1, జూన్ 2023, గురువారం

ఆచార్య సద్బోధన:*

 

             *ఆచార్య సద్బోధన:*

                 ➖➖➖✍️



*ఈషణత్రయం.. ?*


*పుత్రదార గృహాదిషు అనభిష్వంగః:-*


```అభిష్వంగః అంటే అతిస్నేహం. అనభిష్వంగః అంటే తగులుకోకుండా ఉండటం.```

```సంతానం,భార్య,భర్త,ఇల్లు మొ॥న విషయాలపట్ల అతిస్నేహం పనికి రాదు.```

```వీటినే’ఈషణత్రయం’ అంటారు.```

```దారేషణ, ధనేషణ, పుత్రేషణ - వీటిలో మానవుడు తగులుకోరాదు.```

```వీటిని కలిగి ఉండటంలో తప్పులేదు. కాని వాటిపై అతిస్నేహం కూడదు - అని గ్రహించాలి.``` ```నిజంగా ఇవి ఏవీ శాశ్వతం కాదు. అవి నీనుండైనా దూరమౌతాయి, లేదా నీవైనా వాటికి దూరం అవుతావు. ఈవిషయాన్ని గ్రహించి వాటి కొరకే నాజీవితం,అవి లేకపోతే నేను లేను. అనే భ్రమను తొలగించుకోవాలి.```


```వ్యామోహం అనే జిడ్డును వదిలించుకోవాలి. అద్దాన్ని చూడండి. అది అన్నింటిని కౌగిలించుకొంటుంది. అందరితో సంబంధం పెట్టుకుంటుంది. కాని దేనికీ అంటుకోదు. అన్నింటిని వదిలేస్తుంది. కనుక సాధకుడు అద్దంలాగా ఉండాలి.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి

 *𝕝𝕝 ॐ 𝕝𝕝 _01/06/23 - జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి - శ్రీ శంకరాచార్య  కైలాస గమనం_ 𝕝𝕝 卐 𝕝𝕝*

~~~~~~


*శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదుల వారు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోడానికి, కైలాస పర్వతానికి వెళ్ళినది ఈరోజే.*


*ఈ రోజే, శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదులవారికి పరమశివుడు  "ఐదు చంద్రమౌళీశ్వర"  ఆత్మలింగాలు కానుకగా ఇచ్చాడు.*

  

*ఈరోజే, అమ్మవారు,  100 శ్లోకాల "సౌందర్యలహరీ" గ్రంధాన్ని శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదుల వారికి అనుగ్రహించారు.* 


*ఈ ఐదు ఆత్మలింగాలనే, ఆదిశంకరులు,   1) శృంగేరి పీఠంలో,  2) కాంచీ పీఠంలో,  3)కేదార్లో,   4) నేపాల్లోని శ్రీ నీలకంఠేశ్వర  ఆలయంలో,  5) చిదంబరంలలో ప్రతిష్టించారు.*


*శంకరులు, ,"5 లింగాలు" మరియు "సౌందర్యలహరీ"  లను భూమిపైకి తెస్తుంటే, "నందికేశ్వరుడు (నందీశ్వరుడు)  అడ్డగించాడు.  అమ్మవారి మంత్రం శాస్త్రం "శ్రీ సౌందర్యలహరీ"  కైలాసం నుంచి భూమిపైకి వెళ్ళిపోతోందని నందీశ్వరుడు  అపారమైన తాపముపొంది, పరివేదన చెందాడు.  100 శ్లోకాల సౌందర్యాలహరి నుంచి  59 శ్లోకాలు సౌందర్యలహరిభాగాన్ని  శంకరులనుంచి బలవంతంగా తీసుకు పోయాడు.*

 

*అప్పుడు, శంకర భగవత్పాదులకు అమ్మవారి అశరీరవాణి వినపడింది.*


*శంకరా!  నీకీయబడిన 100 శ్లోకాల  సౌందర్యలహరి నుంచి 59 శ్లోకాలు  నందీశ్వరుడు బలవంతంగా తీసుకున్నాడు కదా!  ఆ 59 శ్లోకాలు నువ్వు పూరించు అని అమ్మవారు ఆజ్ఞాపించింది*


*అమ్మవారి కటాక్షంతో శంకరులు 59 శ్లోకాలు పూర్తి చేశారు.*


*41 శ్లోకాల మంత్రభాగాన్ని "ఆనందలహరి"  అంటారు.*


*59 శ్లోకాలను సౌందర్యలహరీ అంటారు. ఈ రెండు కలిపి చదివితే కూడా "సౌందర్యలహరీ " అంటారు.*


*32 సంవత్సరాలు మాత్రమే  ఈ పాంచ భౌతిక శరీరంతో  ఈ భూమిపై సంచరించి, వేద ప్రమాణం నిలబెట్టి, అవైదిక వాదనలు ఈ దేశంలో ప్రవేశించకుండా కాపలాగా నలు చెరగులా 4 ఆమ్నాయ పీఠములు పెట్టిన మహాత్ముడు శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదుల వారు.*


*1) తూర్పున - జగన్నాథ్ లో   గోవర్ధన పీఠం*


*2) పడమర - ద్వారకలో కాళికా పీఠం*


*3) ఉత్తరాన - బదరికాశ్రమంలో జ్యోతి పీఠం*


*4) దక్షిణాన -  శృంగగిరి (శృంగేరి )లో  శారదా పీఠము*


*ఈరోజు,తప్పక సౌందర్యలహరి లోని శ్లోకాలను పారాయణ చేసుకుందాం*


*పరమేశ్వర ప్రసాదిత ఆత్మలింగాలను స్మరించు కుందాం.*


*శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదుల వారికి వినమ్రులమై నమస్కరించు కుందాం*


*జయ జయ శంకర - హర హర శంకర*


🪷 🙏🏻 🪷      🪷 🙏🏻 🪷     🪷 🙏🏻 🪷

దానం ధర్మం

 దానం ధర్మం


दानं प्रियवाक्सहितं ज्ञानगर्वं क्षमान्वितं शौर्यं |

वित्तं त्यागसमेतं दुर्लभमेतच्चतुर्भद्रम् ||


మనకు డబ్బు ఉంటే, మనస్సునకు సంతోషం కల్గించే మాటలతో దానం చేసినపుడే శోభిస్తుంది. గర్వము లేనపుడే, జ్ఞానం శోభిస్తుంది. "క్షమ" ఉంటేనే శౌర్యం శోభిస్తుంది. క్షమను అభ్యసించితే, మనం కోపాన్ని తగ్గించుకొనవచ్చు, లేకపోతే కోపాన్ని తగ్గించుకొనజాలము.


మనం పాపం చేసేటప్పుడు దానిని చూచేవారు ఎవ్వరూ లేరనే భావన మనలో ఉండరాదు. దానిని ఇతరులెవ్వరు చూచినా చూడకపోయినా, చూచే ఈశ్వరుడొక్కడున్నాడు. ఈ న్యాయస్థానాల్ని శాసనాన్ని మనం అపరాధం చేసి గూడా మన తెలివితేటలతో తప్పించుకొనినా, ఆ ఈశ్వరుని మాత్రం మనం తప్పించుకొనజాలము.

"ईश्वरस्सर्व भूतानां हृद्देशेर्जुन तिष्ठति” మనం చేసే ప్రతిపనిని మన హృదయంలో ఉండి ఈశ్వరుడు చూస్తున్నాడు. అతడు 'కర్మఫల ప్రదాత' అనే ధృఢమైన భావనను కలిగి ఉంటే, మన వలన పాపాలు జరగవు. నీవు అంతస్సాక్షికి అవిరుద్ధంగా ప్రవర్తించగలిగితే కృతార్థుడవే, అందుకు మనం ఎక్కడకు వెళ్ళనక్కరలేదు.


మనం ఎన్నో ధర్మాలు చేస్తున్నాం. ఎందుకు? పాపాలు పోవడానికి. అసలు పాపకృత్యాలే చెయ్యడం మనేసే ప్రయత్నంచెయ్యాలి. ఈ విధంగా పాపాలు చెయ్యటం మానివేసి, పుణ్యం మాత్రమే చేయటం నేర్చుకొంటే, మనకు పాప ఫలమైన దుఃఖం కలుగదు. పుణ్యఫలమైన సుఖమే వస్తుంది, అప్పుడు మన జీవితాలు ధన్యమౌతాయి. కావున ప్రతి ఒక్కరూ ఈ నిత్య - సత్యమును గమనించి, ఆ విధంగా తమ జీవితములను తీర్చిదిద్దుకొని, ధర్మాచరణమునే చేసి సర్వ శ్రేయముల పొందుదురుగాక.


--- జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు.


|| ॐ नमः पार्वती पतये हरहरमहदेव ||


 https://www.facebook.com/SringeriSankaraMathamNarasaraopet/

ఉపకారేణ

 .

                 _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*ఉపకారేణ నీచానా* 

*మపకారోహి జాయతే॥*

*పయః పానం భుజంగానాం*

*కేవలం విషవర్ధనం॥*



తా𝕝𝕝

పామునకు పాలు పోయుటచే మిక్కిలి విషవృద్ధి యెట్లు కలుగునో అట్లు నీచులకుపకారము చేయగా మనకపకారమే చేయుదురు.

ఈశ్వరా

 *

🙇‍♀️ఈశ్వరా! నీవెంత ప్రేమ మూర్తివి? 

నిన్ను నమ్మిన వారిని అనుక్షణమూ వెన్నంటి కాపాడతావు. 


🙇‍♀️ఈశ్వరా! నీవెంత కరుణా మూర్తివి? 

నిన్ను శరణు కోరిన వారికి నీడలా వెన్నంటి ఉంటావు... 


🙇‍♀️ఈశ్వరా! నీవెంత కఠినాత్ముడివి?

నిన్ను విశ్వసించిన వారి  విశ్వాసాన్ని పరీక్షిస్తూ, కష్టాలను బహుమతిగా ఇస్తావు..


🙇‍♀️ఈశ్వరా! నీవెంత సున్నిత మనస్కుడివి? 

నీ నిజమైన భక్తుడికి నీవు బహుమతిగా ఇచ్చిన  బాధలను నీవిగా అనుభవిస్తావు...


🙇‍♀️ఈశ్వరా! నీవెంత దయా మూర్తివి? 

కష్టాలను తట్టుకుని నిలబడిన నీ భక్తునికి  చేయందించి నీ సాయుజ్యాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తావు... 


🙇‍♀️ఈశ్వరా! నీ సాయుజ్యాన్ని చేరుకునే మార్గంలో విజేతగా నిలిచే అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామీ...! 



🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

మర్కటం - మాటలు*

         *మర్కటం - మాటలు*

                   ➖➖➖✍️


```వేసవి కాలంలోని ఒక సాయింత్రం! పరమాచార్య స్వామివారు మేనాలో కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తున్నారు.```


```స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు. భక్తులు సమర్పించిన పళ్ళబుట్టలు, ఎండుద్రాక్ష, కలకండ, తేనె సీసాలు మొదలైనవన్నీ మేనా ముందు నేలపైన ఉన్నాయి. ```


```హఠాత్తుగా కోతుల దండు ఒకటి దాడికి దిగింది. పళ్ళని తిని మొత్తం చిందరవందర చేసి తేనెసీసాలను తోసివేసి కిష్కింద చేస్తున్నాయి. ```


```అవి మహాస్వామి వద్దకు వెళ్ళి వారికి హాని చేస్తాయి అని శిష్యులు భయపడ్డారు. ```


```కాని మహాస్వామివారి ముఖపద్మంలో రేఖామాత్రమైనా విరక్తి లేదు. వాటిని ఏమీ చెయ్యవద్దని చేతి సైగలద్వారా ఆజ్ఞాపించారు. ```


```స్వామివారిని కాపాడుకోవాలని చేతులలో కర్రలు పట్టుకుని వస్తున్నవారల్లా ఆ కర్రల్లాగే స్థాణువులై నిలబడిపోయారు. ```


```కొద్దిసేపటి తరువాత ఆకోతులన్నీ వచ్చిన పని ముగించుకుని రామకార్యార్థమై వెళ్ళిపోయాయి. ```


```అవి వెళ్ళగానే స్వామివారు భక్తులకి ఒక సంఘటనను చెప్పారు. ```


```తంజావూరు జిల్లాలో ఒక గ్రామంలోని ప్రజలు ఈ కోతుల బాధ భరించలేకపోయేవారు. అనుకోకుండా దొరికిన ఒక కోతిని ఒకతను కర్రతో కొట్టాడు. దానికి తగిలిన దెబ్బలవల్ల అది కొన్ని రోజులకి మరణించింది. తరువాత తనకి కలిగిన ఆడపిల్లకి మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. ```


```ఆ పిల్లకి వివాహం చెయ్యవలసిన వయసు వచ్చింది. అతను మహాస్వామివారి వద్దకు వచ్చి అతను చేసిన పాపాన్ని చెప్పుకుని బాధపడ్డాడు.```


```“మట్టితో కోతిబొమ్మను తయారుచేసి మీ ఊరి గ్రామదేవత గుళ్ళో ఇవ్వు.   మనఃస్పూర్తిగా ఒప్పుకున్నవాడికే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చెయ్యి” అని చెప్పారు. ```


```స్వామివారు చెప్పినట్లే జరిగింది. తరువాత ఆ అమ్మాయికి చక్కగా మాట్లాడగలిగే పిల్లలు పుట్టారు.```


```*కోతులను ఎప్పుడూ కొట్టరాదు. వాటి మీద జాలి చూపించాలి. అవి రాముణ్ణి సేవించుకున్న కోతుల పరంపరలో నుండి వచ్చాయి. అవి మనకు ఇబ్బంది కలిగించినా ‘ఆంజనేయుడు’ అని తలచి వాటిని వదిలిపెట్టాలి.```


```ఈ కథనంతా విని భక్తులు కరిగిపోయారు. పరమాచార్య స్వామివారే బోధించినందుకు ఆనందపడ్డారు.```


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


http://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

రామాయణం

 16.

రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...


            *వాల్మీకి రామాయణం:*

                  *16 వ  భాగం:*

                    ➖➖➖✍️


*పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహోగ్రమైన తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు.* 


*అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేథ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు.* 


*”అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదు” అని మహర్షులు చెప్పారు. “కాని అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తిచెయ్యచ్చు”అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు.*


*ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద, ఋచీకుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చుని ఉన్నాడు.*


*అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహరణకి గురైనందుకుగాను నాకు ఒక యాగపశువు కావాలి, మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి” అన్నాడు.* 


*అప్పుడా ఋచీకుడు ఇలా అన్నాడు… "పెద్దకొడుకు ధర్మసంతానం(పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు) కావున నేను వాడిని ఇవ్వలేను, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడు మధ్య కొడుకైన శునఃశేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు.*


*రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి, యాగం పూర్తి చెయ్యడానికి తన కొడుకుని పంపాడు ఆ ఋచీకుడు.*


*అంబరీషుడు ఆయనకి లక్ష గోవుల్ని దానంగా ఇచ్చాడు. శునఃశేపుడిని తీసుకెళుతున్న అంబరీషుడు కొంతదూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడకి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునఃశేపుడు చూశాడు.*


*వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు "నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామ అవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వననింది, మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేసారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది. కాబట్టి మీరు నన్ను రక్షించాలి" అని అన్నాడు.* 


*అప్పుడు విశ్వామిత్రుడు… “సరే!” అని తన కొడుకులని పిలిచి, “తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ శునఃశేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి” అన్నాడు.*


*కథం ఆత్మ సుతాన్ హిత్వా త్రాయసే అన్య సుతం విభో |*

*అకార్యం ఇవ పశ్యామః శ్వ మాంసం ఇవ భోజనే ||*


*”నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా, ఇంకొకడి కొడుకుని రక్షిస్తావా, మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది” అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు.* 


*ఆగ్రహించిన విశ్వామిత్రుడు......*


*శ్వ మాంస భోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు |*

*పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యాం అనువత్స్యథ ||*


*”మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళలాగ కుక్క మాంసం తింటూ బతకండ”ని శపించాడు.*


*అప్పుడాయన. శునఃశేపుడితో.... “నువ్వు బెంగపెట్టుకోమాకు, నిన్ను తీసుకెళ్ళి యూప స్తంభానికి కడతారు. ఇప్పుడు నేను నీకు రెండు మంత్రాలని చెప్తాను, నిన్ను అలా యూప స్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ రెండు మంత్రాలని జపించు, అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి, నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, ‘నేను ఈ యాగానికి ప్రీతి చెందాను’ అని యాగ ఫలితం ఇస్తాడ”ని చెప్పి ఆ రెండు మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు.*


*తరవాత శునఃశేపుడిని యూప స్తంభానికి కట్టారు, అప్పుడాయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, “నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యాగపశువుని బలి ఇవ్వకుండానే మీకు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను “అన్నాడు.* 


*అందరూ సంతోషించారు. కోపంలో తన కొడుకులని శపించానని విశ్వామిత్రుడు బాధ పడ్డాడు. ఈ సారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.* 


*అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు.*


*”మేనక! నేను నీయందు కందర్ప వశుడనయ్యాను(అంటె మన్మధ ఆవేశం కలిగింది), అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు” అన్నాడు.* 


*మేనక “సరే” అనంది. అలా మేనకతో క్రీడిస్తూ క్రీడిస్తూ పదేళ్ళు గడిచిపోయాయి.*


*సర్వం సురాణాం కర్మ ఏతత్ తపో అపహరణం మహత్ |*

*అహో రాత్రా అపదేశేన గతాః సంవత్సరా దశ ||*


*పది సంవత్సరాల తరువాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ‘ఈ మేనకతో ఏదో, ఒక రోజు లేకపోతే రెండు రోజులు అనుకున్నాను, కాని ఇలా పది సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనస్సుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు’ అనుకొని కోపంగా మేనక వైపు చూశాడు, కాని ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకని వెళ్ళిపోమన్నాడు.* 


*ఈ సారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.*✍️

రేపు... 17వ భాగం...!

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



అక్షయ పాత్ర*

       *అక్షయ పాత్ర*

                ➖➖➖✍️



*అక్షయ పాత్ర అంటే ఏమిటి....?*


*అక్షయ పాత్ర  వెనకాల ఒక కధ వుంది…*


*పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో చాలామంది  బ్రాహ్మణులు కూడా వారి వెంట వెళ్లారు.* 


*కాని అప్పుడు పాండవులకి వీళ్ళందరినీ పోషించే మార్గం తెలియక చాలా ఆలోచనలలో పడ్డారు.* 


*అప్పుడు ధర్మరాజు సూర్యుడిని ప్రార్దించగా వారికి సూర్యభగవానుడు అక్షయపాత్రని ఇస్తారు.*


*”దీని మీద మూత పెట్టి ప్రార్ధిస్తే, ఎంత మందికైనా దీనినుండి కావాల్సిన భోజనం లబిస్తుంది”అని చెప్పారు.* 


*”కాని ఈ అక్షయ పాత్రని కడిగి బోర్లించేస్తే ఇంకా ఆ రోజుకి మళ్ళీ దానినుండి భోజనం లబించదు. కనుక దీనితో మీరు జాగ్రత్తగా అందరిని పోషించండి” అని చెప్పారు.* 


*ఇలా కొన్ని రోజుల పాటు పాండవులు బ్రహ్మణులందరిని పోషిస్తూ వనవాసం కొనసాగిస్తూ వుంటారు.*


*కాని కౌరవులకి వీరు ఎలా                        ఈ బ్రహ్మణులని పోషిస్తున్నారో అంతుచిక్కక చాల ద్వేషం తో వుంటారు.* 


*ఒకసారి దూర్వాస మహర్షి వచ్చినప్పుడు దుర్యోధనుడు మాటల సందర్భంలో ఈ విషయాన్ని చెప్పాడు.*


*ఒకానొక సందర్భంలో ఆమహర్షి అటుగా వెళ్తూ పాండవుల వద్దకు ఆతిద్యానికి వెళ్లారు.* 


*మహర్షి…  “నేను నదీ స్నానం ఆచరించి వస్తాను. ఈ లోపు మీరు ఆతిద్యానికి అన్నీ సిద్ధం చెయ్యండి” అని ఆయన అక్కడనుండి బయలుదేరి వెళ్ళిపోయారు.*


*పాండవులు ద్రౌపదికి ఆతిద్యానికి అన్నీ సిద్ధం  చెయ్యమని చెప్పగా ద్రౌపది చాల కంగారుగా భయంతో “నేను ఇప్పుడే అక్షయ పాత్రను కడిగివేసేసానే! ఇప్పుడు ఎలా మరి?” అని చింతించింది.* 


*అప్పుడు పాండవులు శ్రీకృష్ణుడిని ప్రార్దించారు.* 


*అప్పుడు శ్రీకృష్ణుడు ‘అక్షయపాత్ర ని సరిగా చూడమని కనీసం ఒక్కమెతుకైన దొరుకుతుంది’ అని దాన్ని తెమ్మని అడగ్గా అప్పుడు ద్రౌపది పాత్రలోలో చూడగా ఒక మెతుకు దొరుకుతుంది అది తెత్చి కృష్ణుడికి ఇచ్చింది.*


*అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మెతుకుని వుపయోగించి కృష్ణ మాయతో వారి కడుపు నిండేలా చేసాడు.*


*నదీ స్నానం చేసి వచ్చిన మహర్షి తో పాండవులు ఆతిథ్యానికి రమ్మని చెప్పగా ఆయన “ఏమిటో కడుపంతా నిండుగా వుంది, ఈ రోజు వద్దు లే మళ్ళీ వస్తాం”  అని అక్కడ నుండి వెళ్ళిపోయారు.*

*ఇది అక్షయపాత్ర కధ.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀.🙏

*స్త్రీ - తల్లి, భార్య


           *స్త్రీ - తల్లి, భార్య*

                ➖➖➖✍️


ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను పరదేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వ సంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది.


మనము అమ్మవారి ఆలయానికి వెళతాము. అక్కడ అమ్మవారికి పడీ పడీ దండాలు పెడతాము. అప్పుడు అమ్మవారు ఏమనుకుంటారో తెలుసా? 


‘నీవు చేయు ఈ పూజ, ఈ సేవ,                 ఈ దండాలు నేను కాక  ఎవరో నిన్ను చూడాలని, చూసి వారు నిన్ను మెచ్చుకోవాలని, లేదా ఏ బంధు ప్రీతి కొరకో లేదా   బుధ జన ప్రీతి కొరకో..! అంతే కానీ నీకొరకు, నాకొరకు కాదు. 


బంధు జనం ప్రీతి చెందుతారేమో కానీ, బుధజనము,     నీగురించి తెలిసిన వారు, ధర్మమును ఆశ్రయించినవారు, ధర్మపరులు హర్షించరు. 


ఎందుకంటే అమ్మవారు అంటారు.. ‘ఇక్కడకు వచ్చి, పడి పడి దండాలు పెడుతున్నావు. ఇక్కడ నేను సమిష్టి రూపంలో ఉన్నాను.       అక్కడ                   నీ గృహములో వ్యష్ఠి రూపంలో ఉన్నాను.    నీకు తల్లిగా, 

నీకు భార్యగా,    నీకు చెల్లిలిగా, 

నీకు అక్కగా, నీకు ఒక వదినగా, మరదలుగానే కాక,  ప్రతి స్త్రీ మూర్తిలోనూ వ్యష్ఠి రూపములో ఉన్నాను,  కాబట్టి ముందు అక్కడ నుండి మొదలుపెట్టరా, నీ సేవ, 

నీ పూజ. 


‘అక్కడ అమ్మకు పట్టెడు అన్నం పెట్టవు’. ‘అమ్మా నీకు ఆరోగ్యం ఎలా వుంది’ అని అడిగిన పాపాన పోవు.


కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపే చ లక్ష్మీ,   క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కులధర్మపత్నీ. అని కదా అన్నారు? 


మరి అలాంటి ధర్మపత్ని, నీకు, 

మీ వంశానికి, వంశోద్ధారకుణ్ణి ప్రసాదించి,  నిన్ను, నీ ముందు తరతరాలవారినీ,  పున్నామ నరకము నుండి తప్పించడానికి తన ప్రాణాలనే ఫణముగా పెట్టి యోగ్యమైన సంతానాన్నిచ్చి, మిమ్ములను, మీ వంశన్నీ ఉద్ధరింపచేసే స్త్రీ మూర్తి, నీ సహధర్మచారిణిని, కట్నం తేలేదని లేదా, మీ మామగారు నీ గొంతెమ్మ కోరికలను తీర్చలేదని, నరక యాతనలకు గురిచేయు ధూర్తుడా, నీ వా ఇక్కడకి వచ్చి పడి పడి దండాలు పెడుచున్నావు. 


ఇక్కడ ఒకవిషయం ఎవరైనా సరే మనస్పూర్తిగా ఆలోచించాలి మనకు ఆరోగ్యం బాగా లేదు, పడకవేస్తే, ఆమె బాధపడుతుంది, ఆక్రోశిస్తుంది, అల్లాడి పోతుంది, తల్లడిల్లిపోతుంది, వివిలలాడుతుంది మన ఆలనా పాలనా చూచి, సమయానికి మందులు, మాత్రలు, సరియైన ఆహారం ఇవ్వడం, మనకు సేవలు చేయడం, కన్నతల్లి లాగా, ఎక్కువగా మనలను సేవించి మనకోసం, మన కుటుంబముకోసం, అన్నీ తానై పాటుపడే సహనమూర్తి, త్యాగశాలి ధర్మపత్ని.    


అందుకే కదా కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, ఇత్యాది రూపాలుగా మన పూర్వులు ధర్మపత్నిని గౌరవించి స్త్రీ మూర్తికి అగ్ర తాంబూలం ఇచ్చారు. 


మరి అలా తల్లడిల్లినపుడు, బాధతో ఆక్రోశించినపుడు, విలవిలలాడేటప్పుడు, రాత్రంతా నీ మంచము ప్రక్కన కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతూ సేవలు చేస్తూ నీకోసం అహోరాత్రము శ్రమిస్తుంది.


మనము బ్రతికి (ఆరోగ్యం కుదుటబడి) బట్టకడితే ఈ జనులు, బుధజనులు ఏమంటారో తెలుసా “ఆ తల్లి మాంగల్యం గట్టిది, ఆతల్లి పూజాఫలము ఆయనకు పునర్జన్మ నిచ్చింది” అంటారే కానీ     నీ గొప్పనో లేక నీ అదృష్టమనో అనరు. 


మన ఆకలిని ఎరిగి తనకు లేకపోయినా తన అమృత హస్తాలతో కొసరి కొసరి వడ్డించి అన్నము పెట్టే.  నీ సహధర్మచారిణి (భార్య) లో భోజన సమయములో అమ్మ కనిపించడములేదా? అమ్మతనాన్ని చూడలేవా? 


దాసిగా సేవలు చేయు నపుడు, మన కోపాలను, దుర్భాషలను, రాక్షసప్రవృత్తిని ఆ స్త్రీమూర్తి భరించు నపుడు ఆమె క్షమా గుణంలో భూమాతను దర్శించలేని నీవు, కట్నం తేలేదని లేదా, మీ మామగారు నీ గొంతెమ్మ కోరికలను తీర్చలేదని, నరక యాతనలకు గురిచేయు ధూర్తుడా, నీ వా ఇక్కడకి వచ్చి పడి పడి దండాలు పెడుచున్నావు. ఎవరికి కావాలి ఇలాంటి ఈ నటనల పూజ. ఇక్కడ ఆలయంలో అమ్మవారికి పూజచేస్తూ ఒక సెకను నీ పంచేంద్రియాలను అమ్మవారి పాదముల చెంత ఆవిష్కరించలేవు, పూజ చేస్తూ కూడా పక్కన ఓ అమ్మాయి కనబడ్డా, ఒక స్త్రీమూర్తి కనబడ్డా ఇక్కడే నీ బుద్ధి, మనము వెర్రివేషాలు వేస్తుంటే చూస్తూ అన్నందిస్తావు. పరస్త్రీలో శయనేషు రంభే తప్ప భోజ్యేషు మాతా, కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, కనపడదు.పర దేవత అసలు కనపడదు. పరస్త్రీలో పర దేవత ను, తల్లిని దర్శించలేని, నీవు, నీ పూజ, నీవు చేసే ఈ పడి పడి దండాలు ఎవరికి కావాలిరా? ధూర్తుడా! విశ్వాస ఘాతకూడా! అని అమ్మవారు ఛీద రించుకుంటుంది తెలుసా?


ఇవే కాక మన పిల్లలకు తల్లి దగ్గర, నాన్నమ్మ, అమ్మమ్మ దగ్గర ఉండే చనువు, ప్రేమ, విశ్వాసము అపారము అనిర్వచనీ యము. ప్రతీది బిడ్డ తల్లితో చర్చిస్తుంది. తల్లిని అడుగుతుంది. మరియు తల్లులు తన బిడ్డల నడవడి, చేసే పనుల పట్ల తనకు తెలియకుండానే చాలా అప్రమత్తతతో ఉంటారు. ఎందుకంటే అది తన రక్తం, పేగుబంధం కాబట్టి బిడ్డలు ఎక్కడ వున్నాతల్లి ఆ బిడ్డను వేయి కళ్ళతో వారి ప్రతి అలోచనను, ప్రతి అడుగును గమనిస్తూ ఉంటుంది. పడకవేస్తే, ఆమె బాధపడుతుంది, ఆక్రోశిస్తుంది, అల్లాడి పోతుంది, తల్లడిల్లిపోతుంది, వివిలలాడుతుంది మన అలనా పాలనా చూచి,సమయానికి మందులు, మాత్రలు, సరియైన ఆహారం ఇవ్వడం, మనకు సేవలు చేయడం, కన్నతల్లి లాగా, ఎక్కువగా మనలను సేవించి మనకోసం, మనకుటుంబముకోసం, అన్నీ తానై పాటుపడే సహనమూర్తి, త్యాగశాలి ధ్ర్మపత్ని. అందుకే కదా కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, ఇత్యాది రూపాలుగా మన పూర్వులు ధర్మపత్నిని గౌరవించి స్త్రీ మూర్తికి అగ్ర తాంబూలం ఇచ్చారు. మరి అలా తల్లిడిల్లినపుడు, బాధతో ఆక్రోశించినపుడు, విలవిలలాడేటప్పుడు, రాత్రంతా నీ మంచము ప్రక్కన కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతూ సేవలు చేస్తూ నీకోసం అహోరాత్రము శ్రమిస్తుంది.

ఆదిత్యనారాయణ..

మనము బ్రతికి (ఆరోగ్యం కుదుటబడి) బట్టకడితే ఈ జనులు, బుధజనులు ఏమంటారో తెలుసా “ఆ తల్లి మాంగల్యం గట్టిది, ఆతల్లి పూజాఫలము ఆయనకు పునర్జన్మ నిచ్చింది” అంటారే కానీ నీ గొప్పనో లేక నీ అదృష్టమనో అనరు. మన ఆకలిని ఎరిగి తనకు లేకపోయినా తన అమృత హస్తాలతో కొసరి కొసరి వడ్డించి అన్నము పెట్టే నీ సహధర్మచారిణి (భార్య) లో భోజన సమయములో అమ్మ కనిపించడములేదా? అమ్మతనాన్ని చూడలేవా? దాసిగా సేవలు చేయు నపుడు, మన కోపాలను, దుర్భాషలను, రాక్షసప్రవృత్తిని ఆ స్త్రీమూర్తి భరించు నపుడు ఆమె క్షమా గుణంలో భూమాతను దర్శించలేని నీవు, కట్నం తేలేదని లేదా, మీ మామగారు నీ గొంతెమ్మ కోరికలను తీర్చలేదని, నరక యాతనలకు గురిచేయు ధూర్తుడా, నీ వా ఇక్కడకి వచ్చి పడి పడి దండాలు పెడుచున్నావు. ఎవరికి కావాలి ఇలాంటి ఈ నటనల పూజ. 


ఇక్కడ ఆలయంలో అమ్మవారికి పూజచేస్తూ ఒక సెకను నీ పంచేంద్రియాలను అమ్మవారి పాదముల చెంత ఆవిష్కరించలేవు, 


పూజ చేస్తూ కూడా పక్కన ఓ అమ్మాయి కనబడ్డా, ఒక స్త్రీమూర్తి కనబడ్డా ఇక్కడే నీ బుద్ధి, మనసు వెర్రివేషాలు వేస్తుంటే చూస్తూ ఆనందిస్తావు.  పరస్త్రీలో శయనేషు రంభే తప్ప భోజ్యేషు మాతా, కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, కనపడదు. పర దేవత అసలు కనపడదు. పరస్త్రీలో పర దేవత ను, తల్లిని దర్శించలేని, నీవు, నీ పూజ, నీవు చేసే ఈ పడి పడి దండాలు ఎవరికి కావాలిరా? ధూర్తుడా! విశ్వాస ఘాతకూడా! అని అమ్మవారు ఛీద రించుకుంటుంది తెలుసా?


ఇవే కాక మన పిల్లలకు తల్లి దగ్గర, నాన్నమ్మ, అమ్మమ్మ దగ్గర ఉండే చనువు, ప్రేమ, విశ్వాసము అపారము అనిర్వచనీయము. ప్రతీది బిడ్డ తల్లితో చర్చిస్తుంది. తల్లిని అడుగుతుంది. మరియు తల్లులు తన బిడ్డల నడవడి, చేసే పనుల పట్ల తనకు తెలియకుండానే చాలా అప్రమత్తతతో ఉంటారు. ఎందుకంటే అది తన రక్తం, పేగుబంధం కాబట్టి బిడ్డలు ఎక్కడ వున్నాతల్లి ఆ బిడ్డను వేయి కళ్ళతో వారి ప్రతి ఆలోచనను, ప్రతి అడుగును గమనిస్తూ ఉంటుంది.


కావున కేవలం తల్లి కే (ఆ పరదేవతకే) అది సాధ్యం. బిడ్డలు చేసిన పనులను, ఆలోచనలను, వారి అసంతృప్తులను, మంచి చెడులు ఎప్పటి కప్పుడు వివరించి, ధర్మాధర్మములను వివరించి, బిడ్డలను తీర్చిదిద్దగలిగే శక్తి ఒక్క తల్లికి మాత్రమే ఉంది. తండ్రికి కాదు. వారికి అర్థమయ్యే రీతిలో చెప్పి వారిని సమాధానపరచ గలదు తల్లి. 


అందుకే వేద వేదాంగములలో మొదటి నమస్కారము తల్లికే “మాతృదేవోభవ” అన్నారు. ప్రతి తల్లి బాధ్యతలు స్వీకరించింది కావున ఈ సమాజము ధర్మమార్గమునకు, న్యాయ మార్గమునకు మన భారతదేశము ఇతర దేశములకు ఆదర్శముగా పూజనీయ మైనది గౌరవప్రదమైనది. ప్రతి తల్లి బాధ్యతలు స్వీకరించి తన బిడ్డలను ధర్మమార్గంలో నడపగలిగితే ఈ సమాజము ధర్మమార్గమునకు, న్యాయ మార్గమునకు మన భారతదేశము ఇతర దేశములకు భావితరాలకు కూడా ఆదర్శము కాగలదు.


గృహస్తాశ్రమము(సంసారజీవనము) లో స్త్రీ పాత్ర ఎంతటిదో అలాంటి స్త్రీ మూర్తిలో శయనేషు రంభే తప్ప భోజ్యేషు మాతా, కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, కనపడదు. పర దేవత అసలు కనపడదు. పరస్త్రీలో పర దేవతను, తల్లిని దర్శించలేని, నీవు, నీ పూజ, నీవు చేసే ఈ పడి పడి దండాలు ఎవరికి కావాలిరా? ధూర్తుడా! విశ్వాస ఘాతకూడా! అని అమ్మవారు ఛీదరించుకుంటుంది తెలుసా?


తన ధర్మపత్నిలో పర దేవతను చూసిన మహానుభావులు పుట్టిన దేశంమనది, అంతగొప్ప సంస్కృతి మనది.


రామకృష్ణ పరమహంస తన ధర్మపత్నిలో పరదేవతను చూచిన మహాపురుషుడు...✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

కాలం-వినియోగం*

 

              *కాలం-వినియోగం*

                   ➖➖➖✍️


*ప్రతీ పనికి అనువైన కాలం అనేది ఉంటుంది.*

*ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తేనే, దానివల్ల ప్రయోజనం. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా వుండాలంటే, వర్షాకాలంలో ఎక్కువ నీటిని నిల్వ చేసుకోవాలి. ఎక్కువ నీరు నిల్వ ఉండాలంటే, వానలకు ముందే చెరువుల్లో పూడికను తీసివేయించాలి.*


*ఇలా మనిషి చేసే ప్రతి పని కాలానుగుణంగా ఉండాలి. క్రమం తప్పని సృష్టి నియతిని చూసి, మనిషి నేర్చుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమంటే ఇదే. గతించిన కాలం గురించి చింతించి ప్రయోజనం లేదు. వర్తమానాన్ని నిర్లక్ష్యం చేసి, భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవడంలో అర్థం లేదు.*


*పుట్టిన తరవాత మనిషి కాలానుగుణంగా పొందేవాటిలో ముఖ్యమైనది యౌవన దశ. మనోవికాసానికి కావాల్సిన వనరులన్నీ యుక్తవయసులోనే పుష్కలంగా ఉంటాయి.*


*వికాసం అంటే- జీవితంపై సుస్పష్టమైన అవగాహన ఏర్పరచుకుని లక్ష్యంతో జీవించడం. సృష్టిలో మిగతా ఏ ప్రాణికీ దక్కని అవకాశం ఇది.*


*పట్టువిడవకుండా నిరంతరం కృషిచేసే సామర్థ్యం, యువశక్తిలో మెండుగా ఉంటుంది. వృద్ధాప్యంలో ఇంద్రియ పటుత్వం తగ్గుతుంది. శరీరం సహకరించనప్పుడు ఏ ఉన్నత కార్యాల్నీ తలపెట్టలేరు. గడించిన అనుభవం గొప్ప ఆస్తిగా మిగులుతుంది. తనకు తానుగా ఉన్నత కార్యాలకు పూనుకోకపోయినా, విజయపథంలో దూసుకుపోయేవారికి చిరునామా అవుతారు.*


*యుక్తవయసులో ఉన్నప్పుడు లభించిన శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకున్న వారికే వృద్ధాప్యం గొప్ప వరమవుతుంది. యౌవనాన్ని వ్యర్థం చేస్తే వృద్ధాప్యం బాధించక మానదు.*


*ఉపాధ్యాయుడు గొప్ప అనుభవజ్ఞుడైనా- విద్యార్థిలో క్రమశిక్షణ, చదువుపై శ్రద్ధ లేకపోతే అతడు రాణించలేడు. ద్రోణాచార్యులు విలువిద్యను శిష్యులందరికీ ఒకే విధంగా నేర్పించారు. అర్జునుడి స్థాయికి మిగతావారు ఎదగలేకపోయారు.*


*విలువిద్యపై పార్థుడికి ఉన్న తీవ్ర ఆసక్తే దీనికి కారణం. అందుకే గురువుకు తగ్గ శిష్యుడు, శిష్యుడికి తగిన గురువు ఉండాలంటారు పెద్దలు. దేనినైనా నేర్చుకోవాలన్న కుతూహలం శ్రద్ధాసక్తులు, బాల్యంలోనే ఏర్పడాలి.*


*బాల్యంలో మనసు శుద్ధంగా స్వచ్ఛంగా తెల్లకాగితంలా ఉంటుంది. వీటిపై పెద్దలు ఏది రాస్తే అదే వారి మనసులో ముద్రితమవుతుంది. అవే యుక్తవయసులో సంస్కారాలుగా మనస్సాక్షికి ముడిపదార్థంలా రూపొందుతాయి.*


*సాయంసంధ్యా సమయాలలో పిల్లలను దగ్గరకు చేర్చుకుని గతంలో బామ్మలు నీతి కథలు చెప్పేవారు. అవి పసిహృదయాలలో నాటుకుని శీలనిర్మాణానికి దోహదపడేవి.*


*భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన స్వామి వివేకానందుడిలో ఆధ్యాత్మిక భావాల్ని బాల్యంలోనే తల్లి భువనేశ్వరీదేవి నూరిపోసి, జాతి గర్వించే తత్వవేత్తగా తీర్చిదిద్దింది.*


*వీరోచిత భావాలను ఆర్షవైభవాన్ని బాల్యంలోనే తల్లి జిజియాబాయి బువ్వగా తినిపించి శివాజీని ఛత్రపతిని చేసింది.*


*అందుకే మన పూర్వీకులు అమ్మకు గురువులలో ప్రథమస్థానం, దేవతలలో ఉన్నత స్థానం కల్పించారు. *


*సర్వసంగ పరిత్యాగులైనా తల్లికి పాదాభివందనం చేస్తారు.*


*బాల్యంలో ఉత్తమ సంస్కార బీజాలు పడినా, అవి అభ్యాసదశలో(కౌమారం) నిర్జీవం కాకూడదంటే విద్యతోపాటు శీలనిర్మాణానికి అధ్యాపకులు, తల్లిదండ్రులు ప్రాధాన్యమివ్వాలి.*


*వారి ఉరకలేసే ఉత్సాహాన్ని సన్మార్గంలోకి మళ్ళేలా చూడాల్సిన బాధ్యత పెద్దలదే.*


*గురువుల సన్నిధే పరిపూర్ణ వ్యక్తి వికాసానికి చివరి మెట్టు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



మంచితనం

 

*మన మంచితనం…*

             *మనల్ని కాపాడుతుంది.*

                 ➖➖➖✍️


*ఒక వ్యక్తి ప్రతిరోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు.   అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు.*


*అది చూసి చాలా ముచ్చటపడేవాడు. ‘మనం కూడా ఇలా చేయాలి’ అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు.*


*అతను అడవిలో  కూరాకులు కోస్తుంటే  తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి ‘మనం ఎలాగూ పూజ చేయలేము,  ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం’ అని అనుకున్నాడు.*


*కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు.*

*అతడికి తెలియని విషయం ఏంటంటే నల్ల నాగు ఒకటి అందులో ఉన్నది.*


*ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే, ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో… “అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు. నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను” అని అన్నాడు.*


*ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న                   ఆ బ్రాహ్మణుడికి తన దివ్యదృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి  వెనుక రాహువు నిలబడిఉండడం  గమనించాడు.*


*అతడితో … “నాయనా  నేను చెప్పేవరకు ఈ కట్టను  నీ తలపై నుండి దించకు!” అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు.*


*రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావువని అడగగా రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి “నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే విధి రాత కాని అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను.” అని అన్నాడు.*


*ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు తులసి దళాన్ని తీసుకురావడంతో ‘ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా?’ అని అడిగినప్పుడు రాహువు…*


*”అయ్యా మీరు ఇన్నిరోజులు పూజ చేసిన పుణ్యాఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే ఈ గండం నుండి తప్పించవచ్చు” అని రాహువు చెప్పగానే …*


*బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా “అతడికి దానం ఇస్తున్నాను” అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు.*

*ఆ పాము మాయమైంది*


*ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా?*

*ఒక దానం  ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడడమా?*

*మనం సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా ?*

*దేవతా గ్రహాలని బ్రహ్మ రాతను మార్చేంత శక్తి గలదా?*


*బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి “ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి!” అని చెప్పాడు.*


*సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు.*

*************


*ఆస్తులే కూడబెట్టక్కరలేదు ఆపదను తప్పించుకోవడానికి కొంచం మంచి పనులు చేయండి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



ఆచార్య సద్బోధన:

 


             *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️


*అజ్ఞాన వినాశం*


```సూర్యరశ్మికి దూది తగులబడదు, భూతద్దం క్రింద దానిని ఉంచినప్పుడు మాత్రం, భూతద్దం ద్వారా ప్రసరించిన సూర్యకిరణాల కది నిప్పంటుకొని తగులబడి పోతుంది.```


 ```అట్లే ఆత్మ యొక్క ఎరుక సర్వకాల సర్వావస్థలలోనూ ప్రకాశిస్తూ వుండేదే అయినా, జీవుని అజ్ఞానాన్ని మాత్రం అది నశింపచేయదు.```


```ధ్యానసాధన ద్వారా చిత్తవృత్తి రాహిత్యపూర్వకమైన విశుద్ధ అహంస్ఫూర్తిని సాధించినప్పుడు అజ్ఞానం పూర్తిగా నశించి పోతుంది.```✍️

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



ధాతుపౌష్టిక లేహ్యం

 ధాతుపౌష్టిక  లేహ్యం  ఉపయోగాలు  - 


 *  శరీరమునందలి ధాతువులకు బలం చేకూర్చును . 


 * రక్తము నందలి దోషములను  పోగొట్టి రక్తమును శుభ్రపరచును . 


 *  కండరములు బలాన్ని చేకూర్చును . ఎముకలు గట్టిబడచేయును . 


 *  వాత, కఫ సంబంధ రోగములు నాశనం చేయును . 


 * శరీర నిస్సత్తువ , నరాల దోషములు నివారణ చేయును . 


 *  వృద్దాప్యము నందు కలుగు శారీరక రుగ్మతలు నశింపచేయును . 


 *  ఎదైనా రోగము చేత శరీరము కృశించబడి ఉండువానికి శరీరం కండబట్టి దుర్బలత్వము నుండి బయటపడును . 


 *  రక్తశుద్ధి వలన ముఖవర్చస్సు పెరుగును . 


 *  చిన్నపిల్లల శారీరక ఎదుగుదల మీద అద్బుతముగా పనిచేయును . 


 *  స్త్రీలయందు కలుగు హార్మోనల్ సమస్యలకు చక్కగా పనిచేయును . 


 * మెనోపాజ్ స్ధితికి దగ్గరగా ఉండు స్త్రీలలో కలుగు "ఆస్ట్రియోపోరొసిస్ " అను ఎముకల బలహీనపరిచే వ్యాధిని  దరిచేరనియ్యదు . 


 * పిల్లల ఙ్ఞాపకశక్తి పెరుగును . 


 *  మగవారిలో సంభోగ సంబంధ సమస్యలకు , నరాల బలహీనత పైన పనిచేయును . 


 *  థైరాయిడ్ సమస్యల వలన వచ్చు నీరసం మరియు అసహన సంబంధ సమస్యలకు దీన్ని తప్పక వాడాలి . 


 *  మానసిక సంభంద సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేయును . 


       పైన చెప్పినవే కాకుండగా మరెన్నో సమస్యలకు ఇది వజ్రాయుధములా పనిచేయును . దీనియందు 16 రకాల విశిష్ట మూలికలు మరియు ముత్య , స్వర్ణ , అభ్రక భస్మాల మిళితముగా ఉండి అత్యంత శక్తివంతముగా పనిచేయును . దీనికి ఎటువంటి పథ్యములు పాటించవలసిన అవసరం లేదు . చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనను వాడవచ్చు .  


      ఈ ధాతువృద్ధి లేహ్యము కావలసిన వారు 9885030034 నంబర్ నందు సంప్రదించగలరు . 


      కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు  


                9885030034

ఉద్ధరించుకోవాలి

 🙏🙏🙏

********

               **శుభోదయం**

                        ***

**మనిషి ఉద్ధరింపబడటానికి, అధోగతి పాలుకావడానికి తనకు తానే కారణం. అందువలన, తనను తానే ఉద్ధరించుకోవాలి. తన మనస్సే తనకు బంధువు మరియు శత్రువుకూడాను, మంచి కోరటం, ఆచరించటం వలన మనస్సు బంధువుగా, మనని ఉద్ధరిస్తుంది. చెడ్డ పనులు ఆలోచనలు వలన మన మనస్సు శత్రువుగా మనలను అధోగతి పాలు చేస్తుంది.*

*అంటే, మనం అధోగతి పాలైనా, ముక్తి మార్గాన్ని అధిరోహించినా దానికి కారణం మన సాంగత్యం కాదు. మనో నిగ్రహంతోనే మన అధోగతి లేదా ఉన్నతి. ఇంతటి గొప్ప విషయాలను, నిత్య సత్యాలను నిక్షిప్తం చేసుకున్న గ్రంధం భగవద్గీత. నిత్యం పారాయణం చేద్దాం, ఆత్మతృప్తిని పొందుదాం, మోక్ష సాధనకు కృషి చేద్దాం.**

                       ***

*ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః*

                       ***

          **ఇదం న మమ**

      **శుభప్రదమైన రోజు**

                      ***

**హర్షవర్ధన్ రావు సిరిపురపు వేంకట శ్రీ**

🙏🙏🙏

ఎట్టి కష్టమైన

 177వ రోజు: (బృహస్పతి వారము) 01-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


ఎట్టి కష్టమైన గుట్టుగా నుంచక 

ఎఱుక పరుప వలయు నింటి వద్ద 

కన్నవారి ప్రేమ కడవారి కుండునా?

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


జీవితములో ఎటువంటి కష్టము వచ్చినను గుట్టు(రహస్యము)గా ఉంచుకొన కుండ ఇంటి వద్ద గల పెద్దలకు, తల్లిదండృలకు ఎఱుక(తెలియజేయ) వలెను. ఏలననగా కన్నవారు (తలిదండ్రులకు) ఉన్న ప్రేమ ఇతరులకు ఉండదు కదా! వారు సరియైన సూచనలతో సమస్యను పరిష్కరించ ప్రయత్నింతురు కదా!.

 

ఈ రోజు పదము. 

కుందేలు (Rabbit): కుందేలు, చెవులపిల్లి, చెవులపోతు, ప్లుతగతి, మృదురోమము, శశమ.

చారిత్రాత్మక కథాస్రవంతి🌹* . ♦️ *ఆర్య చాణక్య*♦️ *అధ్యాయము - 13 : పార్ట్ - 77*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌷🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*అధ్యాయము - 13 : పార్ట్ - 77*


చంద్రగుప్తుని సేనలు పాటలీపుత్రాన్ని ముట్టడించాయి. 


పాంచాల, సింహపుర, నేపాళ, కిరాతక, బాహ్లికాదిక్, కళింగ, ఆంధ్ర రాజ్యముల నుండి తరలి వచ్చిన అశేష సైనిక సమూహమునకు పర్వతకుని సర్వసైన్యాధ్యక్షునిగా గౌరవ బాధ్యతలప్పగించి చాణక్య చంద్రగుప్తులు యుద్ధయాత్రను ముందుకు నడిపించారు. 


జీవసిద్ధి మంత్రాంగమునకు నందుల అహంకారముతోడైనందున మగధకు వచ్చే నలువైపులా ఉన్న సామంత దుర్గములన్నీ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే చంద్రగుప్తుని వశమయ్యాయి. ఇంద్రప్రస్థము, హస్తినాపురము, కురుక్షేత్రము, కాశీ, అయోధ్య, మధుర తదితర సామంతరాజ్యాలన్నీ సంధి చేసుకుని చంద్రగుప్తుని సార్వభౌమత్యాన్ని అంగీకరించాయి. 


'తాము జయించిన రాజ్యములలో గారీచ మధ్యమమున నున్న గ్రామాలలో గానీ ప్రజలను కొల్లగొట్టరాదనీ, హింసించరాదనీ, స్త్రీలపై అత్యాచారమునకు పాల్పడరాదనీ ' చాణక్యుడు తన సేనలకు ముందుగానే కఠినమైన హెచ్చరికలు ఇవ్వడం చేత దారిపొడవునా గ్రామ గ్రామాన జనులు జేజేలతో చాణక్య చంద్రగుప్తులకు స్వాగతాలు పలికారు. అలా మూడు మాసాలు పాటు వరస రాజ్యాలన్నింటినీ లొంగదీసుకుంటూ వచ్చిన చంద్రగుప్తుని సేనలు ఒక శుభముహూర్తాన పాటలీపుత్రమును నాలుగు వైపుల నుంచీ ముట్టడించాయి. 


పారశీక నేపాళ సైన్యములతో పర్వతకుడు, అతని సోదరుడు వైరోజనుడు, కుమారుడు మలయకేతువులతో కలిసి చాణక్యుడు పాటలీపుత్రపు ఉత్తరదిక్కును ముట్టడించాడు. 


సింహపుర, కామారాపాధిపతులు తమ సేనలతో తూర్పునుండి పాంచాల, కొరాత, బహ్లికాదులు పడమటి దిక్కు నుండి ముట్టడించారు. 


ఇక ఆంధ్ర, కళింగ, పిప్పలవన సేనా సమూహంతో దక్షిణ దిశ నుండి పాటలీపుత్రాన్ని ముట్టడించాడు చంద్రగుప్తుడు. పాటలీపుత్ర దుర్గము శత్రుసమూహముల మధ్య దిగ్బంధమైపోయింది. 


మగధ సామ్రాజ్యమునకు రాజధాని నగరం పాటలీపుత్రము తొమ్మిది మైళ్ళ పొడవు రెండు మైళ్ళ వెడల్పు కలిగినది. దాని చుట్టూ అరవైనాలుగు ముఖద్వారాలతో, అయిదువందల డెబ్బై బురుజులతో నిర్మించబడిన కోటగోడ పటిష్టమైనది. ఆ కోటగోడలపై అశ్వరుడులై సైనికులు పహారా కాయుటకు వీలుగానున్నది. ఆ దుర్గమునకు నలువైపులా అగాధమువంటి కందకము నిర్మించబడింది. ఆ కందకము నిండా శోణానది జలాలు నిండుగా ప్రవహిస్తూ వాటిలో భయంకరమైన మొసళ్లు తిరిగాడుతుంటాయి. 


ఆ కందకము దాటడానికి దానిపై బలమైన చెక్కవంతెనలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఆ వంతెనలు కోటలోనించే పైకి లేపుట, కందకము మీదికి దించు ఏర్పాటు ఉండడం చేత కోటలోని వారి అనుమతి, సహాయ సహకారాలు లేనిదే బయటివారెవ్వరూ దుర్గములోపలికి ప్రవేశింపలేరు. సాధారణ దినములలో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆ వంతెనలు కందకము మీదికి దించబడి పౌరుల రాకపోకలకు వీలు కల్పిస్తుంటాయి. రాత్రిళ్ళు మాత్రం వంతెనలు కందకముపైకి లేపబడతాయి. ఈ ప్రత్యేకత వలననే పాగలాపుత్ర దుర్గము అన్యులకు దుర్గ్రాహ్మమైనదిగా పేరుగాంచింది. 


పాటలీపుత్రము చుట్టూ వందలాది పాటలీవృక్షములతో కూడిన అనేక వనములు ఉండడం చేతనే దానికి పాటలీపుత్రము అనే పేరు ఏర్పడింది. ఆ పుష్పముల సువాసనలు నిరంతరమూ వ్యాపించుచుండుట చేత దానికి కుసుమపురము అనే నామాంతరము వచ్చింది. 


ఇన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కారణంగానే పాటలీపుత్రమును నలువైపులా చుట్టుముట్టిన చంద్రగుప్తుని సేనా వాహినులు కోటలోనికి ప్రవేశించే ఉపాయాలను అన్వేషిస్తూ కోటబయటనే మోహరించాయి. 


కోటలోపల వందలాది విశాలమైన వీధులు, వివిధ స్తోమతలు గల ప్రజలు నివసించు వివిధ రకాల నివాసాలు ఉన్నాయి. కోటలోపల మరో బలమైన ప్రాకారము ఉన్నది. ఆ ప్రాకారము నలుచతురాస్రాకారము గలది. దానిని ఆనుకొని లోపలా, బయటా సైనికులూ, సేనాధిపతులూ, మంత్రులు, ఇతర రాజోద్యోగులు నివసించడానికి వారి వారి అర్హతలకి తగినట్టుగా నివాసాలు ఉన్నాయి. వాటితోపాటు చతురంగబలాల కవాతులకు విశాలమైన మైదానాలు, వివిధ ఆయుధాలతో నిండిన గిడ్డంగులు, గజ, తురగశాలలు, ధాన్యాగారాలు, ధనగారాలు ఉన్నాయి. వీటి మధ్యన సువిశాలముగా ఇంద్రభవనమును పోలిన రాజభవనమున్నది. 


అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అలరారే ఈ రాజభవనానికి 'సుగాంగ ప్రాసాదము' అని పేరు. 


ఈ సుగాంగ ప్రాసాధనలో గల వివిధ భవన సముదాయాలలో రాక్షసామాత్యుడు, ఇతర ముఖ్యులు నివసిస్తుంటారు. వీటి మధ్యన మహాద్భుతమైన భవనమే రాజగృహము. ఈ రాజగృహములో సముదాయాలలో మగధరాజులు వారి కుటుంబ సభ్యులు నివసిస్తుంటారు. 


ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పాటలీపుత్రపు కోటలోపలికి ప్రవేశించుటెట్లో చంద్రగుప్త, పర్వతకులకు బోధపడలేదు. చాణక్యుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా ఉండిపోయాడు. 


రెండు రోజులపాటు ఇరువర్గాలలో ఎలాంటి చలనమూ లేదు. కోటలోపలి నుంచి ప్రతిఘటించిన వారు లేరు. కోట బయట నుంచి పోరు సలపడానికి వైరివర్గము వారెవరూ తారసపడలేదు. అలా ఎంతకాలము నిశ్శబ్దాన్ని భరించాలో ఎవ్వరికీ అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. 


మూడోనాటి ఉదయం కోటలో ఒక విచిత్రం జరిగింది. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

చేమకూర కవిత్వపటుత్వం


 చేమకూర కవిత్వపటుత్వం నిజంగా చేమకూరయే. వండనేర్చినవారు చేమకూరను వండితే దానికి ఇక ఏ కూర కూడా సాటిరాదు. అదేవిధంగా చేమకూరవారి కవిత్వమునకు కూడా సాటివచ్చు కవిత్వము లేదనేది సత్యము. ప్రబంధాలలోని వర్ణననలు పరమాద్భుతంగా ఉత్ప్రేక్షలతో అలరారుతూ ఉంటాయి. ఇక విజయవిలాసం గురించి వేరే చెప్పాలా? ప్రముఖ నాస్తికుడైన తాపీ ధర్మారావుగారు విజయవిలాసం లోని కవిత్వానికి ముచ్చటపడి హృదయోల్లాసవ్యాఖ్య వ్రాశారంటే.... చేమకూరవారి కవిత్వంలోని చేవ ఎటువంటిదో మనం అర్థంచేసుకోవచ్చు. 


మంచి రసవంతమైన పద్యమును అర్థంతోసహా అందించిన మీకు ధన్యవాదములు ఆర్యా!



ధర్మము

 ధర్మము


"ధర్మః” శబ్దమునకు “సమస్త విశ్వమును నిలకడగా ఉంచునది అని అర్థము”. దీనిని పాణిని మహర్షి ఊణాది సూత్రములో వివరించారు. ఈ ధర్మ స్వరూపమును ప్రత్యక్ష ప్రమాణము ద్వారా గాని, అనుమాన ప్రమాణము ద్వారా గాని, హేతువాద లేదా నాస్తికవాదముల ద్వారా గాని తెలుసుకోలేము. వేదముద్వారా, పురాణేతిహాసముల వలన మాత్రమే తెలియును.అయితే ఈ ధర్మము యుగములను అనుసరించి మారుతూ ఉంటుంది. ధర్మసూక్ష్మములు స్థూల దృష్టి కలవారికి అవగాహన ఉండదు. అందుకే కర్ణుడు గొప్పవాడు ద్రౌపది పతివ్రత కాదు, రాముడు వాలి విషయంలో ధర్మం పాటించలేదు, రావణ్ ఈజ్ గ్రేట్ అని విమర్శిస్తారు. అప్పటికి మనమేదో ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ అవపోసన పట్టినట్టు..


ధర్మము స్థూలధర్మమని, సూక్ష్మధర్మమని ద్వివిధములు. ఆపద్ధర్మము, విశేషధర్మము అనునవి సూక్ష్మధర్మమునకు పర్యాయ పదములు.


సహజధర్మముచే నెరవేరని వాటిని ఆపద ఏర్పడినప్పుడు అట్టి ఆపత్కాలములో మాత్రమే ఆచరింపదగినది ఆపద్ధర్మము. ఆపత్కాలమున అట్లు చేయుట అధర్మముకాక ధర్మమే అగును. కనుకనే అది ఆపద్ధర్మమయినది.


పూర్వం ఉపస్తి అను ముని తన కుటుంబముతో ఆకలితో అలమటించు సమయమున అతడొక గ్రామమునకు పోయి మావటివానిడి చేరి వాడు తినుచున్న మినుపగుగ్గిళ్ళను యాచిస్తాడు. మావటివాడు ఉచ్ఛిష్టమయిపోయినవి ఇంతకంటె వేరేమిలేవని చెప్తాడు. ఆ ఉచ్ఛిష్టమయిన వానినే ఇమ్మని అడిగి తీసికొని భుజించి ఆకలి తీర్చుకొనెను. మావటివాడు త్రాగుటకు తాను త్రాగగా మిగిలిన నీటిని ఇవ్వబోగా ఈ జలము ఉచ్ఛిష్టము, నాకు వద్దు అని ఉపస్తి చెప్తాడు. అప్పుడు మావటివాడు ఈ గుగ్గిళ్ళు మాత్రము ఉచ్ఛిష్టము కావా? . వీటిని తినవచ్చునా ? అని అడుగుతాడు. అప్పుడు ఉషస్తి ఆ గుగ్గిళ్ళు తినకపోతే నా ప్రాణములు పోయి ఉండేవి. అలాంటి ఆపద సమయమున ఉచ్ఛిష్ట దోషము లేదు. నాకు త్రాగుటకు జలము దొరుకును. ఇప్పుడు అట్టి ఆపదలేదు. ఆ నీరు నాకు ఇప్పుడవసరము లేదు అని తిరస్కరిస్తాడు. ఇది ఆపద్ధర్మస్వరూపము. ఇది ధర్మముయొక్క సూక్ష్మత. ఆపదయందు మాత్రమే దానిని అనుష్ఠించిన దోషము లేదు. ఆపద తీరిన తర్వాత తిరిగి అట్లు చేసిన దోషము కలుగును. దీని తత్వము ఎఱుగక లేదా ఆర్ష సాంప్రదాయము తెలియక వేదాలు, ఋషుల మహత్యము తెలుసుకోక సామాన్యులు శాస్త్రాల్లోని విషయాలను అవమానిస్తున్నారు.


కొందరు మెట్ట వేదాంతంతో ఇతరులకు హాని చేయకపోవడం, మంచిగా మాట్లాడటం ధర్మం అని వారికి తోచిన రీతిలో చెబుతుంటారు. ధర్మం నిర్ణయించడం అంత సులువు కాదు. గురువులచే శాస్త్ర ప్రమాణంగా తెలిసుకున్న విషయాలే ఒక్కోసారి ఆచరించలేక సంగ్దిగ్ధావస్థ కలుగును. ధర్మసూక్ష్మం చాలా విశాలమైనది.


బహుభాషావేత్త అయిన “వింటరినిడ్జ్"  "There is no word in any European Language which is quite synonymous with the Sanskrit word Dharma" ధర్మః పదానికి సమాన అర్థము కలిగిన శబ్దము ఏ భాషలలో లేదని చెప్పాడు.


అంతగొప్పవి మన ధర్మశాస్త్రాలు. కేవలం ఒక్క ధర్మం అనే పదం పైన అనేక ఋషులు నైమిశారణ్యంలో చర్చలు చేసారు. అనేక గ్రంథాలు దీనిపై ప్రచురించ బడ్డాయి.అవిద్యతో ధర్మం గురించి కొందరు సూడో సెక్యులర్లు వక్రీకరించిన రచనలు కూడా చేసారు. 


ధర్మం గురించి అర్థమవ్వాలి అంటే గురుముఖంగా మన శాస్త్రాలను తెలుసుకోవడం వల్లనే సాధ్యం.

వేదం - అనుగ్రహం

 వేదం - అనుగ్రహం


పరమాచార్య స్వామివారు సాక్షాత్తు దైవస్వరూపులు. కలియుగంలో వైదిక ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన అపర శంకరావతారులు. మా తండ్రిగారికి పరమాచార్య స్వామివారు తప్ప వేరు దైవము లేదు. స్వామివారి ఉపదేశం విని మా ముగ్గురు అన్నదమ్ములను వేదసేవకే వినియోగించారు. వేదపండితుడైన యువకునికే మా చెల్లిని ఇచ్చి కన్యా వివాహం చేశారు. అలాగే, వారి ఇష్టానుసారమే మా అన్నకు నాకు కూడా కన్యా వివాహమే చేశారు.


నేను వేదపాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు రెండు మూడు రోజులు వరుసగా సెలవు వస్తే, మా గురువు గారు మమ్మల్ని మహాస్వామివారి వద్దకు “స్వామివారి సమక్షంలో వేదం చెప్పండి” అని పంపేవారు. అప్పుడు మహాస్వామివారు మా అహార విహారాదుల గురించి అన్ని విషయాలు అడిగేవారు. ఆంధ్రదేశ పర్యటనప్పుడు నేను వారితో పాటు కార్వేటి నగరం, బుక్క, రామగిరిలో ఉన్నాను. స్వామివారు నన్ను అనుగ్రహించి బ్రహ్మశ్రీ గోదా మంత్రాలయం వద్దకు పంపారు. తరువాత నేను తిరుపతిలో వేదపారయణదార్ ఉద్యోగానికి అర్జీ పెడితే స్వామివారి అనుగ్రం వల్ల పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాను. స్వామివారి అనుమతితో వెళ్దామని చెప్పడానికి వారి వద్దకు వెళ్ళాను. అనుకోకుండా స్వామివారు వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చారు. ఆశ్శీపూర్వకంగా నాచేతిలో ఒక కమలం పెట్టారు. ప్రేమతో వారు నాతో, “శాస్త్రాన్ని ఉల్లంఘించకుండా నీ కర్తవ్యం నిర్వర్తించు. ఒకవేళ శాస్త్రాన్ని ధిక్కరించవలసిన పరిస్థితి వస్తే, ఉద్యోగం వదిలేసి నావద్దకు రా. నీ బాధ్యత నేను తీసుకుంటాను” అని అన్నారు.


చిన్న కాంచీపురంలోని మహాస్వామి వారి వేదపాఠశాలలో నేను వేదం నేర్చుకున్నాను. అక్కడ నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మాకు భోజన సదుపాయాలు అంతగా ఉండేవి కావు. కనుక స్వామివారు భక్తులను ప్రతి నెలా తమ జన్మనక్షత్రం రోజున ఏవైనా మధుర పదార్థాలు, తినుబండారలు చేసి తనకు చూపించి వేదపాఠశాలలో ఇమ్మని చెప్పారు. భక్తులు అలాగే చేసేవారు. మేము పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు మమ్మల్ని ప్రేమపూరిత మాటలతో అడిగేవారు, “ఈరోజు తినుబండారాలను ఎవరు తీసుకొనివచ్చారు?” అని. ఫలనా వారు మీకు ఈరోజు మధుర పదార్థాలు తెచ్చారా? అని ప్రేమగా అడిగేవారు. దాన్ని తలచుకోవడం ఇప్పటికి ఒక మధురానుభూతి.


పరమాచార్య స్వామివారి కటాక్షం పొందాలంటే విశేషంగా ఏమీ చెయ్యనక్కరలేదు. వేదం పఠిస్తే పరమాచార్య స్వామివారు వారంతట వారే వచ్చి మనల్ని అనుగ్రహిస్తారు. “మంత్రాదీనంతు దైవతం” అంటే దేవతలు మంత్రం యొక్క ఆధీనంలో ఉంటారు అన్నట్టు మనం వేద పారాయణం మొదలుపెట్టగానే వారే స్వతహాగా మనం కూర్చున్న చోటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు.


--- శ్రీ కె. చంద్రశేఖర ఘనాపాటి, న్యాయ - వేదాంత శిరోమణి, తిరుపతి. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం