ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
26, జనవరి 2026, సోమవారం
మాఘ పురాణం - 9వ*
🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️
*🌷మంగళవారం 27 జనవరి 2026🌷*
_*మాఘ పురాణం - 9వ*
_*అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*27వ తేదీ మంగళవారం*
*వేకువఝామున*
*చదువు కొనుటకు*
``
మాఘ పురాణంలోని తొమ్మిదవ అధ్యాయం, గంగానది పవిత్రత, దాని జలాల శక్తి గురించి వివరిస్తుంది.
భగవంతుడి నుండి వచ్చిన గంగానది అన్ని పాపాలను తొలగిస్తుందని, దానిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ అధ్యాయం గంగానది ప్రాముఖ్యత, దాని జలాల శక్తిని తెలియజేస్తుంది.
*గంగా జలం మహిమ*```
ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివ మహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మొదటగా శ్రీరామచంద్రుడు రావణుని సంహరించుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి, వారధి దాటి రావణుని సంహరించెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి, మహా బలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలు దేరే ముందు శివని పూజ చేసియే యుద్ధ రంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి. కనుక, పూజలలో శివపూజ పవిత్రమైనది.
అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా, గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినదియు, శివుని శిరస్సు నుండి ప్రవహించు నట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగా జలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని, “గంగ గంగ గంగ” అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగా జలముతో సమానమయినవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక, మాఘమాసములో గంగ స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను..
కొంత కాలము క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్ని రోజులకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను, బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి, మోహించి, అతనిని సమీపించి చుట్టు ముట్టి మమ్మల్ని వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విధ్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా, ఆ విద్యార్థియూ, మీరుకూడ పిశాచులగుదురుకాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి, అందరిని బాధించి, ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి.
కొంతకాలమునకు ఒక సిద్దుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లి దండ్రులు, తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగి పోవునని చెప్పగా వారట్లు చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి.
ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్మ్యమే కారణము.
మాఘమాస నందు చేయు నదీ స్నానము మానవులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడ పవిత్రమైనది.
ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానము అచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేక పోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ కామక్రీడలలో తేలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించు చుండిరి.
ఆ దృశ్యమును చూచి మండి పడుచు ‘తపస్వివై యుండి కూడా యిలా కామ తృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాక!’ అని విశ్వామిత్రుని, పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు.
విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము”, అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది, గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను.
పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*మాఘపురాణం తొమ్మిదవ* *అధ్యాయము సంపూర్ణము*
*🌷సేకరణ🌷*
*న్యాయపతి నరసింహారావు*
ఔషధే చింతయే ద్విష్ణుం
🙏🏻 ఓం నమో నారాయణాయ నమః 🙏🏻
ఔషధే చింతయే ద్విష్ణుం
భోజనే చ జనార్ధనమ్ |
శయనే పద్మనాభం చ
వివాహే చ ప్రజాపతిమ్ ||
యుద్ధే చక్రధరం దేవం
ప్రవాసే చ ప్రజాపతిమ్ |
నారాయణం తనుత్యాగే
శ్రీధరం ప్రియసంగమే ||
దుస్స్వస్నే స్మర గోవిందం
సంకటే మధుసూదనమ్ |
కాననే నారసింహం చ
పావకే జలశాయినమ్ ||
జలమధ్యే వరాహం చ
పర్వతే రఘునందనమ్ |
గమనే వామనం చైవ
సర్వకాలేషు మాధవమ్ ||
షోడశైతాని నామాని
ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వపాప వినిర్ముక్తో
విష్ణు లోకే మహీయతే ||
ఔషధసేవనం బాచరించెడి వేళ
వినుతించ వలయును 'విష్ణు' నెపుడు
భోజనమ్మును తాను భుజియించు వేళలో
తలచ తగును 'జనార్దను'ని మదిని
శయనించు సమయాన సంతృప్తి తోడను
ప్రార్తించ వలయును 'పద్మనాభు'
ప్రార్థించవలె 'ప్రజాపతి' యంచు వినయాన
పరిణయ వేళందు భక్తితోడ
సమరంబు నందున 'చక్రధరా' యంచు
జపియించ వలయును జయము పొంద
పరదేశమున నుండ హరిని 'ప్రజాపతి'
యనుచు పలుకతగు న్నాత్మ యందు
తనువు నొదులు వేళ తా బల్క వలయును
'నారాయణా' యంచు నయము గాను
ప్రియసంగమమునందు ప్రియమార స్వామిని
'శ్రీధరా' యనుచును చెప్ప తగును
దుస్వప్నముల యందు దుఃఖించకను తాను
'గోవింద' యని మది కొలువతగును
సంకటసమయాల సద్భక్తి తోడను
'మధుసూద'ననతగు మదిని నరుడు
విపినంబునందున వెఱవక మనుజుండు
కోరి దల్చ తగును 'నారసింహు'
అగ్నిజ్వాలల మధ్య ననయంబు మదియందు
'జలశాయి' భజనమ్ము సల్ప తగును
పర్వతంబుల మధ్య 'పట్టాభిరఘురాము'
నెంచంగ వలయును నెపుడు నరుడు
గమనంబు నందున కల్కంగ నశ్రమ
భక్తి నెంచ తగును 'వామనుడి'ని
సర్వకాలములందు సర్వేశు "మాధవున్"
మదిదల్చ వలెనెప్డు మానవుండు
శుభము లిచ్చు "విష్ణు షోడశనామమ్ము "
లుదయ వేళ యందు చదివి తేని
సర్వ పాపరాశి సమసియున్ మనుజుండు
విష్ణునెలవు చేరు విమల మతిని.
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
*🌹26జనవరి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*భీష్మాష్టమి*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*మాఘమాసం - శుక్ల పక్షం*
*తిథి : అష్టమి* రా 09.17 వరకు ఉపరి నవమి
*వారం : సోమవారం* (ఇందువాసరే)
*నక్షత్రం : అశ్విని* మ 12.32 వరకు ఉపరి *భరణి*
*యోగం : సాధ్య* ప 09.11 వరకు ఉపరి *శుభ*
*కరణం : భద్ర* ఉ 10.16 *బవ* రా 09.17 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం : *శేషం ఉ 07.11 వరకు*
అభిజిత్ కాలం : *ప 11.57 - 12.43*
*వర్జ్యం : ఉ 08.43 - 10.15 & రా 09.35 - 11.05*
*దుర్ముహూర్తం : మ 12.43 - 01.28 & 02.59 - 03.44*
*రాహు కాలం : ఉ 08.04 - 09.30*
గుళికకాళం : *మ 01.45 - 03.10*
యమగండం : *ఉ 10.55 - 12.20*
సూర్యరాశి : *మకరం*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం :*ఉ 06.49*
సూర్యాస్తమయం :*సా 06.08*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.40 - 08.56*
సంగవ కాలం : *08.56 - 11.12*
మధ్యాహ్న కాలం : *11.12 - 01.28*
అపరాహ్న కాలం : *మ 01.28 - 03.44*
*ఆబ్ధికం తిధి : మాఘ శుద్ధ అష్టమి*
సాయంకాలం : *సా 03.43 - 06.01*
ప్రదోష కాలం : *సా 06.01 - 08.32*
రాత్రి కాలం : *రా 08.32 - 11.55*
నిశీధి కాలం :*రా 11.55 - 12.45*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58 - 05.49*
******************************
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*
*జ్ఞాత్వైతత్క్షణ భంగురం*
*సపది రే త్యాజ్యం మనో దూరతః*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
మాఘ పురాణం - 8వ*
🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️
*🌷 సోమవారం 26 జనవరి 2026🌷*
_*మాఘ పురాణం - 8వ*
_*అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*26వ తేదీ సోమవారం*
*వేకువఝామున*
*చదువు కొనుటకు*
```
మాఘ పురాణంలోని ఎనిమిదవ అధ్యాయం, శక్తిమత్తు గర్వంతో ఉన్న రాజు కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు చేసిన జ్ఞానోపదేశాన్ని వివరిస్తుంది.
వినయం, సహనం, దయల ప్రాముఖ్యతను,
ఈ లోకము భ్రమేనని, నిజమైన ఆనందం భగవంతుడిలోనే ఉందని దత్తాత్రేయుడు బోధిస్తాడు.
కార్తవీర్యార్జునుడు వాటిని అనుసరించి గొప్ప గురువుగా మారతాడు.
ఈ కథ గర్వం మనకు ఎటువంటి మేలు చేయదని, వినయంతో ఇతరుల నుండి నేర్చుకుంటేనే జ్ఞానం, ఆనందం లభిస్తాయని చెబుతుంది. ```
*దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశము ఇచ్చుట*```
దత్తాత్రేయుడు బ్రహ్మా,విష్ణు,మహేశ్వరుల యొక్క అంశమున జన్మించాడు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసాడు.
త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు.
దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి “గురువర్యా! మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొంటినీ, కాని మాఘమాసము యొక్క మహత్మ్యమును విని ఉండలేదు. కావున, మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించ వలసినదిగా కోరుచున్నాను” అని దత్తాత్రేయుని కోరెను.
దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.
“భూపాలా! భరత ఖండములో ఉన్న పుణ్య నదులకు సమమైన నదులు ప్రపంచమునందు ఎచ్చటా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. అందునా మాఘమాస మందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మ రాహిత్యము కూడ కలుగును. గనుక, ఏ మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘ స్నానము చేసి, ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచ మహపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు” అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి తెలుపుచుచూ ఇంకనూ యీవిధముగా చెప్పుచున్నాడు..
“పూర్వ కాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులు వలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు, బంగారు నగలు, నాణేములు రాసుల కొలది ఉన్నవాడు. కొంత కాలమునకు హేమాంబరుడు చనిపోయెను, తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని, యిష్టము వచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ చేరదీసి, కుల భ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించు చుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు, ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమ దూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి, పెద్ద వానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవ వానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో రెండోవాడు యిలా అన్నాడు..
“అయ్యా! మేము ఇద్దరూ ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును, నాకు స్వర్గమును యేల ప్రాప్తించును” అని అడిగెను.
ఆ మాటలకు చిత్రగుప్తుడు “ఓయీ వైశ్య పుత్రా! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతి దినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవు అయినావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు, ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహా పాపములు కూడ నశించును.
కాన విప్రుని చూచుట వలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియునూ కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను” అని చిత్రగుప్తుడు వివరించెను.
“ఆహా! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా” అని వైశ్య కుమారుడు సంతసించి, దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.```
*మృగ శృంగుని కథ!*```
గత అధ్యాయములో తెలిపిన విధంగా మరణించిన ముగ్గురు కన్యలను తిరిగి బ్రతికించుటకు గాను మృగశృంగుడు యముడు కోసం తప్పస్సు చేసిన విధానం యమలోక విశేషములు మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి మేల్కొనినటుల లేచి, వారు యమలోకము నందు చూసిన వింతలూ, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి. యమలోక మందలి జీవులు తమ పాప పుణ్యములను బట్టి శిక్షలను అనుభవించు చున్నారు. ఒక్కొక్క పాపి తానూ చేసిన పాపకర్మలకెంతటి శిక్షలననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింప జేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విష కీటకములున్న నూతిలో త్రోసి వేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయింది.
అపుడా కన్యలు వారిని ఓదార్చి “మీరు భయపడకుడు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయమొక్కటే యున్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసము నందు నదీ స్నానము చేయుట తనకు తోచిన దానములు, ధర్మములు, జప తపములు యిత్యాది పుణ్య కార్యములు చేయుట వలన అంతకు ముందు చేసియున్న పాపములు అన్నియు పటాపంచలై నశించుటయే గాక, స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్దమయినది.
మాఘమాసమందు నదీస్నానము ఆచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసము అంతయు పురాణ పఠనం చేసినను, లేక వినినను, శ్రీహరి దయకు పాత్రులగుదురు గాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుట కంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి.``
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*మాఘపురాణం ఎనిమిదవ* *అధ్యాయము సంపూర్ణము*
*🌷సేకరణ🌷*
*న్యాయపతి నరసింహారావు*
స్వామి వివేకానంద స్ఫూర్తి.... రోజుకో సూక్తి....
భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
స్వామి వివేకానంద స్ఫూర్తి.... రోజుకో సూక్తి....
సత్సంకల్పం, నిష్కాపట్యం మరియు అఖండప్రేమ అనేవి ప్రపంచాన్ని జయించగలవు. ఈ సుగుణాలు ఉన్న ఒక్క వ్యక్తి లక్షలకొద్ది కపటుల, పశుసమానుల కుతంత్రాలను వమ్ముచేయగలడు.
శుభ ఇందు వారే 🔱Happy Monday.
Swami Vivekananda’s Wisdom for
Daily Inspiration.
Good motives, sincerity, and infinite love can conquer the world. One single soul possessed of these virtues can destroy the dark designs of millions of hypocrites and brutes.
⚜️Meeku, mee kutuambaniki 77th REPUBLIC DAY SUBHAKANKSHALU.👩🎨
మహాభారతము
🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*సోమవారం 26 జనవరి 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
1️⃣1️⃣6️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*116 వ రోజు*
*వన పర్వము పంచమాశ్వాసము*
*జీవుడియాత్ర*```
ఇక జీవుడు ఎలాంటి వాడో చెప్తాను. జీవుడు అనఘుడు, సనాతనుడు, శాశ్వతుడు. జీవునికి పాపం అంటదు. కర్మానుసారం శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు. కొంత కాలానికి శరీరం జీర్ణమై మరణిస్తుంది కాని జీవుడు మరణించడు. శరీరాన్ని విడిచిన జీవుడు వేరు శరీరాన్ని ధరిస్తాడు.
ఆ శరీరంలో సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. ఇలా జీవుడు ఎన్నో దేహబంధాలలో చిక్కుకుంటాడు. మహానుభావా! నీవు పాపపుణ్యముల వలన కలుగు దేహ బంధముల గురించి వివరిస్తాను. స్థిరమైన పుణ్యం చేసిన వాడికి దైవత్వం సిద్ధిస్తుంది. కొంత పాపం కొంత పుణ్యం చేసిన వాడికి మనుష్య జన్మ లభిస్తుంది. పాపములు మాత్రమే చేసే జనులు క్రిమి కీటకాదులుగా పుట్టుతూ మరణిస్తూ జన్మబంధాలలో చిక్కుకుంటారు. ఇలా కోరికలు అను సముద్రంలో కొట్టు మిట్టాడుతూ ఎన్నటికీ ఒడ్డుకు చేరుకో లేరు. ఇది ఎరిగిన వాడు పాపకార్యాలజోలికి వెళ్ళక ధర్మమార్గాన పయనిస్తాడు. మదమూ, అహంకారం విడిచి పుణ్యకార్యాలు చేస్తాడు. ధర్మాచరణ వలన మనసు నిర్మలమౌతుంది. కోరికలను విడిచి సుఖాలు ఎందుకూ పనికి రానివని గ్రహిస్తాడు. తపస్సు, ఇంద్రియ నిగ్రహం, సత్యం పలకడం మేలని గ్రహించి వాటిని ఆచరించి దైవత్వాన్ని పొందుతాడు.```
*ఇంద్రియ నిగ్రహం*```
కౌశికుడు ధర్మవ్యాధుని "ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? ఇంద్రియాలను నిగ్రహించకుంటే కలిగే పాపం ఏమిటి? ఇంద్రియాలను నిగ్రహించడం వలన కలిగే పుణ్యం ఏమిటి?" అని అడిగాడు.
ధర్మవ్యాధుడు కౌశికునితో “మనం మనసుతో విషయాలను గ్రహిస్తాము. మనస్సు ఎప్పుడూ కోరికలతో, కోపముతో నిండి ఉంటుంది. వాటి వలన లోభం ఏర్పడుతుంది. లోభంతో ఏర్పడిన విషయ వాంఛల వలన మానవుడు సదా సతమతమౌతుంటాడు. లోభికి కరుణ లోపించి పాపములతో కోరికలు తీర్చుకుంటాడు. మంచి మాటలు చెవికెక్కవు. దుర్మార్గులతో చెలిమి చేస్తాడు. చెప్పే మాటలకు చేసే పనికి పొంతన ఉండదు. అలాంటి వాడు దుఃఖంలో మునిగి తేలుతుంటాడు. కనుక మానవులు విషయ వాంఛలకు లొంగక జ్ఞానమార్గం అవలంభించి మోక్షప్రాప్తికి ప్రయత్నించడం ఉత్తమం" అన్నాడు.
"మహాత్మా! ఇంద్రియములను నిగ్రహించడం ఎలా? అని నన్ను అడిగారు. బ్రహ్మకోవిదులు చెప్పతగిన బ్రహ్మ విద్య గురించి నేను చెప్పకూడదు. కాని బ్రాహ్మణోత్తముడివి అడిగావు కనుక బ్రహ్మ కోవిదులకు నమస్కరించి చెప్తాను సావధానంగా విను. అనంతాకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అనేవి పంచ భూతములు. మరలా భూమి నీటిలోను, గాలి అగ్ని లోను, అగ్ని వాయువులోను, వాయువు ఆకాశంలోను లీనమౌతాయి. మొదట ఆకాశానికి హద్దులు లేని అనంతాకాశం. అంతా చీకటి, శూన్యము. ఆ ఆకాశంలో నుండి ప్రచండ వాయువు, ఉధృతమైన గాలి ఆగాలిలోని ధాతు సంయోగంతో నీరు పుడుతుంది. ఆ నీరు ఘనీభవించి మంచుఖండాలు, ధూళి మేఘాలు ఏర్పడతాయి. అవి శిలా రూపం చెంది భూమి ఏర్పడుతుంది. మరలా అదే క్రమంలో ప్రళయ కాలంలో సముద్రాలన్నీ ఏకమై భూమి జలమయమౌతుంది. అనావృష్టి ప్రారంభమై ఎండలు అధికమై ఆ ప్రంచండాగ్నికి నీరు ఆవిరై వాయు రూపం పొంది ఆకాశంలో లయమౌతుంది. చెవితో వినడం, నాలుకతో రుచి చూడటం, కంటితో చూడటం, ముక్కుతో వాసన చూడటం పంచేద్రియాలు చేసే పనులు. అంటే పంచ భూతముల గుణములైన శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలు ఇంద్రియవిషయాలు. పంచేద్రియములకు మూలం మనసు. మనసు ఆరవది, బుద్ధి, అహంకారం మనసుకు తోడు మొత్తం ఎనిమిది. సత్వ, రజో, తమో గుణాలు మానవులకు సహజం. ఈ భూత ప్రపంచం అవ్యక్తము నుండి సృష్టింపబడి అవ్యక్తంలో లీనమౌతాయి. అవ్యక్తమనగా వ్యక్తముకానిది. కాని పంచేద్రియాలకు ఈ అవ్యక్త రూపం దైనందిన కార్యాలలో గోచరమౌతూ ఉంటుంది. అది నిరాకారమైన మనో భావనలో వివిధ రూపాలలో గోచరమౌతుంది. మానవులు పంచ గుణాలకు వశుడై భోగలాలసుడౌతున్నాడు. మానవుడు పంచేద్రియాలను అదుపులో పెట్టుకుని జీవిస్తూ జ్ఞాన సముపార్జన చేయాలి. జ్ఞానం కలిగిన వాడు అన్ని భూతాలలో తనను చూసుకుంటాడు. విషయవాంఛల నుండి మనసుని మళ్ళించడమే తపస్సు, వైరాగ్యం. ఇంద్రియముల నివారించిన స్వర్గం ఇంద్రియములకు లొంగి పోయిన నరకం. కోరికలతో సతమమయ్యే మనసును అదుపులో పెట్టుకోవడమే మోక్షం. దేహం రథమైతే ఇంద్రియాలే గుర్రాలు ఆత్మ సారథి, ధైర్యం పగ్గాలు. మానవుడు మనసును నిగ్రహించి ధైర్యమనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలను అదుపు చేస్తూ మోక్షమనే గమ్యాన్ని చేరాలి. ఇంద్రియము పోవు చోటుకు మనసు పోతుంది కనుక ఇంద్రియములను అదుపు చేస్తూ జ్ఞాన యోగి సాగాలి.```
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
సీతారామ కల్యాణము
సీతారామ కల్యాణము
జానక్యాః కమలామలాంజలీ పుటే
యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవ మస్తకే చ
విలసత్కున్ద ప్రసూనాయితాః
స్రస్తా శ్శ్యామలకాయకాన్తి కలితా
యా ఇంద్రనీలాయితాః
ముక్తా స్తా శ్శుభదా భవన్తు
భవతాం శ్రీరామవైవాహికాః
శ్రీరామచంద్రుడు సీతామహాసతిన్
బరిణయం బాడెడి భవ్యవేళ
కాంతులీనెడి సీత కమలాంజలి పుటిని
బద్మరాగము భాతి పరిఢవిల్లి
మహానీయు రాముని మస్తకంబున నుండ
కుంద విరుల భంగి నందగించి
నీలమేఘచ్ఛాయ నెగడు శ్రీరాముని
తనువుపై జారెడి తరుణమందు
నింద్రనీలపుకాంతుల నినుమడించి
మోదమును గూర్చు చుండెడి ముక్తసేస
మిగుల శోభను వర్తిల్లి మించి సొగసు
ననయ శుభముల నిడుగాక నందఱికిని
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
దశరథుని అస్థానమున
26-01-2026
11) దశరథుని అస్థానమున
దృష్టి
జయంతుడు
విజయుడు
సిద్ధార్థుడు
అర్థసాధకుడు
అశోకుడు
మంత్రపాలుడు
సుమంత్రుడు అను ఎనిమిది మంది మంత్రులు గలరు.
12)దశరథుని ఆస్థానమున వసిష్ఠుడు వామదేవుడు అను ప్రధాన పురోహితులునూ ఇంకనూ జాబాలి మొదలగు పురోహితులునూ గలరు.
13)విభండకమహర్షి తనయుడు ఋశ్యశృంగుడు.
14)శాంత భర్త ఋశ్యశృంగుడు
15)సంతానము కొఱకై దశరథచక్రవర్తి పుత్రకామేష్టి యాగమును నిర్వహించెను.
*శ్రీరామచంద్రమూర్తీ ! నీవేగలవు తండ్రీ !*
🙏🙏🙏🙏
