8, నవంబర్ 2020, ఆదివారం

శరీరంలో అజీర్ణం హరించి

 శరీరంలో అజీర్ణం హరించి ఆకలి ఎక్కువ చేయు మూలికా యోగాలు - 


 * ప్రతినిత్యం నీరుల్లిపాయలు తినుచుండిన మందాగ్ని హరించి ఆకలి బాగుగా అగును. 


 * శొంఠి , ఉప్పు రెండూ సమభాగాలుగా కలిపి చేసిన చూర్ణమును ప్రతిపూట భోజనమునకు ముందు 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు పుచ్చుకొనుచుండిన నాలుక , గొంతుక శుభ్రపడి అన్నము బాగా జీర్ణం అయ్యి ఆకలి బాగా పుట్టును . 


 * అల్లంరసం , తేనె రెండు సమభాగాలుగా కలిపి పూటకు 10 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు రోజూ మూడుపూటలా ఆహారానికి ముందుగా పుచ్చుకొనుచుండిన జలుబు , దగ్గు , అరుగుదల తక్కువుగా ఉండటం హరించి మంచి ఆకలి పుట్టును . 


    

పల్నాటి సీమ పల్లెటూరు

 పల్నాటి సీమ పల్లెటూరుల గూర్చి శ్రీనాథుడు చెప్పింది


చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవళ్ళు

నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును దేళ్ళు

పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు

త్ర్యంబకేశ్వరుడు

 Sri Siva Maha Puranam -- 14 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


త్ర్యంబకేశ్వరుడు


‘త్ర్యంబకం గౌతమీ తటే’ అని మనం అంటాము.


సహ్యాద్రి శీర్షే  విమలే వసంతం గోదావరీ తీర పవిత్రదేశే,

యద్దర్శనాత్పాతక మాశునాశం ప్రయాతి తం  త్ర్యంబక మీశమీడే!! (ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం – 8)


త్ర్యంబకుడు తనను దర్శనం చేసిన వారిని రక్షించే స్వభావం కలవాడు. ఆయనను స్మరించిన వారిని, ఆయనను నమ్మిన వారిని సర్వకాలముల యందు రక్షించే స్వరూపం ఉన్నవాడు. ఇప్పటివరకు చదివిన స్వయంభూలింగముల విశేషం ఒకలా ఉంటుంది. త్ర్యంబకేశ్వరుని వద్దకు వచ్చేటప్పటికి ఒకలా ఉంటుంది. ఇది కేవలము ఒక లింగము ఆవిర్భవించిన కథ కాదు. గౌతమ మహర్షి జీవితమును, ఆయన శీలమును, ఆయన గొప్పతనమును ఇందులో చూస్తారు. అక్కడి శివలింగం గొప్పదా?  గౌతముడు గొప్పవాడా?  అని ఒకసారి ఆలోచిస్తే గౌతముడే గొప్పవాడని అనిపిస్తుంది. ఇక్కడ ఒక నది, ఒక శివలింగం ఆవిర్భవించాయి. తెల్లవారి లేస్తే ఏ నదీజలములు త్రాగి బతుకుతున్నామో ఆ నదిని తీసుకువచ్చిన మహాపురుషుని చరిత్ర  చదవబోతున్నాము.

గౌతముడు చాలా గొప్ప మహర్షి. ఆయన తన శిష్యులతో కలిసి ప్రతిరోజూ శంభు లింగారాధనము చేస్తుండేవాడు. ‘శం భావయతి ఇతి శంభుః’ – మంచి భావములను కల్పించ గలిగిన లింగమును ఆరాధనా చేశాడు. మహర్షి కోరుకునేది ఒక్కటే. లోకమంతటినీ లోకేశ్వరునిగా చూడడం. చాలామంది శిష్యులు ఆయనను అనుగమించి ఉండేవారు. వాళ్ళందరికీ అనేక శాస్త్రములను బోధిస్తూ బ్రహ్మగిరి అనే పర్వతశిఖర పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణము చేసుకుని లింగారాధన చేస్తూ పవిత్రమయిన జీవితమును గడుపుతున్నాడు.

 కొంతకాలమునకు అనావృష్టి వలన భయంకరమయిన క్షామం వచ్చింది. వర్షములు పడలేదు. ఎక్కడా నీరు లేదు.  లోకమునందు నీరు లేకపోతే శివలింగమునకు సహస్ర ఘటాభిషేకం చేస్తే వర్షములు పడతాయి. ఇటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరు నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనిని గౌతముడు చూసి నేను ఎలాగయినా ఈ లోక బాధను తీర్చే ప్రయత్నం చేస్తాను’ అని జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు. వరుణుడు ప్రత్యక్షమై  ‘నీవు తపస్సు చేశావు. సంతోషించాను.  నేను మాత్రం వర్షించడం కుదరదు. నీకు ఒక ఉపకారం చేస్తాను. లోకమునకంతటికీ నేను నీరు ఇవ్వలేను. నీవు ఒక చిన్న గుండం తవ్వు. నేను అందులో నీళ్ళు పోసి ఎప్పుడూ నీళ్ళు ఉండేలా   వరం ఇస్తాను.  ఎప్పుడూ నీళ్లు ఉంటాయి’ అని చెప్పాడు. అపుడు గౌతముడు ఇంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది. తప్పకుండా అలా చేస్తాను’ అని తన భార్య అయిన అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు. అహల్య గొప్ప పతివ్రత. వారు తవ్విన గుండంలో నీరు నింపాడు వరుణుడు. గౌతముడు అహల్య కలిసి ఈ నీటిని పట్టుకు వెళ్ళి సేద్యం చేసి అనేకమయిన పంటలు పండించాడు. అందరికీ ఉచితంగా భోజనం లభించింది. అక్కడి ప్రజలు గౌతమ మహర్షి ఆశ్రమమునకు వెళ్లి చక్కగా ఆ పెట్టిన పదార్థములను  అన్నిటిని తినడమే కాక ఈ కీర్తిలో వాటా కోసం కొందరు గౌతమునితో బంధుత్వం ఉన్నదని చెప్పుకోవడం ప్రారంభించి ఆయన దగ్గరకు చేరారు.

ఇలా జరుగుతుండగా గౌతమాశ్రమంలో ఒక విచిత్రం జరిగింది. ఒకరోజు తెల్లవారు జామున మహర్షి శివలింగమునకు అభిషేకం చేయాలి. వరుణ గుండంలోకి వెళ్ళి నీళ్ళు పట్టుకురండి అన్నారు శిష్యులను మహర్షి. వాళ్ళు నీళ్ళు తేవడానికి వెళ్ళారు. అదే సమయమునకు మునుల భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాములే అని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది కాబట్టి అమ్మలారా! మీరు ఒక్కసారి ప్రక్కకి తొలగితే మీము నీళ్ళు పట్టుకుని వెళ్లిపోతాము అని చెప్పారు. స్త్రీలు ‘ మీకు ఎంత మిడిసిపాటు వచ్చింది. మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనం, అభిషేకం ఎక్కువయ్యాయా?అవతలికి పొండి ’ అన్నారు. ఆ మాటలకు శిష్యులు చిన్నబుచ్చుకుని ఖాళీ కుండతో తిరిగివచ్చారు.  వాళ్లకి ఏమి చేయాలో అర్థం కాక అహల్య దగ్గరికి వెళ్ళి ‘అమ్మా ! ముని పత్నులు మమ్మల్ని అనరాని మాటలు అని పంపించి వేశారు. గురువుగారి వద్దకు ఎలా వెళ్ళడం’ అని అడిగారు. ఆమాటలను విన్న అహల్య వెంటనే తాను వెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది.

వెంటనే వాళ్ళు అహల్య మనల్ని చూసి ఏమీ మాట్లాడకుండా చులకన చేసి వెళ్ళిపోయింది అని దెప్పి పొడిచారు. వాళ్ళలో అక్కసు బయలుదేరింది. వెళ్ళి భర్తలను “మా భర్తలు ఒకళ్ళు పెడితే అంగలారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా?” అని అడిగారు. అలా భార్యలు అడిగేసరికి వాళ్లకి కష్టం వచ్చింది. వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలు పెట్టారు. విఘ్నేశ్వరుని ఉద్దేశించి దంతిమఖము అనే మఖము ఒకటి చేశారు. వీళ్ళు చేసినటువంటి మఖమునకు తృప్తిపొందిన గణపతి యజ్ఞ గుండంలోంచి ఆవిర్భవించాడు. ‘నేను మీకు ఏమి చేసిపెట్టాలి?” అని అడిగాడు. అపుడు వాళ్ళు ‘గౌతముడు పొగరెక్కి ఉన్నాడు. కాబట్టి ఈ ఆశ్రమంలోంచి గౌతముడు తరమబడేటట్లు నీవు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి’ అన్నారు. విఘ్నేశ్వరుడు ‘ఇది మీరు అడగవలసిన మాట కాదు. ఒకనాడు మీకు తాగడానికి నీళ్ళు లేక, తినడానికి అన్నం లేకపోతే  ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వండి  వడ్డించి అన్నం పెడుతుంటే ఆయనను ఈ ఆశ్రమం నుండి తరిమి క్షామంలోకి తోసి మీరు సుఖములను అనుభవిద్దామని అనుకుంటున్నారా? ఇది ఎంత కృతఘ్నత! ఇలా చేయకూడదు. అలా చేస్తే మీరు లోకంలో నశించిపోతారు” అన్నాడు.

 వాళ్ళు “నీ దగ్గర నీతులు వినడానికి మేము ఈ మఖము చేయలేదు. మాకోరిక ఒక్కటే. గౌతముడు ఈ ఆశ్రమం నుండి తరమబడాలి. అలా నువ్వు చేస్తే మేము చేసిన మఖమునకు ఫలితం ఇచ్చినట్లు అవుతుంది. అలాకాని నాడు నీవు కృతఘ్నుడవు అయిపోయినట్లు మేము భావిస్తాము” అన్నారు.  విఘ్నేశ్వరుడు ‘మీరు చేసిన మఖమునకు నేను ప్రీతి చెందాను. తప్పకుండా మీకోరిక తీరుస్తాను. కానీ మీరు పాడయిపోతారు. తన ఉపాసన యందు భంగము లేకుండా నడిచి వెళ్ళిపోయినటువంటి గౌతముడు సర్వోత్క్రుష్టమయిన కీర్తిని పొందుతాడు. దీనిని మీ మనస్సులో పెట్టుకోండి. మీ కోరిక తీర్చడంలో నాకు అభ్యంతరం లేదు’ అన్నాడు. ఒక వృద్ధ గోవు ఆయన కష్టపడి వేసిన పళ్ళు, ఆకుకూరలు వచ్చి తినేస్తోంది. మునుల కోర్కెను తీర్చడానికి గాను గణపతి వృద్ధ గోవు రూపములో వచ్చాడు. బక్క ఆవు మేస్తుంటే ఆవును కర్రతో కొట్టినా, చేతితో కొట్టినా గోమోదక దోషం వస్తుందని మహానుభావుడు గౌతముడు ఒక ఎండిపోయిన గడ్డిపరక తీసి ఆవుమీద పడేసి ‘హ హ’ అన్నాడు. ఆ గడ్డిపరక పడగానే ఆవు చచ్చిపోయింది. నాకు గోహత్యాదోషం వచ్చింది’ అని ఏడ్చాడు. ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడలేదు. అక్కడికి అహల్య, ఆయన శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు. మునులు, మునిపత్నులు వచ్చారు. ఏమయిందని గౌతముని అడిగితే  జరిగింది చెప్పాడు.  వారు 'ఆవును చంపిన నీ ముఖం చూస్తే మహా పాతకములు వస్తాయి. నీవు నీ భార్యను, శిష్యులను తీసుకుని ఆశ్రమం వదలి ఎక్కడికయినా పో’ అన్నారు. అక్కడితో ఊరుకోక నువ్వు గోహత్య చేసిన వాడివి, ఇక్కడ నీవు ఉంటే మేము ఉండము అంతేకాక ఈవేళ నుండి నీవు దేవతలను ఆరాధించకూడదు. గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజచేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు. అదేమీ కుదరదు పో’ అన్నారు. గౌతముని ప్రాణం ఈశ్వరార్చన.  ఆయన ‘అయ్యో! నేను తప్పకుండా వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. అక్కడ నుండి బయలుదేరి అక్కడ అక్కడ తిరిగి ఎంతో దుఃఖమును అనుభవించి ఆ మునులను ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి. నేనది చేసుకుని మరల నా జీవితమును ఈశ్వరాభిముఖం చేసుకుంటాను’ అన్నాడు. నిజానికి ఆయనకు తెలియని విషయమా? ఆయన ఇంకా మెట్లు దిగి వినయమునకు వెళుతున్నాడు. వీళ్ళు మెట్లెక్కి అహంకారమునకు వెడుతున్నారు.  వీళ్ళు ‘అయితే ఈ భూమండలమునంతటినీ మూడు మార్లు ప్రదక్షిణ చెయ్యి. అలా చేస్తున్నప్పుడు అడుగుతీసి అడుగు వేసినప్పుడల్లా గోవును చంపిన మహా పాతకుణ్ణి నేను అని అంటూ చెయ్యి. వచ్చిన తరువాత చాంద్రాయణ వ్రతం చెయ్యి.  నీకు ఆవును చంపిన పాపం పోతుంది’ అని చెప్పారు. ఒకవేళ అలా చేయలేక పోయినట్లయితే వెళ్లి శంకరుని గూర్చి తపస్సు చెయ్యి. శంకరుడు ప్రత్యక్షమయిన తర్వాత గంగను ఇమ్మని అడుగు. ఎక్కడ ఆవును చంపావో అటువైపు నుంచి గంగను ప్రవహింపజెయ్యి. తర్వాత అఘమర్షణవ్రతం చెయ్యి. కోటి లింగములు పెట్టు. వాటికి అర్చన చెయ్యి. ఆవిధముగా చెయ్యి అన్నారు. మరల గౌతముడు ఆశ్రమమునకు తిరిగి రాకుడా ఉండేవిధంగా ఉపదేశం చేశారు.

గౌతమ మహర్షి వెళ్లి అద్భుతమయిన తపస్సు ప్రారంభం చేశారు. ఒక పార్థివ లింగమును తీసుకుని పంచాక్షరీ మహామంత్రముతో తదేక నిష్ఠతో శివుణ్ణి ఆరాధన చేశారు. అలా తపస్సు చెయ్యగా శంకరుడు ప్రత్యక్షం అయి ‘నాయనా! ఎందుకింత గొప్ప తపస్సు చేశావు?' అన్నాడు. కన్నుల నీరు కారుస్తూ గౌతముడు ‘ఈశ్వరా! నీకు తెలియనిది ఏముంటుంది? నేను ఆవుని చంపి మహాపాపం చేశాను. నేను చేసిన గోహత్యా పాపమును నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడను కానన్న స్థితిని నాకు  కల్పించవలసినది’ అని ప్రార్థించాడు. శంకరుడు ‘అయ్యో పిచ్చివాడా! ఇంత తపస్సు చేసి పాపమును తియ్యమని అడుగుతున్నావా? నీకు పాపం ఉన్నదని అనుకుంటున్నావా? అసలు నీకు పాపం లేదు. నీవు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు. జగత్తులో ఎవడయినా గౌతమమహర్షి అన్న పేరు పలికినా, గౌతమ మహర్షిని చూసినా వాడి పాపములు నశించిపోతాయి. నీవు అంతటి పుణ్యాత్ముడవు. నిన్ను చూడడానికి నేను వచ్చాను’ అన్నాడు. గౌతముడు ఒక్కసారి అంతర్ముఖుడై చూశాడు. సత్యం తెలిసిపోయింది. వెంటనే ఆయన కళ్ళు తెరచి శంకరుని చూసి ఆహా పరమేశ్వరా ! వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు. వాళ్ళు నన్ను అలా తిట్టక పొతే నిన్ను ఇలా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఉండేవాడిని కాదు. వాళ్ళ వల్లనే కదా నాకు నీ దర్శనం అయింది. వాళ్లకు నేను ఋణపడిపోయాను అన్నాడు.

 శివుడు ‘గౌతమా! ఏదైనా వరం కోరుకో ఇస్తాను’ అంటే  గౌతముడు స్వామీ! మీరు నిజంగా నన్నుకానీ అనుగ్రహించాలి అనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగను విడిచి పెట్టండి. నేను ఆంద్రదేశమునకు తీసుకువెడతాను’ అనగానే గభాలున గంగ స్త్రీరూపంలో పైనుండి క్రిందికి దూకి తెల్లటి వస్త్రములతో నిలబడింది. గౌతమునికి గంగాదర్శనం అయింది. వెంటనే ఆయన తన రెండు చేతులు ముకుళించి నన్ను నిర్మలుడిని చెయ్యి తల్లీ అన్నాడు. ఆ తల్లి నీవు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒక్కసారి నేను ఆగుతాను. నీటి రూపంలో నీ తలమీద పడతాను. అపుడు నీవు గంగా స్నానం చేసిన వాడవు అవుతావు. నీవు నిర్మలుడవు అయినట్లే. వెంటనే శివుని తలమీద వెళ్ళిపోతాను. ఇంకొకసారి భూమిమీద ప్రవహించను అన్నది. అపుడు గౌతముడు ‘అమ్మా, లోకం అంతా సుభిక్షం కావాలి. నీవు ప్రవహించాలని కదా తల్లీ నేను కోరింది అన్నాడు.  గంగ శంకరుని వంక చూసి స్వామీ! గౌతముని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను. మీరు లింగరూపంలో ఇక్కడ వెలయండి. 33 కోట్ల దేవతలు నా ప్రవాహం ఎటువెడుతుందో అటు ఉండాలి అన్నది. శివుడు తప్పకుండా అలాగే  వెలుస్తాను అన్నాడు.  దేవతలు అమ్మా! మేము మాత్రం ఏడాదికి ఒకమారు వచ్చి ఇక్కడ కూర్చుంటాము. పుష్కరములు వచ్చినప్పుడు మాత్రం ఏడాది అంతా ఉంటాము. అని గంగామాతను ప్రార్థించారు. గంగ సరే సంవత్సరమునకు ఒకరోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అన్నది.

గౌతముని మీద వెడుతున్న గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారు. స్వామి త్ర్యంబకుడనే పేరుతో వెలిసాడు. ఇది పరమశివుని అపారమయిన కారుణ్యమును, సౌలభ్యమును తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఏ మునులయితే గౌతమ మహర్షిని పో పో అని తరిమేశారో వాళ్ళందరూ గంగ క్రింద పడిందిట మనం స్నానం చేద్దాం రండి అని భార్యలతోటి, శిష్యుల తోటి దిగుతున్నారు. గంగ వారిని చూసి ‘ఆయన పేరు మీద పుడితే మళ్ళీ అందులో స్నానం చేసి పాపములు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా ధూర్తులారా? అని అంతర్ధానం అయిపోయింది. గౌతముడు ఏడ్చాడు. ఈయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది.  వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానం చేసారు.

కొన్నిచోట్ల గౌతముడు మునులను శపించాడు అని వ్రాయబడింది. అలా చెప్తే ఈ ఆఖ్యానమునకు అర్థం ఉండదు. గౌతముడు శపించలేదు. తమ గురువుగారు ఇంత చేసినా సరే గంగాస్నానమునకు మళ్ళీ ఏర్పాటు చేసిన అసారే స్నానం చేసి వచ్చి క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు మీకు శివభక్తి లేకుండుగాక అని శపించారు. ఆనాటి నుండి వాళ్ళు జడులై, తమ జీవితములను పాడుచేసుకుని తిరగసాగారు. ఆనాడు వెలసిన త్ర్యంబక లింగమే మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వరుడు అని పిలవబడుతూ గౌతమీ తటి ఒడ్డునే మనం చూస్తున్న ఆయన త్ర్యంబకుడు. అనగా మూడు కన్నులు కలవాడు. ఆ త్ర్యంబకుడిని చూసి ఒక్కసారి మూడు కన్నుల వాడా మహాదేవా అని ఒక్కసారి నమస్కరిస్తే చాలు  ఫలితమును ఇచ్చేస్తాడు. ఒకనది ప్రవహించేటట్లు చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు బ్రతుకుతున్నాం అంటే ఇన్ని క్షేత్రములు వచ్చాయి అంటే మహాపురుషుడయిన గౌతముడిని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

సూర్యదేవాలయం* - *గొల్లల మామిడాల

 *తెలుగునాట సూర్యదేవాలయం* 


- *గొల్లల మామిడాల* 


🍁🍁🍁🍁


కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది.


మామిడాడ క్షేత్రంలో రెండు గాలి గోపురాలు ఉన్నాయి.అవి రెండూ కూడా ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టుగాఉంటాయి.ఈ రెండు తూర్పు,పచ్చిమ దిక్కులలో ఎదురెదురుగా ఉంటాయి


.దీనిలోమొదటిది 1950వ సంవత్సరంలో నిర్మించిన గాలి గోపురం 9అంతస్తులతో 160 అడుగుల ఎత్తు ఉంటుంది.రెండవ గాలిగోపురం 1958వ సంవత్సరంలో 13 అంతస్తులతో 200 అడుగుల ఎత్తు ఉంటుంది.


వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ గోపురాల క్రింద నుండి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి.మెట్లు ఎక్కి గోపురం పైకి చేరిన తరువాత ఆ పైనుంచి చూస్తే చుట్టూ 25కి.మీ దూరం నుండి కనిపించే పచ్చని పంటలు,కాలువలు,కాకినాడ ప్రాంతం,ఇలా ఎన్నో ప్రకృతి రామణీయతలను వీక్షించవచ్చును ....


ఇంకా ఆ గోపురాల ముఖ్య విశిష్టత ఆ గోపురాలపై ఉన్న శిల్ప సౌందర్యం.గోపురాలపై ఉన్నశిల్పాలు రామాయణ,మహాభారత కధా వృత్తాన్ని శిల్పాల రూపంలో ఎంతో మనోహరంగా,సుందరంగా అమర్చారు.ఆ శిల్ప సౌదర్యం చూస్తూఉంటే ఆనాటి రామాయణ,మహాభారత విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా అకాలంలోనికి మనల్ని తీసుకోని పోతాయి.....


ఆలయానికి చేరుకొనే మార్గం :



   మామిడాడ గ్రామం కాకినాడకు 20కి.మీ దూరం,రాజమండ్రికి 58కి.మీ దూరం ,సామర్లకోటకు 17కి.మీ దూరంలో ఉంటుంది.కాకినాడ,రాజమండ్రి,సామర్లకోట వరకు రైలు సౌకర్యం కలదు.అక్కడనుండి బస్సులు,ఆటోలు,ఇతర ప్రెవేటు వాహనాలద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు....


🌸జై శ్రీమన్నారాయణ🌸

ఎందుకు వెతకరు

 *అల్లం* లో ఆసిడ్ వెతికారు...

 *మిఠాయిల్లో* విషం వెతికారు...

 *హోళీ* రంగుల్లో రసాయనాలు వెతికారు...

 *ఉట్టి* కొట్టటంలో ప్రాణాలకు ప్రమాదాన్ని వెతికారు...

 *జల్లికట్టు* లో పశు హింస వెతికారు...

 *సక్రాంతి* పతంగుల్లో పక్షి ప్రేమ వెతికారు...

 *దీపావళి* పటాకుల్లో వాయు కాలుష్యము వెతికారు...

 *దసర రోజు* రావనదహనంలో కులాన్ని వెతికారు..


*కానీ ఉగ్రవాదం లో మతాన్ని ఎందుకు వెతకరు...??*

*School for Brahmin Boys*

 *School for Brahmin Boys*

🎈 All expenses paid institution 


*Important message for Brahmin parents:*


Kanchi Math has started a Veda cum regular school in *Ullal near Bangalore University*. All castes are admitted here for CBSE system of regular 10+2 schooling. But Brahmin boys are given Veda class from 6 to 7 AM and 6:30 to 8 PM (approx times). This is in addition to regular schooling. They are also provided with a 400 seat hostel with full Brahman food. 


But one of the organisers of this institution in Kanchi Math was telling that they can find monetary resources but are finding it difficult to get Brahmin boys to join this all expenses paid institution! Now only 100 seats are occupied in the hostel and 300 are vacant. He was requesting all Brahmin families to utilize this opportunity and school. 


As the boys lose nothing and gain Vedic knowledge along with regular knowledge, this is the best place for them. They have got excellent class rooms, labs, play grounds etc of very high standard. This is suitable for every type of Brahmin family irrespective of rich, middle class or poor! The decision of higher studies -if in Veda line or Science , Engg or Medicine etc can be done after 12th standard.


*Details: Sri Sankara Smartha Samskrutha Paatasala, (Vidyaneketan Public school), Ullal Cross Road, Ullal Upanagar, Bangalore 560 056, phone:080 2321 3396, 080 2321 1364.*

 Please visit the school with prior appointment. www.vidyaniketan-school.com (getting ready)

contact email: admissions@vidyaniketan-school.com

విష్ణు_సహస్ర_నామ_మహిమ

 🙏#విష్ణు_సహస్ర_నామ_మహిమ🙏


పూర్వం పూరీ నగరం లో జగన్నాధ చలాపురం లో ఒక మహా పండితుడు భార్య తో ఒక పూరి గుడిసెలో నివాసo ఉండేవాడు.. ఇతను శ్రీ మహావిష్ణువు నకు పరమ భక్తుడు . పూట గడవని దారిద్ర్యస్థితి అతనిది.., ప్రతి నిత్యమూ #విష్ణు_సహస్ర_నామ స్తోత్ర పారాయణ చేసి ఈతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటన కు వెళ్లేవాడు. , ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు.. భార్య మాత్రం పరమ గయ్యాళి.. దైవం పట్ల నమ్మకం లేనిది , ఎటువంటి నియమాలనూ పాటించనిది.. ఇంటి లో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఈతడు హరి నామ స్మరణ ను విడువలేదు..


ప్రతినిత్యమూ చేయుచున్న విధముగా ఆరోజు కూడా #విష్ణు_సహస్రనామ పారాయణo చేయుచుండగా భార్య వచ్చి భర్త తో " ఏమిటి చేస్తున్నావు ? " అని గద్దించి అడిగింది .దానికి ఆ భర్త "విష్ణు సహస్ర నామాలను " స్తోత్రం చేస్తున్నానన్నాడు . అందుకు ఆ భార్య " ప్రతీ రోజూ స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ! ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు ? అడుక్కోవడానికి భిక్షపాత్ర తప్ప అన్నది.. అక్కడితో ఆగక " ఏదీ ! నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు " అన్నది .


అందుకు ఆ భర్త " వెయ్యి నామాలే ! ఏమిటి చెప్పేది ? నీకేమిటి అర్ధమౌతుంది ? ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్ర నామాలేమి అర్ధమౌతాయి ? " అన్నాడు . ఆ భార్య మాట్లాడుతూ " వెయ్యి నామాలు ఆక్కరలేదు.., మొట్టమొదటిది చెప్పు చాలు " అన్నది. అందుకు ఆ భర్త " విశ్వం విష్ణుః " అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య " ఆపు అక్కడ ! దీనర్ధమేమిటో చెప్పు " అన్నది.. అందుకు ఆ భర్త " విశ్వమే విష్ణువు , ఈ ప్రపంచమంతా విష్ణుమయమే " అని వివరించగా "ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు , అందులో నువ్వూ , నేనూ ఉన్నామా ?ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ , పూరిగుడిసె లో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతీ రోజూ నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానము చేస్తున్నావే.అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా ? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్ధం లేదయ్యా ! " అన్నది..  


భార్య మాటలకు సందేహములో పడిన భక్తుడు " నా భార్య మాటలు కూడా నిజమేనేమో ? విశ్వమంతా విష్ణువే ఐతే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి ? కనుక ఈ మంత్రంలో "విశ్వం" అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్క తో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసి పూసి ( తాటాకు ప్రతి ఉండేదట ఈ భక్తుడి ఇంట్లో ) ఎప్పటిలాగే యాచన కై బయలుదేరి వెళ్లిపోయినాడట..


ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది..ప్రతి నిత్యమూ పాల సముద్రములో శ్రీమహావిష్ణువు ను శ్రీమహాలక్ష్మి సేవిస్తున్నట్లు గానే ఆరోజు కూడా స్వామి ని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందిట ! అందుకు శ్రీమహావిష్ణువు " ఏమిటి దేవీ ? ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ? " అని అడిగితే అమ్మవారు... " నాధా ! మిమ్ములను నల్లని వాడని , నీలమేఘశ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను కానీ అంత మాత్రము చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా " అని పరిహాసమాడగా శ్రీమహావిష్ణువు పాల సముద్రం లో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్లరంగు కనబడిందిట . వెంటనే శ్రీమహావిష్ణువు జరిగినదంతా దివ్యదృష్టి తో గమనించాడుట.. 


లక్ష్మీదేవి " ఏమిటి స్వామీ ఆలోచిస్తున్నారు ? మీ ముఖము పై ఆ నల్లరంగు కు గల కారణమేటో తెలిసినదా ?" యని అడుగగా స్వామి " దేవీ ! ఇది నా పరమ భక్తుడు చేసిన పని " యని పలికాడు. లక్ష్మీదేవి " అదేమిటి స్వామీ ! పరమభక్తుడంటున్నారు ? అతడు ఎందుకిలా చేస్తాడ ని యడుగగా స్వామి తన భక్తుని జీవిత దీన స్థితి ని వివరించగా...


 లక్ష్మీదేవి అంతటి పరమ భక్తుని దీనస్థితి కి కారణమేమి ? మీరాతనిని ఉద్ధరింపలేరా ? స్వామీ ! " అని యడుగగా " దేవీ ! గత జన్మ లో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే ఐనప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి యెరుగడు.. కనుకనే ఈ జన్మలో భక్తుడైననూ దరిద్రo అనుభవించుట తప్పలేదు.. అయిననూ నీవు కోరితివి కనుక నేటితో ఈతనికి కష్టములు తొలగించెదనని పలికి మానవ రూప ధారియై ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారముతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి పోయాడు .


 ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషము లోనున్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలి తో " అమ్మా ! నీ భర్త వద్ద నేను అప్పు గా తీసుకున్న సొమ్ము ను తిరిగి తీర్చుటకు వచ్చితిని , సొమ్మును తీసికొనవలసినదని చెప్పగా ఆ ఇల్లాలు.. నీవెవరవో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యములో ఉన్నాము, నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు, ఎవరనుకుని మాఇంటికి వచ్చారో, వెళ్లిపొమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి " లేదమ్మా ! నేను పొరబాటు పడలేదు , అసత్యమసలే కాదు.., నీ భర్త వద్ద అప్పు గా తీసుకున్న సొమ్ము ఇదిగో ! నువ్వు స్వీకరించు , నీ భర్తకు నేను తరువాత వివరిస్తానని ఆమెకు అశేష ధన , కనక , వస్తు వాహనములు , మణిమాణిక్యాలు , సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలూ కానుకలు గా ఇచ్చి వెళ్లిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు " ఓయీ ! నీ ముఖం మీద కప్పియున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు ! నా భర్త కు చెప్పాలి కదా ! నువ్వు ఎలా ఉంటావో ? " అని పలుకగా.... స్వామి " అమ్మా ! నా ముఖాన్ని నీకు చూపలేను.. నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూశారమ్మా ! నేనెవరో నీ భర్తకు తెలుసులే !" అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్లి కొంతదూరం పోయాక అంతర్ధానమైనాడు .


 ఇంతలో ఊరిలో యాచన కు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశములో కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది, అనేకమంది సేవకులూ , ఉద్యానవనాలతో కళకళలాడిపోతోంది ఆ భవనం. ఇంతలో ఈతని భార్య లోపలి నుండి వచ్చి లోపలికి రమ్మని భర్త ని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేక పోయాడు. ..


అసలు ఆ సంపద ని ఎందుకు స్వీకరించావు ? మనము ఎవరికో అప్పివ్వడమేమిటి ? అది తిరిగి వారు తీర్చడమేమిటి ? మన దీన స్థితి నీకు తెలియనిదా ?" అంటూ భార్య పై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటి వెంట విన్న తరువాత తన కళ్లను , చెవులను తానే నమ్మలేకపోయాడు . అయితే ఆ వచ్చినవాడు ఎలా వున్నాడు ? అతడి ముఖము ఎలాగ ఉన్నది ? అని భార్యని ప్రశ్నించగా... నేను అతడి ముఖాన్ని చూడలేదు... అతడి ముఖం పై ఎవరో నల్లని రంగు పులిమారట...ముఖము చూపించ లేనంటూ వస్త్రముతో ముఖాన్ని కప్పుకున్నాడు.. అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్త కు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్లిపోయాడన్నది..


 అది వినిన భక్తుడు హతాశుతుడై భార్యతో .. వచ్చిన వాడు మరెవరో కాదు , మారువేషంలో వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ! ప్రతి నిత్యమూ నేను విష్ణువును స్తుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను..ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది" అని పలికి ఇంటి లోపలికి వెళ్లి ఉదయము విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి " విశ్వం " అనే నామంపై పులిమిన నల్లరంగు ను తొలగించాడు..


 తరువాత భార్య తో " నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడనగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డు కు చేరుకున్నాడు . అక్కడ సముద్రము వైపునకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీమహావిష్ణువు నుద్దేశించి స్తోత్రగానం చేశాడు . అప్పుడు అశరీరవాణి " భక్తా ! పూర్వ జన్మ కర్మ ఫలముల కారణంగా ఈ జన్మ లో నీకు భగవద్దర్శనము కలుగదు... మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు " అని పలికినది...


#విష్ణుసహస్త్రనామ నిత్యపారాయణ వలన కలుగు ఫలితమిదని అందరూ గ్రహించండి... ప్రతి నిత్యమూ పఠించండి... అవసరార్ధులకు సహాయం చెయ్యండి..


🙏🙏ఓం నమో నారాయణాయ 🙏🙏

విదురనీతి

 *విదురనీతి*


*ఆర్యకర్మణి రజ్యంతే భూతికర్మాణి కుర్వతే*

*హితం చ నాభసూయంతి పండితా భరతర్షభ*


పండితులు శుభ కర్మలపై ఆసక్తి కలిగి ఉంటారు.

సంపదలనిచ్చే పనుల్ని చేస్తారు.

మంచి చేసే వారిని తప్పుపట్టరు.


=====================

శ్రీ సూక్తమ్ తాత్పర్య విశేషాలు:

 శ్రీ సూక్తమ్    తాత్పర్య విశేషాలు:

                                      

 *హిరణ్యవర్ణాం హరిణీం* 

*సువర్ణరజతస్రజామ్*

*చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం*

*జాతవేదో మమావహ* 


 *తాత్పర్యము* 


ఓ అగ్నిదేవా! బంగారపు రంగుకలిగిన  పాపాలను హరించేది,    బంగారము  మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడినది,

చంద్రునిలా చల్లగా ఉండేది,  బంగారముతో కూడినది అయిన  లక్ష్మీదేవిని ( ఎవరి చేత సర్వము చూడబడునో ఆమె లక్ష్మి)

నా కొరకు ఆవాహన చేయుము .



 *విశేషాలు* 

లక్ష్మి

ఈమె విష్ణువు యొక్క భార్య. పాలసముద్రమున అమృత మథన సమయములో పుట్టిందని కొన్ని చోట్ల ఉంటే  ధాతృ విధాతలతో  కలిసి  జ్యేష్ఠాదేవికి చెల్లెలు అయి బ్రహ్మకు పుట్టిందని కొన్ని చోట్ల ఉన్నది..

భృగు మహర్షి కూతురు అని అందుకే  ఈమెకు భార్గవి అని పేరు  వచ్చిందంటారు. అమెకు ఇన్ని జన్మాలు రావటానికి  కారణము  కల్పభేదములు అంటారు. వేయి మహాయుగాలు కలిస్తే  ఒక కల్పం. మహా యుగం అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు అనే నాలుగు యుగాల కాలం.  ఇప్పుడు శ్వేత వరాహ కల్పం.


 *ఆవాహనము* 


అంటే ఆహ్వానము, పిలుపు;

దేవతలను విగ్రహాదులయందు సన్నిధి చేయండని కోరుట.మంత్రోచ్చారణచే దైవశక్తిని విగ్రహములయందు నిలుపుట ఆవాహనము


 *హరిణి* 

హరిణి అంటే  ఆడుజింక,  ఒక యప్సరస్త్రీ, బంగారుప్రతిమ, వృత్తవిశేషము, అడవిమొల్ల, ఆకుపచ్చవర్ణము గలది అను అర్థములున్నప్పటికీ ఇక్కడ హరి పత్ని, పాపములను హరించునది అను అర్థములు  స్వీకరించుట సముచితము.


 *హిరణ్యము* 

హయ్యతి గచ్ఛతీతి హిరణ్యం. పోయే స్వభావము కలిగినది హిరణ్యము.

                                      

 *తాంమZవహ జాతవేదో*

 *లక్ష్మీమనపగామినీమ్* 

 *యస్యాం హిరణ్యం విందేయం* 

 *గామశ్వం పురుషానహమ్* 



 *తాత్పర్యము* 

ఓ అగ్ని దేవుడా !

          ఎవరి దయ వల్ల   బంగారము , పొందదగినవయిన  ఆవులు, గుర్రాలు బంధువులను  (సేవకులను), నేను పొందుతానో (పొందానో) ఆ లక్ష్మీదేవిని ( ఎవరి చేత సర్వము చూడబడునో ఆమె లక్ష్మి) విష్ణుదేవుని వీడకుండా అనుసరించే లక్ష్మీదేవిని, నా ఇంట్లో కూడా వీడకుండా చూడుము. నా కొరకు ఆహ్వానించుము.( నా ఇల్లు సిరిసంపదలతో సుభిక్షంగా ఉండేటట్లు చేయుమని భావము)    

          

 *విశేషాలు* 

          ఈ మంత్రములో వాడబడిన “ *వింద* “అనే పదాన్ని ఎక్కువగా ముహుర్తానికి ముందు వాడుతుంటారు.నష్టం ధనం విందతి ( లభతే) అస్మిన్ – ఇతి విందః. ఏదైనా వస్తువు , డబ్బు, మనిషి   ఈ ముహూర్తంలో తప్పిపోతే తిరిగొస్తారట..   


      వాల్మీకి రామాయణం అరణ్యకాండలో రామలక్ష్మణులతో జటాయువు ఈ వింద ముహూర్తం గురించి చెప్పాడు. ( 68 వసర్గ-13 శ్లోకం).

          పగటి పూట ఉండే 15  ముహూర్తాలలో 11  వ విజయ ముహూర్తమునకు విందమని పేరు.

          విజయాలను ప్రసాదించే లక్ష్మీదేవిని ఆ (విందా+ఇయం) విందా పేరుతో ఈ మంత్రంలో పిలవటం గమనార్హం. 


                                      


ఈ మంత్రంలో లక్ష్మిదేవిని   యోగ సాధకుడు ఆహ్వానిస్తున్నాడు.


 *అశ్వపూర్వాం రథమధ్యాం*

 *హస్తినాదప్రభోదినీమ్* 

 *శ్రియం దేవీముపహ్వయే* 

 *శ్రీర్మా దేవీర్జుషతామ్* 



 *తాత్పర్యము* 


          లక్ష్మీదేవి  ప్రారంభంలో గుర్రం వలె,  మధ్యలో రథము లా, చివర్లో ఏనుగులా  శబ్దము చేస్తుంది. అటువంటి  లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాను.  లక్ష్మీదేవి  నా విషయములో  ప్రీతి కల్గి  నన్ను అనుగ్రహించుగాక !


 *విశేషము* 

          ఈ మంత్రం యోగ శాస్త్రం నేపథ్యంలో నే అర్థమవుతుంది

          అమ్మ ఏమిటి.... ఆ ఆరుపులేమిటి ... అని మనకు అనిపించటం సహజం.

          యోగసాధనలో దేవి ......

          సుషుమ్నా నాడి మూలంలో చేసే శబ్దం అశ్వ ఘోష.

          సుషుమ్నా నాడి మధ్యంలో చేసే శబ్దం రథ ఘోష.

          యోగ సాధన చివరి దశలో అమ్మ చేసే ధ్వని కరిణీ ధ్వని.

          అలా  ధ్వనులు జనించే యోగంలో కుదురుగా నిలిపి , నన్ను యోగంలో అనుగ్రహించు అని ఈ మంత్రంలో విన్నపము.

                                                      

ఈ నాలుగవ మంత్రంలో వేద పురుషుడు లక్ష్మీదేవిని తన హృదయములోనికి రమ్మనమని  ఆహ్వానిస్తున్నారు.


 *కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం* **జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్*

*పద్మేస్థితాం పద్మవర్ణాం* *త్వామిహోపహ్వయే శ్రియమ్* 


 *తాత్పర్యము* 

          ఓ  లక్ష్మీదేవి !   నువ్వు శబ్దము చేసే దానివి,గొప్పతనానికి కారణమైన దానివి, అందమైన  స్వభావము కలిగిన దానివి, దయతో నిండిన హృదయము కలిగినదానివి, ప్రకాశించేదానివి, తృప్తి కలిగినదానివి, భగవంతుని తృప్తి పరిచేదానివి, పద్మములో నిలచి ఉన్నదానివి, పద్మమువంటి వర్ణము కలిగినదానివి, నిన్ను ఇక్కడకు ( నా హృదయము లోనికి) ఆహ్వానిస్తున్నాను.


 *విశేషాలు* 

 కై శబ్దే  . అని ధాతువు. అందువల్ల ఈ మంత్రంలో  కాం అను ఆక్షరానికి శబ్దించేదానివని అర్థం చెప్పబడింది.

                                               

                         

ఈ అయిదవ మంత్రంలో లక్ష్మీదేవిని వేద పురుషుడు శరణు కోరుతున్నాడు.


 *చన్ద్రాం ప్రభాసాం యశసాం*

 *జ్వలన్తీం శ్రియం లోకే* *దేవజుష్టాముదారామ్* 

 *తాం పద్మనేమీం శరణమహం* *ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే* 


 *తాత్పర్యము* 


          అమ్మా! లక్ష్మీదేవీ! నువ్వు  చంద్రునిలా దయతో చల్లదనం కలిగినదానివి .బాగా కాంతి కలిగినదానివి. కీర్తి  కలిగినదానివి. వివిధ అగ్నుల స్వరూపము కలిగినదానివి . ఈ లోకమునందు , పర లోకమునందు దేవుడైన విష్ణువుతో కలిసి ఉన్నావు.దాతృత్వ గుణము కలిగినదానివి. కాలానికి అతీతమయినదానివి.అటువంటి నిన్ను నేను శరణము  కోరుతున్నాను.   నాయొక్క దారిద్ర్యము  నశించుగాక! నిన్ను వరిస్తున్నాను.( భక్తితో నిన్ను నా హృదయంలో ఉండాలని కోరుకొంటున్నాను)

విశేషాలు

అగ్నులను  నిఘంటువులలో ఇలా చెప్పారు.

త్రివిధ-అగ్నులు

1. గార్హపత్యము (పిత), 

2. దక్షిణాగ్ని (మాత), 

3. ఆహవనీయము (గురువు).


" *పితా వై గార్హపత్యోఽగ్ని* *ర్మాతాగ్నిర్దక్షిణః స్మృతః* , *గురు రాహవనీయస్తు* 

 *సాగ్ని త్రేతాగరీయసీ"*

 [మనుస్మృతి 2-331]



చతుర్విధ అగ్నులు

(అ.)

 1. దీపాగ్ని, 

2. కమలాగ్ని, 

3. మంధాగ్ని, 

4. గాఢాగ్ని.


(ఆ.) 

1. బడబాగ్ని, 

2. జఠరాగ్ని, 

3. గృహాగ్ని, 

4. వైద్యుతాగ్ని.


(ఇ.) 

1. విషమాగ్ని, 

2. తీక్ష్ణాగ్ని, 

3. మందాగ్ని, 

4. సమాగ్ని.

పంచ-అగ్నులు 


(అ.)

 1. దక్షిణాగ్ని, 

2. గార్హపత్యాగ్ని, 

3. ఆహవనీయాగ్ని, 

4. సభ్యాగ్ని, 

5. ఆవసథ్యాగ్ని.


(ఆ.) 

1. మందాగ్ని, 

2. తీక్ష్ణాగ్ని, 

3. విషమాగ్ని, 

4. సమాగ్ని, 

5. భస్మాగ్ని.


(ఇ.) 

1. బడబాగ్ని, 

2. జఠరాగ్ని, 

3. దావాగ్ని, 

4. గృహాగ్ని, 

5. వైదికాగ్ని.


(ఈ.) 

1. పూర్వాగ్ని, 

2. దక్షిణాగ్ని, 

3. పశ్చిమాగ్ని, 

4. ఉత్తరాగ్ని, 

5. సూర్యుడు.


(ఉ.) 

1. బుద్ధి, 

2. ఉదానము, 

3. చక్షుస్సు, 

4. రూపము, 

5. పాతము.


(ఊ.) 

1. జ్ఞానాగ్ని, 

2. కాలాగ్ని, 

3. క్షుధాగ్ని, 

4. శీతాగ్ని, 

5. కోపాగ్ని.


(ఋ.) 

1. బడబాగ్ని, 

2. జఠరాగ్ని, 

3. కాష్ఠాగ్ని, 

4. వజ్రాగ్ని, 

5. సూర్యాగ్ని.


(ౠ.)

 1. ఉదరాగ్ని, 

2. మందాగ్ని, 

3. కామాగ్ని, 

4. శోకాగ్ని, 

5. బడబాగ్ని. 


[అగ్నిపురాణం]

షట్‌-అగ్నులు :


1. గార్హపత్యము,

 2. ఆహవనీయము, 

3. దక్షిణము, 

4. సభ్యము, 

5. అవసథ్యము, 

6. ఔపాసనము.

 [ఇవి కర్మకాండకు సంబంధించినవి]


అష్ట-అగ్నులు :

1. దీపాగ్ని, 

2. కమలాగ్ని, 

3. గాఢాగ్ని, 

4. దావాగ్ని, 

5. తుషాగ్ని, 

6. భగనాగ్ని, 

7. వానిజాగ్ని, 

8. వత్సలాగ్ని.



అగ్నులు :

1. పంచాగ్నులు అంటే లౌకిక జీవితంలో ఉదరాగ్ని, మందాగ్ని, కామాగ్ని, శోకాగ్ని, బడబాగ్ని.


2. ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం, సభ్యం, అపసథ్యం. (అనలం, కుకూలం, ఛగలం, వత్సలం అనేవి సామాన్యాగ్ని భేదాలు).                                                         


 “పద్యమానం మినోతీతి కాలం పద్మం ప్రచక్షతే” ( లక్ష్మీతంత్రం) తాను కదులుతూ మిగిలినవానిని విభాగించేది  కనుక పద్మానికి కాలమని పేరు.


                                            


ఈమంత్రంలో  లక్ష్మి తో సంబంధం ఉన్న బిల్వ వృక్షాన్ని పొగుడుతున్నాడు.


 *ఆదిత్యవర్ణే తపసో ౽ధిజాతో* 

 *వనస్పతిస్తవ వృక్షో౽థ బిల్వః* 

 *తస్య ఫలాని తపసా నుదన్తు* 

 *మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః* 


 *తాత్పర్యము* 


          శుభ కారకమైన ! ఓ బిల్వ వృక్షమా !  సూర్యుని వర్ణం వంటి వర్ణం కలిగినదానా! నీ సంకల్పం వల్ల నువ్వు

అన్ని శుభాలకోసం అవతరించావు. గొప్ప చెట్టు   ఆ బిల్వ వృక్షం .  దాని యొక్క పండ్లు నా తపస్సుతో అజ్ఞానాన్ని, శత్రువులను బయటికి కనిపించే దారిద్ర్యాలను పోగొట్టు గాక !


 *విశేషాలు* 

బిల్వమంటే మారేడు.

శ్రీ మహా విష్ణువు , లక్ష్మీదేవితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతినుంచి బిల్వ వృక్షం జన్మించిందిట

 *బిల్వపంచకము* 

1. తులసి, 

2. మారెడు, 

3. వావిలి, 

4. ఉత్తరేణు, 

5. వెలగ [వీని పత్రములు].


బిల్వఖల్వాటన్యాయం

మిట్టమధ్యాహ్న సమయంలో బట్టతలవాడొకడు వీధిలో పోతూ సూర్యకిరణాలవల్ల తల చురుక్కుమనగా దగ్గరున్న మారెడుచెట్టు కిందికి చేరినాడు. వెంటనే మీది నుండి మారెడుపండు తలమీద పండి తల చితికింది. [దురదృష్టవంతుడికి, ఎక్కడికి పోయినా బాధలే అని భావం.]


బిల్వవిభజనన్యాయం

మారెడుపండును పగులగొట్టడమన్నట్లు. [తెలియని విషయంలో ప్రవర్తించడమని భావం.]

                                               

ఈ మంత్రంలో యోగ శాస్త్ర విధానాన్ని అనుసరించి లక్ష్మి తనను పొందాలని సాధకుడు ఆహ్వానిస్తున్నాడు.


 *ఉపైతు మాం దేవసఖః* *కీర్తిశ్చమణినా సహ* 

 *ప్రాదుర్భూతో ౽స్మి రాష్ట్రే ౽ స్మిన్* 

 *కీర్తిమృద్ధిం దదాతు మే* 



 *విశేషాలు* 

మూలాధార పద్మము యొక్క కర్ణికలో అగ్ని మండలము ఉన్నదని శాస్త్రము. దానిని ఈ మంత్రములో మణితో పోలుస్తున్నారు.

శరీరంలోని చక్రాలు ఉంటాయని యోగ శాస్త్రం చెబుతోంది.

మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం

నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం

తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం

సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః

7. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం

6. ఆజ్ఞాచక్ర – తపోలోకం – జీవాత్మస్థానం

5. విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం

4. అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం

3. మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం

2. స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం

1. ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం

వీటిలో మూలాధారచక్రం మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవు ఆకారంలో ఉంటుంది.

ఈ మంత్రంలో లక్ష్మీదేవి అనుగ్రహానికి భారత భూమిలో పుట్టటం ఒక గొప్ప అర్హత అని చెబుతున్నారు. మనము ఎంత అదృష్ట

                                      



 *క్షుత్పిపాసాం మలాం జ్యేష్ఠా* -

 *మలక్ష్మీం నాశయామ్యహమ్* 

 *అభూతిమసమృద్ధిం చ*

 *సర్వాన్  నిర్ణుదమే గృహాత్* 



 *తాత్పర్యము* 

 ఓ వేద పురుషా !(అగ్ని దేవా )ఆకలి, దాహము మొదలయిన  దోషాలకు కారకురాలయిన , లక్ష్మికంటె పెద్దదయిన జ్యేష్ఠాదేవిని నేను నశింపచేస్తున్నాను. దరిద్రము సమృద్ధి లేక పోవటము మొదలయిన వాటన్నింటిని నా  ఇంటి నుండి వెళ్లి పోయేటట్లు చేయి.

 విశేషాలు

          01.నాశయామ్యహమ్ (“నేను నశింపచేస్తున్నాను )“ అనే  పద బంధం  కొంచెం వింత కలిగిస్తుంది.  నిజానికి సాధకునికి అంత శక్తి లేదు. ఇక్కడ “నేను” పదం – అమ్మ  దయతో పరిపూర్ణుడైన భక్తుని సూచిస్తుంది. అటువంటి భక్తునికి దరిద్రాన్ని నాశనము చేయగల శక్తి ఉంటుంది.


          02.సంపూర్ణ కార్తీక మహాపురాణములో (29వ అధ్యాయం)ఈ జ్యేష్ఠాదేవి కథ విపులంగా ఉంది. 

 క్షీరసాగర మథనంలో  అనేక వస్తువులు లభించాయి.  లక్ష్మినీ కౌస్తుభాన్నీ శ్రీహరికి సమర్పించి - తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు.  లక్ష్మి  తనకన్న   పెద్దదయిన  జ్యేష్ఠకు పెండ్లి కావాలని కోరింది. విష్ణువు - ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని ఇచ్చి పెండ్లి చేసాడు. పవిత్రమైన  యజ్ఞయాగాదులు  జరిగే ఉద్దాలకుని ఆశ్రమంలో ఉండలేని జ్యేష్ఠాదేవిని  రావిచెట్టు మొదట్లో  కూర్చో'మని చెప్పి ఉద్దాలకుడు వెళ్ళాడు. ఎన్నాళ్ళకీ ఉద్దాలకుడు రాలేదు. ఆమెని ఊరడిస్తూ  "ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగానూ, అక్కడ జ్యేష్ఠాదేవిని పూజించే వారిని  శ్రీలక్ష్మి కరుణిస్తుందని  శ్రీహరి చెప్పాడు.


                                                


 *గంధద్వారాం దురాధర్షాం*

 *నిత్యపుష్టాం కరీషిణీమ్* 

 *ఈశ్వరీం సర్వభూతానాం*

 *తామిహోపహ్వయే శ్రియమ్* 


శ్రీ లక్ష్మీదేవిని తన ఇంటిలో నిత్యము ఉండమని సాధకుడు ఈ మంత్రములో ఆహ్వానిస్తున్నాడు.

తాత్పర్యము

లక్ష్మీదేవి అన్ని సుగంధాలకు నిలయం .ఎవరూ జయించలేనిది. ఎప్పుడూ గుణములతో  నిండి  యున్నది. ఏనుగులకు ఈ శ్వరిసమ స్త జీవరాశులకు అధికారిణి . అటువంటి  లక్ష్మీదేవిని నా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాను.


 *విశేషాలు* 

1. కర్పూరము, 

2. కస్తూరి, 

3. పునుగు, 

4. జవ్వాజి, 

5. అగరు, 

6. పన్నీరు, 

7. అత్తరు, 

8. శ్రీగంధము. 

అను ఎనిమిది రకాల గంధాలనే కాకుండా గంధ శబ్దం   పంచ తన్మాత్రలలోని (శబ్దస్పర్శ రూపరసగంధములు) గంధ శబ్దాన్ని కూడా సూచిస్తుంది.

తత్‌ + మాత్ర. తత్‌ అంటే పరబ్రహ్మం. మాత్రం అంటే కొలమానం. బ్రహ్మాన్ని తెలుసుకొనడానికి ఉపయోగపడే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు  ఐదూ కలసి పంచ తన్మాత్రలు. వీటిని  చెవి, చర్మం, కన్ను, నోరు, ముక్కు అనే జ్ఞానేంద్రియాలతో తెలుసుకొంటాము.

గంధాదుల ద్వార లక్ష్మీదేవిని తెలుసుకోవచ్చని భావం.

వైభోగాలకు, బలానికి  ప్రతీక  ఏనుగు.

 ఏనుగు ఎక్కడ వుంటే అక్కడ సర్వసంపదలు, శక్తులు  ఉంటాయి.

ప్రముఖ దినపత్రిక ది  హిందూ తన గుర్తింపు చిహ్నం (logo)లో ఏనుగుని బలానికి , అధికారానికి ప్రతీకగా గ్రహించింది.

లక్ష్మీదేవిని సేవిస్తే సర్వసంపదలు, శక్తులు   వస్తాయని భావం. 

                                     


లక్ష్మీదేవిని తన దగ్గర ఉండమని వేద పురుషుడు ఈ మంత్రములో ప్రార్థిస్తున్నాడు.


 *మనసః కామమాకూతిం*

  *వాచః సత్యమశీమహి* 

 *పశూనాం రూపమన్నస్య*

 *మయి శ్రీః శ్రయతాం యశః* 



 *తాత్పర్యము* 

 అమ్మా ! లక్ష్మీదేవి! నువ్వు  మనస్సుచేత కోరుకొనేదానివి.పలికే శబ్దాలకు అర్థము నీవే.సత్యమైనదానివి .నీ రూపాన్ని నా మనస్సు  పొందేటట్లు చేయి.

 పశు స్వరూపులైన  మా  జీవులలో జ్ఞాన స్వరూపంలో ఉన్నదానివి. భోగించదగిన వస్తువులలో కీర్తి రూపంగా ఉన్నదానివి.ఓ

లక్ష్మీదేవి! నా భావనా తీరాలకు దయతో నువ్వు  చేరు.(నా మనస్సులో నిత్యంగా ఉండు తల్లీ అని ప్రార్థన.)

                                               

లక్ష్మీదేవిని తన వారందరి దగ్గర ఉండేటట్లు చేయమని కర్దమప్రజాపతిని  వేదపురుషుడు  ఈ మంత్రములో ప్రార్థిస్తున్నాడు.


 *కర్దమేన  ప్రజాభూతా*

 *మయి సంభవ కర్దమ* !

 *శ్రియం వాసయ మే కులే*

 *మాతరం పద్మమాలినీమ్* 


 *తాత్పర్యము* 

 ఓ కర్దమ ప్రజాపతీ ! కర్దముడవైన నీచేత   కుమార్తెగా లక్ష్మీదేవి  స్వీకరించబడినది. పద్మాల మాలికలు కలిగిన శ్రీ లక్ష్మిని నాయందు  ఉండే పరిస్థితి కలిగించు. నాకులములో,నా వారిలో  అమ్మ శ్రీ లక్ష్మీదేవిని ఎప్పుడు  ఉండేటట్లు చేయి.

విశేషము

కర్దమ ప్రజాపతి

బ్రహ్మచ్ఛాయయందు పుట్టిన వాడు కర్దమ ప్రజాపతి . భార్య దేవహూతి. కొడుకు కపిలుడు

కర్దమ ప్రజాపతి లక్ష్మీదేవిని కుమార్తెగా పాలకడలిలో ఆమె పుట్టినప్పుడు స్వీకరించాడని శ్రీ సూక్త వ్యాఖ్యానము లో ఒక చోట ఉన్నది.


                                             

లక్ష్మీదేవిని తన వారందరి దగ్గర ఉండేటట్లు చేయమని చిక్లీతుడనే లక్ష్మీ ఆలయాన్ని కాపాలా కాసే వాడిని   వేదపురుషుడు  ఈ మంత్రములో ప్రార్థిస్తున్నాడు.


 *ఆపః సృజంతు స్నిగ్ధాని*

 *చిక్లీత వసమే గృహే* 

 *ని చ  దేవీం మాతరం*  

 *శ్రియం వాసయ మే  కులే* 


 *తాత్పర్యము* 

 లక్ష్మీ  అమ్మవారి గుడిని రక్షించేవాడా !  నీరు -  లక్ష్మికి ఇష్టమైన వానిని    మా ఇంట్లో సృష్టించుగాక. నా ఇంట్లో నివసించు.

తల్లి అయిన శ్రీ లక్ష్మిని  నా కులములో (నా వంశంలో)నిత్యము ఉండేటట్లు చేయి

విశేషాలు

 విష్ణువుకు నివాస స్థానమైన నీరు - లక్ష్మికి ఇష్టమైన వానిని    మా ఇంట్లో సృష్టించుగాక.  అని చెప్పటంలో నీటి యొక్క గొప్పతనం చెప్పబడింది.

 పద్ముడు, గతుడు, శంఖ నిధి,నాలుగు దంతాలున్న ఏనుగు, శుభకరమైన పాము, సింహం, చిక్లీతుడు- లక్ష్మీ దేవి గుడిని కాపాలా కాసేవారు. వీరిలో చిక్లీతుని ఈ మంత్రంలో వేద పురుషుడు ప్రార్థిస్తున్నాడు.

                                               


తన దగ్గర ఎప్పుడూ ఉండేటట్లు చేయమని  అగ్నిని  ఈ మంత్రంలో వేద పురుషుడు ప్రార్థిస్తున్నాడు.

 *ఆర్ద్రాం పుష్కరిణీం  యష్టిం* 

 *పింగళాం పద్పద్మమాలినీజాతవేదో మమావహ* 

భావము

 ఓ అగ్నిదేవా ! చల్లని , మృదువైన మనస్సు కలిగినది,భక్తులను పోషించేది, అందరికి ఆలంబనగా ఉండేది, పచ్చని రంగును  కలిగినది, తామరపూల మాలికను ధరించినది , ఆనంద రూపమును ధరించినది,బంగారంకలిగినది అయిన ,లక్ష్మీదేవిని  ఎప్పుడూ నా దగ్గర ఉండేటట్లు నన్ను  అనుగ్రహించు

విశేషాలు

 జాతవేదుడు అనగా అగ్ని.

 అపౌరుషేయాలైన వేదాల పుట్టుకను గురించి అగ్ని ఒక్కరికే తెలుసు. వేదాల పుట్టుక గురించి తెలిసినవాడు కనుక జాతవేదుడు.  (నిరుక్తం).

                                               

సూర్య రూపిణియైన లక్ష్మిని తన దగ్గర ఎప్పుడూ ఉండేటట్లు చేయమని  అగ్నిని  ఈ మంత్రంలో వేద పురుషుడు ప్రార్థిస్తున్నాడు.



 *ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం* 

 *సువర్ణా”మ్ హేమమాలినీమ్* 

 *సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం* 

 *జాతవేదో మఆవహ* 


*భావము* 

 ఓ అగ్నిదేవా ! చల్లని , మృదువైన మనస్సు కలిగినది,భక్తులను పోషించేది(తామరలను కలిగినది), అందరిని సంతోషింపచేసేది, అందమైన శబ్దమయిన వేదంలా ఉన్నది ,హైమ పర్వతాన్ని మాలగా ధరించినది,సూర్య రూపమును ధరించినది, బంగారంకలిగినది అయిన లక్ష్మీదేవిని  నాకు అనుగ్రహించు.

విశేషాలు

1. జాతవేదుడు అనగా అగ్ని.

2. అపౌరుషేయాలైన వేదాల పుట్టుకను గురించి అగ్ని ఒక్కరికే తెలుసు. వేదాల పుట్టుక గురించి తెలిసినవాడు కనుక జాతవేదుడు.  (నిరుక్తం).

3. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు మొదలయినవి  హైమన  పర్వతంలో ఉంటాయి.బ్రహ్మను స్థిరంగా నిలుపుట కొరకు తాను ఈ  హైమన పర్వతాన్ని ధరిస్తున్నానని లక్ష్మీదేవి లక్ష్మీ తంత్రంలో చెప్పింది. అందుకే ఆమెకు “హేమ మాలిని” అని పేరు వచ్చింది.


 *తాంమZవహ జాతవేదో* *లక్ష్మీమనపగామినీమ్* 

 *యస్యాం హిరణ్యం ప్రభూతం*

 *గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్* 


భావము

 ఓ అగ్నిదేవా ! అధికమైన  బంగారాన్ని, ఆవులను, సేవకురాళ్లను, గుర్రములను, పురుషులను నాకు ప్రసాదించే లక్ష్మిని అనుగ్రహించు.

విశేషాలు

1. జాతవేదుడు అనగా అగ్ని.

2. అపౌరుషేయాలైన వేదాల పుట్టుకను గురించి అగ్ని ఒక్కరికే తెలుసు. వేదాల పుట్టుక గురించి తెలిసినవాడు కనుక జాతవేదుడు.  (నిరుక్తం).

3. అధికమైన  బంగారాన్ని, ఆవులను, సేవకురాళ్లను, గుర్రములను, పురుషులను లక్ష్మితో వస్తాయి కనుక లక్ష్మిని అనుగ్రహించమని ప్రార్థన

4. శ్రీమంతుడయిన స్వామి . ఏ రూపం ధరించినా 'అనపగామిని' 'అనపాయినీ' (వీడకుండా అనుసరించే శక్తి) అయిన లక్ష్మి ఆయన వెంటనే ఉంటుంది. ఆయన వక్షంపై కొలువుతీరి ఉన్నది ఆ తల్లి. ఈ శ్రీ సూక్తానికి ఈ అజ్ఞాని వ్రాసిన అర్థతాత్పర్య విశేషాలలో దోషాలుంటే  ఆ శ్రీ లక్ష్మిని  క్షమించవలసినదిగా ప్రార్థిస్తూ, ఈ శ్రీ సూక్త అర్థ తాత్పర్యాలు చదివినవారికి శుభ సంపత్తులు కలుగచేయాలని ప్రార్థిస్తున్నాను.🙏🙏🙏🙏🙏

శ్రీమద్భాగవతము


*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1950 (౧౯౫౦)*


*10.1-950-వ.*

*10.1-951-*


*మ. సురభిక్షీరములన్ సురద్విప మహాశుండా లతానీత ని*

*ర్జరగంగాంబువులన్ నిలింపజననీ సన్మౌనిసంఘంబుతో*

*సురనాథుం డభిషిక్తుఁ జేసి పలికెన్ సొంపార గోవిందుఁ డం*

*చు రణాక్రాంతవిపక్షుఁ దోయజదళాక్షున్ సాధుసంరక్షణున్!*🌺



*_భావము: ఇంద్రునితో వచ్చిన పరమ పూజ్యమగు కామధేనువు శ్రీ కృష్ణుని ఇలా స్తుతించింది: "పరమేశ్వరా! దేవదేవా! నీవే మా దైవమవు. నీవే మా ప్రభువవు. బ్రహ్మ దేవుడు బ్రాహ్మణులు, ధేనువులు, దేవతలు, సాధువులకు సుఖ శాంతులు కలగ చేయుటకు నీకు పట్టము కట్టమని మమ్ము నియమించి పంపాడు. నీవు ఈ సమస్త భూమండలము యొక్క భారమును తగ్గించటానికి అవతరించిన ఆదినారాయణుడవు”. ఆపై ఇంద్రుడు మహర్షులతో కలిసి సురభి (కామధేనువు) యొక్క క్షీరముచే, ఐరావతము యొక్క గొప్ప తొండము చేత తేబడిన పవిత్ర దేవ గంగాజలములతో, శ్రీకృష్ణునికి పట్టాభిషేకము గావించి, శత్రువులను జయించి రాజ్యములను ఆక్రమించగలవాడు, సాధుజనులను సర్వదా సంరక్షించేవాడు, పద్మదళాయతాక్షుడగు గోవిందుడు మనోహరముగా ఒప్పుచున్నాడు" అని ప్రశంసించెను._* 🙏



*_Meaning: Kamadhenu, the best and most sacred cow eulogized virtues of Sri Krishna: "O Almighty! You are our God, saviour and our ruler. Brahma ordained us to crown You, so that Brahmins, Cows, Celestial beings (devatas) and the people of virtue live in peace and happiness. You are an incarnation of Sri Maha Vishnu and You took this birth to reduce weight of sinners from this earth". Thereafter, Indra along with sages (Maharshis) performed crowning ceremony of Sri Krishna with auspicious milk from Kamadhenu and sacred Ganga Jal (water from river Ganga) brought in the trunk of Airavata (Elephant of Indra) and said "Sri Krishna, the winner of battles against demons, the conqueror of all other kings and saviour of people of virtue, is glowing in a splendid and brilliant manner"._*🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*

                                                                                                                                              *భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1951 (౧౯౫౧)*


*10.1-952-*


*సీ. తుంబురు నారదాదులు సిద్ధచారణ;* 

*గంధర్వులును హరికథలు పాడి*

*రమరకాంతలు మింట నాడిరి వేల్పులు;* 

*కురియించి రంచిత కుసుమవృష్టి*

*జగములు మూఁడును సంతోషమును బొందెఁ;* 

*గుఱ్ఱుల చన్నులం గురిసెఁ బాలు*

*నవజలంబులతోడ నదులెల్లఁ బ్రవహించె;* 

*నిఖిల వృక్షములు దేనియలు బడిసె*

*తే. సర్వలతికల ఫల పుష్ప చయము లమరెఁ*

*బర్వతంబులు మణిగణప్రభల నొప్పెఁ*

*బ్రాణులకునెల్ల తమలోని పగలుమానె*

*వాసుదేవుని యభిషేక వాసరమున.* 🌺



*_భావము: వాసుదేవుని పట్టాభిషేక సమయమున తుంబురుడు, నారదుడు మొదలగు అమరగాయకులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు విష్ణు కథలను గానము చేశారు. దేవకాంతలు ఆకాశమునందు నాట్యాలు చేశారు, దేవతలు మనోజ్ఞమైన పుష్పవర్షము కురిపించారు. ముల్లోకములలోని జీవులు అమితమైన ఆనందమును పొందారు. పాడియావుల పొదుగులనుండి పాలు సమృద్ధి గా ప్రవహించాయి. ఏరులన్నీ కొత్త నీటితో పారాయి. సకల వృక్షములు మకరంద భరితమయ్యాయి. సమస్తమైన లతా నికుంజములు పండ్లు, పూలతో మనోహరముగా కనిపిస్తున్నాయి. కొండలు మణి, రత్న సమూహ కాంతులతో ఒప్పుచున్నాయి. విశ్వమండలి జీవులన్నియు తమతమ సహజ సిద్ధ వైరములు మానుకున్నాయి._* 🙏



*_Meaning: At the time of crowning Sri Krishna Tumbura, Narada and other celestial singers and Siddhas, Charanas and Gandharvas sang tales of Sri Krishna's great deeds. Celestial women danced in the sky and Devatas showered flowers. People of all three Lokas rejoiced and milk flowed from the udders of cows. Rivers and rivulets were full with fresh water, all trees were endowed with nectar and all creepers bloomed with flowers and fruits. Mountains shone with gems and pearls and all living beings shed their natural enmity towards some of their fellow lives._* 🙏

 


*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

దీపారాధన - పాటించాల్సిన నియ‌మాలు

 దీపారాధన  - పాటించాల్సిన నియ‌మాలు


నిత్యం దీపారాధన చేసినా.. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరకి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి.. దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే.. నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసుకుందాం.. 


 పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయష్కరం. అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి, మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.


తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే.. గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి.. సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే.. రుణ బాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే.. సిరిసంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. దక్షణముఖంగా దీపం వెలిగిస్తే.. అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి. 


దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే.. పూర్వజన్మ పాపాలు తొలగిపోయి.. సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్ర్తం మీద పన్నీరు చల్లి, ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్ర్తాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా.. శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలికిస్తే.. శ్రేయస్కరం. 


దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలి అనే దానిపై చాలా మంది అయోమయం చెందుతూ ఉంటారు. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే.. నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే.. దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 48 రోజులు దీపం వెలిగిస్తే.. సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు....

దీపావళి విశేషాలు -2 🪔

 🪔దీపావళి విశేషాలు -2 🪔


సకల శుభావళి

దీపావళి

        🚩🔔🚩


భాద్రపదమాసంలో చవితి నాడు వినాయకునితో ఆరంభించి ఒక్కొక్క దేవీ దేవతకు  సంవత్సరం అంతా పండుగలు జరుపుకుంటాము.


కాని, ఒకే పండుగలో  సకల దేవతలను పూజించిన పుణ్యఫలాలు

లభిస్తున్నాయంటే  అది

మరింత విశిష్టమైన పండగ కదా  ?

అలాటి ప్రత్యేకత సంతరించుకున్న పండుగే దీపావళి. 


ఆశ్చర్యంగా వున్నదా ? 


దీపావళిరోజున  పండుగగా జరుపుకోవడం

సకల దేవతలను  ఆరాధించినట్లు , ఎలా అవుతోందో  తెలుసుకుందాము. 


ఆరోజున మొదటగా పవిత్ర గంగా స్నానం చెయ్యాలి. గంగలో స్నానం చేయడమంటే , పాపాలన్నీ తలగించి

పుణ్యాన్ని కలిగించేదని

పురాణాలు తెలుపుతున్నాయి. కాని

గంగానదిలో స్నానం చేయడం అందరికీ సాధ్యం కాని పని. 

అందరికి ఆ మహాధ్భాగ్యం ప్రసాదించాడానికి గంగాదేవి  దీపావళి నాడు  సకల జలాలలోను ప్రవేశిస్తుంది.


ఆనాడు ప్రాతఃకాలంలోనే నిద్ర

లేచి  దేహమంతటికి నూనె పట్టించుకొని తలారా స్నానం చేస్తే , మహాలక్ష్మీ

కటాక్షం, గంగాదేవి  ఆశీర్వాదాలు  ఒక్కటిగా

ఒకేసారి లభిస్తాయి. 


నరకాసురుడు  తాను చనిపోయిన రోజున, తనని తలచుకొని స్నానం చేసిన వారికి , గంగలో స్నానం చేసిన పుణ్యం లభించాలని  వరాన్ని పొందాడు.   


అలాగే , మహాలక్ష్మీ అనుగ్రహం కలగడానికి

ఒక పురాణకధ వున్నది. దీపావళీ పండగ దినాన మహాలక్ష్మీదేవి  నువ్వుల నూనెలో నివసిస్తుందట. అమృతం కోసం

పాలకడలిని చిలికినప్పడు , పాలకడలి నుండి శ్రీమహాలక్ష్మీ ఉద్భవించినది.  ఆమె అద్భుత సౌందర్యాన్ని చూసి వ్యామోహం చెందిన దానవులు ఆమెను వెంటాడి రాగా , లక్ష్మీదేవి  దట్టమైన నువ్వులమొక్కల వనం గుండా పరువులెత్తి శ్రీ మహావిష్ణువు ని చేరుకున్నదిట.  సముద్రరాజ పుత్రికను వెంటాడుతున్న దుష్ట దానవులను  అడ్డుకునేందుకు నువ్వుల చెట్లు తమలోని నూనెను ధారగా చెమరించాయి.  ఆ నూనెలో పరిగెత్తలేక దానవులు జారిపడి అవస్థలు పడుతున్న సమయంలో లక్ష్మీదేవి  వేగంగా శ్రీ మహావిష్ణువు ని చేరుకున్నది. 

ఈ సంభవం జరిగినది ఒక తులా మాస  చతుర్దశి రోజు.  తనకు సహాయం చేసి కాపాడినందుకు కృతజ్ఞతగా తాను

ఆనాడు నువ్వులనూనెలో

నివసించి ప్రజలకు శుభాలు కటాక్షిస్తానని మహాలక్ష్మి మాట యిచ్చినది .

తులా మాస కృష్ణ పక్ష 

చతుర్దశినాడే  దీపావళి.

అమవాస్య తిధి కొన్ని సమయాల్లో వచ్చినా 

చతుర్దశి వున్న సమయమే

నరక చతుర్దశి గా , దీపావళిగా ఉత్సవాలు జరుగుతున్నవి. 

అంతేకాదు, ఆనాడు కుంకుళ్ళలో ,సీకాయ్ పొడిలో సరస్వతీదేవి, కుంకుమలో

పార్వతీదేవి , చందనం లో భూదేవి  ఆవాహనమైవుంటారని ఐహీకం. గంగాస్నానం చేసి  నుదుట కుంకుమ, చందనం పెట్టుకోవడంతో 

ముగ్గురు దేవిలతో పాటు భూదేవి  అనుగ్రహం పొందడమౌతుంది.


 🪔దీపావళి నాడునూతన వస్త్రధారణ చేస్తే (ఆనాడు  కొత్త వస్త్రాలు కొనుక్కోలేని వారు ఉన్నంతలో

శుభ్రమైన వస్త్రాలు ధరిస్తే కూడా చాలు) 

శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది అని తెలియచేస్తోంది

దీపావళి మహాత్యం. 

అలంకార ప్రియుడైన 

మహావిష్ణువు కి నూతన

వస్త్రాలు ప్రీతి కదా..

నూతన వస్త్రాలు ధరించడం ద్వారా

మహావిష్ణువు కటాక్షం కూడా పొందేము. 

 

🪔సాధారణంగా  క్రొత్త దుస్తులు ధరించగానే, పెద్దవారి ఆశీర్వాదాలు, తల్లి తండ్రుల ఆశీర్వాదాలు తీసుకుంటాము. అటువంటి అలవాటు లేని వారు కూడా దీపావళి నాడు ఆరంభించండి .

ఎందుకంటే ఆనాడు  ఆలా ఆశీర్వాదాలు తీసుకున్న వారిని  హరి..హరులు ఇద్దరి సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వాదాలు లభిస్తాయని శాస్త్రం వివరించింది. 

పెద్దవారి ఆశీర్వాదం నారాయణుని ఆశీర్వాదమని,  తల్లి తండ్రుల ఆశీర్వాదం

పరమేశ్వరుడే ఆశీర్వదించినట్లని 

అంటారు.


🪔తరువాత,తమ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని పూజించాలి.

వంశావళిని కాపాడేది ఆ

దేవతలే. 


🪔పిదప  ప్రసాదం,  తీపితోనే ఆరంభం.  ఏదైనా ఒక 

తీపి వస్తువుగాని, ఒక  చిటికెడు

చక్కెరగాని మనకి వీలైనది నోట్లోవేసుకోవాలి. అలాగే మన పెద్దవారి చేతుల మీదుగా ఆ తీపిని తీసుకుని

తినాలి. ఎందువలన అనగా దీపావళి రోజున  తీపిగాని ,ఇతర ఫలహారాలు, ఏది తిన్నా అందులో అమృతం కలసి

వుంటుంది అని భవిష్యత్

పురాణం , పద్మ పురాణం తెలుపుతున్నవి. 


🪔ఆ తరువాత బాణసంచా కాల్చాలి. కాంతి ..శబ్దం   రెండూ పరస్పరం అంటిపెట్టుకునే వుంటాయి. 

హరి హరులు ఒకరే అని మీరు గ్రహించే వుంటారు.

ఆ తత్వాన్ని వివరించేది

కాంతి..శబ్దాలతో కూడిన టపాకాయలు,మతాబులు మొదలైనవి. నందీశ్వరుని మద్దెలగా మ్రోగే పేలుడు టపాకాయలు, గరుత్మంతుని రెక్కల కదలిక కు వెలువడే ప్రకాశం వలె ప్రకాశించే  మతాబులు అన్నీ దైవాంశాలకి సంబంధించినవే.


🪔కాని బాణసంచా కాల్చేప్పుడు అగ్ని ప్రమాదాల విషయంలో జాగ్రత్తవహించి టపాకాయలను

కాల్చి ఆనందించండి.


🪔దీపావళి నాడు ఎన్ని రకాల

ఫలహారాలు తిన్నా  ఒక  లేహ్యపువుండ అని చెప్పబడే  ఔషధ వుండను తినడం   అత్యవసరం

అని అంటారు .

పాలకడలి చిలికినప్పుడు 

అమృతకలశం తో ఉధ్భవించినవాడు ధన్వంతరీ.  మహావిష్ణువు

అంశ అయిన ధన్వంతరీ 

యే ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని కాపాడేవాడు. 

దీపావళీ లేహ్యంలో ధన్వంతరీ అంశ కలిగినందున, లేహ్యం తినడం మంచిదని ఐహీకం.


🪔గంగా స్నానం నుండి దీపావళి లేహ్యం దాకా 

అన్ని ఐహీకముల వలన

శ్రీ శివ మహా పురాణము

 *🌹 . శ్రీ శివ మహా పురాణము - 267 🌹* 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴* 

62. అధ్యాయము - 17


*🌻. సతీ కల్యాణము -2 🌻*


రుద్రుడిట్లు పలికెను -


ఓ సృష్టి కర్తా! నీతో మరియు నారదునితో గూడి నేను స్వయముగా ఆతని ఇంటికి వెళ్లగలను. కాన నీవు నారదుని స్మరింపుము (15). ఓ విధీ! నీ మానసపుత్రులగు మరీచి మొదలగు వారిని కూడా స్మరించుము. నేను వారితో, మరియు గణములతో కూడి దక్షుని గృహమునకు వెళ్లెదను (16).


బ్రహ్మ ఇట్లు పలికెను -


లోకాచార పరాయణుడగు ఈశ్వరుడిట్లు ఆజ్ఞాపించిగా, నేను నిన్ను (నారదుని), మరియు మరీచి మొదలగు కుమారులను స్మరించితిని (17). అపుడా మానసపుత్రులందరు నీతో గూడి నేను స్మరించినంతనే ఆనందముతో ఆదరముతో వెను వెంటనే అచటకు వచ్చేసిరి (18). 


శివభక్తా గ్రగణ్యుడగు విష్ణువును రుద్రుడు స్మరించగ ఆయన లక్ష్మీదేవితో గూడి తన సైన్యమును వెంటబెట్టుకొని గరుడుని అధిష్ఠించి వెను వెంటనే విచ్చేసెను (19). తరువాత చైత్ర శుక్ల త్రయోదశీ ఆదివారము ఉత్తరా నక్షత్రము నాడు ఆ మహేశ్వరుడు బయలు దేరెను (20).


ఆ శంకరుడు సర్వ దేవతాగణములతో, బ్రహ్మ విష్ణువులతో, మరియు మహర్షులతో కూడి మార్గము నందు వెళ్లుచూ మిక్కిలి శోభిల్లెను (21). 


దేవతలకు శివగణములకు, ఇతరులకు వెళ్లుచుండగా మార్గము నందు గొప్ప ఉత్సాహము, మనస్సులో పట్టరాని ఆనందము కలిగెను (22).


 గజము ,గోవు , వ్యాఘ్రము, సర్పములు, జటాజూటములు, మరియు చంద్రకళ అనునవి శివుని సంకల్పముచే యోగ్యమగు భూషణములుగా మారిపోయినవి (23). 


తరువాత శివుడు విష్ణువు మొదలగు వారితో గూడి బలశాలి, యోగశక్తి గలది అగు వృషభము నధిష్ఠించి క్షణకాలములో ఆనందముగా దక్షుని గృహమునకు చేరెను (24). 


అపుడు ఆనందముతో గగుర్పాటు గల దక్షుడు వినయముతో కూడిన వాడై తన బంధువులందరితో గూడి ఆయనకు ఎదురేగెను (25)


దక్షుడు తన గృహగమునకు విచ్చేసిన దేవతలనందరినీ స్వయముగా సత్కరించెను. శ్రేష్ఠుడగు శివుని కూర్చుండ బెట్టి, ఆయన ప్రక్కన మునులందరిని వరుసలో కూర్చుండునట్లు చేసెను (26). 


అపుడు దక్షుడు దేవతలనందరినీ, మరియు మునులను ప్రదక్షిణము చేసి, వారితో సహా శివుని ఇంటిలోపలికి దోడ్కోని వెళ్లెను (27).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

కైవల్యాష్టకం

 *కైవల్యాష్టకం అథవా కేవలాష్టకం*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*1) మధురం మధురేభ్యోఽపి మంగలేభ్యోపి మంగలం !*


*పావనం పావనేభ్యోఽపి హరేర్నామైవ కేవలం !!*




*2) ఆబ్రహ్మస్తంబ పర్యంతం సర్వం మాయామయం జగత్ !!*


*సత్యం సత్యం పునః సత్యం హరేర్నామైవ కేవలం !!* 




*3) స గురుః స పితా చాపి సా మాతా బాంధవోఽపి సః !*


*శిక్షయేచ్చేత్సదా స్మర్తుం హరేర్నామైవ కేవలం !!* 




*4) నిఃశ్ర్వాసే న హి విశ్ర్వాసః కదా రుద్ధో భవిష్యతి !*


*కీర్తనీయమతో బాల్యాద్ధరేర్నామైవ కేవలం !!*




*5) హరిః సదా వసేత్తత్ర యత్ర భగవతా జనాః !*


*గాయంతి భక్తిభావేన హరేర్నామైవ కేవలం !!*




*6)అహో దుఃఖం మహాదుఃఖం దుఃఖద్ దుఃఖతరం యతః !* 


*కాచార్థం విస్మృతం రత్నం హరేర్నామైవ కేవలం !!*




*7)దీయతాం దీయతాం కర్ణో నీయతాం నీయతాం వచః !*


*గీయతాం గీయతాం నిత్యం హరేర్నామైవ కేవలం !!*




*8) తృణీకృత్య జగత్సర్వం రాజతే సకలోపరి !*


 *చిదానందమయం శుద్ధం హరేర్నామైవ కేవలం!!*



*ఇతి కైవల్యాష్టకం అథవా కేవలాష్టకం సంపూర్ణం!!* 


*శ్రీకృష్ణార్పణమస్తు.*


*ఇతి శ్రీ నీలకంఠ గోస్వామీ విరచితం కేవలాష్టకం సంపూర్ణం.*


🕉🌞🌏🌙🌟🚩

దైవము ఇచ్చే అవకాశము

 దైవము ఇచ్చే అవకాశము.....


ఒక ఊరిలో నారాయణ అనే పండితుడు ఉండేవాడు. ప్రజలకు పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. సదాచార సంపన్నుడిగా, నిష్టాగరిష్టుడిగా అందరి మన్ననలూ పొందినవాడు."అతడు పిలిస్తే దేవుడు పలుకుతాడు" అని ఊరంతా చెప్పుకుంటారు. నారాయణ కూడా అంతటి భక్తిశ్రద్ధలు దేవునిపట్ల కనబరిచేవాడు. నిరంతరం దైవనామస్మరణతో తనేంటో తన పూజాపునస్కారా

లేంటో అన్నట్టు ఉండేవాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడుకాదు. తనకు కష్టమొచ్చినా, సుఖమొచ్చినా దేవుడితోనే చెప్పుకునేవాడు. మొత్తానికీ ఊరందరిదీ ఒకదారి ఉలిపిరి కట్టది ఒకదారి అన్నట్టు బ్రతకసాగాడు.


ఒకనాటి ఉదయం... ఆ ఊరి కరణం నారాయణ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఆ రోజు మౌనవ్రతంలో ఉన్న నారాయణ తలుపు తీసి ఏమిటి అన్నట్టు చూసాడు."స్వామీ వాతావరణం బాగాలేదు. గాలివాన వచ్చేలా ఉంది. ఊరికి వరద ముప్పు ఉందని భయపడుతున్నాం. కనుక, తమరు త్వరగా కాసిని సామాను సర్దుకుని సురక్షిత స్థలానికి బైలుదేరండి" అని ఆందోళనగా చెప్పాడు కరణం. నారాయణ ఆ మాటలకు చీమకుట్టినట్టు కూడా చలించలేదు. గోడకు ఉన్న దేవుడి పటాన్ని చుపిస్తూ "అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. భయంలేదు" అన్నాట్టు సైగచేశాడు. కరణానికి ఏమీ అర్ధం కాక, బుర్రగోక్కుని త్వరగా తెమలండి" అనేసి, మిగతావారిని హెచ్చరించడానికి వెళ్ళిపోయాడు.


అతడెళ్ళిన కాసేపటికి ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. చూస్తుండగానే కుంభవృష్ఠిగా మారింది. చెరువులూ, వాగులూ నిండసాగాయి. ఊరిజనం ఎడ్లబళ్ళు కట్టుకుని గుంపులు గుంపులుగా ఊరు వదలి తరలిపోసాగారు.


ఒక బండి నారాయణ ఇంటి ముందు ఆగింది- "నారాయణ స్వామీ! వానపెద్దదైంది. చెరువు కట్టకి గండి పడేలాఉంది. త్వరగా రండి పోదాం" అని అరిచాడో గ్రామస్థుడు. పూజలో నిమగ్నమైన నారాయణ సమాధానం కూడా చెప్పకుండా దేవుడి పటం వైపు ఓ సారి చూసి, తిరిగి పూజలో నిమగ్నమయ్యాడు. ఎడ్లబండి మీద ఉన్న జనం మరికొంతసేపు నారాయణ కోసం కేకలు వేసి, వరదనీటీ ఉదృతి పెరగడంతో కదిలి వెళ్ళిపోయారు.

*తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు  క్రింది లింక్ ద్వారా చేరండి*

https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ

ఊరంతా ఖాళీ అవుతుంది. ఊరిబైట చెరువుకు భయపడ్డట్టుగానే గండి పడింది. నీరు ఒక్కసారిగా ఊళ్ళోకి ప్రవేశించి ఇళ్ళను ముంచెత్తసాగింది. నారాయణను ఇంట్లోకి కూడా నీరు ప్రవేశించి క్రమక్రమంగా పెరగసాగింది. అతడు దేవుడి పటం చేతపట్టుకుని రెండో అంతస్తుకు చేరుకున్నాడు అక్కడ నిలబడి భగవధ్యానం చేయసాగాడు అక్కడక్కడా చిక్కుకున్ని ఉన్న జనాన్ని, వీలైతే పశువుల్ని పడవల్లోకి ఎక్కించి తరలించసాగారు ఊరిపెద్దలు.


ఒకపడవ నారాయణ ఇంటి ముందుగా పోతుంది. వాళ్ళు నారాయణను చూసి, "స్వామీ! రండి పడవలో తీసుకుపోతాం" అని కేకలు వేశారు. దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్న నారాయణ అప్పటికీ చెలించలేదు. చేతిలో ఉన్న దేవుడి పటాన్ని వారికి చూపిస్తూ "నాకేం భయం లేదు" అన్నట్టూ సైగ చేశాడు. వారికి అతడేమంటున్నాడో అర్ధం కాలేదు. పడవ వెళ్ళిపోయింది. వరద పోటేత్తింది. ఊరు మునిగి పోయింది. రెండో అంతస్తులోకి కూడా చొచ్చుకు వచ్చిన నీరు నారాయణను లాక్కెళ్ళింది. వరద నీటిలో కొట్టుకుపోతూ అతడు ఊపిరాడక మరణించాడు.


అలా చనిపోయిన నారాయణను దేవదూతలు పట్టుకుపోయి, భగవంతుడి సభలో ప్రవేశపెట్టారు. నారాయణకు తాను చనిపోయిన సంగతి అర్ధమైంది.


 తీవ్రమైన దుఃఖంతో పాటూ దేవునిపై అమితమైన ఆగ్రహం కలిగింది. దూతలు అతడ్ని దేవుడి ముందు నిలబెట్టగానే తన అక్కసునంతా వెళ్ళగ్రక్కుతూ, " దేవుడా! నీవే దిక్కని నమ్మానే? ఆపద్భాంధవుడవని కీర్తించానే? కానీం నువ్వేం చేశావు? నమ్మి నానబోసుకుంటే పులిసి పుచ్చిపోయినట్టు చివరికి దిక్కూ మొక్కూ లేకుండా చావాల్సి వచ్చిందే? భక్తుడి పట్ల దేవుడిగా నీకున్న భాద్యత ఇదేనా?" అని నిష్టూరమాడాడు.


నారయాణ మాటలు విని దేవుడు ఆశ్చర్యపోయాడు."అదేంటి? నువ్వెలా చనిపోయావు? నిన్ను రక్షించడానికి నేను మూడు అవకాశాలు కల్పించాను కదా?" అని అడిగాడు. నారాయణ అమాయకంగా, మూడు అవకాశాలేంటి?" అన్నాడు. దేవుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో గ్రహించి నారాయణపై మండిపడ్డాడు.


 "మార్ఖుడా! నా భక్తుడవనే ప్రేమతో నిన్ను రక్షించడానికి నీకు మూడు అవకాశాలు ఇచ్చాను. ఒకసారి కరణాన్ని పంపించాను. రెండోసారి ఎడ్లబండి పంపించాను. మూడోసారి పడవను పంపించాను. అయినా అవేమీ నువ్వు గ్రహించలేదు. దేవుడంటే కిరీటం పెట్టుకుని, శంఖుచక్రాలు పట్టుకుని గుర్రమెక్కి రాడు. నిన్ను రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే అని గ్రహించాలి".

నారాయణ సిగ్గుతో తలవంచుకున్నాడు.

సచ్చిదానందం* టెలిగ్రామ్ లింక్

 *సచ్చిదానందం*

టెలిగ్రామ్ లింక్

https://t.me/Teluguvelugu2/35

తినడం, పనిచేయడం, నిద్రపోవడం... మనిషే కాదు- జంతువులూ చేస్తాయి. ఆహారం కోసం తిమింగిలం లాంటి సముద్ర జీవులు వందలు, వేల మైళ్ల దూరం  ప్రయాణం చేస్తాయి. అడవి జంతువులు ఆహారం కోసం వేటలో ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతాయి. జీవులు బతకడం, బతికి ఉండటం కోసం ఒక యుద్ధమే చేస్తాయి.

మనిషి అందరికీ భిన్నమైనవాడు. మనిషిలో దివ్యత్వం ఉంది. అది కంటికి కనబడకుండా ఉంది. నిక్కచ్చిగా చెప్పాలంటే- అనుభవానికి మాత్రమే తెలుస్తుంది.

మొదటిది, మనిషిని కదిలించే చైతన్యం. మనిషిని సుఖస్థితిలో ఉంచే ఆనందం. ఇవే పరమావధిగా నిలిచే జీవనసత్యం. వీటిని కలిపి వేదాంత పరిభాషలో సత్తు, చిత్తు, ఆనందం అంటారు. వెరసి సచ్చిదానందం అని పేరు.

ఈ సచ్చిదానందం గొడుగు కిందకు సర్వజీవులూ వస్తాయి. ఇవి మనిషికి తప్ప ఏ ఇతర జీవికైనా అనుభవంలో ఉన్నా- జ్ఞానంలోకి రావు.

సచ్చిదానందంలో మునిగి తేలుతున్నాడు ఆ మహానుభావుడు అంటారు. సచ్చిదానందం ఉంటే ఆహారం అక్కరలేదా? సచ్చిదానందం మనసుకు ఆహారం. శరీరానికి ఆకలి తీర్చేది సాధారణ భోజనం. మనసు ఆకలిని తీర్చగలిగేది సచ్చిదా నందమే!

మనిషి తన తల్లిదండ్రులు పెట్టిన పేరు మరిచిపోయినా, దైవం తనకు ప్రసాదించిన సహజదశ అయిన సచ్చిదానంద స్థితిని మరిచి పోకూడదు.

చైతన్యం లేకపోతే మనిషి చనిపోయాడంటారు. ఆనందం లేకపోతే మనసు చనిపోయిం దంటారు. సత్యమే లేకపోతే శూన్యంలో పడి కొట్టుకుంటున్నాడంటారు.

తాను ఎప్పుడూ సచ్చిదానంద స్వరూపమేనని తెలుసుకున్న తరవాత అతడిలోని దివ్యత్వం బయటకు వస్తుంది. లోకానికి అతడు పూజ్యనీయుడు అవుతాడు అంటారు స్వామి వివేకానంద.

పక్షికి, పాముకు, గొర్రెకు సత్యం గురించి తెలియదు. చైతన్య ఆనందాల గురించి అనుభవంలో ఉండవచ్చు. కాని వాటికి ఆ జ్ఞానం ఉండదు. అయినా అవి సచ్చిదానందం కారణంగానే బతుకుతున్నాయి. సచ్చిదానందం లేకుండా ప్రకృతి లేదు. ప్రపంచం లేదు. సచ్చిదానందమే విశ్వ సహజరూపం.

మనిషిలో సత్యం ఉంది. మనిషి సత్యం కాడు. మనిషిలో చైతన్యం ఉంది. మనిషి చైతన్యం కాడు. మనిషిలో ఆనందం ఉంది. మనిషి ఆనందం కాడు.

ఆధ్యాత్మిక ప్రయాణం మొత్తం పూర్తి చేసిన తరవాత మనిషి తాను తెలుసుకున్నది ఈ సత్య, చైతన్య, ఆనందం అనే మూడు విషయాలే. సచ్చిదానంద స్వరూపుడైన దైవాన్ని కొలుస్తూ, తానుకూడా సచ్చిదానందంలో ఒక భాగమని మనిషి గ్రహిస్తాడు. గ్రహించాలి.

నిజానికి సచ్చిదానందం పేరుతో ఉన్న మూడూ ఒకటే. వాటిని కలిపి ఉపనిషత్తులు ‘సత్యం’ అని చెబుతున్నాయి. ఆ సత్యాన్ని మనిషి గ్రహించాలి. సత్యం అనే చెట్టుకు మొలిచిన రెండు కొమ్మల్లాంటివి చైతన్య ఆనందాలు.

వీటి గురించి తెలుసుకోకపోతే మనిషి జీవించలేడా, తెలుసుకునే తీరాలా అంటే- తెలుసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అజ్ఞానమయమైన జీవితాలు వెయ్యింటిని గడపవచ్చు. వాటిని అంతం చేసే జ్ఞాన జీవితం కావాలంటే సచ్చిదానందం గురించి తెలుసుకుని, అనుభూతి చెంది దివ్యమైన మానవుడనిపించుకోవాలి. ఆ లక్ష్యం సాధించడానికే మనం ఈ భూమ్మీద ఉన్నాం!(ఈనాడు అంతర్యామి)

✍🏻ఆనందసాయి స్వామి

దీపావ‌ళి

 దీపావ‌ళి

దీపాల్లో ఏ నూనె శుభ‌క‌రం? 


జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీ దేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది. అటువంటి పుణ్య దిన సాయంసంధ్య కాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు దీపాలు వెలిగిస్తారు. ఈ దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి వుంది. అయితే దీపాన్ని నేరుగా అగ్గి పుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి. 


దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు. 


ఏ నూనెతో దీపారాధన చేయాల‌న్న అనుమానం అంద‌రిలోనూ క‌లుగుతుంది. ఓ పక్క ఆవునేతితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం. ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవు నెయ్యిలో నువ్వుల నూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.  


వేప నూనె రెండు చుక్కలు, ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది. నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం. అయితే వేరుశెనగ నూనెను దీపారాధనకు వాడరాదు.  


ఈ దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా మీ అంద‌రి జీవితాల్లో వెలుగులు నిండాల‌ని ఆ ల‌క్ష్మిదేవి మాత‌ను ప్రార్థిస్తూ ముందుగా మీ అంద‌రికి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

విషమిత్యాహుః

 *న విషం విషమిత్యాహుః బ్రాహ్మస్వం విషముచ్యతే!*

*విషం ఏకాకినం హన్తి బ్రహ్మస్వ పుత్ర పౌత్రకమ్!!*

 విషం అసలు విషమే కాదని బ్రాహ్మణ సొమ్మే విషమని.

విషం తిన్నవారిని మాత్రమే చంపుతుంది

 బ్రాహ్మణ ధనం పుత్ర పౌత్రుల వంశం ను చంపుతుంది

ధార్మికగీత - 70*

 *ధార్మికగీత - 70*

                                    


      *శ్లో:  విశ్వా౽మిత్రాహి పశుషు ౹*

             *కర్దమే విషమ  స్థలే ౹*

             *అంధే  తమసి వార్ధక్యే ౹*

             *దండం దశగుణం భవేత్ ౹౹*


తరుమగ పక్షులన్ , పయికి

          దాడి నొనర్చెడి కుక్కగొట్టగన్ ,

యరిజను గొట్టగా , మసలు

         వ్యాలము గొట్టగ , జంతు గొట్టగన్,

బురదను లోతు జూడగను , 

          పోయెడిదారిని నెంచి జూడగన్ , 

విరివిగనున్న చీకటిలొ

          వెంటగ నుండను ,యంధు కూతగన్ ,

కరమున నుండ వృద్దులకు ,   

           కారణమై భువినుండు నావిధిన్ 

నరయగ దండమే దశ గు 

           ణంబుగ నుండును నెల్ల వేళలన్ 


✍️గోపాలుని మధుసూదన రావు

శ్రీమద్భాగవతం - 68 వ భాగం

 శ్రీమద్భాగవతం - 68 వ భాగం



శకటాసుర సంహారం :


కృష్ణ లీలలు అన్నీ కూడా మనకు జీవితంలో చేయి ఇచ్చి పైకి ఎక్కించే లీలలు. శకటాసుర సంహారం చాలా చిన్న ఘట్టం. ఎంత వినినా వేదాంతము వేదాన్తముగా ఎప్పుడూ లోపల నిలబడదు. పక్క ఒక ఆలంబనము ఉండాలి. మీరు అన్నమును అన్నముగా తినలేరు. పక్కన కూరో, పచ్చడో, పులుసో ఉండాలి. అలాగే వేదాంతము ఎప్పుడూ కథగా ఉండాలి. అటువంటి కథ లేకపోతే ఈశ్వరుడు లీల చేస్తాడు. పరమాత్మ చేసే లీలలు కర్మతో చేసినవి కాదు. అందులో ఏదో పరమార్థం ఉంటుంది. ఆయన లీలల వెనక ఎంతో ఔచిత్యం ఉంటుంది. 


ఒకనాడు కృష్ణపరమాత్మ బోర్లా పడ్డాడు. పిల్లలను మొదట్లో పడుకోపెట్టినపుడు ఎటు పడుకున్నవాడు అటే పడుకుంటాడు. పసిపిల్లవాడు మొదట చేసేపని బోర్లాపడడం. పిల్లవాడు బోర్లాపడితే ఆ రోజున యింట్లో అదొక పెద్ద ఉత్సవం. బోర్లాపడ్డాడు అని బొబ్బట్లు మొదలయిన పిండివంటలు వండుకు తినేస్తారు. 


కానీ యశోద అలా చెయ్యలేదు. ముత్తైదువలను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలను ఇచ్చింది. వాళ్లకి చీరలు, రవికల గుడ్డలు పెట్టింది. బ్రాహ్మణులను పిలిచి వారికి గోదానము చేసింది. ఈశ్వరునికి అభిషేకం చేసింది. యశోద అన్నిటికి దైవం వైపు చూస్తోంది. యశోద అంటే యశస్సును ఇచ్చున్నది అని అర్థము. కీతి ఎటు పక్కనుంచి వస్తుందో జీవితము ఎటువైపు నడవాలో యశోదవైపు నుంచి తెలుస్తుంది. పిల్లాడు బోర్లాపడితే మనం బొబ్బట్లు వండుకు తినడం కాదు! శివాలయమునకు వెళ్ళి అభిషేకం చేయించాలి. లేదా రామాలయమునకో, కృష్ణాలయమునకో వెళ్ళి తులసి పూజ చేయించాలి. నీ మనవడు బోర్లాపడే అదృష్టం ఈశ్వరుడు నీకు సమకూర్చినాడు. పిల్లవాడు వృద్ధిలోకి రావడమును ఈశ్వరానుగ్రహంగా భావించాలి. నందుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంటికి అందరూ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యాదవుల ఐశ్వర్యం అంతా పశువులు, పాడి. వాళ్ళ ఐశ్వర్యం అంతా పాలకుండలు, పెరుగు కుండలు,నేతి కుండలు, అరటి పళ్ళ గెలలు మొదలయినవన్నీ పెట్టారు. బండికి కూడా ఒక తోరణం కట్టేశారు. అక్కడే ఒక మంచం వేశారు. ఆ మంచం మీద ఒక పరుపు వేశారు. ఆ పరుపు మీద కృష్ణుడిని పడుకోబెట్టారు. ఉత్సవం అంతా కృష్ణుడు బోర్లాపడ్డాడు. కాబట్టి అతడికోసం చేస్తున్నారు. కానీ ఉత్సవం వేడుకలో పడి ఈయనని మరచిపోయారు. ఈయనకు ఆకలి వేసింది. పడుకున్న పిల్లాడికి కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు. ఆయన పక్కనే బండి ఉన్నది. ఆయనది చిన్ని అరికాలు. దానికి పెసర గింజలంత చిన్నిచిన్ని వేళ్ళు. అందులోనే శంఖం, చక్రం, నాగలి, అమృతపాత్ర మొదలయిన దివ్యచిహ్నములు. అటువంటి కాలితో బండిని ఒక్క తన్ను తన్నాడు.


ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. దాని చక్రములు, ఇరుసు అన్నీ ధ్వంసం అయిపోయాయి. అక్కడి నుండి క్రిందపడిపోయి తుత్తునియలయిపోయాయి. దీనిని చూసి అక్కడ ఉన్న గోపకాంతలు, యశోద, నందుడు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. పిల్లవాడిని చూస్తే చాలా చిన్నవాడు. బండి చాలా పెద్దది. ఆకాశమునకు ఎగిరిపోయేలా బండిని కాలితో తన్నడమేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అపుడు యశోద పిల్లవాడిని తీసుకుని సముదాయించింది. ‘అయ్యో! నాన్నా! ఆకలి వేసిందా? నీ కాలు బండికి తగిలిందా? కాలేమీ నొప్పి పెట్టలేదు కదా! అని పిల్లాడిని ఎత్తుకుని పాలిచ్చింది. అది అమ్మ హృదయం. అది మాతృత్వమునకు ఉన్న గొప్పతనం. మాతృత్వమునందు దేవతాంశ ప్రవేశించి పరాభట్టారికరూపమై నిలబడినది. అందుకని స్త్రీకి అంత గొప్పతనం వచ్చింది. కృష్ణుడు ప్రదర్శించిన లీల చాలా చిన్నది. దీనిలో వున్న అంతరార్థమును మనం గ్రహించేటందుకు ప్రయత్నించాలి. మనకు ఈ శరీరమును భగవంతుడు ఇచ్చాడు. శరీరము మనం నిర్మించుకున్నది కాదు. అన్నింటిని ‘నావినావి’ అంటారు. ‘నావి’ అని చూపించిన ఈ శరీరములో ఏ ఒక్కటీ తనది కాదు. ఏదీ తాను తేకపోయినా ఈశ్వరుడు దీనిని నిర్మాణం చేశాడు. ఈశ్వరునిచే ఇంత గొప్పగా నిర్మింపబడి ప్రసాదింప బడిన ఈ దేహము దేనికొరకు? ఇది శకటము. ఈ బండిని ఎక్కి మీరు తీరమును చేరగలరు. కానీ మనము ఈ బండినెక్కి తీరమును చేరడం లేదు. ఎందువలన? దీనిని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు. కానీ మీరు లక్ష్యం వైపు వెళ్ళడం లేదు. ఈ మానవ శరీర శకతంలో కూర్చుని తాను పొందుతున్న శుభములు ఈశ్వరానుగ్రహములని తలంపడు. తలంపక అన్నీ కూడా ‘నా ప్రజ్ఞ’ అంటూ ఉంటాడు. కానీ ‘ఈ పనులను ఈశ్వరుడు చేయించాడు. అందువల చేయగలిగాను’ అనడు. అలా జీవుడు ఈశ్వరానుగ్రహము తీసివేసి మాట్లాడుతాడు. ఈశ్వరానుగ్రహము వలన తాను ఆపనులను చేయగలుగుతున్నాననే భావన మనసులో ఉండాలి. కానీ అటువంటి భావన ఉన్నప్పుడు మాత్రమే ఈ శకటమును ఎక్కి లక్ష్యమును చేరతారు. లేకపోతే యిది ‘శకటతి యితి శకటః’ అవుతుంది. శం అనగా సుఖము, ఈశ్వరుడు. ఈ శకటమును నీవు ఎందుకు ఎక్కావు తెలుసుకుంటే దానిని ఈశ్వరానుగ్రహమని భావించడం ప్రారంభిస్తాడు. ఈశ్వరానుగ్రహం తప్పు పనులు చేయించదు. సాత్త్వికమైన ప్రవృత్తిలోనికి తిప్పేస్తుంది.


అనగా యిప్పుడు నీవు ఎక్కిన శకటమునకు ఎవరు సారధిగా ఉన్నాడు? ఈశ్వరుడు. స్థిత ప్రజ్ఞుడయిన సారధి శకటమును వేయికళ్లతో చూసి నడిపిస్తాడు. అపుడు శకటములో ప్రయాణిస్తున్న జీవునికి ఏ ప్రమాదము కలుగదు. సారధియేబుద్ధి. ఆ బుద్ధిని నీది అనకుండా దానిని కృష్ణ పాదముల దగ్గర పెట్టేయాలి. తెలిసికాని, తెలియక కాని పరమభక్తితో భాగవతంలో దశమ స్కంధార్గత శకటాసుర వృత్తాంతమును విన్నంత మాత్రం చేత శకటాసురుడు – జీవుడు ప్రయాణిస్తున్న యీ బండి రాక్షసుడు. ఎప్పుడు? ‘యిదే నేను – అన్నీ నేను చేస్తున్నాను’ అనే భావన ఉన్నప్పుడు. కృష్ణుడు జగదాచార్యుడై వచ్చాడు. అజ్ఞానం బాగా ఉంటుంది కాబట్టి దానిని చీల్చదానికి అర్థరాత్రి పుట్టాడు. ఇపుడు ఆయనేమి చేశాడు? ‘మనః మనః’ అనకురా, ‘నమః నమః’ అను అని చెపుతాడు. అపుడు జీవుడు కర్మచేత, భక్తిచేత, జ్ఞానము వైపు నడుస్తాడు. ఈవిధంగా శకటా సుర సంహారం పైకి చిన్న లీల. అంతరమునందు స్వామి ఎంత పెద్ద రహస్యమును దాచారో చూడండి. 


తృణావర్తోపాఖ్యానం :


క్రుశ్ని చేష్టితముల వెనక ఒక గొప్ప మర్మం దాగి ఉంటుంది. దానిని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్లకి జీవితంలో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక ఉత్తమమైన దశానిర్దేశం జరుగుతుంది. అటువైపుగా ప్రయాణించడం చేత వారు మనుష్య జీవితంలో చేరుకోవలసిన గమ్యమును చేరుకుంటారు. కథా శ్రవణం చేతకూడా భాగవతం మనిషిని ఉద్ధరిస్తుంది. పరీక్షిత్తు శుకమహర్షి చెప్పిన బాహ్యకథనే విన్నాడు. విని మోక్షమును పొందాడు కదా! జీవితంలో అసలు భాగవతం వినడం కాని, చదవడం కాని చాలా గొప్ప విషయములు. భాగవతమును విన్నంత మాత్రం చేత వాని జీవితం కొన్ని కోట్ల జన్మల తరువాత ఒక మలుపు తిరిగింది అని లెక్క.


ఒకనాడు నందవ్రజంలో పక్కన రోహిణి వుండగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒడిలో కూర్చోపెట్టుకుని ఆనందంగా ఉంది. హఠాత్తుగా ఒళ్ళో వున్న కృష్ణుడు చాలా బరువయిపోయినట్లుగా అనిపించాడు. పర్వత శిఖరం ఒడిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. పిల్లవాడు ఇంత బరువుగా వున్నాడేమిటి? అనుకుని పిల్లవాడిని పక్కన దింపింది. అక్కడికి కంసుని పనుపున ఒక రాక్షసుడు వచ్చాడు. అతని పేరు తృణావర్తుడు. అతడు పెద్ద సుడిగాలి రూపంలో వస్తున్నాడు. ఆ రావడంలో దుమ్ము పైకి లేచిపోయింది. ధూళి కన్నులలో పడిపోయింది. ఇంతకూ పూర్వం ఎప్పుడూ అసలు కష్టం అంటే ఏమిటో తెలియని శ్రీమన్నారాయణుని అవతారమయిన చిన్ని కృష్ణుని కళ్ళల్లోకి ధూళి పడిపోయింది. అందరూ కన్నులు మూసి వేసుకుని ఏమయింది అని చూసేలోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మను అపహరించి తీసుకుపోయాడు. కేవలం కృష్ణుని సంహరించడమే అతని లక్ష్యం. ‘ఆవర్తము’ అంటే త్రిప్పడం. గిరగిర త్రిప్పుతూ కృష్ణుడిని ఆకాశంలోకి తీసుకు వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపి క్రింద పడెయ్యాలని అతని ఉద్దేశం. సుడిగాలి గుండ్రంగా తిరుగుతూ ముందుకు నడుస్తుంది. గుండ్రంగా తిరుగుతూ కృష్ణుడిని తనతో పాటు పైకెత్తుకుని వెళ్ళిపోయింది


ధర్మ ప్రచారం

మా