ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
24, అక్టోబర్ 2020, శనివారం
కమలాక్షు నర్చించు కరములు కరములు
🌺 *ఓం నమో నారాయణాయ*
*57. కమలాక్షు నర్చించు కరములు కరములు;
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు
; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
; మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి
; దేవదేవుని చింతించు దినము దినము;
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.*
*భావము:-* నాన్న గారు! కమలాల వంటి కన్నులు కల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే అవి చేతులు; లేకపోతే చేతులు, చేతులు కావు; శ్రీపతి అయిన విష్ణుదేవుని స్తోత్రము చేస్తేనే నాలుక అనుటకు అర్హమైనది; కాకపోతే ఆ నాలుకకు సార్థకత లేదు; దేవతలను కాపాడే ఆ హరిని చూసేవి మాత్రమే చూపులు; ఇతరమైన చూపులకు విలువ లేదు; ఆదిశేషుని పానుపుగా కల ఆ నారాయణునకు మ్రొక్కేది మాత్రమే శిరస్సు; మిగిలిన శిరస్సులకు విలువ లేదు; విష్ణు కథలు వినే చెవులే చెవులు; మధు అనే రాక్షసుని చంపిన హరి యందు లగ్నమైతేనే చిత్త మనవలెను; పరమ భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణము చేసేవి మాత్రమే పాదాలు; మిగతావి పాదాలా? కాదు. పురుషోత్తము డైన ఆయనను భావించే బుద్ధే బుద్ధి; లేకపోతే అది సద్భుద్ధి కాదు; ఆ దేవుళ్లకే దేవుడైన విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము; చక్రాయుధం ధరించు ఆ నారాయణుని గాథలు విశదపరుచు చదువు మాత్రమే సరైన చదువు; భూదేవి భర్త అయిన గోవిందుని గురించి బోధించే వాడే గురువు; విష్ణుమూర్తిని సేవించ మని చెప్పే తండ్రే తండ్రి కాని ఇతరులు తండ్రులా? కాదు; నాన్నగారు!
దేహి శరీరంలోని చేతులు, నాలుక, కళ్ళు, శిరస్సు, చెవులు, చిత్తం, పాదాలు, బుద్ధి ఒకటేమిటి? సమస్తమైన అవయవాలు విష్ణు భక్తిలో పరవశమై పవిత్రం కావలసిందే. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతఘ్నుడే. ప్రతి రోజూ, ప్రతి చదువూ శ్రీ హరి స్మరణలతో పునీతం కావలసిందే. ప్రతి గురువూ, ప్రతి తండ్రీ నారాయణ భక్తిని బోధించాల్సిందే. అవును లోకైకరక్షాకరు డైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి సార్థకత లేదు.
శమీ వృక్ష విశేషం
శమీ వృక్ష విశేషం (విజయ దశమి స్పెషల్)
Sami Vruksha Puja on Vijayadasami Day
➖🙏➖🙏➖🙏➖🙏➖🙏➖🙏➖🙏➖
శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||
దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది .అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము .
'శమీ పూజ' చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది . శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్నపాండవులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు . అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుదములను ,వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు .
"శ్రీ రాముడు" ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు . అదేంటంటే, శ్రీరాముడు రావణాసురుని పది తలలనూ చూసి భీతిల్లి, నిద్రించిన శక్తిని (దేవిని) పూజించగా, ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని, శ్రీరామునికి విజయాన్ని కల్గజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాడ్యమి. నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.
విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి . పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి . ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి .
👉ఇక్కడ వ్రాసిన శ్లోకం ఒక పేపర్ పై వ్రాసి చదువుతూ ప్రదక్షిణ0మ్ చెయ్యండి.మీ పేరు గోత్ర నామాలు వ్రాసి paper వృక్ష భాగానికి తగిలించి ఉంచండి.
శ్లోకం:-
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.
శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ.
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం.
శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది.
యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
తెలంగాణాలో ఈ పూజ అనంతంరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇండ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం' అని చెప్పి పెట్టి, వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక.
హైదరాబాద్ నగరంలో జమ్మికొమ్మ, ఆరె కొమ్మలకు ఉన్న ఆకులను బంగారు, వెండిగా పంచుతూ, శుభాకాంక్షలను తెలుపుకుంటారు. దీనినే ‘సోనా దేనా' కార్యక్షికమంగా పిలుస్తారు. ప్రధానంగా జమ్మి, ఆరె ఆకులను పరస్పరం పంచుకొని, కౌగిలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్షగా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం. దీనిని జాతి, కుల, మత, లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని, హృదయాల్ని కలిపే సామాజికఐక్యతారాగానికిసామాజిక ఐక్య తారాగానికి ప్రతీకగా భావిస్తారు.
స్వస్థి......
👉👉🙏సనాతన ధర్మస్య రక్షిత-రక్షితః🙏👈👈
🙏➖🙏➖🙏➖🙏➖🙏➖🙏➖🙏➖🙏
.శ్రీమహాలక్ష్మి
శ్రీమహాలక్ష్మి ఏ ఐదింటా వుంటుందంటే
క్షీరసాగర మథనం జరుగుతుండగా..అకస్మాత్తు గా లక్ష్మీ దేవి ఆవిర్భవించింది. ఆవిర్భవిస్తున్న స్థితి ని ఎంతో అద్భుతం గా వర్ణిస్తారు పోతన గారు. ఆ తల్లి ఈ లోకములన్నీ కూడా అనుగ్రహించడం కొసం పైకి వస్తుంటే .. శిరస్సు నించి పాదాల వరకు ఆ రూప వైభవాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణిస్తారు. .
తొలకరి ప్రారంభమయ్యే సమయములో ఆకాశంలో వచ్చేటువంటి మెరుపు ని సౌదామిని అంటాం. అది కంటిని ఆకర్షిస్తుంది. థళుక్కు థళుక్కు మనే మెరుపు కి అందరూ ఆ దిశ గా చూస్తారు. లక్ష్మీ దేవీ మెరుపు కూడా అలాటిదే. లక్ష్మీ దేవి వైభవాన్ని ఎక్కడ ఎవరు వర్ణించినా, స్తుతించినా, శ్లాఘించినా - మెరుపు తీగ తో పోల్చి చెబుతారు. ఎందుకంటే, అందరి కంటినీ అమితం గా ఆకర్షించే శక్తి మెరుపుకి వుంటుంది. విద్యుల్లతలా ఆమె కరుణా కటాక్షాలు కూడా లోకం పట్ల కాంతులు వెదజల్లుతూ వుంటుంది.
ఆమె ఒక్క సారి కన్ను తెరిచి, క్రీగంట చూస్తే చాలు. లోకములన్నీ బ్రతుకుతాయి.
చైతన్యాన్ని విప్పుకుంటాయి.
ఆమె శరీరం అంతా కూడా మిల మిలా , ధగ ధగా మెరిసిపోతూ వుంటుంది. ఆమె ఒక కాంతి పుజం. ఆ కరుణా వీక్షణాలు ప్రసరించిన ఉత్తరక్షణానే, ఇక అలా ఇలా కాని, ఆ ఐశ్వర్య వైభవం మాటలకందని రీతిలో వుంటుంది. ఆ ఉత్సాహం కానీ, ఉల్లాసం కానీ, ఐశ్వర్యం కానీ, పూనిక కానీ, సంపద కానీ, అన్నీ కూడా అంత పుష్కలత్వాన్ని పొందుతాయి.
ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని అందరూ గ్రహించాల్సి వుంటుంది.
ఐశ్వర్యమూ అంటే - కేవలం ధన సంబంధిత సంపద మాత్రమే అని అనుకోకూడదు. అది కాదు.
లక్ష్మి అంటే ఎవరు అని అభిప్రాయపడుతున్నారు? :
మనల్ని విశేషముగా సత్కరించాలి అనుకుంటే ఆ తల్లి ఆడపిల్ల గా ఇంటికొస్తుంది.
ఆడపిల్లా అంటే శ్రీ మహాలక్ష్మి అని అర్ధం.
ఆడపిల్ల పెళ్లయి, అత్తవారింటికి వెళ్ళి తన సత్ప్రవర్తనతో, సత్శీలతతో ఇరు వంశీకులని తరింపచేస్తుంది. మగపిల్లాడికి ఆ అవకాశం లేదు.
అసలు ఆడపిల్ల వచ్చిందీ అంటే నే లక్ష్మీ దేవి వచ్చిందని.
ఆడపిల్ల - అటు వెనక పదితరాలు, ఇటు ముందు పది తరాలను, తండ్రితో కలిపి 21 తరాల వారిని తరియింపచేస్తుంది.
ఆడపిల్ల ఇంటికొచ్చిందంటే, లక్ష్మి దేవి వచ్చినట్టే.
మగపిల్లాడికి పెళ్లయ్యాక ఆ ఐశ్వర్యం ఎవరిదీ అంటే అతనిది కాదు. ఆ ఇంటి ఇల్లాలిది.
ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీ దేవిని స్తుతించినప్పుడు స్వయంగా తానే చెబుతుంది.
తాను ఎక్కడెక్కడు నివాసమై వుండేది! .
కైలాసం లో పార్వతీ దేవిగా
వైకుంఠం లో లక్ష్మీ దేవి గా
బ్రహ్మ లోకం లో సరస్వతిగా
మహా రాజు దగ్గర రాజ్య లక్ష్మి గా
ప్రతి ఇంటి ఇల్లాలి లో - గృహలక్ష్మి గా వుంటానని చెబుతుంది.
'గృహము' అని ఎప్పుడంటారంటే ఆ ఇంట్లో ఇల్లాలు వున్నప్పుడు మాత్రమే!
ఇంటి యజమాని ఎంత అలసిపోనీండి ఇల్లాలి నవ్వుతో, మాటలతో, సేవలతో సేద తీరుతాడు.
ఎంత ఐశ్వర్యం వుండనీండీ, ఎన్ని కోట్లు వుండనీండీ. ఆమె వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతి ఇవ్వలేదు. గృహము అంటే మేడ కాదు. భార్యయే గృహము. అందుకే గృహలక్ష్మీ గృహే గృహే అని అంటారు.
లక్ష్మీ దేవి ని దర్శించడం ఎంత సులువైనదీ అంటే, నీ భార్య లో, సాటి వారి ఇల్లాలిలో, సోదరి లో చూడవచ్చు.
ఈ భావన చాలు. లక్ష్మీ కటాక్షం పొందేందుకు ఈ ఒక్క భావన హేతువు గా నిలుస్తుంది.
దేశానికి అరిష్టం ఎక్కడ పట్టుకుందీ అంటే కనపడిన ప్రతి ఇల్లాలి వంకా చూడకూడని చూపు చూడటం వల్ల, అది దోష భూయిష్టమౌతోంది. అలా కాకుండా, ప్రతి ఇల్లాలిని గనక లక్ష్మీ స్వరూపం గా అటువంటి పవిత్రమైన దృక్కులు కలిగి వుంటే, దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షం తో విలసిల్లుతుంది. వర్ధిల్లుతుంది.
అందుకే లక్ష్మీ ఎక్కడెక్కడ నెలవై వుంటుందీ అంటే 5 స్థానాలు అని చెప్పింది శాస్త్రం
అవేమిటంటే :
1. గోవు యొక్క వెనకతట్టు.
(రోజుకొక్క సారైనా గోవు వెనక తట్టు చూసిన వారు, ప్రదిక్షణ చేసిన వారూ లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంటిముందుకు వచ్చి నిలబడిన గో మాతకు చేతులారా పండూ, ఫలమూ, పరక ని తినిపించిన వాడు సాక్షాత్తు లక్ష్మీ దేవికి పాయసం తినిపించినంత ఫలాన్ని పొందుతాడు.)
2. పద్మం. - పద్మము లక్ష్మీ స్థానం.
3. ఏనుగు యొక్క కుంభస్థలం.
4. సువాసినీ యొక్క పాపిట ప్రారంభ స్థానం.
5. మారేడు దళం.
ఈ ఐదూ లక్ష్మీ నెలవుండే స్థానాలు.
లక్ష్మీ లోకాన్నంతటినీ చూస్తుంది. లోకమంతా ఆమెని చూస్తుంది. ఆమె ఒక మెరుపు. ఆ తల్లి ఎక్కడ వుంటే అక్కడ సంతోషం వుంటుంది.
లక్ష్మీ కటాక్షం అంటే అర్ధం - సంతోషం గా వుంటమే. అన్నీ వున్నవాని విషాదం కన్నా, ఏమీ లేకపోయినా సంతోషంగా వున్న వాడి దే అసలైన లక్ష్మీకటాక్షం.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.
సౌందర్య లహరి శ్లోకము - 52
సౌందర్య లహరి
శ్లోకము - 52
(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
శ్రీ లలితాంబికాయైనమః)
ఈ శ్లోకము లో దేవి కన్నులు చెవుల వరకు సాగి, ఆకర్ణాంతమూకన్నులు చెవుల వరకు సాగి, ఆకర్ణాంతమూి కన్నులు చెవుల వరకు సాగి, ఆకర్ణాంతమూకన్నులు చెవుల వరకు సాగి, ఆకర్ణాంతమూ గబడిన మన్మథుడి బాణముల జంటవలె ఉన్నవని వర్ణన
చేయబడింది.
"గతే కర్ణాభ్యర్ణం _ గరుత ఇవ పక్ష్మాణి దధతీ
పురాంభేత్తు శ్చిత్త ప్రశమరసవిద్రావణ ఫలే !
ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే !
తవా కర్ణాకృష్ట _ స్మరశరవిలాసం కలయతః !!
పర్వతాధిపుడయిన హిమవంతుని వంశానికి శిరోభూషణ మైన
పువ్వు మొగ్గ వంటి పార్వతీ ! నీ కన్నులు చెవులనంటి యున్నవి .
ఆ కన్నుల రెప్పల వెండ్రుకలు , బాణమునకు కట్టబడిన గ్రద్ద
ఈకల వలె ఉంటాయి. అవి పరమ శివుని మనస్సులో ని శాంత
రసాన్ని పోగొట్టి శృంగార రసాన్ని ఉత్పన్నము చేయడమే ఫలముగా
కల్గి ఉంటాయి. అటువంటి నీ నేత్రములు, చెవుల వరకూ లాగబడిన
మన్మథుని బాణముల సౌందర్యాన్ని తలపిస్తున్నాయి ( శివుని
మనస్సును కలతపెట్టే, గ్రద్ద ఈకలు కట్టి , ఆకర్ణాంతము లాగబడిన
మన్మథుని బాణమువలె రెప్ప వెండ్రుకలతో చెవుల వరకు విస్తరించిన
దేవి నేత్రములు శోభిస్తున్నాయని భవము) ( దేవి కన్నులు శివుని
చిత్తమును కలత పెట్టు మన్మథబాణముల వలె ఉన్నాయనిభావము)
అమ్మా! పర్వత పుత్రీ ! చెవులదాకా వ్యాపించి ఉంటాయి నీ పెద్ద పెద్ద
కళ్ళు. బలంగా లాగిన విల్లులవలె ఉంటాయి . నీ కనురెప్పలు ఒత్తుగా
హృద్యంగా వుంటాయి . ఇక నీ చూపులు ఆవిల్లుకే తొడిగిన రెక్కల
బాణాల్లా ఉంటాయి . చూడగా చూడగా త్రిపురారి అయిన ఈశ్వరుణ్ణి
చలింపజేయడం కోసం విసిరేందుకు మన్మథుడు తన వింటికి
బిగించిన బాణాల్లా వుంటుంది తల్లీ _ నీ నేత్ర సౌందర్యం .
ఓం సర్వారుణాయైనమః
ఓం అనవద్యాంగ్యైనమః
ఓం సర్వాభరణభూషితాయైనమః
సౌందర్య లహరి
శ్లోకము - 53
(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
(శ్రీ లలితాంబికాయైనమః)
శ్రీదేవి నేత్రత్రయము ఎరుపు, తెలుపు, నలుపు రంగులు కలిగి బ్రహ్మ
విష్ణు , రుద్రులను సృష్టించడానికై ఆమె సిద్ధపరచుకొన్న రజస్సత్త్వ తమో
గుణములా అన్నట్లున్నవి.
"విభక్త త్రైవర్ణం _ వ్యతికరిత లీలాం జనతయా
విభాతి త్వన్నేత్ర _ త్రితయ మిద మీశాన దయితే !
పున స్స్రష్టుం దేవాన్ _ ద్రుహిణ హరిద్రా నుపరతాన్
రజ స్సత్త్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ !!"
శివుని ప్రియురాలైన దేవీ ! ఓ పార్వతీ ! ఈ కన్పిస్తున్న ఈ నీ మూడు
కన్నులునూ , అర్ధ వలయాకారంగా విలాసము కొరకై తీర్చి దిద్ధి న
కాటుక కలవై , విభజింప బడిన ఎరుపు, తెలుపు , నలుపు అనే మూడు
వర్ణములు కలవై యుండి , ప్రళయమునందు నీ యందు లీనమైన
బ్రహ్మ , విష్ణు , రుద్రులనే దేవతలను, తిరిగీ ఈ బ్రహ్మాండము నందు
సృష్టించడానికై సత్వరజస్తమో గుణములనే మూడు గుణములనూ
ధరిస్తున్నావా అన్నట్లు ప్రకాశిస్తున్నాయి.
అమ్మవారు కళ్ళకు కాటుక పెట్టుకుంటారు కదా ! అలా మూడు కన్నులకూ
కాటుక అలదు కోవడం వలన వాటియొక్క మూడు రంగులూ ఇప్పుడు
మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. (ఒక్కొక్క రంగూ గుణత్రయ విభాగం
లోని ఒక్కొక్క గుణాన్ని సూచిస్తోంది) నిర్గుణమైన ఆమె నేత్రాలలో
త్రిగుణస్ఫురణ చూస్తుంటే _ బ్రహ్మను, విష్ణువునూ, ఈశ్వరుణ్ణీ మళ్లీ
ఆ తల్లి సృజించబోతున్నదా అనిపిస్తోంది .
ఓం శివకామేశ్వరాంకస్థాయైనమః
ఓం శివాయైనమః
ఓం స్వాధీనవల్లభాయైనమః
సౌందర్య లహరి
శ్లోకము - 54
(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
(శ్రీ లలితాంబికాయైనమః)
ఈ శ్లోకము లో శ్రీదేవి యొక్క మూడు కన్నుల యొక్క పవిత్రత ను గూర్చి వివరించ బడింది
"పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే
దయామిత్రైర్నేత్రై రరుణ ధవళ శ్యామ రుచిభిః !
నద శ్శోణో గంగా _ తపనతనయేతి ధ్రువ మ ముం
త్రయాణాం తీర్థానాముపనయసి సంభేద మనఘం!!
పశుపతి యైన శివుని యందు లగ్నమైన చిత్తము
కలదానా ! దేవీ దయారసముతో కూడిన ఎరుపు,
తెలుపు, నలుపు కాంతులు కలవైన నీ కన్నులచే
ఎర్రని జలప్రవాహముగల శోణ నదము, తెల్లని
జల ప్రవాహము గల గంగ, నీల జలప్రవాహముగల
యమున అనే మూడు నదుల సంగమ స్థానమును
మమ్ము లను పవిత్రులను గా చేయటానికై మాకు
సంపాదించి ఇస్తున్నావు. ఇది నిజము.
ఓం సుమేరుశృంగమధ్యస్థాయైనమః
ఓం శ్రీమన్నగరనాయికాయైనమః
ఓం చింతామణిగృహాంతస్థాయైనమః
అమ్మవారి విశేషాలు
ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు ఈరోజున అమ్మవారు సౌమ్య రూపంలో మహిషాసుర మర్ధిని గా దర్శనం ఇస్తారు.
అమ్మవారి విశేషాలు కొద్దిగా మీకోసం
మహిషాసురమర్దిని అమ్మవారి గురించి అందరికీ తెలుసు. ఆది శంకరులు హృద్యంగా లయబద్ధంగా రచించిన మహిషాసుర మర్దినీ స్తోత్రం కూడా స్బాగా ప్రచారంలో ఉన్నదే. ఈ రోజున మహిషాసుర మర్దిని పూజ చేసే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. దీనిని మహిషఘ్నీ పూజ అని కూడా అంటారు. మహిషఘ్నీ అంటే మహిషాసురుణ్ని అంతం చేసిన దేవి అని అర్థం. అయితే మహిషాసురుని గురించి విస్తార ప్రస్తావన, కొన్ని విశేషాలు ఉన్నాయి. అవి తెలుసుకుందాం.. మహిషాసురుడు, రాక్షసులకు ఒకప్పుడు రాజైన రంభాసురుని కుమారుడు. రంభాసురుడు కామరూపంతో దున్నపోతు రూపంలో తిరుగుతూ ఒక అందమైన ఆడ దున్న రూపానికి ముగ్ధుడై ఆమెను వివామ మాడాడు. వారికి సగం మనిషి, సగం దున్నపోతు రూపంలో ఉన్న మహిషాసురుడు జన్మించాడు. స్వాభావికంగా అసురులకు, దేవతలకు మధ్య వైరం ఉంది. ఎందరో అసురులు వర బల గర్వంతో స్వర్గాన్ని జయించడం, తర్వాత విష్ణువు, శివుడు వేర్వేరు అవతారాలు ధరించి వారిని నిర్జించడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మహిషాసురుడు కూడా దేవతలను నాశనం చేయాలని నిర్ణయించాడు.
అందువల్ల బ్రహ్మను గూర్చి తపస్సు చేసి అందరు రాక్షసుల మాదిరిగానే చావు లేకుండా వరమిమ్మని అడిగాడు. అది కుదరదని చెప్పడంతో మహిళలు అబలలు కనుక వారు తనను ఎలానూ సంహరించలేరు కనుక వారు మినహా ఎవరి చేత మరణం లేకుండా వరమిమ్మని కోరాడు. అందుకు బ్రహ్మ అంగీక రిం చి, వరమిచ్చాడు. మహిషాసురుడు ఆ వరబల గర్వంతో పేట్రేగిపోయాడు. తనను ఓడించే మహిళ ఉండదని విర్రవీగుతూ, దేవతలతో యుద్ధానికి దిగి వారిని ఓడించాడు. దానితో దేవతలు తమను రక్షించమని త్రిమూర్తులను వేడు కున్నారు. వారు తమ ముగ్గురి శక్తులు కలబోసి ఒక మహిళను సృష్టించారు. ఆమే దుర్గాదేవి. ఆమె మహిషాసురుణ్ని మట్టుపెట్టింది.
అమ్మవారు దుర్గా దేవి రూపంలో అవతరించి మహిషాసురుణ్రి వధించి మహిషాసురమర్దిని అయింది. దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధిం చే భంగిమలో ఉన్న శిల్పాలు దేశంలో చాలా చోట్ల కనిపిస్తాయి. వీటిలో మహాబలిపురం, ఎల్లోరా గుహలు, హలిబెడులోని హొయసాలేశ్వర ఆలయం ద్వారం వద్ద ఉన్నవి ప్రసిద్ధి పొందిన శిల్పాల్లో కొన్ని. ఇంకా చాలా ఆలయాల్లో, గుహల్లో ఇటువంటి శిల్పాలు ఉన్నాయి.
మహిషాసుర మర్దిని ప్రస్తావన హిందూ మతంలో ప్రముఖంగానే ఉన్నా అది బౌద్ధ శిల్ప కళలో కూడా విస్తారంగా కనిపించడం విశేషం. హిమాచల్ ప్రదేశ్‌లోని చాంబాలోగల లక్షణా దేవి ఆలయంలొ ఈ శిల్పాలు ఉన్నాయి. హట్ కోటిలో వాజేశ్వరీ దేవి చేతిలో ఒక రాక్షసుడు హతమవుతున్నట్టు శిల్పాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని గజ్ని సమీపంలో ఉన్న తప సర్దార్‌లోని పరిరక్ష ణాలయంలో ఉన్న శిల్పాలలోనూ, మధ్య టిబెట్‌లో కొన్ని చోట్ల దుర్గాదేవి, మహిషాసురుణ్ని హతం చేస్తున్న శిల్పాలు కనిపిస్తాయి.
జైన మతంలో కూడా దుర్గాదేవి, మహిషాసురుల ప్రస్తావన కనబడడం మరింత విశేషం. జోధ్‌పూర్ మ్యూజియంలోనూ, జునాగఢ్‌లోని సచికా దేవి ఆలయాలలోనూ, దేవగఢ్‌లోని సిద్ధ్‌కి గుఫాలోనూ ఇటువంటి శిల్పాలు కనిపిస్తాయి. దుర్గాదేవి, మహాషాసురుల మధ్య యుద్ధం ఈ శిల్పాల్లో కనిపిస్తుంది.
దసరాల్లో దుర్గాష్ఠమి రోజున దుర్గాదేవిని మహిషాసురమర్దిని రూపంలో పూజిస్తారు. పశ్చిమ బెెంగాల్ల్లో మహిషాసురుణ్ని చంపుతున్న దుర్గాదేవి విగ్రహా లకు పూజ చేస్తారు. ఇక కర్నాటకలోని మైసూరుకు ఆ పేరు మహిషాసురమర్దిని నుంచే వచ్చిందని చెబుతారు. దక్షిణాదిలో ఒక ప్రాంతం నుంచి భూమిని ఆక్రమించుకుంటూ వస్తున్న మహిషాసురుణ్ని చూసి మైసూర్ ప్రాంత ప్రజలు దుర్గాదేవిని శరణు వేడారని, వారిని కాపాడి అసురుణ్ని దేవి నిర్జించిందని చెబుతారు. మైసూరుకు దగ్గరలోని చాముండీ హిల్స్ ప్రాంతంలో 9 రోజుల యుద్ధానంతరం మహిషాసురుడు నిహతుడయ్యాడని పురాణ కథ. దసరా పండగను కన్నడంలో నడ హబ్బా అంటారు. రాష్ట్ట్ర పండగ అని దీని అర్థం. అందుకే ఈ పండగకు మైసూరు దసరా అనే పేరు కూడా ఉంది.
మైసూరు నగర పరిరక్షకురాలైన చాముండా దేవి ఆలయం వ ద్ద్ద మహిషా సురుని పెద్ద విగ్రహం ఉండడం చూడవచ్చు. మైసూరు ప్రస్తావన చరిత్రలో క్రీస్తు పూర్వం 245 నాటి నుంచే ఉన్నట్టు భావిస్తారు. ఇది సుమారుగా అశోక చక్రవర్తి కాలం. ఆ కాలం లో బౌద్ధ మతం ప్రబలంగా ఉండేది. అప్పుడు జరిగిన మూడవ బౌద్ధ స్నాతకోత్సవం ముగింపు సందర్భంగా ఆయన మహిష మండలానికి ఒక బృందాన్ని పంపారని అంటారు.
మహిష మండలం అంటే మహిషాసురుడు ఆక్రమించిన ప్రదేశం. మహిషా సురునికి మహిషి అనే సోదరి ఉందని కేరళలో ఒక కథ ప్రచారం లో ఉంది. మహిషాసురుని వధ అనంతరం ఆమె దేవతలతో తన యుద్ధం కొనసాగించేదని ఆ కథలో ఉంది.
ధర్మం’ అంటే ఏమిటి?*
*ధర్మం’ అంటే ఏమిటి?*
🕉️🌞🌎🏵️🌼🚩
*• ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం వివాహ ధర్మం!*
*• తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా,* *నమ్మివుండటం భార్య ధర్మం!*
*• నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం మిత్ర ధర్మం!*
*• సోమరితనం లేకుండటం పురుష ధర్మం!*
*• విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం గురుధర్మం!*
*• భయభక్తులతో విద్యను నేర్చుకోవటం శిష్యధర్మం!*
*• న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం యజమాని ధర్మం!*
*• భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్నీ నడపటం ఇల్లాలి ధర్మం!*
*• సైనికుడుగా వుండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం!*
*• వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం బిడ్డల ధర్మం!*
*• తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం తండ్రి ధర్మం!*
*• తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరు ప్రతిష్ఠలు తేవటం బిడ్డలందరి ధర్మం!*
*• తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం ప్రతివాని ధర్మం!*
*• తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం సంసార ధర్మం!*
*• అసహాయులను కాపాడటం మానవతా ధర్మం!*
• *చెప్పిన మాటను నిలుపుకోవటం సత్య ధర్మం*
🕉️🌞🌎🏵️🌼🚩
సిద్ధిదాత్రి
9. *సిద్ధిదాత్రి*
*ఓం శ్రీమాత్రే నమః!*
*సిద్ధగంధర్వయక్షాద్యైః అసురైరమరైరపి*
*సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ*
దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…
1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.
సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.
నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.
ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.
నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.
దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు