28, అక్టోబర్ 2020, బుధవారం

నవగ్రహ దర్శనం

 *నవగ్రహ దర్శనం తరువాత కాళ్ళు  కడుక్కోవాలా*


ఈ మధ్యకాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి.

నవగ్రహాలను దర్శించిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మములోనూ చెప్పబడలేదు. ఈమధ్యకాలంలో క్రొత్తగా నవగ్రహాలు అంటే దోషాలు తొలగించేవి అని, దోషాలన్నీ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే పోతాయని ప్రదక్షిణలు చేసి ఆ దోషాలు నవగ్రహాల వద్దనే వదిలేసి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తున్నాం అయిపోయింది అని ఇటువంటి భావజాలం క్రొత్తక్రొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ సత్యదూరాలు. ఆలయంలోనికి వెళ్ళే పూర్వమే కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే ఇంటిలోనుంచి బయలుదేరే సమయంలోనే ఆలయానికి వెళ్తున్నాం అనే భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి, పూలు, పూజాసామగ్రి తీసుకొని మౌనంగా దేవాలయానికి వెళ్ళాలి. నవగ్రహాల గుడికే వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని, తరువాత ప్రధాన దేవాలయానికి, అలా లేనప్పుడు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఉప ఆలయాలలో ఇతర దేవీదేవతల దర్శనం చేసుకొని ఆ పిమ్మట నవగ్రహాలను కూడా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి. మధ్యలో ఈ కాళ్ళు కడుక్కోవడం అన్న వ్యవహారం ఎక్కడా లేదు. ఇంటిలోనుంచి ఆలయం కాస్త దూరం అయితే ఆలయంలోకి ఈ దుమ్ము కాళ్ళతో వెళ్ళడం ఇబ్బందికరం కనుక ఆలయ పరిశుభ్రతకు ఆటంకం అన్న ఉద్దేశంతో అలాగే స్నానం చేసిన శుభ స్వరూపం మారిపోతుంది కనుక ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కాళ్ళు కడుక్కొని నవగ్రహాల గుడికి అనుకుంటే నవగ్రహ ప్రదక్షిణం చేసి ప్రధాన దైవదర్శనం చేసి ఇంటికి రావాలి. అంతేకానీ దేవతారాధన చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోకూడదు. లఘుశంక వంటి వాటికి వెళ్ళినప్పుడు, ఏదైనా అపశబ్దం విన్నప్పుడు కాళ్ళు కడుక్కుంటాం. కాళ్ళు కడుక్కోవడం అంటే స్నానం చేయడంతో సమానం. నవగ్రహారాధన కూడా దేవతారాధనలో అంతర్భాగమే కనుక నవగ్రహ దర్శనం చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలి అనడం సత్యదూరము. అది మంచి పద్ధతి కాదు. నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఆ దైవ వీక్షణం మనమీద ఉంటుంది. అలాంటప్పుడు మనం కాళ్ళు కడుక్కుంటే దేవతాభావం దూరమైనట్లే. కావున అలా కాళ్ళు కడుక్కోకూడదు. ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కడుక్కోవాలి. ఆలయంనుంచి నేరుగా ఇంటికే రావాలి. ఎవరింటికీ వెళ్ళకూడదు.

విదురనీతి

 *విదురనీతి*


*యస్య సంసారిణీ ప్రజ్ఞా ధర్మార్థావనువర్తతే*

*కామాదర్థం వృణీతే యః స వై పండిత ఉచ్యతే*


ప్రసరించే అతని బుద్ధి ధర్మాన్ని అర్థాన్ని అనుసరిస్తుంది.

శారీరక సుఖానుభవం కన్నా పురుషార్థాన్నే అతడు కోరుతాడు.

అతడే పండితుడు.


*శుభమ్*

 *ఆధ్యాత్మిక జీవనము*


జీవితంలో మన వ్యక్తిత్వం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక దాని మీద ఒకటి పనిచేస్తూ ఉంటాయి. వ్యక్తిత్వానికి అనేక స్థాయిలున్నాయి. అలాగే పరిస్థితులకు కూడా. భౌతిక శరీరం-భౌతిక ప్రపంచంతో, మనస్సు-మానసిక ప్రపంచంతో సంపర్కంలో ఉన్నాయి. అలాగే మన ఆధ్యాత్మిక శరీరం లేదా ఆత్మ, పరమాత్మతో అనుసంధానించబడి ఉంది. 


మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఆ స్థాయిలోని అనుభవాలను మనం యథార్థంగా భావిస్తాము. మనం మేలుకుని ఉన్నప్పుడు చుట్టూ రకరకాల వస్తువులను, సంఘటనలను చూస్తూ వాటితో తాదాత్మ్యం చెందుతూ ఉంటాము. నిద్రపోతున్నంతసేపూ కలలలో కనిపించే వేరే ప్రపంచమే యథార్థంలాగా తోస్తుంది. 


మనకు ఇలా కనిపించే దర్శనాలన్నీ నిజం కాకపోవచ్చు. ఏది నిజమో, ఏది కలో గ్రహించగలగడమే అసలు సమస్య. 


ఇలా మనం గ్రహించే జ్ఞానంలో ఏది సరియైనది అన్న విషయం మీద భారతీయ తత్త్వశాస్త్రంలో సుదీర్ఘంగా చర్చించబడింది. 


భౌతిక శాస్త్రవేత్తలు భౌతికమైన విషయాలను గురించిన సత్యాలను తెలుసుకోవాలనుకుంటారు. 


అలాగే మానసిక నిపుణులు కూడా మనస్సులోకి తొంగిచూసి, ఆలోచనలకు సంబంధించిన నియమాలను దర్శిస్తుంటారు. 


ఆధ్యాత్మిక సాధకుడు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా అనుభూతి చెందాలని ప్రయత్నిస్తుంటాడు. దీనినే అపరోక్షానుభూతి అంటారు.


*శుభంభూయాత్*


 

చాలా చాలా ప్రేమించి ఉంటారు.

 ఇప్పటిదాకా బంగారాన్ని ఆస్తుల్నీ హోదాల్నీ ఎలక్ట్రానిక్ ఉపకరణాల్ని ....ఇంకా వేటి వేటినో చాలా చాలా ప్రేమించి ఉంటారు....ఆ ప్రేమతోనే ఒక్కసారి కన్నయ్యను ప్రేమించి చూడండి..ఇంకా దేన్ని ప్రేమించాల్సిన అవసరం బహుశా రాదేమో, ఆ సుందర మోహనకారుడి అద్వీతీయ మనోహర అనుపమాన రూపలవణ్యాలను మనోనేత్రాలతో మీ హృదయ వాకిట ప్రతిష్ట చేసుకోండి,ఇంకా దేనిని ద్వేషించాల్సిన అవసరం మునుముందెన్నడూ మీకు కలగకపోవచ్చు..ఉట్టిమీద పాలమీగడలు దొంగిలించిన  ఆ అమాయక మానస చోరుడిని మీ మనసులోకి ఆవాహన చేసుకొండొక్కసారీ...అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతం ఎత్తి పట్టుకున్న ఆ పరందాముడి లీలా వినోదాలను చేతులు జోడించి కృష్ణా... కృష్ణా....అని ప్రేమతో మీ కంటిలో నిలుపుకోండి, ఆ కంటిలో ఆనంద భాష్పాలే తప్ప విచారాలు నేలారాలవు...   

ఆ కృష్ణ ప్రేమప్రవాహంలో గోపికలై తరించిండి, కాళింది కదిలినప్పుడు తకదిమి తకదిమి అంటూ నాట్యం చేయడానికి,ఆ విషపునాగులను పారద్రోలాడానికి మీ చెంత వేణుగానాన్ని అలపిస్తూ ఉంటాడు,కానీ నువ్వే గుర్తించట్లేదు....పసిబాలుడు,అందునా ముద్దుగారే యశోదాతనయడు,దేవకినందనుడు...కోటి సూర్యకాంతి ప్రభలతో వెలిగే ఆ ముద్దుమోమును తుదముట్టించడానికి ఎన్ని పన్నగాలు పన్నారు,బకాసురుడు తృణావర్తుడు శకాటసురుడు కంసచాణురాది రక్కసులు...అయినా ఆ తుంటరి కిట్టడు ఆసురులను పావులుగా చేసుకుని హాయిగా చందరంగం ఆడేసుకున్నాడు...ఆ ధైర్యాన్ని ఆ 

గుండెబలాన్ని కన్నయ్య రూపాన ఆవాహన చేసుకుని సమస్యలకై మనం పోరాటం చేద్దాం..కన్నయ్య మన జీవితాల్లోకొస్తే ద్వేషం అనే పదం మనం ఉపయోగించాల్సిన అవసరం ఉండదేమో...అంతా కృష్ణమయమే అవుతుంది, ప్రేమమయమే అవుతుంది.... ఆ కన్నయ్యే మన సమస్యలకు గీతాచార్యుడు, ఆ కన్నయ్యే మన నుదుటి నొసల గీతలు మార్చే గీతాగోవిందుడు.....ఆ కన్నయ్య పాదాలు పట్టుకుందాము, ఇంకా దేనిని పట్టుకోవాల్సిన అవసరం మనకు జన్మలో రాదు...కృష్ణా నీ ప్రేమ బృందావన ధూళినైనా మామీద కురియించు...ఆ మధూళి ధూళిలో నిర్జరులమై నీ చెంత సేదతీరుతాము కన్నయ్య.... అవకాశమివ్వు......

శివపురాణం - 1 వ భాగం

 🙏🌺శివపురాణం - 1 వ భాగం


🌹మొదటి రోజు 🌹🙏


శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.


'శివ' అనే శబ్దము చాలా గొప్పది. శివమహాపురాణము శివ శబ్దముతోటే ప్రారంభమయింది. శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశము మనకు సాధికారికమయిన గ్రంథము. దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు. ఆయన అమర కోశముతో పాటు అనేక గ్రంధములను రచించాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. అపుడు ఆయనకు బాధ కలిగింది. 'నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను - కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి అయిపోయాయి' అని ఆయన తన గ్రంథములనన్నిటిని తగులబెట్టేశాడు. ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్య మూర్తి. ఆయన వచ్చి 'ఎంత పని చేశావయ్యా! గ్రంథములను ఎందుకు తగులబెట్టావు?' అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము. అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు, పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్త్వికమయిన విషయములను, నామములకు, అనేకమయిన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంధాన్ని అమరకోశము అని పిలుస్తారు. ఏదయినా ఒక విషయమును ప్రతిపాదన చేసేముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు.


శివ అన్నమాటను ఏవిధంగా మనం అర్థం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములయిన అర్థములు చెప్పబడ్డాయి. 'శివ' 'శివా' అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి. 'శివ' అంటే శంకరుడు. 'శివా' అంటే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపము.

అమరకోశములో 'శివః' అంటే - 'శామ్యతి, పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి యితి శివః' - శివుడు నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి. వీటిని షడ్వికారములు అంటారు. ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ ఆరు వికారములు లేనిది ఏదయినా ఉన్నదా? ఉన్నది. అదే ‘శివ’. ఆయన నిర్వికారమై, నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు. వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది. కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్ళకు కనపడడు. మరి ఈయనకు రూపం తీసుకు వచ్చి చూస్తే ఎలా ఉంటాడు?


అమరకోశంలో అమరసింహుడు ఆయనను 'పరమానంద రూపత్వ' అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఃఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్నివేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందము అనేది బయటవున్న వస్తువులలో లేదు. లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకుని అరమోడ్పు కన్నులతో వుంది తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే 'శివ'. ఆనంద ఘనమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలోతాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనస్సులో కదలిక ఉండదు. మనం అందరం కూడ కదులుతున్న తరంగములతో కూడిన సరోవరములలాంటి వారము. మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మనుండి విడివడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదానివెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు, దుఃఖములకు కూడ హేతువులు అవుతుంటాయి. ఇటువండి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలోనుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద ఘనమునకు 'శివ' అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్యడైవము. అమరకోశంలో 'శేరతే సజ్జనమనాం స్యస్మిన్నితి' - ఈయన యందు సజ్జనుల మనస్సు రమించుచుండును అని చెప్పబడింది. శివ స్వరూపమును పట్టుకుంటే అది ఏరూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనస్సు యిష్టపడిన దానితో మీరు రమించి పోవడం ప్రారంభించినా, అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినయినా యివ్వగల సమర్ధుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరికున్నదేదీ ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అదీ ఆయన గొప్ప! మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. మీరు అడిగితే యిచ్చినవాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్లి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారి పోయినట్లు అయిపోతుంది. ఒకరి దగ్గరకు వెళ్లి వాచికంగా 'నాకిది యిప్పించండి' అని అడగడం ఆత్మహత్యా సదృశమే అవుతుంది. శీలం ఉన్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత బిడియ పడిపోతాడు. అడగలేడు. అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకునే వారు. అది వాళ్ళ రోషమునకు చిహ్నము. వాని రోషమునకు, శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకొని అప్పు ఇచ్చేవారు. మీరు శివ స్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు.


అమరకోశంలో అమరసింహుడు శివ శబ్దమునకు ‘సజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగిన వాడు’ అని అర్థం. అది ఎలా రమిస్తుంది? దేనివలన? దానికి ఈ కారణము, ఆ కారణము అని చెప్పడం కుదరదు. మీకు మనస్సు ఉంటె భక్తీ ఉంటె ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుడియందు మనస్సు రమిస్తే వానికి సమస్తమయిన ఐశ్వర్యము కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది.


అమరకోశంలో శివ శబ్దమునకు మరొక నిర్వచనం చెప్తూ - 'చేతే సజ్జన మనాంసి ఇతివా' - సాధువుల మనస్సునందు తానుండు వాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును శివునియందు పెట్టారు. లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే రెండు గండు తుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టుకొని రమించిపోతున్నదో, ఎవరు శృతి ప్రమాణముచేత పరవశించి పోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అనగా ఆయనే శివుడయిపోయి ఉంటాడు.


అమరకోశంలో శివునకు చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్లయితే శివుడిని ఏ రకంగానయినా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది. శివనామము పంచాక్షరీ మంత్రములో దాచబడింది. ‘నమశ్శివాయ’ అనేది పంచాక్షరీ మంత్రము. ‘నమశ్శివాయ’ అనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది.


మనకి వేదములు నాలుగయినా, సంప్రదాయంలో వాటిని మూడుగా వ్యవహరిస్తాము. అందుకే శంకరాచార్యుల వారు కూడ శివానందలహరిలో - 'త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం' అన్నారు.


త్రయీవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, ఈ మూడు వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రీ ఉపదేశంతో ఈ మూడు వేదములు చదువవచ్చు. కానీ అధర్వవేదం చదవడానికి, ఈ మూడు వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు. అధర్వ వేదం చదవడానికి మరల ఉపనయనం చేసుకొని, ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు. ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా మూడు వేదములను అలా పెడితే ఈ మూడు వేదములలో మధ్యలో వున్నది యజుర్వేదము. యజుర్వేదమునకు ఏడు కాండలు ఉన్నాయి. మరల యిందులో మధ్యప్రాకారము నాల్గవ కాండ. ముందు మూడు, వెనుక మూడు ఉండగా, మధ్యలో నాల్గవది వుంది. ఈ నాల్గవ కాండలో రుద్రాధ్యాయం ఉంది. రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకమును మీరు చదివినట్లయితే -


నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ

నమశ్శంజ్గాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హన్త్రే చ హనీయ సే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమ స్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమశ్శంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శ్శివతరాయచ!!( శ్రీ రుద్రాధ్యాయం - అష్టమానువాకం-1 - 11)


అష్టమానువాకం చివరి పాదంలో 'నమశ్శివాయ చ' అనే పదమును పెట్టారు. ఈ నమశ్శివాయ చ' ముందు 'మయస్కరాయ చ ' అని ఉంచారు. 'మయస్కరాయ చ' అంటే గురువు. గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి. ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైతసిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదూ మరెవరో కాదు, సాక్షాత్తు శంకరుడే! ఎలా చెప్పగలరు? ఈ విషయం రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉన్నది. 'నమః కపర్దినే చ వ్యుప్త కేశాయ చ' అని. 'కపర్దినే చ' అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. 'వ్యుప్తకేశాయ చ' అంటే అసలు వెంట్రుకలు లేని వాడు. మొత్తం పూర్ణ ముండనం చేయించుకొని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే వున్నా నామంలో పెద్ద జటాజూటం వున్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే వున్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో వున్నవాడు. ఈ రెండూ ఎలా సమన్వయము అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడయినా చెప్పారా? దీనికి వ్యాసభగవానుడు వాయుపురాణంలో 'శివుడు గుండుతో ఉన్నాడు' అని చెప్పారు. మరి గుండుతో శివుడు ఎక్కడ వున్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణ ముండనం చేయించుకున్న శివ స్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయు పురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు -


'చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి'


'నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో వుండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు' అని చెప్పబడింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండు మీద వేసుకొని, చేతిలో వేదములు పట్టుకొని యిలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామి వారు.


నమః కపర్దినే చ - పరమశివుడు. వ్యుప్తకేశాయ చ - శంకరాచార్యుల వారు కాబట్టి ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు పరమశివుడే! ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పింది. ఆయనను మయస్కరాయ చ - ఆ శంకరుల గురుపరంపర ఉన్నదే అది -సదాశివ సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం!


అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!


ఆనాడు శంకరుడు కపర్ది అని యింత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమయిన ఈ గురుపరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురుపరంపరే నడుస్తున్నది.


ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవైదికమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి, అవతార స్వీకారం చేసారు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారమును చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా భాసిల్లుతున్నది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ తత్త్వం. అదే ఒకనాడు కృష్ణుడిగా భాసించింది. అటువంటి భగవద్గీతను యిచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం, ఎందుకో కలియుగంలో వచ్చే ప్రమాదములనుండి ఉద్ధరించ గలిగినంత జ్ఞానబోధ చెయ్యలేదు? దానికి ఒక్కటే కారణం. ద్వాపరయుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసే వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది.


కృష్ణావతార ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు. జరాసంధాది రాక్షసులనందరిని ముందరే చంపి ఉండకపోతే, కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబదగలరా! అవతారంలో వున్నా తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాజ్ఞ్మయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోలేదు. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగము. కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోనడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయభాష్యంతో మొదలుపెట్టి, ఈశ్వరుడిని స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాజ్ఞ్మయమును జ్ఞానబోధ తప్ప యింకొక ప్రయత్నమూ కాని, పని కాని పెట్టుకోకుండా, ముప్పది రెండేళ్ళ జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్రభాష్యము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు. వారి పేరు చెబితే చాలు, మన పాపములు పటాపంచలు అయిపోతాయి.


శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!

నమామి భగవత్పాద శంకరం లోకశంకరం!!


అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమిమీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం – యివన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రేయం, శోభనం ఇంక ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడయాడినాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురురూపంలో నడయాడుతున్నాడు. కాబట్టి మనం గురురూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి.


గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః!

గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!


అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడై, శోభనములు ఇచ్చేవాడై, మంగళ ప్రదుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు, ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్త్వబోధ చేసే వాడిని తయారుచేయాలని గోవిందపదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన ఆర్షజాతి, సనాతన ధర్మము, పురాణములు ఎంత గొప్పవో, ‘శివ’ అనేమాట ఎంత గొప్పదో, ‘శివం’ అన్నమాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో, దానిని గురించి వినినా, దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశము పొందుతామో గ్రహించాము.


పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం

బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా

నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్

శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!


‘శివా! నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకరము’ అంటారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి, అటువంటి శివనామం గురువై నడవటం గురించి, శివనామ మంగళత్వం గురించి, ఆ నామము ఎంతగా భక్తులను ఆదుకునేదో దాని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము.

       (2వ భాగము రేపటి రోజున)

నేటి ఆత్మ విచారం

 🕉️☸️🕉️☸️🕉️☸️🕉️☸️🕉️


          *_🌹నేటి ఆత్మ  విచారం 🌹_*


*_నిజానికి ఈ ప్రపంచంలో ఏది ఎవరికోసం ఆగదు. ఏది ఏ ఒక్కరిపైనో ఆధారపడి లేదు._*


*_మనలో ప్రతివాళ్ళము ప్రత్యామ్నాయం లేనంత ప్రత్యేకమైన  వాళ్ళమేమి కాదు. ఆ సమయానికి, ఆ రంగానికి అప్పటివరకు మనం ముఖ్యమే కావొచ్చు !కానీ మన చోటును, మన లోటును మరొకరు భర్తీ చేయలేనంత ముఖ్యమేమి కాదని మాత్రం ప్రతి ఒక్కరమూ తెలుసుకోవాలి._* 


*_మనం చాలా సార్లు ఈ కఠిన వాస్తవాన్ని విస్మరిస్తాం. తలపెట్టిన పనిలో ఏ కాస్త ప్రావిణ్యం పెరిగినా మనను మించిన వాళ్లే లేరని విర్రవీగుతుంటాం. మనలా మరొకరు పనిచేయలేరని మనకు మనమే భుజకీర్తులను తగిలించు కుంటూ ఉంటాం._* 


*_ఇంతకు మించిన అవివేకం మరోటి లేదు. ఎంతటి గొప్ప కార్యసాధకులైన నిమిత్తమాత్రులే ! ఆ సమయంలో అక్కడ అందుబాటులో ఉన్నాం కాబట్టి ఆ విధాత మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. అంతే ! అనుకోవాలి._*


*_అందుకే "తాను చేయకపోతే ఆ పని ఆగిపోతుందని ఎవరు అహంకరించకూడదు. భగవంతుడు తాను చేయించాలనుకున్న కార్యాన్ని ఎలాగైనా చేయించుకుంటాడు ._*


*_ఎవరికి ఏది దక్కాలో అది ఎలాగైనా దక్కి తీరుతుంది. మన ద్వారా కాకపోతే మరొకరి ద్వారా వారి సంకల్పం నెరవేరుతుంది. అలా వారి ఆశలు, ఆశయాలు ఫలించటానికి మనం వాహకులమే కానీ కారకులం మాత్రం కాదని మరిచిపోకూడదు._*


*_అలా కాకుండా  " నేనే ఆనాడు వారికీ ఆ సాయం చేసి ఉండకపోతే..."  అని స్వోత్కర్షకు పొతే అది మన అనుభవరాహిత్యం._*


*_"నేను కూయందే పొద్దు పొడవదు " అని కోడి మిడిసి పడితే అది దాని అమాయకత్వం. అలాగే " నేను లేనిదే ఈ పని ముందుకు సాగదు " అని ఎవరైనా కళ్ళు నెత్తికెక్కించుకుంటే అది వారి అవివేకం._*


*_ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగే తీరుతుంది ! ఈ ప్రపంచంలో ఏ ఒక్కరిదీ, మరెవ్వరూ భర్తీ చేయలేనంత ప్రత్యేకమైన స్థానమేమీ కాదు. మనం కాకపోతే మరొకరు. మన కన్నా మించిన వాళ్ళు మన పాత్రను పోషించడానికి వస్తారు._*


*_అయితే ఎంతచేసిన మనకు ఏమి విలువ ఉండదా.. ? ఎక్కడ ప్రాముఖ్యత లభించదా.. ? గుర్తింపు దక్కదా...? అని మథనపడాల్సిన అవసరం లేదు.మన సామర్త్యానికి, శ్రమకి, ఆ సర్వేశ్వరుడు సరైన రీతిలో స్పందిస్తూనే ఉంటాడు. ఫలితాన్ని ప్రసాదిస్తూనే ఉంటాడు. అనుకువగా ఉంటే ఆశించిన దానికన్నా...అర్హతకు మించి ఆయన మనకు అందిస్తాడు._*


*_ఆత్మీయ మిత్రులకు శుభోదయం🙏_*


*_✡సర్వేజనాః_* *_సుఖినోభవంతు._*🙏


    🌺 *_🕉* 🌸 🙏


💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺

పుణ్యభూమి

 అగస్త్య మహర్షి శ్రీలు పొంగిన పుణ్యభూమి . భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలు చేసిన మహాత్ముడు అగస్త్య మహర్షి . ఈయన పుట్టడం కూడా చాలా విచిత్రంగా పుట్టాడు . అగ్నిదేవుడూ , వాయుదేవుడూ ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్ళున్న ఒక పాత్రలోంచి పుట్టాడు అగస్త్య మహర్షి . అందుకే ఆయనకి పేరు ఏం పెట్టారో తెలుసా ? కలశజుడు . కుంభసంభవుడు , ఔర్వశేయుడు , మిత్రావరణ పుత్రుడు , వహ్నిమారుత సంభవుడు అని ఇంకా అనేక పేర్లున్నాయి . అగస్త్య మహర్షికి చిన్నతనంలో ఉపనయనం , ప్రణవ పంచాక్షరీ మంత్రోపదేశం అన్నీ దేవతలే చేసేశారు . ఆయన బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేస్తూ ఉండేవాడు . ఒకసారి అడవిలో తిరుగుతూ సల్లకీ చెట్టుకి తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉన్న మునులని చూసి మీరెందుకు ఇలా ఉన్నారని అడిగాడు అగస్త్య మహర్షి . ఆ మునులు అగస్త్యుణ్ణి చూసి నాయనా ! మమ్మల్ని పితృదేవతలంటారు . నీకు పెళ్లయి సంతానం కలిగితేనే మాకు పైలోకాలకి వెళ్ళే అర్హత వస్తుంది . నిన్ను చూస్తే బ్రహ్మచర్యం వదలనంటున్నావు . మాకు పుణ్యలోకం రావాలంటే నువ్వు పెళ్ళి చేసుకోవాలి . లేకపోతే మా గతి ఇంతే అన్నారు . అగస్త్యుడు ఇది విని మరి పెళ్ళి చేసుకోవాలంటే మంచి వధువు కావాలి కదా ! అందుకని తన తపోబలంతో పుత్రకాముడనే పేరున్న విదర్భరాజుకి ఒక చక్కటి కుమార్తె పుట్టాలని వరం ఇచ్చాడు .శ్రీమతి భమిడిపాటి వి.బాలాత్రిపుర సుందరి ఆ అమ్మాయి పేరు లోపాముద్ర . లక్ష్మీదేవంత అందంగా సరస్వతీ దేవికున్నంత విద్యతో సుగుణాల రాశిలా ఉంది . ఆ లోపాముద్రని అగస్త్యుడు పెళ్ళి చేసుకుని తనతో ఆశ్రమానికి తీసుకువచ్చాడు . మరి పెళ్ళి చేసుకున్నాక కొంచమయినా ధనం వుండాలిగా . అగస్త్యుడు తన తపశ్శక్తిని నష్టపోవడం ఇష్టం లేక ' శ్రుతర్వుడనే రాజుని అడిగాడు . ఆ రాజు దగ్గర కూడ సరిపడ ధనం లేదని ఇద్దరూ కలిసి ' ప్రధృశ్వుడు ' దగ్గరికి వెళ్ళారు . ఆయన దగ్గర కూడ అదే జరిగింది . ముగ్గురు కలిసి ' త్రిసదన్వుడు ' అనే రాజు దగ్గరకి వెళ్ళారు . ఆయనది కూడా అదే పరిస్థితి . మణిమతీ పురానికి రాజు ' ఇల్వలుడు ' . ఆయనకి ' వాతాపి ' అనే తమ్ముడుండే వాడు . ఇల్వలుడు తన తమ్ముడు వాతాపిని చంపి బ్రాహ్మణులకి వండి పెట్టేవాడు . తర్వాత వాతాపిని పిలవగానే వాతాపి బ్రాహ్మణుల కడుపులో నుంచి బయటకి వచ్చేవాడు . ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ కలిసి బ్రాహ్మణులని చంపేసేవాళ్ళు . అగస్త్యుడు తను కలిసిన రాజులు ముగ్గుర్నీ తీసుకుని ఇల్వలుడి ఇంటికి వెళ్ళాడు . మామూలుగానే ఇల్వలుడు వాతాపిని చంపి , వండి పెట్టి , మళ్ళీ వాతాపిని పిలిచాడు . కానీ అగస్త్యుడు భోజనం చెయ్యగానే ' జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ' అన్నాడు . వాతాపి జీర్ణం అయిపోయాడు . ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటికి రాలేదు . ఉంటే కదా ! ... రావడానికి ! మీరెప్పుడయినా గమనించారా . పసిపిల్లలకి పాలుపట్టగానే ' జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ' అని పసిపిల్లల పొట్ట మీద రాస్తారు . వాతాపిని కూడా అరగించుకోగలిగినంత జీర్ణశక్తి పిల్లలకి రావాలని అలా అంటారు . అప్పటి అగస్త్యుడి మంత్రం ఇప్పటి పిల్లలకి కూడా ఉపయోగపడుతోంది చూశారా ! ఇల్వలుడు అగస్త్యుడికి ధనం , బంగారం , ఆవులు అన్ని ఇచ్చి పంపించాడు . తర్వాత అగస్త్యుడికి ధృడస్యుడు అనే కొడుకు , తేజస్వి అనే మనుమడు కలిగారు . పితృదేవతలు పుణ్యలోకాలకి వెళ్ళిపోయారు . ఒకసారి బ్రహ్మదేవుడు అగస్త్యుల వారి ఆశ్రమానికి వచ్చాడు . అగస్త్యుడు ఎదురువెళ్ళి తీసుకువచ్చి ఆయన్ని తగిన విధంగా సత్కారం చేసి ఆజ్ఞాపించండి స్వామీ ! అన్నాడు . నీ భార్య లోపాముద్ర విష్ణుమాయ అంశాన పుట్టింది . ఇప్పుడు విష్ణుమాయ కవేరరాజుకి ముక్తి నివ్వడానికి ఆయన కుమార్తెగా పుట్టి ఘోరతపస్సు చేస్తోంది . ఆమెను నువ్వు పెళ్ళి చేసుకో అన్నాడు బ్రహ్మదేవుడు . అగస్త్యుడు బ్రహ్మదేవా ! నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అని చెప్పి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు . పెళ్ళి అవగానే కవేరకన్య కావేరీ నదిగా ప్రవహించింది . కావేరి నదిలో స్నానం చేసిన కవేరరాజుకి ముక్తి కలిగింది . వృత్రుడు అనే రాక్షసుడు ఇంద్రుణ్ణి జయించి ధర్మచరిత్ర గల మహర్షులందర్నీ రాత్రి సమయంలో చంపి పగటి సమయంలో సముద్రంలో దాక్కుని ఉండేవాడు .మహర్షులందరూ కలిసి ఆ సముద్రజలాన్ని అగస్త్య మహర్షికి దానమిచ్చారు . అగస్త్యుడు ఆ సముద్రాన్ని తన కమండలంలో పట్టి ఒక్క గుటకలో త్రాగేశాడు వృత్రాసురుడు బైటపడ్డాడు . దధీచి దేహాన్ని ఆయుధాలుగా చేసుకుని దేవతలు వృత్రుణ్ణి చంపేశారు . అగస్త్యమహర్షి దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా శ్రీరాముడు అరణ్యవాసం చెయ్యడానికి వెడుతూ అగస్త్యమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు . ఖడ్గము , విల్లు , బాణాలు , అక్షయమైన అమ్ములపొది రాముడికి ఇచ్చి దీవించాడు అగస్త్యుడు . కొంతకాలం తర్వాత రామరావణ యుద్ధంలో రావణ బాణాలకి రాముడు గాయపడి బాధపడుతుండగా అగస్త్యుడు రాముడిని విష్ణుమూర్తిగా గుర్తుచేసి స్తోత్రం చేసి రాముడికి ఆదిత్యహృదయం అనే మహాస్తవం ఉపదేశించాడు . అంటే మనం ఇప్పటికీ ఉదయాన్నే చదువుకుంటున్న ఆదిత్యహృదయం అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించిందేనన్నమాట . పూర్వం నహుషుడనే రాజు నూరు అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రపదవిని పొందాడు . కానీ , ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో శచీదేవిని తనతో ఉండమని అడిగాడు . శచీదేవి మునులను వాహనంగా చేసుకుని రమ్మంది . నహుషుడు శచీదేవి దగ్గరికెడుతూ మునులని రథం మొయ్యమని చెప్పాడు . పూర్వాచార్యుల మంత్రాల్నీ , బ్రాహ్మణుల్నీ నిందించటం తప్పని చెప్పిన అగస్త్యుడి తల మీద తన్నాడు నహుషుడు . నహుఘడిని క్రూరసర్పంగా మారమని శపించాడు అగస్త్యుడు . తర్వాత నహుషుడి కోరిక మీద పూర్వజ్ఞానం ఉండేలా కరుణించాడు అగస్త్యుడు . అగస్త్యుడు ' ద్వాదశ వార్షిక యజ్ఞం ' చేశాడు . అంటే ఆ యజ్ఞం పన్నెండు సంవత్సరాలు జరిగింది . దానికి ఇంద్రుడు సహకరించలేదు . అప్పుడు అగస్త్యుడు తానే ఇంద్రపదవి పొంది వర్షాలు కురిపించి నిధులు తెచ్చుకుంటాను అన్నాడు . మునులు ఇంద్రుడు భయపడి కుంభవృష్టి కురిపించాడు . సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరగడం లేదని వింధ్యపర్వతం కోపగించి సూర్య , చంద్ర , నక్షత్రాల గమనం ఆపేసినప్పుడు అగస్త్యుడు కాశీని వదలలేక వదిలి వింధ్య పర్వతం దగ్గరకు వచ్చాడు . పర్వతరాజా ! మా దంపతులం పెద్దవాళ్ళం . నీ మీద ఎక్కడం దిగడం మాకు కష్టం . మేం తిరిగి వచ్చే వరకు నువ్వు భూమికి సమానంగా ఉండు . మేమిప్పుడు దక్షిణాపథం వెడుతున్నామని చెప్పాడు . ఈ విధంగా వింధ్య పర్వతానికి సహజంగా ఉండే పెరుగుదల కూడా లేకుండా దాని గర్వాన్ని అణిగించాడు అగస్త్యుడు . తర్వాత అగస్త్యుడు భార్యతో కలసి యాత్రలు చేస్తూ గోదావరీ తీరంలో ఉన్న పంపాసరోవరం , దండకారణ్యం , గోదావరీ తీరం , కోటిపల్లి , పలివెల , భీమేశ్వరం ,ద్రాక్షారామం , వీరభద్రశిఖరం మెదలయినవి చూసి కొల్లాపురం చేరి అక్కడ లక్ష్మీదేవికి స్తోత్రం చేశాడు . లక్ష్మీదేవి అగస్త్యుణ్ణి ద్వాపర యుగంలో వేదవ్యాసుడవై పుట్టి వారణాశిలో ఉంటావని దీవిస్తుంది . లోపాముద్ర అగస్త్య మహర్షిని ఏఏ తీర్థాలు ముక్తినిస్తాయని అడిగింది . బాహ్య తీర్థాలకంటే మానస తీర్థాలే ముక్తినిస్తాయి . ఎందుకంటే బాహ్య తీర్థాలలో ఎప్పుడు ఉండే కప్పలు , తాబేళ్ళు , చేపలు , మొసళ్ళు లాంటివి అన్నీ మోక్షం పొందాలి కదా ! అలా జరగట్లేదేం ? మానసికంగా పవిత్రంగా వున్నప్పుడే తీర్థాలలో మునిగిన ఫలితం కూడ ఉంటుంది అన్నాడు అగస్త్యుడు . అగస్త్యుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆయనకు కుమారస్వామి దర్శనం ఇచ్చి కాశీ మహత్మ్యం గురించి తెలియచేశాడు . శిష్య సమేతుడైన వ్యాస మహర్షి కూడా కనిపించాడు . మహర్షులిద్దరు కుశలప్రశ్నలు వేసుకున్నారు . వ్యాసుడు తాను కాశీ వదిలి అన్నపూర్ణాదేవి ఆజ్ఞతో ఈ దక్షిణకాశికి వచ్చిన కారణం చెప్పాడు . అగస్త్యుడు తన తపోమహిమతో వ్యాసుడికి ద్వాదశ క్షేత్రాల గురించి చెప్పి పంచతీర్థాలలో స్నానం చేయించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు . పరశురాముడు అగస్త్యుడు ఇచ్చిన కృష్ణకవచాన్ని ధరించే ఇరవై ఒక్కసార్లు రాజుల్ని చంపగలిగాడు . అందుకు అగస్త్యుడి ప్రోత్సాహ ప్రోద్బలాలు కూడా ఉన్నాయన్నమాట ! ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ అగస్త్యుడు రావడం చూడలేదు . అగస్త్యుడికి కోపం వచ్చి ఏనుగువై పుట్టమని శపించాడు . శ్రీ మధ్భాగవతంలో గజేంద్రమోక్షంలో ఉన్న గజేంద్రుడే ఈ ఇంద్రద్యుమ్నుడు . కుబేరుడు కుశపతి చేస్తున్న సత్రయాగానికి రాక్షస బలాలతో విమానంలో వెడుతూ కుబేరుడి స్నేహితుడు మణిమంతుడు క్రిందకి ఉమ్మేశాడు . అది తపస్సులో ఉన్న అగస్త్యుడి మీద పడింది . అతణ్ణి అతని బలగాలని ఒకే మనిషి చేతిలో చనిపోయేట్లుగా అగస్త్యుడు శపించాడు . అదేవిధంగా వాళ్ళందరూ భీముడి చేతిలో చచ్చిపోయారు . కొంతకాలం అగస్త్యుడు పుష్కర తీర్థంలో కుమారస్వామిని పూజచేసి అందిలావృతవర్షంలో ఉండగా నారాయణుడు అగస్త్యుడికి కనిపించి నీకు ఎప్పుడు ఏలోటూ ఉండదని చెప్పి వెళ్ళిపోయాడు . అగస్త్యుడు రాసిన గ్రంథాలు ' అగస్త్యగీత ' ' అగస్త్యసంహిత ' .. అగస్త్య మహర్షి ఎప్పుడూ లోకం కోసమే పాటుపడ్డాడు . ఎంతో మందికి విద్యాదానం చేశాడు . ఎంత చెప్పినా అయిపోని గొప్పతనం ఆయనది . ఇప్పటికీ అగస్త్య మహర్షి భాద్రపద మాసంలో భూలోకంలో నక్షత్ర రూపంలో కనిపిస్తాడు . నక్షత్ర దర్శనం అవగానే బ్రాహ్మణులు అగస్త్యుడి బొమ్మ చేసి పూజ చేసి రాత్రి జాగారం చేస్తారు . అలా చేస్తే అగస్త్యలోపాముద్రల అనుగ్రహం వుంటుందని వారి నమ్మకం .ఇద ! అగస్త్య మహర్షి దివ్య చరిత్ర . ముందే చెప్పానుగా ! అగస్త్యుడు మహర్షులందరిలోకి గొప్పవాడని . చదివారా ! ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతుంది . ఎప్పుడూ ఎవరికో ఒకళ్ళకి సహాయపడూ , ముక్తి పొందడానికి ఉపదేశాలు చేస్తూ , ఇప్పటికీ మనకి కూడా ఉపయోగపడేలా విష్ణుపూజా విధానం , ఆదిత్యహృదయం మొదలయినవి చెప్పిన గొప్ప మహర్షి . మనం చూసి ఉంటే తరించేవాళ్ళం . అదెలాగా లేదు కాబట్టి కనీసం ఆయన గురించి చదువుదాం . కొంచెం ఫలితమైనా ఉండదా ... ? తప్పకుండా వుంటుంది !

భారతీయుడా

 బాగా బలిసిన ఓ మంత్రి వర్యులు గారికి హఠాత్తు గా గుండె నోప్పి వచ్చింది, ఆపరేషన్ కోసం అమెరికా కు తీసుకెళ్లారు

ఆసుపత్రిలో డాక్టర్లు మంత్రి గారికి విజయవంతం గా శస్త్రచికిత్స చేసారు,

మంత్రి గారు కోలుకున్నాక డాక్టర్ గారు వచ్చి మంత్రి గారిని పలకరించారు..

ఎలా ఉన్నారు మంత్రి గారు? ఇప్పుడేం ఛాతీ లో నోప్పి లాంటిది ఏం లేదుకదా?

అందుకు మంత్రి గారు భలే వారే డాక్టర్ గారు, అమెరికా లో అందులో తమంతటి వారు స్వయానా ఆపరేషన్ చేసాక ఇంకెందుకు వస్తుందండి ఆ నోప్పి.. అదే మా ఇండియా లో ఐతే ఈపాటికి టపా కట్టేసే వాన్ని, ఎంతైనా అమెరికా, అమెరికానేనండి మా ఇండియా లో గుండెకు ఆపరేషన్ అంటే లివర్ కు చేసేవారు, అమెరికా కాబట్టి బతికి బట్ట కట్టగలిగాను, మా ఇండియా డాక్టర్ లు శుద్ధ వేస్ట్ అండీ.. అంటూ ఇంకా ఏదో చెప్పబోయారు

ఇక చాలు ఆపండి మీ సోది, అంటూ డాక్టర్ గారు విసురు గా లేచారు, ఆయన కళ్ళు చింతనిప్పుల వలె ఎర్రబడ్డాయి.

ఆపరేషన్ అయ్యింది కదా, దయచేసి ఇక వెళ్ళి పోండి, ఇంకోక్క మాట మీరు ఇండియా గురించి చెడుగా మాట్లాడితే సహించేది లేదు అని మంత్రి గారి మెుహం కూడా చూడకుండా వెళ్ళి పోయారు..

బిక్కచచ్చిన మెుహంతో మంత్రి గారు ప్రక్కనున్న అసిస్టెంట్ డాక్టర్ గారితో ఎవరు ఈయన ?ఎందుకలా నా మీద సీరియస్ అయ్యారు? అని అడిగారు

అందుకు ఆ అసిస్టెంట్ డాక్టర్ మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ విల్సన్ గారు ఆయనే.. ఆయన డాక్టర్ కోర్సు మీ ఇండియా లోనే చేసారు అని చెప్పాడు..

మంత్రి గారికి డాక్టర్ గారు ఎందుకలా మండిపడ్డాడో అర్ధమైంది..

డిస్చార్జ్ అవబోతూ ఆ డాక్టర్ గారితో నన్ను క్షమించండి డాక్టర్ గారు, ఏదో మాట తూలాను, మనసులో పెట్టుకోబాకండి అన్నారు,

అందుకు డాక్టర్ విల్సన్ గారు ఛ. ఛ. అలాంటిదేమి లేదండి.. ఇండియా గురించి తక్కువ చేసి ఓ ఇండియనే అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను, నేను ఇండియా లోనే డాక్టర్ కోర్సు పూర్తి చేసాను, నాకంటే మేధావులు మీ ఇండియా లో సరైన ప్రోత్సాహం, గుర్తింపు లేక మరుగున పడుతున్నారు, మీ రాజకీయాలు,కుల వివక్ష, రిజర్వేషన్ లతో కోంతమంది మేధావులు అక్కడ ఇమడ లేక ఇలా విదేశాలకు వలస వస్తున్నారు, వారి మేధాశక్తి కి ఇక్కడి వారు నెత్తిన పెట్టుకున్నారు, అంత ఎందుకండీ ఇప్పుడు మీకు ఆపరేషన్ చేసిన ఈ హాస్పిటల్ చీఫ్ మీ భారతీయుడే తెలుసా?

ప్రజల సొమ్ము తో ఆపరేషన్ చేయుంచుకునేందుకు వచ్చిన మీరు ఆ ప్రజలనే తిడుతుంటే చూస్తూ ఉండలేక పోయాను, ఇకపోతే మీకు జరిగిన ఆపరేషన్ ను మీ ఇండియా లో డాక్టర్ కోర్స్ చదివే ఓ పీ జీ స్టూడెంట్ చూయింగ్ గమ్ నమిలినంత ఈజీగా చేయగలడు, కానీ మీరు చేయించుకోరు, ఎందుకంటే వారు డాక్టర్ కోర్స్ చదివారో, లేదో? లేక మీరు వేలంపాట పెట్టి అమ్మిన డాక్టర్ సీటును డబ్బు పెట్టి కోన్నవాడేమో అని మీ డౌట్?!

అందుకే రిజర్వేషన్ లేని,ప్రతిభకే పట్టం కట్టే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతున్నారు మీ భారతీయులు,

కష్టం మీ వాళ్ళది, పేరు మాత్రం మా దేశాలది,

నేడుఅభివృద్ధి చెందిన పెద్ద, పెద్ద దేశాలు కానీయండి, కంపెనీలు కానీయండి వారి అభివృద్ధి వెనక ఖచ్చితంగా మీ భారతీయుల  కృషి ఉందనేది ముమ్మాటికీ నిజం.. మీరు వాడుకోలేరు, మేము వాడుకుంటున్నాం..టాప్ అంతా మాదగ్గర ఉంది, స్క్రాప్ మాత్రం మీ దగ్గర ఉంది.

తన దేశాన్ని తప్పు పట్టిన వాడు రేపు తన కన్న తల్లిని కూడ తప్పు పడతాడు..

మీకు ఇంతకంటే నేను చెప్పలేను..

సెలవ్.. గెట్ విల్ సూన్..

మంత్రి గారికి నోరు పెగల్లేదు..

డాక్టర్ గారు అన్న చివరి మాటలు

"గెట్ విల్ సూన్" అన్నది

తన శరీరానికా? తన మనసు కా?

.

.

.

.

షేర్ చెయ్ భారతీయుడా ! నీ దేశం బాగు కోసం.......

🙏🏻🙏🏻🙏🏻🙏🏻

పరమ పవిత్రం కేదారం

 పరమ పవిత్రం కేదారం

పరమేశ్వరుని సన్నిధానాల్లో పరమ పవిత్రమైనది కేదార్‌నాథ్‌ మహాక్షేత్రం. హిమగిరుల్లో నెలకొన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా యుగయుగాలుగా వేలాదిమంది భక్తుల పూజలు అందుకుంటోంది. రుద్రహిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే భక్తులు చాలా శ్రమించాల్సి వుంటుంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్‌ జిల్లాలోని పర్వతాల్లో పరమశివుడు కేదారేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తారు. శీతాకాలంలో ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. వేసవికాలం ప్రారంభంలోనే ఆలయాన్ని తెరవడం సంప్రదాయంగా వస్తోంది. మందాకిని నది జన్మస్థానం కూడా కేదార్‌నాథ్‌ సమీప పర్వతాల్లోనే వుంది.


స్వయంభువుగా శివుడు..

పరమశివుడు ఇక్కడ స్వయంభువుగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటాడు. ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు విజేతలుగా నిలుస్తారు. అయితే యుద్ధంలో తమ సొంత దాయాదులను చంపవలసివచ్చినందుకు ఎంతగానో వేదనకు గురవుతారు. తమ పాపాల నుంచి విముక్తి పొందేందుకు మహేశ్వరుని దర్శనం కోసం హిమాలయాలకు చేరుకుంటారు. ఈశ్వరుడు వృషభరూపంలో కేదారం వద్ద వుండటాన్ని పాండవులు గమనిస్తారు. వారు వచ్చేలోగా శివుడు భూమిలోకి వెళ్లిపోతాడు. పాండవులకు మోపురం మాత్రమే దర్శనమిస్తుంది. ఆ దర్శనంతో పాండవులకు పాప విముక్తి కలుగుతుంది. భూమిలోకి వెళ్లిన పరమేశ్వరుని ముఖ భాగం నేపాల్‌లోని పశుపతినాథ ఆలయంలో వున్నట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. మధ్యమహేశ్వర్‌, తుంగ్‌నాథ్‌, రుద్రనాథ్‌, కల్పేశ్వర్‌, కేదార్‌నాథ్‌... ఈ ఐదింటిని పంచ కేదార్‌నాథ్‌ క్షేత్రాలుగా పేర్కొంటారు.


ఆధ్యాత్మికశిఖరం

మంచుకొండల్లోని కేదార్‌నాథ్‌ క్షేత్రానికి చేరుకోవడం అత్యంత శ్రమతో కూడుకున్న పని. కానీ శివానుగ్రహం భక్తుల్ని ఆ ఇబ్బందులనుంచి దూరంచేస్తుంది. ఇక్కడ ఆలయాన్ని పాండవులు నిర్మించారని తెలుస్తోంది. అనంతరం ఆదిశంకరాచార్యులు ప్రాచీన ఆలయానికి సమీపంలోనే ప్రస్తుతం మనం చూసే ఆలయాన్ని నిర్మించారు. ఎన్నో వందల సంవత్సరాలు మంచుతో కప్పబడిన మహాపుణ్యక్షేత్రం అనంతరం దర్శనమివ్వడం భగవద్‌ అనుగ్రహమే. ఆదిశంకరులు ఇక్కడి నుంచే కైలాసానికి చేరుకున్నట్టు ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఆదిశంకరుల సమాధిని కూడా ఆలయ సమీపంలో దర్శించవచ్చు. మంచు కొండల నడుమ పెద్ద పెద్ద రాళ్లతో ఆలయాన్ని నిర్మించడం దైవానుగ్రహమని పెద్దలు చెబుతారు. ఆలయం ముందు భాగంలో కుంతీదేవి, పాండవులు, శ్రీకృష్ణ విగ్రహాలు వుంటాయి. ఆలయం ముందు నంది విగ్రహం వుంటుంది. ఆలయంలో పరమశివుడు సదాశివమూర్తిగా దర్శనమిస్తారు.


కొండలనెక్కి... శ్రమను అధిగమించి..

ఉత్తరాఖండ్‌లోని పవిత్రపుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, యమునోత్రి, గంగోత్రిలను దర్శించుకోవడాన్ని మినీ చార్‌ధామ్‌ యాత్రగా పేర్కొంటారు. కేదార్‌నాథ్‌ ప్రయాణం క్లిష్టంగా వుంటుంది. రిషికేశ్‌ నుంచి గౌరీకుండ్‌ వరకు సులభంగా చేరుకోవచ్చు. గౌరీకుండ్‌ నుంచి గుర్రాలు, డోలీలు లేదా కాలినడక ద్వారా ప్రయాణించాల్సి వుంటుంది. హిమపాతంతో కూడిన ప్రతికూల వాతావరణంలో భక్తులు ప్రయాణించాలి. హెలికాప్టర్ల సర్వీసులను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కల్పించింది. కానీ ఈ ప్రయాణానికి ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. సముద్రమట్టానికి దాదాపు 3500 మీటర్ల ఎత్తులో వుండే కేదార్‌నాథ్‌ను చేరుకోవడంతో బడలిక మొత్తం ఎగిరిపోతుంది. ఆ నీలకంఠుని దర్శనంతో ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది.


ఎలా చేరుకోవాలి

రోడ్డు మార్గం: రిషికేశ్‌, హరిద్వార్‌, డెహ్రాడూన్‌, దిల్లీనుంచి రోడ్డు మార్గం వుంది. గౌరీకుండ్‌ నుంచి 14 కి.మీ. నడక ప్రయాణముంటుంది. 2013లో సంభవించిన వరదల అనంతరం ఈ మార్గం ధ్వంసమయింది. మార్గాన్ని పునర్‌నిర్మించారు.

రైలుమార్గం : రిషికేశ్‌ రైల్వేస్టేషన్‌ 243 కి.మీ. దూరంలో వుంది. రిషికేశ్‌కు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రైలు సౌకర్యముంది.

విమానయానం : డెహ్రాడూన్‌లోని జాలిగ్రాంట్‌ విమానాశ్రయం. 243 కి.మీ.లో వుంది.


మే నుంచి అక్టోబరు మాసాల మధ్య కాలం కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు అనుకూలమైన సమయం. శీతాకాలం నుంచి వేసవి కాలం ప్రారంభం వరకు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. మే చివర నుంచి జూన్‌ నెలాఖరు వరకు రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి. 2013లో వర్షాలు ఎక్కువగా కురవడంతో అనేక నదులకు వరదలు ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని యాత్ర కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సి వుంటుంది. ఉత్తరాఖండ్‌ పర్యాటక శాఖతో పాటు పలు ప్రైవేటు సంస్థలు ప్యాకేజీ యాత్రను నిర్వహిస్తుంటాయి. వీటిని ముందుగా సంప్రదించి వెళ్లడం ఉత్తమం. మంచు కురిసే ప్రాంతంలో ప్రయాణం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Beautiful Words

 *🦋 GooD MorninG🦋*

     

🌹🙏💅🌹🙏💅🌹🙏💅🌹🙏💅

*Beautiful Words..For Beautiful Life ✍🏼*   


■ 🎯    *_*మిత్రమా కోల్పోయిన దాని గురించి  ఇంకా ఆలోచిస్తున్నావా...???.....* అయితే నువ్వు ఇంకా... మరింత..మరికొంత  కోల్పో తావు..!!!_ అవేంటంటే...

*1.విలువైన కాలాన్ని* 

*2.మనో ధైర్యాన్ని* 

*3.గొప్పగొప్ప అవకాశాలను* 

*4.గొప్ప మానవీయ బంధాలను*


     _నువ్వు కోల్పోయిన వాటి  గురించి అదేపనిగా.... ఆలోచిస్తూ... బాధపడుతూ కూర్చుంటే...ఈ నాల్గింటిని.. తెలిసి కూడా అనవసరంగా కోల్పోతావు మిత్రమా....!!_

✌️👆👌🏃‍♀️🏃🏻‍♂️🧍‍♀️🧍🧍‍♂️🧶


■ 💅       _ *మిత్రమా....! *ప్రయత్నంలోనే.... గెలుపు దాగుంది*..... ప్రయత్నిస్తేనే  గెలుపు లభిస్తుంది. *ప్రయత్నమే* మనకి  ఓటమిని దూరం చేస్తుంది..... ఒక పనిని మొదలుపెట్టి... *నేనిది చేస్తాను*..అని అనుకున్నపుడే     నీవనుకున్న పని సగం అయిపోయినట్లే....సగం విజయం పొందినట్లే.....!

 ---గెలుపు ...ఓటములను పక్కన పెట్టు...  ముందు  ప్రయత్నం  చెయ్యు..!!_ *భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పిందదే.....!*

*ఓం గుహ్యరూపిణ్యై నమః.🙏

 707. *ఓం గుహ్యరూపిణ్యై నమః.🙏*


చం.  జయకరి! *గుహ్య రూపిణి!* లసన్మహనీయ మనోజ్ఞ రూపివై


ప్రియముగ జ్ఞాన నేత్రముల వీక్షణకే కనిపింతు వీవు, నీ


నయ శుభ గుహ్యరూపము ఘనంబుగ భక్తులె చూతురమ్మ, వి


స్మయమును బాపి కన్బడుము సాధకులందరికిన్ మహేశ్వరీ.🙏


అమ్మకు నమస్కరించుచు🙏

చింతా రామకృష్ణారావు.

సరస్వతీమాతకు

 శృంగేరీ పీఠానికీ సరస్వతీమాతకు ( శారదామాత )  వున్న అనుబంధం. 


కర్మమార్గంలో బద్దులైనవారిని ఉద్ధరించడం కోసం,శంకరులు అనేక మందిని కలిసి వాదించారని మనకు తెలుసుకదా ! 


అందులో భాగంగానే  మాహిష్మతీ నగరంలో మండనమిశ్రుని కలవడానికి శంకరులు వెళ్లి, వారి ఇంటి చిరునామా గురించి శంకరులు వాకబుచేస్తుండగా,  కొంతమంది స్త్రీలు నీళ్ళ బిందెలతో శంకరులకు కనబడ్డారు. మండనమిశ్రుని ఇల్లుఎక్కడ ? అని వారిని అడుగగా, వారు శ్లోకరూపంలో సమాధానం ఇచ్చారు.  


స్వత: ప్రమాణం పరత : ప్రమాణం  కీరంగనా యత్ర గిరం గిరన్తి 

ద్వారస్థ నీడాన్తర   సంనిరుద్ధా  జానీ హి తన్మండన పండితౌక : //


అనగా ఏ ఇంటిద్వారంలో పంజరాలలో వున్న చిలుకలు, ' వేదం స్వత:ప్రమాణమా పర: ప్రమాణమా '  అని వాదిస్తూ వుంటాయో,  అదే మండనమిశ్రుని ఇల్లు '  అని వారు చెప్పారు.    ఇది ఆనందగిరీయం లోని శ్లోకం.  


తీరా శంకరులు, మండనమిశ్రుని ఇంటికి వెళ్లిన తరువాత, ఆయన కుమారిలుడు స్వాగతించినట్లు, ప్రతివాదం చేసేవారిని  స్వాగతించలేదు.  అసలు సన్యాసులంటేనే మండనులకు ఇష్టముండదు.  వారు వేదకర్మలను చేయరనీ, వారిని చూడడమే మహాపాపమని భావించే కోవలోనివాడు.  అందుకని శంకరులను వారు పిలవలేదు.  పైగా ఆరోజు మండనమిశ్రుని ఇంట్లో శ్రాద్ధకర్మ  జరుగుతున్నది, ఆరోజు సన్యాసులను వారుచూడరు.  ఇంటి తలుపులు కూడా మూసివున్నాయి.  


ఇలాంటి మండనమిశ్రునికి అలాంటి రోజున ఉపదేశం యివ్వాలని శంకరులు నిర్ణయించారు.   తలుపులు మూసివున్న ఆ ఇంట్లోకి కల్లుగీసేవారు చదివే ఒక మంత్రం సహాయంతో, ప్రవేశించారని ఒక కథ వుండగా,  శంకరులు యోగశక్తితో ఆ ఇంటిలోకి ప్రవేశించారని వేరొక కథ వున్నది.   ఆరోజులలో కొబ్బరిచెట్లు ఎక్కి కల్లు గీయకుండా, మంత్రం చదివి, కొబ్బరి చెట్లనే క్రిందికి వంగేటట్లుగా, వేరొక మంత్రంతో  కల్లుగీత పని అయిపోగానే చెట్టు నిలబడేటట్లుగా కల్లుగీత కార్మికులు చదివేవారట.  


ఆరోజు మండనమిశ్రుని ఇంట్లో శ్రాద్ధకర్మలో, జైమినీ మహర్షి, వ్యాసమహర్హి భోక్తలుగా వున్నారు.   పరీక్షిత్తు  యెంత జాగ్రత్తగా వున్నా, తక్షకుడు పండురూపంలో అతని మేడలో ప్రవేశించ లేదా ?  తక్షకుడు విషం చిమ్మితే, శంకరులు అమృతం  పంచడం కోసం వెళ్లారు.   మండనమిశ్రుడు శ్లేషతో కూడిన ప్రశ్నలతో ఎక్కడనుండి వచ్చావు ? అని ప్రశ్నించడం, దానికి శంకరులు సమాధానం చెప్పడం జరిగింది.  ఆ తరువాత,  జైమిని, వ్యాసుల వారు, సన్యాసిని శ్రాద్ధకర్మలో విష్ణు స్థానంలో కూర్చోబెట్టవచ్చని  చెప్పగా, మండనుడు శంకరులను భిక్ష స్వీకరించమని కోరాడు.  


నేను  ఈ భిక్ష కోసం రాలేదనీ, నాకు వాదభిక్ష కావాలనీ, కుమారిలుడు పంపగా వచ్చానని మండనునితో చెప్పారు,  శంకరులు.    భోజనబిక్ష తరువాత, వాదభిక్ష చేద్దామని మండనుడు అనగా,  భోజనానంతరం ఇరువురూ వాదానికి కూర్చున్నారు.  


వాదానికి మధ్యవర్తిగా ఎవరు వున్నారో  !   


మండనమిశ్రుడు  సాక్షత్తూ బ్రహ్మదేవుని అవతారమనీ,  అతనిభార్య సరసవాణి, సరస్వతీదేవి అనీ  శంకరులకు తెలుసు.  అందుకనే సరసవాణిని మధ్యవర్తిగా నియమించగా శంకరులు యెంతో సంతోషించారు.  ఆమె మెచ్చినదే కదా తనప్రజ్ఞ అని భావించారు.  కనుక సరసవాణి మాట శిరోధార్యమే !  


ఇక సరసవాణికి  ఇబ్బందికర పరిస్థితి.  సన్యాసి గెలిచాడని చెబితే భర్త చిన్నబుచ్చుకుంటాడు.   అందుకని తెలివిగా, ఫలితం తననోటితో చెప్పకుండా, వారిద్దరి మెడలలో రెండు పూలదండలు వేయించి, ఎవరిమెడలో దండవాడిపోతే వారు  ఓడిపోయినట్లని నియమం ఏర్పాటుచేసింది.   ఇక పోటీలో వున్న వాద ప్రతివాదులలో శంకరులు ఓడిపోతే, వారు తిరిగి గృహస్థాశ్రమం స్వీకరించాలనీ,  మండనుడు ఓడిపోతే, సన్యాసం తీసుకోవాలనీ కూడా నియమం పెట్టుకున్నారు. 

 

వాదం మొదలైంది.  రెండు విద్వద్ శిఖరాలు ఢీకొన్నట్లుగా 21  రోజులు చర్చ జరిగింది.   శంకరులు అద్వైత వాదాన్ని ప్రతిపాదించారు.  శంకరులు నివృత్తిమార్గంలో వున్నారు.   పక్వమైన పండు చెట్టునుండి క్రిందబడితే, తిరిగి చెట్టుకు తగిలించి ఏమి ప్రయోజనం ?  అదే విధంగా జ్ఞానం వచ్చేదాకా కర్మలు చేస్తూ, పండుపక్వానికి ( పూర్తిజ్ఞానం ) వచ్చిన తరువాత కర్మలు తొలిగిపోతాయి.  అలాంటి జ్ఞానం కలిగినవారు అన్నింటినీ సమదృష్టితో చూస్తారు.   ప్రేమతో చూస్తారు. నిష్క్రియులై వుంటారు.    సన్యాసులంటే, సర్వభూతములకూ తమనుండి ఏ భయమూ లేకుండుగాక !  అని ప్రైష   మంత్రం పలికినవారు కదా !  


ఎట్టకేలకు మండనుడు అద్వైతాన్ని పూర్తిగా అంగీకరించాడు.   అయన మెడలో పూలమాల వాడిపోయింది.   ఆయనలో సగభాగమైన సరసవాణి  కూడా భర్త ఓటమిని అంగీకరించింది.  తల ఒగ్గింది.  తన భర్త ఓడిపోయాడని ప్రత్యక్షంగా చెప్పకుండా ఇద్దరినీ భిక్షను స్వీకరించమని చెప్పి,  ఇరువురకూ నమస్కరించింది.    ఉత్తరోత్తరా శంకరులు సర్వజ్ఞపీఠం అధిరోహించినప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షమై శంకరులని సర్వజ్ఞులని ప్రకటించినట్లు కథ కూడా వున్నది.  

 

ఏ భార్య అయినా తనభర్త సన్యాసం తీసుకుంటుంటే సహించగలదా ?  అయితే ఉభయభారతిగా ప్రసిద్ధిపొందిన సరస వాణి సరస్వతీ అవతారమే కదా !  మండనుడు సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులైనారు.  సరసవాణి   సరస్వతీదేవిగా బ్రహ్మలోకానికి వెళ్ళడానికి సిద్ధపడగా,  శంకరులు,  '  అమ్మా !  నీవు అలా వెళ్ళిపోతే ఎలా ! ఇక్కడే వుండి అందరికీ జ్ఞానాన్ని సద్బుద్ధినీ కలిగించమని నవదుర్గామంత్రంతో  ఆమెను శంకరులు బంధించారు.  ఆమంత్రానికి అమ్మ లొంగినట్లే కనబడింది.  

( మిత్రులు ఎవరైనా షేర్ చేసుకో దలుచుకుంటే పూర్తిగా షేర్ చేసుకోండి, చక్కగా. ఇంకా ఎక్కువమందికి అందించండి. నేను ఆనందిస్తాను. అంతేకానీ, కత్తిరించీ, అతికించీ నాపేరు మాయం చేసే ప్రయత్నాలు చెయ్యకండి. 😊 )


అయితే, సరస్వతీదేవి, తనను ఎక్కడా ప్రతిష్టించవద్దనీ, నీవు దేశం అంతా తిరుగుతూవుండు, నీవెనుకే నేను వస్తుంటాను.  నువ్వు ఎక్కడ వెనుదిరిగి చూస్తే,  నేను అక్కడే ఉండిపోతానని శంకరులకు చెప్పడము, జరిగింది.   అలాగే శంకరులు వెనుదిరిగి చూడకుండా నడుస్తూ, ఆమె అందెల గలగల వింటూనే వున్నారు.  


శృంగేరీపీఠం గొప్పదనం ఏమిటో తెలుసుకుందాం.


ముందు శంకరులు, వెనుక శారదామాత నడుస్తున్నారని చెప్పుకున్నాము కదా !   అలాప్రయాణం సాగిస్తూ తుంగభద్రా తీరంలోని శృంగేరీచేరుకున్నారు, ఇరువురూ.   అక్కడ ఒకప్రదేశంలో ప్రసవిస్తున్న కప్పకు ఎండ తగలకుండా పాముపడగ పడుతున్న దృశ్యం చూసారు శంకరులు.   


సహజవైరమున్న కప్పకు, పాము పడగ పట్టడం, పరమ సాత్వికతత్వానికి ప్రతీక అనీ, అది మహత్తర ప్రదేశమని భావించారు శంకరులు.   ఇంతలో పరికించి  వింటుంటే, శారదామాత అందెలధ్వని వినరావడం లేదు.  శంకరులు వెనక్కి తిరిగి చూడక తప్పలేదు.   వెనుక ఇసుకతిన్నెలలో శారదామాత పాదాలు చిక్కుపడి, ఆమె కాళ్ళ  అందెల చప్పుడు వినబడకపోవడం గమనించారు శంకరులు.   వెంటనే, ఇదీ మంచికే జరిగిందని భావించి,  అక్కడ శృంగేరీ లో శారదా పీఠాన్ని నెలకొలిపారు శంకరులు. 


శంకరులు చాలాకాలం అక్కడ వుండి, అమ్మవారిని అర్చించారు.   శంకరుల మొత్తం 32  సంవత్సరాల జీవన ప్రయాణంలో, మొదటి 16 సంవత్సరాలలో అన్ని గ్రంధాలనూ వ్రాసారు.  మిగిలిన 16  సంవత్సరాలలో, ముమ్మారు దేశాన్ని పర్యటించి, అనేక విజయాలు సాధించి షణ్మతాలు స్థాపించారు.   అందులో భాగంగానే ఎక్కువకాలం స్వామివారు శృంగేరీలో వున్నట్లు శంకర విజయం గ్రంధం చెబుతున్నది.  


మిగిలిన మఠాలు ఎక్కడ స్థాపించాలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుగా అనుకుని శంకరులు స్థాపిస్తే,  శృంగేరీ మఠం మటుకు దైవప్రేరణతో జరిగినట్లు తెలుస్తుంది.  విద్యాదేవత అయినా శారదామాత అక్కడ మఠాన్ని నెలకొలిపేటట్లు చేసింది.   


ఇదికాక, అనేక ఒడిదుడుకులకు తట్టుకుని శంకరులు స్థాపించిన  ఉత్తరాన బదరీనాధ్ దగ్గరలో జోషీమఠ్,  పడమర ద్వారకలో,  తూర్పున పురిలో, దేశానికి నడిబొడ్డు అయిన కంచిలో ఇలా అయిదు ప్రదేశాలలో ఆదిశంకరులు స్థాపించిన మఠాలు అద్వైత వెలుగులు విరజిమ్ముతున్నాయి.   


సరసవాణిగా వున్న సరస్వతీదేవి, శారదామాతగా శృంగేరీలో కొలువైవున్న విషయం తెలుసుకున్నాము కదా !  


సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం. 


ప్రధమం భారతీనామ ద్వితీయం చ సరస్వతీ 

తృతీయం శారదాదేవి చతుర్ధం హంసవాహనా :  //


పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా /

కౌమారీ సప్తమం ప్రోక్తం అష్టమమ్ బ్రహ్మచారిణీ  //  


నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ 

ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ  //


బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం య : పఠేన్నరః ; 

సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ 

సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ // 


స్వస్తి, 

సరస్వతీమాత అనుగ్రహం మనందరి మీదా ఉండాలని కోరుకుంటూ, 

🙏🙏

*అద్వైత వేదాంత పరిచయము

 **అద్వైత వేదాంత పరిచయము**


4.3 వానప్రస్త మరియు సన్యాస ఆశ్రమం :`

  వానప్రస్త ఆశ్రమంలో నెమ్మదిగా వైరాగ్యం పెంచుకోవటానికి శిక్షణ పొందుతాము. మన స్థూల శరీరం చేయగలిగినన్నాళ్ళు పనిచేసింది. మనకి వృద్ధాప్యం పైబడేసరికి, అంతకుముందు చేసినంత చురుకుగా బాహ్యమైన పనులను చేయలేదు. అందుకని దానితోపాటు మనసుని కూడా నెమ్మదిగా వెనక్కి తీసుకోవటం నేర్చుకోవాలి. మనసు ఇంకా హుషారుగా ఉండి, శరీరం సహకరించకపోతే, మనకి ఒత్తిడి పెరుగుతుంది. అందుకని నెమ్మదిగా మన

సుని బాహ్యప్రపంచం నుంచి దృష్టి మరల్చి, నెమ్మదిగా అంతర్ముఖం చేయాలి. ఇన్నాళ్ళూ బాహ్యప్రపంచం గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఆత్మ జ్ఞానం పొందటానికి సుముఖం అవుతాం.

  అందుకని ఉద్యోగ విరమణ చేసేటప్పుడు జీవన సూత్రాన్ని అర్థం చేసుకుని, దానికి సంసిద్ధులం అవాలే కాని, ఆత్మన్యూనతా భావం పెంపొందించుకోకూడదు. తర్వాత దశ అయిన సన్యాస ఆశ్రమానికి మనని మనం సంసిద్ధులని చేసుకోవాలి. బ్రహ్మచర్య ఆశ్రమంలో విలువలకి సంబంధించిన విద్యనభ్యసిస్తే, సన్యాస ఆశ్రమంలో ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతాము. వానప్రస్థ ఆశ్రమం అంటే కుటుంబం మధ్యలో జీవిస్తూనే, ఒంటరిగా జీవించటం.


  వననామ్‌ సమూహ: వానమ్‌।

  వానే ప్రకర్షేన్‌ తిష్ఠతి ఇతి వానప్రస్త:॥

  సన్యాస: అంటే అసలు అర్థం అన్నీ పరిత్యజించటం. ప్రాధమికంగా మన అజ్ఞానాన్ని,మన అహంకారాన్ని వదులుకుని, జీవితంలో అన్నీ వదులుకోవటానికి సిద్ధపడటం. సన్యాస ఆశ్రమం వేరు, ఆశ్రమ సన్యాసం వేరు. రెండో దానిలో శారీరకంగా అన్నీ అందరినీ పరిత్యజించి ఆశ్రమంలో ఒంటరిగా జీవితం గడపటం. శారీరకంగా అన్నీ పరిత్యజించినా, లేకపోయినా మానసికంగా అన్నీ పరిత్యజించి,ఆత్మజ్ఞానం పొందటానికి సిద్ధపడాలి.

🙏🙏🙏

సేకరణ

ధార్మికగీత - 63*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                       *ధార్మికగీత - 63*

                                  *****

        *శ్లో:- కన్యా వరయతే రూపం ౹*

                 *మాతా విత్తం ౹ పితా శ్రుతం ౹*

                 *బాంధవా: కుల మిచ్ఛన్తి ౹*

                  *మృష్టాన్న మితరే జనాః ౹౹*

                                      *****

*భా:- తరాలు, అంతరాలు మారుతున్నా, పెళ్లి అనగానే ఎవరెవరి అంతరంగాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. 1."వధువు" వరుని యొక్క ఉట్టిపడే అందచందాలను మాత్రమే చూస్తుంది. మనసుకు నచ్చాడా! లేదా! అనేదే కన్యకు ప్రధానం. మిగతా విషయాలు పట్టించుకోదు.2. "వధువు తల్లి" వరుని ప్లాట్లు- ఫ్లాట్లు ; నగలు-నగదు ; ఉపాధి- జీతం ; ఆదాయము- వ్యయము ఇత్యాది ఆర్థికప్రతిపత్తిని మదింపు చేస్తుంది. 3. "వధువు తండ్రి" వరుని బాగోగులు, మంచీచెడు, గుణగణాలు, మైత్రీబంధం ఆధారంగా అతని బలాలు- బలహీనతలు, సామాజిక పరపతిని,యోగ్యతను విచారణ చేస్తాడు. 4.ఇక చుట్టాలు-పక్కాలు వివాహము సువర్ణమా! అసవర్ణమా! సాంప్రదాయికమా! ప్రేమబంధమా! సంతకాలా! దండలా! మున్నగు విషయాలపై మిక్కిలి మక్కువ కనబరుస్తారు. 5. వధువు, వరుని వైపు నుండి భారీ సంఖ్యలో విచ్చేసిన మిత్రులు, హితులు, సన్నిహితులు షడ్రసోపేతమైన, దేశ విదేశీ రుచుల ఘుమఘుమలతో, చవులూరించే పసందైన విందుభోజనం పట్ల మనసారా ఆసక్తి చూపుతున్నారు. ఇదండీ పెళ్లి సందడి. ఆధునిక,సాంకేతికత వెల్లి విరిసినా, పై మౌలిక,సామాజిక ఆంతరంగికసూత్రాలలో మార్పు కనబడకపోవడం విశేషం*.

                                  *****

                    *సమర్పణ : పీసపాటి* 

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲          


చూచునుముందు కన్య వరు

         సుందర రూపము పెండ్లి నాడగన్ 

చూచును కన్య తల్లి వరు

         సొమ్మును స్తోమత కూతు నీయగన్ 

చూచును కన్య తండ్రి వరు

          సూనృత గుణ్య విశేష పద్ధతుల్ 

చూచును బాంధవాళి వరు

          సుప్రజవంశపు లోటుపాటులన్

చూచుదు రన్య బాంధవులు 

          చోష్య విశేషపు భక్ష్య వంటలన్ 



✍️ గోపాలుని మధుసూదన రావు

భగవంతుడు

 🕉


*ఓం పూర్ణమిదః పూర్ణమదం*

*పూర్ణాత్ పూర్ణముదచ్యతే|*

*పూర్ణస్య పూర్ణ మాదాయా పూర్ణమేవావశిష్యతే||*


తాత్పర్యం:


భగవంతుడు/God (irrespective of religion) పూర్ణుడు(complete/zero).


పూర్ణానికి పూర్ణం కలిపినా....పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా....మిగిలేది పూర్ణమే.


ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే..... జీవితమంతా ఇందులోనే దాగుంది. సమస్త సాధనాల/మార్గాల/దారుల సారం ఇందులోనే ఉంది.


*0 + 0 = 0....*

*0 ౼ 0 = 0....*


కానీ.....


0+1 = ఎంత అంటే.....మనం వెంటనే 1 అని సమాధానం ఇస్తాం.....


ఇక్కడ సున్నా ...ఒకటితో కలవగానే అది 1 గా మారిపోయింది.


0+2 =2.....సున్నా 2 తో కలవగానే సున్న మాయమై..... అది రెండుగా మారిపోయింది. 


అంటే.....

సున్న దేనితో కలిస్తే అదిగా మారిపోతూంది.


గాఢ నిద్రలో మనం పూర్ణమైన భగవంతుడిగా ఉంటాం. మనకప్పుడు ఏ భావోద్వేగాలూ ఉండవు. ఎప్పుడైతే సున్నలాంటి మనం నిద్రలేవగానే ప్రకృతితో కలుస్తామో.....మనం ప్రకృతే ఐపోతున్నాం.


మనం దేనితో కలుస్తామో.....

దానిగా మారిపోతున్నాం.....


బాగా గమనిస్తే....

ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు..... అతడు గతంలో మనకు ఎంతగానో సహాయం చేసాడు....


ఆ వ్యక్తి ని చూడగానే.....

మనలో అతనిపట్ల ఆత్మీయత కలుగుతుంది. మనమూ అతనికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఆలోచిస్తాం. 


ఒక వ్యక్తి మనని ఎంతగానో బాధించాడు..... అతను కనబడగానే మనం కూడా అతన్ని ఎలాగైనా బాధించాలని ఆలోచిస్తాం....


ఎదుటి వ్యక్తి ప్రేమతో వస్తే..... మనకూ అతనిపట్ల ప్రేమ కలుగుతోంది.....


ఎదుటి వ్యక్తి మనని గౌరవిస్తే .....మనకూ అతనిపట్ల గౌరవం కలుగుతుంది.....


అంటే.....


మనం ఎదుటి వ్యక్తిలోని ఏ గుణాన్నాయితే గమనిస్తున్నామో.....

మనం మనకు తెలీకుండానే ఆ గుణంతో కలిసిపోయి.....

ఆ గుణంగానే మారిపోతున్నాం.....


_"మనం దేనితో కలుస్తున్నామో... అది గా మారిపోతున్నాం."_


మనలో సున్న(0) లా ఉన్న దైవత్వం..... ఎదుటి వ్యక్తీలోని కోపం తో కలవాగానే అది కోపంగా మారిపోయి మనకు కోపం వస్తుంది.


మనం ప్రేమతో కలిస్తే ప్రేమగా..... ద్వేషం తో కలిస్తే ద్వేషంగా..... మారిపోతాం.

 

ఎదుటివారిలోని అహంకారాన్ని చూస్తే మనలో కూడా అహంకారం మొలుస్తుంది.


అందుకే.....ప్రతి జీవిలోనూ.....

మనిషిలోనూ.....దేవుడు/God ఉన్నాడని గ్రహించి......

ఆయనతో అనుసంధానం అయితే......


అంటే మనలోని పూర్ణాన్ని..... ఎదుటి వ్యక్తీలోని పూర్ణంతో కలుపితే.....వచ్చేది పూర్ణమే.


ఎదుటి మనిషిని చూడగానే అతనిలోని దోషాలను గుర్తిస్తే.....మనం అతనిలో దేన్ని ముందుగా చూస్తామో..... మనం అదిగా మారిపోతామన్న మహా సత్యాన్ని గమనించాలి.


అందుకే ఎలాంటి వారిలోనైనా.....దేవుడిని చూడగల్గితే.....ఆయనతో కలిస్తే....మనం కూడా దేవుడి తత్వంగా మారిపోతాము.


సదా ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాణు స్వరూపంతో ఉన్న దేవునితో అనుసంధానమవుతూ.....ఉంటే.....ఉండగలిగితే...అంతా ఆనందమే, ఉన్నదే *ఆనందం*

🙏🌷🙏🌷🙏

భాగవతామృతం

 *భాగవతామృతం*

ధృతరాష్ట్రాదులనిర్గమనంబు


1-317-వ.వచనము

అని విదురుండు ధృతరాష్ట్రునకు విరక్తిమార్గం బుపదేశించిన, నతండు ప్రజ్ఞాచక్షుండై, సంసారంబు దిగనాడి, మోహపాశంబు వలన నూడి విజ్ఞానమార్గంబునం గూడి దుర్గమం బగు హిమవన్నగంబునకు నిర్గమించిన.


అని = అని; విదురుండు = విదురుడు; ధృతరాష్ట్రున = ధృతరాష్ట్రున; కు = కు; విరక్తి = విరక్తి {విరక్తి - దేని అందు తగులము లేకపోవుట}; మార్గంబు = పద్దతిని; ఉపదేశించిన = తెలియజేసిన; అతండు = అతడు; ప్రజ్ఞా = జ్ఞానముతో కూడుకొన్న; చక్షుండు = దృష్టి కలవాడు; ఐ = అయి; సంసారంబు = సంసార బంధములను; దిగనాడి = విడిచిపెట్టి; మోహ = భ్రాంతితో కూడిన; పాశంబు = పాశముల; వలనన్ = నుండి; ఊడి = విడివడి; విజ్ఞాన = జ్ఞానయోగ; మార్గంబునన్ = పద్దతితో; కూడి = కలసి; దుర్గమంబు = దాటుటకు చాల కష్టమైనది; అగు = అయిన; హిమవన్నగంబు = హిమాలయము; కున్ = కు; నిర్గమించిన = బయలుదేరిన.


ఈ విధంగా విదురుడు ధృతరాష్ట్రునికి విరక్తి మార్గాన్ని ఉపదేశించాడు. ఆ ప్రబోధంతో కురురాజు జ్ఞాననేత్రం విప్పారింది. అతడు సంసార సౌఖ్యాలను విసర్జించి, మోహ బంధాలను త్రెంచి, జ్ఞాన మార్గాన్ని అవలంబించి, దురంతాలైన హిమవత్పర్వత ప్రాంతాలకు ప్రయాణం సాగించాడు.


1-318-శా.శార్దూల విక్రీడితము


అంధుండైన పతిన్ వరించి, పతిభావాసక్తి నేత్రద్వయీ

బంధాచ్ఛాదనమున్ ధరించి, నియమప్రఖ్యాతయై యున్న త

ద్గాంధారక్షితినాథుకూఁతురును యోగప్రీతి చిత్తంబులో

సంధిల్లం బతివెంట నేఁగె, నుదయత్సాధ్వీగుణారూఢయై.


అంధుండు = గ్రుడ్డివాడు; ఐన = అయినట్టి; పతిన్ = భర్తను; వరించి = ప్రేమించి; పతి = పతి యొక్క; భావా = స్థితిని అనుసరించు; ఆసక్తి = ఇష్టపూర్వక నిర్ణయముతో; నేత్ర = కన్నులు; ద్వయీ = రెంటికిని; బంధ = కట్టుటవలన; ఆచ్ఛాదనమున్ = కప్పియుంచునది; ధరించి = కట్టుకొనిన; నియమ = నియమము కలిగి ఉండుట లో; ప్రఖ్యాత = కీర్తి పొందినది; ఐ = అయి; ఉన్న = ఉన్నటువంటి; తత్ = ఆ; గాంధార క్షితి నాథు కూఁతురును = గాంధారి కూడ {గాంధార = గాంధార; క్షితి = దేశ; నాథు = రాజు; కూఁతురు = పుత్రిక, గాంధారి}; యోగప్రీతి = యోగమును అనుసరించు ఇష్టము; చిత్తంబు = మనసు; లోన్ = లో; సంధిల్లన్ = కూడిరాగా; పతి = భర్త; వెంటన్ = వెనుకనే; ఏఁగెన్ = వెళ్ళెను; ఉదయత్ = ఉద్భవించిన; సాధ్వీ = సాధు స్త్రీ; గుణ = గుణములు; ఆరూఢ = స్థిర పరచుకొన్నది; ఐ = అయి.


గాంధారి ఉత్తమ ఇల్లాలు, పుణ్య పురంధ్రి, గాంధార మహారాజు గారాబు పుత్రిక. పుట్టంధు డైన భూ భర్తను భర్తగా వరించి, పతి చూడ లేని ప్రపంచాన్ని తను మాత్రం ఎందుకు చూడాలనే పట్టుదలతో కళ్లకు గంతలు కట్టుకొని, లోకావలోకనం పరిహరించిన ఆ సాధ్వీమణి అతిశయించిన వైరాగ్యభావంతో పతి వెంట బయలుదేరి వెళ్ళింది హిమాలయలకి.

(విదురుడు విరక్తిమార్గం ఉపదేశించగా అతని వెనుక ధృతరాష్ట్రుడు, అతని సతి గాంధారి హిమాలయాలకు బయలుదేరిన సందర్భలోని పద్య మిది)


1-319-చ.చంపకమాల


వెనుకకు రాక చొచ్చు రణవీరునికైవడి, రాజదండనం

బునకు భయంబు లేక వడిఁ బోయెడి ధీరుని భంగి, నప్పు డా

వనిత దురంతమైన హిమవంతము పొంత వనాంతభూమికిం

బెనిమిటితోడ నించుకయు భీతి వహింపక యేగెఁ బ్రీతితోన్.


వెనుకకు = వెనుకకు మరలి; రాక = రాకుండగ; చొచ్చు = దూసుకొని వెళ్లు; రణ = యుద్ధము చేసే; వీరుని = యోధుని; కైవడిన్ = వలె; రాజ = రాజు చేత; దండనంబు = శిక్షింపబడుట; కున్ = కు; భయంబు = భయము; లేక = లేకుండగ; వడిన్ = వేగముగ; పోయెడి = వెళ్ళు; ధీరుని = ధీరుని; భంగిన్ = వలె; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; వనిత = స్త్రీ; దురంతము = అంతుపట్టుటకు కష్టము; ఐన = అయినట్టి; హిమవంతము = హిమాలయము; పొంతన్ = దగ్గరి; వన = అడవి; అంత = లోపలి; భూమి = ప్రదేశము; కిన్ = నకు; పెనిమిటి = భర్త; తోడన్ = తో; ఇంచుకయు = కొంచెముకూడ; భీతిన్ = భయమును; వహింపకన్ = చెందకుండ; ఏగెన్ = వెళ్ళెను; ప్రీతి = ఇష్ట; తోన్ = పూర్వకముగ.


సందేహం లేకుండా ముందుకు చొచ్చుకొనిపోయే సమర వీరుని రీతిగా, జంకూ గొంకూ లేకుండా రాజదండాన్ని అనుభవించటానికి చకచక సాగిపోయే మగధీరుని మాదిరిగా, తిరుగులేని నిర్భీతితో, తరిగిపోని ప్రీతితో, తన వల్లభుని వెంట హిమవంతం ప్రాంతంలోని దుర్గమవనాంతాలకు ఆమె నిర్గమించింది.


1-320-వ.వచనము

ఇట్లు విదురసహితులై గాంధారీధృతరాష్ట్రులు వనంబునకుం జనిన మఱునాఁడు ధర్మనందనుండు ప్రభాతంబున సంధ్యావందనంబు సేసి, నిత్యహోమంబు గావించి, బ్రాహ్మణోత్తములకు గో హిరణ్య తిల వస్త్రాది దానంబులు సేసి నమస్కరించి, గురువందనముకొఱకుఁ పూర్వ ప్రకారంబునం దండ్రి మందిరమునకుఁ జని యందు విదురసహితు లయిన తల్లిదండ్రులం గానక మంజుపీఠంబునఁ గూర్చున్నసంజయున కిట్లనియె.


ఇట్లు = ఈ విధముగ; విదుర = విదురునితో; సహితులు = కూడినవారు; ఐ = అయి; గాంధారి = గాంధారి; ధృతరాష్ట్రులు = ధృతరాష్ట్రులు; వనంబున = అడవి; కున్ = కి; చనిన = వెళ్లగ; మఱునాఁడు = తరువాతి రోజు; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుండు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; ప్రభాతంబున = ఉదయము నందు; సంధ్యావందనంబు = సంధ్యావందనము; చేసి = చేసికొని; నిత్య = ప్రతి నిత్యము చేయు; హోమంబు = హోమము; కావించి = పూర్తిచేసుకొని; బ్రాహ్మణ = బ్రాహ్మణులైన; ఉత్తములు = ఉత్తములు; కున్ = కు; గో = ఆవులు; హిరణ్య = బంగారము; తిల = నువ్వులు; వస్త్ర = వస్త్రములు; ఆది = మొదలగు; దానంబులున్ = దానములను; చేసి = చేసి; నమస్కరించి = నమస్కరించి; గురు = పెద్దలకు చేయు; వందనము = నమస్కారము; కొఱకున్ = కోసము; పూర్వ = ఇంతకు ముందు; ప్రకారంబునన్ = వలె; తండ్రి = తండ్రి యొక్క; మందిరము = భవనము; కున్ = కు; చని = వెళ్ళి; అందున్ = అందులో; విదుర = విదురునితో; సహితులు = కూడిన వారు; అయిన = అయినట్టి; తల్లిదండ్రులన్ = తల్లిదండ్రులను; కానక = కనుగొనలేక; మంజు = చక్కటి; పీఠంబునన్ = ఆసనమున; కూర్చున్న = కూర్చుండి యున్న; సంజయున = సంజయున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.


ఆ ప్రకారంగా గాంధారీ ధృతరాష్ట్రులు విదురునితో కూడి అరణ్యాలకు వెళ్లారు. ఆ మర్నాడు ధర్మరాజు ప్రాతఃకాల కృత్యాలు తీర్చుకొని, సంధ్యవార్చుకొని, అగ్నికార్యాలు నెరవేర్చుకొన్నాడు. అనంతరం ఉత్తములైన విప్రులకు గోదాన సువర్ణదాన తిలదాన వస్త్రదానాదులు నిర్వర్తించి, పెద్దలకు నమస్కరించే నిమిత్తం యాథావిధిగా పెదతండ్రిగారి భవనానికి వెళ్లాడు. అక్కడ విదురుడూ, గాంధారీ ధృతరాష్ట్రులూ కనిపించలేదు. ఒక సురుచిరపీఠం మీద సుఖాసీనుడై ఉన్న సంజయుణ్ణి చూసి ధర్మరాజు ఇలా అడిగాడు…


1-321-సీ.సీస పద్యము


"మా తల్లిదండ్రు లీ మందిరంబున లేరు;

సంజయ! వా రెందుఁ జనిరి నేఁడు

ముందఱ గానఁడు ముదుసలి మా తండ్రి;

పుత్రశోకంబునఁ బొగులుఁ దల్లి

సౌజన్యనిధి ప్రాణసఖుఁడు మా పినతండ్రి;

మందబుద్ధులమైన మమ్ము విడిచి

యెటఁ బోయిరో మువ్వు రెఱిఁగింపు గంగలోఁ;

దన యపరాధంబుఁ దడవి కొనుచు

1-321.1-ఆ.

భార్యతోడఁ దండ్రి పరితాపమునఁ బడుఁ

గపట మింత లేదు కరుణ గలదు

పాండుభూవిభుండు పరలోకగతుఁడైన

మమ్ముఁ బిన్నవాండ్ర మనిచె నతఁడు."


మా = మాయొక్క; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; ఈ = ఈ; మందిరమునన్ = భవనములో; లేరు = లేరు; సంజయ = సంజయ; వారు = వారు; ఎందున్ = ఎక్కడికి; చనిరి = వెళ్ళితిరి; నేఁడు = ఇవేళ; ముందఱన్ = ఎదురుగ ఉన్నదే; కానఁడు = చూడలేడు; ముదుసలి = ముసలి వాడు; మా = మాయొక్క; తండ్రి = తండ్రి; పుత్ర = పుత్రుల వలని; శోకంబునన్ = వేదనతో; పొగులున్ = దుఃఖించును; తల్లి = తల్లి; సౌజన్య = మంచితనమునకు; నిధి = నివాసము; ప్రాణ = ప్రాణముతో సమానమైన; సఖుఁడు = స్నేహితుడు; మా = మాయొక్క; పినతండ్రి = చిన్నాన్న; మంద = మందగించిన; బుద్ధులము = బుద్ధి కలిగిన వారలము; ఐన = అయినట్టి; మమ్మున్ = మమ్ములను; విడిచి = వదలివైచి; ఎటన్ = ఎక్కడకు; పోయిరో = వెళ్ళినారో; మువ్వురు = ముగ్గురు; ఎఱిఁగింపు = తెలియజేయుము; గంగ = గంగానది; లోన్ = లో; తన = తనయొక్క; అపరాధంబున్ = తప్పులను; తడవికొనుచు = తలచుకొనుచు;

భార్య = భార్య; తోడన్ = తోపాటు; తండ్రి = తండ్రి; పరితాపమునన్ = వేదనలో; పడున్ = పడును; కపటము = అబద్ధము; ఇంత = ఇంతకూడ; లేదు = లేదు; కరుణ = దయ; కలదు = కలదు; పాండు = పాండు; భూవిభుండు = రాజు; పరలోకగతుఁడు = చనిపోయిన వాడు; ఐన = అయినట్టి; మమ్మున్ = మమ్ములను; పిన్నవాండ్రన్ = పిల్లవాళ్ళను; మనిచె = పెంచి పోషించెను; అతఁడు = అతడు.


"సంజయా!. మా తల్లీ తండ్రీ ఈ మేడలో కన్పించటం లేదు. వారెక్కడికి వెళ్లారో తెలియదు. మా తండ్రారు కంటిచూపు కరవైన మూడకాళ్లముసలి. మా తల్లిగారు కడివెడు శోకంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటుంది. మా పినతండ్రిగారు మాకు ప్రాణ సమానుడు. సౌజన్యమూర్తి. ఈ ముగ్గురూ మందమతులమైన మమ్మల్ని వదలిపెట్టి ఎటు పోయినారో చెలియదు. మాపెదతండ్రిగారు ఒకవేళ తాము చిసన తప్పులకు పశ్చాత్తాపం చెంది భార్యతో కూడా గంగలో దూకాడేమోనని అనుమానంగా ఉంది. తెలిస్తే చెప్పు. ఆయిన చాలా అమాయకుడు, కరుణాఱ్ఱ్థహృదయుడు. మా తండ్రి పాండుభూపాలుడు పరలోకగతుడు కాగా పిన్నవాళ్లమైన మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచి పెద్దచేశారు."


1-322-వ.వచనము

అనిన సంజయుండు దయాస్నేహంబుల నతికర్శితుం డగుచు దన ప్రభువు వోయిన తెఱం గెఱుంగక, కొంత దడ వూరకుండి తద్వియోగ దుఃఖంబునఁ గన్నీరు దుడిచికొనుచు, బుద్ధిబలంబునం జిత్తంబు ధైర్యాయత్తంబు సేసి, తన భర్తృ పాదంబుల మనంబుల నెన్నుచు ధర్మజున కిట్లనియె.


అనిన = అనగా; సంజయుండు = సంజయుండు; దయా = దయ; స్నేహంబులన్ = స్నేహములకు; అతి = మిక్కిలి; కర్శితుండు = దిగులుచెందినవాడు; అగుచున్ = అవుతూ; తన = తనయొక్క; ప్రభువు = యజమాని; పోయిన = వెళ్ళిన; తెఱంగు = విధము; ఎఱుంగక = తెలియక; కొంత = కొంచెము; తడవు = సమయము; ఊరకన్ = ఊరకనే; ఉండి = ఉండి; తత్ = ఆ; వియోగ = ఎడబాటు వలని; దుఃఖంబునన్ = బాధతో; కన్నీరు = కన్నీళ్ళని; తుడిచికొనుచున్ = తుడుచికొనుచు; బుద్ధి = మనో; బలంబునన్ = బలమువలన; చిత్తంబు = మనసుని; ధైర్య = ధైర్యముతో; ఆయత్తంబున్ = కూడినదిగ; చేసి = చేసి; తన = తన యొక్క; భర్తృ = యజమాని యొక్క; పాదంబులన్ = పాదములను; మనంబులన్ = మనసులో; ఎన్నుచున్ = ఎంచుకొనుచు; ధర్మజున్ = ధర్మరాజు {ధర్మజు - యముని కొడుకు, ధర్మరాజు}; కున్ = తో; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.


ధర్మజుని మాటలు విని సంజయుడు కనికరంతోనూ, ప్రేమతోనూ నిండిన గుండెతో తన ప్రభువు ఎక్కడికి పోయాడో తెలియక కొంచెము సేవు మౌనం వహించాడు. ఆ మహారాజు వెళ్లిపోయినందుకు పొంగివచ్చే కన్నీరు తుడుచుకొన్నాడు. గుండె దిటవుపరచుకొని తన ప్రభువు పాదాలు మనస్సులో ధ్యానిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు సంజయుడు.


1-323-తే.తేటగీతి


"అఖిల వార్తలు మున్ను నన్నడుగుచుండు

నడుగఁ డీ రేయి మీ తండ్రి యవనినాథ!

మందిరములోన విదురుతో మంతనంబు

నిన్న యాడుచు నుండెను నేఁడు లేఁడు.


అఖిల = సమస్తమైన; వార్తలు = వార్తలు; మున్ను = ఇంతకు ముందు; నన్ను = నన్ను; అడుగుచుండున్ = అడుగుతుండేవాడు; అడుగఁడు = అడగలేదు; ఈ = ఈ; రేయి = రాత్రి; మీ = మీయొక్క; తండ్రి = తండ్రి; అవనినాథ = రాజ {అవనినాథుడు - భూమికి ప్రభువు, రాజు}; మందిరము = అంతఃపురము; లోనన్ = లోపల; విదురు = విదురుని; తోన్ = తో; మంతనంబు = ఇష్టాపూర్వక సంభాషణములు; నిన్న = క్రిందటి రోజు; ఆడుచున్ = మాట్లాడుచును; ఉండెను = ఉండెను; నేఁడు = ఈ రోజు; లేఁడు = లేడు.


"ధర్మరాజా! నీపెద తండ్రిగారు ప్రతిదినమూ వార్తలేమిటని నన్ను అడుగుతుండేవారు. ఈ రాత్రి ఆయన నన్నేమీ అడగలేదు. నిన్నటివరకూ రాజమందిరంలో విదురునితో కలిసి రహస్యాలోచనలు చేస్తూ ఉండేవాడు. ఈనాడు కంటికి కన్పించకుండా వెళ్ళిపోయాడు.


1-324-వ.వచనము

విదురగాంధారీధృతరాష్ట్రులు నన్ను వంచించి యెందుఁ బోయిరో వారల నిశ్చయంబు లెట్టివో యెఱుంగ" నని సంజయుండు దుఃఖించు సమయంబునఁ దుంబురు సహితుండై నారదుండు వచ్చిన; లేచి నమస్కరించి తమ్ములుం దానును నారదుం బూజించి కౌంతేయాగ్రజుం డిట్లనియె.


విదుర = విదురుడు; గాంధార = గాంధారి; ధృతరాష్ట్రులు = ధృతరాష్ట్రులు; నన్ను = నన్ను; వంచించి = మోసగించి; ఎందున్ = ఎక్కడకు; పోయిరో = వెళ్ళినారో; వారల = వారియొక్క; నిశ్చయంబులు = నిర్ణయములు; ఎట్టివో = ఎలాంటివో; ఎఱుంగను = నాకు తెలియదు; అని = అని; సంజయుండు = సంజయుడు; దుఃఖించు = బాధపడు; సమయంబునన్ = సమయములో; తుంబురు = తుంబురుని; సహితుండు = కూడినవాడు; ఐ = అయి; నారదుండు = నారదుడు; వచ్చినన్ = రాగా; లేచి = లేచి; నమస్కరించి = మ్రొక్కి; తమ్ములున్ = తమ్ముళ్ళును; తానును = తానును; నారదున్ = నారదుని; పూజించి = పూజించి; కౌంతేయాగ్రజుండు = ధర్మరాజు {కౌంతేయాగ్రజుడు - కుంతి పెద్ద కొడుకు, ధర్మరాజు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.


విదురుడూ గాంధారీ ధృతరాష్ట్రులూ నాకు చెప్పకుండా నా కన్నుగప్పి ఎక్కడికి వెళ్లిపోయారో, ఏ ఉద్దేశ్యంతో వెళ్లిపోయారో తెలియదు” అని సంజయుడు బావురుమన్నాడు. ఆ సమయంలో తుంబురనితో నారదుడు అక్కడికి విచ్చేసాడు. ధర్మరాజు లేచి తమ్ములూ తానూ వారికి నమస్కారం చేసి పూజించాడు. అనంతరం అజాతశత్రుడు బ్రహ్మమానన పుత్రునితో.....


1-325-ఉ.ఉత్పలమాల


"అక్కట! తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మ! వారు నేఁ

డెక్కడ వోయిరో యెఱుఁగ, నెప్పుడు బిడ్డల పేరు గ్రుచ్చి తాఁ

బొక్కుచునుండుఁ దల్లి యెటు వోయెనొకో? విపదంబురాశికిన్

నిక్కము కర్ణధారుఁడవు నీవు జగజ్జనపారదర్శనా!"


అక్కట = అయ్యో; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; గృహంబునన్ = ఇంటిలో; లేరు = లేరు; మహాత్మ = గొప్ప ఆత్మ కలవాడా; వారు = వాళ్ళు; నేఁడు = ఈ రోజు; ఎక్కడన్ = ఎక్కడకు; పోయిరో = వెళ్ళినారో; యెఱుఁగన్ = నాకు తెలియదు; ఎప్పుడు = ఎల్లప్పుడు; బిడ్డల = పుత్రుల యొక్క; పేరు = గొప్పదనము; గ్రుచ్చి = గురించి / నొక్కి; తాన్ = తాను; పొక్కుచున్ = దుఃఖ పడుచు; ఉండున్ = ఉండును; తల్లి = తల్లి; ఎటు = ఎక్కడకు; పోయెనొకో = పోయెనో పాపం; విపత్ = ప్రమాదములు అను; అంబు = సముద్రము; రాశి = దాటుట; కిన్ = కు; నిక్కము = నిజముగ; కర్ణధారుఁడవు = తరింపజేయువాడవు {కర్ణధారుడు - పడవ చుక్కాని పట్టు సరంగు, తరింపచేయువాడు}; నీవు = నీవు; జగత్ = లోకములోని; జన = ప్రజలకు; పార = గమ్యము(ఒడ్డు); దర్శనా = చూపువాడా.


"దేవర్షీ! నీవు సర్వజ్ఞుడవు. ముల్లోకాలలో నీకు తెలియని ఏమీలేదు. ఆపదలనే సముద్రం దాటించటానికి నిజంగా నీవు కర్ణధారుడవు. అయ్యో మహాత్మా! ఏమని చెప్పమంటావు. తెల్లవారి చూసే సరికి మాతల్లిదండ్రులు ఇంటిలో లేరు. వారు ఇల్లు వదలి ఎక్కడికి పోయారో తెలియకుండా ఉంది. సర్వదా తనబిడ్డలను పేరు పేరునా తలచుకొని తల్లడిల్లే మా తల్లి ఎటుపోయిందో ఏమయిపోయిందో."


1-326-వ.వచనము

అనిన విని సర్వజ్ఞుండైన నారదుండు ధర్మజున కిట్లనియె ”నీశ్వరవశంబు విశ్వంబు ఈశ్వరుండ భూతముల నొకటితో నొకటిఁ జేర్చు నెడఁబాపు, సూచీ భిన్ననాసిక లందు రజ్జుప్రోతంబు లగుచుఁ గంఠరజ్జువులఁ గట్టబడిఁన బలీవర్ధంబులంబోలెఁ గర్తవ్యాకర్తవ్యవిధాయక వేదలక్షణ యగు వాక్తంత్రి యందు వర్ణాశ్రమ లక్షణంబులు గల నామంబులచే బద్ధులైన లోకపాలసహితంబు లై, లోకం బీశ్వరాదేశంబు వహించు గ్రీడాసాధనంబు లగు నక్షకందుకాదుల కెట్లు సంయోగ వియోగంబు లట్లు క్రీడించు నీశ్వరుని క్రీడాసాధనంబులైన జంతువులకు సంయోగ వియోగంబు లగుచుండు, సమస్త జనంబును జీవరూపంబున ధ్రువంబును, దేహరూపంబున నధ్రువంబునై యుండు;మఱియు నొక్క పక్షంబున ధ్రువంబు నధ్రువంబునుం గాక యుండు, శుద్ధబ్రహ్మస్వరూపంబున ననిర్వచనీయంబుగ రెండునై యుండు, అజగరంబుచేత మ్రింగంబడిన పురుషుం డన్యుల రక్షింపలేని తెఱంగునఁ బంచభూత మయంబై కాలకర్మ గుణాధీనంబైన దేహంబు పరుల రక్షింప సమర్థంబు గాదు, కరంబులు గల జంతువులకుఁ గరంబులు లేని చతుష్పదంబు లాహారంబు లగుఁ; జరణంబులు గల ప్రాణులకుం జరణంబులు లేని తృణాదులు భక్షణీయంబు లగు; నధిక జన్మంబుగల వ్యాఘ్రాదులకు నల్పజన్మంబులుగల మృగాదులు భోజ్యంబులగు; సకలదేహి దేహంబు లందు జీవుండు గలుగుటం జేసి జీవునికి జీవుండ జీవిక యగు; అహస్త సహస్తాది రూపంబైన విశ్వ మంతయు నీశ్వరుండు గాఁ దెలియుము;అతనికి వేఱు లేదు; నిజమాయా విశేషంబున మాయావి యై జాతిభేద రహితుండైన యీశ్వరుండు బహుప్రకారంబుల భోగిభోగ్యరూపంబుల నంతరంగ బహిరంగంబుల దీపించు, గాన యనాథులు దీనులు నగు నాదు తల్లిదండ్రులు ననుం బాసి యేమయ్యెదరో యెట్లు వర్తింతురో యని వగవం బని లేదు, అజ్ఞాన మూలం బగు స్నేహంబున నైన మనోవ్యాకులత్వంబు పరిహరింపు" మని మఱియు నిట్లనియె.


అనినన్ = అనగా; విని = విని; సర్వజ్ఞుండు = సర్వము తెలిసినవాడు; ఐన = అయినట్టి; నారదుండు = నారదుడు; ధర్మజున = ధర్మరాజు; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = చెప్పెను; ఈశ్వర = భగవంతునికి; వశంబు = ఆధీనము అయి ఉండునది; విశ్వంబు = విశ్వము; ఈశ్వరుండ = భగవంతుడే; భూతములన్ = జీవులను; ఒకటి = ఒక; తోన్ = దానితో; ఒకటిన్ = ఒక దానిని; చేర్చున్ = చేరువ చేయును; ఎడఁ బాపున్ = దూరము జరుపును; సూచీ = సూదితో; భిన్న = పొడిచిన; నాసికలు = ముక్కులు; అందున్ = అందు; రజ్జు = త్రాడు; ప్రోతంబులు = గుచ్చబడినవి; అగుచున్ = అవుతూ; కంఠ = మెడలను; రజ్జువులన్ = తాళ్ళచేత; కట్టబడిఁన = కట్టబడినట్టి; బలీవర్ధంబులన్ = ఎడ్లను; పోలెన్ = వలె; కర్తవ్య = చేయతగినది; అకర్తవ్య = చేయతగనిది లలో; విధాయక = విధివత్ప్రకారమైనదానిని; వేద = తెలియజేయు; లక్షణ = లక్షణములు కలది; అగు = అయినట్టి; వాక్తంత్రి = మాట అను తంత్రి; అందున్ = లోని; వర్ణ = వర్ణములయొక్క; ఆశ్రమ = ఆశ్రమములయొక్క; లక్షణంబులు = లక్షణములు; కల = ఉన్నట్టి; నామంబులు = నామములు; చేన్ = చేత; బద్ధులు = కట్టబడినవారు; ఐన = అయినట్టి; లోక = లోకులను; పాల = పాలించువారితో; సహితంబులు = కూడినవి; ఐ = అయి; లోకంబు = లోకములు; ఈశ్వర = భగవంతుని; ఆదేశంబు = ఆజ్ఞను; వహించున్ = శిరసావహించును; క్రీడా = ఆటకు; సాధనంబులు = పనికివచ్చు వస్తువులు; అగున్ = అయిన; అక్ష = పాచికలు; కందుక = బంతి; ఆదులు = మొదలగు వాని; కున్ = కి; ఎట్లు = ఏ విధముగనైతే; సంయోగ = కలయికలు; వియోగంబుల్ = ఎడబాటు లగునో; అట్లు = ఆ విధముగ; క్రీడించు = క్రీడించే; ఈశ్వరుని = భగవంతుని; క్రీడా = ఆటకు; సాధనంబులు = పనికివచ్చు వస్తువులు; ఐన = అయిన; జంతువులు = జీవులు {జంతువులు - పుట్టుక కలవి}; కున్ = కు; సంయోగ = కలయిక; వియోగంబులు = ఎడబాటులు; అగుచుండు = అవుతాయి; సమస్త = సమస్తమైన; జనంబును = జనమును; జీవ = జీవుని; రూపంబునన్ = రూపములో; ధ్రువంబును = స్థిరమైనదిగను; దేహ = దేహము; రూపంబునన్ = రూపములో; అధ్రువంబును = అస్థిరమైనదిగను; ఐ = అయి; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకనూ; ఒక్క = ఒక; పక్షంబునన్ = విధముగ; ధ్రువంబున్ = స్థిరమును; అధ్రువంబునున్ = అస్థిరమును; కాక = కాకుండగను; ఉండున్ = ఉండును; శుద్ధబ్రహ్మ = శుద్ధబ్రహ్మ; స్వరూపంబునన్ = స్వరూపములో; అనిర్వచనీయంబుగన్ = వివరింపవీలుకానిదిగ; రెండును = రెండూకూడను; ఐ = అయి; ఉండున్ = ఉండును; అజగరంబు = కొండచిలువ; చేతన్ = చేత; మ్రింగంబడిన = మింగబడిన; పురుషుండు = మానవుడు; అన్యులన్ = ఇంకొకరిని; రక్షింపలేని = కాపాడలేని; తెఱంగునన్ = విధముగ; పంచ = ఐదు; భూత = భూతములతో; మయంబు = కూడినది; ఐ = అయి; కాల = కాలమునకును; కర్మ = కర్మలకును; గుణ = గుణములకును; ఆధీనంబు = వశములో ఉండునది; ఐన = అయిన; దేహంబు = శరీరము; పరులన్ = ఇతరుల; రక్షింపన్ = రక్షించుటకు; సమర్థంబు = శక్తి కలది; కాదు = కాదు; కరంబులు = చేతులు; కల = కలిగిన; జంతువులు = జీవులు; కున్ = కు; కరంబులు = చేతులు; లేని = లేనట్టి; చతుష్పదంబులు = నాలుగు కాళ్ళు ఉన్నవి; ఆహారంబులు = ఆహారములు; అగున్ = అగును; చరణంబులు = కాళ్ళు; కల = కలిగిన; ప్రాణులు = జీవులు; కున్ = కు; చరణంబులు = కాళ్ళు; లేని = లేనట్టి; తృణ = గడ్ఢి; ఆదులు = మొదలగునవి; భక్షణీయంబులు = తినదగినవి; అగున్ = అగును; అధిక = పెద్ద; జన్మంబు = పుట్టుక; కల = కలిగిన; వ్యాఘ్ర = పులులు; ఆదుల = మొదలగు; కున్ = వానికి; అల్ప = చిన్న; జన్మంబులు = పుట్టుకలు; కల = కలిగిన; మృగ = లేడి; ఆదులు = మొదలగునవి; భోజ్యంబులు = తినదగినవి; అగున్ = అగును; సకల = సమస్త; దేహి = జీవుల యొక్క {దేహి - శరీరము కలిగినది / జీవి}; దేహంబులు = శరీరములు; అందున్ = లో; జీవుండు = జీవుడు; కలుగుటన్ = కలుగుట; చేసి = వలన; జీవుని = జీవి; కిన్ = కి; జీవుండ = జీవే; జీవిక = జీవించుటకు ఆధారము; అగున్ = అగును; అహస్త = హస్తములు లేనివి; సహస్త = హస్తములు ఉన్నవి; ఆది = మొదలగు; రూపంబు = రూపములు కలవి; ఐన = అయినట్టి; విశ్వము = విశ్వము; అంతయు = సమస్తమును; ఈశ్వరుండుగాన్ = ఈశ్వరుడు అని; తెలియుము = తెలిసికొనుము; అతని = అతని; కిన్ = కి; వేఱు = అన్యమైనది ఏమియును; లేదు = లేదు; నిజ = తన; మాయా = మాయ యొక్క; విశేషంబున = విశిష్టత వలన; మాయావి = మాయకలవాడు; ఐ = అయి; జాతి = జాతి / పుట్టుకతో వచ్చిన; భేద = భేదములు; రహితుండు = లేనివాడు; ఐన = అయిన; ఈశ్వరుండు = భగవంతుడు; బహు = అనేక; ప్రకారంబులన్ = విధములుగా; భోగి = అనుభవించునది; భోగ్య = అనుభవింపబడునవి అనబడే; రూపంబులన్ = రూపములతో; అంతరంగ = లోపటలను; బహిరంగంబులన్ = బయటల యందును; దీపించున్ = ప్రకాశించును; కాన = కావున; అనాథులు = దిక్కులేనివారు; దీనులున్ = దీనులును; అగు = అయిన; నాదు = నాయొక్క; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; ననున్ = నన్ను; పాసి = వదలి; ఏమి = ఏమి; అయ్యెదరో = అవుతారో; ఎట్లు = ఏ విధముగ; వర్తింతురో = ఉండెదరో; అని = అని; వగవన్ = దుఃఖ పడుటకు; పనిలేదు = అవసరములేదు; అజ్ఞాన = అజ్ఞానమునకు; మూలంబు = మూలమైనట్టిది; అగు = అయిన; స్నేహంబునన్ = స్నేహభావమువలన; ఐన = అయినను; మనస్ = మనసు యొక్క; వ్యాకులత్వంబు = చీకాకుపడుటను; పరిహరింపుము = తొలగించుము; అని = అని; మఱియున్ = మళ్ళా; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = చెప్పెను.


ఆ పలుకుల విని నారదుడు ఇలా అన్నాడు.”ధర్మరాజా! ఈ విశ్వమంతా ఈశ్వరాధీనం. పరమేశ్వరుడే ప్రాణులను ఒకరితో ఒకరిని కలుపుతూ విడదీస్తూ ఉంటాడు. ముక్కుత్రాళ్లు పొడిచి, మెడకు పలుపులు తగిలించి, పగ్గాలు చేత పట్టుకొని, కర్షకుడు ఎద్దులను త్రిప్పినట్లుగా భగవంతుడు కర్తవ్యాకర్తవ్యాలను బోధించి, వేద వాక్కులనే త్రాడు బిగించి, వర్ణాశ్రమధర్మాలకు అనుగుణమైన విధంగా ఇంద్రాది దిక్పాలకులతో సహా ప్రాణులను ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతుంటాడు. క్రీడాకారుని ఇష్టానుసారం పాచికలూ, బంతులూ మొదలైన ఆటవస్తువులు కలుస్తూ విడిపోతూ ఉన్నట్లు, భగవంతుని ఇచ్ఛానుసారంగా ప్రాణులకు సంయోగ వియోగాలు ప్రాప్తిస్తుంటాయి. సమస్త దేవలోకమూ ఆత్మరూపంలో నిత్యమైనదై దేహరూపంలో అనిత్యమైనదై ఉంటుంది. మరోవిధంగా చూస్తే రెండు కాకుండా ఉంటుంది. అనిర్వచనీయమైన బ్హహ్మస్వరూపం పొందినప్పుడు నిత్యానిత్యమై కాలకర్మాధీనమై, సంసారపంక నిర్మగ్నమైన దేహం పరులను కాపాడలేదు. చేతులున్న ప్రాణులకు చేతులులేని చతుష్పాద జంతువులూ, కాళ్లుండి కదలగల ప్రాణులకు కాళ్లులేని తృణాదులూ, ఆహార మవుతున్నాయి. పెద్దజంతువులైన పెద్దపులులు మొదలైనవి లేళ్లు మొదలైన చిన్న జంతువులను తింటున్నవి. సమస్త దేహధారుల దేహాల్లో జీవుడు ఉన్నందువల్ల జీవికి జీవియే జీవనాధార మగుతున్నాడు. చేతులున్న ప్రాణులతోనూ, చేతులులేని ప్రాణులతోనూ నిండిన ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపంగా భావించు, ఆయనకంటే అన్యం లేదు. తన మాయావిశేషంచేత మహామాయావి అయిన పరాత్పరుడు బహురూపాలు ధరించి తానే భోక్తయై, భోజ్యమై; లోపలా, వెలుపలా అంతటా తానై విరాజిల్లుతున్నాడు. అందువల్ల మహారాజా! నా తల్లిదండ్రులు దీనులే! దిక్కు లేనివారే! నన్ను వదలి ఏమైపోతారో? ఏలా జీవిస్తారో? అనే విచారం మాను, అజ్ఞానమూలకమైన మమకారం పెంచుకొని అనవసరంగా మనస్సును క్లేశపెట్టుకోవద్దు.


1-327-ఆ.ఆటవెలది


అట్టి కాలరూపుఁ డఖిలాత్ముఁ డగు విష్ణుఁ

డసురనాశమునకు నవతరించి

దేవకృత్యమెల్లఁ దీర్చి చిక్కిన పని

కెదురుసూచుచుండు నిప్పు డధిప!


అట్టి = అటువంటి; కాల = కాలము; రూపుఁడు = రూపముగ కలవాడు; అఖిల = సమస్తమైనది; ఆత్ముఁడు = తానే ఐన వాడు; అగు = అయిన; విష్ణుఁడు = భగవంతుడు; అసుర = రాక్షస; నాశమున = నాశనము; కున్ = కొరకు; అవతరించి = అవతరించి; దేవ = దేవతల; కృత్యము = పని; ఎల్లన్ = సమస్తము; తీర్చి = పూర్తిచేసి; చిక్కిన = మిగిలిన; పని = పని; కిన్ = కోసము; ఎదురుసూచుచు = ఎదురుచూచుచు; ఉండున్ = ఉండును; ఇప్పుడు = ఇప్పుడు; అధిప = గొప్పవాడా;


కాలస్వరూపుడై అఖిలాంతర్యామి అయిన భగవంతుడు అసురులను సంహరించటంకోసం అవతరించాడు. దేవకార్యం తీరిపోయింది. ఇప్పుడు మిగిలిన పనికోసం నిరీక్షిస్తున్నాడు.

జీవితం

 🦚ఒక ఊరిలో ఒక వ్యాపారికి రోజు రాత్రుళ్ళు దయ్యాలు కనిపించి భయపెడుతూ ఉంటాయి 

 

పాపం ఆ వ్యాపారి రాను రాను కొంత కాలానికి భయం తో రాత్రుళ్ళు నిద్ర పోవడమే మానేస్తాడు 


ఈ దయ్యలను వదిలించు కోవడం కోసం తాను సంపాదించిన సంపాదన అంతా కూడా 


భూత,ప్రేత, పిశాచ మాంత్రికుల దగ్గరకు   మోహిని, శాకిని, డాకిని లను కూడ అటాడించే

అఘోరాల దగ్గరకు  


ఎన్నో ఏళ్లుగా శక్తివంతంగా  ప్రసిద్ధిగాంచిన దేవాలయాలకు, దర్గాలకు తిరిగి తిరిగి అలసి పోతాడు


ఇలా కాదని విజ్ఞాన పరంగా వైద్యం అందిస్తున్న సైకియాట్రిస్ట్ ల దగ్గరకు కూడ  వెళ్లి


వారిచ్చిన మందులు ప్రారంభిస్తాడు వారిచ్చిన ఆ మందులతో

పగటి పూట కూడ నిద్ర వచ్చి

నిద్రపోతే అప్పుడు కూడ ఆ దయ్యాలు వ్యాపారిని భయపెడుతూ ఉంటాయి 


ఇంకా తన దగ్గర ఉన్న సంపాదన అంత కర్చు అయిపోయి ఇంకా అప్పులు కూడా పెరిగి పోతాయి

ఇంకా లాభం లేదనుకొని ఆత్మహత్యే శరణ్యం అనుకొని తను ఆత్మహత్య కు

సిద్ధపడతాడు 


ఇంతలో తన సమస్య తెలిసిన

 ఒక స్నేహితుడు అతని దగ్గరకు వచ్చి ఇలా అంటాడు నీకు వచ్చిన సమస్యకు మన ఊరి చివర ఉన్నకొండ దగ్గరి గుడి ముందు ఒక పకీరు ఉన్నాడంట  


అతని దగ్గరకు వెళితే నయం అవుతుందని విన్నాను ఒక సారి వెళ్దామా అంటాడు


ఆ వ్యాపారికి మనసులో నమ్మకం లేకున్నా 

ఎలాగు చనిపోదమని అనుకుంటున్న కదా ఒక సారి చూస్తే పోలే అని చిన్న ఆశతో

తన మిత్రునితో కలసి  పకీర్ దగ్గరకు వెళతాడు 


ఆ పకిరుతో తనకున్న సమస్య 

అంతా కూడ వివరిస్తాడు

అది విన్న పకిరు 

నీవు ఏ వృత్తిలో జీవనం సాగిస్తు ఉన్నావు అని అడుగు తాడు


దానికి బదులుగా వ్యాపారి

నేను మన ఊరి మధ్యలో వున్న 

ఐదు అంతస్థుల భవనం అద్దెకు తీసుకొని హోటల్ నడుపుతున్నాను అంటాడు 


అప్పుడు పకీర్ నీ హోటల్లో ఏమేం ఏమేం ఉంటాయి అని అడుగుతాడు


దానికి వ్యాపారి నా హోటల్లో 

దేశ విదేశాలకు సంబంధించిన

మాంసాహార శాకాహార వంటకాలు ఇంకా అనేక రకాల  భోజనాలు ఉంటాయి స్వామి 

నా దగ్గర యాభై మంది పని వాళ్ళు కూడ వున్నారు అంటాడు


అబ్బో చాల పెద్ద వ్యాపారమే 

కానీ ఇప్పుడు నీకు ఉన్న సమస్యకు ఇంత ఇబ్బంది తో కూడుకున్న వ్యాపారం సరి కాదు నువ్వు ఇప్పుడు నడుపుతున్న వ్యాపారాన్ని అపేసి 

కొన్ని రోజులు చిన్న వ్యాపారం చేసుకో అంటాడు


దానికి వ్యాపారి చిన్న వ్యాపారం అంటే ఏ వ్యాపారం 

చేయమంటారు స్వామి అని అడుగుతాడు


దానికి పకీరు బదులుగా కూరగాయలు లేదా పండ్లు అలాంటి వ్యాపారాలు అని చెప్పి తన దగ్గర ఉన్న తావిజుని వ్యాపారి మెడలో వేసి మళ్లీ కొంత కాలానికి వచ్చి

ఎలావుందో చెప్పు నాయన అంటాడు 


అక్కడినుండి వెళ్ళిన వ్యాపారి

తన పాత వ్యాపారాన్ని నిలిపివేసి కొత్తగా పండ్ల వ్యాపారాన్ని ప్రారంభించి కొంత కాలానికి ఎంతో సంతోషం తో 

ఫకీర్ దగ్గరకు వెళతాడు


అప్పుడు పకీరు   ఎలా ఉంది నాయన ఇప్పుడు అని అడుగుతాడు


వ్యాపారి తమరి దయవల్ల ఇప్పుడు నా జీవితం ఎంతో ఆనందం తో చాలా బావుంది నేను మీకు ఎప్పుడు రుణ పడి ఉంటాను స్వామి


ఇప్పుడు నాకు రాత్రుళ్ళు దయ్యాలు కనిపించట్లేదు దయ్యాలు కనిపించక పోగ తమరి తాయత్తు మహిమతో

 

 నాకు కలలో అప్పుడప్పుడు దేవుళ్ళు కూడ నాకు దర్శనం ఇస్తున్నారు స్వామి అంటాడు


దానికి పకిరు చూడు నాయన నా దగ్గర కాని నేనిచ్చిన తావిజు దగ్గర కాని ఎటువంటి మహిమల్లేవు 


నీకు వచ్చిన సమస్య నీ నుండే వచ్చింది నీ నుండే పోయింది

గతంలో నువ్వు హింసతో కూడుకున్న వ్యాపారం చేశావు 

నువ్వు చేసిన ఆ వ్యాపారం  ఎంతో జీవ హింస తో కూడుకొని ఉన్నది 


అందువల్ల ఆ భగవంతుడే  రోజు నీకు కలలో దయ్యాల రూపంలో 

భయపెట్టాడు ఇప్పుడు నువ్వు 

ఏ హింస లేని వ్యాపారం చేస్తున్నందున ఇప్పుడు నీకు  దేవతలు గా కనిపిస్తున్నాడు


నిజానికి దయ్యం ఎక్కడ లేదు అంతా దైవమే ఒక నాణానికి రెండు రూపాలు ఎట్లనో 

మనం చేసే పనులను బట్టి దైవం దర్శనమిస్తాడు

 

మనం చేసే వృత్తి సరైనద కాద అని మనమే నిర్ధారించుకొని

మన వృత్తిలో మనం ముందుకు సాగాలి


             సత్యవాణి

సంయమనం

 *సంయమనం*


తాటక వధ అనంతరం రాముడికి విశ్వామిత్రుడు అస్త్రవిద్యను ఉపదేశించాడు. విశ్వామిత్రుడి ఉపదేశం ధనుర్వేదానికి సంబంధించినది. అది ఉపవేదం. రుగ్వేదానికి ఆయుర్వేదం, యజుర్వేదానికి ధనుర్వేదం ఉపవేదాలు. ధనుర్వేదానికి అధిదేవత రుద్రుడు. ఆయన నుంచి క్రమంగా ఆ విద్య విశ్వామిత్రుడికి సంక్రమించింది. ఈశానసంహిత పేరుతో అది ఈ లోకానికి అందింది. పరశురాముడి ద్వారా వ్యాప్తిలోకి వచ్చిన భాగం ‘శాండిల్య భాష్యం’. త్రేతాయుగంలో ఈశాన సంహిత, ద్వాపరం(భారతకాలం)లో  ప్రాచుర్యాన్ని పొందాయి. తాటకను రాముడు సంహరించింది శస్త్రంతో. శస్త్రమంటే బాణం మాదిరి ఆయుధం. దాన్ని ఏదైనా మంత్రంతో అనుసంధానిస్తే అది అస్త్రం అవుతుంది. రాముడు శస్త్ర, అస్త్ర విద్యాకోవిదుడు. గడ్డిపరకను అస్త్రంగా అభిమంత్రించగల జగదేక ధానుష్కుడు.


ఐంద్రం, శైవాస్త్రం, బ్రహ్మాస్త్రం, నారాయణం, గాంధర్వం, మానసం వంటి ఎన్నో రకాల అస్త్ర మంత్రాలను విశ్వామిత్రుడు ఉపదేశించినా- రాముడు సంతృప్తి చెందలేదు. వాటి ఉపసంహార విద్యనూ తనకు ప్రసాదించమని అభ్యర్థించాడు. అస్త్రవిద్యలో సంధానం, ప్రయోగం, ఉపసంహారమనే మూడు దశలుంటాయి. సాధారణ విలుకాడైతే మొదటి రెండింటితోనే సంతృప్తి పడిపోతాడు. కానీ రాముడు సంపూర్ణ ధనుర్విద్యావేత్త. ప్రత్యర్థి తనపైకి ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే, దానికి  ప్రతిగా దేన్ని ప్రయోగించాలో ధనుర్వేత్తకు తెలియాలి. అంతేకాదు, అవసరమైతే తాను ప్రయోగించిన అస్త్రాన్ని వెనక్కి రప్పించడం తెలియాలి. ఉపసంహారం తెలియకుండా అస్త్రప్రయోగం చేయడం ఉత్తమ విలువిద్యావేత్త లక్షణం కాదు. ఈ మాట అన్ని విద్యలకు, అన్ని శాస్త్రాలకు వర్తిస్తుంది.

అణుబాంబులాంటి వాటిని తయారు చేయడం, ప్రయోగించడం రెండే తెలిస్తే, వాటివల్ల జరిగే విధ్వంసాన్ని నిరోధించడం అసాధ్యం అవుతుంది. ఒక మందును కనుగొని లోకానికి పరిచయం చేసేటప్పుడు- ముందుగా దాని వాడకంవల్ల వచ్చే చెడు పరిణామాలను సైతం క్షుణ్నంగా అధ్యయనం చేస్తారు. ఉపసంహార విద్యలూ  అలాంటివే.  ఆయుర్వేద మందులు కొన్నింటిని తేనెతోనో, పంచదారతోనో తీసుకొ మ్మంటారు. దాన్నే ‘అనుపానం’గా చెబుతారు. అనుపానం వల్ల ఔషధాల దుష్ప్రభావాలను అరికట్టే వీలుంటుంది.

ఉపసంహారం నేర్చుకోకుండానే అస్త్రవిద్యను దుర్వినియోగం చేసిన ఆవేశపరుడు అశ్వత్థామ. పాండవ వంశం నాశనం కావాలని సంకల్పించి, బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ఫలితం అనుభవించాడు.

రామాయణంలో రాముడు, భారతంలో అర్జునుడు... ఇద్దరే సంపూర్ణ విలువిద్యావేత్తలుగా గుర్తింపు పొందారంటే- వారిద్దరికీ అనుసంధాన, ప్రయోగ, ఉపసంహార విద్యలు పూర్తిగా పట్టుపడటమే కారణం.

కురుక్షేత్ర సంగ్రామానికి ముందు దుర్యోధనుడు ‘ఏడు అక్షౌహిణుల పాండవ సైన్యాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే మీకు ఎన్నిరోజులు పడుతుంది’ అని భీష్ముణ్ని అడిగాడు. పదిరోజులు కావాలన్నాడు ఆయన. తనకూ అంతేనన్నాడు ద్రోణాచార్యుడు. ఈ విషయం తెలిసి ధర్మరాజు పదకొండు అక్షౌహిణుల కురుమహా సైన్యాన్ని మట్టి కరిపించాలంటే ఎన్నాళ్లు పడుతుందని అర్జునుణ్ని ప్రశ్నించాడు. ‘ఒక్క క్షణం చాలు’ అన్నాడు అర్జునుడు. ‘అన్నయ్యా! పరమశివుణ్ని మెప్పించి సాధించిన పాశుపతం ప్రయోగిస్తే అటు పదకొండు, ఇటు ఏడు మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం క్షణంలో బూడిదైపోతుంది. అందుకే పరమశివుడు దాన్ని మానవులపై  ప్రయోగించవద్దని ఆదేశించాడు’ అన్నాడు. అనడమే కాదు, శివుడి ఆజ్ఞను శిరసావహించాడు. నాడు సంయమనం వహించగలవారే సిసలైన యోధులనిపించుకున్నారు. నేడు సామాన్య మానవులూ అటువంటి లక్షణం అలవరచుకోవడం ఎంతో అవసరం

✍ఎర్రాప్రగడ రామకృష్ణ

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది.     9985831828*

పద్మనాభ ద్వాదశి*_

 _* పద్మనాభ ద్వాదశి

పాశాంకుశ ఏకాదశి మరుసటి రోజు పద్మనాభ ద్వాదశి జరుపుకుంటారు. ఇది అశ్విన్ నెల శుక్ల పక్ష పన్నెండవ రోజున వస్తుంది. విష్ణువును ఈ పవిత్ర రోజున అనంత పద్మనవ పూజలు చేస్తారు. పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని పాటిస్తున్న భక్తులు జీవితాంతం శ్రేయస్సు సాధించి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.


*పద్మనాభ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత:*


పద్మనాభ ద్వాదశిని గమనించడం ఒక వ్యక్తి విముక్తి పొందటానికి సహాయపడుతుంది. విష్ణువు యొక్క బలమైన భక్తులు అనంత పద్మనాభంలోని ఏకాదశి మరియు ద్వాదశిపై పూజలు మోక్షాన్ని పొందటానికి సహాయపడతాయని నమ్ముతారు. విష్ణువు మోక్షాన్ని పొందడంలో సహాయపడటంతో అత్యంత ప్రియమైన దేవుళ్ళు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు ప్రాపంచిక ఆనందాల కోసం భక్తులు ఆయనను ప్రార్థిస్తారు. విష్ణువు యొక్క అనుచరులు ప్రపంచాన్ని త్యజించడాన్ని నమ్మరు. వారు సంతోషకరమైన , ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని గడపాలని మరియు విష్ణువును ఆరాధించడం ద్వారా మరియు మంచి పనులు చేయడం ద్వారా స్వర్గానికి తమ మార్గాన్ని కాపాడుకోవాలని కోరుకుంటారు. కొత్త వెంచర్ ప్రారంభించాలనుకునే వ్యక్తులు ఈ రోజున దాని కోసం పని చేయవచ్చు.


*ఆచారాలు / వేడుకలు:*


వరహ పురాణంలో పద్మనాభ ద్వాదశి వ్రతం ప్రస్తావించబడింది. ద్వాదశి రోజు ఉదయం నుండి భక్తులు ఈ వ్రతాన్ని పరిశీలించి తమ కాఠిన్యాన్ని ప్రారంభిస్తారు. కర్మ స్నానం చేసిన తరువాత భక్తులు విష్ణువు విగ్రహం ముందు ధూపం , దీపం వెలిగించి  భక్తులు విష్ణువుకు నీరు , పువ్వులు , బెట్టు ఆకులు , స్వీట్లు , పండ్లు , పసుపు , గంధపు పేస్టులను అందిస్తారు. పువ్వులు మరియు లైట్లతో అందంగా అలంకరించబడిన విష్ణు ఆలయాన్ని కూడా వారు సందర్శిస్తారు. దేవతలను అర్చించడం , గౌరవించడం , ప్రేరేపించడం లేదా పూజించడం కోసం పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. చనిపోయిన ప్రియమైనవారికి నివాళులర్పించడానికి కూడా ఈ వేడుక చేయవచ్చు. భక్తులు విష్ణువుకు అంకితం చేసిన గ్రంథాలను చదువుతారు , ఆయన ప్రశంసలలో శ్లోకాలు పాడతారు మరియు రోజంతా ఆయన పేర్లతో మధ్యవర్తిత్వం చేస్తారు. భక్తులు కూడా రాత్రి జాగరణ చేసి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తారు.ఆచారాలను ఉదయం మరియు రాత్రి రెండింటిలోనూ చేయవచ్చు. పేద ప్రజలకు భిక్ష మరియు ఆహారాన్ని అందిస్తారు.

పరమాచార్య స్వామి – వినోబా భావే

 పరమాచార్య స్వామి – వినోబా భావే


ఇరువురు మహాపురుషులు సమావేశమై మాట్లాడుకున్నప్పుడు లోకానికి వారొక కొత్త వెలుగు చూపిస్తారు. ఒక నవీన సందేశాన్ని వినిపిస్తారు.


పరమాచార్య స్వామి, ఆచార్య వినోబాభావే మధ్య జరిగిన సంభాషణ అందుకు చక్కని ఉదాహరణ.


శ్రీ వినోబాభావే గాంధీ అనుయాయులలో ప్రథమ శ్రేణిలోని వారు భూదానోద్యమ నాయకులు. అయినా, కేవలం రాజకీయనాయకుడే కాదు బహుశ్రుతుడు, బహుభాషాకోవిదుడు.


కాషాయం కట్టలేదు, కౌపీనం పెట్టలేదేకాని, ఆజన్మ బ్రహ్మచారి, సర్వసంగ పరిత్యాగి. కారాగృహంలో భగవద్గీతకు భాష్యం చెప్పిన తత్త్వజ్ఞడు.


1956 జూన్ 7వ తేదీన మహనీయులిరువురూ ఒక చిన్న పూరిపాకలో సమావేశమైనారు. ఇద్దరి సంభాషణ కొన్ని నిముషాల్లొ ముగిసింది. సంభాషణ సంస్కృతంలో జరిగింది.


‘నారాయణ నారాయణ’ అంటూ నారాయణ స్మరణతో స్వామి, వినోబాకు స్వాగతం పలికారు. తమ ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు. వరి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్న చేసారు.


”ఇక్కడికి రావడంలో మీకేమి శ్రమ కలగలేదు కదా? మీకు ఆటంకం లేకుంటే ఇక్కడ మఠంలోనే మీరు బస చెయ్యవచ్చు” అని అన్నారు.


”మీ దర్శనానికే నేనిక్కడికి వచ్చాను. మీ ఆశీస్సు కోరుతున్నాను” అని భావే అన్నారు.


”నారాయణ నారాయణ. పరుల సేవ వల్ల ప్రపంచం అంతగా ఉద్ధరించబడుతున్నట్టు నాకు తోచదు. ఒక్కొక్క వ్యక్తీ తన ప్రవృత్తినిబట్టి, తన మనోభావాలను అనుసరించి సమాజానికి సేవచేస్తాడు. అది అక్షేపణీయం కాదు. అయితే లోకులకు తాను ఏ ఉపకారం చేసినా, అది కేవలం తన చిత్తశుద్దికేనని, ఆత్మోద్ధరణకేనని అతడు భావించాలిఅదే తన లక్ష్యం కావాలి.


ఇతరులవల్ల ఏ విధమైన ఉపకారం పొందని వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు. వారంతా తమ జీవితాలను యధోచితంగా కొనసాగిస్తూనే ఉన్నారు.


మాటవరసకు, అడవుల్లో మృగాలూ, పక్షులూ అసంఖ్యాకంగా జీవిస్తున్నవి. వాటన్నిటికి ఎవరు సహాయం అందిస్తున్నారు? వాటి జీవిత సరళిని క్రమబడ్దం చెయ్యడానికి ఒక సంఘం ఉన్నదా? ఒక ప్రభుత్వం ఉన్నదా?అయినా, ఆ ప్రాణులన్ని మానవులకంటే సుఖంగానే బతుకుతున్నవి. సమస్త జీవరాశిలో పరమాత్మ అంతర్యామిగా ఉంటూ లోకాన్ని నడుపుతున్నాడు. సంఘంలో ఉండే ప్రతి వ్యక్తీ తన విధాయక ధర్మమేదో తెలుసుకుని, స్వధర్మాన్ని నిర్వర్తించినట్లయితే అదే పరమేశ్వరుడికి నిజమైన సేవ.”


ఈ మాటలను విని “నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను” అని వినోబా అన్నారు.


”నారాయణ నారాయణ నాకెంతో సంతోషం”


పరమాచార్య స్వామి వారు శ్రీవినోబాకు ఈ క్రింది రెండు ఉపమానాలు కూడా వినిపించారు.


”చెట్టును పోషించాలంటే చెట్టు కుదుట్ళో నీరు పోస్తే చాలు. చెట్టు తాలూకు వేళ్ళు ఆ నీరు తాగి, కొమ్మలకూ, రెమ్మలకూ, ఆకులకూ, మొగ్గలకూ అన్నింటికీ ఆహారం అందజేస్తాయి. ప్రత్యేకంగా ఒక్కొక్క ఆకుకూ, ఒక్కొక్క మొగ్గకూ ఆహారం అందించనక్కరలేదు.”


"నోటితో మనిషి భుజిస్తాడు. అయినా, అతని చెవి, ముక్కు, కళ్ళు, కాళ్ళు అన్నిటికీ ఆహారం అందినట్టే. ఈ సృష్టి సమస్తం శ్రీమన్నారాయణుని అవయవాలు మాత్రమే. జీవులంతా పరమాత్మ ప్రతిబింబాలు. పరమాత్మను అలంకరిస్తే జీవులందరినీ అలంకరించినట్టే. లోకసేవ చెయ్యడానికి భగవత్సేవ సులువైన మార్గం.

‘సర్వేజనాః సుఖినోభవంతు’ అని దేవుణ్ణి ప్రార్థిస్తాము” అన్నారు స్వామి.


”స్వామి వారు నాకు భగవంతునితో సమానుడు – కాదు భగవంతుడే” అంటూ ఆచార్య వినోబా స్వామి వద్ద సెలవు పుచ్చుకున్నారు.




అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

సోదరి నివేదిత

 Courtesy from Venkatesh Maddikera,


ప్రముఖ సంఘ సేవకురాలు సోదరి నివేదిత. ఆమె చేసిన సేవలను చూసి కూడా ఆమె హిందూ ధర్మ పరిరక్షణకు నిరంతరం కృషి చేసిన కారణంగా మన దేశంలో వున్న హిందూ వ్యతిరేకులు సోదరి నివేదిత చరిత్ర మనకు తెలియకుండా చేసారు కనుక భారత సమాజంలో చాలా మందికి ఆమె ఎవరో తెలియదు. ఈ రోజు ఆమె జయంతి అక్టోబరు 28. యాదృచ్చికం ఈ నెల ఆమె వర్ధంతి కూడా అక్టోబర్ 13. ఆమె గురించి ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి. సేవ పేరుతో భారత దేశంలో అడుగు పెట్టి కొన్ని లక్షల అమాయక హిందు కుటుంబాలను మతం మార్చిన మదర్ తెరిస్సా కాదు మనకు ఆదర్శం..... 


ప్రతి ఒక్క భారతీయులు ఆదర్శంగా తీసుకోవాల్సిన నిష్కామ కర్మ యోగిని సోదరి నివేదిత జయంతి ఈ రోజు.. 


స్వామి వివేకానందుని ఉపన్యాసాలకు, సనాతన ధర్మానికి భారతీయ వేదాంత తత్వ శాస్త్రాలకు ముగ్ధులైన అనేకమంది విదేశీయులు హైంధవ ధర్మం స్వీకరించి స్వామిజీకి శిష్యులైనారు అలాంటి వారిలో ప్రముఖులు ‘సోదరి నివేదిత’ మిస్ మార్గరెట్ నోబుల్‌గా స్వామిజీ ఆహ్వానంపై భారతదేశానికి వచ్చారు.

సోదరి నివేదిత ఉత్తర ఐర్లాండ్‌లోని డంగనాన్ అనే చిన్న పట్టణంలో 28 అక్టోబర్, 1867న శ్రీ సామ్యూల్ రిచ్‌మండ్ నోబుల్, శ్రీమతి మేరీ ఇసాబెల్ నోబుల్ దంపతులకు జన్మించింది. ‘మార్గరెట్’ చిన్నతనం నుంచి మంచి కుశాగ్రబుద్ధి కల్గి ఉండేది. తండ్రి అకాలమరణంతో కుటుంబ పోషణ కోసం పదిహేడేళ్ళ వయసులో మార్గరెట్ నోబుల్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టింది. మంచి బోధకురాలిగా పేరు, ప్రతిష్ఠలను పొందింది. పత్రికా వ్యాసంగం ఆ చిరువయస్సులోనే అబ్బింది. పాఠశాలలో పనిచేస్తూనే అక్కడి స్థానిక చర్చికి తరచుగా వెళ్లేది చివరకు ‘నన్’గా దైవానికి తన జీవితాన్ని సమర్పించుకోవాలని నిర్ణయించు కొని క్రైస్తవం లోని అన్ని శాఖల వారికి తేడా లేకుండా నోబుల్ మార్గరెట్ సేవచేయటం స్థానిక చర్చి అధికారులకు నచ్చలేదు. చర్చి అధికారుల సంకుచిత మనస్తత్వానికి ఆమె ఖిన్నురాలై చర్చికి పోవటం తగ్గించివేసింది. ఆమెలో ఏర్పడిన వెలితిని బుద్ధుని ప్రవచనాలు పూరించగలిగాయి. బౌద్ధంపై అధ్యయనం సాగించింది. తర్వాత‘వెల్ష్‌మేన్’ అనే ఓ ఇంజనీరును వివాహం చేసుకొని ఆధ్యాత్మిక అధ్యయనం చేద్దామనుకొనే సమయానికి ఆ యువకుని మరణం - ఆమెను కృంగదీసింది. ఆ విషాదాన్ని తట్టుకోవడానికి రెక్స్‌హోమ్ నుండి బదిలీ చేయించుకొని చెస్ట్‌ర్ చేరుకొన్నది. అక్కడ రిస్క్‌న్ స్కూలు స్థాపించి విద్యాబోధన చేస్తూనే లండన్, పట్టణంలో సాహితీ విమర్శకురాలిగా, విద్యావేత్తగ మంచి పేరు సంపాదించింది.

అది 1893 సంవత్సరం. మార్గరెట్ స్నేహితురాలు ఇసాబెల్ ఇంటికి స్వామి వివేకానందుడిని ఆహ్వానించారు మార్గరెట్ కూడా ఆయన్ను చూడటం అదే తొలిసారి. ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ జన్మరాహిత్యం మొదలైన పదాలన్నింటికి అర్థాలను ఆయనను అడిగి తెలుసుకొంది. ఆయన సమాధానాలు ఆమె నెంతగానో ప్రభావితం చేసాయి ఫలితంగా ‘మార్గరెట్’ స్వామిజీకి భక్తురాలై పోయింది. స్వామిజీ వెంటనే ఉంటూ ఆయన పర్యటించిన చోట ఉపన్యాసాలను శ్రద్ధతో వ్రాసుకొన్నది. ఈనాడు మనకి లభిస్తున్న వివేకానందవాణి అక్షర మవటానికి కారణభూతురాలైంది. స్వామిజీ నుంచి 1897 జూలైలో ఆమెకు పిలుపు వచ్చింది. 1898వ సంవత్సరం జనవరి 28వ తేదీన మార్గరెట్ కలకత్తా రేవుకి చేరుకొంది స్వామిజీ స్వయంగా స్వాగతం పలికారు. 1898 మార్చి 11వ తేదీన కలకత్తా స్టార్ థియేటర్‌లో ఏర్పాటైన రామకృష్ణమఠ ప్రారంభ సభలో స్వామిజీ ఆమెను సభాముఖంగా పరిచయం చేశారు. 1898 మార్చి 17వ తేదీన శారదామాతను కలుసుకొంది. శారదామాత ఆమెతో కలిసి ఫలహారం చేసింది ఆమెను పుత్రికగా స్వీకరించింది.అది 1998 మార్చి 25వ తేదీ మార్గరెట్ జీవితంలో ఒక సువర్ణపుట - బేలూర్‌లో నిలాంబర ముఖర్జీ ఇంటిలోని దైవమందిరం - ‘అసతోమా సద్గమయా’ అనే ప్రార్థనతో వేద ఘోషతో మారుమ్రోగుతున్న మంటపం - స్వామిజీ తంబూరా తీసుకొని ‘శివపార్వతీస్తవం’ గానం చేశారు. మార్గరెట్ నుదుట ‘విభూతి’ని పెట్టారు స్వామిజీ. మార్గరెట్ ఈ రోజు నుంచి ‘నివేదిత’గా పిలువబడుతుంది’’ అని ప్రకటించారు స్వామిజీ. తర్వాత ‘‘నివేదితా అదిగో గంగ అవతల నీవు ఓ బాలికల పాఠశాల ప్రారంభించు’’ అని సూచించారు. 25-03-1899 తేదీ స్వామిజీ నివేదితకు బ్రహ్మచారిణికి ఇచ్చే అంతిమ దీక్ష ఇచ్చారు. 1898 నవంబర్ 11న కతన ఇంట్లోనే నివేదిత ఓ బాలికల విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. మ్లేచ్ఛ స్ర్తి అని కొందరు మూర్ఖులు నిందించినా పట్టుదలతో తిరిగి పాఠశాలలో బాలికల సంఖ్యను పెంచింది. 1899 మార్చిలో బెంగాల్‌లో ప్లేగు వ్యాధి వ్యాపించి ఎందరినో కబళించింది. స్వామి వివేకానంద, తన శిష్యులతో ‘ప్లేగు సేవాసమితి’ అనే సంస్థను ప్రారంభించి, దాని కార్యభారం నివేదితకు అప్పగించారు. ఈ సేవా కార్యక్రమంలో ‘నివేదిత’ మమేకమై పని చేసింది. భారత చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ‘చిక్కుముళ్ళ భారతీయ జీవనం (వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్) అనే గ్రంథాన్ని రచించింది. వివేకానందుడి మరణానంతరం తిరిగి తన దేశం వెళ్ళిపోలేదు నివేదిత. రాజకీయ కార్యకలాపాలలో తీవ్రంగా పాల్గొనాలని నిర్ణయించుకొని, ‘రామకృష్ణ మఠం’కు రాజీనామా సమర్పించింది. బిపిన్ చంద్రపాల్ నడిపే ‘న్యూ ఇండియా పత్రిక’, అరవిందుని ‘యుగాంతర్’ పత్రిక, తిలక్ నిర్వహించిన మరాఠా కేసరి’ పత్రికలలో ఈమె వ్యాసాలు తరచూ వచ్చేవి. వాటిలో ‘తీవ్ర హిందుత్వం’ వ్యాసం సంచలనమే సృష్టించింది.....

       1906లో జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు ఆమె జాతీయ పతాకాన్ని సృష్టించి ఇచ్చింది. కాషాయ జెండాపై రెండు వజ్రాయుధాలు, వందేమాతరం, యతో ధర్మస్ధతో జయః అనే ధ్యేయ వాక్యాలు ఉన్నాయి. ఇది ఆమె హైంధవ ఆలోచనల లోతును తెలియ జేస్తుంది ఆమె నిష్కామ కర్మయోగిని, కానీ హిందూ వ్యతిరేక కాంగ్రెసు పార్టీ వారు సోదరి నివేదిత రూపొందించిన పతాకాన్ని పక్కన పెట్టారు. అవిశ్రాంత పరిశ్రమవల్ల 1911 నుంచి ఆమె  శరీరం బలహీన పడుతూ వచ్చింది. మెరుగైన వైద్యం కోసం జగదీశ చంద్రబోస్ కుటుంబం ఆమెను డార్జిలింగ్ తీసుకొని వెళ్ళారు. అక్కడే ఆమె అక్టోబర్ 13వ తేదీన పరమపదించింది.....