8, సెప్టెంబర్ 2021, బుధవారం

స్వామి శివానంద సాధన సూత్రములు

 ॐ స్వామి శివానంద 135వ జయంతి శుభాకాంక్షలు.


స్వామి ఉపదేశించిన సాధన సూత్రములు


1. సేవింపుము(SERVE),

    ప్రేమింపుము(LOVE),

    దానమిమ్ము(GIVE),

    పరిశుద్ధుడవుకమ్ము (PURIFY)

    ధ్యానింపుము(MEDITATE),

   సాక్షాత్కారము పొందుము(REALISE).

2. సరిదిద్దుకొనుము(RECTIFY),

    సర్దుకొనుము(ADJUST),

    అవకాశమిమ్ము (GIVE OPPORTUNITY).

3. "మంచి" వాడవు కమ్ము (BE GOOD),

     మంచి చేయుము (DO GOOD),

     దయగా నుండుము,

     కరుణ చూపుము,

     నిష్కపటముగా నుండుము,

     ఋజుత్వము నవలంబింపుము,

     నిజాయితీగా నుండుము,

     అణకువగా నుండుము. 


https://youtu.be/oooM6D5myXM 


స్వామి శివానందులు గానం చేసిన ప్రార్థనా గీతం

(PRAYER SONG BY SWAMI SIVANANDA)  


https://youtu.be/LS4-zjANIww 


                    =x=x=x=  


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

గోమాత విశిష్టత

 గోమాత విశిష్టత

భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు.

గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం.

గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ

ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని

పనులు ప్రారంభించదం ఎంతో

శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ

పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు

చెబుతున్నవి.

ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతీ సంపదలకు

ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచీ

ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవుకన్న మిన్నగా

ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు.

గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలనీ, అవి ఎన్నడూ

ఎవరిచేతా దొంగిలింపబడరాదనీ, దుష్టుల

వాతపడగూడదనీ, అధిక సంతతి పొందాలనీ,

యజుర్వేదంలో శుభాకాంక్ష వ్యక్తం

చేయబడింది. యజ్ఞ యాగాదులలో హవనానికై దుగ్ధ

ఘృతాలనందించే గోవు సకల ప్రాణికోటికీ

జీవాధారమైనదనీ, గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు

అలవడగలవనీ, ధన సంపదలువృద్ధి పొందగలవనీ

ప్రశంసించబడింది.

ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ,

విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన

తీర్థస్థానములు, స్థావర జంగమములు అలరారి

వున్నాయి. శిరస్సుకు మధ్యబాగం శంకరుని

గేహ, బిగువు అంగాలలో చతుర్థశ భువనాలు

ఇమిడి ఉన్నాయి అని అథర్వవేదం చెబుతున్నది.

ప్రపంచంలో అన్నమును ఉత్పన్నం చేసేవి

గోవులు అని ఆర్యులు శ్లాఘించారు. ఈ

జగత్తులో గోసంపదతో సమానమైన ధనసంపద

చూడలేదు అని చ్యవన మహర్షి ‘నహుషం’లో

ప్రవచించారు. చతుర్వేదాలలోనే కాక, హిందూ

ధర్మశాస్త్రగ్రంథాలలోను, భారత, రామాయణ, భాగవతాది

పవిత్రగ్రంథాలలోను, గోమహిమ అసమానమైనదిగా

అభివర్ణించబడింది. వాల్మీకి, వ్యాసుడు,

బుద్ధుడు, స్వామి దయానంద సరస్వతి, గురు

నానక్, శంకరాచార్యులు తులసీదాసు, కబీరు,

చైతన్య మహాప్రభువు మొదలగు

మహానుభావులెందరో గోసంపద యొక్క

రక్షాణావశ్యకతను గూర్చి నొక్కి వక్కాణించారు.

శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను

పూజించి, సేవించి గోపాలుడైనాడు. దిలీప చక్రవర్తి

తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సైతం

వెనుకాడలేదు. జమదగ్ని గోరక్షణకై ఆత్మత్యాగం

చేశాడు. గోవులే స్వర్గ సోపానాలు.

గో మహిమ గురించి శివపార్వతుల సంభాషణ

” శ్రీ కృష్ణ పరమాత్మ” గోవును ఎంతో భక్తి తో

శ్రద్ధ తో సేవకుడిగా చూసుకొనే వాడు. మహా

జనులారా గోవును పూజించిన ముక్తికి

పొందెదరు.

ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని

భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక

ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను,

బ్రాహ్మణులను, భక్తులను దూషించిన

దోషం, పరులను హింసించిన దోషం,

పరులను హింసించిన పాపం ఏ విధముగా

పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా

దయామయుడగు పరమశివుడు ” ఓ పార్వతీ!

గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి

గోవును పూజించిన సర్వపాపములు

నశించును. ఆ గోవునందు పాదములు

ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి

దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు, మారుతీ

కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక

నాలుగు వేదములు, భ్రూమధ్యంబున

గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున

శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో

సూర్య చంద్రులు, చెవులలో శంఖు-

చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు

ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున

సరస్వతి, రొమ్మున నవగ్రహాలు,

మూపురమున బ్రహ్మదేవుడు,

గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును.

ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర,

వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు.

ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు,

తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య

కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి

త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు

పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు

పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త

సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు

నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం,

అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత

గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు

తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద

ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు

కన్నా గొప్పది. కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య

వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా

పాతకములన్నియు తొలగును. ప్రతి

అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల

మహాపాపములు తొలగును. నిత్యము

సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము

కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా

పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు

తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు,

బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి

పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి

ఫలితము నిచ్చును. గోవుకు ఐదు సార్లు

ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం.

గోవును పూజించితే సమస్త దేవుళ్ళను

పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో

ప్రదక్షిణం చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి

మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ

చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి

పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు.

కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ

రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి

పుణ్యములు పొంది 41 రోజులు చేసిన

పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో

పుణ్యం లభిస్తుంది” అని బోధించాడు.

" శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ

తత్తుల్యం రామనామ వరాననే "

గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి ,

మూత్రం , పేడ(గోమయం) మొదలగు వాటిని

పంచ గవ్యములు అంటారు.

ఆవు తన జీవిత కాలంలో 410400 మందికి ఒక

పూట భోజనాన్ని ఇస్తుందట.

భూ మాత గో రూపంలో నే దర్శనమిస్తుందని శ్రీ

మద్భాగవతం లో ఉంది.

గోవు యొక్క సమస్త అంగములందు సమస్త

దేవతలు కలరు. అందుకే ఆవును

ముందు ప్రవేశ పెట్టి, ఆ తర్వాతనే నూతన

గృహంలో యజమాని ప్రవేశిస్తాడు.

గోవునకు ఆహారం సమర్పించినట్లైతే 33కోట్ల

మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే.

గో పూజ,గోరక్షణ,గోదానం,గో వధ నిషేధం ప్రతి

హిందువు కర్తవ్యం.

తల్లి పాల వలె సులభంగా జీర్ణం అయ్యే శక్తి

ఆవు పాలల్లో ఉంది. ఆవు పాలు

సంపూర్ణాహారము. శిశువులకు,

వృద్ధులకు చాల శ్రేష్ఠం. క్రొవ్వు

ఉండదు. ఆవు పాలలో ప్రోటీనులు ,

కార్బోహైడ్రేట్లు , ఖనిజాలు, విటమినులు ,

మెగ్నీషియం , క్లోరిన్ మొదలగు లోహాలు ఉన్నాయి.

నీరు త్రాగుతున్న గోవును, పాలు

తాగుతున్న దూడను వారించకూడదు(అడ్

డు పడకూడదు).

గోవు తిరుగాడు మన ముంగిళ్ళు,

దేవాలయాలను తలపించు గుళ్ళు,గోవులు

కదలాడే దేవుళ్ళు…

గోవులను వధించకుండా చూడాలి. గోవులు

జీవించి ఉండాలి. ఆయుర్వేదం లో విష

పదార్ధాలను గో మూత్రంతో శుద్ధి చేస్తారు.

భోపాల్ విష వాయువు వచ్చిన సమయం లో ఒక

ఇంట్లో విష వాయువులు ఎమీ చేయలేకపోయాయట.

కారణం ఎమిటో తెలుసా..? ఆ ఇంట్లో ఆవు పేడతో

యజ్ఞం చేశారు కాబట్టి.

దేశం మొత్తమ్మీద 6.27 లక్షల గ్రామాల్లో ప్రతి

గ్రామంలో 50 రైతు కుటుంబాల్లో ఒక్కొక్క

కుటుంబానికి 2 ఎద్దులు, 4 పాడి ఆవులు

ఉంటే వాటి ద్వార లభించే పేడ దేశం మొత్తానికి

కావాల్సిన పెట్రోల్, యల్.పి.జి, కిరోసీన్ , యల్.ఎన్.జి

అవసరాలను తీరుస్తుంది. దేశ ఆర్ధిక వ్యవస్థ

బాగుపడుతుంది.

గో మూత్రం ఒక లీటర్ 120 రూపాయలు. పేడ కిలో

15 రూపాయలు అమ్ముతుంది మహరాష్ట్రలోని

వెడప్ కాషా అనే సంస్థ. ఈ సంస్థ కేవలం 3 గోవుల

ద్వారా 60000 విలువ చేసే సేంద్రియ

ఎరువులను , 250000 విలువ చేసే

అగరుబత్తులను తయారు చేసి సంచలనం

సృష్టించింది.

గో మూత్రం వల్ల భూ సారం 20 శాతం

అభివృద్ధి చెందుతుంది. ఒక గ్రాము

గోమయంలో 300 కోట్ల సూక్ష్మ జీవులు

ఉంటాయి. అవి భూసారాన్ని పెంచుతాయి.

ఆవుకి నమస్కరిస్తే ధర్మం నాలుగు పాదాల

నడుస్తుంది. మంగళం కొరే మానవుడు

ఆవులకు ఎల్లప్పుడూ నమస్కరించడం

అవసరం. ఆవు పృష్టానికి నమస్కరించడం

శ్రేయోదాయకమని స్రీ సూక్తం లో చెప్పబడింది.

గోవు భారత ఆర్ధిక వ్యవస్థ లో కీలకము.

భారతీయులు వ్యవసాయం మీద ఆధార పడితే , ఆ

వ్యవసాయ భారాన్ని తమ భుజాలపైన మోస్తున్నవి

ఎద్దులు. ఆలాంటి ఎడ్లనించ్చేది గోవులే.

అందుకే ఆవు మనకు అమ్మ. ఎద్దు మనకు

అన్న.

గో బ్రాహ్మణ హింస జరిగే చోట అబద్దమాడవలసి వచ్చి

అబద్దమాడినా దోషం లేదని వ్యాస భారతం చెప్పింది.

ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను

దానం చేసిన ఫలితం కలుగుతుంది. కపిల

గోవును దానం చేస్తే ఏడు తరాలను

తరింపజేస్తుంది. గో దానం చేస్తే పితృ

దేవతలు ఘోరమైన వైతరణి నది దాటి స్వర్గానికెళతారని

శాస్రంలో చెప్పబడింది.

ఆషాడ శుద్ద ఏకాదశి (తొలి ఏకాదశి) రొజున గో పద్మ

వ్రతం చేస్తే అత్యంత విశేష ఫలితం

కల్గుతుందని పురాణాల్లో చెప్పబడింది.

ఎండ వల్ల, వడ గాడ్పులప్పుడు , చలి

గాలులు వీస్తున్నప్పుడు , వర్షం

వచ్చినప్పుదు ముందుగా నిన్ను నువ్వు

రక్షించుకోవడం కాదు గోవును రక్షించు.

గో పోషణ కొరకు పరుల గడ్డి వామిలోంచి గడ్డి

తీసుకొని ఆవుకు వేస్తే అది దొంగతనం కాదు.

జాతి పిత గాంధీజి నాకు స్వాతంత్ర్యం కంటే గో

రక్షణే ప్రధానమన్నారు.

భూమాతకు ఆభరణం గోమాత,

ఆవు పేడలో లక్ష్మీ దేవి నివసిస్తుంది.

తరతరాల భారతీయ భూతదయ పరంపరకు సజీవ

సాక్ష్యం గోమాత

గోసేవ ఇచ్చును కోటి యజ్ఞ యాగాదుల పుణ్య

ఫలం

గోసంపద ఉన్నచో అది అర్ధ బలం,

గోమూత్రం పుణ్య జలం.

గోక్షీరం పసిపాపలకు తల్లి పాల బలం.

గోవును పూజించిన చాలు నశించును మన

పాపాలు సకలం.

గోలక్ష్మితో రైతు ధనవంతుడవుతాడు.

పల్లెలలో గో సంతతి ఎప్పుడైతే తగ్గుతుందో

అప్పుడే పల్లే ప్రజలు పల్లెల్ను విడిచిపోతారు.

గోపాలుడు పుట్టిన భరతదేశం లో గోవులకు

రక్షణ లేకుండా పోయింది. గో హత్యలు

పెరిగిపోతున్నాయి. గోహత్యలు నిషేదించాలి.

గోహత్యలు చేసిన వారికి కఠిన శిక్షలు

వేయాలి.దీనికోసం చట్టం తెచ్చేవరకు

మనమందరం కలిసికట్టుగా ప్రభుత్వం పై

ఒత్తిడి తేవాలి.

మొగలి పువ్వును,ఆవును శివుడు

శపించాడా?

పూర్వం బ్రహ్మ విష్ణువులు,తమలో తము

"నేను గొప్ప అంటే నేను గొప్ప" అని

వాదించుకున్నారు.ఈ వాదులాట కాస్త వివాదంగా

మారింది.అది మరింతగా పెరిగి యుద్దానికి

దారితీసింది.ఈ యుద్దానికి లోకాలన్నీ తల్లడిల్లాయి.దా

ంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి

దిగాలనుకొన్నాడు.ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద

జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య

వెలసింది.బ్రహ్మ విష్ణువులు ఇద్దరు

లింగాన్ని సమీపించారు.అప్పటి వరకు వారి మధ్య

ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా

సద్దుమణిగింది.ఆ మహా లింగం మొదలు,తుది

తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది.బ్రహ్మ

హంసా రూపం దరించి లింగం అగ్ర బాగాన్ని

చూడడానికి,విష్ణువు వరాహ రుపమలో అదిని

కనుక్కోవడానికి బయలు దేరాడు.బ్రహ్మకు

ఎంతకు లింగం అగ్ర భాగం కాని మొదలు కాని

కనిపించలేదు.ఇంతలో లింగం పక్క నుంచి

ఒక కేతక పుష్పం(మొగలి పువ్వు) జారి

కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని

అపితనకు,బ్రహ్మకు,విష్ణువుకు నడుమ

జరిగిన వాదాన్ని వివరించి,సహాయం చేయమని

అడిగాడు. ఆవు కనపడితే అదే విధంగా చెప్పి,ఆ

లింగం అగ్ర భాగాన్ని చూసినట్లుగా,విష

్ణువుతో చెప్పేటప్పుడుఅది నిజమేనని సాక్ష్యం

ఇమ్మని ప్రాదేయపడ్డాడు.సాక్షాత్తు సృష్టి

కర్తయే తనని బ్రతిమాలేసారికి కాదనలేక

సరేనంటాను.రెండు,కిందకు దిగి వచ్చే సారికి

విష్ణువు తాను ఆ లింగం మొదలు

చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు.బ్రహ్మ

తాను లింగం అగ్ర భాగాన్ని చూశానని ,కావాలంటే

అవును, మొగలి పువ్వును అడగమని

చెప్పాడు..నిజమే అంది మొగలి పువ్వు,బ్రహ్మ

దేవుడి మాటను కాదనలేక అయన లింగం అగ్ర

భాగాన్ని చూసాడని ఆవు తలతో చెబుతుంది

కాని,అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో

చూడలేదని చెబుతుంది.బ్రహ్మ దేవుడి

అసత్య ప్రచారాన్ని చూడ లేక ఈశ్వరుడు

ప్రతయ్యక్షమయ్యాడు.బ్రహ్మ చెప్పిన ప్రకారం

అబద్దపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో

భక్తులెవ్వరు తనను పూజించరాదని ,తెల్లవారి

లేచి ఆవు ముఖం చూడటం కుడా పాప

కారణం అని

శపించాడు.ఆవు అభ్యర్దన మేరకు తోకతో నిజం

చెప్పింది కాబట్టి వృష్టభాగం పవిత్రమైనది....

సంస్కృత మహాభాగవతం

 *8.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఆరవ అధ్యాయము*


*బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*6.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*అథ తస్యాం మహోత్పాతాన్ ద్వారవత్యాం సముత్థితాన్|*


*విలోక్య భగవానాహ యదువృద్ధాన్ సమాగతాన్॥12408॥*


*శ్రీశుకుడు ఇట్లు వచించుచుండెను* అంతట ద్వారకానగరమున పెక్కు అపశకునములు ఉప్పతిల్లెను. మహోత్పాతములు చెలరేగెను. వాటికి ఆందోళన చెంది, యాదవప్రముఖులు శ్రీకృష్ణుని కడకు విచ్చేసిరి. అప్పుడు ఆ ప్రభువు వారితో ఇట్లు నుడివెను.


*శ్రీభగవానువాచ*


*6.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*ఏతే వై సుమహోత్పాతా వ్యుత్తిష్ఠంతీహ సర్వతః|*


*శాపశ్చ నః కులస్యాసీద్బ్రాహ్మణేభ్యో దురత్యయః॥12409॥*


*6.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*న వస్తవ్యమిహాస్మాభిర్జిజీవిషుభిరార్యకాః|*

*ప్రభాసం సుమహత్పుణ్యం యాస్యామోఽద్యైవ మా చిరమ్॥12410॥*


*శ్రీకృష్ణుడు ఇట్లనెను* "పూజ్యులారా! ప్రస్తుతము ద్వారకయందు అంతటను అపశకునములు, ఉత్పాతములు విజృంభించుచున్నవి. బ్రాహ్మణోత్తములు మనవంశమునకు ఘోరమైన శాపమును ఇచ్చియున్నారు. దానికి తిరుగులేదని మీకును తెలియునుగదా! ప్రాణములను దక్కించుకొనదలచినచో మనము ఇచట నిలువరాదు. నేడే వెంటనే పరమ పవిత్రమైన ప్రభాస తీర్థమునకు వెళ్ళెదము.


*6.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*యత్ర స్నాత్వా దక్షశాపాద్గృహీతో యక్ష్మణోడురాట్|*


*విముక్తః కిల్బిషాత్సద్యో భేజే భూయః కలోదయమ్॥12411॥*


ప్రభాసతీర్థముయొక్క మహిమ మిగుల అద్భుతమైనది. పూర్వము దక్షప్రజాపతి శాపకారణముగా చంద్రుడు క్షయరోగమునకు గుఱియయ్యెను (దక్షప్రజాపతి తన కుమార్తెలలో ఇరువదియేడు మందిని చంద్రునకు ఇచ్చి పెండ్లిచేసెను. వారిలో రోహిణి అను తరుణి అతిలోకసుందరి. అందువలన చంద్రుడు ఆమెయందు అధికముగా ఆసక్తి చూపుచూ, తక్కినవారిని అంతగా ఆదరింపకుండెను. అందువలన వారు దుఃఖితులై తమ తండ్రియైన దక్షునికడ తమ బాధను వెళ్ళబోసిరి. అప్పుడు దక్షుడు క్రోధోద్రిక్తుడై 'చంద్రా! నీవు మా కుమార్తెలయెడ నిరాదరమును చూపితివిగాన క్షయరోగను పొందుము' అని శపించెను. ఆ విధమగా చంద్రుడు క్షయరోగ పీడితుడయ్యెను). అంతట అతడు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళి, అచటి పవిత్రతీర్థమున స్నానమొనర్చెను. వెంటనే అతడు తన పాపఫలితమైన రోగమునుండి విముక్తుడయ్యెను. అంతేగాక,ఎప్పటివలె ఆ చంద్రుడు తన కళలతో తేజరిల్లెను.


*6.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*వయం చ తస్మిన్నాప్లుత్య తర్పయిత్వా పితౄన్ సురాన్|*


*భోజయిత్వోశిజో విప్రాన్ నానాగుణవతాంధసా॥12412॥*


*6.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*తేషు దానాని పాత్రేషు శ్రద్ధయోప్త్వా మహాంతి వై|*


*వృజినాని తరిష్యామో దానైర్నౌభిరివార్ణవమ్॥12413॥*


మహాత్ములారా! కావున మనము వెంటనే ప్రభాస తీర్థమునకు వెళ్ళుదము. అచటి పవిత్రజలములలో స్నానములను ముగించుకొని, దేవతలకును, పితృదేవతలకును తర్పణములను సమర్పింతము. షడ్రసోపేతములైన, రుచికరములగు భోజనపదార్థములతో బ్రాహ్మణోత్తములను సంతుష్టులను గావించెదము. పాత్రులైన వారికి ఉత్తమములైన దానములను భక్తిశ్రద్ధలతో సమర్ఫింతము. ఆ విధముగా మనము బ్రాహ్మణుల ఆశీర్వచనములను పొంది, సముద్రమును నౌకలతోవలె సంకటములనుండి తరింతము".


*శ్రీశుక ఉవాచ*


*6.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*ఏవం భగవతాఽఽదిష్టా యాదవాః కులనందన|*


*గంతుం కృతధియస్తీర్థం స్యందనాన్ సమయూయుజన్॥12414॥*


*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణభగవానుడు ఇట్లు ఆదేశింపగా, యాదవులు అందరును ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు ఏకగ్రీవముగా నిశ్చయించుకొని, తమ రథములను (బంద్లను/వాహనములను) సిద్ధపరచుకొనిరి.


*6.40 (ముప్పది నలుబదియవ శ్లోకము)*


*తన్నిరీక్ష్యోద్ధవో రాజన్ శ్రుత్వా భగవతోదితమ్*


*దృష్ట్వారిష్టాని ఘోరాణి నిత్యం కృష్ణమనువ్రతః॥12415॥*


*6.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*వివిక్త ఉపసంగమ్య జగతామీశ్వరేశ్వరమ్|*


*ప్రణమ్య శిరిసా పాదౌ ప్రాంజలిస్తమభాషత॥12416॥*


మహారాజా! శ్రీకృష్ణసేవా పరాయణుడైన ఉద్ధవుడు ఆ పరమాత్ముని సముచిత వచనములను సావధానముగా వినెను. యాదవుల ప్రయాణసన్నాహములను గమనించెను. అనుక్షణము సంభవించుచున్న భయంకరములైన పెక్కు దృశ్యములను గుర్తించెను. పిమ్మట అతడు సకలజగత్తునకు సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని సన్నిధికి ఏకాంతముగా వెళ్ళెను. పిదప ఆ స్వామి పాదపద్మములకు ప్రణమిల్లి, ప్రాంజలియైన ఆ ప్రభువునకు ఇట్లు విన్నవించెను-


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*410వ నామ మంత్రము* 8.9.2021


*ఓం శివపరాయై నమః*


శివుడే పరుడుగా ఉత్కృష్టుడుగా గలిగిన జగన్మాతకు నమస్కారము.


శివుని కంటె పరమైన పరమేశ్వరికి నమస్కారము.


శివుని గూర్చి భక్తులకు ఎరుక కలిగించు జగదీశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శివపరా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం శివపరాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి సర్వాభీష్టసిద్ధులుగా అనుగ్రహించును.


పరమేశ్వరుడు శివుడయితే, పరమేశ్వరి శక్తి. ఈ శక్తిలేనిదే ఈశ్వరునకు శరీరమేలేదని భావము ఈ నామ మంత్రమందు ఉన్నది. త్రిమూర్తులలో ఒకడు శివుడు. ఆ త్రిమూర్తులకన్నను పరమేశ్వరి పూర్వురాలు. అమ్మవారు ఆదిపరాశక్తి. శివునికన్న పరమైనది. గనుకనే శ్రీమాత *శివపరా* యని అనబడినది. శివశక్త్యైక్యము అని అంటాము. అలాగే పిపీలకాది బ్రహ్మపర్యంతము శక్తికి ఏవిధముగా అధీనమైయుండునో, శివుడు కూడా శక్తికి అధీనమైనవాడే. శివునికన్న వేరైనది. అధికురాలు అగుటచే అమ్మవారు *శివపరా* యని అనబడినది. సృష్టి కార్యము శక్తి ప్రమేయము, సహాయము లేనిదే శివుడు చేయలేడు. 


*స్వాధీన వల్లభా* (లలితా సహస్ర నామావళి యందలి 54వ నామ మంత్రము) భర్త అయిన శివుని తన అధీనంలో ఉంచుకోగలిగినది పరమేశ్వరి. (పరమేశ్వరుడు శక్తితో కూడి ఉన్నప్పుడే సృష్టి-స్థితి-లయ కార్యములను చేయగలుగుతున్నాడు. కాబట్టి శివుడు శక్తికి అధీనుడగుటచే, ఆ తల్లి *శివపరా* యని అనబడినది.


సౌందర్యలహరిలో శంకరభగవత్పాదులవారు ఇలా చెప్పారు.


*శివః శక్త్యా యుక్తో- యది భవతి శక్తః ప్రభవితుం*


*న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|*


*అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి*


*ప్రణంతుం స్తోతుం వా కథ-మక్ర్త పుణ్యః ప్రభవతి|| 1 ||*


అమ్మా! పరమశివుడే అయినా నీతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే సర్వశక్తిమంతుడై లోకవ్యవహారములు చేయ గలుగు తున్నాడు. అదే నీతోడు లేనినాడు శంకరుడే అయినా ఇసుమంత కూడా కదలలేడు కదా. (శక్తితో ఉంటే శివం-కదలగలిగేది,శక్తి లేకుంటే శవం - కదలలేనిది)

శివరూపమైన లింగం శక్తిరూపమైన పానుపట్టం లేనిదే నిలబడలేదుగా.

అంత శంకరుడే పరాధీనతతో నీ ఆధారముతో నిలువగా ఇక సామాన్యులు నినువిడచి జీవించుట ఎట్లుసాధ్యం.

నిన్ను నిత్యము శివుడు, విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవాదిదేవతలే కొలుస్తూ ఉంటారు.

అటువంటి నిన్ను కొలవాలన్నా నీ పాదపద్మాలు సేవించాలన్నా ఎన్నో జన్మ జన్మల పుణ్యం చేసినవారికి తప్ప అన్యులకు ఆ భాగ్యము దక్కదు కదా.


కనుక పరమేశ్వరి *శివపరా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శివపరాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*

:

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*993వ నామ మంత్రము* 8.9.2021


*ఓం అజ్ఞానధ్వాంతదీపికాయై నమః*


అజ్ఞానమనే అంధకారమునందు జ్ఞానదీపము వంటి పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అజ్ఞానధ్వాంతదీపికా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం అజ్ఞానధ్వాంతదీపికాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి వారిలోని అజ్ఞానమును తొలగించి, జ్ఞానప్రకాశమును అనుగ్రహించును.


ధ్వాంతము అంటే చీకటి. అజ్ఞానధ్వాంతము అంటే అజ్ఞానమనే చీకటి. దీపిక అనగా జ్యోతి. అజ్ఞానమనే చీకట్లలో జ్ఞానమనే జ్యోతివంటిది పరమేశ్వరి గనుకనే *అజ్ఞానధ్వాంతదీపికా* యని అనబడినది. పరమేశ్వరి తన భక్తులలోని అజ్ఞానమను చీకట్లను తొలగించి జ్ఞానజ్యోతులను ప్రసాదిస్తుంది. ఈ దేహమే నిత్యము, సత్యము అనియు ఈ దేహమే ఆత్మ అనుట అజ్ఞానము. ఈ దేహమునకు చలనము కలిగేది ప్రాణము వలన. అదే జీవాత్మ. ఆ జీవాత్మ ఉండుటకు కారణము పరమాత్మ. పరమాత్మ, జీవాత్మతోనే ఉండి దేహములోని ఇంద్రియములు, మనసు తమ కార్యములను నెరవేరునటులు చేయుచూ జీవాత్మపరమాత్మ ఐక్యతను నిరూపించి, అద్వైతభావనను వెల్లడి చేయడం జరుగుచున్నది. దీనిని బట్టి జీవాత్మ, పరమాత్మలు ఒకటే. జీవాత్మ పరమాత్మలు ఒకటికాదు అనేది అజ్ఞానము. ఆ అజ్ఞానము చీకటివంటిది. అదే ద్వైతము. అటువంటి ఆజ్ఞానమనే చీకటిలో సంసార సాగరపయనము యొక్క మునకతప్ప పరమాత్మ అనే తీరమునకు చేరుట ఉండదు. పరమేశ్వరి అటువంటి అజ్ఞానపు చీకటులను జ్ఞానదీపికలతో తొలగించి పరమాత్మయనే తీరానికి చేరుస్తుంది గనుక ఆ తల్లి *అజ్ఞానధ్వాంతదీపికా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అజ్ఞానాంతదీపికాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం*

 *7.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఆరవ అధ్యాయము*


*బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*6.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*యదువంశేఽవతీర్ణస్య భవతః పురుషోత్తమ|*


*శరచ్ఛతం వ్యతీయాయ పంచవింశాధికం ప్రభో॥12400॥*


ప్రభూ! పురుషోత్తమా! నీవు యదువంశమున అవతరించి, నూట ఇరువదియైదు సంవత్సరముల కాలము గడచినది.


*6.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*నాధునా తేఽఖిలాధార దేవకార్యావశేషితమ్|*


*కులం చ విప్రశాపేన నష్టప్రాయమభూదిదమ్॥12401॥*


*6.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*తతః స్వధామ పరమం విశస్వ యది మన్యసే|*


*సలోకా ల్లోకపాలాన్నః పాహి వైకుంఠకింకరాన్॥12402॥*


"జగదాధారా! దేవకార్యములు అన్నియును అన్నివిధములుగా పూర్తియైనవి. లోకకంటకులైన కంసాది దుష్టులను పరిమార్చితివి. గోవర్ధనోద్ధరణాది మహాకార్యములను నెఱపుటద్వారా సజ్జనులను కాపాడితివి. ఇంక ఇప్పుడు ఇచట నీవు చేయవలసిన కార్యములు ఏమియు లేవు. విప్రుల శాపకారణముగా యదువంశము దాదాపు అంతరించినట్లే. మా మనవి నీకు అంగీకారమైనచో, నీ పరంధామమైన వైకుంఠమునకు ఏతెంచుము. అట్లొనర్చి, నీ సేవకులము, లోకపాలురము ఐన మమ్ము, మా లోకములను కాపాడుము. వైకుంఠనాథా! పాహి-పాహి"


*శ్రీభగవానువాచ*


*6.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*అవధారితమేతన్మే యదాత్థ విబుధేశ్వర|*


*కృతం వః కార్యమఖిలం భూమేర్భారోఽవతారితః॥12403॥*


*6.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*తదిదం యాదవకులం వీర్యశౌర్యశ్రియోద్ధతమ్|*


*లోకం జిఘృక్షద్రుద్ధం మే వేలయేవ మహార్ణవః॥12404॥*


*కృష్ణభగవానుడు ఇట్లనెను* "బ్రహ్మదేవా! నీవు చెప్పినరీతిగనే నేను నిశ్చయించుకొంటిని. భూభారము తొలగినది. మీ దైవకార్యము నెరవేరినది. ప్రస్తుతము యాదవులు శౌర్యపరాక్రమములచేతను, ధనసంపత్సమృద్ధి కారణమునను గర్వోన్మత్తులై యున్నారు. వారు ఈ పృథ్విని కబళించుటకు సిద్ధముగానున్నారు. సముద్రమును చెలియలికట్టవలె వారిని నేను అదుపులో ఉంచినాను.


*6.30 ( ముప్పదియవ శ్లోకము)*


*యద్యసంహృత్య దృప్తానాం యదూనాం విపులం కులమ్|*


*గంతాస్మ్యనేన లోకోఽయముద్వేలేన వినంక్ష్యతి॥12405॥*


గర్వోన్మత్తులైయున్న ఈ యాదవులయొక్క విస్తారమైన వంశమును అంతరింపజేయకుండా నేను నా ధామమును చేరినచో, వీరు లౌకికమర్యాదలను ఉల్లంఘించి ప్రవర్తింతురు. దానివలన లోకము నాశనమగును.


*6.31 ( ముప్పది ఒకటవ శ్లోకము)*


*ఇదానీం నాశ ఆరబ్ధః కులస్య ద్విజశాపజః|*


*యాస్యామి భవనం బ్రహ్మన్నేతదంతే తవానఘ॥12406॥*


పుణ్యాత్మా! బ్రహ్మదేవా! బ్రాహ్మణుల శాపకారణముగా ఇప్పటికే యదువంశనాశనము ప్రారంభమైనది. ఈ కార్యము పూర్తియైన పిదప నేను నీ సత్యలోకమునకు వచ్చి, పిమ్మట నా వైకుంఠధామమును చేరెదను".


*శ్రీశుక ఉవాచ*


*6.32 ( ముప్పది రెండవ శ్లోకము)*


*ఇత్యుక్తో లోకనాథేన స్వయంభూః ప్రణిపత్య తమ్|*


*సహ దేవగణైర్దేవః స్వధామ సమపద్యత॥12407॥*


*శ్రీశుకుడు వచించెను* జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిమ్మట స్వయంభువుడైన బ్రహ్మదేవుడు ఇంద్రాదిదేవతలతోగూడి ఆ ప్రభువునకు ప్రణమిల్లి, ఆ స్వామిని వీడ్కొని, తన లోకమునకు చేరెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

వినాయక చవితి ఖర్చు

 ```దేశం మొత్తం మీద వినాయక చవితి ఖర్చు 

80 వేల కోట్లు అయిందని గగ్గోలుపెడుతున్న 

నాస్తిక సంఘాలు !

-------------------------'


అదేమరి మా గొప్పతనం. 

ఇప్పటికైనా తెలిసిందా 

హిందువుల పండుగల విలువ!

ఈ మా పండగ వల్ల వివిధ కులవృత్తులవారికి అందరికీ 

ఈ 80 వేల కోట్ల రూపాయల డబ్బు వారి ఇండ్లకు చేరింది. 


వినాయక విగ్రహాలు తయారు చేసే వారికి, 

వారి సహాయకులైన, 

వారికి మట్టి అందించే వారికి, 

రంగులు అమ్మేవారికి,రంగులు వేసే వారికి..

మ్యాదర సోదరులు తాటాకు/ వెదురు కర్రలతో వేసే 

తాత్కాలిక మంటపాలు ద్వారా

 మరియు 

షామియానా వారు వేసే టెంట్లు ద్వారా 

వారికి వారికి ఉపాధి దొరికింది.


సన్నాయి, బ్యాండ్ మేళం వారికి.

లోపల డెకరేషన్ చేసే వారికి, 

క్లాత్ వర్క్ చేసే టైలర్ లకు పని దొరికింది.


పువ్వులు పంటల వారికి, కోసే వారికి, అల్లేవారికి, అమ్మేవాళ్లకి, దండలు కట్టేవారికి

దండలు, పూజకు పూలు, పూల డెకరేషన్ల ద్వారా 

అధిక ధరలు గిట్టుబాటు అయ్యాయి.


ట్రాలీలు, లారీలు, వివిధ బళ్ళు నడిపే వారికి 

విగ్రహాలు మంటపాలకు తేవటానికి,

మరల నిమజ్జనానికి తీసుకువెల్లటానికి

అధిక ధరలు చెల్లింపులు జరుగుతాయి.


దాదాపు ప్రతి మంటపం లో అన్నదానాలు జరుగుతాయి. 

కలిసి భోజనాలు జరుగుతాయి.. 

సమాజం లో సామరస్యత పెరుగుతుంది. 

ప్రతి ఒక్కరూ కడుపునిండా తినగల్గుతారు.. 


వంట మనుషులకు, సహాయకులుకు, 

టెంట్ హౌజ్ సామగ్రి వారికి డబ్బులు గిట్టబాటు అవుతుంది.


వివిధ రకాల డెకరేషన్. లైటింగ్, సౌండ్ అందించే 

వారికి మంచి ధర కు వారి సామాగ్రిని అద్దెకు ఇస్తారు.


బ్రాహ్మణులకు, పురోహితులకు సంభావన దక్కుతుంది. 

(వీరిని ఎప్పుడో మనం పట్టించుకోవటం మానేసాం కదా!)

ఇప్పుడైనా వీరికి తగిన పారితోషికం లభిస్తుంది.


కొబ్బరికాయలు, అరటిపండ్లు, పాలవెల్లికి కట్టే పండ్లు,

పూజచేసే పత్రి, మామిడాకులు ఇలా వీటిన్నటినీ

ఈ రోజుల్లో కొనటమే కనక సన్నకారు రైతులు అందరూ

వారి ఇండ్లకీ కొంత ఈ ధనం చేరింది.


హరికధలు బుర్రకధలు నాటకాలు ప్రవచనాలు,

భరతనాట్యాలు సంగీత కచేరీలు ఆర్కెష్ట్రాలు,

ఊరేగింపులలో కోయడాన్సులు భేతాల నృత్యాలు కోలాటాలు,

తీన్మారులు తాసాలు రామడోళ్లు నాదస్వర డోలు సహనాయిలు,

చివరికి తోలుబొమ్మలాటలు వారితో సహా ప్రతీ కళాకారుడు

ఈ వినాయకచవితి పేరుచెప్పకుని తనకుటుంబంతో కలసి

తృప్తిగా భోంచేసేది ఈ డబ్బులతోనే.


ఆఖరికి కూలిపనికి వెళ్లేవారు కూడా

నాలుగు పందిర్లకు స్తంభాలు తవ్వే పనికో, 

షెడ్ లకు రాడ్ లు ఎత్తే పనికో,

పైన ఆకులు వేసే రేకులు వేసే పనికో, పోతే 

నాలుగు డబ్బులొస్తాయని ఎదురుచూసేది

కూడా ఈవినాయకచవితి కోసమే.

 


నవతరానికి సనాతన సంప్రదాయం పరిచయం అయ్యేది కూడా వినాయక మంటపల నుంచే అంటే అతిశయోక్తి కాదు.


ముఖ్యంగా ఆనాడు జాతీయోద్యమం కోసం , ప్రజలలో ఐకమత్యం తీసుకురావటానికి బాలగంగాధర్ తిలక్ గారు ప్రవేశ పెట్టిన నవరాత్రులు నేడు దేశానికి ఇంత మందికి ఉపాధి కల్పిస్తున్నాయి అంటే మాకు చాలా గర్వంగా ఉంది. 


నేడు సొంత ప్రభుత్వాలు ఉన్నా గణేశ నవరాత్రులు కు అనుమతులు తీసుకోవటం అంటే ఆత్మ గౌరవం కల్పించలేని లేని రాజ్యం లో ఉన్నామనే భావన కలుగుతుంది.


 ఆర్థిక మాంద్యం బారిన వివిధ దేశాలు పడుతుంటే 

మనంమాత్రం ఎందుకు ఇలా ధీమాగా ఉన్నామో 

ఎప్పటికీ ఈ సోకాల్డ్ మేధావులకు అర్ధంకాదు.

మన సనాతన సాంప్రదాయాల మాటున ఉన్న

లోకహితమైన లోతైన రహస్యాలు వీరికి ఎన్నటికీ అర్థం కావు.

 

ప్రతి పండగ మనకు ఒక్కో మేలును కల్గిస్తు 

ఒక్కో కులానికి ఏడాది పొడుగునా ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. 

ప్రతి ఒక్క కులమూ గొప్పదే .. 

ఏ కులం లేకుండా మరొక కొలం మనుగడ సాగించలేదు. 

గమనిక:- కులం అంటే వృత్తి. 


మా భక్తి చాటున వ్యావహారిక, సాంస్కృతిక, సనాతన సంప్రదాయాలు, వాటి వలన సమభావం, తద్వారా వసుధైక కుటుంబం 

అనే సిద్దాంతం దాగి ఉంది.


అర్థం కాని వారుఒక ఏడాది పాటు వెయిట్ చేసి,

 ఒకే ఒక్క పండగ జరుపుకుంటూ

 ఆర్థిక మాంద్యం బారిన పడే వివిధ దేశాల 

ఆర్థిక విధానాల మీద పరిశోధన చేసి చూస్తే 

ఇక వారు మా పండగల జోలికి రారు. 


చివరిగా ఒకమాట....


మాపండగలలో ధనం ధర్మ భద్దంగా 

చందాల రూపం లో సేకరించి 

అందరికీ పంచ బడుతుంది.


మాకు దోపిడీ చేసి ధనాన్ని పంచే రాబిన్ హుడ్ ల అవసరం పడదు! 

కానుకలు పంచే తాతయ్యల అవసరం లేదు. 

మాకు మేము పని కల్పించుకుని 

సమాజాన్ని బతికించుకుని నిలబెట్టుకునే ధర్మంమాది.


జై భారతం జైజై హైందవం```.

పాండవోద్యోగపర్వము నుండి

 ఈ పద్యాలు విననివాడు గొంతెత్తిపాడని తెలుగువాడు లేడంటే అతియోశక్తే కదా!

.......................................................


పాండవోద్యోగపర్వము నుండి..

గ్రంథకర్తలు.. తిక్కనసోమయాజి మహకవికి సమవుజ్జీలైన మహానుభావులు *కీ.శే. తిరుపతి వెంకటకవులు*. 


తాత్పర్యం > పద్యాలు సులభగ్రాహ్యం కాబట్టి అక్కరలేదనుకొంటాను.


(1) *బావా ఎప్పుడు వచ్చితీవు ఎల్లరునున్ సుఖులె భ్రాతల్* *సుతుల్ చుట్టముల్*

*నీవాలభ్యమున్ పట్టు కర్ణుడును* *మన్నీలున్ సుఖోపేతులే*

*నీ వంశోన్నతి కోరు భీష్ముడును,నీమేల్కోరుద్రోణాదిభూ*

*దేవుల్ సేమంబై మెసంగుదురే నీతేజమంబుహెచ్చిమంచున్*


(2) *ఎక్కడనుండి రాక యిటకు ఎల్లరునున్ సుఖులే కదాయశో*

*భాక్కులునీదు*

 *అన్నలునుభవ్యమనస్కులు నీదు తమ్ములును*

*చక్కగనున్నవారే భుజశాలి* *వృకోదరుదుఁడగ్రజాజ్ఞకున్*

*చక్కగ నిల్చి శాంతుగతి చరించునె తెల్పునమర్జునా*


(3) *చెల్లియొ చెల్లకో, తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్*

*తొల్లి, గతించె, నేడు నను దూతగ*బంపిరి సంధిసేయ నీ*

*పిల్లలు పాపలున్ బ్రజలు బెంపువహింపగ సంధి సేసెదో*

*ఎల్లి రణంబెగూర్చెదవొ ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా!*


 (4) *జెండా పై కపిరాజు ముందు శిత వాజి శ్రేణియుం పూంచి*

*నేదండంబును గొని తోలు సెందనము మీదన*

*నారి గాండీవము ధరించి ఫల్ఘునుడు*

*మూకన్ చెండు చున్నప్పుడు*

*ఒక్కండును నీ మొర ఆలకింపడు*

*కురుక్షామనాధ సంధింపగన్*


(చేతివ్రాత)

................................................................................................జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

ఒంటె కోసం వేచి ఉండండి.

 *ఒక అరబ్ ముస్లిం లండన్‌లో సిటీ బస్సు ఎక్కాడు..*


బస్సు డ్రైవర్‌ని రేడియో పాశ్చాత్య సంగీతాన్ని ఆపండి అని అభ్యర్థించాడు..


 బస్సు డ్రైవర్ కారణం అడిగినప్పుడు, అరబ్ ముస్లిం ఇలా చెప్పాడు:

"ఇస్లాం ప్రకారం 

ప్రియమైన ప్రవక్త కాలంలో సంగీతం వినడం హరామ్

సంగీతం లేదు.." అని చెప్పాడు.

బస్సు డ్రైవర్ మర్యాదగా

రేడియోను ఆపేసి ,

బస్సు ఆపి తలుపు తెరిచాడు అరబ్ ముస్లిం ని 

దిగమని అభ్యర్థించారు.

అరబ్ ముస్లింలు దీనికి కారణం అడిగాడు. బస్సు డ్రైవర్

 వినయంగా సమాధానమిచ్చాడు: "ఓ అరబ్ సోదరా

 మీ ప్రవక్త కాలంలో టాక్సీ లేదు,

 బస్సు లేదు, బాంబులు లేవు,

 విమానాలు హైజాక్ చేయడం లేదు,

 మసీదులో ధ్వనించే లౌడ్ స్పీకర్‌లు లేవు, ఆత్మాహుతి దాడులు లేవు, RDX లేదు, ఏకే 47 లేదు, ప్రతిచోటా

 శాంతి మాత్రమే ఉంది.. కాబట్టి నిశ్శబ్దంగా దిగండి మరియు

గమ్యాన్ని చేరుకోవడానికి ఒంటె కోసం వేచి ఉండండి..

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*చిరు బోధ!..*


శ్రీ దత్తాత్రేయ స్వామి వారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందాలని నిర్ణయం తీసుకునే ముందు తాము సజీవ సమాధి చెందాలని అభిలషించారు.. తనను సజీవంగా సమాధి చేయమని మా తల్లిదండ్రులైన శ్రీధరరావు, నిర్మలప్రభావతి గార్లకు, శ్రీ చక్కా కేశవులు గారికి, శ్రీ మీరాశెట్టి గారికి చాలా సార్లు చెప్పారు..వారెవరూ కూడా ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు..శ్రీ స్వామివారిని అటువంటి నిర్ణయం తీసుకోవద్దని బ్రతిమలాడారు..తామెవ్వరమూ ఆ పని తమ చేతులతో చేయలేమని ఖరాఖండిగా చెప్పేసారు..శ్రీ స్వామివారు మాత్రం.."సమయం అయిపోయింది..నేను వచ్చిన కార్యం కూడా పూర్తి అయింది..ఇక ఎక్కువ రోజులు నేను ఇక్కడ వుండటానికి లేదు..అది మీరు గ్రహించాలి.." అని చెప్పసాగారు..


ఈ సంప్రదింపులు ఇలా జరుగుతున్న సమయం లో శ్రీ స్వామివారు తమ సాధనను తీవ్రం చేశారు..కఠోర తపస్సు చేయసాగారు..ఆహారం తీసుకోవడం దాదాపుగా మానివేశారు..తరచూ వచ్చి తనను కలవొద్దని మా తల్లిదండ్రులకు చెప్పారు..ఏదైనా అవసరం కలిగితే తానే కబురు చేస్తానని కూడా చెప్పారు..శ్రీ స్వామివారు ఆహారం తీసుకున్నా..తీసుకోకపోయినా..నా చేత మాత్రం ఆహారాన్ని స్టీలు కారియర్ ద్వారా మా అమ్మగారు పంపించేవారు..ఆశ్రమం లోని వంటగది వద్ద ఆ కారియర్ ను ఉంచి నేను మా పొలానికి వెళ్ళేవాడిని..తిరిగి వచ్చేసమయానికి ఆ కారియర్ ఎక్కడ నేను పెట్టానో అక్కడే ఉండేది..వెనక్కు తీసుకొచ్చేసేవాడిని..ఒక్కొక్కసారి మాత్రం శ్రీ స్వామివారు తాను ధ్యానం నుండి లేచిన తరువాత..కారియర్ లోని ఆహారాన్ని కొద్దిగా తీసుకుని..శుభ్రంగా కడిగి పెట్టేవారు..శ్రీ స్వామివారు ఆరోజు ఆహారం స్వీకరించారు అనుకోవడానికి అదే గుర్తు నాకు..


ఒకరోజు విజయవాడ నుంచి మల్లికార్జున రావు గారని ఒక సిద్దాంతి గారిని శ్రీ చెక్కా కేశవులు గారు మొగలిచెర్ల కు పంపారు..శ్రీ మల్లికార్జున రావు గారు దేవాలయాల ప్రతిష్టలు బాగా చేస్తారని పేరు.. శ్రీ చెక్కా కేశవులు గారి ద్వారా శ్రీ స్వామివారి గురించి విని..శ్రీ స్వామివారిని చూడాలనే కుతూహలంతో..మల్లికార్జున రావు గారు మొగలిచెర్ల కు వచ్చారు..


"శ్రీ స్వామివారు తీవ్ర సాధన లో ఉన్నారనీ..ఎవ్వరినీ కలవ వద్దని చెప్పారని.." నాన్న గారు మల్లికార్జున రావు గారికి చెప్పి.."రేపుదయం మా అబ్బాయి ప్రసాద్..పొలానికి వెళుతూ..శ్రీ స్వామివారికి ఆహారం తీసుకెళ్లి ఆశ్రమం లో పెట్టి..వెళుతుంటాడు..మీరు కూడా ప్రసాద్ తో కలిసి వెళ్ళండి..మీరు మధ్యాహ్నం వరకూ అక్కడే వుండండి.. ఒకవేళ శ్రీ స్వామివారు ధ్యానం నుంచి లేచి వస్తే..మీరు వారిని కలవ వచ్చు..పూర్తిగా మీ అదృష్టం మీద ఆధారపడివుంది.." అని చెప్పారు..


"నాకు ప్రాప్తం వుంటే..స్వామివారిని చూస్తాను..లేకుంటే లేదు.." అన్నారు మల్లికార్జున రావు గారు..


ప్రక్కరోజు ఉదయాన్నే..ఎద్దుల బండి సిద్ధం చేయించారు నాన్న గారు..నేనూ మల్లికార్జున రావు గారు అందులో ఎక్కి బైలుదేరాము..మేము ఆశ్రమం చేరేసరికి..అత్యంత ఆశ్చర్యకరంగా శ్రీ స్వామివారు..ఆశ్రమం బైట వైపు నిలబడి వున్నారు..చాలా ప్రశాంతంగా..చిరునవ్వుతో నిలుచుని వున్నారు..బండి కొద్దిగా ఇవతలి వైపు ఆపుకొని..నేనూ, మల్లికార్జున రావు గారు ఇద్దరమూ శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళాము..శ్రీ స్వామివారిని చూడగానే..మల్లికార్జున రావు గారు..సాష్టాంగనమస్కారం చేశారు..శ్రీ స్వామివారు లోపలికి రమ్మన్నట్లు గా సైగ చేసి..ఆశ్రమం లోకి వెళ్లారు..మేమిద్దరమూ కూడా శ్రీ స్వామివారి వెనకాలే లోపలికి వెళ్ళాము..ధ్యానం చేసుకునే గది ముందు శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చుని..మమ్ములను కూడా కూర్చోమన్నారు..


కేశవులు గారు మల్లికార్జునరావు గారిని తమవద్దకు పంపుతున్నట్టు శ్రీ స్వామివారికి ముందే తెలుసా?..అనే నా సందేహానికి శ్రీ స్వామివారి చల్లని చిరునవ్వే సమాధానం!.


"ఏమిటి విషయాలు?..నన్ను చూద్దామని వచ్చారా?..మంచిది..కేశవులు గారు బాగున్నారా?.." అన్నారు స్వామి వారు..సందేహం లేదు..శ్రీ స్వామివారు చక్కటి అవగాహన్ తోనే ఉన్నారని నాకూ మల్లిఖార్జున రావు గారికీ అర్థమైపోయింది..శ్రీ స్వామివారు అడిగిన వాటికి మల్లికార్జున రావు గారు తలూపుతూ వున్నారు..ఒక్కమాట కూడ మాట్లాడలేదు..


"సుమారు డెబ్భైయేళ్ళ వయసు గడచిపోతోంది..ఇప్పటికైనా మీ ఇష్టదైవం పాదాలను గట్టిగా పట్టుకోండి.." అని చెప్పి..తన కుడిచేతిని మల్లికార్జునరావు గారి తల మీద పెట్టి.."దేవాలయములో విగ్రహ ప్రతిష్ఠ చేసినంత మాత్రాన దైవాన్ని చులకనగా చూడొద్దు.. జాగ్రత్త..అహంకారం వద్దు.." అన్నారు..ఎప్పుడైతే స్వామివారి హస్తం తన తలను తాకిందో..మరుక్షణమే మల్లికార్జున రావు గారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..ఆయన కళ్లలోంచి ధారగా కన్నీళ్లు వచ్చాయి.."స్వామీ..మిమ్మల్ని కలుస్తానని అనుకోలేదు..నేను చాలా దేవాలయ ప్రతిష్టలు చేసాను..ఆ విషయం లో నన్ను మించిన వాడు లేడనీ..నేను ప్రతిష్ట చేయబట్టే దైవానికి పూజలు జరుగుతున్నాయని అహంకారం ఉంది..అది తప్పని తెలిసింది..ఇకనుంచి బుద్ధిగా..దైవాన్ని భక్తి తో కొలుస్తాను.."అన్నారు..


శ్రీ స్వామివారు లేచి నిలబడి.."మంచిది..శుభం జరుగుతుంది..ఇక వెళ్ళిరండి..నాకూ ధ్యానానికి సమయం అవుతోంది..కేశవులు గారిని అడిగానని చెప్పండి.." అన్నారు..శ్రీ స్వామివారు చాలా క్లుప్తంగా చెప్పినా..మల్లికార్జునరావు గారికి అందులోని సారాంశం చక్కగా బోధపడింది..మళ్లీ శ్రీ స్వామివారికి సాష్టాంగనమస్కారం చేసుకున్నారు మల్లికార్జునరావు గారు..ఆయన కళ్ల నుంచి కన్నీళ్లు ఆగటం లేదు..


మొగలిచెర్ల లోని మా ఇంటికి తిరిగొచ్చాక..మా తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పి..తన అహంకారాన్ని వదులుకోమని స్వామివారు చెప్పారని కూడా చెప్పి..పదే పదే శ్రీ స్వామివారిని తలచుకుంటూ..విజయవాడ కు తిరిగి వెళ్లారు మల్లికార్జునరావు గారు.


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

వినాయక చవితి సందేశం - 4

 ॐ వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                  సందేశం - 4    


వినాయకుని షోడశ నామాలు


    మనం ఏ దైవాన్ని పూజించాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా, మరే ఇతర దైవ కార్యం జరుపుకుంటున్నా,     

   ముందుగా పసుపు ముద్దగా గణపతినిచేసి, ఆయనని పూజిస్తాం.    

    ఏ కార్యక్రమం చేయదలచుకున్నా, ఏ ప్రయాణం ప్రారంభించుకుంటున్నా,     

    పని నిర్విఘ్నంగా పూర్తవడానికి వినాయకుణ్ణే ప్రార్థిస్తాం.         


    ఆయనని తలచే షోడశ (16) నామాల అర్థాలు తెలుసుకొందాం.    


    ముందుగా ఆ పదహారు నామాలనీ శ్లోకాలరూపంలో, వాటిని చదివితే వచ్చే ఫలితంతో చదువుదాం.    


సుముఖశ్చైకదంతశ్చ 

కపిలో గజకర్ణకః |

లంబోదరశ్చ వికటో 

విఘ్నరాజో గణాధిపః || 1 ||

ధూమ్ర కేతుః గణాధ్యక్షో 

ఫాలచంద్రో గజాననః |

వక్రతుండ శ్శూర్పకర్ణో 

హేరంబః స్కందపూర్వజః || 2 ||

షోడశైతాని నామాని యః 

పఠేత్ శృణు యాదపి |

విద్యారంభే వివాహే చ 

ప్రవేశే నిర్గమే తథా |

సంగ్రామే సర్వ కార్యేషు 

విఘ్నస్తస్య న జాయతే || 3 ||


    ఇపుడు వాటి అర్థాలు చూద్దాం.    


1. సుముఖః - అనుగ్రహిస్తూ మనని చూస్తున్న (సు)ముఖంతో కనిపిస్తున్నవాడు,    

2. ఏకదంతః - ఒక దంతము కలవాడు,     

3. కపిలః - లేత సిందూరపు రంగు కలవాడు,        

4. గజకర్ణిక - ఏనుగు చెవులు గలవాడు,     

5. లంబోదరః - పెద్ద బొజ్జ కలవాడు,        

6. వికటః - కష్టాలనీ, పాపాలనీ తొలగించగలవాడు,     

7. విఘ్నరాజః - విఘ్నాలను అదుపుజేయగలవాడు,     

8. గణాధిపః - గణాలకి అధిపతి 

9. ధూమ(మ్ర)కేతుః - యుద్ధకాలాలలో తన రథానికి యజ్ఞధూమమే జెండాగా కలవాడు,        

10. గణాధ్యక్షః - సర్వ గణాలకీ అధ్యక్షుడు,    

11. ఫాలచంద్రః - నుదిటిమీద చంద్రరేఖ గలవాడు.        

12. గజాననః - ఏనుగు ముఖము కలవాడు,     

13. వక్రతుండః - వంకరగా పెట్టిన తన తుండము ద్వారా ఓంకారాన్ని తలపింపజేసేవాడు,        

14. శూర్పకర్ణః - చేట ఆకారంలో విశాలమైన చెవులు కలవాడు,        

15. హేరంబః - గాదెవంటి బొజ్జ కలవాడు,        

16. స్కంద పూర్వజః - కుమారస్వామికి అన్న.

    

               రామాయణం శర్మ

                    భద్రాచలం

పవిత్రం- అపవిత్రం

పవిత్రం- అపవిత్రం

 మనం మన జీవితానుభవాలల్లో రెండు విషయాలను తరచుగా చూస్తున్నాము.  అది ఒకటి పవిత్రం  రెండు అపవిత్రం   మనకు ఈ రెండు వాటి వాటి అవసరాలనుగుణంగా కావలసి ఉంటుంది.  మీరు మంచినీరు తాగటానికి ఇంట్లో నిలువ చేసుకున్నారనుకోండి అది ఒక బిందెలోనో లేక ఒక చిన్న స్టీల్ డ్రమ్ములోనో ఉంచుకొని మీకు కావలసినప్పుడు  ఒక గ్లాసులో తీసుకొని తాగుతారు అంటే ఆ నీటిని పవిత్రంగా చూసుకుంటున్నారు. .  అదే మీరు వాడుకునే నీరు అంటే స్నానాలకు మరియు పాత్రలు కడగటానికి ఇలా వివిధ పనులకు ఉపయోగించే నీరు మీరు ఒక పెద్ద డ్రమ్ములోనో లేక నీళ్లట్యాంకులోనో నిలువ చేసుకొని ఒక బక్కెటులో నింపుకొని  చెంబు లేక ఒక మగ్గుతో ఆ నీటిని తీసుకొనే వాడుకుంటారు కదా. ఇక్కడ బిందెలోని నీరు బక్కెటు లోని నీరు రెండు ఒకే చోటినుంచి తీసుకొని వచ్చినవే కానీ దేని ఉపయోగం దానికి మాత్రమే వాడతారు.  బిందెలోని నీతితో స్నానం చేయరు, అలాగే బక్కెట్లోని నీటిని తాగరు .ఇలా నీరు ఒకటే అయినా  మీరు వాడే అవసరాన్ని బట్టి వేరు వేరుగా ఉంచుతున్నారు. నిలువ చేసిన పాత్రను బట్టి ఒకచోటి నీటిని పవిత్రంగా మరొక చోటి నీటిని సాధారణంగా భావిస్తున్నారు. 

భక్తి మార్గంలో  కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మనం గుడిలో చూసే మెట్లు, గోడలు, గోపురం అన్ని రాళ్లతో కట్టినవే. అలాగే గర్భ గుడిలో ఉన్నశివలింగం కానీ విష్ణుదేముడి విగ్రహం కూడా బహుశా అదే రాతితో చేసి ఉండవచ్చు.  కానీ మనం గర్భగుడిలోని రాతినే ఎందుకు మొక్కుతాము అంటే ఆ రాయి మనం  పవిత్రంగా చూస్తాం అన్నమాట.  అజ్ఞానులు కొందరు ఇటీవల ఒక వితండ వాదం చేస్తున్నారు అదేమంటే గుడిలో మెట్లు, చాకలి బట్టలుతికే రాయి, గుడి స్తాంబాలు అన్నీ ఒకే రాతితో చేసినప్పుడు కేవలం గర్భ గుడిలోని శివలింగం, లేక విష్ణుమూర్తి విగ్రహంలోనే దేముడు ఉంటాడా అని అంటున్నారు.  అటువంటివారు తెలుసుకోవలసినది ఏమిటంటే నీవు నీ ఇంట్లో నీటిని ఏ రకంగా ఐతే రెండు విధాలుగా అంటే త్రాగే నీటిని శుభ్రంగా (పవిత్రంగా) భవిస్తూ  బిందెలో నింపూకుని వుంచుకుంటావో మరియు వాడుకునే సాధారణ నీటిని బక్కీట్లో వుంచుకుంటావో అదే విధంగా ఇక్కడ మూలవిరాట్టును పవిత్రంగాను, మిగిలిన రాళ్లను సామాన్యంగాను చుస్తున్నామన్న సత్యాన్ని తెలుసుకుంటే ఎవ్వరు విమర్శించలేరు. 

హిందూ ధర్మంలో ప్రతి విషయానికి ఒక నిబద్దత కలిగివుంది. కేవలం అజ్ఞానులు మాత్రమే విమర్శించగలరు. 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

బుధజన విధేయుడు 

సి. భార్గవ శర్మ,