16, సెప్టెంబర్ 2024, సోమవారం

ఆచార్య సద్బోధన*

 179d1.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀266.

నేటి...


              *ఆచార్య సద్బోధన*

                  ➖➖➖✍️


```

అసలైన ఆనందాన్ని చవిచూస్తే ఇక ఏ సంతోషాన్ని ఆశించము!


మనకు నిత్యజీవితంలో విషయాలలో కలిగే సంతోషం నిజమైన ఆనందంపై తేలియాడే నురుగులాంటిది. ఆ సంతోషం కోసమే మానవుడు వెంపర్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి మనలోనే ఉన్న అసలైన ఆనందాన్ని చవిచూస్తే ఇక ఏ సంతోషాన్ని ఆశించడు. 


మట్టితిని సంతోషపడే పిల్లలతో పెద్దలు తేనె నాకిస్తారు. ఒక్కసారి ఆ మధురాన్ని చవిచూసిన నాలుక ఇక మట్టి జోలికి వెళ్లకుండా ఉండటం కోసం అలాచేస్తారు.


విషయాల నుండి లభించే ఆనందం శూన్యమనే జ్ఞానం కలిగిన తర్వాత లౌకికమైన వెంపర్లాట తగ్గి తనలోని అసలైన ఆనందంకోసం అన్వేషణ ఆరంభం అవుతుంది.


ఎప్పుడైతే నిజమైన అన్వేషణ ఆరంభం అయిందో ఇక ఈ జగతి అంతా మిథ్యేనని క్రమంగా తెలుస్తుంది!✍️```

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లో చేరండి https://chat.whatsapp.com/I7L1uTDkGzkBENfxCEXerb

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు🙏

లింగరూపంలో

 ఒక్క పరమ శివుడికి మాత్రమే లింగరూపం ఉండటంలోని విశిష్టత ఏమిటి……….?


పరమేశ్వరుణ్ణి ఎప్పటి నుండి లింగరూపంలో కొలుస్తున్నారో మీకు తెలుసా



శివ లింగము అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతోంది.


#పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు. (హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).


#వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టంలో భృగుమహర్షి శివుడ్ని “నేటి నుండి నీలింగానికే కానీ నీవిగ్రహానికి పూజలుండవు” అని శపిస్తాడు. అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట.


#శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. 


#శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది.


#శివలింగము (మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠం లొ, శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా ఉంటుంది.


#శివ లింగములు – రకములు


• #స్వయం భూ లింగములు: స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.

• #దైవిక లింగములు: దేవతా ప్రతిష్టితాలు.

•# రుష్య లింగములు: ఋషి ప్రతిష్టితాలు.

• #మానుష లింగములు: ఇవి మానవ నిర్మిత లింగములు.

• #బాణ లింగములు: ఇవి నర్మదా నదీతీరాన దొరికే (తులా పరిక్షకు నెగ్గిన) బొమ్మరాళ్ళు


#పంచభూతలింగాలు


#పంచభూతాలు అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు. ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.


• #1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు – అన్నామలై

• #2. జల లింగం: జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం

• #3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు (నటరాజ)- చిదంబరం

• #4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు – కంచి

• #5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు – శ్రీకాళహస్తి


#పంచారామాలు

• #1. అమారారామము:

#అమరావతి (గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి


• #2. ద్రాక్షారామము:

#ద్రాక్షారామ (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ


• #3. కుమారారామము:

#సామర్లకోట (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి


• #4 భీమారామము:

#భీమవరము (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ


• #5. క్షీరారామము:

#పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి.


#కొన్ని విశేషాలు:


• #శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. #కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.


• #కంచి లోని శివలింగం మట్టి తో చేసినది (పృధ్వీ లింగం)

కాబట్టి లింగానికి అభిషేకము జరగదు. నూనెను మాత్రం పూస్తారు.

Panchaag

 


శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 14

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 14 వ భాగము*_ 

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


*సనందనుడు పద్మపాదుడగుట:* 


సనందనుడు ఎటువంటి శిష్యుడు? వేకువనే లేచి గొంతెత్తి గురుస్మరణ చేయడంతో సహశిష్యులు మేలుకొనేవారు. గురువనగా క్రిందటి జన్మకర్మలను నివారించి జ్ఞానవైరాగ్యాలను ప్రసాదిం చేవాడని త్రికరణ శుద్ధిగా నమ్మి గురుపాద పద్మము లను కండ్లకు అద్దుకొనే వాడు. సర్వకాల సర్వావస్థ లయందు గురువు రూపాన్ని మనసులో స్థిరంగా ఉంచుకొని గురుపాదధూళి శిరమున దాల్చెడివాడు. గురు సన్నిధానము నకు వెళ్ళినప్పుడు సాష్టాంగ వందనము ఆచరించే వాడు. గురువుల నివాసాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేవాడు. వేకువనే తన కాలకృత్య ములు నిర్వర్తించుకొని వేళ తప్ప కుండా గురువులకు తానే స్నానం చేయించే వాడు. గురుదేవుడు ఉపదేశించిన మంత్రాన్ని దీక్షగా జపించుకొంటూ గురు కార్యాలను అడగక ముందే పూర్తి చేసేవాడు. గురువు కడ స్వేచ్ఛగా సంచరించి ఎరుగడు. గురువుల శాఠీలు, కౌపీనాలు శుభ్రపరచి ఆరబెట్టేవాడు. అన్ని విధములా సద్భావంతో సత్ప్రవర్తనుడైన సనంద నుడిపై వాత్సల్యభావం కలిగి అతనికి ముమ్మారు సూత్రభాష్యం చెప్పారు శంకరస్వామి. అది చూచిన తోడి శిష్యుల మనస్సులలో అసూయా భావం మొలకెత్తింది. వాళ్ళ ప్రవర్తనలలో వస్తున్న మార్పులను కనిపెట్టి ఆ మాలిన్యాన్ని మొదటలోనే తుంచివేయాలని సమకట్టారు.


ఒకనాడు గంగాతీర సైకత స్థలులలో శిష్యులతో కలిసి విశ్రమిస్తున్నారు శంకరులు. ఇంతలో పాఠంచెప్పే వేళ అయింది. సనందనుడు అక్కడ లేడు. కార్యార్థియై గంగకు ఆవలి ఒడ్డుకు వెళ్ళాడని అందరికి తెలుసును. పాఠం మొదలు పెట్టమని వేడు కొన్నారు శిష్యులు. సనందనుడు రావాల న్నారు గురువుగారు. ఏరు దాటటానికి పడవ గాని, తెప్ప గాని లేదు, ఇప్పుడప్పుడే సనందనుడు రాడు అన్నారు శిష్యులు. అపుడు శంకరాచార్యుడు గొంతెత్తి “సనందనా! తిరిగి రా!” అని పిలిచారు. ఆ కేక సనందనుని మనస్సును కప్పిన మాయను తొలగించే కేక! వెంటనే సనందనుడు తిరుగు ముఖంపట్టి గంగలో పాదం పెట్టాడు. తన తనయుని కాపాడ నెంచిన గంగమ్మ తల్లి బిడ్డ పాదం క్రింద పెద్ద పద్మం అమర్చింది. రెండో పాదం క్రింద ఇంకొక పద్మం అమ ర్చింది. ఇట్లా అడుగడుగు నకూ పద్మాలు అమరి వాటిపై తన పాదాలు మోపి నడచి వస్తున్నాడు సనందనుడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూచిన శిష్యులు సంభ్రాంతులై తమ తప్పిదాన్ని తెలుసు కొన్నారు.


“పద్మపాదా!” అని సంబోధిస్తూ సనందనుని శంకరాచార్య స్వామి కౌగిలించుకొన్నారు. ఆ విధంగా సార్థకనామం వచ్చింది శిష్యునికి.


*వ్యాసమహర్షి రాక:*


మొదట్లో పతంజలి వ్రాసిన సూత్ర భాష్యాన్ని ఆ నాడు పొగడని ద్వైతుడు లేడు. అద్వైతులు మాత్రం వ్యాసుడు ద్వైతాన్ని ఆదరిస్తాడనుకోలేదు. ఆఖరికి పతంజలికే తన భాష్యంపై నమ్మకం కను మరుగైంది. అనుమానా స్పదాలైన భాష్యాలు అచ్చటచట కలవని వ్యాసునకు తెలుసును. శ్రీ శంకరాచార్యులు అద్వైత పరంగా సూత్రభాష్యం వ్రాశారన్న సంగతి దశదిశలా వ్యాపించడంతో కృష్ణ ద్వైపాయనుడు సంతోషించి ఆ విషయం ఏమిటో కనుగొనే ఉద్దేశంతో ప్రచ్ఛన్నరూప ధారియై వెళ్ళడానికి నిశ్చయించుకొన్నాడు. 


ఒకనాడు శ్రీ శంకరా చార్యుడు శిష్యులకు సూత్రభాష్యం చెబుతున్నారు. శిష్యుల సందేహాలను గురువు గారు తీరుస్తున్నారు. ఆ బ్రహ్మ విచారణలో నిమగ్ను లైన వారికి ఎంత ప్రొద్దెక్కిందో తెలియలేదు. అంతరిక్షంలో నున్న ఆదిత్యుడు ఈ పాఠాలను ఆసక్తిగా వినడానికి కాబోలు దగ్గరగా రావడంతో ఆ ప్రచండత కు శిష్యులు తాళలేక పోయారు. కాలాతీతం కావడంతో పాఠం ముగిద్దామనుకొనే సమయానికి ఒక ముదుసలి బ్రాహ్మణుడు వచ్చి నిలబడ్డాడు వారి ముందట. ఆయన ఆ శిష్యులను ఉద్దేశించి ఇలా అడిగాడు:


“మీరెవ్వరు? ఏ విషయం చెప్పుకుంటున్నారో వివరంగా చెబుతారా”.


అప్పుడు శిష్యులు ఆ వృద్ధ విప్రునితో "బ్రాహ్మణోత్తమా! వ్యాసవిరచితమైన బ్రహ్మ సూత్రాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు ఈ మహితాత్ములైన మా గురువుగారు చక్కని భాష్యాలు వ్రాసిన వారు. మాకు బోధిస్తున్నారు. అప్పుడు ఆ కపట విప్రుడు శంకరాచార్యుని వైపు తిరిగి ఇలా అడిగాడు:


"బుద్ధిమంతుడా! ఈ సరి ఎవ్వరూ చేయజాలని భాష్యరచన చేసావంటే మెచ్చదగినదే! అందులో ఒక సూత్రానికి ఎలాంటి భాష్యం వ్రాశావో వివరిస్తావా?”. అందుకు ముదమందిన శంకరుడు "ద్విజోత్తమా! నేను ఇవి వ్రాశానని నాకేమీ గర్వం లేదు. ఏ సూత్రానికి అర్థం కావాలని మీరు కోరుతున్నారో చెప్పండి.” అప్పుడు మొదలైంది చర్చ.


*వ్యాస శంకర వాదోపవాదములు:*


ముసలివాని రూపంలో ఉన్న వ్యాసు డడిగాడు: “యతివర్యా!

బ్రహ్మసూత్రాలలోని మూడవ అధ్యాయం లోని మొదటి సూత్రం 'తదంతరప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్త: ప్రశ్న నిరూపణాభ్యాం' దీని గురించి నీకేదైనా తెలుస్తే చెప్పు”. ఆ సూత్రాన్ని వివరించడం అంత సుళువు కాదు. తీగలాగితే డొంకంతా కదుల్తుంది కదా! అందులో భాష్యకారుని పస బయట పడుతుందని అడిగాడు వ్యాసమహర్షి. సమాధానంగా శంకరుడు:


"స్వామీ! శ్రుతిలో తెలిపినట్లు ప్రశ్నోత్తరాల వల్ల తేలిన నిగ్గు ననుసరించి జీవుడు వేరొక శరీరంలో ప్రవేశించినపుడు సూక్ష్మభూతాలను వెంటబెట్టుకొని పోవును. ఎన్నో తర్జన భర్జనలు చేసి వ్యాసుడు ఈ సూత్రాన్ని చిత్రించాడు” అని సూత్రభావం చెప్పాడు.


“అయితే స్వామీ! ఆ తర్జన భర్జన లేమిటో వివరించగలవా?” అని మరల ప్రశ్నించాడు వృద్ధ విప్రుడు. శంకరుని వివరణను వ్యాసుడు కాదనటం శంకరుడు సమర్థించు కొనడం. వ్యాసుని ప్రశ్న పరంపరలకు ఓపికగా శ్రుతి స్మృతి ప్రమాణాలతో సమర్థంగా చాక చక్యంగా విజ్ఞానాన్ని వైదుష్యాన్నీ చూపిస్తూ అపూర్వంగా సాగిన శంకరుని వివరణ శిష్యుల్ని దిగ్భ్రాంతుల్ని చేశాయి. ఆ విధంగా ఎనిమిది దినములు ధారాళంగా సాగిన వాదప్రతి వాదాలలో ఇసుమంతయినా క్రుంగ లేదు శంకరస్వామి. తన వాదాన్ని ఆ విప్రుడు వేయి విధాల ఖండిస్తున్నాడు. అన్నిటికీ తొణకక బెణకక సరియైన సప్రమాణ మయిన ఉపపత్తులు చూపిస్తున్నాడు శ్రీశంకరా చార్యస్వామి. ఈ ముసలి వాడు వ్యాసుడే అని గ్రహించాడు పద్మపాదుడు. శంకరుని చెవిలో ఆ రహస్యాన్ని ఊదాడు. అప్పుడు విప్రునితో “ఆచార్యదేవా జ్ఞానదాతా! అద్వైతమత స్థాపనా చార్యా! మీ శరీరాన్ని ఆశ్రయించు కొని ఉన్నవన్నీ లోకాలకు వెలుగు నిస్తున్నాయి. కలి మీ కడకు రానోపదు. మిమ్ములను చూస్తే విష్ణుమయంగా ఉంది. మీది విశ్వప్రేమ. విశ్వమే మీ బిడ్డ. మీ ప్రేమకు నా భాష్యరచన ఏమైనా అవరోధం కలిగించునేమో యని పరిశీలన కొరకై వచ్చి ఉంటారు. లోపాలున్న సవరించు కొంటాను. కరుణించండి. మీ నిజరూపం చూపించి నన్ను కృతార్థుణ్ణి చేయండి!” అని అర్థించారు శంకరులు.


*వ్యాస దర్శనం:*


శంకరాచార్యునితో జరిపిన వేదాంత చర్చతో వ్యాస మహర్షి ఆనందసాగరంలో మునిగి తేలాడు. శంకరుల ప్రార్థనతో నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు జలతారు పుంజాల వలె జటలు ప్రకాశిస్తుండగా. ఆ పరమ మౌనిని చూడగానే శిష్య సమేతంగా లేచి వినమ్రులై సాష్టాంగ వందనాలు అర్పించాడు శంకరస్వామి. "పుణ్యచరితా! కృష్ణద్వైపాయన మహర్షి సత్తమా! కరుణాసాగరా! వందనశతానేకములు! నా జన్మ పావనమైనది. లోక కల్యాణార్థం పెక్కు మహాకార్యాలను పరిపూర్తి చేశావు. పరాత్పరుని వేవిధాల చిత్రించి జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేసి పామరుల అజ్ఞానాన్ని తొలగించిన దివాకర స్వరూపుడవు. కలగా పులగంగా ఉన్న వేదాలను నాలుగింటిగా ఏర్పరచి వేదవ్యాసుడవని కొని యాడబడ్డావు. వేదార్థాలు సామాన్యులకు తెలిసి రావని కరుణామూర్తివై పదునెనిమిది పురాణాలు గా వ్రాశావు. దానితో తృప్తి పొందక పదునెనిమిది పర్వాల మహాభారతాన్ని అనితర సాధ్యంగా అపూర్వసంవిధానంగా మలచి మున్నెన్నడు ఎవ్వరు చేయని, చేయలేని 'పంచమ వేదము' అని ప్రణుతికెక్కిన మహా మహితమైన గ్రంథరాజాన్ని ప్రపంచానికి ప్రసాదించావు. బ్రహ్మసూత్రాలు సూత్రీక రించి జగాలకు హారతిగా ఇచ్చావు. పరాత్పరుడే ఆ సూత్రాలలో స్థిరనివాస మేర్పరచుకొన్నాడు. వాటిని నిండుగా అవగాహన పొందినవాడు జీవన్ముక్తుడే” అని పరి పరి విధాల స్తుతించి ఆసనము స్వీకరించుడని నమ్రుడై అర్థించాడు శంకరుడు. మారు పల్కక వ్యాసుడు సుఖాసీను డయ్యాడు. పిమ్మట శంకరుని వైపు తిరిగి వ్యాసుడు ఇలా అన్నాడు:


“నాయనా! శంకరా! నీవు సూత్రభాష్యం వ్రాయడమే కాక శిష్యులకూ, మునులకూ అందరికీ చక్కగా బోధిస్తున్నావు. నీ మూలంగా తత్త్వవిద్య విస్తృతంగా వ్యాపించి దేశప్రజలు తరిస్తారు.”


మరల ఈ విధంగా మాట్లాడాడు వ్యాస భగవానుడు: "శంకరా! నీకు నీవే సాటి! నీ భాష్యంలోని కొన్ని ఘట్టాలను తడిమి చూచాను. అనుమానాలకు అవకాశమివ్వ కుండా స్వప్రజ్ఞతో నీవు తెలివిగా తీర్చిదిద్దిన రీతులు అమోఘములు. శ్రీ గోవింద భగవత్పాదుడు అడుగు జాడలలో మెలగి వారి ఆజ్ఞను శిరసావహించి చేస్తున్న ఈ కృషి అద్వితీయము అలౌకికము.సాక్షాత్తు శంకరుడవే నీవు! చావు పుట్టుకలు లేకుండా చేసికొననెంచేవారికి రాచబాట నిర్మించావు గదా! బ్రహ్మతత్వాన్ని బహుళంగాను, స్థిరంగాను దేశమందు పాతుకొనేలా చేయి. అది నీ అవతార కర్తవ్యము”.


ఆ మాటలు విన్న శంకరాచార్యుడు 'తాపసోత్తమా! తమ దయ వలన నా భాష్యరచనలు పూర్తి అయినవి. దేశమందు ఉన్న దుష్టమతాలను ఖండించాను. నా జన్మ సార్థక మైంది. నా ప్రార్థన ఆలకించండి. ఈ మణికర్ణికా ఘట్టమందు నా కోసమై కొంచెము సేపు ఉండండి. మీ పవిత్ర సన్నిధానమందు ఈ శరీరాన్ని విడిచిపెట్టెదను” అని శంకరుడర్థించగా ఆ పలుకులు ములుకులు వలె తగిలిన ఆ మహాముని పరితపించి శంకరుని చూచి ఇట్లా అన్నాడు: “నాయనా! నీ కార్యభారం ఇంకా పరిపూర్తి కాలేదు. దేశంలో అపరిణత బుద్ధితో వక్రమార్గావలంబులైన అప్రబుద్ధులు ఇంకా ఉన్నారు. వారి వలన హాని ఎక్కువ జరుగుతోంది. అట్టి వారిని నీ ప్రతిభా పాట వాలతో సరియైన దారికి మళ్ళించి అద్వైత మతవ్యాప్తికి సుస్థిర సంస్థానిర్మాణం కావించ వలసిన గురుభారం నీ భుజస్కంధాల పై ఉండగా నీవు తొందర పడకు" అని బోధించి మరల అంటాడు ఆ మహాత్ముడు. 


"శంకరా! నీవు ఎనిమిది ఏళ్ల ఆయుష్షుతో పుట్టావు. నీ మహిమతో అది రెట్టింపయింది. నీకు వరమిస్తున్నాను. ఇంకా నీ పని ముగియలేదు. అందుకని నీకో మరి పదారేడుల ఆయువు ఆ పరమేశ్వరుని అనుగ్రహ పూర్వకంగా నీకు లభిస్తోంది. నీ చరిత్ర ఆచంద్రతారార్కమూ ప్రసిద్ధమగు గాక!” ఈవిధంగా దీవన ఇచ్చి అంతర్ధాన మయ్యాడు కృష్ణద్వైపాయనుడు.


*కాలడి శంకరకైలాస శంకర*

*శ్రీ శంకరాచార్య చరిత్రము*

*14 వ భాగము సమాప్తము.*    

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

సెప్టెంబర్,17, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🍁 *మంగళవారం*🍁

🌹 *సెప్టెంబర్,17, 2024*🌹

     *దృగ్గణిత పంచాంగం*                  


         *ఈనాటి పర్వం*

   *శ్రీ అనంత పద్మనాభ*  

        *చతుర్దశి వ్రతం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - శుక్లపక్షం*


*తిథి : చతుర్ధశి* ఉ 11.44 వరకు ఉపరి *పౌర్ణమి*

*వారం:మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం : శతభిషం* మ 01.53 వరకు ఉపరి *పూర్వాభాద్ర*

*యోగం  : ధృతి* ఉ 07.48 *శూల* రా 03.41 తె వరకు 

*కరణం : వణజి* ఉ 11.44 *భద్ర* రా 09.55 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.30 - 12.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  :*ఉ 07.29-08.54 & రా 03.58-05.22 తె*

అభిజిత్ కాలం  : *ప 11.37 - 12.26*


*వర్జ్యం : రా 07.31 - 08.56*

*దుర్ముహూర్తం : ఉ 08.22 - 09.11 రా 10.51 - 11.38*

*రాహు కాలం:మ 03.05 - 04.36*

గుళికకాళం : *మ 12.02 - 01.33*

యమగండం : *ఉ 08.59 - 10.30*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 05.56* 

సూర్యాస్తమయం :*సా 06.07*

*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం  :*ఉ 05.56 - 08.22*

సంగవ కాలం   :*08.22 - 10.49*

మధ్యాహ్న కాలం :*10.49 - 01.15*

అపరాహ్న కాలం: *మ 01.15 - 03.41*

*ఆబ్ధికం తిధి   : భాద్రపద పౌర్ణమి*

సాయంకాలం  :  *సా 03.41 - 06.07*

ప్రదోష కాలం   :  *సా 06.07 - 08.29*

రాత్రి కాలం : *రా 08.29 - 11.38*

నిశీధి కాలం     :*రా 11.38 - 12.25*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.21 - 05.09*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   🔱 _*శ్రీ సుబ్రహ్మణ్య*_🔱  

🌹 *ద్వాదశ నామ స్తోత్రం*🌹


*ప్రథమం షణ్ముఖం చ* *ద్వితీయం గజాననానుజం* 

*తృతీయం వల్లీవల్లభంచ* 

*చతుర్ధం క్రౌంచభేదకం* 


*పంచమం దేవసేనానీంశ్చ* *షష్ఠం తారకభంజనం* 

*సప్తమం ద్వైమాతురంచ* 

*అష్టమం జ్ఞానబోధకం* 


*నవమం భక్తవరదంచ* 

*దశమం మోక్షదాయకం* 

*ఏకాదశం శక్తిహస్తంచ* 

*ద్వాదశం అగ్నితేజసం*


🙏 *ఇతి శ్రీ సుబ్రహ్మణ్య ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం.* 🙏

**********************************

     🍁 *హనుమకృత*🍁   

      *సీతారామ స్తోత్రం..!!*


పుత్రం దశరథస్యాద్యం 

పుత్రీం జనకభూపతేః |

వశిష్ఠానుమతాచారం  

శతానందమతానుగామ్ 


కౌసల్యాగర్భసంభూతం  

వేదిగర్భోదితాం స్వయమ్ |

పుండరీకవిశాలాక్షం  

స్ఫురదిందీవరేక్షణామ్ 

            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శ్రీభగవాన్ వామన మూర్తి

 శ్రీభగవాన్ వామన మూర్తి


బలిదనుజుని మదమణచగ

పలుయమరుల మొరలు వినియు బాలక వటుగా 

యిలమూడడుగుల నడిగియు 

పలులోకములెల్ల గొలిచె పాదము తోడన్ 


ఇంతింతగుచును విశ్వము 

సాంతంబుగ ప్రోచె జగతి సర్వేశుండై 

వింతగు రూపము దాల్చియు 

స్వాంతంబున బలిని మెచ్చి సద్గతి నిచ్చెన్ 


శ్రీకరంబైనట్టి చిరుత కూకటి తోడ 

           చిరునవ్వు లొలికించు చిన్ని వటువు

దారు కమండలు దాల్చి తా కరమందు 

          విజ్ఞాన ఖనివోలె వెల్గు వాడు 

పావన దర్భలు పట్టియు న్నొకచేత 

          నతి ప్రసన్నత నున్న యర్భకుండు 

హస్తంబు పైకెత్తి యభయంబు నిడుచుచు 

          గొడుగుతో నున్నట్టి వడుగు కుర్ర 

ఘనుడు బలిచక్రవర్తిపై కరుణ జూప 

వామనుని వోలె వచ్చియు వరము నడిగి 

విశ్వమును నిండి వెల్గిన విష్ణువునకు 

ప్రణతు లర్పించు చుంటిని భక్తితోడ


గోపాలుని మధుసూదన రావు

హైందవం

 *హైందవం వర్ధిల్లాలి 2*




మానవ జీవన వ్యవస్థ ఎప్పుడు శిల లాగా మార్పు లేకుండా చైతన్య రహితంగా ఉండే వ్యవహారం కాదు, నదీనదముల లాగా చైతన్య స్థితిగల మహా స్రవంతి, ఒప్పుకొనవలసిన సత్యమిది. ఈ ప్రవాహంలో కూడా భద్రత, అభివృద్ధి మరియు ఆనందములతో బాటు ఆపదలు గూడా పొంచి ఉండడం సంభవమే. ఈ ప్రవాహంలో జీవన సరళి ననుసరించి స్వదేశంలోని వివిధ ప్రాంతాలు మరియు వివిధ దేశాలను సందర్శించు లేదా ఆ ప్రాంతాలలో స్థిరపడు అవకాశాలు గూడా మెండు. *ఎక్కడ ఉన్నా తమ తమ ధర్మాలు, శాస్త్రాలు, సంప్రదాయాల ప్రకారం జీవన మనుగడ సాగిస్తూ అభివృద్ధి మార్గంలో పయనించేవారు వివేకులు*. మరియొక వింత మరియు విడ్డూరమైన స్వభావ జనులను ప్రపంచం గమనిస్తున్నది. అనాదిగా సనాతన మరియు ఆర్య, ఆర్ష ధర్మాలతో కూడుకొని ఉన్న భారత దేశంలో జన్మించి, వారసత్వము పొంది ఉన్న కొందరు, తమకు మాలిన విదేశీ పోకడలు అనగా పాశ్చాత్య ధోరణుల ననుసరిస్తున్నారు. వారు తాత్కాలిక సుఖం, భోగాలు పొందగలరేమో గాని అది శాశ్వతం కాదు. ఇట్టి ప్రభావం ఆధునిక విద్యాధికులు మరియు వాణిజ్య వర్గాలలో ఎక్కువగా దృశ్యమగుచున్నది. వేర్వేరు ప్రాంతాల్లో, దేశాలలో నివసించినా తమ తమ ధర్మాలకు, సంప్రదాయాలకు, ఆచారాలకు కట్టుబడి ఉన్నవారు మరింత ఆత్మనిబ్బరంతో శాశ్వత సుఖ శాంతులు పొందుతున్నారన్న విషయం వాస్తవం. *ఎవరు ఎక్కడ ఉన్నా తమ హైందవ ఆచారాలను, ధర్మాలను మరియు సంప్రదాయాలను వదులుకోను అవసరంలేదు*. 


ధనం పెరిగినా కొద్దీ మదం పెరుగుతుందంటారు. ఈ మధ్య కాలంలో ఇది వాస్తవ రూపందాలుస్తుంది. పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడిన అధికులు స్వధర్మాన్ని విమర్శించటం, ఎదిరించడం, విభేదాలతో నిర్వచించడం. ఈ లాంటి ధోరణులు *నాగరికత పేరుతో , చదువుకున్న వారమనే విర్రవీగుతూ సనాతన ధర్మం పాత చింతకాయ పచ్చడి అంటూ, మూఢాచారమంటూ, వెకిలిగా నవ్వుతూ హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం* అధికమగుచున్నవి. 


ఇంకా కొంతమంది అన్యమత అనురక్తులు, నాస్తిక వాదులు Tv లాంటి ప్రజాభిమాన మాధ్యమాలలో హైందవ ధర్మం, సంప్రదాయం, ఆచారాలు, పండుగలు, పర్వదినాలపై పండిత చర్చలు నిర్వహించి, ఎప్పుడైనా భిన్నాభిప్రాయాలు ప్రకటితమైనప్పుడు, గేలి పూర్వక వ్యాఖ్యానాలు చేయడం, హైందవాన్ని కించపర్చడం అలవాటుగా మారుతున్నది, జరుగుచున్నది. మరికొందరు బహిరంగంగా హిందూ దేవీ దేవతలపై కుత్స్తిత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇటువంటి హిందూ ధర్మ, సంప్రదాయ ద్రోహులను ఉపేక్షించరాదు, సంఘటితంగా ఇటువంటి ద్రోహులను నిరోధించాలి, అవసరమవుతే చట్టం ద్వారా గుణపాఠం నేర్పాలి, శిక్షించాలి. *కావున హిందూ ధర్మానికి, సంస్కృతికి ఉపిరులుదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి, పునర్వైభవం తేవాలి*.


*వేదాలు, ఉపనిషత్తులలోని అంతులేని జ్ఞాన విజ్ఞానం పునాదిగా ఏర్పడినదే హైందవ ధర్మం మరియు సార్వజనీన సుఖశాంతులకు ఆరోగ్యదాయానికి పునాదిగా హిందూ ధర్మం ఫరిఢవిల్లినట్లు చెప్పబడినది*. హైందవ ధర్మం దేవుడు *ఒక్కడే* అను సిద్ధాంతం ఆధారంగా ఆవిర్భవించలేదు. హిందు ధర్మాన్ని అనుసరించేవారు ప్రకృతిలో ఎవరినైనా అనగా రాళ్ళు, చెట్లు, వృక్షములు, జంతు (గో మాత, నందీశ్వరుడు ఇత్యాది), పక్షి (నెమలి, హంస) ఇతర చరములు (నాగ సంబంధ), జలం, అగ్ని వంటి వాటిని స్వేచ్చగా పూజించవచ్చు, ఆరాధించవచ్చు. మరియొక మాట ఒకే దేవుడు, ఒకే చిహ్నం, పూజలకై ఒకే స్థలమన్నది హిందు ధర్మంలో లేదు. *సత్ సంప్రదాయము, ఉత్తమ ఆచరణ ఆధారంగా రూపొందించబడినది హిందూ ధర్మము*. ఇంతటి విశిష్టమైన హైందవ ధర్మంపై ధారావాహిక రచనకు పూనుకోవడం నా స్థాయికి మించిన ప్రయత్నంగా (కృత్యంగా) భావిస్తున్నాను. అవుతే *సాధనాత్ సాధ్యతే సర్వం* అని నమ్మినవాణ్ణి, కావున ప్రయత్నం చేస్తున్నాను.

 

*మాన్యులకు విజ్ఞప్తి*

ఈ రచనలలో అన్యమైన, అసంగతమైన, అప్రస్తుత, అనంగీకార, సత్య దూర ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు. తగు ప్రమాణములు జతపర్చిన చదువరులకు మరింత జ్ఞాన దాయకంగా ఉండగలదు.


ధన్యవాదములు.

*(సశేషం)*

గణేశుని అష్టక్షేత్రాలలోని మూర్తులను

 


శ్రీభారత్ వీక్షకులకు గణపతి నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు 🌹 ఎంతో ఘనంగా జరిగిన నవరాత్రుల చరమాంకానికి వచ్చాం. అలాగే శ్రీభారత్ గణపతి కథా నవరాత్రులకూ చరమాంకమే.  గణేశుని అష్టక్షేత్రాలలోని మూర్తులను, వాటి వెనుక గల పౌరాణిక విశేషాలను, వినాయక మహిమలను ఈ నవరాత్రులలో ఎంతో చక్కగా వీక్షకులకు అందించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. ఈ ఎపిసోడ్ లో త్రిపురాసుర సంహారం ఎలా జరిగిందో, పుణే సమీపం లోని రంజన్ గాం లో శ్రీమహాగణపతి ఎలా ఆవిర్భవించాడో వివరించారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కొమ్మలో ఒక రెమ్మకి కాచిన జామకాయల

 



ఒక జామచెట్టుకి 🌳 ఒక కొమ్మలో ఒక రెమ్మకి కాచిన జామకాయల లో ఒకటి ముందే పండిపోయినది అలాగే ఈ లోకంలో ఒకరు ముందే విజయం సాధిస్తారు, ఒకరు ముందే ధనవంతులు అవుతారు, ఒకరు ముందే స్వర్గస్తులు అవుతారు . విజయానికి సంతోషపడుతాం, ధనవంతులు అయితే ధైర్యంగానో, గర్వంగానో ఉంటాం, స్వర్గస్తులయితే వారు మనల్ని విడిచిపోయేనదానికి బాధపడతాం. ఇక్కడ గమనించవలసింది పచ్చిజామ పండు ఎల్లప్పుడూ ఎప్పటికీ పచ్చిగానే ఉండదు దాని సమయం వస్తే అది కుడా పండిపోవలసిందే, రాలిపోవలసినదే, కుళ్లి పోవలసిందే . ఒకవేళ రామచిలకలు🦜 తింటే చిలకకొట్టుడు జామపండు అవుతుంది(వ్యక్తిత్వం బాగుండాలి). దేవుడికి🛕 నైవేద్యం పెడితే ప్రసాదంగాను మారుతుంది (సత్కర్మలు చేయాలి). అంతా ⏰కాలమహిమ(సత్కర్మల వలన సౌఖ్యం, పాప కర్మల వలన దుఃఖం)🙏

మహాభారత సారాంశం*

 *లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం*


పది వాక్యాలలో..

   

1. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి,మీ ఆధీనంలోంచి దూరం అవుతారు..వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు. 

ఉదా: *"కౌరవులు."*


2. నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ.. ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. వాటిని *"అధర్మం కోసం వినియోగిస్తే"*.. అవి నిరుపయోగమవుతాయి. నువ్వు కూడ వినాశనం అవుతావు.

ఉదా: *కర్ణుడు* 


3. యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే *వినాశం* జరుగుతుంది.

ఉదా:*అశ్వత్థామ.*


4.పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.

*ఉదా: " భీష్ముడు."*


5. సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము *దురహంకారం* తో *అధర్మంగా* వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికి *వినాశం* జరుగుతుంది.

ఉదా: *"దుర్యోధనుడు "*


6. స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా *తనవారి పట్ల వల్లమాలిన అభిమానం* గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.

ఉదా: *ధృతరాష్ట్రుడు* 


 7. *శక్తి యుక్తులకి, తెలివితేటలకి ధర్మం* తోడైతే *విజయం* తప్పక లభిస్తుంది.

ఉదా: *అర్జునుడు.*


8. ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం.

ఉదా: *శకుని*


9. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు, నీ వాళ్ళకి హానిచేయదు.

ఉదా : *యుధిష్ఠిరుడు*


10. అందరి బంధువైనా.. అన్ని తెలిసినా, చివరకి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్యధర్మం కూడా.

ఉదా : *శ్రీకృష్ణుడు*


కోటి కథల, లక్షల వ్యధల, వేల ఉప కథల, 100 మంది శత్రువుల, 5గురు మిత్రుల (అందరు సోదరులే)..

నాలుగు ధర్మాల సారాంశము భారతం.

📖🙏

ఎక్కువ బాధ పడకు.

 🙏🕉️శ్రీ మాత్రే నమః శుభోదయం🕉️🙏 🔥జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధ పడకు.. ఎందుకంటే!! చెట్టు ఆకులు రాలిన ప్రతీ సారి అంతకు రెట్టింప్పు ఆకులతో చిగురిస్తుంది.. జీవితం కుడా అంతే!!🔥జీవితంలో ఆరాటపడితే సరిపోదు..పోరాడితేనే కోరుకున్నది దక్కుతుంది..ఆరాటంలో ఆశ మాత్రమే ఉంటుంది..కానీ పోరాటంలో ప్రయత్నం ఉంటుంది..ప్రయత్నం ఎప్పటికి ఓడిపోదు🔥క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే వ్యక్తి విజయం సాధించడానికి 100/ అవకాశాలు ఉంటాయి.. క్రమశిక్షణ లేని సోమరి వ్యక్తి ఎంత అర్హత కలిగి ఉన్నా జీవితంలో గోరంగా విఫలమవుతాడు..అడవిలో సింహానికి అయినా ఆహారం నోటి దగ్గరకు రాదు..అడవి అంతా తిరిగి వేటాడవలసిందే..మన మైనా అంతే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఏదాగాలంటే కష్ట పడవలసిందే..మరో మార్గం లేదు🔥🔥 అల్లం రాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3గోకవరం బస్టాండ్ దగ్గర. స్టేట్ బ్యాంక్ ఎదురుగా .రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం 🙏🙏🙏

శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

 శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన

పాదారవిందశతకం

🙏🌸🙏🙏🙏🌸🙏

శ్లోకము:-

సుపర్వస్త్రీ లోలాలక పరిచితం షట్పదచితైః

స్ఫుర ల్లాక్షారాగం తరుణతరణిజ్యోతి రరుణైః |

భృతం కాంత్యంభోభిః విసృమరమరందైః సరసిజైః

విధత్తే కామాక్ష్యాఃచరణయుగలం బంధుపదవీమ్ ||9||

 

భావము:

దేవతాస్త్రీలు దేవీచరణ కమలాలపై తలవంచి మొక్కగా, వారి ముంగురులు తుమ్మెదల్లా వ్యాపించాయి. దేవీచరణాలకు అలంకరించిన పారాణి ఎరుపెక్కిన బాల సూర్యప్రభను వెదజల్లుచున్నది.చరణాల కాంతి ప్రవాహము కమలాల నుండి ప్రవహిస్తున్న తేనెలా ఉంది. ఇలా చరణాలకు కమలాలకు అన్నివిదాలా చుట్టరికం సరిపోయింది.

*********************************

అమ్మవారి పాదాల, పాదోదక వైభవవివరణలో భాగంగా శ్రీ శంకర విరచిత *సౌందర్యలహరి* నుండి మరొక శ్లోక వివరణ క్లుప్తంగా.....

 

కదా కాలే మాతః - కథయ కలితాలక్తకరసం

పిబేయం విద్యార్థీ - తవ చరణ నిర్ణేజనజలమ్‌|

ప్రకృత్యా మూకానా - మపి చ కవితా కారణతయా

కదా ధత్తే వాణీ - ముఖకమలతాంబూలరసతామ్‌||

 

భావము:

అమ్మా ! నీ పాదములు ఎర్రగా అందముగా ఉండుట కొరకు నీ అరికాలికి పూతగా ఎర్రని లత్తుక రసము పూయబడి ఉండును. నీ పాదములు కడిగినప్పుడు ఆ పాద్యోదకము నీ అరికాలి లత్తుక రసముతో కూడి ఎర్రగా శోభిల్లును.అటువంటి నీ పాదోదకము స్వీకరించినంత మాత్రాన, జన్మతః చెవిటివారుగా పుట్టిన వారు సైతం చక్కగా వినగలుగుతున్నారు.పుట్టు మూగవారు సైతం మాట్లాడగలుగుతున్నారు. అంతేకాదు మహా కవీశ్వరులు కాగలుగుతున్నారు.ఇన్ని అద్భుతాలకు హేతువైన, మహామహిమ కలిగిన, శారదా ముఖస్థ తాంబూలరసం వంటి, నీ ఎర్రని లాక్షావర్ణ లత్తుకారస మిళితమైన, నీ పాదోదకాన్ని బ్రహ్మవిద్యకై ( బ్రహ్మ జ్ఞానం) అర్రులు చాచు విద్యార్థినైన నేను నా మరణకాలం లోపులో ఎప్పటికి గ్రోలి ఈ మాయా మోహాంధకారాన్ని విడచి బ్రహ్మజ్ఞానాన్ని పొందగలనో కనీసం ఆ సమయమన్నా తెలుపరాదా తల్లీ.

{ ఇచట అమ్మ పాదోదక మహిమ వర్ణించబడినది. దీని ముందు శ్లోకంలో అమ్మే మహా మాయా స్వరూపిణిగా ఈ జగత్తును మాయలో పరిభ్రమింపచేయుచున్నదని చెప్పబడినది.మరి ఆ మాయనుండి బయట పడాలంటే అమ్మ పాదాలే శరణ్యం. అమ్మ పాదోదకం మాత్రమే ఈ మాయనించి బయట పడవేసి, బ్రహ్మవిద్యను ఉపాసించేలాగున చేసి, బ్రహ్మజ్ఞానాన్ని పెంపొందింపచేసి, ఈ మోహాందకారం నుండి బయటపడేలా చేయగలిగినది.అది మన ఉపాసనతోనో మన భక్తితోనో మాత్రమే దాన్ని సాధించలేము.అమ్మ అనుగ్రహంతో మాత్రమే అది సాధ్యం. అందుకే అమ్మా ఆ క్షణం ఎప్పుడమ్మా అని అమ్మను వేడుకోవడం}

 

🔱 ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱                                                                                                                                                                                             🙏🌸🌸🌸🌸🌸🙏

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

 ♦️ *మోక్షగుండం విశ్వేశ్వరయ్య*♦️



*బాల్యం, విద్యాభ్యాసం* 


*మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861* , సెప్టెంబరు 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలో గల చిక్కబళ్ళాపూర్ తాలూకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ అనే బ్రాహ్మణ దంపతులకి జన్మించారు. వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మూడు శతాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్ళారు. కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలిగే వారు. అతని తండ్రి సంస్కృత పండితుడు, హిందూ ధర్మశాస్త్ర పారంగతుడే కాక ఆయుర్వేద వైద్యుడు కూడా. 


విశ్వేశ్వరయ్యకు 12 సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు. చిక్కబళ్ళాపూరులో ప్రాథమిక విద్య, బెంగుళూరులో ఉన్నతవిద్య పూర్తి చేసాడు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ., తరువాత పుణె సైన్సు కాలేజి నుండి సివిలు ఇంజనీరింగులో ఉత్తీర్ణుడయ్యాడు.


పుణెలో ఇంజనీరింగు పూర్తయిన తరువాత తన 23వ యేట బొంబాయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరిన తరువాత, భారత నీటిపారుదల కమిషనులో చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది. అతను దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వచేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను అతను రూపొందించాడు. 


1903లో మొదటిసారిగా దీనిని పుణె దగ్గరి ఖడక్‌వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. దీని తరువాత గ్వాలియర్ వద్ద అల తిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు.


1906-1907 మధ్య కాలంలో అతన్ని భారత ప్రభుత్వం యెమెన్ లోని ఆడెన్ కి పంపించి అక్కడి నీటి పారుదల వ్యవస్థనూ, మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. అతను నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ మంచి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తిచేయబడింది.


హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినపుడు, ఆయనకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది.కావేరీ నది పై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆది నుంచి అంతం వరకు అతని పర్యవేక్షణలోనే జరిగింది. అప్పట్లో *కృష్ణరాజ సాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతిపెద్దది.* 


 *కర్ణాటక పితామహుడు* 


1908లో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత, మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేసాడు. క్రింద పేర్కొన్న సంస్థల ఏర్పాటులో అతను కీలక పాత్ర పోషించాడు.


1. మైసూరు సబ్బుల కార్మాగారం

2. పారాసిటాయిడ్ లేబొరేటరీ

3. విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, భద్రావతి

4. శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్

5. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం

6. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్

7. ద సెంచురీ క్లబ్

8. మైసూర్ చాంబర్ ఆఫ్ కామర్స్

9. విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్


1917లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో ముఖ్యపాత్ర వహించాడు. తరువాత ఈ కళాశాలకు అతని పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటక లోని పేరున్న విద్యా సంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా అతని పాత్ర ఉంది. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాడు. *తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు* ఏర్పాటులో కూడా అతని పాత్ర ఉంది. *హైదరాబాదులోని పత్తర్‌గట్టి నిర్మాణానికి డిజైన్* ను అందించాడు.


 *పురస్కారాలు* 


1911లో అతను కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ (companion of the order of Indian empire) గా నియమితుడయ్యాడు. 1915 లో మైసూరు దివానుగా ఉండగా అతను ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిషు ప్రభుత్వం *నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్* అనే బిరుదును ఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1955 లో భారత దేశపు అత్యున్నత పౌర పురస్కారం *భారతరత్న* ప్రధానం చేశారు.


లండన్ లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ యాభై సంవత్సరాల పాటు, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆయనకు గౌరవ సభ్యత్వాన్నిచ్చాయి. భారతదేశంలోని *ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.* 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (Indian science congress)కు అతను అధ్యక్షుడిగా వ్యవహరించాడు.


విశ్వేశ్వరయ్యకు అనేక రంగాలలో విశేషమైన గుర్తింపు లభించింది. అందులో ప్రధానమైనవి విద్యారంగం, ఇంజనీరింగ్. కర్ణాటకలోని అత్యధిక ఇంజనీరింగు కళాశాలలు అనుబంధమై ఉన్న బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ అతను పేరు మీద నెలకొల్పబడింది. ఇంకా బెంగుళూరులోని యూనివర్శిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పుణెలోని నాగపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (Nagpur college of engineering) అతని పేరు మీదుగా పిలవబడుతున్నాయి. పుణెలో అతని నిలువెత్తు విగ్రహాన్ని చూడవచ్చు.[8] అతను జన్మశతి సంవత్సరంలో బెంగుళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక ప్రదర్శనశాల నెలకొల్పబడింది


*స్మారక చిహ్నం* 


అతను స్వస్థలమైన *ముద్దెనహళ్ళి* లో విశ్వేశ్వరయ్య మెమోరియల్ ట్రస్టు వారు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇది అతను నివసించిన ఇంటి పక్కనే నెలకొల్పబడింది. ఇందులో అతను సాధించిన పతకాలు, బిరుదులు, అతను వాడిన కళ్ళద్దాలు, కప్పులు, వెబ్ స్టర్ డిక్షనరీ, అతను విజిటింగు కార్డును ముద్రించే పరికరం లాంటి వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. అంతే కాకుండా అతను రూపకల్పన చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన కృష్ణరాజ సాగర్ ఆనకట్ట నమూనాను కూడా సందర్శించవచ్చు. అక్కడి ప్రజలు దాన్ని ఓ దేవాలయంగా భావిస్తుంటారు.


*101 సంవత్సరాల వయసులో* 1962 ఏప్రిల్ 14న బెంగళూరులో ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.


🍀🍀🍀🌿👳‍♀️🌿🍀🍀🍀



*ఆయన మేధో శక్తికి ఒక ఉదాహరణ* 


*రైలు చైన్ లాగిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య*


బ్రిటిష్ వారి కాలంలో భారత్‌లో ఓసారి ఓ రైలు వెళ్తోంది. అందులో చాలామంది బ్రిటిషర్లే ఉన్నారు. వారితో పాటు ఓ భారతీయుడు కూడా కూర్చుని ప్రయాణిస్తున్నాడు.


నల్లటి చర్మరంగు కలిగి, సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. అతడిని చూసిన బ్రిటిషర్లు.. అతడో తెలివితక్కువవాడని, నిరక్షరాస్యుడని వేళాకోళం చేయసాగారు. కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు.


కానీ, ఉన్నట్లుండి లేచి నిలబడిన ఆ వ్యక్తి రైలు చైన్ లాగాడు. వేగంగా వెళ్తున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగింది. అందరూ అతడి గురించే మాట్లాడుకోసాగారు. అక్కడికొచ్చిన గార్డు.... చైన్ ఎవరు లాగారని ప్రశ్నించాడు.


'నేనే' అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. 'ఎందుకు లాగానో చెప్పనా... కొద్ది దూరంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయని నాకనిపిస్తోంది' అని ఆ వ్యక్తి చెప్పాడు.


నీకెలా తెలుసు అని గార్డు మళ్లీ ప్రశ్నించాడు.


రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు, దానితో పాటు శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు అలా అనిపించింది అని ఆ వ్యక్తి అన్నాడు.


దీంతో కొద్ది దూరం నడిచి వెళ్లి చూసిన గార్డు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రైలు పట్టాలు రెండూ దూరం దూరంగా పడి ఉన్నాయి. నట్లు, బోల్టులు దేనికవి విడిపోయి ఉన్నాయి.


ఇది విశ్వేశ్వరయ్య గారి మేధోశక్తికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే...!!


*నిఖార్సైన  నిజాయితీ* 


*అది ఒక చిన్న గ్రామం.* అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఓ *ఇంజనీరు* వచ్చి, తన పని పూర్తిచేసుకొని, రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్లాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ఇంజనీరు తన బ్యాగు నుండి రెండు కావ్వొత్తులు తీసి వెలిగించి లెక్కలు వ్రాసుకున్నాడు. తర్వాత ఆ కొవ్వొత్తులు ఆర్పి, మరో *రెండు కొవ్వొత్తులు* బ్యాగు నుండి తీసి వెలిగించి పుస్తకం చదవ సాగాడు. అది గమనిస్తున్న గ్రామ పెద్ద,


*అయ్యా! ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగులోనే ఈ పుస్తకం కూడా చదవొచ్చు కదా!* దాన్ని ఆర్పి వేరేదాన్ని ఎందుకు వెలిగించారు అని అడిగాడు.


అందుకు ఆ ఇంజనీరు, మొదట వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి. *దాని వెలుగులో ప్రభుత్వ పనులు చేశాను.* ఇప్పుడు నా ఆనందం కొరకు నా సొంత కొవ్వొత్తులు వెలిగించి చదువుతున్నాను అన్నాడు.


ప్రభుత్వ సొమ్ము కాజేయాలని చూసేవారే ఎక్కువగా ఉంటారు. కానీ ఇతనెంత నిజాయితీగా ఉన్నాడని, ఆ ఇంజనీరు వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ గ్రామ పెద్ద. ఇంతకీ *ఆ ఇంజనీరు ఎవరో తెలుసా?* 


ఇంకెవరూ.... *మోక్షగుండం విశ్వేశ్వరయ్య...*


🔸🔸🔸🔸👳‍♀️🔸🔸🔸🔸

వినాయక పూజలు*

 *వినాయక పూజలు*

💐💐💐💐💐


*కం. శక్తిగ పూజలు యంచును* *భక్తేమియులేక చేయు భజనల నెన్నో*

*వ్యక్తులనే పూజించుచు*

*యుక్తికి ప్రాధాన్యమయ్యె యువకుల యందున్*



*కం.భీకరమగు శబ్దంబులు*

*శోకంబును కలుగజేసె శోభా యాత్రల్*

*మైకుల హోరెత్తించుచు*

*షోకులుగా మారిపోయె శుభముల పూజల్*


*కం.మోజుల డీజే శబ్దము* 

*బేజారును కలుగచేసె పెద్దల యెదలో*

*పూజించిరి గణపయ్య ను*

*భోజనములకు నవరాత్రి పూర్తై పోయెన్*


*పద్య కవితా శిల్పకళానిధి* 

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* 

 *మిట్టాపల్లి*

🙏 *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏

 💎🌅  *_-|¦¦||¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు, చెల్లించెన*

*య్యుదయాస్తాచలసంధి నాజ్ఞనొకఁ డాయుష్మంతుఁడై వీరి*

*యభ్యుదయంబెవ్వరు చెప్పఁగా వినరొ? యల్పుల్మత్తులై* 

*యేల చ, చ్చెదరో రాజులమంచు నక్కటకటా! శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 38*


*తాత్పర్యము : ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! పదునాలుగు భువనములు ఏలితినని ఒక్కడు, పూర్వాద్రి నుండి పశ్చిమాద్రివరకు దీర్ఘకాలము ఏలితినని మఱొక్కడు అల్పులై నీ మహత్యమెఱుగక మరణ సమయమునందు కూడా గమనింపపరు కదా ప్రభో!*


✍️🌺🌷🌹🙏

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - వర్ష ఋతువు - భాద్రపద మాసం - శుక్ల పక్షం  - త్రయోదశి - ధనిష్ట -‌‌ ఇందు వాసరే* (16.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

గోపాలుని మురళీగానం .

 


 గోపాలుని మురళీగానం .

----------------------------------

     ప్రకృతి పరవశం!


ఉ: కానల నుండుచున్ సరస గాన వివేక విహీన జాతలై

వీనుల నేఁడు కృష్ణముఖ వేణు రవామృత ధారసోకినన్

మేనులు మేఁతలున్ మఱచి మెత్తని చూడ్కి మృగీ మృగావళుల్

మానిని ! చూడవమ్మ! బహుమానము చేసె, కృతార్ధ చిత్తలై ;


భాగ 8స్కం థం 785 ప:


బాలగోపాలుడు వేణువునూదుతుంటే ఆనాద మాధుర్యానికి ప్రకృతి యెంత పులకించి పోయిందో కిన్నర మిధునం దర్శిస్తూ  దానిని వర్ణిస్తున్నారు.

అసలు సంగీతమంటే యేమోతెలియని మృగాలు (అడవిలోజంతువులు) చేష్ఠలుడిగి తన్మయంగా చిత్రీకృత దృశ్యాలవలె నిలబడి పరవశంతో వింటున్నాయట!


మరోచిత్రం!


ఉ: తల్లుల చన్నుఁ బ్రాలు మును ద్రావు తరిన్ ,దమ కర్ణవీధులన్ 

వల్లభమైన మాధవుని వంశ రవామృత ధార చొచ్చినన్ 

ద్రుళ్ళక పాలురాఁ దివక దూఁటక మానక, కృష్ణుమీఁద దృ

గ్వల్లులు చేర్చి , నిల్చె నదె వత్సము లంగనలార!గంటిరే?


దూడలు తల్లి పొదుగు లోముట్టె దూర్చి పాలుతాగ బోతున్నాయి. ఇంతలో నల్లనయ్య మురళీరవం చెవిని సోకింది. అంతే అవి పాలుచేపేందుకు చేసేప్రయత్నం మాని యిటునటు త్రుళ్ళక మొగమును కృష్ణుని వయిపు తిప్పి వేణు రవాన్ని వింటానికి ఉత్సాహం చూపుతున్నాయట! యెంత ప్రకృతి విరుధ్ధం!


మరోవిచిత్రం!


మ: మమతన్ మోములు మీఁది కెత్తుకొని రోమంథంబు సాలించి హృ

త్కమలాగ్రంబున కృష్ణునిల్పి మురళీ గానామృత శ్రేణి క

ర్ణములన్ గ్రోలుచు మేఁత మాని గళితానందా శ్రులై చిత్రితో

పమ లై గోవులు చూచు చున్న వదిగో పద్మాక్షి ! వీక్షించి తే?


ఎంతో ప్రేమతో మోరలు పైకిలేపి హృదయకమలంలో కృష్ణుని దివ్యమంగళ విగ్రహం నెలకొలిపి మురళీగానామృతమును చెవులతో పానం చేస్తూ మేతమాని ఆనందాశ్రువులు కన్నులనుండి జాలువారగా చిత్రితోపమంగా నిలచి పోయి కృష్ణుని చూచు చున్నాయట!


మరో విచిత్రం!


మ: జగతీ జంబుల శాఖ లెక్కి మురళీ శబ్దామృత స్యందముల్ 

మిగుల్ వీనులఁ ద్రావి , వ్రేగుపడు నెమ్మిం గృష్ణరూపంబు చి

త్తగమై యుండగ నడ్డబెట్టు క్రియ నేత్రంబుల్ దగన్ మూసి యీ

ఖగముల్ సొక్కెడిఁ జూచితే మునిజనాకారంబులన్ గామినీ!!


పక్షులుగూడా పరవశములై తమలోనున్న కృష్ణుని రూపం బయటకు రాకుండా తలుపులు మూసినాయా?అనే రీతిగా కన్నులు మూసి మునులవలె మురళీగానాన్ని ఆశ్వాదిస్తున్నాయట!


నదులు సరోవరాలు తమ తరంగ హస్తాలతో పద్మములను దెచ్చి కృష్ణునకు పాదార్ఛనలు గావించేరీతిగా ఉన్నాయట! ఇదీ మురళీ గాన ప్రభావంతో అక్కడి చరాచర ప్రకృతి పరవశం!


" శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణీ! "- అన్నారు విజ్ఙులు!


కృష్ణుని మురళీ గానంలో నాదం ఉన్నది. అది సామ వేదం .విశ్వ ప్రేమవాదం .అదే కారణం ప్రకృతి మురిసిపోయి

మూగనోము పట్టటానికి. ఆఅదృష్టం అలనాడు నంద గోకులానికి దక్కింది. మన హృదయాలు కూడా పరిశుధ్ధమై ప్రేమ పూరితములై త్యాగ మయములై "ఆనందంతో నిండిన గోకులంగా (గోశబ్దానికి యింద్రియాలు అనే అర్ధంకూడా ఉంది)మారినప్పుడు ఆమురళీ గానం మనకు గూడా వినిపిస్తుందేమో? ప్రయత్నిద్దాం!

🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శివుడికి మాత్రమే లింగరూపం

 ఒక్క పరమ శివుడికి మాత్రమే లింగరూపం ఉండటంలోని విశిష్టత ఏమిటి……….?


పరమేశ్వరుణ్ణి ఎప్పటి నుండి లింగరూపంలో కొలుస్తున్నారో మీకు తెలుసా



శివ లింగము అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతోంది.


#పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు. (హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).


#వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టంలో భృగుమహర్షి శివుడ్ని “నేటి నుండి నీలింగానికే కానీ నీవిగ్రహానికి పూజలుండవు” అని శపిస్తాడు. అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట.


#శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. 


#శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది.


#శివలింగము (మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠం లొ, శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా ఉంటుంది.


#శివ లింగములు – రకములు


• #స్వయం భూ లింగములు: స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.

• #దైవిక లింగములు: దేవతా ప్రతిష్టితాలు.

•# రుష్య లింగములు: ఋషి ప్రతిష్టితాలు.

• #మానుష లింగములు: ఇవి మానవ నిర్మిత లింగములు.

• #బాణ లింగములు: ఇవి నర్మదా నదీతీరాన దొరికే (తులా పరిక్షకు నెగ్గిన) బొమ్మరాళ్ళు


#పంచభూతలింగాలు


#పంచభూతాలు అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు. ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.


• #1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు – అన్నామలై

• #2. జల లింగం: జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం

• #3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు (నటరాజ)- చిదంబరం

• #4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు – కంచి

• #5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు – శ్రీకాళహస్తి


#పంచారామాలు

• #1. అమారారామము:

#అమరావతి (గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి


• #2. ద్రాక్షారామము:

#ద్రాక్షారామ (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ


• #3. కుమారారామము:

#సామర్లకోట (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి


• #4 భీమారామము:

#భీమవరము (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ


• #5. క్షీరారామము:

#పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి.


#కొన్ని విశేషాలు:


• #శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. #కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.


• #కంచి లోని శివలింగం మట్టి తో చేసినది (పృధ్వీ లింగం)

కాబట్టి లింగానికి అభిషేకము జరగదు. నూనెను మాత్రం పూస్తారు.