3, ఆగస్టు 2024, శనివారం

మామూలు మనుషులే

 *బ్రిటిష్ వాడు చెడ్డ వాడా?*

*YES.*

*డచ్ వాడు? పోర్చుగీస్ వాడు?*

*YES. YES.*

*మొఘలాయిలు, పాకిస్తానీ లు, తురకలు?*

*YES. YES. YES.*

*కమ్యూనిష్టులు, చైనీస్?*

*YES. YES.*

*చర్చ్?* 

*YES.*

*ఇస్లాం?*

*YES.*

*ముస్లిం లు, క్రిస్టియన్ లు, రోహింగ్యాలు, బంగ్లా దేశీలు, JNU వాళ్లు!?*

*YES అండీ YES YES, YES, YESSSSSS...*


*అన్నిటికీ జవాబు "YES" ఏ. కరెక్టే.*


*కానీ, మన బానిసత్వానికి కారణం వీళ్లు ఎవరూ కాదు.,*

*వీళ్ళందరినీ మనం హ్యాండిల్ చేశాం.*


*వారి బలం వారి సిద్ధాంతమో,* *మతమో, వారి ఆయుధాలో కాదు.*

*వీళ్ళందరి బలమూ ఒకటుంది.*


*ఆ బలం ఒక మనిషి కాదు. ఒక సమూహం. ఒక బ్యాచ్ జనం!*


*ఆ బ్యాచే వారి బలం..*

*ఆ బ్యాచే వారి చేతులు..*

*ఆ బ్యాచే  వారి కాళ్లు..*

*ఆ బ్యాచే వారి బుర్ర..*

*ఆ బ్యాచే వారి ఆయుధం..*

*మన బానిసత్వానికి కారణం ఆ బ్యాచ్ ఏ..*

*మనం ముందుగా భయ పడాల్సింది ఆ బ్యాచ్ కే..*


*ఆ బ్యాచ్ ఎవరో చూద్దాం..*


1. *రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం 35 లక్షలు.*


*అందులో 25 లక్షల మంది భారతీయులే. ఒక నాటి హిందువులే.*

*(నాటి కాంగ్రెస్ సభ్యత్వం అందులో పావలా వంతు కూడా లేదు)*


*జీతం కోసం పని చేశారు. జీతం కోసం తోటి భారతీయులను చంపారు. నరికారు. కాల్చి చంపారు. జైళ్లలో బంధించారు. హింసించారు.*


2. *అతిపెద్ద మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది అక్బర్ ది గ్రేట్ (?) కాదు. అతని సైన్యం లో మొఘల్ లు 30,000 మాత్రమే.*


*అతని కి సైన్యాన్ని సమకూర్చింది., అతని సైన్యాలను నడిపించింది రాజా మాన్ సింగ్ (రాజ్ పుత్, హిందూ). అక్బర్ సైన్యం నిండా భారతీయులే.*


3. *దేశ విచ్ఛిన్నం కోసం ప్రతి క్షణం రక్తం పెట్టే>ఖాన్ గ్రేస్, కమ్యూనిస్ట్, మావోయిస్ట్ ఇత్యాది పార్టీ ల్లో బయటి వాడు ఒక్కడు కూడా లేడు.*


*ప్రతి ఒక్కడూ భారత పౌరుడే. ఒక నాటి హిందువే.*


4. *ప్రపంచం లోనే అతి ఎక్కువ చర్చ్ యాక్టివిటీ నడిచేది భారత్ లో.*


*నడిపే ప్రతి పాస్టర్, ప్రతి ఫాదర్ భారతీయుడే. ఒక నాటి హిందువే.*


5. *అవకాశం దొరికితే భారత్ ని* *ఇంకో ఇస్లామిక్ రాజ్యం* *చేయాలని కల గనే* 


*మదరసా లకు వెళ్లే ప్రతి ముస్లిం భారతీయుడే. ఒక నాటి హిందువే.*


*ఏమైనా అర్థం అవుతోందా!?*


* వాళ్ల బలమూ >మన మధ్యలో ఉన్న మన స్వంత మనుషులే.


*మారాల్సింది వారు కాదు. మనమే.*

*శత్రువు కోసం చూడాల్సింది బయట కాదు.* 

*మన మధ్యనే.*


*మన పిల్లలను రక్షించడానికి ఎవడో వస్తాడని ఆశ వద్దు.*

*ఎవడూ రాడు. మనమే రక్షించుకోవాలి.*


*మన పిల్లలకు కర్తవ్యాన్ని బోధించడానికి మనమే  కృష్ణు డు  వలె  బోధించాలి.*


*అమ్మలూ, నాన్నలూ.. నిద్ర లేవండి.* 


*మనం మన పిల్లల తరాన్ని గుడ్డిగా*

*మన లాగా పొట్ట కూటి ఉద్యోగాలు చేసుకునే "10th పాస్ & ఇంటర్ ఫెయిల్" టీచర్ల చేతిలో, రిపోర్టర్ల చేతిలో పెట్ట కూడదు.*


 *పిల్లల్ని ఎంట్రెన్స్ కోసం, ఉద్యోగం కోసం కాదు.*

*దేశం కోసం - ధర్మం కోసం - కర్తవ్యం కోసం ప్రిపేర్ చేయండి.*


 *దేశ భక్తి లేని వారిని వదలకండి. రేపు మీ పిల్లల భవిష్యత్తు ను కేవలం నాలుగు చిల్లర డబ్బుల కోసం పాడు చేసేది వాళ్లే*


*("దేశ భక్తి లేని వాళ్లు" అంటే వాళ్లేమీ బోర్డ్ కట్టుకుని తిరగరు.*


*మన లాగే మామూలు మనుషులే.*

*కాకపోతే "ఆత్మ గౌరవం", "కామన్ సెన్స్" అనేవి తెలియవు. పైగా మూర్ఖులు.*


*తమను తాము సెక్యులరిస్టులు, సోషలిస్ట్ లు, లెఫ్టిస్ట్ లు, కమ్యూనిస్ట్ లు, మార్క్సిస్ట్ లు, మావోయిస్ట్ లు, హ్యూమనిస్ట్ లు, లిబరల్స్, ఇస్లామిస్ట్ లు, ఫెమినిస్ట్ లు, అంబేడ్కరిస్ట్ లు, ఇలా ఏదో ఒక టైటిల్ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు).*

Panchaag


 

పుష్యార్క యోగం

 *పుష్యార్కే జన్మ నక్షత్రే*

 *వ్యతీపాతే దినత్రయే|*

*సకృద్గోదావరీస్నానం*

*కులకోటిం సముద్ధరేత్||*


పుష్యమితో కూడిన ఆదివారంకానీ, జన్మ నక్షత్రము ఉన్న నాడు గానీ, వ్యతీపాతలలో గానీ లేదా ఎప్పుడైనా సరే వరుసగా మూడు రోజులు గానీ ఎవరైతే గోదావరీ నదిలో స్నానం చేస్తారో వారియొక్క కులంలోని కోటిమందికి ఊర్ధ్వగతులు లభిస్తాయి.గోదావరి నది లేక అందుబాటులో ఉన్న నదిలో స్నానం  చెయ్యడం.ఈశ్వరార్చన మరియు సూర్యారాధన బ్రాహ్మణ భోజన ద్రవ్యం ఇవ్వడం,జప హోమాలు చెయ్యడం ఉత్తమం.04-08-2024 పుష్యార్క యోగం

*శ్రీ చాముండేశ్వరి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 398*


⚜ *కర్నాటక  :  - మైసూరు*


⚜ *శ్రీ చాముండేశ్వరి ఆలయం*



💠 అవనికి ధర్మరక్షణ ఛత్రాలు అష్టాదశ శక్తిపీఠాలు. మైసూరులో 4వ శక్తి పీఠంగా, మహోగ్ర శక్తితత్వానికి ప్రతీకగా అలరారుతున్నది శ్రీ చాముండేశ్వరీదేవి, అమ్మకొలువైన కొండను చాముండీ హిల్స్ అని పిలుస్తారు.


💠 మహిషాసురుడు పాలించిన సామ్రాజ్యానికి రాజధాని మైసూరు మహనగరం. 

పురణాలలో ఈ నగరాన్ని కౌంచపట్టణం అని, అమ్మ కొలువైన కొండను క్రౌంచగిరి అని ప్రస్తావించారు. 


💠 పార్వతీదేవి శరీర ఖండాలు ఒక్కోచోట, ఒక్కో శక్తిపీఠంగా వెలిసాయి అనే విషయాలు మనకు తెలిసిందే. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయి. ఇది నాలుగవ శక్తిపీఠం అయింది. ఇక్కడ శ్రీ చాముండేశ్వరిగా అమ్మ కొలువుదీరి ఉంది.


💠 మహిషాసురుడు బ్రహ్మచే వరాలు. పొందటానికి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడగడం, చావులేని వరం కోరుకోవడటం, ఇది సాధ్యపడదని బ్రహ్మ చెప్పటం ఆడవారు అబలలు కాబట్టి మగవారి చేతిలో నాకు చావు లేకుండా వరం కావాలని అడగటం, బ్రహ్మ సరే అనడం విదితమే ఆ వరబల గర్వంతో దివిని, భూవిని సంపూర్ణంగా జయించి, దేవతలకు దేవేంద్రుడికి నిలువ నీడ లేకుండా చేయటం ఇలా మహిషాసురుడి ఆగడాలు మితిమీరిపోయాయి. 


💠 మహర్షులను, మునులను, తపః సంపన్నులను సంహరించసాగాడు. యజ్ఞయగాదులు జరగకుండా అడ్డుకున్నాడు. ఇలా వాడి బాధలు పడలేక సమస్త దేవ దేవతలు, బ్రహ్మవిష్ణు మహేశ్వరులతో మొరపెట్టుకున్నారు, వారి ముగ్గురి నుంచి ఒక ప్రచండ తేజస్సు వెలుపలికి వచ్చింది.


💠 శివతేజస్సుతో ముఖం, విష్ణు తేజస్సుతో 18 బాహువులు, బ్రహ్మ తేజస్సుతో పాదాలు ఏర్పడ్డాయి. 

ఇలా ఒక మహశక్తి ఆవిర్భవించింది. 

ఆమే చాముండేశ్వరీ దేవి. 


💠 అష్టదిక్పాలకులు సర్వ దేవతలు అమ్మకు వాహనం సింహంగా, అమ్మ చేతి ఆయుధాలుగా మారారు. 

త్రిశూలం, ఢమరుకం, ఖడ్గం, చక్రం, శంఖం, గద, ధనస్సు విల్లంబులు గండ్రగొడ్డలి. 

ఇలా దివ్యాయుధాలతో అక్కడి నుండి కదలి మహిషుడిని సంహరించటానికి బయలుదేరింది. 


💠 మహిషాసురుడితో 9 రోజులపాటు భీకరంగా యుద్ధం చేసి 9వ రోజున, మహిషాసురుడిని సంహరిచింది. 

రాక్షసుడి పాలననుంచి సమస్తలోకాల విముక్తి పొందాయి. 

దేవీ దేవతలు, క్రౌంచ పట్టణ ప్రజలు అమ్మను ఇక్కడే ఉండి పోవలసిందిగా ప్రార్థించారు. 

వారి అభ్యర్థన మేరకు ఇక్కడి క్రౌంచ గిరిపై అమ్మ శ్రీచాముండేశ్వరిగా కొలువుదీరి పూజలందుకుంటున్నది.


💠 ప్రంచడమైన తేజస్సుతో రాక్షసులకు రుద్ర రూపిణియై, భక్తులకు అనుగ్రహమూర్తియై, క్రౌంచగిరిని తన స్థిర నివాసం చేసుకున్నది. జీవితంలో ఒక్కసారైన ఈ అమ్మను దర్శించుకొని తీరవలసినదే. 

అమ్మదర్శనం చేసుకుంటే చాలు జీవితంలో నెరవేరని కోరిక అంటూ ఏమి మిగలదు. 


💠 12వ శతాబ్దంలో హోయసల పాలకులు, అమ్మకు పూర్తిగా నూతన ఆలయాన్ని నిర్మించారు. విజయనగర రాజులు 17వ శతాబ్ధంలో అమ్మ ఆలయంలో కొన్ని పునర్నిర్మాణాలు చేశారు. అందరి రాజుల వలనే విజయనగరం రాజు అమ్మవారికి వెలకట్టలేని నవరత్న ఖచితమైన వజ్రాభరణాలు సమర్పించారు.


💠 ఇక్కడ అమ్మవారు కూర్చున్న భంగిమలో 8 చేతులతో దివ్యాయుధాలతో కాంతి మండల రాసిగా గర్భాలయంలో దర్శన భాగ్యం కలిగిస్తుంది. ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మదర్శనానికి తండోపతండాలుగా భక్తులు తరలివస్తారు.


💠 మైసురు మహారాజుల వంశీయులే నేటికి మైసూరు మహారాజు శ్రీచాముండీ శక్తి పీఠానికి ధర్మ కర్తలుగా కొనసాగుతున్నారు. 

ఈ తల్లియే వారికి కులదేవత.


💠 ఆ ప్రదేశాన్ని తరువాత మహిషూరు (మహిష ప్రదేశం) అని పిలిచేవారు.  

బ్రిటిష్ వారు దీనిని మైసూర్‌గా మార్చారు మరియు తరువాత మైసూరుగా కన్నడీకరించారు.


💠 ఆషాఢ మాసంలో , శుక్రవారాలు ముఖ్యంగా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. 

ఈ సందర్భంగా ఆలయానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. 

ఈ మాసంలో జరుపుకునే మరో పండుగ చాముండి జయంతి. మైసూర్ మహారాజు అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించిన వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు . 

ఈ సందర్భంగా బంగారు పల్లకిలో అమ్మవారి విగ్రహాన్ని ఆలయం చుట్టూ తిప్పారు.


💠 ఇక్కడ జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ నవరాత్రి . మైసూరు దసరాను కన్నడలో నాద హబ్బా (నాడా పండా) అని పిలిచే కర్ణాటక రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు. 

నవరాత్రి సమయంలో, నవదుర్గాలుగా పిలువబడే దేవత యొక్క 9 విభిన్న కోణాలను వర్ణించేందుకు విగ్రహాన్ని 9 రకాలుగా అలంకరిస్తారు.

 నవరాత్రి 7వ రోజున , మహారాజులు విరాళంగా ఇచ్చిన విలువైన ఆభరణాలను విగ్రహాన్ని అలంకరించడానికి ఆలయానికి ఇస్తారు.


💠 చాముండి  కొండలపై మరికొన్ని  ఆసక్తికరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి మరియు వాటిలో 'నంది' ఏకశిలా విగ్రహం కూడా ఉంది. 

నంది శివుని వాహనం.  15 అడుగుల ఎత్తు మరియు 24 అడుగుల పొడవు ఉండే ఒక ఏకశిలాను కనుగొనవచ్చు. 

ఎద్దుపై చెక్కిన గంటలు మరియు దండల వరుసలను గమనించవచ్చు,


💠 చాముండి ఆలయం వైపు వెళుతున్నప్పుడు, 'మహిషాసుర' విగ్రహం సందర్శకులను ఆకర్షిస్తుంది.


💠 మైసూరు సిటీ బస్టాండ్ నుండి చాముండేశ్వరి ఆలయానికి ప్రతి 20 నిమిషాలకు KSRTC బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

దశవిధ నాడులు :-

 🙏🙏🙏🌹🌹🌹

దశవిధ నాడులు :-


1. ఇడానాడి : అంటే చంద్రనాడి, ఎడమ భాగం లో ఉంటుంది. శివుడు అధి దేవత.


2. పింగళ నాడి : అంటే సూర్యనాడి, కుడి వైపు ఉంటుంది. విష్ణువు అది దేవత.


3. సుషమ్న నాడి : అంటే అగ్నినాడి, మధ్యమందు ఉంటుంది. బ్రహ్మ అధిదేవత.


4. గంధారి నాడి : అంటే కుడి నేత్రమందు ఉంటుంది. ఇంద్రుడు అధిదేవత.


5. హస్తినాడి : అంటే జిహ్వయందు ఉంటుంది. ఎడమ నేత్రమందు ఉంటుంది. వరుణుడు అధిదేవత.


6. పూషనాడి : కుడి కర్ణమందు ఉంటుంది. దిగ్ దేవత అధిదేవత.


7. పయశ్వనీ నాడి : ఎడమ కర్ణమందు ఉంటుంది. పద్మోధ్భవుడు అధిదేవత.


8. ఆలంబన నాడి : మెడ దగ్గర ఉంటుంది. నప్యాపకుడు అధిదేవత.


9. కుహునాడి : గుదస్థానం వద్ద ఉంటుంది. భూమి అది దేవత.


10. శంఖినీ నాడి : నాభిస్థానం వద్ద ఉంటుంది. చంద్రుడు అది దేవత.


.......................................................................

సప్త సముద్రాలు :-


లవణ సముద్రం - మూత్రం.


ఇక్షు సముద్రం - చెమట.


సురాసముద్రం - ఇంద్రియం.


సర్ప సముద్రం - శోణితం.


దథి సముద్రం - శ్లేష్మం.


క్షీరసముద్రం - జోల్లు.


శుద్దోదక సముద్రం - కన్నీరు.

.......................................................................


ఊర్థ్వలోకాలు :-


భూలోకం  -- గుదమందు ఉంటుంది.


భువర్లోకం -- గుహ్యమందు ఉంటుంది.


సువర్లోకం -- నాభియందు ఉంటుంది.


మహర్లోకం -- హృదయం యందు ఉంటుంది.


జలలోకం -- కంఠం యందు ఉంటుంది.


తపోలోకం -- భ్రూమధ్యం యందు ఉంటుంది.


సత్యలోకం -- లలాటం యందు ఉంటుంది .


అధోలోకాలు :-


అతల లోకం -- అరికాళ్ళ యందు ఉంటుంది.


వితల లోకం -- మోకాళ్ళ దగ్గర ఉంటుంది.


సుతల లోకం -- మడిమల వద్ద ఉంటుంది.


తలాతల లోకం -- పిక్కల యందు ఉంటుంది.


రసాతల లోకం -- మోకాళ్ళ దగ్గర ఉంటుంది.


మహతల లోకం -- తొడలయందు ఉంటుంది.


పాతాళ లోకం -- గుదయందు ఉంటుంది.

.......................................................................


దేహత్రయ వివరణ :-


ప్రాథమికంగా వీటిని అవగాహన చేసుకోవడం అవసరం అందుకే ఇవి పోస్ట్ చేయడం!


1. దేహత్రయం :- స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం.


2. అవస్థా త్రయం : - జాగృత్త, స్వప్న, సుషుప్తి. 


3. స్థాన త్రయం :- విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు.


4. గుణ త్రయం :- రాజసం, సాత్వీకం, తామసం.


5. వర్ణ త్రయం :- రక్తవర్ణం, శ్వేతవర్ణం, నీలవర్ణం. 


6. దైవ త్రయం :- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు.


7. మాతృకా త్రయం :- అకారం, ఉకారం, మకారం.


ఇలాంటి త్రయాలు చాలా ఉన్నాయి..


సప్త ద్వీపాలు :-


జంబూ ద్వీపం - తలలోను.


ప్లక్షద్వీపం - ఆస్తులు.


శాకద్వీపం - శిరస్సున ఉంటుంది.


శాల్మల ద్వీపం - చర్మమున ఉంటుంది.


పుష్కర ద్వీపం - గోళ్ళ యందు ఉంటుంది.


కుశ ద్వీపం - మాంసం యందు ఉంటుంది.


కౌంచ ద్వీపం - వెంట్రుకల యందు ఉంటుంది...

మన మతం

 

మన మతం అనగానే అదేదో మతం  అని  అనుకుంటున్నారుఅందుకే మన మతం గూర్చి వివరిస్తున్నాను

మన మతానికి  క్రింది నియమాలు వున్నాయి

1)దైవ  అభేద త్వం: అంటే మనం అందరం శివ, కేశవ అబేధంగా వర్తించడం అని అర్థంఅనగా శివునిపై ఇష్టం ఉన్నవారు శివుని, అలాగే విష్ణువుపై ఇష్టం ఉన్నవారు విష్ణువును ఆరాధించవచ్చు, కానీ శివుని ఆరాధించే వారు విష్ణువును అలాగే విష్ణువును ఆరాధించేవారు శివుని యెడల అబేధంగా అంటే వేరుగా చూడకుండా ఉండటంనిజానికి భాగవతుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన పరబ్రహ్మ తత్వాన్ని చేరుకోవటానికి ప్రాధమిక మార్గంగా సగుణోపాసన కాబట్టి రూపంలో కొలిచినా మన అంతిమ లక్ష్యం నిర్గుణ బ్రహ్మను చేరుకోవడమే

2)  ప్రాతఃకాలంలో నిద్రలేవటం: విధిగా ప్రతివారు సూర్యోదయానికి ముందే నిద్ర లేవ వలెను. కాలకృత్యాలను ముగించుకొని తిలక ధారణ చేసి ఇష్టదైవాన్ని అర్చించటం. నిత్యం ఇంట్లో దూప, దీప, నైవేద్యాదులు భగవంతునికి అర్పింపవలెను

3)  ఇంట్లో పిల్లలుకూడా వారి వాయి స్తాయిని పట్టి తప్పకుండ నిత్యం భగవదారాధనలో పాలు పంచుకునే విధంగా తర్ఫీదు ఇవ్వటం

4)  మానవ అభేదత్వం: సర్వ మానవులు పరమేశ్వరుని స్వరూపంగా భావించి అందరిని నిన్ను నీవు చూసుకునే విధంగా చూసుకోవటం

5)  స్త్రీ, పురుష అభేదత్వం : మీకు ఎదురుగా వున్నది స్త్రీ అయినా పురుషుడు అయినా ఇద్దరినీ సమ భావంతో చూడటం. ఇది సాధకులు అలవరచుకోవలసిన ఒక ముఖ్య లక్షణంఎప్పుడైతే నీవు న్త్రీ పురుష అభేదత్వన్ని ఆచరిస్తావో అప్పుడు అందరిలో భగవంతుని చూడగలవు

6)  నమస్కరించటం: కనపడిన ప్రతివారినీ రెండు చేతులు జోడించి నమస్కరించటం. ఇది కొంత ప్రయత్నంతో సాధించవచ్చు. చిన్నవారిని నమస్కరించటం ఏమిటి అని అనుకుంటారునిజానికి జగత్తులో చిన్నవారు, పెద్దవారు అని లేనే లేదు. భూమిమీద రావటంలో మనకు చిన్నా పెద్ద అనే తేడా కనిపిస్తుందికానీ నిజానికి ప్రతి మనిషిలోని పరమాత్మకు వయస్సుతో సంబంధం లేదుఅతడు చిరంజీవి అనంతుడు. సర్వజ్న్యుడు 

7)   వినయశీలత: ప్రతివారితోటి వినయంగా ప్రవర్తించవలెను. నాకు అన్నీ తెలుసు అనే భావనను పూర్తిగా విడనాడవలెను. ఎందుకంటె నీకు నీవు ఏది తెలుసు అని అనుకుంటున్నావో అంతకంటే ఎక్కువగా తెలిసినవారు అనేకులు నీ ప్రక్కన ఉండి వుంటారు జగత్తులో సర్వము తెలిసినవాడు కేవలం ఈశ్వరుడు ఒక్కడే నిజం మనకు సదా స్పృహలో ఉండాలి

8)  నిగర్వంగా ఉండటం: నేను ఐశ్వర్యపరుడను భూమి మీద దేనినయినా కొనగలను అనే ఆలోచన అస్సలు ఉండరాదునీవు ధనవంతుడవు అయితే నీ ధనంతో పలువురికి ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టు. జగత్తులోని ఐశ్వర్యం పూర్తిగా ఈశ్వరునిదే అయి వున్నదినేను నాది అని అనుకునేది కేవలం నేను కొద్దీ కాలం అనియూభావించటానికి మాత్రమే కానీ నేను దేనికి యజమానిని కాను అనే సత్యం తెలుసుకొని వర్తించాలి

9)  బంధాలు: మనము సామాన్యంగా వివాహం వలన, పుట్టుక వలన బంధాలను ఏర్పరచుకొని వాటి చుట్టూ గిరిగీసుకొని ప్రవర్తిస్తుంటాముకానీ నిజానికి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పార్వతి పరమేశ్వరులు మాత్రమే జగత్ మాత జగత్ పిత అంటే అందరికి తల్లిదండ్రులు వారే కానీ వేరొకరు కాదు. ఎదుకంటే మనలో నిక్షిప్తంగా వున్న నేను అనబడే చెతన్యస్వరూపుడు వారి సంతానం మాత్రమే కాబట్టి జగత్తులో వున్న సర్వ జీవరాశి కూడా నాకు సోదర సోదరీమణులు అనే భావం కలిగి ఉండాలి

10.  నేను చూసే ఈ దృశ్యమాన జగత్తు పూర్తిగా ఆ ఈశ్వరునిచే నిర్మించి ఈశ్వరునిచే ఆవరించి వున్నది. 

11. నాది ఏది లేదు: నేను నాది అని అనుకునేది అది ఇల్లు వాకిలి కావచ్చు లేక పొలము పుట్రా కావచ్చు లేక నగలు నట్రా ఇంకా వస్తు వాహనాలు నేను కొనుక్కున్నాను నాకు సంక్రమించాయి అనేవి కేవలము మిధ్య నిజానికి నేను వాటిని కొంతకాలము అంటే నా శరీరం వున్నంతవరకు మాత్రమే అనుభవించే ఒక కిరాయిదారుడిని మాత్రమే అనే భావము కలిగి ఉండాలి. 

12. అకర్త భావన: నేను చేసే ఏ పనికూడా నేను కర్తను కాను కర్త కేవలము పరమేశ్వరుడు మాత్రమే ఆ ప్రభువు నా తో ఆయా పనులు చేయిస్తున్నాడు అనే భావన కలిగి ఉండాలి

ఆచరించవలసినవి

నియమాలు కొంత కఠినంగా ఉంటాయి కానీ అసాధ్యం మాత్రము కాదు

1. దేహవ్యామోహం: దేహవ్యామోహం తగ్గించుకోవాలి అందుకు ఏమి చేయాలి అంటే నేను దేహాన్ని కాదు దేహిని మాత్రం అనే భావం కలిగి శరీరాన్ని కేవలము మోక్ష సాధనకు పనికి వచ్చు ఉపకరణంగా మాత్రం భావించి శరీర వ్యాపారాలు చేయాలి. ఏవిధంగా అయితే ఒక పనిమంతుడు తన పనికి పనికి వచ్చు పరికరాలు చేసుకుంటాడో అలాగేశరీరాన్ని పరిశుభ్రంగా చూసుకోవాలి కానీ శరీరాన్ని అందంగా ఉండాలని అనుకోకూడదు, అంటే వివిధ లేపనాలు పూసుకోవటం, కేశాలను అలంకరించుకోవడం మొదలైనవి

2. వస్త్రధారణ: వస్త్రాలు కేవలం శరీరానికి ఆశ్చాదనగా మాత్రం స్వీకరించాలి. అందమైన అలంకరణలు, ఖరీదైన వస్త్రాలు, వస్తువులు పొంది ఉంటే మనస్సు వాటితో అనుబంధం ఏర్పరచుకొని మనస్సు భగవంతుని నుంచి దూరంగా వెడలుతుందినన్ను ఏది కట్టి పడవేయదు అని భావిస్తే ఏవి వున్నా అవి నిన్ను ఏమి చేయలేవు

3. నేను ఆచరించే నియమాలు నా మనస్సుకు నచ్చాయి కాబట్టి ఎవ్వరితో అంటే ఈ ప్రపంచంతో నిమిత్తం లేకుండా నన్ను నేను ఉద్దరించుకోవటానికి మాత్రమే అనే భావన కలిగి అకుంఠితంగా నిరంతరం నియమాలకు కట్టుబడి జీవనం చేయాలి.

మతాన్ని నిర్దేశించిన గురుదేవులు ఎవరు అంటే ఇంకా ఎవరు శ్రీ ఆది శంకర భగవతపాదులువారిని అనుసరిద్దామువారు  ఏర్పాటు చేసిన మార్గమే మనకు సర్వదా శిరోధార్యం.  

ఓం శాంతి శాంతి శాంతిహి 

ఇట్లు 

మీ

మీ భార్గవ శర్మ   

మతాన్నిమేము ఆచరించదలిచాము అని అనేవారు మీ సమ్మతిని కామెంటులో తెలుపండి. 

నాకు ఈ నియమాలు పూర్తిగా నచ్చాయి ఈ రోజునుంచి నేను మనస్ఫూర్తిగా ఆచరిస్తాను, నా తోటివారితో ఆచరింప చేస్తాను అని మీరు కామెంటులో పేర్కొనండి. ఒక్క విషయం మీ పేరు ఫోను నెంబరు వ్రాయటం మరువ వద్దు.