25, జనవరి 2026, ఆదివారం

పంచాంగం

 


భీష్మాష్టమి

 🕉️ *రేపు భీష్మాష్టమి* 🕉️


రేపు భీష్మతర్పణ విధి. తల్లిదండ్రులు ఉన్నా సరే తప్పకుండా ఇవ్వాలి.


1) తల్లిదండ్రులు ఉన్నవారు కూడా ఈ తర్పణను ఇవ్వవలెను..

2) తండ్రి లేని వాళ్లు దక్షిణ దిశగా తిరిగి అపసవ్యంగా తిలలతో ఇస్తారు..

3) (జీవ పితరులు) తండ్రి ఉన్నవాళ్లు సవ్యముగా దేవతీర్ధము ద్వారా తూర్పు ముఖముగా యవలతో అక్షతలుతో ఇవ్వవలెను.

4) స్త్రీలు మటుకు తర్పణం ఇవ్వరాదు

5) సర్వులు ఆబాల గోపాలం ఇవ్వవచ్చని ఉన్నది.

6) భీష్మాష్టమి రోజు భీష్మునికి శ్రాద్ధము విధిగా జరిపిస్తే సంతానం లేని వారికి తప్పక సంతతి కలుగుతుంది అని భీష్మ ప్రతిజ్ఞ దేవతల అనుగ్రహం లభిస్తుందని పూర్వం నుంచి చెబుతున్న పెద్దల వాక్కు..

ఈ విధంగా యమ భీష్ములకు తర్పణము చేస్తే తప్పక వారి సంవత్సర ఆ క్షణం వరకు చేసిన పాపములు నశిస్తాయి. అని శాస్త్రవచనము.

సత్సంగం

 *సత్సంగం* 🚩


*సుశీలో మాతృపుణ్యేన, పితృపుణ్యేన బుద్ధిమాన్,* 

*ధార్మికో పూర్వపుణ్యేన, స్వీయపుణ్యేన భాగ్యవాన్* 


*అందరికీ వారి పిల్లలు చక్కగా, నలుగురు మెచ్చుకునేలా ఉండాలనే కోరిక ఉంటుంది. అది సహజం కూడాను.  కానీపిల్లలు బాగుండాలంటే, తల్లితండ్రులు కూడా ఎలా ఉండాలో చెప్తోంది ఈ శ్లోకం.*


*భావం: ఇది ఒక సుభాషితం, అంటే చక్కని సూక్తి. "తల్లి చేసుకున్న పుణ్యం వలన పిల్లలు మంచి శీలవంతులవుతారు. తండ్రి చేసిన పుణ్యం వలన చక్కటి బుద్ధిమంతులవుతారు. గతంలోనూ, గతజన్మల్లోనూ చేసుకున్న పుణ్యం ఫలితంగా ధర్మాత్ములవుతారు. తాను స్వయంగా చేసుకున్న పుణ్యవిశేష ఫలితంగా భాగ్యవంతులవుతారు."*


*పిల్లలు అంటే భావితరానికి వారసులు. వారు సౌశీల్యంతో ఉంటే, భావి సమాజంలో సంస్కృతీ, సంప్రదాయాలు బావుంటాయి. సమాజంలో  గౌరవాదరాలు పొందుతారు.*


*తల్లి పెంపకంలో సౌశీల్యమూ, సహనమూ గురించి తెలుసుకుంటే, తండ్రి పెంపకంలో బుద్ధీ, వివేకం నేర్చుకుంటారు పిల్లలు. ఆ తరువాత తన వివేకం, విచక్షణలతో ధర్మాధర్మ విశ్లేషణ చేసి ధర్మకార్యాలు చేయగలుగుతారు.*


*'ఉత్తమం స్వార్జితం విత్తం' అని ధర్మశాస్త్రం చెప్తోంది కదా, ఆ విధంగా ధర్మార్జన చేసి భాగ్యవంతులవుతారు.*


*కనుక పిల్లలు సౌశీల్యంతో, బుద్ధిమంతులై, ధర్మపరులై, భాగ్యవంతులు కావాలంటే, ముందు తల్లితండ్రులు పుణ్యకార్యాలు చెయ్యాలి, ధార్మిక వర్తన అలవరచుకోవాలి.*


*ఇటువంటి సూక్తులు విని ఆచరిస్తే, వ్యష్టి, సమష్టి జీవితాలు బాగుంటాయి. వ్యష్టి అంటే వ్యక్తిగత, సమష్టి అంటే సామాజిక.*


*కనుక మనం నలుగురూ మెచ్చుకునే మార్గంలో నడుద్దాం, మన పిల్లలనూ అదే మార్గంలో నడిపిద్దాం. భావితరాలకు చక్కని సమాజాన్ని సిద్ధం చేద్దాం.*


*జై భారత్*🚩

ఔషధే చింతయే ద్విష్ణుం

 🙏🏻 ఓం నమో నారాయణాయ నమః 🙏🏻


ఔషధే చింతయే ద్విష్ణుం 

భోజనే చ జనార్ధనమ్ |

శయనే పద్మనాభం చ 

వివాహే చ ప్రజాపతిమ్ ||


యుద్ధే చక్రధరం దేవం 

ప్రవాసే చ ప్రజాపతిమ్ |

నారాయణం తనుత్యాగే 

శ్రీధరం ప్రియసంగమే ||


దుస్స్వస్నే స్మర గోవిందం 

సంకటే మధుసూదనమ్ |

కాననే నారసింహం చ 

పావకే జలశాయినమ్ ||


జలమధ్యే వరాహం చ 

పర్వతే రఘునందనమ్ |

గమనే వామనం చైవ 

సర్వకాలేషు మాధవమ్ ||


షోడశైతాని నామాని 

ప్రాతరుత్థాయ యః పఠేత్ |

సర్వపాప వినిర్ముక్తో 

విష్ణు లోకే మహీయతే ||



ఔషధసేవనం బాచరించెడి వేళ

          వినుతించ వలయును 'విష్ణు' నెపుడు

భోజనమ్మును తాను భుజియించు వేళలో 

          తలచ తగును 'జనార్దను'ని మదిని

శయనించు సమయాన సంతృప్తి తోడను 

          ప్రార్తించ వలయును 'పద్మనాభు'

ప్రార్థించవలె 'ప్రజాపతి' యంచు వినయాన 

          పరిణయ వేళందు భక్తితోడ

సమరంబు నందున 'చక్రధరా' యంచు

          జపియించ వలయును జయము పొంద

పరదేశమున నుండ హరిని 'ప్రజాపతి'

         యనుచు పలుకతగు న్నాత్మ యందు

తనువు నొదులు వేళ తా బల్క వలయును

         'నారాయణా' యంచు నయము గాను

ప్రియసంగమమునందు ప్రియమార స్వామిని 

        'శ్రీధరా' యనుచును చెప్ప తగును

దుస్వప్నముల యందు దుఃఖించకను తాను

       'గోవింద' యని మది కొలువతగును

సంకటసమయాల సద్భక్తి తోడను

        'మధుసూద'ననతగు మదిని నరుడు 

విపినంబునందున వెఱవక మనుజుండు

         కోరి దల్చ తగును 'నారసింహు'

అగ్నిజ్వాలల మధ్య ననయంబు మదియందు 

         'జలశాయి' భజనమ్ము సల్ప తగును

పర్వతంబుల మధ్య 'పట్టాభిరఘురాము'

        నెంచంగ వలయును నెపుడు నరుడు

గమనంబు నందున కల్కంగ నశ్రమ

        భక్తి నెంచ తగును 'వామనుడి'ని

సర్వకాలములందు సర్వేశు "మాధవున్"

        మదిదల్చ వలెనెప్డు మానవుండు

శుభము లిచ్చు "విష్ణు షోడశనామమ్ము "

లుదయ వేళ యందు చదివి తేని

సర్వ పాపరాశి సమసియున్ మనుజుండు 

విష్ణునెలవు చేరు విమల మతిని.


✍️గోపాలుని మధుసూదన రావు 🙏