1, ఏప్రిల్ 2025, మంగళవారం

ఆంజనేయ స్వామి*

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

        *ఆంజనేయ స్వామి*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*ఆంజనేయ స్వామి విష్ణు భక్తుడు, రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మచే వరాలు పొందిన త్రిమూర్తుల స్వరూపం.*


*శ్రీ ఆంజనేయస్వామి వారిని ప్రతి నిత్యం పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. హనుమకు మంగళ, శని వరాలు అంటే ఎంతో ప్రీతిపాత్రము.. ఈ రెండు రోజులు శ్రద్దతో స్వామి వారిని కొలిస్తే విశేషామైన ఫలితాలు లభిస్తాయి.*


*"యత్ర యత్ర రఘునాథకీర్తనం -*

*తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్౹*

*భాష్పవారి పరిపూర్ణలోచనం -*

*మారుతిం నమత రాక్షశాంతకామ్॥*


*ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును" అని అర్థం.*


*బుద్దిర్బలం యశో ధైర్యం*

*నిర్భయత్వ మరోగతా*

*అజాడ్యం వాక్పటుత్వం చ*

*హనుమత్ స్మరణాద్భవేత్ ॥*


*చక్కని ఆలోచనను సరైన వేళలో అందించగల బుద్ధీ, ఆ ఆలోచనలను అమలుచేయగల మనోబలం, అలా అమలుచేసి సత్ఫలితాన్ని సాధించినందువల్ల చక్కని కీర్తి, ఇలాంటి కీర్తిని సాధించిన కారణంగా మరో మంచిపనిని కూడా సాధించగలమనే ధైర్యం, అలా ధైర్యంగా పనిచేస్తున్నందువల్ల భయం లేనితనం.*


*ఆంజనేయుణ్ణి స్మరిస్తూ చేస్తున్నందువల్ల శరీర రోగం రానితనం, మనసుకు ఏవిధమైన జడత్వం (నిరాశ నిస్పృహ) లేనితనం, మనసు చురుకుగా ఉన్నందువల్ల మాటల్లో గట్టిదనం, ఇవన్నీ మనస్ఫూర్తిగా ఆంజనేయుణ్ణి స్మరించినందువల్ల లభిస్తాయి.*


*ఆంజనేయం మహావీరం*

*బ్రహ్మవిష్ణు శివాత్మకం౹*

*బాలార్క సదృశాభాసం*

*రామదూతం నమామ్యహమ్॥*


*హనుమంతుడు అంటేనే... బ్రహ్మ,విష్ణు, శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడని, సృష్టిస్థితి లయకారకుడని, రామదూత అని పేర్కొంటారు. ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే... ఆ గృహంలో ఆంజనేయుని ప్రభావం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని విశ్వాసం.*


*ఆంజనేయస్వామి - తొమ్మిది అవతారాలు:-*


*1. ప్రసన్నాంజనేయస్వామి 2. వీరాంజనేయస్వామి 3. వింశతి భుజ ఆంజనేయస్వామి 4. పంచముఖ ఆంజనేయస్వామి 5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి 6. సువర్చలాంజనేయస్వామి 7. చతుర్బుజ ఆంజనేయస్వామి 8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి 9. వానరాకార ఆంజనేయస్వామి.*


*హనుమ ప్రియం సింధూరం:-*


*ఒకసారి సీతమ్మ తల్లి నుదుటన సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయస్వామి. అమ్మా , దేనికమ్మా సింధూరం ధరిస్తున్నావు? అని అడిగాడు. ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచలేదు అమ్మవారికి. సింధూరం ధరించడం వలన శ్రీరామచంద్రునికి మేలు జరుగుతుంది అని చెప్పింది.*


*ఇందులో శ్రీరామచంద్రునకు మేలు జరుగుతుంది అనే మాట ఆంజనేయస్వామి మనస్సులో నాటుకుపోయింది. వెంటనే ఆంజనేయస్వామని శరీరమంతా సింధూరం పూసుకుని సభకు వెళ్ళాడు. అది చూసిన సభాసదులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.*


*అయితే శ్రీరామచంద్రుడు ఆంజనేయస్వామిని దగ్గరకు పిలిచి విషయం అడిగాడు. స్వామి జరిగిన విషయం చెప్పాడు. శ్రీరాముడు ఆంజనేయస్వామికి తన పట్ల భక్తికి సంతసించాడు. వెంటనే ఒక వరం కూడా ఇచ్చాడు.*


*హనుమా ! మంగళవారం నిన్ను సింధూరంతో పూజించిన వారికి సకల అభీష్టాలు సిద్ధిస్తాయి అని చెప్పాడు. భక్త జనుల అభీష్టములు తీర్చేవాడు ఆంజనేయస్వామి. అందుకే ఆనాటి నుండి సింధూర ప్రియుడు అయినాడు.*


*తమలపాకులు దండ :-*


*హనుమంతుడికి తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అశోక వనంలో ఉన్న సీతమ్మ తల్లికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు.. అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట.*


*దగ్గరలో పువ్వులు కనిపించకపోవడంతోనే ఆంజనేయ స్వామికి సీతమ్మ తల్లి తమలపాకుల దండ వేసినట్లు చెబుతారు. అందుకే హనుమంతుడికి తమలపాకుల దండంటే ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి.*


*హనుమను పూజిస్తే శని దూరం:-*


*రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే.. వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.*


*శ్రీ రామ భక్త హనుమాన్ కీ జై॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(93వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

          *కాళీయమర్దనం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*బలరామకృష్ణుల మీద పుష్పవృష్టి కురిపించారు. నాటి నుంచి తాళవనం యాదవులవశమయింది. బలరామకృష్ణుల వీరోచితగాధంతా పిల్లల నోటితో పెద్దలు తెలుసుకున్నారు. పొంగిపోయారు. బలరామకృష్ణుల్ని ఊరేగించారు. బలరామకృష్ణులిద్దరూ పక్కపక్కన కూర్చుని రథంలో ఊరేగుతోంటే వారిని చూసి రోహిణి, యశోదలు ఉప్పొంగిపోయారు. వీరపుత్రులనుగన్న వీరమాతలమని ఆనందించారు.*


*కాళీయమర్దనం:~*


*వ్రేపల్లె సమీపానగల యుమునానది దగ్గరగా ‘కాళింది’ అని ఓ మడుగు ఉన్నది. ఆ మడుగులో ‘కాళీయుడు’ అని ఓ సర్పరాజు నివసిస్తున్నాడు. కోరల్లోనే కాదు, ఆ పాము అణువణువునా విషమే! ఆ విషం అంతా మడుగు అడుగడుగునా నిలిచి ఉండి, కుతకుతా ఉడుకుతుండేది. దాని ఆవిరికి మడుగు మీద ఆకాశంలో ఎగిరే పక్షులుసైతం చచ్చిపోయి రాలిపడేవి. ఇక మడుగులో జీవించే జలచరాల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఏదీ బతికిన పాపాన పోలేదు. ఆ మడుగు పైనుంచి వీచే గాలి కూడా ప్రమాదకారి అయింది. ఆ గాలిసోకి ఆలమందలు చచ్చిపోతున్నాయి. గోపాలురు అనారోగ్యానికి గురవుతున్నారు. చేసేదిలేక దూరంగా తరలిపోతున్నారంతా..*


*కాళీయుడు కాళింది మడుగులో నివసించేందుకు ఓ కారణం ఉన్నది. ఆ కారణం ఏమిటంటే...*


*కద్రువ, వినత దక్షుని కుమార్తెలు. ఆ ఇద్దరూ కశ్యప్రజాపతిని వివాహం చేసుకున్నారు. కద్రువ కడుపున సర్పాలు, వినత కడుపున పక్షులు పుట్టాయి.*


*కద్రువకి పుట్టిన సర్పరాజులలో వాసుకి, శేషుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాళీయుడు ముఖ్యులు.*


*వినతకు సూర్యభగవానుని సారథి అనూరుడు, విష్ణువాహనమయిన గరుత్మంతుడు జన్మించారు.*


*కద్రువ కుమారుడు కాళీయుడు రమణకద్వీపంలో ఉండేవాడు. అతనితోపాటు అనేక సర్పాలు కూడా అక్కడ ఉండేవి. సర్పాలకు నిలయమయి ఆ ద్వీపం సముద్రమధ్యంలో ఉండేది. గరుత్మంతుడంటే సర్పాలకు భయం. సర్పం కనిపిస్తే చాలు, పట్టి భక్షించేవాడు గరుత్మంతుడు.

ఆ బాధపడలేక సర్పాలన్నీ అతనితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నెలలో వచ్చే ప్రతి పర్వదినానికీ ఒక నాగు అతనికి ఆహారం అవుతుంది. చెట్టు మొదట్లో నాగుని బలిగా ఉంచుతారు. గరుత్మంతుడు దానిని భక్షించవచ్చు. ఆ ఒప్పందం చాలా రోజులు కొనసాగింది. రమణకద్వీపంలోని సర్పరాజులంతా ఎన్నడూ ఒప్పందాన్ని తప్పలేదు.*


*చివరికి కాళీయుడి వంతు వచ్చింది. మహావిషసర్పం కాళియుడు. పైగా గొప్పబలాఢ్యుడు. ఆ గర్వంతో గరుత్మంతునికి బలి సమర్పించలేదతను. అంతేగాక, గరుత్మంతునికి బలికావాల్సిన సర్పాలను తానే భక్షించసాగాడు. ఇది తెలిసి గరుత్మంతుడు, కాళీయుడంటే కోపాన్ని పెంచుకున్నాడు. అతన్ని చంపడానికి వచ్చాడు. కాళీయుడు ధైర్యంగానే గరుత్మంతుణ్ణి ఎదుర్కొన్నాడు. పెద్దయుద్ధం జరిగింది ఇద్దరికీ. అనేక పడగలు ఉన్న కాళీయుడు, తన కోరలతో గరుత్మంతుణ్ణి కరచి కరచి హింసించాడు. బాణాలతో పొడుస్తున్నట్టుగా బాధకలిగింది గరుత్మంతునికి. ఆగ్రహోదగ్రుడయ్యాడు. వజ్రంలాంటి కాలిగోళ్ళు విప్పి, బలంగా ఓ తన్ను తన్నాడు కాళీయుణ్ణి. అంతే! ప్రాణాలుపోతున్నట్టనిపించాయి.*


*కాళీయుడు రమణకద్వీపం వదలి పారిపోసాగాడు. గరుత్మంతుడు వదలలేదు. వెంటపడి తరిమాడు. ప్రాణభీతితో నలుదిక్కులకూ పరిగెత్తి, ఆఖరికి కాళింది మడుగులో తలదాచుకున్నాడు కాళీయుడు. అక్కడకి రాలేకపోయాడు గరుత్మంతుడు. అతనికి అది రాకూడని స్థలం.*


*దానికి ఓ కారణం ఉంది.

అది ఏమిటంటే...*


*పూర్వం కాళింది ఒడ్డున ‘సౌబరి’ అనే ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. కాళిందిలో అప్పుడు పెద్దపెద్ద చేపలు ఉండేవి. ఆ చేపల్ని తినడానికి ఒకనాడు గరుత్మంతుడు వచ్చాడక్కడకి. ఓ మత్స్యరాజును పట్టి తినసాగాడు. సౌబరి వద్దని వారించినా వినలేదు గరుత్మంతుడు. తిని ఎగిరిపోయాడు. గరుత్మంతునికి బలయిపోయిన మత్స్యరాజు భార్యలు అనేకం సౌబరి చుట్టూచేరి దీనంగా విలపించసాగాయి. భర్తని కోల్పోయి దిక్కులేనివారమయినామని ఏకధాటిగా రోదించాయి. వాటిని చూసి మునికి జాలికలిగింది. మేలు చేయదలచాడు వాటికి.*


*‘‘ఇక నుంచి గరుత్మంతుడు ఇక్కడకి వచ్చినా, ఈ మడుగులోని చేపలను భక్షించినా మరణించుగాక’’ అని శపించాడు. దాంతో గరుత్మంతుడు అక్కడకి రావడానికి వీలులేకుండాపోయింది.*


*ఈ సంగతి కాళీయుడుకి తెలుసు. అందుకే అక్కడ దాగాడు. దాగి, ఎలాంటి భయమూ లేకుండా భార్యలతో హాయిగా సుఖించసాగాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శంకరులు ఈ శ్లోకములో భక్తి స్వరూపాన్ని వివరించారు. "భక్తి" అంటే ఏమిటో తెలిపారు.*


*శ్లోకము :  61*


*అంకోలం నిజ బీజ సంతతిః అయస్కాంతోపలం సూచికా*

       

*సాధ్వీ నైజ విభుం లతా క్షితి రుహం  సింధు స్సరిద్వల్లభమ్,*

       

*ప్రాప్నోతీహ యథా తథా  పశుపతేః పాదార వింద ద్వయమ్*

       

*చేతో వృత్తి  రుపేత్య  తిష్ఠతి  సదా సా  భక్తి రిత్యుచ్యతే  !!*


*పదవిభాగం:~*


*అంకోలం = ఊడుగు చెట్టును*


*నిజబీజ సంతతిః = తన గింజల రాశి*


*అయస్కాంతోపలం = సూదంటురాయిని*


*సూచికా = సూది*


*సాధ్వీ నైజవిభుం = పతివ్రత తన భర్తను*


*లతా క్షితిరుహం = తీగ వృక్షమును* 


*సింధుః సరిద్వల్లభమ్ = నది సముద్రమును*


*యథా ప్రాప్నోతి = ఏ ప్రకారంగా పొందుచున్నదో*


*ఇహ = ఈ లోకమందు*


*తథా = ఆ ప్రకారంగా*


*పశుపతేః పాదారవిందద్వయం = ఈశ్వరుని యొక్క పాద కమల యుగళమును*


*చేతోవృత్తిః = చిత్తవృత్తి*


*తిష్ఠతి = ఉండుట ఏది కలదో*


*సా = అది*


*సదా ఉపేత్య =ఎల్లప్పుడును పొంది*


*భక్తిః ఇతి ఉచ్యతే = భక్తి అని చెప్పబడుచున్నది.*


*తాత్పర్యము : -*


*ఊడుగు చెట్టు గింజలు నేలపై రాలి, ఆచెట్టునే చేరినట్లు, సూది సూదంటు రాయిని అంటుకొనట్లు, పతివ్రత తన పతి ఎటువంటి వాడైనా అతడినే వదలకుండా యుండినట్లు, నది సముద్రమును చేరినట్లు, భక్తుడి చిత్త వృత్తి పశుపతి యైన శివుడి పాదపద్మ ద్వయాన్ని ఎల్లప్పుడూ చేరి యుండే స్థితిని "భక్తి"  అని అంటారు.*


*వివరణ :~*


*ఊడుగు చెట్టు గింజలు ఆ చెట్టును తమకు తాముగా మళ్ళీ చేరుకొని అతుక్కుపోతాయంటారు. సూది  అయస్కాంతపు రాతిని తనకు తానుగా అంటుకుంటుంది. పతివ్రత తన భర్తను చేరుతుంది. శీలవతి యైన ఇల్లాలు పుట్టింటినీ, తల్లి దండ్రులనూ, తన వారందరినీ వదలి తనకు దైవమిచ్చిన భర్తను త్రికరణ శుద్దిగా ఆరాధిస్తూ, అతని జీవితంలో ఐక్యమవుతుంది‌. అలాగే తీగలు, తనకు ఆధారంగా నిలచిన చెట్టు చుట్టూ గాఢంగా అల్లుకుపోతాయి.  ఇక నదులు  ఎక్కడో కొండల్లో పుట్టి  పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించి, చివరకు తమకు పతియైన సముద్రంలో సంగమిస్తాయి. ఈవిధంగా  గింజలూ, సూదీ, పతివ్రత, లతలూ, నదులూ, సర్వవిధాలా ఆత్మసమర్పణం చేసుకొని, వృక్షాదులలో లీనమవుతున్నాయి.* 


*ఇందులో మొదటి నాలుగూ ఐక్యదశలో స్వరూపాన్ని బట్టి, అవి లేనట్టుగానే తన్మయం పొందుతాయి.  కాగా నదుల విషయానికొస్తే అవి తమ సర్వస్వాన్నీ సమర్పించుకొని నామ రూపాలనుకూడా కోల్పోయి సాగరంలో లీనమవుతాయి.* 


*ఇందులో కొన్ని జలాలు, మరికొన్ని ప్రాణులు,  ఈ పోలిక వేర్వేరు విధానాలలో ఏకత్వ సిద్ధిని వివరిస్తూ, చిత్త వృత్తులలోని బేధాలను తెలుపుతోంది. వృత్తి వైవిధ్యం ఉంది కానీ స్థితిలో వైవిధ్యం లేదు. భక్తి కూడా* *అటువంటిదే. కలవటం వరకే లేదా కలపటం వరకే  కలసిన తర్వాత పూర్తిగా అద్వైతస్థితి.*


*" సదా ", " తిష్ఠతి  "  అన్న పదాలు ఇక్కడ ముఖ్యం. ఉండటంలో కాలాదులను బట్టి వికారాలు కలుగవని  తాత్పర్యము. భక్తిలో కూడా ఎన్నో వైవిధ్యాలుంటాయి.*


*1) ఊడుగు చెట్టు గింజలు చెట్టుకు అతుక్కు పోవడమనే ఉదాహరణ సామీప్య ముక్తిని సూచించే భక్తికి నిదర్శనం.*

*2 ఇనుము _ సూదంటు రాయిల  ఆకర్షణ, సాలోక్యముక్తిని సూచించే

భక్తికి నిదర్శనం.*

*3)పతివ్రత భర్తను చేరేవిషయం సాలోక్య _ సామీప్య ముక్తులను సూచించే భక్తికి నిదర్శనం.*

*4 )తీగ చెట్టుకు అల్లుకున్న విధానం సామీప్య ముక్తిని  సూచించే భక్తికి నిదర్శనం.*

*5 ఇంక నదులు తమ నామ రూప గుణ లక్షణాలను విడిచి , సముద్ర లక్షణాలతోనే కనబడడం _ సాయుజ్య ముక్తిని సూచించే భక్తికి నిదర్శనం.*


*ఈ భక్తికి మరో ఉదాహరణం  కట్టు విప్పిన లేగ దూడ చెంగున దూకుతూ ఆవు వద్దకు చేరడం కూడా భక్తికి ఉదాహరణంగా కొందరు సూచించారు.*

*మనందరి మనస్సులకూ పై విధంగా భగవంతుని వైపు మళ్ళి , భక్తి కలగాలని దైవాన్ని ప్రార్థిద్దాము.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

Panchaag


 

ధనుర్విద్య

 ప్రాచీన భారతీయ వేదాలలో వివరించిన ధనుర్విద్య గురించి సంపూర్ణ వివరణ  - 1


        మన ప్రాచీన యుద్ధవిద్యలలో ధనుర్విద్యకు ప్రముఖస్థానం కలదు. ఈ విద్యకు సంబంధించిన చాలా గ్రంథాలు మరియు తాళపత్రాలు బ్రిటిష్ వారు మనదేశము నుండి తరలించుకొనిపోయి బ్రిటిషు మ్యూజియం నందు ఉంచటం జరిగిందని "మేడం బ్లావేట్స్కి " రచించిన " THE SECRET DOCTRINE " అనే గ్రంథము నందు వివరించారు . ఇలాంటి కారణాల వలన ఈ ధనుర్విద్య గురించిన విజ్ఞానం మరుగునపడిపోయింది.  ఇలా మరుగునపడిపోయిన ధనుర్విద్య గురించి కొంతవరకైనా మీకు తెలియాలి అనే సదుద్దేశముతో నేను చదివిన కొన్ని ప్రాచీన గ్రంథాలలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయుటకు ఈ పోస్ట్ పెడుతున్నాను . 


          ఇప్పుడు మనకి లభ్యం అవుతున్న గ్రంథాలలో ఈశాన సంహిత  శస్త్రాలు మరియు అస్త్రాలు గురించి తెలియచేస్తుంది . ఈ ధనుర్వేదమును ఉపదేశించిన వాడు మహర్షి విశ్వమిత్రుడు .  ఈశాన సంహిత యందు ధనుర్విద్య గురించి 20 ,000 శ్లోకాల రూపంలో శివుడు పార్వతికి సంగ్రహముగా వివరించాడు. దీనిలో నాలుగు విభాగాలుగా అస్త్రములు తెలుపబడినవి. అస్త్రమును తయారుచేయు ధాతువులు , ద్రవ్యములు , ఈ అస్త్రమును తయారుచేయువాడికి ఉండు లక్షణములు . అస్త్రములను తయారుచేసే విధానములు ఇందులో తెలుపబడినవి .  


              ఈశాన సంహిత యందు ఉమామహేశ్వర సంవాదం అను భాగములో వివిధ అస్త్రములును ప్రయోగించు పద్దతులు , ఒక్కో అస్త్రప్రయోగానికి కావలిసిన అస్త్ర మంత్రములు , ఆ మంత్రములను జపించే విధానం , దానికి సంబంధించిన మంత్రశాస్త్రం కూడా సంగ్రహముగా తెలుపబడినది .  


.            పరశురాముడు రచించిన " శాండిల్యభాష్యం " లో దీక్షాపాదము , సంగ్రహ , సిద్ధిపాదాలు అని అధ్యాయాల రూపంలో అనేక విశేషాలు కలవు. ఇది కేరళ రాష్ట్రంలో తాళపత్రాల రూపంలో కలదు. అంతే కాకుండా పంజాబులోని ప్రాచీన తాళపత్రాల పట్టికలో ఈ ధనుర్వేదాన్ని తెలిపే గ్రంథాల వివరాలు ఇంకొన్ని ఇవ్వబడ్డాయి. అందులో                           " శివ ధనుర్వేదం " , మనుసార్ణ , చతుష్టష్టికళ సంగ్రహం , యమళాష్టకం మాత్రమే కాక వైశాలాక్షం అనే పేరుతో 10,000  శ్లోకములు కల్గిన గ్రంథము కూడా తెలుపబడింది.  ఇవే కాకుండా మరికొన్ని గ్రంథాల పేర్లు కూడా తెలియచేస్తాను . 


     *  వశిష్ట సంహిత . 


     *  సారంగధరుని విరచింతామణి . 


     *  కోదండ మండనము . 


     *  హరిహర చతురాంగం . 


     *  రాజ - విజయం . 


     *  భోజుని ధనుస్సంహిత .  


          పైన చెప్పినవే కాకుండా విశ్వమిత్ర సంహితము , లోహార్ణవము , లోహరత్నాకరము , సోవనేశ్వరుని " అభిలాషితార్ధ చింతామణి " , బసవేశ్వరుని " శివతత్వ రత్నాకరం " వంటి గ్రంథముల యందు కూడా ధనుర్విద్యకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. వరాహమిహిరాచార్యుడు  వ్రాసిన బృహత్సంహిత అన్న విజ్ఞానసర్వస్వము లో కూడా అస్త్రములు తయారుచేసే పద్దతి , రకరకాల కత్తులు శూలాలు , వివిధ ఆయుధాలు తయారుచేసే పద్దతి వర్ణించాడు. 


              ధనుర్వేదము నందు రథములు , ఏనుగులు , కాల్బలములు నడిపించే పద్దతి , సైన్యమును నిలబెట్టే వ్యూహరచన వర్ణించబడినవి.  వేదవ్యాస మహర్షి మహాభారతములో భీష్మద్రోణ పర్వాలలో ముఖ్యముగా చక్రవ్యూహము , క్రౌంచవ్యూహము వంటి అనేక సైనిక విన్యాసాలు వర్ణించాడు . పైన చెప్పిన గ్రంధములే కాకుండా ఇంకా ఎన్నో విలువైన గ్రంథములు విదేశాలకు తరలిపోయాయి . మరికొన్ని తాటిఆకులపై రాసి ఉండి సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వలన కాలగర్భములో కలిసిపోయాయి. బ్రిటిషు లైబ్రరీ నందు ఆగ్నేయాస్త్రము గురించి తెలియచేసే ఒక ప్రాచీన వ్రాతపతిని చూసినట్లు "మేడం బ్లావట్స్కి " తన గ్రంధములో రాశారు . 


            అదేవిధముగా ధనుర్వేదము గురించి తెలియచేసే ఇతర గ్రంధములలో ద్రోణాచార్యుడు రచించిన ధనుశ్శాస్త్రము , బసవేంద్రుడి శివతత్వ రత్నాకరం లొని ప్రకరణము , ధనుర్వేద సంహిత , రేవంత్తోత్తరము , భోజరాజీయము , అశ్వలక్ష్మణ సారము మొదలయిన ప్రాచీన గ్రంధములే కాక కొన్ని మహాపురాణాలలో కూడా ఈ ధనుర్విద్య గురించి వివరించబడినది. వాల్మీకి రామాయణములో బాలకాండలో అస్త్రవిద్య వివరాలు తెలుపబడినవి . 


        ధనుర్విద్యకు పదకొండు ఏకాదశ ఉపవిద్యలు ఉండును. అవి 


  *  విలువిద్య .

 

  *  అస్త్రవిద్య . 


  *  మల్ల శాస్త్రం ( కుస్తీ లేక బాక్సింగ్ ) . 


  *  అశ్వ శాస్త్రం . 


  *  గజ శాస్త్రం . 


  *  ఖడ్గ ధారణము . 


  * వ్యూహ శాస్త్రం ( సేనలను నిలబెట్టు వ్యూహాలు )


  *  సేనా శాస్త్రం  ( ఆర్మీ ట్రైనింగ్ ) . 


  *  రధ - శిక్షణ శాస్త్రం . 


  *  వాహనారోహణము .  


         పైన చెప్పిన 11 రకాల విద్యలు ధనుర్విద్యకు ఉపవిద్యలుగా పరిగణించబడుతున్నాయి. 


           తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను. 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


             కాళహస్తి వేంకటేశ్వరరావు  


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                     9885030034

_సూపర్ స్టార్ వచ్చాడు..!_*

 *_సూపర్ స్టార్ వచ్చాడు..!_*



తేనెమనసులు విడుదలై

అరవై ఏళ్ళు..31.03.1965


______________________


మూగమనసులు..

మంచిమనసులు..

కన్నెమనసులు..


మనసుల మీద ఇన్ని సినిమాలు తీసిన దిగ్దర్శకుడు 

ఆదుర్తి సుబ్బారావు..

మూగమనసులు

అంతటి సూపర్ హిట్ సినిమా రూపొందించిన  తర్వాత 

ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ధైర్యంతో ఒక ప్రయోగానికి సిద్ధపడ్డారు.అందరూ కొత్తవాళ్లతో సినిమా నిర్మాణానికి సాహసించారు..

ఆ  సినిమా ఘన విజయాన్ని సాధించింది అన్న విషయం కంటే తెలుగు చిత్ర పరిశ్రమకు 

ఒక విశిష్ట వ్యక్తిని అందించింది.

ఆ సినిమా ప్రయోగం వల్ల పరిశ్రమలోకి వచ్చిన కొత్త హీరో

తదనంతర కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తానే ప్రయోగాలకు చిరునామాగా మారిపోయాడు.ఆయనే తెలుగు సినీమా గమనాన్ని మార్చాడు..కొత్త అడుగులు వేయించాడు.తెలుగు సినిమాని కౌబాయ్ సినిమాల వైపు నడిపించాడు..సినిమా స్కోప్ సొగసులు అద్దాడు..

భారీతనాన్ని సమకూర్చాడు.

చివరకు 70 ఎం ఎం హంగులు కూడా అందించాడు.తెలుగు  సినిమా స్టేటస్ పెంచాడు..తెలుగు నిర్మాతల గౌరవాన్ని ఇనుమడింపచేశాడు..వీటన్నిటి ద్వారా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పిలిపించుకున్నాడు..సూపర్ స్టార్ గా ఎదిగి మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి తెలుగు చిత్రపరిశ్రమ మూల స్తంభాల్లో ఒకడిగా సిరపడ్డాడు..


ఆయనే ఘట్టమనేని 

శివరామ కృష్ణ..

ఉరఫ్ సూపర్ స్టార్ కృష్ణ..!


*_తేనెమనసులు_* 

ఈ సినిమాని అందరూ కొత్తవాళ్లతో తియ్యడానికి ఆదుర్తి సిద్ధపడినపుడు ఆయన భుజం పట్టుకుని వెనక్కి లాగాలని ప్రయత్నించింది ఎందరో..

మూగమనసులు వంటి సూపర్ హిట్ సినిమాని అద్భుతమైన పాటలు.. కధా కథనంతో భారీ తారాగణంతో తీసి సక్సెస్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో సినిమా అవసరమా అని చాలా మంది పెదవి విరిచారు.అయితే అప్పటికే ముళ్ళపూడి అందించిన కథను నమ్మిన సుబ్బారావు ఆ కధతో సినిమా తీసినప్పుడు పెద్ద నటులు అవసరం లేదని..కొత్తవారితో తీసినా చాలని భావించి కొత్తనటుల ఎంపికకే సిద్ధపడ్డారు.ప్రకటన వెలువడింది..ఎంపిక కమిటీలో మహానటుడు.. ఆదుర్తి ప్రియమితృడు అక్కినేని

ఉన్నారు..ఆయనే కృష్ణ ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అంతకు ముందే ఆయన కృష్ణను చూసి ఉన్నారు.

ఎంపికలో ఆయనే తుది ముద్ర వేసేశారు..ఇంకేమి..ఒక గొప్ప 

సంచలనానికి బీజాలు పడ్డాయి..కృష్ణతో పాటు హీరోగా రామ్మోహన్ కూడా ఎంపికయ్యాడు.జయలలిత..హేమామాలిని వంటి వారు కూడా ఎంపికకు హాజరైనా కృష్ణకు జంటగా సుకన్య..

రామ్మోహన్ కు జోడీగా సంధ్యారాణి ఎంపికయ్యారు.

సినిమా నిర్మాణం మొదలైన తర్వాత కృష్ణ నటన అంత బాగా లేదని..తీసెయ్యాలని

పంపిణీదారులు పట్టుబట్టినా కూడా ఆదుర్తి లొంగకపోగా అప్పటివరకు తీసిన బ్లాక్ అండ్ వైట్ పార్టును పక్కన బెట్టి కలర్లో తీయడం మొదలెట్టారు.చక్కని పాటలతో .. చిత్రీకరణతో నడిచిన తేనెమనసులు సూపర్ హిట్ అయింది.

అందులో మరో హీరో రామ్మోహన్ అచ్చం దేవానంద్ లా ఉన్నాడని అతనికి  మంచి భవిషత్తు ఉంటుందని కొందరు

అనుకున్నా ఆ అంచనాలు తిరగబడ్డాయి.. మిగిలిన కథ మామూలు కథ కాదు..తెలుగు సినిమా సరికొత్త చరిత్ర..ఒక నూతన అధ్యాయం..


తదనంతర కాలంలో రామ్మోహన్ పాత్రలు లేకుండా ఇబ్బంది పడుతున్న దశలో అప్పటికే పెద్ద హీరోగా..నిర్మాతగా ఎదిగిన కృష్ణ ఒకనాటి తన సహచర కొత్త హీరోకి తన సినిమాలు

పండంటికాపురం..

పాడిపంటలు వంటి ఎన్నో సినిమాల్లో అవకాశాలు కల్పించి ఆదుకున్నారు..


అంతే కాదు..తన గురువు..తొలి అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో మాయదారి మల్లిగాడు వంటి సూపర్ హిట్ సినిమాలో నటించి ఆయనకు మంచి పేరు..అఖండ లాభాలు సమకూర్చాడు.అంతేకాదు సుబ్బారావు మొదలు పెట్టి నిర్మాణం జరుగుతుండగానే మరణిస్తే గాజుల కృష్ణయ్య సినిమాను పూర్తి చేసి గురువు రుణం తీర్చుకున్నారు.


అలా ఒక గొప్ప సినిమా తేనెమమసులు విడుదలై అరవై ఏళ్ళు పూర్తయ్యాయంటే కృష్ణ పరిశ్రమకు వచ్చి ఆరు దశాబ్దాలు పూర్తయినట్టే.

అంతకు ముందు ఒక సినిమాలో అక్కినేని పెళ్లి సీనులో వెనక కృష్ణని చూసినట్టు గుర్తు..

తేనెమనసులు మాత్రం తెలుగు చిత్రపరిశ్రమకు ఒక లెజెండు ను పరిచయం చేసి ఆ రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయింది..


*_సూపర్ స్టార్ మొదటి సినిమాగా..!_*


✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽


*_సురేష్..9948546286_*

(నేనే భగవంతుణ్ని

 * ‘*నేను’లో ఏముంది...*


కొన్ని అవయవాల సమూహం కాదు నేను అనేది. నిజానికి ‘నేను’ సర్వేంద్రియాలకు, మనసుకు అధిష్ఠానమైన, మూలమైన ప్రేరకమైన ఆత్మకు పర్యాయపదంగా చెప్పుకోవచ్చు. ఒకటి నడిపించేది, అదే ఆత్మ. రెండోది నడిచేది, అదే శరీరం.

ప్రపంచంలో మనకు తరచుగా వినిపించే చమత్కార పదం ‘నేను’. ‘నేను’కు అసలైన అర్థం తెలియని వాడు సాధారణంగా, సహజ స్వభావసిద్ధంగా పరుల మాట వినడు. విన్నా విశ్లేషించుకోడు. తన బలహీనతలు గమనించడు. తాను పట్టిన కుందేటికి మూడు కాదు రెండే కాళ్లనేందుకూ సిద్ధపడతాడు. తాను లేకపోతే లోకమే నడవదంటాడు. సత్య, ధర్మ, న్యాయ, సంస్కార విచక్షణ కోల్పోతాడు. నేనంటే తెలుసుకోలేకపోతే ఇన్ని ప్రమాదాలు జరుగుతాయి.


తపోధనులు, యోగులు, సిద్ధులు, మహర్షులు చెబుతూనే ఉన్నారు- ఈ ‘నేను’ను వదిలించుకొమ్మని. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఘోషిస్తూనే ఉన్నాయి- ఈ ‘నేను’ను మరిచిపొమ్మని. ఈ మాట అహాన్ని, అజ్ఞానాన్ని పెంచి విషవృక్షమై మనిషికి గరళపు నీడనిస్తూ క్షణక్షణం మరణం చూపుతుంటుంది. అదే శాశ్వతమైన తృప్తి, సుఖం అన్న భ్రమలో పడిపోతూంటాడు మనిషి. స్వార్థానికి బానిసైపోతాడు.


‘నీవు ఒక వ్యక్తిననుకుంటున్నావు. నీవోచోట, ప్రపంచం ఓచోట, దేవుడు మరోచోట ఉన్నారనుకోవడం భ్రమ. నిజానికి ఈ మూడూ ఒకటే. ఆ అనుభూతిని పొందటమే అద్వైత సిద్ధి’ అంటారు రమణమహర్షి. ‘నేను’ అనే తలపు ఎక్కడినుంచి పుడుతుందో, అక్కడ దృష్టిపెడితే పలుకుతున్నవాడు పట్టుపడతాడు, అదే నీవు. అతణ్ని తెలుసుకోవడమే జ్ఞానోదయం’ అంటారాయన.

‘కలడు కలండనెడివాడు కలడోలేడో’ అన్న ద్వంద్వస్థితే జీవ రసాయనాల అసమతుల్యతకు కారణం. ద్వైత స్థితి నుంచి అద్వైతస్థితి దిశగా శ్వాసమీద ధ్యాస అనే తొలిమెట్టు ఎక్కి- అనుభూతి, అన్వేషణ, జ్ఞానం, విశ్లేషణ లాంటి మెట్లెక్కుతూ ‘ఆత్మజ్యోతి’ అనే దివ్య, రమ్య భవ్యసౌధానికి చేరుకోవాలి. 


భగవంతుడు విశ్వవ్యాపకుడైనప్పుడు, ఆ ప్రగాఢ విశ్వాసానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తరవాత ఇంకా నువ్వేమిటి, నేనేమిటి... అంతా ఒకటే కదా... అదే కదా ‘త్వమేవాహం’ అంటే! నీ హృదయాంతరాల్లో సర్వదా ప్రకాశించే అంతర్‌ జ్యోతిని దర్శించి తరించమంటోంది యోగశాస్త్రం. అప్పుడే అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, మూర్ఖత్వం అనే క్లేశాలను వదిలే వీలుంటుంది అంటుంది దేవీభాగవతం. నేను నుంచి మనం వైపు, మనం నుంచి మననం వైపు, మననం నుంచి మోక్ష భవనం వైపు ప్రస్థానం చేయడమే సాధకుడి పరమావధి.

పోతన అన్నది అందుకే- పలికెడిది భాగవతమట అని! తాను రాస్తున్నానని చెప్పలేదు. అదే భక్తి జ్ఞాన వైరాగ్య కల్పవృక్షానికి పడిన మహాబీజం. ఇహంతో ఇవాళ ప్రవహిస్తున్నది ‘అహం’ అనే హాలాహలం. అది అమృతజలంగా మారితే లోకమే కల్యాణమందిరమవుతుంది. 


‘నీవు నిమిత్తమాత్రుడివి. కర్మచెయ్యి, ఫలితం నాకు వదిలెయ్యి’ అంటూ గీతాబోధ చేసి అర్జునుణ్ని చైతన్యవంతుణ్ని చేసిన వాసుదేవుడి ఉపదేశ రహస్యం కూడా ఇదే! ‘నేను’ అన్నది ఆత్మస్వరూపమని అంతర్‌దృష్టితో చూసేవారికే అవగతమవుతుంది. అంతర్ముఖీనమైన మనసుకే ‘నేతి’

‘నేతి’ (ఇదికాదు) అన్న భావనకు గల తాత్పర్యం బోధపడుతుంది. ‘అహం బ్రహ్మాస్మి’ (నేనే భగవంతుణ్ని) అన్న సత్యం గ్రాహ్యమవుతుంది. పశుత్వం నుంచి శివత్వంవైపు జరిగే పవిత్ర యాత్రకు ‘అందరికీ శుభమగుగాక’ మూల భావనే భారతీయ సంస్కృతి నినాదమైంది. 


ఓం నమః శివాయ

*A sweet memorable things in our life*...

 *A sweet memorable things in our life*... 


రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మనది .

ఇంటి ముందు కొచ్చే పాల ఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూ నూ. 

SSC పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం మనది .

అద్దెకి బుక్స్ (నవలలు ) తెచ్చుకున్న తరం మనది.

సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టే కాలం అది.

గెజిటెడ్ ఆఫీసర్లు అయినా సైకిళ్లు తొక్కేవాళ్లు ఆ రోజుల్లో.

డ్రాయింగ్ రూమ్ లలో జిమ్ములలో తొక్కే అవసరం పడేది కాదు.


చేబదుళ్లకి కాదేదీ అనర్హం. పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో కాఫీ పొడైనా, బాబాయ్ గారి రాలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ. 


అప్పు పుట్టని పచారీ షాపులూ, బట్టల కొట్టులూ వుండేవే కావు.

రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం నిలబడి, డ్యూయెట్లూ.

పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి.


మధ్యతరగతి మందహాసం కాదు. పగలబడి నవ్వేది.

ఇంటి ముందుకు

కోతులాడించేవాడు, పాములాడించేవాడు, గంగిరెద్దులాడించేవాడు, ఎలుగు బంటిని తెచ్చేవాడు, చిలక జోస్యం చెప్పేవాడు, వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చేసే వాళ్లు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించే వాళ్లు.


మేకప్పులు అంటే తెలీని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకునొచ్చి, ఇళ్ల ముందు సినిమా పాటలకి డాన్స్ లాడే వారు.

గారడీల వాళ్లు బాలన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లలని నడిపిస్తూ చూపించే వాళ్లు.

మూలికలూ, పసర్లూ అమ్మేవాళ్లు తాము నయం చెయ్యలేని రోగం లేదనే వాళ్లు.

బస్టాండ్ లో చెవి గులిమిలు తీస్తామనే పెట్టెలతో తిరిగే వాళ్లూ.

ఇళ్లముందు కొచ్చి సవరాలు కడతాం అనే వాళ్లూ.

వాళ్ల కోసం టిన్నుల్లో జుట్టు వూడితే దాచుకున్న వాళ్లూ వుండేవారు.

మధ్యాహ్నాలు భోజనాలయి వంటింటి గుమ్మం మీద తల పెట్టి కునుకు తీస్తుంటే.

 "దువ్వెన్లు, బొట్లు, కాటుక పెట్లు, ఇయర్ పిన్లు, రబ్బర్ గాజులు, రిబ్బన్లహో". అంటూ పెట్టె నెత్తిన పెట్టుకొచ్చే వాళ్ల దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువుండేది కాదు. వాళ్లు వెళ్లగానే "పాత బట్టలకి స్టీల్ సామాన్లిస్తాం". అన్న వాళ్లు వచ్చి ఎన్నేసినా, చూపించినా గంగాళం కాకుండా, ఆఖర్న ఉగ్గు గిన్నె ఇచ్చి పోయేవాళ్లు. గోతాముడు పాత బట్టలొదిలిపోయేవి. కత్తికి సాన పెడ్తాం, నవార్లు నేస్తాం. పరుపులేకుతాం. గిన్నెలకి సొట్టలు తీస్తాం. బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం. అరువు మీద చీరలిస్తాం అంటూ ఇంటి ఇల్లాళ్లని ఊపిరి తీసుకోనిచ్చే వాళ్లు కారు. ఇంక ముగ్గు అమ్మే వాళ్లూ, ఉప్పు అమ్మేవాళ్లూ, కూరలూ పండ్లూ అమ్మే వాళ్లూ సరేసరి. 


మాదా కబళం వాళ్లు "అన్నం వుంటే పెట్టమ్మా నీ కొడుకులు, బిడ్డలు, మనవలు సల్లంగుండ" అంటూ టైముల వారీగా వచ్చే వాళ్లు...సాయంత్రం 8 గంటల బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది..

రేడియోలో బినాకా గీత్ మాలా ఊహల రెక్కలు విప్పేది. భూలే భిస్రే గీత్ అమర లోకాల్లో విహరింప చేసేది. రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు... "ఏమిటో" అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు 'ఇతి బలదేవానంద సాగరహా 'తో ప్రారంభం అయితే ఈ మాసం పాటలూ కార్మికుల కార్యక్రమాలూ సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలూ..వివిధ భారతి... మీరుకోరిన పాటలూ..పండితులచే నిర్మించబడ్డ నాటకాలూ..వావ్ రేడియో స్వర్ణ యుగం అది!.


అప్పట్లో పేపరు చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు..ఇంగ్లీష్ పేపర్ చదువుతే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే ,రేడియోలో, దూర్దర్శన్ లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం..తాతయ్యలకీ దూరపు చుట్టాలకీ ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగులు నేర్చుకున్నాం....ఉభయకుశలోపరి ఎక్కడ పెట్టాలో, గంగాభాగీరధీ సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు!!


ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు.... 

ఇప్పటికి ఎప్పటికి మా గుండెల్లో నిలిచిపోయి, మా గుండెలు అగిపోయేవరకు మాతో వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న గుర్తులు.


అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు

వీధిలో పిల్లల అల్లరి లేదు

తాతలు ఇచ్చే చిల్లర లేదు

ఏడు పెంకులు ఏమైపోయే

ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు 

పెరుగులమ్మే ముంతలు లేవు

బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు 

కళ్ళ గంతలు కానే రావు

డ్రింకు మూతల గోలే లేదు 

బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు 

జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె

దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె

బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు

మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు

ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే

రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని జీవితం

మానవాళికే మాయని మరక.


మనమే అదృష్టవంతులమ్*!           

1950-60 లలో పుట్టిన మనం ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మన తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 

ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము. లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. 

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత 

గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. 

దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* 


ఇక పల్లెటూళ్ళనుండి పట్టణానికి కిలోమీటర్లు నడుచుకుంటూ క్యారేజ్ తీసుకొని వచ్చి చదువుకునే రోజులు కొంతమంది జీవితాలలో మరువలేనివి. ఆ కష్టాలు చెప్పుకోలేనివి. ఏమి తిన్నామో, లేదో తెలియదు. పల్లెటూల్ల నుండి వచ్చిన మనలో కొంతమందికి, టౌన్లో నివాసముండే ఉద్యోగుల పిల్లలను చూసి ఆశ్చర్యపోవడం మన వంతు. కొన్నిసార్లు కొంచెం ఈర్ష్యగా ఉండేది కూడా, కదూ!.


పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.* 

దాదాపు అందరం భట్టిపంతులు బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మన లో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!  

ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  

ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *అర్ద రూపాయి ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట

రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం

ఈ నాటికీ దాదాపు మనం అందరం 

✌🏻64- 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు మొదలుగునవి.. చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!

అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకున్న వాళ్ళమే.   

*మనకన్నా అదృష్టవంతు లెవరుంటారు నేస్తం?*

 🤝🤝**అందుకే వీలయినప్పుడల్లా కలుసుకుందాం.🤝

ఏమంటారు ఫ్రెండ్స్** 


ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్ని మనమే చూసుకున్నట్టు ఉంది కదా.


నమస్తే 🙏.


    *~శుభమస్తు*~

        🌻🌹🌻


//సేకరణ//

నవ్వుకు ఉండే విలువ

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏           🔥 *నవ్వుకు ఉండే విలువ బాధ కు లేదు.. డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు.. అబద్దానికి ఉండే విలువ నిజానికి లేదు.. నేనే అంతా అని అనుకుంటే అహంకారం.. మనదే అని అనుకుంటే మమకారం.. ఏమీ లేదనుకుంటే నిర్వి కారం.. ఒకరికి ఒకరు తోడైతే సహకారం* 🔥నిరాడంబరంగా ఉండడం అంటే అన్నిటికి దూరంగా ఉంటూ అందరికీ నిరాశను కల్పించడం కాదు.. లేనిపోని ఆశలను కల్పించక పోవడమే నిరాడంబరత...బరువులను అదృష్టంగా, బాధ్యత లను భరోసాలుగా మార్చుకోవడమే నిరాడంబరత..ఎన్ని కష్టాలు ఉన్న సమస్యలున్నా సరే వాటిని మనో బలంతో ఎదుర్కొంటూ సర్వ వేళలా సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషం పంచడమే నిరాడంబరత..నిరాడంబర జీవితమే నిశ్చింత జీవితం🔥 *అలవాటు మొదట్లో సాలేగూళ్ళు.. అలవాటు పడితే ఆ తరువాత ఇనప గొలుసులులా తయారవుతాయి... పుట్టినప్పుడు ఏడుస్తావు.. ఆది జననం.. ఆయువు తీరాక ఏడిపిస్తావు ఆది మరణం..ఈ రెండిటి మధ్యలో నీ ప్రవర్తనతో ఎంత మందిని ఏడిపించకుండా బ్రతుకుతావో అదే జీవితం*🔥🔥మీ అల్లంరాజు  భాస్కరరావు . శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారికి రాలేను వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.9440893593 .9182075510* 🙏🙏🙏

కర్మయోగం

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: శ్రీ భగవానువాచ


శ్రేయాన్‌స్వధర్మో విగుణః పరధర్మాత్‌స్వనుష్ఠితాత్ 

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః (35)


ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడంకంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వల్ల స్వధర్మాచరణలో మరణమైనా మంచెదే.

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*శ్లో 𝕝𝕝   తుల్యనిందాస్తుతిర్మౌనీ*

   *సంతుష్టో యేన కేనచిత్|*              *.          అనికేతః స్థిరమతి*

       *ర్భక్తిమాన్మే ప్రియో నరః||*

        *భగవద్గీత*


*తా 𝕝𝕝 శత్రుమిత్రులయందును, మానావమానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ధి కలిగి, సంగరహితుడై, నిత్య సంతుష్టుడై, చలించని మనస్సు కలవాడై, నాయందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.....*


 ✍️🌹💐🪷🙏

56 పుస్తకాలు(PDF) ఒకేచోట

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀




*జ్ఞాన యోగం/బ్రహ్మవిద్య/సాధన  సంబంధ 56 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

నన్ను నేను తెలుసుకోవటం ఎలా? https://www.freegurukul.org/z/AthmaJnanam-Through-Pictures.pdf


బ్రహ్మవిద్యా రత్నాకరము-1 నుంచి 2 భాగాలు www.freegurukul.org/g/JnanaYogam-1


జీవిత పరమార్ధము - వేదాంత శాస్త్రము www.freegurukul.org/g/JnanaYogam-2


అద్వైత సిద్ధి www.freegurukul.org/g/JnanaYogam-3


ఆత్మానాత్మ వివేక దర్శిని www.freegurukul.org/g/JnanaYogam-4


బ్రహ్మ విద్యాసుధార్ణవము www.freegurukul.org/g/JnanaYogam-5


శ్రీ బ్రహ్మ విద్య www.freegurukul.org/g/JnanaYogam-6


విశ్వ వేదన www.freegurukul.org/g/JnanaYogam-7


సత్య ధర్మ విచారణ - ధర్మ చర్చ www.freegurukul.org/g/JnanaYogam-8


ఆత్మ అనగా ఏమిటి www.freegurukul.org/g/JnanaYogam-9


ఆత్మబోధ www.freegurukul.org/g/JnanaYogam-10


బ్రహ్మ జిజ్ఞాస-1 www.freegurukul.org/g/JnanaYogam-11


బ్రహ్మ జిజ్ఞాస-2 www.freegurukul.org/g/JnanaYogam-12


బ్రహ్మ జిజ్ఞాస-3 www.freegurukul.org/g/JnanaYogam-13


బ్రహ్మ జిజ్ఞాస-4 www.freegurukul.org/g/JnanaYogam-14


త్రిపురా రహస్య దీపిక-జ్ఞాన ఖండము www.freegurukul.org/g/JnanaYogam-15


ఆత్మ సాక్షాత్కారము www.freegurukul.org/g/JnanaYogam-16


బ్రహ్మవిద్య www.freegurukul.org/g/JnanaYogam-17


వేదాంత విద్యాసారధి www.freegurukul.org/g/JnanaYogam-18


బ్రహ్మవిద్యానుసంధాన దర్పణం www.freegurukul.org/g/JnanaYogam-19


జ్ఞానామృత సారము www.freegurukul.org/g/JnanaYogam-20


బ్రహ్మ విద్యా దర్పణము www.freegurukul.org/g/JnanaYogam-21


శంకరాద్వైత వ్యాసమాల-1 www.freegurukul.org/g/JnanaYogam-22


శంకరాద్వైత వ్యాసమాల-3 www.freegurukul.org/g/JnanaYogam-23


శ్రీ బ్రహ్మ విద్య www.freegurukul.org/g/JnanaYogam-24


పరిపూర్ణ బ్రహ్మ విద్య www.freegurukul.org/g/JnanaYogam-25


ఆత్మ తత్వ వివేకము www.freegurukul.org/g/JnanaYogam-26


వివర్త వాద వివేకము www.freegurukul.org/g/JnanaYogam-27


బ్రహ్మ విద్యా వైభవము www.freegurukul.org/g/JnanaYogam-28


ఆత్మ తత్వము www.freegurukul.org/g/JnanaYogam-29


అద్వైత బోధిని www.freegurukul.org/g/JnanaYogam-30


బ్రహ్మవిద్య ప్రాధమిక సూత్రములు www.freegurukul.org/g/JnanaYogam-31


సత్యార్ధ ప్రకాశము www.freegurukul.org/g/JnanaYogam-32


మానవ జన్మ సాఫల్యము-ముక్తి మార్గము www.freegurukul.org/g/JnanaYogam-33


జీవన్ముక్తి వివేకః www.freegurukul.org/g/JnanaYogam-34


భగవదన్వేషణ-కొన్ని మంచి మాటలు www.freegurukul.org/g/JnanaYogam-35


సర్వ వేదాంత శిరోభూషణం www.freegurukul.org/g/JnanaYogam-36


మోక్షస్వరూప నిర్ణయము www.freegurukul.org/g/JnanaYogam-37


ఆత్మ దర్శనము www.freegurukul.org/g/JnanaYogam-38


సర్వోపనిషత్ సార సంగ్రహము www.freegurukul.org/g/JnanaYogam-39


ముముక్షు ధర్మము www.freegurukul.org/g/JnanaYogam-40


విజ్ఞాన వీచికలు-ఆధ్యాత్మికతరంగాలు www.freegurukul.org/g/JnanaYogam-41


సాధన www.freegurukul.org/g/JnanaYogam-42


ఆత్మా- చిత్ ప్రవచనములు www.freegurukul.org/g/JnanaYogam-43


ఒకటి సాధిస్తే అన్ని సాధించినట్లే www.freegurukul.org/g/JnanaYogam-44


సాధన సోపానాలు www.freegurukul.org/g/JnanaYogam-45


తత్వబోధ www.freegurukul.org/g/JnanaYogam-46


వివేక చింతామణి www.freegurukul.org/g/JnanaYogam-47


సనత్సు జాతీయము www.freegurukul.org/g/JnanaYogam-48


వేదాంతపు కథలు www.freegurukul.org/g/JnanaYogam-49


గురుప్రభోద తారావళి www.freegurukul.org/g/JnanaYogam-50


జగన్మిధ్యా - తత్వ పరిశీలనము www.freegurukul.org/g/JnanaYogam-51


అద్వైతం www.freegurukul.org/g/JnanaYogam-52


అధ్యాత్మ జడ్జిమెంట్ www.freegurukul.org/g/JnanaYogam-53


మోక్ష సాధన www.freegurukul.org/g/JnanaYogam-54


జ్ఞానదీపిక www.freegurukul.org/g/JnanaYogam-55


సద్గురు తత్త్వభోధ www.freegurukul.org/g/JnanaYogam-56


బ్రహ్మవిద్య/జ్ఞాన యోగం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

⚜ శ్రీ విల్వాద్రినాథ దేవాలయం

 🕉 మన గుడి : నెం 1067


⚜ కేరళ  : తిరువిల్వామల - త్రిస్సూర్ 


⚜ శ్రీ విల్వాద్రినాథ దేవాలయం



💠 విల్వాద్రినాథ దేవాలయం కేరళలోని త్రిస్సూర్ జిల్లా తిరువిల్వామలలో శ్రీరాముడికి అంకితం చేయబడిన కేరళలోని నాలుగు ప్రధాన దేవాలయాలలో ఇది ఒకటి, మిగిలిన మూడు త్రిప్రయార్, కడవల్లూర్ మరియు తిరువంగడ్ దేవాలయాలు మరియు లక్ష్మణ భగవానుని కలిగి ఉన్న భారతదేశంలోనే అరుదైన దేవాలయాలలో ఒకటి. 



🔆 స్థల పురాణం 


💠 కశ్యప మహర్షి కుమారుడు అమలక అనే మహర్షి ఈ స్థలంలో విష్ణువును స్తుతిస్తూ భారీ తపస్సు చేశాడు.  

ఉసిరి పండు మాత్రమే తినడం వల్ల అమలక మహర్షికి ఈ పేరు వచ్చిందని నమ్ముతారు. 



💠 విష్ణువు తన భార్యలు శ్రీదేవీ మరియు భూదేవీ మరియు అతని  అనంతుడుతో  ( ఆదిశేషుడు) అతని ముందు కనిపించాడు.  

ప్రజల శ్రేయస్సు కోసం భగవంతుడు అక్కడే ఉండాలని తన కోరికను చెప్పాడు.  

ఆ విధంగా, భగవంతుడు తన భార్యలు మరియు అనంతునితో స్వయంభూ విగ్రహంగా మారిపోయాడు.


💠 విగ్రహాలను ప్రతిష్టించిన తరువాత, విష్ణువు యొక్క శక్తి గ్రామం అంతటా వ్యాపించింది.  

అది విన్న అసురులు మళ్లీ కోపోద్రిక్తులయ్యారు.  ఆ విగ్రహాలను ధ్వంసం చేయడానికి వారిలో ఒకరిని పంపారు.  


💠 అతడు పవిత్ర బ్రాహ్మణుని రూపంలో వెళ్ళాడు.  

ఆ రోజుల్లో ఆలయంలో బ్రాహ్మణులకు రెండు పూటలా భోజనం పెట్టేవారు.  వారితో ఈ అసురుడు కూడా చేరాడు.  పగటి పూట మామూలు బ్రాహ్మణుడిలా ఉండేవాడు, రాత్రి పూట తన రూపం మార్చుకున్నాడు.  

ఆ తరువాత, అతను ఆలయానికి దానం చేసిన ఆవులను తినడం ప్రారంభించాడు మరియు వాటి ఎముకలను ఉత్తరం వైపు విసిరాడు.  అందువలన, ఈ ప్రదేశానికి 'మూరిక్కున్ను' (మూరి అంటే పశువులు మరియు కున్ను అంటే మలయాళంలో కొండ) అని పేరు వచ్చింది.


💠 నిద్రపోతున్న కొందరు బ్రాహ్మణులను కూడా తిన్నాడు.  

కానీ సమీపంలో మాంసాహార జీవి లేకపోవడంతో అసలు హంతకుడు ఎవరికీ తెలియదు.  

ఆవులను తినేది ఏదైనా దెయ్యం అని ప్రజలు భావించారు.  చివరగా, కుంభం మాసం (ఫిబ్రవరి-మార్చి) చీకటి పక్షంలో 11వ రోజు (ఏకాదశి) వచ్చింది.  అసురుడు తన పనిని నెరవేర్చుకోవడానికి ఆ సమయం అత్యంత అనుకూలమైనదిగా భావించాడు.  


💠 ఒక అర్ధరాత్రి పూజలన్నీ ముగించుకుని అందరూ నిద్రపోయాక స్తంభాలను ధ్వంసం చేస్తూ అసురుడు శ్రీ కోవిల్‌లోకి ప్రవేశించాడు.  

ఆ సమయంలో, విష్ణువు తన నాల్గవ అవతారమైన నరసింహ రూపంలో ఒక స్తంభం నుండి కనిపించాడు మరియు హిరణ్యకశిపుని చంపిన విధంగానే అసురుడిని సంహరించాడు.  


💠 అసురుడు చేసిన ఉరుము శబ్దం విన్న ప్రజలందరూ మేల్కొని ఏమి జరిగిందో చూడటానికి పరుగెత్తారు.  స్వామివారి ఉగ్రరూపాన్ని చూసి చాలా మంది మూర్ఛపోయారు.  

కొందరు వ్యక్తులు నేలపై సాష్టాంగపడి భగవంతుని నామస్మరణ చేశారు.  భగవంతుని ఉగ్రరూపాన్ని చూసే ధైర్యం వారికి లేదు.  


💠 ఆ సమయంలో అమలక మహర్షి 

అక్కడికి వచ్చి భగవంతుని నామస్మరణ చేసాడు. 

 ఆ తరువాత, భగవంతుడు తన అసలు రూపానికి తిరిగి వచ్చి, తన భక్తులను అనుగ్రహించాడు.

 

💠 కేరళలో రాముడు స్వయంభువుగా ఉన్న ఏకైక ఆలయం ఇదే. 

 ఇది సుమారు 5 అడుగుల పొడవు, మరియు 'పాఠలంజన శిలా' అని పిలువబడే అరుదైన రాతితో తయారు చేయబడింది. 

 విగ్రహం పైభాగంలో అనంత గొడుగులా పడుకుని ఉంటాడు. 


💠 తూర్పు ముఖ మందిరంలో లక్ష్మణుని విగ్రహం సుమారు 3 అడుగుల ఎత్తు ఉంటుంది. 

శ్రీరాముని సోదరుడు కోసం నిర్మించబడిన భారతదేశంలోని అరుదైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి.  

ఈ విగ్రహం సుమారు 3 అడుగుల పొడవు ఉంటుంది మరియు ఇది కూడా 'పథలాంజన శిల'తో రూపొందించబడింది.  

పడమటి నాడలోలాగా ఈ విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు లేవు.


💠 దక్షిణం వైపున, ఇక్కడ 'కుండిల్ అయ్యప్పన్' అని పిలవబడే అయ్యప్పకు అంకితం చేయబడిన ఒక మందిరం ఉంది, ఎందుకంటే ఈ మందిరం ప్రధాన ఆలయానికి 50 అడుగుల దిగువన ఒక గొయ్యి (మలయాళంలో 'కుండు' అని పిలుస్తారు) మీద ఉంది.  


💠 ఇక్కడ, అయ్యప్ప భగవానుడు తన తండ్రి శివుడు మరియు అతని భార్య పార్వతీ దేవితో కలిసి తూర్పు ముఖంగా ఉంటాడు.  

ఈ ఆలయం నుండి కర్క్కడకం (జూలై-ఆగస్టు) మాసంలో విల్వద్రినాథ భగవానుడు 'త్రిప్పుతరి'కి అన్నం పొందుతాడు.  



🔆 రోజువారీ పూజా సమయాలు 


💠 ఆలయం 7 సార్లు శంఖం ఊదడం ద్వారా శాంతియుతమైన మరియు పవిత్రమైన వాతావరణంలో ఉదయం 4 గంటలకు తెరవబడుతుంది.  

ఆ రోజున జరిగే మొదటి దర్శనాన్ని 'నిర్మాల్య దర్శనం' (అంటే 'మునుపటి రోజు అలంకారాలతో కూడిన దర్శనం' అని అర్థం) అంటారు. 

 ఆ అలంకారాలను తొలగించిన తర్వాత, 'శంఖాభిషేకం' (కుడివైపు శంఖంపై పవిత్ర జలాన్ని తీసుకొని నిర్వహించే ప్రత్యేక అభిషేకం) మరియు ఇతర అభిషేకాలు నిర్వహిస్తారు.  అనంతరం విగ్రహాలను నూతన వస్త్రాలు, గంధంతో అలంకరిస్తారు. 


💠 ప్రతి రోజు మొదటి నైవేద్యంగా మలార్ (వేపుడు బియ్యం ), అరటిపండు మరియు బెల్లం.  

దీని తరువాత, ఉషపూజ (ఉదయం పూజ) కోసం నాడ మూసివేయబడుతుంది, ఈ సమయంలో నెయ్యి పాయసం సమర్పించబడుతుంది.


రచన

©️ Santosh Kumar

15-15-గీతా మకరందము

 15-15-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - సకల జీవుల హృదయములందును తాను వెలయుచున్నాడనియు, అన్నిటికిని తానే యాధారభూతుడనియు భగవానుడు తెలుపుచున్నారు-


సర్వస్య చాహం హృది సన్నివిష్టో 

మత్తః స్మృతి ర్జ్ఞాన మపోహనం  చ | 

వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో

వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ || 


తాత్పర్యము:- నేను సమస్తప్రాణులయొక్క హృదయమందున్నవాడను; నావలననే (జీవునకు) జ్ఞాపకశక్తి, జ్ఞానము (తెలివి), మఱపు కలుగుచున్నవి. వేదములన్నిటిచేతను తెలియదగినవాడను నేనే అయియున్నాను. మఱియు వేదము నెఱిగినవాడనుగూడ నేనే అయియున్నాను.


వ్యాఖ్య:- ‘సర్వస్య’ - జాతిమతకులతారతమ్య మెద్దియులేక చరాచర ప్రాణికోట్ల యందు భగవానుడు నివసించుచున్నాడని చెప్పబడుటవలన ఇక నెవరును అధైర్యపడవలసిన పనిలేదు. మహాపాపియైనను చండాలుడైనను తనయందలి దైవసన్నిధిని స్మరించి పవిత్రాచరణద్వారా వారిని తెలిసికొనవచ్చును. అట్టి పాపియు తన వెనుకనున్న, తనకు ఆధారముగనున్న అఖండచైతన్యమును స్మృతియందుంచుకొనినచో తన నిజరూపమును చింతించినచో పుణ్యాత్ముడే అయి తరించును.

ఇట్టి అవకాశమును శ్రీకృష్ణపరమాత్మ గీతయందు సర్వులకును కల్పించియున్నారు. ఎటువంటివారికైనను తరించుటకు చక్కని అవకాశము నొసంగియున్నారు. తరంగము చిన్నదైనను, పెద్దదైనను రెండిటివెనుక మహాసముద్రమే కలదు. కాబట్టి చిన్నతరంగము (ప్రాణి) అధైర్యమొందవలసిన పనిలేదు.

తనయందలి అంతర్యామియగు పరమాత్మను తెలిసికొనిన చాలును. ఆ పరమాత్మ అందఱి యొక్కయు "జన్మహక్కు” అని గీతాచార్యులు "సర్వస్య” అను పదముద్వారా భేరి మ్రోగించి చెప్పుచున్నారు.


"హృది” (హృదయమునందు) - అని పేర్కొనుటవలన, భగవానుడు ప్రతివానికిని అతిసమీపమున హృదయమందే వర్తించుచున్నారని భావము. కావున శిక్షకుడు చెంతనే యున్నారని గ్రహించి, పాపకృత్యములనుచేయక భగవత్ప్రీతికరములైన కార్యములనే (ధర్మకార్యములనే) చేయవలెను.

"మత్తః స్మృతిర్జ్ఞాన మపోహనం చ" - స్మృతి, జ్ఞానము, మఱపు - ఇవి యన్నియు మనస్సు యొక్క వివిధరూపములు. పరమాత్మయో మనస్సునకు అధిష్ఠానముగ, ఆధారభూతుడుగ నున్నవారు. కావున వారివలననే యవి కలుగుచున్నవని చెప్పబడినది. దీనినిబట్టి కేవలము స్థూలవస్తువులనేకాక, అతిసూక్ష్మములగు జీవుని మానసిక ప్రవృత్తులనుగూడ భగవానుడు గమనించుచున్నట్లును, వారికి తెలియకుండ ఏదియు మనస్సునందు జరుగదనియు స్పష్టమగుచున్నది. కాబట్టి ప్రతివారును తమ మనస్సునం దేలాటి అపవిత్రత, మాలిన్యము, దుస్సంకల్పములు, విషయవాసనలు రానీయకుండ భద్రముగా చూచుచుండవలెను.

"వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః” - వేదములందు, శాస్త్రములందు అనేక దేవుళ్లు, దేవతలు చెప్పబడినప్పటికిని, తెలిసికొనదగినవాడు ఆ పరమాత్మ ఒకడే అయియున్నారు. బ్రహ్మవిష్ణుమహేశ్వరాది వివిధదేవుళ్ళందఱును ఒక్క పరమాత్మ యొక్కయే వివిధరూపులైయున్నారు. ప్రపంచమున ఒకే చరమలక్ష్యము, ధ్యేయము, జ్ఞేయము కలదు. అది సచ్చిదానందపరబ్రహ్మమే (పరమాత్మయే) యగును.


"వేదాన్తకృత్” - వేదములన్నిటిని సృష్టించినది సాక్షాత్ పరమాత్మయేకాని మానవమాత్రుడుకాడని యిట స్పష్టముగ తెలుపబడుటవలన, ఆ వేదాదులందు తెలుపబడిన సత్యములందు (‘ఇవి భగవత్ర్పోక్తములే’ అను) నమ్మకముగలిగి ప్రవర్తింపవలయును. అవి దైవనిర్మితములగుటచే వానియందు అఖండవిశ్వాసముంచవలెను. లోకమున గురు పరంపర చెప్పునపుడును ‘ఓమ్ నారాయణం పద్మభువం.....’ అని మొట్టమొదట ఆ పరమాత్మనే, శ్రీమన్నారాయణునే పేర్కొనుచుందురు.


ప్రశ్న:- భగవంతు డెచటనున్నాడు?

ఉత్తరము:- అందఱియొక్క హృదయమున వసించుచున్నాడు.

ప్రశ్న:- స్మృతి, జ్ఞానము, మఱపు ఎవనివలన గలుగుచున్నవి?

ఉత్తరము:- ఆ పరమాత్మవలననే.

ప్రశ్న:- వేదములన్నిటిచే తెలియబడదగిన వారెవరు? వేదాంతమును సృష్టించినదెవరు? వేదమును లెస్సగ దెలిసినవారెవరు?

ఉత్తరము:- ఆ పరమాత్మయే.

తిరుమల సర్వస్వం 195-*

 *తిరుమల సర్వస్వం 195-*

**శ్రీవారి ఆభరణాలు -7*

 ఆలయంలో ఉండే చిన్న-పెద్ద, కొత్త పాత నగలన్నింటిని పరీక్షించి, అవి నిఖార్సైన బంగారు నగలే అని ధ్రువీకరించారు.


 బీరువాలో భద్రపరిచిన నగల వివరాలను ఆయా రిజిస్టర్ లలో ఉన్న వివరాలతో పోల్చి, అన్నీ సక్రమంగా ఉన్నాయని తేల్చి చెప్పారు.


 నిఘా వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా ఉన్నదని, అవసరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం పరిశీలించే పటిష్టమైన వ్యవస్థ కూడా ఉన్నట్లుగా కమిటీ అభిప్రాయపడింది.


 భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించుకున్న నగలు చోరీకి గురైనట్లు అప్పుడప్పుడు ప్రసార మాధ్యమాల్లో వచ్చే వార్తలు నిజం కాదని; ఒకరో ఇద్దరో క్రింది స్థాయి ఉద్యోగులు చాలా అరుదుగా ఆభరణాల విషయంలో అవినీతికి పాల్పడినప్పటికీ, అటువంటి వారి విషయంలో ఆలయ యాజమాన్యం కఠినంగా వ్యవహరించి, ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించుకుంటూ, దేవాలయ యాజమాన్యం పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని

2 నిలబెట్టే విధంగా విశేషమైన కృషి జరుగుతోంది.


 ఆభరణంలోని ఏదైనా రాయి ఊడినా, ఆభరణం విరిగినా, ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నీ రికార్డుల్లో నమోదు చేయబడతాయి. విరిగిన రాళ్లు, ముక్కలు కూడా మిల్లీగ్రాములతో సహా లెక్కగట్టి, వాటిని విడిగా భద్రపరిచే సంప్రదాయం అమలులో ఉంది.


 ప్రతి ఆభరణానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను పేర్కొని, ఆ ఆభరణం యొక్క పూర్తి వివరం, బరువు, రాళ్ల సంఖ్య, ఏ జాతి రాళ్ళు మొదలగు వాటన్నింటినీ రిజిస్టర్ లలో లేదా కంప్యూటర్ లో నమోదు చేస్తారు. ఏ ఆభరణాన్నైనా దాని నిర్దిష్టస్థానం నుంచి ఏ కారణం చేతనైనా బయటకు తీసినట్లయితే, – దానిని ఎందుకు బయటకు తీయవలసి వచ్చింది, ఏ తేదీ నాడు ఎవరిద్వారా తీయబడింది, మరలా ఎప్పుడు యథా స్థానానికి చేరింది – వంటి వివరాలు కూడా తప్పనిసరిగా నమోదు చేయబడుతున్నాయి.


 1933వ సంవత్సరంలో తి.తి.దే. యాజమాన్యం లోకి వచ్చినప్పుడు, మహంతుల ద్వారా అప్పగించబడిన నగలన్నీ యథాతథంగా ఈనాటికీ ఉన్నాయని, ఎటువంటి అవకతవకలు జరగలేదని కమిటీ తేల్చి చెప్పింది.


 కుప్పలు తెప్పలుగా ఉన్న స్వర్ణాభరణాలన్నీ కేవలం స్వామివారి భౌతిక సంపత్తి అయితే; శ్రీవారిపట్ల కోట్లాది భక్తుల గుండె సవ్వళ్ళలో గూడు కట్టుకున్నట్టి, వెలకట్ట సాధ్యం కాని ప్రేమాభిమానాలు, భక్తితత్పరతలు వారికి అసలైన ఆభూషణాలు.


ఆ ఆనందనిలయుని అలంకారాలన్నీ భక్తులు తనివితీరా చూసి సంతృప్తి చెందడానికే గానీ, వారికివన్నీ నిమిత్తమాత్రం.


 వేల సంవత్సరాల క్రితం ఏ విధమైన ఆచ్ఛాదనా లేని ఒక చిన్న నాలుగు కాళ్ళ మంటపంలో చిన్న కౌపీనంతో ఉన్నప్పుడు; బంగారువిమానం క్రిందనున్న భవ్యమందిరంలో వేలకోట్ల ఆభరణాలను ధరిస్తూ షట్కాల పూజలందు కొంటున్న ప్రస్తుత తరుణంలో అదే చిద్విలాసం, అదే వరదహస్తం. పగిలిన కుండపెంకులో చద్దెన్నం పెట్టిన నిరుపేద కుమ్మరి భీమన్నను; కోట్ల రూపాయలు విలువైన ధన, కనక, వస్తు, వాహనాలను సమర్పించుకున్న దక్షిణభారత చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలును స్వామివారు ఒకే రీతిగా కరుణించారు.


 *'వడ్డికాసులవాడిగా'* తాను పేరు తెచ్చుకొని, వచ్చిన కానుకలన్నింటినీ పరోపకారార్థమే వినియోగించే, వితరణశీలి అయిన ఆ మాధవుడు చేసే 'మానవసేవ' గురించి మరొక ప్రకరణంలో వివరంగా తెలుసుకుందాం.


 *బహుశా భద్రతా కారణాల వల్ల శ్రీవారి ఆభరణాల సంబంధించిన సమగ్రమైన సమాచారం బహిరంగంగా మాధ్యమంలో అందుబాటులో లేదు. అత్యంత అరుదుగా పత్రికల్లో ప్రచురించబడే వార్తలు, ప్రత్యేక కథనాలు, ఆలయంతో చిరకాల అనుబంధం ఉన్న వ్యక్తుల నుండి ముఖతః లభించిన సమాచారం, వీటన్నింటినీ సమన్వయ పరచడం ద్వారా పై వివరాలు సేకరించబడ్డాయి.*


[ రేపటి భాగంలో ... *కలపిల తీర్థం* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*


*334 వ రోజు*


*సైంధవుని మరణం*


కృష్ణుడు " అర్జునా! సైంధవుని తల నేల మీద పడితే ప్రమాదం. కనుక దానిని ఆపు " అన్నాడు. అర్జునుడు ఒక దాని వెంట ఒక బాణం సంధిస్తూ ఆ తల నేల మీద పడకుండా ఆపాడు. సైంధవుని తల బంతిలా తిరుగుతూ ఉంది. ఒక వైపు యుద్ధం చేస్తూనే ఒక వైపు బాణప్రయోగంతో సైంధవుని తలని ఆపుతూ " కృష్ణా ! ఎంత సేపు ఈ తలని ఇలా ఆపాలి " అన్నాడు. కృష్ణుడు " సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు. అతడు సింధు దేశపు రాజు. అతడికి వర ప్రసాదంగా సైంధవుడు జన్మించాడు. ఒక రోజు ఆకాశవాణి " సైంధవుని తల యుద్ధంలో నరకబడుతుంది " అని చెప్పింది. అది విన్న వృద్ధక్షతుడు " నా కుమారుని తల నేల మీద పడవేసిన వాడి తల ముక్కలౌతుంది " అని శపించాడు. అతడు ఇప్పుడు తపమాచరించుటకు అడవులకు వెళ్ళాడు. కనుక నీవు పాశుపతాస్త్ర సాయంతో సైంధవుని తల అతడి తండ్రి వృద్ధక్షతుడి ఒడిలో పడేలా చేయి " అన్నాడు. అర్జునుడు " కృష్ణా! వృద్ధక్షతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా! వృద్ధక్షతుడు ఇప్పుడు శమంతక పంచకం సమీపంలో తపస్సు చేసుకుంటున్నాడు. నీవు అతడి తలను వృద్ధక్షతుడి ఒడిలో పడేలా అస్త్ర ప్రయోగం చేయి " అన్నాడు. అర్జునుడు పరమశివుని భక్తితో స్మరించి పాశుపతాన్ని ప్రయోగించాడు. సైంధవుడి తల ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షతుడి ఒడిలో పడేలా చేసాడు. హటాత్తుగా తన ఒడిలో పడిన మానవ మస్తకాన్ని చూసి కంగారు పడిన వృద్ధక్షతుడు దానిని నేల మీద విసిరి వేసాడు. వెంటనే శాపప్రభావంతో అతడి తల ముక్కలైంది. కృష్ణుడుఅర్జునుడిని ప్రశంసించాడు. కౌరసేన భయంతో పారిపోయింది. సైంధవుని తల నేల మీద పడే వరకు అలాగే ఉన్న సైంధవుని మొండెము సైంధవుని తల నేల మీద పడగానే కింద పడింది. ఇది చూసి అందరూ ఆశ్చర్య పడ్డారు. శ్రీకృష్ణుడి సాయంతో అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేర్చుకొనడం చూసి సాత్యకి, భీముడు సింహ నాదాలు చేసారు. కౌరవ సేనలో విషాదఛాయలు కమ్ముకున్నాయి. అది విని ధర్మరాజు ఆనందసాగరంలో మునిగాడు. పాడవుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. పాండవసైన్యం తూర్యనాదాలు, భేరి, మృదంగ నాదాలు చేసారు.

*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము సమాప్తం *


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

⚜ శ్రీ సుందరనారాయణ ఆలయం

 🕉 మన గుడి :


⚜ మహారాష్ట్ర : నాసిక్


⚜  శ్రీ  సుందరనారాయణ ఆలయం



💠 గంగా ఘాట్ సమీపంలో ఉన్న పురాతన ఆలయాలలో ఇది ఒకటి. గంగాధర్ యశ్వంత్ చంద్రచూడ్ దీనిని 1756లో నిర్మించారు. 

లక్ష్మి మరియు  సరస్వతితో పాటు విష్ణువు ప్రధాన దేవత. 


💠 ఈ ఆలయాన్ని "సుందర నారాయణ (విష్ణువు)" అని పిలవడానికి ప్రధాన కారణం, ఒకసారి జలంధర్ (దుష్ట రాక్షసుడు) భార్య వృంద ఇచ్చిన శాపం వల్ల విష్ణువు వికారంగా మారాడు.


💠 పురాణాల ప్రకారం, ఈ ప్రాంతం ఒకప్పుడు శివునికి అత్యంత భక్తుడైన జలంధర్ అనే దుష్ట రాక్షసుడిచే వెంటాడబడే ప్రదేశం. 

ఆ రాక్షసుడు క్రూరంగా ఉండి దుష్ట పనులు చేసినప్పటికీ, అతనికి ధర్మబద్ధమైన మరియు సద్గుణవంతురాలైన భార్య వృందా దేవి ఉండేది. 

అతని భక్తికి శివుడు ఎంతో ఆకర్షితుడై ఆ రాక్షసుడికి అమరత్వం అనే వరం ఇచ్చాడు. ఈ వరం జలంధర్ ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించేలా చేసింది.


💠 మానవాళిని రక్షించడానికి రాక్షసుడిని చంపడం ఎంత ముఖ్యమో దేవతలు గ్రహించారు. 

ఈ గొప్ప పనిలో సహాయం చేయడానికి దేవతలు విష్ణువును సంప్రదించారు. జలందర్ భార్య యొక్క పవిత్రత మరియు భక్తి అతని జీవితానికి కవచంగా పనిచేస్తుందని విష్ణువు అర్థం చేసుకున్నాడు. 


💠 విష్ణువు జలందర్ రూపాన్ని స్వీకరించి తన భార్యతో జీవించడం ప్రారంభించాడు.

అతను జలందర్‌ను చంపాడు. జలందర్ భార్య దేవి వృంద ఈ విషయం తెలుసుకున్నప్పుడు, ఆమె విష్ణువును నల్లగా మరియు వికారంగా మారమని శపించింది. 

ఆ స్త్రీ శాపం అతన్ని నల్లగా మార్చింది మరియు అతను తన అసలు రూపాన్ని తిరిగి పొందడానికి గోదావరి నదిలో పవిత్ర స్నానం చేయాల్సి వచ్చింది. 

తన అసలు రూపాన్ని తిరిగి పొందిన తర్వాత, విష్ణువును సుందరనారాయణ అని పిలుస్తారు.


💠 ఈ ఆలయం ముఖ్యంగా మొఘల్ శిల్పంతో ముడిపడి ఉన్న వంపుతిరిగిన గూడును ప్రదర్శిస్తుంది. 

తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలో తోరణాలు మరియు గోళాకార గోపురాలతో కూడిన మూడు వరండాలు ఉన్నాయి. 


💠 లక్ష్మీ మరియు సరస్వతితో చుట్టుముట్టబడిన ప్రధాన దేవత విష్ణువును గర్భగుడిలో ఉంచారు. గోడలపై హనుమంతుడు, నారాయణ మరియు ఇందిరల చిన్న శిల్పాలు ఉన్నాయి. 


💠 ఈ ఆలయం గురించి అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే ఇది నిర్మించబడిన కోణం. 

ప్రతి సంవత్సరం మార్చి 21న ఉదయించే సూర్యుని కిరణాలు మొదట విగ్రహాలపై నేరుగా పడతాయి. ఈ పవిత్ర కార్యక్రమాన్ని చూడటానికి ఈ రోజున వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.


💠 ఇది మరాఠా నిర్మాణ శైలిలో మరియు హేమద్‌పంతి నిర్మాణ శైలిలో సంక్లిష్టమైన పనితనంతో పూజకు అత్యంత పురాతనమైన ఆలయాలలో ఒకటి. 

గర్భగుడి ప్రాంతంలో విష్ణువు యొక్క అందమైన విగ్రహం ఉంది, ఇది సాధారణంగా పండుగల యొక్క వివిధ దశలలో పండ్లు మరియు పువ్వులతో అలంకరించబడుతుంది. 

ముఖ్యంగా పండుగలు లేదా రామ నవమి మరియు కార్తీక పూర్ణిమ వంటి ఇతర వేడుకల సమయంలో ప్రజలు పూజించడానికి అక్కడికి వెళతారు. మతపరమైన ప్రదేశం కావడంతో, ఆలయ వాతావరణం ప్రశాంతంగా మరియు ఆధ్యాత్మికంగా ఉంటుంది.


💠 దాని నిర్మాణ నిర్మాణాన్ని పరిశీలిస్తే, సుందరనారాయణ ఆలయానికి శతాబ్దాల పురాతన చరిత్ర ఉందని స్పష్టంగా తెలుస్తుంది. 

ఈ స్మారక చిహ్నం నిర్మాణం 13వ శతాబ్దంలో యాదవుల పాలనలో జరిగిందని చెబుతారు, తద్వారా సమకాలీన భవన నిర్మాణ శైలులను ప్రతిబింబిస్తుంది. అప్పటి నుండి ఈ ఆలయం కొన్ని నిర్మాణాత్మక మార్పులు మరియు సౌందర్య మెరుగుదలలకు గురైంది, అదే సమయంలో సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను నిలుపుకుంది.


💠 విష్ణువు ఆలయం కావడంతో, ఈ ఆలయం మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన ప్రార్థనా స్థలాలలో ఒకటి మరియు ముఖ్యమైన యాత్రా కేంద్రంగా ఉంది. చారిత్రాత్మకంగా, శతాబ్దాల క్రితం కూడా ఆచరణలో ఉన్న సంప్రదాయాలు మరియు ఆచారాలను తగిన గౌరవంతో నిర్వహించడం ద్వారా ఇది నాసిక్ యొక్క మతపరమైన జీవితానికి అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.


💠 సమయాలు: 

ఉదయం 6 - మధ్యాహ్నం 12 మరియు సాయంత్రం 5 - రాత్రి 9 గంటల వరకు.



💠 నాసిక్ సెంట్రల్ బస్ స్టేషన్ నుండి 2 కి.మీ దూరంలో, సుందరనారాయణ ఆలయం నాసిక్ లోని పంచవటి ప్రాంతంలోని రామ్ కుండ్ సమీపంలోని అహిల్యబాయి హోల్కర్ వంతెన మూలలో ఉంది.

మంగళవారం🍁* *🌹01, ఏప్రియల్, 2025🌹*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁మంగళవారం🍁*

*🌹01, ఏప్రియల్, 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - శుక్లపక్షం*


*తిథి       : చవితి* రా 02.32 వరకు ఉపరి *పంచమి*

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం   : భరణి* ఉ 11.06 వరకు ఉపరి *కృత్తిక*

*యోగం  : విష్కుంబ* ఉ 09.48 వరకు ఉపరి *ప్రీతి*

*కరణం   : వణజి* మ 04.04 *భద్ర* రా 02.32 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.00 సా 05.00  - 06.00*

అమృత కాలం  : *ఉ 06.50 - 08.16*

అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.36*

*వర్జ్యం            : రా 09.58 - 11.25*

*దుర్ముహూర్తం  : ఉ 08.30 - 09.19 రా 11.01 - 11.48*

*రాహు కాలం   :  మ 03.16 - 04.48*

గుళికకాళం       : *మ 12.11 - 01.44*

యమగండం     : *ఉ 09.07 - 10.39*

సూర్యోదయం :*ఉ 06.02* 

సూర్యాస్తమయం :*సా 06.20*

సూర్యరాశి : *మీనం*

చంద్రరాశి : *మేషం/వృషభం*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.02 - 08.30*

సంగవ కాలం         :      *08.30 - 10.58*

మధ్యాహ్న కాలం    :      *10.58 - 01.25*

అపరాహ్న కాలం    : *మ 01.25 - 03.53*


*ఆబ్ధికం తిధి         : చైత్ర శుద్ధ చవితి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.20*

ప్రదోష కాలం         :  *సా 06.20 - 08.41*

రాత్రి కాలం             :  *రా 08.41 - 11.48*

నిశీధి కాలం          :*రా 11.48 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.28 - 05.15*

--------------------------------------------------

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🚩IIజై పవన పుత్ర హనుమాన్II🚩*


*రామరిణా కృతహృతౌ జనకాత్మజాయా*

*లంకాస్థితా జనకజేతి సుశోధకారిన్*

*సీతాతిశోకహరణ ప్రబలారి హన్తః*

*శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే||*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹