27, జూన్ 2024, గురువారం

మనోహరంగా మాట్లాడటం

 శు భో ద యం🙏


మనోహరంగా మాట్లాడటం

ఒకకళ!!


మాటలచేత దేవతలు మన్ననచేసి వరంబులిచ్చెదర్

మాటలచేత భూపతులు మన్ననచేసి ధనంబు లిచ్చెదర్

మాటలచేత కామినులు మగ్నతచెంది సుఖంబు లిచ్చెదర్

మాటలు నేర్వకున్న అవమానము, న్యూనము, మానభంగమున్;

    -చిలకమర్తి లక్ష్మీనరసింహం!

మనమాట మనజీవితానికి చక్కనిబాట.దాన్ని చక్కగా వాడటం నేర్చుకోవాలి.లేకపోతే కష్టమే!

        లోక వ్యవహారమంతామాటమీదే!నోరుమంచిదైతే ఊరుమంచిదౌతుంది.ఇత్యాదిగా సామెతలెన్నో.లోకమెరిగిన కవితనఅనుభవాన్ని రంగరించి మనకుచెప్పిన మంచిమాటలీపద్యంలోచోటుచేసికొన్నాయి.

       మంచిమాటల చేతనే

(స్తోత్రాదులు)దేవతలు వరాలిస్తారు.మాటలవలననేరాజులుమన్ననచేసిమాన్యాలిస్తారు.మాటలకుపొంగిపోయేమానినులుపరవశమందిసుఖాలు ప్రసాదిస్తారు.

       కాబట్టి మిత్రమా!మంచిగా హృదయరంజకంగామాటలాడటంనేర్చుకో!

       సరిగామాటలాడటం రాకపోతే, అందరిలో అవమానింపబడతావు.చిన్నతనంతప్పదు.ఆపైపరితాపంతప్పదు.

      కాబట్టి మధురంగా మాటలాడటం నేర్చుకో!

అని సందేశం!!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

దైవాన్ని కోరిక ఎలా కోరాలి

 దైవాన్ని కోరిక ఎలా కోరాలి..🚩  1.నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.  2. నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.  3. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..  4. నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా బోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతాడు.....  5. నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..  6. భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి  అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...  7. కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..  8. చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా  జీవించాలని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం.. మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.

జూన్ 28, 2024*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

      🌹 *శుక్రవారం*🌹

  🪷 *జూన్ 28, 2024*🪷

    *దృగ్గణిత పంచాంగం*                 

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠమాసం - కృష్ణ పక్షం*

*తిథి : సప్తమి* సా 04.27 వరకు ఉపరి *అష్టమి*

వారం :*శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం : పూర్వాభాద్ర* ఉ 10.10 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*

*యోగం : సౌభాగ్య* రా 09.39 వరకు ఉపరి *శోభన*

*కరణం : బవ* సా 04.27 *బాలువ* రా 03.22 తె ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.30 - 10.30  సా 05.00 - 06.00*

అమృత కాలం :*(29) తె 04.17 - 05.48*  

అభిజిత్ కాలం :*ప 11.45 - 12.37*

*వర్జ్యం : రా 07.14 - 08.45*

*దుర్ముహుర్తం : ఉ 08.15 - 09.07 మ 12.37 - 01.29* 

*రాహు కాలం : ఉ 10.33 - 12.11*

గుళిక కాలం :*ఉ 07.16 - 08.54*

యమ గండం :*మ 03.27 - 05.06*

సూర్యరాశి : *మిధునం* 

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 05.38* 

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు ప్రయాణం పనికిరాదు* 


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.38 - 08.15*

సంగవ కాలం :*08.15 - 10.52*

మధ్యాహ్న కాలం :*10.52 - 01.29*

అపరాహ్న కాలం :*మ 01.29 - 04.07*

*ఆబ్ధికం తిధి: జ్యేష్ఠ బహుళ సప్తమి*

సాయంకాలం  :  సా 04.07 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.55

నిశీధి కాలం :*రా 11.49 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.11 - 04.54*

_____________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌹 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🌹

*జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే /*

*జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ //*


*మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ /*

*హరిప్రియే నమస్తుభ్యం దయానిధే //*


*పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే /*

*సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదాకురు //*


*జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే /*

*దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే //*


*నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ /*

*వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్ //*


            🪷 *ఓం శ్రీ*🪷 

🌷 *మహాలక్ష్మీయై నమః*🙏

🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

Panchang


 

పురాతన శరీర విజ్ఞాన పరీక్ష

 పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .


  భారతీయ పురాతన ఆయుర్వేద నిపుణులు , మహర్షులు మానవ శరీర నిర్మాణమును తెలుసుకొనుటకు వారి వారి ఆశ్రమాలలో శవాలను తీసుకొచ్చి వాటిని కోసి పుర్తిగా పరీక్షించే వారు . 


         సుశ్రుతములో శరీర పరీక్ష గురించి కొంత వివరణ ఇవ్వబడింది. ఇప్పుడు దాని గురించి మీకు తెలియజేస్తాను. మొదట శరీర స్థానం నందు పూర్తి పరిజ్ఞానం తెలుసుకొవలెను. అటు మనిషుని యెక్క శరీరమును "ద్రుష్ట కర్మం" ( Dissection) కు సిద్దం చేసి ప్రతి అవయవ భాగం ను ప్రత్యక్షం గా పరీక్షించ వలెను.


 పరీక్షార్ధం నిర్దిష్టమైన మృత కళేబరం తీసుకొనవలెను. వ్రుద్దునిది, ధీర్గకాల రోగ పీడితునది , విషాదుల చేత మృతి నొందినది కాక సర్వాయవ స్పూర్తి నొందినది కలిగి ఉండవలెను. ముందు మృత కళేబరం నందు ఉండు వ్యర్ధములను " వస్థి కర్మం " ( enema) చేత బయటకి వెడలించి శోధనం చేయవలెను . పిదప ముంజ గడ్డి , దర్భ, నార మొదలగు వాని చేత అన్ని అవయవములను బాగుగా కట్టి చేపలు మొదలగు నీటి జంతువులు తినకుండా ప్రవాహం నందు కొట్టుకొని పోకుండా పంజరస్థం గావించి నిలువయున్న నీటిలో వాగునందు కుళ్లే విదంగా ఉంచవలెను. అలా 7 దినములు నీటిలో ఉంచవలెను. 7 దినములు అయిన తరువాత బాగుగా కుళ్ళిన శరీరమును పైకి దీసి దర్భ, గడ్డి వీని వేళ్ళతో చేసిన కుంచెను గాని , వెదురు కుంచెతో గాని చర్మం , మాంస కండరములు , సిరలు , నరములు , ధమనులు, ఆంత్రము ( Intestines) , యక్రుత్తు ( Liver) , ప్లీహము (spleen) , హృదయము (Heart) , వ్రుక్కములు ( kidneys) , పుప్పుసము ( Lungs) , క్లోమము ( pancreas) మొదలగు అవయవములును , అస్తులు (Bones) ,అస్థి సంధులు (Joints) . మొదలగు చర్మ బాహ్య,అంతర అవయవాలను విభజించి బాగుగా పరీక్షించ వలెను.ఈ రీతి శరీర శాస్త్రమును చక్కగా అభ్యసించవలెను .


 శరీర పరీక్ష నేర్చుకునే విదానము.-

       

         పలుమార్లు శిష్యునకు శవ పరీక్షా విదానం చేసే విదానం చూపించిన తరువాత శిష్యుని చేత స్వయంగా పరీక్ష చేయించవలెను. 


 చేదన కర్మం - 

  

        సోరపుచ్చ, నూగు దోస , బుడమ, పెద్ద దోస , మొదలగు కాయలను కోసి చూపవలెను .అదే విదంగా ఉత్కర్థానము (పైకి కోయుట ), పరికర్థనము (ధిగువకు కొయుట ).మొదలుగునవి కుడా బోధిం పవలెను .


 బేధ్య కర్మం - 


         నీరు నింపిన తిత్తులు గాని , మృతి చెందిన జంతువుల మూత్ర కోశములు గాని , జిగురు వస్తువులలో , లేక పలుచనైన బురదతో నింపిన తోలుతిత్తులను గాని చీల్చి చూపవలెను .


 లేఖ్య కర్మం - 


          రోమయుక్తమగు చర్మమును పైన , లొపల బేదములు ను చూపవలెను .


 వేద్య కర్మం - 


           మృత జంతువులు యెక్క సిరలును కలువ కాడలును , మొదలగువానిని వేధించి చూపవలెను . ఇయ్యది కేవలం జలోదరం, మూత్ర వృద్ది మొదలగు వాని యందు ఉపయోగించవచ్చు .


 ఏష్య కర్మం - 


          పురుగు తినిపోయిన బెజ్జములు గల కొయ్య కర్రల యందు , వెదురు గోట్టములు , తుటి కాడలు, తామర కాడలు, ఎండిపొయిన సొరకాయలు, మొదలగు వానిని ముఖ ములములందు చేయవలసిన శస్త్ర చికిత్సకు ఉదాహరణగా చూపించ వచ్చు. దీనిని ఏషిని అను శలాకమ్ ఉపయొగించి నేర్పించవలెను .


 ఆహార కర్మం - 


         పనస, మారేడు, దొండ, మొదలగు ఫలముల నుండి గింజలు బయటకు తీయు విద్యను అభ్యసించవలెను. ఈ విదానం నోటిలోని దంతము లను ఉడ దీయుటకు ఉపయొగించ వలెను.


 విశ్రావ్య కర్మం - 


          విశ్రావ్య కర్మను శాల్మలి ఫలకం నందు మైనం పూసి ప్రతిమలు చేసీ ఆయా ప్రదేశం నందు చీము మొదలగు వానిని స్రవింప జేయవలెను .


 సీస కర్మం - 


          మృదువగు వస్త్రములును చర్మం మొదలగు వాని ఎందు యుంచి కుట్టి సేవన కర్మం చేయవలెను . 


 స్థల బేధమున శస్త్ర ఉపయోగ బేదములు - 


      కనుబొమ్మ, కణత , నొసలు, గండ భాగము, కనురెప్ప, క్రింద పెదవి, పంటి చిగురు, చంక, కటి, బోడ్డు , గజ్జ, వీని యందు దిర్యక్చేధనం చేయవలెను .అరిచేయి , అరికాలు, వీనీ యందు జంద్ర మండలాక్రుతి గా ( గుండ్రముగా ) కోయవలెను. గుదము, మేడ్రము వీని యందు అర్థ చంద్రాక్రుతిలో కొయవలెను లేనిచో సిరలు (venis) , ధమనులు తెగిపోయి మిగుల బాధను కలిగించును. అలగే మానుట చాలా కష్టం. అలానే ఉంటే ఆ గాయం గ్రందిలా తయారగును. కనుక జాగ్రత్త వహించవలెను.


 శస్త్ర చికిత్స చేయు విదానం - 


         శస్త్ర చికిత్స చేయుటకు పూర్వం రోగి కి చాలా తక్కువ ఆహారం ఇవ్వవలెను. శస్త్ర చికిత్స బాధలు తెలియకుండా ఉండుటకు బాగా మత్తుగా ఉండు మధ్యములను త్రాగిపించవలెను . శస్త్ర చికిత్స ముందు భుజించడం మూలాన "మూర్చ " మొదలగునవి కలవు. మద్య ద్రవ్యములను ఉపయోగించుట చేత బాద తెలియకుండును.

 

   శస్త్ర చికిత్సకు కావలిసిన వస్తువులు.- 


   * శస్త్రములు - ( Inustruments , Lancet etc .)

   * యంత్రములు - ( surgical అప్ప్లైంచెస్)

   * క్షారము - ( Alkali) .

   * అగ్ని - ( Fire for cauterisation) .

   * జలూక - ( Leeches) .

   * శలాక - ( Probe or direetor ).

   * జాంబ వోష్ణము -( Cavtersing 

                                Inusruments) .

   * పిచువు - (Cotton) .

   * ప్లోతము - ( Lint) .

   * సూత్రము - (Thread) .

   * పట్టము - ( Tow ).

   * తేనే - ( Honey) .

   * నెయ్యి - ( Ghee) .

   * కొవ్వు.

   * పాలు.

   * నూనే .

   * తర్పణం - ( powederd wheat soaked in 

                      water ) .

   * కషాయం - ( Decoctions) .

   * అలేపము - ( Medicated Plasters) .

   * కల్కము - ( Paste) .

   * చన్నీళ్ళు.

   * వేడి నీళ్ళు .

   * కవలిక - ( Splints) .

   * వెదురు వేళ్ళు - ( Skin of Bamboos ).

   * స్పటికం - ( Lens) .

   * కురువింద రాళ్ళు .

   * అయస్కాన్థములు .

   * గాజు తునకలు.

   * టేకు ఆకులు. మరియు మత్తు కలగ చెయు పదార్దం.  


           పైన చెప్పిన విధముగా రకరకాల పరికరాలు ఉపయోగించి అత్యంత నైపుణ్యతతో మన పూర్వికులు శస్త్రచికిత్సలు చేసెడివారు . 


   

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

మాటతో... చూపుతో..

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


            *మాటతో... చూపుతో...!*

                    ➖➖➖✍️

```

రామ పరాక్రమంతో చేతలుడిగి హతాశుడై యుద్ధరంగంలో నిస్సహాయంగా నిలబడిపోయిన రావణుడితో రాముడు అన్నదల్లా ఒకేఒక్క మాట- 'నేడు పోయి రేపు రా!’ అని. 


ఆ ఒక్కమాట దశకంఠుణ్ని జీవచ్ఛవంగా మార్చేసింది. ముల్లోకాలను జయించిన మహాయోధుడు రావణాసురుడు. అలాంటివాణ్ని నిలువునా దహించివేసింది- ఆ ఒక్కమాట!✍️



కురుక్షేత్ర సంగ్రామం చివరి దశలో భీముడి గదాఘాతానికి తొడలు పగిలి సుయోధనుడు దుర్మరణం చెందాడని భారతం చెబుతోంది. 


వాస్తవానికి అతడు ఘోషయాత్ర ఘట్టంలోనే సగం చనిపోయాడు. 


అరణ్యవాసం చేస్తున్న పాండవులను వేధించడానికి దుర్యోధనుడి పరివారమంతా కట్టకట్టుకొని వచ్చారు. చిత్రసేనుడనే గంధర్వరాజు వారందరినీ బంధించాడు. పాండవులే వచ్చి విడిపించి, ధర్మరాజు దగ్గర పంచాయతీ పెట్టారు. “ఇక్కడ జరిగిన అవమానం నీ రాజధాని ప్రజలకు తెలియదు కాబట్టి ఏమీ జరగనట్లు తిరిగి వెళ్ళిపో. ఇకపై బుద్ధి కలిగి ఉండు” అన్నాడు ధర్మరాజు. 


ఆ మాట సుయోధనుడికి ఎక్కడ ఎలా తగలాలో అక్కడ అలా తగిలింది. 'ఇప్పటికిప్పుడు భూమి చీలి నేను అందులో కప్పడిపోతే బాగుండేది' అని తానే అన్నాడు. ప్రాయోపవేశం చేయడానికి సైతం సిద్ధపడ్డాడు. అభిమాన ధనుడైన సుయోధనుణ్ని ధర్మరాజు కేవలం మాటలతో చంపేసిన తీరును ఎర్రన గొప్పగా వర్ణించాడు.✍️



సుడాన్ దేశాన్ని 1990 సంవత్సరంలో భయంకరమైన కరవు పీడించింది. ఆకలి దప్పులతో ప్రజలు అలమటించిపోయారు. 


ఆ కరవు తీవ్రతను ప్రతిబింబించిన ఫొటో ఒకటి ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. 


ఎముకల పోగులా ఉన్న ఓ పసిపాప చిన్న రొట్టెముక్కను- తన వెనక కాచుకొని కూర్చొన్న రాబందు ఎక్కడ ఎత్తుకుపోతుందోనన్న భయంతో దాన్ని గుండెలకు అదుముకొన్న ఫొటో అది. 


నిజానికి రాబందు వేచి చూస్తున్నది- రొట్టె ముక్క కోసం కాదు. ప్రాణాలు గుటుక్కుమంటే ఆ పాపను పీక్కుతిందామని! 


ఇప్పటికీ ఎంతోమందికి ఆ ఫొటో గుర్తుండిపోయింది.


పరమ హృదయవిదారకమైన ఆ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన దక్షిణాఫ్రికా ఫొటోగ్రాఫర్ కెవిన్ కు లెక్కలేనన్ని ప్రశంసలు దక్కాయి. సన్మానాలు జరిగాయి. కెవిన్ పేరు ప్రపంచమంతటా మారుమోగింది. 

At that moment (సందడిలో) కెవిన్ కు ఓ ఫోనొచ్చింది. 


'సార్! ఆ పాప ఏమయింది? ఉందా,చనిపోయిందా?' అని అడిగారెవరో.


 'ఏమో మరి! ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదు' అన్నాడు కెవిన్.


'ఓహో! అయితే రోజు పసిపాప చావుకోసం కాచుకొన్నది రెండు రాబందులన్నమాట! ఒకటి- ఫొటోలో కనబడుతున్నది, 

రెండోది- ఈ  ఫొటో తీస్తున్నది' అనేసి ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. 


ఆ ఒక్క వాక్యం ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిందంటే- 1993లో కెవిన్ తన 33వ ఏట ఆత్మహత్య చేసుకున్నాడు.


మహాయోధులమో, అభిమానధనులమో కాదు కాబట్టి... మాట మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. 


ఏ లారీయో గుద్దేసి పోతే రక్తం ఓడుతూ కొన ఊపిరితో ఓ మనిషి కొట్టుమిట్టాడుతుంటే హాస్పిటల్ కు చేరుద్దామనో, ఆంబులెన్స్ ను పిలుద్దామనో అనుకోకుండా ఆ వ్యక్తితో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించే మనలోని 'కెవిన్' కేసి, ఆ మనిషి చూసే చివరిచూపు చాలు- మనల్ని జీవచ్ఛవాల్ని చేయడానికి!✍️```

              -ఎర్రాప్రగడ రామకృష్ణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

గురువు మాత్రమే చెయ్యగల గమ్మత్తు...!!!

 🌼🌿మనసును గురువు చుట్టూ తిప్పితే, తలతిరిగే మత్తు శరీరానికి ఎక్కుతుంది...!!!

ఆమత్తులో కలిమాయ చిత్తవుతుంది..!

ఇది గురువు మాత్రమే చెయ్యగల గమ్మత్తు...!!! 


ఒక్క సూర్యుడు వెయ్యి కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు, ఒక్క గురువు వేలమంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనిమిస్తాడు...!!!


సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు,గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు...!!!


గురువు చూపుయే ఉపదేశం...!!!

గురువు జీవితమే ఓ సందేశం...!

గురువు పలుకులే ఉపనిషత్తుల సారాంశం...!!

గురువు స్పర్శయే ముక్కోటి దేవతల ఆశీర్వాద ఫలం...!!!

శిష్యుడి జీవితం ఓ వాహనం,

గురు కృప అందులోని ఇంధనం...!!! 


మాంస నేత్రాలతో చూసేవాళ్లకు గురువు ఓ శరీరం...!!!

మనో నేత్రంతో చూసేవాళ్లకు గురువు పరబ్రహ్మం యొక్క సాకారం...!

గురువు సర్వజ్ఞుడు...!!

గురువు దైవజ్ఞుడు...!!!


మూర్తీభవించిన పరంజ్యోతి యొక్క కరుణయే గురువు...!!!

గుండెల్లో గురువు ఉంటే, జీవితంలో కరువు ఉండదు...!

గురువు యొక్క చూపు, శిష్యుడి జీవితనౌకకు బలమైన చుక్కాని...!!

గురువు యొక్క మనసు, మమతానురాగాల మాగాణి...!!!


సంకెళ్లతో బంధియైన శిష్యుని జీవాత్మకు ముక్తిని ప్రసాదించగలిగే ఏకైక శక్తిశాలి గురువొక్కడే...!!!


అగమ్యగోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చేప్పే ఏకైక దిక్సూచి గురువొక్కడే...!!!


గురువు నిండు మేఘమై వర్షించగలడు...!!!

గురువు చల్లటి చినుకై స్పృశించగలడు...!

గురువు తేజోవంతమైన విత్తనమై నాటుకోగలడు...!!

గురువు మహావృక్షమై నీడనీయగలడు. 

గురువు కమ్మటి మెతుకై ఆకలి తీర్చగలడు...!!!


కాలికి గ్రుచ్చిన ముల్లును తీయుటకు వజ్రాయుధాన్ని ఉపయోగించటం ఎంతటి అజ్ఞానమో,

బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయగల గురువును తృచ్ఛమైన  కోరికలు కోరడం అంతటి అజ్ఞానమే...!!!


గురువు శరీరంతో కనిపించగలడు, కాంతి పుంజముల అఖండ ధారగా అనంతాన్ని ఆవరించగలడు...!!!


సమస్త గ్రహములు ఉపగ్రహములతో నిండిన కక్ష్యలు గురువు మెడలో రుద్రాక్ష మాలలు...!!!


సమస్త నక్షత్ర మండలాల సమూహంతో నిండిన అంతరిక్ష తళాలు గురువు కిరీటంలో గల వజ్రాల పలకలు...!!!


🌼🌿గురువున్నవాడు భాగ్యవంతుడు...!

గురువున్నవాడు ఐశ్వర్యవంతుడు...!!

గురువున్నవాడు అదృష్టవంతుడు. 🌼🌿

మామిడి పండు

 

మామిడి పండు  

ఈ రోజుల్లో మనం ఒక విధంగా అపక్వపు మామిడి పండ్లను పండిన మామిడి పండ్లాగా భవిస్తూ సేవిస్తున్నాము. పూర్తిగా పక్వానికి రాని మామిడి కాయలను కోసి వాటిని ఒక సమూహంగా అమర్చి కింద క్యాలీషియమ్ కార్బైడు రాళ్లను(CaC2)  పరచి దానిమీద నీళ్లు చల్లుతున్నారు. అప్పుడు కార్బిడెనుండి ఎసిటిలీను వాయువు  (C2H2)  వచ్చి కాయలను పండినట్లుగా చేస్తుంది. మనం ఇటువంటి కాయలను కొనేటప్పుడు కొన్ని సందర్భాలలో అక్కడక్కడ గ్యాసు చేరని చోట  ఆకుపచ్చదనం కనపడుతూవుండటము  మీరు గమనించే వుంటారు. తొందరగా కాయలను (పండ్లను) అమ్ముకొని సొమ్ముచేసుకోవాలనే వ్యాపారస్తులకు ఇది అనుభవైకమైనదే.

నిజానికి చెట్టు మీద  కొంతకాలం అయిన తరువాత మామిడి కాయ పక్వానికి వస్తుంది. పక్వానికి వచ్చిన మామిడి కాయ పసుపు వర్ణానికి రావచ్చు లేక ఆకుపచ్చగా కూడా ఉండవచ్చు కానీ దాని పక్వస్థితి పరిపక్వతగా మరీన మరుక్షణం పండు తొడిమనుండి విడివడి క్రింద పడుతుంది. అట్లా క్రింద పడిన పండును మీరు ఎప్పుడైనా తిన్నారా దాని రుచి అమోఘంగా ఉంటుంది. మధురఫలం అంటే అదే అన్నట్లు ఉంటుంది. ఇది నిత్యజీవితంలో మనకు తెలిసిన విషయమే అదే రకంగా సాధకుని ఆధ్యాత్మిక జీవనం కూడా ఉంటుంది. ఈ సత్యాన్నే మనకు మహా మృత్యుంజయ మంత్రం చెపుతున్నది. (మంత్రం నిఘాడమైనది పవిత్రమైనది కాబట్టి ఇక్కడ వ్రాయకుండా కేవలం పేర్కొనటం జరిగింది) 

కర్మపరిపక్వత: సాధకుడి కర్మ పరిపక్వత చెందినప్పుడు ఏరకంగా అయితే మామిడి పండు రాలి భూమి మీద పడ్డదో అదే విధంగా సాధకుని కర్మ పరిపక్వత అయిన తరువాత ఐహిక జీవనం నుండి  పూర్తిగా ఆధ్యాత్మిక జీవనంలోకి వెళతాడు. చుట్టూ వున్నవారికి సాధకునికి భార్య పిల్లలు ఉన్నట్లు అతను  వారితో సంబంధం పెట్టుకున్నట్లు గోచరిస్తున్నా కూడా సాధకుని మనస్సు పూర్తిగా భగవంతుని మీదనే ఉంటుంది. భవబంధాలు కేవలం తన భాద్యతలుగా మాత్రమే సాధకుడు తలుస్తాడు. నిత్యం పరబ్రహ్మ మీదనే తన జాసను ఉంచి నిరంతరమూ దైవ చింతనతోటె కాలాన్ని గడుపుతాడు. సాధకుడు ఆచరించే ప్రతి కర్మను కేవలము భగవంతునికోసం మాత్రమే చేస్తున్నట్లు భావిస్తూ చేస్తాడు. సాధకుని జీవితంలో తనకు తెలియకుండానే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అవి ఏమిటంటే ఆహరం. నిద్ర, ధ్యానాదులు. సాధకుడు మితంగా ఆహరం తీసుకుంటాడు. ఇతరుల గురుంచి తక్కువగా ఆలోచిస్తాడు. ఇతరులు తనను విమర్శించినా కూడా వాటిని తీవ్రంగా భావించడు. సదా తాను  ముక్తుడు అవటానికి  సమాజాన్ని ధర్మ మార్గంలో నడపటానికి మాత్రమే ప్రయత్నిస్తుంటాడు.  తన ధర్మాచరణలో చేసే విమర్శలను అస్సలు పరిగణలోకి తీసుకోడు.  కేవలం తన దారిన తాను పోతూవుంటాడు.

సాధకుడు కాని వారు ఇటువంటి వ్యాసాలను ఆసాంతము చదవలేరు. ఒక వేళ చదివిన దానిని విమర్శించి అందులో ఏమిలేదు అనేవిధంగా మభ్యపెట్టడానికి ప్రయతినిస్తారు. అటువంటి వారిని వాచా వేదాంతులు అంటారు. ఇటువంటివారు వారికి తెలిసిందే శాస్త్రమని దానిని మాత్రమే అంగీకరిస్తాము అని అనటమే కాక కూపస్థ మండూకము లాగ తన సిద్ధాంతాన్ని సంపూర్ణ జ్ఞానంగా భావించి ఇతరులను తప్పు తోవ పట్టిస్తారు. ప్రస్తుతం మన సమాజంలో వాచా వేదాంతులు పెరిగిపోతున్నారు.  జ్ఞానులు వారి చేష్టలను ఆపవలసిన అవసరము ఎంతైనా వున్నది. ఇటువంటి వారి వల్ల ధర్మానికి గ్లాని కలిగే ప్రమాదం కూడా వున్నది. జ్ఞాని తన జ్ఞానంతో తన ముక్తిమార్గం చూసుకొని మోక్ష సిద్ది పొందక సమాజంగురించి ఎందుకు ఆలోచించాలి  అని కొందరు  విమర్శిస్తారు. అట్లా జ్ఞానులంతా తనకు ఈ సమాజం సంబంధంలేదు నా మోక్ష చింతన నాకు చాలు అని అనుకుంటే మనకు ఉపనిషత్తులు లభించేవి కావు. శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ వివేకాననంద స్వాములు మన ధర్మాన్ని ఉద్ధరించే వారు కాదు.  నిజానికి ఇప్పుడున్న సమాజాన్ని ఉద్దరించటానికి   ధర్మ పరులైన జ్ఞానుల అవసరము ఎంతైనా వున్నది.  శ్రీకృష్ణ పరమాత్మా బోధించిన శ్రీమత్ భగవత్గీత   ఇప్పటికి నిత్యనూతనమై విరాజిల్లుతున్నది. మన మహర్షులు మనకు ప్రబోధించిన ఉపనిషత్తులు వేదాంత గ్రంధాలుగా సాధకులకు అనుసరణీయాలుగా వున్నాయి . శ్రీ ఆది శనకరాచార్యులవారు మనకు అందించిన వాజ్గ్మయము ఇప్పటికి తత్వవేత్తలకు నిత్యపారాయణ గ్రంధాలుగా విలసిల్లుతున్నాయి. ప్రతి రోజు మన భారతావనిలో అనేకులు తాత్వికులు వారి వారి అనుభవాలతో మనలను జ్ఞానవంతులను చేస్తున్నారు. నిత్యము వారి అడుగుజాడలలో నడవాల్సిన అవసరము ప్రతి సాధకునికి వున్నది. 

సాధకులు నిరంతరసాధన చేస్తూ బ్రహ్మజ్ఞానాభిలాషులై నిరంతరం బ్రహ్మలో లీనమై ఉండాలి. మోక్షము అనేది చాలా చాలా కష్టంతో కూడుకొన్నది దానికోసం నిరంతరం కృషిచేయాలని మన ఉపనిషత్తులు మనకు తెలుపుతున్నాయి. 

సాధకుడు ఈ జన్మలో సాధన మొదలుపెట్టి నిరంతర కృషి సలుపుతే మోక్ష సిద్ది కలుగవచ్చు.  కాకపోయినా శ్రీకృష్ణ భగవానులవారు మనకు గీతలో పేర్కొన్న విధంగా మనం సాధన ఎంతవరకు చేసి ఈ దేహాన్ని వదులుతామో  అక్కడినుండి  మరుజన్మలో సాధన  మొదలు పెడతాము.  కాబట్టి సాధన చేతుష్టయాన్ని ఆచరించి మనస్సును నిర్మలపరచుకొని నిరంతర సాధన చేయవలెను. 84 లక్షల జీవరాశిలో ఉత్కృష్టము జ్ఞ్యానమయం అయిన ఈ మానవ జన్మ మనకు ఈ రోజు లభించింది.  దానికి కారణం మన పూర్వ జన్మ శుక్రతమే. ఈ జన్మలో మనకు మోక్ష సిద్ది కలుగక పోయిన కానీ మరుసటి జన్మను కూడా మనం మానవులుగా పుట్టేటట్లుగా మన సాధన ఉండాలి. అప్పుడే మనం అంచలంచలుగా మోక్ష పదానికి చేరుకొని మోక్ష సిద్ధిని పొందగలము. 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ 

సముద్ర రాక్షసుడు

 *💥ఓ ఉపాధ్యాయుడు,ఓ పోలీస్ అధికారి,ఓ  బ్యాంక్ అధికారి గారు  ముగ్గురూ ఓ నౌకలో ప్రయాణిస్తున్నారు.సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్ష మయ్యాడు.మిమల్ని తినేస్తా అని పెద్దగా కేకలు పెడుతున్నాడు.*


*ముగ్గురూ భయంతో వణికి పోతున్నారు.వారు భయపడటం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది.వాళ్ళతో యిలా అన్నాడు,మీ ముగ్గురూ మీకు తోచింది సముద్రం లోకి విసిరి వేయండి.*

 

*నేను తెచ్చి యిస్తే గెలుపునాదే. వస్తువు తేలేకపోతే గెలుపు మీది వాళ్ళని వదిలేస్తాను.వాళ్లకు నేను జీవితాంతము బానిసగా వుంటాను అన్నాడు.సరే నని* *ముందుగా బ్యాంక్ అధికారి తన చేతి వజ్రపు ఉంగరం విసిరేశాడు.*

*సముద్రం లో మునిగి కాసేపటికి రాక్షసుడు ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ వ్యక్తిని మింగేశాడు.*

*తరువాత పోలీస్ గారు తన చేతికున్న ఖరీదైన వాచీ ని నీళ్ళలోకి విసిరేశాడు.*


*రాక్షసుడు సముద్రం లోకి దూకి దాన్నీ తెచ్చేసి అతన్ని మింగేశాడు.*


*ఇంక ఉపాధ్యాయుడి వంతు వచ్చింది.*


*అతను కొంచెం యోచన చేసి తన దగ్గరవున్న నీళ్ళ సీసా మూత తీసి అందులోని నీళ్ళను సముద్రం లోకి ధారగా పోశాడు.నా మంచి నీళ్ళను నాకు తెచ్చి యివ్వు అన్నాడు.*


*ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగి పోయింది.*

*ఇది ఉపాధ్యాయుడి దెబ్బ ఎలావుంది? అన్నాడు రాక్షసుడితో.*

*రాక్షసుడు తన ఓటమి ఒప్పుకొని అతనికి బానిసగా ఉండటానికి ఒప్పుకున్నాడు.*

*నా స్నేహితుల నిద్దరినీ బ్రతికించు అని ఆజ్ఞాపించాడు,వాడు వాళ్ళని కక్కేశాడు.*


*మంచి పని చేశావు.యింక ఎవ్వరినీ యిలా బాధించకుండా వుంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుడిని చేస్తాను అన్నాడు. రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రం లోకి దూకి మాయమయ్యాడు. ఎంతటి ఆపద వచ్చిన ఆలోచించే వాడు  ఉపాధ్యాయుడు*

*🙏సమాజానికి సమస్య వస్తే తగు పరిష్కారం సూచించగలిగే వాడు గురువు🙏.*

ఈ పద్యం జ్ఞాపకముంద

 వేరుపురుగు చేరి వృక్షంబు జెరుచును 

చీడపురుగు చేరి చెట్టు చెరచు 

కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా 

విశ్వదాభిరామ వినురవేమ!


భావము : ఓ వేమ! ఓ మహావృక్షమునకు అడుగుభాగమున చేరిన వేరుపురుగు 

               ఆ వృక్షమును చంపి వేయును. ఒక చీడపురుగు చెట్టును నాశనము 

               చేయును. అట్లే దుర్మార్గుడు మంచివారిని చెడగొట్టును గదా .

ఈ పద్యం జ్ఞాపకముంద


 మీ ఇంట్లొ చిన్నారులకు వీటిని నేర్పగలరు.

శాసన సభ్యులు - సుపరిపాలన 11*

 *శాసన సభ్యులు - సుపరిపాలన 11*


సభ్యులకు నమస్కారములు.


శాసన సభ్యులు రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం తమ తమ ఇష్ట దైవాలపై  లేక భగవద్గీతపై ప్రమాణము చేసి బాధ్యతలను స్వీకరించినప్పుడు స్వలాభం కొరకు గాకుండా ప్రజా సేవకు మాత్రమే అంకితంమవ్వాలి.   ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నిర్డేశించిన  గడువులోపల శాసన సభ్యుల తమ తమ ఆస్తులు  మరియు అప్పుల సమాచారం శాసన సభకు సమర్పించ వలసిఉంటుంది. *ఇది ప్రథమ కర్తవ్యము*  ఇటువంటి ప్రకటన  Public document గా పరిగణింప బడుతుంది. సదరు వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా Assembly Secretariat web site లో అధికారులు పొందుపర్చాలి. 


వార్తా కథనాలలో కొంత మంది శాసన సభ్యులు అక్రమాస్తులు, Money Laundering విషయాలలో  పాల్గొన్నట్లు వార్తలు చదువుతూ ఉంటాము.  *సచ్చిలురైన సభ్యులు వీటన్నిటికీ దూరంగా ఉంటారు*.  కొందరి దుశ్చేస్టలు  ప్రజా దృష్టిని మరియు మీడియా  గమనికను ఆకర్షించి వారి ప్రతిష్టను దిగజారుస్థాయి.  న్యాయస్థానాల పరిధిలోనికి వెళ్లనే రాదు. వెళ్ళినా నిజాయితి నిరూపించుకోవాలి.  నిజాయితి నిరూపించుకోలేని పక్షంలో  అనర్హత వేటు పడుతుంది.  *శాసన సభ్యుల చరిత్ర పారదర్శకంగా ఉండాలని ప్రజల ఆకాంక్ష*. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విధి విధానాలను ఉల్లంఘించరాదు. 


ప్రజలచేత ఎన్నుకోబడ్డ శాసన సభ్యులు వారి వారి నియోజక వర్గాలలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ నియోజక అభివృద్ధికి పునాదులు (నూతన కార్యక్రమాలకు), సోపానాలు (అంతకుముందే ఉన్న కార్యక్రమాలకు)  వేయవలసి ఉంటుంది. 


అప్పుడప్పుడు *ప్రజా అసంతృప్తి  సంబంధమైన* వార్తా కథనాలు చూస్తూ ఉంటాము. తమ నియోజక వర్గంలో శాసన సభ్యులు చాలా మటుకు ఉండరని,  ప్రభుత్వ కార్యకలాపాల మిషతో రాష్ట్ర రాజధానిలోనే అధిక శాతం కాలం గడుపుతూ ఉంటారని. ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే నియోజక వర్గాలను సందర్శిస్తారని.  ప్రాంతీయ/సంస్థగత ఎన్నికలప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇతర అమాత్యులు శాసన సభ్యులకు ఉద్భోధ చేస్తూ ఉంటారు. శాసన సభ్యులు తమ తమ నియోజక వర్గాలలోనే ఉంటూ సంబంధిత కార్యకలాపాలు చేపట్టాలని.  *ప్రజల చేత మరియు ప్రభుత్వము చేత  అపవాదులు, హెచ్చరికలు రాకుండా శాసన సభ్యులు ఆదర్శంగా ఉండాలి*.  అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నూతన పథకాల విషయమై విదేశీ యానము చేసినా, ఆ పథకాల పాత్రతా, యోగ్యతా, శ్రేష్ఠతా గమనించి, వాటిని తమ తమ నియోజక వర్గాలలో అమలు చేయుటకు మనసా, వాచా కర్మణా పాటుపడాలి. ప్రభుత్వ కార్యాలపై విదేశీ యాత్రలు చేసే శాసన సభ్యులు ప్రజా సంక్షేమ సంబంధమైన అంశాలు...అనగా వ్యవసాయం, నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, పట్టణ నిర్మాణము ఇత్యాది వాటి  అభివృద్ధికర పద్ధతులపై దృష్టిపెట్టాలి.  ఆయా నవీన మరియు మెరుగైన పద్ధతులను మన రాష్ట్రంలో అమలు చేసి ప్రజాభ్యున్నతికి  పాటుపడాలి. విదేశీ యాత్రలా లేక విలాస యాత్రలా అని ప్రజలు అపోహపడకుండా ఉండాలి. *ప్రజా ప్రతినిధుల ఇతర రాష్ట్ర మరియు విదేశీ పర్యటనలు కాలక్షేప యాత్రలుగా ప్రజలు భావించరాదు*. మన ప్రతినిధులు మన సంక్షేమం కోసం వారి అధికార కాలాన్ని వినియోగిస్తారని ప్రజలు కూడా విశ్వసించాలి.


*తమ అధికార కాలమంతా తమను ఎన్నుకున్న ప్రాంతాల ప్రజల సేవకై  శాసన సభ్యులు వినియోగించాలని ప్రజలు కోరుకుంటూ ఉంటారు, ఆశపడ్తూ ఉంటారు*.


ధన్యవాదములు.

🙏🙏🙏


*స్వస్తి*

వారే తపస్వులు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝    *యే పాపాని న కుర్వంతి*

        *మనోవాక్కర్మబుద్ధిభిః* l

        *తే తపన్తి మహాత్మానః*

        *న శరీరస్య శోషణమ్* ll


తా𝕝𝕝 "*మనోవాక్కర్మ చేత పాపాలు చేయనివారే మహాత్ములు.... వారే తపస్వులు.... శరీరాన్ని శుష్కింపజేయడం తపస్సు కాదు*"


 ✍️💐🌷🌹🙏

శివునికి నమస్కారము.🙏

 ☝️శ్లోకం 

*వందేతరస్థం నిగూఢ రూపం* 

*శివంస్వత స్ప్రష్టు మిదం విచష్టే*. 

*జగంతి నిత్యం పరితో భ్రమంతి,* 

*యత్సన్నిధౌచుంబుక లోహవత్తమ్*

భావం : శివుడుగా తనస్వరూపము నుండియే సృజించి సర్వమును వ్యాపించి యున్నవాడై తన గూఢ రూపమునందు ప్రతిష్ఠితుడై యున్నాడు. అయస్కాంత సన్నిధిలో లోహశకలముల వలే ఈ భువనములూ నిత్యమూ ఆయన చుట్టూ తిరుగుతున్నవి. అట్టి శివునికి నమస్కారము.🙏