సాధనేన సాధ్యతే సర్వం : ప్రతి పని ముందు మొదలుపెట్టడంతో మొదలయ్యి సఫలం అవటంతో ముగించాలి. కానీ తన మీద తనకు నమ్మకం లేని వాళ్ళు కొందరు ముందు పని మొదలుపెట్టటానికి వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తారు. అటువంటప్పుడు ఆ పని ఎలా ముగుస్తుంది. మంచి ఫలితాన్ని ఎలా ఇస్తుంది. పరీక్షలు వ్రాయటానికి ముందు ఆ పరీక్షలకు సంబందించిన సలబసు పూర్తిగా కులంకుశంగ చదివితే ఎలాంటి ప్రశ్న పాత్రనైనా సాదించ గలరు. తన ప్రేపరషన్ సరిగా లేనివాళ్లు మాత్రమే పరీక్షలంటే భయపడతారు. మనం రోజు చూస్తున్నాము ఒక తండ్రిగారు తన కుమార్తెను లేక కుమారుణ్ణి స్క్యూటర్ మీద తీసుకొని పరీక్షా కేంద్రానికి వెళుతుంటే సదరు విదార్థి వెనుక సీటులో కూర్చొని తీవ్రంగా చదువుతుంటాడు. అదిచూస్తే చూసేవారికి ఆ పిల్ల ఎంతో తీవ్రంగా ప్రిపేర్ అవుతున్నది అనుకుంటారు. నిజానికి అటువంటి చదువు నిరోధకం ఎందుకంటె ఏడాది చుడండి ఒక్క నిముషంలో అది కుదుపు వేస్తున్న స్క్యూటర్ మీద కూర్చొని చదివితే ఏమి రాదు. పైగా ఇంతకు ముందు చదివింది కూడా పోతుంది. ఇక కొంత మంది రేపు పరీక్షా అంటే ఆ క్రితం రోజు రాత్రంతా మేలుకొని తీవ్రంగా చదువుతారు. అదికూడా మంచిది కాదు. మరుసటి రోజు పరీక్షా హాలులో నిద్ర పోయి పరీక్షా ఫెయిల్ ఆయన వాళ్ళు ఎందరో, ఇక కొందరు పరీక్షా ఇంకా అర్ధ గంట ఉందనగా తన తోటి విద్యార్థిని ఆ ప్రెశ్న తెలుసా ఏ ప్రశ్న తెలుసా అని అడిగి దానికి వాడు ఏదో కొత్త ప్రెశ్న చెపితే అరె అది నేను చదవలేదని అప్పుడు గైడు ముందరేసుకొని చదవటానికి ప్రయత్నం చేస్తారు. దానితో ఆ టెంక్షన్తో చదివింది మొత్తం యెగిరి పోతుంది. మైండు పూర్తిగా బ్లాంక్ అవుతుంది. సాధన వల్ల అన్ని సాధ్యం అంటే దాని అర్ధం తానూ చేసే ప్రయత్నం పటిష్టంగా దృఢంగా ఉండాలి. నిజానికి సమస్తరం మొదటి నుండి పాఠాలని శ్రద్ధగా విని ఆకళింపు చేసుకొని చదివే విద్యార్థికి చివరి క్షణంలో చదవలసిన అవసరం ఉండదు. విద్యార్థులు కోర్సు మొదటి రోజునించీ చదవటం మొదలు పెడితే ఏక్షణంలోనైనా పరీక్షా పెట్టినా వ్రాయగలరు. మంచి మార్కులు సంపాదించగలరు.