3, ఏప్రిల్ 2025, గురువారం

ఆనంద రహస్యాన్ని

 ఓ యువకుడు ఆనందం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. గురువును కలిస్తే తెలుసుకోవచ్చని మిత్రులు సలహా ఇచ్చారు. ఏ గురువును కలిస్తే బాగుంటుందా అని వెదకసాగాడు.


అదే సమయంలో ఆ పట్టణానికి ఓ కొత్త గురువు రావడంతో సంతోషించాడు. అతణ్ని కలిసి ఆనందం అనేది ఎలా ఉంటుందో తెలియజేయమని కోరాడు. 'నీ కాలి చెప్పుల కొలత ఎంత?' అని ప్రశ్నించాడు గురువు. 'ఎనిమిది అంగుళాల'ని సమాధానమిచ్చాడు యువకుడు. 'ప్రస్తుతం నువ్వు వేసుకున్న ఎనిమిది అంగుళాల కొలత ఉన్న చెప్పులను పక్కన పెట్టు. ఏడు అంగుళాల చెప్పులు కొనుక్కో. వాటిని వేసుకుని ఊరంతా తిరిగి సాయంత్రం నా దగ్గరికి రా!' అని చెప్పి పంపాడు గురువు. ఆ యువకుడు ఏడు అంగుళాల చెప్పులు కొనుక్కుని కాళ్లకు తొడుక్కున్నాడు. నడుస్తున్న కొద్దీ ఇబ్బంది మొదలయ్యింది. అప్పుడప్పుడూ సరిగా నడవలేకపోయాడు. అయినా చెప్పులు విడిచిపెట్టకుండా తిరిగాడు. కాళ్ల నొప్పులు మొదలయ్యాయి. 'ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, చెప్పులను ఎప్పుడు విడిచిపెడదామా' అనిపించింది.


ఎలాగోలా ఆ రోజు సాయంత్రం వరకు గడిపాడు. క్షణం ఆలస్యం చేయకుండా గురువు దగ్గరికి వెళ్లి ఏడుపు ముఖంతో ఆయన ఎదుట నిలబడ్డాడు. గురువు చిన్నగా నవ్వి ఏడు అంగుళాల చెప్పులను తీసి పక్కన పెట్టమన్నాడు. అలాగే చేశాడు యువకుడు. 'ఇప్పుడు ఎలా ఉంద'ని అడిగాడు గురువు. 'ఆనందంగా ఉంద'ని బదులిచ్చాడు యువకుడు. 'నెత్తి మీద ఉన్న కొండంత బరువును పక్కన తీసి పెట్టినట్లుగా ఉంది. సరైన కొలతలు ఉన్న చెప్పులు తొడుక్కోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాన'ని బాధపడ్డాడు. అప్పుడు గురువు.. 'మనం జీవితంలో కూడా ఇదే పొరపాటు చేస్తాం. సరైన చెప్పులు వేసుకోం. తప్పుడు కొలత జోళ్లు ఉపయోగిస్తున్నాం' అన్నాడు. ఆశ్చర్యంగా చూశాడు యువకుడు. 'మనకు ఉండాల్సిన మానవీయ విలువలను పక్కన పెడతాం. ధనం పట్ల ఆకర్షణ, వస్తువులపై వ్యామోహం, ఎదుటి వారి మన్ననల పట్ల మోజు, మనం గొప్ప అనే భావం మనసులో పెట్టుకుని జీవనం సాగిస్తుంటాం. కానీ, విలువలు వదలకుండా ఉన్నప్పుడే బ్రహ్మానందం లభిస్తుంది' అని ఆనంద రహస్యాన్ని  వివరించాడు గురువు.

ప్రైవేట్ టీచర్లమ్

 ప్రైవేట్ టీచర్లమ్ 


  మమ్మల్ని ఏమి అడగకండి

 మా గురించి గొప్పగా చెప్పుకోవడానికి

 ఏమీ లేదు ఏమీ ఉండదు

 మాకు మర్యాద లేదు

 మాకు రక్షణ లేదు

 కనీసం కడుపునింపేంత జీతమూ లేదు

 ఎండయితేనేమి వానయితేనేమి

 ఏ కాలమైతేనేమి

 అడ్మిషన్ల పోరులో చెప్పులే కాదు                     మా బతుకులూ అరిగిపోతాయి

 ఎక్కిన గడప మళ్ళీ మళ్ళీ ఎక్కుతూ

 ఎదురయ్యే తిరస్కారాలే మాకు విందు

 మాకు ఆత్మాభిమానం ఉండకూడదు

 మనోభావాలు అస్సలు ఉండకూడదు

 మా బతుకులు బక్కచిక్కి పోతున్నా 

 యాజమాన్యాలను గద్దెనెక్కించే

 క్రతువులో సమిధలైపోవాల్సిందే

 భ్రష్టుపట్టిన ఈ విద్యా వ్యవస్థ

 మా దేహాలకు తూట్లు పొడుస్తున్నా 

 మా మొహాలపై చిరునవ్వుల

 పౌడర్ అద్దుకోవాల్సిందే 

 నాయకులకు మేము ఓటర్లుగాను

 మీడియాకు వార్తా వస్తువుగాను

 కనిపిస్తామే గాని

 మేము మేముగా కనిపించం వాళ్లకి

 మమ్మల్ని ఎప్పుడూ ప్రైవేట్ గా చూస్తారు

 మేము ప్రైవేట్ టీచర్లము కదా


 కూని అంకబాబు

 నెల్లూరు

కృతజ్ఞత

 కృతజ్ఞత!!!


డా ప్రతాప్ కౌటిళ్యా సునీతా ప్రతాప్ 


జ్ఞానం 

ధనం 

విజ్ఞానం 

ప్రతిభ 

కృతజ్ఞత కోరుతుంది!!


కీర్తి 

గుణం 

దానం 

స్త్రీ 

కృతజ్ఞత కోరుతుంది!!!


ప్రేమ 

దయ 

జాలి 

మానవత్వానికి 

కృతజ్ఞత చూపాలి!!!


నేల 

నీరు

గాలి 

చెట్టు కు 

కృతజ్ఞత చెప్పాలి!!!


డా ప్రతాప్ కౌటిళ్యా సునీతా ప్రతాప్

తొమ్మిదింటిని (నవగోప్యాలు)రహస్యంగా దాచాలంటారు*

 🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸

*ఈ తొమ్మిదింటిని (నవగోప్యాలు)రహస్యంగా దాచాలంటారు*


👉 ఆయువు,

👉 విత్తము,

👉 ఇంటిగుట్టు,

👉 మంత్రం,

👉 ఔషధం,

👉 సంగమం,

👉 దానం,

👉 మానము,

👉 అవమానం


🌹 అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.


🌹 భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి మాత్రమే ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.


🌹 రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.


🌹 ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు.

 ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు 

బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే.'అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.


🌹 అయినా మన దగ్గర ఉన్న విషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగు తుంది.


🌹 ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.


🌹 సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.


🌹 ‘మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.


ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.


🌹 సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.


🌹 దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.


🌹 మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.


🌹 అలాగే తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతనేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మనం చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం కదా.


🌹 ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి.🙏👆


🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*సర్వేజనా సుఖినోభవంతు*

*లోకా సమస్త సుఖినోభవంతు*

 *శుభం భూయాత్*

*ఓం శాంతి శాంతి శాంతిః*

*స్వస్తి*

🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹

మనసు ప్రశాంతంగా ఉంటుంది

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️స్వార్థం లేని మనసు ప్రశాంతంగా ఉంటుంది..స్వార్థం లేని ప్రపంచం అనందమయంగా ఉంటుంది.. ఎప్పుడైతే మనకి ప్రియమైన వ్యక్తిని మనము బాధ పెట్టినప్పుడు క్షమించు అని అడగడానికి, అలాగే ఎప్పుడైతే మనకి ప్రియమైన వ్యక్తి మనలని క్షమించు అని అడిగి నప్పుడు వెంటనే అతని తప్పును క్షమించే మనసున్న మొదటి వ్యక్తిగా మనం ఉందాం🏵️ఇతరులు చూపించే ఓదార్పు కంటే మీరు వహించే ఓర్పు వేయి రేట్లు మేలు చేస్తుంది...ఓదార్పు ఎండమావి వంటిది.. ఓర్పు దప్పిక తీర్చే సెలయేరు వంటిది.. ఓదార్పు కోసం ఎదురు చూసే వారికీ జీవితం ఓటమికి దగ్గరగా ఉండే ఆటగాడి వలె కనిపిస్తుంది.. ఓర్పుతో సమస్యలను ఎదుర్కొనే వారికీ ఆటలో గెలిచే సత్తా ఉన్న ఆటగాడు కనిపిస్తాడు🏵️ఎంత దూరమైనా వెళ్లడం వేరు.. ఎంత దూరం వెళ్లాలో తెలియడం వేరు.. మొదటిది సహసం, రెండోవది వివేకం...ప్రతీ సమస్యని ఆటగా తీసుకోని పరిష్కరించుకోవాలి..గెలిస్తే అనందం వస్తుంది.. ఓడితే అనుభవం వస్తుంది.. గెలుపు గర్వవానికి పునాది వేస్తే, ఓటమి తెలివికి పునాది వేస్తుంది🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3.గోకవరం బస్టాండ్ దగ్గర .స్టేట్ బ్యాంక్ ఎదురుగా .రాజమండ్రి .వైద్యసలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా మందులు పంపబడను 9440893593 9182075510* 🙏🙏🙏

రామాయణ దివ్యకథా పారాయణం*

 శ్రీ‌శ్రీ‌శ్రీ‌

*ఇంటింటా రామాయణ దివ్యకథా పారాయణం*

*

         *5 వ  రోజు*

     🌸 *సుంద‌ర‌కాండ‌*🌸


               ***

శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి.

                ****

మనోజవం 

మారుతతుల్య వేగం

జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |

వాతాత్మజం 

వానరయూథ ముఖ్యం

శ్రీరామ దూతం 

శరణం ప్రపద్యే||


(మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీ రామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను.)

                 ***


సీతాన్వేష‌ణ సంక‌ల్ప దీక్ష‌తో ఆంజ‌నేయుడు మ‌హేంద్ర‌గిరి ప‌ర్వ‌తం ఎక్కి ఉత్సాహంతో కాసేపు విహ‌రించాడు. మ‌హా వేగంతో ఆకాశంలోకి ఎగిరేందుకు ప‌ట్టుకోసం భూమిపై కాలు పెట్టి అదిమితే అది ఎక్క‌డ కుంగుతుందో న‌ని మ‌హేంద్ర‌గిరి ప‌ర్వ‌తాన్ని ఆపుగా చేసుకున్నాడు. త‌ల‌పైకి ఎత్తి చూశాడు. విశాల ఆకాశం ప్రేర‌ణ‌నిచ్చింది. మ‌హోత్సాహం ఆవ‌హించింది. తూర్పుకు తిరిగాడు. సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి న‌మ‌స్క‌రించాడు. శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిని శ‌రీరంలోకి ఆవ‌హింప‌చేసుకున్నాడు. 

వాన‌ర‌సేన‌వైపు తిరిగాడు, మిత్రులారా! రామ‌కార్యార్థం వెడుతున్నాను. రామ‌బాణం ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంతో లంక‌లో ప్ర‌వేశిస్తాను. అక్క‌డ సీత‌మ్మ‌వారు లేక‌పోతే దేవ‌లోకం వెళ‌తాను. అక్క‌డా ఆ మ‌హాత‌ల్లి క‌నిపించ‌క‌పోతే రావ‌ణాసురుణ్ణే బంధించి ఈడ్చుకువ‌స్తాను . లేదంటే లంకాన‌గ‌రాన్నే పెళ్ల‌గించి తీసుకువ‌స్తాను చూస్తూ ఉoడండి అంటూ 

ఒళ్లువిరిచి, దేహాన్ని సాగ‌దీసి,చేయి ముందుకు సాచి...జై శ్రీ‌రామ్ అంటూ  మ‌హేంద్ర‌గిరిని కాలితో గ‌ట్టిగా అదిమి హ‌నుమ ఒక్క ఉదుటున ఆకాశంలోకి లేచాడు.  వాన‌ర సేన హ‌నుమ‌కు,శ్రీ‌రామ చంద్ర‌మూర్తికి జేజేలు ప‌లుకుతున్న‌ది. హ‌నుమ మ‌హేంద్ర‌గిరినుంచి పైకి లేస్తుంటే, ఆ ఊపుకు మ‌హేంద్ర‌గిరి ఊగిస‌లాడింది.  చెట్లు ఆ మ‌హోధృత గాలికి పుష్ఫ వ‌ర్షం కురిపించాయి. వాతావ‌ర‌ణం ఒక్కసారిగా ఆహ్లాద‌క‌రంగా మారింది.జీవ‌కోటికి ఏదో తెలియ‌ని ఆనందం. విష‌ప్రాణులు భ‌యంతో విల‌విల‌లాడి పోయాయి. అలా స‌ముద్రం మీద మ‌హావేగంతో హ‌నుమంతుడు లంకాన‌గ‌రంవైపు దూసుకుపోతున్నాడు. స ముద్రంపై ప‌డిన హ‌నుమంతుడి నీడ, స‌ముద్రంలో గాలివాటుకు పోతున్న నౌక‌లా క‌నిపిస్తున్న‌ది. స‌ముద్రం అల్ల‌క‌ల్లోల‌మౌతున్న‌ది.  రెక్క‌ల ప‌ర్వ‌తంలా దూసుకుపోతున్నాడు మ‌న హ‌నుమ‌. దేవ‌త‌లు హ‌నుమ‌నుచూసి విజ‌యోస్తు... విజ‌యోస్తు అని దీవిస్తున్నారు. 


*సాగ‌రుడి సాయం*


స‌ముద్రుడు త‌ల పెకి ఎత్తి చూశాడు. రామ‌కార్యార్థి అయి వెళుతున్న హ‌నుమ‌ కనిపించాడు.  ఏదో ఒక ర‌కంగా హనుమకు స‌హాయం చేయాల‌నుకున్నాడు.అలా రామకార్యంలో తానూ భాగస్వామి కావాలనుకున్నాడు. అప్పుడు స‌ముద్రంలోనే దాగి ఉన్న మైనాకుడ‌నే ప‌ర్వ‌తాన్ని పిలిచి, ఈ స‌ముద్రం నుంచి పైకి లేచి నువ్వు హ‌నుమ‌కు ఆతిథ్యం , కాసేపు విశ్రాంతి నివ్వు .అలా రామ‌కార్యంలో త‌రిద్దాం అన్నాడు స‌ముద్రుడు. మైనాకుడు ఆకాశ‌వీధికి పెరుగుతూ వెళ్లి హ‌నుమ‌కు  విశ్రాంతి ఇవ్వాల‌న్న సంకల్పంతో అతనికి అడ్డంగా నిలిచాడు.. హ‌నుమ త‌న‌కు ఏదో అడ్డుగా నిలిచింద‌ని భావించి గుండెతో మైనాకుడిని ఒక్క గుద్దు గుద్దాడు. దానితో క‌ల‌వ‌ర‌ప‌డిన మైనాకుడు నిజ‌రూపం లో ఎదురుగా నిలిచి  , త‌న శిఖ‌రంపై విశ్రాంతి తీసుకోమ‌న్నాడు. హ‌నుమ సంతోషించాడు.కానీ రామ‌కార్యార్థినై సంక‌ల్ప‌దీక్ష‌తో వెళుతున్నాను. విశ్రాంతి కిది స‌మ‌యం కాదు . అని మైనాకుడి తృప్తి కోసం అత‌నిని చేతితో స్పృశించి ప్ర‌భంజ‌న వేగంతో హ‌నుమంతుడు ముందుకు దూసుకుపోతున్నాడు. హ‌నుమ దీక్ష‌కు,పట్టుదలకు దేవ‌త‌లు ముచ్చ‌ట‌ప‌డ్డారు.

గంధ‌ర్వ దేవ‌తాగ‌ణాలు హ‌నుమ శక్తిసామ‌ర్థ్యాలు ప‌రీక్షించాల్సిందిగా నాగ‌మాత సుర‌స ను కోరారు. ఆమె భారీ కాయంతో హ‌నుమ మార్గానికి అడ్డుప‌డింది. హ‌నుమా! ఈరోజు నువ్వు నాకు ఆహారం. నువ్వు మ‌ర్యాద‌గా నా నోట్లోకి ప్ర‌వేశించు అని గ‌ద్దించింది. అప్పుడు హ‌నుమంతుడు, విన‌యంతో, అమ్మా... నేను రామ‌కార్యార్థినై వెళుతున్నాను. సీతామాత జాడ తెలుసుకుని వ‌చ్చిన త‌ర్వాత నీకు ఆహారం అవుతాను అన్నాడు. సుర‌స ఒప్పుకోలేదు. స‌రే నా దేహానికి స‌రిప‌డినంత‌గా నీ నోరు తెరువు అన్నాడు. సుర‌స నోరు పెద్ద‌ది చేస్తున్న‌ది. హ‌నుమ కూడా త‌న దేహాన్ని పెంచుతూ పోతున్నాడు. ఇలా ఇద్ద‌రూ పోటీ ప‌డుతున్నారు.  ఒక ద‌శ‌లో  హ‌నుమ  ఉన్న‌ట్టుండి త‌న దేహాన్ని బొట‌న వేలి స్థాయికి త‌గ్గించి సుర‌స నోట్లో కి ప్ర‌వేశించి క్ష‌ణ‌కాలంలో బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అమ్మా నీవు చెప్పిన‌ట్టే చేశాను. ఇక వెళ్లిరానా అన్నాడు. ఆంజ‌నేయుని సూక్ష్మ‌బుద్ధికి సంత‌సించి, నాయానా నీకు కార్య‌సిద్ధి క‌లుగుతుంది. సీతారాముల‌ను క‌లుపుతావు అని ఆశీర్వ‌దించి మార్గం సుగ‌మం చేసింది.

అలా గ‌గ‌న‌త‌లంలో స‌ముద్రంపై దూసుకుపోతున్న హ‌నుమ నీడ‌ను ఛాయాగ్రాహిణి అనే స‌ముద్రంలోని సింహిక అనే రాక్షసి చూసింది. త‌న‌కు భ‌లే ఆహారం దొరికింద‌ని అనుకునుంది. నోరుతెరిచి హ‌నుమ నీడ ఆధారంగా అతనిని  త‌న నోట్లోకి లాగే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. ఇది గ‌మ‌నించాడు హ‌నుమ‌. దేహాన్ని మ‌రింత పెంచినా ప్ర‌యోజ‌నం లేక పోయింది. వెంట‌నే సూక్ష్మ‌రూపియై సముంద్రంలోని సింహిక‌ను ఢీకొట్టి దాని ప్రాణాలు తీశాడు. సింహిక మృత‌క‌ళేబ‌రం సముద్రంపై తేలుతుంటే దేవ‌తలు సంతోషంతో పుష్ప‌వృష్టి కురిపించారు. ఈ విధంగా ధైర్యం, విశాల‌దృష్టి, బుద్ధి, చాక‌చ‌క్యం ప్ర‌ద‌ర్శించిన హ‌నుమ‌కు ఇక ఎదురులేద‌ని దేవ‌తలు దీవించారు. అంత‌లోనే  ద‌క్షిణ‌తీరంలో ప‌ర్వ‌త పంక్తులు హ‌నుమంతుడికి క‌నిపించాయి. లంకాన‌గ‌రానికి ద‌గ్గ‌ర‌లోని త్రికూట‌గిరి శిఖ‌రం మీద దిగాడు.  ఇంత దూరం స‌ముద్రంపై ఎగిరివ‌చ్చినా ఏమాత్రం అలిసిపోలేదు. సాయం సంధ్యా వంద‌నాది కార్య‌క్ర‌మాలు ముగించాడు.


*లంకాన‌గ‌ర ప్ర‌వేశం*:


త్రికూట‌గిరినుంచి లంకాన‌గ‌రాన్ని చూశాడు హ‌నుమంతుడు. బ‌హు సుంద‌రంగాఉంది. అంతేకాదు, చీమ‌కూడా న‌గ‌రంలో ప్ర‌వేశించ‌డానికి వీలులేకుండా రాక్ష‌సులు కాప‌లాకాస్తున్నారు. సూక్ష్మ‌రూపి అయి వాన‌ర రూపంలోనే లంక‌లో ప్ర‌వేశించి సీతామాత జాడ తెలుసుకోవాల‌నుకున్నాడు. చిన్న‌వాన‌రంగా లంక‌లో ప్ర‌వేశించ‌డానికి రాజ‌ద్వారం చేరుకున్నాడు. ఇంత‌లో లంకిణి అనే రాక్ష‌సి ఎదురుగా నిలిచి, వ‌నాల‌లో తిరిగే వానరానికి ఇక్క‌డేం ప‌ని అని గ‌ద్దించింది. త‌న అనుమ‌తి లేకుండా లోప‌లికి ప్ర‌వేశించ‌డం కుద‌ర‌ద‌ని చెప్పింది. లోప‌ల ఉన్న వ‌నాల‌ను స‌ర‌స్సుల‌ను ప‌క్షుల‌ను చెట్లను, ఆ న‌గ‌ర సౌంద‌ర్యాన్ని ఒక్క‌సారి చూసి వ‌చ్చేస్తాన‌న్నాడు హనుమ. లంకిణి కుద‌ర‌ద‌న్న‌ది. నేను లంక‌ను కాప‌లా కాస్తుంటాను. న‌న్ను గెలిస్తే కాని నువ్వు లోప‌లికి అడుగు పెట్ట లేవు అంటూ హ‌నుమ‌ను ఒక్క దెబ్బ కొట్టింది. హ‌నుమ వెంట‌నే కుడిచేయి పైకిఎత్తి పిడికిలి బిగించాడు. కానీ కుడిచేతితో కొడితే లంకిణి చ‌నిపోతుంది. స్త్రీ క‌దా అని ఆలోచించి ఎడ‌మ చేతితో ఒక్క గుద్దు గుద్దాడు.ఆమె క‌ళ్లుతేలేసి కింద‌ప‌డింది. అప్పుడు లంకిణి, నాయ‌నా! నువ్వు న‌న్ను గెలిచావు. ఒక వాన‌రుడు వ‌చ్చి న‌న్ను గెలిచిన నాడు రావ‌ణాసురుడి అంత్య‌కాలం స‌మీపించిన‌ట్టు అని బ్ర‌హ్మ‌గారు నాకు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు లంకా న‌గ‌రం భ‌విష్య‌త్తు, రాక్ష‌సుల భ‌విష్య‌త్తునాకు అర్ధ‌మై పోయింది. ఇక ద్వారం తెరుస్తున్నాను. ఈ ద్వారం గుండానే వెళ్లు , సీత‌మ్మ‌ను క‌నిపెట్టు అని చెప్పింది.కానీ హ‌నుమ రాజ‌ద్వారం గుండా ప్ర‌వేశించ‌కుండా ,ఎడ‌మ కాలులోప‌లికి పెట్టి ప్రాకారం మీదినుంచి లంకాన‌గ‌రంలోకి కిందికిదూకాడు. అప్ప‌టికే రాత్రి అయింది. చంద్రుడి వెలుగులో లంకానగరం మరింత శోభాయమానంగా క‌నిపిస్తున్న‌ది.


*అంతఃపురంలో సీతాన్వేషణ*

చిన్నశరీరం ధరించి, హనుమంతుడు రావణుని మందిరంలో, పానశాలలో, పుష్పక విమానములో .. అన్నిచోట్లా సీతమ్మను వెదికాడు. రాత్రి వేళ రావణుని మందిరంలో కాంతలు భోగ లాలసులై, చిత్ర విచిత్ర రీతులలో నిద్రిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూచి కలవరపడిన హనుమంతుడు, తాను ,రామ కార్యాచరణ నిమిత్తం ఏ విధమైన వికారాలకూ లోను గాకుండా సీతాన్వేషణ చేస్తున్నందున తనకు దోషం అంటదని, తన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లదని సమాధానపడ్డాడు. పుష్పక నిమానం అందాన్ని, రావణుని ఐశ్వర్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. నిద్రిస్తున్న స్త్రీలలో మండోదరిని చూసి సీతమ్మ అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ తెలియ‌క చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి ఇష్టప‌డ‌ లేదు. తన కార్యం విఫలమైతే సుగ్రీవుడు, రామ లక్ష్మణులు, మరెందరో హతాశులౌతారని బాధ‌ప‌డ్డాడు.చివరికి ప్రాణ‌త్యాగం చేసుకుందామ‌ని కూడా ఆలోచించాడు. సీతమ్మ జాడ కనిపెట్టకుండా తాను వెనుకకు వెళ్ళేది లేదని నిశ్చయంచుకొన్నాడు. ఆ సమయంలో అశోక వనం కనిపించింది.


నమోస్తు రామాయ సలక్ష్మణాయ,

 దేవ్యైచ తస్మై

 జనకాత్మజాయై, 

నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, 

నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని ప్రార్థించాడు.

 దేవతలు, మహర్షులు తనకు కార్య సాఫల్యత కూర్చాలని ప్రార్ధించాడు. బ్రహ్మ, అగ్ని, వాయుదేవుడు, ఇంద్రుడు, వరుణుడు, సూర్యచంద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, శివుడు, సకల భూతములు, శ్రీమహావిష్ణువు తనకు కార్యసిద్ధి కలిగించాల‌ని ప్రార్థించి సీతాన్వేషణకు చివ‌రి ప్ర‌య‌త్నంగా అశోకవనంలో అడుగుపెట్టాడు.


*అశోకవనంలో*

*సీతమ్మ దర్శనం*


అశోకవనం అనన్య సుందరమైనది. అందులో చక్కని వృక్షాలు, పూలు, చిత్ర విచిత్రాలైన కృతక పర్వతాలు, జలధారలు ఉన్నాయి. అక్క‌డ‌ అతి మనోహరమైన ఒక శింశుపా వృక్షాన్ని ఎక్కి హనుమంతుడు చుట్టుప్రక్కల పరిశీలింపసాగాడు.


అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భయంతో కృశించిన ఒక స్త్రీని చూశాడు..  ఆమె ధరించిన దుస్తులు, ఆమె తీరు, ఉన్న స్థితిని బట్టి హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. ఆమె దీనావస్థను, రామలక్ష్మణాదుల దుఃఖమును తలచుకొని, కాలం ఎంతటివారికైనా అతిక్రమింపరాని బలీయమైనది అనుకొని, హనుమంతుడు దుఃఖించాడు.


*త్రిజటాస్వప్నం*

అశోక‌వ‌నానికి రావ‌ణుడు వ‌చ్చాడు. సీతమ్మ‌ను బెదరించి, తనకు వశంకావాల‌ని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని, రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. పోగాలము దాపురించినందువల్లనే రావణుడికి ఈ నీచ సంకల్పం కలిగిందని హెచ్చరించింది. శ్రీరాముని బాణాగ్నికి లంక భస్మం కావ‌డం తథ్యమని రావణుడికి గట్టిగా చెప్పింది. ఒక నెల రోజుల గడువు పెట్టి రావణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతమ్మను నయానా, భయానా అంగీకరింపచేయాలని ప్రయత్నించ సాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదిరించారు. భయ విహ్వలయై, ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొన్నది.


వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీతవంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన ఒక క‌ల గురించి ఇలా  చెప్పింది .....

"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత కూర్చుని ఉంది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత, వారంతా పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు.

ఇంకో వైపు, రావణుడూ కలలో కనిపించాడు ."ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి, పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి అతనిని లాగుతున్న‌ట్టు ఉంది. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలం త్రాగుతూ, పిచ్చివారివలె లంకలో గంతులు వేస్తున్నారు."....ఇలాంటి దృశ్యాన్ని నేను క‌ల‌లో చూశాను అని త్రిజట చెప్పింది. ఇది లంక‌కు రాబోయే చేటుకాలాన్ని సూచిస్తున్న‌ద‌ని హెచ్చ‌రించింది.

ఇలా చెప్పి త్రిజట, తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని,ఆమే దిక్కు అని తక్కిన రాక్షస కాంతలకు హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.

త్రిజ‌ట త‌న స్వ‌ప్న వృత్తాంతాన్ని వివ‌రించ‌డం, హ‌నుమ చెట్టుపై నుంచి విన్నాడు.ఇక ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌నుకున్నాడు. అయితే ఒక్క‌సారిగా సీతమ్మకు వానర రూపంలో   కనిపిస్తే కంగారుప‌డుతుంద‌ని, ఆమె భయంతో కేక‌లు వేస్తే కాగ‌ల కార్యం చెడిపోతుంద‌ని గ్ర‌హించాడు. నెమ్మ‌దిగా రామ‌క‌థా గానం చెట్టుపైనుంచే ప్రారంభించాడు.

    

ఆ రాముడు సీతను వెదకడానికి పంపిన దూతలలో ఒకడైన తాను ప్రస్తుతం లంకను చేరి, చెట్టుపైనుండి, సీతను చూచానని ఆ కథాక్రమంలో తెలియజేశాడు. ఆ రామకథా శ్రవణంతో సీతమ్మ కొంత ఆనందించింది. కానీ తాను కలగంటున్నానేమోనని భ్రమ పడింది. తల పైకెత్తి, మెరుపు తీగవలె, అశోక పుష్పము వలె ప్రకాశిస్తున్న వానరుని చూచి కలవరపడింది. తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు, మహేంద్రునికి, బృహస్పతికి, అగ్నికి నమస్కరించింది. హనుమంతుడు మెల్లగా చెట్టు దిగివచ్చి ఆమెకు శుభం పలికాడు. సీతమ్మకు తన వృత్తాంతాన్ని, రాముని దుఃఖమునూ వివరించాడు. శ్రీరాముని పరాక్రమాన్నీ, గుణగణాలనూ ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీతమ్మ అంత దుఃఖంలోనూ, అందరి క్షేమసమాచారములు అడిగి తెలుసుకుని, ఆపై రాముని వర్ణించమని కోరింది.

 *శ్రీరామ సుందర రూప వర్ణనం*

హనుమంతుడు, భక్తితో అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించాడు. "రాముడు ఆజానుబాహుడు. కమల పత్రాక్షుడు. రూప దాక్షిణ్య సంపన్నుడు. శుభలక్షణములు గలవాడు, తేజోమూర్తి, ధర్మ రక్షకుడు, సర్వ విద్యాపారంగతుడు, లోకమర్యాదలను పాటించువాడు. సమ విభక్తములైన శరీరాంగములు కలవాడు. దీర్ఘములైన బాహువులు, శంఖమువంటి కంఠము కలవాడు.  ఉత్తముడు, వీరుడు. నల్లనివాడు. అతని తమ్ముడైన లక్ష్మణుడు అట్టి శుభలక్షణములే కలిగి, ఎర్రని మేని ఛాయ గలవాడు - అలాంటి రామలక్ష్మణులు నీ కోసం దుఃఖిస్తున్నారు త‌ల్లీ . సుగ్రీవునితో చెలిమి జేసి, నిన్ను వెదక‌టానికి నలువైపులా వానరులను పంపారు. ఓ సీతా మాతా! త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇక్క‌డినుండి తీసుకువెళ‌తాడు, మ‌న‌స్సు దిట‌వుచేసుకుని ఉండు" - అని హనుమంతుడు చెప్పాడు.


*హనుమంతుడికి* 

*చూడామణి ఇచ్చిన  సీత* :

శ్రీరాముని గురించి విని, సీత ఊరడిల్లింది. తరువాత హనుమంతుడు ఆమెకు శ్రీరాముని ఆనవాలైన అంగుళీయకమును ఇచ్చాడు. రాముడు చెప్పిన మాటలు తెలియజేశాడు. ఆమెకు శుభం పలికాడు. తనతో వస్తే ఆమెను తీసికొని వెళ్ళగలనని అన్నాడు. ఇంత చిన్నవానరం తనను ఎలా తీసుకువెళుతుందని సందేహించవద్దని చెప్పాడు. జై శ్రీరామ్ అంటూ ఆకాశం ఎత్తుకు ఎదిగి సీతమ్మకు నమస్కరించాడు.

సీతమ్మ హనుమంతుని పలుకులకు సంతోషించి అతని పరాక్రమాన్ని ప్రశంసించింది. కాని , స్వయంగా శ్రీరాముడే వచ్చి, రావణుని వధించి, తనను తీసికొని వెళ్ళాలని చెప్పింది. రాముని పరాక్రమానికి ముల్లోకాలలోను ఎదురు లేదని తెలిపింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, భల్లూక వానరులకు ధర్మక్రమ మనుసరించి కుశలం అడిగినట్లు తెలుపమని పలికింది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకుంటే తాను బ్రతుకనని చెప్పింది. ఆ మ‌హాస‌ముద్రాన్ని దాటడం హనుమంతుడు, వాయుదేవుడు, గరుత్మంతుడు తప్పఇతరులకు ఎలా సాధ్యమని సంశయించింది.


అందుకు హనుమంతుడు, తనకంటే గొప్పవారైన మహావీరులు వానరులలో ఎందరో ఉన్నారని, తాను సామాన్యుడను గనుకనే ముందుగా తనను దూత కార్యానికి -పంపారని ఆమెకు నచ్చచెప్పాడు. మహావీరులైన రామలక్ష్మణులు కపి భల్లూక సేనా సమేతంగా, త్వరలో లంకకు వచ్చి లంకను వాశనం చేసి రావణ సంహారం సాగించడం తథ్యమని ఆమెకు న‌చ్చ చెప్పాడు. హనుమంతుని సీతమ్మ ఆశీర్వదించింది.


యత్ర యత్ర రఘునాథ కీర్తనం

తత్ర తత్ర కృత మస్తకాంజలిం|

బాష్ప‌వారి పరిపూర్ణ లోచనం

మారుతిం నమత రాక్షసాంతకం||


          **

బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|

అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||

( ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరుప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు.)

   ***

     *(సుంద‌ర‌కాండ‌-*

*పరమపావన* *సీతాద‌ర్శ‌న‌ఘ‌ట్టం స‌మాప్తం)*


----------

కండువా

 *ఒక్క కండువా - ఎన్ని అర్ధాలో*


*ఎడమ  వైపు  వేసుకుంటే భార్య  జీవించి  ఉంది  అని  అర్ధం*


*కుడివైపు  వేసుకుంటే భార్య  చనిపోయింది  అని  అర్ధం*


*రెండువైపులా  వేసుకుంటే గౌరవ సూచకం* 


*నెత్తిమీద వేసుకుంటే  దివాలా  తీసినట్టు ,  లేదా  విచారంగా  ఉన్నట్టు* 


*తలకు  చుట్టుకుంటే పాగా  వేసేసినట్టు*


*ముఖం  చుట్టూ  కట్టుకుంటే  ఎండలో  గానీ  చలిలో  గానీ  రక్షణ  కల్పించుకున్నట్టు* 


*నడుముకు  చుట్టుకుంటే   వీరత్వం  ప్రదర్శిస్తున్నట్టు* 


*తలకు  చుట్టుకుని చెవులను  కవర్ చేసి   గడ్డం  దగ్గర  ముడి  వేస్తే  చలి  బారినుండి  రక్షించుకున్నట్టు* 


*తలకు  చుట్టుకుని  వెంక  ముడి  వేసి అంచులు  వేలాడదీస్తే   దుమ్మునుంది  రక్షణ  కల్పించుకున్నట్టు*


*తల  ముక్కులను  రెండూ  కవర్  చేస్తే  మీ  ముఖం  ఎవరూ  గురుతు  పట్టకూడదు అని  భావిస్తున్నట్టు*


*ముక్కును  మాత్రం  కవర్  చేస్తే  చాలా  అపరిశుభ్రమిన  వాతావరణం  లో  మీరు  ఉన్నట్టు*


*కూర్చుని కండువా  ఎడమ  భుజం  మీద  వేసుకుని   రెండు  చేతులతో  అంచులు  పట్టి  ఉంటె ఆశీస్సులు  కోరుతూ అక్షంతలు అర్దిస్తున్నట్టు*


*కూడా  బ్యాగ్ లేకపోతే, ఏదైనా  వస్తువు  మూటకట్టుకోడానికి ఉపయోగపడుతుంది.!!*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం  - షష్ఠి - రోహిణీ & మృగశిర -‌‌ గురు వాసరే* (03.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మనసు ప్రశాంతంగా ఉంటుంది

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️స్వార్థం లేని మనసు ప్రశాంతంగా ఉంటుంది..స్వార్థం లేని ప్రపంచం అనందమయంగా ఉంటుంది.. ఎప్పుడైతే మనకి ప్రియమైన వ్యక్తిని మనము బాధ పెట్టినప్పుడు క్షమించు అని అడగడానికి, అలాగే ఎప్పుడైతే మనకి ప్రియమైన వ్యక్తి మనలని క్షమించు అని అడిగి నప్పుడు వెంటనే అతని తప్పును క్షమించే మనసున్న మొదటి వ్యక్తిగా మనం ఉందాం🏵️ఇతరులు చూపించే ఓదార్పు కంటే మీరు వహించే ఓర్పు వేయి రేట్లు మేలు చేస్తుంది...ఓదార్పు ఎండమావి వంటిది.. ఓర్పు దప్పిక తీర్చే సెలయేరు వంటిది.. ఓదార్పు కోసం ఎదురు చూసే వారికీ జీవితం ఓటమికి దగ్గరగా ఉండే ఆటగాడి వలె కనిపిస్తుంది.. ఓర్పుతో సమస్యలను ఎదుర్కొనే వారికీ ఆటలో గెలిచే సత్తా ఉన్న ఆటగాడు కనిపిస్తాడు🏵️ఎంత దూరమైనా వెళ్లడం వేరు.. ఎంత దూరం వెళ్లాలో తెలియడం వేరు.. మొదటిది సహసం, రెండోవది వివేకం...ప్రతీ సమస్యని ఆటగా తీసుకోని పరిష్కరించుకోవాలి..గెలిస్తే అనందం వస్తుంది.. ఓడితే అనుభవం వస్తుంది.. గెలుపు గర్వవానికి పునాది వేస్తే, ఓటమి తెలివికి పునాది వేస్తుంది🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3.గోకవరం బస్టాండ్ దగ్గర .స్టేట్ బ్యాంక్ ఎదురుగా .రాజమండ్రి .వైద్యసలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా మందులు పంపబడను 9440893593 9182075510* 🙏🙏🙏

⚜ శ్రీ వెంకటాచలపతి ఆలయం

 🕉 మన గుడి : నెం 1069


⚜ కేరళ : త్రివేండ్రం 


⚜ శ్రీ వెంకటాచలపతి ఆలయం



💠 శ్రీ వెంకటాచలపతి దేవాలయం కేరళలోని త్రివేండ్రంలో ఉంది మరియు దీనిని శ్రీనివాసర్ కోవిల్, పెరుమాళ్ కోవిల్, అయ్యంగార్ కోవిల్ లేదా దేశికర్ సన్నిధి అని కూడా పిలుస్తారు. 


💠 వెంకటాచలపతి ఆలయం 1898లో నిర్మించబడింది మరియు అప్పటి నుండి ఈ ఆలయాన్ని సందర్శించడానికి అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వస్తుంటారు.


💠 శ్రీ వేంకటాచలపతి దేవాలయం కేరళలోని సర్వోనత వైష్ణవ వడగలై సంప్రదాయం (వైష్ణవులు)కి అంకితం చేయబడిన ఏకైక ఆలయం. అంతేకాకుండా, శ్రీ వేంకటాచలపతి ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి, వైకుంఠ ఏకాదశి, తిరు ఆదిపూరం మరియు ఆది స్వాతి వంటి వైష్ణవ పండుగలతో పాటు, పొంగల్, దీపావళి, విషు మరియు ఓనం వంటి ఇతర జాతీయ పండుగలు కూడా ప్రసిద్ధి చెందాయి.


🔆 ఆలయ చరిత్ర


💠 తిరుమల నాయకర్ రాజు పాలనలో ఒక సమూహం దేశం చుట్టూ తీర్థయాత్రకు వెళ్ళింది.

 వారి పర్యటనలో వారు దట్టమైన అడవి వద్ద ఆగారు. 

వంట కోసం బండిలోని రాయిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా కదలలేదు. 

వారిలో ఎవరైనా తప్పు చేసి ఉంటారని భావించి, వారు భగవంతుని కీర్తనలు పాడటం ప్రారంభించారు. 

రాయిని తొలగించలేని ప్రదేశంలో వెంకటాచలపతి దేవుడు ఉన్నాడని సమూహంలోని ఒక వ్యక్తి చెప్పాడు. అది విని ఆ రాయి చుట్టూ చిన్న మట్టి వేదిక చేసి దానిపై దీపం పెట్టి స్వామిని పూజించారు. 

తర్వాత తమ అనుభవాన్ని రాజుకు తెలియజేశారు. 


💠 రాజు వెంకటాచలపతికి ఆలయాన్ని నిర్మించి, రోజూ పూజలు చేసేవాడు. 

ఈ ఆలయ దైవం శ్రీ వేంకటాచలపతి. వీరవనల్లూర్‌కు చెందిన ఒక శ్రీరంగ అయ్యంగార్ సుమారు 100 సంవత్సరాల క్రితం తన ఇంటి సమీపంలోని చెరువులో విగ్రహాన్ని చూశారని చెబుతారు.


💠 'పాంచరాత్ర ఆగమం'లోని 'పద్మసంహితై' (మూడు సంహితలలో ఒకటి) ప్రకారం 40వ అజ్కియ సింగర్ శ్రీ రంగనాథ శతగోప యతీంద్ర మహదేశికర్ ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

 జీయర్ సూచనల మేరకు, శ్రీరంగ అయ్యంగార్ కుటుంబంలో పెద్ద కుమారుడు ఆలయ ప్రధాన పూజారి మరియు గత మూడు తరాలుగా దాని పరిపాలనా బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నాడు. 

ఆలయంలో నిత్య పూజలు వడగళై పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి.


💠 శ్రీ వేంకటాచలపతి ఆలయంలో భార్యాభర్తలు 9 విశిష్ట భంగిమల్లో ఉంటారు. ఆలయంలో పూజించబడే ఉప దేవతలలో నవనీత కృష్ణ, పెరియ తిరువడి ( గరుడ ) ఉన్నారు.

 

💠 ఒక పౌరాణిక కథనం ప్రకారం, ఒక రాజు ఈ పవిత్ర స్థలంలో భగవంతుడిని ప్రేమించినప్పటి నుండి కోల్పోయిన చూపును తిరిగి పొందాడు. 

ఇది విన్న భక్తులు వేలాదిగా ఆలయాన్ని సందర్శించడం ప్రారంభించారు.

 

💠 ఈ ఆలయం అన్ని రకాల మానవ సమస్యలను పరిష్కరిస్తుంది, ముఖ్యంగా ప్రజల జీవితంలో సూర్య మరియు చంద్ర గ్రహణాల నుండి ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరిస్తుంది.

 కొత్తగా పెళ్లయిన జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి మరియు సామరస్యం కోసం విజయదశమి రోజున ఆలయాన్ని సందర్శిస్తారు. 


💠 గర్భ గృహంలో ఆలయ ప్రధాన దైవం శ్రీ వేంకటాచలపతి పెరుమాళ్. గర్భగుడిలో అలమేలు మంగై తాయార్ మరియు పద్మాసిని తాయార్ విగ్రహాలు ఉన్నాయి. 

నవనీత కృష్ణర్ (సంతాన గోపాలన్), పెరియా తిరువడి మరియు గరుడర్ దేవతలకు కూడా ఆలయాలు ఉన్నాయి .


💠 ఈ ఆలయంలో అనేక శతాబ్దాల క్రితం ఈ భూమిని పాలించిన కులశేఖర ఆళ్వార్ విగ్రహం కూడా ఉంది. 

భక్తుడైన వైష్ణవుడు అయిన రాజుకు గౌరవ సూచకంగా, కులశేఖర ఆళ్వార్ విగ్రహంతో పాటు నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, బాష్యకారర్ ( రామానుజర్ ) విగ్రహాలు ఉన్న సన్నిధిని నిర్మించారు .



💠 ఈ ఆలయ ఆకర్షణీయమైన లక్షణం గరుడ వాహనం, ఇక్కడ గరుడ విగ్రహంపై ఉంచిన ప్రధాన దేవతను పద్మనాభస్వామి ఆలయంలో తీర్థవారి సమయంలో విష్ణువును బయటకు తీసి పల్లకిని పోలి ఉండే గొప్పగా అలంకరించబడిన పల్లకిపై ఊరేగింపుగా తీసుకువెళ్లతారు.

పురటాసి మాసంలోని అన్ని శనివారాల్లో గరుడవాహనం బయటకు తీస్తారు.


💠 మార్గశిర్షం మాసంలో ముఖ్యమైన పండుగ తిరుప్పావై పఠనం. 

ఈ పద్యాలను పెరుమాళ్ యొక్క ముఖ్యమైన భక్తురాలైన "అండాళ్" స్వరపరిచారు. 

దీని పక్కనే వైకుంట ఏకాదశి పండుగ వస్తుంది, దీనిలో పెరుమాళ్ శయన అలంగారంలో (తిరుప్ పార్కాడల్‌లో లాగా) దర్శనమిస్తారు.


💠 పులియోగరే (చింతపండు అన్నం), దధ్యోనం (పెరుగు అన్నం), పొంగల్, చక్కరై పొంగల్, ఎల్లోదరై (నువ్వుల అన్నం), ఖీర్, అమృత కలశం మరియు చక్కరై సుండాల్ వంటివి ఇక్కడ సమర్పించే నైవేద్యాలు



💠 ఆలయానికి 1 కి.మీ దూరంలో తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది.



రచన

©️ Santosh Kumar

15-17-గీతా మకరందము

 15-17-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - వారిరువురికంటెను వేఱైనట్టి ఉత్తమపురుషునిగూర్చి వచించుచున్నారు -


ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః |

యో లోకత్రయమావిశ్య 

బిభర్త్యవ్యయ ఈశ్వరః  || 


తాత్పర్యము:- ఎవడు మూడులోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో, అట్టి నాశరహితుడును, జగన్నియామకుడును, (పైనదెల్పిన క్షరాక్షరులిద్దఱికంటెను) వేఱైనవాడును నగు ఉత్తమపురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు.


వ్యాఖ్య:- పైన దెలిపిన నశ్వరదేహాభిమానికంటెను, చిత్ - ప్రతిబింబరూపుడగు జీవుని (మనస్సుయొక్క అభిమాని) కంటెను వేఱుగ ఆత్మ కలడు. ఆతడే ఉత్తమపురుషుడని యిట వచింపబడెను. ఏలయనిన, క్షణికమగు దేహము యొక్క అభిమాని కంటెను, బద్ధుడగు జీవుని (మనస్సు యొక్క అభిమాని) కంటెను ముక్తుడగు ఆత్మ శ్రేష్ఠుడుగదా! జీవుడు త్రిగుణసహితుడు. పరమాత్మ త్రిగుణరహితుడు, గుణాతీతుడు. ఇక్కారణమున ఆతడు తక్కిన ఇద్దఱు క్షరాక్షరపురుషులకంటెను ఉత్తముడుగ పరిగణింపబడి ‘ఉత్తమపురుషుడ'ని లేక పురుషోత్తముడని వ్యవహరింపబడుచున్నాడు.

ప్రపంచములో కొందఱు "దేహస్థితి” యందును, కొందఱు "జీవస్థితి”యందును ఉండుచుందురు. వారిరువురును సామాన్యపురుషులు, ఆత్మయందుండువాడే ఉత్తమ పురుషుడు. అట్టి ఉత్తమపురుషత్వమును, లేక పురుషోత్తమత్వమును సర్వులును ప్రయత్నపూర్వకముగ సంపాదించ వలయును. ఎల్లకాలములందును 'పురుష’ (జీవ) స్థితిలోనే అనగా  బద్ధజీవితములోనే యుండుట విజ్ఞులకు పాడికాదు. క్రమముగ దేహస్థితిని, జీవస్థితిని (మనస్స్థితి, పురుషస్థితి) దాటి సాక్షియగు ఆత్మయొక్క స్థితికి అనగా పురుషోత్తముని స్థితికి వచ్చినవాడే ధన్యుడు, సర్వశ్రేష్ఠుడు. అట్టి స్థితియే జీవితము యొక్క పరమావధి, పరమలక్ష్యము. దానిచే జన్మ సార్థకమగును. తక్కిన ఏయితర క్రియలచేతను ఈ మానవజన్మ సార్థకతను బొందలేదు.


"అన్యః” అని  చెప్పినందువలన పరమాత్మ దేహముయొక్క అభిమానికంటె జీవునికంటె (మనస్సుయొక్క అభిమానికంటె) వేఱుగనున్నాడని, వానికి సాక్షిగ వెలయుచున్నాడని తెలియుచున్నది. కాబట్టి జీవుడు ఆ దేహసంబంధ, జీవసంబంధ (మనస్సంబంధ) వికారములు తనకు వాస్తవముగ లేవని, తాను నిర్వికార అవ్యయ ఆత్మయని నిశ్చయముచేసికొని, అట్టి ఆత్మస్థితియందే సదా యుండులాగున అభ్యసించవలెను.

ఆ పరమాత్మ యెట్టివాడో తెలిసికొనినచో, ఆతని మహిమను ఎఱిగినచో, ఆతనిపై విశ్వాసము బాగుగ కలుగగలదు. ఇచ్చోట పరమాత్మకు రెండు విశేషణములు చెప్పబడినవి - అతడు (1) సర్వలోకధారకుడని (2) అవ్యయుడని. ముల్లోకములందును లెస్సగ ప్రవేశించి, అంతర్యామిరూపుడై వానిని భరించుచు, ఈశ్వరుడై యతడు వెలయుచున్నాడు. ముజ్జగంబులందును ఎల్లెడల ఆతడు నిండి నిబిడీకృతుడైయున్నాడు. మఱియు నాతడు అవ్యయుడు, నాశములేనివాడు. దేహాది దృశ్యపదార్థములన్నియు, తుట్టతుదకు చిత్ -  ప్రతిబింబరూపుడగు జీవుడున్ను ఒకానొక కాలమున అంతరించియే పోవుదురు (మోక్షప్రాప్తిసమయమున జీవత్వము తొలగిపోవును గావున). పరమాత్మయో ఏ కాలమందును నశింపడు; కావున అట్టి అవ్యయ ఆత్మపదముకొఱకే, పురుషోత్తమస్థితి కొఱకే సర్వులును ప్రయత్నించవలెను. క్షణికములగు అల్పప్రాపంచికవస్తువులకై,  పదవులకై  పరుగిడుట ఉత్తమము కాదు.


ప్రశ్న:- ఈ క్షరాక్షరములకంటె వేఱైన వాడెవడైనకలడా?

ఉత్తరము:- కలడు. ఆతడే ఉత్తమపురుషుడు (పురుషోత్తముడు).

ప్రశ్న:- ఆతడెట్టివాడు?

ఉత్తరము:- (1) ముల్లోకములందును ప్రవేశించి వానిని భరించువాడు. జగన్నియామకుడు. (2) నాశరహితుడు.

ప్రశ్న:- కాబట్టి ఫలితాంశమేమి?

ఉత్తరము:- క్షర (దేహ), అక్షర (జీవ) భావములనుదాటి పురుషోత్తమభావమును, లేక పరమాత్మ భావమును అవలంబించవలెను.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*336 వ రోజు*


*కౌరవశిబిరంలో విషాదచ్ఛాయలు*


కౌరవ శిబిరంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. సుయోధనుడు తనలో తాను ఇలా తర్కించుకున్నాడు. " అర్జునుడికి కోపం వచ్చిన దేవతలకే అలవి కాడు. ఇక ద్రోణుడు, కర్ణుడు ఎంత అని నేడు తేటతెల్లం అయింది. ద్రోణుడు, కర్ణుడు మమ్ము ఎంత ఆదుకొనవలెనని ప్రయత్నించినా అర్జునుడి ముందు శక్తిహీనులు అయ్యారు " అనుకుంటూ ద్రోణుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! ప్రతిరోజు యుద్ధంలో మనకు అపజయం పాండవులకు విజయం లభిస్తుంది. నా తమ్ములతో సహా అనేక యోధులు మరణించారు. ఆ శిఖండి కారణంగా మహాబలవంతుడైన భీష్ముడు పడిపోయాడు. మన సైన్యంలో ఏడు అక్షౌహినుల సైన్యం మరణించారు. సైంధవుడు మరణించాడు, మన కొరకు ప్రాణాలు లెక్క చేయక యుద్ధము చేయవచ్చిన రాజులు అసువులు బాసారు. ఇక నేను పాండవులను వధించి విజయం సాధించడమో లేక వీరస్వర్గం అలంకరించడమో మాత్రమే మిగిలి ఉంది . మరేదైనా మార్గం ఉంటే శలవివ్వండి. మీకు అర్జునుడు ప్రియశిష్యుడు ఆ కారణంగా అతడు చేజిక్కినా చంపక వదిలివేయడమే కాక అతడికి సాయం చేస్తున్నారు. కర్ణుడు ఎంతటి వీరుడైనా యుద్ధనైపుణ్యంలో కాని కార్య సాధనలో కాని మీకు సాటి రాడు. ఉపాయము అనుభము ఉన్న మీరు మాకు సహకరించడం లేదు. కర్ణుడు ఎంత ప్రయత్నించినా సైంధవుని రక్షించ లేక పోయాడు. సామర్ధ్యం కలిగిన మీరు కాపాడ లేదు " అన్నాడు.


*ద్రోణుని వ్యధ*


సుయోధనుడి ములుకుల వంటి మాటలకు నొచ్చుకున్నద్రోణుడు " సుయోధనా ! నా గుండెలు తూట్లు పొడిచే మాటలు ఎందుకు మాట్లాడతావు. కృష్ణుని సాయం ఉన్నంత వరకు అర్జునుడిని గెలవడం అసాధ్యమని నీకు ముందే చెప్పాను నీవు వినలేదు. దేవతలకే గెలువ శక్యము కాని భీష్ముని పడగొట్టిన అర్జునుడికి సాధ్యము కానిదేముంది. నేను నీ పక్షాన యుద్ధము చేస్తున్నది నా అభిమానం కాపాడు కోవడనికే కాని పాండవులను జయిస్తానని కాదు. సుయోధనా ! నాడు నిండు సభలో శకుని చేత పాచికలాడించి పాండవులను అనేక విధముల అవమానించి హింసించావు. నేడు ఆ పాచికలే అర్జునుడి బాణాలై నిన్ను బాధిస్తున్నాయి. వాటిని నిలువరించడం ఎవరి తరం చెప్పు. విదురుడు ఎంత చెప్పినా వినక నాడు పాండుసతిని కొలువు కూటముకు ఈడ్చి చేసిన అవమానం ఊరక పోతుందా ! ఆ వీరపత్నిని నిండు సభలో నీవు, దుశ్శాసనుడు, కర్ణుడు తూలనాడి అన్న మాటలు ఊరకే పోతాయా ! ప్రశస్త చరితులైన పాండుసుతులను అధికారమదంతో కళ్ళు నెత్తికెక్కి చేసిన అవమానం మీకు చెరుపు చేయదా ! సుయోధనా ! మీరు చేసిన అవమానములు సహించి అరణ్య అజ్ఞాత వాసం ముగించుకుని అంతా మరచి వారికి రావలసిన అర్ధభాగం అడిగితే నీవు కనికరం లేక నిర్ధాక్షిణ్యంగా నిరాకరించావు. ఇంత అధర్మవర్తనుడివైన నీ తరఫున యుద్ధం చేస్తున్న నేను ఒక బ్రాహ్మణుడినా ! నాది ఒక బ్రాహ్మణ జన్మా ! నేనంటే శకట వ్యూహం వద్ద ఉన్నాను సైంధవునికి సమీపంలో ఉన్న నువ్వు, కర్ణుడు మిగిలి యోధులు ఏమి చేసారు. నీవు వారందరిని మాటలతో ఎందుకు బాధించవు నన్ను మాత్రమే నిందుస్తున్నావెందుకు వారు నీకు కావలసిన వారు నేను కానా ! యుద్ధసమయంలో పాండవయోధులు వారి శరములతో బాధిస్తున్నారు అలసి వచ్చిన నా మనసును నీవు నీ మాటలతో బాధిస్తున్నావు ఇది నీకు న్యాయమా ! గతజల సేతుబంధన మేలనయ్యా ! రేపటి యుద్ధంలో మీరంతా వీరోచితంగా పోరాడండి. నా వంతుకు నేను పాంచాలురను వధిస్తాను. కావలసిన కార్యము మీద మనసుంచి సైన్యాలను యుద్ధోన్ముఖులను చెయ్యి. వారి మనసులో ఉత్సాహాన్ని నింపి నీవు కూడా నీ పరాక్రమము చూపు. రేపు నేను యుద్ధభూమికి వెళ్ళి జరగరానిది జరిగి తిరిగి రాకుంటే అశ్వత్థామ తట్టుకోలేడు. నా మాటగా అశ్వత్థామకు చెప్పు " నాయనా అశ్వత్థామా ! బ్రాహ్మణుల ఎడ, వృద్ధుల ఎడ భక్తి శ్రద్ధలు చూపుతూ ధర్మవర్తనుడవై మెలగుము. నేను చంపగా మిగిలిన పాంచాల వీరులను నీవు తుదముట్టించుము. ఇదే నా కడపటి సందేశం " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మానాభిమానములతొ

 *2055*

*కం*

మానాభిమానములతొ

మానవబంధముల కెల్ల మాటయె బలమౌ.

గానంబమృతంబౌ మరి

మౌనం బాభరణమౌను మనిషికి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మానాభిమానాలతో మానవ సంబంధాలకు మాడలే బలమవుతాయి. గానం అమృతమవుతుంది,కానీ మౌనం మనిషికి ఆభరణం కాగలదు.

*సందేశం*:--- అమృతతుల్యమైన గాత్రమును గానమిచ్చిన నూ మౌనం కంటే అది గొప్ప ఆభరణం కాలేదు.ఎందుకంటే మాటలతోనే ఎన్నో దగ్గర లు దూరాలు ఏర్పడగలవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శృంగేరి స్థల పురాణం

 *🪔శృంగేరి స్థల పురాణం 

శృంగేరి శారదాపీఠము :- 

🍃🍂🍃🍂🍃🍂 శృంగేరి జగద్గురువు శ్రీ శ్రీ భారతి తీర్థ స్వామి 75వ జయంతి సందర్భంగా ఈ కథనము

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

👉🏻 శ్రీశంకరులు తమ శిష్యులతో ఒకసారి తుంగానదీ తీరంలో సంచరిస్తూండగా ఒక దృశ్యం వారిని అబ్బుర పరిచింది. ఎండ వేడిమిని భరించలేక ఒక కప్ప అలమటిస్తుండగా, ఒక పాము పడగ విప్పి కప్పకు ఉపశమనము కలిగిస్తున్న దృత్యాన్ని చూసిన శంకరులు విస్మయానికి లోనయ్యారు. కప్ప సహజంగా పాముకు వైరి, ఆహారము. అయితే సహజ వైరాన్ని మరిచి పాము కప్పకు సహాయం చేస్తుండడము పూర్తిగా స్థల మాహాత్మ్యమే అని ఆయన గుర్తించారు.


ఇక తాను స్థాపించదలచిన పీఠాల్లో మొదటి పీఠాన్ని స్థాపించేందుకు సముచితమైన ప్రదేశం ఇదేనని నిర్ణయించి, అక్కడే ఒక శిలపై శ్రీ చక్రాన్ని లిఖించి సరస్వతీ మాతను, తల్లీ! శారద అనే పేరుతో ఈ ప్రదేశంలో స్థిరనివాసాన్ని ఏర్పర్చుకుని భక్తజనులను అనుగ్రహించాలని శంకరులు ప్రార్ధించారు. సరస్వతీ దేవి శంకరుల ప్రార్ధనను అంగీకరించి అనుగ్రహించింది. ఈ విధంగా శ్రీశారదాదేవిని ప్రధాన అధిష్టాన దేవతగా శంకరులు ప్రతిష్టించారు. శంకరులు నాడు స్థాపించిన పీఠమే శృంగేరి శ్రీ శారదాపీఠంగా ప్రసిద్ధమైంది. సంప్రదాయాన్ని అనుసరించి ఈ పీఠాన్ని దక్షిణామ్నాయ శృంగేరీ శ్రీ శారదా పీఠంగా పిలుస్తారు.


శ్రీశారదాపీఠానికి ప్రధాన వేదంగా యజుర్వేదాన్ని శంకరులు నిర్ణయించారు. ప్రదత్తమైన శ్రీ చంద్రమౌళీశ్వర సృటిక లింగాన్ని, శ్రీ రత్నగర్భ గణపతి విగ్రహాన్ని, మహామేరు యంత్రాన్ని నిత్యపూజకోసం శంకరులు అనుగ్రహించారు. మహామహిమాన్వితాలైన ఈ విగ్రహాలు పన్నెండు వందల ఏళ్ళుగా నేటికీ పీఠంలో పూజలు అందుకుంటున్నాయి. ఈ పీఠాన్ని నెలకొల్పిన తర్వాత శృంగేరీ క్షేత్ర రక్షణకై నాలుగు దిశల్లో నలుగురు దేవతలను క్షేత్రపాలకులుగా ఏర్పాటుచేశారు. తూర్పున కాలభైరవుడు, పడమర అంజనేయుడు, ఉత్తరాన కాళికాంబ, దక్షిణాన వనదుర్గా దేవిని శంకరులు స్వయంగా ప్రతిష్టించారు.

https://chat.whatsapp.com/LbYrKf7JokM6lc6MEhj5if

సాక్షాత్తు చతుర్ముఖుడైన బ్రహ్మదేవుని అవతారమూర్తులైన తమ ప్రియశిష్యుడు సురేశ్వరాచార్యులను శ్రీ శారదాపీఠం నిర్వహణకోసం ప్రధామాచార్యులుగా శంకరులు నియమించారు. ఈ పీఠం సుస్థిరంగా వర్ధిల్లుతుందని, భవిష్యత్తులో ఈ పీఠానికి అచార్యులుగా వెలుగొందేవారందరూ తమ అంశకలిగి ప్రకాశిస్తారని శంకరులు ఆశీర్వదించారు. ఆ మహనీయుని దివ్యవచనం మేరకు శృంగేరీ శ్రీశారదాపీఠం జగద్గురు పరంపర అపూర్వ విశిష్టతకు నిలయంగా విరాజిల్లుతోంది. సురేశ్వరాచార్యుల తర్వాత జగద్గురువర్యులుగా ఈ పీఠంలో విలసిల్లిన మహానీయులందరూ జ్ఞానమునులైన కరుణా సముద్రులు, మహా పండితులు. ఆదిశంకరుల దైవాంశ సంభూతులైన ఈ ఆచార్యులను స్వయంగా శ్రీ శంకరాచార్యులుగా ఆరాధించడం ఆనవాయితీ. ఈ అనుపమాన పరంపరలో 36వ శంకరాచార్యులుగా జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు, తత్కరకమల సంజాతులు జగద్గురు శ్రీశ్రీ విధుశేఖర భారతీ మహస్వామివారు ప్రస్తుతం పీఠం ఆచార్యవర్యులుగా విరాజిల్లుతూ భక్తజనులను తమ కరుణా పూర్ణ దృక్కులతో జనులను అనుగ్రహిస్తున్నారు.

💁‍♂️💁‍♂️💁‍♂️💁‍♂️💁‍♂️💁‍♂️💁‍♂️💁‍♂️💁‍♂️


🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱 గురు చరణం లో చేర దలచినవారు ఈ నెంబర్ కు మెసేజ్ పెట్టండి 9490860693

ఎవ్వారల మదిమెచ్చిన

 

*కం*

ఎవ్వారల మదిమెచ్చిన

దవ్వారలధర్మమయ్యు ధరణీతలమున్.

చివ్వున నీధర్మంబే

ఎవ్వరికైనను సరియన యేలదు సుజనా.

*భావం*:-- ఓ సుజనా!ఈ భూలోకంలో ఎవరికి నచ్చిన ది వారి ధర్మం గా మారుతుంది. నీకు నచ్చిన దే ఇతరులు కూడా పాటించవలసిన ధర్మం అని చెబితే అది సమంజసం కాదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ**

*కం*

నీమది మెచ్చిన వారికి

నీమనసున స్థానమీయ నెగడుదు వెపుడున్.

నీమది నిను నొచ్చుకొనెడి

యేమరులకు దూరముంచ యెదుగుదు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నీ మనస్సు ను మెచ్చుకునే వారి కి నీ మనస్సు లో స్థానమిస్తే వర్ధిల్లెదవు‌. నిన్ను నొచ్చుకొనేవారిని నీ మనస్సు నుండి దూరం చేసుకుంటే ఎదగగలవు.

*సందేశం*:-- కొందరు వారి మనసున వేరొకరి ని ఉంచుకుని వారి కి వీరు నచ్చకపోయిననూ వెంట బడెదరు.దాని వలన వీరి జీవితం వ్యర్థ మవుతుంది. కానీ వీరి మనస్సు ను మెచ్చుకొనే వారు కూడా ఖచ్చితంగా ఉంటారు. వారి పై మమతానురాగాలు పెంచుకుంటే జీవితం లో వర్ధిల్లగలరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

దక్షిణామూర్తి

 🚩🕉🙏ప్రతి ఇంటిలో దక్షిణామూర్తి యొక్క పటము ఖచ్చితంగా ఉండాలి. దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంటిలో పది నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణా మూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవు. దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటటు వంటి వారికి తెలియక చేసినటువంటి పాపములు నశిస్తాయి. వారికి రాబోవు కష్టములు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.  


ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖవిమోచనం. ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. వసిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మవిద్యను సంపాదించాడు.


🙏ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే 

🙏నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝  *జరాం మృత్యుం భయం వ్యాధిం*

        *యోజానాతి స పండితః*

         *స్వస్థ స్థిష్టే న్నిషీ దే ద్వా*

         *స్వపేద్వా కేనా చిద్ద సేత్*


తా𝕝𝕝 *అపాయములు, వ్యాధులు, ముసలితనము, మృత్యువు - ఇవన్నీ ఎవరికీ తప్పవు... కానీ యివి తప్పవని యెరిగి కూడా యెవ్వరూ గుర్తించి ప్రవర్తించరు. తెలుసుకొని ప్రవర్తించేవాడే పండితుడు*. *అట్టివానికి మనస్సు యెప్పుడూ ఆరోగ్యముగానే వుంటుంది. అతను సుఖంగా కూర్చుని వుంటాడు, నిద్రిస్తాడు, హాయిగా పరిహాసముగా మాట్లాడుతాడు..*


 ✍️🌹💐🪷🙏

కాలం ఒక ప్రవాహం.

 🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀


🙏 *కాలం ఒక ప్రవాహం....*🙏



✅  కాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నది తెలిసినవారు లేరు...


✅ పరమాత్మకు ఆదిమధ్యాంతాలు లేనట్లే కాలానికీ లేవు...


✅ సృష్టి నిర్మాణానికి మూడు తత్వాలు అవసరమని శాస్ర్తాలు చెప్తున్నాయి అవి:


1. *పరమాత్మ*

2. *శక్తి*

3. *కాలం*


✅ స్వయంగా పరమాత్మ కాలాతీతుడైనా సరే...

ఆయా ప్రత్యేక యుగంలో....

ఒక ప్రత్యేక కాలంలో ఆయన అవతరించినప్పుడు...

కాలానికి బద్ధుడయ్యే ఉంటాడు.


✅ కాలం విలువను అంచనా వేయడంలో... కాలమానాన్ని గణించడంలో భారతీయులది విలక్షణ దృష్టి...!


✅ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ రోజులు ఏర్పరుస్తుంది.  మార్చుతుంది కూడా.!


✅ అలాగే, సూర్యుడి చుట్టూ తిరుగుతోంది..! ప్రకృతిలో ఈ భ్రమణ..., పరిభ్రమణాలు ప్రకృతి నియమం..! పరమాత్మ ఆదేశం..!


✅ ఈ నియమం ఆధారంగానే ప్రాచీన భారతీయ ఋషులు కాలగణన చేశారు! 


✅ ఒక రోజు కాలగణనం...

సూర్యోదయం నుంచి మరునాటి సూర్యోదయం వరకు.....అహోరాత్రంగా గణించారు మన ప్రాచీన ఋషులు...


✅ అంతేకాదు, ఎన్నో వేల సంవత్సరాల నుంచే భారతీయులు.... అనుదినం తిథి-వార-నక్షత్ర-అయన-మాస-పక్షాలను స్మరించుకోవడం సంప్రదాయంగా వస్తోంది...

కాలమానానికి ఖగోళ ఆధారం తప్పనిసరి...!


✅ పాశ్చాత్యులు అయితే 15వ శతాబ్దం వరకు కూడా భూమి బల్లపరుపుగా ఉందని నమ్మారు..


✅ వారి కాలగణన తప్పుల తడక అన్నందుకే జైళ్లలో పెట్టి చంపించారు అక్కడి మత పెద్దలు...


✅ పాశ్చాత్యులు జరుపుకునే జనవరి ఫస్ట్ కు...ఎటువంటి ఖగోళ ఆధారమే లేదన్నది నిప్పులాంటి నిజం...


✅ అదే సమయంలో భారతీయులు ఆచరించే ఉగాది పండుగకు... ఖగోళ విజ్ఞానం, నియమబద్ధత, ప్రకృతి ధర్మం, ఆరోగ్య రహస్యాలు, ఆధ్యాత్మిక దృష్టి వంటి ఎన్నో ఉత్తమ లక్షణాలు కనిపిస్తాయి.



🙏 *సర్వేజనాః  సుఖినోభవంతు* 🙏



✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀