7, జూన్ 2023, బుధవారం

అతి మూత్ర వ్యాధి

 అతి మూత్ర వ్యాధి  -  Daibetis 

  అతిమూత్ర వ్యాధి రావడానికి గల కారణాలు - 

 *  అధికమైన ఆలోచనలు , ఆందోళన .

 *  మద్యం అధికంగా సేవించడం . 

 * సిఫిలిస్ , గనేరియా వంటి లైంగిక వ్యాదులు.

 *  శరీరంలో విషరసాయనాల ఉత్పత్తి . 

  వ్యాధి లక్షణాలు , దశలు  - 

      ఈ వ్యాధి ప్రారంభ దశలో అతిమూత్రం , అతి మూత్ర విసర్జన కలుగుతాయి . శరీరం అంతా నీరసంగా యే పని చేయడానికి ఉత్సాహం లేకుండా పోతుంది . క్రమంగా దేహం అంతా శుష్కించి పోతుంది . వ్యాధి తీవ్రదశకు చేరేకోలది మొఖం అంతా వాడిపోతుంది. నుదురు మీద ముడతలు పడతాయి. వ్యాధి ముదిరే కొద్ది రోజుకి 150 నుంచి 200 ఔన్సుల వరకు మూత్రం పోతూ ఉంటుంది. ఆకుపచ్చ , పసుపుపచ్చ కలిసి మిశ్రపు రంగుతో మూత్రం నుంచి చక్కర బయటకు వెళ్ళడమే ఈ వ్యాదికి నిదర్శనం . మూత్రం పోసినచోట ఎక్కువుగా ఈగలు మూగుతాయి. మూత్రం నేలలో ఇంకిపోయిన తరువాత తెల్లటి మరక కనిపిస్తుంది. ఈ లక్షణాలు బట్టి వ్యాధిని ఎవరికీ వారే గుర్తించ వచ్చు. డబ్బు వృధా చేసి మూత్ర పరిక్షలు చేసుకోవలసిన అవసరం లేదు . 

                  వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది మూత్రం ద్వారా అల్బుమిన్ అనే శ్వేత ధాతువు ఎక్కువుగా విసర్జించ బడుతుంది. క్రమంగా చర్మం ఎండిపోయి నట్టు మారి సౌందర్యం దెబ్బ తింటుంది. ముఖం కళ తప్పుతుంది. కురుపులు , పుండ్లు, రాచ పుండ్లు పుడుతుంటాయి. నోరు బాగా ఎండిపోతుంది. దీర్గవ్యాది గ్రస్తులకు పంటి చిగుళ్లు ఉబ్బిపోతాయి. పిప్పి పళ్ళు ఏర్పడుతాయి. రోగిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి బలహీనం అయ్యే కొద్ది కడుపులోని జట రాగ్ని మందగిస్తుంది. అజీర్ణం కలుగుతుంది. అధికంగా వొళ్ళంతా చెమటలు పడుతుంది. పాదాలు వాస్తాయి  . గుండె బలహీనం  అవుతుంది. కంటికి పొరలు కమ్ముతాయి. ఆడవారిలో శరీరం అంతా దురదలు కలిగి సంభోగ వాంచ పెరుగుతుంది. మగవారిలో సంభోగ వాంచ పూర్తిగా  క్షీణిస్తుంది  . 

                తరువాతి పోస్టులో అతిమూత్ర వ్యాధి నివారణ , ఆహార పదార్దాలు వివరిస్తాను . 

      మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.

     గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

   కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

         9885030034

మృత్యు సమానవైనవి.

 .

                     _*సుభాషితమ్*_

 𝕝𝕝శ్లోకం𝕝𝕝

*దుష్టభార్యా శఠం మిత్రం*

*భృత్యశ్చోత్తర దాయకః।*

*ససర్పేచ గృహావాసో*

*మృత్యురేవ న సంశయః॥*

తా𝕝𝕝

దుష్టురాలైన భార్య, మూర్ఖత్వమున్న మిత్రుడు, మాటకు మాట ఎదురుచెప్పే సేవకుడు, సర్పమున్న ఇంటిలో వాసము, మృత్యు సమానవైనవి.

చారిత్రాత్మక కథాస్రవంతి🌹* . ♦️ *ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 83*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️

*పార్ట్ - 83* 

మరొక అర్థగంట తర్వాత రాక్షసుడు వచ్చి దర్శనం కోసం వేచివున్నా డని సేవకుడు చెప్పాడు. అతడిని లోపలికి పంపించమని చెప్పి చాణక్యుడు మామిడిపండు తీసుకుని తింటూ చంద్రుడిని కూడా తినమని సైగచేశాడు. 

కాసేపటి తర్వాత రాక్షసుడు వస్తూనే వాళ్ళిద్దరూ తాను పంపిన పళ్ళెంలోని ఫలాలను ఆత్రంగా ఆరగించడం చూస్తూ మందహాసం చేశాడు. 

"రండి అమాత్యా ! ఆసీనులు కండి. మీరు పంపించిన ఫలాలనే ఆరగిస్తున్నాం... అబ్బా... చాలా మధురంగా ఉన్నాయి... నా జన్మలో ఇట్లాంటి ఫలాలను తినలేదు" అన్నాడు చాణక్యుడు. 

'తిను... తిను... నీకిక జన్మేవుండదు' అనుకున్నాడు రాక్షసుడు ఆశీనుడవుతూ. చంద్రుడు వంత పాడుతూ "అవునవును. ఇంతటి రుచి నేను ఎరుగను. అమాత్యుల వారి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడే తెలిసింది" అన్నాడు. 

"బుడతడివి. నా ప్రత్యేకత నీకేం తెలుసురా...?" అనుకున్నాడు రాక్షసుడు లోలోపల పరిహాసంగా. वौ 

చాణక్య చంద్రగుప్తులు తాపీగా, ప్రశాంతంగా తాను పంపిన ఫలాలను ఆరగిస్తుంటే వారి ముఖాల్లో రాబోయే మార్పు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు రాక్షసుడు. అలా మరికొంతసేపు తీరిగ్గా ఫలాలను ఆరగిస్తూ కాలక్షేపం చేశారు చాణుక్య చంద్రగుప్తులు. రాక్షసుడు ఆశించిన మార్పు వాళ్లలో ఎంతకీ కనిపించకపోవడంతో అతనికి తీవ్రమైన అసంతృప్తి కలిగిస్తోంది వాళ్ల ప్రవర్తన. ఎట్టకేలకు వాళ్ళిద్దరూ ఫలహారం ముగించారు. వాళ్లలో ఎలాంటి మార్పూ సంభవించలేదు. 

"ఇప్పుడు చెప్పండి అమాత్యా ! ఏం పని మీద వచ్చారు ?" సూటిగా అడిగేసాడు చాణక్యుడు. 

అమాత్యుడు సమాధానం చెప్పబోతుండగా ప్రతీహారి లోపలికి వచ్చి "జయము... జయము చాణక్యుల వారికి" అన్నాడు.

చాణక్యుడు విసుగుతో "ఏమిరా ... ?" అని అడిగాడు. 

"శోణనదీ అవతలి తీరాన ఆశ్రమవాసంలో ఉన్న సర్వార్ధసిద్ధి అట... వారికి రాక్షసమాత్యులు మామిడి ఫలాలను పంపారట. ఆ ఫలాలు ఆరగించినంతనే సర్వార్ధ సిద్ధి గిలగిలలాడుతూ క్రింద పడి మరణించారట..." 

ఆ వార్త విని నిర్గాంతపోయాడు రాక్షసమాత్రుడు. అతడి మొహం కత్తి వాటుకు నెత్తురుచుక్కలేకుండా నల్లబారింది. 'తాను చాణక్య చంద్రగుప్తులకు విషఫలాలు పంపితే, అక్కడెక్కడో వున్న సర్వార్ధ సిద్ధి ఎలా మరణించాడు ? ఇందులో ఉన్న తిరకాసు ఏమిటి ?' 

రాక్షసుడు తలెత్తే అనుమానంగా చాణక్యుని వైపు చూశాడు. చాణక్యుడు కొంటెగా నవ్వి "చూసావా, వృషలా ! అమాత్యుల వారికి నీ మీదున్న వాత్సల్యం ? భవిష్యత్తులో నందుల వారసుల వల్ల నీకు ఎలాంటి ప్రమాదం రాకూడదని.. నంద శేషాన్ని నీకు అడ్డు రాకుండా ఎలా తప్పించేశారో చూశావా...?" అన్నాడు పరిహాసంగా. 

రాక్షసుడికి మతిపోయినట్లయ్యింది. 'తాను నందశేషాన్నీ తప్పించేశాడా...? అంటే... తాను పంపించిన మామిడి పండ్లు .... ?' రాక్షసుడు సందిగ్ధంతో చాణక్యుడి ముఖంలోకి తేరిపార చూశాడు. అతడి ముఖం ఏ భావం వ్యక్తం కాకుండా వుదాసీనంగా కనిపించింది. 

"ఏమిటి అమాత్యా ! తమరేం పనిమీద వచ్చారో చెప్పారు కాదు" నవ్వుతూ రెట్టించాడు చాణక్యుడు. 

రాక్షసుడు తేరుకుంటూ "పనేం లేదు. దర్శనం చేసుకుందామని వచ్చాను. వస్తా" అంటూ లేచి నిష్క్రమించాడు. 

చాణక్య చంద్రగుప్తులు ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరిన రాక్షసుడు తిన్నగా ఆశ్రమానికి వెళ్ళాడు. 

జీవసిద్ధి బ్రాహ్మణద్వేషి. చాణక్యుడు బ్రాహ్మణుడు. అతని కారణంగానే నందులు హతమయ్యారు. మార్గాలు వేరైనా తనలాగే జీవసిద్ది కూడా నందాభిమాని. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవసిద్ది కంటే నమ్మదగిన వ్యక్తులు - మిత్రులు లేరు. అతడు తలుచుకుంటే ఏదైనా ఏర్పాటు చెయ్యగలడు. 

జీవసిద్ధిని ఒంటరిగా కలుసుకున్న రాక్షసుడు తన హృదయావేదనను అంతా వెళ్లబోసుకుని చంద్రగుప్తుని తుదముట్టించడానికి అతని సహాయాన్ని అర్ధించాడు. 

రాక్షసుని గోడు విన్న జీవసిద్ధి అతన్ని ఓదారుస్తూ "బాధపడకండి అమాత్యా ! మీలాగే నందులని రక్షించాలని నేనూ ఎంతో ప్రయత్నించాను. ఆ ఒక్కరోజు గడ్డురోజు అనీ, తొందరపడోద్దని ప్రాధేయపడ్డాను. వినిపించుకున్నారు కాదు. వెర్రి ఆవేశంతో చంద్రగుప్తుని ఎదుర్కోని ప్రాణాలు పోగొట్టుకున్నారు. నందుల దుర్మరణానికి ప్రతీకారం చెయ్యాలని నా మనసూ ఆవేశంతో రగిలిపోతుంది. కానీ ఏం చెయ్యను ? బౌద్ధబిక్షకులు అంటే ఆ చాణక్యునికి పడదు. బౌద్ధుల నీడ కూడా తన మీద పడనివ్వడు. అందుకే... ప్రతీకారం తీర్చుకునే ఉపాయం తెలిసిఉండీ, వాళ్ళని సమీపించే అవకాశం లేక చేతులు ముడుచుకుని కూర్చున్నాను" చెప్పాడు బాధగా. 

"నేను సమీపించగలను. నా రాకపోకలపై నిషేధం లేదు. మన ఇద్దరి పగ నేను తీరుస్తాను. ఆ ఉపాయం ఏమిటో నాతో చెప్పండి" అన్నాడు రాక్షసుడు ఆవేశంగా. 

జీవసిద్ధి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఓసారి అటూ ఇటూ చూసి ఎవ్వరూ లేరని నిశ్చయించుకుని స్వరాన్ని బాగా తగ్గించి "ఉపాయం అంటే మామూలు ఉపాయం కాదు... చంద్రుని ప్రాణాలు హరించగల బ్రహ్మాస్త్రం .... దాన్ని ప్రయోగించగల అవకాశం ప్రస్తుతం మీ ఒక్కరికే వుంది...." అన్నాడు. 

రాక్షసుడు ఆశ్చర్యపోతూ "బ్రహ్మాస్త్రమా ...?" అన్నాడు.

జీవసిద్ధి తల పంకిస్తూ "అవును... గురి తప్పకుండా చంద్రుని ప్రాణాలు తియ్యగల మారణ మన్మధాస్త్రం... అది... విషకన్య..." అని చెప్పాడు జీరపోయిన స్వరంతో. 

' విషకన్య ' అన్న పేరు వింటూ అదిరిపడ్డాడు రాక్షసామాత్యుడు.

(ఇంకా ఉంది)...🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

గుండె - గంధం

 గుండె - గంధం

1959లో పరమాచార్య స్వామివారు మద్రాసు దగ్గర్లోని నజరత్ పేట్ లో మకాం చేస్తున్నారు. పూజకు గంధం కావాల్సిరావడంతో కైంకర్యం వాళ్ళల్లోని రామమూర్తి అనే అతణ్ణి పిలిచి గంధం తీయమన్నారు. అప్పటికప్పుడు పూజకు సరిపడా గంధం అరగదీసి స్వామివారికి ఇచ్చాడు.  

రామమూర్తి సాయింత్రం సమయంలో గుండెల్లో కొద్దిగా భారంగా తోచి వెంటనే డాక్టరు వద్దకు పరిగెత్తాడు. “డాక్టరు గారు నాకు గుండెల్లో ఏదో ఇబ్బందిగా, భారంగా ఉంది. ఉదయం నుండి బాగానే ఉంది. పరమాచార్య స్వామివారి కైంకర్యంలో భాగంగా ఈరోజు గంధం కావాలంటే అరగదీసి ఇచ్చాను. సాయింత్రం నుండి కాస్త ఇబ్బందిగా తోస్తోంది” అని చెప్పాడు. 

డాక్టరు గారు అతణ్ణి పరీక్ష చేసి అతనితో, ”నీ గుండె చలా బలహీనంగా ఉంది. పెద్ద పెద్ద బరువులు మోయడము, ఒత్తిడి ఉన్న పనులు చేయడము మానుకోవాలి. ముఖ్యంగా గంధం తీయడం వంటి పనులు అస్సలు చేయకూడదు” అని అన్నారు.

రామమూర్తి డాక్టరు వద్ద నుండి తిరిగొచ్చి మహాస్వామి వారితో తన ఆరోగ్య పరిస్థితి గురించి, జరిగిన విషయమంతా చెప్పాడు. రేపటి పూజకు కూడా గంధం అవసరం ఉండడంతో స్వామివారు మరలా అతణ్ణే పిలిచి గంధం తీయమన్నారు. 

మహాస్వామివారు అతనితో, “అంతా చంద్రమౌళీశ్వరుడు చూసుకుంటాడు. నువ్వు గంధం అరగదీసి ఇవ్వు” అని ఆజ్ఞాపించారు. 

పరమాచార్య స్వామివారి మాటలను కాదనలేక రామమూర్తి గంధం తీసి ఇచ్చాడు. మరలా అతనికి గుండెల్లో ఇబ్బందిగా అనిపించి మహాస్వామి వారితో డాక్టరు తనకు చెప్పిన విషయం చెప్పాడు. 

”అది గుండేపోటు అయితే మాత్రమే ప్రమాదమైనది. గుండె బలహీనంగా ఉన్నవారు శతాయుష్కులై జీవించారు. నీ పని నువ్వు చెయ్యి. దిగులు పడవద్దు” అని అనునయించారు. 

ఇవి సాక్షాత్ భగవంతుని పలుకులు కదా? 

అప్పటి నుండి చాలాకాలం పూజకై స్వామివారికి గంధం తీసి సమర్పించే భాగ్యం రామమూర్తికి దక్కింది. కాని మరలా ఎప్పుడూ తనకి అలా ఇబ్బంది కలగనేలేదు.

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

చతుఃషష్టి ఉపచారాలు

 చతుఃషష్టి ఉపచారాలు

ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు

64 కళలతో, 64 యోగినీ దేవతలు

చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో

ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించారు. అవి...

1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం –

అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి,

త్రాగుటకు జలము సమర్పించడం

2. అభరణ అవరోపణం –

ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం

3. సుగంధ తైలాభ్యంజనం –

వంటికి నూనె పట్టించడం

4. మజ్జనశాలా ప్రవేశము –

స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం

5. మణిపీఠోపవేశనం –

మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం

6. దివ్యస్నానీయ ఉద్వర్తనం –

నలుగు పెట్టుట

7. ఉష్ణోదక స్నానము –

వేడి నీటితో స్నానము చేయించుట

8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము

9. ధౌతవస్త్ర పరిమార్జనం –

పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం

10. అరుణ దుకూల పరిధానం –

ఎర్రని వస్త్రము ధరింపజేయడం

11. అరుణకుచోత్తరీయం –

ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం

12. ఆలేపన మంటప ప్రవేశనం –

అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి

అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం

13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం

14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం –

కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం

15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం -

వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం

16. భూషణమండప ప్రవేశము –

అలంకార గది ప్రవేశము

17. మణిపీఠోపవేశనము -

అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము

18. నవమణిమకుట ధారణ –

తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం

19. దానిపైన చంద్ర శకలం పెట్టడం

20. సీమంతంలో సింధూరాన్ని దిద్దడం

21. తిలక ధారణము –

నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం

22. కాలాంజనం దిద్దడం –

అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం

23. పాళీయగళం –

అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం

24. మణికుండళయుగళం -

మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం

25. నాసాభరణం –

ముక్కుకి నాసాభరణం అలంకరించడం

26. అధరయావక లేపనం –

పెదవులకు పూసే లత్తుక పూయడం

27. ఆర్య భూషణం -

ప్రధాన భూషణం అలంకరించడము

28. మాంగల్య సూత్రము –

మాంగల్య సూత్రమును అలంకరించుట

29. హేమచింతాకం –

బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం

30. పతకం – బంగారు పతకం

31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం

32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం

33. ఏకావళి –

27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం

34. చన్నభీరము –

యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే

ఒక ఆభరణము

35. కేయూర యుగళ భూషణ చతుష్టయము –

నాలుగు చేతులకు నాలుగు కేయీరములు

( దండ కడియాలు)

36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు

37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు

38. కాంచీధామము –

వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము

39. కటిసూత్రము –

వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము

40. సౌభాగ్యాభరణం –

అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)

41. పాదకటకం – కాలి అందెలు

42. రత్ననూపురములు –

దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు

43. పాదంగుళీయములు - మట్టెలు

44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు

45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం

46. పుండ్రేక్షు చాపము –

క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు

47. పుష్పబాణములు –

కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు

48. శ్రీ మణి మాణిక్య పాదుక –

ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు

49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము –

సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం

50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము –

అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట

51. అమృతచషకము –

అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట

52. ఆచమనీయము – జలమునందించుట

53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట

54. ఆనందోల్లాస విలాస హాసము –

అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము

55. మంగళార్తికం –

దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం

56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట

57. చామరము – అమ్మవారికి చామరము వీచుట

58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట

59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట

60. చందనం – గంధం పమర్పించుట

61. పుష్పం – పుష్పాలను సమర్పించుట

62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట

63. దీపము – దీప దర్శనము చేయించుట

64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట

ఏకాంతము..!!

స్వస్తి..!!

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 83*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️

*పార్ట్ - 83* 

మరొక అర్థగంట తర్వాత రాక్షసుడు వచ్చి దర్శనం కోసం వేచివున్నా డని సేవకుడు చెప్పాడు. అతడిని లోపలికి పంపించమని చెప్పి చాణక్యుడు మామిడిపండు తీసుకుని తింటూ చంద్రుడిని కూడా తినమని సైగచేశాడు. 

కాసేపటి తర్వాత రాక్షసుడు వస్తూనే వాళ్ళిద్దరూ తాను పంపిన పళ్ళెంలోని ఫలాలను ఆత్రంగా ఆరగించడం చూస్తూ మందహాసం చేశాడు. 

"రండి అమాత్యా ! ఆసీనులు కండి. మీరు పంపించిన ఫలాలనే ఆరగిస్తున్నాం... అబ్బా... చాలా మధురంగా ఉన్నాయి... నా జన్మలో ఇట్లాంటి ఫలాలను తినలేదు" అన్నాడు చాణక్యుడు. 

'తిను... తిను... నీకిక జన్మేవుండదు' అనుకున్నాడు రాక్షసుడు ఆశీనుడవుతూ. చంద్రుడు వంత పాడుతూ "అవునవును. ఇంతటి రుచి నేను ఎరుగను. అమాత్యుల వారి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడే తెలిసింది" అన్నాడు. 

"బుడతడివి. నా ప్రత్యేకత నీకేం తెలుసురా...?" అనుకున్నాడు రాక్షసుడు లోలోపల పరిహాసంగా. वौ 

చాణక్య చంద్రగుప్తులు తాపీగా, ప్రశాంతంగా తాను పంపిన ఫలాలను ఆరగిస్తుంటే వారి ముఖాల్లో రాబోయే మార్పు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు రాక్షసుడు. అలా మరికొంతసేపు తీరిగ్గా ఫలాలను ఆరగిస్తూ కాలక్షేపం చేశారు చాణుక్య చంద్రగుప్తులు. రాక్షసుడు ఆశించిన మార్పు వాళ్లలో ఎంతకీ కనిపించకపోవడంతో అతనికి తీవ్రమైన అసంతృప్తి కలిగిస్తోంది వాళ్ల ప్రవర్తన. ఎట్టకేలకు వాళ్ళిద్దరూ ఫలహారం ముగించారు. వాళ్లలో ఎలాంటి మార్పూ సంభవించలేదు. 

"ఇప్పుడు చెప్పండి అమాత్యా ! ఏం పని మీద వచ్చారు ?" సూటిగా అడిగేసాడు చాణక్యుడు. 

అమాత్యుడు సమాధానం చెప్పబోతుండగా ప్రతీహారి లోపలికి వచ్చి "జయము... జయము చాణక్యుల వారికి" అన్నాడు.

చాణక్యుడు విసుగుతో "ఏమిరా ... ?" అని అడిగాడు. 

"శోణనదీ అవతలి తీరాన ఆశ్రమవాసంలో ఉన్న సర్వార్ధసిద్ధి అట... వారికి రాక్షసమాత్యులు మామిడి ఫలాలను పంపారట. ఆ ఫలాలు ఆరగించినంతనే సర్వార్ధ సిద్ధి గిలగిలలాడుతూ క్రింద పడి మరణించారట..." 

ఆ వార్త విని నిర్గాంతపోయాడు రాక్షసమాత్రుడు. అతడి మొహం కత్తి వాటుకు నెత్తురుచుక్కలేకుండా నల్లబారింది. 'తాను చాణక్య చంద్రగుప్తులకు విషఫలాలు పంపితే, అక్కడెక్కడో వున్న సర్వార్ధ సిద్ధి ఎలా మరణించాడు ? ఇందులో ఉన్న తిరకాసు ఏమిటి ?' 

రాక్షసుడు తలెత్తే అనుమానంగా చాణక్యుని వైపు చూశాడు. చాణక్యుడు కొంటెగా నవ్వి "చూసావా, వృషలా ! అమాత్యుల వారికి నీ మీదున్న వాత్సల్యం ? భవిష్యత్తులో నందుల వారసుల వల్ల నీకు ఎలాంటి ప్రమాదం రాకూడదని.. నంద శేషాన్ని నీకు అడ్డు రాకుండా ఎలా తప్పించేశారో చూశావా...?" అన్నాడు పరిహాసంగా. 

రాక్షసుడికి మతిపోయినట్లయ్యింది. 'తాను నందశేషాన్నీ తప్పించేశాడా...? అంటే... తాను పంపించిన మామిడి పండ్లు .... ?' రాక్షసుడు సందిగ్ధంతో చాణక్యుడి ముఖంలోకి తేరిపార చూశాడు. అతడి ముఖం ఏ భావం వ్యక్తం కాకుండా వుదాసీనంగా కనిపించింది. 

"ఏమిటి అమాత్యా ! తమరేం పనిమీద వచ్చారో చెప్పారు కాదు" నవ్వుతూ రెట్టించాడు చాణక్యుడు. 

రాక్షసుడు తేరుకుంటూ "పనేం లేదు. దర్శనం చేసుకుందామని వచ్చాను. వస్తా" అంటూ లేచి నిష్క్రమించాడు. 

చాణక్య చంద్రగుప్తులు ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరిన రాక్షసుడు తిన్నగా ఆశ్రమానికి వెళ్ళాడు. 

జీవసిద్ధి బ్రాహ్మణద్వేషి. చాణక్యుడు బ్రాహ్మణుడు. అతని కారణంగానే నందులు హతమయ్యారు. మార్గాలు వేరైనా తనలాగే జీవసిద్ది కూడా నందాభిమాని. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవసిద్ది కంటే నమ్మదగిన వ్యక్తులు - మిత్రులు లేరు. అతడు తలుచుకుంటే ఏదైనా ఏర్పాటు చెయ్యగలడు. 

జీవసిద్ధిని ఒంటరిగా కలుసుకున్న రాక్షసుడు తన హృదయావేదనను అంతా వెళ్లబోసుకుని చంద్రగుప్తుని తుదముట్టించడానికి అతని సహాయాన్ని అర్ధించాడు. 

రాక్షసుని గోడు విన్న జీవసిద్ధి అతన్ని ఓదారుస్తూ "బాధపడకండి అమాత్యా ! మీలాగే నందులని రక్షించాలని నేనూ ఎంతో ప్రయత్నించాను. ఆ ఒక్కరోజు గడ్డురోజు అనీ, తొందరపడోద్దని ప్రాధేయపడ్డాను. వినిపించుకున్నారు కాదు. వెర్రి ఆవేశంతో చంద్రగుప్తుని ఎదుర్కోని ప్రాణాలు పోగొట్టుకున్నారు. నందుల దుర్మరణానికి ప్రతీకారం చెయ్యాలని నా మనసూ ఆవేశంతో రగిలిపోతుంది. కానీ ఏం చెయ్యను ? బౌద్ధబిక్షకులు అంటే ఆ చాణక్యునికి పడదు. బౌద్ధుల నీడ కూడా తన మీద పడనివ్వడు. అందుకే... ప్రతీకారం తీర్చుకునే ఉపాయం తెలిసిఉండీ, వాళ్ళని సమీపించే అవకాశం లేక చేతులు ముడుచుకుని కూర్చున్నాను" చెప్పాడు బాధగా. 

"నేను సమీపించగలను. నా రాకపోకలపై నిషేధం లేదు. మన ఇద్దరి పగ నేను తీరుస్తాను. ఆ ఉపాయం ఏమిటో నాతో చెప్పండి" అన్నాడు రాక్షసుడు ఆవేశంగా. 

జీవసిద్ధి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఓసారి అటూ ఇటూ చూసి ఎవ్వరూ లేరని నిశ్చయించుకుని స్వరాన్ని బాగా తగ్గించి "ఉపాయం అంటే మామూలు ఉపాయం కాదు... చంద్రుని ప్రాణాలు హరించగల బ్రహ్మాస్త్రం .... దాన్ని ప్రయోగించగల అవకాశం ప్రస్తుతం మీ ఒక్కరికే వుంది...." అన్నాడు. 

రాక్షసుడు ఆశ్చర్యపోతూ "బ్రహ్మాస్త్రమా ...?" అన్నాడు.

జీవసిద్ధి తల పంకిస్తూ "అవును... గురి తప్పకుండా చంద్రుని ప్రాణాలు తియ్యగల మారణ మన్మధాస్త్రం... అది... విషకన్య..." అని చెప్పాడు జీరపోయిన స్వరంతో. 

' విషకన్య ' అన్న పేరు వింటూ అదిరిపడ్డాడు రాక్షసామాత్యుడు.

(ఇంకా ఉంది)...🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

విందులో వేళాకోళాలు

 విందులో   వేళాకోళాలు

                                              ----------------------------------- 

                                ఎవరో  మామూలు  మనుషులైతే  అనుకోవచ్చు,  సాక్షాత్తు  పరమ శివుడు, విష్ణువు  యిలామాట్లాడు కున్నారంటే  చిత్రమేగదా! అదేమిటో  పరిశీలిద్దాం  పదండి. 

                    శ్రమతి  గంటి కృష్ణ వేణమ్మ గార  నేరచయి 'త్రి  గిరిజా కళ్యాణమనే ' చంపూగ్రంధాన్ని (పద్యము+గద్యము కలసియున్నది)  వ్రాశారు. అందులో  యీవిచిత్రమైన  ఘట్టం ఉన్నది.

                             గిరిజా శంకరుల కళ్యాణం  చూడ ముచ్చటగా జరిగింది. కళ్యాణానంతరం  పెళ్ళికి  వచ్చిన వారికందరకూ  విందు యేర్పాటు  చేయబడింది. ఆవిందు  సందర్భంలో  భోజనాల వేళ  శివుడు, విష్ణువు వేళాకోళాలాడుకునే  రెండుపద్యాలు చాలా చిత్రంగావ్రాశారు వినిపిస్తాను  వినండి.

             ఆ:  "  విసము తిన్న నోట  కసవయ్యె  కాబోలు

                       భక్షణంబు  లెల్ల  పార్వతీశ!

                        అట్టి  దివ్యమైన  ఆహారములు  లే

                          వటంచు  పల్కె  విష్ణు డభవుతోడ; "

                                     విష్ణువు  శివునితో  యిలాగంటున్నాడు. " ఈబూరెలూ గారెలూ అవీ, నీకు నచ్చినట్లు లేదే?  అవునులే  కాలకూట  విషంతిన్న నోటికి   ఈభక్ష్యాలన్నీ గడ్డిలా  కనబడుతున్నయేమో ! ఏంచేస్తాం ? అలాటి పదార్ధాలిక్కడ లేవే?  "-దానికి సమాధానంగా  విష్ణువు  యిలాగంటున్నాడు

         ఉ:   "నిక్మము  నీవు పల్కినది  నీరజ నాభ!  ఇటెందు మ్రుచ్చిలన్

                  చిక్కదు వెన్న! తెత్తుమన  చిక్కవు  ఎంగిలి కాయలెందు   నీ

                   కెక్కడ  దెత్తుమయ్య!? అవి  యిప్పుడటంచు  శివుండు నవ్వినన్

                   అక్కడ  పంక్తి  భోజనమునందు  పకాలున   నవ్విరందరున్ ";

                                      విష్ణూ! నిజమేనయ్యా  నువ్వుచెప్పింది.  ఇక్కడెక్కడా  దొంగతనంచేద్దామన్నా  వెన్న దొరకదు. తెద్దామన్నా  యెంగిలి కాయలూ  దొరకవు. ఎక్కడనుండి  తేగలంమరి? అని చెప్పి  శివుడు నవ్వాడట!  ఆపంక్తిలో  కూర్చున్న  బ్రహ్మేంద్రాదు లందరూ  వీరిమాటలకు పకాలున నవ్వారట! 

                             అసలు  విషయంయిది. శివుడేమో లోకరక్షణార్ధం  విషంతిని  గరళ కంఠుడైతే,  కృష్ణుడిగా వెన్న దొంగిలించి  గోపికలనందరను ధన్యుల గావించాడనీ, శబరియిచ్చిన  యెంగిలికాయలు  దిని రామునిగా  మోక్షమిచ్చినవాడని,పరోక్షంగా  శివకేశవులను ప్రస్తుతించటమే!

                        ఇది   వ్యాజ స్తుతి  యలంకారం (స్తుతిచేనింద,నిందచే స్తుతి  గమ్యమానమగుట )

                                                                   స్వస్తి!🙏🌷🌷🌷

కడప జిల్లా : గండిక్షేత్రం

 🕉 మన గుడి : 

⚜ కడప జిల్లా : గండిక్షేత్రం

⚜ శ్రీ  గండి వీరాంజనేయ స్వామి ఆలయం

" యత్ర యత్ర రఘునాథ కీర్తనం

 తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్

 భాష్పవారి పరిపూర్ణ లోచనం 

మారుతిం నమత రాక్షసాంతకమ్.

శ్రీ ఆంజనేయస్వామి వారు ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు కీర్తనలు చేస్తూ ఉంటారో! అచ్చోట ఆనంద బాష్పాలతో చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్షమవుతారు .

ఏ ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుని పూజిస్తారో! ఆ యింట్లో హనుమంతుని ప్రభావంవల్ల "మహాలక్ష్మి" స్థిరముగా ఉంటుంది.

💠 మనదేశంలో అత్యంత ప్రముఖంగా పేర్కొనదగిన హనుమత్‌ క్షేత్రాలో హనుమ స్వయంభువుడై వెలిసినట్లు చెబుతారు.

అయితే, కేవలం ఒక్కచోట మాత్రం హనుమకు ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడు తన బాణం మొనతో హనుమ ఆకారాన్ని చెక్కటం, తన స్వామి చెక్కిన ఆ చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి నిలవడం కనిపిస్తుంది.

అదే కడప జిల్లా వేంపల్లెకు దగ్గరలోని గండి ఆంజనేయస్వామి ఆలయం.

💠 పాపఘ్నీ నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది.

పాపాఘ్ని నది కుడి ఒడ్డున వీరాంజనేయ స్వామి ప్రతిష్ఠితుడై ఉన్నాడు. 

ఆ నదే పెన్నాఘ్నిగా పిలువబడింది, ఇప్పుడు పెన్నా నదిగా పిలుస్తున్నారు. 

💠 పాపాలను నశింపజేసేది కాబట్టి ఈ నదికి పాపాఘ్ని అని పేరు వచ్చింది.  పాపాఘ్ని నది గండి క్షేత్రంలో ఆంజనేయస్వామి ఆలయానికి ఎదుట దక్షిణం నుండి ఉత్తర ప్రవాహం ఉండటంతో మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. నదిలో స్నానం చేసి 

స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాల నుంచి విముక్తి లబిస్తుంది అని ప్రతీతి.

⚜ స్థల పురాణం ⚜

💠 రామాయణ కాలంలో అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండిక్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు.

శ్రీరాముడు సీతాన్వేషణ సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయనకు వాయుదేవుడు ప్రణమిల్లి తన ఆతిధ్యాన్ని స్వీకరించమని కోరాడు. సీతను తీసుకుని అయోధ్య తిరిగి వెళ్ళేటప్పుడు వస్తానని శ్రీరాముడు వాయుదేవునికి మాట ఇచ్చాడు.

💠 రావణ సంహారానంతరం శ్రీరాముడు వానరసేనతో కలిసి ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంతంలోకి వస్తున్నాడని తెలిసుకున్న వాయుదేవుడు రెండుగా చీలి, నదికి దారినిస్తూ ఆకాశమంత ఎత్తున కన్పిస్తూ దివ్య కాంతులను వెదజల్లుతున్న కొండ శిఖరాలను చూసి నానా రత్నమణి గణఖచితమైన దివ్యమైన స్వర్ణతోరణం రెండు కొండల శిఖరాలనూ

 కలుపుతూ కొండల మధ్యలోయలో

బంగారు పూలదండతో బంగారు తోరణం నిర్మించి స్వాగత సూచకంగా వేలాడదీశాడు

💠రాముడు ఈ గండి ప్రాంతంలో బస చేశాడు.

హనుమంతుడిని తలుచుకుంటూ శ్రీరాముడు ఒక కొండపై ఆంజనేయుని ఆకారాన్ని తన బాణంతో గీశాడట. 

రాముడు మొత్తం బొమ్మను గీసాడు కానీ ఆంజనేయుని ఎడమకాలి చిటికెన వేలిని చెక్కేలోగా రాహుకాలం రావడంతో అంతటితో వదిలేశాడట రాముడు. ఆ శిలను అక్కడినుంచి తరలిద్దామని చూడగా, వేలినుంచి రక్తం కారడంతో స్వామి వారక్కడ సజీవరూపులై ఉన్నారని తెలుసుకుని, చేసేదేమీ లేక ఆ స్థలంలోనే ఆలయాన్ని నిర్మించారట. అదే గండి వీరాంజనేయస్వామి దేవాలయం.

ఇక్కడ స్వామివారి ఒక పాదానికి చిటికెనవేలు ఉండదు. ఆ చిటికెనవేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది. అందుకే ఇక్కడి మూర్తిని " సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా" పేర్కొంటారు.

💠 ఆ స్వామి దర్శనమాత్రంతోనే సమస్త దోషాలు తొలగి సర్వశుభాలు కలుగుతాయని అంటారు.హనుమ పాదాలను అభిషేకిస్తూ, ప్రజల పాపాలను పోగొట్టే పాపహారణియై ‘పాపఘ్నీ’ అనే సార్థక నామ ధ్యేయంతో ఆ నదీమతల్లి గౌరవించబడుతోంది.

💠 వాయుదేవుడు నిర్మించిన ‘ఆకాశతోరణం’ అదృశ్యరూపంలో శాశ్వతంగా నిలిచి వుంటుందనీ, తపోధనులూ, జీన్ముక్తులైన మహాజ్ఞానులకూ భక్తియుతులకూ మాత్రమే ఆ తోరణ దర్శనభాగ్యం కలుగు తుందనీ, ఆ తోరణాన్ని దర్శించిన వారు జన్మాంతరంలో శాశ్వత విష్ణుసాయుజ్యం పొందుతారని సీతారాములు దీవించారు.ఇలా సీతారాములచే గండిక్షేత్రంలో చిత్రహనుమ ఉద్భవం సర్వమంగళకరంగా జరిగింది. 

💠 ఆ తోరణం 1914లో అప్పటి కడప జిల్లా కలెక్టర్‌ సర్‌ ధామస్‌ మన్రోకి కనిపించినట్టు కడప జిల్లా గురించి మద్రాసు ప్రభుత్వం ప్రచురించిన గెజిట్‌లో పేర్కొనబడింది. 

💠 మధ్వ సంప్రదాయానికి చెందిన వసంతాచార్యులు గండి ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు. 

ఆయన ఆంజనేయస్వామి భక్తుడు. 

ఈ ఆలయంలో ఆంజనేయస్వామికి నివేదన చేసిన ప్రసాదాన్ని వసంతాచార్యుల వారికి కూడా నివేదన చేయడం ఇప్పటికీ సంప్రదాయంగా సాగుతోంది. 

💠 శ్రీరాముడు వాయుదేవుడు ఉన్న గండి క్షేత్రానికి వచ్చింది శ్రావణ మాసంలోనే. అందుకే ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

💠 ఈ మహిమాన్విత పుణ్య క్షేత్రం కడప జిల్లాలోని రాయచోటి - వేంపల్లి మార్గoలో ఉంది. రాయచోటి, వేంపల్లిల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

హరినామ సంకీర్తన

 “అహో ఇమం పశ్యత మే వినాశం”

పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు. అతను ఋగ్వేదం లో పేర్కొనబడ్డాడు, దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది. 'సౌభరి సంహిత' అనే ఒక గ్రంధం కూడా ఉంది. కావున అతను సామాన్యమైన ముని కాడు.

సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటిలోపల ధ్యానం చేసేవాడు. ఒకరోజు అతను రెండు చేపల సంయోగం చూసాడు. ఆ దృశ్యం అతని మనస్సు ఇంద్రియములను చలింపచేసింది, మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెల్లుబికింది. తన ఆధ్యాత్మిక సాధన పరిత్యజించి, ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటినుండి బయటకు వచ్చాడు.

ఆ కాలంలో అయోధ్యకు రాజు మాంధాత, అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు. అతనికి యాభై మంది, ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారు. సౌభరి ముని      ఆ రాజు వద్దకి వచ్చి ఆ యాభై మందిలో ఒకరిని పాణిగ్రహణానికి అడిగాడు.

మాంధాత రాజు ఆ ముని స్వస్థచిత్తత గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు…  "ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు!" అని. 

ఆ రాజు కి, సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు, కాబట్టి ఇతని కోరికని నిరాకరిస్తే, ముని అతనిని శపించవచ్చు. కానీ, తను ఒప్పుకుంటే, తన కుమర్తెలలో ఒకరి జీవితం నాశనం అయిపోతుంది. ఎటూతోచని పరిస్థితిలో రాజు ఇలా అన్నాడ.., "ఓ పుణ్యపురుషా, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి కూర్చోండి. నా యాభై మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను, వారిలో ఎవరు మిమ్ములను ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది". రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలలో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు, కాబట్టి ఈ ప్రకారంగా, ముని శాపాన్ని తప్పించుకోవచ్చు.

సౌభరికి రాజు ఉద్దేశ్యం పూర్తిగా తెలుసు. తను మరుసటి రోజు వస్తానని రాజుకి చెప్పాడు. ఆ సాయంత్రం తన యోగ శక్తి ఉపయోగించి అందమైన యువకుడిగా మారిపోయాడు. పర్యవసానంగా, మరుసటి రోజు రాజ మందిరం వెళ్ళినప్పుడు , ఆ యాభై మందీ రాకుమార్తెలు కూడా అతన్నే భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్దుడై ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది.

ఇప్పుడు, తన యాభై మంది కుమార్తెలు ఒకే భర్త ని పంచుకోవటంలో తమలో తాము తగవు పడతారేమోనని ఆ రాజు చింతించాడు. కానీ, సౌభరి మరల తన యోగ శక్తి ని ఉపయోగించాడు. రాజు భయాన్ని తొలగించటానికి అతను యాభై రూపములు స్వీకరించి, తన పత్నుల కోసం యాభై భవనాలు సృష్టించి, వారందరితో వేర్వేరుగా నివసించాడు. 

ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడచి పోయినవి. సౌభరికి ప్రతి భార్య తో చాలా మంది బిడ్డలు కలిగారని, వారికి మళ్ళీ ఇంకా పిల్లలు కలిగి, చివరకి ఒక చిన్న పట్టణం తయారయిందని పురాణములలో చెప్పబడింది. 

ఒక రోజు ఆ ముని తన అసలు స్పృహకొచ్చి ఇలా మొరబెట్టుకున్నాడు:

“అహో ఇమం పశ్యత మే వినాశం” (భాగవతం 9.6.50)

"ఓ మానవులారా! భౌతిక వస్తువుల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్లాలారా, జాగ్రత్త. నా భ్రష్టత్వం చూడండి. నేనెక్కడ ఉండేవాడిని, ఇప్పుడేమైపోయానో. నేను యాభై శరీరాలు సృష్టించాను మరియు యాభై స్త్రీ లతో వేల సంవత్సరాలు గడిపాను. అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు, సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి. నా పతనం చూసి నేర్చుకొని, ఆ దిశలో వెళ్ళవద్దు."

భగవద్గీత, భాగవతము చదవండి, సులభమైన భక్తి యోగాన్ని ఆచరించండి ఆనందంగా ఉండండి.

కలియుగ ధర్మం హరినామ సంకీర్తన చేస్తూ తరించండి.

వైకుంఠలోకాలలో శాశ్వత ఆనంద జీవితం పొందండి.

సదా జపించండి