26, జులై 2020, ఆదివారం

అశ్వత్థామతో నా అనుభవాలు



--పైలట్ బాబా

ఉన్నత హిమ శిఖరాలలో ఈనాటికీ, వేలాది సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటున్న మహాత్ములున్నారు. నా సంచారంలో ఇలాంటి వారిని  , చాలా మందిని కలిసాను. వారితో కొంత కాలం ఉండి, వారి జ్ఞానం ద్వారా ప్రయోజనం పొందాను.....అలా "అశ్వత్థామ దర్శనం" ....అందులో భాగమే.

   ఒక సారి నేను "పహాడీ బాబాతో" కలసి, నర్మదా తీరంలో నడుస్తున్నాను. మేమిద్దరం అలా, వెళ్ళి వెళ్ళి ఒక అడవిలో ప్రవేశించాం. ఆ అడవిలో "భిల్లులనే" ఆటవిక జాతి నివాసముంటోంది. దారి దోపిడీలు చేయడం వారికి కూసు విద్య. అడవి గుండా వెళ్ళే యాత్రికులను దోచుకోవడం, వారికి ఆనవాయితీ.

     బంజారా జాతి వారిని మాత్రం వారు బాధించరు. మేము, కేవలం లంగోటాలు మాత్రమే ధరించి, అడవి గుండా పోతుంటే....ఆ ఆటవికులు, మమ్మల్ని చూసి వింత ధ్వనులు చేయసాగారు. కొద్ది సేపటి తరువాత, ఆ భిల్లులు మమ్ములను చుట్టు ముట్టారు. మా వద్ద ఉన్న మూటల్లో....వేపాకులు, విభూతి తప్ప, మరేమీ లేవు. ఆ భిల్లులు ఆ మూటలను లాక్కుని తెరచి చూసి నిర్ఘాంతపోయారు. వారిలో వారు ఏవో సైగలు చేసుకొని, మమ్మల్ని వెంట రమ్మన్నారు. కొంచెం సేపట్లో, మమ్మల్ని వారి ప్రధాన గుడిసె లోకి తీసుకొని వెళ్ళి, చాపల మీద కూర్చోమని చెప్పి, అగ్నిహోత్రం వెలిగించారు. రొట్టెలు చేసి తేనెతో వడ్డించారు. గడ్డితో చేసిన ఆ రొట్టెలు, తేనెతో మేమునూ తిని, వారికి కొన్ని పెట్టాం. మాకోసం వారు ఒక ప్రత్యేక కుటీరాన్ని కేటాయించారు. పండ్లు, దుంపలు కూడా సేకరించి మాకిచ్చారు. అలా వారు మమ్మల్ని భక్తితో సేవించారు. 

ఆ ఆటవికులకు, తమదైన క్రమ శిక్షణ కలదు. జాతి నాయకుడి మాట వారికి శిరోధార్యం. అతనికి ఎప్పుడూ ఎదురుతిరగరు.  శివుడు వారి కుల దేవత. ప్రొద్దున్న, సాయంత్రం...మా వద్దకు వచ్చి కూర్చొనే వారు.

    ఒక్కోసారి రాత్రంతా, సంగీత-నాట్యాలతో గడిపే వారు. వారిలో కొందరు దొంగిలించిన దుస్తులు వేసుకొనేవారు. కొంత మంది చెట్ల పట్టాలు ధరించేవారు. ఈ భిల్లులనే ఆటవికులతో, ఒక మనిషి వస్తూండే వాడు, మేమున్న కుటీరానికి. ఆ వచ్చే మనిషి ప్రత్యేకించి కాషాయ దుస్తులు ధరించి, వారి కంటే భిన్నంగా, హుందాగా ఉండేవాడు. అతనితో మేము మాట కలపడానికి ప్రయత్నించినపుడల్లా, మాటలాడకుండా వెళిపోయేవాడు.

     ఒకనాడు, మేము ఆ ప్రాంతంలోని మహాదేవుని మందిరంలో విశ్రాంతి తీసుకొనుచుండగా,  ఆ అసాధారణ వ్యక్తితో మనస్సు,చూపు కలిసాయి. అతను ఆజానుబాహుడు. యువకుడులా ఉన్నాడు. అతనికి చక్కని మీసకట్టు ఉన్నది. కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. శాంతం,సౌమ్యం, ధీర-గంభీర వ్యక్తిత్వం అతని స్వంతం. అతను నొసటికి పసుపు రంగు గుడ్డను కట్టుకొని ఉన్నాడు. నేను పహాడీ బాబాతో అతని గురించి, అతని ఆహార్యాన్ని గురించి, అతని వ్యక్తిత్వాన్ని గురించి మాటలాడుతుంటే, అతను మా వైపు అర్థవంతంగా చూసి, చిరునవ్వు నవ్వి అక్కడ నుండి వెళిపోయాడు.

   కుతూహలం ఆపుకోలేక మేము అతనిని వెంబడించాను. అతను, నన్ను వెంబడించవద్దని వేడుకొన్నాడు. అయిననూ మేము మా పట్టుదల విడిచి పెట్టకుండా, అతనికి పాద నమస్కారం చేసి ఇలా ప్రార్థించాను. " మీరెవరైనా కానీ, మీ పూర్తి పరిచయ భాగ్యం మాకు కావాలి, మీ మార్గదర్శకత్వం మాకు కావాలి, మీ ఉన్నత-గహన-గంభీర రూపం చూస్తుంటే, మీరు ఈనాటి పురుషులు కాదనిపిస్తోంది. దయచేసి మీ పరిచయ భాగ్యాన్ని మాకు ప్రసాదించండి.

   నేనిలా ప్రవర్తించడం, ఈ ఆటవికులకు నచ్చలేదు. ఆ రహస్య వ్యక్తి వాళ్ళకు అత్యంత పూజనీయుడు. మహా శివరాత్రి నాడు శివునితో పాటు, ఆ విచిత్ర వ్యక్తిని కూడా పూజిస్తారు.

    ఆ మహావ్యక్తి భిల్లులను శాంతించమని చెప్పి, నన్ను ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు. "కపిల్ ! నేను ద్రోణాచార్యుని పుత్రుడైన "అశ్వత్థామను". మహాభారత కాలంలో సేనాపతిని. అయితే, అదంతా గతం.  అయినా నన్ను గత జ్ఞాపకాలు విడవడం లేదు. భిల్లుల నివాస ప్రాంతంలోని, ఈ దేవాలయమే నా నివాసం. ఈ భిల్లులు నా సహచరులు. నేను ఎప్పుడో ఒకసారి, హిమాలయాలకు వెళ్ళి కృపాచార్యుడిని, విధురుడిని కలుస్తూంటాను. ఎక్కువ భాగం ఇక్కడే ఈ ఆదిమ వాసుల జీవితంలో పాలు పంచుకుంటాను. కపిల్, మాకైతే కాలం నిలిచిపోయింది. కృపాచార్యుల వారు, విధురుల వారు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూంటారు. అప్పుడిది ఒక హిమాలయమే అవుతుంది.

  ... గోరఖ్ నాథ్ జీ ఎప్పుడన్నా కలుస్తూ ఉంటారు. ఆయన దర్శనం , ఆశీర్వాదంతో సమానం. ఆయనతో కలసినపుడు, ప్రాచీన బ్రహ్మాండాన్ని తలచుకొని, జీవులెలా జనన-మరణ చక్రంలో తిరుగుతుండేది, గమనిస్తాం. మాకు భూత, భవిష్య, వర్తమానాలు తెలుసు. అయినా ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మేము ఇదివరకటిలా ఇప్పుడు లేము.

      అశ్వత్థామ, తన తలకట్టు తీసివేయగా...వంకులు తిరిగిన ఆయన జుట్టు, ఆయన నొసటి పైకి జారింది. ఆయన విశాల ఫాల భాగం మధ్యలో , లోతైన గాయపు గుర్తు ఉన్నది. ఆ గాయపు రంధ్రంలోంచి వింత కాంతి వస్తోంది. "నా నొసటి పై గల ఈ మణి, పోవడం వలనే...నా యుద్ధపు టెత్తుగడలు, దైవీ శక్తి అంతమొందాయి. అన్ని శక్తులు నన్ను వదలివేశాయి. అందుచే, ప్రతిఫలంగా...."చిరంజీవత్వం" అనే వరం లభించింది. ఆనాటి నుండి కూడా నేను ఈ భూమి మీద జీవిస్తున్నాను. నా సమకాలికులు జంతువులుగా, పక్షులుగా, పాములుగా....జన్మ ఎత్తడం చూసి, మానవుని నిస్సహాయతను గుర్తించి బాధ పడుతున్నాను. నేనైతే ఈ జనన-మరణ చక్రంలో బంధితుడిని కావడం ఇష్టం లేదు. నేను పూర్తిగా శివారాధనలో మునిగిపోయాను.

     ఇలా అశ్వత్థామ సాహచర్యంలో, ఆరు మాసాలు గడిపాము. వేల సంవత్సరాల వయస్సున్న మనిషి, ప్రస్తుతం తానున్న సమాజ విధానాల వలన ప్రభావితుడు కాకుండా ఉండగలడో, ఎలా జీవించగలడో అర్థం చేసుకున్నాను........

పైలట్ బాబా అనుభవాలు

చిన్న కద

'ఏమండీ... ఆపిల్‌ను నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టరా?" అంది భార్య భర్తతో

"ఏం.. ఆరు ముక్కలుగా కోస్తే ఇబ్బందేంటో?" ప్రశ్నించాడు భర్త

"వద్దు.. వద్దు.. ఆరు ముక్కలు తినకూడదు. నేను డైటింగ్ చేస్తున్నాను. కాబట్టి నాలుగు ముక్కలు కొయ్యండి చాలు..! అంది భార్య.
😀😀😀😀😀😀😁😁😁
సుబ్బారావు తల పగిలి హాస్పిటల్ లో  అడ్మిట్ అయ్యాడు,  తల కి కట్టుకడుతూ నర్స్ అడిగింది అసలు మీకు దెబ్బెలా తగిలింది సార్.
సుబ్బారావు : నాకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది
మా ఆవిడని సర్ ప్రైజ్ చేద్దామని ఇంటికెళ్ళగానే రేపటినుంచీ నువ్వు మేనేజర్ తో కాపురం చెయ్యాలోయ్ అన్నాను
అంతే.....
🤕🤕🤕🙄🙄🙄🙄🙄🙄
ఒక నల్లని మనిషి చనిపోయాక
స్వర్గానికి వెళ్లాడు..
దేవకన్య: ఎవరు నువ్వు?
నల్లని వ్యక్తి: (ఆమెని ఇంప్రెస్ చేయడానికి)
'టైటానిక్' సినిమాలో హీరోని
దేవకన్య: టైటానిక్ షిప్
మునిగిపోయిందిరా వెధవా.. కాలిపోలేదు..
😅😜😃😆😅😂😅😅

 మందుబాటిల్ కొనుక్కుని బైక్ ఎక్కబోతుండగా అనుమానం వాచ్చింది .... ఒకవేళ బైక్ మీదినుండి పడిపోతే బాటిల్ పగులుతుందేమోనని ''

అందుకని బైక్ స్టాండ్ వేసి ఆ మందుబాటిల్ అక్కడే ముగించి ఇంటికి బయలుదేరాడు .

మద్యలో బైక్ మీదినుంచి పడి దెబ్బలు తగిలి హాస్పటల్ లో చేరి మంచంమీద పడుకొని ఆలోచిస్తున్నాడిలా....
 అక్కడేమందుకొట్టటం మంచిదైంది లేకపోతే బాటిల్ పగిలి పోయేది 😱😱
😁😁😁😁😁😁😁😁😁
అలిగి పుట్టింటికొచ్చిన కూతురు , తిరిగి కాపురానికి వెళ్తుంటే తల్లి అడిగింది...
" ఏమ్మా తప్పు తెల్సుకున్నావా..?? అని.

కూతురు : నిజం తెలుసుకున్నా...
ఇక్కడ నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది... అక్కడైతే అన్ని పనులు ఆయనే చేస్తారు...
😁😁😁😁😁😂😁
తండ్రి కొడుకుతో కోపంగా..

కొత్తిమీర తీసుకొని రమ్మంటే పుదీనా తీసుకొని వచ్చావు కదరా. నీకు కొత్తిమీరకు పుదీనాకూ తేడా తెలియదా..? తాడిచెట్టులా పెరిగితే సరిపోయిందా వెళ్ళు వెళ్ళు. ఇల్లు వదిలి వెళ్ళిపో తెలుస్తుంది జీవితం అంటే ఎంటో..?!

కొడుకు : సరే నాన్న పద ఇద్దరమూ ఇల్లు వదిలి వెళదాం పద..

తండ్రి : ఎందుకు నేనెందుకు..?!

కొడుకు : అమ్మ చెప్పింది ఇది మెంతికూర అంటా..!!
😂😂😂

కరోనాతో నా అనుభవం

నాకు జరిగిన అనుభవాన్ని అందరి తో పంచుకోవాలని అలాగే ఇప్పుడు పరిస్థితుల లో మానవత్వాము అనేది చాలా అవసరం.....

కరోనా పెద్ద ప్రాణాంతకమైనది కాదు....పాజిటివ్ అని తెలిస్తే ధైర్యం చాలా అవసరం....

నంద్యాల లో ఒక హోమియోపతి డాక్టర్ నాగేశ్వర్ రావు గారు నంద్యాల లో పాజిటివ్ కేసులకు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నాడు.హోమియో లో కూడా కరోనా ను కంట్రోల్ చేయగలరు అని ఈ మద్యనే గుజరాత్ లో మొత్తం హోమియో మందులు వాడుతున్నారని టీవీ ల లో చూసాం.

భగవాన్.సి
బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి  

Doctor ph.9441082109

***********************

మహాభారత కథ...! -

స్టే హోమ్... స్టే సేఫ్...! అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...! -
కురుక్షేత్ర సమరం జరగడం ఖాయమై పోయింది… యుద్ధక్షేత్రాన్ని కూడా ఖరారు చేసేశారు… ఏ రోజు నుంచి యుద్ధం ప్రారంభం అవుతుందో కూడా తేల్చేశారు… ఇరుపక్షాలూ బలాల సమీకరణలో పడ్డాయి… సాధనసంపత్తి సమకూర్చుకుంటున్నాయి… అక్షౌహిణుల కొద్దీ సైన్యం తలపడే చరిత్రాత్మక సమరం అది… ఎన్ని లక్షల తలలు తెగిపడతాయో తెలియదు… ఆ కురుక్షేత్ర స్థలాన్ని ఏనుగులతో చదును చేయిస్తున్నారు… రాళ్లు, పొదలు, తుప్పలు, చెట్లను తొలగించేస్తున్నారు… సమతలం చేస్తున్నారు… ఆకాలంలో ఏనుగులే కదా జేసీబీలు, పొక్లయిన్లు…

అర్జునుడు, కృష్ణుడు కలిసి ఆ స్థలాన్ని పరిశీలించటానికి వచ్చారు… క్రికెట్ మ్యాచుకు ముందు ఫీల్డ్, పిచ్ పరిశీలనకు వచ్చిన కెప్టెన్లలాగా ఓచోట నడుస్తున్నారు… ఇంతలో ఒక పెద్ద ఏనుగు ఓ చెట్టును అమాంతంగా కూల్చేసింది… పాపం, ఆ చెట్టు తొర్రలో ఓ పిచ్చుక ఉండేది… దానికి ఓ గూడు… దానికి నాలుగు పిల్లలు… ఇంకా ఎగరడానికి రెక్కలకు బలం రాలేదు… ఆ నాలుగింటినీ ఇంకెక్కడికో ఎత్తుకుపోయేంత బలం ఈ తల్లి పిచ్చుక రెక్కలకు లేదు… చెట్టుతోపాటు పిచ్చుకగూడు కూడా కిందపడింది… లక్కీగా పిల్లలు సేఫ్…

ఆ పిట్ట కృష్ణుడిని చూస్తుంది… గుర్తిస్తుంది… ఎలాగోలా బలహీనంగా ఎగురుతూ వెళ్లి తన ఎదుట వాలుతుంది… ఆ రెక్కలతో దండం పెడుతుంది… అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు… కృష్ణుడికి అన్నీ తెలుసు కదా… చిరునవ్వుతో పిచ్చుక వైపు చూశాడు…

కృష్ణా… ఏమిటిదంతా దేవా..? అడిగింది పిట్ట…

యుద్ధక్షేత్రాన్ని చదును చేసే ప్రక్రియ తల్లీ… బదులిచ్చాడు కృష్ణుడు…

రేపు మరో ఏనుగు వస్తుంది, తన కాళ్లతో తొక్కేస్తుంది… మరి నా పిల్లలు ఏమైపోవాలి..? యుద్ధం నా పిల్లల ప్రాణాలతోనే ప్రారంభం కావాలా కృష్ణా… అని విలపించింది పిట్ట…

నేను విన్నాను, నేనున్నాను అనలేదు కృష్ణుడు… రాసి పెట్టి ఉంటే తప్పదమ్మా… కాలచక్రం చాలా నిరంకుశమైంది… దాని ముందు నువ్వూ, నేను నిమిత్తమాత్రులమే కదా… అన్నాడు నిర్దయగా… కానీ ఏదో ఆలోచనలో పడ్డాడు…

కపటనాటక సూత్రధారివి నువ్వు, నాకు తెలుసులే నీ మాటల మహత్తు… తత్వం బోధించకు స్వామీ… అసలు కాలచక్రమే నువ్వు… అన్నీ జరిపించేది నువ్వే, నువ్వే.,., నా పిల్లల్ని కాపాడాల్సింది నువ్వే, నీమీదే భారం వేస్తున్నా, నువ్వే రక్షకుడివి ప్రభువా…, నిన్నే వేడుకుంటున్నాను…. అని మొరపెట్టుకుంది పిచ్చుక…

పోనీలే కృష్ణా, మనతో తీసుకుపోదాం, బయట వదిలేద్దాంలే అన్నాడు అర్జునుడు… కృష్ణుడు వారించాడు… పిచ్చుక అసహాయంగా చూస్తూ ఉండిపోయింది… వెళ్లేముందు పిచ్చుకతో… ‘‘నీకూ, నీ పిల్లలకు మూడు వారాలకు సరిపడా తిండిని ఎలాగోలా తెచ్చి పెట్టుకో..’’ అన్నాడు… పిచ్చుకకు, అర్జునుడికీ ఏమీ అర్థం కాలేదు…

రెండు రోజులు గడిచాయి… సమరశంఖాలు పూరించారు… ఇరువైపులా చతురంగ బలాలు… సమరాంగణం హోరెత్తిపోతున్నది… కాసేపట్లో యుద్ధం ప్రారంభం కాబోతున్నది… కృష్ణుడు ఒకసారి నీ ధనుస్సు ఇవ్వు బావా అనడిగాడు అర్జునుడిని…

అర్జునుడు విస్తుపోయాడు… నువ్వు ఆయుధాన్ని ధరించను, వాడను, పోరాడను అని ప్రకటించావు కదా బావా… నీకెందుకు మాటతప్పిన అప్రతిష్ట..? నువ్వు ఆదేశించు, నేను హతమారుస్తా…

కృష్ణుడు మాట్లాడకుండా గాండీవాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ఓ బాణాన్ని ఎక్కుబెట్టి, ఘీంకరిస్తున్న ఓ ఏనుగుకు గురిపెట్టి వదిలాడు… ఆ బాణం నేరుగా వెళ్లింది… ఆ ఏనుగు మెడలో కట్టి ఉన్న పెద్ద గంటను తాకింది… ఆ గంటకు ఉన్న తాడు తెగి, గంట కింద పడిపోయింది… అర్జునుడికి నవ్వొచ్చింది… ఏమిటి బావా..? ఈ అపశకునం, ఐనా నీ గురితప్పడం ఏమిటి..? అనడిగాడు… ఆ ఏనుగును చంపేయాలా..? నేను బాణం వదలనా..? అన్నాడు… మాట్లాడకుండా ఆ ధనుస్సు తిరిగి ఇచ్చేసిన కృష్ణుడు తన చేతిలోని పాంచజన్యాన్ని పూరించాడు… యుద్ధం ప్రారంభమైంది… మొన్న పిట్ట గూడును కూల్చేసిన ఏనుగే అది…

భీకరమైన యుద్ధం… 18 రోజుల్లో అటూ ఇటూ లక్షల తలలు తెగిపడ్డాయి… ఏనుగులు, గుర్రాలు చచ్చిపోయాయి… ఎటు చూసినా కళేబరాలు… తెగిన అవయవాలు… విరిగిన రథాలు… బాణాలు, ధనుస్సులు, ఈటెలు, గదలు… పైన ఎగురుతున్న రాబందులు… మృత్యుదేవత వేనవేల కోరలతో తాండవం చేస్తున్న వాసన… అర్జునుడిని తీసుకుని ఆ శవాల నడుమ ఏదో వెతకడం ప్రారంభించాడు కృష్ణుడు…

తొలిరోజున తన పడగొట్టిన ఏనుగు గంట కనిపించింది ఓచోట… అలాగే భద్రంగా… అర్జునా, ఆ గంటను పైకి లేపు అన్నాడు కృష్ణుడు… కృష్ణలీలలు, మాయలు, చేష్టలు ఎప్పటికప్పుడు కొత్తే కదా అర్జునుడికి… మారుమాట్లాడకుండా ఆ గంటను పైకి లేపాడు… అంతే… దాని కింద ఉన్న పిట్టపిల్లలు నాలుగు రెక్కలను ఒక్కసారి వదిల్చి గాలిలోకి ఎగిరాయి… వాటితోపాటు వాటి తల్లి కూడా… ‘ఇవి ఆ రోజు పిట్ట పిల్లలేనా..?’ అనడిగాడు అర్జునుడు… కృష్ణుడు మొహంలో చిరుమందహాసం… ఆ గంట అన్నిరోజులపాటు అంత భీకరమైన యుద్ధం నుంచి ఆ చిన్ని కుటుంబాన్ని కాపాడింది… ఇంతకీ ఈ కథలో నీతి ఏమిటి అంటారా..? ఈ కరోనా విపత్తు వేళ మనకు చెబుతున్న పాఠం ఏమిటీ అంటారా..? సింపుల్…. 

‘‘ గంట దాటి బయటికి కదలకండి, యుద్ధం పూర్తయ్యేంతవరకూ దాని కిందే భద్రంగా ఉండండి… అదే మీకు రక్ష… స్టే హోమ్… స్టే సేఫ్…’’ 

***************************

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - మూడవ అధ్యాయము

గజేంద్రుడు భగవంతుని స్తుతించుట - ఆ ప్రభువు అతనిని రక్షించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

3.18 (పదునెనిమిదవ శ్లోకము)

ఆత్మాత్మజాప్తగృహవిత్తజనేషు సక్తైర్దుష్ప్రాపణాయ గుణసంగవివర్జితాయ|

ముక్తాత్మభిః స్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ॥6409॥

దేహము, దారాపుత్రులు, బంధుమిత్రులు, గృహము, సంపదలు, స్వజనులు మొదలగు వారియందు ఆసక్తిగలవారు నిన్ను పొందుట అసాధ్యము. ఏలయన, నీవు స్వయముగా గుణాతీతుడవు. జీవన్ముక్తులు తమ హృదయములయందు నిరంతరము నిన్నే ధ్యానించుచుందురు. సర్వైశ్వర్య పూర్ణుడవు, జ్ఞానస్వరూపుడవైన నీకు ప్రణామములు.

3.19 (పందొమ్మిదవ శ్లోకము)

యం ధర్మకామార్థవిముక్తికామాః భజంత ఇష్టాం గతిమాప్నువంతి|

కిం త్వాశిషో రాత్యపి దేహమవ్యయం కరోతు మేఽదభ్రదయో విమోక్షణమ్॥6410॥

ధర్మార్థకామమోక్షములను అభిలషించువారు ఆ పరమాత్మను సేవించి, తమ అభీష్ట వస్తువులను పొండుచుందురు. ఆ ప్రభువు వారికి అన్ని విధములుగా సుఖ, శాంతులను ప్రసాదించుచుండును. అంతేగాదు, వారికి శాశ్వతమైన పార్షదదేహమును గూడ అనుగ్రహించుచుండును. పరమ దయాళువైన ఆ స్వామి నన్ను ఉద్ధరించుగాక!

3.20 (ఇరువదియవ శ్లోకము)

ఏకాంతినో యస్య న కంచనార్థం వాంఛంతి యే వై భగవత్ప్రపన్నాః|

అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనందసముద్రమగ్నాః॥6411॥

అనన్య భక్తులు ఆ ప్రభువునకు ప్రసన్నులై, ఆయన నుండి ఏమియును అపేక్షింపరు. వారు కడకు మోక్షమునుగూడ కోరరు. కేవలము ఆ ప్రభువుయొక్క దివ్యమైన, శుభప్రదమైన లీలలను గానము చేయుచు ఆనంద సముద్రమునందు ఓలలాడుచుందురు.

3.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

తమక్షరం బ్రహ్మ పరం పరేశమవ్యక్తమాధ్యాత్మికయోగగమ్యమ్|

అతీంద్రియం సూక్ష్మమివాతిదూరమనంతమాద్యం పరిపూర్ణమీడే॥6412॥

ఆ పరమాత్మ శాశ్వతుడు, సర్వశక్తిమంతుడు, అవ్యక్తుడు, ఇంద్రియాతీతుడు. అత్యంత సూక్ష్మస్వరూపుడు. అందరికిని సమీపముననే యున్నను, అతి దూరముగా ఉన్నట్లు అనిపించును. ఆయన ఆధ్యాత్మిక యోగము ద్వారా అనగా జ్ఞానయోగ, భక్తియోగముల ద్వారా ప్రాప్తించును. ఆది పురుషుడు అనంతుడు, పరిపూర్ణుడు ఐన ఆ పరబ్రహ్మమును స్తుతించుచున్నాను.

3.22 (ఇరువది రెండవ శ్లోకము)

యస్య బ్రహ్మాదయో దేవా వేదా లోకాశ్చరాచరాః|

నామరూపవిభేదేన ఫల్గ్వ్యా చ కలయా కృతాః॥6413॥

ఆ భగవంతుని యొక్క అతి సూక్ష్మమైన అంశము నుండియే పెక్కు నామరూపములు, భేదభావములు గల బ్రహ్మాది దేవతలు, వేదములు, చరాచర లోకములు సృష్టింపబడినవి. ఆ అల్పాంశమే ఈ సర్వమూ రూపుగొని ప్రకటమైనదని భావము.

3.23 (ఇరువది మూడవ శ్లోకము)

యథార్చిషోఽగ్నేః సవితుర్గభస్తయో నిర్యాంతి సంయాంత్యసకృత్స్వరోచిషః|

తథా యతోఽయం గుణసంప్రవాహో బుద్ధిర్మనః ఖాని శరీరసర్గాః॥6414॥

ప్రజ్వలించుచున్న అగ్ని జ్వాలలు, ప్రకాశించుచున్న సూర్యకిరణములు పదే పదే బహిర్గతమై, తిరిగి అందే (సూర్యాగ్నులయందు) లీనమగుచున్నవి. అట్లే స్వయం ప్రకాశుడైన పరమాత్మ నుండియే గుణ ప్రవాహ రూపములైన శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి పదే పదే ప్రకటితమగుచుండును. మరల ఆయనలోనే లీనమగుచుండును.

3.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

స వై న దేవాసురమర్త్యతిర్యఙ్న స్త్రీ న షంఢో న పుమాన్న జంతుః|

నాయం గుణః కర్మ న సన్న చాసన్నిషేధశేషో జయతాదశేషః॥6415॥

భగవానుడనగా దేవతగాని, రాక్షసుడుగాని కాదు. మానవుడుగాని, పశువుగాని, పక్షిగాని కాదు. అట్లే స్త్రీగాని, పురుషుడుగాని, నపుంసకుడుగానీ కాదు. ఆయన ఒక సాధారణ లేదా అసాధారణ ప్రాణి (జంతువు) మాత్రము కూడా కాదు. సత్త్వరజస్తమో గుణములలో ఒక గుణము గాని, క్రియ (కర్మ) గాని, కార్యముగాని, కారణముగాని కాదు. ఇదికాదు- ఇదికాదు అని సర్వమునూ నిషేధించగా మిగలేది. అంతేగాక! ఈ సర్వమునూ తనయందే కలిగియున్నది అగు (చైతన్య) తత్త్వమే ఈశ్వరుడు. అట్టి పరమాత్ముడు నన్ను ఉద్ధరించుటకు ప్రకటమగుగాక!

పోతనామాత్యులవారి పద్యము

కంద పద్యము

కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణముల పాలం
గలఁ డందు రన్నిదిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?

తాత్పర్యము

దేవుడు ఆర్తు లైన వారి వెంట ఉంటాడు అని అంటారు. ఉత్తము లైన యోగుల చెంత ఉంటా డని అంటారు. అన్ని దిక్కుల లోను ఉంటా డంటారు. “ఉన్నాడు ఉన్నాడు” అనే ఆ దేవుడు మరి ఉన్నాడో! లేడో!

3.25 (ఇరువది ఐదవ శ్లోకము)

జిజీవిషే నాహమిహాముయా  కిమంతర్బహిశ్చావృతయేభయోన్యా|

ఇచ్ఛామి కాలేన న యస్య విప్లవస్తస్యాత్మలోకావరణస్య మోక్షమ్॥6416॥

ఈ ఏనుగు దేహము బయట, లోపల, అన్ని వైపుల అజ్ఞానము అను ఆవరణముచే కప్పబడియున్నది. దీని వలన ప్రయోజనము శూన్యము. ఆత్మ ప్రకాశమును కప్పివేయునట్టి ఈ అజ్ఞానమను ఆవరణమునుండి బయటపడగోరుచున్నాను. ఇదీ కాలక్రమమున తనంతట తానుగా వదలిపోదు. కేవలము భగవత్కృప, లేక తత్త్వ జ్ఞానము ద్వారానే ఈ అజ్ఞానావరణము తొలగిపోవును.

3.26 (ఇరువది ఆరవ శ్లోకము)

సోఽహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసమ్|

విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోఽస్మి పరం పదమ్॥6417॥

కనుక, నేను పరబ్రహ్మయైన ఆ పరమాత్మనే శరణు వేడెదను. ఆ ప్రభువు విశ్వరహితుడైనను విశ్వస్వరూపుడు మరియు విశ్వసృష్టి చేయువాడు. విశ్వమునకు అంతరాత్మయై విశ్వరూప సామాగ్రితో అతడు క్రీడించుచుండును. జన్మరహితుడు, పరమపదస్వరూపుడు ఐన ఆ భగవంతునకు నమస్కారములు.

పోతనామాత్యులవారి పద్యము

కంద పద్యము

విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్.

తాత్పర్యము

ప్రభువు లోకాన్ని సృష్టించేవాడు. లోకులు అందుకోలేని వాడు. లోకానికి అంతరాత్మ అయిన వాడు. లోకంలో బాగా తెలుసుకోదగిన వాడు లోకమే తానైన వాడు. లోకాతీతుడు. ఎల్లప్పుడు ఉండేవాడు. పుట్టుక లేనివాడు. బ్రహ్మదేవునికి అధి నాయకుడు. లోకాన్ని నడిపించేవాడు. పరమాత్మ. అట్టి ఆది పురుషుని నేను ఆరాధిస్తాను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

గుడ్లగూబ_లక్ష్మీదేవికి_వాహనం_ఎలా_అయ్యింది


..#గుడ్లగూబ_లక్ష్మీదేవికి_వాహనం_ఎలా_అయ్యింది ..

మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినపుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండటాన్ని చూస్తుంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది? అనే ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తుంది. దానికి సమాధానంగా పురాణాలలో ఓ కథ కనబడుతోంది. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గానమాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూలశరీరాన్ని విడిన తరువాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం ఆంతరంగిక సంగీతసభ ఒకటి ఏర్పాటుచేసాడు. ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు. తుంబరునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబరునకు స్వాగత సత్కారాలు లభించడం చూచిన నారదుడు మండిపడ్డాడు. అయినా, తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అదితెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమైయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా చెమటలు పట్టాయి.

కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గు పడుతున్న నారదుని చూచి అన్నాడు - 'నారదా! నీ కోపకారణం నాకు తెలియును. నిజానికి భక్తి జ్ఞానములందు, శీల వర్తనములందు తుంబరుడు నీకన్న కపటి కాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికి వ్యర్థం. భక్తిశ్రద్ధలతో నన్నుకొలుచువారలకు అవశ్యం వశ్యుడనే. సంగీతం చేత ననుజేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబరులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధ పడటం లేదు. లోకహితమే జరుగుతుంది. చింతించ వద్దు.' నారదునికి అప్పటికి జ్ఞానోదయమైంది. "ఓ దేవదేవా! నా తప్పులను క్షమించుము. అవివేకివలె ప్రవర్తించాను. నన్ను కాపాడుము. తుంబర కౌశికులవలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా!' అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాలమీద పడ్డాడు.

భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్యహస్తాలతో నారదుని పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానససరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాంధం ఉంది. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చెతులు జోడించిన నారదుడు సెలవుపుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానససరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాధుర్యాన్ని పట్టుకుని ఆవలిగిరి శిఖరం చేరాడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాసాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న 'గానబంధు' నారదుని చూడగానే వినయంతో ఆశనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశలప్రశ్నలు వేసాడు. ఏతెంచిన కారణం చెప్పమని ప్రార్థించాడు.

నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీత వేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనేం! తనకు కావలసింది సంగీతవిద్య. ఉలూకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యంకాని శ్రీహరిని తుంబుర కౌశికులు గానమాధుర్యంతో వశం చేసికొన్నారని, తనకూ అలాంటీ దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు, నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింప సాగాడు - పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలి గుండెగలవాడు. ధర్మవర్తనుడు. సంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుని కూడా భక్తిగీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేసాడు. ఆ గానమాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మరచిపోయారు. వెంటనే రాజబటులు వచ్చారు. హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం. మరణశిక్షతో సమానమైనది రాజ్యబషిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసికొని రాజ్యం నుండి వెళ్లగొట్టాడు.

కాలచక్రం తిరగడం మానదుకదా! కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టినప్రాణి కూడ పుట్టక తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంధజన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయింది. పురాకృత దోషఫలితం కాబోలు; ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరగలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసికొన్న సుకృతం వల్ల మరణ దేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముని చూచి 'ధర్మరాజా! ఎందుకు ఈవిధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు?' అన్నాడు భువనేశుడు. దివాంధ స్థితికి యమధర్మరాజు జాలి పడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా! తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది! అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు.

"దివాంధమా! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసినమాట నిజమే. కాని పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమపావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువైనదియా! ఆ పాప ఫలితం కొండంతయై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టిపీడిస్తోంది. విష్ణుభక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెట్టింది. దీనినుండి బయట పడటం ఎవరికీ సాధ్యం కాదు". సమవర్తి చెప్పింది విన్నాక గాని, దివాంధానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుని స్తుతించ వచ్చన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాలమీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది. "ఉలూకరాజా! చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము. అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకుని భక్షించు. అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది" అని దీవించి వెళ్ళాడు.

"ఓ మహర్షీ! ఆ దురదృష్టవంతుడను నేనే! ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా, దివ్య తేజస్వియైన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూచి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి, 'ఇది భువనేశుని కాయము వలెనున్నది. ఇందేల పడియున్నది? దీనిని యీ పక్షి భక్షించుటేమి?" అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుని గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపైబడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతుండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా వివరించాను. హరిమిత్రుడది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకనుగుణంగా ఇలా పలికాడు. 'నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నాయెడల చూపిన కాఠిన్యం నేను ఆరోజునే మరచాను. నీవనుభవించిన బాధలిక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక! గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువు గాక!' అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికేగాడు. వాని దీవనలు ఫలించి నేనిట్లున్నాను" అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు.

ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలిరోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో గాని, తామసంతో కాని అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధనచేస్తే ఎవరైనా అపురూపమయిన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చన్నాడు. గౌరవ భావం మొహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా వేయేళ్లు గడిచాయి. కఠోరమైనదీక్షతో నారదుడు 3,60.006 రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమితానందంతో గురువును జేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను. ఏమికావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సంశయింప వద్దన్నాడు.

శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. 'ఓ మహర్షీ! దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను! దివాంధమునకు వలసిన అవసరములేమి ఉంటాయి? శిష్యుడవైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉండునంత వరకు సంగీతకళతోపాటు నేను సహితం లోకంలో గుర్తుండేలా వరము ప్రసాదింపుము' అని మనసులోని మాట బయట పెట్టాడు. నారదుడు విశాలంగా నవ్వాడు. 'గురువర్యా! ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీతకళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాధిస్తున్నాను. ప్రళయం సంభవించినవేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతునివలె శ్రీమహాలక్ష్మికి నీవు వాహనమై తరియింతువు గాక!' అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకొన్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది.

ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే

*ఇది గుర్తుంచుకోండి.*

  *కరోనా వ్యాధి అనేది దగ్గు, జలుబు కంటే పెద్ద వ్యాధి కాదు.*

  *యునైటెడ్ స్టేట్స్లో ఒక ఖైదీకి మరణశిక్ష విధించినప్పుడు, కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఖైదీపై కొన్ని ప్రయోగాలు చేయాలని భావించారు.* 
*ఉరి తీయడానికి బదులుగా విషపూరితమైన కోబ్రా నీపై దాడి (attack) చేయడం వలన నీవు  చంపబడతావని ఆ ఖైదీని భయపెట్టి చెప్పడం జరిగింది.*

  *ఒక పెద్ద విషపూరిత పాము అతని ముందుకు తీసుకురాబడింది, వారు ఖైదీ యొక్క కళ్ళు మూసివేసి, కళ్ళకు గంతలు కట్టి, అతన్ని కుర్చీకి కట్టేసారు. అతన్ని పాముతో కరిపించలేదు, గానీ రెండు భద్రతా పిన్స్ తో  (Two safety pins) గుచ్చారు అంతే, ఆ ఖైదీ రెండు సెకన్లలోనే మరణించాడు.*

  *ఆ ఖైదీ శరీరంలో పాము విషాన్ని పోలిన విషం ఉందని పోస్ట్‌మార్టం ద్వారా వెల్లడైంది.*

  *ఇప్పుడు ఈ విషం ఎక్కడ నుండి వచ్చింది, లేదా ఖైదీ మరణానికి కారణమేమిటి?*
 *ఆ విషం మానసిక రుగ్మతల ఒత్తిడి కారణంగా తన సొంత శరీరమే ఉత్పత్తి చేయబడిన విషం.!*

 *మానసిక భయాందోళనల ఒత్తిడికి గురియై మరణించడం జరిపించారు.*

  *మీ శరీరం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సానుకూల స్పందన లేదా ప్రతికూల స్పందనలు బట్టి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. (The energy results depends up on our body produces the hormones  positive energy or negative energy accordingly). తదనుగుణంగా మీ శరీరం హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.*

  *90% అనారోగ్యాలకు మూలకారణం ప్రతికూల ఆలోచనల (Negative thoughts) వలన ఉత్పన్నమయ్యే అనారోగ్యాలే.*

  *ఈ రోజు మనిషి తన తప్పుడు ఆలోచనలతో తనను తాను కాల్చుకుని తనను తాను నాశనం చేసుకుంటున్నాడు.*

  *5 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వయస్సు ఉన్న రోగులు పాజిటివ్ నుండి కరోనా ప్రతికూలంగా ఉన్నారు.*

  *గణాంకాలపైకి వెళ్లవద్దు ఎందుకంటే సగానికి పైగా ప్రజలు బాగానే ఉన్నారు, మరియు మరణాలు కరోనా వ్యాధి వల్ల మాత్రమే కాదు, వారికి ఇతర అనారోగ్యాలు ఉన్నాయి, కాబట్టి వారు భరించలేక మరణించారు.*

  *కరోనా చేత ఇంట్లో ఎవరూ చనిపోలేదని గుర్తుంచుకోండి, రోగులందరూ ఎక్కువగా ఆసుపత్రులలోనే మరణించారు. ఆసుపత్రిలో వాతావరణం మరియు మనస్సులో భయం ఉండటమే కారణం.*

  *ఎల్లప్పుడూ మీ ఆలోచనలను సానుకూలంగా (Positive గా) ఉంచండి, సంతోషంగా ఉండండి.*

  *కరోనా వ్యాధి అనేది దగ్గు, జలుబు కంటే పెద్ద వ్యాధి కాదు.*

పెళ్లి తప్పేట్టు లేదు...పెదబాబుకి



‘కరోనా వెళ్ళేదాకా కాస్త ఆగరా’  అంటే “ఇది జీవితాంతం ఉండే వైరసు! అంటే లైఫులో నాకు పెళ్లి చెయ్యరా?” తిక్క రేగింది వాడికి.

 “సరే తగలడు.  ఎవరెవర్ని పిలవాలో లిస్టు తయారు చెయ్యండి. ఇరవై మందికే పర్మిషనట!” అన్నాడు పెద్దాయన.  
 🥵🥵

“ఇదిగో చెల్లి పెళ్ళప్పటి  లిస్టు. ఇందులో  ఏడువందల ఎనభై రెండు పేర్లున్నాయి  మరి!” 

“చచ్చేం! పేర్లన్నీ కొట్టెయ్యండి. దయాదాక్షిణ్యాలు లేవు, బంధుత్వాబంధుత్వాలు లేవు, ప్రతిష్టా అప్రదిష్ఠలు లేవు!” అన్నాడు పెద్దాయన ఆవేశంగా.🥵

అలాగే  కొట్టేసుకుంటూ పోతే పంతొమ్మిది  మంది తేలేరు.  “ ఇంతకుమించి  చచ్చినా  తగ్గరు!” 

 “గుడ్. పెళ్లి కూతురు ఒక్కత్తినీ పంపించమని వియ్యంకుడికి ఫోన్ కొడదాం. దాంతో ఇరవై మంది అవుతారు.” 

 “బావుంది సంబడం! పెళ్ళికూతురొక్కత్తినీ పంపిస్తే మరి ఎవరి బాబొచ్చి చేస్తాడండీ కన్యాదానం?” వియ్యంకుడు ఎగిరి పడ్డాడు.  🥵

“అవును కదా, సరే మీ మొగుడూ పెళ్లాలిద్దరూ కూడా రండి, ఆవార మేం ఇద్దరిని తగ్గించుకుంటాం మా లిస్టులో! 

ఇంతకీ  పురోహితుణ్ణి మీరు తెస్తున్నారుగా?”    

“లేదు లేదు మీరే తేవాలి.”  “అయినా  ‘మాంగల్యం తంతునా నేనా’ మనకందరికీ నోటి కొచ్చిందే కదా. అది చదివేసి  పుస్తి కట్టించేస్తే పోలా? సుమతీ శతకం చదివేసి  మావాడొకడు పెళ్లిళ్లు చేయించేస్తున్నాడు. వాళ్ళంతా  పిల్లాపాపలతో సుఖంగా కాపరాలు చేసుకుంటున్నారు!”

 “ఓకే. మరి భజంత్రీలో?”  “భజంత్రీలు??  బహువచనం కూడానా?  ‘భజంత్రీ’.. అనండి.🤔

 ఒకాయనే వస్తాడు.  ఆయనే నోటితో తూతూబాకా వాయిస్తూ  రెండు చేతుల్తో డోలు వాయిస్తాడు!”
🤔

 “అన్నట్టు  వీడియో వాళ్ళు నలుగురొస్తారట.” గుర్తు చేసాడు పెదబాబు.  

“ చాల్చాలు. వొడిలిపోయి, వాడిపోయిన మన మొహాలకు వీడియోలు కూడానా?   చినబాబు  వాడి కెమెరాతో ఫుటోలు తీస్తాడు చాలు..”   🤔

“మరిచిపోయా బావగారూ. వాళ్ళక్క పెళ్ళిలో జడ తనే పైకెత్తి పట్టుకోవాలని మా చంటిది   ఎప్పట్నుంచో రిహార్సల్సు వేసుకుంటోంది. దాన్ని రావద్దంటే చంపేస్తుంది. 🤔

ఇంకో విషయం. 

పెళ్ళికూతురికి  చీర కట్టుకోడం రాదు. దానివన్నీ  చుడీదార్లే కదా. చీర కట్టడానికి, పీటల మీద  అది జారిపోకుండా చూసుకోడానికీ   మా మరదలు దగ్గరుండాల్సిందే. 

అలాగే పెట్టి దగ్గర కూర్చుని సామాను అందించడానికి, పిల్లని బుట్టలో తేవడానికి ముగ్గురు బావమరుదులు   తప్పదు!” అన్నాడు వియ్యంకుడు. “బుట్ట సిస్టం కాన్సిలండీ. పిల్లని నడిచి రమ్మనండి. పెళ్లి మండపం దూరవేం  కాదు.”

 “అంటే మరో తొమ్మిది మందిని కొట్టెయ్యాలి మా లిస్టులో!  బావుంది. ఇలా మీరు  పదహారు అక్షౌణీల సైన్యాన్ని యుద్ధానికి తెచ్చినట్టు తెస్తే మేం ఏమైపోవాలి?  మా వాళ్ళని ఎంతమందిని తెగ్గోయాలి? 🧐

మా కొంపలోనే పదిమంది ఉన్నామాయె!”  😲 

“ఎందుకుండరూ? కుటుంబ నియంత్రణాపరేషను చేయించుకోమని అప్పట్లో ఎన్నిసార్లు బతిమాలేరు మా వాళ్ళు! వినిపించుకున్నారా?”🤪 వంటింట్లోంచి పలికిందో  స్త్రీ స్వరం. 
    
  “నాన్నా! మరి  భోజనాలు?”  “ఔన్రోయ్ మరిచిపోయాం.  
కేటరింగ్ వాళ్ళు నలుగురొస్తారట. వాళ్ళని తగ్గిస్తే తిండుండదు ఎవరికీ.  

ఓర్నాయనో! అవతల ఆడ పెళ్ళివాళ్ళు, ఇవతల వీళ్ళు!  ఎవరి పేర్లు కొట్టెయ్యాలిరా?  ఈ పెళ్లి  నా వల్ల కాదు!  గంగలో దూకండి అంతా!” 

పోనీ, ఇరవై కంటే ఎక్కువమందిని తెచ్చుకోడానికి మనిషికి ఇంత చొప్పున పెనాల్టీ కట్టేద్దామా గవర్నమెంటుకి? 
సగం సగం భరిద్దాం మీరూ మేమూ.”  

 “చాల్చాలు. ఇప్పటికే మాస్కులూ, సబ్బులూ, తువ్వాళ్ళూ  అంటూ చాలా పెనాల్టీలు వేశారు మా మీద. ఇక మా వల్ల కాదు.” వియ్యంకుడి జవాబు. 

“నాన్నా,  అరమొహం మాస్కులతో,  వైరస్ భయాలతో, రాని చుట్టాలతో ఈ పెళ్లి ఏం కళ కడుతుంది?  వాయిదా వెయ్యండి. 
ఈలోగా ఆ పిల్లని పంపించమనండి. అందాకా సహజీవనం చేస్తాం!” 

“డొక్క చీరేస్తా వెధవా!   రిజిస్టర్ మ్యారేజ్  చేసుకు తగలడండి! పోండి!”😭😭

కరోనా తపస్సు..(స్కెచ్)

                                                            
   అది కైలాసం.. పరమ శివుడు, ఆదిశక్తి ముచ్చట్లాడుకొంటున్నారు. ప్రకృతిమాత పార్వతీ దేవి భర్తతో అంటోంది.. "భూలోకంలో సమస్యలు చాలా తీవ్రరూపం దాల్చుతున్నాయి." అదేంటి? అడిగాడు పరమ శివుడు." మానవులకు తాగుడు ఎక్కువైపోయింది..పీకల దాకా తాగి ఇష్టానుసారం చెలరేగుతున్నారు.. కుటుంబాలను కాల్చుకు తింటున్నారు..పెళ్లాం పిల్లల్ని రోడ్డున పడేస్తున్నారు.. అదేమంటే చంపేస్తున్నారు.. ఎటు చూసినా..భరించలేని వాయుకాలుష్యం..అమ్మో.. ఈసారి చవితికి గణేశుని భూమికి పంపండం నాకు సుతరామూ ఇష్టం లేదు పెదవి విరిచింది పార్వతి.. అంతేకాదు..  ముంబైలో ఊపిరి ఆడటం లేదు.. ఒకసారి గాలి పీలిస్తే 100 సిగరెట్లు కాల్చినట్టు లెక్క అంటున్నారు నిపుణులు.. ప్రాణవాయువునందించే చెట్లను నరికి పారేస్తున్నారు..  
అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు.. శిశుపాలుడికైనా నూరు తప్పులుసరిపోయాయేమో..  ఈ మానవులు మాత్రం దానికి వంద రెట్లు దాటేశారు.. ఎప్పుడో నా చేతిలో శిక్ష అనుభవిస్తారు.. పార్వతీ మాత కళ్లు ఆగ్రహంతో ఎరుపెక్కాయి.. 
ఆది దంపతులిలా ముచ్చటించుకుంటున్నారో లేదో అంతలోనే భూలోకంలో ప్రళయం వచ్చేసింది..
ముల్లోకాలూ కంపించి పోయాయి.. భూకంపానికి భూమి నెగళ్లు వారింది. అదేంటి? ఎందుకిలా ? దివ్యదృష్టితో చూసింది ప్రకృతిమాత. భూలోకంలో సూక్ష్మాతి సూక్ష్మమైన ఓ వైరస్ ఒంటికాలిపై ఘోర తపస్సు  చేయడం కనిపించింది. 
అంతే ఆదిశక్తి ఇక ఆగలేకపోయింది.. తనను అంతలా శరణు వేడుతున్న ఆ వైరస్ కు వచ్చిన బాధేంటి? అనుకుంటూ కైలాసంలో అంతర్ధానమై సరాసరి వైరస్ ఎదుట ప్రత్యక్షమైంది.
"ఓ అల్ప జీవీ ఎందుకీ తపస్సు ?" అడిగింది మాత..
"ఏమిచెప్పను? మాతా నన్ను  భూమండలంలో బతకనివ్వడం లేదు.. అందరిలాగా నాకూ భూమిపై బతికే హక్కు లేదా? 1977 లో మశూచి  నిర్మూలనా కార్యక్రమం కింద నన్ను భూమినుంచి వెళ్లగొట్టారు. భూమండలంలో నాకు స్తానం లేకుండా చేసారు. నేను అల్పజీవిని బడుగు వర్గానికి చెందిన దానిని... అందరినీ చల్లాగా చూసే జగన్మాతవు.. మాతా నీయేలుబడిలోనే నాకే అన్యాయం జరిగింది " బాధగా మూల్గింది వైరస్.. "నేను విన్నాను నేను వున్నాను . నీవేమీ భయపడకు. నేనసలే బడుగు వర్గ పక్షపాతిని... నీకు వరం ఇస్తా కోరుకో "అంది మాత .."నాకు వరం వద్దు. దానిలో ఎదో ఒక లొసుగుంటుంది. గతంలో బ్రహ్మ హిరణ్యకశిపునికిచ్చిన వరంలో లొసుగువల్లే నరసింహావతారంతో హిరణ్యకశిపుడు చంపబడ్డాడు." అంది వైరస్. భూమండలంపై నాకూ కోపంగానే ఉంది.. అన్ని హంగులూ కల్పించి బతకమని మానవులను వదిలితే.. ప్రకృతి మాతనైన నా నెత్తినే చెయ్యి పెట్టేలా తయారయ్యారు.సుందర ప్రకృతి దృశ్యాలతో రమణీయంగా ఉండాల్సిన భూమండలం సర్వనాశనమైపోయింది.. ఇప్పుడిక తప్పులు దిద్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. అందుకే నేనే నీరూపంలో  ప్రవేశించి సంస్కరిస్తా.. నీలో ప్రవేశించి కరోనా రూపంలో కఠిన శిక్ష వేస్తాను.. ప్రపంచాన్ని సంస్కరిస్తాను ఒకింత ఆవేశంతో అన్నది ఆదిశక్తి..
ధన్యు రాలను తల్లీ.. ఐతే నాకు కొన్ని సందేహాలున్నాయి. భూమండలంలో జనం తెలివి మీరిపోయారు.. హ్యాండ్ వాష్ వాడుతున్నారు.. షేక్ హాండ్స్ మానేశారు.. ముఖానికి మాస్క్ కూడా ధరిస్తున్నారు.. వ్యక్తిగత దూరం పాటిస్తున్నారు..  పదే పదే చేతులు కడిగేసుకుంటున్నారు.. శానిటైజర్లు తెగ వాడేస్తున్నారు.. మూల మూలలా రసాయనాలుస్ర్పే చేసి నా ఉనికన్నది లేకుండా తరిమేస్తున్నారు.. ప్రభుత్వమేమో లాక్ డౌన్ ప్రకటించేసిది. శాస్త్రజ్ఞులు వాక్సిన్లు కనిపెట్టేస్తున్నారు.  ఫార్మసీలు వ్యాక్సిన్, టీకా అంటూ నానా హంగామా చేసేస్తున్నాయి. జనం లైఫ్ స్టైల్ మార్చేశారు.. యోగా అంటూ ఉదయానే వ్యాయామాలు చేసేస్తున్నారు.. మంచి పోషకాహారం తినేస్తున్నారు..నేను ప్రవేశించే అవకాశం లేకుండా అన్ని చర్యలూ తీసేసుకుంటున్నారు. కుటుంబ స్థాయిలో, రాష్ట్రా స్థాయిలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అనేక వ్యూహాలు పన్నేసారు. ఇలాంటి టైమ్ లో మన ప్రయత్నం ఎలా ఫలిస్తుంది తల్లీ.. ? చాలా ఆతృతగా అడిగింది వైరస్. 
అందుకు మాత మందస్మిత ముఖారవిందంలో వైరస్ తో ఇలా అంది.. నిన్ను విశ్వద్విగ్మండల వ్యాపి గానూ, బహుముఖ టెంటకిల్ సంజాత ధారిణిగానూ, 200 దేశంబులం దర్శించి, మొత్తం  కోటిన్నర మంది మనుజుల సోకి లెక్కలేనంత మంది ప్రాణాలు దునిమిన శిక్షాన్వివై మనుజులం  నీదాసానుదాసుండులం, ఏకాకులంజేసి ఏడ్పించెదవు. ఇహ పొతే నా సంస్కరణలు మొదలౌతాయి.అపరిశుభ్రత అడ్రస్ లేకుండా పోతుంది..  వాయుకాలుష్యం  తగ్గి  స్వచ్ఛమైన గాలి అందుతుంది.  మద్య పానం మందగిస్తుంది..  రోడ్లపై ట్రాఫిక్ జాములు తగ్గుతాయి. గృహ నిర్బంధంవల్ల కుటుంబంలో వ్యక్తిగత సంబంధాలు పెరిగి కుటుంబవ్యవస్థ బలపడుతుంది. బయట ఆహరం తినకపోవడం ఇంటిఆహారాన్నే తినడంవల్ల ఆరోగ్యం మెరుగౌతుంది. మార్కెట్లు లేకపోవడంవల్ల అవసరంలేని వస్తువులను కొనకపోవటంవల్ల పొదుపు పెరిగింది. ఐతే నా సంస్కరణలు అమలు చేయడంలో చాలామంది మానవులు అనగా పారిశుధ్య పనివారు, పోలీసువారు, వైద్యులు  ప్రాణాలకు తెగించి కష్ట పడ్డారు..వారికి నా ఆశీస్సులు"అంది ప్రకృతిమాత  . "అవునుమాతా నా విజృంభణా వేగంలో అంతమంచివారిని నేను గుర్తించలేక పోయాను" అంది వైరస్ పశ్చాత్తాప పడుతూ.."అవును నిజమే కొందరు పీపీఈ కిట్లను ధరించినా డాక్టర్లు, కొందరు రాజకీయనాయకులు యంపీలు, యమ ఎల్ ఏలు మంత్రులు, సినీమా స్టార్లూ బలైపోయారు.వారికి మోక్ష ప్రాప్తిని ప్రసాదిస్తున్నాను. ఇక వాక్సినులు మందులు కనిపెట్టేస్తున్నారని బెంగపడకు.. వాళ్లు ఎంత కనిపెట్టినా అవేం పనిచేయవు.ఎందుకంటే నేను నీ  డీఎన్ ఏ నిర్మాణాన్నే మార్చేస్తానుగా.. మానవులలో కొంతమంది మంచివారున్నట్లే కొంతమంది పాపులు, దుర్మార్గులు వుంటారు. అటువంటివారికి ఇమ్యూనిటీ ఉంటే, దానిని నాశనం చేస్తా. ఎట్లాగంటావా? రక్తంలోని న్యూట్రోఫిల్సు,కిల్లర్ డి సెల్స్ నిన్ను చంపేస్తాయి. దీనినే ఇమ్యూనిటీ అంటారు. ఆ న్యూట్రోఫిల్సు కిల్లర్ డి సెల్స్ ని గందరగోళంలోకి నెట్టేసేస్తా. అప్పుడు వైరస్ ఏదో  శరీర కణమేదో గుర్తించలేక శరీర కణాలనే వైరస్ అనుకోని తన శరీర కణాలనే నాశనం చేస్తాయి. అంటే  వాళ్ల వాళ్ల ఇమ్యూనిటీ పవర్ పైనే దాడి చేస్తానన్న మాట.. దీన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు.. ఇది మానవుల వ్యూహానికి ప్రతివ్యూహం. 
ఓయి నా భక్త వైరస్.. భూమండలంలో  నీకు చోటేలేకుండా చేయాలని వారు వ్యూహం పన్నినా అంత సీనుండాదు.. ఇప్పటికే కోటిన్నర మందికి నీ దెబ్బ ఏంటో రుచి చూశారు.. నీస్థానం పటిష్టం అయిపోయింది. భూమిపై నా ప్రకృతి నాశనం అవుతుంటే సదరు ప్రకృతిని సంస్కరించాను." అని వివరంగా చెప్పింది ప్రకృతి మాత..  ఉరఫ్ ఆది పరాశక్తి.. .  
మిత్రులారా దీనర్ధం మాస్కులు ధరించవద్దని , సోషల్ డిస్టెన్స్ పాటించవద్దని..  చేతులు కడుక్కోవద్దనీ కాదు. వీటితోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని దేవానుగ్రహం కూడా పొందండి.    

-- వి.వి. రత్నాకరుడు

⚜️ *:పులి కాపు:*⚜️

 *పుల్లని వస్తువుతో పరిశుద్ధం చేయటం పులికాపు.* వైష్ణవ పరిభాషలో తమిళ భాషలో 'పులిక్కాపు'. దేవతా విగ్రహాలను అప్పుడప్పుడు చింతపండుతో తోమి శుభ్రం చేసి పునరావాహన చేసి ప్రతిష్ఠించి పూజిస్తారు. ఈ దేవకార్యానికి కాలక్రమాన ''దేహశుద్ధి'' అనే అర్థం వచ్చింది. ''ఒళ్ళు కడగటం'' అనే అసలర్థమున్న దేహశుద్ధి లాగానే పులికాపు అనేమాటక్కూడా "తోమటం", "కొట్టడం" అనే అర్థాలు వాడుకలో నిలిచాయి. *మంత్రపూతంగా విగ్రహాలను శుద్ధి చేయటమనే* శాస్త్రార్థం స్థానంలో *చావగొట్టడమనే* అర్థం వాడుకలో నిలిచింది. పులికాపు పెట్టడం అంటే "తన్నటం". వైష్ణవ విద్యార్థుల వాడుకలో ఈ అర్థం బలీయం తప్పు చేసినందుకు ఆచారికి వాళ్ళ నాయన *పులికాపు* పెట్టాడు (తన్నాడు) అనే వాడుక ఉంది.
********************************

హిందువులు- నాగ పూజ

ఇప్పటివరకు లభించిన పాము యొక్క అత్యంత ప్రాచీన శిలాజం వయసు 16 కోట్ల సంవత్సరాలు.
బొట్సవానా లోని ఒక గుహలో దొరికిన శాసనం ప్రకారం 70 వేల సంవత్సరాల క్రితం హిందువులు పాములను పూజించేవారు.
రష్యా లో ఒక చెక్క మీద చెక్కిన నాగ దేవత విగ్రహం దొరికింది. ఆ విగ్రహం వయసు 11 వేల సంవత్సరాలు.
హిందువుల ప్రాచీన గ్రంధం మహాభారతం లో కూడా పాములను పూజించడం గురించి ఉంది.

మేము హిందువులం. మేము ప్రకృతిని పూజిస్తాం. మేము జగత్తును పూజిస్తాం. ప్రకృతి ఎంత సహజమైనదో ప్రకృతిలో ఉన్న సకల చరాచరాన్ని పూజించే హిందువుల అలవాటు కూడా అంతే సహజమైనది. మా జీవన విధానం వెనుక ఒక శాస్త్రీయమైన అర్ధముంది. మతం మార్చే, మతం మారే అల్పులకు, హేతువాదమంటూ నీచం మాట్లాడే నీచులకు హిందుత్వాన్ని అర్ధం చేసుకునే శక్తి లేదు, చెప్పినా వినే ఆసక్తి అంతకంటే లేదు. ప్రపంచంలోనే అతి పురాతన, ప్రాచీన, శాస్త్రీయ జీవన విధానమైన హిందుత్వాన్ని వదిలేసి ఎడారి మతాల వైపు పిచ్చి చూపులు చూసే ప్రతి అజ్ఞానికి నాగపంచమి గురించి అర్థం కాదు

***************************

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - మూడవ అధ్యాయము*

*గజేంద్రుడు భగవంతుని స్తుతించుట - ఆ ప్రభువు అతనిని రక్షించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*3.12 (పండ్రెండవ శ్లోకము)*

*నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే|*

*నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ॥6403॥*

ఆ దేవదేవుడు సత్త్వ, రజ, స్తమో గుణముల ధర్మములను స్వీకరించి, క్రమముగా, శాంతస్వరూపుడుగను, ఘోరుడుగను, మూఢుడుగను భాసించును. ఐనను, భేదరహితుడై, సమభావముతో నున్న ఆ జ్ఞానస్వరూపునకు నేను పదేపదే ప్రణమిల్లుచున్నాను.

*3.13 (పదమూడవ శ్లోకము)*

*క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే|*

*పురుషాయాత్మమూలాయ మూలప్రకృతయే నమః॥6404॥*

సర్వమునకు అధ్యక్షుడు, సర్వాధీశ్వరుడు అగు పరమేశ్వరుడే దేహేంద్రియ మనస్సంఘాతములు అన్నింటియందు చైతన్యస్వరూపుడై   సర్వసాక్షిగా వెలుగొందుచున్నాడు. ఆయన తనకు తానే కారణమైనట్టి సర్వకారణుడు. పూర్ణపురుషుడగు ఆ పరమేశ్వరుడు మూలప్రకృతి (మాయాశక్తి) కి అధిష్ఠానమై యున్నాడు. అట్టి పరమప్రభువునకు అనేకానేక నమస్కారములు.

*3.14 (పదునాలుగవ శ్లోకము)*

*సర్వేంద్రియగుణద్రష్ట్రే సర్వప్రత్యయహేతవే|*

*అసతాచ్ఛాయయోక్తాయ సదాభాసాయ తే నమః॥6405॥*

నీవు సకల ప్రాణుల ఇంద్రియములకు, వాటి విషయములకు ద్రష్టవు. సమస్త ప్రాణుల జ్ఞానమునకు నీవే ఆధారము. ఈ విశ్వమునందలి అసద్వస్తువుల నిరాకరణముద్వారా  నీ సత్తాస్వరూపము కనుగొనబడును. సమస్త వస్తువుల సత్తా రూపముల యందు గూడ కేవలము నీవే భాసిల్లుచుందువు. అట్టి నీకు నమస్కారము.

*3.15 (పదునైదవ శ్లోకము)*

*నమో నమస్తేఽఖిలకారణాయ  నిష్కారణాయాద్భుతకారణాయ|*

*సర్వాగమామ్నాయమహార్ణవాయ నమోఽపవర్గాయ పరాయణాయ॥6406॥*

సర్వమునకు మూలకారణమైన నీకు వేరొకకారణము లేదు. మూల కారణము ఐనప్పటికినీ అనగా సర్వము నీ నుండియే ఉద్భవించినా, సర్వము నీ యందు వాస్తవముగా లేదు. అట్టి అద్భుతమగు ఆశ్చర్యమును గొలిపెడి జగత్కారణుడవు నీవు. సమస్త నదీనదములు సముద్రమునందు కలిసిపోయినట్టుగా సకలములైన శాస్త్రములు, వేదములు నీయందే పర్యవసానము నొందుచున్నవి. నీవే మోక్షస్వరూపుడవు. సమస్త సాధకులు పొందెడు సర్వాశ్రయమైనట్టి సర్వోత్తమమైన గతివి నీవే. అట్టి నీకు అనేక నమస్కారములు.

*3.16 (పదునారవ శ్లోకము)*

*గుణారణిచ్ఛన్నచిదూష్మపాయ తత్క్షోభవిస్ఫూర్జితమానసాయ |*

*నైష్కర్మ్యభావేన వివర్జితాగమస్వయంప్రకాశాయ నమస్కరోమి॥6467॥*

నిప్ఫును అరణి (అగ్నికొరకు మధించెడు కొయ్య) దాచిపెట్టినట్లుగా, సత్ప్వము, రజస్సు, తమస్సు అనెడు త్రివిధగుణముల కార్యమగు దేహాదికము, జ్ఞానఘనమగునట్టి ఆత్మను కప్పివేయును. సృష్ట్యాదిలో ఆ త్రివిధగుణములయందు క్షోభను కలిగించి తద్ద్వారా జగద్రూపముగా ప్రకటము కావలెననెడు సంకల్పము భగవానునియందు కలిగెను. సకల కర్మల సంగము లేనివాడైనట్టి నిష్కాములై ఆత్మతత్ప్వమునందు నిష్ఠగా నిలిచియున్నవారై, విధినిషేధముల పరిధిని పూర్తిగా దాటిపోయిన మహాత్ములయందు ఆ భగవానుడు ఆత్మస్వరూపుడుగా సాక్షాత్కరించును. అట్టి భగవానునకు నేను నమస్కరించుచున్నాను.

*3.17 (పదునేడవ శ్లోకము)*

*మాదృక్ ప్రపన్నపశుపాశవిమోక్షణాయ  ముక్తాయ భూరికరుణాయ నమోఽలయాయ|*

*స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీతప్రత్యగ్దృశే  భగవతే బృహతే నమస్తే॥6408॥*

నేను నీ శరణుగోరినవాడను. బంధింపబడిన పశువు యొక్క బంధములను ఛేదించునట్లు నీవు నావంటి శరణాగతుల సంసార బంధములను ఛేదించెడు దయామూర్తివి. నీవు నిత్య ముక్తుడవు. పరమ కరుణామయుడవు. భక్తులకు శుభములను చేకూర్చుటలో నీవు ఎన్నడును ఆలస్యము చేయువు. సకలప్రాణుల హృదయములలో అంశగానుండి, అంతరాత్మ రూపమున వెలుగొందుచుందువు. నీవు షడ్గుణైశ్వర్య సంపన్నుడవు. అనంతుడవు. నీకు నమస్కారములు.

*పోతనామాత్యులవారి పద్యములు*

8-78-సీస పద్యము

భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నా;
హ్వయమును గుణము లెవ్వనికి లేక
జగములఁ గలిగించు సమయించు కొఱకునై;
నిజమాయ నెవ్వఁ డిన్నియునుఁ దాల్చు
నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మ;
కిద్ధరూపికి రూపహీనునకునుఁ
జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినిఁ;
బరమాత్మునకుఁ బరబ్రహ్మమునకు

*8-78. ఆటవెలది*

మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ
గాని శుచికి సత్త్వగమ్యుఁ డగుచు
నిపుణుఁ డైనవాని నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు వందనములు.

*తాత్పర్యము*

భగవంతుడికి పుట్టుక, పాపము, ఆకారం, కర్మలు, నామలు, గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించడానికి, నశింపజేయడానికి తన మాయా ప్రభవంతో ఇవన్నీ ధరిస్తాడు. అతడు పరమేశ్వరుడు, అంతులేని శక్తి కలవాడు, బ్రహ్మ, నిండైన రూపంగలవాడు, ఏ రూపంలేనివాడు, చిత్రమైన ప్రవర్తన కల వాడు, సర్వసాక్షి, ఆత్మప్రకాశమైన వాడు, పరమాత్మ, పరబ్రహ్మ, మాటలకు ఊహలకు అందని వాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిజేర దగినవాడు మరియు నేర్పరులు చేసే ఫలాపేక్షలేని కర్మలను మెచ్చువాడు అయినట్టి ఆ దేవదేవునికి నేను నమస్కారాలు చేస్తాను.

*8-79- సీస పద్యము*

శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి;
నిర్వాణ భర్తకు నిర్విశేషు
నకు; ఘోరునకు గూఢునకు గుణధర్మికి;
సౌమ్యున కధిక విజ్ఞాన మయున
కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహు;
క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రి;
య జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి

*8-79.1-ఆటవెలది*

నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు
నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖిల కారణునకు నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

*తాత్పర్యము*

భగవంతుడు శాంతస్వరూపుడు. పరలోక సౌఖ్యప్రదాత. మోక్షానికి అధిపతి. నిర్విశేషుడు. దుష్టులకు భయంకరుడు. సంసారబద్దులకు అందనివాడు. సర్వ గుణ ధర్మాలు కలవాడు. సరళ స్వభావి. విశేషమైన ఙ్ఞానము కలవాడు. సర్వేంద్రియాల కార్యాలను చూసేవాడు. సమస్తానికి ప్రభువు. బహు క్షేత్రఙ్ఞుడు. దయారసానికి సముద్రం వంటివాడు. సర్వానికి ఆది మూల పురుషుడు. ఆత్మకు ఆధారమైనవాడు. సకల ఇంద్రియాలకు నియామకుడు. దుఃఖాన్ని తొలగించేవాడు. మాయ అనే నీడతో ప్రకాశించే బహు నేర్పరి. మిక్కిలి గొప్పవాడు. సమస్తానికి ఆది బీజం అయినవాడు. తనకి మూల కారణం ఏది లేనివాడు. అట్టి ఆ దేవ దేవునికి నన్ను కాపాడమంటు నమస్కరిస్తున్నాను.

*8-80 కంద పద్యము*

యోగాగ్ని దగ్ధకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము నొం డెఱుఁగక స
ద్యోగ విభాసిత మనముల
బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్.

*తాత్పర్యము*

యోగీంద్రులు యోగం అనే అగ్నితో తమ సర్వ పూర్వ కర్మలను కాల్చివేసి. ఇతరమైనది మరేది తలచకుండ ప్రకాశించే తమ మనసులలో ఆ దేవదేవుని చూస్తు ఉంటారు. అట్టి ఆ మహానుభావుడిని నేను సేవిస్తాను.

*8-81-సీ.సీస పద్యము*

సర్వాగమామ్నాయ జలధికి నపవర్గ;
మయునికి నుత్తమ మందిరునకు
సకలగుణారణిచ్ఛన్న బోధాగ్నికిఁ;
దనయంత రాజిల్లు ధన్యమతికి
గుణలయోద్దీపిత గురు మానసునకు సం;
వర్తితకర్మనిర్వర్తితునకు
దిశ లేని నా బోఁటి పశువుల పాపంబు;
లడఁచువానికి సమస్తాంతరాత్ముఁ

*8-81.1-ఆటవెలది*

డై వెలుంగువాని కచ్ఛిన్నునకు భగ
వంతునకుఁ దనూజ పశు నివేశ
దారసక్తు లయినవారి కందఁగరాని
వాని కాచరింతు వందనములు.

*తాత్పర్యము*

పరమేశ్వరుడు సమస్త ఆగమాలు వేదాలు అనే నదులకు సంగమరూపమైన సముద్రము వంటివాడు. మోక్షస్వరూపుడు. గొప్ప గుణాలకు నిలయమైన వాడు. ఆరణి కొయ్యలలోని అగ్నివలె సుగుణాలలో దాగి ఉండేవాడు. స్వయం ప్రకాశకుడు. గొప్ప మనస్సు కలవాడు. ప్రళయాన్ని సృష్టిని నడిపేవాడు. నాలాంటి ఏ దిక్కులేని జీవుల పాపాలను శమింపజేసేవాడు. సర్వులలోను ఆత్మయై వెలగువాడు. నాశనం లేనివాడు. పూజింప దగినవాడు. భార్యా పుత్రులు ఇల్లు పశువులు వంటి వాటి యందు ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి ప్రభువునకు నమస్కారాలు చేస్తాను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

అనూరాధ మంత్ర లక్షణము

శని నక్షత్రమైన అనూరాధ మంత్ర లక్షణము పరిశీలన చేయగా పుష్యమి శక్తిగా మారినది కాని దాని ధాతు లక్షణం అనూరాధ యున్న కుజగ్రహ అధిపతియైన వృశ్చిక తత్వం వలన మార్పు లక్షణము కలుగును. ఆపై ఉత్తరాభాధ్ర రాణియైన మీన రాశి జలతత్తవం వలన దాని కాంతి లక్షణము మనకు జీవ లక్షణము జల తత్వంగా తెలియును వక దాని కొకటి పంచమస్ధానంగా అనగా 120 డిగ్రీలలో కాంతి మారి లక్షణముగా అవగతమగుచువ్నది. దీనికి మూల తత్వం ఔషధ తత్వ మైన చంద్ర కాంతి కుజ లక్షణము గా మారి జల తత్వంగా జీవజీవకణ  మార్పు జరుగుచున్నది. దీని మంత్ర పరిశీలన. ఋధ్ద్యాస్మ హవ్యైః నమ సోపసద్య. మిత్రం దేవం మిత్ర ధేయం నో అస్తు. అనూరాధాన్ హవిషా వర్ధయంతః. శతం జీవిత శరదః సవీరాః. చిత్రం నక్షత్రం ఉదగాత్ పురస్తాత్. యిచ్చట ఉదగదయం ఆదిత్యో అని మహాసౌరంలో సూర్య శక్తి సప్త వ్యాహృతులలో వక కిరణ మంత్ర లక్షణము ఉదగాదయం ఆదిత్యో. అని కలదు. సమస్తమైన ప్రకెృతికి మూల తత్వం ఉదక  లక్షణము అనగా జల తత్వమై జీవ ఉనికికి చైతన్యమునకు మూలముగా మాత్రమే మార్పు చెంది తెలియుచున్నది. అనూరాధా స యిది వదంతి. అన్న మందిరములో అనూరాధా సత్ యిది యత్ వదంతి. ఆదిత్య కాంతి లక్షణమే సమస్త ఉదయించిన జల లక్షణముగా ఎల్లప్పుడు కలిగియున్నదని మనకు తెలియుచువ్నది
అందుకే వృశ్చిక రాశి అధిపతియైన కుజ భూ సంబంధమైన ధాతు లక్షణముగా మార్పుచెంది క్షేత్ర శక్తి ని కలిగియున్నది అట్టి క్షేత్ర లక్షణము నకు మీన రాశి యందున్న ఉత్తరాభాధ్ర శక్తి జల తత్వం వలన జీవ లక్షణము గమూలసూత్రముగా మనకు తెలియును. ఏతి పథిభిః దేవయానైః హిరణ్యయైః వితతైః అంతరిక్షైః. సత్ యిది సత్ అనే ఎల్లప్పుడు యున్న అనంతమైన ఋధ్ద్యాస్మ ఋక్కు యెుక్క కాంతి ౦ హవిస్సు పూర్ణమని దాని లక్షణం ధాతు పరంగా మారి సస్సవంతమగుటకి జలతత్వమైన మీన తత్వం జీవ లక్షణం. యిది యే శాస్త్రీయ దృక్పథం అనగా సత్ యెుక్క పూర్ణమే సత్యమని తెలియును.మన వేద దార్శనీయత శాస్ర్తీయ మే కాని అభూత కల్పన కాదు. తెలియునంత మాత్రమున కల్పన అనుటకు వీలులేదు. యిలా ప్రతీకిరణ  శక్తి యెుక్క లక్షణము మార్పు చెందుతూ వలన మాత్రమే దాని లక్షణము తెలియుచున్నది. యిట్టి ఙ్ఞానం ఋషి పరంపరగా మనకు వేదం ద్వారా తెలియుచున్నది.
**************************

అహంకరించ వద్దు

అహంకరించ వద్దు. ఎన్ని ఉన్నా ఎప్పుడు ఎవరికీ ఏది అవసరం అవుతుందో  తెలియదు ఈ లోకంలో. 🌹*

*ఒక రోజు జ్ఞాని దగ్గరకు కోటీశ్వరుడు వెళ్లి  స్వామి నా దగ్గర కోటానుకోట్ల  డబ్బు ఉన్నది. పూర్తి ఆరోగ్యవంతుడిని ఇక నేను ఎవరిపైన ఆధారపడవల్సిన  అవసరం లేదు. ఎవరినీ సహాయం చేయమని అర్థించాల్సిన  అవసరము లేదు  అని చాల గొప్పగా చెప్పుకున్నాడు.*

*ఆ మాటలు విన్నాక  జ్ఞాని నవ్వుతూ  బాబు నాతో కాస్త దూరం నడవగలవా  అని అడిగాడు. అయన ఆలా అడగడంతో నిరాకరించడం  బాగుండదని తలచిన ఆ వ్యక్తి జ్ఞానితో  కలిసి అడుగులు వేసాడు.*

*అలా నడుస్తూ నడుస్తూ అలసిపోయిన వ్యక్తి ఏదైనా చెట్టు కనిపిస్తుందా  ఆ  నీడలో కాసేపు సేద తీరాలని చుట్టూ చూసాడు.  ఎక్కడాఏ చెట్టు కనిపించలేదు.   ఇది గమనించిన  జ్ఞాని ఏంటి బాబు వెతుకుతున్నావు అని అడిగాడు. అయ్యా చాల దూరం వచ్చాము  కాసేపు చెట్టు నీడలోకి  వెళదాం అని చెప్పాడు.*

*చెట్టు నీడ నీకెందుకు  బాబు నీ నీడ లో నువ్వు సేద తీర్చుకో  అన్నాడు. నా నీడలో నేను ఎలా అయ్యా అని ఆశ్చర్యంగా  అడిగాడు.*

*నువ్వే కదా బాబు నాదగ్గర అన్ని ఉన్నాయి ఎవరిని ఆశ్రయించాల్సిన  అవసరం లేదు అన్నావు,   చూసావా ఇప్పుడు నీ నీడ సైతం నీకు ఉపయోగపడలేదు  అని చెప్పారు.*

*ఇప్పుడు ఆయనకు నిజంగా జ్ఞానోదయం  అయింది ఏ చెట్టు కిందకు వెళ్లకుండానే.*

*మనపైన మనకు నమ్మకం ఉండాలి అహం ఉండకూడదు. మనపైన మనకు ఆత్మవిశ్వాసం  ఉండాలి ఇతరులపైనా  చులకన భావం రాకూడదు.*
(సత్యనారాయణ చొప్పకట్ల)

అష్టాంగ యోగ

అహంకారాదులను వదిలించుకోవడానికి పాతంజలి యోగ పద్ధతులలో అష్టాంగ యోగమని ఒక ఉపాయమున్నది. 

*అవి యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని ఎనిమిది అంగాలు.* 

*మొదటి ఐదు విషయాసక్తిని నిగ్రహించడానికి, చివరి మూడు భగవంతునికి దగ్గరవడానికిని పనికి వస్తాయి.*

1. యమం : 
యమమనగా ఈ కనిపించే ప్రపంచాన్ని ఈశ్వరమయంగా చూస్తూ అన్ని వస్తువులు ఆయనవేననే భావం కలిగి ఉండి తనది అంటూ దేనిమీద హక్కు లేకుండడం, అవసరమైన వాటిని భగవంతునివిగా భావించి ఇవన్నీ ఆయనవే అని, ఆయనకు నివేదించి తిరిగి భక్తుడి అవసరానికి ప్రసాదించమని ఆయనను వేడుకొనడం చేయాలి. నైవేద్యం, ప్రసాదం అనే వాటి అర్థం అదే. అంతేగాని మన వస్తువులు భగవంతుని కివ్వడమనే భావన సరికాదు.

ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్‌
తేన త్యక్త్యేన భుంజీథా, మాగృథః కస్యస్విద్ధనమ్‌ ||

దీని అర్థం అంతా ఈశ్వరమయమని భావిస్తూ మనకు అవసరమైన వాటిని, ఆయనను అర్థించి అనుభవించు అని.

ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మన తలపులలో, మాటలలో, చేతలలో మన వలన ఎవరికీ కీడు కలుగరాదు. ఇదే అహింస. అబద్ధమాడరాదు. ఇతరుల వస్తువులను, శ్రమను దోచుకొనరాదు. అవినీతి, అక్రమ చర్యలు మానాలి. పరస్త్రీని తల్లివలె భావించాలి. సకల జీవరాసుల యెడల దయ కలిగి ఉండాలి. ఎట్టి దాపరికం లేకుండా నిజాయితీగా ఉండాలి. ఎవరెంత రెచ్చగొట్టినా ఓర్పు నశించక, సత్వ గుణంలోనే ఉండాలి. భేద భావన, శత్రు భావన మనలో ప్రవేశించరాదు. అరిషడ్వర్గాన్ని జయించి స్థైర్యం, ధైర్యం, నిగ్రహం సాధించాలి. మితాహారం, హితాహారం భుజించడం.  జిహ్వ చాపల్యం పనికిరాదు. భక్తి సాధనలో ఏకాగ్రత కుదురుటకు మన లోపల, బయట శుచిగా ఉండాలి.

2. నియమం : 
నియమమనగా నిరంతరం భగవచ్చింతన చేయడం, ప్రాపంచిక విషయాలను ఇష్టంగా చూడక, తప్పదు కదా అని పట్టించుకోవడం. అయ్యప్ప దీక్ష ఉద్దేశ్యం అదే. మనలోని కల్మషాలను తొలగించాలనే దీక్షను చేపట్టాలి. దాని కొరకు కొన్ని సత్కార్యాలు ఆచరించాలి. భాగవతోత్తములను, ఆచార్యులను చేరి సత్సంగం చేయాలి. వారి ఆజ్ఞలను, సూచనలను పాటించాలి. స్వార్థం, అహంకారం మనలో వ్యక్తం కాకుండా చూచుకోవాలి. అదే తపస్సు. ప్రాప్తించిన దానితో సంతోషపడి తృప్తిగా ఉండాలి. ఎంత కష్టపడినా లభించకపోతే, దుఃఖపడరాదు.

భక్తి కోసం, జ్ఞానం కోసం చేసే సాధనలలో భగవంతుడున్నాడని విశ్వాస ముండాలి. ఆయనతో ఐక్యమవడమే లక్ష్యంగా చేసుకోవాలి. చాలామంది భగవంతుడున్నాడని నమ్ముతారు గాని, దైవేచ్ఛ ప్రకారం నడచుకోరు. అందువలన దైవం గురించి వివరమైన దృఢమైన అవగాహన ఉండాలి.

ధన, శ్రమ, అవయవ దానాల వంటి త్యాగబుద్ధి ఉండాలి. ఇందులో ‘‘నేను చేశాను’’ అనే అహంకారం తలెత్తరాదు. అందరిలోనూ భగవంతుడున్నాడనే భావనతో ‘నారాయణసేవ’గా చేయాలి.

భగవంతుని పూజించడం, జప, తప ధ్యానాలన్నీ నియమబద్దంగా, క్రమ శిక్షణతో దీక్షగా చేయాలి. కర్మకాండయందు అంతరార్థ మెరిగి చిత్తశుద్ద్ధితో చేయాలి.

చేయకూడని పనులు చేయరాదు. అట్టి ఆలోచన వచ్చినంతనే సిగ్గుపడి, పశ్చాత్తాపపడి, నిగ్రహించుకోవాలి. సత్యవ్రతం, అహింసా వ్రతం, బ్రహ్మచర్య వ్రతం, అపరిగ్రహ వ్రతం, మౌనవ్రతం వంటివి, ఉపవాసాలు వీలునుబట్టి, వాటి యొక్క అర్థం తెలిసి చేయాలి. ఇవన్నీ మనలను మనం క్రమశిక్షణలో పెట్టు కోవడానికి అవసరమౌతాయి. అంతేగాని ఈ పనులు నేరుగా భగవంతుని వద్దకు చేర్చవు.

3. ఆసనం : 
పూజాది కార్యక్రమాలకు ఒక స్థిరమైన చోటును ఏర్పరచుకొని భక్తి, ఏకాగ్రత కుదిరేటట్లు కదలకుండా కూర్చునే పద్ధతిని ఆసనమంటారు. పద్మాసనం, అర్థ పద్మాసనం, సుఖాసనం ఏది కుదిరితే అదే ఆసనం.

4. ప్రాణాయామం : 
భాగవతులు, గురువులు ఉపదేశించిన మంత్రాన్ని శ్వాసతో అనుసంధానం చేస్తూ జపిస్తే ఏకాగ్రత లభిస్తుంది. దాని వలన మనలో ఉన్న భగవంతుని వద్దకు చేరగలం.

5. ప్రత్యాహారం : 
భగవద్భావాన్ని మనయందు నింపుకొని, అహంకార మమకారాలకు కారణమైన ఇంద్రియ, మనోబుద్ధులను లోనికి ముడుచుకోవాలి. అనగా తాబేలు తన అవయవాలను ముడుచుకొన్నట్లు చేసి, బయటి విషయాలలోకి పోనీయకుండడం.

6. ధారణ : 
భగవంతుని హృదయం నిండా నింపుకోవడమే ధారణ. ఈ ధారణ మధ్య మధ్యలో మనసు విషయాలమీదికి పోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మళ్ళీ ధారణ చేస్తూ ఉంటాం.

7. ధ్యానం : 
ధారణ ఖండ ఖండాలుగా జరుగుతూ, చివరకు అఖండ ధారణ జరిగితే అంతవరకు చేసే ప్రయత్నాన్ని ధ్యానం అంటారు.

8. సమాధి : 
ధ్యానం అఖండ ధారణగా మారినప్పుడు కలిగేది సమాధి. సమాధిలో దైవ సాక్షాత్కారమవుతుంది.

ఈ ఎనిమిదింటిలో యమ నియమాలు పునాది వంటివి. ఆసన, ప్రాణాయామాలు ఉపకరాణాలు. ప్రత్యాహార, ధారణ, ధ్యానాలు సాధనా మార్గాలు. పర్యవసానంగా కలిగే సమాధి ఫలరూపమైన పరాభక్తి అనబడుతుంది.

ఈ విధంగా జ్ఞాన, యోగ పద్ధతులలో కూడా భక్తుడు తనను తాను సంస్కరించుకొని సంసిద్ధుడవవచ్చును. అన్ని మార్గాలు ఉపయోగ పడేవే. ఏదో ఒక పద్ధతిలో యోగ్యత సంపాదించి, భగవదనుగ్రహం పొందే ప్రయత్నం భక్తులే చేసుకోవాలి. అంతేగాని, ఆయనను నిందించడం అవివేకం.

*శ్రీనరసింహ శతకము*

*(38) జందెమింపుగ వేసి సంధ్యవార్చిన నేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు*
*తిరుమణి శ్రీచూర్ణ గురురేఖ లిడినను విష్ణు నొందక కాడు వైష్ణవుండు*
*బూదిని నుదుటను బూసుకొనిన నేమి శంభు నొందక కాడు శైవజనుడు*
*కాషాయవస్త్రాలు గట్టి కప్పిన నేమి యాశపోవక కాడు యతివరుండు*
*ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన గురుని జెందక సన్ముక్తి దొరకబోదు*
*భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*

శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామీ!
నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు.
పాపములను పారద్రోలు వాడవు.
దుష్టులను శిక్షించువాడవు.

తండ్రీ! అందముగ జందెం వేసుకొని, సంధ్య వార్చినా బ్రహ్మమును తెలియని వాడు బ్రాహ్మణుడు కాడు.

తిరుమణి శ్రీచూర్ణములతో పెద్ద నామాలు (గురు రేఖలు) పెట్టుకున్నను విష్ణువును తెలియనివాడు వైష్ణవుడు కాడు.

లలాటమున విభూతి రేఖలను ధరించినా శివుని తెలియనివాడు శైవుడు కాడు.

కాషాయ వస్త్రాలు ధరించినా ఆశలుడగని వాడు సన్యాసి కాడు.

లౌకిక వేషాలు ఎన్ని ధరించినా గురువును ఆశ్రయించని వానికి ముక్తి లేదు.

*శుభంభూయాత్*

*సంస్కృతాంధ్ర సాహితీసౌరభం*

                                                                                                                                                                 *సుభాషితం - సత్యం మాతా పితా జ్ఞానం*                                                                                                                                                                                                                                                                                                                               
*శ్లోకం:*
*सत्यं माता, पिता ज्ञानं, धर्मो भ्राता, दया सखा, ।*
*शान्ति: पत्नी, क्षमा पुत्र:, षडेते मम बान्धवा: ।।*

*శ్లోకం:*                                                                                                                                                     *సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా ।*                                                                                                       *శాంతిః పత్నీ క్షమా పుత్రః షడేతే మమ బాంధవాః ।।*

*ప్రతిపదార్థం:*                                                                                                                                                                                 సత్యం = నిజం పలుకుట, మాతా = తల్లి, పితా = తండ్రి, జ్ఞానం = జ్ఞానము, ధర్మః = ధర్మము, భ్రాతా = సోదరుడు, దయా = భూత దయ కలిగి ఉండడం , సఖా = స్నేహితుడు,                                                                                                      శాంతిః = శాంతి అనగా సంఘర్షణలు లేకుండుట, పత్నీ = భార్య, క్షమా = క్షమించే గుణం, పుత్రః = కొడుకు,  ఏతే = ఈ, షట్ = ఆరు, మమ = నా యొక్క, బాంధవాః = బంధువులు,
*Meaning:*
If one considers the following “Truth” as mother, “Knowledge” as father, “Dharma: as brother, “Mercifulness” as friend, and “Calmness (peacefulness) as friend and “Forgiveness” as son, meaning these six qualities only are treated as kith and kin, the life of an individual will be on a righteous path. That gives ultimately peace and happiness for life to lead.

*తాత్పర్యం:*
సత్యం తల్లి, జ్ఞానం తండ్రి, ధర్మం సోదరుడు, దయా గుణం స్నేహితుడు, 
శాంతం సహధర్మ చారిణి, క్షమ గుణం కుమారుడు, ఈ ఆరునూ నా ఆత్మీయ బంధువులు. 
జీవనం సుఖముగా సంతోషముగా ఏ రకమైన ఒడుదుడుకులూ లేకుండా సాగిపోవడానికి తద్వారా సమాజము దేశమూ కూడా శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లడానికీ మార్గదర్శకముగా ఈ మంచి గుణాలని తన స్వంత బంధు మిత్రులుగా చేసుకుని జీవనం సాగించాలనియూ ధర్మపథంలో అందరూ పయనించాలనియూ ఈ సుభాషితములో సత్యాన్ని, జ్ఞానాన్ని, పరుల పట్ల దయాగుణాన్ని కలిగి ఉండడాన్ని, శాంత చిత్తముతో మెలగాలనియూ, ఇతరుల తప్పులని క్షమా గుణముతో ఓర్పు కలిగి ఉండాలనియూ, చెపుతూ ఈ ఆరు మంచి లక్షణాలనే నిజమైన స్వంత ఆత్మీయ బంధువులుగా పరిగణించాలనియూ ఉపదేశిస్తున్నది ఈ చక్కటి సుభాషితం.

నిజముగా అందరూ ఈ లక్షణాలని ఈ విధంగా కలిగి ఉంటే ప్రపంచ తీరు ఎల్లప్ప్డుడూ మరొక విధంగా అద్భుతంగా ఉంటుంది. ఇది అసాధ్యం.  వీటిలో కొన్నైనా ఇటువంటి అత్యుత్తమ లక్షణాలని కలిగి ఉండడం ఎంతైనా కావలసిన విషయం. 

కానీ, ఇటువంటి కొన్నిఅత్యుత్తమ లక్షణాలని కలిగి ఉన్నవారిని అక్కడక్కడా చరిత్రలో మనం చూస్తూ ఉంటాం.

జ్ఞాపకం





*గడచిపోయే కాలం అంతా జ్ఞాపకమే. స్మృతి శకలమే. జ్ఞాపకాలని పలవరించని వారు ఉండరు. సశైవం, బాల్యం, కౌమారం, యవ్వనం, నడిప్రాయం, వృధాప్యం...ఇలా ప్రతీ దశ జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. మనుషులు వెళ్లిపోయినా వారి జ్ఞాపకాలు నిలిచిపోతాయి. అందుకే మనిషికి నిష్క్రమణ లేదు. వెళ్లిపోయినవాళ్ళు ఇతరుల జ్ఞాపకాల్లో జీవిస్తారు. రోడ్డు మలుము తిరిగిన ప్రతిసారి ఆ మూలమీద నిల్చున్న దృశ్యం మనసులో రూపుగడుతుంది. గడప ముందు నిలబడ్డ చిత్తరువు పదిలంగా ఉండిపోతుంది. ఒక పాట, ఒక మాట, ఒక దృశ్యం జ్ఞాపకాలని సజీవంగా నిలుపుతాయి. బుద్ధుడు, క్రీస్తు, అది శంకరుడు, మొహమ్మద్ ప్రవక్త, మర్క్స్ వంటి మహానుభావులకు మరణం లేదు. శతాబ్దాలు గడిచినా వారి ఆలోచనలు, భావాలు, బోధనలు మనల్ని ఉత్తేజితులను చేస్తూనే ఉన్నాయి. ఈ విధంగా ప్రతీ మనిషి మరొకరి జ్ఞాపకాల్లో సజీవంగా నిలిచే అవకాశం ఉంది. మనసులో, మాటలో, చేతలో అంతరం లేకుండా జీవించిన  మనిషికి మృత్యువు ఉండదు. ఏ ఆనవాలు లేకుండా అదృశ్యమవరు. నలుగురి నెత్తి కొట్టయినా బతకాలనుకునే వారిని లోకం సులువుగా మరచిపోతుంది. కుటుంబ సభ్యులు మరచిపోతారు. లోకంలో పదుగురికి మేలు చేసే జీవనరీతిని అలవాటు చేసుకున్న వారి జ్ఞాపకాలు పరిమళిస్తాయి. వారి మృతి తేజస్సును అందిస్తుంది. అందుకే జ్ఞాపకాలు ఎంతో పదిలమైనవి. వాటిని కాపాడుకోవడానికి మనుషులు అహరహం శ్రమిస్తారు. కళలు, సాహిత్యం, సమస్త సృజనాత్మక రూపాలు ఇందులో భాగంగానే ఆవిష్కృతమయ్యాయి. జ్ఞాపకాలకి ధన్యతని చేకూరుస్తున్నాయి.*

*సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి....26.07.2020...ఆదివారం....🙏

రామాయణమ్. 11

ఈ లోకములో ఏ ఏ అస్త్రములు అయితే వున్నవో అవి అన్నియు విశ్వామిత్రుని వద్ద ఉన్నవి .
.
అస్త్రములు అన్నీ కూడా భృశాస్వుని పుత్రులు .
భృశాస్వుడు ఒక ప్రజాపతి ,ఆయన దక్షప్రజాపతి కూతుళ్ళు జయ,సుప్రభలను వివాహమాడి కన్న సంతానమే అస్త్రములు!
వీటిని విశ్వామిత్రుడు పొందుతాడు!
.
అంతేకాదు విశ్వామిత్ర మహర్షికి గల అస్త్ర పరిజ్ఞానము అపారము (guided missiles).
ఈయన క్రొత్త అస్త్రములు ఎన్నింటినో పుట్టించగలడుకూడా  ! .
.
(శస్త్రము అంటే మామూలుగా గాయం చేసేది!
 అస్త్రము అంటే మంత్రపూర్వకముగా ప్రయోగించేది! .
bullet కు intercontinental ballistic missile కు ఉన్నంత తేడా అన్నమాట).
.
ఓ దశరధమహారాజా, విశ్వామిత్ర మహర్షి అమిత మేధోసంపన్నుడు! అతులిత పరాక్రమవంతుడు! ,ఆయన తన యాగసంరక్షణము తానే చేసుకోగల సర్వసమర్ధుడు! .
.
ఆయన అడుగుతున్నాడు నీ రాముడి ని పంపమని!
ఆయనవెంట వెళితే రామునకు మేలుకలుగుతుంది! మహర్షి ఉద్దేశ్యము అదే ! రాముడెవరో సంపూర్ణముగా తెలిసిన మహాజ్ఞాని ఆయన!
.
నీవు మనసులోని భయసందేహాలన్నింటినీ తొలగించుకొని రామచంద్రుని ఆయనవెంట పంపు సకల శుభాలు ఒనగూరుతవి!.
.
కులగురువు మాటలు విని దశరధుడి శరీరం ఉప్పొంగింది!
రాముని మహర్షివెంట పంపటానికి సంతోషంగాఒప్పుకొన్నాడు!.
.
స్వయముగా వెళ్ళి రామలక్ష్మణులను తీసుకొని వచ్చి ఒక్కసారి తన ప్రియపుత్రుని శిరస్సుముద్దిడుకొని ,మహర్షి చేతిలో పెట్టాడు !  .
.
మూపున విల్లమ్ములు ధరించి రాముడు,లక్ష్మణుడు మహర్షిని అనుసరించారు .
.
బ్రహ్మదేవుడు ముందువెడుతుండగా వెనుక ఇద్దరు అశ్వనీదేవతలనుసరించినట్లుగా కనపడుతున్నారు వారివురూ చూపరులకు!.
.
బాటలు నడిచారు,పేటలు గడిచారు నడుస్తూనే ఉన్నారు మహర్షి వెనుదిరిగి చూడలేదు.
ఆ విధంగా మొదటిసారి నగరువిడచి దుర్గమారణ్యాలలో కాలుమోపాడు కోదండపాణి సోదరసమేతుడై!.
.
అలా చాలా దూరం నడచిన తరువాత తనలోని ప్రేమంతా మాటరూపంలో బయలుపడేటట్లుగా "రామా" అని అత్యంత మధురంగా పిలిచాడు మహర్షి! .
.
అప్పటిదాకా ఆయన వెనుదిరిగిచూడలేదు, చూస్తే రాముని మధురమోహనరూపం కట్టిపడేస్తుంది, ముందుకు సాగనీయదు అనే భయం వల్లనేమో బహుశా!
.
సరయూనదీ దక్షిణతీరం చేరారు ! ఆ నది ఒడ్డున కాసేపు ఆగి నాయనలారా ఆచమనం చేయండి ! మీకు కొన్ని మంత్రములను ,"బల,""అతిబల "అను విద్యలను ఉపదేశిస్తాను! స్వీకరించండి!
.
ఈ విద్యలెటువంటివి అంటే! ఇవి తెలుసుకొన్న తరువాత నీకు శ్రమగానీ,జ్వరముగానీ,రూపములో మార్పుగానీ సంభవించదు!
నీవు నిద్రపోయినప్పుడుగానీ ,ఏమరపాటుగా ఉన్నప్పటికీ కూడా రాక్షసులు నిన్నేమీ చేయజాలరు!
.
రామా !బాహుబలములో నీతో సమానుడు
మూడులోకములలో ఎవడునూ లేడు ఇకముందు ఉండడు!
రామా! సౌందర్యము,సామర్ధ్యము, జ్ఞానము బుద్ధినైశిత్యములలో నీతో సరిసమానుడు ఈ లోకములో ఉండడు!.
.
ఈ విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలు!
.
అంత శ్రీరాముడు శుచియై,శుద్ధాంతరంగుడై,ఆ మహర్షి నుండి విద్యలను ఆనందంగా స్వీకరించాడు!
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

#సెక్యులర్_విదానాలు

ఇతరదేశాల్లో #సెక్యులర్_విదానాలకు , మన దేశంలోని #దరిద్ర_సెక్యులర్_విధానాలకు తేడాలు .

#మొత్తంవ్యాసాన్ని ఓపికతో #తప్పక_చదవండి . 

#సెక్యులర్‌ వ్యవస్థలో అన్ని మతాలనూ సమానంగా చూసే తీరాలా ?
ఒక మతానికి ప్రత్యేక గౌరవస్థానం ఇచ్చి మిగతా మతాలను ద్వితీయ స్థానంలో చూస్తేతప్పా ?

#తప్పేమీ_లేదు !!!సెక్యులర్‌ రాజ్యం ఇలాగే ఉండాలి ,అందులో మతాల ప్రమేయం లేక ప్రాముఖ్యం ఈరకంగానే ఉండి తీరాలన్న నిబంధన ఎక్కడాలేదు . సెక్యులర్‌ దేశాల్లో మతాల హెచ్చుతగ్గులు ఉన్న దృష్టాంతాలు ,ఉదాహరణలు కావలసినన్ని వున్నాయి .

1)‘ది చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌’ ఇంగ్లాండులో ఆధికారమతం .దానికి సంబంధించిన ఇద్దరు ఆర్చిబిషప్పులకు 24 గురు సీనియర్‌ బిషప్పులకు బ్రిటిషు పార్లమెంటు ఎగువ సభ అయిన 
House of Lords లో ప్రత్యేక స్థానాలు కేటాయించబడ్డాయి .Lords Spiritual అని పిలవబడే వీరు చట్టసభ డిబేట్లలో పాల్గొంటారు .

యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యుకె) లో ఇంగ్లాండుతో బాటు ఉత్తరఐర్లండ్‌ ,వేల్స్‌ , స్కాట్లండ్‌లు కూడా చేరి ఉన్నాయి . అక్కడ వేరే చర్చిలది ప్రాబల్యం . అయినా సరే ‘ది చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌’కు చెందిన ఈ 26 మంది Lords Spiritual లు మొత్తం యునైటెడ్‌ కింగ్‌డమ్‌కి సంబంధించిన తీర్మానాల మీద ఓటు చేయగలరు .సభ కొలువుదీరగానే ఈ 26 మందిలో ఒకరు ప్రార్థనను నిర్వహిస్తారు .

బ్రిటన్‌ రాజు లేక రాణి పట్టాభిషేకాన్ని ఆర్చిబిషప్‌ (Archbishop of Canterbury) వెస్‌మినిస్టర్‌ అబ్బీ (abbey) లో జరిపిస్తారు .దేవుడి శాసనాల ప్రకారం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ప్రాటెస్టంట్‌ మతాన్ని నిలబెడతానని ,చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌నూ , దాని సిద్ధాంతాన్నీ ,పూజా విధానాన్నీ , క్రమశిక్షణను ,చర్చ్‌ పరిపాలనను పరిరక్షిస్తానని ఆ సందర్భంలో ప్రమాణం చేయిస్తారు .

కానీ #మనదేశంలో ?????

2)అర్జంటీనా సెక్యులర్‌ దేశమే .అక్కడ అధికారిక మతమంటూ ఏదీలేదు .
కాని ఆదేశ రాజ్యాంగం సెక్షన్‌ 2 ప్రకారం ‘ఫెడరల్‌ గవర్నమెంటు రోమన్‌ కాథలిక్‌ అపోస్తలిక్‌ మతాన్ని సపోర్టు చేస్తుంది’.

కానీ మనదేశంలో ?????

3)‘మలేసియా అధికారిక మతం ఇస్లాం . కాని ఇతర మతాలను కూడా పౌరులు అనుసరించవచ్చు’అంటుంది మలేసియా రాజ్యాంగం .

కానీ మనదేశంలో ?????

4)The Republic of Srilanka shall give to Buddhism the foremost place, and accordingly it shall be the duty of the State to Protect and foster the “Budda Shasana”(శ్రీలంక రిపబ్లిక్‌ బౌద్ధ మతానికి ప్రప్రథమస్థానం ఇస్తుంది.‘బుద్ధ శాసనా’న్ని రక్షించటం ,పోషించటం రాజ్య బాధ్యత) అని చాటుతుంది శ్రీలంక రాజ్యాంగం .

కానీ మనదేశంలో ?????

5)‘థాయ్‌ ప్రజల్లో అత్యధికులు అనుసరించే బౌద్ధ మతాన్ని సంరక్షించి , ప్రోత్సహించటం ప్రభుత్వ కర్తవ్యం’ అని థాయ్‌లాండ్‌ రాజ్యాంగం స్పష్టం చేస్తుంది .

కానీ మనదేశంలో ?????

6)రుమేనియాలో మత స్వాతంత్య్రం ఉంది .కాని ‘ఆర్థోడాక్స్‌ చర్చి’కి ప్రభుత్వ బడ్జెటు నుంచి నిధులు కేటాయిస్తారు . జార్జియా రాజ్యాంగం మత స్వాతంత్య్రానికి గ్యారంటీ ఇస్తుంది . కాని‘జార్జియన్‌ ఆర్థోడాక్స్‌ చర్చి’కి ప్రత్యేక ప్రతిపత్తినిస్తుంది .

కానీ మనదేశంలో ?????

7)ఫిన్లాండ్‌ తాను సెక్యులర్‌ అంటుంది . కాని అక్కడి "ఎవాంజలికల్‌ లూథరన్‌ చర్చ్‌","ఫిన్నిష్‌ అర్థోడాక్స్‌ చర్చిలకు" చర్చ్‌ టాక్స్‌ను రాబట్టే అధికారం ఉంది .
ఆ దేశంలో వ్యాపార సంస్థలు కూడా చర్చ్‌కి పన్ను చెల్లిస్తాయి .ఆయా చర్చ్‌లలో సభ్యులైన పౌరులనుంచి వ్యక్తిగతంగా వసూలు చేసే పన్నుగాక , ప్రైవేటు కంపెనీల నుంచి రాబట్టే సొమ్మును ప్రభుత్వం రెండు ఆధికారిక చర్చ్‌లకూ పంచుతుంది .

కానీ మనదేశంలో ?????

8)అదేవిధంగా ఆస్ట్రియా ,డెన్మార్క్‌ , జర్మనీ ,ఐస్‌లాండ్‌ ,ఇటలీ ,స్వీడన్‌ , స్విట్జర్లండ్‌ వంటి దేశాల్లోనూ చర్చ్‌టాక్స్‌ వసూలు చేస్తున్నారు .

కానీ మనదేశంలో ?????

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి .ఈ ఉదాహరణలను బట్టి అర్థమయ్యేదేమిటంటే ......
అఫీషియల్‌ మతం అంటూ దేన్నీ పేర్కొనకపోయినా ,కొన్ని మతాలకు ప్రత్యేక గుర్తింపు ,ప్రత్యేక హక్కులు ఇచ్చి పెద్దపీట వేయటం ప్రపంచంలో చాలా దేశాల్లో రివాజు .

మరి పైన పేర్కొనబడిన దేశాలలో సెక్యులరిజానికి ,మన సంకర సెక్యులరిజానికీ తేడా ఎక్కడ ?

ఇంగ్లాండ్‌లో చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ అయినా ,అర్జంటీనాలో రోమన్‌ కాథలిక్‌ అయినా ,రుమేనియా జార్జియాల్లో ఆర్థోడాక్స్‌ చర్చ్‌ అయినా , డెన్మార్క్‌ ,జర్మనీ ,ఇటలీ ,స్వీడన్‌ ,తదితర ఐరోపా దేశాల్లో వేరువేరు చర్చిలు అయినా ,

శ్రీలంక ,థాయ్‌లాండ్‌లో బౌద్ధం అయినా ఆయా దేశాల్లో మెజారిటీ ప్రజలకు విశ్వాసం ఉన్న మతాలు
""దేశప్రజల్లో అత్యధిక సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహించే మతాలకు రాజకీయంగా ,ప్రభుత్వపరంగా ప్రాధాన్యం ఇవ్వటం సమంజసమే , ప్రజాస్వామ్యబద్ధమే .

ఆచరణలో లోకమంతటా అనుసరిస్తున్న ఈ సాధారణ సూత్రాన్ని భారతదేశంలో లోనూ మన్నించదలిస్తే ఈ దేశంలో నూటికి 80 మంది అనుసరించే హిందూ ధర్మానికి గౌరవస్థానం ,అగ్రస్థానం ఇవ్వాలి .దాని ప్రయోజనాల రక్షణకు , అభివృద్ధికి ప్రభుత్వమే ప్రత్యేకశ్రద్ధ చూపాలి .

కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి , మనం చూస్తున్నది ఏమిటి ,
మనం చేసిందేమిటి ?

‘ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది ఇంకోదారి’ అన్నట్టు ప్రపంచంలో మన రూటేవేరు .
20 శాతానికి ప్రాతినిధ్యం వహించే మైనారిటీ మతాలను నెత్తిన పెట్టుకుంటాం .ప్రత్యేక హక్కులు ,
ప్రత్యేక సౌకర్యాలు ఉదారంగా సమకూరుస్తాం! .ప్రజల్లో నూటికి 80 మందికి విశ్వాసం ఉన్న అతిప్రధాన ,
అతిపెద్ద ధర్మాన్ని మాత్రం కాళ్లకింద తొక్కేస్తాం .మిగతా ప్రపంచ దేశాలు ప్రధాన మతానికి ప్రత్యేక గౌరవం ఇస్తూ అనుకూల వివక్ష చూపుతూంటే మనం మాత్రం ప్రధాన మతాన్ని ప్రత్యేక అగౌరవం చేస్తూ ,శాయశక్తులా సతాయిస్తూ ప్రతికూల వివక్షను కనపరుస్తున్నాం .

ఈ విచిత్ర మనస్తత్వం మనకు ఎవరి నుంచి సంక్రమించింది ?ఈవికృత ,వంకర అవ్యవస్థ ఎలా వచ్చిపడింది ?
దీనికి కారణం ఎవరు ?
పైకి సెక్యులరిజం కొంగజపం చేస్తూనే కరకు మతతత్వాన్ని పెంచిపోషించి , జాతి మూలాలను వేటువేసే ,చేటుచేసే , ధర్మ వినాశకర ,నికృష్ఠ రాజకీయ సంస్కృతి ప్రాచీన భరతభూమికి ఎలా దాపురించింది ?

దీన్ని అర్థం చేసుకోవాలంటే మొదట సెక్యులరిజం అనేది ఏ పరిస్థితుల్లో ఎలా పుట్టిందన్నది గమనించాలి .అసలు భావన ఏమిటో తెలిస్తేగానీ దానిని మన మహానుభావులు ఎలా భ్రష్ఠు పట్టించారన్నది తేటపడదు .

క్రీస్తుశకం 4వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకూ ఐరోపా దేశాలలో క్రిస్టియన్‌ చర్చికీ ,రాజ్య వ్యవస్థకూ నడుమ గట్టిబంధం ఉండేది .
ప్రతి దేశంలోనూ క్రైస్తవానికి శాఖ అయిన ఏదో ఒక చర్చితో అక్కడి ప్రభుత్వానికి లంకె ఉండేది .ప్రభుత్వం అనేది చర్చి యొక్క సెక్యులర్‌ అంగంగా వర్ణించబడేది .రోమన్‌ సామ్రాజ్యం అనేది ఆవిర్భవించింది మొదలుకొని చర్చి ఆధిపత్యం కొత్తకొత్త రాజ్యాలకు విస్తరించడానికి ప్రభుత్వాలు తోడ్పడేవి . సామ్రాజ్యవిస్తరణ కాంక్షతో ప్రభువులు చేసే దుర్మార్గపు దండయాత్రలకూ , జయించిన కొత్త ప్రాంతాల్లో విచ్చలవిడి దోపిడీలకూ ,రాక్షస కృత్యాలకూ చర్చి వత్తాసునిచ్చేది .దానికి ప్రతిఫలంగా సమాజంలో చర్చిని ధిక్కరించే పౌరులను పరమకిరాతంగా పీడించి ,చిత్రవధ చేసే పుణ్యకార్యాన్ని ప్రభుత్వాలు చేసిపెట్టేవి . 

వందేళ్ల యుద్ధాలు ,రెండొందలు ఏళ్ల యుద్ధాలు అంటూ ‘ఏకైక సత్యమతాన్ని’ వ్యాప్తి చేసే నెపంతో మతం ,రాజ్యం కుమ్మక్కయి యూరప్‌లో ఎన్ని ఘాతుకాలు చేశాయో ,సామూహిక జన సంహారాలకు ఎలా పాల్పడ్డాయో , అవిశ్వాసులు ,మంత్రగత్తెలు , విగ్రహారాధకులు ,అన్న నెపంతో ,అభియోగాలతో ఎన్ని లక్షలమందిని సజీవంగా తగలబెట్టి , దారుణంగా పొట్టన పెట్టుకున్నారో నెత్తురు ఏరులుగా పారిన ఐరోపా అంధయుగ అంధకార చరిత్ర చెబుతుంది ,నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది .

పౌరుల ప్రాపంచిక జీవితాన్ని పర్యవేక్షించి ,కంట్రోలు చేయడం మాత్రమే కాదు! పైలోకంలో వారికి ముక్తిని కలిగించటమూ ప్రభుత్వ బాధ్యతేనట!ఆ ముక్తికి కీలకమేమో చర్చి చేతుల్లో ఉంటుంది .ఎప్పటికప్పుడు చర్చి ప్రకటించే ప్రవర్తన నియమాలను ఎవరైనా ఉల్లంఘించినా ,ఎదురు తిరిగినా వారిని వెలివేసి ,స్వర్గలోకపు గేట్లను వారికి చర్చ్‌ మూసేస్తుంది .
ఆ తరువాత వారిని సజీవదహనం చెయ్యటమా ,చిత్రహింసలు పెట్టి ఖైదు చేయటమా ,చిత్రవధ చేయటమూ అనేది రాజ్యవ్యవస్థ బాధ్యత . అదేవిధంగా క్రీస్తును చంపిన పాపాత్ములు అని చర్చి ముద్రపడిన యూదులను , చర్చి జులుంను అంగీకరించని ఇతర వర్గాలను వేటాడటం ,భయానక అఘాయిత్యాలకు గురిచేయటం ఏలినవారి డ్యూటీ .ఆ ప్రకారం చర్చిసేవ చేసి ,అన్యమతాలను నిర్మూలించడంలో సహాయపడినంత వరకూ రాజులు ఎన్ని మహాపాపాలకు ఒడిగట్టినా చర్చి సమర్థించేది .

క్రైస్తవంలోకి బలవంతంగా మార్చబడని ప్రాంతాలు ,సమూహాలు ఐరోపాలో మిగిలినంతవరకూ చర్చికీ ,రాజ్యానికీ మధ్య అపవిత్ర అనుబంధం ,ఉభయ తారకంగా కొనసాగింది .క్రైస్తవేతరులను ఊచకోత కోయడానికి ,దారుణంగా హింసించి బలవంతంగా క్రైస్తవంలోకి మార్పించడానికి రాజులు కత్తులు దూశారు .నరకలోకపు అగ్నికుండాల నుంచి ‘పాగన్ల’ను రక్షించడానికీ ,వారి ఆత్మలను ఉద్ధరించడానికే అదంతా చేస్తున్నట్టు వారు బుకాయించేవారు . ‘గొప్ప పని చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు’ అని క్రైస్తవ మత గురువులు శ్లాఘించేవారు .
ఇలా రాజరికమూ ,క్రైస్తవమూ చేతులు కలిపి తమ ప్రాబల్యాన్ని ,సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోయే క్రమంలో ఘర్షణలు తలెత్తేవి .విరోధం కన్నా సహకారం శ్రేయస్కరం .కాబట్టి తాత్కాలిక సంక్షోభాలను ఏదో ఒకటి చేసి గట్టెక్కేవారు .

15వ శతాబ్దం చివరికల్లా మొత్తం ఐరోపా క్రైస్తవమయం అయిపోయింది .తమ అధికారాన్ని ,ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చర్చితో అవసరం రాజులకు తీరింది .చర్చి కబంధ హస్తాల నుంచి బయటపడాలన్న ఆరాటం రాజ్యానికి మొదలైంది .16వ శతాబ్దంలో చర్చిపై తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి . క్రిస్టియానిటీ అనేక తెగలు గా చీలిపోయింది .సంస్కరణ పేర చీలిపోయిన తెగలు మరీ దుర్మార్గంగా చెలరేగాయి .

ఒకదేశంలో ప్రభుత్వం ఒక క్రైస్తవ తెగ కొమ్ముగాసి వేరొక తెగను క్రూరంగా అణచివేస్తే ,ఆ వేరొక తెగను ఇంకో రాజ్యం ఆదరించి ,దానికి గిట్టని తెగను వేటాడేది .దాంతో యూరోప్‌ ఖండం అంతటా మతం పేరిట భయానక రక్తపాతం జరిగింది .దేశాల నడుమ మత యుద్ధాలు ముమ్మరమయ్యాయి .

అదృష్టవశాత్తూ ఆ కాలపు యూరోపియన్‌ మేధావులకు , తత్వవేత్తలకు గ్రీస్‌ ,ఇండియా ,చైనా దేశాల ప్రాచీన సంస్కృతులతో పరిచయం కలిగింది .ఆ విశిష్ట నాగరికతలలోని మానవతావాదం , హేతువాదం ,విశ్వజనీన దృక్పథం వారిని గాఢంగా ప్రభావితం చేశాయి . 

క్రిస్టియానిటీలో జడలు కట్టిన మూఢత్వం మీద ,దాని అభివృద్ధి నిరోధక , అశాస్త్రీయ ,అనాగరిక పోకడల మీద బుద్ధిజీవులు తిరగబడ్డారు .
తర్క పరీక్షకు నిలబడే దమ్ములేక , మూఢత్వపు చీకట్లను చీల్చిన జ్ఞాన , విజ్ఞాన వెలుగు పుంజాలకు తాళలేక మహామూర్ఖ ,మహాక్రూర క్రైస్తవం కుప్పకూలింది .18వ శతాబ్దం ఆఖరులో ఫ్రెంచి విప్లవంతో క్రైస్తవ మతాధిపత్య పతనం వేగం పుంజుకుంది .

ఇదీ యూరప్‌ ఖండంలో సెక్యులరిజం ఆవిర్భావానికి నేపథ్యం .19వ శతాబ్దంలో ఐరోపాలోని ప్రతిదేశం చర్చి భల్లూకపు పట్టునుంచి బయటపడింది . పరలోకంలో పౌరుల ఆత్మలకు ముక్తికోసం ప్రభుత్వం పాటుపడాల్సిన పనిలేదు .ఎవరి ముక్తి సంగతి వారు ఆలోచించుకోగలరు .ప్రాపంచిక వ్యవహారాలు సజావుగా నడిచేటట్టు , సమాజపు కట్టుబాట్లు సరిగా ఉండేటట్టు ,ప్రజల అవసరాలు తీరేటట్టు ,శాంతిని ,భద్రతను రాజ్యం కాపాడితే చాలు .రాజ్యవ్యవస్థ మీద మత జోక్యానికి వీలులేదు .ఈ నూతన ఆలోచనాధార ఆసరాతో చర్చి బంధనాలను తెంచుకొని కొత్తరూపు ,కొత్త చూపు సంతరించుకున్న రాజ్యవ్యవస్థకు ‘సెక్యులర్‌ స్టేట్‌’ అని పేరు పెట్టారు .మతం ,రాజ్యం వేరువేరు ,దేని దారి దానిది ,దేని కార్యక్షేత్రం దానిది అన్న నవీన పాశ్చాత్య చింతనకు ‘సెక్యులరిజం’ అనివాడుక .

కానీ మొదటి నుంచి ధర్మ చింతనతో , సద్గుణాలతో ....
#సర్వే_భవంతు_సుఖినః
#సర్వే_సంతు_నిరామయా 
అంటూ ఆచరిస్తూ ,సనాతన జీవనవిధానంలో ఉంటున్న 
మన హిందూ ధర్మానికి #సెక్యులర్_పాఠాలు 
#సెక్యులర్_విధానాలు ఒకరితో చెప్పించుకునే అవసరం లేదు ,ఆచరింప అవసరం లేదు .        

జై_హింద్

ఎం .వి .ఆర్ .శాస్త్రి గారి రచనా సహకారంతో ..........