ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
7, అక్టోబర్ 2020, బుధవారం
🌷🌷ఆహారం🌷🌷
👏అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు.
మనలోని జీవశక్తి ని పెంపొందించేది అన్నం.
అయితే, ఈ అన్నాన్ని ఏ విధంగా, ఎక్కడ , ఎవరు వండి
వడ్డిస్తున్నారన్న
విషయం కూడా చాలా
ముఖ్యమైనది.
🥀🌹అందు వలననే పూర్వకాలంలో మడి, ఆచారాల విషయంలో
ఖచ్చితంగా వుండేవారు.
🌹🌿మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన
దోషాలు నిమిడివున్నాయి.
🥬అర్ధ దోషం ,. 🌻 నిమిత్త దోషం.
🌺స్ధాన దోషం, 🌷గుణ దోషం ,
🌹సంస్కార దోషం. ఈ ఐదు
దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.
🌸 *అర్ధ దోషం:*
ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు.
భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు . భోజనం చేసి ,
సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.
ఆ గదిలో నే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది ,
ఆ మూటలో నుండి
కొంచెం డబ్బు తీసుకుని
తన సంచీలో దాచేశాడు.
తరువాత శిష్యుని వద్ద
సెలవు తీసుకుని, తిరిగి
తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.
మరునాడు పూజా సమయంలో తను చేసిన
పనికి సిగ్గుతో పశ్చాత్తాపం
చెందాడా సాధువు.
తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే
తనకా దుర్బుధ్ధి కలిగిందని
రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు
అర్ధం చేసుకున్నాడు.
వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు.
శిష్యుడిని ఎలాటి వృత్తి ద్వారా డబ్బు
సంపాదిస్తున్నావని అడిగాడు.
శిష్యుడు తలవంచుకొని,
"నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు. "అని తలవంచుకొన్నాడు.
ఈ విధంగా సన్మార్గంలో
సంపాదించని డబ్బు తో
కొన్న పదార్థాలతో , తయారు చేసిన ఆహారం
భుజించడమే అర్ధ దోషం.
మనం న్యాయం గా సంపాదించిన దాని
తోనే ఆహారం తయారు
చేసుకుని , భుజించడం
ముఖ్యం.
*🌸నిమిత్త దోషం🌸*
మనం తినే ఆహారాన్ని
వండేవారు కూడా మంచి మనసు కలవారైవుఇంటికి
వారు సత్యశీలత కలిగి
దయ, ప్రేమ కల
మంచి స్వభావము కలిగిన వారిగా వుండాలి.
వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు , పక్షులు జంతువులు తాక కూడదు.
ఆహారం మీద దుమ్ము,
శిరోజాలు వంటివి పడ కూడదు.
🌹🥀అపరి శుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది.
దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి
దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి.
🌺 భీష్మాచార్యుల వారు కురు క్షేత్ర యుధ్ధం లో
బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య
మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు.
వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు.
🍁🌾అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది.ఇప్పుడు ఇంత వివేకం గా ఆలోచిస్తున్న భీష్ముడు
ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ,ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది.
🌸🌿ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు
'అమ్మా ! నేను అప్పుడు
దుర్యోధనుని, ప్రాపకంలో
వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను.
నా స్వీయ బుధ్ధిని ఆ
ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం బిందువులుగా
బయటికి పోయి, నేను
ఇప్పుడు పవిత్రుడినైనాను.
నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను.
అన్నాడు భీష్ముడు.
🌻🌿చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి
గుణములు నశించి
'నిమిత్త దోషం ' ఏర్పడుతోంది.
*🌸స్ధాన దోషం*
ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో,
అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి.
వంట చేసే సమయంలో
అనవసరమైన చర్చలు
వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది.
యుధ్ధరంగానికి , కోర్టులు ,రచ్చబండలు వున్న చోట్లలో వండిన
వంటలు అంత మంచివి కావు.
🥬🥀దుర్యోధనుడు ఒకసారి
యాభై ఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు.
కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును
నిరాకరించి, విదురుని
ఇంటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని
చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు
చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొట్రుపాటు పడిఅరటి పండుతొక్క ఒలిచి,
పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది.కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో
భుజించాడు.
ఇది చూసిన విదురుడు
భార్య వైపు కోపంగా చూశాడు.
కృష్ణుడు, " విదురా! నేను ఆప్యాయత తో కూడిన ప్రేమకోసమే ఎదురుచూస్తున్నాను.
నిజమైన శ్రధ్ధాభక్తులతో యిచ్చినది అది
కాయైనా , పండైనా, ఆకైనా, నీరైనా, ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను.' అని
అన్నాడు.
మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో
వడ్డించాలి.
*🌻గుణ దోషం :*
మనం వండే ఆహారం
సాత్విక ఆహారంగా వుండాలి.
సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని
కలిగిస్తుంది. రజోగుణం
కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది. తామస ఆహారం👏👏👏
🌷సర్వేజనాః సుఖినోభవంతు🌷
జ్ఞాపక శక్తిని ప్రసాదించు శ్రీ శారదా స్తోత్రం.
చదువులో పిల్లలకు జ్ఞాపక శక్తి ని పెంచాలంటే శ్రీ శారదాదేవి స్తోత్రం తెల్లవారు జామున 5 గంటల సమయంలో శుచిగా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో జపించవలెను.శారదాదేవి స్తోత్ర మంత్ర పఠనం మీలో జ్ఞాపకశక్తిని,మనోధైర్యాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది.
శారదా దేవి స్తోత్ర మంత్రాలలో ఉండే అక్షరాలు కలిగించే ప్రతి ధ్వని మానవుల మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతాయి.మంత్రోచ్ఛారణ ద్వారా వచ్చే ధ్వని మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది.
శారదా స్తోత్ర మంత్రాలను చదవడం వల్ల మనలోనున్న చైతన్యం అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి.
*నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని |
త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే *
*యా శ్రద్ధా ధారణా మేధా వగ్దేవీ విధివల్లభా |
భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ* ||
నమామి యామినీం నాథలేఖాలంకృత కుంతలామ్ |
భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీమ్ ||
భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః |
వేద,వేదాంగవేదాంతవిద్యాస్థానేభ్య ఏవ చ ||
బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ |
సర్వవిద్యాధిదేవీ యాతస్యై వాణ్యై నమో నమః ||
యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్ |
జ్ఞానాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః ||
యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవత్సదా
యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమో నమః || 💐🕉️💐🌸🕉️🌸🕉️🌺🕉️🌺🕉️🌹
శ్రీదుర్గాసప్తశ్లోకీ
శ్రీమార్కండేయ పురాణాంతర్గతమైన 700 శ్లోకాలు గల #దుర్గాసప్తసతి ని (చండీపారాయణం)ను అందరూ చదవలేరు!?
కానీ..రోజూ. ఈ #సప్తశ్లోకీస్తోత్రమును చదివితే.. #దుర్గాసప్తసతిపారాయణ చేసినంత ఫలితాన్ని పొందుతారు!!
ఓం అస్యశ్రీ దుర్గా సప్త శ్లోకీ స్తోత్రమంత్రస్య,
నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః,
మహంకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వత్యో దేవతాః, శ్రీ దుర్గాంబా ప్రీత్యర్థం..
సప్త శ్లోకీ దుర్గా పాఠే జపే వినియోగః !!
1- ఓం జ్ఞానినా మపి చేతాంసి దేవీ భగవతీ హి సా !
బలాదా కృష్యమోహాయ మహామాయా ప్రయచ్ఛతి !!
2- ఓం దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః,
స్వస్థైః స్మృతా మతిమతీవ శుభామ్ దదాసి !
దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా,
సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా !!
3- ఓం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే !!
4- ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే !
సర్వస్యార్తి హరే దేవీ నారాయణీ నమోస్తుతే !!
5- ఓం సర్వ స్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే !
భయేభ్య స్త్రాహినో దేవీ దుర్గే దేవీ నమోస్తుతే !!
6- ఓం రోగా నశేషా నపహంసి తుష్టా
రుష్టాతు కామాన్ సకలా నభీష్టాన్ !
త్వా మాశ్రితానాం న విపన్నరాణాం
త్వా మాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి !!
7- ఓం సర్వబాధా ప్రశమనం త్రైలోక్య స్యాఖిలేశ్వరీ !
ఏవమేవ త్వయాకార్యం అస్మద్వైరి వినాశనం !!
-: ఓం శాంతిః శాంతిః శాంతిః :-
మార్కండేయ పురాణంలో నున్న
" #చండీసప్తశతి " (- దేవీ మహాత్యము)
700 ల మంత్రపూరిత శ్లోకాలలో ఏడింటినీ ఏర్చి కూర్చి (7) శక్తివంతమైన మంత్రాలతో సులభమైన సూక్ష్మమైన " #మంత్రరాజం " ను
మన ఋషులు తయారు చేశారు.
సర్వ శక్తి స్వరూపిణి , సకల దేవతా స్వరూపిణి యైన ఆ దుర్గా పరమేశ్వరీ దేవి మధుకైటభ,
మహిషాసుర, చండ-ముండ, ధూమ్రాక్ష, రక్తబీజ, శుంబ-నిశుంబాది రాక్షసులను సంహారం చేసింది!!
అందరూ దేవతలు కలసి అమ్మను వేడుకున్నారు!! అమ్మా !..ధర్మానికి హాని తలపెట్టే ఆసురీ శక్తులను నాశనం చేసి దైవిక శక్తులకు తోడుగా వుండమ్మా! అని దుర్గా సప్త శతి లో పై మంత్రములతో వేడుకున్నారు!!
#ఫలశృతి
నిత్యం ఈ ఏడు శ్లోకాలను ఎవరైతే పఠిస్తారో
వారిని రక్షించే భారం అమ్మ స్వీకరిస్తుంది!!
సకల గ్రహ బాధలు ఈతిబాధలు తొలగుతాయి!! సకల శత్రుబాధలు తొలగుతాయి!! దారిద్ర్యాన్ని దూరం చేసి దేనికి లోటు లేకుండగ అమ్మ సకల ఐశ్వర్యములను ప్రసాదిస్తుంది!! సందేహం లేదు!! మా స్వానుభవముతో చెబుతున్న మాటలు!! #అమ్మదయఉంటేఅన్నీమనవెంటే!!
#ఓందుందుర్గాయైనమః..!!
*నేను...బాలు..కొన్ని జ్ఞాపకాలు
కైలాసంలో... శివతాండవం ఆగింది...! డమరుకం పేలింది...! రుద్రాక్ష రాలింది...!
ఏకబిల్వమ్... శివార్పణం అయిపోయింది!!
సింహపురిలో శివకేశవులిద్దరిమీదా హరికథలు చెప్పుకుంటూ ఏడాదికి ఒకసారి త్యాగరాజ ఆరాధనోత్సవాలు సమయంలో ఉంఛవృత్తి చేసి, పరమపవిత్రమైన జీవితం గడుపుకుంటున్న శ్రీపతి పండితారాధ్యుల సాంబ మూర్తి, శకుంతలగారి ఇంట బంగారు పంట... బాలు.
· · ·
ఎస్.పి.బి... అనే బీజాక్షర సహిత పుంభావ సరస స్వర సరస్వతితో నా జ్ఞాపకాలు....
· · ·
తొలి పరిచయం... నిడదవోలులో.... జవ్వాది రామారావు గారి కళాసంస్థ.... మా ‘కొక్కొరొక్కో’ నాటిక వేసిన సందర్భంలో మాకు ప్రథమ బహుమతి వస్తే... ముఖ్య అతిథి అయిన బాలు గారు నన్ను, తల్లావజ్‌ఝల సుందరాన్ని కావలించుకుని ‘‘మీలాంటి వాళ్ళు ఉండాల్సింది హైదరాబాదులో కాదు.... అర్జెం టుగా మద్రాస్ రండి’’ అని ప్రోత్సహిం చిన సంస్కారి.
· · ·
‘కళాసాగర్’ నాటక పోటీల్లో; ప్రథమ బహుమతి మళ్ళీ ‘కొక్కొరొక్కో’కి వస్తే... ‘‘వీళ్ళు సామాన్యులు కాదు’’ అని... నేను, సుందరం స్టేజి ఎక్కి బహుమతి అందుకునే వరకూ ఆడిటోరియంలో అందరి చేత చప్పట్లు కొట్టించిన సహృదయుడు బాలు.
· · ·
నా మొదటి చిత్రం ‘కంచు కవచం’ రికార్డింగ్.... నేను డైలాగ్స్ రాసిన సినిమా లో వేటూరి రచన, బాలు పాట .... అలా చూస్తూ ఉండిపోయా... నా కల పాటై బాలు నోట వినిపిస్తోంది. కాళ్ళకు దణ్ణం పెడితే; గుండెలకు హత్తుకుని... ఎత్తుకుని నెత్తినెట్టుకునే మనిషి!
· · ·
తర్వాత.... వంశీ– ఇళయరాజా గారి కాంబినేషన్లో ఎన్ని పాటలు... ‘ఆలాపన’, ‘లేడీస్ టైలర్’, ‘శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’, ‘చెట్టు కింద ప్లీడర్’లోని ‘చల్తీ కా నామ్ గాడి, చలాకి వన్నెలేడి’...! ఎన్ని రికార్డింగ్ థియేటర్లలో పలకరింపుతో కలిసి బాతాఖానీలో.... టిఫిన్సో్ల. తమాషా ఏమిటంటే సింగర్లు తిండి, నీళ్ళ విషయంలో పరమ జాగ్రత్తగా ఉంటారు... బాలుకు అదేమీ లేదు. గుప్పెడు వక్కపొడి, ఎప్పుడైనా సిగరెట్, కుదిరితే తాంబూలం. గొంతును ఈశ్వరుడికి ఎల్.ఐ.సి చేసినట్టుండేవాడు.
· · ·
నేను బాలు కలిసి కొన్ని సినిమాల్లో నటించే సమయాల్లో నా సాహిత్యం, ముఖ్యంగా ‘ఆటగదరా శివ’, ’శభాష్ రా శంకరా’ విని ముగ్ధుడైపోయేవాడు. ‘శభాష్ రా శంకరా’ సీడీని శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యానికి అంకితం ఇస్తూ... ‘భాషా శ్రీపతికి... పాటల పండితుడికి... సుబ్బరమైన బాలుడికి...’ అని చమత్కరిం చాను...
· · ·
కొత్తగా రాసిన ‘శివ చిలకలు’ అనే శివతత్వాలను వినిపించి, వీటిని మీరు పాడాలి అంటే... కన్నీరు నిండిన కళ్ళతో, ‘వద్దు భరణి, వీటికి నీ గొంతే కరెక్ట్.... కొంచం ‘రా’ గా ఉంటే మంచిది.... శుభం భూయాత్‘ అన్నాడు.
· · ·
నేను, జనార్దన మహర్షి అమీర్‌పేట్‌లో కొనుక్కున్న మొదటి 2 బెడ్ రూమ్ ఫ్లాట్ గృహప్రవేశానికి పిలిస్తే వచ్చి, మాతో భోజనం చేసి, సరదాగా గడిపి వెళ్తే... మా బంధువులంతా అలా అవాక్కయి చూస్తూ ఉండిపోయారు...
‘బాలు మా ఇంట్లో అడుగు పెట్టేడంటే సాక్ష్యాత్తు ఆ సుభ్రహ్మణ్య స్వామే వచ్చినట్టు పొంగిపోయాం‘.
· · ·
ఆస్ట్రేలియాలో ఉండే కోడూరి రామమూర్తి గారు బాలుకి, నాకు కామన్ ఫ్రెండ్. బాలు ‘భగవద్గిత’ పాడేరు... (ఈ సంగతి చాలా మందికి తెలీదు). సి. నారాయణ రెడ్డిగారు, మిగతా ప్రముఖులు ముఖ్య అతిధులుగా చాలా వైభవంగా ‘సత్య సాయి నిగమాగమంలో’ ఆవిష్కరణ జరిగింది... ఆ కార్యక్రమానికి నేనే యాంకర్‌ని. కానీ అదెందుకో పాపులర్ కాలేదు. బహుశా భగవద్గీతను ఘంటసాల మాష్టారుకి, బిల్వాష్టకాన్ని బాలుగారికి కేటాయించాడేమో ఆ పరమేశ్వరుడు.
· · ·
నా 25 సంవత్సరాల సినీ యాత్రని ‘వెండి పండగ’ పేరుతో రవీంద్ర భారతిలో సంగం అకాడమీ సంజయ్ కిశోర్ నిర్వహిస్తే చాలామంది సినీ ప్రముఖులు వచ్చారు. చివరిగా బాలు అడక్కుండానే భక్త కన్నప్పలో పద్యాలు పాడి, ప్రేక్షకులంతా ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చేలా చేసి తన వాత్సల్యాన్ని ప్రకటించాడు. వెండిపండగ నాడు నాకదో బంగారు బహుమతి.
· · ·
ఒకసారి చెన్నైలో బాలు గారి ఇంట్లో చరణ్ తియ్యబోయే ఒక ఆర్ట్ సినిమా గురించి చర్చించుకున్నాం. అక్కడే డిన్నర్ చేసి మీద దిగి వస్తుం డగా, కాలు జారి, నా బొటనవేలు ఫ్రాక్చర్ అయ్యింది. హైదరాబాద్ వచ్చాకా దాదాపుగా ప్రతిరోజా ఫోన్ చేసి ‘కాలు ఎలా ఉంది భరణి’ అని తగ్గేవరకూ పరామర్శిస్తూ ఉండేవాడు ఆయన.
· · ·
మేమెప్పుడూ కలిసినా తరచూ వేటూరి వారి సాహిత్యంలో చమక్కుల్నీ, ఆ భాషా సౌందర్యాన్ని, భావ శబలతని తల్చుకుని మురిసిపోతూ ఉండేవాళ్ళం. ‘వేటూరి వంటి వారు వెయ్యేళ్ళకోసారి పుడతారేమో’ అని నేనంటే... ‘మా అందరి ఆయుష్షు పోసుకుని నువ్వు వెయ్యేళ్ళు బతకాలయ్యా సుందరయ్యా’ అని అంటుండేవాడు బాలు.
మేము నీ విషయంలో అదే కోరుకున్నాంగా... కానీ ఏది? దెబ్బకొట్టేశావుగా బాలు!
· · ·
ఇక ‘మిథునం’ సినిమా అనుకున్నప్పుడు మొదట అప్పదాసు వేషం నేను వేద్దామని అనుకుని, చాలా మంది హీరోయిన్లు అంటే హిందీ రేఖ... సుహాసిని... రాధిక... వై. విజయ... శైలజ (బాలు గారి చెల్లి), మృణాళిని (రచయిత్రి) ఇలా చాలామందిని అనుకున్నాకా... లక్ష్మి గారు, బాలు ఫిక్స్ అయ్యారు.
బాలు గారికి కథ వినిపిస్తే బావుందని మెచ్చుకుని ‘ఔను, నువ్వూ నటుడివే కదయ్యా! ఇంత మంచి పాత్ర నువ్వే వెయ్యచ్చుగా’ అన్నాడు. అప్పుడు నేనన్నాను ‘స్వామీ నేనే రాసి, నేనే వేసి, నేనే తీస్తే, చివరికి నేనే చూసుకోవాల్సొస్తుందేమో’ అంటే నవ్వేసి చాలా తక్కువ పారితోషికం తీసుకొని అప్పదాసు పాత్రకి జీవం పోశాడు.
· · ·
‘మిథునం’ నిర్మాత ముయిద ఆనందరావు గారి ఊరు వావిలవలసలో షూటింగ్. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర మూడు నెలల ముందు నుంచే అక్కడికి వెళ్ళి, ఆ పాడుబడ్డ పెంకుటింటిని సరిచేసి, అక్కడ నేను చెప్పిన అన్ని మొక్కలనీ పెంచి... సర్వాంగ సుందరంగా, పరమ సహజంగా తీర్చిదిద్దాడు. బాలుగారు లొకేషన్ చూడగానే వాళ్ళావిడ సావిత్రి గారితో ‘మనం రిటైర్ అయ్యాకా ఇలాంటి పర్ణశాలలో ఉండాలోయి’ అన్నాడు.
ఏది బాలూ? ఆవిడ సావిత్రే ... నువ్వే పేద్ద సత్యవంతుడివి.... మాట తప్పావు!!!
· · ·
రోజూ మధ్యాహ్నం బ్రేక్ చెప్పగానే తోటలో ఒక బెండకాయని కొరుక్కు తింటూ ఉండేవాడు. ‘ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి పచ్చివి తింటూ ఉండాలయ్యా’ అని ముచ్చట పడుతూ ఉండేవాడు. బాలుని సంతోషపెడదామని ప్రత్యేకంగా ఒక వంట మనిషిని పెట్టి వండిస్తే సాయంత్రం ఆయన నవ్వుతూ, ‘నువ్వు ప్రేమ చేత అన్నీ వండించేవు గానీ, నేను రెండు గరిటెల కన్నా ఎక్కువ తినకూడదయ్యా.... బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాగా’ అన్నాడు. నేను ఎంత బాధపడ్డానో! కడుపునిండా అన్నం పెట్టేమన్న తృప్తి కూడా లేకుండా పోయింది అప్పదాసూ!!
· · ·
బాలు, లక్ష్మి గార్లిద్దరూ పొద్దున్నే 8 గంటలకు వచ్చేసేవారు లొకేషన్‌కి. ఒంటిగంటకు బ్రేక్. మళ్ళీ 3 గంటలకే షూటింగ్. 6 గంటలకి పేక్ అప్. క్లైమాక్స్ మాత్రం ఒకటి, రెండు రోజులు అర్ధరాత్రి వరకూ జరిగింది... ఇద్దరూ విసుక్కున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్ర ప్రసాద్‌ని బాలు కేకలేశాడు కూడా! సినిమా చూశాక, కెమెరామ్యాన్‌కి సభాముఖంగా సారీ చెప్పి కావలించుకున్నాడు. దట్ ఈజ్ బాలు!
· · ·
షూటింగ్ చివరిరోజుల్లో ఒక సీన్ పొరపాటున డ్రెస్ మార్చి, మళ్ళీ తియ్యాల్సొచ్చింది. ఆయనకీ కోపం వచ్చి లొకేషన్‌లో అన్యాపదేశంగా అసిస్టెంట్ డైరెక్టర్లని కేకలేశాడు. తప్పెవరు చేసినా బాధ్యత దర్శకుడిగా నాదే కదా... నేను హర్ట్ అయ్యాను... రాత్రి కన్నీళ్ళు పెట్టుకున్నాను. రెండు రోజులు మేము మాట్లాడుకోలేదు.
సినిమా అయిపోయింది. నేను ప్యాక్ అప్ చెప్పేశాను.
ఆయన్ని సాగనంపడానికి ముభావంగా కార్ దగ్గరకొచ్చాను. ఆయన చొక్కా పట్టుకు లాగి, కావలించుకున్నారు. నేను గాఢంగా కావలించుకుని ఏడ్చేశాను. నన్ను సముదాయిస్తూ, ‘చాలా గొప్ప సినిమా తీశావు భరణీ! పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా తీశావు. నీకు అఖండమైన పేరొస్తుంది. నీతో పాటు నాకూనూ‘ అన్నాడు. కాళ్ళ మీద పడిపోతే లేవనెత్తి ముద్దెట్టుకున్నాడు. ఆ ముద్దే నాకు ఆస్కార్ అవార్డు!
· · ·
ఈ సినిమాలో టైటిల్ సాంగ్ బాలు గారితో కాకుండా జేసుదాస్ గారితో పాడించాడు వీణాపాణి. షూటింగ్ టైంలో ఆ సంగతి బాలుకి చెప్పలేదు. షూటింగ్ చివర రోజున వినిపిస్తే ‘నా కోసం మా అన్న పాడేడా!’ అని పరమానందపడిపోయాడు. సినిమా రిలీజ్ అయిన తరువాత ఒకసారి నాతో ఇలా అన్నాడు ‘ఎప్పుడైనా నేను జీవిత చరిత్ర రాస్తే ‘మిథునా’నికి ముందు, ‘మిథునా’నికి తరువాత’ అని... అంతకన్నా ఏ దర్శకుడికైనా ఏం ప్రశంస ఉంటుంది? శ్రీపతితో కలయిక... ఐశ్వర్యం. పండితారాధ్యుడితో పరిచయం... యోగం. బాలసుబ్రహ్మణ్యంతో స్నేహం... వ్యసనం...
· · ·
ఇదీ కైలాసమే!
కనకమహాసభ... ఐశ్వర్యానికి నిలయం...
మొత్తం బంగారంతో మెరిసిపోతోంది. అంతెత్తు వెండి నంది తన ఉచ్ఛ్వాస, నిస్వాసాలతో బంగారు ఉయ్యాల ఊపుతోంది. ఆదిదంపతులిద్దరూ కూర్చున్నారు. ఒకవైపు అమ్మవారు...మరోవైపు అయ్యవారు.
పార్వతీదేవి ఒళ్ళో నెల‘బాలుణ్ణి’ ఒద్దికగా బజ్జోపెట్టుకుని జోల పాడుతున్న హేల! చిరునవ్వుతో కన్నులరమూసిన పరమేశ్వరుడి లీల!
వ్యాసకర్త : తనికెళ్ల భరణి, ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు
#తుంగభద్ర #పుష్కరాలు
20- 11 - 2020 నుండి డిసెంబర్ 1 - 2020 వరకు తుంగభద్ర పుష్కరాలు తుంగభద్రా నదీతీరంలో విశేష ఆలయాలు గురించి..
పన్నెండేళ్ళకోసారి వచ్చేది పుష్కరం. పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాలు శ్రీ శార్వరి నామ సంవత్సరంలో జరుగనున్నాయి. 2008 లో ఈ నదికి పుష్కరాలు జరిగాయి. మళ్ళీ 12 ఏళ్ళతర్వాత 2020 నవంబరు 20 నుంచి డిసెంబరు ఒకటి వరకూ తుంగభద్రమ్మకు పుష్కరాలు జరుగనున్నాయి.
తుంగభద్రమ్మ నడక ఇలా
కర్నాటక ఎగువ భాగాన తుంగ , భద్ర నదుల సంగమమే తుంగభద్ర నది. రాష్ట్రంలో కౌతాళం మండలం మేళగనూరు వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది. నదీ తీరంలో కొలువుదీరిన దేవతలను తాకుతూ సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది. 2008లో తుంగభద్ర నదికి పుష్కరాలు జరిగాయి. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో ప్రస్తుతానికి తుంగభద్ర జలాశయం నిండుగా ఉంది. కౌతాళం , కొసిగి , మంత్రాలయం , నందవరం , సి.బెళగళ్ , గూడూరు మండలాలతో పాటు కర్నూలు నగరం వరకు 107 కిలోమీటర్ల మేర తుంగభద్రమ్మ నదీతీర ప్రాంతంఉంది.
పుష్కరాలు ఎప్పుడు వస్తాయి?
ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించేటప్పుడు ప్రతీ నదికి పుష్కరాలు జరుపుతారు. అందుకే 12 నదులను పుష్కర నదులని , 12 రోజుల పాటు జరిగే ప్రక్రియను పుష్కరాలని జరుపుకుంటారు. నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు 27 , తొమ్మిది పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడతాయి. గురువు మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో బ్రహ్మ , బృహస్పతి , పుష్కరుడు , నదీ దేవతతో పాటు ముక్కోటి దేవతలు ఆ నదీజలంలో కొలువై ఉంటారని ప్రతీతి. ఇక శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి శక్తి ఉంటుంది.
ప్రత్యేకత గల ఆలయాలు
కర్నూలు జిల్లాలో తుంగభద్రానది ముందుగా మేళిగనూరు వద్ద రామలింగేశ్వరస్వామి ఆలయాలన్ని తాకి వస్తుంది. స్వామి ఆలయం నదీతీరంలో ఉంది. కోసిగిలో ఆర్డీఎస్ ఆనకట్ట , అనంతరం మంత్రాలయం మండలంలో రాంపురం రామలింగేశ్వర స్వామి ఆలయం , మాధవరం వద్ద నదిలోనే ఓ శివాలయం ఉంది. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి ఆలయాలను తాకుతూ , దిగువన గురజాల ఇసుక రామలింగేశ్వర స్వామి ఆలయం మీదుగా కర్నూలు చేరుకుంటుంది.
తెలంగాణ , కర్నాటక రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి చేరుకుని పుణ్యస్నానాలు చేస్తారు. సి.బెళగల్ మండలం సంగాల వద్ద ఈశ్వరాలయం ప్రసిద్ధి.....
భూమి కొలతలు
1) ఒక ఎకరాకు = 40 గుంటలు
2) ఒక ఎకరాకు = 4840 Syd
3) ఒక ఎకరాకు = 43,560 Sft
4) ఒక గుంటకు = 121 Syd
5) ఒక గుంటకు = 1089 Sft
6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09
చదరపు ఫీట్లు
7) 121 x 09 = 1089 Sft
8) 4840 Syd x 09 = 43,560 Sft
9) ఒక సెంట్ కు = 48.4 Syd
10) ఒక సెంట్ కు = 435.6 Sft
Land servay కోసం అత్యవసరమైన information...
*Common Terminology in Revenue Department*
*గ్రామ కంఠం :
గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.
*అసైన్డ్‌భూమి :
భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.
*ఆయకట్టు :
ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.
*బంజరు భూమి (బంచరామి) :
గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.
*అగ్రహారం :
పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.
*దేవళ్ ఇనాం :
దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.
*అడంగల్ (పహాణీ) :
గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.
*తరి : సాగు భూమి
*ఖుష్కీ : మెట్ట ప్రాంతం
*గెట్టు : పొలం హద్దు
*కౌల్దార్ : భూమిని కౌలుకు తీసకునేవాడు
*కమతం : భూమి విస్తీర్ణం
*ఇలాకా : ప్రాంతం
*ఇనాం : సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి
*బాలోతా ఇనాం :
భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి
*సర్ఫేఖాస్ : నిజాం నవాబు సొంత భూమి
*సీలింగ్ : భూ గరిష్ఠ పరిమితి
*సర్వే నంబర్ : భూముల గుర్తింపు కోసం కేటాయించేది
*నక్షా : భూముల వివరాలు తెలిపే చిత్రపటం
*కబ్జాదార్ : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి
*ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) :
భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.
*ఫీల్డ్ మెజర్‌మెంట్ (ఎఫ్‌ఎంబీ) బుక్ :
దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.
*బందోబస్తు :
వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.
*బీ మెమో :
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.
*పోరంబోకు :
భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.
*ఫైసల్ పట్టీ :
బదిలీ రిజిస్టర్
*చౌఫస్లా :
ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.
*డైగ్లాట్ :
తెలుగు, ఇంగ్లిఫ్ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్.
*విరాసత్/ఫౌతి :
భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.
*కాస్తు :
సాగు చేయడం
*మింజుములే :
మొత్తం భూమి.
*మార్ట్‌గేజ్ :
రుణం కోసం భూమిని కుదవపెట్టడం.
*మోకా :
క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్).
*పట్టాదారు పాస్ పుస్తకం :
రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.
*టైటిల్ డీడ్ :
భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.
*ఆర్వోఆర్ (రికార్డ్స్ ఆఫ్ రైట్స్) :
భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్.
*ఆర్‌ఎస్సార్ :
రీ సెటిల్‌మెంట్ రిజిస్టర్ లేదా శాశ్వత ఏ రిజిస్టర్.
*పర్మినెంట్ రిజిస్టర్ :
సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్. సేత్వార్ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.
*సేత్వార్ :
రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.
*సాదాబైనామా :
భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.
*దస్తావేజు :
భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.
*ఎకరం :
భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.
*అబి :
వానకాలం పంట
*ఆబాది :
గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు
*అసైన్‌మెంట్ :
ప్రత్యేకంగాకేటాయంచిన భూమి
*శిఖం :
చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం
*బేవార్స్ :
హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్ భూమి అంటారు.
*దో ఫసల్ :
రెండు పంటలు పండే భూమి
*ఫసలీ :
జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.
*నాలా :
వ్యవసాయేతర భూమి
*ఇస్తిఫా భూమి :
పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి
*ఇనాం దస్తర్‌దాన్ :
పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి
*ఖాస్రాపహానీ :
ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.
*గైరాన్ :
సామాజిక పోరంబోకు
*యేక్‌రార్‌నామా :
ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్ తీసుకునే గ్రామాల ఒప్పందం..
చివరకు మిగిలేది ఏది*
*
ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.
దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.
మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!
దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.
మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను
దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.
మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?
దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి
మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?
దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి
మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!
దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు
మనిషి: నా స్నేహితులున్నారా అందులో?
దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే
మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?
దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు
మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!
దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.
మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?
దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.
మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.
మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.
మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?
దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి.
పశ్చాతాపులను క్షమించాలి.
తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.
*గళం : గౌతమి*🎙️
*శివుడే విష్ణువు విష్ణువే శివుడు*
దేవుడు మనిషిని సృష్ఠించి పంచభూతాలతో ప్రకృతిని సృజించి అద్భుతమైన జీవనసౌఖ్యాన్ని అనుభవాన్ని పొందమన్నాడు అయితే హిందూ మతధర్మం, ఆర్ష విజ్ఞానం భోదించేది ఒకటే. దైవం ఒక్కడే భారత వర్షంలో మతవిధానము ఒక్కటే అని ఉద్భోదించినా, మనుషులు తమస్వార్ధానికి నిర్మించుకున్న పాపకూపాలే వివిధ మతాలు అది శైవమైనా వైష్ణవమైనా అంతే. దైవానికి విభజన లేదు.
శివ సహస్ర నామస్తోత్రం పంచమవేదంగా ప్రసిద్ధి చెందింది.మహాభారత యుద్ధానంతరం ధర్మరాజుని శ్రీకృష్ణుడు భీష్మాచార్యు ని వద్దకు తీసుకుని వెళ్ళగా, కురువంశ పితామహుడు సకల ధర్మాలను, ధర్మ సూక్ష్మా లనూ ధర్మరాజుకు భోదించాడు.అంతా నేర్చుకున్న తరువాత ధర్మరాజు తన మనసులోని మాటను బయట పెట్టాడు. పంచమ వేదంగా పరిగణిస్తున్న శివ సహస్ర నామ స్తోత్రం గురించి చెప్పమని తాతగారిని కోరతాడు.
అప్పుడు బీష్మాచార్యుడు ఏ మాత్రం భేషజం లేకుండా ఇలా అంటాడు." ధర్మజా! శివుని గురించి సమగ్రంగా చెప్పగలిగినవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. వారిద్దరూ ఒకటే కనుక ,శ్రీకృష్ణుడు మాత్రమే శివ సహస్ర నామ స్తోత్రాన్ని గురించి చెప్పగలడు." అని అంటాడు.అదే సందర్భంలో భీష్మాచార్యుడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ధర్మరాజు మనోభిష్టాన్ని గ్రహించావు కదా! శివ సహస్ర నామ స్తోత్రం గురించి వివరించు ' అని అంటాడు.
దాంతో శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచన చేసి శివుని వెయ్యి నామాలను ధారాళంగా చెబుతాడు.అంత వేగంగా , తడుముకోకుండా చెప్పగలిగిన వాడు శ్రీకృష్ణుడు మాత్రమేనన్న తన మాట నిజమైనందుకు భీష్మాచార్యుడు సంతోషిస్తాడు. అప్పుడు ధర్మరాజుతో ఇలా అంటాడు." ధర్మజా ! తెలియని వారు ,సగం తెలిసినవారు శివ, కేశవులకు మధ్య భేదాన్ని సృష్టిస్తు ఉంటారు.సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్తులు ముగ్గురూ ఒకటే ,వారిని వేరు చేసి చూడటం తగదు.
ఈ విషయాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా స్పష్టం చేసాడు. ఈశ్వరుని అంశతో జన్మించిన ఆంజనేయుణ్ణి తనకు నమ్మకమైన మిత్రునిగా, సచివునిగా శ్రీరామచంద్రుడు పరిగణించడానికి ప్రధాన కారణం ఇదే. శివ కేశవుల మధ్య ఎటువంటి భేదం లేదని చెప్పడనికి ఆంజనేయుడే ఉదాహరణ.
శివుడు ఆపదలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి తోడ్పడినట్లే ,విష్ణుమూర్తికి శివుడు తోడ్పడాడు. ఈశ్వరాంశ సంభూతు డైన ఆంజనేయుడు సీతాన్వేషణలో శ్రీరామచంద్రునికి తోడ్పడటాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
"శివాయ, విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే " అని సంద్యావందనం శ్లోకాలు తెలుపుతున్నాయి.
శివ, కేశవుల్లో ఎవరిని అరాధించినా ఒకటే.ఇద్దరినీ అరాధించినా తప్పు లేదు. సృష్టిలోని ప్రాణులనునిలబెడు తున్నది విష్ణుమూర్తి అయితే లయం చేసుకుంటున్నది పరమేశ్వరుడు.ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది కార్తీకమాసం.
కార్తీక మాసంలో శివునికి అభిషేకాలు చేసినట్లే విష్ణుమూర్తికి ప్రీత్యర్ధం సాలగ్రామ పూజలు చేయడం ఆన వాయితీ ,అలాగే కార్తీక మాసం వెళ్ళిన వెంటనే వచ్చే మార్గశిర మాసంలో కూడా శివ కేశవుల అరాధన జరుగు తుంది.రూపలు వేరైనా దైవం ఒకటే అన్నది మన పెద్దల మాట.
*ఓం నమో నారాయణాయా*
మకరతోరణం
#'మకరతోరణం' అంటే ఏమిటి? దాని విశేషం ఏమి? దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణ మధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక *రాక్షసముఖం* కనబడుతుంది. దానికే 'మకరతోరణం' అని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణం మధ్యభాగంలో అమర్చటానికి గల కారణము గురించి *స్కందమహాపురాణం* లో ఒక కథ వుంది....· పూర్వం *"కీర్తిముఖుడు"* అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేకవరములను పొంది తద్వారా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుని పత్ని అయిన *'జగన్మాతను'* కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతిభీకరమైన *అగ్నిని* సృష్టించాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది.· మరణంలేకుండా వరం పొందినా, శివుని ఆఙ్ఞమేరకు ఆబడబాగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడేడు. భక్తసులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట *మూడవ కన్ను* గా ధరించాడు.· ఆ తరువాత *కీర్తిముఖుడు* తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదనీ, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు *"నిన్ను నువ్వే తిను"* అని చెప్పాడు. శివుని ఆనతి మేరకు *కీర్తిముఖుడు* *మొసలి రూపం* ధరించి తనను తాను ముందుగా తోకభాగంనుంచి మొదలుపెట్టి కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలాతినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు.· ఆప్రార్ధన ఆలకించిన పరమశివుడు, ఈనాటినుంచి అన్ని దేవతాలయాలలో దెవతా మూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురఃహంకారాన్ని, ఆశను, తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు.· ఆనాటినుంచి *కీర్తిముఖుడు* దేవతాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక వున్న తోరణామధ్యభాగాన్ని తన రాక్షస మకరముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని,, దురాశను కబళిస్తున్నాడు . ఈకారణంగానే దేవతా మూర్తుల వెనుక మధ్యభాగంలో అమర్చబడిన తోరణానికే *'మకరతోరణం'* అని పేరు వచ్చింది.మనసంసృతి సంప్రదాయాలు ...!
నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 20 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
‘’
నవచంపకము అంటే అప్పుడే విరిసిన సంపంగిపువ్వు. వశిన్యాది దేవతలు అమ్మవారి ముక్కుని నవచంపకము అని పోల్చారు. లోకములోని ముక్కులన్నీ వాసన చూడటానికి పనికి వస్తాయి. అమ్మవారి శరీరము, జుట్టు దగ్గరనుంచీ అన్నీ పరిమళములు కలిగి ఉంటాయి. ఈ నామము చాలా గొప్ప నామము. వాసన అన్న దానిని పక్కన పెడితే ముక్కు ఊపిరికి చిహ్నము. ముక్కు ఊపిరిని తీసి మళ్ళీ వదలకపోతే ప్రమాదము వచ్చేసిందని గుర్తు. చేసిన కర్మలకు ఆధారముగా ఈశ్వరుడు శరీరము ఇస్తాడు. ఆఖరి ఊపిరినాడు ఏమి చేసాడు అన్నదానిబట్టి పునర్జన్మ ఉంటుంది. ఏ భాష్యమైనా అదే చెపుతున్నది. ఏ ఉపాధిలో ఉన్నా భక్తిని అనుగ్రహిస్తాడు. భక్తి ఉంటే ఆయన మోక్షమును కూడా అనుగ్రహిస్తాడు. ఒక సాలె పురుగుకి, పాముకి, ఏనుగుకి ఇచ్చాడు. పునర్జన్మను ఫలానాదిగా పుట్టించమని అంటే తనకు సంబంధము లేదని చెపుతాడు. మళ్ళీ మంచిజన్మలోకి దేనివలన వెడతారు బ్రతికి ఉండగా చేసిన కర్మానుష్టానములోమనసు ఎంత రంజిల్లినదని చూస్తారు. జాగరూకత కలిగి దీపము ఉండగా ఇల్లు చక్కపెట్టుకున్నట్టుగా ఈశ్వరోపాసన ఎక్కువ చేసుకోవలిసి ఉంటుంది.
అమ్మవారు ఎప్పుడైనా ఒక రూపము తీసుకుంటే కర్మకొరకు తీసుకోదు. ఒకనాడు దక్షప్రజాపతి కోరుకుంటే ఆయనకు కూతురిగా పుట్టి దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నది. అలా పెట్టుకోవడము వలన కీర్తి తండ్రయిన దక్షప్రజాపతికి దక్కింది. నిరీశ్వర యాగము చేస్తూ, శివుడిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే శివుని రుద్రుని చెయ్యగలనని నిరూపించడానికి శరీరము వదిలి పెట్టింది. శివుడు వీరభద్రుని సృష్టించాడు. దక్షయజ్ఞం సర్వనాశనము అయిపోయింది. యజ్ఞము ఆగిపోయిందని ఏడిస్తే దక్షునికి మేకతల పెట్టి యజ్ఞము పూర్తిచేసారు. అమ్మవారి ముక్కు వేరొక చోట ఊపిరి పోసుకున్నది. నిజానికి ఆవిడకు పుట్టుక, ఊపిరి ఆగడము లేదు. ఒక ప్రయోజనము కోసము శరీరము తీసుకున్నది.
ఒకనాడు మేనకాదేవి హిమాలయ పర్వతముల మీద తిరుగుతున్నది. అక్కడ పార్వతీపరమేశ్వరులు విహారము చేస్తున్నారు. పార్వతీదేవి అందచందములను చూసి మేనకాదేవి ఇటువంటి కుమార్తె నాకు ఉంటే అనుకున్నది. మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారు ఇచ్చేస్తుంది. దాక్షాయణిగా శరీరము వదిలి హైమవతిగా పర్వతరాజు పుత్రిక పార్వతిగా వస్తాను అన్నది. ఆవిడ ఎక్కడ పుడితే అక్కడ వారి జీవితములు ధన్యము. ఊపిరికి ముక్కును సంకేతిస్తాము. వాసన ఊపిరికి అంతర్గతము. వాసన – ఊపిరి రెంటినీ ఏకీకృతముగానే సంకేతిస్తాము. పరమేశ్వరుడు ఇన్ని ఊపిరులని లెక్క కట్టి ఇస్తాడు. ముక్కు ఆయుర్దాయములను నిర్ణయించగల చిహ్నం. అమ్మవారు కూడా ఊపిరితీస్తుంది, విడచి పెడుతుంది. అవి ఆవిడ ఆయుర్దాయమునకు సూచనలు కావు. అమ్మవారి ఊపిరియే శృతి – వేదము. ఆమె ముక్కువంక చూసి నమస్కారము చేస్తే ఎక్కడ గాడితప్పితే అక్కడ దిద్దుబాటు చేస్తుంది. అదంతా ముక్కుకి సంబంధించిన గొప్పతనము. అమ్మవారి ముక్కుని సంపంగి పువ్వుతోనే ఎందుకు పోల్చారు? అనగా సంస్కృతములో తుమ్మెదను షట్పదము అంటారు అనగా ఆరుకాళ్ళున్నదని అర్థము. పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనసు ఈ ఆరింటితోటి అన్ని సుఖములు అనుభవించి సంసారములో మగ్నులమై ఆ పువ్వుమీదనుంచి ఈ పువ్వుమీదకి, ఈ పువ్వుమీదనుంచి ఆ పువ్వుమీదకు వాలుతూ తేనె త్రాగి బ్రతుకుతూ ఉంటాము. సంపంగిపువ్వు ఒక్కదాని మీద తుమ్మెద వాలదు. పంచ ఇంద్రియములు బహిర్ముఖము కాకుండా అంతర్ముఖమై భగవంతుని పాదములలో ఉండే మందారమకరంద పానముచేసి మత్తెక్కి ఉండే హృదయము కలిగిన మహాపురుషుడై జ్ఞానబోధ చేయకలిగిన అధికారము కలిగిన మహాపురుషుడు ఒక గొప్ప గురువు లోకములో పుట్టాలి అంటే అమ్మవారి నాసాదర్శనము తప్ప వేరొకమార్గము లేదు. అందుకని నవచంపకముతో పోలిక వేసి ఈ నామము చెప్పారు.
https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage
ఈరోజు మొగాళ్ళ దినం ....!
🔹
అందరు
ఉదయాన్నే లేచి
తలారా స్నానాలు చేసి
దగ్గరలో వున్న గుడికి వెళ్లి
ఒక కొబ్బరికాయ కొట్టి
వచ్చే జన్మలో మొగాడిగా
పుట్టించకు
అని వేడుకుంటున్న......
మొగవాళ్ళ అందరికీ శుభాకాంక్షలు.. 💐
ఎందుకో...
మచ్చుకు కొన్ని ....
చెడ్డి చొక్కాతో బాల్యం అంతా గడిపెయ్యాలి.
కొన్ని సార్లు చెడ్డి కూడా వెయ్యరు
చదువు చదివితే సరిపోదు
మొగాడివి రాంక్ రావాలి
అని అరచి గోల చేస్తారు.
భయమేసినా భయపడి చావకూడదు.
మగాడు భయపడేది ఏంటి అంటారు.
ఎలకవచ్చినా...
పాము వచ్చినా బల్లి చచ్చినా..
మనమే తియ్యాలి...
వారు తియ్యరు
అరవడం మాత్రమె చేస్తారు.
ఉద్యోగాలు చెయ్యల్సింది మనం....
కోయిలమ్మ....
కుంకుమరేఖ...
రచ్చబండలు...
లాంటి సీరియల్స్ చూసేది వాళ్ళు.
నోములు వ్రతాలు వాళ్ళకి...
సరుకులు,సామాన్లు తేవాల్సింది మనం.
పెళ్లి చేసుకుంటే..
వాళ్ళని బుట్టలో తెస్తారు
మనల్ని బుట్టలో వేసుకుంటారు
పట్టు చీరలు వుంటాయి
కాని పట్టు పాంటులు వుండవు,
ఉన్నా పెట్టరు.
మనం అమ్మాయిలని చూసినా...
వాళ్ళు మనన్ని చూసినా...
పళ్ళురాల గోట్టేది మనన్నే...
ఫలానా ఆవిడ మొగుడు
అని చెప్తారు కాని...
ఫలానా వాడి పెళ్ళాం
అని ఎందుకు అన రో...
కాఫీ ఇస్తే తాగాలి.లేకపోతే...
మంచినీళ్లని కాఫీలా భావించాలి...
నోరు ఇచ్చాడు..
కాని వాడకూడదు.
ఇలాంటి బాధల మధ్య కూడా...
ఓ రోజు మనకంటూ ఇచ్చినందుకు
తోటి మొగవాళ్ళకి...
నా అభినందనలు..
కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు
మన బాధలు మనమే పడాలి.
మనకు శుభాకాంక్షలు మనమే చెప్పుకుందాం!!
👍
చివరిగా....
అదే ఉమెన్సు డే అయితే
ప్రత్యేక సెలవు .
టీవీల్లో ఆడవాళ్ళ కోసం ప్రత్యేక ప్రోగ్రాంలు,
పాటలు....
మరి మగవారి కోసం
ఒక్క. పాట
కూడా లేదు
ఇక వాట్సాపుల్లో అయితే
ఉదయం నుండి పడుకునే వరకూ
ఒకటే మెసేజులు...
వాటిని డిలీట్ చేయాలంటే
ఓ పూట పడుతుంది
మన గ్రూపులో ఉన్న
ఆడలేడీసులో ఇప్పటి వరకూ
మగవారికి ఎవరూ శుభాకాంక్షలు చెప్పినవారు లేరు!
ఏదైనా మగవారిదే
విశాల హృదయం
అని నిరూపించారు
ఈ జన్మకింతే....
హ్యాపీ మగవాళ్ళ డే.......
☹️☹️🤭🤣😂🤣😂😬😬😬😩
మెకాలే
మెకాలే కోసం.
Indian Penal Code (IPC) కి ఇవాళ్టితో 160 ఏళ్ళు.
ఐపిసి రూపకర్త
అనేక దేశాల చట్టాలని అధ్యయనం చేసి దేశంలో
జరిగే రకరకాల వంచనలకి అడ్డుకట్ట వేసి నిందితులకి శిక్షలు వేసే సమగ్ర చట్టాన్ని ఆవిష్కరించిన వాడు
లార్డ్ మెకాలే.
దేశంలో
ఇంగ్లీషు విద్యని ప్రవేశపెట్టిన మహోన్నత మానవుడు మెకాలే.
నిజానికి
ఈ చట్టాలు లేకుంటే ఈ దేశపు మత మైనారిటీల నుంచి శూద్రుల వరకూ
అత్యంత హేయమైన బానిసత్వాన్ని మోస్తూ ప్రాచీన రోమ్ ని తలపించేవాళ్ళు.
ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేకుంటే
జ్ఞాన తిరస్కరణతో
మట్టి కింద చరిత్ర కప్పబడి కనీస చరిత్రకే దూరమయ్యే వాళ్ళం.
కుల మత ఉన్మాదం తలకెక్కి ఊరేగే ఎవడికైనా
చదువు విలువ
చట్టాల విలువ తెలిసే అవకాశం లేదు.
అందుకే
చట్టాలు మారుస్తాం అంటారు.
ఆ చట్టాన్ని ఆచరించడంలో గడ్డిపోచంత కృషి చేయనివాడికి
చట్టం మీద దుర్మార్గ కామెంట్ చేసే రోగం ప్రసాదించేది
ఇక్కడి కుల మతోన్మాదం.
చట్టాలని క్రియాశీలం చేయడం
కావాలనే మర్చిపోయిన శక్తులు
చట్టాలని మారుస్తామని కూయడం
చరిత్రని వెనక్కి నడిపించాలని చూడటం.
మనుషులంతా సమానం అని భావించడానికి
ఇక్కడి కులమతాలు వ్యతిరేకం.
కులమతాల బురదలో మునిగితేలుతూ ఆ బురదనే ఆరగించే సన్నాసులకి చట్టాలు, దేశాలు, మెకాలేలు శత్రువులు.
వాళ్లే కాదు సమత్వం కోరే ప్రతి మనిషీ శత్రువే.
అందుకే వాళ్ళు
ప్రశ్నని బోనులో నెడుతారు.
ప్రశ్నించే వేళ్ళని కత్తిరిస్తారు.
ప్రశ్నని ధరించే మనుషుల్ని చంపేస్తారు.
ప్రశ్నకి
స్వరం ఇచ్చే గొంతుల్ని నులిమేస్తారు.
ప్రశ్నతో
ఈ గోళం వెలుగు సంతరించుకున్న సత్యం వాడికి అవసరం లేదు.
వెలుగు
సమానత్వం వాడికి శత్రువు.
వెలుగు
సమానత్వంని కోరని చవటలు
ఇప్పుడు
చట్టాలని మారుస్తున్నాయి.
Dunna Ambedkar
*ధార్మికగీత - 11*
*****
*శ్లో:- న దేవో విద్యతే కాష్ఠే* ౹
*న పాషాణే, న మృణ్మయే* ౹
*భావే తు విద్యతే దేవః* ౹
*తస్మాత్ భావో హి కారణమ్*౹౹
దేవుడు లేడు కాష్టమున ,
తీరుగ నుండడు రాతి , మన్నులన్ ,
భావము లోనె నుండు ప్రతి
ప్రాణికి దేవుడు దివ్యరూపుడై
పావనుడైన దేవుడిని
భావన జేసియు సన్మనంబుతో,
కావగ గోరుటే నరుని
కామితమైనచొ శాంతి దక్కెడున్ .
✍️ గోపాలుని మధుసూదన రావు
పంచమాధ్యాయం - భక్తి మహిమ
ప్రసాద్ భరద్వాజ
*పరమార్థ దృష్టికి భక్తి అనేది ఏకరూపమే. కాని వ్యవహార దశలో అది 11 రూపాలుగా కనబడుతుంది.*
1) భగవత్కళ్యాణ గుణాభివర్ణన
2) భగద్దివ్య మంగళ విగ్రహానురాగం
3) భగవత్పూజనం
4) భగవత్స్మరణం
5) భగవత్సేవ
6) భగవంతుని పట్ల సఖ్యభావ ప్రేమ
7) భగవంతుని పుత్రుడుగా భావించి ప్రేమించడం
8) భగవంతుని భర్తగా ప్రేమించడం
9) భగవంతునికి సర్వ సమర్పణ చేయడం
10) భగవన్మయుడై ఉండడం
11) భగవంతుని ఎడబాసి ఉండలేకపోవడం
ఈ విధాలైన భక్తి వారి వారి పూర్వ జన్మల సంస్కారాల ననుసరించి కలుగు తుంటాయి. ఇవి ఏకాదశ రూపాలే కాదు. ఇంకా అనేక రూపాలుగా కూడా ఉండవచ్చును.
నారదుడు, వ్యాసులవారు మొదలైనవారు భగవంతుని కళ్యాణ గుణాభి వర్ణన చేసేవారు.
బృందావన స్త్రీలు భగవానుని దివ్య మంగళ విగ్రహంపై అనురాగం కలిగినవారు. అంబరీషుడు భగవత్పూజలో ఆసక్తి కలవాడు. ప్రహ్లాదుడు నిరంతర హరినామ స్మరణను విడువనివాడు. హనుమంతుడు శ్రీరాముని సేవకే అంకితమయ్యాడు. ఉద్ధవార్జునులు సఖ్య భక్తిగలవారు.
దేవకీ, కౌసల్యలు పుత్ర వాత్సల్యంతో కూడిన ప్రేమ గలవారు. రుక్మిణీ సత్యభామలు భగవంతుని భర్త రూపంలో ప్రేమించేవారు. బలి చక్రవర్తి, విభీషణుడు భగవంతునికి సర్వ సమర్పణ అయినవారు. సనత్కుమార యాజ్ఞవల్క్యులు భగవన్మయులుగా ఉన్నారు.
గోపికలు భగవంతుడిని విడచి ఉండలేని ప్రేమికులు. వీరి ప్రేమ సాధారణం కాదు. మానవ ప్రేమ వంటిది కూడా కాదు. వీరంతా ఆయా అవతారాలను భగవత్స్వరూపంగా గుర్తెరిగి ప్రేమించినవారే. అందువల్లనే వారు ఉదాహరణీయులు.
వీరు ఒక్కోసారి భ్రాంతిలోపడి, నా పుత్రుడు, నా స్నేహితుడు, నా భర్త అని అనుకున్నప్పటికీ వారిలో సహజంగా ఉన్న నానా విధ ప్రేమ వ్యక్తీకరణాలలో భక్తి భావం ఏకరూపం గానే నిరంతరం ఉన్నది. వీరు భ్రాంతి లేని సమయంలో తన్మయత్వం చెంది ఉంటారు.
*మాయ అంటే ఏమిటి - ఎలా ఉంటుంది???*
🌺
రామక్రిష్ణ పరమహంస వారు ఒకసారి "మాయ" ను దర్శించాలనుకున్నారు.
కాళి మాతను ప్రార్దించారు, అప్పుడు అక్కడ గంగానది వైపు చూస్తుండగానే ఆ జలాల్లోంచి ఒక చిన్న బుడగ బయటికి వచ్చింది.
అది అలా లేచి క్రమేపి పెద్దదవుతూ గట్టు మీదకి వచ్చి, చూస్తూ ఉండగానే ఒక స్త్రీ గా మారింది.
ఆ స్త్రీ ఒక బిడ్డను ప్రసవించింది, కాసేపు ఆ బిడ్డను పోషించి, పెంచి, ప్రేమతో లాలించి పెద్ద చేసింది.
కొద్ది సేపటికి ఎక్కడి నుండో కత్తిపీట తెచ్చింది, అంత సేపు ఆలనా, పాలనా చూస్తూ కనీ పెంచిన బిడ్డను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కరకరా నమిలి మింగేసింది.
తానూ ఆ జలాల్లో కలిసిపోయింది, అయితే ఆ స్త్రీ ముఖములో నీటి బుడగ నుంచి ఉత్పన్నమైన క్షణము నుంచి, తిరిగి నీటిలో కలిసి పోయేవరకు ఒకే రకమైన ప్రసన్నత వుంది.
రామకృష్ణులు వంక పలకరింపుగా నవ్వి, అంతర్దానమైంది.
వారికీ దృశ్యము అనుభూతమైనంత సేపు, చుట్టు పక్కల జనం సంచరిస్తున్నారు, వారెవరికీ ఈ దృశ్యం కనిపించినట్లు లెదు....
*అప్పుడు కాళికా దేవి ఇలా వివరించింది, "నీవు చుసిన దృశ్యం మాయ". అయితే మాయను చూచుటకు ఒకడు వుండాలి. చూచువానిని విడిచి మాయ లేదు, చూచువాడు కూడా ఆ మయాసమ్భవములొ ఒక పాత్రను పోషిస్తాడు" అని.*
రామక్రిష్ణులు అప్పటికే జ్ఞాన సిద్ధులు కాబట్టి స్వయముగా ప్రభావితులు కాకుండానే అ దృశ్యాన్ని దర్శించ గలిగారు.
అలా కాని వారికి అది సాధ్యము కాదు, మాయానుభుతికి ఏంతో కొంత సుంకం చెల్లించాలి.
_అంటే అందులో పాత్రను పోషించి దాని కాస్త నష్టాలను, పంచుకొవాలి. ఈ అనుభూతి ద్వారా మాయను గురించి గ్రహించ వలసిన అంశాలు వున్నయి._
_1. మాయ తాత్కాలికము. దానికి మొదలు, మధ్య, తుది వున్నాయి._
_2. దానిలో సంఘటనలు ముందు ఆకర్షణీయముగా ఉన్నప్పటికీ, చివరికి దుఃఖము గానే మారుతున్నయి._
_3. రామక్రిష్ణుల దర్శనములో మాయారూపిణి అయిన స్త్రీ గంగా జలము నుండి పుట్టి తిరిగి గంగ లోనే కలిసి పొయింది_
_అంతే కాదు తాను సృష్టించిన బిడ్డని తానే తెగ నరికి తిరిగి తనలోకే అంతర్హితం చేసుకుని మరీ గంగలో కలసిపోయింది._
*గంగ అంటే పరబ్రహ్మము, కాబట్టి మాయ బ్రహ్మము నుండి పుట్టి, దాని నుండి పడినట్టుగా కనిపించి తిరిగి బ్రహ్మము లోనే కలిసి పోతుంది.*
_పై దృశ్యము లోని స్త్రీ మాయకు సంకేతము..._
_ఆమె కని, ప్రేమతో పెంచిన బిడ్డ ఆమె, దేహముతో కలుపుకుని ఈ ప్రపంచానికి సంకేతము._
_అనగా మాయ తాను కన్న ప్రపంచములో అంతర్భాగమే ముందు ఆకర్షణీయముగా తోచిన ప్రపంచమే చివరకు విషం, విషమం అవుతుంది._
దానిని వదిలింన్చుకోవటమే అభ్యాసము, దానిక్ సాధనం విచారమనే కత్తిపీట.
తన సృష్టి అనే శిశువును ఖండించి అంతర్హితం చెయ్యాలి.
అనగా దేహ భావన, ప్రపంచ భావన అంతరించాలని అన్తరార్ధము.
అప్పుడే జీవునికి మరలా గంగా ప్రవేశము.. అనగా బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మము లో కలియుట...
*_🌺
విక్రమాదిత్య మహారాజు...*
.
మనలో చాలామంది నేను ప్రతిరోజూ పూజ చేస్తాను, ఉపవాసం, దీక్షలు చేస్తుంటాను అయినా మాకు కలుసుబాటు రావడం లేదు.... ఏ జన్మ లో ఏం పాపం చేసామో అంటుంటారు కదా అలాంటి పూర్వజన్మ ఫలితాన్ని మనకు తెలిపే చిన్న కథను ఈ రోజు తెలుసుకుందాం...
*విక్రమాదిత్య మహారాజు...*
ఒక రోజు తీరిక సమయం లో తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది :
' నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు.
కానీ వాళ్ళంతా రాజులు కాలేదు ,
నేనే ఎందుకయ్యాను ?
ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది ?
' మరుసటిరోజు సభ లో పండితులముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు.
అపుడు ఒక వృద్ధ పండితుడు '' రాజా , ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు.
ఆయనను కలవండి.
జవాబు దొరుకుతుంది ''అన్నాడు.
రాజు వెళ్ళాడు. అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు
అది చూసి రాజు ఆశ్చర్యపోయి ,...
తన ప్రశ్న ఆయన ముందు పెడితే....
ఆయన అన్నాడు : '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది.
అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''
నిరాశపడినా ,
రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు.
రాజు ఆయన్ని చూసినపుడు , ఆ సన్యాసి మట్టి తిం టున్నాడు
రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు.
కానీ తన ప్రశ్ననైతే అడిగాడు.
కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు
రాజుకూ కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు.
వాపసు వెళుతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు : '' ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది ,
అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి.'
రాజుకంతా గందరగోళంగా వుంటూంది. అయినా అక్కడికెళతాడు.
చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు.
అపుడు ఆ అబ్బాయి అన్నాడు
'' గత జన్మ లో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారితప్పివుంటారు.
ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుక్రింద ఆగివుంటారు.
తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి , నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటీవాడు కోపంతో
*'' నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు*
*రెండవ వ్యక్తిని అడిగితే..*
'' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే ''
అని వెటకారంగా అంటాడు.
మూడవ వాడు '' రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ?
''అని నీచంగా మాట్లాడాడు.
కానీ నాల్గవ వ్యక్తి మాత్రం '' తాతా , నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె తిను , '' అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేసాడు.
ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా '' అని అన్నాడు.
రాజు దిగ్భ్రాంతి కి లోనయ్యాడు.
రాజా నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు. అనవసరమయిన మీమాంసలతో కాలం వృథా చేయక ప్రజలను కన్న తండ్రి వలె పాలించు అని చెప్పి కనులు మూసినాడు...
ఓ మంచిమాట దానం వంటిది...అందరికీ పంచండి...ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది...*
*ఓ చెడ్డ మాట అప్పులాంటిది...ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది..........!
పెద్దతనం వచ్చింది
పెద్దతనం వచ్చింది అనగానే కొన్ని విషయాలు మనం వదిలి వేయాలి.
పట్టుకోవటం కష్టం కానీ వదిలివేయటంలో బాధ ఏమిటి చెప్పండి?
అలా అనుమానంగా చూడకండి... ఏమి వదిలివేయాలో చూద్దామా ..
"అమ్మాయి!! గ్యాసు కట్టేసావా!! గీజర్ ఆఫ్ చేసావా?? ఏ.సి. ఆన్ లో ఉన్నట్లుంది.. పాలు ఫ్రిజ్ లో పెట్టావా ?? కరెంట్ బిల్లు కట్టారా !!!" లాంటి ఎంక్వయిరీలు వదిలి వేయండి !!!
"మా కొడుకు కోడలు పట్టించుకోరు" అని హైరానా పడకండి..
ఇలా పట్టించుకుంటూ.. 60..70 ఏళ్ళు గడిపారు, ఇంకా ఎంతకాలం ?? ఇది వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం .. కష్టనష్టాలు కూడా వాళ్ళవే !! చూడండి అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండగలరో.. "నా అభిప్రాయం ఏమిటంటే" అని అనటం తగ్గించి..
"నీ ఇష్టం, నువ్వు చెప్పు" అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిద్దామా!!
'నాకూ తెలుసు' తో పాటు 'నాకు మాత్రమే తెలుసు' అనే అహం తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ 'నాకంటే ఎక్కువ తెలుసు' కదా అనే నిజాన్ని ఠక్కున ఒప్పేసుకోండి.. మీ మంచికేనండీ చెబుతున్నాను ...
"మా కాలంలో",
"మా చిన్నప్పుడు" అంటూ వీలు చిక్కినప్పుడల్లా వారిని ఊదరకొట్టకండి. వారి ముఖాల్లో కనిపించే విసుగుని చూడనట్లు నటించకండి. మన పిల్లలు కోసం వచ్చేవారితో మితంగా మాట్లాడండి. వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకోండి. కాసేపు మాట్లాడాక లేచి గదిలోకి వెళ్ళిపోగలిగే మనోనిగ్రహం అలవరుచుకోండి ..
పెద్దవారిని పలకరించే మర్యాదతో ఒక ప్రశ్న ఎవరైనా సహజంగా అడుగుతారు... "ఆరోగ్యం బాగుంది కదా" అని. దయచేసి వెంటనే స్పందించకండి...
మన బి.పి..... షుగర్.. కీళ్ళనొప్పులు .. నిద్ర పట్టకపోవటం,.. నీరసం అంత రసవత్తరమైన విషయం కాదని సదా సర్వదా గుర్తుంచుకోవాలండీ బాబూ !!! మనకి తోచక కాలక్షేపానికి ఎంత ఆలోచించినా ఎదుటివాళ్ళకి దాంట్లో అంతే ఇంట్రెస్ట్ ఏం ఉంటుంది చెప్పండి.. "బాబోయ్ !! ఎందుకు అడిగామా" అనే పశ్చాత్తాపం వారికి కలిగించకండి..
ఇంకొక విషయం...
ఎవరో పెద్దాయన అన్నాడు...
"మన అనుభవం తో వారిని తీర్చి దిద్దాలి కదా!" అని.
కాలం మారింది... మారుతున్నది..
"రోట్లో కందిపచ్చడి రుబ్బటం.. తిరగలితో విసరటం.. కట్టెల పొయ్యి మీద వంట చేయటం, కవ్వంతో మజ్జిగ చిలకటంలో గల నా అనుభవం నేటి తరానికి ఎలా ఉపయోగపడుతుంది ??"
ఉద్యోగాలైనా అంతే ! పద్దతులు మారుతున్నాయి.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది.... విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సు లో సీటు ఎలా పట్టుకోవాలో చెప్పి ఏం ప్రయోజనం ??
*చివరగా పెద్దతనంలో మన పరువు కాపాడుకోవటం పూర్తిగా ... పూర్తిగా మన చేతుల్లోనే ఉందండీ !! అనవసరం విషయాల్లో జోక్యం చేసుకోకుండా... మితభాషిగా వుంటూ... మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ... జిహ్వ చాపల్యం తగ్గించుకుని... అన్నింటికంటే ముఖ్యమైన విషయం "నన్ను ఎవరూ గౌరవించటం లేదు" అనే ఆత్మన్యూనతా భావం దరి చేరకుండా జాగ్రత్తపడాలి...*
భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము.. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.. పాజిటివ్ గా చూడండి... ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు... మొత్తం సంసారాన్ని లాగే బాధ్యత లేదు... పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది..
హాయిగా పూజలు చేసుకోవచ్చు.. భగవద్గీత, భాగవతం చదువుకోచ్చు.. దైవదర్శనం చేసుకోవచ్చు.. చిన్న చిన్న హాబీలు మనసు కి ఆహ్లాదాన్నిస్తాయి.. వాటికి సమయం కేటాయించవచ్చు..
*ఒక మాటని రోజూ అనుకుందాం.. "I love myself... I respect my self " ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది..*
చివరగా............ మనం దిగవలసిన స్టేషన్ దగ్గరలోనే వుంది ... Platform అదిగో ..... సమయం దగ్గర పడింది.
ఇక మనకి బోగీలో ఉన్నవారితో తగువులు... మనస్పర్థలు ఎత్తిపొడుపు మాటలు అవసరం అంటారా...
*మనం దిగుతుంటే వారి ముఖాల్లో 'హమ్మయ్య' అనే భావం కనిపించాలో లేక 'అయ్యో అప్పుడే స్టేషన్ వచ్చేసిందా' అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది ...*
పెద్దతనం మనకి వరంలాంటిది ... అది ముఖ్యంగా మన 'అహం' తగ్గించి, మనకి జీవితం అంటే ఏమిటో, మన నిజమైన విలువ ఏమిటో సరియైన అవగాహన కల్పిస్తుంది ... కాబట్టి అందరూ వృద్ధాప్యాన్ని ఆనందంగా స్వాగతించాలి సుమండీ !!!
*నస అనిపించుకునే కంటే nice అనిపించుకోవడం మంచిది కదా!
👏👌🙏👍😊
ఆవలి తీరం వైపు
ఇప్పుడు మీరు ఏ జీవితం జీవిస్తున్నారో, ఆ జీవితాన్ని ఒక స్వప్నంగా భావించి జీవించినట్లయితే, అప్పుడు ఆవలి తీరం వైపు మీ యాత్ర సాగగలదు. నిజానికి మీరు పరమాత్మ తో ఒకటి అవ్వాలనే అనుభవము పొందడానికి యాత్ర ప్రారంభించినట్లయితే, ఈ జీవితం మీకు స్వప్న సాదృశ్యమే అవుతుంది.. ఎప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుందో, అప్పుడు ఆ సాక్షాత్కారం పొందినవాడు ఉండడు, భగవంతుడే ఉంటాడు.
కేవలం కుతూహలం మాత్రమే కాక జీవితం అమూలాగ్రం రూపాంతరం చెందాలి అనే ప్రేరణ నిండినవాడు జ్ఞాని. ఎవరికి తెలుసుకోవడం అనేది కుతూహలం కాక, జీవన్మరణ సమస్య అవుతుందో, అతడు జ్ఞాని. ధనం కోసం కాకుండా, దుఃఖం యొక్క కారణం కాకుండా, ఎటువంటి కుతూహలం లేకుండా, జీవన సత్యాన్ని తెలుసుకోమని ఎవరికి పిలుపు వస్తుందో, ఎవరికి ఆ దాహం కలుగుతుందో, ఏది లేకుండా బ్రతకడం కష్టం అని ఎవరికి అనిపిస్తుందో, అతడు జ్ఞాని.
బ్రహ్మమును పొందాలి అంటే అన్ని వాసనలను వదలి వేయాలి. ఇది పరమాత్మ షరతు. పరమాత్మని అన్వేషించే యాత్ర, ఏ పేరుతో ప్రారంభించినా, అందులో శ్రద్ధ ఉంటేనే అది మహాత్వపూర్ణమైనది అవుతుంది.
భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
*వందేమాతరం*
*
పద్యం: 1920 (౧౯౨౦)
*10.1-907-*
*క. ఈ యుఱుములు నీ మెఱుములు*
*నీ యశనీఘోషణములు నీ జలధారల్*
*నీ యాన తొల్లి యెఱుఁగము*
*కూయాలింపం గదయ్య! గుణరత్ననిధీ!* 🌺
*_భావము: ఓ సుగుణాలవాలా కృష్ణా! ఇంత భయంకరమైన ఉరుములు మెరుపులు పిడుగులు, ఈ భీకర శబ్దములు, ఈ వరద ధారలు ఇంతకుముందు కని విని యెరుగము, నీ మీద ఒట్టు. మా మొరలాలించి మమ్మల్ని రక్షించు నాయనా!_* 🙏
*_Meaning: "Sri Krishna, an Embodiment of all virtues! We swear on you that the present situation, which is full of thunderous lightning, thunderbolts and horrific sounds, was never heard of. Kindly listen to our woes and protect us from this catastrophe"_* 🙏
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454).*
భాగవతామృతం
**
విదురాగమనంబు
1-300-క.కంద పద్యము
బంధుఁడు వచ్చె నటంచును
గాంధారీవిభుఁడు మొదలుగా నందఱు సం
బంధములు నెఱపి ప్రీతిం
బంధురగతిఁ జేసి రపుడు మన్నన లనఘా!
బంధుండు = బంధువు; వచ్చెన్ = వచ్చెను; అటంచును = అనుచు; గాంధారీ = గాంధారియొక్క; విభుఁడు = భర్త; మొదలుగాన్ = మొదలగువారు; అందఱున్ = అందరు; సంబంధములు = సంబంధములు; నెఱపి = నెరవేర్చుచు; ప్రీతిన్ = ప్రీతితో; బంధుర = తగు; గతిన్ = విధముగ; చేసిరి = చేసిరి; అపుడు = అప్పుడు; మన్ననలు = గౌరవములు; అనఘా = పాపములేనివాడా.
ఆత్మ బంధుడైన విదురుడు తీర్థయాత్రలు ముగించి తిరిగి వచ్చాడని విని, ధృతరాష్ర్టుడూ, మొదలైన వారంతా ఎంతో సంతోషంతో ఎదురేగి స్వాగతం పలికారు.
1-301-వ.వచనము
అంత ధర్మనందనుండు విదురునికి మజ్జనభోజనాది సత్కారంబులు సేయించి సుఖాసీనుండై తనవార లందఱు విన నిట్లనియె.
అంత = అంతట; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుండు - యముని పుత్రుడు, ధర్మరాజు}; విదురు = విదురు; కిన్ = కి; మజ్జన = స్నానము; భోజన = భోజనము; ఆది = మొదలగు; సత్కారంబులు = గౌరవములు; చేయించి = చేయించి; సుఖ = సుఖముగ; ఆసీనుండు = కూర్చున్న వాడు; ఐ = అయి; తనవారలు = తనవారు; అందఱున్ = అందరును; వినన్ = వినుచుండగ; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
అలా విదురుడు విచ్చేసినప్పుడు, యమధర్మరాజు పుత్రుడు అయిన ధర్మరాజు విదురునకు ఎదుర్కోలు వెళ్ళి సాదరంగా ఆహ్వానించాడు. తగిన గౌరవ సత్కారాలతో స్నానము, భోజనము మున్నగు మర్యాదలు అన్నీ ఏర్పాటు చేసాడు. పిమ్మట సుఖముగా కూర్చుండజేసి, తనవారు అందరూ వింటూ ఉండగా విదురుని ఇలా అడిగాడు.
1-302-సీ.సీస పద్యము
"ఏ వర్తనంబున నింత కాలము మీరు;
సంచరించితి రయ్య జగతిలోన
నే తీర్థములు గంటి రెక్కడ నుంటిరి;
భావింప మీవంటి భాగవతులు
తీర్థసంఘంబుల ధిక్కరింతురు గదా;
మీయందు విష్ణుండు మెఱయు కతన
మీరు తీర్థంబులు మీకంటె మిక్కిలి;
తీర్థంబు లున్నవే తెలిసి చూడ
1-302.1-తే.
వేఱు తీర్థంబు లవనిపై వెదక నేల
మిమ్ముఁ బొడగని భాషించు మేల చాలు
వార్త లేమండ్రు లోకులు వసుధలోన
మీకు సర్వంబు నెఱిఁగెడి మేధ గలదు.
ఏ = ఏ; వర్తనంబునన్ = విధమున; ఇంతకాలము = ఇంతకాలము; మీరు = మీరు; సంచరించితిరి = తిరిగితిరి; అయ్య = ఓయయ్య; జగతి = లోకము; లోనన్ = అందు; ఏ = ఏ; తీర్థములు = పుణ్యస్థలములు; కంటిరి = చూచితిరి; ఎక్కడ = ఎక్కడ; ఉంటిరి = ఉంటిరి; భావింపన్ = ఆలోచించి చూసిన; మీ = మీ; వంటి = లాంటి; భాగవతులు = భాగవతులు / భగవద్భక్తులు; తీర్థ = పుణ్యస్థలముల; సంఘంబులన్ = సమూహములను; ధిక్కరింతురు = అధిగమింతురు; కదా = కదా; మీ = మీ; అందున్ = లోన; విష్ణుండు = విష్ణుమూర్తి / భగవంతుడు; మెఱయు = ప్రకాశించుట; కతనన్ = వలన; మీరు = మీరు; తీర్థంబులు = పుణ్యస్థలములు; మీకు = మీకు; కంటెన్ = మించి; మిక్కిలి = పెద్ద; తీర్థంబులు = పుణ్యస్థలములు; ఉన్నవే = ఉన్నవా / లేవు; తెలిసి = తెలుసుకొని; చూడ = చూడగా;
వేఱు = వేరే; తీర్థంబులున్ = పుణ్యస్థలములు; అవని = భూము; పైన్ = మీద; వెదకన్ = వెతుకుట; ఏలన్ = ఎందులకు; మిమ్మున్ = మిమ్ములను; పొడగని = దర్శించుకొని; భాషించు = మాట్లాడుట అనే; మేల = మేలు; చాలున్ = చాలును; వార్తలు = వార్తావిశేషములు; ఏమి = ఏమి; అండ్రు = చెప్పుదురు; లోకులు = జనులు; వసుధ = లోకము; లోనన్ = లో; మీకు = మీకు; సర్వంబున = సమస్తమును; ఎఱిఁగెడి = తెలిసికొను; మేధ = తెలివి; కలదు = ఉన్నది.
అయ్యా ఇంతకాలమూ మీరు ఏయే ప్రాంతాలు సందర్శించారు ఎలా ఎలా సంచరించారు ఏయే పుణ్యతీర్థాలు సేవించారు ఏయే ప్రదేశాల్లో నివసించారు మీవంటి పరమభాగవతోత్తములు తీర్థాలను లెక్కచేయరుగదా మీలో భగవంతుడు సన్నిధిచేసి ఉన్నాడు. కనుక మీరే పుణ్యతీర్థాలు, ఆలోచించి చూస్తే మీకంటే మించిన పుణ్యతీర్థాలు పుడమిలో ఎక్కడో ఉన్నాయి మీవంటి మహాత్ములను దర్శించి సంభాషించే అదృష్టం అబ్భితే చాలదా వేరే తీర్థాలకోసం వెదకవలసిన పనేమున్నది మీరు సర్వజ్ఞులు, వివేకవంతులు. ఉన్న చోటనే ఉండి లోకంలో ఉన్న విశేషాలన్నీ తెలుసుకోగలరు.
1-303-మత్త.మత్తకోకిల
తండ్రి సచ్చినమీఁద మా పెదతండ్రిబిడ్డలు దొల్లి పె
క్కండ్రు సర్పవిషాగ్నిబాధల గాసిఁ బెట్టఁగ మమ్ము ని
ల్లాండ్ర నంతముఁ బొందకుండఁగ లాలనంబున మీరు మా
తండ్రి భంగి సముద్ధరింతురు తద్విధంబు దలంతురే?
తండ్రి = తండ్రి; సచ్చిన = మరణించిన; మీఁదన్ = పిదప; మా = మాయొక్క; పెదతండ్రి = తండ్రికి అన్నగారి; బిడ్డలున్ = కొడుకులు; తొల్లి = పూర్వము; పెక్కండ్రు = అనేకమంది; సర్ప = పాముల; విష = విషమువలన; అగ్ని = అగ్నివలన; బాధలన్ = బాధలతో; కాసిఁబెట్టఁగ = రాపాడించగా, బాధించగ; మమ్మున్ = మమ్ములను; ఇల్లాండ్రన్ = భార్యలను; అంతమున్ = మరణము; పొందకుండఁగన్ = చెందకుండగ; లాలనంబునన్ = సముదాయించుతూ; మీరు = మీరు; మా = మాయొక్క; తండ్రి = తండ్రి; భంగిన్ = వలె; సముద్ధరింతురు = పైకి తీసుకొనివచ్చిరి; తత్ = ఆ; విధంబున్ = విధమును; తలంతురే = జ్ఞప్తి చేసుకొందురా.
మా తండ్రిగారు చనిపోయిన అనంతరం, మా పెదతండ్రి కుమారులు మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టారు. సర్పాలచేత కరిపించారు. విషాన్నం తినిపించారు. కొంపకు నిప్పు అంటించారు. మా తండ్రివంటి మీరు మమ్మల్నీ, మాతల్లినీ మృత్యువువాత పడకుండా అత్యంత అనురాగంతో లాలించి పాలించారు. కష్టాలలో నుంచి ఉద్ధరించారు. ఆ విషయాలన్నీ ఎన్నడైన తలచుకొంటారా.
1-304-క.కంద పద్యము
పక్షులు తమఱెక్కలలోఁ
బక్షంబులు రాని పిల్లపదువుల మమతన్
రక్షించిన క్రియ మీరలు
పక్షీకరణంబు సేయ బ్రతికితిమి గదే.
పక్షులు = పక్షులు; తమ = తమయొక్క; ఱెక్కల = రెక్కలు; లోన్ = అందు; పక్షంబులు = రెక్కలు; రాని = రాని; పిల్ల = పిల్లల; పదువుల = గుంపును; మమతన్ = మమతతో {మమత - నాది అను భావము}; రక్షించిన = కాపాడు; క్రియన్ = విధముగ; మీరలు = మీరు; పక్షీకరణంబు = పక్షము వహించుట; చేయన్ = చేయుట వలన; బ్రతికితిమి = బ్రతికి బైట పడితిమి; కదే = కదా.
రెక్కలురాని తమ పసికందుల్ని రెక్కల్లో దాచుకొని మమకారంతో రక్షించే పక్షుల విధంగా,మీరు ఎంతో దాక్షిణ్యంతో మాపక్షం వహించి మమ్మల్ని రక్షించారు.
1-305-క.కంద పద్యము
మన్నారా ద్వారకలో
నున్నారా యదువు లంబుజోదరు కరుణన్
గన్నారా లోకులచే
విన్నారా మీరు వారి విధ మెట్టిదియో?"
మన్నారా = జీవించి; ద్వారక = ద్వారకాపట్నము; లోన్ = లో; ఉన్నారా = ఉన్నారా; యదువులు = యాదవులు {యదువులు - యదు వంశస్తులు}; అంబుజోదరు = కృష్ణుని {అంబుజోదరు - (నీటిలోపుట్టినది) పద్మము ఉదరమున ఉన్నవాడు}; కరుణన్ = దయను; కన్నారా = పొందుచున్నారా; లోకుల = ప్రజల; చేన్ = వలన; విన్నారా = విన్నారా; మీరు = మీరు; వారి = వారు ఉన్న; విధము = విధము; ఎట్టిదియో = ఎలాంటిదో.
మహానుభావా! మీరు తీర్థయాత్రలు చేస్తూ ద్వారకకు వెళ్లారా? వాసుదేవుణ్ణి కన్నారా? యాదవులంతా ఆ స్వామి అనుగ్రహం వల్ల సుఖంగా ఉన్నారా? పోని ఎవరివల్లనైనా వారి వృత్తాంతం విన్నారా?"
1-306-చ.చంపకమాల
అన విని ధర్మరాజునకు నా విదురుండు సమస్తలోక వ
ర్తనముఁ గ్రమంబుతోడ విశదంబుగఁ జెప్పి యదుక్షయంబు సె
ప్పిన నతఁ డుగ్రశోకమున బెగ్గిలుచుండెడి నంచు నేమియున్
విను మని చెప్పఁ డయ్యె; యదువీరుల నాశము భార్గవోత్తమా!
అనన్ = అనగా; విని = విని; ధర్మరాజు = ధర్మరాజు; కున్ = కు; ఆ = ఆ; విదురుండు = విదురుడు; సమస్త = సమస్తమైన; లోక = లోకముయొక్క; వర్తనమున్ = నడకను; క్రమంబు = క్రమము; తోడన్ = ప్రకారముగను; విశదంబుగన్ = వివరముగను; చెప్పి = చెప్పి; యదు = యాదవుల; క్షయంబు = నాశనము; చెప్పినన్ = చెప్పినచో; అతఁడు = అతడు; ఉగ్ర = భయంకరమైన; శోకమునన్ = దుఃఖమువలన; బెగ్గిలుచు = బెంగపడుతు, బాధపడుతూ; ఉండెడిన్ = ఉండును; అంచున్ = అనుకొనుచు; ఏమియున్ = ఏమీకూడా; వినుము = వినుము; అని = అని; చెప్పఁడయ్యె = చెప్పుట లేదు; యదు = యాదవ; వీరుల = వీరులయొక్క; నాశమున్ = నాశనమును; భార్గవోత్తమా = శౌనకుడా {భార్గవోత్తముడు - భార్గవుని సంతానములో ఉత్తముడు, శౌనకుడు}.
ఈ విధంగా ప్రశ్నించిన ధర్మరాజుతో విదురుడు తన తీర్థ యాత్రా విశేషాలన్నీ వివరించి చెప్పాడు. అన్నీ చెప్పాడు. కాని యాదవుల నాశనం మాత్రం చెప్పలేదు. అలా చెప్పితే ధర్మరాజు దుఃఖా వేశంతో క్రుంగి కృశించిపోతాడనే భయంతో ఆ విషయాన్ని చెప్పకుండా దాటవేశాడు.
1-307-ఆ.ఆటవెలది
మేలు సెప్పెనేని మేలండ్రు లోకులు
చేటు చెప్పెనేని చెట్టయండ్రు
నంతమీఁద శూద్రుఁ డైన కతంబున
శిష్టమరణ మతడు సెప్పఁడయ్యె.
మేలు = మంచి విషయము; సెప్పెనేని = చెప్పినట్లైతే; మేలు = మంచిది; అండ్రు = అందురు; లోకులు = ప్రజలు; చేటు = చెడ్డ విషయము; చెప్పెనేని = చెప్పినట్లైతే; చెట్ట = చెడ్డవాడు; అండ్రు = అందురు; అంత = ఆ; మీఁదన్ = పైన; శూద్రుఁడు = శూద్రుడు; ఐన = అయిన; కతంబునన్ = కారణముచేత; శిష్ట = శిష్టులయొక్క; మరణము = మరణమును; అతడు = అతడు; సెప్పఁడయ్యె = చెప్పుటలేదు.
లోకులు మంచి విషయం చెప్పితే మేలు మేలని వింటారు. చెడ్డవిషయం చెబితే చీదరించుకొంటారు. అందువల్ల సదయహృదయుడైన విదురుడు యదువీరుల మరణవార్తను ధర్మరాజుకు చెప్పలేకపోయాడు.
1-308-వ.వచనము
అది యెట్లనిన మాండవ్యమహాముని శాపంబునం దొల్లి యముండు శూద్ర యోని యందు విదురుండై జన్మించి యున్న నూఱు వత్సరంబు లర్యముండు యథాక్రమంబునం బాపకర్ముల దండించె; ఇట యుధిష్ఠిరుండు రాజ్యంబుఁ గైకొని లోకపాలసంకాశు లయిన తమ్ములుం దానును గులదీపకుం డైన మనుమని ముద్దు సేయుచుఁ బెద్దకాలంబు మహావైభవంబున సుఖియై యుండె నంత.
అది = అది; ఎట్లు = ఏవిధముగ; అనిన = అనిని; మాండవ్య = మాండవ్యుడు అను; మహా = గొప్ప; ముని = ముని యొక్క; శాపంబునన్ = శాపమువలన; తొల్లి = పూర్వము; యముండు = యముడు; శూద్ర = శూద్రుల యొక్క; యోనియందు = గర్భము నందు; విదురుండు = విదురుడు; ఐ = అయి; జన్మించి = పుట్టి; ఉన్న = ఉండగ; నూఱు = వంద; వత్సరంబులు = సంవత్సరములు; అర్యముండు = సూర్యుడు; యథాక్రమంబునన్ = యథావిధిగ; పాప = పాపపు; కర్ములన్ = కర్మలు చేయు వారిని; దండించె = దండించెను; ఇట = ఇక్కడ; యుధిష్ఠిరుండు = ధర్మరాజు {యుధిష్ఠిరుండు - ధర్మరాజు అసలు పేరు}; రాజ్యంబున్ = రాజ్యమును; కైకొని = చేపట్టి; లోకపాల = లోకపాలురకు; సంకాశులు = సమానమైనవారు; అయిన = అయినట్టి; తమ్ములున్ = తమ్ములును; తానును = తానును; కుల = కులమును; దీపకుండు = నిలబెట్టువాడు, దీపము వంటివాడు; ఐన = అయినట్టి; మనుమని = మనుమణ్ణి; ముద్దు = గారాబముగ పోషణ; సేయుచున్ = చేయుచు; పెద్ద = చాలా; కాలంబు = కాలము; మహా = గొప్ప; వైభవంబునన్ = వైభవముతో; సుఖి = సుఖము కలవారు; ఐ = అయి; ఉండెన్ = ఉండెను; అంత = అప్పుడు.
విదురుడు ధర్మస్వరూపుడు, పూర్వకాలంలో మాండవ్యుడనే మహర్శి శాపంవల్ల, యమధర్మరాజు శూద్రకులంలో విదురుడై జన్నించాడు. ఆ నూరు సంవత్సరాలూ, సూర్యుడే యథావిధిగా యమధర్మరాజు స్థానంలో ఉండి పాపాత్ముల పాపాలకు తగిన శిక్షలు విధిస్తూ ఉన్నాడు.
1-309-క.కంద పద్యము
బాలాజన శాలా ధన
లీలావన ముఖ్య విభవ లీన మనీషా
లాలసు లగు మానవులను
గాలము వంచించు దురవగాహము సుమతీ!
బాల = పిల్లలు; జన = అంతఃపుర స్త్రీలు; శాలా = భవనములు; ధన = ధనములు; లీలావన = ఉద్యానవనములు; ముఖ్య = మొదలగు; విభవ = వైభవము లందు; లీన = మునిగి, లీనమై; మనీషా = ప్రజ్ఞ; లాలసులు = రుచి మరిగిన వారు; అగు = అయినట్టి; మానవులను = మనుష్యులను; కాలము = కాలము; వంచించు = మోసము చేయును; దురవగాహము = తరించుటకు కష్టమైనది, అంతు చిక్కనిది; సుమతీ = మంచి బుద్ధి కల వాడా, శౌనకా.
శౌనక మహర్షి! అందమైన బిడ్డలు, అందచందాల అంగనలు, ఆనంద సౌధాలు, అపార సంపదలు, అలరారే ఉద్యానవనాలు మొదలైన భోగభాగ్యాలు యందు మునిగితేలుతూ, సుఖలాలసు లైన మానవులను కాలం మోసం చేస్తు ఉంటుంది. కాల ప్రవాహాన్ని తెలిసికొనుట దుస్సాధ్యం సుమా.
1-310-వ.వచనము
అది నిమిత్తంబుగాఁ గాలగతి యెఱింగి విదురుండు ధృతరాష్ట్రున కిట్లనియె.
అది = ఆ; నిమిత్తంబుగాన్ = కారణమువలన; కాల = కాలముయొక్క; గతి = లక్షణము, నడక; ఎఱింగి = తెలిసి; విదురుండు = విదురుడు; ధృతరాష్ట్రున = ధృతరాష్ట్రున; కు = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
అందవల్ల కాలజ్ఞుడైన విదురుడు ధృతరాష్ట్రుని సమీపించి ఇలా ప్రబోధించాడు...
1-311-మ.మత్తేభ విక్రీడితము
"కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్ ముందటం
గని ప్రాణేచ్ఛల నుండు జంతువుల నే కాలంబు దుర్లంఘ్యమై
యనివార్యస్థితిఁ జంపునట్టి నిరుపాయంబైన కాలంబు వ
చ్చె నుపాంతంబున; మాఱు దీనికి మదిం జింతింపు ధాత్రీశ్వరా!
కనక = బంగారము; అగార = గృహములు; కళత్ర = భార్యలు; మిత్ర = మిత్రులు; సుత = సంతానముల; సంఘాతంబు లన్ = సమూహములను; ముందటన్ = ఎదురు గుండా; కని = చూసి; ప్రాణ = ప్రాణములమీద; ఇచ్ఛలన్ = మక్కువతో; ఉండు = ఉండు; జంతువులను = జీవులను; ఈ = ఈ; కాలంబు = కాలము; దుర్లంఘ్యము = దాటరానిది; ఐ = అయి; అనివార్య = నివారింపరలేని; స్థితిన్ = విధముగ; చంపున్ = చంపును; అట్టి = అటువంటి; నిరుపాయంబు = ఉపాయములేనిది; ఐన = అయినట్టి; కాలంబు = కాలము; వచ్చెన్ = వచ్చెను; ఉపాంతంబున = సమీపమునకు; మాఱు = తిరుగు; దీని = దీని; కిన్ = కి; మదిన్ = మనసులో; చింతింపు = ఆలోచించుము; ధాత్రీశ్వరా = రాజా;
"ఓరాజా! ప్రపంచంలోని మానవులు బంగారు భవనాలు, పుత్ర, మిత్ర, కళత్ర పరివారాన్ని ఎల్లప్పుడు ఎదురుగుండ చూచుకొంటు, ప్రాణాలమీద తీపిని పెంచుకొంటు ఉంటారు. అయితే దుర్నివారక మైన కాలం వాళ్లను చంపి తీరుతుంది. కాలాన్ని కాదని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. అక్కడ ఏ ఉపాయాలు పనిచేయవు. నీకు అలాంటి కాలం దగ్గరపడింది. మహారాజ! దీనికి ప్రతిక్రియ ఏదైన ఆలోచించండి. (కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పంచను చేరి రోజులు వెళ్ళదీస్తున్న ధృతరాష్ట్ఱ్ఱునికి విదురుడు విరక్తి మార్గం ఉపదేశిస్తు ఇలా చెప్పసాగాడు.)
1-312-శా.శార్దూల విక్రీడితము
పుట్టంధుండవు, పెద్దవాఁడవు, మహాభోగంబులా లేవు, నీ
పట్టెల్లం జెడిపోయె, దుస్సహ జరాభారంబు పైఁగప్పె, నీ
చుట్టా లెల్లను బోయి; రాలు మగఁడున్ శోకంబునన్ మగ్నులై
కట్టా! దాయలపంచ నుండఁదగవే? కౌరవ్యవంశాగ్రణీ!
పుట్టు = పుట్టుకతోనే; అంధుండవు = గ్రుడ్డివాడవు; పెద్దవాఁడవు = వయసులో పెద్దవాడవు; మహా = గొప్ప; భోగంబులా = భోగములు అంటే అవీ; లేవు = లేవు; నీ = నీయొక్క; పట్టు = బలము; ఎల్లన్ = అంతా; చెడి = పాడు; పోయెన్ = అయిపోయినది; దుస్సహ = సహింప కష్టమైనది; జరా = ముసలితనము; భారంబున్ = బరువుగా; పైన్ = మీద; కప్పెన్ = పడెను; నీ = నీయొక్క; చుట్టాలు = బంధువులు; ఎల్లను = అందరును; పోయిరి = చనిపోయిరి; ఆలు = భార్య; మగఁడున్ = భర్తా; శోకంబునన్ = శోకములో; మగ్నులు = మునిగిన వారు; ఐ = అయి; కట్టా = అయ్యో; దాయల = శత్రువులయొక్క / దాయాదులయొక్క; పంచన్ = నీడలో; ఉండన్ = ఉండగా; తగవే = ఉచితమా; కౌరవ్య = కౌరవులయొక్క; వంశ = వంశమునకు; అగ్రణీ = గొప్పవాడా.
ఓ కురుకులశిరోమణీ అసలు నీవు పుట్టుకతోనే అంధుడవు. పైగా ఇప్పుడు మూడుకాళ్ల ముసలివైనావు. మహారాజ వైభవాలన్నీ అంతరించాయి. అధికారం అడుగంటింది. భరింపరాని వార్ధక్యం పైన బడింది. నా అన్నవారు అంతా గతించారు. ఇప్పుడు ఈ విధంగా బ్రతికి చెడ్డ మీ భార్యాభర్తలు బండు దుఃఖంతో మునిగి తేలుతూ అయ్యయ్యో దాయాదులైన పాండవుల పంచలో పడి ఉండటం ఏమంత బాగుంది.
1-313-క.కంద పద్యము
పెట్టితిరి చిచ్చు గృహమునఁ
బట్టితిరి దదీయభార్యఁ, బాడడవులకుం
గొట్టితిరి వారు మనుపఁగ
నెట్టన భరియింపవలెనె? యీ ప్రాణములన్.
పెట్టితిరి = పెట్టినారు; చిచ్చు = నిప్పు; గృహమునన్ = ఇంటికి; పట్టితిరి = పట్టుకొన్నారు; తదీయ = వారి; భార్యన్ = భార్యని; పాడు = చెడ్డ; అడవుల = అడవుల; కున్ = కి; కొట్టితిరి = గెంటివేసినారు; వారు = వారు; మనుపఁగ = పోషిస్తుండగ; ఎట్టన = ఏవిధముగ; భరియింపన్ = బలవంతముగ నిలుపుకొన; వలెను = వలెను; ఈ = ఈ; ప్రాణములన్ = ప్రాణములను.
మీరు పాండవుల కొంపకు చిచ్చుపెట్టారు. పాండవపత్నిని నిండుసభలో చెరబట్టారు. ఆ అమాయికుల్ని అన్యాయం చేసి అరణ్యాలకు వెళ్లగొట్టారు. ఇప్పుడు ఈ విధంగా వారి అండజేరి, వారు పెట్టిన తిండి తిని ప్రాణాలు నిలుపుకుంటున్నారు.
1-314-క.కంద పద్యము
బిడ్డలకు బుద్ధి సెప్పని
గ్రుడ్డికిఁ బిండంబు వండికొని పొం; డిదె పైఁ
బడ్డాఁ డని భీముం డొఱ
గొడ్డెము లాడంగఁ గూడు గుడిచెద వధిపా!
బిడ్డల = పిల్లల; కున్ = కి; బుద్ధి సెప్పని = మంచి దారిలో పెట్టుటకు శిక్షించని; గ్రుడ్డి = గ్రుడ్డివాని; కిన్ = కి; పిండంబు = పిండము {పిండము - (నిందా పూర్వకముగ) భోజనము, తద్దినము రోజు గుండ్రముగ చేయు ముద్దలు}; వండికొని = వండికొని; పొండు = తీసుకొని వెళ్ళండి; ఇదె = ఇదిగో; పైన్ = మీద; పడ్డాఁడు = పడ్డాడు; అని = అని; భీముండు = భీముడు; ఒఱ = మర్మపు; గొడ్డెములున్ = ఎత్తి పొడుపు మాటలు; ఆడంగన్ = పలుకు చుండగ; కూడు = తిండి; కుడిచెదవు = తింటున్నావు; అధిపా = రాజా;
“ఏనాడు బిడ్డలకు బుద్ధిచెప్పనట్టి గ్రుడ్డివాడు, ఈ నాడు సిగ్గు లేకుండా మాయింటి మీద పడ్డాడు; ఈ కళ్లులేని కబోదికి ఇంత పిండం వండి పట్టుకెళ్లి పడెయ్యండి” అంటున్న భీముడు పలికే దెప్పుడు మాటలు వింటు, ఆ దిక్కుమాలిన తిండి ఎలా తినగలుగుతున్నావు మహారాజా!
(కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పంచను చేరి రోజులు వెళ్ళదీస్తున్న ధృతరాష్ట్ఱ్ఱునికి విదురుడు విరక్తి మార్గం ఉపదేశిస్తు ఇలా చెప్పసాగాడు. తన కొడుకులు పాండవులను అనేక బాధలు అవమానాలు పెడుతున్నప్పుడు తప్పని వారించ లేదు కదా. అలాంటిది సిగ్గు లేకుండ ఇవాళ ఎలా వాళ్ళ చేతికూడు తింటున్నావు అని అడుగుతున్నాడు. ద్విక్తాక్షరం”డ్డ’ ప్రాసగా వేసి ఆపైన ఏడు డకారాలు వేసి ధ్వని సూచకం సాధించిన తీరు అద్భుతం.)
1-315-క.కంద పద్యము
కనియెదవో బిడ్డల నిఁక,
మనియెదవో, తొంటికంటె మనుమల మాటల్
వినియెదవో, యిచ్చెద ర
మ్మనియెదవో దానములకునవనీసురులన్.
కనియెదవో = చూడగలవా ఏమిటి; బిడ్డలన్ = (నీ) పిల్లలను; ఇఁకన్ = ఇంకా; మనియెదవో = గొప్పగా జీవించెదవా ఏమిటి; తొంటి = పూర్వము; కంటెన్ = కంటే; మనుమల = మనవల యొక్క; మాటల్ = (ముద్దు) మాటలు; వినియెదవో = వింటావా ఏమిటి; ఇచ్చెదన్ = ఇచ్చెదను; రమ్ము = రండు; అనియెదవో = అంటావా ఏమిటి; దానముల = దానములు తీసుకొనుట; కున్ = కు; అవనీసురులున్ = బ్రాహ్మణులను {అవనీసురులు - భూమికి దేవతలు, విప్రులు};
ఇక ఈ జన్మలో కన్నకొడుకుల ముఖాలు కనలేవు గదా; వెనుకటి దర్పంతో మనలేవు గదా; నీ మనుమల ముద్దు పలుకులు వినలేవు గదా; అగ్రహారాలు దానాలు గ్రహించటానికి ధరణీసురులను రమ్మనలేవు గదా; ఎందుకయ్యా ఇంకా ఈ బ్రతుకు.
1-316-క.కంద పద్యము
దేహము నిత్యము గా దని
మోహముఁ దెగఁ గోసి సిద్ధ మునివర్తనుఁడై
గేహము వెలువడు నరుఁడు
త్సాహముతోఁ జెందు ముక్తిసంపద ననఘా!"
దేహము = శరీరము; నిత్యము = నిత్యమైనది; కాదు = కాదు; అని = అని; మోహమున్ = భ్రాంతిని; తెగన్ = తెగునట్లు; కోసి = నాశనము చేసి; సిద్ధ = సిద్ధులు; ముని = మునులు వలె; వర్తనుఁడు = ప్రవర్తించు వాడు; ఐ = అయి; గేహము = గృహము; వెలువడు = విడుచు; నరుఁడు = మానవుని; ఉత్సాహము = ఉత్సాహము; తోన్ = తో; చెందు = చెందును; ముక్తి = ముక్తి అను; సంపద = భాగ్యము; అనఘా = పాపము లేనివాడా.
ఈ దేహం నిత్యం కాదన్న సత్యం తెలుసుకొని దేహం మీద వ్యామోహం తెంచుకొని, యోగ్యమైన వైరాగ్యమార్గంలో ఉత్సాహంగా ముందడుగు వేసేవాడే మోక్షలక్ష్మిని కైవసం చేసుకోగలుగుతాడు.
నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 20 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
‘’
నవచంపకము అంటే అప్పుడే విరిసిన సంపంగిపువ్వు. వశిన్యాది దేవతలు అమ్మవారి ముక్కుని నవచంపకము అని పోల్చారు. లోకములోని ముక్కులన్నీ వాసన చూడటానికి పనికి వస్తాయి. అమ్మవారి శరీరము, జుట్టు దగ్గరనుంచీ అన్నీ పరిమళములు కలిగి ఉంటాయి. ఈ నామము చాలా గొప్ప నామము. వాసన అన్న దానిని పక్కన పెడితే ముక్కు ఊపిరికి చిహ్నము. ముక్కు ఊపిరిని తీసి మళ్ళీ వదలకపోతే ప్రమాదము వచ్చేసిందని గుర్తు. చేసిన కర్మలకు ఆధారముగా ఈశ్వరుడు శరీరము ఇస్తాడు. ఆఖరి ఊపిరినాడు ఏమి చేసాడు అన్నదానిబట్టి పునర్జన్మ ఉంటుంది. ఏ భాష్యమైనా అదే చెపుతున్నది. ఏ ఉపాధిలో ఉన్నా భక్తిని అనుగ్రహిస్తాడు. భక్తి ఉంటే ఆయన మోక్షమును కూడా అనుగ్రహిస్తాడు. ఒక సాలె పురుగుకి, పాముకి, ఏనుగుకి ఇచ్చాడు. పునర్జన్మను ఫలానాదిగా పుట్టించమని అంటే తనకు సంబంధము లేదని చెపుతాడు. మళ్ళీ మంచిజన్మలోకి దేనివలన వెడతారు బ్రతికి ఉండగా చేసిన కర్మానుష్టానములోమనసు ఎంత రంజిల్లినదని చూస్తారు. జాగరూకత కలిగి దీపము ఉండగా ఇల్లు చక్కపెట్టుకున్నట్టుగా ఈశ్వరోపాసన ఎక్కువ చేసుకోవలిసి ఉంటుంది.
అమ్మవారు ఎప్పుడైనా ఒక రూపము తీసుకుంటే కర్మకొరకు తీసుకోదు. ఒకనాడు దక్షప్రజాపతి కోరుకుంటే ఆయనకు కూతురిగా పుట్టి దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నది. అలా పెట్టుకోవడము వలన కీర్తి తండ్రయిన దక్షప్రజాపతికి దక్కింది. నిరీశ్వర యాగము చేస్తూ, శివుడిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే శివుని రుద్రుని చెయ్యగలనని నిరూపించడానికి శరీరము వదిలి పెట్టింది. శివుడు వీరభద్రుని సృష్టించాడు. దక్షయజ్ఞం సర్వనాశనము అయిపోయింది. యజ్ఞము ఆగిపోయిందని ఏడిస్తే దక్షునికి మేకతల పెట్టి యజ్ఞము పూర్తిచేసారు. అమ్మవారి ముక్కు వేరొక చోట ఊపిరి పోసుకున్నది. నిజానికి ఆవిడకు పుట్టుక, ఊపిరి ఆగడము లేదు. ఒక ప్రయోజనము కోసము శరీరము తీసుకున్నది.
ఒకనాడు మేనకాదేవి హిమాలయ పర్వతముల మీద తిరుగుతున్నది. అక్కడ పార్వతీపరమేశ్వరులు విహారము చేస్తున్నారు. పార్వతీదేవి అందచందములను చూసి మేనకాదేవి ఇటువంటి కుమార్తె నాకు ఉంటే అనుకున్నది. మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారు ఇచ్చేస్తుంది. దాక్షాయణిగా శరీరము వదిలి హైమవతిగా పర్వతరాజు పుత్రిక పార్వతిగా వస్తాను అన్నది. ఆవిడ ఎక్కడ పుడితే అక్కడ వారి జీవితములు ధన్యము. ఊపిరికి ముక్కును సంకేతిస్తాము. వాసన ఊపిరికి అంతర్గతము. వాసన – ఊపిరి రెంటినీ ఏకీకృతముగానే సంకేతిస్తాము. పరమేశ్వరుడు ఇన్ని ఊపిరులని లెక్క కట్టి ఇస్తాడు. ముక్కు ఆయుర్దాయములను నిర్ణయించగల చిహ్నం. అమ్మవారు కూడా ఊపిరితీస్తుంది, విడచి పెడుతుంది. అవి ఆవిడ ఆయుర్దాయమునకు సూచనలు కావు. అమ్మవారి ఊపిరియే శృతి – వేదము. ఆమె ముక్కువంక చూసి నమస్కారము చేస్తే ఎక్కడ గాడితప్పితే అక్కడ దిద్దుబాటు చేస్తుంది. అదంతా ముక్కుకి సంబంధించిన గొప్పతనము. అమ్మవారి ముక్కుని సంపంగి పువ్వుతోనే ఎందుకు పోల్చారు? అనగా సంస్కృతములో తుమ్మెదను షట్పదము అంటారు అనగా ఆరుకాళ్ళున్నదని అర్థము. పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనసు ఈ ఆరింటితోటి అన్ని సుఖములు అనుభవించి సంసారములో మగ్నులమై ఆ పువ్వుమీదనుంచి ఈ పువ్వుమీదకి, ఈ పువ్వుమీదనుంచి ఆ పువ్వుమీదకు వాలుతూ తేనె త్రాగి బ్రతుకుతూ ఉంటాము. సంపంగిపువ్వు ఒక్కదాని మీద తుమ్మెద వాలదు. పంచ ఇంద్రియములు బహిర్ముఖము కాకుండా అంతర్ముఖమై భగవంతుని పాదములలో ఉండే మందారమకరంద పానముచేసి మత్తెక్కి ఉండే హృదయము కలిగిన మహాపురుషుడై జ్ఞానబోధ చేయకలిగిన అధికారము కలిగిన మహాపురుషుడు ఒక గొప్ప గురువు లోకములో పుట్టాలి అంటే అమ్మవారి నాసాదర్శనము తప్ప వేరొకమార్గము లేదు. అందుకని నవచంపకముతో పోలిక వేసి ఈ నామము చెప్పారు.
https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage
సంతృప్తి
మన ప్రస్తుత జీవితంలో మనం సంతోషంగా ఉండాలి & మన దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందాలి.
లేకపోతే ప్రతిసారీ కొంత అసంతృప్తి లేదా మానసిక శాంతి ఉండదు.
సమాజంలో కొంతమంది ఉంటారు.
క్రింద పేర్కొన్న అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ - వారు సంతృప్తి చెందరు
1) కోట్ల డబ్బు
2) అందమైన భార్య
3) అర్థం చేసుకునే భార్య
4) చాలా మంచి వ్యాపారం
5) చాలా మంచి ఉద్యోగం
6) చాలా మంచి సంపద
7) చాలా మంచి పిల్లలు
8) చాలా మంచి ఇల్లు
9) చాలా మంచి శరీర రూపం
10) ఆరోగ్యకరమైన శరీరం
సమాజంలో ఆశ్రయం / ఇల్లు / ఆహారం / ఉద్యోగం / డబ్బు లేని లక్షలాది మంది ఉన్నారు.
మనం ఆ వ్యక్తుల కంటే చాలా బాగున్నాము. మనం చాలా అదృష్టవంతులము.
మన దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందాలి
పోతన తలపులో...75
అర్జునుడు ద్వారక నుంచి వచ్చి శ్రీకృష్ణ అవతార సమాప్తి గురించి ధర్మరాజుకు చెప్పలేక చెబుతూ,కృష్ణుడు తమకు చేసిన మేలు గురించి ఎన్నో విధాలుగా గుర్తు చేసుకుంటున్నాడు.....
**
గురుభీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశచక్రంబులో,
గురుశక్తిన్ రథయంత యై, నొగలపైఁ గూర్చుండి, యా మేటి నా
శరముల్ వాఱక మున్న, వారల బలోత్సాహాయు రుద్యోగ త
త్పరతల్ చూడ్కుల సంహరించె, నమితోత్సాహంబు నా కిచ్చుచున్.
**
భీష్మ ద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం చేస్తూ, రథం నొగలపై కూర్చుండి నేను బాణ పరంపరలను వర్షింపక ముందే, తన చూపులతో శత్రువుల శక్తినీ, ఉత్సాహాన్నీ, ఆయుర్దాయాన్నీ, తదేకదీక్షనూ అపహరించి, నాకు అమితానందాన్ని అందించిన విజయ సారథి ఆయనే కదా!
**
అసురేంద్రుం డొనరించు కృత్యములు ప్రహ్లాదుం బ్రవేశించి గె
ల్వ సమర్థంబులు గాని కైవడిఁl గృపాశ్వత్థామ, గాంగేయ, సూ
ర్యసుత, ద్రోణ ధనుర్విముక్త బహుదివ్యాస్త్రప్రపంచంబు నా
దెసకున్ రాక తొలంగె మాధవు దయాదృష్టిన్ నరేంద్రోత్తమా!
**
మహారాజా!
పూర్వం హిరణ్యకశిపుని క్రూరకృత్యాలు ప్రహ్లాదుని విషయంలో విఫలమైనట్లే, భీష్మ ద్రోణ కర్ణ కృప అశ్వత్థామల ధనుస్సుల నుంచి వెలువడిన నానావిధాలైన శస్త్రాస్త్రాలు నా మీదకు రాకుండా ఆ మాధవుని దయాధృక్కులతో ప్రక్కకు తొలగి పోయాయి కదా..
**
వసుమతి దివ్యబాణముల వ్రక్కలు వాపి కొలంకు సేసి, నా
రసములు మాటుగాఁ బఱపి రథ్యములన్ రిపు లెల్లఁ జూడ సా
హసమున నీటఁ బెట్టితి రణావని సైంధవుఁ జంపునాఁడు, నా
కసురవిరోధి భద్రగతి నండయి వచ్చినఁ గాదె? భూవరా!
**
సైంధవుని వధించే ఆ నాటి రణరంగంలో, శత్రువులు కళ్లారా చూస్తుండగానే, నా దివ్య బాణాలతో భూమిని బద్దలుకొట్టి జలాశయాన్ని కల్పించి అలసి సొలసిన నా రథాశ్వాలకు దప్పిక తీర్చింది ఆ దయామయుని అండవల్లనే కదా!
🏵️ పోతన పదం🏵️
🏵️ఆత్మీయతకుపట్టం🏵️
ధార్మికగీత - 42*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*
*****
*శ్లో:- త్రివిధం నరక స్యేదం ౹*
*ద్వారం నాశన మాత్మనః ౹*
*కామః క్రోధ స్తథా లోభః ౹*
*తస్మా దేత త్త్రయం త్యజేత్౹౹*
*****
*భా:- అరిషడ్వర్గములో అతి కీలకమైన కామము, క్రోధము, లోభము అనే యీ మూడును నరకమునకు ప్రవేశ ద్వారములు. ఇవి ఆత్మ నాశన హేతువులు. లోభము సకల పాపాలకు కారణంగా చెబుతారు. ఆ లోభము వల్లనే కామము కలుగుతుంది. ఆ కామము తీరకపోతే క్రోధం పుడుతుంది. దుర్యోధనుని పరమ లోభితనమే అఖండ రాజ్యరమ పట్ల తీరని కామానికి, దాయాదులైన పాండవుల యెడ తీవ్ర క్రోధానికి దారితీసింది. ఫలితం కౌరవ సామ్రాజ్య పతనం. వంశ నాశనం. ఆత్మ వినాశనం. విశ్వామిత్రుడు, దుర్వాసుడు తమ క్రోధం వల్ల అమూల్యమైన తపోబలం కోల్పోయారు. జమదగ్ని క్రోధానికి భార్య బలి కాబడింది. అతి కామానికి లంకేశుడు హతుడైనాడు. నాడు, నేడు మానవుని అథోగతికి , సామాజిక పతనానికి, పరస్పర ద్వేషానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో యీ మూడే కారణమౌతున్నాయి. తత్ ఫలితంగా మానవతా విలువలు నానాటికి అణగారి, దిగజారి పోతున్నాయి. కాన సత్సంగం, సద్గ్రంథ పఠనము , సచ్చింతనలతో ప్రతి ఒక్కరు కామ క్రోధ లోభములను నిర్మూలించు కోగలగాలి. అప్పుడే మానవ జన్మ సఫలత. సార్ధకత. పారమార్థికత.*
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲