ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
25, సెప్టెంబర్ 2023, సోమవారం
ఫలముల గుణధర్మములు
కొన్నిరకాల ఫలముల గుణధర్మములు -
* మామిడి -
మంచి పౌష్టిక ఆహారం , కొంచం అరుగుటకు సమయం తీసుకొనును.
* అంజూర -
చాలా మంచి పౌష్టిక ఆహారం. అరుగుటకు సమయం తీసికొనును. వేసవికాలమున ప్రాతఃకాలం నందు ( సూర్యోదయమునకు పూర్వం ) ఈ ఫలమును తినుట శరీరానికి చాలా మంచిది .
* ద్రాక్ష -
మంచి జీర్ణకారి. రక్తమును శుద్ధి చేయును . కొవ్వు మరియు వేడిమిని శరీరం నందు వేగముగా పుట్టించును . గుండెకు మంచి మేలు చేకూర్చి గుండె చుట్టు ఉండే రక్తమునకు మంచి చేయును .
* ఆపిల్ -
త్వరితముగా జీర్ణం అగును. శరీరం నందు శక్తి లేనివారికి , చిన్నపిల్లలకు మేలు చేయును .
* అరటి -
మంచి పౌష్టిక ఆహారం , మలాన్ని శుద్ధిచేయు గుణము అధికం .
* కిత్తిలి -
మంచి జీర్ణకారి , రక్తాన్ని శుద్ధిచేయును .
* సీమ రేగు -
శ్రేష్టమైన ఆహారం , మంచి ఔషధముగా పనిచేయును . శరీరాన్ని పరిశుభ్రపరుచు శక్తి కలదు. రోగపదార్థమును బయటకి వెడలించును. వాతమును , గుండె సరిగ్గా కొట్టుకొనకుండా ఉండు సమస్యని మాన్పును.
భోజనమునకు ముందే వీటి రసము లొపలికి తీసుకొనిన పులితేన్పులు రాకుండా చేయును . నివారణ చేయును . వీటి రసమునకి సూక్ష్మజీవులను సంహరించగల శక్తి కలదు. విష జ్వరాలకు కారణం అయిన శిలింద్రాలను ఇది సహరించగలదు.
* బేరిపండ్లు -
వీటిని చెక్కు తీయకుండా తినినచో విరేచనం కలిగించును. చెక్కు తీసి తినినచో బంక విరేచనాలను నివారించును. పుట్టకొక్కు విషమునకు విరుగుడుగా పనిచేయును .
* అనాస -
భోజనానంతరం ఇది పుచ్చుకొనిన ఇది మిక్కిలి జీర్ణకారిగా ఉండును. గొంతుచుట్టు గ్రంధులు వలే గొలుసు మాదిరిగా ఏర్పడు రోగమును గండమాల అందురు. అలా ఏర్పడిన గ్రంధుల నుంచి రసికారుటను మాన్పుటకు ఈ ఫలము అద్భుతంగా పనిచేయును . ఈ పండ్ల రసమును మొటిమలకు మరియు పులిపిరులకు పూస్తున్న అవి హరించును .
* బాదం -
ఇది మానవులకు సహజ ఆహారం. వీటిని చిరుతిండిగా మధ్య ఆహారంగా ఉపయోగించవచ్చు . ఇవి అధిక బలకారులు కావున మితముగా ఉపయోగించవలెను. ఇది సమశీతోష్ణము అయినది. కొత్త కాయలలోని పప్పు శ్రేష్టమైనది. వేడిచేసి చలువచేయును. వీర్యవృద్ధి , దేహపుష్టి కలుగచేయును . మేహవాతాన్ని అణుచును . రొమ్మునకు బలమును ఇచ్చును.
మూత్రపు సంచిలోని పుండ్లు మాన్పును . శరీరంలోని అని అవయవములను బలమును ఇచ్చును. గొంతుకను , రొమ్మును మృదువుగా చేయును . దగ్గు,లివర్ నొప్పి , క్షయ మొదలగు రోగాలని అణుచును. కిడ్నీలకు బలమును కలుగచేయును . వాతమును అణుచును. పళ్లనొప్పి , దేహము బక్కగా అవ్వు సమస్య , శిరస్సుకు సంబందించు సమస్యలను నివారించును. మాటిమాటికి వచ్చు జ్వరమును నివారించును.
ఈ పప్పులను తినటం మొదలుపెట్టగానే శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్ళుట ప్రారంభం అగును.
* వేరుశెనగ -
ఈ పప్పు చాలా బలకరం . వీటిని పచ్చిగానే తినినచో మంచి బలాన్ని కలగచేయును . వీటిని తినినచో శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్ళును.
* టెంకాయ -
కొబ్బరి మరియు కొబ్బరి నీరు లొపలికి తీసుకోవడం వలన మంచి బలం కలిగించును. శరీరం లోని వేడిని తీసివేయును. తక్షణ శక్తిని ఇవ్వడంలో దీనిని మించినది ఏది లేదు . కేవలం టెంకాయ మాత్రమే తిని జీవించవచ్చు అని కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో రాసి ఉన్నది.
మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
⚜ శ్రీ ఖల్లారి మాత మందిర్.
🕉 మన గుడి : నెం 189
⚜ ఛత్తీస్‌గఢ్ : మహాసముండ్
⚜ శ్రీ ఖల్లారి మాత మందిర్.
💠 భారతదేశంలోని అనేక దేవాలయాలు మరియు నగరాలు రామాయణం మరియు మహాభారతంతో ముడిపడి ఉన్నాయి.
ఈ దేవాలయాలలో ఒకటి ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో ఉన్న మాతా ఖల్లారి దేవి ఆలయం.
మహాబలి భీముడు మరియు రాక్షసి హిడింబ వివాహం ఇక్కడే జరిగిందని ఈ ఆలయం గురించి చెబుతారు. ఆ తర్వాత ఇక్కడ మాతా ఖల్లారి ఆలయాన్ని నిర్మించారు.
రామాయణం మరియు మహాభారతాలలో వర్ణించిన ప్రదేశాలలో ఒకటి ఖల్వాటిక, దీనిని ఇప్పుడు ఖల్లారి అని పిలుస్తారు.
💠ఈ ఆలయం ఎత్తైన కొండపై ఉంది. పాండవులు ఒకప్పుడు ఇక్కడ నివసించినట్లు తెలిపే అనేక ఆధారాలు ఈ ప్రదేశం చుట్టూ ఉన్నాయి.
ఖల్లారి పేరు ఒకప్పుడు ఖల్వాటిక అని నమ్ముతారు.
ఖల్లారి యొక్క ఒక అర్థం ఖల్ + అరి అంటే చెడును నాశనం చేసేవారు.
బహుశా ఈ కారణంగానే మాతాదేవి పేరు ఖల్లారిగా మారింది.
ఇక్కడ కొండపైన ఉన్న ఖల్లారి మాత ఆలయం ఉంది, ఇక్కడకు చేరుకోవడానికి దాదాపు 850 మెట్లు ఎక్కాలి. ఇక్కడ ఛోటీ ఖల్లారి మాత మరియు బడి ఖల్లారి మాత యొక్క దివ్య ఆలయాలు ఉన్నాయి.
💠 ఖల్లారి మాత ఆలయం మహాసముంద్‌కు దక్షిణంగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖల్లారి గ్రామం కొండపై ఉంది.
⚜ స్థల పురాణం ⚜
💠 పాండవులను చంపడానికి శకుని ఒక అందమైన లక్క రాజభవనాన్ని నిర్మించిన ప్రదేశం ఇది. దీనిలో పాండవులు నిద్రించిన తర్వాత నిప్పంటించారు, అయితే పాండవులు ఈ మోసపూరిత పథకం గురించి తెలుసుకుని ఇక్కడ నుండి రహస్య సొరంగం ద్వారా వెళ్లిపోయారు. ఖల్లారిలో ఇప్పటికీ ఆ లక్క కోట అవశేషాలు కనిపిస్తాయి. మరియు అనేక చెక్కిన రాతి స్తంభాలు కూడా కనిపించాయి. ఖల్లారిలో లక్షగృహానికి సంబంధించిన పురాతన మంటపం లాంటి శిథిలావస్థ ఉంది, దీనిని లఖేసరి గుడి అని పిలుస్తారు, ప్రస్తుతం ఈ ప్రదేశం నిర్లక్ష్యం కారణంగా తన ప్రాచీనతను కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.
💠 అజ్ఞాతవాస కాలంలో 5 పాండవులు మరియు వారి తల్లి ఈ ప్రాంతానికి చేరుకున్నారు, సాయంత్రం తరువాత వారు ఈ ప్రదేశం విశ్రాంతికి అనువైనదిగా భావించి విశ్రాంతి తీసుకున్నారు, అప్పుడు రాక్షస రాజు హిడింబాసురుడు మానవుల రాకను గ్రహించి తన సోదరి హిడింబని పిలిచి అందరినీ గుహలోకి తీసుకురావాలని కోరగా, హిడింబ నిరాకరించినప్పటికీ, అతను అంగీకరించలేదు మరియు పాండవులందరినీ చంపడానికి బలవంతంగా బయటకు వెళ్ళవలసి వచ్చింది.
ఆ సమయంలో 7 సోదరులు మరియు వారి తల్లి కుంతి నిద్రిస్తున్నారు మరియు భీమసేనుడు వారికి కాపలాగా ఉన్నాడు.
💠 భీముని అందాన్ని చూసి హిడింబ మైమరచిపోయి తన మనసులో అతడ్ని తన వరుడిగా ఎంచుకుని, అందమైన అమ్మాయి వేషంలో భీముని దగ్గరకు వెళ్లి, ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోమని, లేకపోతే నా అన్న మీ అందరినీ చంపేస్తాడని వేడుకుంది.
మరోవైపు, ఆకలితో విలవిలలాడిన హిడింబాసురుడు పాండవుల వద్దకు చేరుకుని తన సోదరి తన హృదయాన్ని భీముడికి ఇచ్చిందని తెలుసుకున్నాడు.
భీముడు మరియు హిడింబాసురుడు మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది,
ఈ యుద్ధంలో హిడింబాసురుడిని భీముడు సంహరించాడు.
💠 కుంతిదేవి తన పుత్రుడు అయిన భీముడికి హిడింబకి ఖల్లారిమాత ఆలయం దగ్గర గంధర్వ వివాహం చేసింది.
వివాహం తర్వాత, భీమ మరియు హిడింబ ధెల్వా డోగ్రీలో నివసించారు అంటారు.
ఒక సంవత్సరం తర్వాత హిడింబకి, భీముడికి ఒక కొడుకు పుట్టాడు.
పుట్టిన తర్వాత తలపై చిన్న వెంట్రుకలు ఉన్నందున అతనికి ఘటోత్కచుడు అని పేరు పెట్టారు.
💠 పాండుపుత్ర భీముడుతో వివాహం తరువాత, హిడింబ రాక్షసత్వం మానేసింది, ఆమె మానవురాలిగా మారింది మరియు తరువాత వనదేవతగా మారింది మరియు ఆమె దైవీకరణ తరువాత, ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మనాలికి వెళ్ళింది.
ఆమె ఇప్పటికీ మనాలి ప్రధాన దేవతగా పూజించబడుతోంది.
మనాలిలో హిడింబా మందిరం చాలా ప్రముఖ ఆలయం.
⚜ ఆలయ చరిత్ర ⚜
💠 1985లో, మొదటి సారిగా నవరాత్రుల సమయంలో జ్యోతి కలశాన్ని వెలిగించడం ప్రారంభమైంది, దీని సంఖ్య 11.
క్రమేణా దీని సంఖ్య పెరిగి నేడు వేలాది మంది ఇక్కడ దీపాలను వెలిగిస్తున్నారు.
💠 కొండపై కూర్చున్న తల్లి కథ ఆసక్తికరంగా ఉంటుంది. పురాతన కాలంలో, ఖల్లారి మాత మహాసముంద్‌లోని డెంచ గ్రామంలో నివసించేవారు.
ఖల్లారిలోని బజారుకు అమ్మవారు ఆడపిల్ల రూపంలో వచ్చేది. ఒకసారి ఆడపిల్ల రూపంలో ఉన్న మాతృమూర్తిని చూసి ఒక సంచార జాతివాడు పరవశించిపోయి కామంతో కొండ వరకు ఆమెను అనుసరించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఖల్లారీ మాత ఆ సంచార వ్యక్తిని శపించి రాయిగా మార్చేసి ఆమె అక్కడే కొండపై కూర్చుంది.
💠 కల్చూరి రాజవంశం యొక్క లహరి శాఖ రాయ్‌పూర్‌లో స్థాపించబడినప్పుడు, వారి ప్రారంభ రాజధాని ఖల్లారి.
1409లో, బ్రహ్మదేవ రాయ్ కాలంలో, రాజధాని ఖల్లారి నుండి రాయ్‌పూర్‌కు మార్చబడింది.
💠 ఈ ఆలయం మహాసముండ్ నుండి 24, రాయ్‌పూర్ నుండి 79 కి.మీ దూరంలో ఉంది.
మల్లె సుగంధపు మధురిమ
*1933*
*కం*
మల్లె సుగంధపు మధురిమ
మెల్లగ పయనించి మదిని మెప్పించునయా.
అల్లన దుర్గంధమ్ములు
గొల్లున వ్యాపించి రోత గొలుపును సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మల్లెపూల సుగంధ పరిమళం మెల్లగా ప్రయాణం చేసి మనసు ను మెప్పిస్తుంది. కానీ దుర్గంధం వేగంగా వ్యాపించి రోతపుట్టిస్తుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
వినాయక చవితి శుభాకాంక్షలు సందేశం 10/11
ॐ వినాయక చవితి శుభాకాంక్షలు
సందేశం 10/11
వినాయకుడు - కంచి పరమాచార్య స్వామి
గాణాపత్యంపై కంచి పరమాచార్య స్వామివారు ఒకసారి,
క్రింది విధంగా సమీక్షిస్తూ భక్తులను అనుగ్రహించారు.
వినాయకుణ్ణి ధారణచేసి మనం కొంచెం యోచిస్తే, ప్రతి చిన్న విషయంలోనూ అయనను గూర్చి మన కొక తత్త్వం నయన పర్వంగా దీపిస్తుంది.
వినాయకునికి మనం కొబ్బరికాయలు కొడతాం. ఎందుకు?
ఒకప్పుడు విఘ్నేశ్వరుడు తండ్రియైన పరమశివుని చూచి, 'నాకు నీ తలను బలిగా ఇవ్వు' అని అడిగాడట.
తలను ఉత్తమాంగం అని అంటారు. మనకున్న వస్తువులో పరమ శ్రేష్ఠమైన వస్తువును త్యాగంచేసి అర్చిస్తే కదా అది భక్తి.
ఈశ్వరుడు త్రయంబకుడు - మూడుకళ్ళవాడు. తన తలకు ఈడైన వస్తువునొకటి ఈశ్వరుడు సృష్టించాడు. ఆ వస్తువే మూడుకళ్ళుకల కొబ్బరికాయ.
"వినాయకునికి మీరు కూడా మూడుకళ్ళ కొబ్బరికాయ కొట్టండి" అని ఈశ్వరుడు అనుగ్రహించినట్లున్నది.
తమిళనాడులో కొబ్బరికాయ జుట్టును పూర్తిగా తీసివేసి ఒక్కవ్రేటులో పగిలేటట్లు కొట్టడం ఒక అలవాటు. దానిని వాళ్ళు "సిదిర్ తేంగాయ్" అని వ్యవహరిస్తారు.
ఒకప్పుడు నేను చాతుర్మస్యదీక్షలో నాగపట్నంలో ఉన్నాను. అక్కడ వినాయకుని ముందు విస్తారంగా కొబ్బరికాయలు కొట్టేవారు. ఆలయం ముందు ఒకటే పిల్లల సందడి. కాయను కొట్టీ కొట్టకముందే పిల్లలు మూగి చెదిరే కొబ్బరిముక్కలకై పోట్లాడుకునేవారు. కొందరు పెద్దలు వారిని గద్దించారు.
"కొబ్బరి ముక్కలను ఏరుకోవద్దని గద్దించారు.
"కొబ్బరి ముక్కలను ఏరుకోవద్దని గద్దించడానికి మీకేవరు అధికారం ఇచ్చారు?" అని పిల్లలు తిరగబడ్డారు .
ఔను, ఆ చిట్టిదైవానికి ఆ చిట్టిపిల్లలే సొంతం అని నాకు అనిపించింది.
కొబ్బరికాయను పగలకొడితే అందులొని నారికేళ జలం లభించినట్లు, అహంకారం అణిగితే ఆత్మానుభూతి కల్గుతుంది.
స్థూలం
గణపతిది స్థూలదేహం. ఆయన నామాలలో స్థూలకాయుడు అన్నదొకటి. ఆయన పర్వతంవలె ఉన్నాడు. కాని అతడేమో చిన్నబిడ్డ.
బిడ్డలకు పుష్టియే అనందం. చిక్కిపోయిన శిశువూ, బొద్దుగా వున్న సన్యాసీ ఒక విరోధాభాసం. వయసు ముదిరే కొద్దీ ఉపవాసం వుండి శరీరాన్నికొంచెం శుష్కింపచేయడం మంచిది.
చిన్న బిడ్డలు ఉపవాసముండనక్కర్లేదు.
వాహనం
గణపతి వాహనం ఎలుక. ఈయన ఎంత స్దూలకాయుడో, అది అంత సూక్ష్మమైన దేహం కలది. ఈయనకు వాహనం వలన వచ్చే గౌరవం ఏమిలేదు.
స్థూలకాయుడైనా, తన వాహనానికి ఏ విధమైన శ్రమా ఉండరాదని, అయన లఘిమాసిద్ధితో బెండువలె తేలికగా ఉంటాడు. అదొక విశేషం.
దంతం
ఒక్కొక్కప్రాణికీ, ఒక్కొక్క విషయంలో ప్రీతి.
చమరీమృగానికి తోక అంటే ప్రీతి.
నెమలికి దాని ఫింఛమే బంగారం.
ఏనుగుకు దంతాలంటే ప్రాణం.
కానీ మన గణపతి మహాభారత రచనా సందర్భంలో తన ప్రాణప్రదమైన దంతాన్ని ఊడబెరికి, దానిని కలంగా చేసుకొని, వ్యాసులవారు గంగా స్రవంతిలా భారతాన్ని కవనం చేస్తుంటే, పద్దెనిమిది పర్వాలు చకచకా వ్రాసిముగించి వేశాడు.
ఆదిదంపతుల ఆనందం
"ఆనందాద్థ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే"
పార్వతీ పరమేశ్వరుల ఆనందార్ణవంలో నుంచి ఉద్భవించిన వీచికలాంటివాడు మన గణపతి.
భండాసుర వధ
శ్రీదేవి సేనలను ప్రతిఘటించడానికి భండాసురుడు ఒక విఘ్నయంత్రాన్ని రణమధ్యంలో స్థాపించాడు.
ఆ సమయంలో లలితాదేవి కామేశ్వరుని చూచి ఆనందంగా ఒక చిరునవ్వు నవ్వింది. ఆ హాసచంద్రికలనుంచి ఒక దేవుడు, మదజలాక్త కుంభస్థలంతో గజానుడై పుట్టాడు. ఆ దేవుడు ఇరువదెనిమిది అక్షరములు మంత్రానికి అధిపతి.
ఆయన భండాసురుని విఘ్నయంత్రాలను క్షణంలో భగ్నంచేసి తల్లికి ఎనలేని సహాయం చేశాడు.
గాణాపత్యులు
గణపతినే ప్రధానమూర్తిగా ఉపాసించేవారిని గాణపత్యులని అంటారు.
గుంజిళ్ళు
వినాయకుని ముందు మనం గుంజిళ్ళు తీస్తాం. సంస్కృతంలో దానిని 'దోర్భి:కర్ణ'మని అంటారు.
దోర్భి: అంటే చేతులు.
కర్ణమంటే చెవులు.
దోర్భి:కర్ణమంటే చేతులతో చేవులని పట్టుకొని గుంజిళ్ళు తీయటం.
ఒకప్పడు మహావిష్ణువు వైకుంఠం నుండి కైలాసానికి వెళ్ళారట. అక్కడ మేనల్లుడైన గణపతి కనపడి ఆయన సుదర్శన చక్రాన్ని లాక్కోని ఎంతవేడినా తిరిగి ఇవ్వలేదట. మహవిష్ణువుకు ఏమి చేయడానికీ తోచక తన రెండు చెవులనూ, నాలుగు చేతులతో పట్టుకొని గుంజిళ్ళు తీశారట.
ఈ విచిత్ర చర్యకు వినాయకుడు దొర్లిదొర్లి నవ్వాడట. చిన్నబిడ్డకదా!సుదర్శన చక్రం విషయం మఱచిపోయాడు! అంతటితో అమ్మయ్యా! అని చక్రం తో బాటు విష్ణువు బయటపడ్డాడట.
విఘ్న నివారకుడు
ఏకార్యం తలపెట్టినా మనం ముందు, విఘ్నేశ్వరుని తృప్తి పరచాలి. ఆయన అనుగ్రహం ఉంటే ,అన్నీ అనుకూలంగా సమాప్తమౌతాయి. అన్నిటికీ ఆది దైవం ఆయనే.
ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగాలంటే,
విఘ్నేశ్వరుని అనుగ్రహంతో జరగాలంటే,
విఘ్నేశ్వరుని అనుగ్రహం అక్షయంగా ఉండాలి.
అందుకే ఆయనకు,
"యన్నత్వాకృతకృత్యాశు తం నమామి గజాననం" అన్న ప్రశస్తి.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
మధువని క్యాటరింగ్
మధువని క్యాటరింగ్ విజయవాడ 9182554800,
నిన్న రాత్రి కాశీ వెళ్తున్న వాళ్లకి మంది కి డిన్నర్ మరుసటి రోజు కి గారెలు చపాతి పిండి పులిహార మూడు రకాల ఊరగాయ పచ్చళ్ళు ఆర్డర్ చేశారు వారు భోజనం చేశాక రాత్రి లేట్ అయినా సరే ఫోన్ చేసి మరీ చాలా బాగుంది అని చెప్పారు 🙏🏻🙏🏻 చాలు కదండీ మనకి 🙏🏻 వివాహాది శుభకార్యములకు అన్ని రకముల ఫంక్షన్లకి క్యాటరింగ్ చేయబడును 🙏🏻🙏🏻🙏🏻 పండగలకు ప్రసాదాలు మడితో ఇవ్వబడును
మధువని క్యాటరింగ్ 9182554800
అతిరథ మహారథులు
అతిరథ మహారథులు..అంటే..ఎవరు..!
(సేకరణ )
అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం.
అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం
మనకు అర్థమవుతుంది.
అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు.
మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు.
ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.
యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.
ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..
రథి,
అతిరథి,
మహారథి,
అతి మహారథి,
మహామహారథి.
1) రథి..💐
ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.
సోమదత్తుడు,
సుదక్షిణ,
శకుని,
శిశుపాల,
ఉత్తర,
కౌరవుల్లో 96మంది,
శిఖండి,
ఉత్తమౌజులు,
ద్రౌపది కొడుకులు -
వీరంతా..రథులు.
2) అతి రథి (రథికి 12రెట్లు)..💐
60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
లవకుశులు,
కృతవర్మ,
శల్య,
కృపాచార్య,
భూరిశ్రవ,
ద్రుపద,
యుయుత్సు,
విరాట,
అకంపన,
సాత్యకి,
దృష్టద్యుమ్న,
కుంతిభోజ,
ఘటోత్కచ,
ప్రహస్త,
అంగద,
దుర్యోధన,
జయద్రథ,
దుశ్శాసన,
వికర్ణ,
విరాట,
యుధిష్ఠిర,
నకుల,
సహదేవ,
ప్రద్యుమ్నులు
వీరంతా..అతిరథులు.
3) మహారథి (అతిరథికి 12రెట్లు).💐
7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
రాముడు,
కృష్ణుడు,
అభిమన్యుడు,
వాలి,
అంగద,
అశ్వత్థామ,
అతికాయ,
భీమ,
కర్ణ,
అర్జున,
భీష్మ,
ద్రోణ,
కుంభకర్ణ,
సుగ్రీవ,
జాంబవంత,
రావణ,
భగదత్త,
నరకాసుర,
లక్ష్మణ,
బలరామ,
జరాసంధులు
వీరంతా..మహారథులు.
4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).💐
86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.
ఇంద్రజిత్తు,
పరశురాముడు,
ఆంజనేయుడు,
వీరభద్రుడు,
భైరవుడు -
వీరు..అతి మహారథులు.
రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు,
అటు ఇంద్రజిత్తు -
ఇటు ఆంజనేయుడు.
రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.
5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .💐
ఏకకాలంలో 207,360,000
(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు,
దుర్గా దేవి,
గణపతి మరియు
సుబ్రహ్మణ్య స్వామి,
వీరంతా..మహామహారథులు.
మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం
హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు.
అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు .... లెక్కలకు అందని గొప్ప ధర్మం మన హైందవ ధర్మం.... _శవాల సమాధుల శ్మశానాలా మనకు సాటీ_!!!
పాఠకాధములు
పాఠకులు అంటే బోధకులై ఉండొచ్చు లేదా విద్యార్థులైనా కావొచ్చు. ఎవరైనా గాని వాళ్ళ పఠనంలో ఈ కిందివి ఉన్న యెడల వారిని అధములనే పరిగణించాలి.
మాట్లాడేటప్పుడు రాగాలు తీసేవారు, వేగంగా సంభాషించేవారు, తలను ఊపుతూ మాట్లాడేవారు, రాసిన దానిని చూసి చదివేవారు, కంఠస్థము చేసినదానిని అప్పగించినట్లుగా మాట్లాడేవారు, అర్థం తెలియకుండా మాట్లాడేవారు, పీలకంఠము కలవారు, వీరందరూ పాఠకాధములే సుమా.
అసలు మాట్లాడేటపుడు ముఖములో ఏ విధమైన వికారాలు లేక మాట్లాడాలి. సంక్షిప్తంగా తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్త పరచాలి.
ఎటువంటి సందేహాలకు తావులేకుండా తొందరపాటు తొట్రుపాటు లేకుండా కూలంకషంగా పదాలను అర్థవంతంగా కలిపి ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా క్రమబద్ధంతో మధ్యమ స్వరంలో మాట్లాడాలి.
ఇలా చేస్తేనే మన మాటలు ఎదుటి వారిని మంత్ర ముగ్ధులను చేయగలవు.
ఇవి లేనివారందరూ పాఠకాధములే.
ఔషధములు
ಸುಭಾಷಿತ . 633 .
ಔಷಧಾರ್ಥಸುಮಂತ್ರಾಣಾಂ ಬುದ್ಧೇಶ್ಚೈವ ಮಹಾತ್ಮನಾಂ | ಅಸಾಧ್ಯಂ ನಾಸ್ತಿ ಲೋಕೇತ್ರ ಯದ್ಬ್ರಹ್ಮಾಂಡಸ್ಯ ಮಧ್ಯಗಂ ||
ಔಷಧ , ಹಣ , ಮಂತ್ರಾಲೋಚನೆ , ಮಹಾತ್ಮರ ಬುದ್ಧಿಶಕ್ತಿ - ಇವುಗಳಿಗೆ ಲೋಕದಲ್ಲಿ ಅಸಾಧ್ಯವಾದದ್ದು ಈ ಬ್ರಹ್ಮಾಂಡದ ನಡುವೆ ಇಲ್ಲ .
ಪಂಚತಂತ್ರ .
ఔషధములు, ధనం, మంత్రములు, మహాత్ముల బుద్ధి - వీటికి అసాధ్యమైనది ఈ బ్రహ్మాండం లో లేదు.
విశ్వామిత్రులు
శ్రాధ్ధంలో ఒక్క కాకరకాయ కూర వంద కూరలకు సమానం
ఒకసారి తమ పితరుల శ్రాద్ధము తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠులు విశ్వామిత్రులను పిలిచినారు. దానికి విశ్వామిత్రులు దానికేమి వస్తాను కాని నాదొక నిబంధన మీరు ఒకవెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించవలెను అన్నారు.
మీరు అడిగిన వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను అన్నారు.శ్రాద్ధ దినము రానే వచ్చింది విశ్వామిత్రులు రానే వచ్చినారు. వారికి అరటి ఆకు పరచి కాకర కాయకూర పనస పండు మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని కూరలు మాత్రము వాడి చేసిన వంటను అరుంధతి వడ్డించింది.
వెయ్యిన్ని ఎనిమిది కూరలు అయితే లేవు. దానికి విశ్వామిత్రులు కోపించి ఇదేమిది, ఈ ఆకులో వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఎక్కడున్నాయి, అన్నారు. దానికి వశిష్ఠులు నేను తమ కోరికను అరుంధతి వద్ద ముందే చెప్పి ఉంచినాను.మీ కోరిక ప్రకారమే చేస్తాను అని చెప్పింది కూడా అడుగుతాను ఉండండి అన్నారు. వీరి మాటలు వింటున్న అరుంధతి తానే ముందుకు వచ్చి ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు చెపుతుంది
కారవల్లీ శతం చైవ వజ్రవల్లీ శత త్రయం
పనసమ్ షట్ శతశ్చైవ శ్రాద్ధకాలే విధీయతే
దాని అర్థము శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కూరగాయలకు సమానము. మరియు వజ్రవళ్ళి (నల్లేరు) పచ్చడి మూడు వందల కూరలకు సమానము.పనసపండు ఆరు వందల కూరలకు సమానము. ఇవి మూడూ కలిపితే మొత్తం వెయ్యి కూరలు.ఇవికాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించినాను అంది నమస్కరించి వినయముతో.
అది విని విశ్వామిత్రులు తబ్బిబ్బై నోటమాట రాక భోజనము చేసి వెళ్లారుట.
వాట్సాప్
*వాట్సాప్ మరియు ఫోన్ కాల్స్ కోసం కొత్త కమ్యూనికేషన్ నియమాలు రేపటి నుండి వర్తిస్తాయి*
01. అన్ని కాల్‌లు రికార్డింగ్ అవుతాయి.
02. అన్ని కాల్ రికార్డింగ్‌లు సేవ్ చేయబడతాయి.
03. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు అన్ని సోషల్ మీడియాలను పర్యవేక్షిస్తారు.
04. తెలియని వారందరికీ తెలియజేయండి.
05. మీ పరికరాలు మినిస్ట్రీ సిస్టమ్‌కి కనెక్ట్ అవుతాయి.
06. ఎవరికీ తప్పుడు సందేశాలు పంపకుండా జాగ్రత్త వహించండి.
07. మీ పిల్లలు, సోదరులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులను మీరు జాగ్రత్తగా చూసుకోవాలని మరియు తక్కువ సోషల్ సైట్‌లను ఉపయోగించమని వారికి చెప్పండి.
08. రాజకీయాలు లేదా వర్తమాన వ్యవహారాలపై ప్రభుత్వం లేదా ప్రధానమంత్రి ముందు మీ పోస్ట్ లేదా వీడియో...మొదలైనవి. పంపవద్దు
09. ప్రస్తుతం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన విషయాలపై సందేశాలు రాయడం లేదా పంపడం నేరం... అలా చేస్తే వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు.
10. పోలీసులు నోటిఫికేషన్ జారీ చేస్తారు... సైబర్ క్రైమ్ తర్వాత... చర్య తీసుకుంటారు, ఇది చాలా తీవ్రమైనది.
11. దయచేసి మీరందరూ, గ్రూప్ సభ్యులు, అడ్మిన్లు,...దయచేసి ఈ విషయాన్ని పరిగణించండి.
12. తప్పుడు సందేశాన్ని పంపకుండా జాగ్రత్త వహించండి మరియు అందరికీ తెలియజేయండి మరియు జాగ్రత్త వహించండి.
13. దయచేసి దీన్ని భాగస్వామ్యం చేయండి.
సమూహాలు మరింత అప్రమత్తంగా మరియు అప్రమత్తంగా ఉండాలి.
*గ్రూపు సభ్యులకు WhatsApp గురించి ముఖ్యమైన సమాచారం...*
*వాట్సాప్‌లో సమాచారం*
*1. ✔= సందేశం పంపబడింది*
*2. ✔✔ = సందేశం బట్వాడా చేయబడింది*
*3. రెండు నీలం ✔✔ = సందేశం* *చదవండి*
*4. మూడు నీలం ✔✔✔=* *ప్రభుత్వం సందేశాన్ని నోట్స్*
*5. రెండు నీలం మరియు ఒక ఎరుపు ✔✔✔= ప్రభుత్వం మీపై చర్య తీసుకోవచ్చు*
*6. ఒక నీలం మరియు రెండు ఎరుపు = ప్రభుత్వం మీ సమాచారాన్ని తనిఖీ చేస్తోంది*
*7. తీన్ లాల్ ✔✔✔= ప్రభుత్వం మీపై చర్యను ప్రారంభించింది మరియు త్వరలో మీకు కోర్టు సమన్లు అందుతాయి.*
*బాధ్యతగల పౌరుడిగా ఉండండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి*..
వీరుల చరిత్ర
*1) తాగుబోతు, స్వలింగ సంపర్కరాజు ఎవరు ?*
*👉🏻 బాబర్*
*2) బాబాయి కూతురిని వివాహమాడి, తన కోడలిని మానభంగం చేసిన రాజు ఎవరు ?*
*👉🏻 అక్బర్*
*3) 37 భార్యలు, 5,000 మంది సెక్స్ బానిసలను ఉంచుకున్న రాజు ఎవ్వరు ?*
*👉🏻 అక్బర్*
*4) సొంత కూతురి ప్రేమికులను చంపి, జీవితాంతం కూతురితో శారీరక సంబంధాలు పెట్టుకున్న రాజు ఎవరు ?*
*👉🏻 షా జహాన్*
*5) సొంత కొడుకుని తన చేతులతోనే కంటి గుడ్లు పీకేసిన రాజు ఎవ్వరు ?*
*👉🏻 జహంగీర్*
*6) సొంత తండ్రిని జైలులో బందీ చేసి, సోదరుడి తలకాయ నరికేసి తండ్రికి బహుమానం ఇచ్చిన రాజు ఎవరు ?*
*👉🏻 ఔరంగాజీబ్*
*❌ ఇలాంటి దౌర్బాగ్యుల జీవితాలను పాఠ్యపుస్తకాల్లో చేర్పించి, చరిత్రను వక్రీకరించిన మన కుహనా సెక్యులరిస్టులను చెప్పుతో కొట్టినా తక్కువే ! 😤*
*📖 సమాధానం తెలిసాక మీకు బడిలో గంటలకు గంటలు అబద్దపు చరిత్ర నేర్పించిన మాస్టారుగారిని దూషించకండి. 👐🏻*
*🚩 ఇప్పటికైన మన వీరుల చరిత్ర తెలుసుకోనే ప్రయత్నం చేయండి... 🙏🙏🙏*
*ఇవి పిల్లలకు తెలియచేయాలి*కాపీ పేస్ట్
_అక్షరమే ఆయుధమై..!_
.: *
_అక్షరమే ఆయుధమై..!_*
🙏🙏🙏🙏🙏🙏🙏
*_ఆయన.._*
నడిచే అక్షరాల ఉద్యమం..
కలం యోధుడు..
మాటల మాంత్రికుడు..
*నవయుగ వైతాళికుడు..!*
*వాడుక భాష..*
*గురజాడ గుండెఘోష..*
మనం మాట్లాడే భాషను..
జనం మాట్లాడే భాషను
ప్రశస్తం చేసేందుకు
ఎన్ని పాట్లు...ఆటుపోట్లు..
భాషాచాందసులపై.. ఛందస్సులపై..
చండశాసనులపై తిరుగుబాట్లు..
బుడుగుగా ఉన్ననాడు జట్టుకట్టిన గిడుగుతో కలిసి
ఎన్ని ప్రయత్నాలు..
ఇప్పుడు ఆ భాషే
'గురజాడ'య్యింది..
*_నీ కాలాన్ని..నా కలాన్ని.._*
*మన కలల్ని_*
ఆ గురజాడ అడుగుజాడే
నడిపిస్తోంది..!
*కలానికి ఇంత బలం ఉంటుందా..*
అక్షరాల పేర్పు ఇంతటి మార్పునకు కా"రణం'
కాగలుగుతుందా..
*ఈ ప్రశ్నలకు అప్పారావు*
*రచనలే సమాధానం..*
సాంఘిక దురాచారాలపై
పెన్నే గన్నుగా ఎక్కుపెట్టిన *_ఆయన తెగువ.._*
*_కన్యాశుల్కం నుంచి_* *_విముక్తం_*
*_అయింది మగువ.._*
వేశ్యావృత్తిపైనా పీఠికలు..
బీగాలు వేసుకున్న
నాటి వాటికలు..!
గురజాడ పాత్రలు
ఏ కాలంలోనైనా ఎలాంటి సమాజంలో అయినా
*కళ్ళ ముందు కదిలే*
*సజీవ మూర్తులు...*
ఒక్క గిరీశంలోనే
ఎన్నెన్ని కోణాలు..
అతగాడి మాటలు
రుగ్మతలపై ఎక్కుపెట్టిన బాణాలు...
ప్రతి పాత్రలో ఓ ప్రయోజనం
ఉబ్బితబ్బిబ్బైన జనం..
మధురవాణి..
రామప్పపంతులు..బుచ్చమ్మ
నిజంగా ఉన్నారా..
*ఇప్పటికీ మన మధ్య..*
*కాదనిపిస్తూ మిథ్య..*
ఎన్నో సంస్కరణలకు
*_గురజాడ రచనలేగా తొలిసంధ్య..!_*
*దేశమంటే మట్టికాదోయ్*
*దేశమంటే మనుషులోయ్..*
ఈ గీతమే
భరతజాతి అవగతం
మానవజాతి మనోగతం..
మనిషన్నవాడి ఇంగితం..
మరో జాతీయగీతం..!
సొంతలాభం కొంత మానుకుని
పొరుగువాడికి సాయపడవోయ్..
ఇంతకు మించిన నీతిసూత్రమున్నదా..
జాతికిది వేదమంత్రమే కదా!
ఇలా రాశాడు గనకనే
గురజాడ అప్పారావు ఆరాధ్యుడయ్యాడు సదా!
++++++++++++++++++
_మహాకవి గురజాడ_ _జయంతి..(21.09.1862)_
_సందర్భంగా_
_అక్షర నివాళి.._
_______________________
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
9948546286
[21/09, 21:29] Eck Murali.: నేడు గురజాడ జయంతి
బుచ్చమ్మను అమ్మింది ఎంతకు?
– మహమ్మద్ ఖదీర్‌బాబు
‘ఈ ఊళ్లో నారదుడు వచ్చి పాడితే నాలుగు దమ్మిడీలివ్వరు’ అంటుంది మధురవాణి ‘కన్యాశుల్కం’లో కాసేపు వీణ సాధన చేసి, పక్కన పడేస్తూ.
తెలుగువారి కళాపోషణను గురజాడ అప్పుడే పసిగట్టి ఆ మాట అనిపించినట్టున్నారు. దమ్మిడీ అంటే అరపైసా. నాలుగు దమ్మిడీలు– రెండు పైసలక్కూడా ఆ రోజుల్లో విలువ.
గత కొన్నాళ్లుగా ‘కన్యాశుల్కం’ పారాయణం చేస్తున్నాను. ప్రతిసారీ కొత్తగా ఉంది. ప్రతిసారీ రుచిగా ఉంది. ప్రతిసారీ విభ్రమంగా ఉంది. గురజాడ జీవించి ఉండగా ఆయనతో నేస్తు కట్టినవారు ధన్యులు. నాటకంలోని ప్రతి పాత్రలోని వ్యంగ్యం ఆయనదే కనుక అటువంటి కోత పెట్టే వ్యంగ్యం కలిగినవాడితో ప్రతి సంభాషణ ఎంత రంజుగా ఉండేదో. అయితే– లోక స్వభావాలను కాచి వడబోసిన ఇటువంటి మేధావి, సూక్ష్మగ్రాహి ఎవరినైనా దగ్గరకు రానిచ్చి ఉంటాడా అని మరో సందేహం.
‘కన్యాశుల్కం’లో మాట్లాడాల్సిన విషయాలు చాలా కనిపించాయి. కాని ముందుగా నన్ను ఆకర్షించింది అందులోని ‘ద్రవ్య ప్రస్తావన’. ఈ రోజు మనం నాటకం చదువుతూ అందులో కనిపించే రూపాయలను, పైసలను ఉపేక్షిస్తూ వెళితే కన్యాశుల్కంలో జరిగిన ఆర్థిక లావాదేవీల విశ్వరూపం అర్థం కాదేమో అనిపించింది. అసలు కన్యాశుల్కంలో ‘డబ్బు ప్రస్తావన’ గురించే ఒక పిహెచ్.డి చేయవచ్చు. ఎవరైనా చేశారో లేదో.
‘కన్యాశుల్కం’ కథ జరిగిన కాలం 1890 – 1910 అనుకుందాం. దమ్మిడీలకు కూడా విలువ ఉన్న కాలం అది. మనం నాటకం చదివేటప్పుడు ఈ ‘విలువ’ను గుర్తించాలి.
నాటకంలో రామప్ప పంతులు కొండుభొట్టుకు ‘విచ్చ బేడ’ఇస్తాడు. అంటే 12 పైసలు కావచ్చు.
‘పది అణాలు పెట్టి శేరు కాశీమిఠాయి’ తెమ్మంటాడు గిరీశం. పది అణాలు 60 పైసలు. (ఆ 60 పైసలు నేటి రూ.400 కు సమానం. కిలో స్వీటు కనీసం నాలుగు వందలు).
‘నీ దగ్గర కాపర్సు ఏమైనా ఉన్నాయా’ అంటాడు గిరీశం చుట్టల కోసం. కాపర్స్ అంటే కాణీలు. ఒక కాణి ఒకటిన్నర పైసా. ఆ ఒకటిన్నర పైసాకు చుట్టలు వచ్చేవి. (నేడు ఒక కింగ్ సిగరెట్ రూ.20)
తన కుమార్తెను (అంటే మారువేషంలో ఉన్న శిష్యుణ్ణి) లుబ్ధావధాన్లకు కట్టబెడితే రామప్ప పంతులికి 10 వరహాలు ఇస్తానంటాడు కరటక శాస్త్రి. ఒక వరహా మూడున్నర రూపాయలు. అందుకే రామప్ప పంతులు ‘నేను నలభై యాభై రూపాయల వ్యవహారాల్లో జొరబడను’ అంటాడు.
ఇదే నాటకంలో ‘కాసు’ ప్రస్తావన ఉంది. ‘పెద్ద కాసు’ ప్రస్తావన ఉంది. కరటక శాస్త్రి ‘నేను పది రాపాషాణాలు ఇస్తాను’ అంటాడు. రాపాషాణాలు ఎంతో మరి. పులి మొహరు ప్రస్తావన ఉంది. దాని విలువ ఎంతో.
విషయం ఏమిటంటే 1925 నాటికి మన దేశంలో 10 గ్రాముల బంగారం విలువ 18 రూపాయలని గెజిట్‌లు చెబుతున్నాయి. మరి ‘కన్యాశుల్కం’ కాలంనాటికి 10 గ్రాముల బంగారం 10 రూపాయలు అయి ఉండదా?
ఈ లెక్కన అగ్నిహోత్రావధాన్లు తన కూతురు బుచ్చెమ్మను 1500 రూపాయలకు అమ్మాడంటే నేటి ఎంత మొత్తానికి సమానం? 1500 గ్రాముల బంగారం నేటి లెక్క– సుమారు 75 లక్షలు.
బుచ్చమ్మను అగ్నిహోత్రావధాన్లు అమ్మింది 75 లక్షలకు!
ఆ డబ్బు చాలక ఇదే అగ్నిహోత్రావధాన్లు తన చిన్న కూతురు సుబ్బిని అమ్మజూపింది అక్షరాలా 1800 రూపాయలకు. అంటే దాదాపు 90 లక్షలకు! ఇది భారీ మొత్తం కనుకనే కొనుక్కోదలచిన లుబ్ధావధాన్లు ‘అంత డబ్బు ఏనాడైనా అగ్నిహోత్రావధాన్లు చూశాడా?’ అంటాడు.
ఇంకా గుండెలవిసే విషయం ఏమిటంటే ‘నాకే మధురవాణి వంటి కూతురు ఉంటే మూడు నాలుగు వేలకు అమ్ముకుని సెటిలైపోయేవాణ్ణి’ అంటాడు కరటక శాస్త్రి. అంటే ఏకంగా రెండు మూడు కోట్లకు అమ్మడమే!
కనుక ‘కన్యాశుల్కం’ ఏదో ఆకలికి ఆడపిల్లల్ని అమ్ముకున్న దురాచారం కాదు. కొంతమంది అత్యాశాపరుల భారీ వ్యాపారం. బానిసల వ్యాపారం వలే ఆడపిల్లల వ్యాపారం.‘బాలికా విక్రయం’. గురజాడ ఇది గమనించి ఈ అత్యాశాపరుల వినా తక్కిన అగ్రహారాలను కాస్తయిన గట్టున పడేయడానికి హాస్యాన్ని ఎంచుకుని ఉంటాడు. లేక ఏడవలేక నవ్వి ఉంటాడు. జరిగింది నవ్వులాట విషయం మాత్రం కాదు.
ఇంకోటి గమనించారా? పూటకూళ్లామె నుంచి గిరీశం కొట్టేసిన 20 రూపాయల నేటి విలువ లక్ష రూపాయలు. ఈ లక్ష పట్టుకెళ్లి మధురవాణికి ఇచ్చి ఆమెను ఉంచుకున్నాడు.
అయితే మధురవాణి కూడా ‘విటుణ్ణి’ బట్టి రేటు పెట్టేలా ఉంది. రామప్ప పంతుల దగ్గర ‘నెల జీతం’ (ముప్పై రోజులకు) 200 రూపాయలు ముందే తీసుకుంది. అంటే నేటి విలువ 10 లక్షలు. సరైన ‘కొమ్మ’ దొరకాలే గాని ఆమె నెలకు పది లక్షలు సంపాదించగలదు!
‘కన్యాశుల్కం’ ఆ కాలం ప్రజలకు సంబంధించిన ఆర్థిక దస్తావేజు అనుకుంటే అదే కాలంలో ఇతర వర్గాల జీవనం ఎలా ఉండేది? బేడకూ అర్థకూ బీదా బిక్కీ జనాలు ఎలా అలమటించేవారు? వారి ఆర్థిక లావాదేవీలు ఎట్టివి? అని తెలిపే సాహిత్యం వెతికి బేరీజు వేయడం విమర్శకుల పని. అది జరిగితే ఒక కాలంలో తెలుగువారి అన్ని వర్గాల అర్థిక జీవనం తెలుసుకునే వీలుంటుంది.
కన్యాశుల్కంలో ఎంతో ఉంది. వెతికినంత వాడికి వెతికినంత.
– సెప్టెంబర్ 21, 2023.
పి.ఎస్: 1891లో లెక్చరర్‌గా గురజాడ నెల జీతం 125 రూపాయలు. సరిగ్గా వందేళ్ల తర్వాత 1991లో నేను ఈవెనింగ్ ట్యూషన్ టీచర్‌గా నెలకు 150 రూపాయలకు పని చేశాను. 25 రూపాయలే తేడా!
పి.ఎస్ 2: ‘కన్యాశుల్కం’లో నామౌచిత్యం ఉందా? కన్యలయ్యే వరకూ ఆగి, వివాహం జరిగే పరిస్థితి నాడు లేదు. ‘రజస్వలా ముండని చూస్తూ చూస్తూ యలా పెళ్లాడావురా? మరి నీకు గతులు లేవు‘ అని లుబ్ధావధాన్లు తనను తాను తిట్టుకుంటాడు. ‘మన దేశంలో మెయిడన్సు (సంపర్కం ఎరగని కన్యలు) వుండరోయి. యంతసేపూ లమ్మేకింగ్ విడోజ్కి చెయ్యాలిగాని మరి సాధనాంతరం లేదు’ అని గిరీశం అంటాడు. ఈడేరక ముందే పెళ్లి చేసేస్తారు కనుక ఇది ‘వధువు శుల్కం’.
గమనిక: కన్యాశుల్కం నాటకాన్ని ‘చదువు’ యాప్‌లో చదవొచ్చు. వినొచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ట్రై చేయండి.
రాజకీయ నాయకులకు పెన్షన్‌పై
👌👌👌👌👌👌👌👌
రాజకీయ నాయకులకు పెన్షన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది
ఈ కారణాన్ని షేర్ చేయండి & మద్దతు ఇవ్వండి
ఇప్పుడు ఓ నేత సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసి మీ అంచనాకు పంపారు.
ప్రియమైన / గౌరవనీయులైన భారతదేశ పౌరులారా... మీరు ఈ సందేశాన్ని చదవవలసిందిగా అభ్యర్థించబడ్డారు మరియు మీరు అంగీకరిస్తే, దయచేసి మీ పరిచయంలో ఉన్న వ్యక్తులందరికీ పంపండి మరియు తదుపరి కూడా ఫార్వార్డ్ చేయమని వారిని అడగండి.
మూడు రోజుల్లో, ఈ సందేశం మొత్తం భారతదేశంలో ఉంటుంది. భారతదేశంలో ప్రతి పౌరుడు స్వరం పెంచాలి. __
2018 మెరుగుదల చట్టం
ఎంపిలకు పెన్షన్ రాకూడదు ఎందుకంటే రాజకీయాలు ఉద్యోగం లేదా ఉద్యోగం కాదు, ఉచిత సేవ. - రాజకీయం అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు, పదవీ విరమణ లేదు, కానీ మళ్లీ అదే పరిస్థితిలో మళ్లీ ఎన్నిక కావచ్చు. (ప్రస్తుతం వారు 5 సంవత్సరాల సర్వీస్ తర్వాత పెన్షన్ పొందుతారు).
ఇందులో మరో లోపం ఏమిటంటే, ఒక వ్యక్తి మొదట కౌన్సిలర్‌గా ఉండి, శాసనసభ్యుడిగా, ఆ తర్వాత ఎంపీగా ఉంటే, అతనికి ఒకటి కాదు మూడు పింఛన్లు వస్తాయి.
దీన్ని అరికట్టడానికి తక్షణమే చట్టం చేయాల్సిన దేశ పౌరులకు ఇది ఘోర ద్రోహం...
సెంట్రల్ పే కమిషన్‌తో ఎంపీల జీత భత్యాలను సవరిస్తున్నారు....దీన్ని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురావాలి....
ప్రస్తుతం ఎంపీలు తమకే ఓటు వేసి ఇష్టారాజ్యంగా జీతాలు, అలవెన్సులు పెంచుకుంటున్నారని, ఆ సమయంలో అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు.
ఎంపీల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను విస్మరించాలి.. భారత ప్రజారోగ్యం వంటి ఆరోగ్య సంరక్షణ ఇతర పౌరుల మాదిరిగానే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారి స్వంత ఖర్చుతో చేస్తారు.
వారికి విద్యుత్, నీరు మరియు ఫోన్ బిల్లు వంటి అన్ని రాయితీలు ముగించాలి. (వారు ఇలాంటి అనేక రాయితీలను పొందడమే కాకుండా వాటిని క్రమం తప్పకుండా పెంచుతారు) -
నేరస్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలి, శిక్షాస్పద రికార్డులు, నేరారోపణలు మరియు సంకల్పం ఉన్న అనుమానాస్పద వ్యక్తులు, గత లేదా ప్రస్తుత పార్లమెంటు నుండి నిషేధించబడాలి.
కార్యాలయంలోని రాజకీయ నాయకుల వల్ల వారి వల్ల కలిగే ఆర్థిక నష్టాలు, వారి నుండి కూడా రికవరీ చేయాలి, వారి నామినీలు, ఆస్తులు - సాధారణ పౌరులకు వర్తించే నిబంధనలను ఎంపీలు కూడా పాటించాలి.
పౌరులకు LPG గ్యాస్ సబ్సిడీపై మినహాయింపు ఉండదు... MPలు మరియు MLA లకు అందుబాటులో ఉన్న సబ్సిడీలు, & పార్లమెంట్ క్యాంటీన్‌లో సబ్సిడీ ఆహారంతో సహా ఇతర సబ్సిడీలు ఉపసంహరించబడవు.
పార్లమెంట్‌లో పనిచేయడం గౌరవం, దోపిడీకి లాభదాయకమైన వృత్తి కాదు.
ఉచిత రైలు మరియు విమాన ప్రయాణాలు నిలిపివేయాలి.
వారి సరదాలను సామాన్యుడు ఎందుకు భరించాలి?
ప్రతి వ్యక్తి కనీసం ఇరవై మందితో కమ్యూనికేట్ చేస్తే, భారతదేశంలో చాలా మంది వ్యక్తులు ఈ సందేశాన్ని పొందడానికి మూడు రోజులు మాత్రమే పడుతుంది.
ఈ సమస్యను లేవనెత్తడానికి ఇదే సరైన సమయం అని మీరు అనుకోలేదా?
*నేను ఒప్పందంలో ఉన్నాను*
మీరు పైన పేర్కొన్నదానితో ఏకీభవిస్తే, దాన్ని ఫార్వార్డ్ చేయండి.
కాకపోతే, దాన్ని తొలగించండి.
మీరు నా 20+ మందిలో ఒకరు, దయచేసి దీన్ని కొనసాగించండి...
ధన్యవాదాలు
జాగో ఇండియా 🤍🇮🇳
వరూధిని పై కన్నేసిన
శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 అల్లసాని వారి అల్లిక జిగి బిగి అంటారు. ఆచార్య వేణు గారి గళం నుంచి ఆ పద్యాలు వింటుంటే పద్య కవిత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది. కామోద్రేకంతో మీద పడిన అప్సర కాంత వరూధినిని వదిలించుకొని ప్రవరుడు తన ఇంటికి వెళ్లిపోతాడు. అప్పుడు వారిద్దరి మధ్య సాగిన సంవాదం ఎన్ని మార్లు విన్నా తీరదు. వరూధిని పై కన్నేసిన ఓ గంధర్వుడు ప్రవరుని వేషంలో వచ్చి ఆమెతో గడుపుతాడు. స్వరోచి జన్మిస్తాడు. అదే మనుచరిత్ర. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
https://youtu.be/NTzQ7lN7DvY?si=KYL9QGp7uXkzrc1B
ఏకాదశులు..ఉపవాసo
*ఏకాదశులు..ఉపవాస ఫలితం*
మన భారతీయ సనాతన ధర్మ (హిందూ) సాంప్రదాయములో కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
అందు..కర్మానుష్ఠానం కోసం కొన్ని పర్వములను నిర్ణయించారు మన పెద్దలు.
ఆ పర్వములను కూడా తిథుల ప్రకారంగా నిర్ణయించడం జరిగింది.
ఆ తిథులలో ముఖ్యమైనది ఏకాదశి తిథి.
సర్వమూ కాలాధీనం.
“కాలః కలయతా మహమ్” అని భగవద్గీత అనంతమైన కాలాన్ని భగవత్ స్వరూపంగా నిరూపించింది.
కాలము శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞతో నడుస్తుందని పెద్దలు సూచించారు.
గృహస్థో బ్రహ్మచారిశ్చ ఆహితాగ్నిస్తథైవచ
ఏకాదశ్యాం న భుంజీత పక్షయోరుభయోరపి
బ్రహ్మచారి,
గృహస్థుడు,
నిత్యాగ్నిహోత్రుడు..ఎవరైనా కావచ్చు,
ఉభయ ఏకాదశులలో భోజనం చేయకూడదు
అని శాస్త్రం చెబుతుంది.
ఎంతో నిష్ఠతో ఏకాదశి రోజున ఉపవాసించిన శ్రీమహావిష్ణువుకు చాలా ఇష్టులు అవుతారు.
సర్వోత్తమ తిథి ఏకాదశి:
కుచేలుడు ఏకాదశీవ్రతాన్ని ఆచరించి మహదైశ్వర్యవంతుడైనాడని,
ధర్మరాజు ఆచరించి కష్టాల నుండి గట్టెక్కినాడని, రుక్మాంగదుడు ఆచరించి పుత్రప్రాప్తి నొంది, దేవతాకృపకు పాత్రుడై, మోక్షగామి అయినాడని, క్షీరసాగర మథనం, లక్ష్మీ ఆవిర్భావం ఏకాదశినాడే జరిగాయని,
వైఖానస రాజు ఆచరించి పితరులకు ఉత్తమ లోక ప్రాప్తి చేకూర్చాడని పురాణ ఉవాచ.
ఇక అంబరీష వ్రత ప్రభావం జగద్విదితమే.
“ఏకాదశ్యాముపవసేన్న కదాచి దతిక్రమేత్” –
ఏకాదశినాడు తప్పక ఉపవాసం చేయాలి.
ఉపవాసంనాడు.
ఉపవాసః స విఙ్ఞేయః సర్వభోగ వివర్జితః” –
పాపకృత్యాలకు దూరంగా ఉండి (చేయక),
సకల భోగాలను వదలి,
పుణ్యకార్యాలు చేయడమే ఉపవాసం
అని పెద్దలమాట!
ఏకాదశీవ్రతం దశమి రాత్రితో ప్రారంభమై,
ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది.
అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి తరించాల్సినదిగా శాస్త్రవచనం.
ఏడాది పొడుగునా.
నెలకి రెండు పక్షాలు
1.శుక్ల పక్షము ,
2. కృష్ణ పక్షము …
పక్షానికొక ఏకాదశి చొప్పున్న ఇరవైనాలుగు ఏకాదశులుంటాయి .
శుక్ల ఏకాదశినాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవ కళ చంద్రుణ్ణి ప్రవేశిస్తుంది.
బహుళ ఏకాదశినాడు చంద్ర మండలం నుండి పదకొండవ కళ సూర్యమండలాన్ని చేరుతుంది.
ఇలా రాకపోకలవల్లనే “ఏకాదశి” అనే పేరు సార్థకమవుతుంది.
ప్రతి నెలా అమావాస్యకి, పౌర్ణమికి ముందు
ఈ ఏకాదశులు వొస్తుంటాయి.
ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టమైన పేరు,
విశేషమైన ఫలము విశేషముగా చెప్పబడినది..
రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయి హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ ఏకాదశి నాడు విద్యుక్తంగా ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా అతను తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడు.
ఇంకా కామికా వ్రతం, శ్రీధర పూజ చేస్తారని
కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.
కామికా వ్రతం ఆచరించే దినం కాబట్టి ఈ తిథిని కామికా ఏకాదశి అని కూడా అంటారు.
24 ఏకాదశుల పేర్లూ, ఫలాలు, సంగ్రహంగా:
1) చైత్ర శుక్ల ఏకాదశి –
‘కామదా’ – కోర్కెలు తీరుస్తుంది.
2) చైత్ర బహుళ ఏకాదశి –
‘వరూధిని’ – సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.
3) వైశాఖ శుద్ధ ఏకాదశి –
‘మోహిని’ – దరిద్రుడు ధనవంతుడగును.
4) వైశాఖ బహుళ ఏకాదశి –
‘అపరా’ – రాజ్య ప్రాప్తి.
5) జ్యేష్ఠ శుక్ల ఏకాదశి –
‘నిర్జల’ – ఆహార సమ్రుద్ధి.
6) జ్యేష్ఠ బహుళ ఏకాదశి –
‘యోగినీ’ – పాపాలను హరిస్తుంది.
7) ఆషాఢ శుద్ధ ఏకాదశి –
‘దేవశయనీ’ – సంపత్ ప్రాప్తి (విష్ణువు యోగ నిద్రకు శయనించు రోజు).
8) ఆషాఢ బహుళ ఏకాదశి –
‘కామికా’ – కోరిన కోర్కెలు ఫలిస్తాయి.
9) శ్రావణ శుక్ల ఏకాదశి –
‘పుత్రదా’ – సత్ సంతాన ప్రాప్తి.
10) శ్రావణ బహుళ ఏకాదశి –
‘అజా’ – రాజ్యపత్నీ-పుత్ర ప్రాప్తి. ఆపన్నివారణం.
11) భాద్రపద శుద్ధ ఏకాదశి –
‘పరివర్తన’ – (యోగనిద్రలో విష్ణువు ప్రక్కకు దొర్లును కనుక పరివర్తన) యోగసిద్ధి.
12) భాద్రపద బహుళ ఏకాదశి –
‘ఇందిరా’ – సంపదలు, రాజ్యము ప్రాప్తించును.
13) ఆశ్వయుజ శుక్ల ఏకాదశి –
‘పాపాంకుశ’ – పుణ్యప్రదం.
14) ఆశ్వయుజ బహుళ ఏకాదశి –
‘రమా’ – స్వర్గప్రాప్తి.
15) కార్తిక శుక్ల ఏకాదశి –
‘ప్రబోధిని’ – (యోగనిద్ర నొందిన మహా విష్ణువు మేల్కొనే రోజు) ఙ్ఞానసిద్ధి.
16) కార్తిక కృష్ణ ఏకాదశి – ‘
ఉత్పత్తి’ – దుష్ట సంహారం. (మురాసురుణ్ణి సంహరించిన కన్య విష్ణు శరీరం నుండి జనించిన రోజు).
17) మార్గశిర శుక్ల ఏకాదశి –
‘మోక్షదా’ – మోక్ష ప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).
18) మార్గశిర కృష్ణ ఏకాదశి –
విమలా’ (సఫలా) – అఙ్ఞాన నివ్రుత్తి.
19) పుష్య శుక్ల ఏకాదశి –
పుత్రదా’ – పుత్ర ప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).
20) పుష్య బహుళ ఏకాదశి –
‘కల్యాణీ’ (షట్ తిలా) – ఈతి బాధా నివారణం.
21) మాఘ శుక్ల ఏకాదశి –
‘కామదా’ (జయా) –ఫలం= శాప విముక్తి.
(ఇది భీష్మైకాదశి అని ప్రసిద్ధి).
22) మాఘ బహుళ ఏకాదశి –
‘విజయా’ – సకల కార్య విజయం
23) ఫాల్గున శుక్ల ఏకాదశికి –
‘అమలకీ ఏకాదశి’ –ఫలం ఆరోగ్యప్రదం.
24) ఫాల్గున బహుళ ఏకాదశికి –
‘సౌమ్య ఏకాదశి’ అనే పేరు. ఫలం – పాప విముక్తి.
పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో
కొన్ని భేదాలు కన్పిస్తున్నాయి.
ఇంద్రియాలను..
(పంచ కర్మేంద్రియ+ పంచ జ్ఞానేంద్రియ + మనస్సులు = 11 ఇంద్రియాలు)
భగవంతుని సన్నిధిలో వసింపచేయునదియే నిజమైన ఉపవాసం.
ఏకాదశీవ్రతం దశమి రాత్రితో ప్రారంభమై,
ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది...
*వైకుంఠ ఏకాదశి ( ముక్కోటి ఏకాదశి ) :*
----------------------------------------
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. (నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
పండుగ ఆచరించు విధానం
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.
ఏకాదశి వ్రతం నియమాలు :
1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.
2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
3. అసత్య మాడరాదు.
4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.
5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
7. అన్నదానం చేయాలి.
పండుగ ప్రాశస్త్యం :
------------------
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి
వైఖానసుడి కథ :
పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!
మురాసురుడి కథ
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కానిమురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే!వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.
తాత్త్విక సందేశం
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు(కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.
ముక్కోటి ఏకాదశి వ్రతమాచరిస్తే మరు జన్మంటూ ఉండదట! :-
అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు.
ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.
అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.
వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.
అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.
ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదు.
ఏకాదశి వ్రతం
*||ఏకాదశి వ్రతం అనగానేమి?||* అసలు ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఎలా చేయాలి? ఏకాదశి రోజున, ఉపవాస దీక్షలో ఉన్నవారు, స్మరించవ లసిన ప్రత్యేకమైన మంత్రము లు ఏమైనా ఉన్నవా? ఇది ఎవరికి ఉద్దేశించబడింది?
సమాధానం:
ఉత్సవములకన్న కొంచెం కఠినమైన నియమాలతో కూడినవి వ్రతములు..... వ్రతము లన్నీ అభీష్ట సిద్ధినిస్తాయి.... వీటిలో ఏకాదశీ వ్రతాలు చాలా శ్రేష్ఠమైనవి....
ఏకాదశీ వ్రతాలు
౧. మనలో ఉత్తమ సంస్కారా లను కలుగచేస్తాయి....
౨. కోరిన కోరికలను సిద్ధింప చేస్తాయి....
౩. ఆత్మోన్నతికి ఉపకరిస్తాయి.....
౪. జన్మాంతలో విష్ణులోకానికి చేరుస్తాయి.....
ఈ ఏకాదశీ వ్రతాలు ప్రతీ నెలలో రెండుసార్లు (శుక్లపక్ష ఏకాదశినాడు, కృష్ణపక్ష ఏకాదశినాడు) వంతున సంవత్సరంలో ఇరవైనాలుగు సార్లు సంభవిస్తాయి....
ప్రతి ఏకాదశికి ఒకపేరు ఉన్నది.... పన్నెండు నెలలలో చైత్రం నుంచి ఫాల్గుణం వరకూ శుక్లపక్షంలొ వచ్చే ఏకాదశుల పేర్లు క్రమంగా –
చైత్రం -కామదా,
వైశాఖం – మోహనీ,
జ్యెష్థం – నిర్జలా,
ఆషాఢం – శయనీ,
శ్రావణం – పుత్రదా,
భాద్రపదం – పద్మా,
ఆశ్వియుజం – పాపాంకుశా,
కార్తికం- ప్రబోధినీ,
మార్గశీర్షం- మోక్షదా,
పుష్యం – పుత్రదా,
మాఘం – జయా,
ఫాల్గుణం – ఆమలకీ – అని పేర్లు
అలాగే – ప్రతినెలలలో కృష్ణపక్ష ఏకదశులపేర్లు క్రమంగా –
చైత్రం -పాపమోచనీ,
వైశాఖం – వరూథినీ,
జ్యెష్థం – అపరా,
ఆషాఢం – యోగినీ,
శ్రావణం – కామికా,
భాద్రపదం -అజా,
ఆశ్వియుజం – ఇందిరా,
కార్తికం- రమా,
మార్గశీర్షం- ఉత్పన్నా,
పుష్యం – సఫలా,
మాఘం – షట్ తిలా,
ఫాల్గుణం – విజయా – అని పేర్లు
ఈ ఏకాదశీ వ్రతములను ముఖ్యంగా యతీంద్రులు, వానప్రస్థులు, గృహస్థులు అందరూ ఆచరించవలెనని ధర్మ శాస్త్రములు బోధిస్తున్నవి.....
ఆషాఢశుక్ల ఏకాదశి నుంచి కార్తికశుక్ల ఏకాదశివరకూ యతీంద్రులు, ధర్మాచార పరాయణులైన గృహస్థులు చాతుర్మాస్య దీక్షను కూడా ఆచరిస్తారు....
ఈ ఏకాదశీ వ్రతాలు ముఖ్యంగా ఉపవాస దీక్షాప్రధానాలు -అందుచేతనే –
ఉపోష్యైకాదశ్యాం నిత్యం పక్షయోరుభయోరపి|
కృత్వా దానం యథాశక్తి కుర్యాచ్చ హరిపూజనమ్||
అని గరుడపురాణం చెబుతున్నది.... కనుక ఉపవాసం, దానములు, హరిపూజ ఇవి ఏకాదశీ వ్రతంలో ముఖ్య విశేషాలుగా గ్రహించదగిన వన్నమాట....
అలాగే ఉపవాస విషయంలో –
ఏకాదశీ సదోపేష్యా పక్షయో: శుక్లకృష్ణయో:
అని సనత్కుమారసంహితా,
ఏకాదశ్యాముపవసేన్నకదాచిదతిక్రమేత్ –
అని కణ్వస్మృతి,
ఏకాదశ్యాం న భుంజీత కదాచిదపి మానవ: –
అని విష్ణుస్మృతి చెబుతున్నవి....
కనుక ఏకాదశీ వ్రతములలో ఉపవాసానికి అంత ప్రాధాన్య మున్నది. ...
ఆశ్రమభేదంలేకుండా మానవులందరూ ఈ వ్రతాన్ని ఆచరించవలెనని విష్ణుస్మృతి చెబుతున్నది....
ఈ ఉపవాసదీక్షలో నిరాహారం గా జలం మాత్రమే తీసుకుని కొందరూ, నిర్జలంగా అంటే నీరుకూడా త్రాగకుండా కొందరూ పాటిస్తూంటారు. ...
ఏకాదశీ తిథిలో ఇలా ఉపవాసం చేసి ద్వాదశితిథి ప్రవేశించగానే విష్ణుపూజనం చేసి విష్ణునైవేద్యాన్ని ఆహారంగా స్వీకరించాలి. ....
అనివేదిత భోజనం చేసేవారు దొంగలతో సమానమని శాస్త్రం చెబుతున్నది. ....
ఇది సంగ్రహంగా ఏకాదశి వ్రత పరిచయం.....
—————————————————————————
ఏకాదశి తిధి రెండు రోజులు ఉన్నప్పుడు ఉపవాసం ఏరోజున చెయ్యాలి ?? చాలా సందర్బాలలో ఏకాదశి తిధి ఒక రోజు సాయంత్రమో లేక మధ్యాహ్నమో వచ్చి తరువాతి రోజు మధ్యాహ్నం వరకు వుండే సమయాలలో ఉపవాసం ఏరోజు చెయ్యాలి మొదటి రోజా లేక రెండోరోజా?
సమాధానం: ధర్మనిర్ణయచంద్రికా –
అరుణోదయవేధోత్ర వేధః సూర్యోదయే తథా |
ఉక్తాద్వౌదశమీవేధౌ వైష్ణవఃస్మార్తయోః క్రమాత్ ||
వైష్ణవులకు అరుణోదయము నకు దశమీ వేధయున్ననూ ...
స్మార్తులకు సూర్యోదయము నకువేధయున్ననూ అట్టి ఏకాదశి ఉపవాసమునకు పనికిరాదు...
భృగుః – సంపూర్ణైకాదశీయత్రప్రభాతే పునరేవసా |
తత్రోపోష్యద్వితీయాత్ పరతో ద్వాదశీయది ||
ఒకరోజు ఏకాదశీ పూర్తిగా నుండి మరునాడు సూర్యోదయమునకు ఏకాదశీ మిగులుండి త్రయోదశినాడు ఉదయం ద్వాదశి మిగులున్న చో ఏకాదశీమిగులున్ననాడే ఉపవాసము చేయాలి
త్రయోదశ్యాం కియన్మాత్రా ద్వాదశీనలభేద్యది |
పూర్వాకార్యా గృహస్థైస్తు యతిభిః చోత్తరా యదా ||
మొదటిరోజు ఏకాదశి పూర్తిగా నుండి మరునాడుమిగులుండి త్రయోదశి నాడు ద్వాదిశి మిగులుకాకున్న, మొదటి రోజు గృహస్థులు, రెండవరోజు సన్యాసులు ఉపవాసము ఉండవలెను. ...
మరింత వివరములకై “ధర్మసింధు”, “ధర్మనిర్ణయచంద్రిక” లను గ్రంథములను పరిశీలించగలరు....
ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి:
శాస్త్రము-శాస్త్ర విజ్ఞానము
శాస్త్రము (పురాణము):
అసలు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందంటే, మహా విష్ణువులోని స్త్రీ తేజం ‘ముర’ అను రాక్షసిని సంహరించి దేవతలను రక్షిస్తుంది.... ఆ స్త్రీ మూర్తికి విష్ణువు ఏకాదశి అని పేరు పెట్టి, ఆ రోజు ఏకాదశిని పూజించిన వారు వైకుంఠము చేరేదరని వరం యిస్తాడు....
మురని హరించడం వలన శ్రీ హరి ‘మురహర’ లేదా ‘మురహరి’ లేదా ‘మురారి’ అయినాడు....
అంతే కాదు ఈ దినం ఉపవాసం ఉన్నవారికి పుణ్యము లభిస్తుందని హిందువుల నమ్మకము....(దశేంద్రియములను జయించడం కోసమే ఏకాదశి ఉపవాసం)
విష్ణు పురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మిగిలిన ఇరవైమూడు ఏకాదశులు ఉపవాసం చేసినంత ఫలం....
అయితే ఈ ఏకాదశే కాదు ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చాల మంది భక్తుల నమ్మకం....
ఈ రోజు వైష్ణవ ఆలయాలలో విష్ణు సహస్ర నామ పారాయణం, వేదాన్తిక చర్చలు, పూజలు విశేషంగా చేస్తారు.....
శాస్త్ర విజ్ఞానము:
అదలా ఉంచితే చాంద్రమాన తిథుల ప్రకారం ఏకాదశి పక్షం లో 11 వ రోజు......
ప్రతి నెలలో రెండు సార్లు ఏకాదశి వస్తుంది......
అయితే చాల మంది గమనించే ఉంటారు భూమిపైన, అందు నివసించే మన మనస్సుల మీద చంద్రుని ప్రభావం ఉంది......
ఏకాదశి నుండి మొదలుకొని పౌర్ణమి లేదా అమావాస్య దాటిన ఐదు రోజుల (పంచమి) వరకు క్రమంగా చంద్రుని ప్రభావము మన శరీరములోని ద్రవ పదార్థములు
(ఉదాహరణకు - రక్తము),
మెదడు, జీర్ణ వ్యవస్థల మీద క్రమక్రమంగా అధికము అవుతుంది....
ఈ ప్రభావము పౌర్ణమి నాడు అత్యధికంగా వుంటుంది.....
అందుకే పౌర్ణమి నాడు సముద్ర కెరటాలు మిగిలిన రోజులలో కన్నా ఉవ్వెత్తుగా లేస్తాయి....
అందు వలన పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయడానికి వెళ్ళే వాళ్ళను వారిస్తారు...
(పౌర్ణమి సముద్ర స్నానాలు విశేషమే!!?)
లేదా చాల జాగ్రత్తగా ఉండాలని చెబుతారు.....
అంతే కాదు, కొందరు మానసిక రోగులకు పున్నమి రాత్రులలో మానసిక రుగ్మతలు విజృంభిస్తాయి. మన వాళ్ళు అంటుంటారు “వీడికి అమావాస్యకు, పున్నమికి పిచ్చి ఎక్కువ అవుతుంటుంది జాగ్రత్త” అని.... నిజానికి ఇదంతా చంద్రుని ప్రభావమే అంటున్నారు శాస్త్రజ్ఞులు....
అయితే ఉపవాసానికి ఏకాదశికి ఏమిటి సంబంధం? ఏకాదశి నాడే ఎందుకు ఉపవాసం చేయాలి? వేరే రోజులలో చేయవచ్చును కదా! దీనికి శాస్త్ర విజ్ఞానము ఇంకొక విశ్లేషణ ఇస్తోంది....
చంద్రుడు 24 గంటలలో 12 డిగ్రీల దూరం ప్రయాణిస్తాడు....
ఈ కాలం ఒక తిథితో సమానం. సూర్యుని నుండి 180 డిగ్రీలు చలించాక పౌర్ణమి వస్తుంది, మరో 180 డిగ్రీలు తిరిగాక అమావాస్య వస్తుంది.....
అయితే ఏకాదశి నాడు (కృష్ణ పక్షం గాని, శుక్ల పక్షం గాని)
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక నిర్నీతమైన అమరికలో ఉంటారు.....
ఈ ఏకాదశి రోజు చంద్రునికి భూమి మీద, ముఖ్యంగా నీటి మీద ఆకర్షణ అతి తక్కువగా ఉంటుంది.... అది మన శరీరంలో ఉండే ద్రవ పదార్ధాల మీద కూడా అతి తక్కువ ప్రభావం ఉంది వాటి ప్రసరణ లేదా చలనం మంద కొడిగా ఉంటుంది..... ఉదాహరణకు - మన ప్రేగులలో ఆహార పదార్ధాలు కూడా అతి నెమ్మదిగా కదులుతాయి.... తత్ఫలితంగా జీర్ణక్రియ మంద గించి మలబద్ధానికి దారి తీస్తుంది.... మలబద్ధకం అనేది అన్ని వ్యాధులకు మూల కారణము... అందువలన ఈ రోజు
(ఏకాదశి రోజు)
ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం వలన మరుసటి రోజుకు ఆంత్ర చలనం క్రమ పద్ధతిలోనికి వచ్చి శరీరం తేలిక పడుతుంది....
ఈ రకమైన చర్య మన ఆరోగ్యానికి మంచిది....
దీని కోసం ఏకాదశి నాడు కేవలం నీరు (అందులో చిటికెడు ఉప్పు, ఒక అర చెంచా నిమ్మ రసం కలిపి) రోజంతా తీసుకోవాలి.....
ఈ విధంగా చేయడం వలన మన జీర్ణ వ్యవస్థ నుండి మలినాలు తొలగించబడి అది చక్కబడు తుంది....
అందు వలన ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పురాణ శాస్త్రరీత్యా పుణ్యము వస్తుంది, విజ్ఞాన శాస్త రీత్యా ఆరోగ్యకరం గా ఉంటుంది....
** సర్వం శ్రీకృష్ణార్పణమస్తు **
*************************************************************
ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం చేసేప్పుడు తినకూడనివి:
ధాన్యం సంబంధించిన అనగా వరి, గోధుమ, జొన్న, రాగులు, సజ్జలు ఇత్యాది వాటితో చేసినవి
పప్పు దినులు అంటే కంది, పెసర, మినప, శనగ, పెసర్లు, బబ్బెర, పుట్నాలు, ఓట్స్ ఇత్యాదివి తీసుకోకూడదు....
ఇక తీసుకునే పదార్థాలు:
పండ్లు , సగ్గుబియ్యం (పాయసంగా కానీ లేద కూరగాయలు వేసుకుని కిచిడీ కానీ చేసుకోవచ్చు , ఆవాలు వాడకూడదు) , పాలు, మజ్జిగ , పెరుగు
ఉప్పు మాత్రం సాధారణంగా వాడేది కాక సైంధవ లవణం లేదా rock salt వాడాలి
ఏకాదశి ఉపవాసం ఆడవారికి ఎక్కువ వంట పని లేకుండా ఆ రోజు ఎక్కువ సమయం భగవద్ధ్యానం, నామ జపం మరియు పురాణ పారాయణం చేయడానికి అవకాశం కల్పించబడింది!! మామూలు రోజుల్లో ఆడవారికి వీలుపడదు కదా!! వంట పనే చాలా పెద్దపని వారికి !! ఇదండీ ఏకాదశి సంగతులు....
*||ఓం నమో నారాయణాయ||*
ఏకాదశుల పేర్లు
ఏకాదశుల పేర్లు - వాటి ఫలాలు :-
చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమి ముందు వచ్చే ఏకాదశి) - 'కామదా' - కోర్కెలు తీరుస్తుంది
చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి) - 'వరూధిని' - సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.
వైశాఖ శుద్ధ ఏకాదశి - 'మోహిని' - దరిద్రుడు ధనవంతుడు అవుతాడు
వైశాఖ బహుళ ఏకాదశి - 'అపరా' - రాజ్యప్రాప్తి
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి - 'నిర్జల" - ఆహార సమృద్ధి
జ్యేష్ఠ బహుళ ఏకాదశి - 'యోగిని' - పాపములను హరిస్తుంది
ఆషాఢ శుద్ధ ఏకాదశి - 'దేవశయనీ' - సంపత్ ప్రాప్తి(విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు- తొలిఏకాదశి)
ఆషాఢ బహుళ ఏకాదశి - 'కామికా' కోరిన కోర్కెలు ఫలిస్తాయి
శ్రావణ శుద్ధ ఏకాదశి - 'పుత్రదా' - సత్సంతాన ప్రాప్తి
శ్రావణ బహుళ ఏకాదశి - 'ఆజా' - రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ
భాద్రపద శుద్ధ ఏకాదశి - 'పరివర్తన' (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధి) భాద్రపద బహుళ ఏకాదశి - 'ఇందిరా' - సంపదలు, రాజ్యము ప్రాప్తించును
ఆశ్వయుజము శుక్ల ఏకాదశి - 'పాపంకుశ' - పుణ్యప్రదం
ఆశ్వయుజము బహుళ ఏకాదశి - 'రమా' - స్వర్గప్రాప్తి
కార్తీక శుద్ధ ఏకాదశి - 'ప్రబోధిని' - (యోగనిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు) జ్ఞానసిద్ధి
కార్తీక బహుళ ఏకాదశి - 'ఉత్పత్తి' - దుష్టసంహారం (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరం నుండి జనించిన రోజు)
మార్గశిర శుద్ధ ఏకాదశి - 'మోక్షదా' - మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి)
మార్గశిర బహుళ ఏకాదశి - 'విమలా' -(సఫలా) - అజ్ఞాన నివృత్తి
పుష్య శుద్ధ ఏకాదశి - 'పుత్రదా' - పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి)
పుష్య బహుళ ఏకాదశి - 'కళ్యాణీ' (షట్ తిలా) ఈతిబాధా నివారణం
మాఘ శుద్ధ ఏకాదశి - 'కామదా' (జయా) - శాపవిముక్తి
మాఘ బహుళ ఏకాదశి - 'విజయా' - సకలకార్య విజయం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - 'ఆమలకీ' - ఆరోగ్యప్రదం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - 'సౌమ్య' - పాపవిముక్తి
( కొన్నికొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని బేధాలున్నాయి
పరివర్తన ఏకాదశి
పరివర్తన ఏకాదశి , పార్శ్వ ఏకాదశి , వామన ఏకాదశి.
భాద్రపద శుక్ల ఏకాదశిని *పరివర్తన ఏకాదశి* అని పిలుస్తారు. పరివర్తన ఏకాదశికి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినదిగా పరిగణిస్తారు కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు. ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు. *పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం* వలన బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులని సేవేస్తే కలుగు ఫలం లబిస్తుందని పురాణాలూ చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే *ద్వాదశే వామన జయంతి.*
ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని , కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకం.
శ్రీ మహా విష్ణువు అది శేషు పైన శయనించి (దక్షిణాయనం లో) విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకో వైపు శాయనిస్తాడు అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది.
పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి.. ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది. ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో *"దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి , ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని"* పలికి అదృశ్యమవుతాడు.
ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు , దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను. ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును , యజ్ఞోపవీతమును ధరించి , శరీరముపై మృగచర్మము , శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు.
అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై... వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. *"వామనుడు మూడు పాదముల భూమి"* ని అడిగెను. శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి , దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను.
శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని , రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను.
విడువ వలెను.
దుర్జనః పరిహర్తవ్యః విద్యయా అలంక్రృతోపి సన్. మణినా భూషితః సర్పః కిమసౌ నభయంకరః.
భావం: మణిచే అలంకరించబడిన నూ భయంకరమైనదై పాము విడువదగినదో అట్లే దుర్మార్గుడు విద్యచే అలంకరించబడిననూ వానిని విడువ వలెను.
సంస్కృత భారతీ* *ద్వాదశ పాఠః*
*సంస్కృత భారతీ*
*ద్వాదశ పాఠః*
*12*
చాలకః = నడిపే వాడు, వాహన చోదకః(చాలకః) = వాహనం నడిపే వాడు, వాహన నిలయం = వాహనాలు నిలిపే చోటు, ప్రయాణికః = ప్రయాణికుడు, నయతు = తీసుకుని వెడలుము, తిష్టతి = నిలబడుతుంది,
*ప్రయాణ వాహన నిలయ సంభాషణం*
*రామః* హే వాహన చాలక! అహం భాగ్యనగరం ప్రతి గన్తుమిఛ్ఛామి, ఇదం వాహనం తావత్ గమిష్యతి వా? (ఓయీ వాహనం నడుపువాడా నేను భాగ్యనగరం వెళ్ళ గోరెదను. ఈ వాహనం అంతవరకూ వెళ్తుందా??)
*చాలకః*:-- అవశ్యం గమిష్యతి. పరన్తు సాయం కాలే పంచవాదనానంతరమేవ గమిష్యతి. (తప్పకుండా వెళ్తుంది. కానీ సాయంత్రం ఐదు గంటల తర్వాతే వెళ్ళును.)
*రామః* మమ తు శ్రీఘ్రమేవ గంతవ్యం. కృపయా కథం గంతవ్యమితి వక్తుం శక్యతే వా?(నేనైతే తొందరగా వెళ్ళవలెను. దయచేసి ఎలా వెళ్లవలెనో చెప్పడం కుదురుతుందా/చెప్పగలవా?)
*చాలకః* అవశ్యం. అధునా ఏక త్రిచక్రవాహనే విమానాశ్రయం ప్రతి గఛ్ఛన్తు భోః, ఏక వాదనకాలే విమానమస్తి.(ఒక త్రిచక్రవాహనం/ఆటో లో విమానాశ్రయం నకు వెళ్ళండి, ఒంటిగంటకు విమానం కలదు).
*రామః*:-- ధన్యవాదాః.
రామః త్రిచక్ర శకటచాలకం పృఛ్ఛతి(రాముడు ఆటో చాలకుడిని అడుగు చున్నాడు).. భోః చాలక, విమానాశ్రయం పర్యంతమాగంతుమిఛ్ఛతివా?(ఓయీ చాలకుడా,విమానాశ్రయానికి వస్తావా?)
*త్రిచక్రికా చాలకః* అహం అన్య కార్యార్థం,అన్య ప్రాంతం ప్రతి గఛ్ఛామ్యధునా,భవతః కృతే ప్రత్యేకశః ఆగంతవ్యం, మమ సఖః ఏక ఏవ ద్విచక్ర వాహనే తావదేవ గఛ్ఛతి.తస్యసహ గంతుమిఛ్ఛంతి చేత్ అహం తం వదామి.(నేను ఇప్పుడు వేరే పనిలో వేరే చోటకు వెడలు చున్నాను,మీకొరకై ప్రత్యేక ముగా రావలయును,మా మిత్రము ఒక్క డే ద్విచక్ర వాహనంపై అక్కడ కే వెడలు చున్నాడు,అతనితో వెళ్ళడానికి ఇష్టపడితే ఆతనికి చెబుతాను.)
*రామః*:--అవశ్యం, కృపయా వదన్తు భోః. మమ తు ఝటితి గంతవ్యం.( తప్పకుండా, దయచేసి చెప్పండయ్యా,నేను వెంటనే వెళ్ళవలెను.) ఈదృశీ/ఇథ్థం
రామః ద్విచక్ర వాహనే విమానాశ్రయం గత్వా విమానే భాగ్యనగరం ప్రతి గతవాన్.( ఇలా రాముడు ద్విచక్రికపై విమానాశ్రయానికి వెళ్ళి విమానం లో భాగ్యనగరానికి వెడలెను.),
*రామః*:-- (భాగ్య నగరే= భాగ్య నగరం నందు) భోః అత్ర కోఠి పర్యన్తమ్ వాహనం అస్తి వా!?? (ఏవండీ ఇక్కడ కోఠి వరకూ వాహనం ఉందా!!??),
*అధికారి*:-- అస్తి, పరన్తు తద్వాహనం త్రీణి సంఖ్యాక ప్లాట్ ఫామ్ సమీపే తిష్ఠతి,శ్రీఘ్రం గఛ్ఛన్తు భోః,(ఉంది, కానీ ఆ వాహనం మూడవ నంబర్ ప్లాట్ ఫాం వద్ద నిలిచింది, వెంటనే వెళ్ళండి.
*రామః*:-- అవశ్యం, ధన్యవాదాః భోః,(తప్పకుండా, ధన్యవాదాలండీ)
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
సంస్కృత భారతీ* *ఏకాదశపాఠః*
*సంస్కృత భారతీ*
*ఏకాదశపాఠః*
*11*
ప్రణిధిః = బాటసారి, మార్గం/సరణి = దారి, గ్రామం = ఊరు, గృహం = ఇల్లు, యానం/ వాహనం/ శకటం = వాహనము, పద్భ్యాం / పాదగమనం = కాలినడక, చలనం= కదులుట, భ్రమణం = తిరుగుట, గమనం = వెడలుట, ద్విచక్ర వాహనం/ ద్విచక్రికా = ద్విచక్ర వాహనం,ఇలాగే చతుశ్చక్రికా,బహుచక్రికా...లను కూడా అనువర్తించుకొనవచ్చు. యాంత్రిక శకటం/ యాంత్రిక వాహనం = మోటారు వాహనం, తైల యాంత్రిక శకటం = నూనె (పెట్రోలు వంటి) తో నడిచే మోటారు వాహనం, మృత్తికా తైలం = మట్టి నూనె (పెట్రోలు), జవం = శక్తి, వేగం = వేగము, విద్యుద్వాహనం = విద్యుత్ చేత నడిచే వాహనం,
*నూతన గ్రామప్రవేశ సంభాషణం*
*ప్రణిధిః*:-- భోః అత్ర రామాలయం కుత్రాస్తీతి వక్తుం శక్యతే వా?( అయ్యా, ఇక్కడ రామాలయం ఎక్కడ ఉన్నదో చెప్పగలరా?)
*సమాధానం*:-- సంతోషేన వక్తుం శక్నోమి భోః. అత్రతః పూర్వదిశే శతపదం గత్వా దక్షిణే వింశతి పదం గఛ్ఛన్తు భోః తత్ర అయమేవ ప్రశ్నం కమపి పృఛ్ఛన్తు,తే వదిష్యన్తి.(సంతోషంగా చెప్పగలనండీ. ఇక్కడి నుండి తూర్పు దిశలో వంద అడుగులు వెళ్ళి దక్షిణమునకు ఇరవై అడుగుల దూరం వెళ్ళి ఇదే ప్రశ్న ఎవరినైనా అడగండి,వారు చెప్పుదురు.)
*ప్ర*:-- ధన్యవాదాః.
స ప్రణిధిః తథా గత్వా అర్చకం పృఛ్ఛతి...(ఆ బాటసారి ఆ విధంగా వెళ్ళి అర్చకుని అడుగుచున్నాడు.)
*ప్ర*:-- భోః భవతః నామం కిం??
*అర్చకః*:-- చతుస్సాగరపర్యన్తం గోబ్రాహ్మణేభ్యశ్శుభం భవతు కాశ్యపావత్సారనైధృవత్ర్యాఋషేయప్రవరాన్విత కాశ్యపసగోత్రః యజుశ్శాఖాధ్యాయీ ఆపస్తంబ సూత్రః శ్రీ రామశర్మాహంభో అభివాదయే ఇత్యుక్తవన్తః యతః స ప్రణిధిః అర్చకస్య గురురిత్యవగతం తమ్. (అర్చకులు ప్రవరతో వారి పేరు శ్రీ రామ శర్మ అని పలికెను. ఎందుకంటే ఆ బాటసారి తన గురువని అర్ధం అయినది వారి కి).
*ప్ర*:-- హే శ్రీ రామ శర్మ వర్ధస్వ.(ఓ శ్రీ రామ శర్మా వర్థిల్లుము.) సర్వైః సకలైః కుశలైర్వా?? అహం ఏక వేదశాస్త్రసదస్యార్థం ఆగతవాన్. మహ్యం స్నాతుం తటాకం దర్శయ. తథాస్థాతుంనివాసం చ వ్యవస్థయ.(నేను ఒక వేదశాస్త్ర సదస్యమునకై వచ్చాను. నాకు స్నానం చేయుటకు చెరువు చూపుము. అలాగే ఉండుటకు నివాసం కూడా ఏర్పరచుము.)
*అ*:-- ఆమ్ భోః.అవశ్యం.(అలాగే ఆర్యా.తప్పకుండా.),
*ప్రణిధిః*:-- (స్నానాది నిత్య కృత్యానంతరమ్ = స్నానాది నిత్య కృత్యాలు ముగించిన తర్వాత) హే శ్రీ రామ! అహం సదస్యార్థం పద్భ్యాం గఛ్ఛామి( ఓ శ్రీ రామ! నేను సదస్యానికి నడచి వెళ్తాను)
*అ*:-- మాస్తు మహాశయ! సదస్యకేంద్రం బహుదూరమస్తి, భవతః శ్రమా భవేత్, అహం తైల యాంత్రికయానే నేష్యామి(వద్దు మహాశయా! సదస్యకేంద్రం చాలా దూరంలో ఉంది. మీకు శ్రమ కలుగుతుంది, నేను పెట్రోమోటర్ వాహనం పై తీసుకుని వెళ్ళెదను.
*ప్రణిధిః*:-- నావశ్యకం వత్సా! మహ్యం జవమస్తి(అవసరం లేదు బాలకా! నాకు శక్తి ఉంది).
అంతే గురురనుజ్ఞయా శ్రీ రామః తస్య వాహనే నీతవాన్ సదస్యకేంద్రపర్యన్తమ్.(చివరకు గురువు ను ఒప్పందం తో శ్రీ రాముడు ఆతని వాహనం పై సదస్యకేంద్రానికి తీసుకుని వెళ్ళాడు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
సోమవారం, సెప్టెంబరు 25, 2023
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
సోమవారం, సెప్టెంబరు 25, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:ఏకాదశి రా1.37 వరకు
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ ఉ9.16 వరకు
యోగం:అతిగండ మ1.56 వరకు
కరణం:వణిజ మ2.43 వరకు తదుపరి భద్ర రా1.37 వరకు
వర్జ్యం:మ1.01 - 2.31
దుర్ముహూర్తము:మ12.16 - 1.04 &
మ2.40 - 3.28
అమృతకాలం:రా10.00 - 11.30
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి: కన్య
చంద్ర రాశి : మకరం
సూర్యోదయం:5.52
సూర్యాస్తమయం: 5.53
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
*గణేశ పంచరత్నమ్
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*_సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం_*
*_దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం_*
*_కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం_*
*_మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం_*
*గణేశ పంచరత్నమ్* - 3
*సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి, లోకాన్ని గజాసురుని బారినుండి కాపాడిన వానికి, పెద్ద ఉదరముతో, గజముఖముతో జనులను ఆశీర్వదించే వానికి, కరుణను కురిపించే వానికి, తప్పులను క్షమించి, శుభము, యశస్సు కలిగించే వానికి, తనకు నమస్కరించే వానికి సర్వ శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి నా నమస్కారములు*.....
🧘♂️🙏🪷 ✍️🙏
మన ఆరోగ్యం
మన ఆరోగ్యం….
*మీరు పెద్దయ్యాక ఎక్కువగా మాట్లాడండి*
* రిటైర్ అయినవారు (సీనియర్ సిటిజన్లు) ఎక్కువగా మాట్లాడాలని వైద్యులు చెబుతున్నారు, ఎందుకంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతానికి మార్గం లేదు. ఎక్కువ మాట్లాడటం ఒక్కటే మార్గం*
*సీనియర్ సిటిజన్లతో ఎక్కువగా మాట్లాడటం వల్ల కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయి*
*మొదట: మాట్లాడటం మెదడును సక్రియం చేస్తుంది మరియు మెదడును చురుకుగా ఉంచుతుంది, ఎందుకంటే భాష & ఆలోచన ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి, ముఖ్యంగా త్వరగా మాట్లాడేటప్పుడు, ఇది సహజంగా వేగంగా ఆలోచించే ప్రతిబింబం మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మాట్లాడని వృద్ధులు జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశం ఉంది*
*రెండవది: మాట్లాడటం వల్ల చాలా ఒత్తిడి తగ్గుతుంది, మానసిక అనారోగ్యాన్ని దూరం చేస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. మనం తరచు ఏమీ అనకుండా గుండెల్లో పెట్టుకుని ఊపిరి పీల్చుకుంటాం._నిజమే! కాబట్టి! సీనియర్లు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తే బాగుంటుంది*
*మూడవది: మాట్లాడటం వలన చురుకైన ముఖ కండరాలు & అదే సమయంలో, గొంతు వ్యాయామం & ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది, అదే సమయంలో, ఇది కళ్ళు & చెవులు క్షీణించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు మైకము & వంటి గుప్త ప్రమాదాలను తగ్గిస్తుంది. చెవిటితనం*
*క్లుప్తంగా చెప్పాలంటే, పదవీ విరమణ పొందినవారు, అంటే సీనియర్ సిటిజన్లు * అల్జీమర్స్ రాకుండా ఉండాలంటే వీలైనంత ఎక్కువ మాట్లాడటం మరియు వ్యక్తులతో చురుగ్గా సంభాషించడం ఒక్కటే మార్గం. దీనికి వేరే చికిత్స లేదు.*
*కాబట్టి, ఎక్కువగా మాట్లాడుదాం మరియు బంధువులు మరియు స్నేహితులతో ఎక్కువగా మాట్లాడేలా ఇతర సీనియర్లను ప్రోత్సహిద్దాం*
* సహాయకరంగా మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు; వృద్ధ పౌరుల జీవితంపై సంభావ్య ప్రభావం కారణంగా*
కాబట్టి సీనియర్ సిటిజన్లకు ☝🏻 షేర్ చేయండి.✍️
-సేకరణ.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
భగవత్కృప
శ్లోకం:☝️
*దుర్లభం త్రయమేవైతత్*
*దేవానుగ్రహహేతుకమ్ ।*
*మనుష్యత్వం ముముక్షుత్వం*
*మహాపురుషసంశ్రయః ॥*
భావం: మానవజన్మ, ముక్తికాంక్ష మరియు మహానుభావులతో సహవాసం (సత్సంగం) - ఈ మూడు విషయాలు భగవత్కృప వలన మాత్రమే లభిస్తాయి.🙏
మహాభారతములో - ఆది పర్వము*
*మహాభారతములో - ఆది పర్వము*
*ప్రథమాశ్వాసము*
*5*
*ఉదంకుడు పౌష్యుడు శాపప్రతిశాపాలు ఇచ్చుకొనుట*
కుండలములు తీసుకుని రాజు వద్దకు వెళ్ళగా రాజు ఉదంకుని భోజనం చేసిన తరువాత వెళ్ళమని చెప్పాడు. రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నంలో ఒక వెంట్రుక వచ్చింది. అందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డి వాడివి కమ్మని శపించాడు. పౌష్యుడు కోపించి "ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్షా. నేను నీకు ప్రతి శాపం ఇస్తున్నాను. నీవు సంతాన హీనుడవు కమ్ము" అన్నాడు. తన అపరాధం గ్రహించిన ఉదంకుడు మహారాజుతో అయ్యా ! నాకు సంతానం కావాలి కనుక నీ శాపాన్ని ఉపసంహరించు " అని కోరగా పౌష్యుడు " మనసు నవనీతం మాట వజ్రాయుధం ఇది బ్రాహ్మణ స్వభావం. క్షత్రియులకు ఇవి రెండు విపరీతములే కనుక నా శాపం ఉపసంహరించ లేను కనుక నీవు ఉపసంహరించు" అన్నాడు. అందుకు ఉదంకుడు "కొంతకాలం తరువాత నా శాపం ఉపసంహరింపబడుతుంది " అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు.
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* *🌸 సాంఖ్య యోగః 🌸*
*🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం, 37వ శ్లోకం*
*హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్య సే మహీమ్ |*
*తస్మా దుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః || 37*
*ప్రతిపదార్థం*
వా = ఒక వేళ; హతః = (నీవు ) చంపబడినచో; స్వర్గమ్ = స్వర్గమును; ప్రాప్స్యసి = పొంద గలవు;వా లేక (అట్లు గాక ); జిత్వా =( నీవు యుద్ధమున ) జయించినచో; మహీమ్ = భూమండల, రాజ్యమును; భోక్ష్య సే = అనుభవించెదవు; తస్మాత్ = అందు వలన; కౌంతేయ = కుంతీకుమారా ! (అర్జునా !); యుద్ధాయ = యుద్ధము చేయట కొరకు; కృత నిశ్చియః = తిరుగు లేని నిశ్చయము గలవాడవై; ఉత్తిష్ఠ = లెమ్ము (కటి బద్ధుడవు కమ్ము )
*తాత్పర్యము*
ఓ అర్జునా! రణరంగమున మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్య భోగములను అనుభవింప గలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్దమునకు లెమ్ము.
*సర్వేజనా సుఖినోభవంతు*
*హరిః ఓం 🙏🙏*
కేదారేశు భజించితిన్
శ్రీ మహాద్రి పార్శ్వేచ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రాః సురాసురైర్యక్ష మహోరగొద్ద్యె కేదారమీశం శివమేక మీడే
ॐ ఓం నమః హరాయ
కేదారేశు భజించితిన్ శిరమునన్ గీలించితిన్
పుష్పంబు భవత్పదద్వయముపై
శుభోదయం🙏
"ఒక పుష్పంబు భవత్పదద్వయముపై
నొప్పంగ సద్భక్తి రం
జకుడైపెట్టిన,పుణ్యమూర్తికి పునర్జన్మంబులేదన్న, బా
యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచున్ పెద్ద నై
ష్ఠికుడై యుండెడువాడు,నీవగుట తా
చిత్రంబె? సర్వేశ్వరా!
సర్వేశ్వర శతకం-చిమ్మపూడి అమరేశ్వరుడు.
భావం: ఓసర్వేశ్వరా!నీపాదాలపై భక్తితో ఒకపువ్వుంచి
ప్రార్ధించినవాడికి పునర్జన్మమేలేదని పురాణాలుప్రవచిస్తున్నాయ్.అలాంటిది ముక్కాలములయందూ మూడుసంధ్యలా ,మహానిష్ఠతో నిన్నర్చించేవాడు నీలోసమైక్యమైతే యిక నాశ్చర్యపడవలసినదేమున్నది?అనిభావం.
ఈశ్వరార్చనకు ఫలితం జన్మరాహిత్యమేనని,ఈశ్వరసాయుజ్యమేనని చెప్పే యీపద్యం.కాకతిరాజులకు
సమకాలికుడైన చిమ్మపూడి రచించుట విశేషం.🙏🙏🙏👌👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ఒక్కడే కొడుకు.
*Rapeti Mahalakshmi Naidu Raghuram Colony Anakapalli*
*😀డబ్బే జీవితమూ కాదు😂*
*ఒక జడ్జి తన వృత్తినుండి పదవీవిరమణ అయ్యాక తన భార్యతో తనలోని భావాలను ఇలా పంచుకుంటున్నారు.*
*”లక్ష్మీ! నేను లాయర్ గా ఉన్నప్పుడు కాని, జడ్జిగా ఉన్నప్పుడు కాని ఈరోజు నేను చూసిన నా చివరికేసు లాంటిది చూడనే లేదు” అని అన్నాడు.*
*“ఏంటా కేసు?” అని ఆమె అడగగా…*
*”ఒక తండ్రి, తన కొడుకు తనకు నెలకు డబ్బులు ఇవ్వడం లేదని కేసు“ అన్నాడు.*
*కొడుకుని పిలిచి, “ఏంటయ్యా, నీ తండ్రికి నెలకు సరిపడ డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదు?” అని అడిగాను.*
*”మా తండ్రిగారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవివిరమణ పొందిన వ్యక్తి. నెలనెలా ఆయనకు పెన్షన్ వస్తున్నది. బాగానే డబ్బులు ఉన్నవ్యక్తి. నాపైన ఇలాఎందుకు కేసుపెట్టాడో అర్థం కాలేదు” అన్నాడు.*
*ఆ తండ్రి, “అవును నాకు డబ్బుకు లోటులేదు కాని, నా కొడుకు నెలకు 100 రూపాయలు కానివ్వండి, స్వయంగావచ్చి అందించేలా తీర్పుఇవ్వమని" అడిగాడు.*
*తీర్పు చెప్పాక, ఆ తండ్రిని కలిసాను. “ఎందుకయ్యా ఇలా అడిగావు” అని*
*”మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. మీరు ఇచ్చే తీర్పు కారణంగా అయినా నెలకు ఒక్కసారి మా దగ్గరకువచ్చి, మాతో గడిపివెళ్ళగలడని ఆశ, వాడంటే మాకు ప్రాణం।” అని అన్నాడు.*
*ఇలా చెబుతూ, ఆయన కళ్ళు తడిచాయి.*
*డబ్బే ప్రధానం అనుకుంటారు. అంతకంటే ఎక్కువగా మనకోసం ఎదురుచూసే వారుంటారు అని గుర్తించలేము.*
*నాకెందుకో అప్పటి కన్నవారికి, నేడు ఉన్న తల్లితండ్రులకి చాలాతేడా కనిపిస్తుంది.*
*మా పిల్లలు డబ్బు సంపాదించకపోయినా పర్లేదు, మా కళ్ళ ముందు ఉంటే చాలు! సరిపడా సంపాదన చాలు! అనుకునేవారు.*
*నేడు పిల్లలు అంటే వారు విధేశాలకు వెళ్ళిపోవాలి, లక్షలు సంపాధించాలి అని కోరుకుంటున్నారు.*
*అందుకే ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు అనేవాటికి విలువ లేకుండా పోయింది.*
*అనురాగం, ఆప్యాయత అందని ద్రాక్షపళ్ళు కాకూడదు. కనిపెంచిన తల్లిదండ్రులకు.*
*🌹లోకా సమస్తా సుఖినోభవన్తు!🌹*