*సుభాషితం - సత్యం మాతా పితా జ్ఞానం*
*శ్లోకం:*
*सत्यं माता, पिता ज्ञानं, धर्मो भ्राता, दया सखा, ।*
*शान्ति: पत्नी, क्षमा पुत्र:, षडेते मम बान्धवा: ।।*
*శ్లోకం:* *సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా ।* *శాంతిః పత్నీ క్షమా పుత్రః షడేతే మమ బాంధవాః ।।*
*ప్రతిపదార్థం:* సత్యం = నిజం పలుకుట, మాతా = తల్లి, పితా = తండ్రి, జ్ఞానం = జ్ఞానము, ధర్మః = ధర్మము, భ్రాతా = సోదరుడు, దయా = భూత దయ కలిగి ఉండడం , సఖా = స్నేహితుడు, శాంతిః = శాంతి అనగా సంఘర్షణలు లేకుండుట, పత్నీ = భార్య, క్షమా = క్షమించే గుణం, పుత్రః = కొడుకు, ఏతే = ఈ, షట్ = ఆరు, మమ = నా యొక్క, బాంధవాః = బంధువులు,
*Meaning:*
If one considers the following “Truth” as mother, “Knowledge” as father, “Dharma: as brother, “Mercifulness” as friend, and “Calmness (peacefulness) as friend and “Forgiveness” as son, meaning these six qualities only are treated as kith and kin, the life of an individual will be on a righteous path. That gives ultimately peace and happiness for life to lead.
*తాత్పర్యం:*
సత్యం తల్లి, జ్ఞానం తండ్రి, ధర్మం సోదరుడు, దయా గుణం స్నేహితుడు,
శాంతం సహధర్మ చారిణి, క్షమ గుణం కుమారుడు, ఈ ఆరునూ నా ఆత్మీయ బంధువులు.
జీవనం సుఖముగా సంతోషముగా ఏ రకమైన ఒడుదుడుకులూ లేకుండా సాగిపోవడానికి తద్వారా సమాజము దేశమూ కూడా శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లడానికీ మార్గదర్శకముగా ఈ మంచి గుణాలని తన స్వంత బంధు మిత్రులుగా చేసుకుని జీవనం సాగించాలనియూ ధర్మపథంలో అందరూ పయనించాలనియూ ఈ సుభాషితములో సత్యాన్ని, జ్ఞానాన్ని, పరుల పట్ల దయాగుణాన్ని కలిగి ఉండడాన్ని, శాంత చిత్తముతో మెలగాలనియూ, ఇతరుల తప్పులని క్షమా గుణముతో ఓర్పు కలిగి ఉండాలనియూ, చెపుతూ ఈ ఆరు మంచి లక్షణాలనే నిజమైన స్వంత ఆత్మీయ బంధువులుగా పరిగణించాలనియూ ఉపదేశిస్తున్నది ఈ చక్కటి సుభాషితం.
నిజముగా అందరూ ఈ లక్షణాలని ఈ విధంగా కలిగి ఉంటే ప్రపంచ తీరు ఎల్లప్ప్డుడూ మరొక విధంగా అద్భుతంగా ఉంటుంది. ఇది అసాధ్యం. వీటిలో కొన్నైనా ఇటువంటి అత్యుత్తమ లక్షణాలని కలిగి ఉండడం ఎంతైనా కావలసిన విషయం.
కానీ, ఇటువంటి కొన్నిఅత్యుత్తమ లక్షణాలని కలిగి ఉన్నవారిని అక్కడక్కడా చరిత్రలో మనం చూస్తూ ఉంటాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి