6, జులై 2023, గురువారం

కౌసల్యా సుప్రజా రామా'

 *కౌసల్యా సుప్రజా రామా' అంటూ శ్రీవేంకటేశ్వర సుప్రభాతం మొదలవ్వడంలో అంతరార్ధం ఏమిటి? శ్రీనివాసుని స్తుతిలో రాముని ప్రస్తావన ఎందుకు వచ్చింది?*


🙏🙏🙏🙏🙏🙏🙏


శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలోని మొదటి శ్లోకమైన 'కౌసల్యా సుప్రజా రామా' అనేది వాల్మీకి రామాయణంలోని శ్లోకం. యాగ సంరక్షణ కోసం తనతో తీసుకు వెళ్తున్న ఆ సుకుమారుడైన రాముణ్ణి నిద్ర మేల్కొలుపుతూ విశ్వామిత్ర మహర్షి చెప్పిన శ్లోకం ఇది. ఇక ఈ సుప్రభాతంలోని రెండవ శ్లోకం 'ఉత్తిష్టోత్తిష్ట గోవిందా అంటూ కృష్ణుణ్ణి నిద్రలేపుతున్నట్టు ఆ తరువాత 'ఉత్తిష్ట గరుడధ్వజ' అంటూ విష్ణువుకు మేలుకొలుపు పాడుతున్నట్టూ ఉంటుంది. 24వ శ్లోకంలో 'మీనాకృతే' అంటూ మత్స్యావతార వర్ణన కూడా ఉంది.


దీని అర్ధం ఏమిటంటే ఈ దశావతారాలనూ వహించిన సాక్షాత్ ఆ శ్రీమహావిష్ణువే ఈ వేంకటేశ్వరస్వామి అని పునఃప్రతిపాదించడానికే. తిరుమల కలియుగ వైకుంఠం. ఆ వేంకటేశ్వరస్వామి వైకుంఠం నుంచీ మనందర్నీ తరింపజేఒయడానికి వచ్చిన ఆ మహా విష్ణువే కాబట్టీ ఆయన అవతారాలన్నీ వేంకటేశ్వరస్వామికీ ఆపాదించవచ్చు

*సర్వేజనాసుఖినోభవంతు*🙏

భగవాన్

 భగవాన్ (శ్రీకృష్ణుడు) కుల భేదాలను (గీతలో) ఖండించలేదని కొందరు అంగీకరిస్తారు, అయితే భగవంతుని ప్రకారం, కులం అనేది పుట్టుకపై ఆధారపడి ఉండదు కానీ వ్యక్తుల వ్యక్తిగత లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. 

మద్దతుగా వారు గీత నుండి ఈ పంక్తిని ఉటంకించారు. 

"కాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణ-కర్మ-విబాగసః".



ఒక వ్యక్తిని వేరు చేసే లక్షణాలను మనం ఎప్పుడు తెలుసుకుంటాం? 

ఏ వయస్సులో అతను తన స్వభావాన్ని బయటపెడతాడు? 

మనం దీన్ని ఎలా గుర్తించాలి మరియు అతని లక్షణాలకు అనుగుణంగా ఉండే వృత్తికి అవసరమైన విద్య మరియు శిక్షణను ఎలా అందించాలి? 

ఉదాహరణకు, ఏడెనిమిదేళ్ల వయసులో గురుకులంలో చేరాల్సిన బ్రాహ్మణుడిని పిలవడం తీసుకోండి.


అతని విద్య పన్నెండు సంవత్సరాల వ్యవధిని కలిగి ఉంటుంది; 

దీని తర్వాత మాత్రమే అతను తన వృత్తికి అర్హత పొందుతాడు, ఇందులో ఇతర విషయాలతోపాటు, బోధన ఉంటుంది. 

ఒక వ్యక్తి యొక్క వృత్తి, అతని పాత్ర మరియు లక్షణాలు ఏర్పడిన తర్వాత అతని వృత్తిని స్థిరపరచినట్లయితే, అది అతని యవ్వన సంవత్సరాలు వృధా అవుతుంది. 

ఒకవేళ అతను లేటు వయసులో ఉద్యోగం లేదా వ్యాపారం నేర్చుకుంటే అది తనకే కాదు సమాజానికి కూడా నష్టం. 

మనం నిరంతరం పనిలో నిమగ్నమై ఉండాలని, ఒక్క క్షణం కూడా నిశ్చలంగా ఉండకూడదని భగవంతుడు పదే పదే చెబుతున్నాడు. 

అప్పుడు ఎలా వౌ

చేయరాని పనిని చేయకూడదు.

 కర్తవ్యమేవ కర్తవ్యం 

ప్రాణైః కంఠగతైరపి!

అకర్తవ్యం న కర్తవ్యం 

ప్రాణైః కంఠగతైరపి!!


కంఠములో ప్రాణం ఉన్నంత వరకు చేయవలసిన కర్తవ్యమును చేసియే తీరవలెను. ప్రాణములు గొంతుదాకా వచ్చి, ప్రాణములు పోయే స్థితిలో ఉన్నప్పటికినీ చేయరాని పనిని చేయకూడదు.


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

వరంవిరోధోపి సమం మహాత్మభిః

 గురు  శిష్యుల  లడాయి!

------------------------------------ 

               

               పండిత లోకంలో  " శిష్యాదిచ్ఛేత్పరాజయం"- అనే  ఆభాణకం  ప్రచారంలో  ఉంది. అంటే  శిష్యుని చేతిలో గురువు పరాజయాన్ని  కోరుకుంటాడని.  ఉత్తమ గురువు  విద్యలో  తనకన్నా తన శిష్యుని  గొప్పవానిగా, సమున్నతునిగా , చూడగోరుతాడని,

దీనిభావం. శిష్యుడు అల్పుడై  యెదిరిస్తేమాత్రం  చీల్చి చెండాడుతాడు. 


                                     గురువుగా  చెళ్ళపిళ్ళవారి  పరిస్థితిమాత్రం చిత్రాతి  చిత్రమైనది.ఈవిషయంలో  ఆయనకన్నా  అదృష్టవంతుడూ లేడు,  ఆయనకన్నా  దురదృష్టవంతుడూ  కనిపించడు.  


                             తెలుగు వారికి మాత్రమే  స్వంతమైన  అవధాన కళకు  అత్యద్భుతమైన  జనాకర్షణ  కలిగించిన  జంటకవులు

తిరుపతి  వేంకట కవులు   వారిలో చెళ్ళపిళ్ళవేంకటశాస్త్రి యొకరు. వారిశిష్యులలో  ప్రముఖుడు  విశ్వనాథ సత్యనారాయణ. ఆయన తమ గురువుగారిని

గురించి  మహోన్నతంగా  సంభావిస్తూ  యిలాచెప్పుకున్నారు.


           "   అల  నన్నయ్యకు  లేదు  తిక్రనకు  లేదాభోగ  మస్మాదృశుం


              డలఘు  స్వాదు  రసావతార  ధిషణాహంకార   సంభార  దో


              హల  బ్రాహ్మీమయ  మూర్తి   శిష్యుడైనాడట్టి   దావ్యోమ   పే


              శల  చాంద్రీమృదుకీర్తి   చెళ్ళపిళ   వంశస్వామి   కున్నట్లుగన్;


                     ఇందులో  స్వోత్కర్ష  ఉన్నప్పటికీ  


. తనవంటి శిష్యుడుండేభాగ్యం నాడు నన్నయకూ,  తిక్కనకూ

కలుగలేదు చెళ్ళపిళ్ళ వారికి మాత్రమే దక్కిందంటాడు విశ్వనాధ!  ఇలా ఒకవంక  తనగొప్పతనం  చాటుకుంటూనే  గురువుగారి గౌరవాన్ని  ఆకాశమంత  యెత్తు కుపేంచేశాడు. మాగురువుగారు నన్నయ తిక్కనకన్న  గొప్పవాడని  సాటుకున్నాడు. అటువంటి శిష్యుడు దొరికితే  గురువు  కింకేమి కావాలి? అనిపించాడు.  ఇది  మొదటి కోణం!


                              ఇక  రెండో కోణంతోనే  ఉంది సమస్యంతా !  

            

                     చెళ్ళపిళ్ళ వారికి  'ఓలేటి  వేంకట రామ శాస్త్రి'  అనే శిష్యుడుండేవాడు. ఎందుకో  ఆయనకూ  చెళ్ళపిళ్ళ వారికి చెడింది.

"నీవునాగురువువు కానేకాదు పొమ్మన్నాడు ఓలేటి. చెళ్ళపిళ్ళవారికి  మండింది. కాదంటే  ఊరుకుంటాడా ? అద్యతనాంధ్రకవిత్వ ప్రపంచ

నిర్మాతగదా!  వారికి  కోపమొచ్చినా తాపమొచ్చినా 'పద్యాలలోనేకదా!  ఒకసీసాన్ని  గుప్పించి  తనదగ్గర గలసాక్ష్యాలన్నీ  యేకరువు పెట్టారిలా పద్యంమాట యెటున్నా చూచేవారికది వినోదంగా మారింది.


                            సీ:   ఇంజరం బొకసాక్షి- యేనాము తా సాక్షి


                                                పల్లె పాలెంబు  తానెల్ల సాక్షి!


                               ఇపుడు  నీవున్నట్టి- యీపిఠాపురిసాక్షి


                                                      ఏలూరుసాక్షి   నీయిల్లు  సాక్షి


                               వల్లూరు నృపతి  శ్రీ- భాష్య కారులు  సాక్షి


                                                          నూజివీడ్రామచంద్రుండు   సాక్షి


                             మంజువాణీప్రెస్సు- మానేజరొక  సాక్షి


                                                           శంకరుండాతని   సాని  సాక్షి


             తే:      మధున పంతుల సూరయ  బుధుడు సాక్షి


                        యయ్యనఘు,  నన్నసాక్షి  సుబ్బయ్యగారు


                        సాక్షులున్నారు   పద్యంబు  చాలదింక


                       వేంకటేశ్వరు  శిష్యుడవే! నిజమ్ము  !


                                                            

                                        చిత్ర  మైన  విషయమేమిటంటే  యీవిషయంలో  అటూ ఇటూ మధ్యవర్తు లుండటం. చెళ్ళపిళ్ళవారి తరపున వారి  సోదర కవులు  దివాకర్ల  తిరుపతి  శాస్త్రిగారు  ఓలేటిని గట్టిగా మందలించారు. 


                             "  వ్యాకరణంబుఁ జెప్పె ,  నది యంటక పోయిన  పోవుగాక , నీ


                                కీ' కవి'నామ మయ్యనఘుఁడే  కద పెట్టిన   దంతఁ బోక     తా


                                నే కడ  కేగె , నిన్ను గొనియే చనె  నచ్చటి , కట్టివాని  ,  సు


                                శ్లోకు ,  సభాస్థలిన్విడచి  చోరుగతి  న్మెలగంగ    నేమొకో?


                                              "   వేంకటేశ్వరు  పాదంబు  వీడి  పిదప


                                                  నెవని  సేవించితివి?   చెప్పు  మింత యేల?


                                                  యే విషయమీవు  సాధించినావొ    పిదప?


                                                 వ్రాయుమా  వేంకటేశ్వరు  పదము  లాన !


                                    అంటూ  హితవు  చెప్పారు. అయినా   ఇతరుల దుర్బోధలకు  లోగిన  ఓలేటి యామాటలను లేక్క సేయలేదు.

వారి మనసు మారలేదు. ఓలేటి వారికి   వేదుల రామకృష్ణ శాస్త్రి యను మిత్రుడున్నాడు. అతడే  ఓలేటివారికి వెనుక నున్నదన్ను.

" పాఠంచెప్పేవాడు గురువైతే, గుణపాఠం చెప్పేవాడే  శిష్యుడనే" వాదాన్ని నమ్మేవ్యక్తి  రామకృష్ణశాస్త్రి. చెళ్ళపిళ్ళవారికి తమకు మధ్యగల వైరానికి   ఓలేటినొక  అస్త్రంలా  వాడుకోదలచారు.  అందుకే  ఓలేటివారి పక్షాన  చెళ్ళపిళ్ళపై  వారోపద్యాస్త్రాన్ని సంధించారు.


                                              "  ఎట్టొ  చదివితి  మూనాళ్ళ పట్ట పగలు,


                                                    పట్టుమని  రెండు  ముక్కలు  పలుక కున్న,


                                                     తిరుగడిక  నెన్ని  చెప్పిన    గురుడ ననుచు,


                                                     తగులు  కొన్నాడు , నిన్ను  'సైతాను'   లాగు; 


   "-       అనేశాడు.చూశారా !  యెంత     నీచంగా   వ్రాశాడో!   చెళ్ళఫిళ్ళవారిగురించి    ఇంతనీచంగామాట్లాడినా   


               వారిని   గురువుగా   తానేయొప్పుకున్నాడు.


                                              పాపం   చెళ్ళపిళ్ళవారికి   శిష్యులతోనేకాదు.గురువుగారు   చర్లబ్రహ్మయ్యశాస్త్రిగారితో   గూడా     గొడవ     తప్పలేదు.  ఒకసారి గురువుగారిమీద  ఒళ్ళుమండి"గురుడైనన్  హరుడైననేమి?"- అంటూ పద్యంచెప్పారట! కొంతకాలానికి అదే తనకూప్రాప్తించింది. ఆయన శిష్యుడు ఓలేటి గట్టిగానే  యిచ్చుకున్నాడు "శ్రుత పాండిత్యము  దక్క లేనిగురుడు"- అంటూ చెళ్ళపిళ్ళవారిపాండిత్యాన్ని  వేళాకోళమాడాడు. చెళ్ళపిళ్ళ  యేదో  అక్కడాయిక్కడా విని నేర్చుకున్నదే తప్ప డొక్క శుధ్ధిగా చదువుకొన్నవాడు  కాదని దాని సారాంశం!


                            ఏది  యేమైనా " వరంవిరోధోపి  సమం  మహాత్మభిః"- (మహాత్ములతో  విరోధంకూడా మంచిదే)  అనే' భారవి'

వాక్యం మరువరాదు.

                                                                 స్వస్తి!


                    తెలుగు  వెలుగుల  సౌజన్యంతో--🙏🙏🙏🌷🌷💐💐🌷🌷💐💐🌷🌷💐🌷🌷🌷

నన్నెచోడకవి వర్ణనా వైభవం!

 


నన్నెచోడకవి  వర్ణనా వైభవం!


              

                సీ:  శశిబింబ  మణిహేమ  సౌదామినీ  చయో


                                                 త్కరము లన్నియు గూడ నరసి  దెచ్చి ,


                       నవలతా  పుష్ప పల్లవ బిస కోమల


                                                    విభవంబు లన్నియు  వెదకి  తెచ్చి ,


                       కర్పూర  చందన కాశ్మీర  మృగమదా


                                                   మోదంబు  లన్నియు  ముంచి  దెచ్చి  , 


                       పరివాదినీ   శుక పరిపుష్ట  మధుకరా


                                                      రాకంబు  లన్నియు  రాచి  దెచ్చి ,


      ఆ:      హావ భావ  రూప లావణ్య  సారముల్ 


                 త్రిభువనముల  నేర్చి  తెచ్చి,  నేర్పు 


                 సూపఁదలచి   యాడు  రూపజుఁడొనరించె ,


                  నని నుతింప  నొప్పు   నగతనూజ!


               

               ----- కుమార సంభవము-- తృతీయాశ్వాసము-121పద్యం--నన్నెచోడుడు .


      సతిగా  దేహమును చాలించి పార్వతిగా హిమవంతుని యింట జనించిన  యభవుని పత్ని  కాత్యాయని  దిన దిన ప్రవర్ధమానయై  అపురూప సౌందర్యరాసిగా  రూపొందెను. ఆమె యతిలోక మనోహర మైన రూపమును నన్నెచోడుడీ పద్యమున కడు రమ్యముగా వర్ణించినాడు. 


                    బ్రహ్మగారు సృష్టిలోని  అపురూప వస్తు సముదాయములను  యేర్చికూర్చి  యొక లోకోత్తర  సౌందర్యవతి యగు స్త్రీని

సృష్టింప  దలచినాడట. అందుకు పార్వతియే తగినపిల్ల  యని నిర్ణయించి  ఆపదార్ధాలను తెచ్చి యోజన చేశాడట.! ఆసౌందర్య నిర్మాణ సామగ్రి యేదో మనమిపుడు  తెలిసికొందాము. 


                     చంద్ర బింబము,బంగారము మణులు, మెఱపుతీగెలు ,మున్నగు వాని సముదాయమును, నవతలలు ,పుష్పములు ,చిగురుటాకులు ,తామరతూడుల వంటి మృదువైన  వస్తు సముదాయమును , కర్పూరం( పచ్చకర్పూరం) మంచిగంధం ,కస్తూరీ, మొన్నగు సుగంధపరిమళములను , కోకిల ,చిలుక ,తుమ్మెద , మొన్నగువాని ధ్వనులను, తెప్పించి.


                       చంద్రబంబాదులతో రూపాన్ని దిద్దాడు. అందుకే ఆమె మోమున వెన్నెలవంటి కాంతులు. శరీరమున సువర్ణచ్చాయలు, తనువున మెరపులను బోలిన లావణ్యకాంతులు అలముకొన్నాయి.


                       నవలతా పుష్పాదులతో  ఆశరీరానికి  మెత్తదనం  కల్పించాడు. అందుకే ఆమెతనువు నవ వికసిత పుష్పసదృశం. పల్లవ బిసరుహ  మృదులం. 


                          కర్పూర  చందన  కస్తూరికాదులతో  మెదపి ఆమెతనువునకు  సుగంధమలదినాడు. అందుకే ఈమె శరీరము సహజసువాసితమై సన్నిహితులకు ఆమోదకారక మైనది.


                    కోకిల ,చిలుక ,తుమ్మెదల కూజితముల తో నామె కంఠమును సవరించినాడు. అందుకే ఆమె కలభాషిణి యైనది.


                     ఈరీతిగా ఆమె హావ , భావ ,రూప,లావణ్యాదులను  సవరించి, బ్రహ్మ  యద్భుతమైన  స్త్రీ మూర్తిని  సృజియింపగల

దిట్ట  యనిపించు కొన్నాడట!  యేమి  వర్ణనమిది!! ఒక్క కాళిదాసుకు తప్ప నితరు లెవ్వరకు నిట్టి వర్ణనమును చేయనవకాశములేదు.ఆమహానుభావుడు  విక్రమోర్వశీయమున  ఊర్వసి  నిట్లే మనోహరముగా వర్ణించినాడు. 


             శ్లో:  అస్యాః సర్గవిధౌ ప్రజాపతి రభూశ్చంద్రోను కాంతిప్రదః /

                    శృంగారైక రసస్వయన్ను మదనో మాసోను పుష్పాకరః /

                    వేదాభ్యాస జడః కధన్ను  విషయ వ్యావృత్త కౌతూహలః /

                     నిర్మాతుం ప్రభవేన్మనోహరమిదం రూపం  పురాణోమునిః ! 


                                      విక్రమోర్వశీయం- 2 అంకం-- కాళిదాసు.


                  భావం:  ఈపిల్లని కాంతిప్రదుడైన చంద్రుడు గాని , లేదా పుష్పాకరుడైన వసంతుడుగాని , శృంగార రస ప్రచోదకుడైన మన్మధుడుగాని సృజియించి ఉండాలి. వేదాభ్యాస జడుడు , సంసార సుఖవిముఖుడూ ,అయిన ఆముసలిబ్రహ్మ సృష్టించాడంటే 

నేను నమ్మను. అని ఢంకా బజాయించాడు. కాళిదాసు. నన్నెచోడకవి మరింతగా  మెఱుగులు దిద్దాడు.


                                                                            స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐