11, జులై 2024, గురువారం

అమృత వాక్కు

 🌸 *అమృతం గమయ* 🌸


*అమృత వాక్కు- నిత్య దీక్ష*


అహంకారము అగ్నివంటిది. అట్టి అహంకారాగ్ని నిన్నే దహించివేస్తుంది.


ఎక్కువ విను. తక్కువ మాట్లాడు. పరిశీలనాత్మక దృష్టి వృద్ధి చెంది సత్య అవగాహన కలగడం ప్రారంభమవుతుంది.


విద్య, ధనం, కీర్తి ఇబ్బడిముబ్బడి గా వున్నా అణకువ, వినయం సహజ స్వభావంగా మలచుకో. 


జరుగరానిదేదో జరిగి పోతున్నదని   ఎప్పుడూ కలత చెందకు.  నీవు చేసే ప్రతి ఆలోచన మరియు కర్మ  యొక్క ఆశయం ఆనందం పొందడమే, కలత కాదు. ఈ విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకో.


చెరువుకు కట్ట అనేది ఏ విధంగా  రక్షణ గా ఉంటుందో నీ దేహమునకు నీ మనస్సే రక్షణ. మనసును బీటలు వారనివ్వకు.


క్షణికమైన భావోద్వేగాలలో మునిగి నిరాశ చెందకు.


ఈర్ష్యాద్వేషాలు మున్ముందుగా నిన్నే దహించి వేస్తాయి. సహనాన్ని సాధన చేయి. అన్ని రోజులు ఒకేలా ఉండవు.  


ప్రతికూలమైన వాతావరణంలో కూడా క్రమశిక్షణకు కట్టుబడగలిగే సాధన కలిగి ఉండు.


త్రికరణ శుద్ధిగా అహింస పాటించు. ఎవరి సంగతి ఎలా ఉన్నా అహింస నీకే అత్యంత మేలు చేకూరుస్తుంది.


--సత్ చిత్

కామెంట్‌లు లేవు: