11, జులై 2024, గురువారం

ఆచార్య సద్భావన*

 


              *ఆచార్య సద్భావన*

                  ➖➖➖✍️


*ప్రతీ దానికీ ఒక కిటుకు ఉంటుంది. అలాగే  అంతటా ఉన్న  ఈశ్వరుడిని చూడటానికి కూడా ఒక కిటుకు ఉంది. ఆ కిటుకును తెలుసుకుంటే మీకు ప్రతీ క్షణం దైవ దర్శనం అవుతూనే ఉంటుంది.*


*మీరు ఏది చూస్తున్నా, ఏది వింటున్నా, ఎక్కడ నడుస్తున్నా, ఏమి మాట్లాడు తున్నా, కళ్ళు మూస్తున్నా, తెరుస్తున్నా, ఆఖరికి శ్వాసను పీలుస్తూ ఉన్న సమయంలో కూడా మీకు ఈశ్వర దర్శనం అవుతూనే ఉంటుంది.. ఆ కిటుకు చిన్నదే, కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే చాలా కష్టం.*


*అది ఏమిటంటే మన ఆలోచనా ధోరణిలో ఒక మార్పు రావాలి. ఏ మార్పు అంటే నాకోసం అనే భావన పోయి ఈశ్వరుడి కోసం అనే భావన రావడం. ఈ పనిని నేను నాకోసం చేస్తున్నాను అనే స్వార్థ భావన పోయి, ఈశ్వరుడి కోసం చేస్తున్నాను అనే భక్తి భావన రావడం. ఇదే కిటుకు. మనలో ఈశ్వర భావన ఉంటేనే మంచి పనులు చేయగలుగు తాము.*


*స్వార్థ భావన వల్ల మనిషికి ఆశ ఎక్కువైపోతుంది. ఆశ ఎక్కువగా ఉండడం వల్ల మనిషి చెడు పనులు చేస్తాడు. ఈశ్వర భావన మనిషిని ఈశ్వరుడికి దగ్గర చేస్తే, స్వార్థ భావన మనిషిని ఈశ్వరుడికి దూరం చేస్తుంది..✍️*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

జూలై 12, 2024*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

        🌹 *శుక్రవారం*🌹

    🪷 *జూలై 12, 2024*🪷

      *దృగ్గణిత పంచాంగం*              

 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః* 

*ఆషాఢమాసం - శుక్లపక్షం*

*తిథి : షష్ఠి* మ 12.32 వరకు ఉపరి *సప్తమి*

వారం :*శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం : ఉత్తర* సా 04.09 వరకు ఉపరి *హస్త*

*యోగం : పరిఘ* (13) తె 05.15 వరకు ఉపరి *శివ*

*కరణం : తైతుల* మ 12.32 *గరజి* రా 01.49 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.30 - 10.30  సా 04.30 - 06.00*

అమృత కాలం :*ఉ 08.01 - 09.50*

అభిజిత్ కాలం :*ప 11.47 - 12.39* 

*వర్జ్యం : రా 01.38 - 03.26*

*దుర్ముహుర్తం : ఉ 08.17 - 09.11 మ 12.39 - 01.31*

*రాహు కాలం : ఉ 10.35 - 12.13*

గుళిక కాలం :*ఉ 07.20 - 08.58*

యమ గండం :*మ 03.29 - 05.06*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.42* 

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.42 - 08.18*

సంగవ కాలం :*08.18 - 10.55*

మధ్యాహ్న కాలం :*10.55 - 01.31*

అపరాహ్న కాలం :*మ 01.31 - 04.08*

*ఆబ్ధికం తిధి : ఆషాఢ శుద్ధ సప్తమి*

సాయంకాలం :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.56*

నిశీధి కాలం :*రా 11.51 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.15 - 04.58*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

         

🌷 *మహా లక్ష్మీష్టకం స్తోత్రం*🌷

       🌷 *ఇంద్ర ఉవాచ*🌷


*నమస్తేఽస్తు మహామాయే* *శ్రీపీఠే సురపూజితే ।*

*శంఖచక్ర గదాహస్తే* *మహాలక్ష్మీ నమోఽస్తుతే ॥ 1 ॥*


*నమస్తే గరుడారూఢే* *కోలాసుర భయంకరి ।*

*సర్వపాపహరే దేవి* *మహాలక్ష్మీ నమోఽస్తుతే ॥ 2 ॥*


*సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట*

*భయంకరి సర్వదుఃఖ హరే దేవి*

*మహాలక్ష్మీ నమోఽస్తుతే ॥ 3 ॥*


*సిద్ధి బుద్ధి ప్రదే దేవి*

*భుక్తి ముక్తి ప్రదాయిని ।*

*మంత్ర మూర్తే సదా దేవి* *మహాలక్ష్మీ నమోఽస్తుతే ॥ 4 ॥*


*ఆద్యంత రహితే దేవి* 

*ఆదిశక్తి మహేశ్వరి* 

*యోగజ్ఞే యోగ సంభూతే* 

 *మహాలక్ష్మీ నమోఽస్తుతే ॥ 5 ॥*


*స్థూల సూక్ష్మ మహారౌద్రే* 

*మహాశక్తి మహోదరే ।*

*మహా పాప హరే దేవి* 

*మహాలక్ష్మీ నమోఽస్తుతే ॥ 6 ॥*


*పద్మాసన స్థితే దేవి*  

*పరబ్రహ్మ స్వరూపిణి ।*

*పరమేశి జగన్మాతః* 

*మహాలక్ష్మీ నమోఽస్తుతే ॥ 7 ॥*


*శ్వేతాంబరధరే దేవి* 

*నానాలంకార భూషితే ।*

*జగస్థితే జగన్మాతః* 

*మహాలక్ష్మీ నమోఽస్తుతే ॥ 8 ॥*


*మహాలక్ష్మష్టకం స్తోత్రం*

*యః పఠేద్ భక్తిమాన్ నరః ।*

*సర్వ సిద్ధి మవాప్నోతి*  

*రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥*


ఏకకాలే పఠేన్నిత్యం 

మహాపాప వినాశనం ।


*ద్వికాలం యః పఠేన్నిత్యం* *ధన ధాన్య సమన్వితః ॥*


త్రికాలం యః పఠేన్నిత్యం 

మహాశత్రు వినాశనం ।

మహాలక్ష్మీర్భవేన్-నిత్యం 

ప్రసన్నా వరదా శుభా ॥


🌷ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మీష్టకం 

స్తోత్రం సంపూర్ణం....🌞🙏🌹   

              🪷 *ఓం*🪷 

🌹 *శ్రీ మహాలక్ష్మీయై నమః*🌹 


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

           

          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

  🌹🌷🍃🌹🌹🍃🌷🌹

Panchang


 

శ్రీ తలకావేరి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 375*


⚜ *కర్నాటక  : తలకావేరి- కొడగు*






⚜ *శ్రీ తలకావేరి ఆలయం*



💠 హిందూ గ్రంధాలకు చెందిన సప్త సింధుల యొక్క ఏడు పవిత్ర నదులలో కావేరి నది ఒకటి.

తలకావేరి కావేరి నదికి మూలమని చెబుతారు. నీటి ప్రవాహమైన మూలం ఎల్లప్పుడూ కనిపించదు.



💠 సముద్ర మట్టానికి 1276 మీటర్ల ఎత్తులో, ఇది చిన్న ఆలయాన్ని కలిగి ఉంది, దీనిని తరచుగా యాత్రికులు సందర్శిస్తారు.

 ఇక్కడి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పునరుద్ధరించింది.


💠 తీర్థ కుండికే లేదా బ్రహ్మ కుండికే అని పిలువబడే ఒక చిన్న నీటి బుగ్గ ఉంది. 

ఈ నీటి బుగ్గ నుండి నది ఉద్భవించిందని నమ్ముతారు. 

ఈ నీటి బుగ్గ స్పష్టంగా భూగర్భంలో ప్రవహిస్తుంది మరియు కొద్ది దూరం తర్వాత ఉద్భవిస్తుంది. 

కుండికే దగ్గర, ఒక మందిరం ఉంది. 

మందిరం ముందు, యాత్రికులు స్నానాలు మరియు ప్రార్థనలు చేసే భారీ కోనేరు నిర్మించబడింది.


🔆 *తలకావేరి చరిత్ర*


💠 పురాణాల ప్రకారం, కావేరీ నదిని అగస్త్య మహర్షి కమండలు (పవిత్రమైన నీటి పాత్ర)లో ఉంచారు. 

అగస్త్యుడు ధ్యానం చేస్తున్నప్పుడు వినాయకుడు కాకి రూపాన్ని ధరించి అగస్త్యుని కమండలంపై కూర్చున్నాడు. 

ఇది గ్రహించిన అగస్త్యుడు కాకిని తరిమి కొట్టాడు. కానీ కాకి కమండలాన్ని తిప్పి పడేసింది. ప్రవహించడం ప్రారంభించిన కావేరి బయటకు పోయింది. కాకి అదృశ్యమైంది మరియు దాని స్థానంలో ఒక చిన్న పిల్లవాడు నిలబడి ఉన్నాడు. అబ్బాయి ఏదో చిలిపిగా ఆడుకుంటున్నాడని, రెండు పిడికిలి బిగిస్తున్నాడని అనుకుని, అగస్త్య చిన్న పిల్లవాడి తల కొట్టడానికి వెళ్లాడు. 

కానీ బాలుడు తప్పించుకోగా, అగస్త్య వెంబడించాడు. చివరకు బాలుడు అదృశ్యమయ్యాడు మరియు గణేశుడు తనను తాను అగస్త్యుడికి చూపించాడు. 


💠 గణేశుడి తలను తానే కొట్టడానికి ప్రయత్నించానని అగస్త్యుడు విస్తుపోయాడు. ప్రాయశ్చిత్తంగా, అతను రెండు బిగించిన పిడికిలితో తన తలను తానే కొట్టుకున్నాడు. కావేరీ మరియు గణేశుని మధ్య ఉన్న సంబంధం శ్రీరంగం వరకు కూడా విస్తరించింది, అక్కడ రంగనాథ ఆలయాన్ని ఏర్పాటు చేయడంలో గణేశుడి పాత్ర ఉంది.


💠 తలకావేరిలో అగస్త్యేశ్వరుడు మరియు వినాయకునికి అంకితం చేయబడిన పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. 

ఇక్కడి శివాలయంలో అరుదైన మరియు పురాతనమైన శివలింగం ఉంది. 


💠 పురాణాల ప్రకారం, అగస్త్య మహర్షి ముందు శివుడు ప్రత్యక్షమైన ప్రదేశం ఇది. ఇక్కడి దేవతను అగస్తీశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు.


💠 అక్టోబరులో వచ్చే తుల సంక్రమణ తలకావేరిని సందర్శించడానికి అత్యంత పవిత్రమైన రోజు, ఈ రోజున కావేరి దేవి భూమిపై కనిపిస్తుందని నమ్ముతారు.

అక్టోబరు నెలలో తులా సంక్రాంతి రోజున చాలా మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. 

ఈ సమయంలో, కావేరీ మాత రూపాన్ని సూచించే చిన్న బావిలో అకస్మాత్తుగా బుడగలు మరియు నురుగును చూడవచ్చు.


💠 ఈ పండుగ సందర్భంగా ఆలయాల్లో వెలిగించే వేలాది దీపాలతో ఈ ప్రాంతం ఎంతో ఆకర్షణీయంగా మారుతుంది. తులా సంక్రమణ నాడు ఈ ప్రదేశంలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.


💠 ఈ ప్రదేశంలో రెండు దేవాలయాలు ఉన్నాయి. 

ఒక ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు పురాతన శివలింగం ఉంది. 

మరొక ఆలయం గణేశుడు. 


💠 ఈ ఆలయంలో, మీరు పవిత్ర అశ్వంత వృక్షాన్ని కనుగొంటారు. పురాణాల ప్రకారం, బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు అగస్త్య మహర్షికి తమ పవిత్ర దర్శనం ప్రసాదించారు 


🔆 తలకావేరిలో చేయవలసిన పనులు


💠 తలకావేరి ఒక తీర్థయాత్ర మాత్రమే కాకుండా, ఉత్కంఠభరితమైన ప్రకృతి మధ్య అద్భుతమైన ప్రదేశం. 

ఈ ఆలయం బ్రహ్మగిరి కొండల ఒడిలో ఉత్కంఠభరితమైన ప్రదేశంలో ఉంది. 

పచ్చని పచ్చిక బయళ్లతో విస్తరించి ఉన్న కొండల పొర నిజంగా సుందరమైనది. ప్రకృతి ప్రేమికులకు విందును అందించే బ్రహ్మగిరి కొండ శిఖరానికి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది.


💠 తలకావేరి ఆలయం ఏడాది పొడవునా తెరిచి ఉంటుంది. శీతాకాలం & రుతుపవనాల అనంతర కాలాలు తలకావేరిని సందర్శించడానికి ఉత్తమమైన కాలాలు. కూర్గ్‌లో వేసవి కాలం అత్యంత రద్దీగా ఉంటుంది మరియు తలకావేరుతో సహా అన్ని పర్యాటక ప్రదేశాలు సాధారణంగా రద్దీగా ఉంటాయి.


💠 తలకావేరి భాగమండలానికి 8 కి.మీ,

 పానత్తూరు (కేరళ) నుండి 36 కి.మీ మరియు మడికేరి నుండి 48 కి.మీ దూరంలో ఉంది. 

ప్రయాణం జ్ఞానం వైపు...

 మన ప్రయాణం జ్ఞానం వైపు...


జ్ఞానం, విజ్ఞానం అనే మాటల పర్యాయపదాలుగా వినిపిస్తాయి. ఆ మాటల్లో కొంత భేదం కనిపిస్తుంది. జ్ఞానం అంటే అది వ్యవహార జ్ఞానం కావచ్చు. విశేషించి ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు కాని, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. జీవాత్మలు అల్పజ్ఞానం కలిగినవని, పరమాత్మ పూర్ణజ్ఞానం కలిగినవాడని, అతడు సర్వజ్ఞుడని ఆధ్యాత్మిక గ్రంథాలు వర్ణిస్తాయి.


లోకంలో మానవులను చూస్తే వారిలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా తెలివితేటలు ఉన్నట్లు గమనిస్తాం. కాళిదాసులాగా అందరూ కవులు కాకపోవచ్చు. జగదీశ్ చంద్రబోస్లోగా అందరూ శాస్త్రవేత్తలు కాకపోవచ్చు. అరవిందుడిలాగా, రామకృష్ణ పరమహంసలాగా అందరూ యోగులు కాకపోవచ్చు కాని- ఎవరి జ్ఞానం వారిదే. వారికున్న జ్ఞానపరిధిలోనే వారి సుఖదుఃఖానుభవాలు ఉంటాయి. జ్ఞానానికి వ్యవహారానికి సంబంధం ఉంది. అంతేకాదు, జ్ఞానానికి మోక్షానికి కూడా సంబంధముంది. కాని వ్యవహార జ్ఞానం మోక్షాన్ని ఇవ్వదు. దేనికి సంబంధించిన జ్ఞానం, దానికి సంబంధించిన ఫలాలనే ఇస్తుంది.


'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' అని భగవద్గీత చెబుతుంది. దేని మీద శ్రద్ధ ఉంటుందో దానికి సంబంధించిన జ్ఞానమే దొరుకుతుంది. విద్యార్థుల శ్రద్ధను బట్టి వారికి ఆయా విద్యలను బోధించే విధానం అనాది కాలం నుంచీ ఉంది. కపిలుడు సాంఖ్య విద్యలో, పతంజలి యోగవిద్యలో ఆరితేరినవారు కావడానికి వారి అభిరుచులే కారణం.


పూర్వం శౌనకుడనే ఋషి కుమారుడు అంగీరసుడనే గురువు వద్దకు వెళ్ళాడు. దేన్ని తెలుసుకుంటే అంతా తెలుస్తుందో, దాన్ని చెప్పమని అడుగుతాడు. పర, అపర విద్యలు రెండున్నాయని, వాటిలో పరవిద్య అనగా పరమాత్మను గురించి తెలుసుకుంటే అంతా తెలుస్తుందని గురువు చెబుతాడు. శౌనకుడు గురువాజ్ఞను పాటించి బ్రహ్మచర్యాన్ని పాటించి, వివేకాన్ని సాధించి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడు.

లౌకిక విద్యలన్నీ అపరవిద్యలే. అవి లోక వ్యవహారాల్లో మనల్ని నడిపిస్తాయి. పరావిద్య మనల్ని సాంసారిక జీవితం నుంచి నివృత్తి చేసి యోగమార్గంలో నడిపిస్తుంది.


'నేను శాస్త్రవిద్యలో కుశలుడి'నని చెప్పుకొనే స్థాయికి ఒక శాస్త్రవేత్త ఎలా ఎదగగలుగుతాడో, అట్లే 'నేను నన్ను తెలుసుకున్నాను... పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నాను... ఇంక తెలుసుకోవలసింది ఏమీ లేదు' అనే స్థాయికి యోగి అయినవాడు ఎదుగుతాడు. ఎవరే స్థాయికి ఎదగాలన్నా జ్ఞానమే ముఖ్యమైంది. అందుకు మానవుడు నిరంతరం కృషి చేయవలసి వస్తుంది. ఈ కృషినే ఆధ్యాత్మిక భాషలో తపస్సు అంటారు. తపస్సులో మనోనిగ్రహం ఉంది, స్థితప్రజ్ఞ ఉంది, ద్వంద్వ సహిష్ణుత ఉంది. లక్ష్యాన్ని చేరాలన్న కోరిక ఉంది.


కొందరు కోరికల్ని తక్కువగా భావిస్తారు గాని సాధించవలసిన లక్ష్యం తనకు గాని, ఇతరులకు గాని ఉపయోగకరమైంది అయితే తప్పక కోరిక ఆదరణీయమైందే. ఫలాపేక్ష లేకుండా ఒక పని చేయాలనుకోవడం ఉత్తమ ధర్మమని ధర్మగ్రంథాలు ప్రబోధిస్తాయి. ఇక్కడ సత్సంకల్పం లేకపోతే నిష్కామకర్మ కూడా సాధ్యం కాదు కదా!


మనిషి జ్ఞానం వైపు ప్రయాణించాలి. అప్పుడు అతడికి గమ్యం గోచరిస్తుంది. గమ్యం అనేది జ్ఞానాన్ని అనుసరించే ఉంటుంది- భౌతిక వాదులకైనా, యోగులకైనా.

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

తెలుగుని పరీక్షిద్దాం!

 ఛలో! పదండి. మీ తెలుగుని పరీక్షిద్దాం! 


క్రింది ఖాళీలను మూడక్షరాల పదాలతో పూరించండి. *ప్రతి పదము "టి" తో పూర్తవ్వాలి.*


1.ఏనుగును నియంత్రించేవాడు——.

2.చలినుండి కాపాడే వస్త్రం——.

3.పాండవులలో ఒకరినిఇలా కూడా పిలుస్తారు——.

4.రాగి,జొన్నలతో చేసే ఒక వంటకం——.

5.కాళహస్తీశ్వర శతకాన్ని వ్రాసిన కవి——.

6.పాతకాలం నటులు శివరాం ఇలా ప్రసిద్ధులు——.

7.పూర్వకాలం చలికాలం వెచ్చదనం కోసం దీన్ని వాడేవారు——.

8.ఈనిద్ర పనికి రాదంటారు——.

9.మోసగాడు——.

10.నేటి బాలలే——పౌరులు.

11.కనుబొమల మధ్యభాగాన్ని ఇలా అంటారు——.

12.పురాణాలను కొందరు ఇలా కూడాఅంటారు——.

13. కస్తూరి రంగ రంగా  మాయన్న ——రంగ రంగా, 

14.అంకెల్లో ప్రథమం——.

15.వెలుపటికి వ్యతిరేకం——.

16.వైశ్యులను ఇలా కూడా పిలుస్తారు——.

17.తిమిరం అంటే——.

18.——బ్రతుకు నాటకము అన్నాడొక కవి——.

19.సంవత్సరం పొడువునా దొరికే పండు——.

20.ఇంత మంది దేవతలుంటారని ప్రతీతి——.

21.వాక్పటిమను ఇలా కూడా అంటారు——.


కర్టెసీ: యన్. ప్రభాకర్, కర్నూలు గారు

ఒక పరీక్ష

 అందరికి ఒక పరీక్ష 


మనమందరం 10వ  తరగతి వరకు తెలుగును చదివాము. ఇప్పుడు ఆ తెలుగు కు పరీక్ష. ఒక్క 10 నిమిషాలు కేటాయించండి. కింది లింక్ ని ఓపెన్ చేసి  మీరు కరెక్ట్ ఆన్సర్ ఏదో తెలుసుకొని మీరు టచ్ చేయండి అది గ్రీన్ కలర్ అయితే కరెక్ట్ రెడ్ కలర్ వస్తే రాంగ్ . పరీక్ష వ్రాయండి.  ఇందులో మార్కులు తక్కువచ్చాయని సిగ్గు పడాల్సిన పని లేదు. అందరూ ప్రయత్నించండి.



*https://tappoppulu.irusu.in*


*ఇది మన భాష పరిరక్షణ కోసం*

.

శ్రీ గాయత్రి ఆద్యాత్మిక ఆన్ లైను మాసపత్రిక

 శ్రీ గాయత్రి ఆద్యాత్మిక ఆన్ లైను మాసపత్రిక


సెప్టంబర్ 2024 నెల వజ్రోత్సవ (75) ప్రత్యేక  సంచికగా తీర్చి దిద్దాలని సంకల్పం .  ఈ ప్రత్యేక సంచికకు మహాభారత ఘట్టాలను వ్యాస రూపంలో పంపమని ఇంతకుముందే తెలియచేయడం జరిగింది. వ్యాసకర్తలు అందరూ వెంటనే పూనుకొని 4-5 పేజీలు ఉండేటట్లు తెలుగులో టైపు చేసిన వ్యాసాలను 10-08-2024 లోగా పంపగలరు. మీరు వ్రాస్తున్న వ్యాస శీర్షిక గాని సంక్షిప్త విషయం గాని నాకు ముందుగానే తెలియచేసినట్లయితే ప్రత్యేక సంచిక మీద అవగాహన వస్తుంది. ప్రాణాళికకు అవకాశం. ఈ సంచికలో  వ్యాసానికి మీ ఫోటో – బయోడేటా కూడా ప్రచురిస్తాము. వీటిని ఇప్పటినుంచి   10-08-2024 వరకూ  పంపవలసినది. మొత్తం సంచిక 99 పేజీలు మించకుండా చూడడానికి, ముందు వచ్చినవి ముందుగా ప్రచురిస్తాము. మిగిలితే అక్టోబర్ నెల తరువాత తిరిగి అవకాశం. త్వరపడండి. 


 డా. వి.యన్. శాస్త్రి 9866242585

భారంగా కళ్ళుమూసా

 భార్య చనిపోయి ఇప్పటికీ నాలుగురోజులు గడిచిపోయాయి.. 

తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు.. 


    చివరికి ఆ ఇంట్లో నేను, నా పిల్లలు మిగిలాము...

తను నాతోపాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.. 


  ప్రతి విషయానికి 'ఏమండీ...... అనే పిలుపుకు నేను దూరమయ్యాను.. 


  నన్ను, నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు.. 


  ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు లేవు.. 


    ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది...


  నిజానికి తను వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు.. వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందనే #స్వార్థం నాలో ఉండేది.. 


    సెలవు దినాలలో నేను మరియు పిల్లలు టివి చూస్తూ ఆనందిస్తుంటే, తను మాత్రం వంటింట్లో వంట చేయడంలో బిజీగా ఉండేది.. 

  

    ఎప్పుడైనా మాతో పాటు టివి చూడటానికి కూర్చుంటే 'అమ్మా... నీళ్లు, 

'అమ్మా... తినడానికి ఏమైనా తీసుకురా.., 'కొంచెం కాఫీ పెట్టవోయ్ అంటూ .. తనని మళ్లీ వంటింట్లోకి పంపించేవాళ్ళం... 


    నేను అడగకుండానే అర్థం చేసుకుని నా అన్ని పనులు చేసి పెట్టేది.. 

ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్లకు మరియు కప్పు కాఫీ చేసుకోవడానికి తను జతగా లేదన్న చేదు నిజాన్ని మరవలేకపోతున్నాను.. 


   తన ఇష్టాలను సహితం నేను గుర్తించలేకపోయాను.. సినిమాలకు గానీ షికారులకు గానీ తీసుకువెళ్ళలేకపోయాను.. తను కూడా ఎప్పుడూ అడిగింది లేదు.. 

ఆఫీసు నుండి లేటు వచ్చినపుడు 'ఎందుకు లేటయ్యింది' అనే తన ప్రశ్నకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని.. 


    ఏమండీ... పాలవాడికి డబ్బులు.., 

పేపర్ వాడికి డబ్బులు.., కరెంట్ బిల్లు.., పిల్లల ఫీజులు కట్టే విషయం మరీ మరీ గుర్తుచేసేది.. 


     చివరకు నాకు సంబంధించిన బిపి మాత్రలు, షుగర్ మాత్రలు కూడా అయిపోకముందే తెచ్చుకొండని మరీ మరీ గుర్తుచేసేది.. ఇప్పుడు అవన్నీ గుర్తుచేయడానికి తనులేదు.. 😔


   తన గురించి ఎప్పుడూ, ఏది కావాలని నోరు తెరచి అడిగింది లేదు.. 


రాత్రి పని అంతా ముగించుకుని నా పక్కన పడుకున్నప్పుడు.. 

ఏమండీ... ఎదలో నొప్పిగా ఉంది .,నడుము నొప్పిగా ఉంది.., కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ పని అలసట వల్ల అని చెప్పి అటు తిరిగి పడుకునేవాడిని.. 


    చివరికీ ఆ ఎద నొప్పి #హార్ట్_ఎటాక్ రూపంలో వచ్చి తనను తీసుకు వెళ్లేవరకు నేను గుర్తించలేకపోయాను.. 


     ఇంట్లో అంతా కొత్త.. వంటింట్లో ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్తితి.. ఉదయం నుండి తిన్న ప్లేట్లు, పాత్రలు అన్నీ సింక్ నిండా అలాగే పడిఉన్నాయి.. 


   పిల్లలు ఏది పట్టనట్లు తమ తమ మొబైల్స్ తో బిజీగా గడుపుతున్నారు.. 

తను ఉన్నన్నీ రోజులు అన్ని సులభంగా అయ్యే పనులు.., ఇప్పుడు మాకు భారంగా అనిపిస్తున్నాయి.. 


     పిల్లలు తమకు కావాల్సిన నూడుల్స్ తిని ఖాళీ పాకెట్స్  కూడా సింక్ లో పడేసారు.. 


     అన్ని పాత్రలు కడిగేసి.. ఫ్రిడ్జ్ లో ఉన్న ఆపిల్ పండు తినేసి పడుకుందామని భారంగా బెడ్రూం వైపు నడిచాను..


లైట్ ఆఫ్ చేసి పడుకుందామనేలోపు గోడ మీద వేలాడుతున్న తన భావ చిత్రాన్ని చూసి తెలియకుండానే కళ్ళలో నీళ్లు వచ్చాయి.. 😥😥

 

     తనను నిర్లక్ష్యము చేయకుంటే నేను, నా పిల్లలు ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళం అని తలచుకుంటూ భారంగా కళ్ళుమూసాను... 😴😴

#ViralV🚩

     *****************************

#forevercouple 

#familylove 

#FamilyFirstBeforeAnythingElse 

కన్నులు ఉన్నప్పుడే వాటి విలువ తెలిసేది.. కన్నుల దృష్టి తగ్గిన తర్వాత వాటి మహత్యం తెలిసి కూడా ప్రయోజనం ఉండదు..🙏💐

హోమ్ వర్క్

 👌🤣🥴👌🥴🤣👌🥴🤣

ఒక టీచర్ తన 9వ తరగతి విద్యార్థులకు *"దొంగలపై వ్యాసం"* రాయమని హోమ్ వర్క్ ఇచ్చింది.

అందులో ఒక మేధావి వ్రాసిన వ్యాసం చదవండి. మొదట నవ్వొచ్చినా చివరకు ఇదే నిజమని మీరే మెచ్చుకుంటారు...

*ఆ మేధావి వ్రాసిన వ్యాసం చదవండి...*

దొంగలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి వారు, అది ఎలాగంటే...

* కేవలం దొంగల వల్ల మాత్రమే తాళాలు, బీరువాలు, కప్ బోర్డులు, లాకర్లు తయారుచేసేవారికి పని దొరుకుతుంది.

* ఇంటికి గ్రిల్లులు, కిటికీలు, వాకిళ్ళు తయారుచేసే వారికి కూడా పని దొరుకుతుంది.

* కాంపౌండ్ వాల్స్, గేట్స్ లాంటివి కేవలం దొంగల కొరకే కట్టడం జరుగుతుంది. 

* వాచ్మాన్స్, పోలీసుకు ఉద్యోగాలు వస్తాయి.

* CC టీవీలు, మెటల్ డిటెక్టర్లు తయారుచేసే కంపెనీలు కోట్లు సంపాదించగలుగుతున్నాయి.

* గన్స్, బుల్లెట్స్ అమ్మికూడా సంపాదిస్తున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు కట్టేవారికి ఉపాధి లభిస్తుంది.

* కోర్టు ఉద్యోగులు, జడ్జులు, లాయర్లకు ఉపాధి దొరుకుతోంది.

* ఒక దొంగ ఫెమస్ అయితే వాడి గురించి ప్రతిరోజు చూపించీ, చూపించీ టీవీ ఛానల్ల వారు తమ TRP రేటింగ్స్ పెంచుకుంటారు.

* మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు, సైకిళ్ళు, కార్లు, బైకులు కొట్టేసి అమ్మడం వల్ల కూడా ఒక సెకండ్ హ్యాండ్ మార్కెట్ సృష్టించబడుతుంది.

* కాబట్టి దొంగలు ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఎంతగానో తోడ్పడతారు.

ఈ వ్యాసం చదివిన టీచర్ ఎన్ని మార్కులు వేయాలో దయచేసి మీరే చెప్పాలి. 🤝🥴🥴🥴

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


•••••┉━•••••┉━•••••┉━•••••

*11-07-2024 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


సంతానం  కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో  వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా   పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో  రాణించవు.  ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------

వృషభం


కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు  నిర్ణయాలు  పనిచేయవు. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి.  నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది.

---------------------------------------

మిధునం


నూతన పరిచయాల వలన  ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు. పాత బుణాలు తీరి ఊరట పొందుతారు.  కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి  ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి.

---------------------------------------

కర్కాటకం


దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా   ఉండదు. ఒక  వ్యవహారంలో  ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి.  చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు  నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

---------------------------------------

సింహం


ఆకస్మిక ధన ప్రాప్తి   కలుగుతుంది. కుటుంబ సభ్యుల  ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో  గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో  పదోన్నతులు   పెరుగుతాయి.

---------------------------------------

కన్య


ధన వ్యవహారాలలో చిన్న పాటి  ఇబ్బందులు  ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు  కొంత నిరాశ  కలిగిస్తాయి. చుట్టుపక్కలవారితో  ఊహించని విభేదాలు  కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలకు జోక్యం చేసుకోకపోవడం మంచిది.

---------------------------------------

తుల


కీలక వ్యవహారాలలో కుటుంబ  సభ్యుల సహాయ సహకారాలు  అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం  లభిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి  శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

వృశ్చికం


చేపట్టిన  పనులలో  విజయం సాధిస్తారు. స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు   బంధువుల   నుంచి కీలక నమాచారం అందుతుంది.  ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.  ఉద్యోగమున అధికారుల  ఆదరణ పెరుగుతుంది. 

---------------------------------------

ధనస్సు


వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా  పాల్గొంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు  పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి.

---------------------------------------

మకరం


ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఇంటా బయట  కొన్ని పరిస్థితులు  మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో  కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా  వ్యవహరించాలి. ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు.

---------------------------------------

కుంభం


ఉద్యోగమున అదనపు  బాధ్యతల నుండి కొంత  ఉపశమనం లభిస్తుంది. పాత ఋణాలు తీరుతాయి. ప్రయాణాలలో  నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధికంగా అనుకూల వాతావరణం  ఉంటుంది.  గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారమున భాద్యతలు  సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.

---------------------------------------

మీనం


ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు  లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరుల  సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

అమృత వాక్కు

 🌸 *అమృతం గమయ* 🌸


*అమృత వాక్కు- నిత్య దీక్ష*


అహంకారము అగ్నివంటిది. అట్టి అహంకారాగ్ని నిన్నే దహించివేస్తుంది.


ఎక్కువ విను. తక్కువ మాట్లాడు. పరిశీలనాత్మక దృష్టి వృద్ధి చెంది సత్య అవగాహన కలగడం ప్రారంభమవుతుంది.


విద్య, ధనం, కీర్తి ఇబ్బడిముబ్బడి గా వున్నా అణకువ, వినయం సహజ స్వభావంగా మలచుకో. 


జరుగరానిదేదో జరిగి పోతున్నదని   ఎప్పుడూ కలత చెందకు.  నీవు చేసే ప్రతి ఆలోచన మరియు కర్మ  యొక్క ఆశయం ఆనందం పొందడమే, కలత కాదు. ఈ విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకో.


చెరువుకు కట్ట అనేది ఏ విధంగా  రక్షణ గా ఉంటుందో నీ దేహమునకు నీ మనస్సే రక్షణ. మనసును బీటలు వారనివ్వకు.


క్షణికమైన భావోద్వేగాలలో మునిగి నిరాశ చెందకు.


ఈర్ష్యాద్వేషాలు మున్ముందుగా నిన్నే దహించి వేస్తాయి. సహనాన్ని సాధన చేయి. అన్ని రోజులు ఒకేలా ఉండవు.  


ప్రతికూలమైన వాతావరణంలో కూడా క్రమశిక్షణకు కట్టుబడగలిగే సాధన కలిగి ఉండు.


త్రికరణ శుద్ధిగా అహింస పాటించు. ఎవరి సంగతి ఎలా ఉన్నా అహింస నీకే అత్యంత మేలు చేకూరుస్తుంది.


--సత్ చిత్

కోరికలను ఎలా జయించాలి

 *“కోరికలను ఎలా జయించాలి?” -* 


మాధవీయ శంకర విజయంలోని అయిదవ సర్గలో శ్రీ శంకరభగవత్పాదులవారి బాల్యం వంద శ్లోకాలలో వర్ణించబడింది. వారి రూపం ఎలా ఉన్నదో, వారి ప్రవర్తన ఎలా ఉండేదో, వారు ఎంతటి నిజాయితీపరులో మనం మాధవీయ శంకర విజయం నుండి గ్రహించవచ్చును. అందులో వారు అరిషడ్వర్గాలైన కామక్రోధమోహ లోభ మద మాత్సర్యాలను జయించారని చెప్పబడింది. ఎలా జయించిందీ కూడ చెప్పబడింది. మనకు కూడ వాటిని జయించాలని ఉంటుంది. కాని మార్గమే తెలియదు. ఆ మార్గాన్ని బోధిస్తే, కొందరైనా ప్రయత్నించి కామక్రోధాదుల నుండి ముక్తిని పొందవచ్చు.  కొంతమంది ఉపన్యాసాలు విన్నా, తమ మామూలు దారినే పోతుంటారు. మనం ఆ వర్గంలో చేరకూడదు.

కోరికను జయించటమెలా? భౌతికమైన వస్తువుల పట్ల నిర్లక్ష్యాన్ని పెంచు కోవాలి. ''భౌతికమైన వస్తువులు ఆనందదాయకం కానప్పుడు అవి మనకెందుకు ?  వాటి వలన ప్రయోజనం లేదు'' అనెడి ఆలోచనను పెంచుకోవాలి. ఒక వస్తువు ఆకర్షణీయంగా అందంగా ఉన్నదనుకున్నప్పుడే మనం దానిని కోరుకుంటాం. మనం చూసిన వస్తువుల గురించి మన కళ్ళే మనకు తెలియ చెప్పుతాయి. చక్షురింద్రియ స్వభావమది.  మనం చాలా వస్తువులను చూస్తున్నా, అన్నిటినీ మనం కోరుకొనం.  ఆనందాన్ని, సంతోషాన్ని అందించగలవని అనుకున్న వాటినే మనం కోరుకుంటాం. ఒక వేళ అన్ని వస్తువులు పనికి రానివే అని ఎవ్వరైనా భావిస్తే, అతను కోరుకోవటానికి యింకేమి ఉంటుంది ? అందువలన కామాన్ని జయించాలంటే, భౌతికమైన వస్తువులు ఆకర్షణీయమూ, ఆనందదాయికమూ కావనే ఆలోచనను పెంచుకోవాలి.

*అసారమేవ సంసారం*

*దృష్ట్వా సారదిదృక్షయా౹*

*ప్రవ్రజన్త్యకృతోద్వాహాః*

*పరం వైరాగ్యమాశ్రితాః॥*

శంకరులు సన్యాసాన్ని ఎందుకు స్వీకరించారు ? *“అసారమేవ సంసారం దృష్ట్వా”* ఇదీ కారణం .

ఏ వస్తువునైనా అనుభవిస్తే ఈ ప్రపంచంలో మనకు ఏమి దక్కుతుంది. అన్ని వస్తువులు అందంగా కనపడ్తాయి కాని, వాటి స్వభావాన్ని విశ్లేషించి చూస్తే వానిలో సారమేమీ కనపడదు.

అంతే కాదు. వానిని మనం సంపాదించేదాకానే వాటి అందం, ఆ తరువాత వానిలో ఎటువంటి ఆకర్షణ ఉండదు. నిర్లక్ష్యం కనుక నిరంతరం ఉంటే ఏ వస్తువునూ పొందటానికి ప్రయత్నం చేయవలసిన పని ఉండదు.  కోరికలను జయించటానికి ఇటువంటి మనః స్థితి అవసరం.

*-శృంగేరీ జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహస్వామివారు*

శరీరము నందు కొవ్వు

 శరీరము నందు ఏర్పడు కొవ్వు గురించి విశేషాలు - 


  *  శరీరములో అంతర్గత రసాయన చర్యల వలన ఉత్పత్తికాని Linoleic Acid కొవ్వులో ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం . 


 *  నరాలవ్యవస్థ సజావుగా పనిచేయుటకు కొవ్వు చాలా అవసరం . 


 *  కొవ్వు శరీరంలో కొన్ని ప్రత్యేక కణాలలో నిలువ ఉంటుంది. ఈ ప్రత్యేక కణాలు చర్మం అడుగున మెత్తలు ( Pads of tissue ) గా ఏర్పడటమే కాక కీళ్లు మరికొన్ని అవయవాలని కుదుపుల నుంచి కాపాడుతూ వాటికి ఇన్సులేషన్ గా ఉపయోగపడును. 


 *  కొవ్వు వేడి నుంచి మరియు చలి నుంచి మనల్ని కాపాడును. శరీరంలో నిలువ అయ్యి ఉన్న కొవ్వు కేంద్రీకృత శక్తి కింద ఏర్పడి అవసరమైన సందర్భాలలో శరీరానికి ఇంధనంగా ఉపయోగపడును . 


 * శరీరపు కొవ్వు కండరాల సంకోచ వ్యాకోచాలకు సహాయపడును. 


 *  ఆరోగ్యవంతుడు అయిన పురుషుడిలో సుమారు 15 కిలోల కొవ్వు నిలువ ఉండును. ఈ కొవ్వు సుమారు రెండు నెలలపాటు అతడి ప్రాణాన్ని నిలబెట్టును . బాగా భారీకాయులు అయిన మనుషులలో 100 కిలోల దాకా నిలువ కొవ్వు ఉండును. ఇది ఒక సంవత్సరం పాటు అతని ప్రాణాన్ని నిలబెట్టును . 


 *  స్త్రీ లలో కొవ్వు పిరుదుల వద్ద , తొడల వద్ద ఎక్కువ నిలువ ఉండును. అది వాళ్లకు గర్భధారణ కోసము , స్తన్యమును ఇవ్వటం కొరకు ఇంధనముగా ఉపయోగపడును. 


              పురుషులలో కొవ్వు పొట్ట భాగాన ఎక్కువ నిలువ ఉండును. అది పురుషులకు అతి త్వరగా శక్తిని ఇచ్చుటకు ఇంధనంగా ఉపయోగపడును. 


 *  కొవ్వులోని యాసిడ్  శరీరకణాల గోడల తయారీకి సహకరించును.ఆంగ్లము నందు Cell walls అంటారు. 


 *  శరీరం ఎదుగుదలకు సహకరించును. 


 *  చర్మపోషణం కొరకు మరియు సెక్స్ పరమైన పునరుత్పత్తికి ఉపకరించును. 


 *  కొవ్వులో మిళితమయ్యే A , D , E ,  K  విటమిన్లు జీర్ణకోశము నుంచి రక్తములో ప్రవేశించడానికి కొవ్వు ఉపకరిస్తుంది. 


 *  ఒక గ్రాము కొవ్వు ద్వారా 9 కేలరీల  శక్తి లభ్యం అగును. ఇది కార్బోహైడ్రేట్స్  అందించే శక్తికి రెట్టింపు .


 *  కొవ్వు శరీరం యొక్క ఉష్ణోగ్రత క్రమబద్ధీకరిస్తుంది  

 

 *  కొవ్వులో రెండు రకాలు ఉన్నాయి. 


       *  శాచురేటేడ్ ఫాట్ 

       

       *  అన్ శాచురేటెడ్ ఫాట్ . 


 *  శాచురేటెడ్ ఫాట్ సాధారణముగా రూము ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టిపోతుంది  . ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్స్ జంతుసంబంధ ఆహారంలో ఉంటాయి. మాంసం , చికెన్ , పాలు , వెన్న , గుడ్లు మొదలైన వాటిలో కొబ్బరినూనె , పామాయిల్ వంటి వృక్ష సంబంధ ఆహారంలో కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. 


 * అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టకుండా ద్రవస్థితిలోనే ఉంటుంది. ఇది ఎక్కువుగా వృక్షసంబంధ ఆహారంలో లభించును. వేరుశెనగ నూనె , నువ్వులనూనె , ఆలివ్ ఆయిల్ , సన్ ఫ్లవర్ ఆయిల్ , సోయాబిన్ ఆయిల్ మొదలయిన వాటిలో ఉండును. 


 *  మనం తిన్న ఆహారంలో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటే వాటిని కాలేయం కొలెస్ట్రాల్ కింద మార్చును . 


 *  ఆహారంలో మీరెంత శాచురేటెడ్ ఫ్యాట్ తీసుకుంటే అంత ఎక్కువుగా మీ రక్తములో కొలెస్ట్రాల్ శాతం పెరిగి గుండెకి రక్తాన్ని తీసుకొనివెళ్లే కరొనరీ ధమనుల లోపలి గోడల మీద నిలువ అవుతాయి. అప్పుడు ధమని ఇరుకుగా అయ్యి గుండెజబ్బులకు , గుండెపోటుకు దారి తీయును . 


 *  కొలెస్ట్రాల్ అనేది మన శరీరపు టిష్యూస్ మధ్య ఏర్పడే మైనంలా తెల్లగా ఉండే కొవ్వులాంటి పదార్థం . 


 *  శరీరంలో కొలెస్ట్రాల్ అవసరం ఎంతో ఉంటుంది . కొలెస్ట్రాల్ అడ్రెనాల్ గ్రంధులలోను , పురుషుల వృషణాలలోను , స్త్రీల అండాశయాలలోను నిలువ అయ్యి "steroid harmons " కింద మార్పు చెందటానికి ఉపకరించును. 


 *  కొలెస్ట్రాల్ పిత్తరసం ( bile ) తయారీకి ఉపయోగపడును. ఆహారం జీర్ణం అవ్వడానికి ముఖ్యముగా ఆహారంలో కొవ్వు పదార్ధాలు జీర్ణం అవ్వడానికి పిత్తరసం ( Bile ) అవసరం ఉండును. 


 *  కొవ్వు నరాల చుట్టూ ఇన్సులేషన్ లా ఉపయోగపడటమే కాకుండా శరీరపు మిగతా అవసరాలకు ఉపయోగపడును. 


 *  30 సంవత్సరాల లోపు మనిషిలో కోలెస్ట్రాల్ 

150 m/g  dl లోపల ఉండాలి . 


 *  30 సంవత్సరాల పైన ఉన్న మనిషిలో కొలెస్ట్రాల్ 

 180 m/g dl లోపల ఉండవలెను . 


 *  ఏ వ్యక్తిలో నైనా కోలెస్ట్రాల్ 200 m/g dl మించి ఉండరాదు  


 *  

                సమాప్తం                     


  

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

జూలై 11, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🌷 *గురువారం*🌹

  🌹 *జూలై 11, 2024*🌹

     *దృగ్గణిత పంచాంగం*                  

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం / శుక్లపక్షం*

*తిథి : పంచమి* ఉ 10.03 వరకు ఉపరి *షష్ఠి*

వారం :*గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం : పుబ్బ* మ 01.04 ఉపరి *ఉత్తరఫల్గుణి ( ఉత్తర )*

*యోగం : వరీయాన్* రా 04.09 తె వరకు ఉపరి *పరిఘ*

*కరణం : బాలువ* ఉ 10.03 *కౌలువ* రా 11.16 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 07.30 - 10.00  & 11.00 - 02.00*

అమృత కాలం :*ఉ 05.55 - 07.42*

అభిజిత్ కాలం :*ప 11.47 - 12.39* 

*వర్జ్యం : రా 09.11 - 11.00*

*దుర్ముహుర్తం : ఉ 10.03 - 10.55 మ 03.16 - 04.08*

*రాహు కాలం : మ 01.51 - 03.29*

గుళిక కాలం :*ఉ 08.57 - 10.35*

యమ గండం :*ఉ 05.42 - 07.19*

సూర్యరాశి : *మిధునం* 

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 05.42* 

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల :‌ దక్షిణ దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.42 - 08.18*

సంగవ కాలం :*08.18 - 10.55*

మధ్యాహ్న కాలం :*10.55 - 01.31*

అపరాహ్న కాలం :*మ 01.31 - 04.08*

*ఆబ్ధికం తిధి : ఆషాఢ శుద్ధ షష్ఠి*

సాయంకాలం :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.56*

నిశీధి కాలం :*రా 11.51 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.14 - 04.58*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


⚜️🚩 *శ్రీ దత్తాత్రేయుడు*🚩⚜️ 

కేవలం స్మరణ మాత్ర సంతుష్టుడు.

తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా

*“అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ”*

అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి,

రక్షించి కోరిన కోరికలు తీర్చు దయామయుడు శ్రీదత్తాత్రేయుడు.


🕉️⚜️🚩 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹🙏


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


           🌷 *సేకరణ*🌷

        🌹🌿🌷🌷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

        🌷🍃🌹🌹🍃🌷

  🌹🌷🌹🌷🌹🌷🌷🌹

వానజల్లులు మంచిగూర్చవు

 *వానజల్లులు మంచిగూర్చవు వద్దుమాకనిరీ జనుల్*

ఈ సమస్యకు పూరణ. 


ఈనగాచిన పంటలన్నియు నింటికెప్పుడు చేరునో


కానుపించెను కఱ్ఱిమబ్బులు కంటగింపయి తోచెనే


హానికల్గును ముంచివేయుచు నాగమాగము జేయునే


వానజల్లులు మంచిగూర్చవు వద్దుమాకనిరీ జనుల్.


అల్వాల లక్ష్మణ మూర్తి

కృషితో నాస్తి దుర్భిక్షం

 *పురాణ, ఇతిహాస,  ప్రాచీన గాథల అంశాలకు  సామాజిక అన్వయము - లక్ష్మీ దేవి ఆరాధన*




భక్తి అనగా భగవత్ మూర్తుల ఎదురుగా  ఉండి, పువ్వులతో పూజసల్పి, నైవేద్యము సమర్పించడము మాత్రమే కాదు, భగవత్ ఉనికిని అనుభవ సిద్ధము చేసుకుని, ఆ శక్తిని అర్థ యుక్తంగా అవగాహన చేసుకోవాలి. స్తోత్రాలను పఠించేటప్పుడు దైవ భక్తితో పాటు వాటిలోని కవితా సౌందర్యాన్ని గమనించాలి మరియు శబ్ద సౌష్టవం పై దృష్టి పెట్టాలి. దేవీ దేవతల స్తోత్ర మాత్రాన అభీష్టములు సిద్ధించవు.  *కనకధారా* స్తోత్రము ద్వారా *లక్ష్మీ కటాక్షము*  పొందడం శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారికే మాత్రమే సాధ్యమైనది. *శ్రద్ధ భక్తి సమన్వితః*  అని శాస్త్ర వచనము.


లక్ష్మీ  అను పదము వినగానే లక్ష్మీ దేవి సకల సంపదల ప్రదాయినిగా జనసామాన్యాలు భావించి వెంటనే *విష్ణు పత్నిమ్, ప్రసన్నాక్షిం, నారాయణ సమాశ్రితామ్*

అని స్మరిస్తారు, ఇది సర్వ సాధారణము. లక్ష్మీ పద పరిశీలన గావించుదాము.  లక్ష్మీ = లక్ష్యము = విజయము = సంపద.

సంస్కృతములో *లక్ష్మీ* అన్న పదానికి మూల ధాతువు *లక్* అనగా పరిశిలించుట, ఇదే ధాతువు ను *లక్ష్యము*

అను పదములో కూడా చూస్తాము.

*లక్ష్మీ* పదముకున్న నానార్థములలో లక్ష్యము, గురి, బుద్ధి, సంపదలు, సౌభాగ్యము, విజయము, ధైర్యము మొదలగునవి.

*లక్ష్మీని* వేదాలలో *లక్ష్మాయితి లక్ష్మీ* అంటారు...   *అనగా జనులను ఉద్ధరించే లక్ష్యము కలది*. పండితులు, పెద్దలు *ఆలక్ష్యము* కూడదు అని హెచ్చరిస్తారు. *ఆలక్ష్యము* అనగా *శ్రద్ద* లేనిది అని చెప్పుకునవచ్చును.

ఆ మాటకొస్తే *శ్రద్ద లేని* జీవితమే కూడదు.

పెద్దవాళ్ళు అంటూవుంటారు *పెందలకడ (ఉదయము) లేస్తే లక్ష్మీ ప్రదమని*.

ఒక్కసారి ఆలోచిద్దాము.....ఉదయమే లేవడము వలన *మనము* త్వర త్వరగా పనులు ముగించుకుని, మన *ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున వచ్చును*. *విద్యార్థులు* ఉదయమే లేచి చదువుకుంటే *అభివృద్ది చెందుట* తథ్యము, తద్వారా *ఉన్నత ఉద్యోగాల ప్రాప్తి*. ఒక యాజ్ఞికుల వారు ప్రాతః కాలంలోనే లేచి, స్నాన,  సంద్యావందన పూజలు ముగించుకుని, ఇతరుల ఇళ్లలలో పూజలు, వ్రతాలు, సంప్రదాయ వ్యవహారములు చేయుట వలన ఆధ్యాత్మికముగా మరియు ఆర్థికముగా (లక్ష్మీ పరంగా) బలపడుట నిశ్చయము.

ప్రతి వ్యక్తి జీవితములో *ఒక లక్ష్యము, గమ్యము, శ్రద్ధతో* ప్రయాణించిన అదియే *లక్ష్మీ ప్రదము*.  *లక్ష్యము* వైపు తీసుకుని పోయేదే *లక్ష్మీ*.


*పురాణ, ఇతిహాస ప్రాచీన గాథలను* దైనందిన జీవితములో అన్వయించుకొని జీవిత పథమును మరింత సుగమము, ఫలప్రదము చేసుకొనవచ్చును.

మనమందరము గ్రహించ వలసినదేమనగా *లక్ష్మీ* (సంపదలు, సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు) రావలెనన్న, జీవితములో *లక్ష్యము* (శ్రద్ద, గురి, గమ్యము) ఉండవలసినదే.

లక్ష్మిలలో *అష్ట లక్ష్మీల* గురించి పరిశీలిద్దాము. 

1) *ఆది లక్ష్మీ* శ్రీ మహా విష్ణువును భర్తగా చేపట్టిన లక్ష్మీ.... ఆది లక్ష్మీ.  అర్థము...విశ్వమంతా వ్యాపించిన వాడు విష్ణువు. విశ్వ వ్యాప్తంగా లక్ష్యము, ప్రయత్నము, శ్రద్ద ఎక్క డ ఉంటాయో అక్కడ లక్ష్మి (సంపదలు) ఉంటుందని చెప్పడమే ఆది లక్ష్మీ *పదమునకు* సంకేతము.

2) *ధైర్య లక్ష్మీ* జీవిత సమరములో ఆటు పోట్లను ఎదుర్కొనే ధైర్యమును కల్గి ఉండడమే ధైర్య లక్ష్మీ.

3) *ధాన్య లక్ష్మీ* సర్వ మానవాళికి ఆకలి తీర్చే శ్రమ, ప్రయత్నమే ధాన్య లక్ష్మీ.

4) *గజ లక్ష్మీ* రాజ లాంఛనాలకు, వైభోగాలకు నిలువెత్తు నిదర్శనము గజము. అంటువంటి భోగ భాగ్యాల కొరకు కృషి చేయడమే గజ లక్ష్మీ.

5) *సంతాన లక్ష్మీ*  ఎన్ని సంపదలున్నా సంతానము లేకపోవడము, జీవితమే శూన్యమనిపించును. జగత్ కళ్యాణము ఉండదు. సంతాన ప్రయత్నాలే సంతాన లక్ష్మీ.

6) *విజయ లక్ష్మీ* జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలతో పోరాటమే విజయ లక్ష్మీ.

7) *విద్యా లక్ష్మీ* అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞాన మార్గాన్ని చూపించే విద్యను సంపాదించడమే విద్యా లక్ష్మీ.

8) *ధన లక్ష్మీ*  "ధనం మూలమిదం జగత్" అనునది లోకోక్తి. జీవితావసారాలు తీరుటకు ధన సంపాదన ప్రక్రియనే ధన లక్ష్మి.

*లక్ష్మీ ప్రసన్నమునకు కష్టే ఫలి సూత్రమే ముఖ్యము*

పురాణాలు, శాస్త్రాలు నిర్దేశించే వ్రతాలు, నోములు, దైనందిన పూజలు నిరర్థకమా అంటే కానే కాదు.

*శాస్త్ర విహితము, సశాస్త్రీంగా చేసే ఏ కార్యమైనా లక్ష్యమును సూచించేదే* ఎటొచ్చి  ఆ కార్య క్రమాలన్ని..... *శ్రద్దా భక్తి సమన్వితః మరియు మనసా వాచా కర్మణా* ప్రతిపాదికపై ఉంటేనే అనుకున్న లక్ష్యములు సాధించగలము.

*ప్రతి పూజలో ఆడంబరములు తక్కువ, ఆధ్యాత్మికత ఎక్కువ ప్రతిబింబించ వలెను*

చివరిగా....

ఋషులు, పారమార్థికులు  *ఆలక్ష్మీ నాశమామ్యహం* అని భగవంతుణ్ణి కోరుతారు. అనగా తమను అశ్రద్ద, లక్ష్యము చెరనీయరాదు అని.

*అలక్ష్మీర్కే నమృతాం*

అనగా సకల దారిద్య్రములను నశింప జేయుము..... అని భగవంతుని కొరుదాము.


*కృషితో నాస్తి దుర్భిక్షం* అని కూడా విని యున్నాము.


ధన్యవాదములు.

🙏🙏🙏

యోగక్షేమం వహామ్యహం

 ఒక్కోసారి దేవుడు ఇంగ్లాండు నుండీ కూడా వస్తాడు ! 

కొన్నేళ్ళ క్రితం మన దేశంలో [ ఉత్తరభారతం] ఒక ఆయుర్వేదవైద్యుడు వుండేవారు. పేద డాక్టరు .  భగవద్గీత లో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో కచ్చితంగా అలానే జీవిస్తూవుండేవాడు. ఒకరోజుకు తన భార్య , కూతురు , తనకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంతే సంపాదించేవాడు. [ నన్ను నమ్మి ,  అహంకారం వదలి , నాకు శరణాగతి చేసుకొన్న వారి బాగోగులు నేనే చూసుకొంటాను - అనన్యాశ్చింతయోమా  ...యోగక్షేమం వహామ్యహం - 9 వ అధ్యాయం , 22 వ శ్లోకం] ] ఉదాహరణకు రోజుకు 80 రూ. కావాలి. ఎనిమిదిమంది పేషెంట్లు వచ్చారు , 80 రూ. వచ్చింది. అంతే . తొమ్మిదవ పేషెంటు దగ్గర డబ్బు తీసుకోడు. ఉచితం. ఎప్పుడూ దైవ చింతనలో వుండేవాడు.ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంటికి ఏమి కావాల్నో వ్రాసి ఇస్తుంది. దాన్ని తీసుకొని ఆస్పత్రికి వెళతాడు. ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు  [ ఫీజు రూపంలో ] రాగానే ఇక ఫీజు తీసుకోడు. రేపు ఎలా ? అనే ఆలోచన లేదు. ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారి అవుతాడా ? వాసుదేవమితి సర్వం .      


ఒక రోజు ఆసుపత్రి [ చిన్న గది] ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి , డాక్టరు దగ్గరికొచ్చి ' నన్ను గుర్తుపట్టారా ? '' అని అడిగాడు. '' క్షమించాలి , లేదు , '' అన్నాడు డాక్టరు. అపుడు ఆయన ఇలా చెప్పాడు : '' 15 ఏళ్ళ క్రితం ఒక రాత్రి ఈ వూరిగుండా వెళుతున్న నేను , ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు ఆగాను. నా డ్రైవర్ కారు రిపేరు చేస్తున్నాడు. అపుడు మీరు వచ్చి ' లోపలికి రండి ' అన్నారు. గదిలోకొచ్చి కూర్చొన్న నన్ను చూసి ' మీరు ఏదో దిగులు పడుతున్నారు , ఆరోగ్యం సరిగాలేదా ? ' అన్నారు. అపుడు మీ టేబిల్ దగ్గర సుమారుగా ఆరేళ్ళు వుండే ఒక చిన్న పాప మిమ్మల్ని ' నాన్నా , ఇక ఇంటికి వెళదాం , రండి ' అని పిలిచింది. ' కాసేపు ఆగమ్మా , కారు వెళ్ళాక మనం ఇంటికివెళదాం ,' అన్నారు. ఆ చక్కటి పాపను చూస్తూ ఇలా అన్నాను ' , నేను ఇంగ్లాండులో వుంటాను. మాకు సంతానం లేదు. మా ఇంట్లో ఆడపాప వుండాలని మాకు ఎంతో కోరిక , కానీ తీరలేదు. ఇపుడు ఈ పాపను చూస్తే , నా బాధ  గుర్తుకొచ్చింది ,'' అన్నాను. మీరు రెండు పొట్లాల ఔషధం తయారుచేసి ' మీరు , మీ భార్య దీన్ని 60 రోజుల పాటు ఒక్కో గుళిక చొప్పున  తీసుకోండి 'అన్నారు.  నేను వీటికి డబ్బు ఎంత చెల్లించాలి ?  అని అడుగుతుంటే అపుడు మరో పేషెంటు వచ్చి తన జబ్బు చెప్పి మీదగ్గర మందు తీసుకొని వెళ్ళిపోతూ , నాదగ్గరకొచ్చి ' ఈరోజు కుటుంబం గడవడానికి ఎంత అవసరమో , ఆ డబ్బు అందాక వారు ఇక డబ్బు తీసుకోరు ' అని అంటూ  వెళ్ళిపోయాడు. కారు రిపేరు అయ్యింది. నేను మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. దిల్లీ వెళ్ళి అక్కడినుండి ఇంగ్లాండు వెళ్ళాం. ఇంగ్లాండు డాక్టర్లు మాకు సంతానం ఇక కలగదు అని చెప్పిన తరువాత కూడా , మీరంటే నాకు కలిగిన అపారమైన గౌరవం ,వృత్తిపట్ల మీ అంకిత భావం , మీ వ్యక్తిత్వం చూసాక నమ్మకం కలిగి నేను , రాధిక ఔషధం తీసుకొన్నాం. ఇపుడు మాకు ఇద్దరు ఆడపిల్లలు. పుత్తడిబొమ్మల్లావుంటారు. మీరు మాకు దేవుడితో సమానం. 


అప్పటినుండీ మీ ఋణం ఎలా తీర్చుకోవాలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం. నాకు ఇక్కడ భారత్ లో ఒక అక్కగారు వున్నారు . దురదృష్టం కొద్దీ ఆమె భర్త రోడ్డుప్రమాదం లో మరణించారు. వాళ్ళకో కూతురు. ఆమె పెళ్ళి బాధ్యత నేనే తీసుకొన్నాను. అపుడు నాకు 15 ఏళ్ళక్రితం ఈగదిలో నేను చూసిన మీ అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆమె కూడా ఇపుడు పెళ్ళి వయసుకు వచ్చివుంటుంది. ఆమె పెళ్ళికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. మాకు ఆ అవకాశం ఇవ్వండి. ఈనెల 24 న మా అక్క కూతురి  పెళ్ళి . మీ అమ్మాయి పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిసిన పద్దతిలో లెక్కవేసి ఈడబ్బు తెచ్చాను.మీరు డబ్బు కోసం ఎవరిదగ్గరా అప్పు చేయకండి. నేనున్నాను.ఇది మీరు తీసుకోవాలి '' అంటూ ఒక కవరులో పెద్ద మొత్తం డబ్బును టేబిల్ మీద పెట్టాడు.  అపుడు డాక్టరు తన జేబులోంచి ఈ రోజు కుటుంబానికి ఏమి కావాలో తన భార్య ఆరోజు ఉదయం వ్రాసి ఇచ్చిన అవసరాల లిస్టు ను అతనికి చూపించాడు. అందులో చివరన ఇలా వ్రాసివుంది : ' ఈనెల 22 న మన అమ్మాయి పెళ్ళి. మన దగ్గర వంద రూపాయలు కూడా లేవు. ఆలోచించండి.' 


అనన్యాశ్చింతయోమా....యోగక్షేమం వహామ్యహం

(ఈ కథ చదివిన తర్వాత ఒకరిద్దరికైనా కన్నీరు వస్తుంది కదా.

స్కంద పంచమి*

 *ఈరోజు స్కంద పంచమి*


*స్కంద పంచమి , కుమార షష్టి / స్కంద షష్ఠి రోజుల్లో ఇలా చేస్తే వివాహ సంతాన ప్రతిబంధకాలు తొలగును*


     తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నమ్మకం ఎక్కువే ! పిల్లలు పుట్టకపోయినా , జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని నమ్ముతారు. ఇంతకీ ఆ *సుబ్రహ్మణ్యస్వామి జన్మించింది ఎప్పుడూ అంటే.... కుమారషష్టి రోజే* !


     శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడట. అంతే ! మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేశాడు. అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దాంతో ఆయన దాన్ని గంగానదిలో రెల్లుపొదల మధ్య విడిచిపెట్టాడు. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది.

 

*కుమారస్వామి అవతరించింది ఆషాఢమాసంలోని షష్టి తిథినాడే అని కొందరి నమ్మకం. అందుకే ఆ రోజుని కుమారషష్టి* పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కుమారస్వామి ఆరు ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు. అందుకే ఆయనకు *షష్టి తిథి* అంటే చాలా ఇష్టం. ఇక *ఆషాఢమాసంలో తను పుట్టిన రోజైన కుమారషష్టి అంటే మరీ ఇష్టం.*

కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా చేసుకుంటారు. ఆ ముందు రోజుని *స్కందపంచమిగా* పిలుస్తారు. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి , కుమారషష్టి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో వల్లీదేవసేన సమేతంగా ఉన్నా స్వామి ఆలయానికి వెళ్తి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుంది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించినా , సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే మనకి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే !

 

*స్కందపంచమి , కుమారషష్టి* రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయట. సంతానం కలగాలన్నా , సంపదలు రావాలన్నా ఈ రోజు స్వామిని పూజించాలి. 

*వివాహ,సంతాన ప్రతిబంధకాలు తొలగి సాంప్రదాయిక వివాహం సత్సంతానం కోరుకునేవారు ఈ రెండు రోజుల పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కి అర్చనలు చేసుకొనవలెను.*

ఈనాడు స్కందపంచమి,రేపు స్కందషష్టి ల సందర్భంగా మన కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లోని కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కి ప్రత్యేక అభిషేకాద్యర్చనలు నిర్వహించబడును. *కల్యాణసిధ్ధి, సంతానప్రాప్తి కోరుకునే భక్తులు వారి గోత్రనామాలను 9492050200 కు వాట్సాప్ చేయగలరు.*

 


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

యూనివర్సిటీ వారి స్పాట్

 *శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా విద్యాలయం (డీమ్డ్ యూనివర్సిటీ). కాంచీపురం.*


  ఈ నెల 21తేదీన  హన్మకొండ లోని  గోపాలపురం శారదాంబ దేవాలయం ప్రక్కన విధ్యారణ్య బ్రాహ్మణ భవనం నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కంచి యూనివర్సిటీ వారి స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ జరుగును. కావున ఈ సమాచారం మీ తోటి విద్యార్థిని విద్యార్థుల కు పంపించండి.ఈ నెల 16 వ తారీకు వరకు కౌన్సిలింగ్ లో పొల్గోనే వారి పేర్లు నమోదు చేసుకో గలరు. 


కంచి యూనివర్సిటీలో

కేవలం ఇంటర్మీడియట్ లో మేథ్స్ కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ - ఈ సబ్జెక్ట్ లలో రెండేళ్ల మార్కుల ఆధారంగా మరియు

*మెరిట్* ను గౌరవిస్తూ 

స్టూడెంట్స్ కి అడ్మిషన్స్ ఇవ్వబడును‌.‌లిమిటెడ్ సీట్లు మాత్రమే కలవు.


**ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,‌డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలు గా అందించడం యూనివర్సిటీ ప్రత్యేకత**


మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్ లు కలవు...

న్యాయమైన ఫీజులతో

చక్కని హాస్టల్ వసతులు..

ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ/శిక్షణ.


అన్ని కోర్సులు అందుబాటులో...B.E ( ECE, EEE, MECHANICAL,  CIVIL MECHATRONICS), B.Tech (I.T) with  specialisations in AI,ML, Data Science, Cyber security, I.O.T., Electrical Vehicles, Sensor technology,  Microgrid technology, 3D printing,  etc..

B.Com. BBA, BSc (Data science and cyber security) MBA, MCA, B.Ed, MSc (Physics, Chemistry, Maths)


అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి*


*ఇటువంటి సదవకాశం మీరు పొందడమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి*. ఈ క్రింద తెలియ బరచిన మొబైల్ నంబర్ లను సంప్రదించి మీ రిజిస్ట్రేషన్ లను  ఈ నెల 16 వ తారీకు లోపు చేసుకో గలరు.


*మరిన్ని వివరాలకు*...

బ్రహ్మశ్రీ కుప్పా జగన్నాథ శర్మ  - 98496 58030      శ్రీ రవి చంద్ర.    9866765439            

----------


_--------------

దానముచేత

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


        *శ్లోకము*


*దానేన భూతాని వశీ భవన్తి*

*దానేన వైరాణ్యపి యాన్తి నాశమ్|*

*పరోఽపి బంధుత్వముపైతి దానైః*

*దానం హి సర్వవ్యసనాని హన్తి||*


*తాత్పర్యము*


"*దానముచేత సకల ప్రాణులను వశము చేసుకొనవచ్చును.... దానముచేత శత్రువులు కూడా నశింతురు..... దానముచేత ఇతరులతో బంధుత్వమును ఏర్పరుచుకోవచ్చును..... దానము సమస్త కష్టములనూ తొలగించును* "...


 ✍️🌹💐🌷🙏

ఆచార్య సద్భోదన

 080724-1.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀208.

నేటి...


                *ఆచార్య సద్భోదన*

                   ➖➖➖✍️


               

```

ప్రారబ్ధకర్మ అంటే ‘భగవంతుడు మనకు ఈజన్మకు కేటాయించిన కర్మ‘ అనుభవించక తప్పదు.


అయితే దేవుడిని పూజించడం ఎందుకు అని చాలామందికి సందేహం కలుగుతూంటుంది.


జీవకోటిలో ఉత్తమమైన మానవజన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతగా భగవంతుని మనం పూజించాలి. దేవుడు మనిషిలా కృతఘ్నుడు కాదు. 


దేవతారాధన, ధర్మాచరణ చేస్తున్నవారి సంచిత కర్మలను... అంటే వెనక జన్మ కర్మలను నిప్పులో పడిన దూది వలె దహింపజేస్తాడు.


ఆగామి కర్మలను అంటే రాబోయే జన్మకు కర్మను తామరాకు మీద నీటి బిందువు వలె ఫలమంటకుండా చూస్తాడు.


ఘోర ప్రారబ్ధ కర్మను సైతం సుఖ ప్రారబ్దంగా మారుస్తాడు.


భగవదనుగ్రహమే మనిషి మనుగడకు మూలం.✍️```

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*

                     🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774.

లింక్ పంపుతాము.దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు🙏

పంచాంగం 11.07.2024

 ఈ రోజు పంచాంగం 11.07.2024 Thursday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస శుక్ల పక్ష పంచమి తిధి బృహస్పతి  వాసర: పూర్వఫల్గుని నక్షత్రం వరీయాన్ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పంచమి పగలు 10:04 వరకు .

పూర్వఫల్గుని మధ్యాహ్నం 01:05 వరకు.


సూర్యోదయం : 05:52

సూర్యాస్తమయం : 06:51


వర్జ్యం : రాత్రి 09:12 నుండి  11:00 వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:12 నుండి 11:04 వరకు తిరిగి మధ్యాహ్నం 03:23 నుండి 04:15 వరకు.


అమృతఘడియలు : ఉదయం 05:56 నుండి 07:43 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.



శుభోదయ:, నమస్కార: