16, ఏప్రిల్ 2023, ఆదివారం

అభిజ్ఞాన శాకుంతలం

 శ్లోకం:☝️

*సరసిజమనువిద్ధం శైవలేనాపిరమ్యం*

*మలినమపి హిమాంశోర్లక్ష్మ లక్ష్మీం తనోతి l*

*ఇయమధికమనోజ్ఞా వల్కలేనాపి తన్వీ*

*కిమివ హి మధురాణాం మండనం నాకృతీనాం ll*


భావం: అందానికి ఏ ఆభరణమైనా అలకారమే

కాళిదాసుని "అభిజ్ఞాన శాకుంతలం" నాటకంలో, వేటకోసం అడవికొచ్చిన దుష్యంతుడు మునివాటికలో వున్న శకుంతలను చూసి ఇలా అనుకుంటాడుట.

కమలం నాచులో పుట్టినా రమ్యంగానే ఉంటుంది. చంద్రునికి మచ్చ కూడా ఒక అందమే. అసలు సహజ సౌందర్యమే ఉండాలి గాని, ఎలాంటి బట్టకట్టినా బాగానే ఉంటుంది. ఈమె నారచీర కట్టినా బాగానే ఉంటుంది. మధురమైన ఆకృతిగల శరీరానికి అలంకారం కానిదేది? (ఏ వస్తువు(నగ/చీర) తొడిగినా అది అందంగానే తోస్తుంది.

భయానికి విరుగుడు భాగవతం*




*భయానికి విరుగుడు భాగవతం*

                  ➖➖➖✍️


*ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేవి మనిషికి నాలుగు సహజమైన విషయాలు.*


*వీటిలో ఆహారం, నిద్ర, మైథునాలు, సహజ అవసరాలైతే, భయం సహజ లక్షణం.*


*భయం నుంచి తప్పించుకున్నవారు ఎవ్వరూ కనిపించరు. ఈ నాలుగు విషయాలు మానవులకే కాకుండా, పశుపక్ష్యాదులకూ సమానమే.*


*అనివార్యంగా ఉండే భయానికి విరుగుడు ఇవ్వడానికే భాగవతం ఉదయించింది.*


*సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని భయాన్ని తొలగించడానికి మొట్టమొదటిసారి భాగవతం ప్రకటితమైంది.


*నారాయణుడి నాభికమలంలో ఆసీనుడైన బ్రహ్మ సృష్టి విషయంలో భీతావహుడైన సందర్భంలో అతనిపై కరుణతో చతుఃశ్లోకి భాగవతం ఉపదేశం జరిగింది.*


*నిత్యం భాగవత ధ్యానంతో, బ్రహ్మదేవుడు భయాన్ని వీడి సృష్టికార్యం కొనసాగించాడు. ఈ బృహత్తర కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తిస్తున్నానని కలిగిన గర్వభయం కూడా భాగవత ధ్యానంతో తొలగిపోయింది.*


*బ్రహ్మ భయాన్ని తొలగించిన భాగవతాన్ని, జనుల భయాలను, కష్టాలను తొలగిస్తుందని ఆ దివ్య ఉపదేశాన్ని బ్రహ్మలోకం నుంచి భూలోకానికి తీసుకొని వచ్చాడు నారదుడు.*


*భాగవత అమృతాన్ని ముందుగా వ్యాస మహర్షికి తెలియజేసి ఆయన నైరాశ్యాన్ని పోగొట్టాడు. దాని మహత్తును సంపూర్ణంగా అనుభవించాడు వ్యాసుడు.*


*ఆ భాగవత సుధను మాయా భయాన్ని తొలగించడానికి శుకమహర్షికి ఉపదేశించాడు.*


*శుక మహర్షి ద్వారా భాగవతఅమృతాన్ని గ్రహించి మృత్యుభయాన్ని జయించాడు పరీక్షితుడు.*


*తర్వాత కలి భయంతో విచారానికి, అంతులేని చింతకు లోనైన శౌనకాది రుషులకు ఉపశమనం కలిగిస్తూ, నైమిశారణ్యంలో వారికి భాగవతాన్ని ఉపదేశించాడు సూత మహర్షి.*


*ఈ విధంగా భయానికి విరుగుడుగా భాగవతం ఈ సృష్టిలో అవతరించింది.*


*‘మనిషి తన మనసును, నిగ్రహించుకొని, పుష్కర తీర్థం, మథుర, ద్వారకలో ఉపవసిస్తూ భాగవతాన్ని పఠిస్తే సర్వభయాలకూ దూరం అవుతాడు’ అంటుంది భాగవతం (12.12.61).*


*భాగవత రచయిత వ్యాసభగవానుడి అనుభవాన్ని గమనించినా ఆ పురాణం మహిమ మనకు స్పష్టంగా తెలుస్తుంది. తన గురువైన నారదముని ఆజ్ఞ మేరకు శ్రీకృష్ణుడి లీలలను వర్ణించడానికి ముందు వ్యాసుడు శ్రీకృష్ణుణ్ని గాఢంగా ధ్యానించాడు. ఆ ధ్యానంలో వ్యాసమహర్షికి సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి దర్శనం కలిగింది. ఆ దర్శనంతోపాటుగా కృష్ణుడి వెనుక నీడలా ఉన్న మాయాశక్తి దర్శనమైంది. ఆ మాయ వెనుక నిలిచిన జీవుడూ కనిపించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడికి, జీవుడికి మధ్య మాయ వచ్చిందనే సత్యాన్ని ధ్యానంలో గ్రహించాడు వ్యాసుడు.*


*మాయను దాటి శ్రీకృష్ణుడి ముందుకు చేరుకొని నేరుగా భక్తిలో నెలకొనడమే జీవుడి సమస్త దుఃఖాల వినాశనానికి ఏకైక మార్గం అని గుర్తించాడు మహర్షి. ఆ మాయా భయాన్ని జయించడానికి శ్రీమద్భాగవత రచనకు పూనుకున్నాడు.* 


*ఆ దివ్య భాగవత శ్రవణం వల్ల శోకమోహభయాలు నశించి కృష్ణభక్తి కలుగుతుందని భాగవత ఫలశృతిగా తెలియజేశాడు.


*సమస్త వేద సాహిత్యాన్ని కలియుగంలో మానవాళికి అందించింది భగవదవతారమైన శ్రీల వ్యాసదేవుడే.*


*ఆయన తన రచనలన్నీ పూర్తిచేసిన తర్వాత పరిపక్వ స్థితిలో గురుదేవుల ఆదేశం మేరకు చివరగా భాగవతాన్ని అందించాడు. సమస్త భయాలకు విరుగుడు భాగవతమేనని తెలియజేశాడు.* 


*అందుకే భయరహితులం కావాలంటే ఉన్న మార్గం భాగవతాన్ని ఆశ్రయించడమే.*


*భాగవతాన్ని నిత్యం సేవించేవారికి మాయతెరలు తొలగిపోయి, భయాలన్నీ పటాపంచలవుతాయన్న మహత్తర సత్యం శీఘ్రమే అనుభవంలోకి వస్తుంది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం...

* గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...9493906277

లింక్ పంపుతాము.🙏

[16/04, 8:51 am] +91 94939 06277: 0110.      1-5.  160423-6.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*ఆచరిస్తే అద్భుతాలు జరుగుతాయి*


                   *బయోక్లాక్!*

                  ➖➖➖✍️

                 *BIO-CLOCK*


*మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే,  4.00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము.*


*కానీ కొన్నిసార్లు మనం  అలారం లేకపోయినా అనుకున్న టైం కి  లేస్తాము.  ఇదే ‘బయో-గడియారం!*


*చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు.* 


*50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని నమ్మి చాలామంది తమ సొంత బయోక్లాక్‌ను ఏర్పాటు చేసుకున్నారు.  అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌ను తప్పుగా సెటప్ చేస్తాము.*


*చైనాలో చాలా మంది ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారు.*

 *వారి బయోక్లాక్ అలా ఏర్పాటు చేయబడింది.*



*కాబట్టి మిత్రులారా ఈ "8" సూత్రాలు తప్పకుండా పాటించాలి! అందులో…* 


*1). మనము బయో-గడియారాన్ని సర్దుబాటు చేసి, రోజూ క్రమం తప్పకుండా ‘ధ్యానం’ చేస్తే…. తద్వారా మనం కనీసం120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు!*


*2.) 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.*


*3.)సహజ సిద్ధమైన రంగు ( తెల్లజుట్టు ఉంటే) వెయ్యండి యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ  యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే  ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు.*


*4.) మనం తీసుకునే భోజనం కల్తీ, కలుషితం, అనుకుని తీసుకోవద్దు. ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది,  ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి! జరిగి తీరుతుంది.*


*5.) చురుకుగా ఉండండి. నడవండి. వీలైతే జాగింగ్ కూడా తప్పకుండా చేయండి. *


*6.) వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి! (ఇది నిజం కూడ).*


*7.) ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. కనుక ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి!*

*(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి! మనసులో కాకుండా పైకి నవ్వండి)*

(అదేదో సినిమాలో మనసులోనే నవ్వుకుంటుంది, మనసులోనే డాన్స్ కూడా చేస్తుందట! - అలాకాదు!)


*8). ప్రతిదానికీ కారణం మన మనస్సు.  మన ఆలోచన. ముఖ్యంగా మన మాట, సరదాకు కూడ old age అనే మాటను అనకండి.  ధర్మరాజుకు యువరాజా పట్టాభిషేకం జరిగింది 105 సంవత్సరాల వయసులో!*    


**బయో క్లాక్ ని మీ  తక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేయవద్దు...!*

ALL THE BEST..

                 *ద్వి శతమానం భవతి!*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

[16/04, 8:52 am] +91 94939 06277: 150423g1659.    160423-5.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*దేవుడంటే ఏంటి?  పూజ చేయకపోతే ఏమవుతుంది?*

అని...

              ➖➖➖✍️


*చిన్నపిల్లలే కాదు ..  నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.*


*మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం.. "అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని!*


*మనకు భవవంతుని గురించి అవగాహన లేనప్పుడు... చెప్పడం చేతగానప్పుడు మనం వాడే మాట అదే!.*


*కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా !*


*మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు.*

*తెలియని వారికి అలా చెప్పడం వల్ల ... వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.*


*"పూజ" అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, మనసుతో చేసే వ్యాయామం. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ.* 


*"దీప ప్రజ్వలనం" అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ.*

*రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.*


*ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు. అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది, ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.*


*పూజ అంటే చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.* 


*మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి. అదే సమయంలొ మూఢ విశ్వాసాలకు దూరం గా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన బాధ్యత కూడా పెద్దవారిపై ఉంది.*


*1. మూలవిరాట్ 🚩 భూమిలో ఎక్కడైతే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.*

 

*2. ప్రదక్షిణ🚩 మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు, కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.*


 *3. ఆభరణాలతో దర్శనం 🚩 ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.*


 *4. కొబ్బరి కాయ 🚩 ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.*


 *5. మంత్రాలు 🚩 ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే    మనకి తెలియకుండానే neurons ని ఏక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.*


*6. గర్భగుడి 🚩 గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.*


*7. అభిషేకం 🚩 విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించి నపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించు కుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.*


*8.  హారతి 🚩 పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో ‘స్వేదకర్మ’ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.*


*9. తీర్థం 🚩 ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు.*


*10.  మడి 🚩 తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోస0 గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

[16/04, 8:54 am] +91 94939 06277: 150423f1639.   160423-4.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



మానవ జన్మ పుట్టుక లక్ష్యం ఏమిటి?

             ➖➖➖✍️



మానవ జన్మ పుట్టుక లక్ష్యం ఏమిటి? జన్మలు అంటే ఏమిటి? అందులో మానవ జన్మకు గల కారణం ఏమిటి? 


మొదట మనం జన్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. ..


జన్మ అంటే మళ్ళి పుట్టడం. అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ. కాని తిరిగి మానవ జన్మే వస్తుంది అని మాత్రం చెప్పలేము ఎందుకంటే మరల మనం పొందే జన్మ మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడుతుంది. 


అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమోత్తమమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ కర్మలకు ఫలితాలను తప్పక అనుభవించి తీరాలి,   వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. 


అన్నీ పుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు దేవ లోకాలలో దేవ జన్మ నెత్తుతాడు, అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది   భోగ భూమి   కనుక  అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు. అందువలన పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలను  ఆచరించే అవకాశం లేదు. తన కర్మ ఫలాల ననుసరించి భోగాలను మాత్రమే అనుభవించి   ఆ కర్మ ఫలాలు అయిపోగానే…  'క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి'   అన్నట్లు ఈ మర్త్య లోకాన్ని మానవ లోకాన్ని చేరవలసిందే. మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే.  దేవ జన్మలో కేవలం మనోబుద్దులుంటాయే కానీ కర్మచేయుటకు సాధనమైన స్థూల శరీరం ఉండదు.  కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు ఈ దేవ జన్మ. 


ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా జన్మిస్తాడు. 


ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించ బడుతాడు. ఈ జన్మలలో కర్మలు చేస్తున్న అవి అన్నియు బుద్ధి పరంగా కాదు అవి అన్నియు కేవలం ప్రకృతి ప్రేరణలతో పర తంత్రంగా చేస్తాయి. ఈ జంతు జన్మలలో శరీరం - మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించడమే కానీ పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడ ఉపయోగపడదు.


ఇక పుణ్యపాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ మానవ జన్మలో పుణ్య కర్మల ఫలంగా సుఖాలు మరియు పాప కర్మల ఫలంగా దుఃఖాలు అనుభవిస్తాడు.


అయితే ఇలా కర్మ ఫలాలను అనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే ఉంది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది.   కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది అని అన్నారు. 


ఈ మానవ జన్మ తీసుకోవడానికి జీవుడు 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ ఈ మానవ జన్మ. 


కనుకనే ఈ మానవ జన్మను 'జంతూనాం నర జన్మ దుర్లభం' అని పెద్దలు తెలియజేసారు.


ఇలాంటి ఈ అపురూపమైన, ఉత్తమోత్తమమైన మరియు దుర్లభమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి.


వేరే జన్మలు అయితే ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి కాని ఎందుకు మనం ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పుట్టవలసి వస్తుంది. పుట్టిన మన జన్మ లక్ష్యం ఏమిటి ? జంతు జన్మలు పొందిన వాటి లక్ష్యం అయితే ఒకటే, అవి మానవ జన్మ పొందడానికి కర్మలను ఆచరిస్తు వుంటాయి. మరి మనిషిగా పుట్టిన మనం ఏమి చేస్తున్నాం, మన లక్ష్యం ఏమిటి అన్నది,  అంటే మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి. సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి…


సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి, సాధారణంగా మనం అంతా ( మనుషులందరూ ) బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి లేదా పెద్ద పెద్ద పదవులు చేపట్టాలి. బాగా సంపాదించి భార్యబిడ్డలతో సహా తను అనేక భోగాలు అనుభవించాలి. అయితే ఇక్కడ ఎవ్వరు తాము కోరుకున్నట్లుగా జీవించలేక పోతున్నారు. ఎన్ని సుఖాలు, భోగాలు అనుభవించినా ఈ మనస్సుకు ఏదో ఒక వెలితి వుంటుంది. దీనికి కారణం మనం అనుభవించేవి ఏవి కూడ నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు.


ఇవి అన్నియు అనిత్యమైన వస్తువుల ద్వారా వచ్చే సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే నిత్య వస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది. ఏమిటది? ఆ నిత్యమైన వస్తువు ఏకమైన "పరమాత్మ" మాత్రమే. 'నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం' అని తత్వబోధ లో శంకరాచార్యులవారు స్పష్టం చేసారు. 


అంటే నిత్య వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వమూ అనిత్యమైనవే అని అర్థం.


కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం - ఆనందం అందుకునేవరకు మానవుడికి తృప్తిలేదు.


అసంతృప్తి తీరదు. అట్టి శాశ్వాతానందాన్ని అందుకోవడమే జన్మను సార్ధకం చేసుకోవడమంటే. ఆ శాశ్వతానందాన్నే మోక్షం, ముక్తి అన్నారు.


ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి భగవంతునిలో ఐక్యం (పరమాత్మునిలో విలీనం అదియే మోక్షం) కావాలంటే ఇక్కడ చేసిన అన్ని కర్మలని సంపూర్ణంగా నిర్మూలించుకొని అంటే ఆత్మ స్వరూపుడవైన నీవు వీటి అన్నిటినుండి విముక్తిని పొందాలి. 


ఈ విధంగా విముక్తిని పొందడమే ముక్తి అని కూడ అంటారు. దానికి సరియైన జన్మ ఈ ఒక్క మానవ జన్మ మాత్రమే! ఇది యే జన్మలలోనూ సాధ్యం కాదు!!


జంతు జన్మలలో అయితే మనస్సు మాత్రమే ఉంటుంది కాని వాటికీ బుద్ధి ఉండదు. 


అందువలన మనం అజ్ఞానంతో, అవివేకంతో మరియు అవిద్యతో ఏర్పరచుకున్న ఈ కర్మ బంధనాల నుండి విముక్తి పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ మానవ జన్మే. 


ఈ మానవ జన్మలో మనిషికి దేవుడు ఒక ఆయుధాన్ని ప్రసాదించాడు అదియే బుద్ధి.    దీని ద్వారా శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, నాశనం లేనిది ఏది అని గ్రహించి అదే విధంగా జ్ఞానాన్ని గ్రహించి, అంటే నేను ఎవరు, ఎందుకు పుట్టాను, ఎవరికోసం రావలసి వచ్చింది, నా లక్ష్యం ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి, అని తెలుసుకొని మనస్సును అదుపులో పెట్టుకొని పరమాత్మ తత్వాన్ని నిత్య సత్యమైన దానిని సంపుర్ణముగా తెలుసుకొని అదే విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించడమే జ్ఞానం అని అంటారు.


ఎప్పుడైతే నీలో ఈ ధ్యాస, అంటే దేవుని గురించి తెలుసుకోవాలని నీలో తపన మొదలవుతుందో అప్పుడు ఆ దేవుడే నీకు ఖచ్చితంగా మార్గాన్ని     లేకపోతే ఒక మంచి సద్గురువును ప్రసాదిస్తాడు. 


ఇక్కడ సద్గురువును ప్రసాదిస్తాడు అంటే దేవుడు తెచ్చి నీ ముందర సద్గురువును పెట్టడు. నువ్వు ప్రయత్నించు దానికి భగవంతుడు సహకారం అందిస్తాడు అని భావం. 


అంటే మనం అజ్ఞానంలో ఉంటూ కర్మలను ఆచరిస్తూ అన్నియు దుష్కర్మలే చేస్తే నూటికి నూరు శాతం మనం మానవ జన్మ పొందడం మాత్రం సాధ్యం కాదు.


అన్ని చెడ్డ పనులే చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న కర్మ బంధనములు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని నరకంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు ఏదో ఒక జన్మ వస్తుంది. మరి సత్కర్మలు ఆచరిస్తే మానవ జన్మ ఎత్తవచ్చా అంటే ఎక్కువ శాతం మానవ జన్మ ఎత్తే అవకాశాలు ఉంటుంది.


కానీ సత్కర్మలు చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న కర్మ బంధనములు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని స్వర్గంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు జన్మ వస్తుంది. 


నీవు సత్కర్మలు ఆచరించి ఎంతో కొంత దేవుని గురించి తెలుసుకొని ఉంటే నీవు మంచి యోగుల కుటుంబంలో జన్మిస్తావు.


భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ధ్యాన యోగంలో చెప్తాడు. “అర్జునా! ఎవరు అయితే నా జ్ఞానాన్ని గ్రహించి యోగాన్ని (కర్మ, జ్ఞాన మరియు ధ్యాన)పద్ధతిని అవలంభించి ఉంటారో వారికి ఇంకా ఏదైనా కర్మలు చేయాల్సిన విషయం ఉంటే వారికి ఖచ్చితంగా ఒక మంచి జన్మ అది ఉన్నతమైన ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మ వస్తుంది. ఇందులో ఏ మాత్రం సందేహం ఉండదు” అని శ్రీ కృష్ణుడు అర్జునకు వివరిస్తాడు.


అందుకే మనం ఈ మానవ జన్మ పొందినపుడు జీవన, జీవిత సత్యాన్ని గ్రహించి సత్ సాంగత్యం చేస్తూ సత్ కార్య జీవనం సాగించాలి. మానవ సేవే మాధవ సేవగా భావించి అందరిలో దైవాన్ని చూస్తూ నీలో ఉన్న దైవాన్ని నీ పనులలో, ప్రవర్తనలో చూప గలిగిననాడు, దేనికీ ప్రలోభ పడక జీవిస్తే తప్పక మోక్షాన్ని పొందుదురు.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం… గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

[16/04, 8:57 am] +91 94939 06277: 150423c1452.   160423-3.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀326.


                శ్రీ మహాభారతం 

                 ➖➖➖✍️

                 326 వ భాగం

    శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:



#పిండప్రధానం:

పార్వతీదేవి “నాధా ! మానవులు చనిపోగానే మరలాజన్మ ఎత్తాలి కదా! మరి ఎవరి కొరకు ఈ పితృ కార్యాలు పిండప్రదానాలు చెయ్యాలి. వివరంగా తెలియ జెయ్యండి” ఆ ప్రశ్న పార్వతీదేవి అడగగానే అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. పరమశివుడు ఏమి సమాధానం ఇస్తాడో అని ఆతురతగా ఎదురు చూసారు. 


పరమశివుడు “పార్వతీ! నువ్వు అడిగిన ప్రశ్న చాలా సందేహాలతో కూడుకున్నది పరమ రహస్యము కూడా. పితరులు కూడా దేవతల వంటివారే ! దేవతలు ఉత్తరదిక్కున ఉంటారు. దేవతాపూజకు హవ్యము అనీ పితృకార్యములకు కవ్యము అని పేర్లు. పితృకార్యములు చేస్తే దేవతలు సంతోషించి ఆ కర్తకు ఆయుష్షు, ధనము, కీర్తి ప్రసాదిస్తారు. పితృగణములు దేవతలకు, అసురులకు, గరుడులకు, యక్షులకు మొదలగు వారు పూజనీయులు. పార్వతీ శ్రద్ధగా విను!   కుంచెడు ధాన్యము కలవాడు ఆ కుంచెడు ధాన్యమును దానంగా ఇచ్చినా కోటి రూపాయలు ధనం ఉన్న వాడు ఆ కోటి రూపాయలు దానంగా ఇచ్చినా రెండూ సమానమే. కనుక దానములు తన శక్తికి తగ్గట్టు చేయాలి. అప్పుడే ఫలితాన్ని ఇస్తాయి. ఏ దానము చేసినా మనసులో తిట్టుకోకుండా ప్రేమతో మనసారా ఇస్తే ఆ దానము సత్ఫలితాన్ని ఇస్తుంది” అని చెప్పాడు ఈశ్వరుడు.



#ధర్మములు:


పార్వతీదేవి “నాధా! ధర్మము నానా విధములుగా ఉంటుంది కదా ! ఆ ధర్మము యొక్క విశేషముల గురించి తెలియజెయ్యండి” అని అడిగింది. 


పరమశివుడు “పార్వతీ! శృతులలో చెప్పిన ధర్మముల గురించి వివరిస్తాను. ధర్మములలో జాతిధర్మములని, కులధర్మములనీ, గుణధర్మములనీ, శరీరములను బట్టి కాలము బట్టి మారే ఆపద్ధర్మము అని ధర్మములు అయిదు విధములు.



#పుణ్యము లోకములు:


పార్వతీదేవి “నాధా ! పుణ్యలోకములో భోగములు ఎలా ఉంటాయో వివరించండి” అని అడిగింది. 


పరమశివుడు “పార్వతీ ! ఆ లోకములో పుష్పములు ఆయా ఋతువులను పూస్తూ ఉంటాయి. కల్పతరువుల నుండి శరీరానికి లేపనము సువాసనలు వెదజల్లు తుంటాయి. అక్కడ అమృతమే ఆహారము. అక్కడ దుస్తులు మలినము లేనివి. ఆభరణములు నిరుపమానంగా మెరుస్తూ ఉంటాయి. అక్కడ అందరూ పరస్పర స్నేహభావంతో మెలగుతుంటారు. అక్కడ ఉన్న వారి మనసులో మార్దవము, సుగుణములు విరాజిల్లుతుంటాయి. అక్కడ సుఖము తప్ప దుఃఖము లేదు. అక్కడ కోపము మొదలైన దుర్గుణాలకు తావు లేదు. అక్కడ ఉన్న వారు రోగములు, ముసలితనము అనేది తెలియకుండా నిరంతరము ఆనందములో తేలియాడు తుంటారు” అని మహేశ్వరుడు చెప్పాడు.



#సుగతి దుర్గతి:


పార్వతీదేవి “నాధా ! చనిపోయిన తరువాత వీరు సుగతికి పోవాలి. వీరు దుర్గతికి పోవాలి అని ఎవరు నిర్ణయిస్తారు” అని అడిగింది. 


పరమశివుడు “పార్వతీ! తనతోటి వారికి కీడుతలపెట్టని వారు, ఎల్లప్పుడు సదా ధర్మంగా బ్రతికేవారు, సజ్జనులను, గురువులను పూజించేవారు, ఎల్లప్పుడూ సత్యమునే మట్లాడేవారు, దీనులను ఆదరించు వారు, అతిధులను పూజించు వారు, ఇతరులపట్ల దయ జాలి కలిగిన వారు, వీరంతా స్వర్గమునకు పోవడానికి అర్హులు అని తెలుసుకొన వలెను” అని చెప్పాడు.



#ఉత్తమ ధర్మము:


పార్వతీదేవి “స్వామీ! ధర్మాలు ఎన్నో ఉన్నాయి కదా ! అందులో ఉత్తమధర్మము ఏది ?” అని అడిగింది. 


పరమేశ్వరుడు “పర్వతరాజపుత్రీ ! పురుషార్ధములు నాలుగు. ధర్మము, అర్ధము, కామము, మోక్షము. అందులో మొదటి మూడు అయిన ధర్మ, అర్ధ, కామముల వలన కలిగే సుఖములు అశాశ్వతములు. అవి ఎన్నటి కైనా నశిస్తాయి. కాని ఆఖరిది అయిన మోక్షము శాశ్వతమైనది, సుఖప్రథమైనది. అది ఎన్నటికీ నశించదు. కనుక మొదటి మూడు పురుషార్ధముల కంటే మోక్షము అత్యుత్తమమైనది. మోక్షము ఎలా పొందాలో నీకు చెప్తాను. మానవుడు గృహస్తాశ్రమము స్వీకరించిన తరువాత ఋణములు అన్నీ తీర్చుకుంటాడు. అంటే దేవ ఋణము, పితృఋణము, ఋషిఋణము, మనుష్యఋణము తీర్చుకుంటాడు. తరువాత వానప్రస్థముకు వెళతాడు. అక్కడ అడవులలో నివసిస్తాడు. ప్రశాంత వాతావరణంలో నిర్మలమైన మనస్సుతో మునుల నుండి సాంఖ్యమును అభ్యసిస్తాడు. సాంఖ్యమనగా 25 తత్వముల జ్ఞానము తెలుసు కొనడమే. తరువాత యోగాభ్యాసము చేస్తాడు. సాంఖ్యము యోగము రెండూ ఒక్కటే. తరువాత సుఖదుఃఖములు, రాగద్వేషములు మొదలగు ద్వందములను జయిస్తాడు. తరువాత శౌచము, బ్రహ్మచర్యము, శాంతజీవనము, మితాహారము తీసుకోవడము పాటిస్తాడు. మనస్సును అంతర్ముఖంచేస్తాడు. మధ్య మధ్య వచ్చే అవాంతరములను తొలగించుకుంటూ మోక్షమార్గాన పయనిస్తాడు. ఇదీ మోక్షమార్గము. ఇది నిరంతర అభ్యాసము వలన మాత్రమే కలుగుతుంది. ఈ మోక్షమార్గము మానవుడిని జననమరణచక్రము నుండి విముక్తుడిని చేస్తుంది. మానవుడు సంసారము నందు విముఖత చెందనంత వరకూ మోక్షమార్గములో పయనించ లేడు. ఈ ప్రాపంచిక విషయముల మీద మనసు విరక్తి కలిగినప్పుడే మానవుడు మోక్షమును పొందగలడు. పార్వతీ ! మనసులో ఉన్న చింతలన్నీ వదిలి పెడితే కాని అందరి అందు సమత్వము, సమభావన కలిగితే కాని తృష్ణ, ఆశ, లోభత్వము విడిచి పెడితే కాని పైన చెప్పిన విరక్తి కలుగదు. వాటి స్వభావము వివరిస్తాను. ధనము ఉన్నా పోయినా, దగ్గర బంధువులు చని పోయినా దాని గురించి విచారించడం మానుకోవాలి. పోయిన ధనము గురించి, చనిపోయిన బంధువుల గురించి దుఃఖించడం వలన దుఃఖము పెరుగు తుందే కాని తరగదు. కనుక దుఃఖించడం అనవసరము.

ఎందుకంటే సుఖము, దుఃఖము ఒకదాని వెంట వస్తూ పోతుంటాయి. స్వర్గలోకాధిపతి దేవేంద్రుడికి కూడా సుఖము దుఃఖము ఒకటి వెంట ఒకటి వచ్చాయి. ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించే ప్రతి ప్రాణి ప్రతి వస్తువు పరిణామం చెందడం కానీ నాశనం కావడం కాని తధ్యము. ఈ సత్యము తెలిస్తే దుఃఖము కలుగదు. కనుక నాశనం అయ్యే వాటి గురించి చింతించడం అవివేకము. ఇతరుల నుండి ధనమును వస్తువును స్వీకరించే వాడు పట్టు పురుగు తన దారములతో తనను ఎలా బంధించుకుంటుందో అలా తనను తాను బంధించుకుంటాడు. పార్వతీ ! మానవుడికి ధనము సంపాదించడం, సంపాదించిన ధనం కాపాడడడం, ఆ ధనమును ఖర్చు చెయ్యడం, ఆ ధనము పోతే దాని కొరకు దుఃఖించడం ప్రధాన వ్యాపకాలు. కనుక ధనము అన్ని దుఃఖములకు మూలకారణము. ధనము లేకపోతే దుఃఖము ఉండదు.



#ఆశ:


ధనము తరువాత ఆశ మానవుడిని నాశనం చేస్తుంది. ఆశను మించిన దుఃఖము మరొకటి లేదు. ఆశను వదిలితే కలిగే సుఖము దేనికీ సమానము కాదు. ఆశ అనేది మనిషితోపాటు పుడుతుంది. మనిషి చచ్చేదాకా అతడిలో ఉన్న ఆశచావదు. కనుక ఆశ ప్రాణాలను తీయకలిగిన ప్రాణాంతక వ్యాధి. కోరికలు అనేవి ఒకటి వెంట ఒకటి పుడుతూ ఉంటాయి. కోరికలు అనుభవిస్తే తీరేవి కాదు. అగ్నిలో నెయ్యి వేస్తే అగ్ని ఆరిపోతుందా ! అలాగే అనుభవించే కొద్దీ కొత్త కొత్త కోరికలు పుట్టుకు వస్తుంటాయి. కోరికలను ఆశను అదుపులో పెట్టుకుంటే అంతులేని సుఖంకలుగుతుంది. మానవుడు ఇంద్రియములను నిగ్రహించుకోవాలి. ఇంద్రియములను వాటి ఇష్టము వచ్చినట్లు పోనిస్తే అవి చేయకూడని పనులు చేసి దుఃఖముకలిగిస్తాయి. అలాకాకుండా కోరికలను నిరోధిస్తే మానవునికి సుఖము కలుగుతుంది. మరణం తరువాత సద్గతులు కలుగుతాయి. ఎప్పుడూ ధనము సంపాదించడం లోనూ ఇంద్రియ సుఖములు అనుభవించడంలోనూ మునిగి తేలే వాడిని మృత్యువు ఒక్క సారిగా మీదపడి అడవిలో పెద్దపులి మేకమీద పడి కబళించినట్లు కబళిస్తుంది. మానవుడు సంపాదించిన ధనము, అతడు చేసిన ధర్మములు, యజ్ఞములు, యాగములు, అతడిని మృత్యువు నుండి కాపాడ లేవు. పుట్టిన వాడు చావక తప్పదు. కేవలం మోక్షసాధనతోనే ఈ జనమరణ చక్రము నుండి విముక్తి పొందగలడు. మానవుడి జీవితంలో ఒక్కొక్కరోజు, ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరం గడిచేకొద్దీ అతడి ఆయువు క్షీణిస్తుంది. అతడు మృత్యువుకు దగ్గర ఔతుంటాడు. కనుక రేపటి పని ఈ రోజు, తరువాత చెప్పిన పని ఇప్పుడే చెయ్యాలి. కాలయాపన, అలసత్వము, సోమరితనము పనికి రాదు. కాలముకు వశుడైన మానవుడికి ఏమరిపాటు సహజము. కాలం గడిచే కొద్దీ ఆయుష్షు తరిగి పోతుందని గ్రహించిన నాడు ఈ సంసారం మీద విరక్తి కలుతుంది. ఆ విరక్తిమార్గము ముక్తికిసోపానము. పార్వతీ ప్రాపంచిక సుఖముల మీద కోరిక ఆశ లేక పోతే అతడు మనస్సును జయించగలడు. దాని వలన ముక్తి లభించి జరామరణచక్రము నుండి విముక్తి పొందగలడు.”



#సాంఖ్యము:

“పార్వతీ ! ఇప్పుడు నీకు సాంఖ్యము గురించి చెప్తాను. ఈ సాంఖ్యయోగము సంసారము అనే జబ్బుకు మంచి మందు. సాంఖ్య యోగులు జ్ఞాన సముపార్జనతో ముక్తి చెందుతారు. కాని ఈ శరీరముతో తపస్సు చేయడము, శరీరాన్ని సుష్కించచేయడం వృధా ప్రయాశ. కేవలం జ్ఞానము వలనే మోక్షం పొందగలము. ఈ ప్రకృతికి అవ్యక్తము అనే పేరు కూడా ఉంది. ఈ ప్రకృతిలో నుండి మహత్తత్వము, అహంకారము, మనస్సు, ఇంద్రియములు, పంచభూతములు, వాటి గుణములు, ఆవిర్భవించాయి. ఇవి అన్నీ కలిపి 24. 25వ తత్వము ఆత్మ. ఈ ఆత్మ సత్వ, రజొ, తమో గుణముతో ప్రభావితం ఔతుంది. వీటి ఆధారంతో ప్రకృతిలో సృష్టి జరుగుతుంది. అవ్యక్తమైన ప్రకృతి ఏక అణువు. అనగా అణువు ఒక్కటే అవిచ్చిన్నము. కంటికి కనపడదు. ఇదే సృష్టికి ప్రధానము.



#త్రిగుణములు:


సౌఖ్యము, తృప్తి, ప్రకాశము సత్వగుణ లక్షణములు. సుఖదుఃఖాలు, రాగద్వేషములు, మొదలగు ద్వందములు రజోగుణ లక్షణములు. అజ్ఞానము, భయము, అంతా తనకు తెలుసు అనే భ్రాంతి, విపరీతమైన జ్ఞానము కలిగి ఉండడం, ఏ పనీ చెయ్యకపోవడం, అలసత్వము ఇవి తమోగుణ లక్షణములు. సత్వగుణము ప్రధానంగా కలవాడికి, ధైర్యము, విజ్ఞానము, శ్రద్ధ, దేని మీద మోహము లేకపోవడము, ఇతరుల పట్ల దయ, ఎప్పుడూ సంతోషంగా ఉండడం అనేవి ప్రధాన గుణములు. ఈ గుణములు లేకపోతే సత్వగుణము కూడా నశించి పోతుంది. కోపము, లోభము, కామము, ద్రోహచింతన, దుఃఖము ఇవి రజోగుణ గుణములు. ఈ గుణములు విడిచిపెడితే రజోగుణము నశించిపోతుంది. ఎల్లప్పుడూ ప్రతిదానికి సంశయించడము, విషాదము, జడత్వము ఇవి తమోగుణ లక్షణములు. ఈ గుణములు తగ్గించుకుంటే తమోగుణము నశించి పోతుంది. ఈ మూడు గుణాలు ప్రతి మనిషిలోనూ హెచ్చుతగ్గులుగా ఉంటాయి. ఒక్కటి ఎక్కువైతే మిగిలినవి తగ్గుముఖం పడతాయి. రెండు ఎక్కువగా ఉంటే మిగిలినది తగ్గుముఖం పడుతుంది. సత్వగుణము ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి తేజస్సుతో ప్రకాశిస్తుంటాడు. సదా సంతోషంగా ఉంటాడు. రజోగుణము ఎక్కువగా ఉన్న మనిషి ఎప్పుడూ కోపంగా ఉంటాడు. సదా దుఃఖిస్తుంటాడు. తమోగుణము అధికంగా ఉంటే కామము, కోరికలు, సకలము అన్నీ తనకు కావాలని అనుకొని అవి దక్కక పోతే జితేంద్రియుడు ఔతాడు. ఈ గుణముల ప్రభావంతో చేసేపనుల వలననే మానవులకు దేవలోకప్రాప్తి మనుష్యలోకములో పుట్టడం లేక జంతువులలో పశుపక్ష్యాదులలో పుట్టడం జరుగుతూ ఉంటుంది. మహతత్వమును బుద్ధి అనికూడా అంటాము.


ఈ బుద్ధి వివేకముకు, జ్ఞాననముకు గుర్తు. ఈ బుద్ధి వివేకముకు జ్ఞానముకు గుర్తు. అహంకారము సృష్టికి మూలము. అహంకారము వదిలితే ముక్తి దానంతట అదే వస్తుంది. ఇక మనస్సు ఇది ఇంద్రియముల ద్వారా ప్రకృతిలో సంచరిస్తుంటుంది. ఇంద్రియ లోతత్వమునకు, ఇంద్రియ నిగ్రహముకు ఈ మనసే కారణము. ఈ శరీరము పంచభూతముల గుణములైన శబ్ద, స్పర్శ, రస, గంధ రూపములు ఈ శరీరము ద్వారా ప్రకటించబడుతూ ఉంటాయి. ఈ దేహము ఆత్మ కాదు, ఆత్మ కంటే వేరైనది. జీవాత్మ ఈ శరీరంలో అవ్యక్తంగా ప్రకాశిస్తున్నాడు. కాని మానవులు తామే ఆత్మ అనే అజ్ఞానంలో ఉంటాడు. అన్నీతామే చేస్తున్నామని, తమవలనే అన్నీ జరుగుతున్నాయని భ్రమ పడుతుంటారు. తాను వేరు మనసు వేరు అనుకుని మనసును ప్రకృతి నుండి పరమాత్మ వైపు మళ్ళించిన మానవుడు ముక్తి పొందుతాడు. దేహాభిమానము పూర్తిగా నశిస్తేగాని ఇది సాధ్యము కాదు. ఈ తత్వమే 25వ తత్వము.. ప్రకృతిని వదిలి పెట్టి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విజ్ఞానము పరమ శాంతిప్రథము. అన్నింటికీ అధిష్టానం అయినది 26వ తత్వము. దానికి ఈ శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలు అంటవు. ఇది నిత్యము, శాశ్వతము, అవ్యయము. అన్నింటిలోను ఉంటుంది. సర్వే సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అతి సూక్ష్మమైనది. అత్యంత విశాలమైనది, ఇంద్రియములకు గోచరము కాదు. ఇదే 26వ తత్వము. ఆ తత్వమును పరమాత్మ అని పిలుస్తారు. ఇదే మోక్షపదము. సమదృష్టి కలిగిన వారు మోక్షముకు అర్హులు. పార్వతీ నీకు చెప్పిన ఈ సాంఖ్యము కపిల మహర్షి సేవించిన ధర్మము.”



#యోగము:


“పార్వతీ ! ఇక యోగమార్గము గురించి వివరిస్తాను…” ఈ దేహము, ఇంద్రియములు, మనసు, బుద్ధీ, ఆత్మ ఇవన్నీ ఒకటే కాని వేరు కాదు అనుకోవడమే యోగము. ప్రతిరోజూ అగ్నిహోత్రము చెయ్యడం, అధికంగా మాట్లాడకుండా ఉండడం, సత్వగుణము కలిగి ఉండడడం, అర్హులైన వారికి దానంచెయ్యడం, వేదాభ్యాసంచెయ్యడం, ఎల్లప్పుడూ శుచిగా ఉండడం, సత్యము పలకడం, వీటిని అనుసరించడం వలన మానవుడిలోని పాపాలునశిస్తాయి . శుచిగాశుభ్రంగా ఉండాలి. ఏకాంత ప్రదేశంలో ఒక ఆసనముమీద కూర్చోవాలి. నడుము దగ్గర నుండి తల వరకు నిటారుగా కూర్చోవాలి. ఇంద్రియములను మనస్సును ఏకం చెయ్యాలి. మనస్సును ఆత్మలో లీనము చెయ్యాలి. ప్రాణ, ఆపాన వాయువులను క్రమబద్ధం చెయ్యాలి. మానవుడు మనసును ఈ దశకు రాగానే ఇష్టం వచ్చినట్లు పోనీయరాదు. ప్రాణవాయువు ఆపానవాయువుతో కూడి ఊర్ధ్వ ముఖంగా పయనించి శిరస్సు దగ్గరకు చేరుతుంది. అప్పుడు జీవాత్మ పరమాత్మగా మారుతుంది. ఈ యోగమును అనుసరించడానికి సోమరితనము, పరధ్యానము, అత్యాశ, ఇతరులపట్ల ఆదరం లేకపోవడం, రోగములు, స్వప్నములు, లోభత్వము, భయము, కామము, క్రోధము, సుఖములు అనుభవించాలన్న కోరిక, చంచలత్వము మొదలైన దుష్టగుణములు అత్యంత విరోధములు. పైన చెప్పిన గుణములు ఉన్నవారు యోగాభ్యాసానికి అర్హులు కారు. ఈ యోగాభ్యాసమును నిష్ఠతో చేసిన అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. అలాంటి యోగి స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ తిరగగలడు. యోగి ఎక్కువగా నిద్ర పోకూడదు. అలాగని అసలు నిద్రపోకుండా ఉండ కూడదు. ఎక్కువగా తిన కూడదు. అలాగని అసలు తినకుండా ఉండ కూడదు. మితభోజనం, మితనిద్ర యోగికి యోగసిద్ధి కలిగిస్తుంది. యోగధర్మము ఇదే” అని మహేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు.



#పరమాత్మలో లీనం:


పార్వతీదేవి…  “మీ దయ వలన సాంఖ్యము, యోగము గురించి తెలుసుకున్నాను. భక్తులు పర్మమాత్మలో లీనం కావడానికి ఎటువంటి పరిచర్యలు చేయాలి” అని అడిగింది. 


పరమశివుడు “పార్వతీ! దేవతలకు కాని మానవులకు కాని పరమాత్మను గురించి తెలుసుకోవడం అసాధ్యం. ఎందుకంటే సాంఖ్యము, యోగము రెండూ పరమాత్మ స్వరూపాలే. ఆ పరమాత్మను నేనే. నేను సనాతుడను, అవ్యయుడిని, సత్యమే నాస్వరూపము. నా దయలేనిది ఎవరూ నన్ను దర్శించలేరు. నన్ను చేరుకోవడానికి మంత్రము, జపము, నిరంతర పరమాత్మ చింతన, స్తోత్రములు, నమస్కారములు ఇవన్నీ నిష్టతో చేసిన పరమాత్మను చేరుకోవచ్చును. పూర్వము నేను నాలుగు ఆశ్రమములను గురించి పాశుపత్రవ్రతము గురించి నలుగురు విప్రులకు బోధించాను. వారు దానిని తమ శిష్యులకు బోధించారు. అలా లోకమంతా వ్యాపించింది. సకల శుభములు కలగడడానికి, శుచిగా ఉండడానికి, నా స్వరూపమైన లింగార్చనకు నేను విభూతిని రూపొందించాను. యోగులు ఆ విభూతిని, శరీరము అంతా అలముకొని, కపాలము చేత బూని, తలగొరిగించుకుని, భిక్షాటన చేస్తూ, మనోనిగ్రహంతో మెలగుతూ, నా మీదనే మనసు నిలిపి, ఇతర కోరికల మీదకు మనసు పోనీయక పరమానందకరమైన అనుభూతిని అనుభవిస్తారు. కేవలం ఈ ప్రకారం సంగమును విడిచిన యోగులు నా సాయుజ్యమును పొందగలరు. నిరాకారంగా నిస్సంగంగా నన్ను పూజించుట కొరకు నేను మూడు లోకములలో ఏ ఆకారము లేని శివలింగాలను స్థాపించాను. ఆ లింగములను నా స్వరూపంగా పూజిస్తే నేను వారికి ప్రసన్నుడను ఔతాను. ఆ లింగములను ఎవరికి ఎలా తోచినట్లు అలా పూజ చేయవచ్చు. వారివారి శక్తిని అనుసరించి పూజించవచ్చు. పాలతో, నేతితో, నీటితో ఆ లింగములను అభిషేకించ వచ్చు. నాకు మారుగా ఆ లింగములను గంధము, పుష్పములు, ధూపము, దీపము, నైవేద్యము శక్తికి తగిన విధంగా ఆరాధించ వచ్చు. ఆ లింగములను పూజించిన నన్ను పూజించినట్లే.”✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం… గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

[16/04, 8:59 am] +91 94939 06277: 150423b1527.   160423-2.

🍀🌺🍀 🌺🍀🌺🍀🌺🍀🌺🍀X51.



                   పక్షవాతం - 

              పేకముక్కల చికిత్స!

                  ➖➖➖✍️️


         ఒక పెద్దాయనకు  పక్షవాతం వల్ల కుడిపక్కన అవయవాలన్నీ   చచ్చుబడి పోయి చలనం లేకుండా పోయింది. 


      వైద్య చికిత్స వల్ల ఫలితం అంతగా కనిపించడం లేదు.    అతనికి మాటలు రాక జ్ఞాపకశక్తి కూడా నశించిపోయింది. అతని భార్య  పరమాచార్య స్వామి వారి వద్దకువెళ్ళి కన్నీళ్ళు కారుస్తూ తన గోడు చెప్పుకుంది.     “మహాస్వామి వారు ... కరుణించి నా భర్తను మళ్ళా మామూలు మనిషిని   చేయవలసినది...! ”    అని ప్రార్థించింది.


      స్వామి వారు    కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.


       ”అతను కోలుకోవడానికి    ఏమైనా చెయ్యడానికి సిద్ధమా?” అని అడిగారు.


     ”ఎంత ఖర్చైనా పర్లేదు పెరియవ ” అన్నది ఆవిడ.


   ”నా ఆంతర్యం    అది కాదు!     నేను చెప్పిన విషయం    తేలికగా    తీసుకోరు కదా?” అని అడిగారు.


    ”లేదు పెరియవ మీరు చెప్పినట్టే.... చేస్తాను”


   “రెండు కట్టల పేకముక్కలు తీసుకుని ఎల్లప్పుడూ  అతని  కంటికి కనబడేట్టు పెట్టండి.   నిదానంగా అతని జ్ఞాపకశక్తి పెరిగి    మాటలు వస్తాయి.....”    అని సెలవిచ్చారు.


      ఆ వచ్చినావిడ తెల్లబోయింది. కాని అది  సరైన వైద్యమే  అని    నిర్ధారించు కుంది.       కాని ఒక్క విషయం ఆవిడకి అర్థంకాలేదు  “నాభర్త పేకాటకు బానిస అని స్వామి వారికి ఎలా తెలుసు”  అని అనుకుంది. కాని రోజంతా పేకముక్కలు చూసినంతమాత్రాన       తన భర్త.. పక్షవాతం నుండి బయటపడతాడా?


       పరమాచార్య స్వామి    ఆజ్ఞప్రకారం ఆవిడ అలాగే చేసింది.  కొద్దిరోజులలోనే ఆ పెద్దమనిషి కోలుకోవడం    ప్రారంభిం చాడు.  అతని జ్ఞాపకశక్తి పుంజుకోవడం ప్రారంభించింది.    కొద్దిరోజుల తరువాత పూర్తిగా కోలుకున్నాడు.


  మనవళ్ళతో పేకాట ఆడటం మొదలు పెట్టాడు.   పిల్లలు తప్పు చేస్తే ప్రేమతో... మందలిస్తూ., “నువ్వు  ఇప్పుడు   స్పేడ్ వెయ్యాలి....    హార్ట్స్ కాదు” అనేవాడు. పడిపోయిన   నోరు కూడా      బాగుపడి మాట్లాడడం మొదలు పెట్టాడు.


   ఎంటువంటి పరిహారం సూచించారు మహాస్వామి వారు?    ఇంటి వైద్యమా? పేక వైద్యమా? ఏదేమైనా గెలుపు ముక్క ఉన్నది వారిచేతుల్లోనే...!


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


:

 జై శ్రీరామ్ *అష్టోత్తర శతం*🙏🕉️🙏


108. ఏమిటి ఈ సంఖ్య?  ఏదైనా మంత్రం చదివితే, 108 సార్లు అంటారు. ప్రదక్షిణాలు చేసినా, 108 సార్లు చేస్తే మంచిదంటారు. ఇది చాదస్తమా?  సాంప్రదాయమా? లేక,  ఈ అంకె వెనక ఏదైనా మిస్టరీ ఉందా? భారతీయుల అద్భుత గణిత పరిజ్ఞానానికి  సంఖ్య 108. అవును. దిమ్మతిరిగే  పరిశోధనలను భారతీయులు వేల ఏళ్ళ క్రితమే ఎలా చేశారు? అని చెప్పడానికి ప్రపంచానికి ఇచ్చిన ఎన్క్రిప్టెడ్ కోడ్  108.  ఆలయంలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి? అంటే, చదువు రానివారు కూడా 108 చేస్తే మంచిది అంటారు. రుద్రాక్ష తులసి, ఇలా ఏ మాల తీసుకున్నా,, 108 పూసలు ఉన్నాయా? అని గుచ్చి గుచ్చి మరీ అడుగుతాం. "ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి, మంచిది" అంటాడు పురోహితుడు. ఏమిటి ఈ  108? కొందరు దేవుడిని నమ్ముతారు. కొందరు నమ్మరు కూడా . కానీ, అందరూ నమ్మేది సైన్స్. కనుకే, అందరూ నమ్మే పరిశోధనలు చేశారు, భారతీయు ఋషులు. అవి అలాంటి ఇలాంటి పరిశోధనలు కాదు, అందుకు సరైన ఉదాహరణ ఈ 108. ఈ 108 వెనుక అంతరిక్ష శాస్త్రమే దాగుంది. ఈ భూమి ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఖగోళం అనే వృత్తంలో సూర్యుడు, సూర్యుడు చుట్టూ ఎంత దూరంలో తిరుగుతున్నాడు? వీటన్నిటికీ సమాధానం 108..


 వేదకాలంలో ఎన్నో అద్భుత పరిశోధనలు జరిగాయి వాటిలో అంతరిక్ష శాస్త్రం కూడా ఒకటి. సూర్యుడికి భూమికి, చంద్రుడికి భూమికి మధ్య దూరాలు ఓ రెండు మూడు వందల ఏళ్ళ క్రితమే కనుక్కున్నారని పుస్తకాల్లో చదివాం. కానీ, వేదాల్లో ఈ దూరాల్ని ఎప్పుడో చెప్పేసారు. ఎలా అంటే, 108 తో.. భూమికి, చంద్రుడికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు. భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు. సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు. ఏంటి? ఆశ్చర్యంగా ఉందా? అవును. మనం నివసించే భూమి, మన భూమికి ప్రాణాన్నిచ్చే సూర్యుడు, భూమి ఆకర్షణను బ్యాలెన్స్ చేసే చంద్రుడు, అన్నిటి లెక్కలు ,అన్నిటి దూరాలు ఈ 108తో కలిపి ఉన్నాయి. ప్యూర్ ఎస్ట్రనామికల్ సైన్స్. ఊహించారా?  108 వెనక ఇంతకథ ఉందని.. ఇవన్నీ కాకి లెక్కలు కావు. ఆధునిక సైన్స్ పెద్దపెద్ద కంప్యూటర్లతో, మిషన్లతో, శాటిలైట్లతో కనిపెట్టిన గ్రహాల దూరాలకి వేద కాలంలో భారతీయ ఋషులు 108 కోడ్ తో చెప్పిన ఈ తేడాకి  సరిగ్గా సరిపోయాయి. మరి ఎవరు గొప్ప? ఇక్కడితో ఆగిపోతే మనం భారతీయులం ఎలా అవుతాం? మన జీన్స్ లోనే ఫిలాసఫీ ఉంది.  సైన్స్ ఉంది. 


ఆయుర్వేదం అందరికీ తెలిసిన వైద్యగ్రంథం. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 107+1 మర్మ స్థానాలు ఉంటాయి. ఈ మర్మస్థానాలే మన శరీరంలో అన్ని భాగాలకు ప్రాణాన్ని సరఫరా చేస్తే శక్తి ఉత్పత్తి కేంద్రాలు.


 మర్మకళ అని ప్రాచీన కేరళ వద్ద కళ ఒకటి ఉంది. వాళ్లు మన మర్మాల మీద దాడి చేసి ఆ పార్టులు పనిచేయకుండా చేయగలరు.


 శ్రీ చక్రం వినడం వినడమే కానీ, శ్రీ చక్రం అంతరార్థం ఏంటో చాలామందికి తెలియదు. సృష్టి రహస్యానికి బ్లూ ప్రింట్ అది., శ్రీ చక్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. మొత్తం 108. పాజిటివ్ నెగిటివ్ కలిస్తే ఎనర్జీ. శక్తిని ఉత్పత్తి చేసే ప్రాచీన యంత్రం,అది. .శ్రీ చక్రం ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీలను పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుందని విశ్వాసం.


 జ్యోతిష్య శాస్త్రం కొంతమందివల్ల అది మూఢనమ్మకమనే మచ్చ పడింది. కానీ, జ్యోతిష్యం అంటే పూర్తిగ సైన్స్. కంప్లీట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. దీనికి 108కి సంబంధమేంటి? అంటే, మనిషిలోని ప్రవర్తనలకు సూచికలు. ప్రతి మనిషిలోనూ వారి వారి ప్రవర్తనలకు సూచికలు 27 నక్షత్రాలు. మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రం, ఏ గ్రహం, ఈ భూమి మీద ప్రభావం చూపిస్తాయో, వాటి ప్రవర్తనలే మన జాతకాల మీద, మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. అశ్విని, భరణి 27 నక్షత్రాలు. ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు 27 నక్షత్రాన్ని ఈ నాలుగు పాదాలతో గుణిస్తే, అక్కడ 108 వస్తుంది. ఇందులో 9 పాదాలు ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అలా రాశులు మళ్ళీ 12 ఉంటాయి.


 ఆధునిక మానసిక తత్వశాస్త్రం కూడా మనిషిలో ముఖ్యమైన ప్రవర్తనలం 108 ఉంటాయని చెబుతోంది.


 మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనిషి సగటున ప్రతి రోజు 21,600 సార్లు శ్వాస తీస్తాడు. అందులో పదివేల ఎనిమిది వందల సూర్యాంశ, అంటే ప్రాణశక్తి. పదివేల ఎనిమిది వందల సార్లు చంద్రాంశ. అంటే, మనం వదిలే కార్బన్డయాక్సైడ్ అనుకోవచ్చు. ఆక్సిజన్ పీల్చుకొని, కార్బన్డయాక్సైడ్ ని వదలడం అన్నమాట. పదివేల ఎనిమిది వందలని అంటే 108 వందలే కదా.


 భరతుని నాట్య శాస్త్రంలో చేతులు, కాళ్లు కలిపి చేసే నాట్య భంగిమలు 108 ఉంటాయి. ఈ ఒక్కో భంగిమ ఒక్కో సంకేతాన్ని చెప్తూ ఉంటుంది. నటరాజస్వామి చేసే నాట్య భంగిమలు కూడా 108.


 మన ఉపనిషత్తుల సంఖ్య 1080. మన ఇంట్లో, ఆలయాల్లో అష్టోత్తర శతనామావళి అంటాం. అంటే, 108 నామాలను జపించాలని.


  ఇలా, మన శాస్త్రాలన్నీ మొత్తం 108తో ముడిపడి ఉన్నాయి. అందుకే, ఆ సంఖ్యకి మన ప్రాచీన ఋషులు అంత ప్రాధాన్యతనిచ్చారు.🙏 మీ *శ్రీ రామాలయం*🕉️🛕🕉️

ఊపిరితిత్తులు ఆరోగ్యవంతమై

 *మన ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవడానికి ఏవైనా వ్యాయామాలు కానీ, ఆహార జాగ్రత్తలు కానీ ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా చేయాలో అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*


1.- ఊపిరితిత్తుల ను శుభ్రం చేసుకునేందుకు రోజు ప్రాణాయామం చేయాలి.కొంత వ్యాయామం చేయాలి.సాత్వికాహారం తీసుకోవాలి.అంటే ఉప్పు,కారం, మసాలాలు చాలా తగ్గించి తీసుకోవాలి.వీలైనంతవరకు పళ్ళు తీసుకోవాలి.పచ్చి కారట్, కీరదోసకాయ వంటి వాటిని తురిమి పెరుగు లో వేసుకుంటే ఆరోగ్య మునకు చాలా మంచి ది.


*2.-నిల్వ ఉంచిన పచ్చళ్లు,బిస్కెట్లు, వేపుళ్లు,పాలిష్ చేసిన పదార్థాలు, పంచదార వంటి వాటిని పూర్తిగా మానేయండి.పంచదారకు బదులు బెల్లం లేదా తేనెను తీసుకోండి.*


3.-సిరి ధాన్యాలు కొత్త గా ప్రచారం లోకి వచ్చాయి.ఇవి ఆరోగ్య మునకు చాలా మంచి వి.వరి, గోధుమ లకు బదులు వీటిని వాడుకోండి.చాలా బాగుంటాయి.బిపి,సుగర్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి తీవ్రత తగ్గుతుంది.

*4.-వ్యాయామం -చేయుట వలన గుండె కొట్టుకొనుట వేగవంతమై ఊపిరి తిత్తుల పనితీరు బాగుండి కండరములు ఆక్సిజెన్ సరఫరా మెరుగ్గా ఉండి కార్బన్ డయాక్సైడ్ ను వెలుపలకు పంపిస్తుంది.అన్ని రకముల కాలుష్యములకు దూరం పాటించాలి.*


5.-ఇంటిలోపల ఫర్నిచర్ ను వాక్యూం చేస్తుండాలి (వారం -వారం )


*6.-కిటికీలు తెరచి గాలి వెంటిలేషన్ ఉండే తట్టు గా చూడాలి*


7.-కృత్రిమ ఎయిర్ ఫ్రెషనర్లు , కాండిల్స్ కూడదు


*8.-ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రముగా ఉంచుకోవాలి దుమ్ము ధూళి వలన పీల్చే గాలితో ఊపిరితిత్తులను చేరి ఇర్రిటేషన్ కలుగ చేయును*


*9.-ఇంటిలో ధారాళమైన గాలికి -వెంటిలేషన్ -ఎక్సజాస్ట్ అమరిక ఉంచాలి*


10.-అంటు వ్యాధులు బారిన పడకుండా జాగర్తలు పాటించాలి


11.-పండ్లు కూరగాయలు విరివిగా తీసుకోవాలి. ఎక్కువ మంచి నీరు తాగాలి


12.-వాక్సినేషన్లు తీసుకుంటూ ఉండాలి


*13.-ఉచ్చాస -నిశ్వాసా ములను క్రమబద్దీకరణ పాటించాలి.(బ్రీతింగ్ ).*


*14.-అటు ఆర్ట్ అఫ్ లివింగ్ లో అలాగే ఇషా యోగా లోనూ ఈ పద్ధతులు నేర్పిస్తున్నారు*

ఈ రోజుల్లో ఎవరికీ ఫలానా చేయండి అని సూచించకూడదు నా సలహా

  *ఇవన్నీ పాటిస్తే ఊపిరితిత్తులు ఆరోగ్యవంతమై మనము కూడా ఆరోగ్యవంతులం కాగలం.*

*ధన్యవాదములు 🙏*

*


        




సెలవు

ధృతరాష్ట్రుడు

 💐 *శుభోదయం* 💐


*మహాభారత కథ ప్రకారం ధృతరాష్ట్రుడు అంధుడు..* 


*అతనికి పుత్ర వ్యామోహం ఎక్కువ..*

 

*ఈ కథలో  ఒక అంతరార్థం ఉంది.*


*ధృతరాష్ట్రుడు జీవుడికి సంకేతం...*

 

*రాష్ట్రము అంటే శరీరము...ఉపాధి..*


*ధృత అంటే దృఢం..* 

*ఈ శరీరమే "నేను" అని దృఢంగా నమ్మేవాడు,* 

*ధృతరాష్ట్రుడు...* 

*ఇతడు అహంకారి...* 


*అహంకారంతో ఉన్నవాడు ఎప్పుడూ అంధకారంలో ఉంటాడు.*

 

*అహంకారంతో ఉన్నవాడికి బాహ్యంగా కళ్లున్నా,  జ్ఞాన చక్షువు పనిచేయదు..*


*అందుచేత జీవుడు  అంధుడు...గుడ్డివాడు.*

 

*అహంకారంతో ఉన్నవాడు మమకారంతో జీవిస్తాడు..* 


*ఈ మమకారమే వ్యామోహం...*


*నాది అనే వ్యామోహంతో ఎన్నో తప్పులు చేస్తాడు..*

 

*చివరకు అన్నీ పోగొట్టుకుని అహం వదలక తప్పదని వ్యాసులవారు 

 పాత్ర ద్వారా మనందరికీ చేసిన బోధ...*


*అర్థం చేసుకుని ఆచరిద్దాం...*

 

 

🙏🙏🙏🙏🙏

*ఓం శ్రీ గురుభ్యోనమః*

శ్రీరామనవమి

 *శ్రీరామనవమి-రాముడు జన్మించిన సుదినము.అది సీతారామకళ్యాణము కాదు.*

శ్రీరామచంద్రుడు జన్మించి నేటికి 1,91,49,127- ఒక కోటి తొంబై ఒక్క లక్షల,నలుబై తొమ్మిదివేల ఒకవంద ఇరువది ఏడు సంవత్సరములైనవి.దాదాపు( 2) కోట్ల ఏళ్ళ క్రితం శ్రీరాముడు ఈ ఆర్యావర్త దేశమందు జన్మించారు.

సీతకు పద్దెనిమిది యేండ్లు నిండాక,రాముడికి (25)యేండ్లు నిండాక వారి వివాహము జరిగినట్లు తెలియుచున్నది.అయితే అది చైత్ర శుద్ధ నవమి నాడు కానే కాదు.అయినను నిరాధారంగా,మన దక్షిణాదిన శ్రీరాముడి జన్మదినోత్సవములు జరుపుటకు బదులు సీతారాముల కళ్యాణోత్సవాలు జరపుతున్నారు. జీవితములో ఒక జంటకు ఒక్కమారే వివాహము జరుగుతుంది.కాని ఈ కళ్యాణ వేడుకలు చేయువారు,శ్రీరాముడికి యేటేట పెళ్ళిల్లు జరిపిస్తున్నారు.

ఆ సందర్భంగా పురోహితుడే పతివ్రత తల్లి సీతాదేవి(విగ్రహము) మెడలో తాళి కట్టు కుప్రథకు-దురాచారమునకు తెర లేపారు.

తన భార్య సీతాదేవిని యెత్తుకుని వెళ్ళిన రావణాధముడిని బంధుబాంధవ,పుత్ర సమేతముగా శ్రీరామచంద్రుడు హతమార్చాడు.అటువంటప్పుడు,ఈ దుష్ట కార్యమునాచరించు పూజారులు యేల నశించకుందురు?


మనము అసలుసిసలైన శ్రీరాముడి చరిత్రోపాసకులము.ఇటువంటి కుప్రథలు-దురాచారాలు దక్షిణాదిలో జరుగకుండా మనమే చూడాలి.ఒక ఉద్యమ రూపకంగా పని చేయాలి. పూజారులు సీతామ తల్లి పై చేయుచున్న ఈ దుష్టాచారాన్ని నిరోధించాలి.

మహర్షి స్వామి దయానంద సరస్వతిగారు వాల్మీకి విరచిత రామాయణాన్ని పఠనీయ గ్రంథాలలో సూచించారు.

శ్రీరాముడు జగదభిరాముడు.రఘుకుల సోముడు.

ఇంతకాలం ఒక వ్యక్తిని భరతజాతి యావత్తు యింతగా గుర్తు చేసుకోవడానికి అతడి శుభ గుణములే కారణము.

శ్రీరాముడు ఒక స్ఫూర్తి.ఒక ఉద్యమము.ఒక అగ్ని శిఖ.

అందువలన ఆ మహాపురుషుడు మహిలో రాక్షసులు లేకుండా చేశాడు.సరయూనది తీరమునగల కోసల దేశమునుండి సుదూర ప్రాంతమైన దక్షిణాతటిలోని దండకారణ్యము వరకు పాదాచారియై పయనించి ధర్మవిహీనులను, దుష్కర్ములను దునుమాడాడు.

“అగ్నే త్వం సుజాగృహి”అంటుంది యజుర్వేదము.

(అగ్నే)అగ్నివంటి తేజోవంతుడైన వీర!వీరాగ్రేసరా!(త్వమ్)నీవు(సుజాగృహి)బాగుగా మేల్కొనుము. వీరులు,వీరాగ్రణ్యులు మేల్కొనియుండి ప్రజలను బాగుగ మేల్కొలుప వలయును.నిద్రాణమైయున్న జాతి సర్వ నాశనమగును.

మేల్కొన్న వ్యక్తికి -పురుషార్థ పరాయణునికి పరమే శ్వరుడి మరియు  ధర్మ సహకారముంటుంది. పురుషార్థరహితుడై నిద్రించే వ్యక్తిని ధర్మము యే రకంగాను కాపాడదు.

“Vigilenti bus non dormanti bus “ఇది “లా”లోని ఒక ల్యాటిన్  మ్యాక్సిమ్(సిద్ధాంతము).తన హక్కులపై అవగాహన గల జాగరూకునికి ‘లా’సహకరిస్తుంది.తన హక్కులు-బాధ్యతలు మరచిపోయి నిద్రించే వ్యక్తికి సహకరించదు.

అగ్ని-అంటే జాగరూకత.అగ్ని-వేడియున్నప్పుడు శరీరము చైతన్యవంతముగనుండును.లేనపుడు చల్లబడును.శవమగును.శవమెంతటి మహనీయు నదైనను నిరుపయోగమగును.దానిని కాపాడవలసి వచ్చును.అది ఇతరులను కాపాడదు.తన్న తాను కాపాడుకొనజాలదు.పూర్వము ఆర్యవీరులు అజేయు లుగా యుండి అవనిలో అన్యాయ అక్రమాలు యెక్కడ జరిగినను, అచ్చటికి చేరుకొని మరీ అరికట్టుచుండిరి.

కాని,నేడు దురదృష్టవశాత్తు మన దేశములోనే అన్యాయఅక్రమాలను అరికట్టజాలకున్నాం.దీనికి కారణం? మనలో అగ్ని లేకపోవడమే!

🚩“అగ్ని మూలం బలం పుంసాం రేతో మూలంతు జీవితమ్।తస్మాత్ సర్వ ప్రయత్నేన అగ్నిం వీర్యంచ రక్షయేత్॥(చరక సంహిత)

జీవులకు జఠరాగ్ని దీప్తిని బట్టియే బలం ఉంటుంది.

వీర్యము జీవనానికి మూలము.కావున అన్ని విధాల ప్రయత్నించి అగ్ని దీప్తిని,వీర్యమును కాపాడు కొనవలెను.

వాల్మీకి శ్రీరాముడిని అద్భతంగా వర్ణించాడు.

🚩 “ఇక్ష్వాకు వంశప్రభవో రామోనామ జనైః శ్రుతః।నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ధృతిమాన్వశీ॥”వా.రా.బాల కాండము.8.

ఇక్ష్వాక వంశోద్భవుడు రామనామ విఖ్యాతుడు-నియత స్వభావుడు(మాటిమాటికి స్వభావములు మార్చువాడు కాడు), వీర్యవంతుడు-చెఱకుగడలో రసమున్నట్లు శరీరములోని కణకణమునందు వీర్యమున్నవాడు, అగ్నితుల్య తేజోవంతుడు,ధృతివంతుడు-వెనుకడుగు వేయని దైర్యవంతుడు మరియు తనపై తనకు అదుపు గలవాడు.

🚩బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః।

విపులాంసో మహాభాహుః కంబుగ్రీవో మహాహనుః॥

మహెూరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమః।

🚩అజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః॥

వా రా.బాలకాండం.9,10.

శ్రీరాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, వాగ్విశారదుడు-మధుర భాషి,శత్రు సంహారకు డు,ఆజానుబాహుడు,గుండ్రటి బలమైన భుజములు కలవాడు,శంఖాకృతిని బోలిన కంఠము గలవాడు,విశాలమైన నుదురు కలవాడు,సదా ధనుస్సును ధరించి శత్రువులకు బుద్ధి చెప్పుటకు ఉద్యుక్తుడై యుండువాడు,మెడ యెముకలు-clavical bones మాంసముతో కప్పబడి పుష్టికరముగ నున్నవాడు,సుందరమైన శిరస్సు మరియు మహా పరాక్రమవంతుడు.

ఆబాలవృద్ధులు తమ శరీరాకృతిని వ్యాయామ ము(దండెములు-బస్కీలు) సూర్యనమస్కారాలు, ఆసనములు మరియు ప్రాణాయామముల ద్వారా రామునికి తుల్యముగ మార్చుకొని శరీరమునందు వీర్యమును వర్ధిల్ల జేసుకొనవలయును.అగ్ని-తేజములను కలిగి యుండవలయును.

అప్పుడు అందరు వారిని ఆదరింతురు. తేజోవిహీనులను తిరస్కరింతురు.ప్రజ్వరిల్లుచున్న అగ్నిని,జ్వాలలను దాటుటకెవరు సాహసింతురు?నిప్పును త్రొక్కరు.బొగ్గును త్రొక్కవచ్చును.కావున ఆర్యసమాజీయులు,వైదికులు,వేదాభిమానులు “అగ్నే త్వం జాగృహి”వేద వాక్యమును శ్రీరామనవమి రోజు పఠించి,మననము చేసి తాము మేల్కొని,ఇతరులను మేల్కొలిపి చైతన్యవంతమైన  జాతిగ రూపొందవలయునని “ఆదిత్య వాణి”కోరుచున్నది.

ఊరగాయల కార్యక్రమం

 *మార్చి లొనే మనల్ని వడియాల్లా వేయించేస్తున్న ఈ ఎండల్ని చూస్తుంటే పాతారోజులు జ్ఞాపకం వస్తున్నాయి. మునుపూ ఎండలు ఉన్నాయి. కానీ వాటికి మనం ఇంత భయపడింది లేదు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించు కొనేవారు. నాకయితే బాగా గుర్తు. వేసవి కాలం వచ్చిందంటే మాబామ్మ , అమ్మ, చాలా బిజీగా ఉండేవారు. మాకు పరీక్షల హడావుడి; వాళ్ళకి ఇంకోరకం హడావిడి. "నులకమంచాలు, పట్టెడ మంచాలూ, మడతమంచాలు బైటవేసి, ఏడాదికి సమకూర్చుకొన్న పప్పులు ఎండబెట్టి, అన్నీ డబ్బాలలో పోసి అటకెక్కించడం పెద్దపని. అది అవుతూనే వడియాలు పెట్టే కార్యక్రమం మొదలు. గుమ్మిడి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, చల్ల/మజ్జిగ మిరపకాయలు, గుమ్మిడి వడియాలూ, పిండి వడియాలు.... అబ్బో! పెద్ద బృహత్తర కార్యక్రమం. నాలుగు ఎండలకే, వడియాలు గలగల లాడుతూ ఎండిపోయేవి. మధ్యలో పచ్చివడియాలు- అన్నంలోకి వేయించుకొని ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. ఈలోపు మాపరీక్షలు అయిపోయేవి. మళ్ళీ ఊరగాయల కార్యక్రమం మొదలు. పప్పులడబ్బాలు, వడియాల డబ్బాలు, అన్ని వరసగా ఆటకెక్కేవి. భోషాణపు పెట్టెలు నిండిపోయేవి.  జాడీలు అన్ని బుద్ధిగా కిందికి దిగేవి. మళ్ళీ ఊరగాయల కార్యక్రమం మొదలు. ఆవాలు, మిరపకాయలు, ఉప్పు ఎండబెట్టడం, పనివాళ్ళచేత ఇళ్లలోనే చెక్కరోళ్లలో ఆవకాయ కారాలుకొట్టించడం, అన్నికొలతలు కొలుచుకొని, జాడీ లకెత్తించడం; మరునాడు సొంత తోటల్లోంచికాని, లేదా వాడుగ్గా ఇచ్చే చెట్టునించి కాని కాయలు కోయించి తేవడం, వెంటనే కాయలు నీళ్ళల్లో వేసి కడగడం మావంతు.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ముందురోజే "మరకత్తి పీట" ని అటకమీదనుచిదించి కడిగి శుభ్రంచేసి ఉంచేవారు. నాన్నగారు మరకత్తి పీటతో కాయలుతరిగితే, జీడి తీయడం మావంతు. బామ్మ పర్యవేక్షణలో అమ్మ ఆవకాయకలిపి జాడీలకెత్తి ఆమహాయజ్ఞం జయప్రదంగా పూర్తి చేసేది.  మరునాడు మాగాయ, తొక్కుడు పచ్చళ్ళపని.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

          *ముందురోజే ఆవకాయ కాయతోపాటు, మాగాయకికూడా మామిడికాయలు తెచ్చి నీళ్ళల్లో వేసి ఉంచేవారు. తెల్లవారి లేస్తూనే అమ్మ పాతదుప్పటి పరిచి రడీ అయ్యేది. మేమందరం కాయలన్నీ తుడిచి పెడితే, ఇరుగపొరుగు అత్తయ్యలందరూ కదనరంగానికి వచ్చే వీరనారుల్లా కత్తిపీటలువేసుకొని తయారై వచ్చేవారు. వదినా, అత్తయ్యగారు, పిన్నిగారు, అంటూ కబుర్లు చెప్పుకుంటూ-- అలవోకగా రెండువందలకాయల్ని- మాగాయకి, తొక్కుడుపచ్చడికి తరిగేసి, కావాలంటే ఉప్పువేసి ముక్కల్ని జాడీకెత్తేసి మరీ ఇంటి కెళ్లేవారు.*

*ఒకరికి ఒకరు మేమున్నాం మీకు- అన్నట్లు గా ఆరోజుల్లోఉండేవారు. పనిసాయం, మాటసాయం, ఆర్థికసాయం చేసుకుంటూ ఒకరికొకరు అండదండలుగా ఉండేవారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

        *ఆవకాయలపర్వం పూర్తయ్యేసరికి, అత్తయ్యలు, పిల్లలు, వేసంగి సెలవలకి అమ్మమ్మల ఇళ్ళకి రావడం మొదలయ్యేది. ఇంక ఒకటే సందడి. పెద్దలకి వాళ్ళ కబుర్లు, పిల్లలకి వాళ్ల ఆటపాటలతో, చిలిపిచేష్టలతో ఒకటే సందడి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *సాయంత్రం అయ్యేసరికి మావీరమ్మ  పెరడంతా పేడనీళ్లతో   కళ్ళాపుజల్లి ముగ్గేసి అందరికి పట్టెమంచాలు, మడతమంచాలు వేసి, పక్కలువేసి వెళ్ళేది.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

           *ఆరుబయట హరికేన్ లాంతరు మధ్యలో పెట్టుకొని అందరం చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పు కుంటూ భోజనం చేసిన ఆరోజులు ఇప్పటికి నా కళ్ళకి కడుతున్నాయి. నాకే కాదు, ఇలాంటి అనుభవం మీకందరికీ ఉండే ఉంటుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

       *రెండురోజుల తరువాత కొత్తావకాయ, మామిడిపండు తో అన్నం తింటుటే, స్వర్గం బెత్తె డు దూరం లో ఉన్నట్టు ఉంటుంది.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

        *నాన్నగారు వేసవి వస్తూనే ఓ  పాతిక తాటాకు విసిన కర్రలు కొనేసి అందరి మంచాల దగ్గర పెట్టేసివారు. పెరట్లో మంచాలు వేసుకొని పడుకొంటే ఆవేపచెట్టు నుండి వచ్చే గాలి, కొబ్బరాకుల గలగలలు, ఆకాశం లో చుక్కలు, చంద్రుడు, వెన్నె ల, చుక్కల్ని చూపిస్తూ బామ్మ చెప్పే కబుర్లు ,,,,,,,నిద్రఎప్పుడు పట్టింది తెలిసేదికాదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

    *ఇప్పట్లా ఫాన్, ఏసీ లు ఏమీ లేని రోజులు,అయినా ఏమీ కష్టం అనేపెంచేదికాదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

       *ఆరోజులు ఈరోజులు పూర్తిగా అనుభవించిన తరం మాది. మాతరం కనుమరుగైతే బహుశా ఇలాంటి అనుభూతుల్ని మీతో పంచుకొనే పెద్దలు ఇంకోపదేళ్ల తరవాత ఎవరూ ఉండరు.*  *అందుకే ఆనాటి ముచ్చట్లు మీతో పంచుకుందాం అనిపించింది.*

పరమార్ధమంతయు

 *కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లుచూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు.ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు.  జానకమ్మ బెంగ పెట్టుకుంది, కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని.*


*ఒక రోజు షావుకారు వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి.  ప్రతి గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా టేపు తో కొలిచాడు.భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు.చివరికి పెదవి విప్పాడు షావుకారు…“మాస్టారుగారూ, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క..ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి.మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?”*


*రాఘవరావు మౌనం వహించాడు.జానకమ్మే అంది.‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే.*

 *అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై లక్షలు, ఇంటికి పదిహేను, మొత్తం ఏభై ఐదు లక్షలు రాదంటారా?” *


*ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు… “చూడండి అమ్మా, మీ లెక్కలు మీకు ఉంటాయి. కొనేవాడి లెక్కలు కోనేవాడికుంటాయి. నేను ఇక్కడ ఒక అపార్ట్ మెంట్ కట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు ఇల్లు తీసెయాలి. అందుకని స్తలం రేట్ కి కొందామని నా ఉద్దేశ్యం. అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను.  ఆలోచించండి “ అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు.*


*అతను వెళ్ళాక భార్యాభర్తలు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.చివరకుజానకమ్మే నిర్ణయం ప్రకటించింది ."మనం ఆలస్యం చేసేకొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారి పోతుంది

నలభై లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం. మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు”.ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది, ఇల్లు నలభై లక్షలకు షావుకారికి ఇద్దామనుకుంటున్నామని .

రాజేష్ అలాగే చెయ్యమని చెప్పాడు.*


*మర్నాడే రాఘవరావు షావుకారికి కబురుచేసి తమ అంగీకారం చెప్పాడు.  వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరం అయ్యింది.  రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకుని హైదరాబాదు వెళ్ళిపోవడం చాలా స్పీడుగా జరిగిపోయింది.*


*నెలరోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లితండ్రుల్ని హైదరాబాదుకి  తీసుకునివెళ్లాడు. భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు, జానకమ్మ.*


*కొన్నాళ్ళకు మనవల ఆట పాటలతో ఇంటి గురించి మర్చిపోయారిద్దరూ. మరో నెల రోజులకు కొడుకు కొన్న ప్లాట్ లోకి మారారు అందరూ.రెండు పడక గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు. కొడుకుని అడిగితే  ‘మనం ఆలస్యం చేయడంవలన, మూడు పడక గదుల ప్లాట్ చేజారిపోయిందని ‘ చెప్పాడు రాజేష్.  కొడుకు, కోడలు మనవలు ఒక గదిలో, రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునే వారు.మూడు నెలలు ముచ్చటగా గడిచాయి.  ఒకరోజు మనవడు ‘నానమ్మా, నేను నీ దగ్గరే పడుకుంటానని’ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. జానకమ్మ ఎంతో సంతోషంతో వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది.  పది రోజులు తర్వాత మనవరాలు కూడా ‘నానమ్మా, నేనూ నీ దగ్గరే పడుకుంటానని’  జానకమ్మ దగ్గరకు వచ్చేసింది.  ఆ విధంగా రాఘవరావు పడక హాలులోని దివాను మీదకు మారిపోయింది.

ఆరునెలలు గడిచాయి.  పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు, కోడలు గొడవ పడటం చూసి, తన పెన్షన్ లో దాచుకున్న ఏభై వేలు పట్టుకొచ్చి కొడుకుకి ఇచ్చాడు

రాఘవరావు. మరో ఆరునెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్ లోంచి ఐదువేలు తన దగ్గర ఉంచుకుని మిగతా ఇరవైవేలు కొడుకుకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.  ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని కోడలు సుమిత్ర కాన్వెంట్ లో టీచర్ గా చేరింది.,


*వంట చెయ్యడం, మనవలు ఇద్దరినీ కాన్వెంట్ కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీ గా మారిపోవడం జరిగింది. జానకమ్మకు శ్రమ ఎక్కువ అయ్యింది ఇంటి పనితో.శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు.వంట తక్కువ, పని కూడా తక్కువే .  విశ్రాంతిగా ఉండేది.ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు. పని ..పని ..పని..!

మరో ఆరు నెలలు గడిచాయి. మనవలు ఇద్దరూ పెందరాళే పడుకోకుండా స్కూల్ విషయాలు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాలు లోకి మారింది. రాఘవరావు దివాను మీద, జానకమ్మ నేలమీద చాప వేసుకుని పడుకుంటున్నారు.*


*ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు “ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు?” అని అడిగాడు.*


*మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ ‘మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను’ అంది.*


*మర్నాడు ఉదయం శివపురం హైస్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల సభ చాలా బాగా జరిగింది.*



*ముందుగా తమకు విద్య నేర్పిన గురువులు అందరికీ 

పాదాభివందనం చేసి, ఆ తర్వాత వేదిక మీదకు వెళ్ళారు.రాఘవరావు, మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి, సంస్కారానికి అబ్బురపడ్డారు.అమెరికాలో, ఆస్ట్రేలియా, సింగపూర్ లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు పేరునా పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది.పూర్వ విద్యార్ధుల తరపున వరుణ్ మాట్లాడుతూ “ఈసమావేశానికి మూలకారకులు మిదున్, సాత్విక్.వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నా అందరినీ కాంటాక్ట్  చేసి ఇక్కడికి రప్పించారు.వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.మమ్మల్ని వృద్ధిలోకి తీసుకువచ్చిన మా గురువులు అందరికీ నా నమస్సులు.” అని అన్నాడు.*


*తర్వాత గురువులు అందరికీ ఘనంగా సన్మానంచేసి, వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్ధులు.*


*రాఘవరావు మాట్లాడుతూ,”మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం.అది గురువుగా మా బాధ్యత.మీరు మన ఊరికి, మన స్కూలుకి  పేరు తెచ్చినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి.*


మీరు అందరూ పిల్లా, పాపలతో సుఖంగా ఉండాలి.

మీరు మాకు చేసిన సత్కారం,సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను” అని అన్నాడు. *


*వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.  చివరగా మిదున్ మాట్లాడుతూ… ”మన బాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్ గా తణుకులో ప్రాక్టీసు చేస్తోంది.  ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది.  ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి” అని అన్నాడు.*


*అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు.  రాఘవరావు ఇంటిముందు ఆగాడు మిదున్.*


*రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు.తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి.గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది. మిదున్, రాఘవరావు చేయి పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు.  “మాస్టారు, మీ ఇల్లు మీకు అప్పచెబుతున్నాం. మీరు, అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి.  షావుకారు దగ్గరనుండి మేము దీన్ని కొన్నాం. చాలా కాలంక్రితమే పరమేశం గారు నాకు, మీరు ఎంత బెంగగా, దిగులుగా ఉన్నారో చెప్పారు. మేము ఈ రోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలూ, కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి మూలం మీరు పెట్టిన జ్ఞాన భిక్షే. మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే నేనూ, నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం.  మీ స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు.  మీ ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది.  మన వూరి నుండి తణుకు పది నిముషాల ప్రయాణం. మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక.  కాదనకండి.” అని రాఘవరావు రెండు చేతులూ పట్టుకున్నాడు.*


*కళ్ళమ్మట ఆనందభాష్పాలు కారుతుండగా రాఘవరావు, మిదున్ ని దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు.*


*వెంటనే ఇంట్లోకి వెళ్లి, ప్రతిగుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు.దొడ్లోకి వచ్చి,మామిడిచెట్టు కింద ఉన్న చప్టా మీద కూర్చున్నాడు.లేచి ప్రతి చెట్టుని ముట్టుకుని పరవశించి పోయాడు.తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవుదూడ,చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు.ఐదు నిముషాలు గడిచాక పూర్వ విద్యార్ధులు అందరూ రాఘవరావు దగ్గర శెలవు తీసుకుని వెళ్ళిపోయారు.*


*రాఘవరావు, మిత్రబృందం మిగిలారు.  పరమేశం, సుబ్బారావు ల చేతులు పట్టుకుని  ‘మీ ఋణం ఎలా తీర్చుకోను’ అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో.*


*“రోజూ మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే” అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.*


*ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ. ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది.*


*“పైస జారనీకు* *ప్రాణమున్నంతకు*

*పైస పోయెనేని ప్రాణమాగు*

*పైస లోనగలదు* *పరమార్ధమంతయు,*

*పైసె యిలను వెలసె ప్రాణమగుచు!!*


*అదీ కథలోని నీతి!*

*విశ్రాంతజీవులందరూ,తస్మాత్ జాగ్రత....*


*మీ కంటూ చివరి వరకు ఒక ఇల్లు ఉండడానికి ఉంచుకోండి. మీరు మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించవచ్చు... చివరి దశలో మిమ్మల్నీ ఒక పనిమనుషులుగా మీ పిల్లలు వాడు కొంటారు. విదేశాలకు వెళ్లి 6నెలలు పిల్లలకు మనవళ్లు మనవరాళ్లకు ఊడిగం చేసి రావాల్సి వస్తది.... ఎందుకంటే విదేశాల్లో పనిమనుషులు దొరకరు ఒకవేళ దొరికిన వాళ్లు చాలా కాస్ట్లీ..!   ఫ్రీ గా వచ్చేది అమ్మ నాన్నలు, అత్త మామలు..!  ఆర్నెల్ల ముందు ఫ్లైట్ బుక్ చేసుకుంటే చాలా చౌకగా పడతాది.   6 నెలలు వాడుకున్నంత వాడుకోవచ్చు.. ముఖ్యంగా తల్లులకు ఎక్కువ పని. అందరు పిల్లలూ అలా లేరు కొందరు మాత్రమే...!  సీనియర్ సిటిజన్స్ చివరి రోజుల్లో స్వేచ్ఛగా ఆనందంగా హ్యాపీగా బతకండి...*

తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు

 తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం  -


    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.


      వాము  250 గ్రాములు .


      జీలకర్ర  250 గ్రాములు .


      ధనియాలు  250 గ్రాములు . 


         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.


            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.


  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు  -


  పాటించవలసిన నియామాలు  -


      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .


 పాటించకూడనివి  -


       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం 


          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు. 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

ఓంకార (ప్రణవ) సాధన*

 .

       *ఓంకార (ప్రణవ) సాధన*


      "ఓం" అనే ప్రణవమే ధనుస్సు. లోనున్న జీవాత్మే బాణము. పరమాత్మయే లక్ష్యం. నిశ్చలమైన మనస్సుతో లక్ష్యాన్ని చేరు. లక్ష్యంతో ఐక్యమై నిన్ను నువ్వు అధిష్టించి పరిపాలించుకో.


      "ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరమ్ మా మనుస్మరమ్" 


      ఓం అనే ఏకాక్షరమే బ్రహ్మం . అది నాద స్వరూపమగును, జ్యోతి స్వరూపం అవుతుంది జీవుని యందు స్థితి చెంది ఉన్నది. అదే "నేను" అనే ప్రజ్ఞ. అదే భావంగా, వాక్కుగా మరియు ప్రాణంగా, శ్వాసగా వ్యక్తం అవుతోంది. అంటే తనను తాను ఉచ్చరించుకొంటోంది. దాని యందు అనుస్మరణం సిద్దిస్తే తానక్షరుడగును.


      అన్ని వేదాలు ఘోషించే గమ్యం, అన్ని తపస్వులు ఉధ్ఘాటించే గమ్యం, సమస్త సాధువుల ఏకైక లక్ష్యం ఓంకారమే. ఓంకార బ్రహ్మం యొక్క నాదస్వరూపమే. అన్ని శబ్దాలకు, భావములకు ఓంకారమే మూలము. కాబట్టి "ఓంకారాన్ని" నిరంతరం జపం చెయ్యి. 


       ఓంకారం ఏకాక్షరముగా త్రిగుణాతీతం. అందులోని "అ" కారం "ఉ" కార, "మ" కారములు త్రిగుణములు. అవే సృష్టి కారకములు. త్రిగుణాతీత శుధ్ధచైతన్యంగా తనను తాను తెలియుట. ఓంకారము ఉచ్చరిస్తూ అది తానే అని భావన చేయాలి. ఇదే అనుస్మరణం కావాలి.


       ధనము, పదవి, కుటుంబంపై ఆధారపడే వారు సుఖ దుఃఖాలకు లోను అవుతాడు. శరీరం పై ఆధారపడే వారు కూడా అలాగే దుఃఖితులు అవుతారు. ఇవి అన్నీ తనపై ఆధారపడి ఉన్నాయి. తనపై ఆధారపడే వానిపై ఆధారపడే వారు అవివేకి. తాను ఓంకారం పై ఆధారపడి ఉన్నాను అని తెలిసి దానిపై ఆలంబనగా అనుస్మరణం చేయడం సర్వోత్కృష్టం.


       ఓంకారం మాత్రమే అక్షరం (శాశ్వతమైనది). దాని నుండి మిగిలిన అక్షరాలు జన్మిస్తాయి. ఈ అక్షరాలు తెలిసినవానికి తాను అక్షరుడని తెలుస్తుంది. అదే ఉన్నతోన్నతమైన సిద్ది. ఈ సిద్ది పొందిన వారికి సమస్తం సిద్దించగలదు. అందుకే ఓంకారాన్ని నిరంతరం అనుస్మరణం చేయమని భగవానుడు బోధిస్తున్నాడు.


       ఓంకారాన్ని అనుస్మరణ రూపంలో ఆశ్రయిస్తే నువ్వు ఎన్నో మార్పులకు లోను అవుతావు. శరీరం యొక్క, పుట్టుక, బుద్ది, నాశము అను మార్పులను కూడా గమనించగల సనాతనుడుగా నిన్ను నువ్వు తెలుసుకోగలవు. సమస్త మార్పుల యందు మార్పు చెందని వానిగా నిన్ను నువ్వు తెలుసుకో గలవు. నువ్వు అక్షరుడవుగా, శాశ్వతంగా నిలువ గలవు. కాబట్టి ఓంకారాన్ని అనుస్మరణ చేయాలి.


       ఓంకారమే బ్రహ్మం. అది వ్యక్త బ్రహ్మం. దానినే ఆత్మ అంటారు. అనుస్మరణచే అది నువ్వే అని తెలియగలవు. అప్పుడు నీ నిజమైన మహిమను నువ్వు తెలుసుకుంటావు. లోపల బయటా శుచి నేర్చుకుంటూ ఓంకారాన్ని నీ యందు జరుగుతున్న స్పందనమును గుర్తించి ధ్యానం చేయాలి.


      ఓంకారాన్ని నిరంతరం అనుస్మరణ మార్గంలో తెలిసిన వారు కదలకుండానే దూర ప్రయాణం చేయగలడు. ప్రయాణిస్తూ స్థిరమైన స్థితిలో ఉండగలడు. కదిలే దానిలో కదలని వాడుగా, కదలని దానిలో కదిలే వాడుగా తన్ను తాను తెలుసుకోగలడు. 


      ఓంకారం తెలియాలంటే ఓంకారాన్ని నిరంతరం జపం చేయడమే మార్గం. ఆ స్మరణం అనుస్మరణం కావాలి. అంటే నిరంతరం గా జరగాలి. నిజానికి ఓంకారం నీ యందు నిరంతరం జరుగుతూనే ఉంది. దాన్ని ప్రశాంతంగా గమనించడమే నీ సాధన. వైఖరితో ఉచ్చరించడం ప్రాధమిక సాధన. జరుగుతున్న ఓంకారాన్ని గమనించడం ఉత్తమ సాధన. అది నువ్వే అని తెలియడం సిద్ది. అప్పుడు నువ్వు నీ శరీరం కాదు అని కూడా తెలుస్తుంది. ఇదే ముక్తి.

గ్రహణం తర్వాత

 శ్లోకం:☝️

*అహంకారగ్రహాన్ముక్తః*

 *స్వరూపముపపద్యతే ।*

*చంద్రవద్విమలః పూర్ణః*

 *సదానందః స్వయంప్రభః ll*

 అధ్యాత్మోపనిషత్-11


భావం: గ్రహణం తర్వాత (రాహువు నుండి విముక్తమైన) చంద్రుని వలె, అహంకారపు పట్టు నుండి విముక్తి పొందిన జీవుడు శుద్ధంగా, పూర్ణంగా, నిత్యానందంగా, స్వయంప్రకాశవంతంగా ఉన్న తన స్వరూపాన్ని పొందుతాడు.🙏

ఆలయాలు

 ⑴ సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

కాశ్మీర్.. *బాసరా (తెలంగాణ)..*

⑵ బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో... 

పుష్కర్ (రాజస్థాన్).. *ధర్మపురి (తెలంగాణ)..* 

⑶ త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. *కాలేశ్వరం (తెలంగాణ)*

⑷ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. 

నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)

*గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)*


*ధర్మపురి:-*

యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. 

(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా)

బ్రహ్మదేవుడు (సృష్టి)

నరసింహుడు, (స్థితి)

శివుడు, (లయం)

యముడు, (కాలం)

అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది


*కాళేశ్వరం:-*

ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. 

గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. 

సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే.. 


*వేములవాడ:-*

అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)


*మెదక్:-*

సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది.. 


*యాదగిరి:-*

అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం.. 


*కొండగట్టు:-*

శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం.. 


*బాసర (వ్యాసపురి):-*

వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం.. 


*భద్రాచలం:-*

శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం. 


*చెన్నూర్:-*

గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం. 


*మంథని:-*

మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే. 


*బోదన్:-*

బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే. 


🙏 *మన తెలంగాణ ఘన కీర్తి గల తెలుగు నేల* *మనదైనందుకు తెలుగు వారిగా గర్వ పడదాం* 🙏

సుభాషితమ్


            _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝


*కదర్థిస్యాపి హి ధైర్యవృత్తేః*

*న శక్యతే ధైర్యగుణఃప్రమార్ష్టుం|*

*అధోముఖస్యాపి కృతస్య వహ్నేః*

*నాధశ్శిఖా యాతి కదాచిదేవ||*


తా𝕝𝕝 

*నిప్పును తలక్రిందులుగా పట్టుకున్నప్పటికీ దాని జ్వాల పైకే ఎగిసిపడుతుందికదా.... అట్లే ఎన్ని కష్టాలెదురైననూ ధీమంతుడు తన ధైర్యాన్ని విడనాడడు*.....

[15/04, 9:11 am] Srmada Vdk Br Fn: *శ్రీ సూక్తము-10*


*మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి౹*

*పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః॥*


తా॥ 

ఓ లక్ష్మీ! మనస్సులోని కోరిక, సంకల్పము, మాటయందలి సత్యము, పశువులవలన క్షీరాదులు, అన్నము మున్నగునవి, సంపద, కీర్తి - ఇవన్నియును నాకు గలుగు గాక!


 శ్లోకం:

*దశ ధర్మం న జానంతి ధృతరాష్ట్ర నిబోధ తాన్ ।*

*మత్తః ప్రమత్త ఉన్మత్తః శ్రాంతః క్రుద్ధో బుభుక్షితః ॥*

*త్వరమాణశ్చ భీరుశ్చ లుబ్ధః కామీ చ తే దశ ।*

*తస్మాదేతేషు భావేషు న ప్రసజ్జేత పండితః॥*

                               ~విదుర నీతి


భావం: ధృతరాష్ట్ర మహారాజ! ధర్మం తెలియని వారు లేక ఆచరించని వారు పది రకాలుగా ఉంటారు – మత్తులో ఉన్నవారు, శ్రద్దలేనివారు, పిచ్చివారు, అలసటతో ఉన్నవారు, కోపంతో ఉన్నవారు, ఆకలితో అలమటించేవారు, తొందరపాటు మనుషులు, భయాందోళనలు గలవారు లేక పిరికివారు, దురాశాపరులు లేక పిసినారులు, మరియు కామాంధులు. అందుకే పండితులు వీళ్లందరితో సాన్నిహిత్యాన్ని తగ్గించుకోవాలి.


*శ్రీ సూక్తము-11*


*కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ౹*

*శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్॥*


తా॥ 

లక్ష్మీదేవి కర్దముడను పుత్రుని సుపుత్రుడు కలదిగా అయినది. కావున ఓ కర్దముడా! నీవు నా యింటియందుండుము. పద్మమాలికలు ధరించి నదియు, నీ తల్లియు నగు లక్ష్మీదేవిని నా వంశమున నుండునట్లు చేయుము.


 శ్రీరామకృష్ణమఠపు ప్రచురణలలోని “శంకర ఉవాచ” అనే పుస్తకములో *అవిద్య, గురువు -శిష్యుడు, నే నెవడు, వైరాగ్యస్తుతి, నిర్వాణ షట్కము, జ్ఞానము, ఆత్మ, బ్రహ్మము, పరిశిష్టము, ప్రార్థన* అనే విషయముల గుఱించి వ్రాయబడింది. వాటిలో *“అవిద్య”* గుఱించి మొదట్లో వ్రాయడం జరిగింది. ఇప్పుడు *‘గురువు - శిష్యుడు’* గుఱించి ఈ రోజునుంచి మొదలుపెట్టబడింది.


*శ్రీ శంకర ఉవాచ:*


*గురువు ~ శిష్యుడు.*


1. వేదవిదుడు, పాపరహితుడు, కోరికలు లేనివాడు, బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడు, బ్రహ్మనిష్ఠుడు, ఇంధనములేని అగ్నివలె శాంతుడు, అవ్యాజకరుణా సముద్రుడు, శరణాగత సుజనులకు మిత్రుడు అగువాడు నిజమగు గురువు.