9, మే 2022, సోమవారం

సాధూనాం దర్షనం పుణ్యం

 *దేహమే దేవాలయం*


ఋషి "దేహమే దేవాలయం జీవుడే దేవుడు" అనే వేద ప్రమాణానుసారం, సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే. అయితే ఇక్కడ మానవులు మినహా ఇతర ప్రాణులకు ఈ విషయం అనుభవంలోకి రాలేదు .ఎందుకంటే వాటికి పుట్టుకతోనే విచక్షణాజ్ఞానం లేకుండా పుడతాయి, అదే బలహీనతను ఆసరా చేసుకొని మానవుడు ఇతర జీవుల పట్ల తనకున్న విచక్షణా జ్ఞాన్ని ఉపయోగించుకొని తన స్వార్ధం కోసం తన వశంలోకి తెచ్చుకొని ప్రయోజనాన్ని పొందుతున్నాడు. ఇదే విషయాన్ని శృతి "జ్ఞాన హీనః పశుభిస్సమానః" అంటే జ్ఞానం లేని ప్రతి వ్యక్తి పశువుతో సమానమని అర్ధం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి!!? అని విచారిస్తే చతుర్వేదముల నుండి గ్రహించబడిన నాలుగు మహావాక్యములు అంటే 4 వేదాల సారము (1) "అహం బ్రహ్మాస్మి"=నేనే పరబ్రహ్మమును (2) "అయమాత్మాబ్రహ్మ"=నా ఆత్మయే బ్రహ్మ అంటే దేవుడు(3) "ప్రజ్ఞానం బ్రహ్మ"= విశేషణమైన జ్ఞానమేదికలదో అదియే బ్రహ్మ (4) "తత్వమసి"=ఏదైతే దేవుడు పరబ్రహ్మము ఉన్నదో అది నీవే అయి ఉన్నావు. 


పై నాలుగు మహావాక్యములు నీవే భగవంతుడవు అనే నగ్న సత్యాన్ని మన ముందుంచినా "సముద్రము తలాపున ఉంచుకొని , చేప నీళ్ళకు ఏడ్చినట్లుగా" మనం జ్ఞాన స్వరూపులం, అఖండ సచ్చిదానంద స్వరూపులం అయి ఉండి కూడా నాకు 'సుఖం ' లేదు 'శాంతి ' లేదు అని బాధపడుతూ ఆ సుఖం, శాంతిని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మనం పొందే సుఖం పరావర్తన సుఖం అంటే మన నుండి ఉద్భవించిన సుఖం అనే జ్ఞానం మనం మరచిపోయినందువల్లనే ఒక్క మానవ జీవితానికే ఇంత బాధ్యత .తద్వారా ఇన్ని అనర్ధాలు, బాధలు, దుఃఖాలు, భయాలు కలుగుతున్నాయి. ఇది అనుభూతిలోకి రావడానికి (1)వేదవాక్యముపై విశ్వాసముంచి తద్వారా ఆ ఆత్మభూతస్థితిలో ఉండుట (2) శ్రుతి ప్రమాణాన్ని ఆచరించి అనుభూతి పొందిన మహాత్ముల 'పాదాలు ' ఆశ్రయించడమే. 


పై మార్గములలో (1)వ మార్గము కొంత ప్రయాసతో కూడుకొనినటువంటిది. (2)వ మార్గాన్ని గూర్చి కొంత విచారణ అవసరం.అసలు మహాత్ములు, ఋషులు అంటే ఎవరు? సృష్టి ఆరంభంలో తొలుత దేహధారణ చేసి తద్వారా ఈ ప్రపంచ రూపకల్పనకు మూల పురుషులు ఋషులే. అందుకే ఇది ఋషి పరంపర.. మనమంతా వారి సంతతి వారమే.. కావున మన పేరున అర్చన చేసుకొనేటప్పుడు మన గోత్రం అడుగుతారు పూజారి, అప్పుడు మనం అంగీరస మహాముని గోత్ర, గౌతమ ఋషి గోత్రమని,కాశ్యపస అని ఇలా చెబుతుంటాం. అంటే ఇక్కడ మనం వాడే పేర్లు ఋషులవే. మానవజాతి అంతా ఋషి సంతతే ఇదే మన భారతీయ సంస్కృతి. 


'శ్రుతి ' చెప్పినట్లు (వేదం చెప్పినట్లు) నడిచేవాడు 'మానవుడు '. 'మతి ' చెప్పినట్లు నడిచేవాడు 'వానరుడు '. శ్రుతి మాత చెప్పినట్లు మహర్షులు మంచిని ఆచరించి తన స్వార్ధానికి కాకుండా వారి జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసి లోక కల్యాణ నిమిత్తం వారి జీవితాల్ని గడపడం మనం చూస్తూనే ఉన్నాం. వారు పొందే ఆనందాన్ని అందరూ పొందాలనేదే వారి కోరిక. అందుకే కాబోలు ప్రవచనాల ద్వారా, హోమాల ద్వారా, యాగాల ద్వారా, సంకీర్తనల ద్వారా, నిస్వార్ధ విగ్రహ ప్రతిష్ఠల ద్వారా, క్రియా యోగము ద్వారా శాంతిని మనకు అందజేస్తున్నారు. అసలు మహర్షిని గుర్తించడం ఎలా? ఒక వ్యక్తి ఏ కులస్థుడైనా, మతస్థుడైనా, ఉచ్చ జాతి వారైనా లేక నీచజాతి వారైనా అతని వద్దకు మనం వెళితే మనకు తెలియకుండానే మనం అతని వద్ద ఉన్నంత సేపు ఒత్తిడిలో నుండి విముక్తులమై శాంతంగా ఉండగలిగితే అతను నిస్వార్ధ జీవన విధానావలంబుడై ఉంటే, అతడే మహర్షి, మహాత్ముడు, సాధువు, భగవంతుడు. అతని శరీరంలోని ప్రతి అంగము పరిశుద్ధం గావింపబడి ఉంటాయి. "ప్రతి జీవిని తనవలె" చూచె ఉత్తమోత్తమ ఆలోచన వారి మనస్సులో నిరంతరం కదలాడుతుంది. ఇదే అసలైన మన భారతీయ సంస్కృతి. పవిత్ర భారత దేశంలో, నివురు గప్పిన నిప్పులా  ప్రపంచ శాంతి కోసం ఎందరో మహర్షులు వారి జీవితాలను, తృణ ప్రాయంగా పెట్టి ఎన్నో కష్టాలకు ఓర్చి (1) మౌనం (2) పయోహారం (గోవు పాలు) మాత్రమే ఆహారంగా తీసుకొని (3) ఏకాంతవాసం చేసి (4) దిగంబరత్వం ఉండి గడుపుతున్నారు. 


"సాధూనాం దర్షనం పుణ్యం స్పర్శనం పాపనాశనం" 


అందుకే సాధువును దర్శించుకుంటే పుణ్యమనీ, వారి పాదాలను స్పృశించడం ద్వారా పాపాలు నాశనమవుతాయని పెద్దల మాట. జ్ఞానస్థితిలో ఉన్న సాధువుల పాదాలలో సమస్త తీర్ధ క్షేత్రాలు ఉంటాయి. జ్ఞాన సహిత సాధువు దేహమే పవిత్ర దేవాలయం.

విటమినులు

 శరీరానికి కావలిసిన అతిముఖ్య విటమినులు - అవి లభించు పదార్ధాలు .


     A , B , C , D , E అను పేర్లతో విటమిన్లు ప్రాముఖ్యం పొందినవి. వీటిని "దేహనిర్మాతలు " అని తెలుగులో పిలుస్తారు. ఇవి మనం తిను ఆహారం నందు లేకున్న శరీరపోషణం సరిగ్గా జరగదు. గుడ్లు , పాలు , పండ్లు , దంపుడు బియ్యం మొదలగు సహజసిద్ధముగా లభించు పదార్ధములలో ఈ విటమిన్లు ఎక్కువుగా ఉండును. 


           ఇప్పుడు ఈ అయిదు ముఖ్యవిటమిన్ల గురించి మీకు వివరిస్తాను.


 * "A" విటమిన్  -


       ఇది లోపించినవారికి "రేచీకటి" వచ్చును. కన్ను , నోరు , ఊపిరితిత్తులు మొదలైన సున్నితమైన చర్మం ఎండిపోయి రోగములు తెచ్చు సూక్ష్మజీవులు దాడిచేయుటకు అనువుగా ఉండును. శరీరం చక్కగా ఎదుగుటకు , గర్భధారణకు , బాలింతలుగా ఉన్న సమయమున ఈ విటమిన్ చాలా అవసరం .


              ఈ "A" విటమిన్ ఎక్కువుగా పాలు , పెరుగు , వెన్న , నెయ్యి , గుడ్లు , చేపలు , పచ్చికూరలు , కాడ్ లివర్ ఆయిల్ , టొమాటో , బొప్పాయి , నారింజపండ్లు , బచ్చలి , తొటకూర మొదలైన వాటిలో ఎక్కువుగా ఉండును.


 *  "B" విటమిన్  -


         ఇది లోపించిన నరముల నిస్సత్తువ , ఉబ్బసరోగం కలుగును.


           ఈ "B" పచ్చికూరలు , మాంసము , పప్పుదినుసులు , గుడ్లు మొదలయిన వాటిలో లభించును. "B6" విటమిన్ తెల్లరక్త కణాలు తయారీకి ఉపయోగపడును. అరటిపండులో , పచ్చటి ఆకుకూరలలో , పప్పుదినుసుల్లో , చిక్కుడు , బంగాళాదుంపలలో ఈ విటమిన్ ఎక్కువుగా ఉండును. "B12" విటమిన్ ఇది లోపించిన పెదవుల్లో పగుళ్లు వస్తాయి. ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి , నాడీమండలం వ్యవస్థకు , నీరసం , జ్ఞాపకశక్తి తగ్గటం , నోటిపూత , నరాల కణాలు నశించిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ "B12" విటమిన్ పాలఉత్పత్తుల్లో , సోయాచిక్కుడు పాలలో పుష్కలంగా ఉండును.


 *  "C" విటమిన్ -


          శరీరంలో ఈ విటమిన్ "స్కర్వీ " అను వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ యాంటిబయాటిక్ గా పనిచేయును . జీర్ణశక్తిని పెంచును. విటమిన్ C లోపించిన ఐరన్ ను ప్రేగులు గ్రహించలేవు . ఐరన్ లోపిస్తే రక్తహీనత ఏర్పడును . ఈ విటమిన్ ఎక్కువుగా నిమ్మకాయ , ఉశిరికాయ , కొత్తిమీర , పండ్లరసములు , మొలకెత్తిన గింజలలో , కలబందలో , వెల్లుల్లిలో , ముల్లంగిలో , పైనాపిల్ లో , కొబ్బరిబోండాలలో , మునగ ఆకులో పుష్కలంగా లభించును.


 *  "D" విటమిన్ - 


         బిడ్డల ఎదుగుదలకు ఈ విటమిన్ చాలా అవసరం . ఇది లోపించిన బిడ్డలు దొడ్డికాళ్ళు వారగును. ఇది A విటమిన్ తో కలిసి వెన్న , గుడ్డు లొని పచ్చసొనలో ఉండును. ఉదయం , సాయంకాలం శరీరముకు సూర్యరశ్మి తగులుట వలన శరీరానికి కావలసిన D విటమిన్ బాగుగా లభించును. ఈ విటమిన్ శరీరంలో కొంతమొత్తంలో తయారగును.


              ఈ D విటమిన్ మనశరీరంలో ఎముకలు క్షీణించకుండా చూస్తూ వాటిని దృడంగా ఉంచును. రోగనిరోధక శక్తి బలోపెతం చేసేగుణం ఈ విటమిన్ కు ఉండును. ఇన్సులిన్ శరీరం సంగ్రహించుటకు తోడ్పడును. విటమిన్ D కణవిభజనను నియంత్రిస్తుంది. ఫలితముగా క్యాన్సరు నివారణకు తోడ్పడును . విటమిన్ D లోపము వలన పేగు క్యాన్సరు,రొమ్ము క్యాన్సరు , ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సరు , క్లోమ క్యాన్సరు ముప్పుని తొలగించును. ఉదయం 6 నుంచి 8 లోపు సూర్యనమస్కారాలు చేయుట మంచిది . ఈ విటమిన్ లోపం ఉన్నవాళ్లు తరచుగా పాలు , గోధుమలు , మరియు దేశివాళీ ఆవునెయ్యిలో తరచుగా తీసికొనవలెను .


 * "E " విటమిన్  -


          ఇది లోపించిన నపుంసకత్వం కలుగును. A విటమిన్ మరియు C విటమిన్లను మరియు ప్రోటీయాసిడ్స్ ని శరీరం నుండి నశించకుండా రక్షించే గుణం పైనాపిల్ లో ఉన్న E విటమిన్ లో ఉన్నది. వేరుశనగలో , బాదంలో , కాయగింజలలో , సొయాచిక్కుడు , గట్టి గింజలలో దొరుకును . గోధుమ , మొలకెత్తిన గింజలలో , మాంసములో ఎక్కువుగా లభించును.


              వీటితో పాటు విటమిన్ K కూడా మనకి ముఖ్యమయినది. ఈ విటమిన్ K రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడింది. ఈ విటమిన్ K లోపించడం వలన రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ విటమిన్ K పచ్చిబఠాణీ , ఆవునెయ్యి , క్యారెట్ లలో ఎక్కువుగా ఉండును.


        మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

    

       ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  .  మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ

 స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 


          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 


       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 


          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 


              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 


       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 


      ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం  ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  


                కాళహస్తి వేంకటేశ్వరరావు 


            అనువంశిక ఆయుర్వేద వైద్యం 


                      9885030034

మాతృపంచకం

 *ఎన్నిసార్లు చదివినా కళ్ల నీళ్లు రప్పించే* *ఆదిశంకరాచార్య విరచిత మాతృపంచకం*                                                      


మన సనాతన హిందూ సంప్రదాయం లో మాతృమూర్తికి తొలిస్థానం ఇచ్చారు. అమ్మ ప్రేమకోసం దేవుడు కూడా మానవ జన్మ ఎత్తాడని అంటారు. అమ్మ ప్రేమ వెలకట్టలేని..అటువంటి అమ్మ చివరి దశలో మృత్యువుతో పోరాడుతున్న సమయంలో బిడ్డ అమ్మ దగ్గరలేకపోతే.. ఆ పిలల్లు పడే బాధ, తపన వర్ణనాతీతం… ఇందుకు జగద్గురు ఆదిశంకరాచార్యలు మినహాయింపు కాదని తెలుస్తోంది. కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు.  ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా ? తల్లికి నమస్కారం చేస్తూ.. ఆది శంకరులు ఐదు శ్లోకాలను చెప్పారు. ఇవి “మాతృపంచకం” గా ప్రసిద్ధమైనవి. ఈరోజు తల్లి గొప్పదనాన్ని.. విశిష్టతను తెలియజేస్తూ… మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకాన్ని స్మరించుకొందాము.                                                       

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*1* ముక్తామణిస్త్వం నయనం మమేతి

రాజేతి జీవేతి చిరం సుత త్వం

ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః

దదామ్యహం తండులమేవ శుష్కమ్.

భావం: అమ్మా! “నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా!, నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవిగా ఉండాలి” అని ప్రేమగా నన్ను పిలిచిన నీ నోటిలో – ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను క్షమించు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*2* అంబేతి తాతేతి శివేతి తస్మిన్

ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః

కృష్ణేతి గోవింద హరే ముకుందే

త్యహో జనన్యై రచితోయమంజలిః.


భావం: పంటిబిగువున నన్ను ప్రసవ వించే సమయంలో వచ్చే ఆపుకోలేని బాధను “అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!” అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*3* ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా

నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ

ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః

దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.3

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

భావం: అమ్మా! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను (కడుపునొప్పి) అనుభవించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*4* గురుకులముప సృత్య స్వప్న కాలే తు దృష్ట్వా

యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః

గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం

సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః.  


భావం: కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి, మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*5* న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా

స్వ ధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా

న జప్త్వా మాతస్తే మరణసమయే తారక మను-

రకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులామ్. 


భావం:అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు.  ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ !


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

భారత్ మాతాకి జై

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*It’s not a political post but wonderful information.* 


*1962లో అక్టోబర్ 25వ తేదీ అర్థరాత్రి*  *#జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయంలో ఏంజరిగిందో తెలుసా?* 

******************************

స్థలం:  #శ్రీనగర్


శత్రువులు అతి వేగంగా సమీపిస్తున్నారు. 

ఆ సమయంలో కాశ్మీర్‌కి సైనిక సహాయం అత్యంత అవసరం.


ఎట్టి పరిస్థితులలోను శ్రీనగర్ విమానాశ్రయం శత్రువుల చేత చిక్కకూడదని డిల్లీలోని సైనిక కార్యాలయం నుండి సందేశం వచ్చింది.  పట్టణం శత్రువుల చేతచిక్కినా పరవాలేదు కానీ, విమానాశ్రయం ఎట్టి పరిస్థితులలో కూడా శత్రువు చేత చిక్కకూడదని సందేశం..


"విమానాశ్రయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. విమానాలు దిగడం చాలా కష్టం.." అని శ్రీనగర్ నుండి ప్రత్యుత్తరం వచ్చింది..


"అత్యవసరంగా కూలీలను పెట్టి మంచును తొలగించండి, ఎంత మంది కూలీలను నియోగించినా సరే, ఎంత  ఖర్చయినా సరే.."


"కూలీలు దొరకడం లేదు. స్థానిక కూలీలపై ఇటువంటి క్లిష్ట సమయంలో భరోసా ఉంచలేము.."


ఇటువంటి సమయములో స్థానిక సైన్యాధికారికి #సంఘ్ (RSS) గుర్తుకు వచ్చింది.. 


అప్పుడు రాత్రి 11 గంటలయింది. ఒక సైనిక వాహనం శ్రీనగర్ సంఘ కార్యాలయం ముందు వచ్చి నిలిచింది. దానిలో నుండి ఒక అధికారి దిగారు. 


కార్యాలయంలో ప్రముఖ స్వయ సేవకుల సమావేశము జరుగుతున్నది. #ప్రేమనాథ్‌డోగ్రా, #అర్జున్ జీ లు  అక్కడే ఉన్నారు..


సైన్యాధికారి పరిస్థితిని వివరించారు. "మీరు విమనాశ్రయములో పేరుకున్న మంచును తొలగించే పని చేయగలరా..?" అని అడిగారు.


"తప్పకుండా! ఎంత మంది సహాయకులు కావాలి..?" అని అర్జున్ జీ అడిగారు. 


"కనీసం 150 మంది కావాలి, వారితో 3, 4 గంటలలో మంచు తొలగించగలం.."


"మేము 600 మంది స్వయంసేవకులను సమకూర్చగలం.." అని అర్జున్ జీ అన్నారు. 


"ఇంత రాత్రి వేళ అంతమందా.. అందునా భయంకరమైన చలిలో.. ఇప్పటికిప్పుడు అంతమందిని ఎలా సమకూర్చగలరు..? ఇది దేశరక్షణకు సంబంధించిన విషమ పరిస్థితి, పరాచకాలకు సమయం కాదు.." అని సైన్యాధికారి ఆశ్చర్యపోయారు. 


"మీరు మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. 45 నిమిషాలలో మేము తయారుగా వుంటాము.."


సంఘ పద్ధతి ప్రకారం అనుకున్న సమయానికి 610 మంది తయారై కలసి వెళ్ళిపోయారు..


"మంచును తొలగించే పని ప్రారంభమయింది. విమానాలు ఎప్పుడయినా రావచ్చును." అని డిల్లీకి సందేశం పంపబడింది. 


"ఇంత తొందరగా కూలీలు దొరికారా.."


"అవును, కాని వారు కూలీలు కారు., 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ (ఆర్‌ఎస్‌ఎస్) సభ్యులు.."  


రాత్రి గం.1.30 ని. లకు వారు పనిలో దిగారు. తెల్లవారుజామున 5 కల్లా మంచును పూర్తిగా తవ్వి దూరంగా తోసివేశారు..

విమానాలు దిగడానికి #రన్‌వే ను సిధ్దం చేశారు..

సైన్యాధికారి కోరింది రెండు విమానాలు దిగేలా స్థలాన్ని సిధ్దం చేయమంటే, ఏకంగా 10 విమానాలు దిగేలా విమానాశ్రయం సిధ్దమైపోయింది..

అక్టోబర్ 26వ తేదీ ఉదయం 1వ  సిక్కు రెజిమెంటుకు చెందిన 329 మంది సైనికులు విమానం నుండి శ్రీనగర్ లో దిగి అత్యంత ప్రేమతో స్వయంసేవకులను ఆలింగనం చేసుకున్నారు. తర్వాత ఏముంది, ఒకటి తర్వాత ఒకటి వరుసగా 8 విమానాలు దిగాయి..


వాటన్నిటిలో అస్త శస్త్రాలు ఉన్నాయి. స్వయంసేవకులు వాటిని దించి నిర్దేశించిన స్థలంలో ఉంచడానికి సహాయం  చేశారు కూడా..


విమానాశ్రయం శత్రువుల చేతిలో చిక్కకుండా రక్షింపబడింది. దాని వలన మనకు ఎంతో ప్రయోజనం కలిగింది..


ఆధారం: న ఫూల్ చడే న దీప్ జలే (పుస్తకం)


#RSS అంటే....

*************


60 వేల శాఖలు

60 లక్షల స్వయం సేవకులు

30 వేల విద్యా మందిరాలు

3 లక్షల మంది ఉపాధ్యాయిలు

50 లక్షల మంది విద్యార్థులు

90 లక్షల మంది BMS కార్మిక సభ్యులు

50 లక్షల మంది ABVP కార్యకర్తలు

10 కోట్ల మంది భాజాపా కార్యకర్తలు

500 ల అనుబంధ సంస్థలు

1 లక్ష మంది మాజీ సైనికుల సంఘం

4 వేల మంది దుర్గావాహిణీలు

70 లక్షల మంది విశ్వహిందూ పరిషత్ సభ్యులు

3 లక్షల మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు

21 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు

303 మంది పార్లమెంట్ సభ్యులు

1460 మంది MLA లు

17 మంది ముఖ్యమంత్రులు

ఒక రాష్ట్రపతి

ఒక ఉపరాష్ట్రపతి

ఒక ప్రధాన మంత్రి


ఇంతే...RSS ఆంటే


నమస్తే సదా వత్సలే మాతృభూమే

త్వయా హిందుభూమే సుఖం వర్థితోహం..🙏🙏🙏


భారత్ మాతాకి జై....

Source: Asthram News

 *సేకరణ* : వాట్సాప్.

 ✍️

ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. 


తల్లి వృద్ధాప్యం వల్ల పెద్దదయి కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు.


ఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు.


 తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు.


 విడిపోవటమనే ఆలోచనపట్ల తాను చింతించినా, తమ మధ్య లెక్కలు తేల్చుకోవటమేమిటో తనకు బోధపడలేదని తల్లి అతనితో స్పష్టంగా చెప్పింది. 


ఖర్చులకు సంబంధించిన అనేక వ్యయ పట్టికల క్రింద తాము ఒకరికొకరు డబ్బు బాకీ పడ్డామని కొడుకు వివరించాడు. 


తనను పెంచి పోషించినందుకు తాను ఆమెకు కొంత డబ్బు ఋణపడ్డానని అతడు చెప్పసాగాడు.


 అలాగే ఆమెపట్ల తన భక్తి శ్రద్ధలకుగాను ఆమె తనకు కొంత ధనం ఋణపడ్డదని చెప్పాడు. 


చాలా సేపు అతడు సమ్మతింపచేయటంతో ఆమె లెక్కలు తేల్చుకునేందుకు అంగీకరించింది. 


అతనికి సబబు అని తోచినట్లుగా జమాఖర్చు లెక్కలను సిద్ధంచేయమని ఆమె కొడుకుకు సూచించింది.


 జాబితాలో కొన్ని విడిచిపెట్టబడినవి ఉన్నట్లయితే, ఏవైనా మార్పులు చేయవలసి వచ్చినట్లైతే, వాటిని చివరలో తాను సూచిస్తానని, అతడు వాటిని అంగీకరించాలని ఆమె చెప్పింది.


 ఈ సూచనలు కొడుకు చాలా సంతోషంతో అంగీకరించాడు.


 ఆ పిచ్చి తల్లికి మనసు సరిలేదని కుడా అతడు తలంచాడు. 


చివరికి తల్లే అతనికి చెప్పుకోదగినంత పెద్దమొత్తం బాకీ ఉన్నట్లుగా అతడు ఒక పట్టిక తయారు చేశాడు.


పట్టికలోని అంశాలు, దానికి సంబంధించిన మొత్తాలు విని అంగీకారం తెలుపుతూ వచ్చింది. 


ఆఖరి అంకె వెల్లడికాగానే ఆమె కుమారునికి ఒక అంశం విడిచినట్లుందని ఎత్తిచూపింది.


 అతడు ఇంకా మాతృగర్భంలో ఉన్నప్పుడు తన్నిన తన్నులకు ఆమె అనుభవించిన వేదనకు పరిహారం అతడు దానిలో చేర్చలేదు. అతడు ఈ అంశం కూడా పట్టికలో చేర్చేందుకు అంగీకరించి, దీనికి కావలసినంత కావలసిన డబ్బు ఎంతో చెప్పమని అడిగాడు. తాను అతనికి చెల్లించవలసిన మొత్తం ఎంతో, దానికి సమానమైన మొత్తాన్ని నస్టపరిహారంగా ఇవ్వమని ఆమె కోరింది. 


కుమారుడు సంతృప్తిగా దీర్ఘవిశ్వాసం విడిచి, ఆ " మూర్ఖురాలు " ఇంకా ఎక్కువ డబ్బు కోరనందుకు సంతోషించాడు. 


ఆ దిక్కుమాలిన స్త్రీకి వీడ్కోలు చెప్పేందుకు అతడు లేవబోతుండుగా ఆమె మరో అంశం జాబితాలో లోపించిందనీ, దాన్ని కుడా చేర్చాలనీ చేప్పింది. " ఆలస్యంగా వచ్చిన తెలివితేటలకు " ఆమెను డబ్బు గుంజాలనుకుంటున్నదని శపిస్తూ కుమారుడు దానికి అంగీకారం తెలిపాడు.


అప్పుడు తల్లి అతనితో ఇలా చెప్పింది:" కుమారా! ఇటుచూడు! చాలా సంవత్సరాల క్రితం, నీవు బోసినోటి పసిపాపగా ఉన్నరోజుల్లో, ఒకనాడు నీవు నా ముఖం వంక - ప్రకాశవంతమైన చిఱునవ్వులు వెదజల్లుతూ - చూసి " అమ్మా " అని పిలిచావు. ఆ క్షణంలో నేను అనుభవించిన పులకరింత నాకు ఉన్న యావత్తు ధనానికి మించి నీకి ఋణపడ్డాను. 

ఇప్పుడు నా వద్ద ఉన్న సంపద అంతా నీవేతీసుకుని - దాని వల్ల సుఖం లభిస్తే - నీవు సుఖంగా జీవించు " 


మాతృమూర్తి ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదని ఆ క్షణంలో అతడు గుర్తించగలిగాడు!    


కళ్ళనిండా నీళ్లతో ఆమె పాదాల పై పడ్డాడు....😢


🔹🔸🔹🔸🔹🔸🔹🔹

ఆనందాభిలాషి

 మానవుడు ఆనందాభిలాషి. నిజానికి మానవుడే కాదు ప్రతి జీవీ ఆనందాభిలాషే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ‘ఆనందమయోభ్యాసాత్‌’ అంటుంది శాస్త్రం. అంటే, జీవుడు నిజానికి ఆనందస్వరూపుడే. అందుకే, ఆనందాన్వేషణ అతనికి సహజంగానే ఉంటుంది. అయితే అతను కేవలం శరీరం ద్వారానే ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. కానీ, శరీరం ద్వారా లభించేది సుఖమే గాని ఆనందం కాదు! అందుకే శాస్ర్తాలు ఆనందం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఉపదేశిస్తున్నాయి. ధర్మచ్యుతితో మానవుడు పాపరాశులు మూటగట్టుకొని దుఃఖభాగుడవుతాడు. ఈ విషయమే భాగవతంలో ‘అధర్మశీలస్య సుదుఃఖితస్య’ అన్నారు. తెలిసో, తెలియకో జీవుడు పాపాలు చేసి, కష్టాలు కొనితెచ్చుకొని దుఃఖాలకు లోనవుతాడు.అతని కష్ట పరంపర తొలగి అసలైన ఆనందం లభించడానికి ఏకైక పరిష్కారం ఆధ్యాత్మిక మార్గమే. అది కేవలం భక్తుల సాంగత్యంతో లభిస్తుంది.

భాగవతంను సప్తమ స్కంధంలో ఉపబర్హణుడనే గంధర్వుని కథ ఆధ్యాత్మిక ఆనందం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఉపబర్హణుడు గొప్ప అందగాడు. గానకళలో నిష్ణాతుడు. దానితోపాటు అతనికి భోగ ప్రవృత్తిపై ఆసక్తి ఉండేది. ఒకసారి దేవలోకంలో జరిగే భగవన్నామ సంకీర్తనకు ఈ గంధర్వుడిని అతిథిగా పిలిచారు. సంగీత విభావరి మొదలైంది. స్త్రీ సాంగత్యంలో, మదిరా మైకంలో ధర్మచ్యుతుడై ఉపబర్హణుడు భగవన్నామ కీర్తనకు బదులు, దేవతా కీర్తనం మొదలుపెట్టాడు. అది ప్రజాపతులకు నచ్చలేదు. భూ లోకంలో మనిషిగా జన్మించమని శపించారు. అలా ఓ మానవకాంత కడుపున పుట్టాడు ఉపబర్హణుడు. ఆమె ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పనిమనిషిగా ఉండేది. కొడుకు కూడా ఆ ఇంట్లోనే ఆడుకునేవాడు. అయితే, ఓ వర్షకాలం కొందరు భక్తాగ్రేసరులు ఆ బ్రాహ్మణుడి ఇంటికివచ్చారు. నాలుగు నెలలు ఆ ఇంటనే బస చేశారు.

ఆ భక్తులు నిరంతరం శ్రీకృష్ణుడి సేవలో తరించేవారు. కృష్ణ నామసంకీర్తన, కృష్ణుడి కథాచర్చ, కృష్ణ ప్రసాద సేవనం ఇలా.. ఏం చేసినా కృష్ణుడే వారికి పరమావధి. ఆ దాసీబాలుడికి ఈ భక్తుల సాంగత్యం లభించింది. ఆ పిల్లాడు అన్ని ఆటలూ మానుకొని వారితోనే కాలం గడపసాగాడు. ఆ పసి మనసులోనూ కృష్ణభక్తి మొగ్గ తొడిగింది. వానకాలం గడిచిపోయింది. భక్తబృందం వారు తమ ఇండ్లకు వెళ్తూ బాలుడికి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించారు. దాసీపుత్రుడు ఆ మంత్రాన్ని నిరంతరం జపించడం మొదలుపెట్టాడు. ఓ రోజు హఠాత్తుగా పాముకాటుకు గురై తల్లి మరణించింది.

తల్లి పోయేనాటికి ఆ బాలుడికి ఐదేండ్లు. అంతటి పసివయసులోనూ ఎప్పుడూ కృష్ణనామాన్ని జపిస్తూ ఉండేవాడు. దానికి ప్రతిఫలంగా కొంతకాలానికి భగవంతుడి దర్శనం క్షణకాలం పాటు లభించింది. దానితో ఆ బాలుడి జీవితంలో ఆనంద వెలుగులు నిండాయి. అయినా భగవంతుణ్ని నిరంతరం చూడాలని ఆ పిల్లవాడు ఉబలాటపడ్డాడు. అది సాధ్యం కాదని భగవంతుడు సెలవిచ్చేసరికి ఆ దేవదేవుడిని నిరంతరం దర్శించే దివ్య గడియ కోసం ఎదురుచూస్తూ కాలం గడిపాడు. సమయం రాగానే దేహత్యాగం చేశాడు. తర్వాత దివ్యశరీరధారియై శ్రీనారదమునిగా అవతరించాడు. దుర్భర జీవితాన్ని గడిపిన దాసీపుత్రుడి జీవితం ఎక్కడ? నిరంతరం ముల్లోకాల్లోనూ, వైకుంఠంలోనూ తిరుగాడే నారదముని జీవితం ఎక్కడ? ఇదంతా కేవలం ఆధ్యాత్మిక మార్గం ద్వారానే సాధ్యపడింది. మానవుల అపారమైన దుఃఖాలను, క్లేశాలను తొలగించే ప్రశస్తమైన మార్గమే భాగవతం బోధించే ఆధ్యాత్మిక మార్గం. భువిలోని మానవుల శ్రేయస్సు కోసం నారదుడు స్వానుభవంతో భాగవతాన్ని తెలియజేశాడు.

ప్రహేళిక

 శ్రీమోహన్ రెడ్డి గారి మరో ప్రహేళిక. నేను ఇందాక చెప్పినట్టు మొదటి మూడు పాదములలోని మొదటి పదాలను ఉపేక్షించగలరు. 


తే.గీ.పడతి పంచాక్ష రములును పదము లోన

కొమ్మ, తుదిమూడు వర్ణముల్  కూడ కడలి

వనిత యన్నియు కలిసిన పసిడి యగును

తెలిసి యున్నచో చెప్పుము తెలుగు లేమ

పి.మోహన్ రెడ్డి.

స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదము

.


స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి. దాదాపుగా ఒక పదమునకు ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉండవేమో ...!!!*

1. అంగన

2. అంచయాన

3. అంబుజాలోచన

4. అంబుజవదన

5. అంబుజాక్షి

6. అంబుజనయన

7. అంబురుహాక్షి

8. అక్క

9. అతివ

10. అన్ను

11. అన్నువ

12. అన్నువు

13. అబల

14. అబ్జనయన

15. అబ్జముఖి

16. అలరుబోడి

17. అలివేణి

18. అవ్వ

19. ఆటది

20. ఆడది

21. ఆడగూతూరు

22. ఆడుబుట్టువు

23. ఇంచుబోడి

24. ఇంతి

25. ఇదీవరాక్షి

26. ఇందునిభాష్య

27. ఇందుముఖి

28. ఇందువదన

29. ఇగురాకుబోణి

30. ఇగురాకుబోడి

31. ఇభయాన

32. ఉగ్మలి

33. ఉజ్జ్వలాంగి

34. ఉవిధ

35. ఎలతీగబోడి

36. ఎలనాగ

37. ఏతుల

38. కంజముఖి

39. కంబుకంఠ

40. కంబుగ్రీవ

41. కనకాంగి

42. కన్నులకలికి

43. కప్పురగంధి

44. కమలాక్షి

45. కరబోరువు

46. కర్పూరగంది

47. కలకంఠి

48. కలశస్తిని

49. కలికి

50. కలువకంటి

51. కళింగ

52. కాంత

53. కించిద్విలగ్న

54. కిన్నెరకంఠి

55. కురంగానయన

56. కురంగాక్షి

57. కువలయాక్షి

58. కూచి

59. కృషమధ్యమ

60. కేశిని

61. కొమ

62. కొమరాలు

63. కొమిరె

64. కొమ్మ

65. కోమ

66. కోమలాంగి

67. కొమలి

68. క్రాలుగంటి

69. గజయాన

70. గరిత

71. గర్త

72. గుబ్బలాడి

73. గుబ్బెత

74. గుమ్మ

75. గోతి

76. గోల

77. చంచరీకచికుర

78. చంచలాక్షి

79. చంద్రముఖి

80. చంద్రవదన

81. చక్కనమ్మ

82. చక్కెరబొమ్మ

83. చక్కెర

84. ముద్దుగుమ్మ

85. చాన

86. చామ

87. చారులోన

88. చిగురుంటాకుబోడి

89. చిగురుబోడి

90. చిలుకలకొలోకి

91. చెలి

92. చెలియ

93. చెలువ

94. చేడి(డియ)

95. చోఱుబుడత

96. జక్కవచంటి

97. జని

98. జలజనేత్ర

99. జోటి

100. ఝషలోచన

101. తనుమధ్య

102. తన్వంగి

103. తన్వి

104. తమ్మికింటి

105. తరళలోచన

106. తరళేక్షణ

107. తరుణి

108. తలిరుబోడి

109. తలోదరి

110. తాటంకావతి

111. తాటంకిని

112. తామరకంటి

113. తామరసనేత్ర

114. తియ్యబోడి

115. తీగ(వ)బోడి

116. తెఱువ

117. తెలిగంటి

118. తొగవకంటి

119. తొయ్యలి

120. తోయజలోచన

121. తోయజాక్షి

122. తోయలి

123. దుండి

124. ధవలాక్షి

125. ననబోడి

126. నళినలోచన

127. నళినాక్షి

128. నవల(లా)

129. నాంచారు

130. నాచారు

131. నాచి

132. నాతి

133. నాతుక

134. నారి

135. నితంబవతి

136. నితంబిని

137. నీరజాక్షి

138. నీలవేణి

139. నెచ్చెలి

140. నెలత

141. నెలతుక

142. పంకజాక్షి

143. పడతి

144. పడతుక

145. పద్మముఖి

146. పద్మాక్షి

147. పర్వందుముఖి

148. పల్లవాధర

149. పల్లవోష్ఠి

150. పాటలగంధి

151. పుచ్చడిక

152. పుత్తడిబొమ్మ

153. పువు(వ్వు)బోడి

154. పువ్వారుబోడి

155. పుష్కరాక్షి

156. పూబోడి

157. పైదలి

158. పొల్తి(లతి)

159. పొల్తు(లతు)క

160. త్రీదర్శిని

161. ప్రమద

162. ప్రియ

163. ప్రోడ

164. ప్రోయాలు

165. బంగారుకోడి

166. బాగరి

167. బాగులాడి

168. బింబాధర

169. బింబోష్ఠి

170. బోటి

171. భగిని

172. భామ

173. భామిని

174. భావిని

175. భీరువు

176. మండయంతి

177. మగువ

178. మచ్చెకంటి

179. మడతి

180. మడతుక

181. మత్తకాశిని

182. మదిరనయన

183. మదిరాక్షి

184. మసలాడి

185. మహిళ

186. మానవతి

187. మానిని

188. మించుగంటి

189. మించుబోడి

190.మీనసేత్రి

191. మీనాక్షి

192. ముగుద

193. ముదిత

194. ముదిర

195. ముద్దరాలు

196. ముద్దియ

197. ముద్దుగుమ్మ

198. ముద్దులగుమ్మ

199. ముద్దులాడి

200. ముష్ఠిమధ్య

201. మృగలోచన

202. మృగాక్షి

203. మృగీవిలోకన

204. మెచ్చులాడి

205. మెఱుగారుబోడి

206. మెఱుగుబోడి(ణి)

207. మెలుత

208. మెళ్త(లత)మెల్లు(లతు)

209. యోష

210. యోషిత

211. యోషిత్తు

212. రమణి

213. రామ

214. రుచిరాంగి

215. రూపరి

216. రూపసి

217. రోచన

218. లతకూన

219.లతాంగి

220. లతాతన్వి

తెలుగు భాషలో ఒక్క స్త్రీ అనే పదానికి మాత్రమే ఇన్ని పర్యాయ పదాలున్నాయంటే - తెలుగు నా మాతృభాష అని చెప్పడం గర్వకారణం కదా.

దేశభాషలందు తెలుగు లెస్స