24, సెప్టెంబర్ 2020, గురువారం

స్త్రీలు జుట్టు విరబోసుకొని ఎందుకు ఉండరాదు?


Sivudu:

ఈ చర్య పిశాచాలకు ఆహ్వానం వంటిది. అనేక దుష్ట గ్రహాలూ ఆ సమయంలో ఆవహించి కల్లోలపరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది. జుట్టు విరబోసుకు తిరుగుతుంటే జ్యేష్ట దేవి కూడా ఆహ్వానమే.జుట్టు విరబోసుకుని తిరగడం నేడు ఓ ఫ్యాషన్ అయిపోయింది. అయితే మన ఆచార, సాంప్రదాయాల ప్రకారం జుట్టు విరబోసుకోకూడదు. 


అసలు వెంట్రుకలు, గోళ్లు మన పాపాలకు ప్రతీకలు. అందుకే భగవంతునికి తల నీలాలిచ్చి పాప ప్రక్షాళన చేసుకుంటాం.


★స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగావచ్చా? తిరిగితే ఏమవుతుంది???


★మీరు (స్త్రీలు) తలస్నానం చేసి జుట్టుని విరబోసుకొంటున్నారా? జడని అల్లుకోకుండా జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్తున్నారా??? అయితే కింది సమాచారం తపకుండా చదవండి.


స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగావచ్చా?

స్త్రీ జుట్టు విరబోసుకొని తిరిగితే ఏమవుతుంది?

పురుషులు పొడుగ్గా పెంచుకొనే జుట్టుకి ఏ నియమమైన ఉందా?

స్త్రీలు బ్రహ్మహత్యాపాతకాన్ని పంచుకున్నందుకు ఇంద్రుడు ఇచ్చిన వరమేమిటి?

స్త్రీ దేవతలు కేశములను పూర్తిగా వదిలినట్టుగా ఫోటోలు ఉంటాయి కదా మరి వాటి సంగతి ఏమిటి?

భారతీయ మహిళల సాంప్రదాయ కేశాలంకరణలు ఏమిటి? 


తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎన్నడూ తమ యొక్క జుట్టుని విరబోసుకోకూడదు. తలంటు స్నానం చేసిన స్త్రీల యొక్క జుట్టు విరబోసుకొని ఉంటే సమస్తమైన భూత ప్రేతాది శక్తులు కేశపాశముల గుండా ప్రవేశిస్తాయి. ఎట్టి పరిస్తితులలో తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదు. స్త్రీ విరబోసుకొన్న జుట్టుతో సంచరించినచో అనేక దుష్ట గ్రహాలు ఆవహిస్థాయి


తలస్నానానంతరం జడని అల్లుకొని లేదా జుట్టు కొసలను ముడివేసుకొని పూజ/దైవదర్శనం చేయాలి. విరబోసుకొన్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్ళడంకానీ, శుభకార్యాల్లో పాల్గొనడం అశుభం. ఆవిధంగా చేసినచో, దరిద్ర దేవత ఆహ్వానించినట్లే.


దీనికి ఉదాహరణే రామాయణంలో దితి జుట్టుని విరబోసుకొని, బాగా అలసిపోవడం చేత శిరస్సు కొంచెం ముందుకి వంగి, జుట్టు పాదాలకి తగిలి సౌచం పోయి ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించి పిండాన్ని 7 ముక్కలు చేయడమే.


పురుషులు కూడా జుట్టుని పొడుగ్గా పెంచుకోవడం లేదా మహర్షులు జటలు పెంచుకొంటారు కదా? వాళ్లకు ఈ నియమం వర్తించదా?


ఈ విధంగా చాలా మంది నాస్తికులకు ఒక సందేహం కలుగుతుంది. పురుషులు/మహర్షులు పెంచుకొనే జుట్టుకు నియమంలేదు ఎందుకంటే, కేశములను విరబోసుకొనే స్త్రీలకు మాత్రమే అధికంగా కామోపభోగాన్ని ప్రేరేపించే శక్తి ఉంది. అది ఇంద్రుడు స్త్రీలకు ఇచ్చిన వరం. 


వృత్తాంతం:


ఒకనాడు బ్రహ్మజ్ఞానం కలిగిన విశ్వరూపుడు అను మహర్షి తనమన భేదాలు లేకుండా దేవతలకి ఇచ్చే హవిస్సులలో కొంతభాగం రాక్షసులకు ఇస్తున్నాడనే విషయం తెలుసుకొన్న ఇంద్రుడు యుక్తాయుక్త విచక్షణ మరచి తన చంద్రహాసంతో విశ్వరూపుని మూడు శిరస్సులను(సురాపానం, సోమపానం,అన్నం తింటున్న శిరస్సు) నరికి వేస్తాడు.


అనంతరం సురాపానం చేసే శిరస్సు ఆడాపిచుకగా మారి పోయింది, సోమపానం చేసే శిరస్సు కౌజు పక్షిగా మారిపోయింది. అన్నం తినే శిరస్సు తిత్తిరి పిట్ట(తీతువు పిట్ట)గా మారిపోయాయి. ఆ మూడు పక్షులు ఇంద్రుడు చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని సూచిస్తాయి. ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చెవ్వుల్లొ రొదగా ఉండేవి. వాటి బాధ భరించలేక బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకోవడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి, భూమికి, స్త్రీలకు, నీటికి, వృక్షాలకు తలో పావుభాగం పంచుతాడు. బ్రహ్మహత్యాపాతకం పాపం తీసుకొన్నందుకు ఆ నాలుగు జాతులకు నాలుగు వరాలు ఇచ్చాడు.భూమికి వరంగా ఇక్కడైన గోతులు తీస్తే ఆ గోతులు తమంతతాము పూడుకొనేటట్లుగా, వృక్షాలకు ఎవరైన మొదలు ఉంచి కొమ్మలు, ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతటతాము పెరిగేటట్లుగా, నీటికేమో ప్రక్షాళన గుణాన్ని, స్త్రీలకేమో కామభోగాలయందు కొద్దిపాళ్ళు ఎక్కువసుఖాన్ని ప్రసాదించాడు. బ్రహ్మహత్యపాతకం క్రింద వారు అనుభవించే బాధలు భూమి కొన్నిచోట్ల పంటలు లేకుండా ఉండడం (ఊసర క్షేత్రాలు), నీరు నురుగుతో ఉండడం, వృక్షాలు జిగురు, స్త్రీలకు ఋతుస్రావం. అందుకని కేవలం స్త్రీలకు మాత్రమే జుట్టు విరబోసుకు తిరగడం నిషిద్ధం.


స్త్రీ దేవతలు అందరూ కేశములను పూర్తిగా వదిలినట్టుగా ప్రతిమలు, ఫోటోలు, మూర్తులలో ఉన్నాయి కదా మరి వాటి సంగతి ఏమిటి?


ఏ దేవతా రూపమైన ఆది పరాశక్తి స్వరూపమే. దేవీ భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపము. సత్వ,రజో,తమో (స్త్రీ)గుణములు ఆమె యందు ఉండవు. అమ్మవారు కామారి(కామాన్ని హరించేది). కాబట్టి స్త్రీ దేవతలకు ఈ నియమం వర్తించదు.


 అందుచేత ఛాందస్సవాదులు ఇటువంటి ప్రశ్నలని కట్టిపెట్టి శాస్త్రాల్ని అనుసరించండి మంచిది.


భారతీయ మహిళల సాంప్రదాయ కేశాలంకరణలు:


జడ వేసుకొని ఆలయ దర్శనం చేయుట


సిగలో(తలలో) పుష్పములను ధరించుట


వృద్ధ మహిళలు సాంప్రదాయంగా కొప్పును వేసుకొనుట.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు-2020,

 తిరుమ‌ల‌, 2020 సెప్టెంబ‌రు 24,



స్వ‌ర్ణ‌ర‌థం బదులుగా సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ‌ మలయప్ప


         శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం బదులుగా శ్రీవారి ఆలయంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు.


       సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

అయోధ్యలో భూమి పూజ గురించి వివరణ.

 


ఇది మీకు తెలుసా?


అయోధ్య రామ జన్మ భూమి శంకుస్థాపన రోజు ఏమి జరిగింది‌? అసలు పూజ ఎవరు చేశారు?

************************

ఏ గుడికి వెళ్లినా మోడీని సతీసమేతంగా వెళ్లమనండి, తిరుమలకూ రమ్మనండి, ఏ భార్యతో వెళ్తాడు? ఇలాంటి దిగజారుడు బజారు వ్యాఖ్యలు చేసిన వారిని కాసేపు వదిలేయండి. తన లెవల్ అదే. ప్రధానిపై మంత్రి చేసే ఇలాంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి నచ్చుతున్నాయా లేదా అనేదీ వదిలేయండి. ఆ డిక్లరేషన్ వివాదమూ కాసేపు వదిలేయండి. గతంలోనూ కొన్ని విమర్శలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హిందువులు భక్తిగా వీక్షించిన అయోధ్య భూమిపూజ ఎవరైనా దంపతులతో జరగాలి గానీ, సతీరహితంగా ప్రధాని మోడీ చేయడం ఏమిటని! నిజం ఏమిటి? 


ధర్మవిరుద్ధంగా, హైందవ ఆచారవిరుద్ధంగా రామజన్మభూమి ట్రస్టు మోడీతో ఈ భూమిపూజ చేయించిందా? ఇదెక్కడి పాలకదాస్యం? అని మీకూ అనిపించిందా ఎప్పుడైనా?


కాదు, ఆ భూమిపూజలో కూర్చున్న దంపతులు వేరు. వాళ్లు సలిల్ సింఘాల్, ఆయన భార్య మధు సింఘాల్. వారితోపాటు వాళ్ల కొడుకు మయాంక్ సింఘాల్ కూడా హాజరయ్యాడు. వీళ్లెవరు? అయోధ్య ఉద్యమాన్ని మొదటి నుంచీ జాగ్రత్తగా నిర్మించిన మాజీ విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ సోదరుడు ఆయన. అయోధ్య కల సాకారం అయ్యేందుకు ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ, ఆ కుటుంబంతోనే భూమిపూజ చేయించింది రామ్ జన్మభూమి ట్రస్టు…

టీవీల్లో ఈ భూమిపూజ వీక్షించిన వాళ్ల దృష్టి ఎక్కువగా మోడీ మీద ఫోకస్ అయ్యింది. కానీ అక్కడ పూజ దగ్గర కూర్చున్నది..మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్, ప్రధాన పూజారి గంగాధర్ పాఠక్, నారద్ భట్టారాయ్, పండిట్ విశిష్టాచార్య. భూమిపూజ ఫోటోల్లోనూ సలిల్ సింఘాల్ దంపతులను చూడొచ్చు. అక్కడ ఉన్నవారిలో దంపతులు వాళ్ల ముఖ్యమైన పూజా కార్యక్రమాల్లో దంపతులు పాల్గొనడం హైందవ ఆచారం. సతీరహితులు లేదా పతీరహితులు ముఖ్య యజమానిగా పూజలో కూర్చోరు‌. ముఖ్య యజమాని అంటే Main Host. అయోధ్య వంటి ఆలయ భూమిపూజను ఆచారాలకు విరుద్ధంగా జన్మభూమి ట్రస్టు ఎలా నిర్వహించగలదు? అనేక మంది పీఠాధిపతులు, ధర్మప్రచారకులు పాల్గొన్న ఆ కార్యక్రమాన్ని ధర్మవిరుద్ధంగా ఎలా నిర్వహిస్తారు? అసలు వాస్తవం ఇదీ.


నిజానికి మెయన్ స్ట్రీమ్ మీడియా కూడా మోడీయే భూమిపూజ చేశాడన్నట్టుగా కవర్ చేసింది. ఈ కార్యక్రమానికి సలిల్ సింఘాల్, మధు సింఘాల్ దంపతుల్నే కాదు, ఆ కుటుంబం మొత్తాన్ని ఆహ్వానించింది ట్రస్టు. కరోనా కారణంగా కొందరే హాజరయ్యారు. సతీరహితంగా మోడీ ఒక్కడే భూమిపూజకు అర్హుడెలా అయ్యాడని ఎవరో అడిగితే విశ్వహిందూపరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ కోక్జే ఈ వివరాలు వెల్లడించి, ప్రధాని మోడీ ముఖ్య అతిథి మాత్రమేనని బదులిచ్చాడు. అదీ అసలు వాస్తవం.

నామస్మరణ

భగవన్నామ ప్రభావం చేత పాపాలు పటాపంచలౌతాయి అనటం లో ఎట్టి సందేహం లేదు. కానీ మనం దీని రహస్యాన్ని తెలుసుకోలేకపోవడం వలన దురుపయోగం చేస్తున్నాము. 


పాపాలను నాశనం చేసే అమోఘమైన శక్తి 

నామ మహిమకి ఉందని తెలిసి..

పాపం చేసిన తరువాత నామాన్ని జపించి 

దాన్ని కడుగుకుందాం అనుకుంటాము.

ఇలాంటి ఆలోచనలతోనే అధికంగా పాపపంకిలంలో చిక్కుకుపోతూ ఉంటాము. 


ఈ ఆలోచన వలన మన పాపాలు అధికం అవుతుంటాయి. 

నామాన్ని అడ్డుపెట్టుకుని పాపం చెయ్యడం 

అనేది నామం యొక్క పది అపరాధాలలో ఒకటి.

అదే నామాపరాధం.


నామం యొక్క పది అపరాధాలు


సన్నిందాసతి నామవైభవకధా శ్రీశేశయోర్భేదధీహి

ఆశ్రద్దాశృతిశాస్త్ర దైశికగిరాం నామ్న్యర్దవాదభ్రమః

నామాస్తీతి నిషిద్ధవ్రుత్తి విహితత్యాగౌ హి ధర్మాంతరైహి

నామ్యం నామజపే శివస్య చ హరేర్నామాపరాధా దశ..!!


1. సత్పురుష – ఈశ్వరుని భజన, 

ధ్యానం చేసేవారిని నిదించుట 


2. ఆశ్రద్ధాపరులకి నామము యొక్క మహిమని తెలియపరచటం 


3. శివ కేశవుల నామ రూపములలో భేద బుద్ధి కలిగియుండుట


4,5,6, వేదములు, శాస్త్రములు, గురువుల ద్వారా చెప్పబడిన నామ మహత్యం మీద శ్రద్ధ లేకపోవడం 


7. హరినామమందు అర్ధవాదం యొక్క భ్రమ అనగా నామ మహిమ కేవలం స్తుతి మాత్రమే అనే భావం


8, 9. నామ బలం మీద విహిత కర్మత్యాగము, నిషిద్ధమైన దానిని ఆచరించుట


10. ఇతర ధర్మాలతో నామాన్ని పోల్చటం, 

అనగా శాస్త్రవిహిత కర్మలతో నామాన్ని పోల్చటం, ఇవన్నీ శివకేశవుల నామ జపంలోని నామం యొక్క పది అపరాధాలు. 


ఈ పది అపరాధాల నుండి తమని తాము రక్షించుకోకుండా నామజపాన్ని చేసేవారు, 

నామజపం యొక్క రహస్యాన్ని తెలియని వారే.


ఏవం ప్రసన్న మనసః భగవద్భక్తి యోగతః | 

భగవత్ తత్త్వ విజ్ఞానమ్ ముక్త సంగస్య జాయతే ||


నామ జపానికి ఎవరికైనా పరిపూర్ణమైన యోగ్యత లేక పోయినా చుట్టూ నలుగురు పాడుతుంటే 

మెల్ల మెల్లగా నోరు కదిపే అవకాశం ఏర్పడి , 

మొదట ఇష్టం లేక ప్రారంభం చేసినది 

కొంతకాలం సాగగా ఇష్టంతో ప్రవర్తించేట్టు చేసి 

అది ఎంతవరకు వెళ్తుందంటే మొదట భగవంతుని నామాలు విన్నవాడికి ఆ భగవంతుని గురించి కలిగే వాస్తవిక జ్ఞానం వరకు తీసుకెళ్తుంది. 


వాక్కు ద్వారా నామజపం చెయ్యటం కంటే 

మానసిక జపం చేయటం వలన నూరు రెట్లు అధికలాభం కలుగుతుంది అని భగవానుని ఉవాచ. 


ఆ మానసిక జపం కూడా అత్యంత ప్రేమ శ్రద్ధ లతో చేసినట్లయితే అది అనంత ఫలప్రదమవుతుంది. 


అదే గుప్తము గాను, నిష్కామ భావంతోనూ చేసినట్లయితే శీఘ్రంగా పరమేశ్వర ప్రాప్తిని కలిగించేదవుతుంది. 


కాబట్టి ఈ రహస్యాన్ని చక్కగా తెలుసుకుని భగవన్నామాన్ని ఆశ్రయిద్దాము.



జై శ్రీమన్నారాయణ🙏

కొన్నిరకాల ఫలముల గుణధర్మములు

 -


 * మామిడి - 


         మంచి పౌష్టిక ఆహారం , కొంచం అరుగుటకు సమయం తీసుకొనును.


 * అంజూర -


         చాలా మంచి పౌష్టిక ఆహారం. అరుగుటకు సమయం తీసికొనును. వేసవికాలమున ప్రాతఃకాలం నందు ( సూర్యోదయమునకు పూర్వం ) ఈ ఫలమును తినుట శరీరానికి చాలా మంచిది .


 * ద్రాక్ష -


         మంచి జీర్ణకారి. రక్తమును శుద్ధి చేయును . కొవ్వు మరియు వేడిమిని శరీరం నందు వేగముగా పుట్టించును . గుండెకు మంచి మేలు చేకూర్చి గుండె చుట్టు ఉండే రక్తమునకు మంచి చేయును .


 * ఆపిల్ -


         త్వరితముగా జీర్ణం అగును. శరీరం నందు శక్తి లేనివారికి , చిన్నపిల్లలకు మేలు చేయును .


 * అరటి -


         మంచి పౌష్టిక ఆహారం , మలాన్ని శుద్ధిచేయు గుణము అధికం .


 * కిత్తిలి -


         మంచి జీర్ణకారి , రక్తాన్ని శుద్ధిచేయును .


 * సీమ రేగు -


         శ్రేష్టమైన ఆహారం , మంచి ఔషధముగా పనిచేయును . శరీరాన్ని పరిశుభ్రపరుచు శక్తి కలదు. రోగపదార్థమును బయటకి వెడలించును. వాతమును , గుండె సరిగ్గా కొట్టుకొనకుండా ఉండు సమస్యని మాన్పును.


                భోజనమునకు ముందే వీటి రసము లొపలికి తీసుకొనిన పులితేన్పులు రాకుండా చేయును . నివారణ చేయును . వీటి రసమునకి సూక్ష్మజీవులను సంహరించగల శక్తి కలదు. విష జ్వరాలకు కారణం అయిన శిలింద్రాలను ఇది సహరించగలదు.


 * బేరిపండ్లు -


        వీటిని చెక్కు తీయకుండా తినినచో విరేచనం కలిగించును. చెక్కు తీసి తినినచో బంక విరేచనాలను నివారించును. పుట్టకొక్కు విషమునకు విరుగుడుగా పనిచేయును .


 * అనాస - 


         భోజనానంతరం ఇది పుచ్చుకొనిన ఇది మిక్కిలి జీర్ణకారిగా ఉండును. గొంతుచుట్టు గ్రంధులు వలే గొలుసు మాదిరిగా ఏర్పడు రోగమును గండమాల అందురు. అలా ఏర్పడిన గ్రంధుల నుంచి రసికారుటను మాన్పుటకు ఈ ఫలము అద్భుతంగా పనిచేయును . ఈ పండ్ల రసమును మొటిమలకు మరియు పులిపిరులకు పూస్తున్న అవి హరించును .


 * బాదం -


         ఇది మానవులకు సహజ ఆహారం. వీటిని చిరుతిండిగా మధ్య ఆహారంగా ఉపయోగించవచ్చు . ఇవి అధిక బలకారులు కావున మితముగా ఉపయోగించవలెను. ఇది సమశీతోష్ణము అయినది. కొత్త కాయలలోని పప్పు శ్రేష్టమైనది. వేడిచేసి చలువచేయును. వీర్యవృద్ధి , దేహపుష్టి కలుగచేయును . మేహవాతాన్ని అణుచును . రొమ్మునకు బలమును ఇచ్చును.


               మూత్రపు సంచిలోని పుండ్లు మాన్పును . శరీరంలోని అని అవయవములను బలమును ఇచ్చును. గొంతుకను , రొమ్మును మృదువుగా చేయును . దగ్గు,లివర్ నొప్పి , క్షయ మొదలగు రోగాలని అణుచును. కిడ్నీలకు బలమును కలుగచేయును . వాతమును అణుచును. పళ్లనొప్పి , దేహము బక్కగా అవ్వు సమస్య , శిరస్సుకు సంబందించు సమస్యలను నివారించును. మాటిమాటికి వచ్చు జ్వరమును నివారించును.


          ఈ పప్పులను తినటం మొదలుపెట్టగానే శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్ళుట ప్రారంభం అగును.


 * వేరుశెనగ -


         ఈ పప్పు చాలా బలకరం . వీటిని పచ్చిగానే తినినచో మంచి బలాన్ని కలగచేయును . వీటిని తినినచో శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్ళును.


 * టెంకాయ -


         కొబ్బరి మరియు కొబ్బరి నీరు లొపలికి తీసుకోవడం వలన మంచి బలం కలిగించును. శరీరం లోని వేడిని తీసివేయును. తక్షణ శక్తిని ఇవ్వడంలో దీనిని మించినది ఏది లేదు . కేవలం టెంకాయ మాత్రమే తిని జీవించవచ్చు అని కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో రాసి ఉన్నది.


 

  గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

*🙏🏼✍🏻కొడుకుకి లేఖ✍🏻🙏🏼*


అమ్మ దీవించి వ్రాయునది.


నేను క్షేమంగానే ఇల్లు చేరాను. కోడలు ,పిల్లలు కులాసా అని తలుస్తాను.


నా అంతవాడివి నువ్వైయ్యావు,

నీ కుటుంబం నీది.

మీ ఇంట్లో మీరు మీకు నచ్చినట్లు నడచుకొంటారు. కానీ,తల్లిగా నీకు ఇష్టంవున్నా లేకపోయినా కొన్ని విషయాలు చెపుదామనుకొంటున్నాను.

నచ్చితే విను.

నచ్చకపోతే వదిలెయ్ .


పిల్లలు మట్టి ముద్దల్లాంటి వాళ్ళు. వాళ్ళని మీరు ఎలా తయారుచేస్తేవాళ్ళు అలా తయారౌతారు.


ముఖ్యంగా మీ భార్యా భర్తలిద్దరూ ఒక విషయం గ్రహించాలి.

పిల్లలెదురుగుండా మీరు ఆర్థిక విషయాలు మాట్లాడుకొని, అసహనంగా మాటలు విసురుకోరాదు. వారి ఎదురుగా, నువ్వెక్కువంటే నువ్వు తక్కువ అనుకోకూడదు.

చుట్టాల గురించీ, బంధువుల గురించీ చులకన చేసి మాట్లాడకూడదు.

అలాగే,వాళ్ళు చదువుతున్న స్కూలు గురించీ, టీచర్ల గురించీ తక్కువజేసి మాట్లాడకూడదు.


ముఖ్యంగా పిల్లలకు సరైన అవగాహన ఏర్పడే వరకు,తల్లితండ్రుల పట్ల భయం, భక్తి, ప్రేమ కలిగేలా చూడాలి కానీ,అతి చనువు ఇవ్వకూడదు. బాల్యంలో అడిగినంత డబ్బులివ్వడమంటే

వారిని మనం మన చేతులారా పాడుచేసినట్లే. పిల్లలు తల్లితండ్రులను ఎదిరించి మాట్లాడుతున్నారంటే ,వారికి మీరు అతి స్వేఛ్ఛ ఇచ్చినట్లే. పిల్లలకు చిన్నప్పటినుండే డబ్బు విలువ, మాట విలువ, మనిషి విలువ నేర్పాలి.


మీరు మీ ఖాళీ సమయంలో లాప్ టాప్ లు ముందువేసుకు కూర్చొనేముందు, నాలుగు మంచి మాటలు ,కనీసం ఒక నీతి కథైనా చెప్పాలి.


పిల్లలకు చదువు ముఖ్యమే కానీ, చదువుతో పాటుగా

లోకజ్ఞానం వుండాలి. పదిమందిలో వున్నప్పుడు ఎలా వుండాలన్నది, ఇంటికి వచ్చిన బంధువులను ఎలా గౌరవించిలన్నది

తప్పకుండా నేర్పాలి.


అతి గారాబం అనర్థదాయకం, అలాగే అతిగా శిక్షించడం కూడా అనర్థమే!

అడగగానే కొండమీద కోతైనా వస్తుంది అనే భావన పిల్లలలో కలగ కూడదు.వారి పట్ల మీకు అతి ప్రేమవుందనే విషయం వారికి తెలిస్తే, దాన్ని వారు దుర్వినియోగం చేస్తారు. మనం చూస్తూనేవున్నాం అలా పెరిగిన పిల్లలు ఎలా తయారై, తల్లితండ్రులను ఎలా బాధ పెడుతున్నదీ చూస్తునేవున్నాం.


పిల్లల సరదాలు తీర్చటం తప్పులేదు. తీర్చాలి కూడా. అలా తీర్చలేనంత మాత్రాన వారుమిమ్మల్ని నిరసన చేేసే విధంగా వారు తయారు కాకుండా పెంచే భాద్యత కూడా మీదే!


ఈ విషయాలన్నీ పెద్ద చదువులు చదువుకొన్న మీ వంటి భార్యా భర్తలకు తెలియవని కాదు కానీ ,పిల్లల విషయంలో మీ భార్యా భర్తలది ఒకేమాట అన్న విషయం మీరు మీ పిల్లలకు కలిగించలేకపోతున్నారు నేటి మీవంటి భార్యాభర్తలు. అదే యీనాడుపిల్లలు పెడమార్గం పట్టడానికి కారణమౌతోంది. నేటి పిల్లలకు ,తండ్రంటే భయం లేదు, తల్లంటే గౌరవం లేదు.

ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులు గతిలేక వచ్చినట్లు, అనవసర బర్డెన్ గానూ భావిస్తున్నారంటే ,మీరు బంధువుల పట్లా,చుట్టాలపట్లా వారికి అవగాహన కలిగించడం లేదని అర్థం.


ఇక ఆఫర్లంటూ షాపులు ప్రకటిస్తే, అవి మనకు అవసరమా కాదా అన్న ఆలోచన లేకుండా కొనెయ్యడం.వాడే టైమ్ దాటిపోయిందంటూ నిర్లక్ష్యంగా పారేయడం.బట్టలు కొనడానికైతే హద్దేలేదు. ఇలా తొడగడం,అలా పారెయ్యడం. వేలరూపాయలు పెట్టి బట్టలు కొనేటప్పుడు ,అవి ఎన్ని రోజుల వరకూ పనికొస్తాయన్నది కూడా ఆలోచించి కొనాలి. 


చినుకు చినుకు చేరితేనే చెరువులో నీరుంటుంది. లేకపోతే చెరువెండిపోతుంది. డబ్బుకూడా అంతే, రూపాయికి రూపాయి కలిపితేనే పొదుపౌతుంది. పిల్లలు పెరుగుతుంటే ముందు ముందు అధిక ఖర్చులే, రూపాయి రూపాయి కలిస్తే పాపాయెత్తు డబ్బౌతుంది అని సామెత.


మనిషికి ఉన్నది బలము, గొడ్డుకు తిన్నది బలము అంటారు. అందుకని డబ్బు విషయంలో ముందు జాగ్రత్త అవసరం. 


నేను చెప్పిన విషయాలన్నీ మీ బాగుకోసం చెప్పినవే. కోపగించుకోవని తెలుసు.

ఎదురుగానే చెప్పకపోయావా అంటావేమో? నేను ఉత్తరంలో వ్రాసినట్లు ముఖా ముఖీ చెప్పలేను. నేను చెప్పినపుడు మీరు మొఖం

చిట్లించినా నా మనసు గాయపడుతుంది. ఆపై చెప్పాలన్న విషయాలు చెప్పలేక పోవచ్చు.

అవసరమనుకొంటే కోడలికి కూడా ఈ లేఖ చూపించు. ముందులోనే చెప్పినట్లు, అవసరమనుకొంటే ఆచరించు. లేదూ, అమ్మదంతా చాదస్తం అంటే చింపి పారెయ్ .


                       వుంటాను

   

సదా నీ క్షేమం కోరే......

                           *అమ్మ*

మూకపంచశతి

🌷 **ఆర్యాశతకము** 🌷


🌹6.

**పరయాకాంచీపురయా**


**పర్వత పర్యాయపీన కుచభరయా**


**పరతంత్రావయ మనయా**


**పంకజస బ్రహ్మచారి లోచనయా౹౹**


    🌺భావం:


కాంచీపురమునే తన నగరముగాచేసుకొన్న పరాత్పరి,పర్వతశబ్ధమునకు పర్యాయపదముగా చెప్పబడుచున్న ఘన స్తనమండలము గల లోకపోషకురాలు ,కమలములకు ధీటైన కన్నులు గల శ్రీ కామాక్షీ దేవికి మేము దాసులమైయున్నాము.


🙏అంబా ! మమ్ము పాలించుటకు కాంచీనగరమున వెలసిన తల్లివి ,నీ పాదములే దిక్కనుచూ నమ్మితిని శ్రీ కంచికామాక్షీ 🙏


🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

ఆనందం


 

గత వైభవం


 

Ice

 


శ్రీమహారాజ్ఞి

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 7 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


‘’


‘శ్రీమహారాజ్ఞి’ – లలితా సహస్రనామస్తోత్రములో రెండవనామము. మహారాజు అనగా పరిపాలకుడు. అమ్మవారిని మహారాజ్ఞి అని స్త్రీ వాచకములో చెపుతున్నారు. ఆమె బ్రహ్మమై పరిపాలకురాలిగా నిర్వహణ చేస్తున్నది. ఉపనిషత్తునుండి వచ్చినమాట – ‘ఏనజాతాని జీవంతి’ – ఈ పుట్టినవి అన్నీ అమ్మవారి దయవలన బ్రతుకుతున్నాయి. పరిపాలన చేస్తున్న ఆమె మహారాజ్ఞి. మహారాజు అయినా మహారాజ్ఞి అయినా పాలితులు, పాలకులని వారికి ప్రధానమైన రెండులక్షణములు ఉంటాయి. పాలితులు అనగా పాలింపబడేవారు. పాలకులు అనగా పరిపాలించేవారు. మహారాజ్ఞి శబ్దము చేత ఒక విషయము తెలుస్తుంది. కేవలము సంక్షేమము కోసమే పరిపాలన చెయ్యరు. ప్రభుత్వముకూడా తప్పు చేసిన వాళ్ళను దండిస్తుంది - శిక్షిస్తుంది. ఆ శిక్షలు వెయ్యడములోకూడా దయతోనే ఉంటుంది. మహారాజ్ఞి అమ్మవారు ఎవరిని ఉద్ధరించాలో, ఎవరు భగవంతుని పట్ల భక్తిభావము కలిగి ఉన్నారో, ఎవరు భగవంతుడు చెప్పిన సూత్రముల ప్రకారము జీవితము గడుపుతున్నారో వారిని వృద్ధిలోకి తీసుకు వస్తుంది. మహారాజ్ఞిగా అమ్మవారు రక్షణ చేస్తుంది, శిక్షలు వేస్తుంది. చిన్నకోరికనుంచి మోక్షమనే స్థితి వరకు ఉన్న హద్దులు దాటించి ఏ హద్దులో ఉన్నవాళ్ళకి ఆ హద్దులలో ఆ స్థాయిని బట్టి కోరికలు తీర్చకలిగిన సమస్తశక్తులు కేంద్రీకృత మైన అమ్మ పరిపాలకురాలిగా కూర్చుని అనుగ్రహిస్తే శ్రీమహారాజ్ఞి. తనని తాను గుర్తెరిగి ఆత్మస్వరూపముగా నిలబడటానికి ఒక తెర అడ్డుపడుతున్నది. దానిని అమ్మవారే తీసి నిజస్వరూపముతో జ్ఞానిగా, ఆత్మరూపిగా, ఇక్కడే మోక్షము పొందడానికి కావలసిన స్థితిని, జ్ఞానమును, శక్తిని కృపచేస్తుంది. ‘జపో జల్ప శ్శిల్ప సకలమపి ముద్రావిరచనా’ - సౌందర్యలహరిలో శంకరాచార్యులవారు అంటారు. అమ్మవారి దర్శనమునకు ఎక్కడకు వెళ్ళాలి? ఆవిడ మన శరీరములోనే ఉన్నది. చెయ్యి కదిపితే అమ్మవారు కదుపుతున్నది. మాట్లాడితే అమ్మవారు మాట్లాడిస్తున్నది. ఉపాసన చేస్తున్నవారు ఇది గమనించి చెయ్యి కదిపితే వారు ముద్రలు పట్టినట్టే. తెలుసుకుని మాట్లాడితే అన్నీ అమ్మవారి స్తోత్రములే. శరీరమును ఆవహించి ముప్పదిమూడు కోట్లమంది దేవతలు ఉంటారు. వారికి శరీరమునుంచి హవిస్సు అందుతూ ఉంటుంది. శరీరము ఒక దేవాలయము దానిని పవిత్రముగా ఉంచడము నేర్పారు. అమ్మవారు శరీరములో అనేకమైన చోట్ల ఉంటుంది. బొడ్డులో చిటికిన వేలు పెట్టి పైకి బొటన వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ వంగిన కమలము ఉంటుంది. దాని మొగ్గ చివర అగ్నిహోత్రము ఉంటుంది. వడ్లగింజ పైన ఉన్నంత చిన్న మొనలో ఆ ప్రకాశము వెలుగుతూ ఉంటుంది. ఆ ప్రకాశము శరీరములో ఉన్న దేవతలందరికీ కూడా తిన్న ఆహారము పచనము చేసి యజ్ఞవేదిలోకి హవిస్సు వేసినట్లుగా పడేట్లు చేస్తుంది. అందుకే తినే ముందు స్వాహాకారము చెపుతారు. లోపల పుచ్చుకున్న పదార్ధమును చిన్న అగ్నిహోత్రములా ఉన్న అమ్మవారు జీర్ణము చేసి ప్రధానదేవతకు నైవేద్యమయిన తరవాత ఉప దేవాలయములోకి అందినట్టు మిగిలిన దేవతలకు అందేట్లుగా చేస్తుంది. ప్రధాన దేవతయిన అమ్మవారు శరీరములోనే ఉండి పరిపాలన చేస్తున్నది. ఇంద్రియములకు పుష్టి ఇస్తున్నది. 

యాదేవీ సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థితా|

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

ఆ తల్లి బుద్ధి రూపములో ఉన్నది. ఈ మాట అనవచ్చునా ! అనకూడదా ! అని ఆలోచించకుండా మాట్లాడితే కొన్ని సందర్భములలో ఉపద్రవములు కలుగుతాయి. బుద్ధిని నిశ్చయాత్మకముగా ఉంచి వృద్ధికలిగించే తల్లికి నమస్కారము.  

యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

ఆ తల్లి నిద్రరూపములో ఉండకపోతే ఎవరూ సుఖ శాంతులతో ఉండరు. నిద్రపట్టకపోతే ఆకలి వెయ్యదు. ప్రశాంతముగా ఉండరు. 

యా దేవీ సర్వభూతేషు క్షుధా రూపేణసంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

ఆహారము తీసుకోకపోతే తల్లి మనసు లేపి అన్నము తినమని ఆకలి రూపములో ఆదేశిస్తున్నది. 

యా దేవీ సర్వభూతేషు చ్ఛాయారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

మనిషికి నీడ కనపడకపోతే ఇంక ఆరునెలల్లో వెళ్లిపోతాడని గుర్తు. 

యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు తృష్ణా రూపేణసంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

మహానుభావులు మూడేసిమాట్లు మాలో ఇన్నిరూపములుగా ఉండి కదుపుతున్నది నువ్వే తల్లి అంటూ రెండుచేతులూ ఎత్తి నమస్కరిస్తున్నారు. 

  యా దేవీ సర్వభూతేషు క్షాంతి రూపేణ సంస్థితా |   

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః  

యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః   

యా దేవీ సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః   

యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః   

యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః    

యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః   

యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |

 నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః    

యా దేవీ సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థితా |     

 నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః    

 యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |   

 నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై  

యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |       

 నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః    

యా దేవీ సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః 

చండీయాగము చేస్తే ఈ మంత్రములతో అమ్మవారికి హవిస్సు ఇస్తారు. ఇవన్నీ అమ్మవారి అనుగ్రహముతో సరయిన దిశయందు ప్రచోదనము జరగాలని కోరుకుంటాము. శ్రీమహారాజ్ఞి నిరంతరము మంచివైపు కదుపుతు పరిపాలన చేస్తున్నది. ఎవరు తమకి ఉన్న శక్తిని సద్వినియోగము చెయ్యడము కోసమే పాటు పడతారో వారిని అమ్మవారు కీర్తిరూపములో ప్రకాశింపచేసి అనుగ్రహిస్తే వారు కీర్తిమంతులు అవుతారు. అహంకార పరిత్యాగము ఈ నామము బాగా ఉపయుక్తము అవుతుంది. ఏ విభూతి వలన ఏదిచేసినా, ఏ కదలికయినా ఆవిడ అనుగ్రహముతో కదిలింది. పై పట్టు అమ్మవారిదయి ఉండాలి. పట్టుకున్నప్పుడు సడలిపోకుండా లోపలిపట్టు గట్టిపడినంత కాలము పైకి ఎక్కడము జరుగుతూనే ఉంటుంది. దీనిని జాగ్రత్తగా తెలుసుకోగలగడమే శ్రీమహారాజ్ఞి అన్న నామమునకు ప్రధానమైన అర్థము. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

హిందూ దేవదాయ చట్టం 30/ 1987*



హిందూమతంపై ప్రత్యక్షంగా,పరోక్షంగా గాని దాడి చేయడం లేదా అసభ్యకరమైన పదజాలంతో మతమును కించపరిచే వారి నుండి భారత రాజ్యాంగంలో చట్టాలు చేయబడిన నియమ నిబంధనలతో అడ్డంకులను నిరోధించడం ఎలా ??


 *హిందూ దేవాదాయ చట్టము 30/1987*


 హిందూ దేవాదాయ చట్టప్రకారం హిందూ దేవాలయాల చుట్టుప్రక్కల, హిందూ నివాసగృహాల మధ్య పరిసర ప్రాంతాలలో రోడ్లపై పోస్టల్ బ్యానర్లు, మైక్ సెట్ ద్వారా ప్రార్థనల వంటి అన్యమత ప్రచారం నిషేధించడమైనది. అతిక్రమించిన వారు జి. ఓ 746,747 ప్రకారం అరెస్టయితే బెయిల్ లభ్యంకాని శిక్షలకు అర్హులవుతారు.


      30/1987 ప్రకారం దేవాలయ ఆవరణలో పాన్,సిగరేటు,ఉమ్మివేయడం వంటి ఆకృత్యాలు చేసినను హిందువులైనప్పటికీ శిక్షకు అర్హులవుతారు .మసీదు, చర్చి వంటి అన్యమత ప్రార్దన మందిరాలు నిర్మించ తలపెట్టినప్పుడు కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా పొందాలి.


 ఎక్కడైనా కలెక్టరు లేదా ఆ పరిసర ప్రాంత సబ్ ఇన్స్పెక్టర్ లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా అనుమతి పొందిన పత్రాలు లేకుండా వ్యక్తిగత ప్రసారం లేదా వాహనాల ద్వారా ప్రసారం చేసిన అటువంటి ప్రసారాలను అడ్డుకునే విషయములో గ్రామాధికారులు అధికారము కలిగి ఉంటారు. 


      హిందూ మతాన్ని దూషించడం, అసభ్యకరంగా మాట్లాడడం చేసినయెడల ipc 295 (1), ఒకవేళ హిందూ దేవుళ్లను గురించి మాట్లాడుతూ ఆ సంస్కృతి పరువు తీసిన తీసివేయుటకు వంటి విషయములను ముద్రించడం లేదా ముద్రించి విక్రయించడం చేసినయెడల ipc 501,502(2) క్రింద కేసును నమోదు చేయమని,

దేవుడి పేరు చెప్పి, మతం పేరుచెప్పి భయోత్పాతం కలిగించుట వంటి కార్యకలాపాలు చేపట్టిన ఎడల ipc 503 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని కోరడం,

 మత విశ్వాసాలను విశ్వసించక పోతే దేవుడు శపిస్తాడని లేదా అనేక కార్యకలాపాల్లో మీకు అసౌకర్యం కలుగుతుందని మిమ్మల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తే ipc 508 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని కలెక్టరు లేదా సమీప పోలీస్ స్టేషన్ అధికారులను కోరవచ్చును.


      ఈ విషయంలో అన్యమత ప్రచారం జరుగుతుందని ఫోన్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసు శాఖ వారు స్పందించని ఎడల ఫిర్యాదుదారులు నేరుగా కలెక్టర్ గారికి లిఖిత పూర్వక ఉత్తరాల ద్వారా సవివరాలతో సబ్ ఇన్స్పెక్టర్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ పై 219 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని న్యాయ సంబంధమైన విషయములు చట్ట విరుద్ధంగా వ్యవహరించి అందుకుగాను 217 సెక్షన్ ప్రకారం నేరస్తులను కాపాడే ప్రయత్నం చేసినందుకు గాను కేసు నమోదు చేయమని కోరవచ్చును.

 


*జైశ్రీరామ్ జై హింద్✊✊🚩🚩🚩

విశ్వనాథ విప్లవం!

 విశ్వనాథ విప్లవం! కృష్ణశాస్త్రి అరుణతార!


TWO RARE POEMS - TWO PURE POETS

---------------------------------------------------------------


విశ్వనాథ సత్యనారాయణ మహోన్నత కావ్యకర్త. 

సత్సాంప్రదాయంతో కలిసి నడిచిన కవి. 

అమోఘ రచనా ప్రావీణ్యానికి ఆయనొక కొండగుర్తు. 


శక్తిమంతమైన ఆ బండి ముందుకి నడవదు. 

ఆధునిక నాగరికతని సుతరామూ అంగీకరించదు. 

తిరోగమనమే పురోగమనమని 

ఎలుగెత్తి చాటుతుంది. 


వేదకాలంలోకి వెళదాం .. వెనక్కి నడవండి - అంటారు విశ్వనాథ. అలాంటి పురాతన, సనాతన కవి 'విప్లవం' అంటూ ఒక వచన గీతం రాశారు.


దేవులపల్లి కృష్ణశాస్త్రి అయితే ఏకంగా 'అరుణతార' అంటూ ఓ కవిత రాశారు. ఈ రెండు అరుదైన కవితలూ ఎవరైనా పంపగలరా? అని నేనొక వ్యాసంలో అడిగాను. కవీ, జర్నలిస్టు రావూరి ప్రసాద్ ఆ రెంటినీ నాకు వెంటనే పంపాడు. 


మరి విశ్వనాథ, శ్రీశ్రీని మహాకవి అన్న 'భారతి' వ్యాసం దొరుకుతుందా? అని అడిగాను. అదీ పంపారు రావూరి ప్రసాద్. 1977లో హైదరాబాద్ 

'ఈనాడు'లో మేమిద్దరం కలిసి పనిచేశాం. 

Thank You RAVURI PRASAD.


 విశ్వనాథలోనూ ఒక ఆధునికుడు దాగి వున్నాడు. 

కోకిలమ్మ పదాలు ఎంత షోగ్గా రాశాడో... 


'ఆంధ్రప్రశస్తి'లో కూడా ఈ మాటలు చూడండి. 

విమల కృష్ణానదీ సైకతముల యందు 

కోకిలపు పాట పిచ్చుకగూళ్లు కట్టి

నేర్చుకొన్నవి పూర్ణిమా నిశల యందు 

అక్షరజ్ఞాన మెరుగదో ఆంధ్రజాతి!


'రామాయణ కల్పవృక్షం' రాసిన విశ్వనాథతో సుతరామూ, సుతసీతా, సుత లక్ష్మణా అంగీకరించని, ఆయన చెప్పిన ఒక్క మాటనీ ఒప్పుకోని నాటిమేటి సంపాదకుడు 

నార్ల వెంకటేశ్వరరావు -

అతడు ఆంధ్రుడై పుట్టటం తెలుగువారి అదృష్టం 

ఆధునికుల వైపు రాకపోవడం మన దురదృష్టం - అన్నారు. 


శ్రీశ్రీ 'మహాప్రస్థానం'లోని 'ఆనందం అర్ణవమైతే' 

కవిత విని విశ్వనాథ పరవశించిపోయారు. 

 'ఆనందం అర్ణవమైతే

అనురాగం అంబరమైతే 

అని శ్రీశ్రీ రాస్తే.. అద్భుతమైన కవిత్వం - అని అభినందించారు. 

అంతేనా, నాటి సాహిత్య పత్రిక 'భారతి'లో 'హేతువాద యుగం' పేరిట వ్యాసం కూడా రాశారు విశ్వనాథ సత్యనారాయణ.

అది ఇలా నడిపించారాయన. 


             'హేతువాద యుగం' 


"ఆనందం అర్ణవమైతే / అనురాగం అంబరమైతే -

అనురాగపుటంచులు చూస్తాం,

ఆనందపు లోతులు తీస్తాం "


గిరి : అహో, ఏమి గీతం. ఎంత సొగసుగా ఉంది. కవిత్వాన్ని వడబోసినట్లుందే. 

ఎవరయ్యా ఈ పాట రాసింది?


హరి : ఈ పాట వ్రాసినతని పేరు శ్రీరంగం శ్రీనివాసరావు.


గిరి : ఈ క్రొత్త కవుల్లో ఇంతటి మహాకవులుంటారా?


హరి : అట్టే మాటాడితే ఈ క్రొత్త కవుల్లో ఒక్కడే మహాకవి. అతని పేరు శ్రీశ్రీ.


గిరి : అయితే శ్రీశ్రీ వంటి నవ్యకవిలో కూడా అలంకారాలుంటాయంటావా?


హరి : అయ్యో! ఉన్నదే అతని కవిత్వంలో. శబ్దాలంకారాలని ఉంటవి. ఒకదాని పేరు వృత్యనుప్రాసము. ఈ వృత్యనుప్రాసము యొక్క ప్రాబల్యమే శ్రీశ్రీ కవిత్వంలోని మొదటి సొగసు. అంత్యప్రాస కూడా ఒక శబ్దాలంకారం. అది లేకపోతే వీళ్ల నడక లేదుగా. శ్రీశ్రీ చంద్రవంకను చూచి కాళ్లు తెగిన ఒంటరి ఒంటెలాగ ఉందన్నాడు. ఇది ఉపమాలంకారం. ఎట్లాంటిది? 'మృచ్ఛకటికం' లో నీటిలో మునిగి ఏనుగు ఎత్తిన రెండు దంతముల వలె చంద్రవంక వున్నదన్నాడే 

అంత గొప్ప ఉపమానం. 


గిరి : అయితే శ్రీశ్రీ మహారథి, అతిరథుడు అన్నమాట. అతనిననుసరించిన వాళ్లెవరైనా ఉన్నారా?


హరి : అందరూ అతనిననుసరించిన వాళ్లే. 


గిరి : ఇంతకూ ఈ యుగపురుషుడెవరంటావు ?


హరి : ఎవరేమిటోయి పిచ్చివాడా. ఈ గీతం ఎవడు వ్రాశాడో వాడు. 


గిరి : ఎవడు వ్రాశాడు? 


హరి : నేను చెప్పను. గీతం విను. 


" మరో ప్రపంచం, మరో ప్రపంచం, 

మరో ప్రపంచం పిలిచింది !

పదండి ముందుకు, పదండి త్రోసుకు ! 

పోదాం పోదాం పైపైకి ! "


విశ్వనాథ సత్యనారాయణ : 'భారతి', జూన్ 1962


*** *** ***


శ్రీశ్రీ గనక మరో దేశంలో పుట్టివున్నట్లయితే, నోబెల్ ప్రైజ్ పొందివుండేవాడు - అని బందరు సాహిత్య పరిషత్ కవితా గోష్టిలో విశ్వనాథ సత్యనారాయణ అన్నారని నార్ల చిరంజీవి ఒక వ్యాసంలో రాశారు. 


అలాగే, 'కవితా ఓ కవితా'... కవిత చదివిన శ్రీశ్రీని 

ఒక సభలో విశ్వనాథ ఆనందబాష్పాలతో ఆలింగనం చేసుకున్న విషయమూ అందరికీ తెలిసిందేగా!


ఇలా హేతువాద యుగమూ, నవ్యకవితా విశ్వనాథ వారిని ఏ తెలతెలవారుజామునో పలకరించాయేమో!


'విప్లవం' అంటూ విశ్వనాథ రాసిన 

వచన కవిత ఇదే... 


విప్లవం 


హిమాలయమ్ములు 

గుహాముఖమ్ముల 

తెలియని యేవో ప్రళయరావములు ధ్వనించి 

దద్దటిల్లెడు!


భగీరథాత్మజ

సభంగ తనువై 

ఎదో తనతడి యిగురుబెట్టు నెండగొట్టి 

ఆవటిల్లెడు


ధరిత్రియంతయు 

ఎదో కలతపడి 

తన మనస్సు త్రోవలు రహదార్లు లేక 

గుడుసు వడియెడు!


ఏది చూచినా

తుపానులో 

విరిగిపోవుచున్న కెరటములై 

అటోఇటో అన్నట్లున్నది 


- విశ్వనాథ సత్యనారాయణ           

'జ్వాల' పత్రిక - 1941


*** *** ***


ఇది చూడండి... కవిసామ్రాట్ విశ్వనాథ

అసంపూర్ణ ఆత్మకథ నుంచి...


అజ్ఞానమనే ఆలోచన లేకుండుట


ఒక జీవిత రహస్యమును విచారణ చేసినచో దానిని వేదాంతమనుట మన దేశంలో పరిపాటియై పోయినది. పెరిగినాము. కొంత ధనము వచ్చినది. కొంత ధనము పోయినది. కొన్ని సుఖముల ననుభవించినాము. కొన్ని దుఃఖములు పొందినాము. ఎప్పుడునూ ధనం రావలయునన్న ఆశయే. ధనము, కీర్తి, స్త్రీ, ఆస్తి, యుద్యోగము, పలుకుబడి, మన మాట చెలామణి యగుట - యెప్పటికప్పుడు మనమే గొప్ప వారమన్నట్లు జరుగుట - ఆరోగ్యము, బంధువులు సుఖముగా నుండుట, జన్మయెత్తిన తరువాత వీనిని గురించియే యాలోచన. ఇంకొక దాని గురించి లేదు. చేయకూడదు. చేసినచో వేదాంతము. వాడొక వెర్రి వాని కింద లెక్క. 

"జాతస్య మరణం ధృవమ్" ఇది యందరకును తెలిసినట్లుండును. నిజము తెలియదు. పైకి అందరము చచ్చిపోవుదుమందురే కాని వ్రేళ్ళు పాతుకుని, కొమ్మలు వేసి మింటి కొనలు తాకుదుమన్న యూహయే అజ్ఞానము చేత నావరింపబడిన బుద్ధిలో నుండును. అజ్ఞానమనగా ఆలోచన లేకుండుట.


దీన్ని modern thought అనే అనాలి కదా!


*** *** ***


దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన 

ఈ విప్లవ గీతం చూడండి.


అరుణారుణ తార


యుగయుగాల పీడకలలు - సొగయజేయు సంకెలలు

తెగనివికావోయి - మ్రోల ధగధగా స్వతంత్ర విభా 

తాకాశము నొసట పొడుచు అరుణారుణ తార 


అంతులేని ద్వేషము, విషరోషము, స్వార్థము, మోసము 

పంతగించి నిలువున ఆవంతయేని ; శాంత విభా 

తాకాశము నొసట పొడుచు అరుణారుణ తార!


ముందుగలదు మన జాతికి ముక్తి, అమర జీవరక్తి!

క్రిందువెనుక గనక నడుపుడందరు, అభ్యుదయ విభా 

తాకాశము నొసట పొడుచు అరుణారుణ తార!


ఆకాశము నొసట పొడుచు అరుణారుణ తార

ఏకాకి నిశీధి నొడుచు తరుణ కాంతిధార!

జయపతాక యువపతాక 

విజదాపక వెడలు నౌక 


- దేవులపల్లి కృష్ణశాస్త్రి, 'మహతి'


"ఆకులందున అణిగిమణిగీ 

కవితకోకిల కూయవలెనోయ్ .." అన్న కవి అరుణ పతాకాన్ని ఎగరేయటం ఒక చరిత్రాత్మక సన్నివేశం. 


కృష్ణశాస్త్రి గారు అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షునిగా కూడా వున్నారు. రెండో ప్రపంచ యుద్ధం, భారత స్వాతంత్య్ర పోరాటం ఈ ఇద్దరు మహాకవుల్నీ ప్రభావితం చేశాయి. 


పైగా ఆ శ్రీశ్రీ ఒకడూ...! 'గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్య శంఖం పూరించు రష్యా'.. అంటూ. 


'కనబడలేదా మరో ప్రపంచపు 

అగ్నికిరీటపు ధగధగలు!

హోమజ్వాలల భుగభుగలు!

ఎర్రబావుటా నిగనిగలు! ..

హేండ్ గ్రెనేడ్స్ లాగా పేలుతాయి కదా ఈ అక్షరాలు!

*

ఒక 40 ఏళ్ల క్రితం కావొచ్చు, విశాఖపట్నంలో తెలుగు సాహిత్యం పై ఒక సెమినార్ జరిగింది. కొర్లపాటి శ్రీరామ్మూర్తి దాన్ని నిర్వహించారు. 

ఆ సభలో, మహానుభావుడు దివాకర్ల వెంకటావధాని మాట్లాడుతూ , "కాలానికి కత్తులవంతెన" అనే సమాసాన్ని గత 500 ఏళ్లలో ఎవ్వరూ ప్రయోగించలేదు. అలాగే "తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?" అని ప్రశ్నించినవాళ్లూ గతంలో ఎవ్వరూ లేరు" - అని చెప్పారు. 

*

ఎందుకో, విశ్వనాథని శ్రీశ్రీ తిట్టినట్టు - 

"కాగితప్పడవలు, చాదస్తపు గొడవలు"

అనాలని నాకు అనిపించడం లేదు. 


- Taadi Prakash 97045 41559


Two giants - Krishna Sastry, Viswanatha

తథాస్థు దేవతలు అంటే.(శ్రీ)

 🙏🙏🙏🙏🙏

🌹🌹🌹🌹🌹



వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, 

ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. 

ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. 

సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. 


వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. 

అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించుట మూలంగా వీరు జన్మించారు. 


మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. 

వీరిసోదరి ఉష. 

ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. 

ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.


ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. 

ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. 

పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. 

తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. 

ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. 

వీరినే తథాస్తు దేవతలు అంటారు. 


సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. 


ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. 


ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. 


కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు.

అనారోగ్యానికి గురైనపుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు. 


వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. 

ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు.. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. 

దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి.


చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. 

ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా 

మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. 

మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. 

కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచి జరుగుతుంది.


సర్వే జనా సుఖినోభవంతు.

🌹🌹🌹🌹🌹

🙏🙏🙏🙏🙏

🌹అవహేళన- పశ్చాతాపం🌹



ఒక 24 సంవత్సరాల యువకుడు తన వృద్దులైన తల్లితండ్రులతో రైలు ప్రయాణం చేస్తున్నాడు. రైలు కిటికీ ప్రక్కన చోటు దక్కడంతో చాలా ఆనందపడుతున్నాడు. 


ఆ పక్కనే కూర్చున్న నలుగురు యువకులు ఈ యువకుడినే చూస్తున్నారు.


రైలు స్టేషన్ నుండి బైలుదేరింది. 


ఇంతలో ఆ యువకుడు నాన్న నాన్న చూడు చూడు. ప్లాట్ఫాం పై ఉన్న వాళ్ళందరూ వెనక్కి నడుస్తున్నారు అని గట్టిగా కేరింతలు నవ్వుతున్నాడు. పక్కన ఉన్న ఆ నలుగురు కుర్రోళ్ళు ఈ యువకుడినే చూస్తూ నవ్వుకుంటున్నారు.


ఇంతలో ఆ రైలు స్టేషన్ దాటి పక్కనే ఉన్న పల్లెప్రాంతం వైపుగా వెళ్తుంది. మళ్ళి ఈ యువకుడు గట్టిగా "నాన్న నాన్న చూడు చెట్లు, కొండలు, రాళ్ళు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి" అని కేరింతలు మొదలు పెట్టాడు. 


పక్కన ఉన్న ఆ నలుగురి యువకులలో ఒకడు.., "అవునా వెళ్ళు , వెళ్ళి గట్టిగా పట్టుకో పారిపోతున్నాయి" అని గేలి చేసాడు. ఇది విని కూడా ఆ యువకుడి తండ్రి హాయిగా నవ్వుతూనే "సరే" అంటు కొడుకు వైపు చూస్తూ ఆనందగా ఉన్నాడు ..,


మళ్ళి ఈ యువకుడు గట్టిగా "నాన్నా నాన్నా చూడు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నా మేఘాలు మాత్రం మనతోనే వస్తున్నాయి" అంటూ కేరింతలు మొదలు పెట్టాడు. ఇంతలో ఆ నలుగురిలో ఒకడు "అవునవును మేఘాలని మన రైలుకి కట్టేశారు అందుకే మనతోనే వస్తున్నాయి " అని వెక్కిరించారు., పక్కనే ఉన్న తల్లి అవును నాన్న మేఘాలు కదా అలాగే మన వెంట వస్తాయి అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది.


ఇంతలో చిన్న చిరు జల్లులతో కూడిన వర్షం మొదలైంది. ఆ కిటికీ కడ్డీలకి జాలువారుతున్న చుక్కలని చూసి. ఆ చుక్కల్లోనుండి పచ్చని ప్రకృతిని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవ్వుతున్న యువకుడిని చూసి మళ్ళి ఆ నలుగురిలో ఒకడు "మీ అబ్బాయిని ఏదైనా హాస్పిటల్ లో చూపించండి ఎందుకైనా మంచిది" అని ఎగతాళిగా మాట్లాడుతూ అన్నాడు.


ఈ యువకుడి తండ్రి "ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాం బాబు","పుట్టుకతో అంధుడైన మా అబ్బాయికి కళ్ళు తెప్పించలేక ఇన్నాళ్ళు ఆగాము. 


బ్రెయిలీ ద్వారా చదివి CA లో దేశంలోనే మొదటి రాంకు వచ్చిందని ప్రభుత్వమే ఉచితంగా వీడికి చికిత్స చేయించింది. ఇప్పుడే లోకాన్ని చూస్తున్నాడు." అని ఆనందంగా తండ్రి వెల్లడించాడు. 


తల్లి తండ్రుల డబ్బుతో విలాసంగా జీవిస్తూ ఇతరులని ఎగతాళి చేస్తున్న ఆ నలుగురు యువకులు తామెంత తప్పుగా ప్రవర్తించామో అని సిగ్గుతో తల దించుకున్నారు.


"ఒకరిని ఏదైనా అనే ముందు వారి పరిస్తితి ఏమిటి అని ఆలోచించడం ముఖ్యం.."

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

గమనిక: రాసింది ఎవరో తెలియదు.

మంచి విషయం నచ్చి పోస్ట్ చేసా..

Be Good.. Do Good..

 🙏🙏🙏

**హిందూ ధర్మం** 47

 **దశిక రాము**




విద్య: జ్ఞానము కలిగి ఉండడం. అది నిజజీవితంలో ఉపయోగపడేదిగా ఉండాలి. విద్యా నమ్రతను, అణుకువను, వినయమును ఇవ్వాలి. అదే నిజమైన విద్య. మనస్మృతి ప్రకారం ధర్మానికి ఉన్న లక్షణం.


భూమి నుంచి దైవం వరకు, జడపదార్ధం నుంచి విశ్వచైతన్యం వరకు, స్థూలమైన విషయాల నుంచి సూక్ష్మ విషయాల వరకు, భౌతిక జ్ఞానం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం వరకు, సరైనా జ్ఞానాన్ని ఆర్జించడం, సమస్త విషయాయలపైన సరైన అవగాహన ఉండాలి, లేదా తెలుసుకోవాలి. తెలుసుకున్న జ్ఞానం కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు, నిజ జీవితంలో ఉపయోగపడాలి. అటువంటి జ్ఞానమే విద్యా. మరొక విధంగా చెప్పాలాంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం, మనసులో ఉన్న భావాన్ని అచ్చం అలాగే వ్యక్తపరచడం/పలకడం, ఏది మాట్లాడుతున్నామో, అచ్చంగా అదే చేయడం విద్యా అని, దానికి విరుద్ధంగా ఉండడం అవిద్యా అని అన్నారు ఆర్యసమాజ స్థాపకులు దయానంద సరస్వతీ. అంటే ఏ కర్మనైనా త్రికరణశుద్ధిగా చేయించగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది.


(ఆత్మ)తన గురించి తాను తెలుసుకోవడమే విద్య అన్నారు స్వామి చిన్మయానంద. విద్య అనేది జనంలో ఆస్తికతను పెంచాలి తప్ప నాస్తికతను పెంచకూడదు.


మనం ఏం చదువుకున్నామో అది మన జీవితంలో ఉపయోగపడాలి. ఈ రోజు గమనిస్తే, మనం చదివిన చదువుకి, చేసే పనికి ఎంతమాత్రం పోలిక ఉండదు. వేదం అంటుంది కేవలం చదవడమే కాదు, మీరు చదివిన చదువు మీకు మీ జీవితంలో ఉపయోగపడాలి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఉపయోగపడాలి, మీరు నేర్చుకున్న విద్యతో కొత్త విషయాలను వెలుగులోకి తేవాలి అంటే ముందుగా మీరు నేర్చుకున్న విద్య మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. అది మీ మనసులోకి దట్టించకూడదు, మీకు మీరుగా స్వేచ్చగా తెలుసుకునేంత ఆసక్తిగా ఉండాలి. విద్య మీ సంస్కారాన్ని వృద్ధి చేయాలి, మీ జీవితాన్ని, మీ ద్వారా సమస్త సమాజాన్ని ఉద్ధరించాలి. మీలో స్వార్ధాన్ని తొలగించాలి. మీ ధృక్పదాన్ని మార్చాలి. నేను, నా కుటుంబం అనే భావన నుంచి సమస్త ప్రపంచం నా కుటుంబమే (వసుదైవ కుటుంబకం) అన్న భావన తీసుకురావాలి. విద్య దైవాన్ని దర్శింపజేయాలి. మీలో మీకు తెలియని రహస్యాలను తెలియజేయాలి. మీలో ఉన్న సమస్త శక్తిని బహిర్గతం చేయాలి. ఆత్మ తత్వాన్ని భోధించాలి. అదే నిజమైన విద్య.  


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

https://chat.whatsapp.com/HUn5S1ETDNTG580zg5F9PU


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95


*ధర్మము - సంస్కృతి* గ్రూప్

 ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

హ‌నుమంత వాహ‌నంపై

 తిరుమ‌ల‌, 2020 సెప్టెంబరు 24,

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు-2020,


హ‌నుమంత వాహ‌నంపై వేంక‌టాద్రిరామునిగా 

శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు...


శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురు‌‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు వేంక‌టాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు.


హ‌నుమంత వాహ‌నం - భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి


            హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.


        కాగా, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం బదులుగా స‌ర్వ‌భూపాల వాహ‌నసేవ జ‌రుగుతుంది. రాత్రి 7 గంటలకు గ‌జ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షిస్తారు. @ Tirumala Tirupati Devas

thanams(TTD)

🕉️దుర్గా దేవి మహిమ🕉️



🔸దుర్లభమైనది దుర్గ. దుర్గమమైనది దుర్గ. పరమార్ధదృష్టితో చూస్తే ఏది దుర్లభమో, ఏది దుర్గమమో,


 ఆ పరతత్త్వమే దుర్గ. దుర్గా అంటే పరతత్త్వస్వరూపం, పరబ్రహ్మస్వరూపం. అంతేకాని త్రిశూలం పట్టుకుని రాక్షసులను సంహరించే ఒకానొక స్త్రీమూర్తి మాత్రమే కాదు.


  🔸దుర్గతులను తొలగించునది దుర్గ.


 దుర్గతులు చాలా ఉంటాయి. దుః శబ్దంతో వచ్చేవి దుఃఖం, దుష్టత్వం, దుర్మార్గం, దురాచారం, దురితం మొదలైనవి. సాధించడానికి మహాకష్టమైన దానికి దుస్సాధ్యం అని పేరు. ఇందులో ఏం వచ్చినా భయం వేస్తుంది. వీటన్నింటిని తొలగించే తల్లి కనుక దుర్గా.  


🔸దుర్గానామానికి ఉన్న శక్తిని చెప్తూ సప్తశతిలో "దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా" అంటారు.  


🔸రాక్షస శక్తులు, విఘ్నాలు, సంసారబంధాలు, చెడ్డ పనుల వల్ల కలిగే ఫలితాలు, శోకము, దుఃఖము, నరకము, యమదండన, జన్మ పరంపర, భయాలు, రోగాలు మొత్తం పదకొండు దుర్గతులు.


 వీటన్నింటిని తొలగించేది దుర్గ. ఒక్క నామం అన్నింటికి పెట్టు.  


🔸ఆ తల్లిని ఆశ్రయిస్తే ఇచ్చే ఫలం సంసార సముద్రం నుంచి దాటవేస్తుంది. అంత గొప్పగా ఎవరు దాటించలేరు.


 "సుతర సితరసే నమః" ఈవిడ దాటిస్తే సంపూర్ణంగా దాటిస్తుంది.  


🔸"నమః ప్రతరణాయచ ఉత్తారణాయచ" - ఆ దాటించడం ఒక ఉత్తమ స్థితి నుంచి మరొక ఉత్తమస్థితికి తీసుకువెళ్ళడం ప్రతరణ.


 ఉత్తరణం అంటే మళ్ళీ వెనక్కి రావల్సిన అవసరం లేకుండా మోక్షాన్ని ఇవ్వడం. 


అది దుర్గమ్మ అనుగ్రహం.


శ్రీ మాత్రే నమః

**మహాభారతము**

 **దశిక రాము**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


92 - అరణ్యపర్వం.


కలియుగాంతము, యుగాలపరిక్రమణల విధానం గురించి తన ప్రత్యక్ష అనుభవాలను ధర్మరాజాదులతో పంచుకున్న మార్కండేయమహర్షి, శ్రీకృష్ణుని సన్నిధిలో, ధర్మవ్యాధుడనే మహనీయుని గాధను యిలా వివరిస్తున్నాడు :


ఒకప్పుడు, కౌశికుడనే బ్రాహ్మణుడు వేదవేదాంగాలు అభ్యసించి, నిత్యమూ జప తపాదులు చేసుకుంటూ, వుదరపోషణార్ధం యాచనచేసుకుంటూ, నిర్మలమైన జీవితం గడుపుతూ వుండేవాడు. తన దినచర్యలో, ఒకనాడు చెట్టుక్రింద కూర్చుని అతడు వేదాధ్యయనం చేసుకుంటూ వుండగా, ఒక కొంగ అదే చెట్టుమీద సేదతీరుతూ, ఆయనపై రెట్టవేసింది.  


ఆ సంఘటనకు కోపించి కౌశికుడు, కళ్ళెర్ర చేసి, చెట్టు పైకిచూశాడు. అంతే ! ఆ కోపాగ్నిని తట్టుకోలేక, ఆకొంగ, చెట్టు పైనుండి దబ్బున క్రిందపడి చనిపోయింది. అది చూసి కౌశికుడు యెంతో పశ్చాత్త్తాపం చెంది, కోపం వలన ఇంత దుష్పరిణామాలు వున్నాయా ! అని చలించిపోయాడు. ఏ కోరికలు లేని తనలోనే ఇంతక్రోధం వుంటే, సామాన్యుల పరిస్థితి యేమిటి ? అనుకుంటూ, ప్రాయశ్చిత్త క్రియ చేసుకుని, భిక్షాటన సమయమైందని, భిక్షాపాత్ర పట్టుకుని, గ్రామంలోకి బయలుదేరి వెళ్ళాడు.


గ్రామంలో ఒక ఇంటిముందునిలబడి ' భవతీ భిక్షం దేహీ ' అంటూ భిక్ష అర్ధించాడు. ఆ ఇంటి గృహిణి, గృహశుద్ధికార్యక్రమంలో వుండి, ' వస్తున్నాను స్వామీ ! కొద్దిక్షణాలు ఆగమని ' చెప్పింది. అదేసమయానికి ఆమెభర్త యెంతో అలిసిపోయి, ఆకలితో యింటికివచ్చాడు. వెంటనే ఆయనకు మంచితీర్థం యిచ్చి, యెండలో వచ్చాడని తగు సపర్యలు చేసి, భోజనం వడ్డించి, ఆయన భోజనం చేసిన తరువాత, శయ్య యేర్పాటు చేసింది.   


ఇంతలో హఠాత్తుగా ఆమెకు గుమ్మం ముందు వున్న బ్రాహ్మణుడు గుర్తుకువచ్చి, ఆలశ్యమైనందుకు నొచ్చుకుంటూ, భిక్ష యివ్వడానికి బైటకువచ్చింది. ఎప్పటినుండో ఎదురు చూస్తున్న కౌశికుడు, యెర్రబారిన నేత్రాలతో రోషంగా, ముక్కుపుటాలు 

అదురుతుండగా, ' ఓ గృహిణీ ! ఏమి నీ వింత ప్రవర్తన ? బ్రహ్మణుడంటే అంత అగౌరవమా ! నీ యింటిముందు యాచకుడిగా నిలబడినాడని, చులకనా ! ఇది నీకు తగునా ? ' అని కోపంగా అడిగాడు. దానికి ఆమె యెంతో వినయంగా ' మహానుభావా ! నన్ను క్షమించండి. ఆకలితో వచ్చిన నా భర్తను సేవించి రావడంలో ఆలశ్యమైంది. పతిసేవకి మించిన ధర్మం వేరే యేమివున్నదని ఆయన సేవలో మీ పట్ల కొద్దిగా ఆలశ్యమైంది.' అని వినయంగా సమాధానమిచ్చింది.


ఆమె యిచ్చిన సమాధానంతో కౌశికుడు తృప్తి చెందక, ' గృహస్థాశ్రమంలో వుండి అతిధిని అవమానిస్తావా ? ఇంద్రాదులు ఆ సాహసం చెయ్యలేరు. మాలాంటి మహిమాన్వితులైన, విప్రులు తలుచుకుంటే, యీభూమండలాన్ని అగ్నికి ఆహుతి చెయ్యగలం. నీ ధర్మసూక్ష్మాలు నావద్ద చెప్పవద్దు. ' అని ఆమెను ఈసడించుకున్నాడు.


' నేను వున్నది వున్నట్లుగా చెప్పినా మీరు నాపై కోపిస్తున్నారు. మీ క్రోధాగ్నిలో పడి అసువులు బాయడానికి నేనేమీ చెట్టుమీద కొంగను కాదు. నాకు నా పతిదేవుడే ముఖ్యం. నేను నీవు చదివిన ధర్మశాస్త్రాలు చదివి వుండకపోవచ్చు. కానీ, నాగృహిణీ ధర్మం నాకు నేర్పింది యిదే. ' అని గట్టిగా సమాధానం యిచ్చి కౌశికుని నివ్వెరపర్చింది.


' బ్రాహ్మణోత్తమా ! క్రోధమోహాలను జయించినవాడే బ్రాహ్మణుడు. సత్యమునే యెల్లప్పుడూ పలికేవాడు, గురువును గౌరవించేవారు, అహింస ఆచరించేవాడు, ఇంద్రియాలను జయించినవాడు, యధాశక్తి దానధర్మాలు చెయ్యగలిగినవాడు, ఉదారహృదయుడు, ఎవరో అతడే నిజమైన బ్రాహ్మణుడు. నీలో యిన్ని గుణాలు వున్నా,క్రోధము వదలలేక పోయావు. అసలుధర్మము నీకు తెలియదు. '


' నీకు నిజమైన ధర్మ జ్ఞానము తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే, మిథిలానగరంలో ధర్మవ్యాధుడు అనే మహనీయుడిని కలువగలవు. అతడు నీకు నిజమైన ధర్మం అంటే యేమిటో చెబుతాడు. నీతో నేను అధిక ప్రసంగం చేశాను అనుకుంటే నన్నుక్షమించు. ' అని రెండుచేతులతో నమస్క రించి ఆగృహిణి, కౌశికుని భిక్షతో సత్కరించింది.  


ఆమె చెప్పిన మాటలు వినగానే, కౌశికుడికి నోటమాట రాలేదు. నెమ్మదిగా తాను చేసిన తప్పు తెలుసుకుని, ' అమ్మా ! నా అజ్ఞానం పొర తొలగించావు. నా క్రోధస్వభావం, యిప్పుడే నశించింది. నా క్షేమం గురించి నీవు చెప్పిన మాటలు నా మాతృమూర్తి చెప్పినట్లుగా భావించి, యిప్పుడే మిథిలానగరానికి బయలు దేరుతాను, నీకు శుభమగు గాక. ' అని కౌశికుడు ఆమె యిచ్చిన భిక్ష స్వీకరించి, తేలికబడిన మనస్సుతో అక్కడనుంచి కదిలాడు. 


తన ప్రవర్తనకు తానే సిగ్గుపడుతూ, మిథిలానగరం వైపు బయలుదేరాడు, కౌశికుడు. మిరుమిట్లు గొలుపుతున్న మిథిలానగర అందాలు చూసుకుంటూ, ధర్మవ్యాధుని గురించి వాకబుచేసుకుంటూ, మాంసాన్ని కోసి శుభ్రం చేసి అమ్మే దుకాణానికి చేరుకున్నాడు. అదే ధర్మవ్యాధుడు పనిచేసే స్థానం అని తెలుసుకుని, దూరం నుండి అతనిని చూసి, ఆ వాసన భరించలేక, దగ్గరకు పోలేక, అల్లంతదూరంలో నిలబడిపోయాడు కౌశికుడు.  


ధర్మవ్యాధుడు కూడా కౌశికుని చూసి, తనదుకాణం వదిలి కౌశికుని సమీపించి, ' స్వామీ ! మీరు వాకబు చేస్తున్న ధర్మవ్యాధుడను నేనే ! ఆ పతివ్రతా శిరోమణి మిమ్ములను పంపింది నా దగ్గరకే ! ' అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు.


ఆ గృహిణి తాను కొంగను దహింపజేసిన వైనం యెలా చెప్పిందో, యీధర్మవ్యాధుడు తనను గృహిణి పంపిన విషయం యెలా చెప్పగలిగాడో ! అని విపరీతంగా ఆశ్చర్యపోతూ నిరుత్తరుడై ధర్మవ్యాధుని వైపు చూస్తున్నాడు కౌశికుడు.


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

(శ్రీ లలితా సహస్ర నామములలో 101వ నామము)

 101. ఓం మణిపూరాంతరుదితాయై నమః.🙏



కం. మణిపూరక చక్రోజ్వల!


ప్రణవాక్షర రూప! సత్య భాసుర జననీ!


గుణగణులకు రక్షణ నిడు


మణిపూరాంతరుదితా! నమామి, భగవతీ!🙏


మణిపూరాంతరుదిత పాదారవిందములకు ప్రణమిల్లుచు🙏

చింతా రామకృష్ణారావు.

హిందూ ధర్మం - 6

 **దశిక రాము**




ధర్మం అంటే?


ధర్మం అనేక అర్ధాలు కలిగిన పదం. ధర్మం అన్న పదం ఒక్క భారతీయసంస్కృతిలోనే ఉంది. హిందూ, జైన, బౌద్ధ, సిక్కు గ్రంధాల్లో ధర్మం అన్న పదం తరచూ కనిపిస్తుంది. ధర్మం అన్న పదానికి చాలా విశాలమైన అర్ధం ఉంది. ఎంత విశాలమైన అర్దం అంటే మూములు మనిషి యొక్క మనసు, ధర్మం యొక్క అర్ధాన్ని అంత సులభంగా అర్దం చేసుకోలేనంతగా. ధర్మానికి ఋగ్ వేదంలో 20 రకాల అర్ధాలను చెప్పారు. ధర్మం అన్న పదానికి సమానమైన పదం మరే భాషలోనూ లేదు. 


ధర్మం 'ధృ' అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది, ధర్మానికి ఆచరించబడేది, పాటించబడేది, సమస్త సృష్టికి ఆధారభూతమైనది అనే అర్ధాలున్నాయి. ఇవే కాక, కర్తవ్యం, విధి, శాసనం, సరైన మార్గం, ఆచారం, న్యాయం వంటి అర్ధాలున్నా, ఇవన్నీ ఒక్కొక్కటిగా ధర్మాన్ని వివరించడంలో అసంపూర్ణాలే. సాధరణంగా చెప్పవలసి వస్తే, ధర్మం అనగా సరైన/అసలుసిసలైన జీవన విధానం. మానవులు ఎలా బ్రతకడం వలన, సృష్టికి ధర్మాలకు అనుగుణంగా, సులభంగా, సుఖంగా జీవనం సాగించగలరో, అదే ధర్మం.  


ఈ ధర్మం అనే మాటకు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు అర్ధాలు అన్వయం అవుతాయి. ధర్మం అంటే స్థిరమైనది, ఎప్పటికి నశించనది అని కుడా చెప్తారు. ఈ జగత్తు మొత్తం సవ్యంగా నడవడానికి ఆధరభూతమైన దానిని, ఈ సృష్టిని గందరగోళం లేకుండా, సవ్యంగా నడిపించే వ్యవస్థను ధర్మం అన్నారు.


ఈ సృష్టిలో భిన్నత్వాల సమూహం. రకరకాల వ్యక్తిత్వాలు, ఆలోచనలు, జీవన విధానాలు ఉన్నా, సూక్ష్మంలోకి వెళ్తే అన్నిటి యందు ఏకత్వం ఉంది. ఆ ఏకత్వమే చైతన్యం. ధర్మం కూడా అంతే. అన్ని జరుగుతున్నా, అన్ని కారణాలు వెనుక ఒక పెద్ద కారణం ఉంది, ఒక వ్యవస్థ ఉంది, అన్నిటిని నడిపిస్తున్నది, అన్నీ దాన్ని అనుసరించే జరుగుతాయి. అదే ధర్మం.  


తరువాయి భాగం రేపు


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95

పాట


 

కీర్తన


 

నమహః


 

సామజవరగమన


 

గానం


 

ప్రసాద వితరణ


 

దేవాలయాలు


 

పద్యం పఠనం


 

మధురాష్టకం

 మధురాష్టకం కృష్ణ వందేజగద్గురుమ్ అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ |

హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౧ || వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ |

చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౨ || వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ |

నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౩ || గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురమ్ |రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౪ || కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురమ్ |

వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౫ || గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచీ మధురా |

సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౬ || గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురమ్ |

దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౭ || గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా |

దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౮ ||

🙏🙏🙏🙏🙏

శ్రీమద్భాగవతము

 *వందేమాతరం*

                                                                                     *భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1907 (౧౯౦౭)*


*10.1-890-*


*శా. గంధాలంకరణాంబరావళులచేఁ గైచేసి యిష్టాన్నముల్*

*బంధుశ్రేణియు మీరలుం గుడిచి నా భాషారతిన్ వేడుకల్*

*సంధిల్లన్, గిరి గో ద్విజానల నమస్కారంబు గావింపుఁడీ;* 

*సంధిల్లున్ సకలేప్సితంబులును మీ జన్మంబు ధన్యం బగున్. "* 🌺



*_భావము: శ్రీకృష్ణుడు ఇంకా ఈ విధముగా అనునయంగా చెప్తున్నాడు: "మీరందరు చక్కని ఆభరణములను, వస్త్రములను ధరించి చందన, సుగంధ పరిమళములతో తయారై, మీ ఇష్టమైన ఆహారపదార్థములను బంధు మిత్రులతో సహా కడుపు నిండా భుజించి, నేను చెప్పిన వాక్యములపై విశ్వాసముంచి ప్రీతితో, సరస సల్లాప ఉత్సాహములతో వేడుకగా కొండకు, గోవులకు, బ్రాహ్మణులకు, హోమాగ్నికి నమస్కారములు చేయండి. మీ జన్మ సార్థకమై, మీ మీ కోరికలు తప్పక నెరవేరుతాయి.”_* 🙏



*_Meaning: Sri Krishna reassuringly advised them: "You wear your ornaments and beautiful clothes, apply scented perfume and eat to your hearts' content. Believe in my words and circumambulate enthusiastically to the Hill, Cows, Brahmins and the Yagnik fire with diligence and devotion and prostrate before them. With this, your desires would fructify and you will achieve fulfilment for having taken birth as human being"._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

15-03,04-గీతా మకరందము

 15-03,04-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అట్టి సంసారవృక్షమును అసంగమను శస్త్రముచే ఛేదించివైచి పరమాత్మ పదము నన్వేషింపవలయునని బోధించుచున్నారు-

 

న రూపమస్యేహ తథోపలభ్యతే

నాన్తో న చాదిర్న చ సమ్ప్రతిష్ఠా | 

అశ్వత్థమేనం సువిరూఢమూలం

అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్వా || 

 

తతః పదం తత్పరిమార్గితవ్యం

యస్మిన్ గతా న నివర్తన్తి భూయః | 

తమేవ చాద్యం పురుషం ప్రపద్యే 

యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ || 


తాత్పర్యము:- ఆ సంసారవృక్షముయొక్క స్వరూపము ఆలాగున (ఇపుడు వర్ణింపబడినరీతిగా) ఈ ప్రపంచమున (సంసారాసక్తిగలవారిచేత) తెలియబడకున్నది. దాని ఆదిగాని అంతముగాని, మధ్యము (స్థితి) గాని కనబడకున్నది. గట్టిగ వేళ్ళునాటుకొనిన ఈ సంసారమను అశ్వత్థవృక్షమును అసంగమను బలమైన ఆయుధముచే నఱికివైచి ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించినవారు మఱలవెనుకకు (సంసారమునకు) రారో, ఎవరినుండి అనాదియైన ఈ సంసారవృక్షముయొక్క ప్రవృత్తివ్యాపించెనో, (అట్టి) ఆది పురుషుడగు పరమాత్మనే శరణుబొందుచున్నాను - అనునిట్టి (భక్తి) భావముతో ఆ పరమాత్మపదమును వెదకవలయును.


వ్యాఖ్య:- క్రిందటి శ్లోకములందు వర్ణింపబడినలాగున (ఊర్ధ్వమూలముగ, అథఃశాఖగ. - ఇత్యాదిరూపముగ) ఈ సంసారవృక్ష మేల కనుపించుటలేదు? సంసారాసక్తిగల అజ్ఞానుల కట్టిరూపము తెలియబడదు. దాని ఆద్యంతమధ్యములుకూడ తెలియబడవు. ఏలయనగా వారు దానిలో మునిగియుండి సత్యమును తెలిసికొనజాలకున్నారు (చీకటిలోనున్నవారికి వస్తువులు గోచరింపనట్లు). ప్రకాశమునందు వస్తువులు తెలియునట్లు, వైరాగ్యము, ముముక్షుత్వము, ఆత్మజ్ఞానము కలవారికి దానిస్వరూపము గోచరించగలదు.

         ఈసంసారవృక్షము అనాదికాలమునుండి వర్తించుచు అతివిశాలముగ, శాఖోపశాఖలుగ వ్యాపించి, బాగుగ వేళ్ళుతన్నుకొని యున్నది. కనుకనే దానివేళ్ళను గూర్చి వర్ణించునపుడు భగవానుడు "రూఢమూలమ్” అనిగాని, "విరూఢమూలమ్” అనిగాని చెప్పక "సువిరూఢమూలమ్” అని చెప్పుటకు కారణము. దానివేళ్ళు చాలగట్టిగ పాతుకొనిపోయినవని భావము. అయితే అంతమాత్రముచేత దిగులునొందవలసిన పనిలేదు. చెట్టు ఎంతగొప్పదైనను బలమైన ఆయుధముచే నేలమట్టము కాగలదు. అట్లే ఈ సంసారవృక్షమును ఛేదించుటకు భగవానుడు చక్కని ఆయుధమును సూచించిరి. అదియే అసంగము. ప్రాపంచిక పదార్థములందు అభిమానము, ఆసక్తి గలిగియుండుటయే సంగము, అది లేకుండుటయే అసంగము. వైరాగ్యమని భావము. అయితే మందమంద వైరాగ్యభావములచేత ఈ గొప్పసంసారవృక్షచ్ఛేదనము సాధ్యపడదు. తీవ్రతర విరక్తి, పరిపూర్ణ అసంగము ఆవశ్యకమైయున్నది. కనుకనే "ధృడేన” అను పదమును భగవానుడు ప్రయోగించిరి. ఒక పెద్ద "ఫ్యాక్టరీ” లో మూలచక్రమునకుగల "బెల్టు” తెగినచో అన్నియంత్రములున్ను ఎట్లాగిపోవునో, అట్లే ఈసంసారరూప బృహద్యంత్రాంగమంతయు సంగరాహిత్యము (అసంగము)చే స్తబ్ధమైపోవును. మహనీయు లీప్రపంచమున నున్నప్పటికిని ఇట్టి అసంగభావమే గలిగియుండి సంసారబాధలెవ్వియు లేకయుందురు. అయితే ఈ అసంగము బాహ్యముననేగాక, అభ్యంతర సంకల్పములందును గలిగియుండవలెను. అపుడే ఆ అసంగము పరిపూర్ణము కాగలదు.

ఇంతటితో పని పూర్తి అయినదా? కాదు. సంసారవృక్షచ్ఛేదనము అయిన పిదప అనగా దృశ్యత్యాగము అయినపిదప దృక్ - స్వరూపమును ఆశ్రయించుట అను ముఖ్యమైనపని మఱియొకటి కలదు. అప్పు తొలగవలెను, సొంతముగ కొంత ద్రవ్యమును గలిగియుండవలెను. అపుడే మనుజుడు సుఖముగ నుండగలడు. దృశ్యభావత్యాగము అప్పుతొలగుటవంటిది. అది చాలదు. ఏలయనిన అప్పు తొలగినను, తన పోషణనిమిత్తము కొంత ద్రవ్యము లేనిచో మనుజునకు తృప్తియుండదు. అట్లే దృశ్యవిరక్తి, ఆత్మపదప్రాప్తి రెండును యున్నచో జీవునకు పరిపూర్ణసుఖమేర్పడగలదు. కనుకనే భగవానుడు సంసారవృక్షచ్ఛేదనమును గూర్చి తెలిపి, “తతః” - అటు పిమ్మట 'పరిమార్గితవ్యమ్’- "పరమాత్మపదాన్వేషణము గావింపవలెను" అని బోధించుటకు కారణమైనది.

ప్రపంచములో అనేక పదవులున్నప్పటికిని అన్నిటికంటె గొప్పది పరమాత్మ పదవియే కావున దానినే అనుసరించవలెనని, అన్వేషింపవలెనని ఇచట బోధింపబడినది. ఏలయనిన ఆ మహోన్నతపదమును బొందినవాడిక మరల ఈ దుఃఖభూయిష్ఠమగు సంసారస్థితికి దిగిరాడు. (యస్మిన్ గతా న నివర్తని భూయః). బ్రహ్మాండమునం దేలోకమునకు పోయినను తిరిగిరావలసినదే, మఱల పుట్టవలసినదే - కాని భగవంతుని పొందినవారు, ఆత్మపదవి నధిష్ఠించినవారు మఱల జన్మింపరు. అది శాశ్వతపదము. పూర్ణదుఃఖరాహిత్యము దానివలననే కలుగును. కనుకనే అన్ని పదవులలోను అది సర్వోత్కృష్టమైనది. కాబట్టి విజ్ఞలెల్లరును దానినే అనుసరించి తరించుదురుగాక!


అయితే "ఆ పరమపురుషునే శరణు బొందుచున్నాను” (తమేవ పురుషం ప్రపద్యే) అను భక్తిభావముతో, నిరహంభావనతో ఆ యాత్మపదమును అన్వేషింపవలసియున్నది. నిర్మలభక్తిగలవానికి ఆత్మజ్ఞానము త్వరలో లభించగలదు.


ప్రశ్న:- సంసారవృక్షము ఏ ప్రకారముగనున్నది?

ఉత్తరము:- బాగుగ వేళ్ళుతన్నుకొనియున్నది.'

ప్రశ్న:- దానిని ఛేదించుటెట్లు?

ఉత్తరము:- “అసంగము" (ప్రాపంచిక పదార్థములందు ఆసక్తి, అభిమానములేకుండుట) అను బలమైన ఖడ్గముచే అది ఛేదించివేయబడగలదు. 

ప్రశ్న:- అట్లు సంసారవృక్షమును ఛేదించినపిదప యేమి చేయవలెను?

ఉత్తరము:- పరమాత్మపదమును అన్వేషింపవలెను.

ప్రశ్న:- ఆ పరమాత్మ యెట్టివాడు?

ఉత్తరము:- (1) ఆతనిని పొందినవారు మఱల వెనకకురారు (తిరిగి ఈ సంసారమున జన్మింపరు) (2) ఆతనినుండియే ఈ జగత్తంతయు ఆవిర్భవించినది. (3) ఆతడు ఆదిపురుషుడు.

*కొండంత దేవుడు*



మనిషి దృష్టిలో దేవుడు కొండంతటివాడు. అన్నమయ్య ‘కొండంత వరములు గుప్పెటి వాడు’ అని కీర్తించాడు. అయితే, మనిషికి కొండంత వరాలను పొందే అర్హత కూడా ఉండాలి. ఆంజనేయుడిలా సంజీవని పర్వతాన్ని అందరూ మోయలేరు. కొండంత వరాలను అందరూ సద్వినియోగం చేసుకోలేరు.


అమోఘమైన వరాలను పొందిన రాక్షసులందరూ తమ సహజమైన తమో గుణంతో, నష్టమే పొందారు తప్ప- ఎలాంటి లోక కల్యాణాన్ని చెయ్యలేకపోయారు.


జన్మతః ప్రతి మనిషికీ కొన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి. దానికి లోబడి లోకకార్యాలు చేస్తుంటాడు. జీవితమంటే కష్టసుఖాల కూడలి కనుక రెండూ రుచిచూడాలి. సాధారణ కష్టాలను ఎదుర్కొని మనిషి బయటపడుతుంటాడు. కానీ, శక్తికి మించిన ఆపదలు వచ్చినప్పుడు ఆకాశంవైపు చూసి చేతులు జోడిస్తాడు. ఆపద తొలగేవరకు ఆందోళన చెందుతాడు. సమస్య తొలగిపోతే దేవుడు కరుణించాడని కృతజ్ఞతలు చెప్పుకొంటాడు. లేని పక్షంలో దేవుడి ఉనికినే సందేహిస్తాడు. నిందిస్తాడు కూడా.


శ్రీకృష్ణ తులాభార సన్నివేశంలో భగవంతుడి దివ్యతత్వం గురించి నారదమహర్షి సత్యభామకు వివరిస్తాడు.


రాసులకొద్దీ ధనకనక వస్తువులు ఎన్ని వేసినా, తులాభారం తూగదు. చివరకు రుక్మిణి సమర్పించిన తులసి దళంతో తూగుతుంది.


అప్పుడు నారదుడు భక్తికితప్ప మరిదేనికీ శ్రీహరి వశుడు కాడన్న పరమ రహస్యాన్ని ప్రకటిస్తాడు. ఇది ఆస్తిక ప్రపంచానికి ఒక అద్భుత సందేశం.


లోకాలన్నీ సృష్టించి, పోషిస్తున్న పరమాత్మను ప్రాపంచిక వస్తువులతో ఆకట్టుకోగలమా? ఈ ప్రశ్న ఎవరూ వేసుకోరు. అందువల్లనే కొబ్బరి కాయల కొలమానం మొదలెడతారు. ఎన్ని పూజలు, పునస్కారాలు, రాసులకొద్దీ నివేదనలు సమర్పించినా- భక్తి లేకపోతే, అవి పరమాత్మను మెప్పించలేవు.


పత్రం, పుష్పం, ఫలం, తోయం- ఇవన్నీ చాలా సాధారణ వస్తువులు. సామాన్యులందరికీ అందుబాటులో ఉంటాయి. వీటిని భక్తితో తనకు సమర్పిస్తే, ఇష్టంగా స్వీకరిస్తానంటాడు కృష్ణుడు. అనడమే కాదు- విదురుడు పెట్టిన అరటిపండు తొక్కను ఆప్యాయంగా స్వీకరించి ఆరగించాడు. విదురుడు పరమభక్తుడు. కృష్ణుడు విదురుడి భక్తినే చూశాడు. పారవశ్యంతో అతడిచ్చినది పండు కాదని తెలిసినా, స్వీకరించాడు.


శబరి ఎంగిలి పండును శ్రీరాముడికి సమర్పించిన సన్నివేశం కూడా ఇలాంటిదే. దశరథుడు శ్రీరాముని పుత్రుడిగా పొందడానికి, ‘రారా...కన్నా...’ అంటూ ఆలింగనం చేసుకునేందుకు తపమేమి చేసెనో- అని త్యాగరాజు కీర్తించాడు.


నిజమైన భక్తులు పూజా సమయంలో మాత్రమే భగవంతుని ఆరాధించరు. వారు అనుక్షణం తమలోని అంతర్యామితో అనుబంధం కలిగి ఉంటారు. ఆనందంలో ఓలలాడుతుంటారు. కీర్తనలు పాడతారు. పరవశంతో నాట్యాలు చేస్తారు. చైతన్య మహాప్రభు, శ్రీరామకృష్ణులు ఇలాంటి స్థితిలోనే ఉండేవారు. అంతర్యామి దర్శన భాగ్యం లభించాక పాదాలు నిలవవు. మనసు ఆనందంతో గెంతులేస్తుంది.


‘పిబరే రామరసం’ అంటూ ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ పాడిన పాటను సామాన్య భక్తులు ఎలా ఆలపించగలరు?


ప్రపంచంలో మనకు కొండ గొప్పదిగా కనిపిస్తుంది. అందుకే కొండంత దేవుడు అంటారు. కానీ, ఆయన మేరుపర్వతం కన్నా గొప్పవాడు. అంతటి దేవుడికి కొండంత పత్రిలాగా ఆడంబర నివేదనలు అవసరంలేదు.


భక్తితో చింతాకంత నివేదనకు- ద్రౌపది అక్షయపాత్రలోని అడుగునగల మెతుకు తిని తృప్తి చెందినట్లు ఉంటుంది ఆయన అనుగ్రహం. ఆ అనుగ్రహం పొందగలిగితే జీవితం ధన్యం.

శ్రీ భాగవతం దశమ స్కంధం

 శ్రీ గురుభ్యో నమః శుభమస్తు 

        ........................... 


              ............ 


కంసుడికి తనను సంహరించే 

శక్తిమంతుడు పుట్టి, పెరుగుతున్నాడని, వానిని సంహరింపమని ఆనతి ఇచ్చాడు 


విష్ణువును సంహరించాలంటే, ఆతని దేహము దొరకాలి. ఆతను, ధర్మములో నిలిచి యుండేవాడు. 

అది ఒకచోట దొరకదు. ఆతనికి ఎన్నో శరీరములు ఉంటాయి. 

గోవులు, బ్రాహ్మణులూ, వేదములు, తపస్సులు, యాగాలు , శాంతి ఇవన్నీ ఆయన వుండే ప్రదేశాలే. వాటిని అంతంచేస్తే , ఆతనికి నిలువ నీడ యుండదు. కంసుడి ఆలోచనలు ఇలా సాగాయి. సాధు జనాలను, 

హింసించడానికి, ఆదేశాలు ఇచ్చాడు. ఇక రాక్షసుల అకృత్యాలకు అంతే లేకపోయింది. 

ధర్మ ఆచరించే, సజ్జనుల హింసించసాగారు. సమయా సమయాలు లేకుండా పాపాల్ని మూటగట్టుకున్నారు. పూజ్యులను హింసించితే, కీర్తి, ఐశ్వర్యము , ఆయుష్షు తగ్గిపోతాయని వారికి 

తెలియదు. 


ఇలాటి పాపులలో, పూతన అనే రక్కసి ఒకటి యుంది. 

శిశువులను చంపడంలో ఆరితేరింది. కామరూపిణి. మాయ వేషాల్లో పల్లెలలో తిరుగుతూ పసి పిల్లలను చంపసాగింది 

ఆకాశ మార్గాన వ్రేపల్లె చేరింది. 

నందుడి ఇంట్లో, ఒక బాలుడి ఏడుపు వింది. సంతోష పడింది 

మోహనాకారిణి గా మారింది వ్రేపల్లె వీధుల్లో తిరగ సాగింది. 

ఆమె సౌందర్యానికి గోపికలు ముగ్ధులయ్యారు 

"అమం శతాంభోజక రేణ రూపిణీం 

 గోష్య:శ్రియం ద్రష్టుమివాగతాం పతిం "


శ్రీకృషుని దర్సించుటకు అరుదెంచిన లక్ష్మి అని అనుకున్నారు.    

ప్రకాశించే కండ్లు, ఎత్తైన వక్షోజాలు, చంద్రుడిని బోలుముఖము, సన్నని నడుము, 

అల నాటి మోహిని అవతార రూపంతో నందుడి ఇంట అడుగు పెట్టింది. 

పూతన ఊయల వైపుకు నడిచింది. ఊయలలో బాల కృషుని రూపాన్ని చూసింది. మాములుగా అయితే స్వామి పూతనను తేరి పార చూసేవాడు. 

ఇది శిశు ఘాతి అని ముందే అర్ధం అయింది. ఏమి తెలియనట్లు కండ్లు మూసుకున్నాడు. 

స్వామికి రత్నమాల గుర్తుకు వచ్చింది. రత్నమాల ఎవ్వరో కాదు. బలిచక్రవర్తి, వింధ్యావళీ ల 

కూతురు. తన తండ్రి చేస్తున్న యాగ సమయం లొ దానము తీసుకొనడానికి వచ్చిన వామనుడి ని చూసింది. ఆతని బ్రహ్మ వర్చ్చస్సు, ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అలాటి పుత్రుడు, ఒకడు తనకంటే బాగుణ్ణు అనుకొంది. కానీ తరువాత అదే వామనుడు తన తండ్రిని పాతాళానికి త్రొక్కెయ్యడం చూసి, క్రౌర్యం పెంచుకుంది. పుత్రభావం తో ఇవ్వాలనుకున్న తన చను బాలను, శత్రుభావంతో విష పూరితం చేసి, వామనుణ్ణి చంపితే బాగుణ్ణు అనుకొంది. ఆ సంకల్పం 

అప్పుడు నెరవేరలేదు. మంచి మనసుతో భగవంతుడిని కాసేపు ఆరాధన భావంతో స్మరించిన పుణ్యానికి, ఈ రోజు రత్నమాల పూతన రూపంలో తీర్చుకుంటున్నదని అంటారు.

దేవకి కి లభ్య పడని అదృష్టం, ఇప్పుడు పూతనకు లభ్యం కావడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి కదా !

భగవంతుడు ఎవరిని, ఎప్పుడు అనుగ్రహిస్తాడో, ఎందుకు అనుగ్రహిస్తాడో, మనకు అవగతం కాదు. 

పూతన వేసే ప్రతి అడుగు మృత్యువు వైపుకి అనుకోవాలా లేక మోక్షం వైపు వైపుకు అనుకోవాలో! ఆ పాప పుణ్యాలు ఆయనకే ఎరుక. 


ఉయ్యాల లోని బిడ్డను పూతన ఎత్తుకొని తన వడి లొ ఉంచుకొంది. 

"అనన్త మారోప యదజ్ఞ మస్తకం 

యథోరగం సుప్తమబుద్ధి రజ్జు ధీ "

సర్పమును త్రాడుగా భావించి, అజ్ఞానంతో, మానవుడు ఆ పామును వొడిలో వుంచు కున్నట్లు, తనను వధించడానికి ఆయత్త మవుతున్న శ్రీకృషుని, పూతన తన వడిలో వుంచు కొన్నది. 

విషం కక్కే తన చనుబాలు, నల్లనయ్యకు, ఇస్తే, ఇంక నల్లగా మారి, మాడి, నశిస్తాడని పూతన ఉద్దేశ్యము. పైట తొలగించింది, స్తనాన్ని, స్వామి ఆధరాలకు అందించింది. సూర్యుడిని మబ్బుకమ్మినట్లు, తన పైట చెంగు కృష్ణయ్య మొహానికి కప్పింది. 

పూతన ఎంత అదృష్టవంతురాలైన స్త్రీయో !

స్వామి ప్రతి అంగము పూజనీయమే !నాడు పాదాలు తండ్రి బలిని పాతాళానికి పంపితే. ఈ రోజు స్వామి అధరాలు కుమార్తె కు మోక్షాన్ని ఇస్తున్నాయి. 

వేదాలు వల్లించిన అధరాలు. 

తల్లి కి తత్వమును నేర్పిన ఆధరాలు. 

మోహన మురళి గానం తో జగత్తును పరవశింప చేయనున్న 

అధరాలు. 

శ్రీమహాలక్ష్మి కే స్వంతమైన అధరాలు 

సుకుమారంగా సున్నితంగా, మధుర సంభాషణలతో, శ్రీ లక్ష్మి 

 చెక్కిళ్ళు చుంబించే ఆధరాలు. ఇపుడు పూతన కు మారణాయుధాలు కాబోతున్నాయి 


కళ్ళుమూసినస్వామిపరమశివుడిని ప్రార్ధించాడని అంటారు. పూతన గరళం ను ఆస్వాదించడం గరళ కంఠుడి కే తెలుసునని, ఆయనను ఆ సమయంలో సాయం అర్ధించ దానికి ధ్యానం లోకి వెళ్లడంటారు.


పూతన అందించిన కుచ మొనను  

స్వామి పెదవులు అందుకున్నాయి. ఈ దృశ్యం చూస్తున్న దేవత లందరు అసూయపడ్డారు. గోవులు గోవు పొదుగులు దీనంగా చూశాయట. 

పూతన అనిర్వచనీయ అనందం, పారవశ్యం తొలి క్షణాలవరకే. మొదట ఆనందంతో మెలికలు తిరిగిన పూతనకు, భరించరాని భాధ ప్రారంభం అయింది. ప్రాణాలను ఎవరో గుంజుకుంటున్న భాధ !గిల గిల కొట్టుక సాగింది. విడు, విడు అని కేకలు పెట్టింది. నలుగురు చేరకముందే, ప్రాణాలు వదిలింది సహజమైన వికృత రూపం మహాపర్వతం లా పడిపోయింది. 

ప్రకృతి అతలా కుతలం అయింది.  


"పత మానో పి తద్దేహ స్త్రీగవ్యూ త్య స్త రుద్రమాన్ 

చూర్ణాయామాస రాజేంద్ర మహాదాసీత్త దద్భుతం 


ఆరు క్రోసుల లోని వృక్షాలు అన్ని నుగ్గు నుగ్గు అయ్యాయట. 

ఆ వికృతకారాన్ని చూడడానికి అందరు భయపడ్డారు 

ఆరురోజుల క్రితం జనియించిన 

శ్రీకృష్ణుడు ఆరక్కసి కుచముల దగ్గర ఆడుకుంటూ కనిపించాడట. 

యశోద బిడ్డను అందుకొని . బిడ్డకు దిష్టి తీసి రక్షరేఖలు కట్టింది. 


ఇంటికి వచ్చిన నందుడు విషయం తెలుసుకొని, వసుదేవుడు తనకు చెప్పిన జాగ్రత్త్తలు గుర్తు చేసుకొని , బాల కృష్ణుడు పట్ల 

జాగ్రత్త వహించడం మొదలు పెట్టాడు 


పూతన శరీరము దగ్ధం చెయ్యడానికి వ్రేపల్లె వాసులు బహుకష్టపడ్డారు. పూతన శరీరం 

కాలుతుంటే అగరు సువాసనలు 

వచ్చాయట. 

"హరి దనమీదం బదములు, కరములు నిడి చన్ను గుడిచి కదిసిన మాత్రన్ 


హరిజనని పగిది బరగతి, కరిగెను 

దురితముల బాసి యసురాంగనయున్ 


కృష్ణుడు కాళ్ళు చేతులు వేసి చనుబాలు తాగినంత మాత్రము న

రక్కసి పూతన పాపాలు పటా పంచలు అయి పోయాయి. 

బాలకృష్ణుని ఒకసారి స్మరించి, 

ధ్యానం చేయడం మంచిదంటారు 


        శుభమస్తు

ఆదిపర్వము -29

 

కురు, పాండవుల జననం


కుంతీ దేవి భర్త పడుతున్న ఆవేదనకు చలించి పోయింది. ఆమెకు చిన్నప్పుడు దుర్వాస మహాముని ఉపదేశించిన మంత్రం గుర్తుకు వచ్చింది. తనకు కర్ణుడు పుట్టడం తప్ప మిగిలిన విషయం అంతా పాండురాజుకు చెప్పింది.


“పాండురాజా, ఆ మంత్రం సహాయంతో మనకు సంతానం కలుగుతుంది. నేను ఏ దేవతను ఆరాధించాలో చెప్పండి?” అని అడిగింది కుంతి.


“కుంతీ, ధర్మ దేవుడి మించిన దేవత లేదు. అతనిని స్మరింపుము” అన్నాడు.


అలా భర్తచేత నియోగింపబడిన కుంతి, శుచి అయి ధర్మదేవుడిని, మనసారా ధ్యానించింది. ధర్ముడు ఆమెకు ప్రత్యక్షం అయ్యాడు. అతని దయవలన కుంతీదేవి గర్భం ధరించింది. ఒక సంవత్సర కాలం పూర్తి కాగానే ఒక కుమారుడు జన్మించాడు. ఆకాశవాణి ఆ బిడ్డకు యుధిష్టిర అని నామకరణం చేసింది. అది చూసి అక్కడున్న మహాఋషులు అతను కురు వంశానికి రాజు అవుతాడని, ధర్మం తప్పకుండా రాజ్యం చేస్తాడని పలికారు.


ఇదిలా ఉండగా, హస్తినా పురంలో ధృతరాష్ట్రుడి వలన గాంధారి గభవతి అయింది. అదీ కూడా కుంతీదేవి కన్నా ముందే గర్భవతి అయింది. కాని ఎంతకు ఆమేకు ప్రసవం కాలేదు. ఇంతలో కుంతీదేవికి యుధిష్టిరుడు పుట్టాడని వార్త తెలిసింది. అది విని భరించలేక, గాంధారి తన కడుపు మీద కొట్టుకుంది. ఆమెకు గర్భస్రావం అయింది.


అది విని కృష్ణద్వైపాయనుడు హస్తినకు వచ్చాడు. వెంటనే ఆ మాంస ఖండాలను, 101 భాగాలుగా విభజించి, వాటిని నేతి కుండలలో పెట్టి కాపాడమని, ఆమెకు 100 మంది ప్పుత్రులు, ఒక పుత్రిక కలుగుతారని చెప్పాడు. గంధారి కృష్ణద్వైపాయనుడు చెప్పినట్టు చేసింది.

అక్కడ శతశృంగ పర్వతము మీద ఉన్న పాండురాజు మరొక కొడుకు కావాలనిపించి “కుంతీ, ఈ సారి నువ్వు వాయుదేవుడిని స్మరించి, అంతటి బలసంపన్నుడైన కొడుకును పొందుము” అని చెప్పాడు.

ఇక్కడ భీముడు పుట్టిన రోజే, హస్తినా పురంలో, కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు. తరువాత రోజుకు ఒక్కరు చొప్పున, నూర్గురు కుమారులు జన్మించారు.


తరువాత 101వ పిండము పగలగా, అందులో నుడి దుస్సల అనే కూతురు పుట్టింది. ధృతరాష్ట్రుడికి వైశ్య కులమునకు చెందిన మరొక భార్య వలన యుయుత్సుడు అనే కొడుకు పుట్టాడు.

దుర్యోధనుడు పుట్టీపుడు అనేక దుశ్శకునాలు గోచరించాయి. ఆ దుశ్శకునాలను చూసి భీష్మాదులు కలత చెందారు. భీష్ముడు, విదురుడు, బ్రాహ్మణులు ఇలా అన్నారు.


“ధృటరాష్ట్ర మహారాజా, దుర్యోధనుడు పుట్టినపుడు అనేక దుశ్శకునాలు గోచరించాయి. కులక్షయకారకుడైన దుర్యోధనుని వదిలివేసి, కులమును రక్షించరాదా. నీకు వందమంది పిల్లలు ఉన్నారు కదా” అని పలికారు. కాని పుత్రుడి మీద మమకారంతో, ధృతరాష్ట్రుడు వాళ్ల మాటలు వినలేదు.


శతశృంగ పర్వతము మీద ఒకరోజు కుంతీదేవి, వాయుదేవుని అంశతో పుట్టిన భీముని ఎత్తుకుని దేవాలయానికి వెళుతూ ఉంది. ఇంతలో ఒక పులి కుంతీదేవి మీదికి దుమికింది. పాండురాజు తన బాణములతో పులిని చంపాడు. కాని, పెద్ద పులి భయంతో కుంతీదేవి వణికిపోయింది. ఆమె చేతిలో ఉన్న భీముడు కింద పడ్డాడు. కేవలం పది రోజుల వయసు ఉన్న ఆ బాలుని శరీరం పడ్డ చోట రాళ్లు పొడి పొడి అయ్యాయి. ఇది చూసి పాండురాజు ఆశ్చర్యపోయాడు.

ఇంతలో గాంధారికి నూరు మంది కొడుకులు కలిగారని వార్త తెలిసింది. తనకూ ఇనకా కొడుకులు కావాలని కోరుకున్నాడు. పాండురాజు దేవేంద్రుని గూర్చి తపస్సు చేసాడు. దేవేంద్రుడు ప్రత్యక్షం అయి, “పాండురాజా, నీకు ముల్లోకాలను జయించే కొడుకు పుడతాడు” అని వరమిచ్చాడు.


కుంతీదేవికి ఇంద్రుని అంశతో పౌరుష వంతుడు, తెజోవంతుడు అయిన కుమారుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రములో జన్మించాడు. అప్పుడు ఆకాశవాణి “ఇతను కార్త వీర్యార్జుని కన్నా వీరుడు అవడం వలన, అర్జునుడు అనే పేర్తో పిలువబడతాడు” అని పలికింది. పాండురాజు, కుంతీదేవి త్రిమూర్తులతో సమానమైన ముగ్గురు కొడుకులతో ఆనందంగా కాలం గడుపుతున్నారు.


అక్కడ గాంధారికి 101 మంది సంతానం కలిగారు. ఇక్కడ కుంతీదేవికి ముగ్గురు సంతానం కలిగారు కాని పాండురాజు రెండవ భార్య అయిన మాద్రికి సంతానం లేరు. దానికి ప్రతిరోజూ చింతిస్తూ ఉంది. ఒకరోజు తనకు కూడా సంతానం కావాలని భర్తను అడిగింది. పాండురాజు కుంతీదేవిని పిలిచి, మాద్రికి కూడా సంతానాన్ని కలుగచెయ్యమని అర్థించాడు.


కుంతీదేవి భర్త మాట ప్ర్కారం, సకలలోక కళ్యాణ కారకులైన అశ్వినీ దేవతలను ప్రార్థించింది. వారి వల్ల మాద్రికి ఇరువురు పుత్రులు జన్మించారు. వారికి ఆకాశవణి నకులుడు, సహదేవుడు అని నామకరణం చేసింది.


కుంతీదేవికి సంతానం కలిగార్న్న విసహ్యం కుంతీదేవి అన్నయ్య వసుదేవుడికి తెలిసింది. ఆయన తన చెల్లెలి పిల్లలకు ఎన్నో కానుకలను తన పురోహితుడైన కశ్యపునిచేత పంపించాడు.

ఇంతలో వసంత కాలం వచ్చింది. ఒకరోజు పాండురాజు, తన రెండవ భార్య మాద్రి మనోహర రూపం చూసాడు. తన్మయుడై, ముని శాపాన్ని మరిచాడు. బలవంతంగా ఆమెతో సంభోగ సుఖాన్ని అనుభవించాడు. ప్రాణాలు కోల్పోయాడు.


ఇందంతా చూసి మాద్రి భయంతో వణికిపోయింది. భర్త శవాన్ని చూసి పెద్దగా ఏడవసాగింది. కుంతీదేవి అక్కడికి వచ్చి భర్త శవాన్ని చూసింది, జరిగింది అర్థమైంది. వెంటనే సహగమనానికి సిధ్ధపడింది. కాని మాద్రి అందుకు ఒప్పుకోలేదు.


“అక్కా, నా వలననే మన భర్త మరణించాడు. ముని శాపం తెలిసికూడా అజాగ్రత్తగా ప్రవర్తించాను. ఇంత జాగ్రత్త లేని దాన్ని నేను మన కొడుకులను కాపాడలేను. నువ్వే వీరిని కాపాడాలి. అందువల్ల నేనే సహగమనం చేస్తాను” అని చెప్పింది. వెంటనే పాడురాజు చితి మీదికి ఎక్కి సహగమనం చేసింది.

రామాయణమ్.94

 

...

భరతుడు తండ్రికి చేయవలసిన పితృకార్యాన్ని పూర్తిచేశాడు.అది పధ్నాల్గవరోజు దశరధుడి చితికి నిప్పంటించి. 

.

రాజ్యాభిషేకమహోత్సవము జరిపించే అధికారముగల మంత్రులంతా భరతుని సందర్శించారు.

.

ఆయన సముఖంలో నిలిచి నీ తండ్రి,మరియు నీ అన్నగారు ఇరువురూ రాజ్యము నీకు ఇచ్చివేశారు ఇక నీవు రాజ్యలక్ష్మిని చేపట్టవలసి ఉన్నది అందుకు ఏ మాత్రము ఆలస్యమైనా రాజ్యములో అరాచకము ప్రబలవచ్చును.ఇప్పటివరకూ ప్రజలు శాంతితో సహజీవనం చేస్తున్నారు.ఎవరూ ఎవరినీ పీడించడంలేదు.ఇప్పటివరకు ఏ ఉపద్రవమూలేదు.

.

నీ పట్టాభిషేకమునకు సర్వము సిద్ధం చేసినాము అని పలికి నిలిచారు వారంతా!

.

భరతుడు సగౌరవముగా వారందరికి నమస్కరించి వారు అప్పటికే తెచ్చి అక్కడ ఉంచిన అభిషేక సామాగ్రికి ప్రదక్షిణనమస్కారములు చేసి అమాత్యలతో ఇలా అన్నాడు.

.

మా వంశములో ఎల్లప్పుడూ పెద్దకుమారుడే రాజు ! అది ఉచితము అదే మా వంశాచారము.మీరీవిధముగా మాట్లాడవద్దు.

.

మా రాముడే రాజు ఆయన బదులుగా పదునాల్గు సంవత్సరాలు నేను అరణ్యవాసం చేస్తాను.

.

చతురంగబలాలు సిద్ధం చేయండి ,మహాసైన్యాన్ని సమకూర్చండి నేను నా జ్యేష్ఠసోదరుడైన రాముని అరణ్యం నుండి తీసుకు వచ్చెదను మనము ఆయననే రాజుగా అభిషేకించవలె!.

.

మనము రామునివద్దకు వెంటనే ప్రయాణము కావలె మార్గములు నిష్కంటకములు గావించండి,చక్కని రహదారులు గంగాతీరము వరకు ఏర్పాటుచేయించండి,దిగుడుబావులు తవ్వించండి .అని ఆజ్ఞాపించాడు భరతుడు.

.

అమాత్యలంతా క్షణంలో ఆ పనులన్నీ పూర్తిచేసి ఆయనకు తెలిపారు.

.

ఆయాప్రాంతములు,ప్రదేశముల స్వరూప,స్వభావములు తెలిసినవారు(topographers),సూత్రములుపట్టికొలతలు వేయువారు (surveyors),

నేలను తవ్వేవారు( earthmovers)

యంత్రాలుపయోగించేవారు,శిల్పులు (Architects)

వడ్రంగులు(Carpenters)

.కూలివారు,చెట్లునరికిమార్గముఏర్పరచేవారు,బాటవేయువారు,వేసినబాటమీద సున్నముపరచి పటిష్ఠము చేయువారు(Road builders) ,,వెదురుపనివారు,సమర్ధులైన పర్యవేక్షకులు (Supervisors) అందరూ ముందుగా బయలు దేరి వెళ్ళారు.

వారితోపాటు అపారజనసమూహము బయలుదేరింది బాటలన్నీ పౌర్ణమినాడు ఉప్పొంగిన సముద్రాలలా ఉన్నాయి.

.

భరతుడి ఉదాత్తమైన ఈ పలుకులకు జనులందరి కనులనుండి ఆనందబాష్పములు జలజలరాలినవి.

.

మనమంతా రాముని వెనక్కి తీసుకునే రావాలి!

 అదే మన ధ్యేయం,అదేమనకర్తవ్యం అన్నట్లుగా అందరూ దీక్షపూని సాగుతున్నారు

.

ఆ రాత్రిగడచి తెల్లవారుతుండగా మంగళవాయిద్యములతో కూడిన స్తోత్రము లతో భరతుని స్తుతించసాగారు వందిమాగధులు,బంగారుదండములతో కొట్టి యామదుందుభి మ్రోగించసాగారు. భరతుడు నిదురలేచి ఆ స్తోత్రపాఠాలు,ఆదుందుభిస్వనాలు ఆయన హృదయంలో తీవ్రమైన వేదనరగిలించగా వెంటనే అందరినీ వాటిని ఆపమన్నాడు ,"నేను రాజును కాను" అని వారికి చెప్పి అన్నింటినీ ఆపివేసినాడు.

.

ప్రక్కనే వున్న శత్రుఘ్ననితో చూడు కైకవలన ఎంత అపకారం జరిగిందో ఆ మహారాజు దుఃఖాలన్నీ నాకు వదిలి వెళ్ళిపోయాడు .

.

మన అందరికీ రక్షకుడైన రాముడిని ధర్మహీనురాలైన నా తల్లి స్వయముగా అడవికి పంపినది.రాజ్యము చుక్కానిలేని నావ అయినది.

.

NB.

ప్రాచీన భారతావనిలో ఎన్ని వృత్తులు పరిఢవిల్లినవో గమనించగలరు .మహర్షి ఎన్ని వృత్తులవారి గురించి చెప్పారో చూడండి.అదీ భారతదేశం అంటే!



రామాయణమ్ 95

..

 తన తదుపరి కర్తవ్యము

 శ్రీ రాముని మరల అయోధ్యకు రప్పించి పట్టాభిషిక్తుడిని చేయటమే ! అని మనసులో దృఢపరచుకొన్న భరతునికి వశిష్ఠుల వారు రాజసభలో ఉన్నారు మిమ్ములను రమ్మనమని అన్నారు అనే కబురు వచ్చింది.

.

రాజసభాప్రాంగణంలో సకలసంభారాలతో సిద్ధంగా ఉన్నారు మహర్షి ! భరతుని చూడగనే "నాయనా ! నీతండ్రీ ,అన్నగారు ఇచ్చిన ఈ రాజ్యాన్ని స్వీకరించి ధర్మబద్ధంగా పరిపాలన సాగించు "అని పలికి భరతుడి ఆమోదం కోసం ఎదురు చూశాడు.

.

కనుల నీరునింపుకొని దోసిలి ఒగ్గి మహాత్మా రాముని రాజ్యమిది ! ఇక్ష్వాకుల లో ధర్మము తప్పి నడిచినవారు ఎవరైనా ఉన్నారా! ధర్మాత్ముడైన దశరధుడికి పుట్టినవాడు చేయవలసిన పనేనా ఇది ! దశరధుడి కొడుకు ఇంకొకరి సొత్తును అపహరిస్తాడా?

.

నేను ,ఈ రాజ్యము రాముడిసొత్తు! 

మా లో పెద్దవాడు ,దిలీప,నహుషులతో సమానుడూ అయిన రామునకే ఈ రాజ్యముపై అధికారము ,.వేరెవ్వరికీలేదు!.

.

నా తల్లి చేసిన పాపకార్యము నేనెన్నటికీ అంగీకరించను.

రాముడి ని అనుసరించటమే నాకు తెలిసినది.

.

ఏ కారణము చేతనైనా అన్నగారిని తీసుకొని రానట్లయితే నేనుకూడా లక్ష్మణునిలా అడవిలో ఉండిపోతాను.

.

మార్గములు ఏర్పరచేవారు,రక్షించేవారు,తదితరులంతా నాచేత ముందుగనే పంపబడినారు.

.

అని పలికి సుమంత్రునివైపు తిరిగి , వెంటనే రామునివద్దకు బయలుదేరడానికి కావలసిన ఏర్పాట్లు చేయమని, సైన్యంతో సహా సిద్ధం కావాలని ఆదేశించాడు.

.

భరతుడి ఆజ్ఞవిని సుమంత్రుడు ఉత్తమాశ్వాలు పూన్చిన రధం సిద్ధం చేసి ఉంచాడు.

.

పిమ్మట ప్రాతఃకాలమునందే లేచి శ్రేష్టమైన రధమెక్కి బయలుదేరాడు భరతుడు.ఆయన వెంట అయోధ్యలోని అధికారగణమంతా బయలుదేరింది.చతురంగబలాలు కదిలాయి. అయోధ్య అంతాకదిలింది.

.

అందరి మనసులో ఒకటే లక్ష్యం రాముడిని త్వరగా చూడాలని.

మనసుతో సమానంగా పరిగెత్తాలని కోరిక!.

.

అలా ప్రయాణం చేస్తూ గంగ ఒడ్డుకు చేరుకున్నారంతా!.

భవభూతి

 భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ " నాటకం వ్రాయటం పూర్తిచేసిన తర్వాత, దాన్ని 

ఆ కాలంలో అతిప్రసిద్ధుడైన కాళిదాస మహాకవికి చూపించి ఆయన అభిప్రాయం 

తెలుసుకోవాలని కొన్నాళ్ళు తహతహలాడాడు బాణభట్టులాగే.

తీరా నాటకం చదివి నచ్చకపోతే మహాకవి ఏమంటాడో అని (బాణుడిలాగే ) ఒక శంక.

అందువల్ల తను స్వయంగా కాళిదాసుకు నాటకం చూపించటానికి సంశయించి, తన 

కుమారుడికి తన కుమారుడికి తన తాళపత్రగ్రంథం యిచ్చి కాళిదాసు యింటికి పంపాడు.

 కాళిదాసు యింట్లో కూచుని చదరంగం ఆడుకుంటున్నాడు. భవభూతి కుమారుడు కాళిదాసుతో మీరు కొంచెం సమయమిస్తే, మా నాన్నగారి నాటకం మీకు వినిపించి మీ 

అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను. అన్నాడు.

వేరే సమయమెందుకు?వచ్చావుగదా!యిప్పుడే చదివి వినిపించు. ఒక చెవి పడేసి వినేస్తాను. అన్నాడు చదరంగం బల్లమీది నుంచి దృష్టి కూడా మరల్చకుండా.

భవభూతి కుమారుడికి మనసు చివుక్కుమంది. తన తండ్రి వ్రాసిన మహాకావ్యం, శ్రద్ధపెట్టి వినేందుకు కూడా యిష్టం లేని ఈ అహంభావికి నాటకమంతా వినిపించటం చెవిటివాడి 

ముందు శంఖమూది నట్టు గదా! అనిపించింది. కానీ ఏంచేస్తాడు?తన తండ్రికి కాళిదాసు గురుతుల్యుడు, అంతకంటే ఎక్కువే. ఈయన అభిప్రాయం తెలుసుకుంటే తప్ప 

ఆయనకు మనః శాంతి లేదు. చేసేది లేక నాటకమంతా చదివి వినిపించాడు.

చదివాడు కానీ కాళిదాసు ఒక్క ముక్కైనా విన్నాడని అతనికి నమ్మకం లేదు. ఆయన మానాన ఆయన చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇటుపక్కకు తిరిగి చూడనైనా 

చూడలేదు. అంతా చదివాక మాత్రం,నోటినిండా తాంబూలం తో అస్పష్టన్గా సున్నా ఎక్కువైంది అని మాత్రం వినిపించింది. భవభూతి కుమారుడికి 'ఓహో! ఈ వ్యసనపరుడైన అహంభావికి తాంబూలంలో సున్నం ఎక్కువైనట్లుంది. దానిమీద వున్న

ఆసక్తి గూడా ఈయనకు యితరులు వ్రాసిన కావ్యాల మీద లేదు.అనుకొన్నాడు. ఆ 

నిర్లక్ష్యం, అనాసక్తి అతన్ని బాగా నొప్పించాయి.

ఒకనమస్కారం పెట్టి యింటికివెళ్ళి తండ్రితో జరిగినదంతా చెప్పాడు. విని ఆయనకూడా చిన్నబుచ్చుకున్నాడు. 

తండ్రీ కొడుకులిద్దరూ యిలా దిగాలుగా కూర్చొని వుండగా, కాళిదాసేభవభూతి యింటికి వచ్చాడు. వస్తూనే భవభూతిని కౌగలించుకొని ఎంత గొప్పగా వ్రాశావయ్యా! గ్రంథం' 

అని మెచ్చుకున్నాడు. భవభూతి ఆయనను కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు.

  మాటల మధ్యలో భవభూతి,కాళిదాసుతో మహాకవీ, నా కుమారుడు మీకీ నాటకం చదివి వినిపించినప్పుడు మీరు మరేదో పనిలో వుండి, అంత శ్రద్ధగా వినలేక పోయారనీ చెప్పాడు. అంతా విన్న తర్వాత కూడా మీరు నాటకం విషయం ప్రస్తావించకుండా, మీ

తాంబూలంలో సున్నం ఎక్కువవడం గురించి మాత్రం ఏది అన్నారని చెప్పాడు. మీరేమో 

యిప్పుడు నా నాటకాన్ని ఇంతగా ప్రశంసిస్తున్నారు. ఏదో సాటి కవినని మర్యాదతో 

మీరిలా అంటున్నారనని అనుకుంటున్నాను. మీరేమీ అనుకోకపోతే, మరోసారి నాటకమంతా నేనే స్వయంగా మీకు చదివి వినిపిస్తాను. ఈసారైనా విని మీ సూచనలూ, 

అభిప్రాయమూ నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తాను. అన్నాడు.

కాళిదాసు నవ్వాడు; 'కవిరాజా, నాకు కావ్యరచనలో, కావ్య పఠనంలో, శ్రవణంలో వున్న 

ఆసక్తి మరే విషయంపైనా లేదు. మీ చిరంజీవి చదువుతున్నప్పుడు, నేను మీ కావ్యం 

క్షుణ్ణ౦గా, శ్రద్ధగా విన్నాను. పూర్తిగా ఏకాగ్రతతో. మీరు కావాలంటే నేను ఆ నాటకం 

ఆమూలాగ్రం ఇప్పటికిప్పుడు తిరిగి చెప్పగలను. నాటకం నాకెంతో నచ్చింది కనుకే

నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని అభినందించటం నాధర్మం అని భావించి వచ్చాను.నేను అన్నమాటలు పై పై మర్యాదకోసం చెప్పినవి కావు.' అన్నాడు.

ఇక సున్నం విషయమా? మీ అబ్బాయి నేనన్నది సరిగా వినలేదు. నేనన్నది సున్నం గురించికాదు. 'సున్న' గురించి , నాటకం లో ఒకే ఒకచోట ఒక్క సున్నాఎక్కువైందేమో 

ఆ సున్నా తీసేస్తే ఆ శ్లోకం మరింత రమ్యంగా వుంటుందేమో ననిపించింది. అందుకే సున్న ఎక్కువైందేమో నాని చిన్న సూచన చేశాను తప్ప మీ అద్భుతమైన నాటకం లో 

ఏ చిన్న మార్పూ అవసరం లేదు.

ఆ మాటలువిని భవభూతి ఉప్పొంగి పోయాడు. ఉత్సాహంగా సున్న ఎక్కువైంది ఏ శ్లోకం లో స్వామీ?నాటకంలో శ్లోకాలన్నీ గబ గబ మీకు వినిపిస్తాను.దయచేసి చెప్పండి. అన్నాడు.

ఆ అవసరం లేదు. నీ కావ్యంలో ఏ శ్లోకమైనా నేను మరిచిపోతే కదా నువ్వు నాకు గుర్తు చేసేది? మొదటి అంకం లోనే, రాముడు తను అరణ్యవాసంలో సీతతో గడిపిన తొలిరోజులు గుర్తు చేసుకుంటూ వుండే సందర్భంలో ఒక మనోహరమైన శ్లోకం చెప్పావు.

     కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్ 

     అవిరళిత కపోలం జల్పతోర క్రమేణ 

     అశిధిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణో

     అవిదిత గతయామా రాత్రి రేవం వ్యరంసీత్

(అశిధిల పరిరంభ -వ్యాపృత-ఏక - ఏక - దోష్ణో: = అతి సన్నిహితంగా ఒకరి బాహువులలో

ఒకరుగా ఒదిగి ;

అవిరళిత కపోలం - చెక్కిలికీ చెక్కిలికీ మధ్యస్థలం లేకుండా 

ఆసక్తి యోగాత్ - అక్రమేణ - కిమపి కిమపి - మందం మందం - జల్పతో: = ఆసక్తి బట్టే తప్ప - మారె వారసలేకుండా - ఏవేవో ముచ్చట్లు - గుసగుసలుగా చెప్పుకుంటున్న 

(మనకు)

అవిదిత గతమయామా - రాత్రి: - ఏవం - వ్యరంసీత్ = తెలియకుండా దొర్లిపోయిన 

జాములు గల రాత్రి యిలా గడిచిపోయింది.

అవునవును అన్నాడు భవభూతి.

అందులో రాత్రిరేవం వ్యరంసీత్ (రాత్రి యిలా గడిచిపోయింది.) అనే బదులు 

రాత్రి రేవ వ్యరంసీత్ (రాత్రిగడిచి పోయింది, మాటలు యింకా మిగిలే వున్నాయి)

అని చెప్తే మరీ బాగుంటుంది.

పరస్పరం అనురక్తులైన దంపతుల మాటలు ఎడతెగనివి.అలా ఉంటూనే ఉంటాయి.

రాత్రి జాములు మాత్రం దొర్లిపోతూంటాయి. అని అందమైన భావం వస్తుంది.అన్నాడు 

కాళిదాసు.

అవశ్యం మహాకవి! ఎంత అద్భుతమైనమార్పు సూచించారు! అందుకే తమరు కవికుల 

గురువులు అన్నాడు ఆనంద భాష్పాలతో భవభూతి.

అదేమీలేదు మీ అంతటివారు మీరు, మహాకవులు.

        నాటకేషు చ కావ్యేషు వయం వా వయమేవ వా

        ఉత్తరే రామచరితే భవభూతి: విశిష్యతే 

నాటక రచనలో, కావ్య రచనలో మాకు మేమే సాటి. ఉత్తరరామచరిత్ర లో మాత్రం 

భవభూతి మమ్మల్ని మించి పోయాడు. అని చెప్పక తప్పదు. అన్నాడు కాళిదాసు.

భవభూతి కవిగానే కాక గొప్ప దార్శనికుడిగా కూడా ప్రసిద్ధి పొందినవాడంటారు. 

కన్యాకుబ్జ౦ రాజు యశోవర్మ ఆస్థాన కవిగా ఉండేవాడు. ఈయన విదర్భ దేశం వాడని కొందరూ, గ్వాలియర్ ప్రాంతం వాడని కొందరూ,ఆంద్రుడని కొందరూ వాదించారు.

భవభూతి రచనలు మూడూ నాటకాలే.'ఉత్తరరామచరితం' 'మాలతీమాధవం'

'మహావీరచరితం' భవభూతి కరుణరసాన్ని ఎక్కువ అభిమానించాడు'.ఏకో రసః కరుణ ఏవ!'

  -----------------------------శుభరాత్రి----------------------------

ఆహారంలో ఐదు దోషాలు

 🕉మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి.🕉🕉


1. *అర్ధ దోషం ,* 

2. *నిమిత్త దోషం.*                  

3. *స్ధాన దోషం,* 

4. *గుణ దోషం ,*             

5. *సంస్కార దోషం.*  


ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు. 


 *అర్ధ దోషం:*


ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.


భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. 


హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.


తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.  


తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.


వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. 


శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు.


ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో , తయారు చేసిన ఆహారం భుజించడమే *అర్ధదోషం.* మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. 


*నిమిత్త దోషం*

 

మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.


వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడ కూడదు.


అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి. 


భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు.


అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది.


ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు

'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. 


నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను 

ఇప్పుడు పవిత్రుడినైనాను.


నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు.


చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి *'నిమిత్త దోషం '* ఏర్పడుతోంది.


 *స్ధాన దోషం*


ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటll కూడా పాడైపోతుంది.


యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంతl మంచివి కావు.


దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో 

కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు. 


మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి 


*గుణ దోషం*


మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

భోజన ప్రియులకు మాత్రమే!


సాంబారులో చందమామలు

తెలుగువాడు మంచి భోజనప్రియుడని వేరే చెప్పవలసిన పనిలేదు. మన విస్తరిని ఉత్తరాది భోజనాలతో పోల్చి చూస్తే, ఎవరికైనా ఆ విషయం తెలిసిపోతుంది. అభిరుచుల్లో వైవిధ్యాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘ఆవకాయ రుచుల ఠీవి తానెరుగును, పూతరేకు తీపి కేతమెత్తు, ఉలవచారు త్రావ ఉత్సాహమును జూపు, పనసపొట్టు నొక్క పట్టుబట్టు!...’ వాడెవడని అడిగితే జవాబు కోసం తడుముకునే అవసరం రాదు. కనుకనే దేశదేశాల్లో తెలుగు రుచులు నేడు రాజ్యం ఏలుతున్నాయి. వైద్యులు కాదంటున్నా, ‘వరితో చేసిన వంటకంబు రుచియై వార్ధక్యముం బాపదే’ అంటూ మధుమేహులు వాదనకు దిగుతారు. భక్ష్య భోజ్య లేహ్య చోహ్య పానీయాలకు భోజనంలో భాగం కల్పించిన ఘనత తెలుగువాడిది. మామిడిపండుతోనో, మాగాయ టెంకతోనో ‘గడ్డపెరుగు నింత గారాబమును చేసి’ గర్రున తేన్చి, ఆ పూటకు భోజన పరాక్రమానికి స్వస్తి చెప్పడం వేరే వాళ్ళకు చేతకాదు. ‘కడుపే కైలాసం’ వంటి నానుడిని పుట్టించడం తెలుగువాడికి మాత్రమే సాధ్యం. కాబట్టే పరభాషల్లో అలాంటి పదబంధాలు కనపడవు. సరైన భోజన సదుపాయం దొరక్క ‘చల్లా న౦బలి త్రావితిన్‌ రుచులు దోసంబంచు పోనాడితిన్‌ తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడన్‌’ అని అదేదో ఘనకార్యంలా ఫిర్యాదు చేశాడంటే శ్రీనాథుడు తెలుగువాడు కాబట్టే! కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశక’ను గాని, పాలవేకరి కదిరీపతి ‘శుకసప్తతి’ని గాని తిరగేస్తే తెలుగువారి భోజన పదార్థాల పట్టిక పట్టరాని విస్మయాన్ని కలిగిస్తుంది. చేపలను జలపుష్పాలుగాను, గోంగూరను శాకంబరీమాత ప్రసాదంగాను చమత్కరించడం తెలుగు నాలిక్కి మాత్రమే పట్టుబడే విద్య. ఏ గిరీశాన్నో నిలదీస్తే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నవాడు ఆంధ్రుడే- అని ఠక్కున చెబుతాడు. ‘చల్ది వణ్ణం’ తినడానికి అభ్యంతరం లేదని బుచ్చెమ్మకు అందుకే గట్టిగా చెప్పగలిగాడు.

మహాభారతంపై మమకారాన్ని ప్రకటిస్తూ ‘వింటే భారతమే వినాలి’ అని వూరుకుంటే- తెలుగువాడు ఎందుకవుతాడు? ‘తింటే గారెలే తినాలి’ అంటూ తన జిహ్వచాపల్యాన్ని జోడించడం తెలుగువాడికే చెల్లింది. ‘గారెలు తిందు నేను వడగాచిన నేతిని ముంచుకొంచు’ అనడం ఒకరి అభిరుచి విశేషం. తేనె పానకంలో నానబెట్టి ‘పాకం గారెలు’గా తినడం మరొకరికి ఇష్టం. ‘ఆ సుధారసంబునందు వూరిన గారెలు ఇచ్చు పరితుష్టికి పుష్టికి సాటిలేదిలన్‌’ అనేది వీరి అభిప్రాయం. ఈ వేళంటే కంగాళీ తిళ్ళు(ఫాస్ట్‌ఫుడ్స్‌) వచ్చిపడి తెలుగువాడి తిండిపుష్టి ఇలా ధ్వంసం అయిందిగాని, మన పెద్దల తిళ్ళు గుర్తుచేసుకుంటే మనం ఎంత అర్భకులమో తెలిసొస్తుంది. అలా పెట్టీ, తినీ ఆస్తులు కరగదీసిన జాతి మనది! తరవాణీల బలం- కాఫీ, టీలకు రమ్మంటే ఎలా వస్తుంది? ‘అరుణ గభస్తి బింబము ఉదయాద్రి పయిం పొడతేర గిన్నెలో పెరుగును, వంటకంబు వడపిండియలతో’ చల్దులను పిల్లలకు ఎలా తినిపించేవారో కృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’లో వర్ణించాడు. ‘మాటిమాటికి వ్రేలు మడిచి వూరించుచు వూరుగాయలను’ గోపబాలకులు ఎలా ఇష్టంగా ఆరగించారో భాగవతంలో పోతన వర్ణించాడు. ఈ చద్దన్నాలకు, ఆ పానీయాలకు పోలికే లేదు. కాఫీ, టీల మూలంగా మంటపుట్టిందే తప్ప ‘కడుపులో చల్ల కదలకుండా’ హాయిగా తిని కూర్చోవడం మనకు వీలుకావడం లేదు. ఆ రోజుల్లో వడ్డనలూ భారీగానే ఉండేవని కల్పవృక్షంలో విశ్వనాథ పేర్కొన్నారు. దశరథుడి అశ్వమేధయాగ సంతర్పణలో ఎన్నో రకాల వంటకాలు సిద్ధంచేసి ‘హస్తములు అడ్డముంచినను ఆగక వడ్డన చేసిరన్నియున్‌’ అని వర్ణించారు. విస్తరిపై వంగి వద్దు వద్దంటే కడుపులో ఇంకాస్త చోటున్నట్లట! బొజ్జ వంగక కళ్ళతోనే నిస్సహాయంగా సైగలు చేస్తే ఇక చాలు అని ఆగేవారట. తెలుగువాడి భోజనప్రీతిని వెల్లడించే ఉదాహరణలివన్నీ. వూరుగాని వూరు పోతే ముందస్తుగా ‘మంచి భోజనమ్ము మర్యాదగా పెట్టు పూటకూళ్ళ యిళ్ళ వేట’లో నిమగ్నం కావడం గతంలో తెలుగువాడి ఆనవాయితీ.

వండటం వడ్డించడం తినడంలోనే కాదు- ఆరోగ్యం విషయంలోనూ తెలుగువాడి అభిరుచి ప్రత్యేకమైనదేనని మళ్ళీ కొత్తగా నిరూపణ అయింది. ఇడ్లీ తెలుగువాడికి చాలా ఇష్టమైన పదార్థం. ‘ఇడ్డెనల్‌’ అనేది అటు కవుల ప్రయోగాల్లోను, ఇటు నిఘంటువుల్లోను కనిపించే అచ్చతెనుగు పదం. ‘చినచిన్న చందమామలు నునుమల్లెల మెత్తదనము నోటికి హితమౌ, జనప్రియములు రుచికరములు- ఇడ్డెనలకు ఎనయైన భక్ష్యమేది ధరిత్రిన్‌’ అని బులుసు వేంకటేశ్వర్లు కవి చెప్పినట్లు తెలుగువారు ‘తినుచున్న ఇడ్డెనలు తినుచుంద్రు నిత్యము’ అనిపిస్తుంది. పిండిని ఉడకబెట్టి ఆవిరిపై వండే పదార్థాన్ని ‘ఇడ్లి ’ అంటారు. దాన్నే పనస ఆకుల మధ్య ఒబ్బిడిగా ఉడికిస్తే- అది పొట్టిక్కబుట్ట! ఆషాఢ మాసపు చివరి రోజుల్లో కడుపులో పెరిగే క్రిముల నివారణకు పనసాకులతో సహా ఉడికే పొట్టిక్కబుట్టలోని ఆహారం దివ్య ఔషధం! సాధారణ ఇడ్లీకి సాంబారు చక్కని జత. ‘సాంబారులో స్నానం చేస్తున్న ఇడ్లీ సుందరి’ ఓ సందర్భంలో శ్రీశ్రీ కవితలో మెరిసింది. ‘ఉదయంపూట ఆహారంగా తినే ఇడ్లీ ప్రపంచంలోని ఆహార పదార్థాలన్నింటికన్నా ఆరోగ్యకరమైనది’ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ మేరకు యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఇరినా బొకోవా సంతకంతో జారీ అయిన యోగ్యతాపత్రం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందింది. లక్షలమంది ఆ విశేషాన్ని ఒకరితో ఒకరు ‘పంచు’కుంటున్నారు. ఈ సంగతి తెలియగానే ‘ఇడ్డెనతో సాంబారును గడ్డపెరుగుతోడ ఆవకాయయు జతగా...’ హాయిగా లాగిస్తూ మన పూర్వీకులు ‘సొడ్డుసుమీ స్వర్గలోక సుఖముల కెల్లన్‌’ అనుకుంటూ ఆరోగ్యంగా జీవించారని కవులు కీర్తించడం మొదలెట్టారు. ఐక్యరాజ్య సమితి పుణ్యమా అని మన వంటకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఆంధ్రులకు గర్వకారణమని వారి ఆనందం! (తెలుగు వెలుగు మాసపత్రిక సౌజన్యముతో)

-

చాలా అద్భుతమైన మంత్రం

 

చాలా మహిమగలా మంత్రం 🙏


ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతుడై ఉండగా, అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి..లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంతదూరాన వారిని చూసిన లక్ష్మీదేవి, 

భర్త అనుమతితో ఆయన పాదాలను వొత్తడం ఆపి, శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది.


ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్లి, 

ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటుండగా, దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది. 

నారదుడు కూడా వీరిని చూశాడు. 


ఇంకేం.. .కలహభోజనుడు తనకు కావలసినంత 

కాలక్షేపం దొరికింది అనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకేచోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి.. 

వారి మధ్య కలహాన్ని రేపి, తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. 


అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి 

'ఈ కలహ భోజనుడు ఊరకనే రాడు. ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి'' అని నిర్ణయించుకుని బ్రహ్మమానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు. 


ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి.. నమస్కరించాడు. ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి, విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు. 


త్రిమూర్తులైన వారికి..భార్యలైన మీరు ముగ్గురూ, 

సకల లోక వాసులచే స్తుతింపబడుతున్నారు. 

అంతవరకు బాగానే ఉంది.. కానీ మీ ముగ్గురిలో ఎవరుగొప్ప? అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్తాడు. 


నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు.. నారదా నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి.. అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు. కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు. 


ముందు సరస్వతీ దేవి నారదునితో.. ! నారదా! భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి, అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి, సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో "ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్ఛరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్ఛరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీ దేవి అంటుంది. 


ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్లి సెల్వనాథుడి గురువును కలిశాడు. సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు.. సెల్వ నాథుడికి అక్షరం ముక్క రాదు...వాడితో నా ప్రాణం విసిగిపోయింది. పశువులను మేపాల్సిందిగా పంపేశాను.. 

వెళ్ళి చూడమంటాడు. 


నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని.. 

తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. ఇలా సముద్రంలో స్నానం చేసి.. శుచియై వచ్చిన 

ఆ బాలుడికి ''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని 

108 సార్లు జపం చేయమని చెప్తాడు. 


ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు. 


పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. 

నారదా.. కావేరి నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ''ఓం శ్రీ మాత్రే నమః'' మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. 

ఇలా పెరినాయకి ఇంటికి వెళ్లిన నారదుడు.. ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. 


సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు. ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. 

ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయింది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు. 


ఇక మూడో సారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే 

పేద పండితుడిని కలవమంటుంది. ''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది.


అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్లి.. 

దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు. రాజశేఖరుడు తనవద్ద ఉన్న బియ్యాన్ని మారు వేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా, రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంది. 


దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు. ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించి 108సార్లు జపించమని చెప్తాడు. 


ఆ తర్వాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శింటుకుంటాడు. 


అమ్మలారా! మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను. ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు.

అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది. 

బ్రహ్మదేవ పుత్రా.. మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు. జగదాంబ ఆజ్ఞానుసారం..

నా వలన ఐశ్వర్యం, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనం, సౌభాగ్యం, సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తుంటాయి. 


శ్రీ లక్ష్మిలోని శ్రీ సరస్వతీ లోని శ్రీ శక్తి లోని

బీజాక్షరాలు జతచేసి   ''ఓం శ్రీ మాత్రే నమః'' 

అనే మంత్రసృష్టి.

ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది.


అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాలకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది.   


                 ఆ మంత్రమే 

  '   ఓం శ్రీ మాత్రే నమః' అనే మంత్రం. 🙏