9, నవంబర్ 2024, శనివారం

నవదుర్గా నడిపించుమమ్మా*

 *శీర్షిక: నవదుర్గా నడిపించుమమ్మా*


అమ్మా నవదుర్గా మమ్ము నడిపించుమమ్మా

పచ్చని పకృతివై వెలిసి ధరణి కాపాడుమమ్మా 

ధాన్యలక్ష్మిగ జీవనం సుఖప్రదం చేయవమ్మా 

గజలక్ష్మిగా వచ్చి సహనాన్ని పెంపొందించవమ్మా 

సంతానలక్ష్మిగా ధర్మాన్ని రక్షించే ధరణీషుల గని ధర్మాన్ని గమనంలో ఉంచవమ్మా

ధైర్యలక్ష్మీ అభాగ్యులకు ధైర్యమిచ్చి ధైన్యాన్ని తీర్చుమమ్మా

జ్ఞాన సరస్వతీ యువతకు సంస్కారమీయవమ్మా

విజయలక్ష్మీ మంచి ప్రయత్నాలకు విజయాలు ప్రసాదించుమమ్మా 

ధనలక్ష్మీ ధన దాన పాత్రత నిచ్చి మమ్ములను దాతలుగా మార్చుమమ్మా 

అపర కాళివై ఆడబిడ్డల చెరచు దుర్మార్గుల దునుమాడు మమ్మా 

ఉజ్జయిని మహంకాళివై ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టమ్మా 

మంచిని మరలా స్థాపింప మానవాళి కోసం మరో అవతారం ఎత్తవమ్మా 

ఆదిలక్ష్మివై అన్నింట అభయమిచ్చి నడిపించవమ్మా 

భారతిగ లోకాన దేశ యశో కీర్తిని పెంచవమ్మా 

సరిహద్దులు దాటు దేశద్రోహులను ఆపవమ్మా సేనలకు అండగా ఉండవమ్మా

మహిషాసుర మర్ధినివై మాలోని అవగుణాలను హరించుమమ్మా

సర్వ సౌభాగ్య వరములిచ్చి అభివృద్ధి బాటలో నడుపుమమ్మా 

మమ్ము నడుపుమమ్మా


🪷🙏🪷మీకు మీ కుటుంబ సభ్యులకు

 *దసరా పండుగ శుభాకాంక్షలు*🪷🙏🪷


✍️ తుమ్మ జనార్దన్ (జ్ఞాన్) 🙏

Panchaag


 

కార్తీక పురాణం* 9

 🕉️🌹🪔🛕🪔🌹🕉️

    🌹 *ఆదివారం*🌹

🕉️ *నవంబరు 10, 2024*🕉️


🚩 _*కార్తీక పురాణం*_🚩    

    _*9 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*విష్ణు పార్షద , యమ దూతల వివాదము*


☘☘☘☘☘☘☘☘☘


*'ఓ యమ దూత లారా ! మేము విష్ణు దూతలము వైకుంటము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని ప్రశ్నిచిరి. అందుకు జవాబుగా యమదూతలు ' విష్ణు దూత లారా ! మానవుడు చేయు పాపపున్యడులను సూర్యుడు , చంద్రుడు , భూదేవి , ఆకాశము , ధనంజయాది వాయువులు , రాత్రింబవళ్లు  సంధ్య కలం సాక్షులుగా వుండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించు చుందురు. మా ప్రభువుల వారీ కార్య కలాపములను చిత్ర గుప్తునిచే చూపించి ఆ మనిజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు.  వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారును , గోహత్య , బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు , పర స్త్రీ లను కామించిన వారును , పరాన్న భుక్కులు , తల్లిదండ్రులను - గురువులను - బంధువులను - కుల వృతిని తిట్టి హింసించు వారున్నూ , జీవ హింస చేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును , జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును , యితరుల ఆస్తిని స్వాహా చేయు వారును , చేసిన మేలు మరచిన కృతఘ్నులును , పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారునూ పాపాత్ములు. 


వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజా మీళుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకు లోనై కుల భ్రష్టుడై జీవ హింసలు చేసి , కామాంధుడై వావివరసలు లేక , సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు ? ' అని యడగగా విష్ణు దూతలు ' ఓ యమ కింకరులారా ! మీరెంత యవివేకులు ? మీకు ధర్మ సుక్ష్మములు తెలియవు. ధర్మ సుక్ష్మములు లేట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును , జపదాన ధర్మములు చేయువారును - అన్నదానము , కన్యాదానము , గోదానము , సాలగ్రామ దానము చేయువారును , అనాధ ప్రేత సంస్కాములు చేయువారును , తులసి వనము పెంచువారును , తటాకములు త్రవించువారును , శివ కేశవులను పూజించు వారును సదా హరి నామ స్మరణ చేయువారును మరణ కాలమందు *' నారాయణా'* యని శ్రీ హరిణి గాని , *' శివ '* అని శివుని గాని స్మరించు వారును , తెలిసిగాని తెలుయక గాని మరే రూపమున గాని హరి నామస్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు ! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున *"నారాయణా"* అని పలికిరి.

అజా మీళుడు విష్ణు దూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యమొంది *" ఓ విష్ణు దూతలారా ! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములు గాని , ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణ మిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కుల భ్రష్టుడనై , నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో *"నారాయణా"* యని నంత మాత్రమున నన్ను ఘోర నరక భాదలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా ! నేనెంత అదృష్టవంతుడను ! నా పూర్వ జన్మ సుకృతము , నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది. " అని పలుకుచు సంతోషముగా విమాన మెక్కి వైకుంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ ! తెలిసిగాని , తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలేక్కి భాద , కలిగించునో , అటులనే శ్రీ హరినామం స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నోన్దేదరు. ఇది ముమ్మాటికినీ నిజము.


*ఇతి స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*

*నవమ అధ్యాయం - తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.*

    

             🌷 *సేకరణ*🌷

          🌹🪔🕉️🕉️🪔🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*

          🙏🙏🕉️🕉️🙏🙏

హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఆలయాలు

 :

 హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఆలయాలు

వారణాసి పరిసరాల్లో మరియు సమీపంలో ఖచ్చితంగా అనేక దేవాలయాలు ఉన్నాయి

ఈ ఆలయం హరీష్ చంద్ర ఘాట్ ప్రాంగణంలో ఉంది. కాల భైరవ ఆలయం భైరవ భగవానుడికి అంకితం చేయబడింది, ఇది శివుని యొక్క ఉగ్రరూపం. భక్తులు తమ కుటుంబాల రక్షణ మరియు శ్రేయస్సు కోసం ఆశీర్వాదం కోసం ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. 'ది కొత్వాల్ ఆఫ్ వారణాసి' అని కూడా పిలుస్తారు, కాల భైరవుడు నగరానికి రక్షకుడిగా పరిగణించబడ్డాడు, ఈ ఆలయం శక్తివంతమైన ప్రకాశం మరియు పురాతన సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది,


: చిత్ర క్రెడిట్: వికీమీడియా కామన్స్ కోసం సుజయ్25

ఇది హరీష్ చంద్ర ఘాట్ సమీపంలో ఉన్న మరొక ముఖ్యమైన ఆలయం. ఇది పూర్తిగా శివునికి అంకితం చేయబడింది. హిందూ పురాణాల ప్రకారం, ఈ ఆలయానికి ప్రార్థనలు చేయడం వల్ల భక్తులు మరణ భయాన్ని అధిగమించి ఆధ్యాత్మిక విముక్తిని పొందుతారు. ఈ ఆలయం మహా మృత్యుంజయ్ మంత్రానికి ప్రసిద్ధి చెందింది, ఇది ఆరోగ్యం మరియు దీర్ఘాయువును ప్రసాదిస్తుందని నమ్ముతారు.🙏

కార్తీకపురాణం 9

 *కార్తీకపురాణం 9 అధ్యాయం* *విష్ణు దూతలు-యమదూతల వివాదం*


విష్ణు దూతలు-యమదూతల వివాదం

అజామీళుడిని తీసుకెళ్తున్న విష్ణుదూతలతో యమదూతలు వాగ్వాదానికి దిగారు. విష్ణుదూతలిలా అంటున్నారు… ”ఓయీ యమదూతలారా. మేం విష్ణు దూతలం. వైకుంఠం నుంచి వచ్చాం. మీ ప్రభువైన యముడు ఎవరిని తీసుకురమ్మని మిమ్మల్ని పంపాడు?” అని ప్రశ్నించారు. దానికి వారు ”ఓ విష్ణుదూతలారా… మానవుడు చేసే పాపపుణ్యాలకు సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, ధనంజయాది వాయువులు, రాత్రింబవళ్లు, సంధ్యాకాలం సాక్షులుగా ఉండి, ప్రతిరోజూ మా ప్రభువుకు విన్నవించుకుంటారు. మా ప్రభువు వారి కార్యకలాపాలను చిత్రగుప్తుడి ద్వారా మాకు చూపించి, ఆ మనిషి అవసానదశలో మమ్మల్ని పంపుతారు” అని చెప్పుకొచ్చారు.

పాపుల గురించి విష్ణుదూతలకు యమదూతలు ఇలా వివరిస్తున్నారు… ”అయ్యా… అసలు పాపులు అనే పదానికి నరకంలో ప్రత్యేక నిర్వచనాలున్నాయి. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారు, గోహత్య, బ్రహ్మ హత్యాది మహాపాపాలు చేసినవారు, పర స్త్రీలను కామించిన వారు, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను – గురువులను – బంధువులను- కుల వృతిని తిట్టి హింసించు వారు, జీవ హింస చేయు వారు, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులు, పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారు పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమ ధర్మరాజు గారి ఆజ్ఞ” అని చెప్పుకొచ్చారు.

తమ సంవాదానిన కొనసాగిస్తూ… ”ఈ అజామీళుడు బ్రాహ్మణుడై పుట్టి, దురాచారాలకు లోనై, కులభ్రష్టుడై జీవ హింసలు చేసి, కామాంధుడి ప్రవర్తించాడు. వావి వరసలు లేకుండా కూతురువరస యువతితో సంబంధం పెట్టుకున్న పాపాత్ముడు. వీడిని విష్ణులోకానికి ఎలా తీసుకెళ్తారు?” అని ప్రశ్నించగా… విష్ణుదూతలిలా చెబుతున్నారు. ”ఓ యమకింకరులారా! మీరెంత అవివేకులు? మీకు సూక్షధర్మాలు తెలియవు. ధర్మసూక్షాలు ఎలా ఉంటాయో చెబుతాం వినండి. సజ్జనులతో సహవాసము చేయువారు, జపదాన ధర్మములు చేయువారు- అన్నదానం, కన్యాదానం, గోదానం, సాలగ్రామ దానం చేయువారు, అనాథ ప్రేత సంస్కాములు చేయువారు, తులసి వనము పెంచువారు, తటాకములు తవ్వించువారు, శివ కేశవులను పూజించు వారు, సదా హరి నామ స్మరణ చేయువారు, మరణ కాలమందు ‘నారాయణా’యని శ్రీహరిని గాని, ‘శివ’ అని ఆ పరమశివుని గాని స్మరించు వారు, తెలిసిగాని తెలుయక గాని మరే రూపమున గాని హరి నమ స్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున ‘నారాయణా’అని పలికాడు” అందుకే విష్ణుసాన్నిద్ధ్యానికి అతను అన్నివిధాలా అర్హుడు” అని వివరించారు.

అజామీళుడికి విష్ణుదూతల సంభాషణ ఆశ్చర్యాన్ని కలిగించింది. ”ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణ పుజగాని వ్రతములు గాని, ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణ మిల్లలేదు. వర్ణాశ్ర మాములు విడిచి కుల భ్రష్టుడనై, నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో ‘నారాయణా’ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుంచి రక్షించి వైకుంఠానికి తీసుకెళ్తున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వ జన్మ సుకృతము, నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది” అని పలుకుతూ… సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి వెళ్లడు.

”కాబట్టి ఓ జనక మహారాజా! తెలిసిగానీ, తెలియక గానీ నిప్పును ముట్టినప్పుడు బొబ్బలెక్కడం, బాధకలగడం ఎంత నిజమో… శ్రీహరిని స్మరించినంతనే పాపాలు నశించి, మోక్షాన్ని పొందుతారనడం అంతే కద్దు” అని వివరించారు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి నవమధ్యాయ: – 9 రోజు పారాయణము సమాప్తం.

కార్తీకపురాణం 8

 *కార్తీకపురాణం 8 అధ్యాయం* *హరినామస్మరణం*


వశిష్టుడు చెప్పిన దంతా విన్న జనకుడు ఇలా అడుగుతున్నాడు… ”మహానుభావా! మీరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా వింటున్నాను. అందులో ధర్మం చాలా సూక్షంగా, పుణ్యం సులభంగా కనిపిస్తోంది. నదీస్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వంటి విషయాలను గురించి చెప్పారు. ఇలాంటి స్వల్ప ధర్మాలతో మోక్షం లభిస్తుండగా… వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసినగానీ పాపాలు పోవని మీలాంటి ముని శ్రేష్టులే చెబుతున్నారు. మరి మీరు ఇది సూక్ష్మంలో మోక్షంగా చెబుతుండం నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దుర్మార్గులు, వర్ణ సంకరులైనవారు రౌరవాది నరకాలకు పోకుండా తేలిగ్గా మోక్షాన్ని పొందుతున్నారు. ఇదంతా వజ్రపు కొండను గోటితో పెకిలించడం వంటిదే కాదా? దీని మర్మమేమిటి? నాకు సవివరంగా చెప్పండి” అని ప్రార్థించాడు.

అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి . ‘జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగములను కూడా పఠించాను. వాటిల్లోనూ సూక్ష్మ మార్గాలున్నాయి. అవి సాత్విక, రాజస, తామసాలు అని పిలిచే మూడు రకాల ధర్మాలున్నాయి. సాత్వికమంటే… దేశ కాల పాత్రలు మూడు సమాన సమయంలో సత్వ గుణం జనించి ఫలితాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తాం. మనోవాక్కాయ కర్మలతో ఒనర్చే ధర్మం అధర్మంపై ఆదిక్యత పొందుతుంది. ఉదాహరణకు తామ్రవర్ణ నది సముద్రంలో కలిసిన తావులో స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమయ్యే విధంగా సాత్వికత వహించి, సాత్విక ధర్మం ఆచరిస్తూ గంగ,యమున, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలు పుణ్యకాలాల్లో దేవాలయాల్లో వేదాలను పఠించి, సదాచారుడై, కటుంబీకుడైన బ్రాహ్మణుడికి ఎంత స్వల్ప దానం చేసినా… లేక ఆ నదీ తీరంలో ఉన్న దేవాలయంలో జపతపాదులను చేయుట విశేష ఫలితాలనిస్తుంది. ఇక రాజస ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులతో చేసే ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతుకమై కష్టసుఖాలను కలిగిస్తుంది. తామస ధర్మమనగా… శాస్త్రోక్త విధులను విడిచి, దేశకాల పాత్రలు సమకూడని సమయంలో డాంబిక చరణార్థం చేసేది. ఆ ధర్మం ఫలాన్ని ఇవ్వదు. దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు’ అని ఇలా చెప్పసాగారు.

ఆజా మీళుని కథ

పూర్వ కాలంలో కన్యాకుబ్జం అనే నగరంలో నాలుగు వేదాలు చదివిన బ్రాహ్మడు ఒకడుండేవాడు. అతని పేరు సత్య వ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశి అయిన భార్య ఉంది. ఆ దంపతులు అన్యోన్యత, ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అనే పేరు తెచ్చుకున్నారు. వారికి చాలాకాలానికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. వారు ఆ పిల్లాడిని గారాబంగా పెంచి, అజామిళుకుడని పేరు పెట్టారు. అతను గారాబంగా పెరగడం వల్ల పెద్దలను నిర్లక్ష్యం చేస్తూ దుష్ట సహవాసాలు చేయసాగాడు. విద్యను అభ్యసించక, బ్రాహ్మణ ధర్మాలను పాటించక సంచరిచేవాడు. అలా కొంతకాలం తర్వాత యవ్వనవంతుడై కామాంధుడయ్యాడు. మంచిచెడ్డలు మరిచి, యజ్ఞోపవీతం తెంచి, మద్యంసేవించడం, ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి, నిరంతరం ఆమెతోనే కామ క్రీడల్లో తేలియాడుచుండేవాడు. ఇంటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె ఇంట్లోనే భోజనం చేస్తూ ఉండేవాడు. అతి గారాబం వల్ల ఈ దుష్పరిణామాలు ఎదురయ్యాయి. చిన్నపిల్లల్ని చిన్నతనం నుంచి అదుపాజ్ఞల్లో పెట్టకపోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. అజామీళుడు కులభ్రష్టుడు అయ్యాడు.

కుల బహిష్కరణతో అతను మరింత కిరాతకుడిగా మారాడు. వేట వల్ల పక్షులను, జంతువులను చంపుతూ అదే వృత్తిలో జీవించసాగాడు. ఒక రోజున అజామీలుడు, అతని ప్రేయసి అడవిలో వేటాడుతూ తేనె పట్టు తీసేందుకు ఆమె చెట్టుపైకెక్కి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందింది. అజామీళుడు ఆమెపైపడి కాసేపు ఏడ్చి, ఆ తర్వాత అడవిలోనే దహనం చేసి, ఇంటికి తిరిగి వెళ్లాడు. అప్పటికే ఆ ఎరుకల మహిళకు ఒక కుమార్తె ఉండడంతో, అజామీళుడు ఆమెను పెంచసాగాడు. ఆమెకాస్తా యుక్తవయసుకు వచ్చేసరికి అజామీళుడు కామంతో కళ్లు మూసుకుపోయి, ఆమెను చేపట్టాడు. ఆమెతో కామక్రీడల్లో తేలియాడుచుండేవాడు. వీరికి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆ ఇద్దరూ పురిటిలోనే చనిపోయారు. ఆ తర్వాత ఆమె మరలా గర్భందాల్చి ఓ కుమారుడిని కన్నది. వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలవసాగారు. ఒక్క క్షణమైనా ఆ బాలుడిని విడవకుండా, ఎక్కడకు వెళ్లినా… తన వెంట తీసుకెల్తూ… నారాయణా అని ప్రేమతో సాకుచుండిరి. ఇలా కొంతకాలం గడిచాక అజామీళుడి శరీరం పటుత్వం కోల్పోయింది. రోగస్తుడయ్యాడు. మంచం పట్టి కాటికి కాలుచాచాడు. ఒకరోజు భయంకరాకారాలతో, పాశాయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామీళుడు భయపడి కుమారుడిపై ఉన్న వాత్సల్యంతో ప్రాణాలు విడువలేక… నారాయణా… నారాయణా… అని పిలుస్తూ ప్రాణాలు విడిచాడు. అజామీళుడి నోట నారాయణ శబ్దం రాగానే యమభటులు గడగడా వణికారు. అదే వేళకు దివ్య మంగళకారులు, శంకచక్ర గధాధరులూ అయిన శ్రీమహావిష్ణువు దూతలు విమానంలో అక్కడకు వచ్చి, ”ఓ యమ భటులారా! వీడు మావాడు. మేం వైకుంఠౄనికి తీసుకెళ్లడానికి వచ్చాం” అని చెప్పి, అజామీళుడిని విమానమెక్కించి తీసుకుపోయారు. యమదూతలు వారితో ”అయ్యా… వీడు పరమ దుర్మార్గుడు. వీడు నరకానికి వెళ్లడమే తగినది” అని చెప్పగా… విష్ణుదూతలు అతను చనిపోవడానికి ముందు నారాయణ పదాన్ని ఉచ్చరించాన్ని ఊటంకించి, ఆ పాపాలన్నీ ఆ నామ జపంతో తొలగిపోయాయని, అతను ఇప్పుడు పునీతుడని చెప్పుకొచ్చారు. ”’సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త్య దు:ఖా సుఖినోభవంతు” అన్నట్లు అజామీళుడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడని వశిష్టుడు జనకమహారాజుకు వివరించారు.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి ఎనిమిదో అధ్యాయం, ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం

కవియూర్ శ్రీ మహాదేవర్ ఆలయం

 🕉 *మన గుడి : నెం 495*


⚜ *కేరళ  : పథనంతిట్ట*


⚜ కవియూర్ శ్రీ మహాదేవర్ ఆలయం



💠 కవియూర్ మహాదేవర్ ఆలయం కేరళలోని ముఖ్యమైన శివాలయాలలో ఒకటి, ఇది భారతదేశంలోని కేరళలోని తిరువల్ల పతనంతిట్ట జిల్లా కవియూర్‌లో ఉంది.  

దీనిని సాధారణంగా త్రిక్కవియూర్ మహాదేవ దేవాలయం అంటారు.  


💠 ఇక్కడ ప్రధాన దేవత శివుడు అయినప్పటికీ, హనుమంతుడిని కూడా ప్రాముఖ్యతతో పూజిస్తారు.


💠 ఇది ఒక చిన్న కొండపై ఉంది మరియు 21 విశాలమైన మెట్లు గంభీరమైన తూర్పు గోపురానికి దారి తీస్తుంది.

తూర్పు ప్రాంగణం బంగారు ధ్వజ స్తంభం మరియు ఇరువైపులా రెండు ఎత్తైన దీపస్తంభాలతో అలంకరించబడింది.


💠 దేవాలయం చుట్టూ అనేక రకాల పురాణ గాథలు ఉన్నాయి.  

ఒక  పురాణం ప్రకారం, రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు శ్రీరాముడు సీత, హనుమంతుడు, సుగ్రీవ మరియు విభీషణుల సమక్షంలో శివుని ప్రధాన విగ్రహాన్ని స్థాపించాడు. 

 హిమాలయాల నుండి దివ్యమైన శివలింగాన్ని తీసుకురావడానికి శ్రీరాముడు హనుమంతునికి దీక్షను ఇచ్చాడు.  

హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి ఒక ప్రత్యేకమైన శివలింగం కోసం ప్రతిచోటా శోధించాడు మరియు దాని కోసం కొంత సమయం తీసుకున్నాడు.  


💠 ప్రతిష్టకు అనుకూలమైన సమయం సమీపించడంతో, శ్రీరాముడు ఇసుకని ఉపయోగించి, అతను ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడు.  

తిరిగి వచ్చిన హనుమంతుడు ప్రతిష్ఠాపన పూర్తయిపోయిందని చూసి చాలా బాధపడ్డాడు.  

కాబట్టి రాముని ప్రతిష్టను తొలగించి, దాని స్థానంలో తాను తెచ్చిన దివ్యలింగాన్ని ప్రతిష్టించమని చెప్పాడు.  

హనుమంతుడు తన బలం తో శివలింగాన్ని తీయడానికి ప్రయత్నించాడు, కానీ కొత్తగా అచ్చు వేయబడిన మట్టి లింగం అలాగే ఉంది.  బదులుగా, దాని చుట్టూ ఉన్న భూమి ఒక చిన్న కొండగా మారింది.  కాబట్టి హనుమంతుడు క్షమించమని ప్రార్థించాడు మరియు అతను చేసిన దివ్యప్రతిష్టకు సమీపంలో ఉండటానికి అనుమతి కోసం శ్రీరాముడిని కోరాడు. 

 అలా కవియూర్ హనుమంతుని స్థానంగా మారింది.  


💠 ఇది సాంప్రదాయకంగా దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రముఖ హనుమాన్ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.


💠 ప్రధాన దేవతను త్రిక్కవియూరప్పన్ అని పిలుస్తారు.  శివలింగం ఇసుక మరియు దర్భ గడ్డితో తయారు చేయబడిందని నమ్ముతారు.  ధ్యానశ్లోకం ప్రకారం కవియూర్ ఆలయంలోని శివుడు ఆహ్లాదకరమైన రూపంలో ఉన్నాడు మరియు పద్మాసనంలో తన ఎడమ చేతితో పార్వతీ దేవిని ఆలింగనం చేసుకున్నాడు మరియు అతని కుమారులు గణపతి మరియు సుబ్రహ్మణ్యుడు కూడా ఉన్నారు.


💠 శివుని దక్షిణామూర్తి మరియు గణపతి విగ్రహాలు ప్రధాన గర్భగుడి యొక్క దక్షిణ భాగంలో కలిసి ఉన్నాయి. 

అయ్యప్ప నైరుతిలో ప్రతిష్టించబడి, తూర్పున పార్వతి దేవిని శ్రీ మూలరాజేశ్వరిగా పూజిస్తారు. 


💠 ప్రధాన గర్భగుడి వెలుపల లోపలి ప్రాంగణంలోని వాయువ్య మూలలో హనుమాన్ ఆలయ స్థానం ఉంది. 

 విగ్రహం చిన్నది మరియు తూర్పు ముఖంగా ఉంటుంది.  ఈ దేవతకు శివుని కంటే ఎక్కువ ప్రజాదరణ ఉంది.


💠 ప్రధాన పురాణం ప్రకారం, ఈ ఆలయం త్రేతా యుగానికి చెందినది అయినప్పటికీ, దీని అసలు నిర్మాణ సమయం తెలియదు.  

కానీ నిర్మాణ శైలులు కేరళ ఆలయ వాస్తుశిల్పం యొక్క ప్రారంభ దశలను సూచిస్తాయి.  


💠 నమస్కారమండపం, గర్భాలయం ముందు చతురస్రాకారంలో ఉంటుంది.  నమస్కారమండపం లోపలి పైకప్పు అందమైన శిల్పాలతో నిండి ఉంది.  మధ్యలో నవగ్రహ శిల్పాలు మరియు రామాయణ కథ, రామ జననం నుండి హనుమంతుని లంకాదహనం వరకు మూడు పొరలుగా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి.  


💠 1951లో హనుమాన్ ఆలయ పునరుద్ధరణ మరియు నవీకరణ జ్ఞాపకార్థం శ్రీ చితిర తిరునాళ్ బలరామవర్మ కోరిక మేరకు హనుమంతుని కోసం పంత్రంతు కలభం ప్రారంభించబడింది.  

ఈ పండుగ మలయాళ నెల చింగం మొదటి రోజున ప్రారంభమై పన్నెండవ రోజున ముగుస్తుంది.  

మైలయం మాసం కన్నీళ్లలో వచ్చే ఆయిల్యం సర్ప దేవతలకు సంబంధించినది.


💠 మహాదేవుని ప్రధాన పండుగ మలయాళ మాసం ధను (డిసెంబర్-జనవరి)లో మధ్య ట్రావెన్‌కోర్ ప్రాంతం నలుమూలల నుండి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది మరియు పది రోజుల పాటు ఉంటుంది.  

పండుగ రెండవ రోజు నుండి ఆరవ రోజు వరకు ఆలయానికి సంబంధించిన వివిధ ప్రాంతాలకు స్వామివారి విగ్రహాన్ని ఏనుగుపైకి తీసుకువెళతారు.  

ఏడో రోజు నుంచి ఆలయ ప్రాంగణంలో మాత్రమే పూజలు జరుగుతాయి.  

పదవ రోజు, ఆరాట్ కోసం మణిమాల నదికి శివుడు మరియు పార్వతి దేవి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళతారు.


💠 హనుమాన్ ఆలయానికి సంబంధించి మలయాళ నెల ధను (డిసెంబర్-జనవరి)లో మరొక వార్షిక పండుగను హనుమత్ జయంతి అని పిలుస్తారు.  

ఈ పండుగ కూడా వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.  మకరం (జనవరి-ఫిబ్రవరి) మాసంలో శ్రీ మూలరాజేశ్వరి విగ్రహ ప్రతిష్ఠాపన జ్ఞాపకార్థం ఉత్రిత్తతి తిరునాల్ జరుపుకుంటారు.  

మలయాళ మాసంలో కుంభం (ఫిబ్రవరి-మార్చి) శివరాత్రి వివిధ ఆచారాలతో జరుపుకుంటారు.  నలంబళం గోడపై ఉన్న 8000 దీపాలను కవియూర్ మరియు కున్నంథానం గ్రామాలలోని ఏడు మండలాలు వెలిగిస్తారు.  

సహస్రకలశం అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ. 

కార్తీకపురాణం 8

 *కార్తీకపురాణం 8 అధ్యాయం* *హరినామస్మరణం*


వశిష్టుడు చెప్పిన దంతా విన్న జనకుడు ఇలా అడుగుతున్నాడు… ”మహానుభావా! మీరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా వింటున్నాను. అందులో ధర్మం చాలా సూక్షంగా, పుణ్యం సులభంగా కనిపిస్తోంది. నదీస్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వంటి విషయాలను గురించి చెప్పారు. ఇలాంటి స్వల్ప ధర్మాలతో మోక్షం లభిస్తుండగా… వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసినగానీ పాపాలు పోవని మీలాంటి ముని శ్రేష్టులే చెబుతున్నారు. మరి మీరు ఇది సూక్ష్మంలో మోక్షంగా చెబుతుండం నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దుర్మార్గులు, వర్ణ సంకరులైనవారు రౌరవాది నరకాలకు పోకుండా తేలిగ్గా మోక్షాన్ని పొందుతున్నారు. ఇదంతా వజ్రపు కొండను గోటితో పెకిలించడం వంటిదే కాదా? దీని మర్మమేమిటి? నాకు సవివరంగా చెప్పండి” అని ప్రార్థించాడు.

అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి . ‘జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగములను కూడా పఠించాను. వాటిల్లోనూ సూక్ష్మ మార్గాలున్నాయి. అవి సాత్విక, రాజస, తామసాలు అని పిలిచే మూడు రకాల ధర్మాలున్నాయి. సాత్వికమంటే… దేశ కాల పాత్రలు మూడు సమాన సమయంలో సత్వ గుణం జనించి ఫలితాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తాం. మనోవాక్కాయ కర్మలతో ఒనర్చే ధర్మం అధర్మంపై ఆదిక్యత పొందుతుంది. ఉదాహరణకు తామ్రవర్ణ నది సముద్రంలో కలిసిన తావులో స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమయ్యే విధంగా సాత్వికత వహించి, సాత్విక ధర్మం ఆచరిస్తూ గంగ,యమున, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలు పుణ్యకాలాల్లో దేవాలయాల్లో వేదాలను పఠించి, సదాచారుడై, కటుంబీకుడైన బ్రాహ్మణుడికి ఎంత స్వల్ప దానం చేసినా… లేక ఆ నదీ తీరంలో ఉన్న దేవాలయంలో జపతపాదులను చేయుట విశేష ఫలితాలనిస్తుంది. ఇక రాజస ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులతో చేసే ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతుకమై కష్టసుఖాలను కలిగిస్తుంది. తామస ధర్మమనగా… శాస్త్రోక్త విధులను విడిచి, దేశకాల పాత్రలు సమకూడని సమయంలో డాంబిక చరణార్థం చేసేది. ఆ ధర్మం ఫలాన్ని ఇవ్వదు. దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు’ అని ఇలా చెప్పసాగారు.

ఆజా మీళుని కథ

పూర్వ కాలంలో కన్యాకుబ్జం అనే నగరంలో నాలుగు వేదాలు చదివిన బ్రాహ్మడు ఒకడుండేవాడు. అతని పేరు సత్య వ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశి అయిన భార్య ఉంది. ఆ దంపతులు అన్యోన్యత, ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అనే పేరు తెచ్చుకున్నారు. వారికి చాలాకాలానికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. వారు ఆ పిల్లాడిని గారాబంగా పెంచి, అజామిళుకుడని పేరు పెట్టారు. అతను గారాబంగా పెరగడం వల్ల పెద్దలను నిర్లక్ష్యం చేస్తూ దుష్ట సహవాసాలు చేయసాగాడు. విద్యను అభ్యసించక, బ్రాహ్మణ ధర్మాలను పాటించక సంచరిచేవాడు. అలా కొంతకాలం తర్వాత యవ్వనవంతుడై కామాంధుడయ్యాడు. మంచిచెడ్డలు మరిచి, యజ్ఞోపవీతం తెంచి, మద్యంసేవించడం, ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి, నిరంతరం ఆమెతోనే కామ క్రీడల్లో తేలియాడుచుండేవాడు. ఇంటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె ఇంట్లోనే భోజనం చేస్తూ ఉండేవాడు. అతి గారాబం వల్ల ఈ దుష్పరిణామాలు ఎదురయ్యాయి. చిన్నపిల్లల్ని చిన్నతనం నుంచి అదుపాజ్ఞల్లో పెట్టకపోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. అజామీళుడు కులభ్రష్టుడు అయ్యాడు.

కుల బహిష్కరణతో అతను మరింత కిరాతకుడిగా మారాడు. వేట వల్ల పక్షులను, జంతువులను చంపుతూ అదే వృత్తిలో జీవించసాగాడు. ఒక రోజున అజామీలుడు, అతని ప్రేయసి అడవిలో వేటాడుతూ తేనె పట్టు తీసేందుకు ఆమె చెట్టుపైకెక్కి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందింది. అజామీళుడు ఆమెపైపడి కాసేపు ఏడ్చి, ఆ తర్వాత అడవిలోనే దహనం చేసి, ఇంటికి తిరిగి వెళ్లాడు. అప్పటికే ఆ ఎరుకల మహిళకు ఒక కుమార్తె ఉండడంతో, అజామీళుడు ఆమెను పెంచసాగాడు. ఆమెకాస్తా యుక్తవయసుకు వచ్చేసరికి అజామీళుడు కామంతో కళ్లు మూసుకుపోయి, ఆమెను చేపట్టాడు. ఆమెతో కామక్రీడల్లో తేలియాడుచుండేవాడు. వీరికి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆ ఇద్దరూ పురిటిలోనే చనిపోయారు. ఆ తర్వాత ఆమె మరలా గర్భందాల్చి ఓ కుమారుడిని కన్నది. వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలవసాగారు. ఒక్క క్షణమైనా ఆ బాలుడిని విడవకుండా, ఎక్కడకు వెళ్లినా… తన వెంట తీసుకెల్తూ… నారాయణా అని ప్రేమతో సాకుచుండిరి. ఇలా కొంతకాలం గడిచాక అజామీళుడి శరీరం పటుత్వం కోల్పోయింది. రోగస్తుడయ్యాడు. మంచం పట్టి కాటికి కాలుచాచాడు. ఒకరోజు భయంకరాకారాలతో, పాశాయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామీళుడు భయపడి కుమారుడిపై ఉన్న వాత్సల్యంతో ప్రాణాలు విడువలేక… నారాయణా… నారాయణా… అని పిలుస్తూ ప్రాణాలు విడిచాడు. అజామీళుడి నోట నారాయణ శబ్దం రాగానే యమభటులు గడగడా వణికారు. అదే వేళకు దివ్య మంగళకారులు, శంకచక్ర గధాధరులూ అయిన శ్రీమహావిష్ణువు దూతలు విమానంలో అక్కడకు వచ్చి, ”ఓ యమ భటులారా! వీడు మావాడు. మేం వైకుంఠౄనికి తీసుకెళ్లడానికి వచ్చాం” అని చెప్పి, అజామీళుడిని విమానమెక్కించి తీసుకుపోయారు. యమదూతలు వారితో ”అయ్యా… వీడు పరమ దుర్మార్గుడు. వీడు నరకానికి వెళ్లడమే తగినది” అని చెప్పగా… విష్ణుదూతలు అతను చనిపోవడానికి ముందు నారాయణ పదాన్ని ఉచ్చరించాన్ని ఊటంకించి, ఆ పాపాలన్నీ ఆ నామ జపంతో తొలగిపోయాయని, అతను ఇప్పుడు పునీతుడని చెప్పుకొచ్చారు. ”’సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త్య దు:ఖా సుఖినోభవంతు” అన్నట్లు అజామీళుడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడని వశిష్టుడు జనకమహారాజుకు వివరించారు.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి ఎనిమిదో అధ్యాయం, ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం

శివమహిమ

 



శివమహిమ!!


విశ్వనాధసత్యనారాయణ!


కైలాసాచలసానువాసము వృషస్కంధాగ్రసంస్థాయి త

త్ప్రాలేయాచలకన్యకాకుచతటీపర్యంకనిద్రాగతం

బాలోలాగ్రజటాతటీఘటితనాకౌకస్సరిత్కంబు దే

హాలంకారితలేలిహానము వెలుం గర్చింతు విశ్వేశ్వరా!


ఇది విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణకల్పవృక్షావతారికయందలి రెండవ పద్యం. కైలాసాచలసానువాసము అనగానే నాకు మొదట తెనాలి రామకృష్ణుని ఉద్భటారాధ్యచరిత్రలోని పద్యం  గుర్తొచ్చింది.


* * *


కైలాస-అచల-సాను-వాసము వృష-స్కంధ-అగ్ర-సంస్థాయి తత్-ప్రాలేయ-అచల-కన్యకా-కుచ-తటీ-పర్యంక-నిద్రా-ఆగతంబు ఆలోల-అగ్ర-జటా-తటీ-ఘటిత-నాక-ఓకస్-సరిత్కంబు దేహ-అలంకారిత-లేలిహానము వెలుంగు అర్చింతు విశ్వేశ్వరా


సం అంటే సమ్యక్, బాగుగా. స్థా గతినివృత్తౌ అని ధాతువు, అంటే గమనరహితమైన స్థితి. ప్రాలేయము మంచు. పర్యంకము మంచము. ఓకస్సు అంటే నివాసం. నాకౌకస్సు అంటే స్వర్గము నివాసముగా కల. "ఆలోల"లో లోల కంపిస్తున్న, ఆ స్వల్పత్వాన్ని సూచిస్తుంది. లేలిహానము అంటే పాము (లేలిహానో ద్విరసనో గోకర్ణః కఞ్చుకీ తథా  అని అమరకోశము).


వెలుంగు అన్న పదం ఇక్కడ కీలకం. నిరాకారస్వరూపంగా అర్చించడమన్నమాట. ఎప్పుడైతే ఇలా నిరాకారస్వరూపంగా తీసుకున్నామో అప్పుడు చెప్పేవన్నీ స్త్రీ-పురుష-నపుంసక-లింగాతీతమైన శివలింగానికి సంబంధించినవౌతాయి కదా.


కైలాస పర్వత సానువులందు నివాసమున్నట్టిది. నందీశ్వరునియొక్క భుజములపైన చక్కగా నుండినది. ఆ మంచుకొండ కూతురైన పార్వతీదేవియొక్క పాలిండ్ల ప్రదేశమనే మంచముపై నిద్రను పొందునది. స్వల్పంగా కదులుతున్న జటాజూటపు పైభాగంలో స్వర్గలోకపు నదిని కలిగినట్టిది. దేహాలంకారముగా పామును చేసికొన్నట్టిది.


కైలాసపర్వతసానువులలో నివాసముంటూ, పాముని గంగని ధరించి, నందీశ్వరుని అధిరోహించి, పార్వతీదేవిపాలిండ్లపై నిద్రపోయే స్వరూపంగా కనిపిస్తున్న వెలుగువైన విశ్వేశ్వరా! నిన్ను కొలుస్తాను అని తాత్పర్యం.


                  

   స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌾🌾🌾🌷🌾🌷🌷🌷🌷🌷🌷🌷

Kartika Puranam - 7

 Kartika Puranam - 7


వశిష్ఠుడిట్లనెను. ఓ జనకమహారాజా! కార్తీక మహాత్మ్యమును యింకా చెప్పదను సావధాన మనస్కుడవై వినుము. ఈమాసమందు ఎవడు పద్మములచేత పద్మములవంటి నేత్రములు గల హరిని పూజించునో వాని యింటిలో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్యనివాసము చేయును. భక్తితో తులసీదళముతోను, జాజిపువ్వులతోను హరిని పూజించువాడు తిరిగి భూమియందు జన్మించడు. మారేడు దళములతో సర్వ వ్యాపకుడయిన హరిని పూజించినవాడు తిరిగి భూమియందు జన్మించడు. భక్తిో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయముకాగానే చీకట్లు ఎట్లునశించునో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరి చెట్టుక్రింద హరిని పూజించువానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీకమాసమందు తులసీదళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు బ్రాహ్మణులతో గూడా వనభోజనము ఆచరించువానియొక్క కోటానుకోట్ల పాపాలు నశించును. బ్రాహ్మణులతో గూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్ామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును. భక్తిచే హరియొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును గట్టువాడు పరమపదము పొందును. హరికి అరటి స్తంభములతోగాని, పుష్పములతోగాని, మంటపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుండును. ఒక్కమారయినను హరిముందు దండప్రణామమాచరించువారు పాపవిముక్తులై అశ్వమేధయాగఫలము పొందుదురు. హరిముందు జపము, హోమము, దేవతార్చనము చేయువారు తమ పితరుతో కూడా వైకుంఠమునకు బోవుదురు. స్నానముచేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలమును పొందును. విష్ణువుయొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును. నల్లనివిగాని, తెల్లనివిగాని అవిశపువ్వులతో హరిని పూజించిన యెడల పదివేల యజ్ఞములు చేసిన ఫలము గలుగును. బృందావనమునందు ఆవుపేడతో అలికి ఐదు రంగులతోను, శంఖపద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. విష్ణుసన్ిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యముయొక్క గొప్పతనము జెప్పుట బ్రహ్మకు కూడ శక్యముగాదు. పర్వతిధులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈనందాదీపము నశించిన యెడల వ్రతభ్రష్టుడగును. తిలలతోను, ధాన్యముతోను, అవిశపువ్వులతోను, కలిపిన నందాదీపమును కార్తీకాసమందు హరికి క్సమర్పించవలయును. నందా అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు జేయునది. శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షము పొందుదురు. విష్ణ్వాలయమంటపమును భక్తితో అలంకరించువారు హరి మందిరమునకు వెళ్ళుదురు. హరిని మల్లెపువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించునట్లు నశించును. కార్తీకమాసమందు తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపవిముక్తుడై విష్ణులోకమును బొందును. హరిసన్నిధిలో స్త్రీగాని పురుషుడుగాని నాట్యముజేసినయెడల పూర్వజన్మ సంచితమైన పాతకములు గూడ నశించును. ఇతరులకు హరిపూజకొరకు మనోవాక్కాయములచేత సహాయముచేయువాడు స్వర్గమునుబొందును. భక్తితో గంధపుష్ప ధూపదీపాదులచేత హరిని పూజించువాడు వైకుంఠమునుబొందును. ఈమాసమున హరిసన్నిధిలో జపమాచరించనివాడు భూమియందు ఏడు జన్మములందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహము లేదు. సాయంకాలమందు హరిసన్నిధిని పురాణ కాలక్షేపమునుజేయువారు వైకుంఠమును జేరుదురు. సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలముండి తరువాత ధ్రువలోకము చేరి సుఖించును.


ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే సప్తమోధ్యాయస్సమాప్తః

70. " మహాదర్శనము

 70. " మహాదర్శనము " --డెబ్భైయవ భాగము--కర్మ-బ్రహ్మ వాదులు


70. డెబ్భైయవ భాగము -- కర్మ-బ్రహ్మ వాదులు



         ఆర్తభాగుడు అలాగ వెళ్ళిపోవుటను చూచి సభ ఆక్రోశము చెందినది. " అతడు లేచినపుడు ఏమి ఠీవి ? ఏమి అట్టహాసము ? అంతటివాడు అడగకూడని ప్రశ్నను అడిగి చివరికి ఎవరిని విరోధించుటకు వెళ్ళినాడో వారినుండే రక్షణ తీసుకొని ఉండిపోవలసి వచ్చెను. ఇటువంటివాడు వారిపైన ఎందుకు పడవలసినది ? " అని మాట్లాడుకున్నది. భగవానులు ఏమీకానట్లే నిర్విషణ్ణులై కూర్చున్నారు. 


        కాశీ విద్వాంసులు కూర్చున్న వైపు గుసగుసలు మొదలైనాయి. ఒకడన్నాడు : " భుజ్యూ , నువ్వు గంధర్వుల నుండీ విద్యను పొందినవాడవు. వెళ్ళు , అయితే అడగకూడనివి అడగవద్దు. చూడు , దీనిలో ఓడిపోయిననూ నీ పేరు శాశ్వతమగును. లే మరి ? " 


భుజ్యుడు సిద్ధమైనాడు. లేచి వేదికవైపుకు వెళ్ళినాడు. 


" ఇతడెవరు ? "


" మంచిది , ఇతడిని చూడలేదా ? భుజ్యుడు. ఆ పరమ విద్వాంసులు లహ్యులు ఉన్నారు కదా ? వారి మనవడే ఇతడు. "


భుజ్యుడు వేదిక పైకి ఎక్కి భగవానుల ఎదురుగా కూర్చున్నాడు. ప్రశ్నోత్తరములు ఆరంభమయినవి. 


         " యాజ్ఞవల్క్యా ! మేము విద్యార్థులై మద్ర దేశములోనున్న కాప్య గోత్రులైన పతంజలుడి ఇంటికి వచ్చినాము. అక్కడ అతని కూతురును గంధర్వుడు  పూనుటను గురించి అతనితో మాట్లాడుతూ , పరీక్షితులు ఎక్కడికి వెళ్ళినారు అని అడిగినాము. అదే ప్రశ్నను మిమ్మల్ని అడుగుతున్నాను. పరీక్షితులు ఎక్కడికి వెళ్ళినారు ? "


" పరీక్షితులు అశ్వమేధయాజులు ఉన్నచోటికి వెళ్ళినారు. "


" అశ్వమేధయాజులు ఎక్కడున్నారు ? "


        " భుజ్యూ , సూర్యుడి రథము ఒక దినమునకు ఎంత దూరము వెళ్లునో దానికి ముప్పై రెండు రెట్లు ఈ లోకము. ఈ లోకమును దీనికి రెట్టింపు ఉన్న భూమి చుట్టియున్నది. దానిని ,  దానికి రెట్టింపు ఉన్న సముద్రము ఆవరించి యున్నది. అక్కడే బ్రహ్మాండపు కొన. అక్కడ కత్తిమొన అంత ఒక చిన్న రంధ్రమున్నది. దానినుండి బయటకు వాయువు పరచుకొని యున్నది. అశ్వమేధపు అగ్ని , సుపర్ణుడై అశ్వమేధ యాజులను, మీరు చెప్పిన పరీక్షితులనూ తనలో ఉంచుకొని తీసుకొని వెళ్ళి ఆ వాయువుకు ఇచ్చును. ఆతడు వారిని తనలో ఉంచుకొని తీసుకొని వెళ్ళి పూర్వపు అశ్వమేధ యాజులున్న బ్రహ్మలోకమును చేర్చును. "


       భుజ్యుడు ఆశ్చర్యపడుతూ , " ఔను , నిజము. మీరు చెప్పినది సరిగ్గా ఉంది. గంధర్వుడు కూడా ఇలాగే చెప్పినాడు " అని చేతులు జోడించి, ఆసనము నుండీ లేచి వేదిక నుండీ దిగి వెళ్ళి కూర్చున్నాడు. 


        ఇక్కడ కాత్యాయని మైత్రేయితో , " అక్కా , భుజ్యులు ఒకటి మరచినారు. వారు గంధర్వుడి అనుగ్రహము పొంది ఉంటే , వీరు ఆదిత్యుని అనుగ్రహమును పొందినవారు  అన్నది వారు మరచినారు " అన్నది. మైత్రేయి,  " వారి స్థానములో నువ్వు ఉంటే , ప్రతిపక్షము వారు మిగిలేవారు కాదు , కదా ? " అని భుజమును తట్టి నవ్వింది. 


       అంతలో మరలా గుసగుసలయినాయి . ఉషస్తుడు లేచినాడు. సభకు నమస్కారము చేసి , దిట్టముగా నడచుకొని వచ్చి వేదికను ఎక్కి , భగవానుల ఎదురుగా కూర్చున్నాడు. ఆ ఠీవి మనోహరముగా నుండినది. ఉషస్తునికి భగవానులను ఓడించెదనను పట్టుదల గానీ , వారికి ఓడిపోతానని భయముగానీ లేవు. సములను సములు చూచినపుడు ఉన్న సమభావమే ఉండినది. 


అతడు వినయముతో అడిగినాడు: " యాజ్ఞవల్క్యుల వారూ , నేను ప్రశ్నను అడగవచ్చునా ? " 


       భగవానులు ముఖమును చూచి , " మీరు చక్రాయణుల పుత్రులు ఉషస్తులు కదా ? బ్రహ్మ విద్యా సంపత్తుకు పేరెన్నిక గన్న వంశపువారు. అనుష్ఠానమునకు ప్రఖ్యాతులైనవారు. తప్పకుండా అడగండి. "


" సంతోషము , ఏది సాక్షాత్తయి ఉండి , అపరోక్షమై ఉంటుందో , ఆ సర్వాంతస్థమైన బ్రహ్మమును గూర్చి నాకు చెప్పండి. " 


       " మాకు ఇష్టమైన విషయమునే అడిగినారు. దానికి వందనములు. ఉషస్థుల వారూ , చూచే మన ఇంద్రియములు బయటి ముఖమైనవి. ఇంద్రియములకూ , దృశ్యములకూ ఉన్న సంబంధము తప్పితే ,( అనగా , ఇంద్రియములు బహిర్ముఖములగుట తప్పి అంతర్ముఖములయితే )  అప్పుడు ఆత్ముడు సాక్షాత్తుగా కనిపించును. దేనిని సుఖమనుకొని కోరి కోరి దానిచుట్టూ లోకము తిరుగునో , ఆ సుఖమంతటికన్నా ఎక్కువ సుఖమని , అన్నిటికీ కారణమైనదని , అన్నిటికన్నా గొప్పది యని అపరోక్షమైనది.. అది అన్నిటిలోనూ ఉన్ననూ , చూచువాడికి వాడి వాడి ఆత్మగా కనిపిస్తుంది. కాబట్టి , సర్వాంతస్థుడైన ఆత్ముడు ఇంకెవరూ కాదు , అడుగుతున్న మీరే! " 


        ఉషస్తుడు గంభీరుడైనాడు. తాను ఏదో అడిగితే ఏమేమో ఉత్తరము వచ్చినట్లు, అసంతృప్తిని చూపించు ముఖముద్ర ఉన్నవాడైనాడు. మరలా అదే ప్రశ్నను అడిగినాడు , " సర్వాంతస్థుడైన ఆత్ముడు ఎవరు ? " భగవానులు చెప్పుటకు ఆరంభించినారు:


         భగవానులు ఎదుటివాడి యొక్క ఉద్దేశమును సులభముగా అర్థము చేసుకున్నారు. తల ఆడిస్తూ అన్నారు : " అటులనా ? అయితే వినండి ఆత్మ అంటే ఈ శరీరము కావలెను , లేదా ఆత్మ అంటే కార్య కరణ సంఘాతమైన లింగము, కావలెను , లేదా ఆత్మ అంటే ఈ రెండింటీలో నున్న ఇంకొకడు కావలెను.. శరీరము సర్వాంతస్థము కాదు , కాబట్టి ఆత్మ కాదు. ఎందుకంటే శరీరము కార్య కరణ సంఘాతమైన ప్రాణము చేత ఎన్నుకోబడుతుంది. లింగము కూడా ఆత్మ కాదు. ఎందుకంటే , అదీ కరణమే! పంచాత్మకమై , ఈ భూత సంఘాతమైన దేహమును ఆడించుచున్న ఆ పంచప్రాణముల క్రియను చేయించు వాడతడు. కాబట్టి , ఈ కార్యము లన్నిటికీ కారణుడైన , ఈ కరణముల నన్నిటినీ ఆడించుచున్న, ఆ చేతనాచేతనుడు ఉంటాడే , వాడు సర్వాంతస్థుడు. "


        ఉషస్తుడు ముఖము గంటు పెట్టుకున్నాడు. అసంతృప్తి ఆవరించుకుంది. అరిచినాడు , " యాజ్ఞవల్క్యా , ఇది మోసము. ’ కొమ్ములు పట్టి తెచ్చి ఇది  ఎద్దు అని చూపిస్తాను ’ అన్నవాడు , దానిని ప్రత్యక్షముగా తెచ్చి ఇవ్వక ,  నడిచేది ఎద్దు , పరుగెత్తేది గుర్రము , మొదలుగా చెప్పినట్లాయెను. మీరు తీసుకున్నది బ్రహ్మిష్ఠతముడికి అట్టిపెట్టిన గోధనము. బ్రహ్మమును అడిగితే , ఇప్పుడు సాక్షాత్తుగా చూపించకుండా , ఇలాగ వేరే వేరే గుర్తులతో ఆనవాలు చెపుతున్నారా ? "


         భగవానులు మందహాసమును వదలకనే అన్నారు : " బ్రహ్మజ్ఞులకు ఈ విక్షోభము తగనిది. బ్రహ్మమనునది ఆకారము లేనిది. ఇంద్రియములు దానిని చూడలేవు. ఇటువంటిదానిని ఇంద్రియ గోచరము చేయుట ఉన్నదా ? సువర్ణాలు పదివేలు అంటే చూడవచ్చు. అర్బుదము అంటే ఊహించవచ్చు. అసంఖ్యాకమంటే , ఏ ఇంద్రియముతో దానిని సాక్షాత్కరించుకునేది ? చూపులోనూ ఉండి , చూపులకు చిక్కని దాన్నెలా చూచేది ? చూపించేది ? కాబట్టి ప్రతిజ్ఞా హాని మాకు లేదు. అసాధ్యమైనదానిని చూపించమని అన్న మీలోనే ప్రతిజ్ఞాహాని ఉన్నది. దాన్ని ( ఆత్మను ) వాక్కు , మనసు కూడా ముట్టలేదు. అనుభవించి మాత్రమే తెలుసుకో వలసిన దానిని మాటలతో తెలుసుకొనుట సాధ్యమా ? మాటలకు అందని దానిని వర్ణించుటకు పోతే , మాట నిలచిపోదా ? మనసుకు అందని దానిని మననము చేసుకోబోతే అన్యమనస్కమవదా ? ఔనా , కాదా ? చెప్పండి "


        ఉషస్తుడు ఏమో చెప్పబోయాడు. మాట పెగల లేదు. బెదిరినాడు. లేచి నమస్కారము చేసినాడు. నాలుక పలికింది. ’ తప్పయింది. ఖండించి నందుకు క్షమించవలెను. తమరు చెప్పినదే సరైనది " అని ప్రతివచనమును నిరీక్షించకయే వెళ్ళిపోయినాడు.  


         అనంతరము కౌషీతకేయ కహోళుడు సభనుంచీ వచ్చి ఆసనములో కూర్చున్నాడు. ఆతని ముఖ ముద్రను చూడగా, ఆ మంటపములో తానూ , భగవానులూ తప్ప ఇంకెవరూ లేరనుకున్నట్టే కనిపించు చుండినది. అతడు గోధనము , బ్రహ్మిష్ఠతముడు మొదలైనవి అంత ప్రధానముగా ఎన్నడూ చూచినట్లు లేదు. అతనికి తన జీవితములో ఇంతటి సమయము వస్తుందా అని కాచుకున్నట్లు , అంతటి యోగము కలసి వచ్చినట్లు , దానిని తాను ఉపయోగించు కోకుండా వదిలితే మరలా అది లభ్యమేకాదు అన్న దిగులున్నట్లు తోచుచున్నది. అయినా గురుశిష్య భావమున్నట్లే కనపడదు. ఆసనములో కూర్చొని అతడు ఏదో మరచినదానిని జ్ఞాపకము తెచ్చుకుంటున్న వాడివలె , అథవా అనేకమైన విషయాలను ఎదురుగా ఉంచుకొని యేది సరియైనది అని ఎంచుకొనుటకు ఒక్కొక్కదానినీ తీసుకొని పరీక్షిస్తున్న వాడివలె  ఒక ఘడియ నేలను చూస్తూ కూర్చున్నాడు. సభ నీరవమై , అతని నోటినుండీ ఏమి వస్తుందో అని కాచుకున్నది. 


        ఆ సమయమును చూసి కాత్యాయని మైత్రేయిని మోచేతితో పొడిచి , ’ చూడు ’ అన్నది. మైత్రేయి, కాత్యాయని చూపించిన చోట చూస్తే , గార్గి , పైకి లేచునపుడు చేయునట్లే చీర చెరగును , ఉత్తరీయమును సవరించుకుంటున్నది. భగవానుల వైపు సూటిగా చూస్తున్నది. చూడబోతే ఆమె కూడా భగవానులను ప్రశ్నించుటకు సిద్ధమగునట్లున్నది. 


      అది చూచి మైత్రేయి చిన్నగొంతుతో , కాత్యాయనితో అన్నది , " చెల్లీ , ఇవన్నీ మేఘాలు. వారు పర్వతము వంటి వారు. గాలికి సాగిపోయే ఈ మేఘాలు ఆ పర్వతమును ఏమి చేయగలవు ? పాపం ! " అన్నది. 


కాత్యాయనికి ఆ అభిమానపు మాట ఎంతో ముచ్చటగా అనిపించినది. ఏమో చెప్పబోయింది , అంతలో కహోళుడు మాట్లాడినాడు. 


" యాజ్ఞవల్క్యా , పెద్ద మనసు చేసి మరలా అదే ప్రశ్నకు ఉత్తరము నివ్వవలెను. " 


" అనగా ? "


"సాక్షాత్తుగా, అపరోక్షముగా , సర్వాంతస్థముగా ఉన్న బ్రహ్మవిచారమును గురించి చెప్పవలెను. "


         " మంచిది , చెపుతాను , దానికేమి ? శరీర ధర్మములూ , ప్రాణ ధర్మములూ , మనోధర్మములూ ఆ ఆత్మను ముట్టలేవు. ఆతడు వీటి నుండీ దూరము. శరీర ధర్మములు జరామరణములు. ఆత్ముడు అజరుడు. అమరుడు. జరామరణములు  ఏమైననూ శరీరమును , అంటే , వేరొకదాని కార్యమై , ఇంకొకదాని కరణమై యున్న శరీరమును పట్టుకోగలవే తప్ప ఆ శరీరి యొక్క ఆత్మను అంటుకోలేవు. ఇక ఈ శరీరము లోపల ఉండి శరీరమును స్వేఛ్చగా ఆడిస్తున్న  ప్రాణపు ధర్మములు క్షుత్పిపాసలు. అవి కూడా ఆత్మను ముట్టలేవు ప్రాణము ఆత్మ యొక్క నీడ. ప్రాణము కార్యము కూడా మరియూ కరణము కూడా!. అవి రెండూ కాని ఆత్మను అవి రెండూ అయిన ప్రాణపు ధర్మములు ఎలా ముట్టగలవు ? ప్రాణము వలెనే శరీరములో ఉండి ఇంద్రియముల చలనమును ప్రేరేపించు మనస్సు యొక్క ధర్మములు శోక మోహములు. శోకమే కామము. మోహమే అజ్ఞానము. గడ్డి అగ్నిని ముట్టి ఎలాగ బ్రతకలేదో , అలాగే కామము అకామమైన ఆత్మను ముట్టి బతుకలేదు. కామకామములూ , లుప్తకామమమైన ఆత్మను ముట్టి ఎలా బతకగలవు ? అలాగే , అజ్ఞానము కూడా , జ్ఞానమే తానైన ఆత్మను ఎటుల చేరగలదు ? తెలిసిందా ? "


" తెలిసింది. శరీర ధర్మము , ప్రాణ ధర్మము, మనో ధర్మములకు బయట, వాటికి అందకుండా ఉండువాడు ఆత్ముడు. "


         " ఆ ఆత్ముడు మీరు చెప్పిన సర్వాంతస్థుడు. ఎందుకంటే అది నిత్యమై అంతటా ఉండుట చేత, ఒకసారి చూచినవాడు మరచిపోలేక , దానినే సర్వదా సర్వత్రా చూచుట వలన సాక్షాత్తుగా , అణువుకే అణువైననూ మహత్తు కన్నా మహత్తై ఉన్నందువలన అపరోక్షమైన అదే అందరిలోనూ ఉండి అన్నిటినీ ఆడిస్తున్నందు వలన దానిని తెలుసుకుంటే ఫలమేమి ? తెలుసా ? "


" తమరే చెప్పవలెను "


          " దానిని తెలిసినవాడు ఆ తెలిసినదే బలమని నిశ్చింతగా ఉంటాడు. వాడికి అది తప్ప ఇంకేదీ అవసరము లేదు. పుత్రాదుల వైపుకు కూడా వాడి మనసు లాగబడదు. లాగబడే తత్త్వమే అతనికి ఉండదు. అతడు తన అవగాహన , దానివలన కలుగు బలము వలన మౌనియగును. మౌని యైనవాడు తాను మౌని యైనంతసేపూ తాను అదే అయినాను అనునది చూచి బ్రాహ్మణుడై కృతకృత్యుడగును. ఆ మహా దర్శనము ఒక్కటి తప్ప  మిగిలినవన్నీ నశించునవే. "


" పరమోపకారమయినది "


కహోళుడు వేరేమీ మాట్లాడకుండా లేచి , భగవానులకు నమస్కారము చేసి వెళ్ళినాడు. 


      అనంతరము గార్గి లేచినది. అందరూ వేదికపైకి వెళ్లండి అన్ననూ ఆమె ఒప్పుకోలేదు. గార్గి , "  భగవానులు ప్రసన్నులై నా ప్రశ్నకు ఉత్తరమును అనుగ్రహించవలెను. " అన్నది. 


        భగవానులు నవ్వుచూ , " ఔను, భగవతి అడుగు ప్రశ్న అటువంటిది. దానికి రక్ష కానే కావలెను. కాబట్టి మొదటే కోటను కట్టి కాపాలా కూడా ఉంచుకొని బయలుదేరినారు. అనుజ్ఞ ఇవ్వండి " అన్నాడు. 


        గార్గి అడిగినది  , " ఈ పృథ్విలోనున్న సర్వమూ జలములో పరచుకొని చేరి ఓతప్రోతమై ( కలగలసి ) యుండును. ఆ జలము దేనిలో అలాగ పరచుకొని చేరి ఓతప్రోతమై యుండును ? "


         " భలే , భలే , భగవతి వారి ప్రశ్న యొక్క జాతి బాగుంది. పరంపరగా పెంచవచ్చు. అయితే భగవతీ , నిష్ఠతో (ఆధారములు చూసి )  తెలుసుకోవలసిన దానిని యుక్తితో, అనుమానముతో ( ఊహతో ) తెలుసుకుంటే , తెలిసినది యని సంతృప్తి కలగ వచ్చును, కానీ అది చిత్రాగ్ని. అది గుర్తుండనీ. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఉత్తరము చూద్దాము. ఈ పృథ్వి , జల , అగ్ని , వాయు , ఆకాశములు ఒకదానితో ఒకటి చేరి లోకలోకములనూ ఏర్పరచును. అవి , జలము వాయువులో , వాయువు అంతరిక్షములో ,  ఆ అంతరిక్షము  గంధర్వ లోకములో , అది ( గంధర్వ లోకము ) ఆదిత్య లోకములో , అది చంద్రలోకములో , అది నక్షత్ర లోకములో , అది దేవలోకములలో , అది ఇంద్రలోకములలో  , అది ప్రజాపతి లోకములలో , అవి బ్రహ్మ లోకములలో  అల్లిబిల్లిగా ఓతప్రోతమైపోయి ఉంటాయి. సంతోషమయినదా ? "


" బ్రహ్మ లోకములు దేనిలో అల్లుకొని ఓతప్రోతమైపోయి ఉంటాయి ? "


          " దానికి ముందర అడగ వద్దు. గార్గి , ఆ బ్రహ్మలోకములలో బ్రహ్మాండములను నిర్మించు భూతములు ఉన్నాయి. భూతములు ఉన్నంతవరకూ జ్ఞానము బాహ్యము. జ్ఞానము భూతములను దాటిననూ అంతటా నిండిపోదు. అప్పుడు  విషయమును తెలుసుకొనుట ఆగమము వలన. అనుమానము వలన కాదు. కాబట్టి ఆగమమును వదలి , అనుమాన ప్రధానముగా వెళితే , విషమును అన్నమని తిన్నట్టగును. వదిలివేయండి. "


గార్గి అది విని, విధేయురాల వలె చేతులు జోడించి , తన చోటుకి వచ్చింది.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 

Janardhana Sharma