నటరాజు అనే పేరు కూడా వున్నది.  ఆ పరమేశ్వరుడు రచించిన నాటకంలో ప్రతిదీ ఒక పాత్ర పోషిస్తూవుంటుంది. మనుషుల పాత్ర మనుషులది పశు పశ్యదుల పాత్ర వాటిది.  కొన్ని నిర్జీవులు కొన్ని సజీవులు జీవం ఉండటం ఉండక పోవటం కూడా ఆ పరమేశ్వరుని లీలలో భాగమే.  ఈ విషయం ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. 

లయం అంటే ఏమిటో కాదు లయ ఆగటమే లయం. సాధారణంగా మనం నిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉంటాము అంటే అది లయ, కొంత సమయం తరువాత ఆ పని  అయిపోతుంది. అంటే లయ  ఆగిపోతుంది. అదే లయం ఎందుకంటె అప్పుడు ఆ పని లేదు.  నీవు హైదరాబాదు నుండి కాశీకి ప్రయాణం చేయాలని రైలు ఎక్కావు రైలు కదిలింది అంటే లయ మొదలైంది. కొంతకాలం తరువాత నీ రైలు కాశీని చేరుకుంది అంటే అప్పటి దాకా రైలుకు వున్న లయ ఆగిపోయింది అంటే లయ లయంగా నిశ్చలంగా మారింది అని అర్ధం. 

ప్రతి మనిషి శ్వాస కూడా ఒక లయ, ఏదో ఒకరోజు ఆ లయ ఆగిపోతుంది అంటే లయం  అవుతుంది. దాని అర్ధమే జీవన చివరి  ఘట్టం. లయను, లయాన్ని రెంటిని శాసించేవాడే పరమేశ్వరుడు.  ఈ విషయం మనం తెలుసుకోవాలి.  ఎప్పుడైతే లయకారుని స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడే మనకు మనస్సులో ఒక భావన కలుగుతుంది అదేమిటంటే మనలను కాపాడేవాడు, రక్షించేవాడు కరుణించేవాడు మోక్షసిద్దిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు తప్ప వేరొకరు  కాదని. నిత్యం శివాలయంలో మనకు లయ, లయం రెండు దృగ్గోచరితం అవుతుంటాయి. మన మహర్షులు మనకు ప్రతి క్షణం మనం ఎలా మసలుకోవాలి, ఎలాంటి ఆలోచనలు చేస్తే మనం జన్మరాహిత్యాన్ని పొందగలం అనే విషయం అను క్షణం గుర్తుచేస్తున్నారు.  

శివాలయలో పరమశివుని లింగం మీద ఒక్కొక్క చుక్కగా జలం పడటం మనం చూస్తూవుంటాము.  ఆ జల పాత్రలో నీరు ఒక రోజో లేక కొన్ని గంటలో పడి కాళీ అయి  పోతుంది. అదే విధంగా మానవ జీవితంలోని కాలం కూడా ఒక్కొక్క క్షణం కరిగిపోయి చివరికి కాళీ అయి పోతుంది.  అంటే అక్కడ అతని కాలం ఆగిపోతుంది.  కాబట్టి కాలం చాలా విలువైనది అని  గమనించాలి. మరి కాలాన్ని ఎలా వినియోగించాలి అంటే ఎలాగ అయితే పాత్రలోని నీరు చుక్క చుక్కగా పరమేశ్వరుని అభిషేకం చేయటానికి ఉపయోగపడుతున్నదో అదే విధంగా మన మనస్సు ప్రతి క్షణం ఆ దేవదేవుని అంటే ఆ పరమశివుని పాదాలమీదనే ఉండి నిత్యం ఆయనతోటె సంబంధం కలిగి ఆయననే పట్టుకుంటే అప్పుడే మనకు ఆయన కరుణా కటాక్షం కలుగుతాయి. 

శివుడు బాహ్యంలో కాదు మాన హృదయాంతరాళాల్లో నిక్షిప్తమై వున్నాడు ఈ సత్యాన్ని తెలుసుకొని మన హృదయేశ్వరున్ని నిత్యం అను క్షణం తలుస్తూ, కొలుస్తూ ఉంటే తప్పకుండ కైవల్యం లభిస్తుంది. అది ఎలా అంటే 

నేను తీసుకునే శ్వాస అజపా జాపంగా భావించి నిత్యం అజపాజపం చేయాలి. అంటే రోజుమొత్తం నేను జపంలోనే ఉన్నాననే భావనలో ఉండటం.  నేను స్నానం చేస్తున్నాను అంటే శివునికి అభిషేకం చేస్తున్నాననే భావనలో  ఉండాలి. నేను మల మూత్ర విసర్జన చేస్తున్నాను అంటే శివుని వద్ద మాలిన్యాన్ని తొలగిస్తున్నాను అని  నేను  మాట్లాడుతున్నాను అంటే శివుడు మాట్లాడుతున్నాడు అనే భావన ఇలా నా పూర్తి దైనందిక జీవనం శివునిదే కానీ నాది కాదనే భావనలో సాధకుడు ఉంటే నిత్య కైవల్యమే.  ఆ స్థితి మనం చెప్పుకునే అంత  సులభం కాదు కఠోర దీక్షతో, అకుంఠిత పరిశ్రమతో మాత్రమే సాధ్యం.  కానీ అసాధ్యము మాత్రం కాదు. "కృషితో నాస్తి దుర్భిక్షం"

బహిర్గతం

 శ్లోకం:☝️

*అర్థనాశం మనస్తాపం*

 *గృహిణ్యాశ్చరితాని చ ।*

*నీచం వాక్యం చాపమానం*

 *మతిమాన్ న ప్రకాశయేత్ ॥*

   - చాణక్యనీతి


అన్వయం: _ధనస్య నాశః , మనసః క్లేశః , గృహస్య కలహః , అన్యేన వఞ్చనం తథా అన్యేన ప్రాప్తం అపమానం ఇత్యేతాన్ విషయాన్ అన్యేషాం పురతః న వక్తి బుద్ధిమాన్ పురుషః l_


భావం: తనకు జరిగిన ధననష్టం, తన యొక్క మనస్తాపం, స్వంత ఇంటి గొడవలు, తాను ఇతరుల వల్ల మోసపోవడం మరియు అవమానింపబడడం వంటి విషయాలను మతి ఉన్న వ్యక్తి ఎప్పుడు ఇతరులకు బహిర్గతం చేయడు.