6, మే 2021, గురువారం

ప్రియంచనానృతం బ్రూయాత్

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🥀  *సత్యంలోని సత్యం*🥀


🌻 *"నబ్రూయాత్ సత్యమప్రియం"🌸* సత్యమును కఠినంగా ఉండేట్లు, బాధపడేట్లు చెప్పకండి, చెప్పకండి. సత్యాన్నే చెప్పండి, ఎదుటివాడు బాధపడేట్లు సత్యాన్ని చెప్పకండి. 


ఎదుటివాడు ఒక తప్పు చేశాడనుకోండి. శిష్యుడే అనుకోండి, నలుగురిలో పట్టుకొని నువ్విలా చేస్తావా అనకండి. కనుక "సత్యార్జవే" సత్య ప్రవర్తనం, కష్టంగా ఉండేటట్లు చెప్పకండి సత్యం. శిష్యుడు ఇట్లా చేశాడు. "ఏరా! ఇలా చేశావు? బుద్దుందా, లేదా నీకు? ఎన్ని మాట్లు చెప్పాలి నీకు? మందమతీ,చవట వెధవా" అనరాదు. తప్పు అని, వాణ్ణి లోపలికి, ఇంట్లోకి పిలిచి, ఎవ్వరూ వినకుండా, వాడు ఒక్కడ్నీ పిలిచి, చెప్పేటువంటి సద్బుద్ది మన దగ్గర ఉంటే ఎట్లా ఉంటుంది? వీళ్ళందరి ఎదురుగుండా వాడితో చెప్పాననే దురద మనకు తీరాలంటే? జంతుత్వం, పశుత్వం మనం తీర్చుకుంటున్నాం వాడి యందు. 


మనం ఏమన్నా కూడా అడిగే వాళ్ళు ఎవరూ లేరని నలుగురిలో ఒకడ్ని పట్టుకొని మనం తిడుతున్నామంటే అర్థమేంటి? మనలో ఉన్న జంతుత్వాన్ని, మనలో పశుత్వాన్ని బయట పెట్టుకుంటున్నామని అర్థం. మనలో మానవత్వం ఉంటే వాడ్ని వేరే ఒంటరిగా పిలిచి చెప్పి ఉండేవాళ్ళం, కొడుకైనా సరే, శిష్యడైనా సరే, తమ్ముడైనా సరే, మిత్రుణ్ణయినా సరే, ఎవరయినా సరే హృదయంలో ఉన్న పరమాత్మను మనం గుర్తించటం కనుక నేర్చుకున్నట్లయితే, నలుగురు ఎదురుగుండా పట్టుకొని అదీ ఇదీ అనిఉండేవాళ్ళం కాదు. అంటే మన దగ్గర్నుంచి బయలుదేరాలి ఆచరణ అనేది. 


కనుక సత్యం ఎప్పుడూ కూడా అప్రియంగా చెప్పకు, "ప్రియంచనానృతం బ్రూయాత్" చాలా మధురంగా ఉంటుంది గదా అని అబద్ధమూ చెప్పవద్దన్నారు. *సత్యాన్ని అవతలివాడు ప్రేగులు తెగేటట్లు చెప్పకూడదు‌.* చాలా తియ్యగా ఉంటుంది కాబట్టి అసత్యమూ చెప్పకూడదు.........!

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

అంతా డాక్టర్లే

 దేశం అంతా డాక్టర్లే

🤔🤔🤔🤔🤔🤔


శ్రీ కృష్ణ దేవరాయలు

ఓక రోజున సభ నిర్వహిస్తూ

మన రాజ్యం లో

ప్రజలు ఏక్కువ మంది ఏ వృత్తీ లో ఉన్నారు

అని ప్రశ్నించేరు.

తమ ఏలుబడిలో

వ్యవసాయ వృత్తీ లో

ఏక్కువ మంది ఉన్నారని కోందరు

వర్తకం చేస్తూ ఏక్కువ మందీ ఉన్నారని కోందరు .రకాల వృత్తు లవారూ ఏక్కువ మంది ఉన్నారని కోందరు రకరకాలుగా చేప్పేరు

ఆఖరున వికట కవి లేచి 

మహారాజా

మీ రాజ్యంలో అందరి కన్నా ఏక్కువ మంది వైద్యులు ఉన్నారని

శ్రీ కృష్ణ దేవరాయల వారికీ విన్నవించేడు.

తేనాలి రామ లింగడు.

వేటకారం చేస్తున్నాడని భావించిన మహారాజు

వ్యవసాయము లో ఏక్కువ మంది ప్రజలు ఉండవఛు.వ్యాపారం లో ఉండవచ్చు. నువ్వేంటీ వైద్య వృత్తీ లో ఏక్కువ మంది ఉన్నారని అంటున్నావు

నాతోనే వేటకారమా రామ లింగా..

కాదు. మహారాజా. నేను చేప్పేది నిజం

నిరూపించ గలను మహారాజా అని 

వికట కవి అనగానే

రామ లింగా నువ్వు అన్నది నిరూపించు

లేకుంటే నీకు శిరశ్చేదన దండన 

శిక్ష విధీస్తాను.అని సభ చాలిఁచారు.

మరునాడు తేలవారకుండా

రామలింగడు

మహా రాజును

తీసుకుని తలకు శీరోభార ము ఉన్నట్లుగా నుదుటీకీ

కట్టు కట్టి మారు వేషాల్లో నగర సంచారం  ప్రారంభించగానే

గుడిలో అర్చకుడు ఏదురు పడి

అయ్యా మీకు శీరో భారమా నుదీటీకీ

కట్టు కట్టేరు.. దీనికి

తులసి రసం నుదుటి కీ రాస్తే శీరోభారం చీటికలో తగ్గిపోతుంది.

అని అయాచితంగా సలహా ఇఛీ ముందుకు కదీలేడు

రాజు గారు వికట కవి మరో నాలుగు అడుగులు ముందుకు కదలగానే

నాగలి భుజాన వేసుకుని రైతు

తారస పడి

బాబు తల పోటా

ఏమి రాసేవూ

నేను ఓ చిట్కా చేపుతాను చేయ్యి

ఇలా తీసేసీనట్లు

తగ్గి పోతుంది

ఆవూనేయ్య హారతి కర్పూరం రంగరించి నుదుటీన పట్టు వేయ్యి

చీతీకలో తల నోప్పి పోతుందని చేప్పి మందుకు కదీలేడు

ఇలా వికట కవి. మహారాజుకు ఏదురు పడ్డ ప్రతి వ్యక్తీ వీరికి ఉచిత వైద్య సలహా ఇస్తూనే ఉన్నారు.

ఇదంతాచూసీ చూసి

రాజు ఆశ్చర్యం చేంది

వికట కవి చేప్పింది నిజమే నని ఓప్పుకుని

ఓక అగ్రహారం బహుమతి గా ఇఛేరు

ఆ అగ్రహారం పేరు

అయాచితవైద్యఅగ్రహారం గా నిన్న మోన్నటి వరకూ పిలవ బడేదీ.


ఈ కధ అదేనండి సోది

ఏందుకూ అంటే ...


నిన్న. నేడు. రేపు

ఏ న్యూసుపేపరు చూసినా

ఏ న్యూస్ చానల్ చూసీనా

waats app గ్రూప్ చూసినా

ఏక్కడ చూసినా

ఏక్కడకు వేళ్ళినా

కరోనా ఉచితవైద్యసలహాలే


దేశం అంతా కరోనా

రోగ మయం 

కాదు.. కాదు

అందరూ అయాచితంగా

వైద్య సలహా మయం

దేశం అంతా డాక్టర్ల మయం.😟

ఓంకారం అంటే....

 ఓంకారం అంటే....


🧘🏻‍♀️🧘🏻‍♀️🙏🙏🧘🏻‍♀️🧘🏻‍♀️🙏🙏🧘🏻‍♀️🧘🏻‍♀️



🌺 పంచభూతాల్లో శబ్దం ముందు ఉంది. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారమే


🌺 ఓంకారం దేహంలో ఉంది. 'ఓం' అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది. దివ్య ప్రకంపనలు శరీరాన్ని చుట్టుముడతాయి. అప్పుడు శరీరం సహజ ధ్యానంలోకి అత్యంత సహజంగా వెళుతుంది. ఆ తరవాత నిశ్శబ్దంలో ఓలలాడుతుంది.


🌺 ఓంకారానికి, ఓంకారానికి మధ్య ఏర్పడుతున్న నిశ్శబ్దాన్ని సాధకుడు గమనించాలి. అక్కడ మనసు ఆగిపోతుంది. ఆ నిశ్చలత్వమే ఓంకారాన్ని ఉద్దీపింపజేస్తుంది. ప్రయత్నపూర్వకంగా ప్రతి రోజూ ఓంకారాన్ని జపిస్తే, కొంతకాలం గడిచాక మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది.


🌺 'ప్రశాంతత కావాల్సినవారు ఓంకార ధ్యానం చేయాలి' అంటారు ఓషో. నమ్మకం ఉన్నవారైనా, లేనివారైనా ఓంకారాన్ని జపిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. 'అ'కార, 'ఉ'కార, 'మ'కారాలు కలిసి 'ఓంకారం' అయిందని పండితులు చెబుతారు.


🌺 ఔషధాన్ని నమ్మనివారైనా, దాన్ని తీసుకున్నప్పుడు దాని పని అది చేస్తుంది. ఓంకారమూ అంతే! ఆ శబ్దాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టగానే, అది సాధకుల్ని చక్కగా పట్టుకుంటుంది. ఆరోగ్యం కలిగించేవరకు అది విడిచిపెట్టదు - అంటారు యోగ నిపుణులు.


🌺 వేదభూమికి ఆధారం ఈశ్వరుడు. ఆయనకు శబ్దరూపం ఓంకారం. ఓంకారంతో ధ్యానంలోకి ప్రవేశిస్తే చాలు. ఆనందం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని ఉపనిషత్తులు చెబుతున్నాయి.


🌺 ఓంకారం అంటే, ఆనంద స్వరూపం. అది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాల్ని దాటి వెలుగులీనుతూ ఉంటుంది అది. ఎవరు ఆ ప్రణవ శబ్దం చేస్తారో, వారితో సులువుగా కలుస్తుంది. వారిని తనలో కలుపుతుంది.


🌺 ఓంకారం ప్రాణం. చైతన్యం, సత్యం, ఆనందం... అన్నీ ఓంకారమే.


🌺 ప్రతి స్తోత్రమూ ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ప్రతి శ్లోకమూ ఓంకారంతోనే జీవిస్తుంది. ఓంకారంతోనే విశ్వం ప్రారంభమైంది. అది చివరికి ఓంకారంలోనే లీనమవుతుంది. 'ఓం' అని ధ్యానిస్తే పరమేశ్వరునికి మోకరిల్లినట్లే...🙏


🧘🏻‍♀️🧘🏻‍♀️🙏🙏🧘🏻‍♀️🧘🏻‍♀️🙏🙏🧘🏻‍♀️🧘🏻‍♀️

కరోనాను సులువుగా జయించడానికి

 కరోనాను సులువుగా జయించడానికి 13 సూత్రాలు.


1. లక్షణాలు కనబడిన  మొదటి రోజే హోమ్ ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ మొదలు పెట్టండి.

2. లక్షణాలు కనబడిన మొదటి రోజే ఒక డాక్టర్(online/offline) పర్యవేక్షణ లో ఉండండి. 

3. లక్షణాలు కనబడిన రెండో రోజు RTPCR test ఇవ్వండి. దాని రిజల్ట్ గురించి ఆందోళన వద్దు.

RTPCR లో పాజిటివ్ రాగానే కంగారు పడుతూ హాస్పిటల్స్ కి పరిగెత్తకండి. 

RTPCR లో నెగెటివ్ వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో దానిని కరోనా కాదని ఊహించకండి. ఒక పదిరోజులు కరోనానే అనుకుని జాగ్రత్తగా ఉండటం వలన ప్రపంచం ఏమీ తల్లకిందులైపోదని గుర్తించుకోండి.


4. లక్షణాలు కనబడిన ఐదవరోజు వరకు రక్తపరీక్షలు, చెస్ట్ ఎక్స్ రే, సీటీ స్కాన్ల అవసరం ఉండదు.


5. లక్షణాలు ఉన్నా తగ్గినా ఐదు లేదా ఆరవ రోజు రక్త పరీక్షలు డాక్టర్ సూచించినట్టు చేయించుకోండి. 


6.అవసరం ఐతే చెస్ట్ ఎక్స్ రే లేదా సీటి స్కాను ఐదు నుంచి పది రోజుల మధ్య చేయించే అవకాశం ఉంటుంది. అది ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ మీ లక్షణాలనుబట్టి వచ్చిన రక్త పరీక్షల రిపోర్ట్ లను బట్టి నిర్ణయిస్తారు.

7. లక్షణాలు మొదలైన ఐదవ రోజునుంచి ప్రతి మూడు గంటలకొకసారి పల్స్ ఆక్సీమీటర్ ను చూసుకుంటూ ఉండండి. ఆక్సిజన్ శాతం 94% కన్నా తక్కువగా ఉన్నా పల్స్ రేట్ 120/మినిట్ కన్నా ఎక్కువగా ఉన్నా మీ డాక్టర్ దృష్టికి తీసికెళ్ళండి.


8. లక్షణాలు కనబడ్డ ఐదో రోజు నుంచి పదో రోజు వరకు జ్వరం పెరిగుతున్నా లేదా జ్వరం కంట్రోల్ కి రాకున్నా దగ్గు పెరుగుతున్నా లేదా దగ్గు కంట్రోల్ కి రాకున్నా మీ డాక్టర్ దృష్టికి తీసికెళ్ళండి. 


9. Oxygen శాతం 93% కంటే తక్కువగా ఉంటేనే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం. 90-93% ఉన్నప్పుడు ఆయాసం లేకపోతే  ఆందోళన అవసరం లేదు. ఆ సమయంలో మీ డాక్టర్ తో మాట్లాడండి. నింపాదిగా ఉంటూ ఎక్కడైనా బెడ్ దొరకగలదేమో ప్రయత్నించండి. కంగారు పడుతు పేషంట్ ని కంగారు పెట్టడం వలన ఆక్సిజన్ శాతం మరింత వేగంగా పడిపోయే ప్రమాదం ఉంది. 


10. 93%కంటే తక్కువగా ఆక్సిజన్ పడిపోవడమన్నది పదిమందిలో ఒకరికి జరిగే అవకాశం ఉంది. కాబట్టి భయం అనవసరం. సంయమనంతో కంగారు పడకుండా ఉండేవాళ్ళలో 90% కి తగ్గి కూడా మెల్లిగా మళ్ళీ అదేంతకు అదే ఒకరోజులో మామూలు స్థితికి వస్తుంది. కాబట్టి ఆక్సిజన్ శాతం తగ్గినపుడు ఆందోళన పడకపోవడం చాలా చాలా ముఖ్యం.


11. హోం ఐసోలేషన్లో సరిగా తినని వాళ్ళు కరోనానుండి కోలుకోవడాని చాలా సమయం పడుతోంది. సరిగా తినని వాళ్ళలో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కూడా తగినంత స్థాయిలో ఉండటం లేదు. అంతే కాక వీళ్ళలో కరోనా వలన విపరీతమైన నీరసం ఆవహిస్తున్నది. కరోనా తగ్గాక కూడా మూడు నెలలు ఈ నీరసం బాధపెడుతున్నది. కాబట్టి ప్రతి మూడుగంటలకు ఎంతో కొంత తినడం ముఖ్యం. షుగరు జబ్బు ఉన్నవారు తగినంత ఆహారం తీసుకుంటూ ఇంట్లో రెండు పూటలా షుగర్ టెస్టు చేసుకుంటూ మీ డాక్టర్ సూచించానట్టు ఏ రోజుకారోజు షుగరు మందుల డోసు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 


12. హోం ఐసోలేషన్ లో ఉన్నపుడు వీలైనంత పడుకోవడమూ అవసరం. అనవసర శక్తి ప్రదర్శన వ్యాయామాలు చేస్తూ తాము బాగానే ఉన్నామని అనుకోకూడదు. ఏ జ్వరం వచ్చినపుడైనా పూర్తి విశ్రాంతి చాలా అవసరం. శరీరం విశ్రాంతిలో తిరిగి పుంజుకున్నంతగా ఎందులోనూ పుంజుకోదనే విషయం మనకందరికి తెలుసు. కాబట్టి నిద్రను ఎట్టి పరిస్థితుల్లో అలక్ష్యం చేయకూడదు. 12-14 గంటల నిద్ర హోం ఐసోలేషన్లో అవసరం. రాత్రి ఎనిమిది గంటలకంటే ముందే నిద్రపోతున్న వారిలో కరోనా లక్షణాల తీవ్రత ఉండటం లేదు. ఎనిమిది తరువాత టీవీలు సెల్ఫోన్లు చూస్తూ రాత్రిళ్ళు మేలుకొంటూ, ఆందోళన చెందేవారిలో వైరస్ ని చంపే గుణం గల మెలటోనిన్ ఉత్పత్తి జరగడంలేదు. అందుకే త్వరగా కోలుకోవడమూ లేదు.


13. భయంగొలిపే వార్తలకు దూరంగా ఉండటం చాలా అవసరం.మంచి సంగీతం..సరదా జోక్సు మనసును తేలికపరుస్తాయి. బంధు మిత్రులు ఆందోళన పడుతూ ఇచ్చే సలహాలు వృథా అని గుర్తించండి. వాళ్ళు ఆందోళన పడుతూ మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తూ చివరికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లనూ ఆందోళన పెడుతూ ఉంటారు. ట్రీట్మెంట్ విషయంలో పదిమంది చేతులు పెట్టకుండా చూసుకోవడం అవసరం. ఒక డాక్టర్ చాలు.


ఇవి పాటిస్తే..కరోనా కింగ్ or కరోనా క్విన్ మీరే.

_కధ_ఇప్పుడే_మొదలైంది


#_కధ_ఇప్పుడే_మొదలైంది


కంటికి కూడా కనిపించని #_Corona 

అనే సూక్ష్మాతి సూక్ష్మ క్రిమి 

నీ ఊపిరితిత్తులలో చొరబడ్డాక మొదలయ్యే కధే ఇది 


నీ గొంతునెవరో నొక్కేసినట్టు

నీ ఉదరకోశాలనెవరో మెలిపెట్టి తిప్పేసినట్టు

శ్వాస కూడా అందని పరిస్థితి లో 

వాటిలో ద్రవాలు ఇరుక్కుంటాయి

 #_Fluids_stucked_lungs 

దీనివల్లే కొంతమందికి నోటినుండి నురుగొస్తుంది

దానివల్ల గాలి పీల్చుకోవడం అతి కష్టంగా మారి 

మూలుగు లాంటి ఒక శబ్ధం వస్తుంది

దాన్నే  #_Death_rattle అంటారు 


అప్పటి వరకూ రోజూ తెల్లగా అవ్వడం కోసం 

#_Cream లు పూసిన నీ శరీరం 

నల్లగా మారడం మొదలుపెడుతుంది 

ముట్టుకుంటే చల్లగా వుంటుంది...

ఇక ఏ #_Moisturiser లు రాయాల్సిన అవసరం లేదు


రక్త కణాలు #_RBC అన్నీ తెగిపోయి 

ఎక్కడివి అక్కడే నిల్చిపోయి రక్తస్రావం లా మారిపోతాయి మెల్లిగా...నీ గుండె చప్పుడు ఆగిపోయింది

పక్కనున్న #_ECG_monitor_Uniform గా గోలపెడుతుంది (కనీసం అదైనా దాని పని నిజాయితీగా చేస్తుంది!)


#_Doctor లు కూడా #_sorry అని చేతులెత్తేసినప్పుడు

#_Background లో మెల్లగా నీ వాళ్ళ ఏడుపు మొదలయ్యి దాని #_decibel_count అంతకంతకూ పెరుగుతూ పైకప్పు లేసిపోతుందేమో అన్నంత భయంకరంగా మారుతుంది


అదృష్టవంతుడివి. ఈ #_Drama అంతా తప్పించుకున్నావు #Doctor లు, #_Hospital_Equipment ల దృష్టిలో 

నువ్వు చచ్చిపోయావు 

దీన్నే #_Technical గా  #_Medical_terminology లో #_Clinical_Death అంటారు


కానీ...

నీ ఆత్మ మహాప్రస్థానానికి ఇంకా

నాలుగు నుండి ఆరు నిముషాల సమయం వుంది

ఒక చిన్న చేప పిల్ల గాజు పాత్రలో వేగంగా 

అటూ ఇటూ తిరుగుతున్నట్టు

అది నీ శరీరంలోని ప్రతి అణువు తిరుగుతుంటుంది


పిచ్చిగా...వేగంగా... 

ఏదో మర్చిపోయినదాని కోసం వెతుకుతున్నట్టు

కలలో ఎవరో తరుముతున్నట్టు బయటపడడానికి ఇష్టంలేక 

లోపలే దాక్కోడానికి ప్రయత్నిస్తున్నట్టు తిరుగుతూ ఉంటుంది అదే నీ నిజమైన అంతిమయాత్ర


ఆరవ నిముషం ముగిసే లోపల నీ మెదడులోని 

ఏ ఒక్క కణం #_cell కూడా ప్రాణంతో మిగలదు

అన్నీ పూర్తిగా సమాధి అవుతాయి

#_oxygen కరువై  క్షణంలో లక్షోవంతులో 

అవన్నీ ఒక్కసారిగా చచ్చిపోతాయి

మంచు ముద్దలు ఎండకు కరిగినట్టు

నిప్పు తునకలు నీటికి ఆరినట్టు


'నువ్వు' అనబడే నీ ప్రాణం శూన్యం లో కలిసిపోతుంది

సరిగ్గా అదే సమయంలో నీకెవరో ఆహ్వానం పలుకుతుంటారు

అది శంఖచక్రాలు ధరించిన నారాయణుడో 

లేక పాశం విసిరి ప్రాణం తీసిన యమకింకరుడో 

అది ఎవరనేది ...నువ్వు బ్రతికిన బ్రతుకు నిర్ణయిస్తుంది


తెలుసుకో...

చావు కేవలం ఒక ద్వారం మాత్రమే

అది ఏ  క్షణమైనా నీకోసం తెరుచుకోవచ్చు మిత్రమా

చచ్చాక నీ శరీరం  #_Decompose అయ్యేదాకా కాదు

నీ శవాన్ని కూడా నీ వాళ్ళు తీసుకోలేరిప్పుడు


నేస్తమా...గుర్తుందా....

నిన్నటి వరకూ ఎన్ని కుట్రలు ...కుతంత్రాలు

నమ్మక ద్రోహలు...పగలు..ప్రతీకారాల నడుమ

అసూయ అనే నిశీధి నీడలో బ్రతికేస్తూ

నా అనుకునే నలుగురినీ హేళన చేస్తూ 

నిత్యం విద్వేషపు చితిలో రగిలిపోయావో


నేడు

రేపటి వరకూ బ్రతికుంటే చాలనుకుంటున్నావు.. ప్చ్

తెలుసుకో నేస్తం.....ఇంతే జీవితం


చెట్టూ..పుట్టనే కాదు

మంచీ...మానవత్వాన్ని కూడా నిలువునా నరికేసి

నేనూ..నాది అని నిన్నటి వరకూ 

స్వార్థంతో పరుగులు తీసిన ఓ మనిషీ


నీ ఆటలూ...పాటలూ

సంతోషాలు...ఆనందాలే కాదు

నేడు నీ దుఖః కూడా నిషేధమే

ఎందుకంటే దుఖః సముద్రమైన నీ దేహం

ఊపిరి అందక ఒరుగుతున్న నీ బంధాలను 

చూసి ఏడ్చి ఏడ్చి ఎండిన కన్నీటి వాగయ్యింది

ఇప్పుడు నీ చుట్టూ ఉన్నది కళేబరాల దిబ్బలే కాదు

శవాల ప్రవాహాలు కూడా


#_Corona ఖతమైపోతుందని అనుకోకు

దాని కధ ఇప్పుడే మొదలైంది

చూస్తుండు నీలోని చెడుని చంపేదాకా

భయంతో చస్తూ బతకడం కన్నా

చావే నయమనిపించేలా చేస్తుంది


ఓ మనిషీ ఇకనైనా మారు

నీ చుట్టూ ఉన్న సమస్తాన్ని  ప్రేమించు

చావులో కూడా బ్రతకడం నేర్పించు.

   Mangu venkat 💐💐

ఆచార్య సద్బోధన*

 *ఆచార్య సద్బోధన*


మొక్కుబడిగా చేసే పనుల వలన ఉపయోగం ఏదీ ఉండదు.


మనలో ఆధ్యాత్మిక విలువలు మేల్కొనడాన్ని గ్రహించినప్పుడు మనలో ఆనందం కలుగుతుంది. ఇది పవిత్రత ద్వారా వస్తుంది.


ఆ ఆధ్యాత్మిక విలువల నిజమైన అంతరార్థాన్ని గ్రహించాలి. ఆ మహోన్నత భావాలు మన మనస్సులో చక్కగా లగ్నమై ఉండాలి.


మన మనస్సు, హృదయం, కర్మలు ఎల్లప్పుడూ సుందరమైన, సువిస్తృతమైన వాటినే ఉత్పన్నం చేయాలి. లేకపోతే అవే మనకు హాని కలిగిస్తాయి.


మనం చేసే ప్రతీ పని చక్కనైన, యోగ్యమైన ఫలితాలనే అందివ్వాలి. యాంత్రికంగా చేసే పనులకు ఫలితం కూడా ఆ విధంగానే వస్తుంది.


*శుభంభూయాత్*

నందీశ్వరుడు

 నందీశ్వరుడు:..👍💐💐


మనం శివాలయమునకు వెళ్ళినప్పుడు ఎదురుగుండా ముందు దర్శనం ఇచ్చే భగవన్మూర్తి నందికేశ్వరుడు. నందీశ్వర దర్శనం చేసి శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం చెప్తోంది. శివాలయం ద్వారపాలకులు దిండి, మొండి. విష్ణ్వాలయం ద్వారపాలకులు జయవిజయులు. విష్ణ్వాలయంలో అయితే గరుడాళ్వారు ఉంటారు. శివాలయంలో శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం. ఇక్కడ వృషభ రూపమై ఒక పశువు శివుడి ముందు కూర్చునే అధికారం ఎలా పొందింది? దీనిని మనం జాగ్రత్తగా ఆలోచించాలి.


 మనం శివాలయపు మెట్లు దాటి లోపలికి వెళ్ళగానే మనకి ముందుగా ధ్వజ స్తంభం కనపడుతుంది. దాని తర్వాత నందీశ్వరుడు కనపడతాడు. ఆ నందీశ్వరుడు అసలు అలా ఎందుకు ఉంటాడు అనే విషయం మీకు అర్థం అయితే జీవితంలో మీరు నూరు మెట్లు ఒక్కరోజు ఎక్కేసినట్లు. 

పూర్వం శిలాదుడు అనే మహర్షికి చిత్రమయిన కోరిక కలిగింది. ఆయన ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షం అయి నీకు ఏమి కావాలి? అని అడిగాడు. అపుడు శిలాదుడు ‘నాకు అయోని సంభవుడు, చిరంజీవి, పరమ భక్తుడయిన కుమారుడు కావాలి’ అన్నాడు. అపుడు దేవేంద్రుడు ‘నాకే శాశ్వతత్వము లేదు. నాకే చిరంజీవిత్వం లేదు. అటువంటప్పుడు ఎదుటివాళ్ళకు నేను ఎలా ఇవ్వగలను? ఇవ్వలేను. పరమశివుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి నువ్వు ఆ శంకరుడి గురించి తపించు’ అన్నాడు. అపుడు శిలాదుడు శివుని గురించి తపస్సు మొదలుపెట్టాడు. కొద్దికాలం గడిచేసరికి శిలాదుని రూపం అక్కడలేదు. ఆస్థిపంజరం ఒక్కటే ఉంది. శంకరుడు ప్రమథగణములతో, పార్వతీ సహితుడై, సుబ్రహ్మణ్య, గణపతులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అయినా శిలాదుడు బహిర్ముఖుడు కాలేదు. అపుడు శంకరుడు తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొటనవ్రేలితో ఆయన మూడవకన్ను అనగా జ్ఞాన నేత్రం ఉండే ఆజ్ఞాచక్రం దగ్గరపెట్టి ఆపాడు.


 అప్పుడు శిలాడుడు బహిర్ముఖుడు అయ్యాడు. శంకరుడు ‘శిలాదా, నీవు దేనిని గురించి తపస్సు చేశావు? అని అడిగాడు. అపుడు శిలాదుడు ‘నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలి అన్నాడు. ఈమాట అనేసరికి శంకరుడు నవ్వి నాలాంటి కొడుకు వేరొకడు లేదు. నీ భక్తికి లొంగిపోయాను. కనుక నేనే నీకొడుకుగా వస్తాను’ అని చెప్పి వెళ్ళిపోయాడు. 

కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు శిలాదుడు పరమశివ సంబంధమయిన ఒక యజ్ఞకార్యమును నిర్వహించడం కోసం భూమిని దున్ని యజ్ఞశాలా నిర్మాణం చేసి అగ్నిహోత్రములను వ్రేల్చడం కోసమని కొన్ని గుండములను ఏర్పాటు చేసి ఆ యజ్ఞ నిర్వహణ చేస్తున్నాడు. అప్పుడు ఆ యజ్ఞ వాటికలో ఉన్న అగ్నిగుండంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించాడు. ఆ వచ్చినవాడు చంద్రరేఖవంటి కిరీటం ధరించి ఉన్నాడు. ఏ విధమైన మలినము లేకుండా ప్రకాశించి పోతున్న తెల్లని శరీరం మీద అలదిన భస్మంతో కూడిన శరీరం కలిగి ఉన్నాడు. నాలుగు భుజములు కలిగి ఉన్నాడు. పరమశివుని అంశ చేత బాలశివుడా అన్నట్లుగా ఆవిర్భవించాడు. ఆ పిల్లవాడిని చూడగానే శిలాదుడు పొంగిపోయాడు. ఆ పిల్లవాడిని చూడగానే ఎక్కడలేని ఆనందం పొంగి పొరలింది కాబట్టి నందీ అని పిలిచాడు. ప్రజలందరూ చూసి పొంగిపోతుండగా ఆ పిల్లవాడు దినదినప్రవర్ధమానం అవుతున్నాడు. 


శిలాదుడు శివుడిని నీలాంటి కొడుకు కావాలని అడిగినప్పుడు పరమశివుడు వెంటనే ‘ఆదివృషభము’ను పిలిచాడు. దానికి ధర్మము అని పేరు. నీవు ధర్మ స్వరూపంగా నా స్వరూపంగా నందీశ్వరుడుగా శిలాదుడికి అయోనిజుడిగా జన్మించు అని శాసనం చేశాడు. అందుకని ఆయన ముందు బాలశివుడిగా దర్శనం ఇచ్చాడు. శివునికి తనకి అభేదం చెప్పడానికి అలా దర్శనం ఇచ్చాడు. బాలశివుడయి ఉన్నాడు. కొంతకాలం అయిన పిమ్మట ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కొంతమంది దేవతలు వచ్చి శిలాడుడితో అన్నారు ‘అయ్యో శిలాదుడా నువ్వు ఎటువంటి స్వరూపమును కోరావో అటువంటి స్వరూపమును నీ పిల్లవానికి ఇచ్చారు. కానీ పిల్లవాడిది అల్పాయుర్దాయం. ఆయన జ్ఞానము చేత చిరంజీవి అవుతాడు కానీ శరీరం చేత చిరంజీవి కాడు. ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపొయింది’ అని చెప్పారు. ఈ మాటలకు శిలాదుడు బాధపడి శోకిస్తున్నాడు. అపుడు పిల్లవాడయిన నందీశ్వరుడు ‘నాన్నగారూ, ఎందుకంత బాధపడతారు? నేను శంకరుని గూర్చి తపస్సు చేస్తాను’ అని చెప్పి మార్కండేయుడు ఎలా తపస్సు చేశాడో అలాగే ఈయన కూడా తపస్సు ప్రారంభించాడు. ఈయన చేసిన తపస్సు చేత ప్రీతిచెందిన శంకరుడు ప్రత్యక్షమయి నీవు ఎప్పటికీ చిరంజీవివే. నామీద నీకు ఎంత పూనిక ఉన్నదో చూడడం కోసమని ఈ పరీక్ష చేశాను. నీ పూజకు నీ తపస్సుకు నేను పరవశించాను అని చెప్పి తన మెడలో ఉన్న బంగారు పద్మములతో కూడిన హారమునొకదానిని ఎదురుగుండా వున్నా పిల్లవాడి మెడలో వేశాడు. ఆ మాలను మెడలో వేయగానే పిల్లవాడికి కూడా మూడవకన్ను వచ్చింది. శివునికి అయిదు ముఖములు ఎలా ఉంటాయో అలా అయిదు ముఖములు వచ్చాయి. పది భుజములు వచ్చాయి. ఈవిధంగా వచ్చి పిల్లవాడు శివునితో సమానంగా అలరారుతూ శివుని ఎదుట నిలబడ్డాడు. అపుడు అమ్మవారి పుత్రప్రేమతో పరవశించిపోతూ ఆ నందీశ్వరుడిని కొడుకుగా అక్కున చేర్చుకుంది. శివుడు తన జటాజూటంలో వున్నా నీళ్ళు తీసి ఆ పిల్లవాడి మీద చల్లాడు.


అవి నందీశ్వరుడినుండి జాలువారి ‘త్రిశ్రోట, జటోదక, స్వర్ణోదక, జంబూనది, వృషధ్వని’ అను పేర్లు గల అయిదు నదులుగా ప్రవహించాయి. ఈ అయిదు నదులు ప్రవహిస్తున్న మధ్యప్రదేశంలో పరమేశ్వరుడు ప్రతిష్ఠచేసిన శివలింగం ఒకటి ఉంది. ఆ అయిదు నదులలో స్నానం చేసి అక్కడి శివలింగమును ఎవరు అర్చిస్తారో వారికి మోక్షం ఇవ్వబడుతుంది అని శాస్త్రం చెప్పింది. పార్వతీదేవి ఆ పిల్లవాడిని ప్రమథగణములకు నాయకునిగా చేయవలసినదని శివుని అభ్యర్థించింది. వెంటనే శివుడు ఆ పిల్లవానిని కూర్చోబెట్టి ప్రమథగణములన్నింటికి నాయకునిగా అభిషిక్తం చేశారు. 


ఈవిధంగా అభిషిక్తం చేయబడిన వానికి తగిన కాంతను చూసి వివాహం చేద్దామని పార్వతి శివునకు చెప్పింది. ఆయనకు తగిన భార్యగా మరుత్తుల కుమార్తె ‘సుయశ’ను నిర్ణయించి వివాహం చేశారు. పిమ్మట శివుడు నందీశ్వరునితో ‘నీవల్ల నీతండ్రి తరించాలి కదా. నీ తండ్రిని, తాతని కూడా సమున్నతమయిన అధికారం కలిగినటువంటి ప్రమథగణముల స్థితిలోకి తీసుకువస్తున్నాను. వారు కూడా నన్ను సేవించుకుంటారు’ అన్నాడు. ఇప్పుడు శిలాదుడు ప్రమథగణములలో ఒకడిగా చేరిపోయాడు. ప్రమథగణములకు నాయకుడు తన కొడుకు నందీశ్వరుడు. ఇదీ వాళ్ళ గొప్పతనం. ఇది నందికేశ్వరుడి చరిత్ర. శివుడు నందీశ్వరునికి మరొక వరం ఇచ్చాడు. ‘నీవు ఎప్పుడయినా ఎక్కడికయినా వెళ్ళి ఉంటే నేను కూడా అక్కడికి వచ్చేసి ఉంటాను. నేను ఎక్కడయినా ఉంటే నీవు కూడా అక్కడ ఉంటావు. శివాలయములలో నా ఎదురుగుండా నీవు ఉండాలి’ అని చెప్పాడు. కాబట్టి నందీశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ శివుడు ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నందీశ్వరుడు కూడా ఉంటాడు. ఎవరయినా నందికేశ్వర చరిత్రను చదివినా చేతులొగ్గి నమస్కరిస్తూ వినినా నందికేశ్వరుని వైభవమును మనసులో తలంచుకొని మురిసిపోయినా వారికి భగవంతుడు ఇహమునందు సమస్త సుఖములను యిచ్చి అంతమునందు ఇదివిని పరవశించి పోయిన వారిని ఈశ్వరుడు తన ప్రమథగణములలో ఒకరిగా చేర్చుకుంటాడు అని అభయం ఇవ్వబడింది. 


నందీశ్వరుడు ఆదివృషభం కాబట్టి ఆయన వృషభ రూపంలో ఉంటాడు. శివాలయంలో శివలింగ దర్శనం చేసేటప్పుడు నందీశ్వరుడి ప్రక్కనుంచి వెళ్ళడం కానీ, నందికి శివుడికి మధ్యలో వెళ్ళడం కానీ చేయరాదు. తోక పక్కకు పడేసి వృషణములు కనపడేటట్లుగా నందీశ్వరుని మూర్తి పడుకుని ఉంటుంది. ఎడమచేతి బొటనవ్రేలిని ఎడమచేతి చూపుడు వ్రేలిని నంది కొమ్ముల మీద వేసి కుడిచేతితో ఆయన వృషణములను పట్టుకుని రెండు వేళ్ళ మధ్యలోంచి శివలింగమును చూస్తూ ‘హరహర మహాదేవ శంభోశంకర’ అని అనాలి. ఇలా ఎవడు అన్నాడో వాడు కైలాసమునందు శంకరుడిని దర్శనము చేసిన పుణ్యమును వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి నందీశ్వరుడి శృంగముల మధ్య నుంచి తప్ప శివలింగ దర్శనం చేయరాదు. నందీశ్వరుడు జీవుడికి సంకేతం. శివుడు బ్రహ్మమునకు సంకేతం. జీవ బ్రహ్మల మధ్య భేదము చెప్పడం కానీ మధ్యలోకి వెళ్ళడం కానీ చేయరాదు. కాబట్టి ఎప్పుడూ అలా దర్శనం మాత్రం చేయకూడదు. దానికి ఒకే ఒక్క మినహాయింపు వున్నది. శివలింగమునకు సాయంకాలం కవచం పెడతారు. అలా కవచం తొడిగి ఉంటే మాత్రం శివలింగమును శృంగములలోంచి చూడనక్కరలేదు. మీరు తిన్నగా శివ దర్శనం చేయవచ్చు. 

అరటిపండు ముక్కలు పట్టుకు వెళ్ళి నందీశ్వరుడి మూతికి రాయడం, కార్తిక దీపముల పేరు చెప్పి నందీశ్వరుడి తోకకింద పెట్టేయడం వంటి పనులు మిక్కిలి పాపభూయిష్టములు. మనం పుణ్యం పేరుతో హద్దులేని పాపములు చేస్తుంటాము. అలా చెయ్యకూడదు. నందీశ్వరుడి శృంగములలోంచి శివలింగ దర్శనం చేసిన తర్వాత ఆగి నందీశ్వరునికి నమస్కరించి 

“నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక!

మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి!!

అని అడగాలి. నందీశ్వరుడు నాలుగు పాదములతో చక్కగా పడుకుని ఉంటాడు. బసవయ్య ధర్మమునకు మారుపేరు. ఆ ధర్మము మీదనే శివుడు అధిరోహించి ఉంటాడు. 


నందీశ్వరుడు మీకొక పాఠమును నేర్పుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడూ శివుడినే చూస్తూ ఉంటాడు. అలాగే మీకు లోకమునందు ఎప్పుడూ ఈశ్వరుడినే చూడడం అలవాటు కావాలి. 

ఆంద్రదేశంలో నందిమండలం’ అనే ప్రాంతంలో నవనందులుగా తపస్సు చేశాడు. అవే ప్రథమనంది, నాగనంది, శివనంది, కృష్ణ(విష్ణు)నంది, మహానంది, గరుడనంది, గణేశనంది, సోమనంది, భానునంది అనునవి. నంది తపస్సు చేసిన ప్రతి చోట ఒక శివలింగం ఉంటుంది. ఆయనకి ‘నందివిద్య’ అని పేరు. అయ్యగారి అనుగ్రహమును ఎంత పొందాడో అమ్మవారి అనుగ్రహమును కూడా అంతే పొందాడు. అమ్మవారు తన విద్యా రహస్యమునంతటిని నందికి చెప్పింది. అమ్మవారి శ్రీవిద్య నందీశ్వరుడి ద్వారా వచ్చింది. అందుకే లలితా సహస్రనామంలో ‘నందివిద్యానటేశ్వరీ’ అని ఒకమాట ఉంది.

నందీశ్వరుని ప్రజ్ఞ చాలా గొప్పది. ఇప్పటికీ మనకి ‘చరనంది’ అని ఒకటి ఉంటుంది. ‘స్థిరనంది’ అంటే కదలని నంది. చరనంది కదులుతుంది. పూర్వం శివాలయములలో రెండు నందులు పెట్టేవారు. ఒకటి స్థిరనంది, రెండవది చరనంది. పూర్వం అంత తొందరగా వెళ్ళడానికి వైద్యులు దొరికేవారు కారు. శివుడే మొదటి వైద్యుడు. ఆ చుట్టుపక్కల ఎవరికయినా ప్రసవం అవక బిడ్డ అడ్డం తిరిగితే వాళ్ళని తీసుకువెళ్ళడం కుదరకపోతే తల్లీ బిడ్డా బతకాలంటే వైద్యుడి దృష్టిపడాలి.


అంతరాలయంలోంచి అది కుదరదు కనుక చరనందికి శివుడికి అభేదం కనుక గబగబా ఆవిడను ముఖమండపం వద్దకు తీసుకువచ్చి తలుపులు తీయించి ఆవిడ బాధపడుతున్నవైపుకి చరనందిని తిప్పేవారు. చరనందిని ప్రసవమునకు బాధపడుతున్న ఆవిడ వైపు తిప్పగానే ఆవిడ చాలా సులువుగా ప్రసవం అయ్యేది. అందుకే పూర్వం శివాలయములలో చరనంది ఉండేది. నందీశ్వరుడు అంతటి మహానుభావుడై ఈ లోకమును రక్షించాడు.

వాక్సిన్ వేసుకున్నా

 _*💫 వాక్సిన్ వేసుకున్నా ఎందుకు మరణిస్తున్నారు !? 💉*_


_కోవిడ్ వాక్సిన్ వేసుకున్నా కూడా, కరోనా ఎందుకు వస్తుంది ?? వాక్సిన్ వేసుకున్నా కూడా కోవిడ్ వల్ల మనుషులు ఎందుకు మరణిస్తున్నారు ?? ఇది వాక్సిన్ వైఫల్యమా మానవ తప్పిదమా ??_


_అసలు వాక్సిన్ ఏమిటి, అది ఏమి చేస్తుంది. కోవిడ్ వాక్సిన్ లో కరోనా అవశేషాలు ఉంటాయి. కవిడ్ యొక్క జినోమ్ స్ట్రక్చర్ ఉంటుంది. అ స్ట్రక్చర్ ద్వారా మన శరీరంలోని ఇమ్మ్యూనిటి అంటే తెల్ల రక్తకణాలకి కరోనా వైరస్ నించి రక్షించే వలయం ఏర్పాటుచేయ్యడం నేర్పిస్తుంది. తద్వారా మన శరీరంలో ఇమ్మ్యూన్ సిస్టం అంటే రక్షణ వలయం ఏర్పారుచుకుంటుంది._


_అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ వాక్సిన్ మందు కాదు. కరోనాని ఆపేది వాక్సిన్ కాదు. రక్షణ వలయం ఏర్పాటు చేసేదీ వాక్సిన్ కాదు. అదీ కేవలం ఫార్ములా చూపిస్తుంది అంతే, మొత్తం చేసేది మన శరీరమే._


_ఉదాహరణకి ఒక ఇల్లు కట్టాలంటే ముందు దాని స్ట్రక్చర్ గిస్తాము. ఇంజనీరు తన విధ్వత్తంతా ఉపయోగించి ప్లాన్ గిస్తాడు. అంత మాత్రాన ఇల్లు పుట్టుకురాదు. మంచి పనివాళ్ళు మంచి సిమెంటు మంచి ఇసుక మొదలైన వాటితో ఇల్లుని జాగ్రత్తగా అమర్చుకుంటూ వెళ్తేనే ఇల్లు తయారవుతుంది. ఇంజనీరు ఎంత మంచి ప్లాన్ వేసిన పని వాళ్ళు సరైన విధంగా కట్టకపోతే ఇల్లు కూలిపోతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది._


_వాక్సిన్ అనే కరోనా జినోమ్ స్ట్రక్చర్ మన ఒంట్లోకి వెళ్ళాక మన శరీరానికి రక్షణ వలయం అనే ఇల్లు కట్టడానికి 14 రోజులు పడుతుంది (మొదటి డోస్ అయినా రెండో డోస్ అయినా) ఆ 14 రోజులు పాటించాల్సిన నియమాలు పాటిస్తేనే మన శరీరం వాలయాన్ని క్రమంబద్దంగా పర్ఫెక్ట్ గా ఏర్పరుచుకుంటుంది._ 


_ఇందులో మొదటి నియమం perfect blood circulation, సరైన రక్తప్రసరణ. అంటే blood intoxication, acidic blood, blood hypertension, ఇవి లేకుండా చూసుకోవాలి. ఇదే అన్నిటికన్నా ముఖ్యం._


_1. బైట అస్సలు తిరగకూడదు. ఎండ,  UV rays అస్సలు తగలకూడదు. UV rays కొంచెం తగిలిన anti bodies బాగా దెబ్బ తింటాయి._


_2. జనాలుచేసే ఇంకో ముఖ్యమైన పొరపాటు. చిన్న పనే కదా అని బైటకి వెళితే. బైక్ మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ పడినా, పక్క బైక్ వాడు overtake చేసిన. ఏదన్నా వాహనం అదుపుతప్పి మీదకి రాబోయినా, రోడ్డు మీద ఎవరన్నా మనతో దురుసుగా ప్రవర్తించినా, వీటిల్లో ఏది జరిగిన మన రక్త ప్రసారణలో మార్పు వస్తుంది. Blood intoxication జరుగుతుంది. వెంటనే anti bodies దెబ్బ తింటాయి._


_3. తరవాత మన work spot కి వెళతాం. అక్కడ మన కింద వాడితో పని విషయంలో గొడవ పైవాడితో వత్తిడి. మళ్ళీ BP ups and downs. మళ్ళీ తెల్ల రక్తకాణాలు దెబ్బ తింటాయి._


_ఇప్పుడు గమనించండి బైటకి వెళ్ళగానే UV rays వల్ల దెబ్బ, రోడ్డు మీద hypertension వల్ల దెబ్బ, పని వేళలో వత్తిడి వల్ల దెబ్బ. ఇన్ని దెబ్బలతో మన శరీరం వలయాన్ని కట్టుకుంటుంది. ఇక వాక్సిన్ వేసుకున్నాం మాకేం కాదు అనే నిర్లక్ష్యం మనకే తెలియకుండా వస్తుంది._


_సామజిక దూరం పాటించకుండా మాస్క్ శానిటైజర్ లేకుండా తిరిగేస్తారు. అదే సమయంలో కరోనా మన వంట్లోకి చేరుతుంది. వీక్ గా కట్టుకున్న వలయాన్ని కూలుస్తుంది, మన శరీరాన్ని ఆక్రమించుకుంటుంది. ఈ సమయంలో గనుక మన ఇమ్మ్యూన్ సిస్టం పూర్తిగా చేతులెత్తేసిందంటే, ఇక ఎప్పటికి లేవదు. దాని కెపాసిటీ కోల్పోతుంది. సరైన తిండి పెట్టకుండా 10 యుద్ధలు చేయించిన సైనికుల్లా తయారవుతాయి మన తెల్ల రక్త కణాలు. ఇంక ఆ స్టేజిలో మనిషి మరణిస్తాడు._


_అమెరికాలో వాక్సిన్ వేసిన తర్వాత 2 గంటలు హాస్పిటల్ లో కౌన్సిలింగ్ ఉంటుంది. అది అయ్యాక గాని బైటకి రారు. అది అక్కడ ప్రోటోకాల్. అందులో ఈ విషయాలన్నీ చెబుతారు. అందుకే వాళ్ళు post vaccine care బాగా తీసుకున్నారు. అందుకే అమెరికాలో వాక్సిన్ బాగా సక్సెస్ అయ్యింది._


_మన దేశంలో అలాంటి కౌన్సిలింగ్లు లేవు. అందువల్లే అమెరికా కన్నా స్ట్రాంగ్ వాక్సిన్ అయిన మన వాక్సిన్స్ వేసుకుని కూడా కరోనా బారిన పడుతున్నారు._


_దయచేసి అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడొచ్చిన వాక్సిన్ సంవత్సరాల క్రితం తయారుచేసింది కాదు. కొన్ని నెలల క్రితం మాత్రమే తయారుచేసింది. దీనికి ఇంకా medical history లేదు. ఇది ఇంకా primary దశ లో వేసిన వాక్సిన్. ఆల్ఫా స్టేజి అంటారు దాన్నే. ఇందులో వాక్సిన్ 20% చేస్తే 80% మన శరీరం చెయ్యాలి. అంటే మనమే చెయ్యాలి._


_కొన్ని సంవత్సరాలలో ఇంకా స్ట్రాంగ్ వాక్సిన్లు వస్తాయి అప్పుడు వాక్సిన్ వెయ్యగానే తిరిగేయాగలుగుతాం. కానీ ఇప్పటికి మాత్రం ఆ స్టేజి లేదు._


_దయచేసి వాక్సిన్ వేసుకున్న 14 రోజులు (మొదటి డోస్ అయినా రెండో డోస్ అయినా) ఇవి పాటించండి._


_1. బైట తిరగవద్దు. ఎండలో అస్సలు తిరగవద్దు._


_2. పాలు, పళ్ళు, dry fruits, కూరగాయలు, ఆకు కూరలు లాంటి మితమైన ఆహారం తినండి. బిర్యానీలు పిజ్జాలు బర్గర్ లు తినవద్దు. Digestion ఎప్పుడు తేలికగా ఉండేవి తినాలి._


_3. మందు [లిక్కర్] తాగకూడదు, మందు వల్ల blood acidic అవుతుంది. దానివల్ల ఇమ్మ్యూనిటి వెంటనే డామేజ్ అవుతుంది._


_4. డాక్టర్ సలహా లేకుండా ఏ కొత్త మందులు, ఇంజక్షన్లు వేసుకోవద్దు._


_5. మన ఊపిరి మన రక్త ప్రసరణ ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగా మన శరీరం, వాలయాన్ని కట్టుకుంటుందని బాగా గుర్తుపెట్టుకోండి._ 


_టెన్సన్స్ లేకుండా చూసుకోండి. వ్యాయామం, యోగ, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటి వల్ల ఇమ్మ్యూనిటి సిస్టం బాగా బిల్డ్ అవుతుందని అధ్యాయానాలలో తేలింది._


_మన ప్రభుత్వం, ఎంతోమంది డాక్టర్లు ఎంతో ఖర్చుపెట్టి శ్రమించి తయారుచేసిన ఈ వాక్సిన్స్ కి చెడ్డ పేరు రానివ్వకండి, వృధాపోనివ్వకండి🙏🙏._


_14 రోజులు జాగ్రత్తలతో మంచి ఇమ్మ్యూనిటితో బైటకు రండి. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ శానిటైజర్లు వాడుతూ ఈ మహమ్మారినించి బైటపడండి._

_దయచేసి అందరూ బ్రతికే ఉండండి._

_-[నిపుణుల నుండి సేకరణ]-_


🙏🇮🇳😷

Foresight

 Foresight of our Ancestors!!


Clear instructions taught by puranas and vedas in 5000 BC to prevent Pandemic by maintaining perfect hygiene.


1. लवणं व्यञ्जनं चैव घृतं

    तैलं तथैव च । 

    लेह्यं पेयं च विविधं 

    हस्तदत्तं न भक्षयेत् ।। 

    धर्मसिन्धू ३पू. आह्निक


Salt, ghee, oil, rice and other food items should not be served with bare hand. Use spoons to serve.


2. अनातुरः स्वानि खानि न 

    स्पृशेदनिमित्ततः ।।

    मनुस्मृति ४/१४४


Without a reason don't touch your own        indriyas (organs like eyes, nose, ears, etc.)


3. अपमृज्यान्न च स्न्नातो

    गात्राण्यम्बरपाणिभिः ।। 

    मार्कण्डेय पुराण ३४/५२


Don't use clothes already worn by you & dry yourself after a bath.


4. हस्तपादे मुखे चैव पञ्चाद्रे

    भोजनं चरेत् ।।

    पद्म०सृष्टि.५१/८८

    नाप्रक्षालितपाणिपादो

    भुञ्जीत ।।

    सुश्रुतसंहिता चिकित्सा

    २४/९८


Wash your hands, feet, mouth before you eat.


5. स्न्नानाचारविहीनस्य सर्वाः 

    स्युः निष्फलाः क्रियाः ।।

    वाघलस्मृति ६९


Without a bath or Snan and Shudhi, all Karmas (duties) done are Nishphal (no use).


6. न धारयेत् परस्यैवं

    स्न्नानवस्त्रं कदाचन ।I

    पद्म० सृष्टि.५१/८६


Don't use the cloth (like towel) used by another person for drying yourself after a bath.


7. अन्यदेव भवद्वासः

    शयनीये नरोत्तम ।

    अन्यद् रथ्यासु देवानाम

    अर्चायाम् अन्यदेव हि ।।

    महाभारत अनु १०४/८६


Use different clothes while sleeping, while going out, while doing pooja.


8. तथा न अन्यधृतं (वस्त्रं 

    धार्यम् ।।

   महाभारत अनु १०४/८६


Don't wear clothes worn by others.


9.  न अप्रक्षालितं पूर्वधृतं

     वसनं बिभृयाद् ।।

     विष्णुस्मृति ६४


Clothes once worn should not be worn again before washing.


10. न आद्रं परिदधीत ।।

      गोभिसगृह्यसूत्र ३/५/२४


Don't wear wet clothes.



These precautions were taught to every Indian five thousand years ago in the Sanatana Dharma .We were forewarned about importance of maintaining personal hygiene, when no microscopes existed, but our ancestors using Vedic knowledge prescribed these Dharma as Sadhaachaaram and followed these !


Follow the above if you feel it has some meaning.


🙏🙏🙏

టీకా పీక నొక్కిందెవరు

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

1. *టీకా పీక నొక్కిందెవరు?*       (ఋజువులతో సహా)

2. ఎవరికి లాభం చేకూర్చడానికి చేశారు?

==============


1. టీకా పీక నొక్కిందెవరు? (ఋజువులతో సహా)


భారత ప్రభుత్వం కరోనా టీకా కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించగానే.. ఒక్కసారిగా ప్రతిపక్షాల నాయకులూ వాటికి ఒత్తాసు పలికే మీడియా, వారి ప్రోద్బలంతో ఇంకా అనేకమంది టీకా కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకొనేలా ప్రకటనలు గుప్పించారు, హేయంగా ప్రవర్తించారు.  ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి తప్పు దోవ పట్టించి టీకాపై వ్యతిరేకత పెచ్చరిల్లేలా చేసి.. దేశానికి, ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టారు.. ఒకరి తర్వాత ఒకరు, వీరి లీలలు క్రింద చదవండి.. కేవలం టీకాపై దుష్ప్రచారమే కాకుండా వీరు చేసిన ప్రచారానికి వేరే ఆశయం కూడా ఉంది.. అదే స్వదేశీ టీకా "కోవ్యాక్సిన్" ను దెబ్బతీసి అమెరికా, యూరోప్ లకు చెందిన టీకాలకు మద్దతు ఇవ్వడం.. దేశంలో వినియోగానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం.. ఎందుకు అలా చేశాయో తెలుసా? చదవండి క్రింద..


ముందు టీకాను వ్యతిరేకించిన వివిధ వ్యక్త్రుల ప్రకటనలు చూడండి.. వీరు టీకాపై చేసిన దుష్ప్రచారానికి ఆధారాలుగా వీరి ప్రకటనలు, ఆర్టికిల్స్, ఇంటర్వ్యూలు, ట్వీట్లు కూడా జతచేయబడ్డాయి.


1. *అఖిలేష్ యాదవ్*     

      (సమాజ్‌వాదీ పార్టీ)


అది బీజేపీ వ్యాక్సిన్.  నేను ఆ టీకా వేసుకోను అని టీవీ కెమేరాల సాక్షిగా జనవరి 3న ప్రకటించాడు.. ఇదే పార్టీకి చెందిన ఒక ముస్లిం నాయకుడైతే పదడుగులు ముందెకేసి, కరోనా టీకా వేసుకొంటే నపుంసకులు అవుతారని ప్రకటించాడు.


2. రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్


టీకాలు తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తాయి అనేదాంట్లో ఏ సందేహం అక్కర్లేదు.  టీకాల వల్ల ఏ సమస్యా లేకపోతే, అవి సురక్షితం అయితే  ప్రధాని, కేంద్ర ఆరోగ్య మంత్రి, ఇతర కేంద్ర మంత్రులు, వారి సీఎంలు టీకాలు ముందుగా ఎందుకు వేసుకోవట్లేదు అని టీవీ ఛానెళ్ళ సాక్షిగా ప్రశ్నించాడు.


3. మనీష్ తివారీ, కాంగ్రెస్


దాని పనితీరు, విశ్వసనీయత మీద సందేహం ఉన్న వారెవరైనా ఈ టీకాలను వేసుకుంటారా? (Jan 5, 2021)


4. శశిథరూర్, కాంగ్రెస్


కోవ్యాక్సిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోలేదు.  దానికి అనుమతివ్వడం తొందరపాటు చర్య.  ప్రజల ప్రాణాలకు ప్రమాదం. (Jan, 03 2021)


5. మాఫియా అనుకూల వ్యాపారవేత్త, బజాజ్ ఆటో అధిపతి రాజీవ్ బజాజ్:


టీకా వేసుకోవడంవల్ల వచ్చే దుష్పరిణామాలు, దాని ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటాయా?  అంటూ తనలాంటి వ్యక్తికి టీకా ప్రయోజనాల కంటే ముప్పే ఎక్కువ అన్నట్లు, అటూ ఇటూ కాని అభిప్రాయం వ్యక్తం చేశాడు.


6. చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ హెల్త్ మినిస్టర్ TS సింగ్ దేవ్


చత్తీస్‌గఢ్ రాష్ట్ర టీకా కార్యక్రమంలో కోవ్యాక్సిన్ చేర్చము అని స్పష్టంగా ప్రకటించాడు (10 Jan 2021).  టీకాలు అన్నిరకాల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని, సురక్షితం, ప్రభావవంతం అని తేలితేనే టీకా కార్యక్రమం మొదలు పెడతాం అన్నారు.


7.  ప్రశాంత్ భూషణ్, పేరుమోసిన అర్బన్ నక్సల్, లాయర్:


కోవిడ్ దేశం నుండి పూర్తిగా మాయమవుతుంటే, సామర్థ్యం నిరూపించుకోని ప్రైవేట్ కంపెనీల టీకాపై ప్రజల డబ్బు  ధార పోయడానికి, ప్రభుత్వం ఈ టీకా కార్యక్రమం తెరపైకి తెచ్చింది అని నిస్సిగ్గుగా ప్రకటన చేశారు.  (Feb 01, 2021) 


8. మమతా బెనర్జీ బెంగాల్ సీం, భూపేష్ బెగల్ కాంగ్రెస్, చత్తీస్‌గఢ్ సీఎం.


టీకాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయకపోయినా, ప్రజల్లో వాటిపట్ల సానుకూలతను పెంచడంలో ఎటువంటి పాత్ర పోషించలేదు.  ఒకరు బెంగాల్ ర్యాలీల్లో బిజీగా ఉంటే, వేరొకరు అస్సాం ప్రచారంలో నిమగ్నమయ్యారు.  ప్రధాని నిర్వహించిన కోవిడ్ సమీక్షా సమావేశాలకు కూడా ఈ ఇరువురూ డుమ్మా కొట్టారు.


9. అసదుద్దీన్ ఒవైసీ AIMIM


స్వదేశీ ఉత్పత్తికి మద్దతుగా నిలవడానికి, అప్పటికే ఈ టీకాపై అనేక సందేహాలు వెలిబుచ్చుతున్న స్వదేశీటీకా వ్యతిరేకుల నోళ్ళు మూయించి ప్రజలకు ధైర్యం ఇవ్వడానికి,  ప్రధాని భారత్ బయోటెక్ తయారీ టీకా కోవ్యాక్సిన్ వేయించుకుంటే, సీరం తయరీ విదేశీ టీకా సమర్థవంతమైంది కాదా అని చచ్చు చర్చ తెచ్చాడు. దానిపై ప్రజలకు, ముఖ్యంగా తన వర్గ ప్రజల్లో ఆందోళన రేకెత్తించడానికి. (March 1, 2021) 


10. నవాబ్ మాలిక్, NCP


టీకా మీద ప్రజలకు  అనేక అనుమానాలు ఉన్నాయి. అందుకే, ప్రధాని ముందుగా ఈ టీకా వేసుకోవాలి. (Jan 11, 2021)


11. సాగరికా ఘోష్, జర్నలిస్ట్ 


టీకాలను అనుమతించిన విధానంపై నమ్మకం లేదని, ప్రభుత్వం ట్రయల్స్ పూర్తి కాకుండా టీకా కార్యక్రమం ప్రకటించకూడదు అనీ, దానివల్ల ఇంకా పెద్ద ఉపద్రవం ముంచుకొస్తుందనీ ప్రచారం చేసింది.  మరి ఈమెకెవరు చెప్పారో చెవిలో నమ్మకం లేదని. (Jan 3, 2021) 


12. స్వాతి చతుర్వేది, జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది


భారత్ బయోటెక్ టీకా మీద నా నమ్మకం సున్నా.  ఆ టీకాను నేను వేసుకోను.. మళ్ళీ ఈమే ఎప్పుడైతే కేసులు పెరుగుతున్నాయో వెంటనే ట్విట్టర్ వేదికగా టీకా కావాలని మొత్తుకుంది..


13. న్యూస్ ఛానెల్ "న్యూస్  

       24" యాంకర్ "సందీప్   

       చౌధరీ."


ఏమన్నాడో చూడండి.. కోవ్యాక్సిన్ ఫేస్-3 ట్రయల్స్ పూర్తై, దాని పనితీరు నిరూపితమయ్యే వరకు ఆ టీకాను ఎట్టి పరిస్థితుల్లోనూ వేయించుకోను.. అంటూ జనవరి 6న నిక్కచ్చిగా చెప్పాడు.. అదే పెద్దమనిషి, కరోనా కేసులు పెరగడం మొదలవ్వగానే, టీకా కావాలని గొంతు చించుకోవడం మొదలుపెట్టాడు.


14. రోహిణీ సింగ్, జర్నలిస్ట్


భారత్ బయోటెక్ తయారీ స్వదేశీ టీకాపై ఎక్కడలేని దుష్ప్రచారం చేసింది.  పైగా అమెరికన్ కంపెనీలైన ఫైజర్/మోడర్నా వారి టీకాలకు మద్దతుగా ఆర్టికిల్స్ రాసి ప్రచారం చేసింది.  భారత ప్రభుత్వం ఈ కంపెనీల టీకాలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ఇళ్ళపైకప్పుల నుండి గొంతు చించుకొని గగ్గోలు పెట్టింది.  ఏకంగా తాను, ఫైజర్ టీకాను ఎంచుకుంటాను అంది.


15. బల్బీర్ రాజెవాల్ (SKM రైతు నాయకుడు)

      జోగీందర్ ఉగ్రహాన్ (BKU రైతు నాయకుడు)


మాకు టీకా అక్కర్లేదు.  మేము కరోనాను ఎప్పుడో చంపేశాం.  పొలాల్లో కష్టపడి పనిచేయడంతో, రైతులకు బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది.   రైతులెవరూ కరోనాకు భయపడడం లేదు. ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇచ్చి రైతుల్లో తప్పుడు భద్రతా భావం కలిగించారు.  ఇప్పుడు పంజాబ్‌లో అనేక మంది రైతులు కరోనాకు బలవుతున్నారు.  ఢిల్లీ బోర్డర్ నుండి వెనక్కు తిరిగి ఇంటికి వస్తున్న వారిని, వారి కుటుంబ సభ్యులు ఇళ్ళకు కూడా రానివ్వడం లేదు. 


16. The Print (Media)


టీకాలపై ప్రజల్లో వ్యతిరేకత పెచ్చరిల్లేలా, అనేక ఆర్టికిల్స్ రాసింది.  దేశ ప్రజానీకానికి టీకాలంటే భయం కలిగేలా ప్రచారం చేసింది.


17. మైనారిటీ వర్గానికి చెందిన అనేక మంది అపరిచిత వ్యక్తులు


టీకా హలాల్ కాదని అని, హరాం అనీ, అలాగే టీకా తయారీలో వాడే పదార్థాలపైనా అనేక అనుమానాలు, ఆందోళన కలిగించే ప్రచారానికి పూనుకున్నారు. ఇదంతా టీకా స్వీకారానికి వ్యతిరేకతను పెంపొందించింది.


18. సతీష్ ఆచార్య అనే లెఫ్ట్ లిబరల్, కాంగీ అనుకూల కార్టూనిస్ట్


కోవిడ్ టీకాపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా టీకాలపై అభద్రతాభావం కలిగించేలా అనేక కార్టూన్లు వేశాడు.  అదే పెద్దమనిషి, కరోనా కేసులు పెరగడం మొదలవ్వగానే, క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ముందుకు దూకి ఏప్రిల్ 16న పరిగెత్తుకుంటూ వెళ్ళి టీకా వేయించుకున్నాడు..

===============


2. ఎవరికి లాభం చేకూర్చడానికి చేశారు?


చూశారుగా పైన, దాదాపు అందరి పల్లవి ఒక్కటే.. అందరి ధ్యేయం ఒక్కటే.. అదే, స్వదేశీ టీకా ఐన భారత్ బయోటెక్ తయారీ "కోవ్యాక్సిన్‌ను" మన దేశ టీకా కార్యక్రమం నుండి తప్పించాలి.. ప్రజల్లో దానిపై వీలైనంతగా వ్యతిరేకతా, అభద్రతాభావం కలిగించాలి.. ఎందుకంటే, ఈ టీకా తయారీ విధానం అత్యుత్తమమైనది.. సురక్షితమైనది.. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని టీకాలకన్నా ఇది గొప్ప పనితీరు కనబరచడమే కాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా చాలా తక్కువ అని క్లినికల్ ట్రయల్స్‌లో ఋజువైంది.  ప్రస్తుతం దాని తయారీ సామర్థ్యం చాలా తక్కువ.. కానీ మోదీ ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారంతో అనతి కాలంలోనే దాని తయారీ సామర్థ్యం పెంచుకోబోతోంది.. 


ఈ ఏడాది చివరికి 100 కోట్ల డోసుల టీకా తయారు చేసే విధంగా అది ప్రణాళికలు వేసింది.  ఒకసారి దీని సామర్థ్యం అంత మొత్తానికి చేరుకొంటే ఇక భారతీయ మార్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకొన్న అనేక అంతర్జాతీయ, ముఖ్యంగా అమెరికాకు చెందిన, కంపెనీల ఆశలు అడియాసలవుతాయి. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం తన దేశపు ఫార్మా కంపెనీలకు, కేవలం కరోనా టీకాపై పరిశోధన, అభివృద్ధికి, తిరిగి ఇవ్వక్కర్లేని విధంగా దాదాపు 90 వేల కోట్లు ఆర్థిక సహాయం చేసింది.  ఈ మొత్తాన్ని, ఆయా కంపెనీలు నేరుగా అమెరికా ప్రభుత్వానికి చెల్లించవలసిన అవసరం లేకపోయినా, ఆ కంపెనీలు తాము తయారు చేసే ఉత్పత్తిని ఇతర దేశాల నెత్తిన రుద్ది, ఆదేశాలనుండి విదేశీ మారకం అమెరికాకు తెచ్చిపెట్టేందుకు సకల ప్రయత్నాలూ చేస్తాయి.. అసలిదే అమెరికా వ్యవస్థ యొక్క కుటిల విధానం.. అమెరికా ప్రభుత్వం పెద్ద ఎత్తున తన దేశపు కంపెనీలకు భారీ మొత్తంలొ నిధులు అందజేస్తుంది.. పరిశోధన అభివృద్ధికి.. ఆ కంపెనీలు తిరిగి చెల్లించ వలసిన అవసరం ఉండదు.. కానీ అవి తయారు చేసే ఉత్పత్తులను సాటిలేని వాటి కుటిల మార్కెటింగ్ నైపుణ్యం ఉపయోగించి  ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేసి విదేశీ మారకం తద్వారా పన్నుల రూపంలో తిరిగి అమెరికా ప్రభుత్వానికి అవి తీసుకున్న నిధులకంటే ఎన్నో రెట్లు ఎక్కువ చెల్లిస్తాయి.. దీనికోసం అవి అనేక నికృష్ట విధానాలకూ ఏమాత్రం మానవత్వం లేని పద్దతులకూ వెనుకాడవ్.. అందులోనూ ఇప్పుడు అనేక ప్రపంచ దేశాలనే కాక, అమెరికాలో ట్రంప్ పదవీచ్యుతుడు కావడానికి కారణం ఐన సోరోసురుడు నేరుగా రంగంలోకి దిగినట్లు రష్యా నిఘా వర్గాలు భారత ప్రభుత్వానికి ఉప్పందించాయి.


    అందరి ధ్యేయం ఒక్కటే.. జాతీయవాద మోదీని తప్పించి..  పప్పూని అధికారపీఠంపైకి తేవడం.. అందులో భాగంగా వీరు చేయని అకృత్యం లేదు.. ఏచిన్న అవకాశాన్నీ జారవిడుచుకోరు.. అందుకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీకా కార్యక్రమాన్ని దెబ్బతీసి కరోనా తీవ్రమయ్యేలా చేసి, ప్రజల్లో అశాంతి రేకెత్తించాలనేది వీరి పన్నాగం.. ఇంకొకటి సోరోసురుడు చెప్పినట్లుగా, భారతదేశ స్వదేశీ టీకా భారత్ బయోటెక్ "కోవ్యాక్సిన్‌ను"  దెబ్బతీసి, అమెరికన్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడం.. 


అందుకే దేశంలోని ధూర్త రాజకీయ నేతలు, మీడియాసురులు, సామాజిక కార్యకర్తల రూపంలో ఉండే అర్బన్ నక్లైట్, ఇంకా అనేక మంది మూకుమ్మడిగా, కలిసికట్టుగా మన టీకా కార్యక్రమంపై, ముఖ్యంగా స్వదేశీ టీకా ఐన కోవ్యాక్సిన్‌పై దుర్మార్గమైన దుష్ప్రచారానికి తెరతీశారు.. దీనికి తోడు, మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా, టీకా ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ముడి పదార్థాలూ అలాగే ఇతర మందులు, వైద్య పరికరాలు భారత్‌కు అందించడానికి అమెరికా మొదట విముఖత వ్యక్తం చేసింది, "అమెరికా ఫస్ట్" అనే దాని సహజ విధానాన్ననుసరించి.. తరువాత  దిగొచ్చి కావాలసిన సహాయం అంతా చేస్తానని ముందుకు రావడమే కాకుండా ఇప్పుడు శరవేగంగా భారత అవసరాలు తీరుస్తోంది.  దీని వెనుక మర్మం ఏమిటో అందరికీ తెలిసినదే. ఇది కూడా దాని సహజ   విధానంలో భాగమే.., అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు..

   ఇలా చేసే కధా కరోనా మహమ్మారి ప్రబలే లా చేసి ఇప్పుడు నోటికి వచ్చినట్టు వక్రీకరణ లు చేస్తున్నారు. 

*జైభారత్.*

కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్

 కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఇలా..

⇒ మొదట కొవిన్ పోర్టల్‌(cowin.gov.in)లో లాగిన్ చేసి, మొబైల్ నంబర్ నమోదుచేయాలి. ఆ వెంటనే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.

⇒ ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. అంతా ఓకే అయితే ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్’ పేజ్‌ ఓపెన్ అవుతోంది.

⇒ దాంట్లో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.

⇒ ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్‌ను క్లిక్ చేయాలి.

⇒ పిన్‌కోడ్ ఎంటర్ చేసి, వెతికితే..దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.

గోధుమగడ్డి రసం ఉపయోగాలు

 గోధుమగడ్డి రసం ఉపయోగాలు - సంపూర్ణ వివరణ.


       గోదుమగడ్డి రసం అనునది వైద్యంలో చాలా ప్రముఖపాత్ర కలిగి ఉంది. చాలా మందికి దీనియొక్క ఉపయోగాలు తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు . గత కొంతకాలంగా దీనిపైన కొంతపరిశోధన చేసి దీని ఉపయోగాలు తెలుసుకున్నాను. ఈ గోధుమగడ్డి రసం కేన్సర్ చికిత్సలో కూడా చాలా అద్బుతఫలితాలు ఇచ్చింది. ఇది జలుబు , దగ్గు లాంటి చిన్నచిన్న వ్యాధులనే కాక బ్లడ్ కేన్సర్ , కేన్సర్ వంటివాటిలో కూడా చక్కని ఫలితాలు ఇస్తుంది.


             డాక్టర్ థామస్ అనే పరిశోధకుడు కూడా ఈ గడ్డిపైనా చాలా అద్భుతపరిశోధనలు చేశాడు . ఈ గడ్డిలో జీవమున్న ఖనిజాలు , విటమిన్లు , ఇతర పోషకాలు అనేకం ఉన్నాయి అని కనుగొనినాడు. ఒక ఆరోగ్యవంతుడి రక్తములో ఉండే అన్ని రకాల పదార్ధాలు ఈ గోధుమగడ్డి రసములో ఉండును. ఈ గోధుమగడ్డి రసానికి "ఆకుపచ్చ రక్తం " అనికూడా పేరు కలదు. కేన్సర్ తో బాధపడువారు ఒక గ్లాసు నిండా గోదుమగడ్డి రసాన్ని రోజుకి నాలుగుసార్లు తీసుకొనవలెను . ఇలా రోజుకి నాలుగు గ్లాసుల చొప్పున గోదుమగడ్డి రసాన్ని తీసికొనవలెను .


              ఈ గోధుమగడ్డికి జీవమున్న ఆహారం అని పేరు కలదు. దీనిలో ఉండే "క్లోరోఫిల్" రక్తాన్ని శుద్దిచేస్తుంది. పేగుల్లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . గోదుమగడ్డి రసంలో ఉండు క్లోరోఫిల్ పార్టికల్స్ హిమోగ్లోబిన్ ని పోలి ఉంటాయి. అందువల్ల రక్తహీనతకు ఐరన్ లా పనిచేయును . ఈ క్లోరోఫిల్ గుండె పనితీరును మెరుగుపరుచును. శరీరవ్యవస్థను , పేగులను , మూత్రకోశం , ఊపిరితిత్తులను బాగుగా ప్రభావితం చేయును . దీనిలో విటమిన్ A , B , ఈ  మరియు K పెద్దమొత్తంలో ఉంటాయి. గోధుమ కంటే 600 శాతం అధికంగా విటమిన్ B ను గోధుమగడ్డి కలిగి ఉంటుంది.  గోధుమగడ్ది లో కేన్సర్ నివారణకు ఉపయోగపడు B17 పెద్దమొత్తంలో ఉన్నది. గోధుమల కంటే గోధుమగడ్డిలో 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 


                శరీరంలో 30 రకాల ఎంజైములను చురుకుగా ఉంచడానికి అవసరం అయిన మెగ్నీషియం ఖనిజాలు గోధుమగడ్డి రసములో తేలికగా లభ్యం అగును. ఇప్పుడు మీకు గోధుమగడ్డి రసం వాడటం వలన నయం అయ్యే కొన్నిరకాల వ్యాధుల గురించి తెలియచేస్తాను . అవి 


     చర్మవ్యాధులు , మానసిక , శారీరక వ్యాధులు , మూత్రకోశ సంబంధ వ్యాధులు , మూత్రపిండాలలో రాళ్లు , మలబద్దకం , కడుపువ్యాధులు , మధుమేహం , గుండెవ్యాధి , కీళ్లు , కండరాల వ్యాధులు , ఆస్తమా , వంధత్వము , కన్ను , చెవి సంబంధ వ్యాధులు , కంపవాతం , దీర్ఘకాలిక జలుబు , అగ్నిమొలలు , వయస్సుకు ముందే జుట్టు నెరవడం , స్త్రీ గర్భసంబంధ వ్యాధులు , నిద్రలేమి , రక్తహీనత , కేన్సర్ వంటి వ్యాధులు 


             పైన చెప్పిన సమస్యలతో బాధపడువారు రోజుకు నాలుగు గ్లాసుల చొప్పున తక్కువలోతక్కువ 21 రోజులపాటు తీసుకొనవలెను .


    

    


          మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు