18, ఫిబ్రవరి 2026, బుధవారం

_కృష్ణ - కుచేల స్నేహం_*

 *_కృష్ణ - కుచేల స్నేహం_*

~~~~~~


పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి చూపించే నవవిధ భక్తుల (శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం లేదా స్నేహం, ఆత్మనివేదనం)లో స్నేహభక్తి ఒకటి. భగవంతునితో స్నేహం చేసి, దానితో సమానంగా భక్తిని ప్రదర్శించగలగడం అందరివల్లా అయ్యే పనికాదు. దీనిలో అద్భుత విజయం సాధించిన ఏకైక పౌరాణిక పురుషోత్తముడు కుచేలుడు. ‘కృష్ణ-కుచేల స్నేహం’ లోకానికే ఆదర్శం. స్నేహానికి ‘పేద-ధనిక భేదం’ లేదని ఈ కథ చాటుతున్నది.


కృష్ణ-కుచేలుల స్నేహం ఎంత ప్రాణప్రదమో అంత పవిత్రం. అది విడదీయరానిది. వారి నడుమ స్వార్థానికి తావుండదు. అడిగిన తర్వాతే ఇచ్చేవారు సామాన్యులు. అడక్కుండా ఇచ్చేవారు గొప్పవారు. కృష్ణుడిది అంతటి గొప్పస్నేహం.


కుచేలుని నిర్మల మనసు తెలిసిన నేస్తం ఆ పరంధాముడు. సాందీప మహర్షివద్ద బాల్యమిత్రులుగా విద్య నేర్చుకొని గురువుకు గొప్పపేరు తేవడమే కాక స్నేహానికి వన్నె తెచ్చారు కృష్ణ-కుచేలులు. కుచేలుని అసలు పేరు సుధామ. ‘కుత్సితః చేలః కుచేలః’. ఆయన చినిగిన బట్టలు గలవాడు. కటిక పేదరికం. విద్య ముగిసాక గృహస్థుడైనాడు. గుణవతి, శీలవతి, అనుకూలవతి అయిన భార్య లభించింది.


సంతానానికి కొదువ లేదు. కానీ, దరిద్రానికి ఆకలెక్కువ కదా! అంత పెద్ద కుటుంబాన్ని పోషించుకోలేని దుర్భర పరిస్థితి. కాలం ఎంత పరీక్ష పెట్టినా గోవింద నామస్మరణను మాత్రం కుచేలుడు మానలేదు. ఒకానొక సంక్లిష్ట పరిస్థితిలో కుచేలునితో భార్య, ‘మీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్లండి’ అని ప్రాధేయపూర్వకంగా సూచిస్తుంది. ‘అప్పుడు మన దారిద్య్రం తొలగే మార్గం లభించవచ్చు’ అన్నది ఎంతో ఆశగా. కుచేలుడూ ‘చిన్ననాటి మిత్రుణ్ణి కంటినిండా చూసుకోవచ్చన్న’ ఆనందంతో భార్య మాటను కాదనలేకపోయాడు.


తక్షణమే కొన్ని అటుకులు భర్త కండువా కొసకు కట్టిచ్చింది. కృష్ణ నామస్మరణతోనే కృష్ణుని భవనంలోకి ప్రవేశిస్తాడు. ‘ద్వారపాలకులు తనను లోపలకు వెళ్లనిస్తారో లేదోనని’ అనుమాన పడుతుండగా, అనుకొన్నంతా జరిగింది. అక్కడి వారు అడ్డుకొన్నారు. ఎలా తెలిసిందో ఏమో స్వయంగా కృష్ణుడే అక్కడకు వచ్చి, స్వయంగా కుచేలుణ్ణి తోడ్కొని వెళతాడు. తన్మయత్వంతో కౌగిలించుకొంటాడు. తన మృదుతల్పంపై కూర్చోపెట్టుకొంటాడు.


రుక్మిణీ సమేతంగా బాల్యమిత్రుడైన ఆ నిరుపేద బ్రాహ్మణునికి అర్ఘ్య పాద్యాలతో కాళ్లు కడుగుతాడు. ‘నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే’ అంటూ ఆ నీటిని కృష్ణ దంపతులిద్దరూ తమ శిరస్సులపై చల్లుకొంటారు. అతిథి పూజ చేస్తారు.షడ్రసోపేతమైన భోజనం వడ్డిస్తారు. కృష్ణుడిని చూసిన ఆనందంలో కుచేలుడు వచ్చిన పనినేమరిచి పోతాడు. తనపట్ల చూపుతున్న ఆదరణకు ఉబ్బితబ్బిబ్బవుతాడు. నోట మాటలు రానంత తన్మయత్వంలో మునిగిపోతాడు. స్నేహభక్తిలో పరాకాష్ట తప్ప మరేదీ కోరుకోని నిష్కామయోగి కుచేలుడు. నోరు తెరచి ఏమీ అడగకున్నా, అన్నీ తెలిసిన పరంధాముడు మిత్రునికి ఎంత వైభవం ఇవ్వాలో అంతా ఇచ్చాడు. కుచేలుడు ఇల్లు చేరేసరికి అతని పూరిగుడిసె స్థానంలో పెద్ద భవనమే వెలసింది శ్రీకృష్ణ పరమాత్మ మహిమ🙏🙏



సేకరణ


🙏🙏

పుణ్య,పాపకర్మలు

  


 ( పూర్వజన్మలో చేసిన పుణ్య,పాపకర్మలు, ఈజన్మలో సుఖ, దుఃఖాలను కలిగిస్తాయి - 

మహాభారతం, అనుశాసనిక పర్వంలోని "ఉమామహేశ్వర సంవాదం" )

                    

శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).

                            -----------------


పూర్వజన్మలో చేసిన ధర్మాధర్మములు, ఈ జన్మలో ఏ సుఖ, దుఃఖాలను కలిగిస్తాయో, పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇలా తెలియజేస్తున్నాడు.


పార్వతీ దేవి: ఈశ్వరా! కొంతమంది గొప్ప విద్యావంతులు గాను, మేధా సంపన్నులుగాను ఉంటున్నారు.

కొంతమందికి ఎంత ప్రయత్నంచినా చదువు రావటము లేదు.

దీనికి కారణం ఏమిటి?


పరమేశ్వరుడు: పార్వతీ! పూర్వజన్మలో ఆచార్యునికి ఎంతో అడకువతో పరిచర్యలు చేస్తూ, విద్యా సముపార్జన చేసినవారు, 

తాము నేర్చిన విద్య యోగ్యులైన శిష్యులకు బోధించుటకు ఆత్ర పడిన మహితాత్ములు,

ఈ జన్మలో విద్యావంతులు, మేధావులు అగుచున్నారు.

పూర్వజన్మలో విద్యాగర్వంతో మదించి,సభలలో సాధువులను, విద్వాంసులను అవమానించిన అహంకారులు, ఈ జన్మలో ఎంత ప్రయత్నించినా చదువు రానివారుగా ఉండిపోతున్నారు.


పార్వతి: కొంతమంది చక్కని ఆరోగ్యంతోను, అనుకూలంగా ఉండే భార్యా,పిల్లలతోను, ఐశ్వర్యంతోను సుఖిస్తున్నారు.

కొంతమంది దుష్టులైన పత్నీ పుత్రులతో, సదా "లేమి" తో, అనారోగ్యంతో, నిరంతరం దుఃఖిస్తున్నారు.

మహేశ్వరా! దయచేసి దీనికి కారణం తెలుపవలసింది?


పరమేశ్వరుడు: పూర్వజన్మలో ఎంతోమంది సత్పురుషులను మిక్కిలి ఆత్మీయతతో ఎన్నో విధములుగా ఆదరించిన మహనీయుడు ఈ జన్మలో ఆయురారోగ్య ధనసంపత్తితోను,అనుకూల దాంపత్యం తోను సుఖిస్తున్నాడు.

కామ,క్రోధ,లోభ,నాస్తికత్వములతో పరులను ఇనుమిక్కిలిగా పీడించిన దుర్మార్గుడు,ఈ జన్మలో దారిద్ర్యం, వ్యాధి, తనను ద్వేషించే భార్యా, పిల్లలతో దుఃఖిస్తున్నాడు.


పార్వతి: నాథా! పుట్టుగుడ్డి గాను,కర్ణ రోగములతోను,ఉదర రుగ్మతలతోను, మనిషి ఎందువల్ల బాధపడుతున్నాడు?


పరమేశ్వరుడు: సాధ్వీ! పూర్వజన్మలో అందగాడై, ఇతరుల పత్నులను ఆకర్షించి వ్యభిచరించిన పాపి పుట్టుగుడ్డిగా జన్మిస్తున్నాడు.

కటు వాక్యములతో సత్పురుషులకు మానసిక వ్యధ కలిగించినవాడు చెముడు మొదలైన కర్ణరోగములతో బాధపడుతున్నాడు.

విషభోజనం పెట్టి, ఇతరులకు హాని చేసినవాడు ఉదర రుగ్మతలతో దుఃఖిస్తున్నాడు.


పార్వతి: పరమేశ్వరా! మానవులనుభవిస్తున్న ఇతర దుఃఖములకు కూడా కారణములు తెలుపగలరు.


పరమేశ్వరుడు: మానినీ! పరదారలనుగాని, కన్యకను గాని, గేదె, గోవు, ఆడుగుఱ్ఱము, అనే జంతువులను గాని మదనాతురుడై అనుభవించిన దుర్మార్గుడు, నీరు పట్టిన శరీరముతో గాని,మధుమేహముతో గాని ఇనుమిక్కిలిగా దుఃఖించగలడు.

ఇతరులు కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని దొంగిలించిన వాడు ఆర్చుకు పోవడం అనే ఎండు రోగముతో అలమటించగలడు.

ఇతరుల శరీరములకు బంధనములతో గాని,దారుణాఘాతములతో గాని ,వికృతత్వం కలిగించిన దుర్మార్గుడు "కుష్టు"రోగముతో పీడింపబడుతాడు.

ఇతరుల కాళ్లు, చేతులు, విరిచి సహించరాని యాతన కలుగజేసిన పాపి, ఆయా అవయవ లోపములతో జన్మించి తీరని దుఃఖంతో అలమటించ గలడు.

ఇతరులను కాలితో తన్నినా,పరిశుభ్రత లేని పాదములతో దేవాలయములలో ప్రవేశించినా,తప్పక చరణ రుగ్మతలు ఏర్పడగలవు.

ఆహార పదార్థములను కల్తీ చేసి విక్రయించే వారు, తప్పుడు తూకములతో వ్యాపారంలో లాభాలు ఆర్జించిన పాపాత్ములు,

 'గూని' 'మరుగుజ్జుతనము' ' 'కాళ్లవ్యాధులు' మొదలైన రోగములతో అలమటించ గలరు.

విధాతకు ఎవరి యెడల ఆగ్రహం కాని, అనుగ్రహం కానీ లేవు.

మానవులు పూర్వజన్మలో ఆచరించిన పుణ్య పాపములనే ఈ జన్మలో సుఖ దుఃఖాలుగా తగు సమయంలో అనుభవిస్తున్నారు.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

18-2-'26

రామేశ్వరః

  పద్మపురాణం ప్రకారం *"రామేశ్వరః"* అనే పదానికి చాలా లోతైన మరియు ఆధ్యాత్మికమైన వివరణ ఉంది. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, శివకేశవుల మధ్య ఉన్న అభేదాన్ని (ఇద్దరూ ఒక్కటే అనే భావనను) చాటిచెప్పే అద్భుతమైన వ్యాకరణ సమన్వయం.


పద్మపురాణంలోని పాతాళ ఖండంలో ఈ పదాన్ని మూడు రకాలుగా విడదీసి వివరిస్తారు:


1. షష్ఠీ తత్పురుష సమాసం

"రామస్య ఈశ్వరః రామేశ్వరః"


అర్థం: రాముడికి ఎవరైతే ఈశ్వరుడో (ప్రభువో/దైవమో) ఆయనే రామేశ్వరుడు.


భావం: ఇక్కడ శ్రీరాముడు శివుడిని పూజించాడు కాబట్టి, శివుడు రాముడికి దైవం అని అర్థం.


2. బహువ్రీహి సమాసం

"రామః ఈశ్వరో యస్య సః రామేశ్వరః"


అర్థం: రాముడు ఎవరికి ఈశ్వరుడో ఆయనే రామేశ్వరుడు.


భావం: శివుడు ఎప్పుడూ రామ నామాన్ని జపిస్తూ ఉంటాడు. శివుడి హృదయంలో రాముడు కొలువై ఉంటాడు కాబట్టి, శివుడికి రాముడు దైవం అని అర్థం.


3. కర్మధారయ సమాసం

"రామశ్చ అసౌ ఈశ్వరశ్చ రామేశ్వరః"


అర్థం: రాముడే ఈశ్వరుడు.. ఈశ్వరుడే రాముడు.


భావం: హరి (విష్ణువు/రాముడు) మరియు హరుడు (శివుడు) ఇద్దరూ ఒకటే. వారిద్దరి మధ్య భేదం లేదు.


ముఖ్య గమనిక: పద్మపురాణం ప్రకారం, శ్రీరాముడు సేతువు దగ్గర లింగ ప్రతిష్ఠ చేసే సమయంలో ఈ చర్చ జరుగుతుంది. "రాముడికి ఈశ్వరుడు శివుడా? లేక శివుడికి ఈశ్వరుడు రాముడా?" అని దేవతలు చర్చించుకుంటున్నప్పుడు, శివుడు స్వయంగా ప్రత్యక్షమై "మా ఇద్దరి మధ్య భేదం లేదు, మేమిద్దరం ఒకరికొకరం ఈశ్వరులం" అని స్పష్టం చేస్తాడు.


దీనినే "అద్వైత భావన" అని కూడా అంటారు. అంటే భక్తుడికి దైవానికి, అలాగే హరిహరులకు మధ్య వ్యత్యాసం లేదని ఈ పురాణ వివరణ సారాంశం.

మహాశివరాత్రి మహిమ

  మహాశివరాత్రి మహిమ 


1. శివ పురాణం


మాఘకృష్ణచతుర్దశ్యాం యః కరోతి శివవ్రతమ్ ।

తస్య పుణ్యఫలం వక్ష్యే శృణు తత్త్వం మహామునే ॥


ఉపవాసం చ జాగరణం శివపూజాం విశేషతః ।

కృత్వా ముచ్యతే పాపేభ్యః శివసాయుజ్యమాప్నుయాత్ ॥


తాత్పర్యము:

మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున శివవ్రతం ఆచరించి, ఉపవాసం ఉండి, రాత్రి జాగరణతో శివపూజ చేసినవాడు సర్వపాపాల నుండి విముక్తి పొంది, చివరికి శివసాయుజ్యాన్ని పొందుతాడు.


2. లింగ పురాణం


శివరాత్రివ్రతం నామ సర్వపాపప్రణాశనం ।

ఆచరేద్యః సమాహిత్య స యాతి పరమాం గతిమ్ ॥


తాత్పర్యము:

శివరాత్రి వ్రతం అన్ని పాపాలను నశింపజేసే మహా వ్రతం. దీన్ని శ్రద్ధతో ఆచరించినవాడు పరమగతిని (మోక్షాన్ని) పొందుతాడు.


3. లింగ పురాణం


న స్నానేన న దానేన న తపోభిర్న చాధ్వరైః ।

తుష్టో భవతి శంభుస్తు శివరాత్రివ్రతేన వై ॥


తాత్పర్యము:

స్నానాలు, దానాలు, తపస్సులు, యజ్ఞాలు చేసినా లభించని సంతోషం శంభునికి శివరాత్రి వ్రతం ద్వారా లభిస్తుంది. ఈ వ్రతం శివునికి అత్యంత ప్రీతికరమైనది.


4. స్కాంద పురాణం


శివరాత్రేః పరం నాస్తి వ్రతం పాపప్రణాశనం ।

తస్మాత్ సర్వప్రయత్నేన కర్తవ్యం భక్తితత్పరైః ॥


తాత్పర్యము:

పాపాలను నశింపజేసే వ్రతాలలో శివరాత్రి వ్రతానికి సమానం మరొకటి లేదు. కాబట్టి భక్తులు శ్రద్ధతో తప్పకుండా దీనిని ఆచరించాలి.


5. శివ పురాణం – జాగరణ మహిమ


రాత్రౌ జాగరణం కుర్యాద్భక్త్యా శంకరసన్నిధౌ ।

ఏకరాత్రికృతం పుణ్యం సంవత్సరశతాధికమ్ ॥


తాత్పర్యము:

శివరాత్రి రోజున శివసన్నిధిలో భక్తితో రాత్రి జాగరణ చేస్తే, ఒక రాత్రిలో చేసిన పుణ్యం వంద కంటే ఎక్కువ సంవత్సరాల పుణ్యానికి సమానమవుతుంది.


---


6. బిల్వార్చన మహిమ


బిల్వపత్రం ప్రదాతవ్యం శివపూజాం విశేషతః ।

ఏకబిల్వప్రదానేన కోటియజ్ఞఫలం లభేత్ ॥


తాత్పర్యము:

శివపూజలో బిల్వపత్ర సమర్పణకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. ఒక్క బిల్వపత్రాన్ని సమర్పించినా కోటి యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది.




మహాశివరాత్రి రోజున ఉపవాసం, రాత్రి జాగరణ, అభిషేకం, బిల్వార్చన చేస్తే సర్వపాపక్షయం, శివప్రసాదం మరియు మోక్షఫలం లభిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తున్నది.

శివరాత్రి తో సమానం అయిన రోజు కానీ శివుడిని మించిన దైవం కానీ సృష్టి లో లేదు.

ఆరోజు చేసే స్నానం,దానం,ధ్యానం,తపస్సు,అర్చన,అభిషేకం ఏవైనా అనంత ఫలములను అందిస్తాయి.

సుభాషితమ్


🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *పాపోత్సప విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ*

        *స్తోత్ర ధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాచిత్త*

        *శిరోఽఘిహస్తనయన శ్రోత్రైరహం ప్రార్ధితో మమాజ్ఞాన*

        *యాతన్నిరూపయా ముహుర్మామేవనూమేవచః*


తా𝕝𝕝 *ఓ సర్వేశ్వరా! నేను పాపమును పోగొట్టుకోవడానికి మోక్షం సంపాదించుకోవడానికి, నీ స్తుతియందు జిహ్వను, ధ్యానమున మానసమును ప్రణమిల్లుట యందు శిరస్సును. ప్రదక్షిణమున చరణాలను, అర్చనయందు హస్తములను, చూచుట యందు నేత్రములను, వినడమున కర్ణములను ఉండేలా ఆజ్ఞాపించమని కోరుతున్నాను. నీ ఆజ్ఞను పాటించేలా నన్ను ఉత్సాహపరచుము.*


✍️🌹💐🌸🙏

భాగవతం భాగవతం

 *'భాగవతం వింటే బాగవుతాం'*

_శ్రీ పోతన భాగవత మధురిమలు_

 

(6-230-ఆ)

పురుషుఁ డెట్టులేనిఁ బూని బిలస్వర్గ

గతుఁడుఁ బోలె వర్తకంబు మాను

నట్టి బ్రహ్మ మెఱుఁగు నయ్యకు స్వర్భోగ

కర్మగతుల నేమి గానఁబడును?


*భావము:-* పురుషుడు సంసారమనే పాతాళ కూపంలో కూరుకొనిపోయి బయట పడకుండా ఉంటే పరబ్రహ్మ స్వరూపాన్ని ఎట్లా గుర్తించగలుగుతాడు? కర్మలు ఆచరించటం వల్ల స్వర్గఫలాలు ప్రాప్తిస్తాయి. కాని కైవల్యం చేకూరదు.


శ్రీ శివ అష్టోత్తర శత నామ స్తోత్రం తో 

*'మహాశివరాత్రి పర్వదిన' శుభాకాంక్షలు* 


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

హోమియోనె తిరముగా సరిజేయు

  కొవిడు వేక్సి నిచ్చె కోటి కష్టములను

రక్త మెల్ల జెడుతు రగడ బెట్టె

దీన్ని హోమియోనె తిరముగా సరిజేయు

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: కొవిడ్ వేక్సీన్ అనేక మందిలో రక్తం గడ్డకట్టించడం వలన వెరికోస్ వీన్స్, కీళ్ళ సందులలో రక్త సరఫరా తగ్గి కీళ్ళ నొప్పులు, వెన్ను పూసల మధ్యలో రక్త సరఫరా తగ్గి, కార్టిలేజ్ అరిగి, స్పాండిలైటిస్, సయాటికా బాధలు రావడం, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి, తగ్గిపోయిందనుకున్న ఫిట్స్ వేక్సీన్ తర్వాత తిరిగి ఇంతకు ముందుకంటే ఉధృతిగా మొదలవ్వడం, తగ్గిపోయిందనుకున్న షుగర్, బి పీ తిరిగి వచ్చి, తీవ్రమైన రీడింగులు నమోదు కావడం, ఎన్ని టాబ్లెట్లను మింగినా కంట్రోల్ కాకపోవడం, కిడ్నీ నెఫ్రాన్స్ లో రక్త శుద్ధికి ఆటంకం కలిగి, రక్తంలో మలినాలు పెరిగిపోయి, క్రియాటినైన్, యూరిక్ ఏసిడ్ పెరిగి, కిడ్నీ డయాలసిస్ రోగుల కేసులు పెరగడం, గుండెకు స్టెంటులు వేయించుకునేవాళ్ళు పెరగడం, ఆర్గాన్ ఫెయిల్యూర్ తో, కార్డియాక్ అరెస్ట్ తో నడుస్తూ తిరుగుతూనే ఎక్కువ మంది సడన్ గా చనిపోవడం, మెదడులో ఎడమవైపు రక్తం గడ్డలు తయారై, కుడివైపు పక్షవాతం కలగడం, కుడి మోకాలు అధికంగా అరిగిపోయి, కుడి మోకాలు నొప్పి, కుడివైపు సయాటికా, కుడివైపు స్పాండిలైటిస్ బాధ, ఎడమ చెవిలో చీము, వినికిడి లోపాలు, కంటి నాడులు క్షీణించి పోయి, దృష్టి తగ్గడం, లిపోమాస్ (కొవ్వు కంతులు) ఉన్న వాళ్ళకు అవి మరికాస్త అధికమయ్యి, క్రమంగా కేన్సర్ గడ్డలుగా మారడం, బ్రెస్ట్ కేన్సర్, ఇతర కేన్సర్ కేసులు అధికమవ్వడం, గుండె జబ్బు బాధితులు పెరగడం,రక్తం గడ్డకట్టకుండా వాడే ఎకోస్ప్రిన్ అమ్మకాలు విపరీతంగా పెరగడం, కిడ్నీ, గుండె, న్యూరో, కేన్సర్ హాస్పిటల్స్ వ్యాపారాలు కరోనా తర్వాత కిటకిటలాడేంత విపరీతంగా పెరగడం, కిడ్నీ, ప్రొస్టేట్ లోపల, లివర్ లోపల, రకరకాల ఆర్గాన్స్ పైన సిస్టులు, ట్యూమర్లూ, కేన్సర్ గడ్డలూ పెరగడం, హెర్నియా, ప్రొస్టేట్ గ్లేండ్ వాపు కేసులు పెరగడం, మూత్ర నాళాల్లో అడ్డంకులు పెరిగి మూత్రం సక్రమంగా జారీ కాకపోవడం, గ్యాస్ ట్రబుల్ కేసులు పెరగడం, రక్త నాళాల్లో అడ్డంకులు పెరగడంతో స్టెంటులు వేయించుకోవడం మరియు ఆపరేషన్లూ పెరగడం, థైరాయిడ్, పీసీఓడీ బాధితులు పెరగడం, అనేకమంది ఆడవాళ్ళ కాళ్ళలో వెరికోస్ వీన్స్ సమస్య పెరిగిపోవడం వంటి ఎన్నో సమస్యలు సైడ్ ఎఫెక్టుగా వస్తూనే ఉన్నాయి! అనేకమంది రైతుల్లో తీవ్రమైన కీళ్ళ నొప్పులు తలెత్తి,వ్యవసాయ పనులకు దూరమవడం, వేక్సీన్ కి ముందు కాలంలో వచ్చి తగ్గిపోయిన అనేక వ్యాధులు తిరిగి వచ్చి,అంతకు రెట్టింపు తీవ్రతతో బాధించడం, మెట్లెక్కితే మోకాళ్ళ నొప్పులు,ఆయాసం, ఆరోగ్య పరిస్థితి లోనూ, శారీరక బలం లోనూ ముందు కంటే తీవ్రమైన మార్పు కలగడం, నీరసం ఆవహించడం, తరచుగా జ్వరాలకూ, దగ్గు, ఆస్తమా లాంటి బాధలకు గురవ్వడం, చర్మంపై సొరియాసిస్, నల్లటి మచ్చలు అధికంగా రావడం, ఇలా ఎన్నో సమస్యలు నా పరిశోధనలో బయటపడ్డాయి! ఇది పైపైన ఉండిపోకుండా, జీన్స్ లోపల తిష్ట వేసుకుని కూర్చుని, పుట్టబోయే పిల్లలకు సైతం అనేక సమస్యలను సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు! ఈ వేక్సీన్ వేయించుకోవడం వలన ప్రజలకు నష్టమూ, కష్టమే మిగిలింది కానీ ఇంగ్లీషు మెడికల్ దందాకు విపరీతమైన బిజినెస్ పెరిగింది! చూడగా చూడగా ఈ తంతంతా వాళ్ళ లాభం కోసమే ఎవరో పనిగట్టుకుని చేసిన స్కేమ్ లాగా కనిపిస్తోంది! ఇప్పుడు జరిగిన తప్పును సరి చేయగలిగే దమ్ము ఈ భూమిపై ఒక్క హోమియోపతీకి మాత్రమే ఉంది! అలాగే వేక్సీన్ విసిరే ప్రతీ ఛాలెంజ్ కీ హోమియోలో, యోగా, ప్రకృతి వైద్యాలలో స్పష్టమైన సమాధానం ఉంది! ఈ పరిశోధనతో సమస్యలను గుర్తించి, మిమ్మల్ని భయపెట్టాలనేది నా ఉద్దేశ్యం కాదు! ఈ సమస్యలను పొందినవారు అనవసరంగా టెస్టులూ, స్కేనులూ చేయించుకుంటూ, ఒక్కొక్క జబ్బు కోసం ఒక్కొక్క స్పెషలిస్ట్ చుట్టూ తిరిగి, టైమూ, డబ్బులూ వేస్టు చేసుకోకుండా, మొత్తం అన్ని సమస్యలకూ "వేక్సీన్" అనే ఒకే కారణం ఉంది కాబట్టి, వందల మంది దగ్గరకు తిరగకుండా, ఒకే ఒక్క సమర్ధుడైన హోమియో డాక్టరు వద్ద మీ సమస్యలన్నీ చక్కదిద్దించుకోండి, మరియు నిత్యం యోగా చేస్తూ, మీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి, టీ, కాఫీలు, టిఫిన్లూ మానేసి, చక్కగా పళ్ళూ, పెరుగన్నాలూ తినండి! మషాలూ,కారాలూ,వేపుళ్ళూ, బిర్యానీ కోకోకోలాలూ, జంక్ ఫుడ్స్ తగ్గించండి! జరిగిన తప్పేదో తెలిసో తెలియకో జరిగిపోయింది, దాన్ని తలుచుకుని బాధ పడితే ప్రయోజనం లేదు! హోమియో, యోగా, ప్రకృతి వైద్యాలూ అండగా ఉండగా మనకేమీ భయం లేదు! కాకపోతే ఇప్పుడు ఈ సమస్యలన్నీ వేక్సీన్ సైడ్ ఎఫెక్టులని తెలిసిపోయింది కాబట్టి, అనవసర ప్రయాస మానేసి, నేరుగా హోమియోకి, యోగాకీ వెళ్ళి, పరిష్కరించుకుంటే సరిపోతుంది! ఈ సవివరమైన పరిశోధన పూర్తిగా నా స్వంతం! నా పరిశోధనతో సమస్యలను గుర్తించడం మాత్రమే గాక పూర్తి పరిష్కారం సైతం కనుగొనడం జరిగింది, కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు! అలాగే దీనిపై ఏ రాద్దాంతమూ చెయ్యాల్సిన పనిలేదు! ఙరిగినది తలుచుకుని బాధ పడే కంటే, సరి చేసుకుపోవడమే సమర్ధుల తక్షణ కర్తవ్యం! 

సకురు అప్పారావూ ఇదే సత్యం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

నేను పాపమును పోగొట్టుకోవడానికి

 **


శ్లో𝕝𝕝 *పాపోత్సప విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ*

        *స్తోత్ర ధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాచిత్త*

        *శిరోఽఘిహస్తనయన శ్రోత్రైరహం ప్రార్ధితో మమాజ్ఞాన*

        *యాతన్నిరూపయా ముహుర్మామెవనూమేవచః*


తా𝕝𝕝 *ఓ సర్వేశ్వరా! నేను పాపమును పోగొట్టుకోవడానికి, మోక్షం సంపాదించుకోవడానికి, నీ స్తుతియందు జిహ్వను, ధ్యానమున మానసమును, ప్రణమిల్లుట యందు శిరస్సును, ప్రదక్షిణమున చరణాలను, అర్చనయందు హస్తములను, చూచుట యందు నేత్రములను, వినడమున కర్ణములను, ఉండేలా ఆజ్ఞాపించమని కోరుతున్నాను. నీ ఆజ్ఞను పాటించేలా నన్ను ఉత్సాహపరచుము.*

🙏🪷🪷🪷🙏

శ్రీల ప్రభుపాద ఉవాచ!

 శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా ।

పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ 


అభ్యాసముతో ఎవరైతే పరమాత్మునిగా నన్ను ధ్యానిస్తారో, అతని మనస్సు నిరంతరం నన్ను స్మృతి చేయడంలో నిమగ్నమై ఉంటుంది, మార్గం నుండి తప్పుకోకుండా ఉంటుంది, అతను, ఓ పార్థా, ఖచ్చితంగా నన్ను చేరుకుంటాడు.


ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తనను స్మరించుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. 

హరే కృష్ణ అనే మహా-మంత్రాన్ని పఠించడం ద్వారా కృష్ణుడి జ్ఞాపకశక్తి పునరుద్ధరించబడుతుంది. 

ఈ పఠించడం మరియు భగవంతుని ధ్వని కంపనాన్ని వినడం ద్వారా ఒకరి చెవి, నాలుక మరియు మనస్సు నిమగ్నమై ఉంటాయి. 

ఈ మార్మిక ధ్యానం సాధన చేయడం చాలా సులభం, మరియు అది పరమాత్మను పొందడంలో సహాయపడుతుంది….


భక్తుడు తను ఆరాధించే వస్తువు అయిన పరమేశ్వరుని - నారాయణ, కృష్ణ, రామ మొదలైన ఏ రూపములోనైనా నిరంతరం హరే కృష్ణ అని జపించడం ద్వారా ఆలోచించగలడు.


ఈ అభ్యాసం అతన్ని శుద్ధి చేస్తుంది మరియు అతని జీవితాంతమున, అతని నిరంతర జపం కారణంగా, అతను దేవుని రాజ్యానికి బదిలీ చేయబడతాడు. 

యోగాభ్యాసం అంటే లోపల ఉన్న పరమాత్మపై ధ్యానం; 

అదేవిధంగా, హరే కృష్ణ జపించడం ద్వారా ఒక వ్యక్తి తన మనస్సును ఎల్లప్పుడూ పరమ భగవంతునిపై ఉంచుకుంటాడు.


మనస్సు చంచలమైనది, అందువల్ల కృష్ణుని గురించి ఆలోచించడానికి మనస్సును బలవంతంగా నిమగ్నం చేయడం అవసరం. 

తరచుగా ఇవ్వబడిన ఒక ఉదాహరణ ఏమిటంటే, గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారాలని భావించి, అదే జీవితంలో సీతాకోకచిలుకగా రూపాంతరం చెందుతుంది. 


అదేవిధంగా, మనం నిరంతరం కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉంటే, మన జీవితాల ముగింపులో కృష్ణుడిలాగా మనకు కూడా అదే శారీరక అమరిక ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.


(భగవద్గీత అధ్యాయం.8)

వచనం.8


హరే కృష్ణ 

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

నేర్పించడం విస్మరించి



వాల్మీకి వేదవ్యాస

కాలిదాస భవభూతి

ఆర్యభట్ట, వరాహమిహిర

విష్టుశర్మ, పాణిని, పతంజలి

ఇత్యాదుల సంస్కృతభాషా 

గురుశిష్యులను వారి సాహిత్యమును

నేర్చుకోవడం నేర్పించడం 

విస్మరించి


కొందరు అడ్డం నామాలు పెట్టమంటారు

మరికొందరు పంగనామాలు పెట్టమంటారు

ఇంకొందరు మీసం తీసి గడ్డం పెంచి

తలపై టోపీ పెట్టమంటారు

ఇంకొందరు శిరస్సుపై 

ఏమీ లేకుండా ఉండాలి అంటారు

మగవారిని వింత అలవాటులకు

బానిసలు చేస్తున్నారు


ఒకరు జెడవేసుకోమంటారు

నుదుటి బోట్టుకోమంటారు

చీరకట్టుకోమంటారు


మరొకరు బురఖా వేసుకో అంటారు

హిజాబ్ ధరించమని చెబుతారు


మరి కొందరు అవేమి వందంటారు

డ్రెస్ కోడులు పెడతారు


మన ప్రజలు మన ప్రభుత్వాలు

మన గురువులు మన మేధావులు

సంస్కృతభాషా చదువులకు

ప్రజలను దూరం చేస్తున్నారు


భౌతిక వ్యసనాలకు అలంకారాలకు

ప్రజలను వ్యసనపరులను చేస్తున్నారు 

దుర్ SSV SANSKRIT NEWS CHANNEL


వాల్మీకి వేదవ్యాస

కాలిదాస భవభూతి

ఆర్యభట్ట, వరాహమిహిర

విష్టుశర్మ, పాణిని, పతంజలి

ఇత్యాదుల సంస్కృతభాషా 

గురుశిష్యులను వారి సాహిత్యమును

నేర్చుకోవడం నేర్పించడం 

విస్మరించి


కొందరు అడ్డం నామాలు పెట్టమంటారు

మరికొందరు పంగనామాలు పెట్టమంటారు

ఇంకొందరు మీసం తీసి గడ్డం పెంచి

తలపై టోపీ పెట్టమంటారు

ఇంకొందరు శిరస్సుపై 

ఏమీ లేకుండా ఉండాలి అంటారు

మగవారిని వింత అలవాటులకు

బానిసలు చేస్తున్నారు


ఒకరు జెడవేసుకోమంటారు

నుదుటి బోట్టుకోమంటారు

చీరకట్టుకోమంటారు


మరొకరు బురఖా వేసుకో అంటారు

హిజాబ్ ధరించమని చెబుతారు


మరి కొందరు అవేమి వందంటారు

డ్రెస్ కోడులు పెడతారు


మన ప్రజలు మన ప్రభుత్వాలు

మన గురువులు మన మేధావులు

సంస్కృతభాషా చదువులకు

ప్రజలను దూరం చేస్తున్నారు


భౌతిక వ్యసనాలకు అలంకారాలకు

ప్రజలను వ్యసనపరులను చేస్తున్నారు 

దుర్ అలవాటులకు

బానిసలు గా మార్చేస్తున్నారుఅలవాటులకు

బానిసలు గా మార్చేస్తున్నారు

మహా శివరాత్రి వ్రత మహాత్యం

  _*🚩మహా శివరాత్రి వ్రత మహాత్యం🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి , ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ శివుడే.


ఓసారి బ్రహ్మ , విష్ణువు , పార్వతీ నేరుగా శివుడినే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని , ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చేసిన వారికే కాక చూసిన వారికీ , విన్నవారికీ కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి , దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించి తెలియచెప్పాడు. భక్తిని , ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయి.


జాబాల శ్రుతిలో రుషులు పది శైవవ్రతాలను గురించి చెప్పారు. శివపూజ , రుద్రజపం , శివాలయంలో ఉపవాసం , వారణాసిలో మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలు , అష్టమి తిథితో కూడిన సోమవారం , కృష్ణపక్షం నాటి చతుర్ధశి శివుడికి ఎంతో ప్రీతికరం. ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చెయ్యటం మంచిది. ధర్మసాధనలన్నిటిలో ఉత్తమమైనదని దీనికి పేరు. ఏ భేదమూ లేకుండా సర్వవర్ణాలవారు , అన్ని ఆశ్రమాలవారు , స్త్రీలు , పిల్లలు ఒకరనేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు.


మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయటం శ్రేష్ఠం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి. శివరాత్రి పూట ఉదయాన నిద్రలేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నంచేయాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజాద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకొన్న పూజాద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం , లోపల , బయట అంతాపరిశుభ్ర వస్త్రధారణలతో శివపూజకు ఉపక్రమించాలి. శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజాద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలోమాత్రమే పూజ చేయాలి. మంత్రం లేకుండా పూజించకూడదు.


భక్తి భావంతో గీత , వాద్య , నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలి యామం(జాము) పూజను పూర్తిచేయాలి. శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రతమాహాత్మ్య కథను వినాలి. ఈ పూజ నాలుగు జాములలోనూ ఆ రాత్రి అంతా చెయ్యాల్సి ఉంటుంది. వ్రతానంతరం యధాశక్తిగా పండితులకు , శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. నాలుగు జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలి జాములో పార్థివ లింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృతాభిషేకం , ఆ తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి.


చందనం , నూకలు లేని బియ్యం , నల్లని నువ్వులతో పూజచేయాలి. ఎర్రగన్నేరు , పద్మంలాంటి పుష్పాలతోఅర్చించాలి. భవుడు , శర్వుడు , రుద్రుడు , పశుపతి , ఉగ్రుడు , మహాన్‌ , భీముడు , ఈశానుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూప దీప నైవేద్యాలతో అర్చన చేయాలి. అన్నం , కొబ్బరి , తాంబూలాలను నివేదించాలి. అనంతరం ధేను ముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి. అనంతరం అయిదుగురు పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది.


రెండోజాములో తొలిజాముకన్నా రెట్టింపు పూజను చేయాలి. నువ్వులు , యవలు , కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉండాలి. మిగిలిన పద్ధతంతా తొలిజాములాంటిదే.


మూడో జాములో చేసే పూజలో యవలస్థానంలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చేయాలి. వివిధ ధూపదీపాలను. శాకపాకాలను , అప్పాలను నివేదించాలి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి.


నాలుగోజాములో పూజాద్రవ్యాలుగా మినుములు , పెసలు లాంటి ధాన్యాలను , శంఖ పుష్పాలకు , మారేడు దళాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ , మినుములతో కలిపి వండిన అన్నాన్నీ కానీ పెట్టాలి. అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తి పూర్వకంగా నాలుగు జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఏ జాముకు ఆ జాము పూజ పూర్తికాగానే ఉద్వాసన చెప్పటం , మళ్ళీ తరువాతి జాము పూజకు సంకల్పం చెబుతుండాలి.


నాలుగు జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని , ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రతక్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని సర్వశుభాలు , సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మ , విష్ణు , పార్వతులకు వివరించి చెప్పాడు ఈ కథను.

భాగవతం వింటే బాగవుతాం'*

  *'భాగవతం వింటే బాగవుతాం'*

_శ్రీ పోతన భాగవత మధురిమలు_ 


(6-336.1-తే)

దండ మద్భుత పుణ్యప్రధానునకును;

దండ ముత్తమ వైకుంఠధామునకును;

దండ మాశ్రిత రక్షణ తత్పరునకు;

దండ మురు భోగినాయక తల్పునకును.


*భావము:-* అద్భుతమైన పుణ్యాల నిచ్చేవానికి వందనం; ఉత్తమమైన వైకుంఠంలో నివసించేవానికి వందనం; ఆశ్రయించిన వారిని రక్షించేవానికి వందనం; శేషతల్పునకు వందనం.


శ్రీ శంకరాచార్య కృత శ్రీ శివ అక్షరమాల స్తోత్రం తో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

సుభాషితమ్

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో||   *శ్రీశైలే భ్రమరాంబికా విలసితో భద్రాసనే సంస్థిత*:

        *రాజచ్ఛంద్రకళా వికాసితవపు స్సారంగపాణిస్సదా*

        *శ్రీనాథాది సురేంద్ర పూజిత పదాంభోజాత మృత్యుంజయ:*

        *పాయాచ్చ్రీగిరిమల్లికార్జున మహా దేవోమహీమండలం*


తా|| *శ్రీశైలమందు భ్రమరాంబికతో ప్రకాశించు వాడను, మంగళకరమైన ఆసనమందున్న వాడును, ప్రకాశించు చంద్రకళతో నొప్‌రు శరీరము కలవాడును, చేతి యందు లేడి కలవాడును, విష్ణువు మొదలైన దేవతా ప్రభువులచే పూజింపబడిన పాద పద్మములు కలవాడును, మృత్యువును జయించిన వాడును అగు శ్రీశైల మల్లికార్జున మహాదేవుడెల్లప్పుడును భూమండలమును కాపాడుగాక!*


✍️🌹💐🌸🙏

లింగాష్టకమ్

  🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


🙏*లింగాష్టకమ్*🙏


బ్రహ్మమురారి సురార్చిత లింగం

నిర్మలభాసిత శోభిత లింగమ్ |

జన్మజ దుఃఖ వినాశక లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||


దేవముని ప్రవరార్చిత లింగం

కామదహన కరుణాకర లింగమ్ |

రావణ దర్ప వినాశక లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||


సర్వ సుగంధ సులేపిత లింగం

బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |

సిద్ధ సురాసుర వందిత లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||


కనక మహామణి భూషిత లింగం

ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |

దక్ష సుయఙ్ఞ నినాశన లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||


కుంకుమ చందన లేపిత లింగం

పంకజ హార సుశోభిత లింగమ్ |

సంచిత పాప వినాశన లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||


దేవగణార్చిత సేవిత లింగం

భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |

దినకర కోటి ప్రభాకర లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||


అష్టదళోపరివేష్టిత లింగం

సర్వసముద్భవ కారణ లింగమ్ |

అష్టదరిద్ర వినాశన లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||


సురగురు సురవర పూజిత లింగం

సురవన పుష్ప సదార్చిత లింగమ్ |

పరమపదం పరమాత్మక లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||


లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్రీల ప్రభుపాద ఉవాచ!

శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

శ్రీమద్-భాగవతంలో కనిపించే కృష్ణ-లీలలను అధ్యయనం చేయడం లేదా చర్చించడం వల్ల కలిగే ఫలితం గురించి ఇక్కడ ఒక సూచన ఉంది. 

సద్యో హృద్య అవరుధ్యతే 'త్ర కృతిభిః శుష్రుషుభిస్ తత్-క్షాణాత్ (భాగ. 1.1.2). 


వృందావనంలో నంద మహారాజు మరియు యశోద ఈ భౌతిక ప్రపంచంలోని సాధారణ వ్యక్తుల వలె కనిపించారు, కానీ వారు ఈ ప్రపంచంలోని కష్టాలను ఎప్పుడూ అనుభవించలేదు, అయినప్పటికీ వారు కొన్నిసార్లు రాక్షసులచే సృష్టించబడిన అనేక ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. 


ఇది ఒక ఆచరణాత్మక ఉదాహరణ. 

మనము నంద మహారాజు మరియు గోపాలురు అడుగుజాడలను అనుసరిస్తే, కృష్ణుడి కార్యకలాపాల గురించి చర్చించడం ద్వారా మనమందరం సంతోషంగా ఉండగలం.


వ్యాసదేవుడు ఈ సాహిత్యాన్ని అందించాడు, తద్వారా ప్రతి ఒక్కరూ భాగవత-కథ గురించి చర్చించడం ద్వారా ఒకరి అతీంద్రియ స్థితిని అర్థం చేసుకోవచ్చు. 

ప్రస్తుత క్షణంలో కూడా, శ్రీమద్-భాగవతాన్ని అనుసరించడం ద్వారా ప్రతి ఒక్కరూ సంతోషంగా మరియు భౌతిక కష్టాల నుండి విముక్తి పొందవచ్చు. 


కాఠిన్యము మరియు తపస్సుల అవసరం లేదు, వాటిని ఈ యుగంలో నిర్వహించడం చాలా కష్టం. 

కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించారు, సర్వాత్మ-స్నపనం పరం విజయతే శ్రీ-కృష్ణ-సంకీర్తనం అని.


మా కృష్ణ చైతన్య ఉద్యమం ద్వారా, మేము శ్రీమద్-భాగవతాన్ని పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నాము, తద్వారా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా కృష్ణుడి కార్యకలాపాల గురించి జపించడం మరియు వినడం ద్వారా కృష్ణ చైతన్య ఉద్యమంలో లీనమయ్యేలా మరియు అన్ని భౌతిక కష్టాల నుండి విముక్తి పొందవచ్చు.


(శ్రీమద్భాగవతం, స్కందము .10

అధ్యాయం.11, వచనం.58)


హరేకృష్ణ 

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి

 ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి - ఎరుపు రంగు తిలకమే ఎందుకు.............!!

అతివలను చూడగానే చంద్రబింబం వంటి ముఖంలో ముందుగా కనిపించేది బొట్టు. ముఖ సౌందర్యాన్ని పెంచే బొట్టులో.. చాలా ప్రత్యేకతలున్నాయి. అందంగా కనిపించడమే కాకుండా.. ఆరోగ్యానికి ప్రయోజనకరమే. కుంకుమ బొట్టు పెట్టుకుంటే.. దాని ద్వారా సూర్యకిరణాలు శరీరమంతా ప్రసరించి.. నూతనోత్తేజాన్నిస్తాయి.


హిందువుల సంప్రదాయం ప్రకారం మహిళలు, ముఖ్యంగా పెళ్లైన ముత్తైదులు తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఐదోతనానికి బొట్టు చిహ్నం కాబట్టి పెళ్లైన ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేని ముఖం అందవిహీనంగా కనిపించడమే కాదు..శుభ కార్యాలు చేయటానికి అర్హత లేదని హిందూ సంప్రదయం చెబుతోంది. మహిళలు ఉదయాన్నే స్నానం చేయగానే ముందుగా బొట్టు పెట్టుకుని పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు.


బొట్టు పెట్టుకోవడం మంచిది, సంప్రదాయం అని అందరికీ తెలుసు. కానీ.. బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం..? ఎలా పెట్టుకుంటే మంచిది అన్న విషయంలో చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే అసలు బొట్టు ఎందుకు ధరించాలి ? నుదుటి మీదే ఎందుకు పెట్టుకోవాలి ? ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? అన్న సందేహాలను తీర్చుకుందాం...


గౌరవసూచకం బొట్టు పెట్టటం మర్యాదకి గుర్తింపు. అందుకే ఎవరినైనా ఆహ్వానించడానికి ముందుగా బొట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు బొట్టు పెట్టి గౌరవిచమూ హిందూ సంప్రదాయం.


బొట్టు పెట్టుకునేటప్పుడు ఏం స్మరించాలి ? సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను స్మరించుకుంటూ నుదుటన బొట్టు పెట్టుకుంటే మంగళకరం.. శుభకరం.


ఏ వేలితో ఏం ప్రయోజనం ? బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతుంటారు. కొందరు మధ్య వేలు మంచిదని.. మరికొందరు ఉంగరపు వేలు మంచిదని. అయితే ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి.. మధ్య వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలితో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.


నుదుటనే ఎందుకు ? బొట్టు నుదుటిపైనే పెట్టుకోవాలనే సంప్రదాయం వెనక కారణాలున్నాయి. జ్ఞాపక శక్తికి, ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య తిలకము పెడతాము. మరో అధ్యయనం ప్రకారం.. బ్రహ్మ స్థానం నుదురుగా భావిస్తారు. అందుకే కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటే.. బ్రహ్మను పూజించినట్లు అవుతుందని నమ్ముతారు.

ఎరుపు రంగే ఎందుకు ? బొట్టు అంటే ఎరుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే.. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నుదుటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు.. మనుషుల ఆత్మ జ్యోతి స్వరూపమని.. అందుకే ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలని సూచిస్తారు.


ఆరోగ్యానికి కుంకుమ బొట్టుపై సూర్యకాంతి ప్రసరించి.. శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది. అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేదా విభూతి నుదుట రాయడమూ మంచిదే.


స్త్రీలకే కాదు ధర్మాన్ని పాటిస్తూ.. భగవంతున్ని నమ్ముతున్నారనడానికి బొట్టు ప్రతీకగా చెప్పవచ్చు. కాబట్టి కుంకుమ పెట్టుకోవడం స్త్రీలకే పరిమితం కాలేదు. పురుషులు కూడా పెట్టుకుంటే సంప్రదాయం పాటిస్తున్నారని తెలియజేస్తుంది. బొట్టు పెట్టుకోవడం మూఢాచారం కాదు. పెద్దలు, మనకోసం పాటించిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం. ఇది భారతీయులకే ప్రత్యేకం.

గీతలోని మొత్తం 18 అధ్యాయాల

  గీతలోని మొత్తం 18 అధ్యాయాల సారాంశాన్ని కేవలం 18 వాక్యాలలో ఇక్కడ ఇస్తున్నాను.

వన్ లైనర్ గీత -

 దీన్ని అందరికి ఫార్వార్డ్ చేసి సర్క్యులేట్ చేస్తారా? ప్రతి ఒక్కరూ దీన్ని 4 రోజుల్లో 100 మందికి ఫార్వార్డ్ చేయాలని అభ్యర్థించారు. మీ రాష్ట్రంలోనే కాదు, ఇది మొత్తం భారతదేశానికి ఫార్వార్డ్ చేయాలి.


 వన్ లైనర్ గీత


 *అధ్యాయం 1 - తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య .*

 *అధ్యాయం 2 - సరైన జ్ఞానం మన సమస్యలన్నింటికీ అంతిమ పరిష్కారం.*

 *అధ్యాయం 3 - నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకు ఏకైక మార్గం.*

 *అధ్యాయం 4 - ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు .*

 *అధ్యాయం 5 - వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి .*

 *అధ్యాయం 6 - ప్రతిరోజూ ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి.*

 *అధ్యాయం 7 - మీరు నేర్చుకున్న వాటిని జీవించండి .*

 *అధ్యాయం 8 - మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి.*

 *9వ అధ్యాయం - మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి .*

 *అధ్యాయం 10 - చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి .*

 *అధ్యాయం 11 - సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి.*

 *అధ్యాయం 12 - మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి.*

 *అధ్యాయం 13 - మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం.*

 *అధ్యాయం 14 - మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి.*

 *అధ్యాయం 15 - దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి .*

 *అధ్యాయం 16 - మంచిగా ఉండటమే ప్రతిఫలం.*

 *అధ్యాయం 17 - ఆహ్లాదకరమైన వాటిపై హక్కును ఎంచుకోవడం శక్తికి సంకేతం .*

 *అధ్యాయం 18 - విడువండి, దేవునితో ఐక్యతకు వెళ్దాం.*

 (ఈ సూత్రంలో ప్రతి ఒక్కదానిపై ఆత్మపరిశీలన)

                          

                   || ॐ తత్సత్ ||


 P. S. - దీన్ని 100 మందికి ఫార్వార్డ్ చేసి, గీత ప్రాముఖ్యతను వివరించవలసిందిగా నేను మిమ్మల్ని పదే పదే కోరుతున్నాను.

      ⛳ జైశ్రీరామ్⛳

విశ్రాంత జీవితం

 విశ్రాంత జీవితం


అవిశ్రాంతంగా రెండున్నర దశాబ్దాలపాటు చదువుకుని, తర్వాత మూడున్నర దశాబ్దాలు ఒక సంస్థకు అంకితమై, అహరహం శ్రమపడి, చివరకు ఎంత కాలం నించో ఎదురుచూస్తున్న విశ్రాంత జీవిత ప్రస్థానం చేరుకున్నాను. 


శారీరకంగా, ఆర్థికంగా కొంప మునిగిపోయేంత సమస్యలేవీ లేవు కాబట్టి నాకు నచ్చినట్లుగా తిని, తిరిగి, చూసి, చదివి, ఆడి, పాడి జీవించాలనుకున్నాను.  


కానీ అనుకున్న దొక్కటి, అయినది ఇంకొకటి. ఏ ముహుర్తాన రిటైర్ అయ్యానో, నా వాట్సాప్, ఫేస్బుక్ ఫీడ్ అంతా రిటైర్మెంట్ డబ్బులు ఎలా దాచుకోవాలో  చెప్తున్న బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ , రియల్ ఎస్టేట్,  ఫైనాన్స్ కంపెనీల అడ్వర్టైజ్ మెంట్లే . అవి నా డబ్బులు దోచేసే దాకా విశ్రమించేలా లేవు.


ఇక  వాట్సప్ గ్రూపుల్లో  ఇది మీ జీవితం, మీరే జీవించుకోండి, ఎవరిమీదా ఆధారపడొద్దు, కొడుకులు ,కూతుళ్ళ ఇళ్లలో ఉండకండి, మీ డబ్బులు మీ ఆవిడకు కూడా ఇవ్వకండి , మీ వారసులు ఏ టైమ్ లో ఎవరు ఎలా మారతారో చెప్పలేం అంటూ భయపెట్టేస్తున్నారు.


మీరు బ్రతికుండగా తప్పనిసరిగా చూడవలసిన పుణ్యక్షేత్రాలుచూడక పోతే పుట్టగతులు ఉండవని కొంతమంది, చచ్చేలోపు ఈ దేశాలు, ప్రదేశాలు చూడకపోతే మీ లైఫ్ వేస్ట్ అయిపోయినట్లే అని కొంతమంది కంగారు పెట్టేస్తున్నారు.


అరవై దాటగానే నిలబడి నీళ్లు తాగకూడదని, పరిగెత్తి పాలు తాగాలని కొంతమంది,  పొద్దున్నే  వాకింగ్ చేస్తే న్యుమోనియా వస్తుందని కొంతమంది, పక్క వాళ్ళతో  కులాసాగా జోకులేస్తూ నవ్వుతూ వాకాలని కొందరు, సీరియస్ గా ముఖం పెట్టుకుని ఒగురుస్తూ వాకాలని మరికొందరూ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు.


 ఒకడు పరిగెత్తమంటాడు, ఇంకొకడు జాగింగ్ అంటాడు, వేరొకడు బ్రిస్క్ వాకింగ్ అంటాడు, మరొకడు స్లో వాకింగ్ అంటాడు. ఇవేవీ కాదు వెనక్కి నడవమంటాడొకడు. ఎందుకీ అనవసరపు శ్రమ, సీనియర్ సిటిజన్లు కుర్చీలో కాళ్ళూపుకుంటూ కూర్చుంటే చాలంటాడు మరో పెద్దమనిషి. ఏదినిజమో అందర్నీ అడుగుతూ హిమాలయాలదాక నడిచి వెళ్ళి కనుక్కుంటే కానీ తెలీదు.


ఉన్నది ఒక జీవితమే కాబట్టి,  క్రమం తప్పక  రోజూ లిమిటెడ్ గా 'మందు' వేస్తే గుండెకు ఆరోగ్యం అని ఒకరు, మందు పూర్తిగా మానేసి, క్రమం తప్పక రోజూ మందులేసుకుంటేనే జీవితం అంటూ మరొకరు నొక్కి వక్కాణిస్తున్నారు.


ఇక నేను రోజూ ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి, ఎక్కడ తినాలి , అలా తినక పోతే ఏమేం భయంకరమైన రోగాలు చుట్టుముడతాయి వగైరా వివరాలతో పోస్టులు పెట్టి చంపేసే వాళ్ళు ఇంకొందరు. ఒకరోజైతే ఓకే. ప్రతీ రోజూ అవే పోస్టులు!


బంధాలు, అనుబంధాలు అంటూ కొన్ని పోస్టులు. కోడలితో ఎలా ఉండాలి, అల్లరి చేసినా మనవల్ని ఎందుకు తిట్టకూడదు, కొడుక్కి ఎందుకు సలహాలు ఇవ్వకూడదు, బంధువులతో ఎలా మసలుకోవాలి అంటూ కొత్తగా కాపురానికి వెడుతున్న పిల్లకి జాగర్తలు చెప్పినట్లు రోజూ చెవిలో పోరుతున్నారు.


ఇప్పటిదాకా చెప్పినవి కొన్ని మాత్రమే. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. రోజూ వస్తున్నాయి. ఇవన్నీ చదివితే నేను పండు ముసలివాడిని అయిపోయినట్లు, అందరూ నన్ను అదోలా చూస్తున్నట్లు అనిపించేస్తోంది. అరవై ఏళ్ళు ఉత్సాహంగా, ఉల్లాసంగా, జయప్రదంగా జీవించిన నాకు అరవై దాటగానే చిన్నపిల్లలకి చెప్పినట్లు అన్నీ చెబుతూ ఈ పోస్టులేమిటో? 


అసలు రిటైర్ అవకముందు రాని ఈ పోస్టులు అన్నీ రిటైర్ అయినప్పటించే ఎందుకొస్తున్నాయి?  నేను శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నానని , నా జీవితం నా ఇష్టానుసారం గడపగలనని, నాకున్న బంధాలు, అనుబంధాలు స్ట్రాంగ్ గానే ఉన్నాయని, అందరికీ అరిచి చెప్పాలని ఉంది. కానీ ఎవరు వింటారు? ఈ విశ్రాంత జీవితంలో వీటి ప్రభావం నించి తప్పించుకోడానికి అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉండాలి. తప్పదు.

🙏🙏🙏

దశకం 18- పృథుచరితము



*దశకం 18-  పృథుచరితము*

*దశకం 18- శ్లోకం 4*


తన్నాశాత్‌ ఖలజనభీరుకైర్మునీం ద్రై:

తన్మాత్రా చిరపరిరక్షితే తదంగే ।

త్యకాఘే పరిమథితాదథోరుదండాత్‌

దోర్డండే పరిమధితే త్వమావిరాసీః ॥


ఆ వేనుని నాశనము వలన దుష్ట జనులు ఈ భూమియందు విచ్చలవిడిగా ప్రవర్తిచుండగా.,   మునిపుంగవులు భయపడిరి.


తన తల్లియైన సునీథ చే రక్షింపబడిన వేనుని శరీరములో తొడను మహర్షులు మథింపగా, అతని పాపమంతయు నశించెను. అటుపిమ్మట అతని బాహువును మథింపగా పృథువుగా నువ్వు అవతరించితివి.

శ్రీ ధూర్జటిమహాకవి ఇలా అంటున్నారు



🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


శ్రీ ధూర్జటిమహాకవి ఇలా అంటున్నారు


శా//అంతామిథ్య తలంచి జూచిన నరుం డట్లౌటెరింగిన్ సదా/ 

కాంతల్పుత్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ/

భ్రాంతిం జెంది జరించు గాని,పరమార్థంబైన

నీయందు దా/

జింతాకంతయు జింత నిల్పడు గదా! శ్రీకాళహస్తీశ్వరా!//


(జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ జగత్తులో 

కనిపించేవి,వినిపించేవి, అయిన సమస్త విషయములు అశాశ్వతములే.

ఈ విషయం తెలిసినప్పటికీ, మానవులు, భ్రాంతి వల్ల నా భార్య, ,నాభర్త,నాపుత్రులు,నాధనము,నా శరీరము,అని అశాశ్వతములైన వీటినుండి సుఖాన్ని ఆశిస్తూ అగాధమైన ఈ సంసార సముద్రములో తిరుగుచున్నారు.

శాశ్వతము,పరమసత్యము, అయిన నీగురించి "చింతచెట్టు ఆకు" అంత కూడా ఆలోచించటం లేదు)




భగవంతుని మీదికి దృష్టి పోకుండా సంసారంలో మనల్ని కట్టిపడేసే, ప్రాపంచిక బంధాలు చాలా బలవత్తరమైనవి.

వాటినుండి మనంతట మనం ముక్తి పొందలేము. ఈశ్వరానుగ్రహంతోనే అది సాధ్యం అంటున్నారు.


శా / ఆలంచున్ మెడ గట్టి, దానికి నపత్యశ్రేణి గల్పించి తత్/

బాల వ్రాతము నిచ్చి పుచ్చుటను సంబంధంబు గావించి యా/

మాలర్కంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పగా/

సీలన్ సీల యమర్చి నట్లొసగితో ! శ్రీకాళహస్తీశ్వరా! //


(స్వామీ! భార్యాభర్తలనే సంబంధం మెడకు కట్టావు. సంతానాన్ని కనటం అనే ప్రక్రియ ఏర్పాటు చేసావు. ఆడపిల్లలను ఇవ్వడం, కోడండ్రను,తెచ్చుకోవడం, అనే తతంగంతో క్రొత్త క్రొత్త బాంధవ్యాలను, ప్రేమలను కల్పిస్తున్నావు.

 ఈ విధంగా మానవులను సంసారంనుండి బయటపడకుండా త్రిప్పటం అనేది, మరలలో మేకులను గట్టిగా బిగించినట్లు ఉన్నది.

సీలలో సీలలాగా బిగింపబడిన ఈ బంధములనుండి మా అంతట మేము ఎలా బయటపడగలం?

శ్రీకాళహస్తీశ్వరా! నీవే దయతో ఈ బంధములనుండి విముక్తులను చేసి మాకు ముక్తిని ప్రసాదించు స్వామీ )


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

18-2-'26.

నేటిపెద్దలమాట

  🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏


     🌺శుభోదయం 🌺


🌺 నేటిపెద్దలమాట 🌺


"కష్టసుఖాలు కాలాలు వంటివి. నువ్వు వద్దు అనుకున్నా సరే నీ కర్మ ప్రకారం వచ్చి అవి ఉండగలిగినంత కాలం ఉండి వెళ్లిపోతాయి. దానిని నువ్వు అడ్డుకోలేవు, ఆపనూ లేవు. ఏదైనా చేయగలిగావంటే ఒక్కటే! వచ్చి పోయే ఈ కష్టనష్టాలు గురించి పట్టించుకోకుండా పరమాత్మను గట్టిగా పట్టుకో. నీవు చేయాల్సిన పనులు దోషం లేకుండా చేసుకో. నిన్ను ఏ కర్మ ఫలం కూడా ఏమీ చేయలేదు!. 


🌹 నేటిమంచిమాట 🌹


నీ 'ఇచ్చానుసారం' అన్ని జరగాలి అని అనుకున్నంత కాలం నీకు 'శాంతి' లభించదు.నువ్వు ఎప్పుడైతే 'భగవంతుని' ఇచ్చానుసారమై అన్నీ జరుగుతున్నాయి.నేను నిమిత్రమాత్రుడినే అనే భావనతో కర్తవ్యాలను నిర్వర్తిస్తావో, అప్పుడు మాత్రమే నిజమైన సంతృప్తి, 'శాంతి' నీకు లభిస్తాయి.


🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌺పంచాంగం🌺

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 18 - 02 - 2026,

వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

ఉత్తరాయనం,

శిశిర ఋతువు,

ఫాల్గుణ మాసం,

శుక్ల పక్షం,


తిథి : *పాడ్యమి* సా5.26 వరకు,

నక్షత్రం : *శతభిషం* రా10.00 వరకు,

యోగం : *శివం* రా11.42 వరకు,

కరణం : *బవ* సా5.26 వరకు

                తదుపరి *బాలువ* తె5.05 వరకు,


వర్జ్యం : *ఉ6.38 వరకు*

                              మరల *తె4.21 - 5.56*

దుర్ముహూర్తము : *ఉ11.50 - 12.36*

అమృతకాలం : *మ2.43 - 4.20*  

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : *కుంభం* 

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం : 6.29,

సూర్యాస్తమయం : 5.58


                 *_నేటి మాట_*

*"జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది??..."*

భగవంతుని యందు భక్తి భావన వల్ల కొంత వియోగం దుఃఖము అనుభవింప వలసి వస్తుంది.

( రూప నామములే నమ్మి నందు వల్ల)అది కూడా మార్గమే!... అందువల్ల "అంతర్యామిగా మీరు నన్ను చూసి నట్లయితే, అప్పుడు మీకు వియోగ దుఃఖము ఉండదు, మనస్సు లో శాంతి ననుభవిఁపగలరు," అని ఈశ్వర తత్వాన్ని గోపి కలకు చెప్పాడు కృష్ణ పరమాత్మ. 


ఇది మనందరికీ శిరోధార్యములైన మాట!!...

లోకంలో భూత ప్రేత పిశాచాలను ఆరాధనచేసి నిధులు పొందిన వారున్నారు. 

అవి ఈశ్వరుడే ఇవ్వవలసిన అవసరం లేదు. 

మరి భక్తులకు ఆయన ఏమి ఇస్తాడు అంటే!!... ఎవ్వరూ ఇవ్వలేని వస్తువునే ఆయన ఇవ్వాలి మరి. 

అది సృష్టి లో ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఈశ్వరుడు తప్ప, అట్టి వస్తువునే తానివ్వాలి. 

అదే ఆయన అధికారానికి తగినట్లుంటుంది. 

అట్టి వస్తువు ఏమిటంటే!!... అది జ్ఞానమే! 

చరిత్రలో అనేక మంది భక్తులు దరిద్రాన్ని అనుభవించారు, అయినా వాళ్ళు ఆయన కనపడినా కూడా ధనం అడగలేదు. 

ఈశ్వరానుగ్రహాన్ని, జ్ఞానాన్ని మాత్రమే కోరుకున్నారు, పొందారు.

తాను అనుభవించే సుఖ దుఃఖా లు, తన చేసుకున్న కర్మ ఫలితాలే అనే జ్ఞానం కలగాలి. 

ఈ రెండింటియందూ సమ భావం తో ఉండాలి. 

ఈ ప్రకారంగా తెలుసుకుని, చివరకు నేనే దైవం, శత్రువులు, మిత్రులు ఎవరూ లేరు, అందరూ దైవస్వరూపులే !... నేనే దైవం అనే జ్ఞానం కలుగుతుంది. 


             *_🌺శుభమస్తు🌺_*

🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏


     🌺శుభోదయం 🌺


🌺 నేటిపెద్దలమాట 🌺


"కష్టసుఖాలు కాలాలు వంటివి. నువ్వు వద్దు అనుకున్నా సరే నీ కర్మ ప్రకారం వచ్చి అవి ఉండగలిగినంత కాలం ఉండి వెళ్లిపోతాయి. దానిని నువ్వు అడ్డుకోలేవు, ఆపనూ లేవు. ఏదైనా చేయగలిగావంటే ఒక్కటే! వచ్చి పోయే ఈ కష్టనష్టాలు గురించి పట్టించుకోకుండా పరమాత్మను గట్టిగా పట్టుకో. నీవు చేయాల్సిన పనులు దోషం లేకుండా చేసుకో. నిన్ను ఏ కర్మ ఫలం కూడా ఏమీ చేయలేదు!. 


🌹 నేటిమంచిమాట 🌹


నీ 'ఇచ్చానుసారం' అన్ని జరగాలి అని అనుకున్నంత కాలం నీకు 'శాంతి' లభించదు.నువ్వు ఎప్పుడైతే 'భగవంతుని' ఇచ్చానుసారమై అన్నీ జరుగుతున్నాయి.నేను నిమిత్రమాత్రుడినే అనే భావనతో కర్తవ్యాలను నిర్వర్తిస్తావో, అప్పుడు మాత్రమే నిజమైన సంతృప్తి, 'శాంతి' నీకు లభిస్తాయి.


🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌺పంచాంగం🌺

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 18 - 02 - 2026,

వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

ఉత్తరాయనం,

శిశిర ఋతువు,

ఫాల్గుణ మాసం,

శుక్ల పక్షం,


తిథి : *పాడ్యమి* సా5.26 వరకు,

నక్షత్రం : *శతభిషం* రా10.00 వరకు,

యోగం : *శివం* రా11.42 వరకు,

కరణం : *బవ* సా5.26 వరకు

                తదుపరి *బాలువ* తె5.05 వరకు,


వర్జ్యం : *ఉ6.38 వరకు*

                              మరల *తె4.21 - 5.56*

దుర్ముహూర్తము : *ఉ11.50 - 12.36*

అమృతకాలం : *మ2.43 - 4.20*  

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : *కుంభం* 

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం : 6.29,

సూర్యాస్తమయం : 5.58


                 *_నేటి మాట_*

*"జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది??..."*

భగవంతుని యందు భక్తి భావన వల్ల కొంత వియోగం దుఃఖము అనుభవింప వలసి వస్తుంది.

( రూప నామములే నమ్మి నందు వల్ల)అది కూడా మార్గమే!... అందువల్ల "అంతర్యామిగా మీరు నన్ను చూసి నట్లయితే, అప్పుడు మీకు వియోగ దుఃఖము ఉండదు, మనస్సు లో శాంతి ననుభవిఁపగలరు," అని ఈశ్వర తత్వాన్ని గోపి కలకు చెప్పాడు కృష్ణ పరమాత్మ. 


ఇది మనందరికీ శిరోధార్యములైన మాట!!...

లోకంలో భూత ప్రేత పిశాచాలను ఆరాధనచేసి నిధులు పొందిన వారున్నారు. 

అవి ఈశ్వరుడే ఇవ్వవలసిన అవసరం లేదు. 

మరి భక్తులకు ఆయన ఏమి ఇస్తాడు అంటే!!... ఎవ్వరూ ఇవ్వలేని వస్తువునే ఆయన ఇవ్వాలి మరి. 

అది సృష్టి లో ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఈశ్వరుడు తప్ప, అట్టి వస్తువునే తానివ్వాలి. 

అదే ఆయన అధికారానికి తగినట్లుంటుంది. 

అట్టి వస్తువు ఏమిటంటే!!... అది జ్ఞానమే! 

చరిత్రలో అనేక మంది భక్తులు దరిద్రాన్ని అనుభవించారు, అయినా వాళ్ళు ఆయన కనపడినా కూడా ధనం అడగలేదు. 

ఈశ్వరానుగ్రహాన్ని, జ్ఞానాన్ని మాత్రమే కోరుకున్నారు, పొందారు.

తాను అనుభవించే సుఖ దుఃఖా లు, తన చేసుకున్న కర్మ ఫలితాలే అనే జ్ఞానం కలగాలి. 

ఈ రెండింటియందూ సమ భావం తో ఉండాలి. 

ఈ ప్రకారంగా తెలుసుకుని, చివరకు నేనే దైవం, శత్రువులు, మిత్రులు ఎవరూ లేరు, అందరూ దైవస్వరూపులే !... నేనే దైవం అనే జ్ఞానం కలుగుతుంది. 


             *_🌺శుభమస్తు🌺_*

🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


*655 వ రోజు*

అన్నదమ్ముల విధులు

ధర్మరాజు " పితామహా ! ఈ లోకములో అన్నదమ్ములు ఎలా ప్రవర్తించాలో తెలియజెయ్యండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! చిన్న వాళ్ళయిన తమ్ములు పెద్ద వారైన అన్నల ఎడల భక్తి శ్రద్ధలతో మెలగాలి. అలాగే అన్నయ్యలు కూడా తమ తమ్ముల పట్ల వాత్సల్యముతో ప్రవర్తించాలి. తమ్ములలో ఒకడు బుద్ధిహీనుడైనా పరవాలేదు కాని అన్నమాత్రము బాధ్యతా యుతంగా ప్రవర్తించక ఉన్న ఆ కుంటుంబం నాశనం ఔతుంది. అన్నదమ్ములు తమలో తాము తగవులు వదిలి పెద్దలు ఇచ్చిన ఆస్తిని సమంగా పంచుకోవాలి. అలా చేసిన లోకము వారిని కీర్తిస్తుంది. అలా చేయక వారిలో ఏ ఒక్కడైనా స్వార్ధంతో అంతా స్వాధీనం చేసుకున్న ఆ కుంటుంబం చిన్నాభిన్నంమై అపకీర్తి పాలు ఔతుంది. తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు అన్నయ్య. ఆయన భార్య తల్లి తరువాత తల్లి వంటిది. తల్లి తండ్రుల మరణానంతరం అన్నవదిన తల్లి తండ్రులతో సమానము. అన్నదమ్ములు ఎవరైనా మిగిలిన అన్నదమ్ములకు ద్రోహం చేసిన అతడు శిక్షార్హుడు ఔతాడు. తల్లి తరువాత అక్క తల్లి వంటిది. చిన్నతనంలో తనకు పాలిచ్చి పెంచిన ఆయాలు దాదులు తల్లివంటి వారే. తండ్రి తొలి గురువు. తండ్రి గురువుకంటే పదింతలు పెద్ద. తండ్రి కంటే తల్లి పదింతలు పెద్దది. తల్లి తండ్రులు శరీరం ఇచ్చి ఈలోకలోకి తీసుకు వస్తారు. గురువు విద్యాబుద్ధులు నేర్పి మరుజన్మ ప్రసాదిస్తాడు. గురువు ఇచ్చినజన్మ అజరామరమైనది కనుక గురువు అధికంగా పూజించ అర్హుడు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

ఉపవాస వ్రతము

ధర్మరాజు " పితామహా ! ఉపవాసవ్రతము బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే నిర్దేశింపబడింది. మిగిలిన వర్ణములకు కాదు అంటారు కదా ! పైగా ఎక్కువ ఉపవాసములు చెయ్యడం దోషము అంటారు కదా ! అసలు ఉపవాసము అంటే ఏమిటి ? దానికి ఉండవలసిన యోగ్యతలు ఏమిటి ? ఉపవాసము వలన కలుగు ఫలితం ఏమిటి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నువ్వు అడిగినట్లే నేను అంగీరసుడు అనే మునీశ్వరుడిని అడిగాను. ఆయన చెప్పినది నీకు చెప్తాను విను. బ్రాహ్మణుడు, క్షత్రియుడు మూడు రాత్రులు ఉపవసించ వచ్చు. శరీరము సహకరించి అనారోగ్యము పాలుకాకున్న మరి కొన్ని రోజులు ఉపవశించ వచ్చు. వైశ్యులు, శూద్రులు నాలుగు పూటలు మించి ఉపవసించ రాదు. పౌర్ణమి, శుక్లపక్ష అష్టమి, చతుర్ధశి, శుక్లపక్ష పంచమి, షష్టి, అలాగే బహుళ పంచమి, షష్టి ఉపవాసముకు తగిన పర్వ దినములు. రోజుకు ఒక రోజు మాత్రమే తిని ఉపవాసము ఉండు బ్రాహ్మణుడికి అందమైన భార్య, సంతానం కలుగి ఐశ్వర్యవంతుడు ఔతాడు. ఇలా ఒక్క సంవత్సరము ఉపవాసము ఉన్న అతడికి ఈ లోకములోని సౌఖ్యములన్నీ పొందుతారు. ఎన్ని రోజులు ఉపవాసము ఉంటే అన్ని సౌఖ్యములు కలుగుతాయి. ఒక సంవత్సరములో 15 రోజులు ఉపవసించిన పుణ్యలోకప్రాప్తి కలిగుతుంది. ఒక మాసము ఉపవసించిన బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుంది. కాని ఎవరూ సంవత్సరంలో ఒక మాసము మించి ఉపవసించ రాదు. యుగయుగానికి మనుష్యునికి ఉపవాస సామర్ధ్యము మారుతుంది కనుక వారి కాల ప్రమాణం అనుసరించి ఉపవాస దినముల సంఖ్య మారుతుంటుంది. తల్లిని మించిన గురువు, వేదముకు మించిన శాస్త్రము, ధర్మముకు మించిన లాభము లేదు. పవిత్రములైన వాటిలోక్లెల్లా బ్రాహ్మణుడు పవిత్రుడు. కనుక బ్రాహ్మణుడిని భక్తితో పూజించాలి. పూర్వము దేవతలు మునులు ఉపవాసధర్మము అనుసరించి గొప్పవాళ్ళు అయ్యారు. విశ్వామిత్రుడు తన జీవితమంతా ఏక భుక్త్వము చేసి బ్రాహ్మణత్వము పొందాడు. కనుక ఉపవాసముకు మించిన వ్రతము లేదు. ఉపవాసవ్రతము అనుసరించడం వలన మనసు శరీరము పవిత్రమౌతాయి. పైన చెప్పిన ఉపవాస ధర్మము లోకముకు అంగీరస మహర్షి అందించాడు. అంగీరసుడు చెప్పిన విధంగా వ్రతాచరణ చేసిన మానవుడికి పాపములు అంటవు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ ప్రసన్న వరదరాజ పెరుమాళ్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1392


⚜ తమిళనాడు : శూలగిరి


⚜ శ్రీ ప్రసన్న వరదరాజ పెరుమాళ్ ఆలయం



💠 భారతదేశంలోని తమిళనాడులోని శూలగిరిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన దేవాలయం . 



💠 వరదరాజ పెరుమాళ్ ఆలయం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా శూలగిరిలో ఉంది.

 ఈ పురాతన ఆలయం ప్రసిద్ధి చెందిన విష్ణు దేవాలయం. 


💠 ఈ ఆలయాన్ని చాలా కాలంగా అనేక మంది రాజులు నిర్మించారు. మహాభారత కాలంలో అర్జునుడు వనవాస కాలంలో ఈ ఆలయాన్ని ప్రతిష్టించాడు . 


💠 ఈ ఆలయంలోని గర్భగ్రహాన్ని చోళ రాజులు నిర్మించారు . 

ముందు హాలు (మండపం) విజయనగర సామ్రాజ్యానికి చెందిన కృష్ణదేవరాయలు నిర్మించారు . తరువాత, హొయసల రాజులు , మరియు విజయనగరానికి చెందిన చిన్న రాజులు ఈ ఆలయాన్ని క్రమంగా విస్తరించి పూజలు చేశారు.


💠 ద్వాపర యుగంలో, పంచపాండవులు దుర్యోధనుడి చేతిలో జూదంలో ఓడిపోయినప్పుడు , జూదం నిబంధనల ప్రకారం వారిని అడవిలో బహిష్కరించారు. 


💠 వనవాస కాలంలో, పంచ పాండవులు అనేక ప్రదేశాలకు వెళ్లి శూలగిరికి కూడా వచ్చారు. శూలగిరిలో, అర్జునుడు వరదరాజ పెరుమాళ్‌ను ప్రతిష్టించి పూజించాడు. 

పంచ పాండవులు ఈ ప్రదేశానికి వచ్చినందుకు గుర్తుగా, శూలగిరి కొండలో 5 పెద్ద రాళ్ళు కలిసి ఉన్నాయి 


💠 శూలగిరి కొండ త్రిశూలాన్ని (తమిళంలో శూలం) పోలి ఉండటం వల్ల, ఈ ప్రదేశానికి కాలక్రమేణా 'శూలగిరి' అనే పేరు వచ్చింది.


💠 శ్రీ ప్రసన్న వరదరాజ పెరుమాళ్ దేవాలయం షూలగిరిలో మూడు కొండల పాదాల మీద కలిసి కలుస్తుంది కాబట్టి దీనిని త్రికూటాచల క్షేత్రం అని పిలుస్తారు. 


💠 ఈ ఆలయాన్ని దక్షిణ వైకుండం లేదా హస్తశైల శ్రీ క్షేత్రం అని కూడా అంటారు. 


💠 ఈ ఆలయంలో వరదరాజ పెరుమాళ్ పశ్చిమ ముఖంగా ఉంటాడు. 

తల్లి పెరుందేవి మహాలక్ష్మి ప్రత్యేక గర్భగుడిలో తూర్పు ముఖంగా ఉంటారు.


💠 ప్రతి సంవత్సరం ఉత్తరారణ్య కాలంలో (జనవరి మధ్య నుండి జూలై మధ్య వరకు), సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు వరదరాజ పెరుమాళ్ పాదాలపై పడతాయి.


💠 ఉత్తరాయణ కాలంలో అస్తమించే సూర్యకిరణాలు పెరుమాళ్ పాదాలపై పడడంతో, ఆయనను ఉదయస్థగిరినాధర్ అని పిలుస్తారు .


💠 ఈ ఆలయం పడమర ముఖంగా ఉంది మరియు ఇరుకైన వీధిలో ఉంది. 

భక్తులు పశ్చిమ ముఖంగా ఉన్న ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 20 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. 

ఈ ఆలయంలో మూడు అంచెల రంగుల రాజగోపురం ఉంటుంది. 


💠 ఈ ఆలయం అసలు పేరు 

శ్రీ భూ నీలా పెరుందేవి నాయికా సమేత శ్రీ ప్రసన్న వరదరాజ పెరుమాళ్ ఆలయం. 


💠 ఈ ఆలయం ఉన్న ఇరుకైన వీధిని కృష్ణగిరి జిల్లా పరిధిలోకి వచ్చే శూలగిరిలోని హస్తగిరిపురం అని పిలుస్తారు.


💠 రాజగోపురం క్రింద ఆళ్వార్లు, గణపతి విగ్రహం మరియు ఆంజనేయ విగ్రహం ఉన్నాయి. మూలస్థానానికి ఎదురుగా గరుడాళ్వార్ సన్నధి ఉంది. 


💠 అనేక స్తంభాలు కలిగిన బహుళ స్తంభాల మండపంలో శ్రీకృష్ణుడు, నవ నరసింహుడు, దశావతారం మొదలైన అనేక విగ్రహాలు ఉన్నాయి. 


💠 గర్భగుడి బహుళ స్తంభాల మండపంలో ఉంది మరియు పశ్చిమ ముఖంగా ఉంది, దీనిలో శ్రీ ప్రసన్న వరదరాజ పెరుమాళ్ నిలబడి ఉన్న భంగిమలో కనిపిస్తాడు. మూలవార్‌తో పాటు నమ్మాళ్వార్, విశ్వక్సేనర్ మరియు రామానుజర్ విగ్రహాలు ఉన్నాయి. 


💠 ఈ ఆలయం యొక్క మరొక లక్షణం భక్తులు మూలస్థానాన్ని లోపలి నుండి ప్రదక్షిణ చేయవచ్చు. శ్రీ వీర ఆంజనేయర్ మరియు శ్రీ భక్త ఆంజనేయర్ ఉన్న రెండు ఉప మందిరాలు ప్రక్కనే ఉన్నాయి. 


💠 సమీపంలో ఒక జత యాగకుండం ఉంది. 

తాయార్ సన్నధి తూర్పు ముఖంగా ఉంది మరియు ఆమెను పెరుందేవి మహాలక్ష్మి తాయార్ అని పిలుస్తారు, ఆమె పద్మాసనములో కనిపిస్తుంది. 


💠 ఆమె మందిరానికి ఎదురుగా అర్జునుడి లక్ష్యాన్ని గుర్తుచేసే ఒక చేప చిహ్నం ఉంది మరియు దానికి దగ్గరగా చంద్రుడిని మింగినట్లుగా ఒక పాము ఉంది. 

ఈ చిత్రాలు పైకప్పుపై వర్ణించబడ్డాయి. 


💠 ప్రతి ఉత్తరాయణం సమయంలో సూర్య భగవానుడు విష్ణువును పూజిస్తాడు మరియు ఈ రోజుల్లో సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ఇక్కడ అధిష్టాన దేవత పాదాల వద్ద పడతాయి.

 ఈ ఆలయాన్ని రాహు కేతు పరిహార స్థలంగా పరిగణిస్తారు.


💠 ప్రతి సంవత్సరం మే 21వ తేదీన వరదరాజ పెరుమాళ్ జయంతిని పురస్కరించుకుని వరదరాజ్ పెరుమాళ్ మరియు తాయార్ పెరుందేవి మహాలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు, హోమాలు మరియు కళ్యాణోత్సవం నిర్వహించారు.


💠 గరుడ సేవ వైకుంఠ ఏకాదశి మరియు మార్గశి తమిళ మాసంలో (డిసెంబర్ మధ్య - జనవరి మధ్యలో) జరుగుతుంది . సమీపంలోని అన్ని ఆలయాలతో ఈ ఆలయంలో అతిపెద్ద గరుడ వాహనం ఉంది.


💠 హోసూర్ నుండి షూలగిరికి దూరం 26 కి.మీ.,బెంగళూరు నుండి షూలగిరి దూరం 64 కి.మీ.


రచన

©️ Santosh Kumar

శ్రీ ధూర్జటిమహాకవి ఇలా అంటున్నారు

 


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


శ్రీ ధూర్జటిమహాకవి ఇలా అంటున్నారు


శా//అంతామిథ్య తలంచి జూచిన నరుం డట్లౌటెరింగిన్ సదా/ 

కాంతల్పుత్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ/

భ్రాంతిం జెంది జరించు గాని,పరమార్థంబైన

నీయందు దా/

జింతాకంతయు జింత నిల్పడు గదా! శ్రీకాళహస్తీశ్వరా!//


(జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ జగత్తులో 

కనిపించేవి,వినిపించేవి, అయిన సమస్త విషయములు అశాశ్వతములే.

ఈ విషయం తెలిసినప్పటికీ, మానవులు, భ్రాంతి వల్ల నా భార్య, ,నాభర్త,నాపుత్రులు,నాధనము,నా శరీరము,అని అశాశ్వతములైన వీటినుండి సుఖాన్ని ఆశిస్తూ అగాధమైన ఈ సంసార సముద్రములో తిరుగుచున్నారు.

శాశ్వతము,పరమసత్యము, అయిన నీగురించి "చింతచెట్టు ఆకు" అంత కూడా ఆలోచించటం లేదు)




భగవంతుని మీదికి దృష్టి పోకుండా సంసారంలో మనల్ని కట్టిపడేసే, ప్రాపంచిక బంధాలు చాలా బలవత్తరమైనవి.

వాటినుండి మనంతట మనం ముక్తి పొందలేము. ఈశ్వరానుగ్రహంతోనే అది సాధ్యం అంటున్నారు.


శా / ఆలంచున్ మెడ గట్టి, దానికి నపత్యశ్రేణి గల్పించి తత్/

బాల వ్రాతము నిచ్చి పుచ్చుటను సంబంధంబు గావించి యా/

మాలర్కంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పగా/

సీలన్ సీల యమర్చి నట్లొసగితో ! శ్రీకాళహస్తీశ్వరా! //


(స్వామీ! భార్యాభర్తలనే సంబంధం మెడకు కట్టావు. సంతానాన్ని కనటం అనే ప్రక్రియ ఏర్పాటు చేసావు. ఆడపిల్లలను ఇవ్వడం, కోడండ్రను,తెచ్చుకోవడం, అనే తతంగంతో క్రొత్త క్రొత్త బాంధవ్యాలను, ప్రేమలను కల్పిస్తున్నావు.

 ఈ విధంగా మానవులను సంసారంనుండి బయటపడకుండా త్రిప్పటం అనేది, మరలలో మేకులను గట్టిగా బిగించినట్లు ఉన్నది.

సీలలో సీలలాగా బిగింపబడిన ఈ బంధములనుండి మా అంతట మేము ఎలా బయటపడగలం?

శ్రీకాళహస్తీశ్వరా! నీవే దయతో ఈ బంధములనుండి విముక్తులను చేసి మాకు ముక్తిని ప్రసాదించు స్వామీ )


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

18-2-'26.

విఘ్నేశ్వర స్తుతి

   ☘️విఘ్నేశ్వర స్తుతి🙏


సీ .పార్వతినందనా! పరమపురుషనిను 

సేవింతు నిత్యము చింత తీర్చు

సకలభూ తాదులు సైతంబు నినుకొల్చు

శివదేవ సుతుడవు శిష్ట గాత్ర 

లంబోదరా! వేగరావయ్య పుడమికి

దనుజసంహారక ధర్మ చరిత 

విఘ్నవినాయక! వేదవే ద్యనిరతము

మముకావగా రావ మమతతోడ

తే ఘనముగనినుకొలిచెదము గౌరి తనయ!

సాధుజన పరిరక్షక సత్యపాల

సర్వదేవ గణార్చిత సాధుశీల

అగ్ర పూజలొ నర్తు గణాగ్రగణ్య!


 సాహితీ శ్రీ జయలక్ష్మి

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - ప్రతిపత్ - శతభిషం -‌‌ సౌమ్య వాసరే* (18.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*