20, అక్టోబర్ 2024, ఆదివారం

ఆత్మానుభూతి

 *ఆత్మానుభూతి అంటే ఏమిటి ? అది ఎలా అనుభవిస్తాము.?*

ఆనందం మానవుని సహజస్థితి, వాస్తవస్థితి. కానీ నేడు అనేకమంది తమ సహజస్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖసంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మనుగడ సాగిస్తున్నారు.

*నిజానికి సుఖం, సంతోషం, ఆనందం.. ఒకేలా చెప్పేస్తున్నా, ఇవి మూడు రకాల అనుభూతులు...*

*1) పంచేంద్రియాలను సంతృప్తి పరిచే 'సుఖానుభూతి' శారీరకమైనది.*

*2) వినోద భరితమై మనస్సును ఉత్సాహపరిచే 'సంతోషానుభూతి' మానసికం.*

*3) వీటికి అతీతమైంది*

*"ఆనందానుభూతి" ఆత్మ సంబంధితం*

*ఆనందం, ఆధ్యాత్మికం, బాహ్య ప్రపంచముతో సంబంధంలేని అంతర్గత అనుభూతి...*

సుఖానుభూతి కట్టిపడేస్తుంది, సంతోషానుభూతి చిరు స్వేచ్చనిస్తుంది, ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం.

శారీరకస్థాయిని, మానసికస్థాయిని దాటి హృదయస్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి వస్తాం...

మొదటిది బంధం,

రెండవది తాత్కాలితం,

మూడవది శాశ్వతం...

మొదటి రెండిటిని పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తునే ఉంటాడు, కానీ పరమానందస్థితికి వచ్చిన వాడు అమృతమయుడే అని అంటాడు బుద్ధుడు.*

*ఆనందముగా జీవించడానికి హంగులు అవసరం లేదు,* *ఆర్ధిక స్థితిగతులు అవసరం లేదు,* *అవగాహనతో మనమున్న స్థితిని అంగీకరించడం, ఏ* *పరిస్థితులోనైన సమస్థితిలో*

*ఉండగలగడం.*

*అన్నీ.. అందరూ.. పరమాత్ముని* *అనుగ్రహమేనన్న భావనతో* 

*ఉండగలగడం* *అలవర్చుకోవాలి...*

*మన భావాల పట్ల, మనలో ఉన్న ఆంతర్యామి పట్ల, మనకు అమరిన లేదా* *అమర్చుకున్నవాటి పట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో ఉన్న ఆంతర్యామిపట్ల ఎరుకతో*

*ఉండడం నేర్చుకోవాలి.*

*ఇది అలవడిననాడు* *అనుక్షణం మనం ప్రార్ధనలో ఉన్నట్లే, ఆనందంగా ఉన్నట్లే,*

*ఆంతర్యామితో ఉన్నట్లే...*

ఆనందాన్ని మానుషం, దివ్యం అంటూ రెండు రకములు, (తైత్తిరీయోపనిషత్.. ఆనందవల్లి.. )

మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం...

మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం...

మొదటి కొస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన...

వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవజన్మకు సార్ధకత...

మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందం లోనికి చేరుకోవడమే పరమార్ధకత...

ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం... పేరు ఏదైతేనేం.. అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే,

ఎక్కడ అహం (నేను) ఉండదో అక్కడే ఆనందం ఉంటుంది, మనలోపలే ఉన్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి... అప్పుడే అర్ధమౌతుంది ఆనందమే చైతన్యమని...

ఆ అన్వేషణలో తెలుస్తుంది 'సత్ చిత్ ఆనందం'...

సత్ అంటే సత్యం,

చిత్ అంటే చైతన్యం,

ఆనందమంటే పరమానందం..

ముందుగా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగల్గుతాం, అటుపిమ్మట అనుభవమైనదే "ఆనందస్థితి"...

ఇలా ఆనందమును తెలుసుకున్నవారు (ఆనందం బ్రహ్మనో విద్వాన్) ఆత్మను స్పృశించగలరు (నయఏవం విద్వానే తే ఆత్మానం స్పృణతే).

ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం...

అందరిలో అంతర్యామిని గుర్తించడం...ఏ క్షణంకాక్షణం వర్తమానంలో జీవించడం, భూతదయ, సేవాదృక్పధం కలిగివుండడం.🙏🙏🙏

వృద్దాప్యం రాకముందే

 *వృద్దాప్యం రాకముందే భగవంతుని పూజించాలి* 

శ్రీ నీలకంఠ దీక్షితుల వారు ఈ విధంగా చెప్పారు.... *అయి ప్రధచేతః పరమముపదేశం చృణు* 

 *మమ స్మరారేరర్షయం బాదుషు కరణేషు స్మర* *పాలమ్ I*                                              

 “ఓ మనిషీ!మీ కోసం నా దగ్గర ఒక మంచి సలహా ఉన్నది వినండి, దాన్ని పాటించండి! అన్ని ఇంద్రియాలు సంపూర్ణంగా ఉన్నప్పుడే భగవంతుని పూజించగలవు, ఆరాధించగలవు అంటాడు.ఎందుకంటే తన శక్తి అంతా పోయిన తర్వాత ఎవరైనా గుడికి వెళ్లాలనుకున్నా వెళ్లలేరు.మహాశివరాత్రి నాడు కళ్లని నిద్ర ఆవహించకుండా చేసి, మెలకువగా శివపూజ చేయాలన్నా, శ్రీకృష్ణాష్టమి నాడు అర్ధరాత్రి వరకు పూజ చేయాలన్నా కుదరదు.  అందుచేత కృతార్థుడు కావాలనుకుంటే, ఇంద్రియాలన్నీ సంపూర్ణంగా ఉన్న సమయంలో భగవత్ ఆరాధన, భగవత్ సేవ మొదలైన వాటిని చేయాలి.  భగవంతుడు ప్రసాదించిన ఈ దేహాన్ని ఆయన సేవలకే వినియోగించే విధంగా అనుక్షణం కాపాడుకోవడం మనబాధ్యతే. అందులోని ఏ ఒక్క భాగాన్నయినా నిర్జీవంగా చేస్తేమాత్రం పాప కూపంలోకి నెట్టివేయబడతారు మానవులు. అందుకే, జీవితంలో ఆనందాన్ని పొందాలంటే భగవత్పదులవారి ఆదేశం ప్రకారం వృద్ధాప్యం రాకముందే భగవంతుడిని పూజించాలి. వృద్ధాప్యంలో కూడా భాగవత్ప్రసాద ద్దేహాన్ని తన నియంత్రణలో ఉంచుకుని, అన్ని అవయవాలు భగవత్ సేవకే నిరంతరం వినియోగిపబడేవారికి మోక్షప్ర్రాప్తి ప్రసాదిస్తాడు భగవంతుడు.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.

 😭🙏::*జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.*


*హాస్పిటల్ లో "అడ్మిట్" అయ్యే ముందు "పది" సార్లు ఆలోచించండి.*


*మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తె "హాస్పిటల్" లో అడ్మిట్ కావద్దు.*


*ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు.*


*అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు.*


*👤చాలా మంది కమర్షియల్ అయిపోయారు.* 


*హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి.*


*పైకి కనిపించేంత అందమైనది కాదు.*


*మేనేజ్మెంట్ పెట్టె టార్గెట్స్ రీచ్ కావడానికి నానా "అబద్ధాలు" అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్.*


*డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది.అది డెబ్బై శాతం "అబద్దం". ముప్పై శాతమే నిజం.*


*SP బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే.*


*😌ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు. అదేదో హోటల్ అనుకున్నాడు. అటు నుండి అటే అనే తెలుసుకోలేక పోయాడు.రెండు కోట్లు బిల్లు వసూలు చేశారు. శవాన్ని ఇచ్చారు.*


*దాసరి నారాయణ రావు, జయలలిత....ఇలా చాలా మంది చావుకు రోగం కారణం కాదు. నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి,టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, "భయంకర"మైన ఆంటీ బయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు.*


*తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు,డబ్బు ఉన్నవారు. వైద్యమును చాలా మిస్టరీ గా చేశారు అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం. "అది" తప్పు.*


*అసలు అన్నీ రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది?* 


*ఉన్న రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా??*


*అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో. ఇంకో పది ఏండ్లు "బ్రతికే" అవకాశం ఉన్న మనిషి ఆయన.*


*అందుకే మిత్రులారా హాస్పిటల్... అది ఎలాంటి దైనా ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి. సెకండ్ opinion తీసుకోండి. ఊరకే జొరబడ వద్దు.*


*అత్యంత మోసపూరిత వ్యవస్థ వైద్యం. కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది. ప్రతీ దానికీ కార్పొరేట్ హాస్పిటల్ లోకి పోవడం కరె క్టు కాదు.*


*కనీసం మీరైనా ఈ విషయాలను మనస్సులో పెట్టుకోండి. ఇంట్లో ఉంటే వంద ఏండ్లు బ్రతుకుతారు. హాస్పిటల్ కు పోతే రేపే ....*


*జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.*


*అందరికీ మంచి జరుగాలనీ కోరుకుంటూ.*

________________________________

*💯% Correct ఎన్ని గ్రూప్ లకైనా షేర్ చేయొచ్చు ఇది సగటు భారతీయుని మనస్సు లోని మాట, ఆవేదన, నగ్నసత్యం మన ప్రియతమ గౌరవ రాష్ట్రపతి మరియు ప్రధాని గార్లకు చేరేవరకు భారతఫౌరుని బాధ్యత గా బావించి షేర్ చేద్దాం మిత్రులారా.......services to mankindisservice to god, Bharat Maata ki jaya*🙏🙏💐💐

వెన్నెలలు కురిపించిన కళాపూర్ణోదయం

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 సాహిత్యంలో పండు వెన్నెలలు కురిపించిన కళాపూర్ణోదయం వంటి మహా ప్రబంధం అప్పటికి, ఇప్పటికీ మరొకటి లేదనే చెప్పాలి. అంతటి మహాకవి పింగళి సూరన. ఆయన రాసిన రెండర్థాల ద్వ్యర్థి కావ్యం రాఘవ పాండవీయం. ఒకే పద్యంలో రెండు అర్థాలు స్ఫురింపచేస్తూ ఓ కావ్యాన్నే రచించడమంటే మాటలా! ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు పింగళి సూరన కవితా వైభవాన్ని ఎంత చక్కగా వివరించారో వినండి. నన్నయ నుంచి నారాయణ రెడ్డి దాకా సాగుతున్న సాహితీ ప్రవాహం ఇది. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

చిన్నతనమునందు

 చిన్నతనమునందు*

చీమిడి కారుచు!

మల మూత్రములయందు*

మగ్గు నిన్ను!

స్నానము చేయించి*

సన్నవస్త్రము చుట్టి!

దిష్టిచుక్కనుపెట్టి*

దీవెనిచ్చి!

కమ్మని పాలిచ్చి *

కలి నాకలిని దీర్చి!

గట్టిగా ముద్దాడు*

గారవముగ!

మెత్తని పరుపు పై*

హత్తుకుపడుకుండి!

నిద్దుర పుచ్చును*

నేమముగను!


తల్లి ప్రేమలు పంచును *

ధర్మ ముగను!

కాని! తల్లిని యవసాన*

కాలమందు!

ఛీదరించుచు తిట్టుచు*

ఛీత్కరించు!

సంతు నేమని తిట్టాలి*

జన్మహీను!

కన్న దుర్మార్గు డవనిలో*

దున్న పోతు!


మాతృ దేవో భవ.

నమాతుఃపరదైవతం.


అమ్మ ప్రేమకు అక్షరాంజలి.


మాడుగులమురళీధరశర్మ

సిధ్ధిపేట-

9440478439/

9951985880

20.08.2024

లోకం తీరు:--47

 లోకం తీరు:--47

కందం||


తిరగలి తిరగదె, తిరిగీ

తిరిగీ, తిరిగిన నెలవుకు దిరుగుచు చేరున్

తిరగలి విధాన నరుడిల

పరిపరి కోర్కెల బ్రతుకగ, ఫలమై పుట్టున్


భావము||

లోకములో మానవుడు కోరికలచట్రానచిక్కి ,

వాంఛాలోలునిగా బ్రతికి మరల మానవ జన్మనే

పొందుచున్నాడు.తిరగలి తిరిగీతిరిగీ ,ఆరంభమైనచోటునకే మరలచేరినట్టు.


దేవరకొండ:రాజోలు.

నిత్యపద్య నైవేద్యం

 నిత్యపద్య నైవేద్యం-1646 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-281. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


సుభాషితం:

దీప నిర్యాణ గంధం చ 

సుహృద్వాక్య మరుంధతీంl

న జిఘ్రంతి న శృణ్వంతి 

న పశ్యంతి గతాయుష:ll


తేటగీతి:

అరయగా చావు మూడినయట్టి వారు 

దీప నిర్యాణ గంధమున్ తెలియలేరు 

చెవిని పెట్టరు వినుటకై చెలుని మాట 

ఘన యరుంధతీ రిక్కను గాంచలేరు.


భావం: చావు మూడినవారు దీప నిర్యాణ గంధమును పసిగట్టరు. మిత్రవాక్యమును చెవిని పెట్టరు. అరుంధతీ నక్షత్రమును చూడలేరని పెద్దలు చెబుతారు.

క్యారెట్ తో వైద్యం -

 క్యారెట్ తో వైద్యం -


       క్యారెట్లని తెలుగులో గాజరగడ్డలు అని అంటారు. వీటిలో పచ్చగా , ఎర్రగా రెండు రకాలు ఉండును . 


  వీటి ఉపయోగాలు - 



*  శరీరంలో పైత్యం , కఫం , వాతం ని హరించును . 


*  దగ్గు ఎక్కువుగా ఉన్న సమయంలొ వీటిని తీసుకొవడం వలన దగ్గు హరించును . 


*  గుండెని శుభ్రపరచును.బలము కలిగించును.


*  ఉదరముకి బలమునిచ్చును .


*  రొమ్ము , పొట్ట , గుండెలలో నొప్పిని హరించును .


*  మూత్రపిండాలు , మూత్రాశయం లోని రాళ్లు తీసివేయును.


*  త్వరగా జీర్ణం అగును. 


*  శరీరం ఉబ్బి ఉన్నవారికి శరీరంలో నీరు తీసివేయను.


*  మూత్రం బయటకి రాకుండా ఆగిపోయిన వారికి క్యారెట్ చెట్టు ఆకు రసం లోపలి ఇచ్చిన కషాయం ఇచ్చినా వెంటనే మూత్రం బయటకి వచ్చును.


*  మూత్రంలో మంట ఉండి మూత్రం మంటగా ఉన్నప్పుడు పంచదార పాకంలో క్యారెట్ ముక్కలు వేసి తయారు చేసిన క్యారెట్ మురబ్బాని పూటకు రెండు మూఁడు ముక్కలు సేవించిన మూత్రసంబంధ సమస్యలు తొలగిపోవును . 


    గమనిక  - 


  ప్రతిరోజూ ఈ ఔషదం తో పాటు బార్లీ గింజల నీటిని కూడా తాగడం వలన ఇంకా తొందరంగా మీ సమస్య నుంచి బయటపడతారు.

 


 మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

మజ్జిగ గురించి సంపూర్ణ వివరణ

 మజ్జిగ గురించి సంపూర్ణ వివరణ  - ఉపయోగాలు .


       పెరుగు , నీరు సమాన పాళ్ళలో కలిపి చిలికి తయారుచేసిన మజ్జిగ తేలికగా ఉండి శీఘ్రముగా జీర్ణం అగును. కొంచెం వగరును , పులుపును కలిగి ఉండును. జఠరాగ్నిని వృద్దిచెందించును. కఫవాతాలను హరించును . శోఫరోగం , ఉదరం , మొలలరోగం , బంక విరేచనాలు , మూత్రబంధం , నోరు రుచిని కోల్పోవుట , స్ప్లీన్ పెరుగుట, గుల్మం , అధికంగా నెయ్యి తాగుట వలన కలుగు సమస్య , విషము , పాండురోగం వంటి సమస్యలను నివారించును.


                 మజ్జిగలో కూడా రకాలు కలవు. ఇప్పుడు ఆ రకాలను మీకు వివరిస్తాను. పెరుగుకు నీళ్లు కలపకుండా కేవలం పెరుగును మాత్రం చిలికి చేయబడిన మజ్జిగని "గోళ " అని  అంటారు. పెరుగుకు నాలుగోవ వంతు నీరు కలిపి కవ్వముతో చిలికి చేయబడిన మజ్జిగని "ఉదశ్విత" అనబడును. సగం భాగం నీరు కలిపి పెరుగును చిలికి చేయబడిన మజ్జిగని " తక్రము " అని పిలుస్తారు . పెరుగుకు మూడు వంతులు నీరు కలిపి చేయబడిన మజ్జిగని "కాలశేయ" అని పిలుస్తారు . వీటన్నింటిలో సగం పెరుగు , సగం నీరు కలిపి చేసిన తక్రము అని పిలిచే మజ్జిగ బహు శ్రేష్టమైనది. ఇప్పుడు మీకు తక్రము యొక్క విశేష గుణాలు గురించి వివరిస్తాను .


            తక్రమను మజ్జిగని వాడుట వలన శరీరం నందు జఠరాగ్నిని వృద్దిచెందించును. వాంతి , ప్రమేహము , వాపు , భగంధరం , విషము , ఉదరరోగము , కామెర్లు , కఫము , వాతాన్ని హరించును .


                   వెన్నపూర్తిగా తీయని మజ్జిగను మందజాతం అని పిలుస్తారు . ఇది అంత తొందరగా జీర్ణం అవ్వదు . జిడ్డు కొంచం కూడా లేకుండా చిలకబడిన మజ్జిగని అతిజాతం అనబడును. ఇది మిక్కిలి పులుపుగా ఉండి ఉష్ణాన్ని కలుగచేయును. దప్పికను పెంచును. వగరు , పులుపు రుచుల కలిసిన మజ్జిగ మలబద్దకం కలుగచేయును . కేవలం పుల్లగా ఉండు మజ్జిగ మలాన్ని బయటకి పంపును . ఏమి కలపకుండా ఉండు చప్పటి మజ్జిగ ఉదరం నందు ఉండు కఫాన్ని హరించును . కాని కంఠము నందు కఫాన్ని కలిగించును.


                 మజ్జిగని ఉపయోగించకూడని  సమయాల గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను.  గాయాలు తగిలినప్పుడు , మూర్చరోగము నందు , భ్రమ , రక్తపిత్త రోగము నందు  తక్రమను మజ్జిగ వాడరాదు.  అదే విధముగా మంచు కాలం నందు , శరీరంలో జఠరాగ్ని మందగించి ఉన్నప్పుడు , కఫముచే జనించిన రోగముల యందు , కంఠనాళం సమస్య యందు , వాతం ప్రకోపించినప్పుడు తక్రము అను మజ్జిగని ఉపయోగించవలెను .


         శరీరం నందు వాతము ప్రకోపించినప్పుడు పులిసిన మజ్జిగని సైన్ధవ లవణము కలిపి తాగవలెను . పిత్తము ప్రకోపించినప్పుడు తీపిగల మజ్జిగ పంచదార కలిపి తాగవలెను. అదేవిధముగా శరీరము నందు కఫము ప్రకోపించినప్పుడు త్రికటుకముల చూర్ణం అనగా శొంటి, పిప్పళ్లు, మిరియాలు సమాన చూర్ణం మరియు ఉప్పు కలిపిన మజ్జిగ తాగవలెను.

   

                  కొంచెం పుల్లగా ఉండు మజ్జిగ శుక్రవృద్ధికరం , మిక్కిలి పులుపు కలిగిన మజ్జిగ జఠరాగ్ని వృద్దిచేయును . పీనసరోగం అనగా ముక్కువెంట ఆగకుండా నీరుకారు రోగం , శ్వాస , రొప్పు వంటి రోగాలు ఉన్నప్పుడు మజ్జిగని కాచి తాగవలెను . శరీరంపైన వ్రణాలు లేచినప్పుడు మజ్జిగ వాడినచో అనేక సమస్యలు వచ్చును. మజ్జిగకు ద్రవాన్ని శోషించుకొనే గుణం ఉండటం వలన నీళ్ల విరేచనాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు మజ్జిగ ఇవ్వడం వలన నీటిని గుంజి మలమును గట్టిపడచేయును అందువల్ల విరేచనాలు తగ్గును. గేదె మజ్జిగ కామెర్ల రోగము నందు , పాండు రోగము నందు అద్భుతముగా  పనిచేయును . మేకల మజ్జిగ , గొర్రెల మజ్జిగ , చెడ్డవాసన కలిగిన మజ్జిగ త్రిదోషాలను పెంచును. కావున వాడరాదు.


            మనుష్యల రోగాలకు ప్రధానకారణం మనం తీసుకునే ఆహారం . మనయొక్క శరీరతత్వానికి అనుకూలమైన ఆహారాన్ని మనం తీసుకున్నంతవరకు మనకి సమస్య ఉండదు. తీసుకునే ఆహారం చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి . ఈ మధ్యకాలంలో నాదగ్గరకు వస్తున్న రోగులలో చాలావరకు ఆహారసంబంధ రోగాల వారు ఎక్కువగా వస్తుండటం గమనించాను.  అదేవిధంగా ఆయుర్వేదంలో ఒక ప్రధాన సూక్తి కలదు.  " త్రికాల భోజనే మహారోగి , ద్వికాల భోజనే మహాభోగి , ఏకకాల భోజనే మహాయోగి " అని గొప్ప విషయం అంతర్లీనంగా చెప్పబడింది. కావున మీ శరీరతత్వానికి అనుకూలమైన ఆహారాన్ని తీసుకుని అనారోగ్య సమస్యల బారిన పడవద్దు. 


 మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

ఆదివారం*🌞 🌹 *20, అక్టోబర్, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        🌞 *ఆదివారం*🌞

🌹 *20, అక్టోబర్, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                  

 

         *ఈనాటి పర్వం* 

      *సంకష్టహరచతుర్థి* 

    పూజ సా 05.43-08.11


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - కృష్ణపక్షం*


*తిథి   : తదియ* ఉ 06.46 ఉపరి *చవితి* రా 04.16 తె వరకు 

*వారం: ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం  : కృత్తిక* ఉ 08.31 వరకు ఉపరి *రోహిణి*


*యోగం  : వ్యతీపాత* మ 02.12 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం  : భద్ర* ఉ 06.46 *బవ* సా 05.26 ఉపరి 

*బాలువ* రా 04.16 తె వరకు ఆపైన *కౌలువ*   


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 07.00 - 10.00 సా 02.00 - 04.00*

అమృత కాలం  :*ఉ 06.21 - 07.48 & రా 03.52 - 05.21 తె*

అభిజిత్ కాలం  : *ప 11.29 - 12.15*


*వర్జ్యం    :  రా 11.24 - 12.53*

*దుర్ముహూర్తం :సా  04.09-04.56*

*రాహు కాలం : సా 04.15 -05.43*

గుళికకాళం      : *మ 02.47 - 04.15*

యమగండం    : *ప 11.52 - 01.20*

సూర్యరాశి : *తుల* 

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 06.01* 

సూర్యాస్తమయం :*సా 05.43*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.01 - 08.21*

సంగవ కాలం    :*08.21 - 10.42*

మధ్యాహ్న కాలం :*10.42 - 01.02*

అపరాహ్న కాలం:*మ 01.02 - 03.23*

*ఆబ్ధికం తిధి:ఆశ్వీజ బహుళ చవితి*

సాయంకాలం :  *సా 03.23 - 05.43*

ప్రదోష కాలం   :  *సా 05.43 - 08.11*

రాత్రి కాలం     :  *రా 08.11 - 11.27*

నిశీధి కాలం     :*రా 11.27 - 12.17*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.23 - 05.12*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌞 *శ్రీ సూర్య నారాయణ దండకం...!!*🙏


🌷 సూర్య నారాయణా వేదపారాయణా లోకరక్షామణి దైవచూడమణి!!🌷


పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా

మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య

దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార

గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి

ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి!! 


   🌞 *ఓం భాస్కరాయ నమః*🌞


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

🌹🌷🍁🌞🌞🍁🌷🌹

51. " మహాదర్శనము

 51. " మహాదర్శనము "--- యాభై ఒకటవ భాగము --సమారాధన


 51.  యాభై ఒకటవ భాగము  సమారాధన



          ఆచార్య దేవరాతుని ఇంటిలో ఈ దినము సమారాధన. బ్రహ్మర్షి యాజ్ఞవల్క్యుడు ఆదిత్య దేవుని అనుగ్రహము వలన లభించిన యజుర్వేద లేఖనమును  ముగించినాడు . దానికే ఈ సంభ్రమపు సమారాధన. ఇరవై నలుగురు దంపతులకు దంపతీ పూజ. వచ్చిన వారిలో రాజపురోహితుడు భార్గవుడు , ఇద్దరు కులపతులూ ముఖ్యులు. 


         భార్గవులు కులపతుల ప్రశ్నకు ఉత్తరముగా అన్నారు , " వెనుకటి మహారాజులు ’ కావలసినది జరగవలెను , కురు పాంచాలులను మించునట్టి విద్వాంసుడు మనలో పుట్టిమన దేశము కీర్తి సంపన్నము కావలెను ’  అనేవారు . ఇప్పుడున్నవారు విద్వత్సంభావనా విషయములో ఏమీ తక్కువ వారు కాదు . ’ అయినా వారింకా ప్రాతస్సూర్యులే . అయినప్పుడు చూద్దాములే , ’ అనునది ఒక స్వభావముగా మారినట్టున్నది . లేకపోతే ఇంతటి సందర్భములో రాజ భవనము నుండీ ఇంకా కానుకలూ లాంఛనాలూ రాకుండా ఉండటము ఏమిటి ? " 


          ఆచార్యుడు అక్కడే ఉన్నాడు . వారు అది విని అన్నారు : " దానికి కారణము లేకపోలేదు . ఒక దినము రాజభవనము నుండీ పిలుపు వచ్చినది . అనగా , నేను చెపుతున్నది ఇప్పటి మహారాజు గురించి . యాజ్ఞవల్క్యుడు అప్పుడేమనవలెను ? ’ నేను ఇప్పుడు చేపట్టిన కార్యము ముగియు వరకూ నేను ఎవ్వరినీ చూడబోను ’ అనేసినాడు .  ఇంకా వేడి రక్తమున్న ఆ మహారాజుకు అది విని చురుక్కుమనుట సహజమే కదా ? "


అది విని కులపతులిద్దరూ చాలా సంతోషించినారు . ఒకరు , " అతడికి ఇప్పుడు కావలసినది రాజానుగ్రహము కాదు , దేవతానుగ్రహము . రెంటిలో రెండవదే ముఖ్యము . అది లభిస్తే మొదటిది తానే దొరకును. " అని సంతోష పడితే , ఇంకొకరు , " ముఖ్యముగా , ఇంకా కాలము రాలేదు . దానివల్లనే దేవతలు అతడి నోటిలో ఆ మాట పలికించినారు . " అని సంతోష పడినారు . 


భోజనానికి ముందే దంపతీ పూజలు జరిగినవి . ఆదిత్యుని ద్వాదశ నామములు ఒక్కొక్క దానికీ ఇద్దరు దంపతులకు పూజలు జరిగినవి . చీర, రవిక , ధోవతులు , దక్షిణగా రెండ్రెండు ధేనువులు , పసుపు , కుంకుమ , పూలు , తట్టల నిండా పళ్ళు , అవి చూచి అందరూ , " ఇలాగ చేయుటకు కేవలము రాజాధిరాజులకు మాత్రమే సాధ్యము . ఏదేమైనా తీసుకొనుట మాత్రమే అలవాటైన బ్రాహ్మణులు ఇలాగ ఇచ్చుట ఆశ్చర్యమే !! " అని పొగిడినారు .  


భోజనానంతరము తాంబూలాదులను ఇచ్చి కాత్యాయనీ యాజ్ఞవల్క్యులు ఆశీర్వాదములను పొంది అందరినీ వీడ్కొలిపినారు . కులపతులూ , భార్గవులూ కొత్త వేదమును వినుటకు కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు వినిపించుట మొదలుపెట్టినాడు . మొదట ప్రకృతి యానమైన దర్శేష్టి విన్నవారంతా చాలా ఆనందించినారు . " ఇప్పుడున్న యజుర్వేదములో ఇంతటి పరిష్కారము లేదు . బ్రాహ్మణపు సహాయము లేక దానిని సమన్వయము చేసుకొని పోవుట నిజముగా కష్టము . అయితే ఇది అలాగ కాదు , మంత్రముల వినియోగములు స్పష్టముగా వున్నాయి . ఇది  శుక్లమయితే , ఇప్పుడున్నదానిని కృష్ణ యజుర్వేదమనవలెను .  దేవరాతా , మీరు యజ్ఞవల్క్యులని ప్రసిద్ధులైతే , మీ కొడుకు వేద వల్క్యుడు . ప్రకృతి వికృతి యాగములను రెండు పాయలుగా విభజించినట్టు విభాగించి చూపునట్టి ఒక వేదమునే ఆదిత్యదేవుని దయ వలన పొంది తెచ్చినాడు " అని పొగడినారు . 


యాజ్ఞవల్క్యుడు లేచి వారికి సాష్టాంగ ప్రణామము చేసి చేతులు జోడించినాడు . " అంతా తమరి అనుగ్రహము ! " అన్నాడు . వైశంపాయనులు , " ఇలాగ నవోనవమైన వేదమును పొందుటకే పుట్టినవాడు , నాకు గనక శిష్యుడై ఉంటే అయ్యెడిదా ? దేవతలు ఒక ఆటను రచించి మమ్ములను వేరు చేసినారు . ఏమైనా సరే , మా యాజ్ఞవల్క్యుని ప్రాదుర్భావము మాకు హితమే కాదు , ప్రియము కూడా ! " అని యాజ్ఞవల్క్యుని వెన్ను తట్టినారు . 


ఉద్ధాలకులు ఏమీ మాట్లడకయే ముసి ముసి నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు . వైశంపాయనులు , " సమారోపణము ఎలాగయినది , చూద్దాము తియ్యవయ్యా " అన్నారు . యాజ్ఞవల్క్యుడు తీసి చదివినాడు . ’ ఈశావాస్యమిదం సర్వ...’  మొదలగు పద్దెనిమిది మంత్రములు . 


వైశంపాయనులు , " ఈ మంత్రములు ఏ కర్మలో వినియోగము ? " అన్నారు. వారికి సమాధానము చెప్పువారెవరు ? యాజ్ఞవల్క్యుడు  మిన్నకున్నాడు . 


ఇటు ఆడవాళ్ళ మధ్య గుసగుసలు మొదలైనాయి . మైత్రేయి అత్త చెవిలో ఏదో ఊదింది . ఆమె , " మా మైత్రేయి ఏమో అంటున్నది , వినండి .’  అని ఉద్ధాలకులకు చెప్పింది . వారు అందరి అనుమతితో , " అదేమిటమ్మా ? చెప్పు " అని మైత్రేయిని అడిగినారు . 


ఆమె రెండు మూడుసార్లు మొహమాట పడి , మళ్ళీ మళ్ళీ అడిగించుకొని , లేచి అందరికీ నమస్కారము చేసి, " ఈ నవీన వేదము లభించినది ఆదిత్యుని కృప వలన. ఆ మంత్రముల వినియోగము గురించి యాజ్ఞవల్క్యుని అడిగితే ఎలాగ ? ఆదిత్యుడినే అడగవలెను " అన్నది . 


సభ , ఆమె మాటను ఒప్పుకున్నది . యాజ్ఞవల్క్యుడు గురుజనుల అనుమతితో ఆచమనాదులను చేసి ఆదిత్యుని ప్రార్థించినాడు . ఆదిత్యుడు అతడి నోటిలో పలికించినాడు, " ఈ మంత్రములకు వినియోగము లేదు . ఇది ఉపనిషత్తు . తామెల్లరూ వేదమును బ్రహ్మము అంటున్నారు . ప్రత్యక్షముగా బ్రహ్మమును బోధించు ఉపనిషత్తు లేకుంటే వేదము బ్రహ్మమగుటెలా ? అందుకోసమే ఇది " 


ఆ వివరణ అందరికీ సమంజసమనిపించినది .  అందరూ ఒప్పుకున్నారు . కాత్యాయనికి మైత్రేయితో మైత్రి కుదిరింది . ఆమెకు , ఆ సభలో ఆ సందర్భములో తన భర్తకు కలగబోయే అవమానమును తప్పించినది అని మైత్రేయి అంటే ఏదో ఆత్మీయ భావము కలిగింది . దగ్గరికి వెళ్ళి కూర్చొని విశ్వాసముతో , " ఈ దినము నుండీ నువ్వు నాకు అక్కవి " అన్నది . మైత్రేయి కూడా ఆ విశ్వాసమును వద్దనలేదు . 


అంతా అయిన తరువాత వైశంపాయనులు , " మంచిది , ఆచార్యా , ఈ దినము గార్గి దేవిని ఎందుకు పిలవలేదు ? ఆమె ఉండి ఉంటే ఈ సభ బ్రహ్మసభకు సమానమయ్యెడిది . " అన్నారు . 


ఆచార్యుడు  , " దేవి గార్గి ఊరిలో లేరు . తమ గురువులైన కురు పాంచాల దేశపు విదగ్ధ శాకల్యులను చూచి వచ్చుటకు వెళ్ళియున్నారు " అన్నాడు . 


ఉద్ధాలకులన్నారు , " ఆతడు పేరు మోసిన విద్వాంసుడైతే కావచ్చు. కానీ దేవీ గార్గి వలె జ్ఞాన కాండలో అంత చెయ్యి తిరిగిన వారు కాదు అనిపిస్తుంది . అయినా విద్వద్వర్గములో గణ్యుడైన వాడు . ప్రథమ శ్రేణికి చేరినవాడు . " 


వైశంపాయనులు నవ్వుతూ అన్నారు : " అందువలననే మన వెనుకటి మహారాజు వారు , వారినందరినీ తోసిరాజన గల విద్వాంసుడు మనలో ఒకడు పుట్టవలెను  అనుచుండినది . మీ ఈ స్తుతి వచనమును గనక విని ఉంటే వారు ఎలాగయ్యెడివారో ? "


" దేనికీ ? కొంచము వేచియుండండి . యాజ్ఞవల్క్యుడు ఆ గార్గి , విదగ్ధ శాకల్యుడు మొదలగు వారికన్నా గొప్పవాడగు కాలము చాలా దూరము లేదు . మీ శిష్యుడు వారిని మించిపోవును . " 


" అలాగ అవుతుందంటే , ఇదిగో , ఇప్పుడే నేను నా తపస్సునంతా ధారపోయుటకు సిద్ధము . వైదేహులు విద్యార్థముగా కావలసినది ఇచ్చుటకు సిద్ధముగా నున్ననూ ఇంకా విద్యాలక్ష్మి విదేహమును తన గృహముగా చేసికొనలేదు . మీ ఆకాంక్ష వలన అలాగ అగుగాక. " 


" అవుతుంది , సందేహము లేదు " 


ఆచార్యుల ఇంటిలో జరిగినదంతా కూలంకషముగా రాజభవనమునకు నివేదిక వెళ్ళినది . మహారాజులు ,  యాజ్ఞవల్క్యులు రాజ భవనమునకు రానన్నది విని పదుగురు పలుమాట లాడతారేమో , పని చెడునో ఏమో అని శంకించి , రాజపురోహితుని వెంటనే పిలిపించుకున్నారు . అతని ద్వారా అక్కడ జరిగినది మళ్ళీ ఒకసారి విని , " మీ మాట ప్రకారము జరిగి ఉంటే బాగుండెడిది . ఇప్పుడు చేజారి పోయింది . ఏమి చేయుట ? ఇంతటి విద్వాంసులను గౌరవించక పోతే , మా వంశపు ఖ్యాతి మిగులుటెలాగ ? " అన్నారు . 


భార్గవుడు ఆలోచించి , " దేవీ గార్గి ఇక్కడికి వచ్చు వరకూ ఆగండి . ఆమెను ఉపయోగించి , యాజ్ఞవల్క్యుడను ఆ మదపుటేనుగును పట్టి తెచ్చు ప్రయత్నము చేద్దాము " అన్నాడు . 

Janardhana Sharma

అవతార ప్రకటన!

 అవతార ప్రకటన!  

-------------------------- 

         

  సీ:  చేతివిభూతితో  జీర్ణరోగాలకు 


                                      చిట్కావైద్యంబు  చేయువాఁడ ;


                కను చూపుతో  కల్పవృక్షాల  సృజియించి


                                                  కలిమికికాపులఁ  జేయువాఁడ ;


                 చిరునవ్వుతో  చేతనా చేతనములేలి  ,


                                               కరుణామృతంబును  గురియువాఁడ ;


                  నోటిమాటలతోఁడ   లోకాల  నాడించి 


                                                      నాటకరంగంబు  నడపువాఁడ ; 


        గీ: ఎవ్వరనుకొంటిరో  నన్ను?  నేననంత,


             శాంత మూర్తిని  కరుణా  నితాంత మూర్తి ,


           నాశ్రయించిన వారల నాదరించు  

!!

            సాయి బాబాను  సర్వార్ధ  సాధకుండ:!


              శ్రీ సత్యసాయి  భాగవత సత్కథామృతము. -తృతీయ స్కంథము:- స్వీయము !


                         ధర్మగ్లాని  కలిగినప్పుడు  సంభవామి  యుగే యుగే ! అని భగవద్గీతలో  కృష్ణ భగవానుడు చెప్పాడు. ఆప్రకారం అవసరానుసారంగా  యెన్ని యవతారా లెత్తాడో?  ప్రతీ అవతారానికీ  ఒకప్రత్యేకత  ఒకప్రయోజనం మనం అనుభవించాం.మంచిపనులు చేసి లోకానికి మేలుచేసిన వారి నందరినీ  మనం దైవాలుగానే  సంభావించాం. అలాంటి లోకోప కారక మైన అవతారాల్లో  శ్రీ  సత్యసాయి  యవతారమొకటి.


                                 పుట్టపర్తి యనే మారుమూల పల్లెలో  ఈశ్వరమ్మ  పెద వేంకమ రాజులకు 4 వ సంతానంగా సత్యసాయి

(సత్యనారాయణరాజు)  ఉదయించాడు.పుట్టినదాది మామూలు బాలురవలెగాక కొంత ప్రత్యేకతగా కనిపించేవాడు.తాతగారు  కొండమరాజుగారి   పెంపకంలో చక్కని యాధ్యాత్మక సంపత్తిని పొందాడు.బాలునిగా బుక్కపట్నంలో  చదివేరోజులలోనే  యేవేవో మహిమలు  చూపించేవాడు. 


                 కమలాపురం , ఉరవకొండ గ్రామాలలో  అన్న శేషమరాజు యింటివద్ద ఉంటూ విద్యాభ్యాసం  చేస్తోన్నరోజులలో  కొద్ది కొద్దిగా

     అతనిలో యేదో చెప్పలేని మార్పు కనబడ సాగింది. అతనిలో దివ్యత్వం వ్యక్తావ్యక్తంగా  ఉంటూవచ్చింది. ఇలాఉండగా ఉరవకొండలో  అతడొక తేలు  కాటుకు  గురియైనాడు. ఆవిషప్రభావంతో  రెండురోజులు సుప్తచేతనావస్థలో ఉండిపోయాడు. అదేతరుణంలో యేవేవో కలవరింతలు. మొత్తానికి కోలుకున్నతరువాత గూడా మామూలు మనిషికాలేదు. పదేపదే "నేను సాయిబాబాను"- నాకు నాగతం తెలిసిపోయింది. మీతో నాకుసంబమధంలేదు. " అంటూ ప్రక్కనున్న ఆబ్కారీ తోటకుపారిపోవటం,ఇలాజరగుతూ ఉండేది. అన్నగారు తలిదండ్రుల కీవిషయం తెలియ జేశాడు. వారువచ్చి  సత్యాన్ని పుట్టపర్తికి తీసికొనివచ్చి  పలు వైద్యాలు చేయించారు. కానీ ఫలితం  శూన్యం.*


                 సత్యం  తనలోతానేవో పాడుకోవటం. చుట్టూచేరిన వారికి  హస్తచాలనంతో  కలకండను  విభూతిని  సృష్టించి యిస్తూ ఉండటం .చివరకు ఇదియతని దినచర్యగా మారింది. 14 ఏండ్ల ప్రాయంవాడు యిలామారటం తలిదండ్రులకు తీరనివేదనకు కారణమైంది.

 అది 1940 సంవత్త్సరం అక్టోబరు 20వ తేదీ. సత్యం యధాప్రకారంగా  భజనానంతరం  చేయికదలించి  కలకండను ,విభూతిని సృష్టించి  భక్తులకు పంచి బెట్టుచుండగా  పెదవేంకమరాజు ( తండ్రి)చేతిలో ఒక దుడ్డుకర్ర పట్టుకొని,సత్యా న్ని అదలిస్తూ"  ఓరీ! యిదంతా

బూటకంరా! నాటకాలాడకు.లోకవంచన మహాపాపం. నిన్నేదో  దెయ్యమో భూతమో  ఆవహించిందిరా! నిజంచెప్పు నీవు దెయ్యానివా?

దేవతవా? నిజంచెప్పక పోయావో  యీదుడ్డుకర్రతో  బాదగలను"- అని మహరౌద్రంగా  పలుకగా,"  సత్యం పరమ శాంత చిత్తంతో" పుత్ర

మమకారంతో  మీరు నన్ను గుర్తింప లేకున్నారు. 


                                  నేను సాయి బా బాను. సాయి బాబానే! మహారాష్ట్రమున  తొలుత జననమంది. తదుపరి యిట నవతరించితిని. భక్తి శ్రధ్ధలతో  నన్ను పూజించు వారికి  సకల శుభములు. సకల సౌఖ్యములు కల్గును.ముమ్మాటికిది నిజమనెను.

వేంకమరాజు సంశయాస్పద చిత్తంతో  "  నీవు సాయివని మాకేమి నమ్మకము. నిదర్శన మెట్లు?అన్నాడు. సత్యం పూజార్ధమై  భక్తులు గొనివచ్చిన  మల్లెపూల తట్టను  నేలపైకి విసరాడు. చిత్రంగా ఆపూలన్నీ తెలుగున  "సాయి బా బా! " యను నక్షరములుగా రూపుదిద్దుకొన్నాయి. అది చూచినవారు ఆశ్చర్యంతో చేతులు జోడించి మ్రొక్కారు.


                              నాటినుండి  సత్యం  ' సత్యసాయిగా ' పిలువ బడినాడు. ఇదీ సత్యసాయి యవతార ప్రకటన కథ!


                              సత్యసాయిగా  ఉచిత విద్యావైద్య సదుపాయములకు. నీరులేని ప్రాంతములకు సత్యసాయి సుజల పథకముద్వారా మంచినీటి నందించటం. ప్రజలకు తాత్విక జ్ఙానోప దేశములు చేయటం, గ్రామ సేవ రామసేవ యనుపథకముద్వారా పల్లీయులకు మేలుగూర్చటం, ఇత్యాది అనేకానేక మహత్కార్యాల ద్వారా లోకోప కారంచేశారు.పుట్టపర్తిలోను,బెంగుళూరు లోను సూపర్ స్పెషాలిటీ  హాస్పటల్సద్వారా  సత్యసాయి సేవాసమితి నేడు చేయుచున్న సేవ  వెలలేనిది.


                              ఇట్టి లోకోపకారిని , విజ్ఙాన మూర్తిని , వేదాంత  దేశికుని , యుగావతారి  యనుట ఉచితమేగదా!


                శ్లో:  త్వవమేవ మాతాచ పితాత్వమేవ ,


                      త్వమేవ బంధుశ్చ  సఖా త్వమేవ,


                      త్వమేవ విద్యా ద్రవిణం  త్వమేవ ,


                       త్వమేవ  సర్వం  మ మ  సాయిదేవ!!


                        భగవాన్  శ్రీ సత్యసాయి  పదారవిందములకు  భక్తితో  సమర్పితము.


                                                        ఓం  శాంతిః  శాంతిః  శాంతిః

50. " మహాదర్శనము

50. " మహాదర్శనము "--యాభైయవ భాగము--కీర్తి వ్యాపించినది


50.  యాభైయవ భాగము--- కీర్తి వ్యాపించినది



" మిథిలలో బ్రహ్మర్షి యొకడు పుట్టి యున్నాడంట ! " 


" మిథిలా నగరపు జనక మహారాజు విద్వాంసులకు కావలసినదంతా ఇస్తున్నది సార్థకమైనది "  


" విద్య ఎంతైనా కురు పాంచాలుల సొత్తు యనునది ముగిసింది " 


" ఏదో మద్ర వారూ , కాశీ వారూ విద్వాంసులు అయితే కావచ్చును అనుకున్నాము , ఇప్పుడు మిథిల వారు కూడా తలెత్తుకొని తిరుగునట్లాయెను . " 


"  మిథిలలో కూడా మహర్షి కల్పులూ , ఋషి కల్పులు ఉన్నారు , లేరనుటకు లేదు , ఎందుకు ?  ఋషి దేవరాతుడుండలేదా ? " 


"అలా అనవద్దు , మహర్షి వైశంపాయనులు తక్కువ వారా ? ఆ ఉద్ధాలక మహర్షులు మాత్రము సామాన్యులా ? "  


        " సరేలే వయ్యా , బ్రహ్మర్షి పుట్టవలెనంటే ఊరకే అవుతుందా ? కర్మ కాండ , బ్రహ్మ కాండ సిద్ధాంతములు రెండూ అనుభవ పూర్వకముగా తెలిసినవాడై , శిష్యులకు కూడా ఇదమిత్థం  ఇది ఇలాగ అని బోధించు వాడు కావలెను . అంతటివాడు పుట్టినాడంటే జగత్తు యొక్క అదృష్టమనవలెను . " 


          " నువ్వు చెప్పేదెవరి గురించి ? యాజ్ఞవల్క్యుడి గురించే కదా ? నాకు తెలుసు , విను : ఎన్నో సంవత్సరముల కిందటే వైశంపాయనులు అతడిని తమ ఆశ్రమము నుండీ వెడలగొట్టినారు . అంతటివారు ఇప్పుడు బ్రహ్మర్షి యైనారంటే ఏమి చెప్పేది ? ఊరికే ఉండవయ్యా ! " 


" అటుల కాదయ్యా , అతడికి అభ్యూహన మంత్ర సిద్ధి అయినదట. ఆ తరువాతే  వైశంపాయనుల ప్రసక్తి . " 


          " ఏమైనా చెప్పు , మేము ఏదీ చూడకుండా దేనినీ నమ్మము . నువ్వు చెప్పినదాని కన్నా ఎక్కువగా నాకు తెలుసు , అయినా నేను నీకన్నా ఎక్కువగా ప్రత్యక్షమును నమ్మేవాడిని . " 


" సరే పద , వెళ్ళి చూసుకొని వద్దాము "  


       " స్వామీ , మా వల్ల కాదు , మేము సన్యాసులు కాదు , ఉంటే ఈ ఊరు లేస్తే పక్క ఊరు అనుటకు మాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు . మేము ఎక్కడికైనా వెళ్ళ వలెనంటే ఇంటిలో అంతా సంపన్నముగా ఉంటే మాత్రమే సాధ్యము . కాబట్టి అనుకున్న వెంటనే సాధ్యము కాదు "   


        " కానీవయ్యా , ఇంకేమి మాఘాది పంచకము వచ్చింది . ఎక్కడ చూచినా యాగములవుచున్నవి . నిన్ను ఆర్త్విజ్యమునకు పిలవనే పిలుస్తారు . కర్మ ధర్మ సంయోగముంటే నేనూ వస్తాను . ఇద్దరం వెళ్ళి చూచుకొని వద్దాము ."" 


        " అలాగయిన సరే . ఈ యాజ్ఞవల్క్యుని విషయములో ఒకటి మాత్రము నిజము . అతడు అసంగ్రహి . ఎవరినుండీ ఒక గుడ్డి గవ్వను కూడా తీసుకోడంట. "  


" సరే , అతడిని ఎవరూ అధ్వర్యమునకు పిలవరా ఏమిటి ? "  


" పిలవకేమి ? కానీ అతడు వెళ్ళడట. "


          ఇలాగ పరి పరివిధములుగా బ్రాహ్మణుల సంపత్తు చేరిన ప్రతిచోటా యాజ్ఞవల్క్యుని వృత్తాంతము తప్పక వచ్చును . నూరు మందిలో ఒక్కొక్కరు అతడి యోగ్యత విషయములో సందేహ పడుతారు . అదేమో ఎందుకో ఉద్ధాలకుల వద్ద యాజ్ఞవల్క్యుడు ఉండి బ్రహ్మోపాసన చేసినదానిని ఎవరూ మాట్లాడరు . కానీ వైశంపాయనుని వద్ద అతడుండి వచ్చినదీ , మరలా ఎలాగెలాగో బ్రహ్మర్షి యైనది మాత్రము అందరి నోటిలోనూ వస్తుంది . 


          ఇక్కడ యాజ్ఞవల్క్యుడు ప్రాతః కర్మలన్నీ ముగిసిన తరువాత సూర్యోపాసనను ముగించి గుడిసెలో కూర్చొని వస్తూ ఉంటాడు . కాత్యాయని  ఒకతే అతనికి నీడలా ఉండి సేవ చేయును . భూర్జ పత్రములను తెచ్చి , వాటిని సరిగ్గా కత్తరించి ,ఈనెలు తీసి ,  బాగా కడిగి, నానవేసి , ఉంచుట ఆమె దైనందిన కార్యములలో ఒకటి . అప్పుడప్పుడు ఆలంబిని వచ్చి కొడుకును చూచి వెళ్ళేది . ఆమెకు కొడుకు ముఖములో తేజస్సు నిండియుండుట చూసి చాలా సంతోషము . 


          అదేమో ఈ వర్షము ఆచార్య దేవరాతునికి విరామమే లేదు . కొడుకు ద్వారా ఆదిత్యుడు లోకానికి వేరే వేదమును అనుగ్రహించినది అతడికి తెలుసు . ఒక దినము కూర్చొని , తమ వేదమునకూ , ఆ కొత్త వేదమునకూ గల వ్యత్యాసమేమిటో చూడాలన్న కుతూహలము అతనికి పెరిగిపోయింది . కానీ దానికి కావలసిన వ్యవధానము లేదు . 


         ఎలాగో ఆచార్యుడు ఒకరోజు వీలు చేసుకొని కొడుకును వెతుక్కొని వచ్చినాడు . గుడిసెలో కొడుకు పద్మాసనము వేసుకొని కూర్చొని రాస్తూ ఉన్నాడు . అతడికి ఒంటిమీద స్పృహలేనట్టు కూర్చొని రాస్తున్నాడు . చేతనున్న ఘంటము, రాస్తున్న భూర్జ పత్రము తప్ప , ఇంకొక దాని గమనమే లేకుండా రాస్తున్న అతని ముందు ఇంకొక ఘడియ అలాగే నిలుచొన్నాడు . దేవరాతుడు కట్టుకున్న గంజిపెట్టి ఉతికిన తెల్లటి గరగరలాడే ధోవతి ఆ గుడిసెలో కాంతి పెంచుతూ గాలికి సన్నగా సవ్వడి చేస్తున్నా యాజ్ఞవల్క్యునికి గమనమే లేదు . 


         అది చూచి ఆచార్యుడు వచ్చి భార్యతో , " నీ కొడుకు  రాయుటలో మునిగియున్నాడు . తానుగా మనలను పిలుచు వరకూ మనము వెళ్ళరాదు . ఈ దినము కాత్యాయని  కూడా అక్కడ లేదు . ఆమె ఎక్కడ ? " అన్నాడు .


       "  ఆమె బహుశః చెరువు దగ్గరకు వెళ్ళిఉండవచ్చు . అదేం మాయో , ఇక్కడి పనంతా  ఒక్క ఘడియలోనే పూర్తి చేసి గుడిసెకు పరుగెత్తి పోతుంది . అది చూసి నాకూ సంతోషమే . నాకేమో అడ్డు చెప్పుటకు మనసు రాదు . " 


          " వద్దు , వద్దు . అడ్డువెళ్ళవద్దు . అయినా ఆమె ఇప్పటినుండే భర్త సేవ చేసుకోవడమే కదా మనకు కావలసినది ?  అది సరే , నేనిక్కడికి వచ్చినది ఇది చెప్పాలని : మననుండీ వాడికి ఇబ్బంది కలుగకుండా చూసుకో . మనము పెద్దలము అక్కడికి వెళితే , వాడు చేస్తున్న పనిని వదలి మనవైపుకు తిరగవలెను . అలాగ తిరిగితే వాడి పనికి చేటు . ఇది చెప్పడానికే వచ్చినాను . " 


        " మొన్న వెళ్ళినాను . ’ ఇంకా కొంచము మిగిలిందమ్మా . అదవగానే వారికి చూపవలెను. వారు ఒప్పుకున్న తర్వాతే మిగతా మాటలు ’ అన్నాడు . ’ మిగతా మాటలు అంటే ఏమి ? ’ అన్నాను . ’ తండ్రిగారి అనుమతి అయితే ఒకసారి గురువులకు చూపించవలెను . కానీ వారు-’ ఏమీ ?  నీ వేదము లేకపోతే నాకు వేరే గతిలేదా ? చూడండి , కొత్త వేదాన్నే తెచ్చినాను - అని జంభము చూపించుటకు వచ్చినావా ? ’ అంటే ? అని దిగులు . కాబట్టి ఆ విషయములో తండ్రిగారు చెప్పినట్లే చేయవలెనని అనుకున్నాను ’ అన్నాడు " 


         " వాడు చెప్పినది సాధువుగా ఉంది. అయితే వైశంపాయనులు వాడి విషయములో అలాగ అనరు . అదేకాదు , వీడికి కొత్త వేదము వచ్చినది కూడా వారికి తెలుసు . వీడికి కొత్త వేదమును అనుగ్రహించిన ఆదిత్య దేవుడే వారికి కూడా దర్శనమిచ్చి, ’ ఆచార్యా , నీ దయ వలన జగత్కార్యము ఈనాడు నెరవేరినది . నీ శిష్యునికి ఈ నాడు వేదమును దేవతలు నా ద్వారా ఇచ్చినారు . ఇప్పుడు అతడు దానిని రాస్తున్నాడు .  అదయిన తరువాత నీ వద్దకు పంపిస్తాము . నువ్వు చూచి ఒప్పుకుంటే , ఆ తర్వాతే మిగిలిన మాటలు ’. అని అన్నాడట. ఈ పూట సమయము దొరికితే నేనే ఈ మాటను చెప్పేవాడిని . నువ్వు అవకాశము చూసి వాడికా మాట చెప్పు . ఏమైనా సరే , అందరూ అదేమిటో , ఎందుకో , యాజ్ఞవల్క్యుని బ్రహ్మర్షి అంటున్నారు . వారి మాటే నిజము కానీ అని నేను రాత్రీ పగలూ ఆకాంక్షిస్తున్నాను . సరే , ఇదంతా ఉండనీ , కాత్యాయని  వెళితే ఆడది వచ్చింది అని ఏమీ ఆరాటము లేదు కదా ? "


          " దైవము అలాగ జరగ నివ్వలేదు అనవలెను . పోయిన వర్షము భర్త ఆదిత్య వ్రతములో ఉన్నాడని ఆమె నియమములో ఉన్నది కదా ! అప్పటినుండి వాడికి ఆమెమీద మమత కావలసినంత ఉంది . అయినా మీరేమీ అనుకోవద్దు. వాడు పదిమంది లాగా సంసారమును లంపటముతో నడిపించువాడు కాదనే నా భావన. ఏదో సంత వేళకు మూడు మూరలు బట్ట నేస్తే చాలు అనుకునే వాడు . వాడికింకా నా యిల్లు , నా వాకిలి అన్న లంపటమే లేదు . " 


        " చూడు , మనకు వేరే పిల్లలు లేరు . ఇంట్లో అంతా సమృద్ధిగా ఉంది . కూర్చొని తిన్నా ఇంకా ఒక పది సంవత్సరాలకు మోసము లేదు . ఇప్పుడు వీడికి అప్పుడే నాకన్నా ఎక్కువ కీర్తి వచ్చింది . వీడు రానన్ననూ పట్టుకొని వెళ్ళి యజ్ఞ యాగములు చేయించని వారే లేరు . అన్నిటికన్నా మిన్నగా వీడు కొత్త వేదమును తెచ్చినవాడు . వీడిపాలిటి దైవము వీడిని కాపాడక చేయి వదలదు . ఇప్పటికి చేసుకున్న పెళ్ళాన్ని వదలక ఇంట్లో దీపము పెట్టుకుంటూ ఉంటే చాలు . " 


         " వాడు ధర్మ పరాయణుడు. కాబట్టి పెళ్ళాం విషయములో దిగులు పడనవసరము లేదు . అదీకాక, మీరు చెప్పినట్లు వాడి దేవతలు వాడి చేయి వదలరు . కానీ వాడు మీవలె కాదు . మీకు ఇంటి విషయములో ఉన్న అక్కర వాడికి లేదు అన్నాను , అంతే ! " 


          " అయితే ఒక్కొక్కసారి వాడి తేజస్సు కన్నులతో చూచుటకు కాదు . మండే సూర్యుడే దిగివచ్చి వాడిలో వెలసినాడా యేమి,  అనిపిస్తుంది . అప్పుడంతా నాకు ఏదో ఆలోచన , మీకు తెలుసా , వీడేమైనా తానున్న చోటునే వేరే లోకముగా చేసేస్తాడేమో యని సందేహమవుతుంది . అయితే పక్కనే ఉన్న కాత్యాయనిని చూసి , " ఓహో , ఇదే లోకము , వేరే లోకముకాదు " అని సందేహ నివారణ అవుతుంది . అట్లే , బయట గుడిసె పక్కన  ఉన్న  అవే మొక్కలు , అవే చెట్లు , అదే చెరువు ఉండుట చూసి నేను వేరే లోకమునకు వెళ్ళలేదు అని నమ్మకము వస్తుంది ." 


         ఆచార్యుడు ఆ వివరణను విని నవ్వినాడు .: " భలే ఆలంబినీ , నువ్వు పురాణ ప్రవచనము చెప్పితే చాలా బాగా ఆకట్టుకుంటావు . అది సరే , సమయము చూసి వైశంపాయనుల వృత్తాంతము వాడికి చెప్పు " 


Janardhana Sharma

*ఆత్మకు అనుబంధం లేదు*

 *ఆత్మకు అనుబంధం లేదు* 


 *వ్యాక్రివాటిష్ఠతి జరా* *పరిధర్జయన్తీ* 


వృద్ధాప్యాన్ని దాని కష్టాలను ఎవరూ తప్పించలేరు.  దాన్నుంచి తప్పించుకునే అవకాశం కూడా లేదు.ఉండదు.                  

 *రోగాచ సత్రవ ఇవ ప్రహరన్తి దేహమ్ ॥*                             

ఈ శరీరాన్ని రోగాలు వెంటాడుతునే ఉంటాయి.  రోగాలకు భయపడరని వారు ఈ విశ్వంలో ఉండేనే ఉండరని ఎవరూ చెప్పలేరు.రోగాలు లేని వ్యక్తిని చూడటం చాలా అరుదు.అలాంటప్పుడు మనిషికి మర్త్యానందం ఎక్కడుంది?  ఒక తల్లి ద్వారా జననం(పునర్జన్మ) , మరొక తల్లి ద్వారా మరణం.... ఇలాగే జీవి తిరుగుతుంటే, ఒక వ్యక్తి ఎక్కడ ఆనందం పొందగలడు? బంధంఅనే ఈజనన- వృద్ధాప్య-మరణ చక్రంలో మనం చిక్కుకున్నాం.  ఈ బంధం ఎవరిది? ఇది శరీరం కోసమా లేక ఆత్మ కోసమా? ఇది శరీరం కోసమే. అందుకే ఆత్మకు అనుబంధం లేదు. అనుభవిచడం తప్ప.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

49. " మహాదర్శనము

 49. " మహాదర్శనము " --నలభై తొమ్మిదవ భాగము --ఆదిత్యుని అనుగ్రహము


49.  నలభై తొమ్మిదవ భాగము --ఆదిత్యుని అనుగ్రహము



          యాజ్ఞవల్క్యుడు వ్రతుడై , కాత్యాయని ఆతని సతియై , పాయస భోజనము చేస్తూ ఒక సంవత్సరము ఆదిత్యోపాసన చేసినారు . కొన్ని దినములగుచుండగా , యాజ్ఞవల్క్యుడు మంత్ర జపమునకు కూర్చొనువేళకు , ఒక పచ్చటి మైదానములో మేస్తున్న ఎర్రటి గుర్రమొకటి కనిపిస్తుంది . అతడు  జపంలో ఉన్నంత సేపూ అది ఎదురుగనే ఉండును . 


         కాత్యాయనికి ఆమె పితామహుని వలననూ , ఇంటి లోని వారు ఆడుకొను మాటల వలనా, భర్త ఒక అలౌకిక మహాపురుషుడు అన్నది తెలిసియుండినది . అందుకే ఆమె , భర్తను వ్రతమెందుకు చేయుచున్నావు మొదలైన ప్రశ్నలను ఒక్కటీ అడుగలేదు . 


         రాను రాను యాజ్ఞవల్క్యుని ముఖము తేజస్సుతో వెలుగుచున్నది . తేజస్సంటే సామాన్యమైన తేజస్సు కాదు , అది కనులకు మిరుమిట్లు గొలుపు నంతటి తేజస్సు . ముట్టుకుంటేనే కాదు , చూస్తేనే కాలుస్తుందేమో అనునట్టి తేజస్సు . ఒకటి రెండు సార్లు అతడు జపమగ్నుడై యున్నపుడు అతని తల్లి ఏదో కారణము వలన వచ్చి తొంగి చూచినది. పదునై తీవ్రముగా నున్న , ఆ శీతలమైన తేజస్సును చూచి , గుడిసె దేదీప్యమానంగా వెలుగుతుంటే ఎక్కడైనా అంటుకుంటే ? అని శంకించి , తన భర్తకు తన శంకను చెప్పినది . అతడు నవ్వి , " పిచ్చిదానా , మంత్ర జపము చేయువాడు మంత్రాధిదేవత వలెనే అగును , నిజము . కానీ గుడిసె ఏమీ అంటుకోదు . దిగులు పడవద్దు . ఒకవేళ నీ కొడుకు యొక్క  తపోజ్వాల వలన గుడిసె అంటుకున్నా , అతడిని ఏమీ చేయలేదు . " అని శాంతింప జేసినాడు . 


         అయితే దినమూ భర్త తోపాటు అగ్ని సేవ చేయునపుడు కాత్యాయనికి శాఖము , వేడిమి ఏమీ తగులుట లేదు . పైగా దేహమంతా ఏదో సౌభాగ్యమును పొంది సంతోష పడినట్లగును . ఆమె అదంతా గమనించలేదు . ఆమెకు కావలసినది ఒకటే ఒకటి : అది , భర్త కృతార్థుడగుట. 


        ఇలాగ కొన్ని దినములు గడచినాయి . నెలలూ గడచినవి . గుర్రము ఒకరోజు సకిలిస్తూ యాజ్ఞవల్క్యుని ఎదురుగా వచ్చింది . అతడికి ఇది సామాన్యమైన గుర్రము కాదు అనిపించి , దానికి పంచోపచార పూజను అర్పించినాడు . గుర్రము మానవులు స్వీకరించుట కన్నా ఎక్కువగా పూజను స్వీకరించి , ’ నా వలన ఏమి కావలెను , చెప్పు ’ మానవ భాషలో అడిగింది . 


        యాజ్ఞవల్క్యుడు , " దేవా , నువ్వు ఎవరు అని అడుగవలెనని ఆశ. అయితే ఆదిత్యమంత్రమును జపము చేయునపుడు దర్శనము ఇస్తున్నావు కాబట్టి ఆదిత్యుడవే అయి ఉండవలెను అని నమ్మకము " అన్నాడు . 


        గుర్రము సకిలించినది . ఆ సకిలింపు యాజ్ఞవల్క్యునికి నవ్వు వలె అనిపించినది . ’ చూడ వలెనా , చూడు ’ అన్నది . చూడగా , గుర్రము ఉన్న వైపంతా ఆదిత్య మండలము జ్వాలాయమానం గా మనోహరముగా ఉంది . నానా వర్ణపు జ్వాలలు మండలమును వెలిగిస్తూ వెలుగుచున్ననూ , తెల్లటి వెలుగు అంతటా పరచుకొని సుందరముగా ఉన్నది . మండల మధ్యస్థుడైన హిరణ్మయ పురుషుడు విరాజిల్లుతున్నాడు . రక్త మాల్యాంబరములను ధరించినాడు . సర్వాభరణ భూషితుడైనాడు . ఆతడే ఆదిత్యుడై యుండవలెనని యాజ్ఞవల్క్యునికి బోధయగుచున్నది . 


 ఆ మహాపురుషుడు అడిగినాడు , " ఏమి యాజ్ఞవల్క్యా , నా వలన ఏమి కావలెను ? " 


         యాజ్ఞవల్క్యుడు ’ నేను అర్పించిన పూజను గైకొనుము ’ అంటున్నాడు . ఆ మహా పురుషుడు , " మీ దంపతులు నిత్యమూ అర్పిస్తున్న పూజవలన నేను ప్రసన్నుడనైనాను . కాబట్టి మరలా పూజ అవసరము లేదు . నీకేమి కావలెనో అడుగు "  అంటాడు . 


       యాజ్ఞవల్క్యుడు " దేవా , మేము మానవులము . లోభపు మూర్తులము . మేము మా మనసు ప్రేరేపించునట్లు పలికెడివారము . కాబట్టి , నేను అడుగుట , నువ్వు ఇచ్చుట వద్దు . ఏమిస్తే నేను కృతార్థుడ నగుదును అని నీకనిపిస్తుందో , నువ్వు నీ అంతస్తుకు తగినట్లు ఏమిస్తే సరిపోతుందో , నాకు నువ్వేమిస్తే లోకము కృతార్థమగునో , దానిని ఇవ్వు " అంటాడు . 


         ఆదిత్యుడు ఆ మాట విని తల ఊపుతాడు . " యాజ్ఞవల్క్యా , నువ్వు నా మంత్రమును నాకే అప్పజెప్పినావు , భలే !  కానిమ్ము , అటులనే ఇచ్చెదను . నీ అహంకారమును ముందుంచుకొని , అదివ్వు , ఇదివ్వు అనకుండా , ఏమి ఇచ్చుట అనుదానిని నీకే వదలినాను అన్నదీ బాగుంది . అది సదహంకారపు పరమావధి . కానిమ్ము , నువ్వు పుట్టినది ఎందుకు అన్నది నాకు తెలుసు . ఈ ఉద్దేశము నెరవేరనీ యనే , మేమే నీచేత ఈ వ్రతమును చేయించు చున్నాము . సరే , ఇంకొన్ని దినములు వ్రతమును చేస్తూ ఉండు . ఇప్పుడే కదా ఉత్తరాయణము గడచింది, మరలా ఉత్తరాయణములో నేను నీకు మరలా వరప్రదానము చేయుదును . ఇక వెళ్ళి వస్తాను " అని అంతర్థానమవుతాడు . యాజ్ఞవల్క్యుడు మరలా జపములో మగ్నుడవుతాడు . 


          మరలా ఉత్తరాయణము వచ్చింది . జగత్తును ఆవరించిన శీతలము ఓడిపోయిన సైనికుడివలె మెలమెల్లగా వెనక్కి వెళుతూ వేసవికి దారి ఇస్తూ వచ్చింది . రథసప్తమి కూడ వచ్చి  , సూర్యుని రథము ఉత్తరమునకు తిరిగింది . యాజ్ఞవల్క్యుడు అంతర్ముఖుడయి ఉండుట ఎక్కువైంది . కాత్యాయని , యాజ్ఞవల్క్యుని ప్రతిబింబము వలె , బహిర్ముఖముగా వ్యాపారములను నడిపిస్తున్ననూ , ఆదిత్య మంత్రమును ఎడము లేకయే జపిస్తున్నది . చూచేవారికి , ’ ఈ పిల్లకు మాటలే రావా ? ’ అనిపించేంత మౌనముగా ఉంటున్నది . దినమునకు ఒకటో రెండో మాటలు మాట్లాడుతుంది , అదికూడా అత్తతోటే ! 


         ఎప్పటి వలెనే తోటలో సూర్యారాధన జరుగుతున్నది . నమస్కారములన్నీ అయినవి . అర్ఘ్య ప్రదానాదులు కూడా ముగిసినాయి . ఆ దినము పూజ జరుగుచుండగా ఏమి విచిత్రము జరిగిందో ఏమో , యాజ్ఞవల్క్యుడు భార్యను పిలచి , " సాధ్యమైతే నువ్వు ఈ దినము గుడిసెలో ఉండు " అన్నాడు . కాత్యాయని మౌనముగా , వినయముగా ’ సరే’ నని తలాడించినది . ఇంకా సూర్యుడు ముఖాని కెదురుగా వస్తున్నాడు , అంతే ! మొదటి ఝాము గడచింది . సుమారు రెండో ఝాములో కూడా కొంత గడచింది . 


యాజ్ఞవల్క్యుడు ఎప్పటిలా జపములో మగ్నుడైనాడు . కాత్యాయని వాకిటి లోపల తానూ జపములో కూర్చున్నది . 


          ఎప్పటి వలె గుర్రము కనిపించినది . గుర్రము ఒకటి ఉన్నది , ఒకటి రెండైనది . అలాగే మరలా ఒకటే అగుచున్నది . అదికూడా గుర్రము పిల్లగా అగుచున్నది . పరుగెత్తుతూ నేరుగా యాజ్ఞవల్క్యుని వద్దకు వచ్చి , " యాజ్ఞవల్క్యా , వచ్చేదా ? " అని అడుగుతుంది . అతడు దానికి పూజ చేసి , " దేవా , నీ ఇఛ్చయే నా ఇఛ్చ " అంటాడు . 


         " చూడు , నువ్వు నన్ను ధరించగలవా ? " అని గుర్రము కాళ్ళు తాటిస్తూ ఆడుచున్నది . చూడగా , ఇప్పుడది గుర్రము పిల్ల కాదు , ఒక మనిషి కన్నా ఎత్తైన గుర్రము . అంతే కాదు , జ్వాలామయమైనది . నిగనిగమని నిప్పులకన్నా ఎర్రగా మెరుస్తున్నది . 


          యాజ్ఞవల్క్యునికి బెదురు కలుగుట లేదు . " దేవా , అప్పుడే తెలిపియున్నాను . నీకు సరి యనిపించిన దానిని కరుణించు . నాకు హితమైనది ఏదో దానిని కరుణించు . లోకానికి ఏది కావలెనో దానిని కరుణించు " 


          గుర్రము పలుకుతుంటే ఉరుము ఉరిమినట్లుంది , " సరే , భారమును నాపై వేసి నువ్వు కృతార్థుడవైనావు . లేకపోతే , ఇప్పుడు నేనివ్వవలె ననుకొన్న ఈ వరమును ధరించుటకు నీకు చేతనయ్యెడిది కాదు . ఇదిగో  , నువ్వు నావలె అయి , నా వరమును గ్రహించు " అని గుర్రము మరలా ఒకసారి సకిలించి ఆతని హృదయమును ప్రవేశించినది . 


        యాజ్ఞవల్క్యుడు ప్రజ్వలిస్తున్న అగ్నిగుండమైనాడు . అతని రోమ కూపము లన్నిటినుండీ అగ్ని పురుషుని కన్నా ఎక్కువగా జ్వాలలు లేచినవి . ఒక ముహూర్త కాలము  అలాగే ఉండినది . 


         గుర్రము మరలా బయటికి తిరిగి వచ్చినది . యాజ్ఞవల్క్యుని దేహము వెదజల్లుతున్న మంటలన్నీ శమించినాయి . గుర్రమన్నది , " యాజ్ఞవల్క్యా , కృతార్థుడవైనావు . నీ వలన లోకము కృతార్థమైనది . నువ్వు వేద పురుషుడవైనావు . నీనుండీ లోకము ఒక సంహిత , ఒక బ్రాహ్మణము , రెండు ఉపనిషత్తులను పొందును . వాటిలో ఒక ఉపనిషత్తు నీ గురించినది . ఇంకొకటి బ్రహ్మను గురించినది . ఆ రెండింటినీ అధ్యయనము చేసి , వాటిలోనున్న రహస్యమును ఛేదించువానికి తప్పకుండా మహాదర్శనమగును . ’


          యాజ్ఞవల్క్యుడు ఏమి చెప్పవలెనో తెలియక ఒక గడియ మౌనముగా ఉన్నాడు . గుర్రము అంత సేపూ యాజ్ఞవల్క్యుని తన మూతితో నిమురుతూ తన విశ్వాసమును చూపిస్తూ అక్కడే నిలిచింది . కొంతసేపైన తరువాత ప్రకృతస్థుడై యాజ్ఞవల్క్యుడు గుర్రానికి పూజ సలిపినాడు . వెనుక అయినట్లే మరలా , గుర్రము ఉన్న చోట మండలస్థుడైన ఒక మహాపురుషుడు  కనిపించి ఆతని పూజనంతా స్వీకరించి , " యాజ్ఞవల్క్యా , నువ్వు ఋషివైనావు . మహర్షియైనావు . బ్రహ్మర్షియైనావు . నీవంటి అదృష్టవంతుడు లేడు . ఇప్పుడు నువ్వు సర్వజ్ఞుడవు . సర్వ దేవతామయుడవు . అంతే కాదు , బ్రహ్మమై యున్న బ్రహ్మర్షి , వృక్షము లోపల గుజ్జు తో కూడిననూ బయట చిగురు , పూలు , కాయలతో మెరయునట్లే అంతర్ముఖుడవైనను బహిర్ముఖుడవై సంసారిగా ఉండు . కాలము వచ్చినపుడు హెచ్చరించెదము . అప్పుడు నువ్వు నువ్వు అగుదువు గాని . నేనిక వెళ్ళి వస్తాను , మేమంతా నీలో ఉపస్థితులము . మరవ వద్దు " అని అతనిని వీడ్కొని వెళ్ళినాడు . 


          యాజ్ఞవల్క్యుడు కళ్ళు తెరచు వేళకు కాత్యాయని కూడా కళ్ళు తెరచింది . అతనికి కనిపించినదంతా ఆమెకూ కనిపించినది . ఆమె ప్రసన్న వదనయై , తన హృదయములోని సంతోషము కన్నులలో నీరుగా వర్షిస్తున్నది . " నేను జన్మాంతరములలో ఈశ్వరుని బాగా అర్చించి యుండవలెను . లేకపోతే తమ వంటి మహానుభావుల చేయి పట్టుకొను భాగ్యమును పొందేదానిని కాదు . " అన్నది . మాటలో , " మీరు పర్వతము , నేను పరమాణువును " అన్న ధ్వనియుండినది . 


Janardhana Sharma

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - ఆశ్వయుజ మాసం - కృష్ణ పక్షం  -  తృతీయ & చతుర్థి - కృత్తిక -‌‌ భాను వాసరే* (20.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శివో అభిషేక ప్రియ*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

        *శివో అభిషేక ప్రియ*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*శివో అభిషేక ప్రియః। అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు !!*


*"నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి* 

*పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు* 

*గామధేనువు వానింట గాడి పసర*

*మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు॥"* 


*తాత్పర్యము:~*


*శివ లింగంపై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు 'కామధేనువు' కాడి పశువుగా పడి వుంటుందట, 'కల్పవృక్షం' అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట !!*


*శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి !!*

*సకలైశ్వర్యములు సమకూరతాయి !!*


*నిశ్చల భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు.* 


*విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు.ఆయన శిరస్సు పై గంగ వుంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శివుడి 108 నామాలు

 శివుడి 108 నామాలు వాటి అర్ధాలు

 

శివుని నామాలు శివునికి గల వివిధ పార్శ్వాలను తెలియచేస్తాయి.



శివుడికి లెక్కలేనన్ని రూపాలు, ఆవిర్భావాలు ఉన్నాయి,వాటినన్నిటినీ మనము ఏడు విభాగాలుగా పొందుపర్చవచ్చు. దేవునిగా మనము భక్తితో కొలిచే ఈశ్వరుడు, ఉదారంగా మనకు తోడుండే శంభుడు, నిరాడంబరుడైన సన్యాసి భో, అమాయకంగా మనపై ప్రేమను చూపే భోళా శంకరుడు, వేదాలను మనకు బోధించే జ్ఞానమూర్తి దక్షిణామూర్తి, కళలకు ప్రతీక నటేశుడు, తీవ్రమైన, శిష్ట రక్షణ చేసే కాలభైరవుడు లేదా మహాకాలుడిగా, చంద్రుని మించిన సుందరమైన, శృంగార మూర్తి, సోమసుందరుడు, ఇవన్నీ ఏడు ప్రాధమిక రూపాలు మాత్రమే. వీటినుండి లక్షల కొద్దీ ఆవిర్భవాలకు అవకాశం ఉంది.


యోగ సంప్రదాయంలో శివుడికి ఉన్న 1008 పేర్లున్నాయి ఇవన్నీ ఈ ఏడు విస్తృత వర్గాల నుండే ఉద్భవించాయి. ఈ 1008 పేర్లలో 108 పేర్లు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి.



ఆశుతోషుడు

అన్నికోరికలను వెంటనే తీర్చేవాడు


ఆదిగురువు

మొదటి గురువు


ఆదినాథుడు

మొదటి స్వామి


ఆదియోగి

మొదటి యోగి


అజా

పుట్టుక లేనివాడు


అక్షయగుణ

అంతులేని గుణములున్నవాడు


అనఘుడు

వంక పెట్టలేనివాడు


అంతదృష్టి

అంతులేని దృష్టి కలవాడు


ఔగాధుడు

ఎల్లప్పుడూ ఆనందంలో రమించువాడు


అవ్యయప్రభు

అంతములేనివాడు


భైరవుడు

భయము దూరము చేసేవాడు


భళనేత్ర

నుదుటియందు నేత్రం కలవాడు


భోళానాథుడు

అమాయకుడు


భూతేశ్వరుడు

పంచ భూతాలపై ఆధిపత్యం ఉన్నవాడు


భూదేవుడు

భూమికి అధిపతి


భూతపాలుడు

భూతములను రక్షించువాడు


చంద్రపాలుడు

చంద్రునికి అధిపతి


చంద్రప్రకాశుడు

చంద్రుని శిఖపై ధరించినవాడు


దయాళుడు

కరుణతో నిండినవాడు


దేవాదిదేవుడు

దేవతలకే దేవుడు


ధనదీపుడు

ధనానికి అధిపతి


ధ్యానదీపుడు

ధ్యానానికి అధిపతి


ధ్యుతిధారుడు

ప్రకాశానికి అధిపతి


దిగంబరుడు

ఆకాశాన్ని తన వస్త్రంగా చేసుకున్నవాడు


దుర్జనీయుడు

తెలుసుకోవటం కష్టమైనవాడు


దుర్జయుడు

ఓటమినెరుగనివాడు


గంగాధరుడు

గంగను తనపై మోయువాడు


గిరిజాపతి

గిరిజకు పతి


గుణాగ్రహుడు

గుణాలను అంగీకరించినవాడు


గురుదేవుడు

దేవునితో సమానమైన గురువు


హరుడు

పాపములను హరించువాడు


జగదీశుడు

జగత్తుకి అధిపతి


జరాదిష్మణుడు

బాధలను తొలగించువాడు


జటి

జడలుగా ఉన్న జుట్టు ఉన్నవాడు


కైలాశుడు

శాంతిని ప్రసాదించువాడు


కైలాశాధిపతి

కైలాసానికి అధిపతి


కమలాక్షణుడు

కమలములు వంటి కనులున్నవాడు


కాంతుడు

ఎప్పటికీ ప్రకాశించువాడు


కపాలి

కపాలమాలను మేడలో ధరించినవాడు


కొచ్చడైయాన్

పొడుగు జడలున్న స్వామి


లలాటాక్షుడు

లలాటముపైన కన్ను ఉన్నవాడు


లింగాధ్యక్షుడు

లింగాలకు అధిపతి


లోకంకరుడు

మూడు జగత్తులను సృష్టించినవాడు


లోకపాలకుడు

లోకాలను రక్షించువాడు


మహాబుద్ధి

గొప్ప జ్ఞానము కలవాడు


మహాదేవుడు

దైవాలలోకెల్లా గొప్పవాడు


మహాకాళుడు

కాలానికి అధిపతి


మహామాయ

మాయలలో కెల్లా గొప్పదైన మాయ


మహామృత్యుంజయుడు

మృత్యువును జయించినవాడు


మహానిధి

గొప్పనిధి


మహేశా

మహోన్నతమైన దైవం


మహేశ్వర

దేవతలకు అధిపతి


నాగభూషణ

పాములను ఆభరణాలుగా ధరించినవాడు


నటరాజు

నాట్యకళలో మహారాజు


నీలకంఠ

కంఠము నీలము రంగులో ఉన్నవాడు


నిత్యసుందరుడు

ఎల్లప్పుడూ సౌందర్యముతో ఉండువాడు


నృత్యప్రియుడు

నాట్యమును ప్రేమించువాడు


ఓంకారుడు

ఓంకార నాదమునకు మూర్తి


పాలనహరుడు

అందరిని కాపాడువాడు


పరమేశ్వరుడు

దైవాలలో అగ్రగణ్యుడు


పంచత్సరుడు

తీవ్రమైనవాడు


పరమేశ్వరుడు

దేవతలలోకెల్లా గొప్పవాడు


పరంజ్యోతి

గొప్పకాంతి


పశుపతి

జీవాల కన్నిటికి అధిపతి


పినాకిని

చేతిలో విల్లు ఉన్నవాడు


ప్రణవుడు

ఆదినాదమైన 'ఓం" శబ్దముకు మూలమైనవాడు


ప్రియభక్తుడు

భక్తులందరికీ ప్రియుడు


ప్రియదర్శనుడు

ప్రేమపూరిత దృష్టి కలవాడు


పుష్కరుడు

పోషణను ఇచ్చువాడు


పుష్పాలోచన

పుష్పములవంటి కన్నులున్నవాడు


రుద్రుడు

గర్జించువాడు


రవిలోచన

సూర్యుడిని కన్నుగా కలవాడు


సదాశివ

అతీతుడు


సనాతనుడు

శాశ్వతమైనవాడు


సర్వాచార్య

అత్యుత్తమ గురువు


సర్వశివ

శాశ్వతమైన స్వామి


సర్వతపనుడు

అందరికి గురువు


సర్వయోని

శాశ్వతమైన స్వచ్ఛత కలవాడు


సర్వేశ్వరుడు

సర్వమునకు అధిపతి


శంభో

శుభప్రదుడు


శంకర

దేవతలకందరికి అధిపతి


శాంత

స్కంద గురువు


శూలినుడు

సంతోషం అందచేసేవాడు


శ్రేష్ఠ

చంద్రునికి అధిపతి


శ్రీకంఠ

ఎల్లప్పుడూ స్వచ్ఛత ఉన్నవాడు


శృతిపక్ష

త్రిసూలం ఉన్నవాడు


స్కందగురువు

వేదాలను అందచేసినవాడు


సోమేశ్వరుడు

శుద్ధమైన శరీరం కలవాడు


సుఖద

సుఖాలను ఇచ్చువాడు


స్వయంభు

స్వయంగా సృష్టింపబడినవాడు


తేజస్విని

కాంతిని ప్రసరించువాడు


త్రిలోచన

మూడు కన్నుల వాడు


త్రిలోకపతి

మూడు లోకాలకు అధిపతి


త్రిపురారి

అసురులు సృష్టించిన మూడు లోకాలను ద్వష్టం చేసినవాడు


త్రిశూలి

త్రిశూలం చేత నున్నవాడు


ఉమాపతి

ఉమకు పతి


వాచస్పతి

వాచస్పతి వచనానికి (మాటకు) అధిపతి


వజ్రహస్త

చేతిలో వజ్రాయుధం ఉన్నవాడు


వరద

వరాలను ఇచ్చువాడు


వేదకర్త

వేదాలను సృష్టించినవాడు


వీరభద్ర

Oవిశ్వానికి రారాజు


విశాలాక్షుడు

విశాలమైన కన్నులున్నవాడు


విశ్వేశ్వరుడు

లోకాలన్నిటికి అధిపతి


విశ్వనాథుడు

లోకనాథుడు


వృషవాహనుడు

ఎద్దును వాహానము చేసుకున్నవాడు


అల్లమ ప్రభు - గుణాలకు అతీతమైన ముని !