8, జూన్ 2022, బుధవారం

మణిపూరక చక్రం.

 మణిపూరక చక్రం.


 మనవ శరీరం లొ ఇది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది నాభి కి కుడివైపు ఒక అంగుళం దూరం లొ వెన్నుని ఆనుకొని ఉంటుంది. ఇది గతి తప్పినా అనగా సరిగ్గా శక్తి సంచాలనం చేయక పోయినా లేక స్థితి తప్పినా అనగా ఉండాల్సిన చోట ఉండకుండా కొంచెం కదిలినా శక్తి హీనం అయినా మనిషి చాలా రోగాలుకి గురి అవుతాడు.


మణిపూరక చక్రం పరీక్ష - 


  మణిపూరక చక్రం సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి 2 పరిక్షలు ఉన్నాయి .


 * పరగడుపున అనగా ఏమీ తిననప్పుడు వెల్లికిలా పడుకొని నాభిలో వేలుపెట్టి  కొద్ది గా అదిమితే గుండె చప్పుడు లాంటిది వినపడుతుంది.అలా వినపడితే మణిపూరక చక్రం సరిగ్గా ఉన్నట్టు.


 * నాభి స్థానం నుండి కుడి ఎడమ స్థనగ్రముల వరకు దూరాలు కొలవండి. ఈ రెండు దూరములు సమానం గా ఉంటే మణిపూరక చక్రం సరిగ్గా ఉన్నట్టు.


 మణిపూరక చక్రం ఎందుకు కదులుతుంది - 

 

     మూలాధారం నుండి ప్రారంబించి ఆ చక్రాలు ఒక నిర్ణిత స్థానం లొ ఉంటాయి. ఈ చక్రాలు ఒక నిర్ణీత స్థానం లొ వెన్నుని ఆనుకుని ఉంటాయి.వీటి సంభందం శరిరం లొని నాడీ కేంద్రాలతో అన్నిటితో ఉంటుంది . ఈ నాడి కేంద్రాలలో ని అయస్కాంత శక్తి తగ్గినప్పుడు వాటికి అనుగుణం గా చక్రాల స్థితులలో మార్పు రావోచ్చును కారణం ఇవన్ని జివయస్కాంత శక్తి కేంద్రాలు.కనుక 


 శరీరం లొ జీవయస్కాంత శక్తి ఎందుకు తగ్గుతుంది 


 * చాలా ఎక్కువ సమయం ఇనప వస్తువులపై కూర్చోవడం.

 * ఎక్కువుగా ఇనప గ్రిల్ల్స్ మొదలయినవి ఉండే ఇంట్లో నివసించడం.

 * అత్యధిక ఉష్ణం కలిగించె ఆహరం తరుచుగా తినడం.

 * అయస్కాంత శక్తి తగ్గిపోయిన స్త్రీ తొ కాని పురుషుడు తో కాని సంభందం పెట్టుకొవడం.

 * ఉప్పు, కారం లు అదికం గా తినడం

 * మాంసాహారం హద్దు దాటి తినడం .

 * ఎక్కువ సమయం స్కూటరు, కార్ మొదలయిన వాహనాలు గాని లేక రోడ్ రోలర్ , ప్రొక్లియన్ వంటి వాహనాలు నడపడం.

 * అయస్కాంత విదుతయస్కాంత యంత్రాలకు సంభందించిన ఉద్యోగాలు.

 * చాలా శక్తి వంతమైన విధ్యుత్ తో నడిచే యంత్రాల వద్ద పని చేయడం .


 మణిపూరక స్థాన బ్రంసం వలన ఏ రోగాలు రావొచ్చు -


 " ఉదార విథానం " ( Diaphram ) అనేది కడుపుని పై భాగాన్ని వేరు చేస్తూంది .ఈ ఉదార వితానం క్రింది భాగం లొ ముఖ్యం గా నాభి నుండి క్రిందికి గల భాగం లొ ఏ రోగమైన రావొచ్చు. 


 * జీర్ణకోశ వ్యాదులు , అల్సర్, apendisitees , డయారియా , డిసెంత్రీ , లైంగిక సమస్యలు, నడుంనొప్పి, పైల్స్ , phiistula , కడుపు నొప్పి ఇటువంటివి రావొచ్చు.


  మణిపూరక చక్రం శక్తి హీనం అయ్యి స్థానబ్రంశం పొందినా కాలేయం ఫాన్క్రియాస్ పాడు అయ్యి మదుమేహం రావొచ్చు .పెద్ద ప్రేవులలో, పురీష నాలం కాన్సర్ రావొచ్చు .


 మణిపూరక చక్రాన్ని సరి చేయడం ఎలా -


 వెల్లికిలా పడుకోండి . నాభి పైన ఒక రూపాయి బిళ్ళ ఉంచండి.దానిపైన ఒక కొవ్వొత్తి ఉంచండి.దానిపై ఒక స్టీల్ గ్లాస్ బోర్లించి పట్టుకోండి.వేడి వలన గ్లాస్ లొ ప్రాణ వాయువు

 ఖర్చు అయిపోయి శూన్యం ఏర్పడుతుంది.లేదా వాయువు వ్యాకోచించి ఒత్తిడి ఎర్పడుతుంది. ఆ వత్తిడి వలన మణిపూరక చక్రం సరి అయిన స్థానం లొ కి వస్తుంది. ఈ ప్రక్రియను నాలుగు , అయిదు సార్లు చేసి మనిపురకానికి పైన చెప్పిన పరిక్షలు నిర్వహించాలి. అది సరి అయిన స్థానానికి వచ్చినపుడు గుండె చప్పుడు వినిపిస్తుంది.


 * అరచేతి కేంద్ర స్థానాన్ని గాని అరకాలి కేంద్ర స్థానాన్ని బొటన వ్రేలితో నొక్కండి.(sound వినపడే వరకు ) .

 * వెల్లికిలా పడుకొని గాలి పీల్చి కడుపుని ఉబ్బించి పెట్టండి అలా మణిపూరక చక్రం తన స్థానం వచ్చె వరకు చేయండి .

 * సూర్య యంత్రం మెడలో ధరించండి.

 * సూర్య నమస్కారాలు చేయండి .

 * కుడి చేతి మద్య వేలికి మాణిక్యం ధరించండి. 


  

            మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

పొడుపు పద్యాలు ….

 జాతీయ తెలుగు సాహితీ పీఠము …. 

  తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

        డా. నలవోలు నరసింహా రెడ్డి


          ……  పొడుపు పద్యాలు …...

1. ఆ. అందమైన మాట కైదక్షరమ్ములు 

పోల్చ మొదటి రెండు ''పుష్ప'' మగును    

నాల్గు, మూడు నైదు నయముగా నగు ''క్రొత్త''  

పదము తెలుప వలయు పసిడి బాల..!  


2. తే.గీ.పడతి పంచాక్షరములును పదములోన

వనిత మూడునాలుగు గూడ బ్రహ్మయగును

భామ మధ్య వర్ణముబోవ బావి యగును

తెలిసి యున్నచో చెప్పుము తెలుగు లేమ


పి.మోహన్ రెడ్డి

మామిడి పండు

 త్రపశ్యామ జంబూ

ర్దళిత హృదయం దాడిమ ఫలమ్

సశూలం సంధత్తే హృదయ

మభిమానేన పనసః

భయా దంతస్తోయం

తరు శిఖరజం లాంగలి ఫలమ్

సముద్బూతే చూతే

జగతి ఫలరాజే ప్రసరతి.

దళితంబయ్యెను గుండె దాడిమకు,

మీదన్ సల్పు జంబూఫలం

బులకం గల్గెను సిగ్గుచే,

పనస రొమ్ముంగ్రుమ్మె శూలమ్మున్

సలిలంబయ్యెను గుండె కొబ్బరికి

వృక్షాగ్రమ్మునన్ భీతిచే,

ఫలరాజంబను పేర చూతమునకున్

ప్రఖ్యాతి ప్రాప్తించుటన్.


భావం:


అప్పటి వరకు ఎన్నిరకాల పండ్లు ఉన్నప్పటికీ మామిడి పండు వచ్చే సరికి అందరి మనసు దాని మీదకే పోతుంది. దాంతో అది ఫలరాజుగా గణుతికెక్కుతుంది. 


ఇది సహించని తక్కిన  ఫలాల పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి


మామిడి పండు వచ్చి ఫలరాజుగా జనులచేత కీర్తింపబడటాన్ని చూచి నేరేడు పండు సిగ్గుతో ముఖం నల్లగా మాడిపోయింది.


తరుశిఖరిజం చెట్టు కొనన పుట్టే లాంగలి ఫలం నారికేళం కుమిలి కుమిలి లోలోపలే ఏడ్చి  ఏడ్చి లోపలనే నీటితో నిండిపోయిందట.


ఇక పనస పండు ఎందుకొచ్చినది ఈ బ్రతుకు అని అభిమానంతో శూలాన్ని లోపలకు పొడిచేసుకుందట.


ఇలా ఆయా ఫలాలో ఉండే సహజ లక్షణాలకు కారణాలను ఆపాదించటమే కాక మానవీకరణ చేసి చెప్పడంతో అద్భుత కవిత్వమైంది.


నేరేడు సహజంగా నల్లగానే ఉంటుంది. దానికి కవి సిగ్గు ఆపాదించారు.


దానిమ్మ పండు సహజంగా పగిలి గింజలు కనిపిస్తూ ఉంటుంది. దీనిని హృదయం బద్దలైపోయినట్ల చెప్పారు.  


నారికేళం  లోపల నీరుంటుంది. దానికి లోలోపల కుమిలిపోయినట్లు చెప్పారు. 


ఇక పనసకు మధ్యభాగంలో ఈ చివరినుంచి ఆ చివరకు పెద్ద కాడ ఉంటుంది. దానిని లోపల శూలాన్ని పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు.


రసగంగాధరమను ఆలంకారిక గ్రంథములో మాత్సర్యమను గుణమునకు లక్ష్యముగా ఈ శ్లోకమును చెప్పారు పండిత జగన్నాథ రాయలు.


ఇంతటి సంస్కృత పండితుడు అచ్చమైన మన తెలుగువాడు కావడం మరో విశేషము.


- వాదారి నారాయణ

పొడుపు పద్యాలు …...

 జాతీయ తెలుగు సాహితీ పీఠము …. 

  తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

        డా. నలవోలు నరసింహా రెడ్డి


          ……  పొడుపు పద్యాలు …...


1. ఆ. నమ్మదగిన పదము నాలు గక్షరములు  

ఒండు జూడ నర్థమొప్పు ''మంచి''       

అరయ నాది తొలగ నగను ''అక్షరము''గ    

పదము తెలుప వలయు పసిడి బాల..!  


2. తే.గీ.పడతి పంచాక్షర ములును పదములోన

కొమ్మ మొదటిది నాల్గును గూడ కీర్తి

పొలతి మూడునైదును గూడ భుజగమగును

తెలిసి యున్నచో చెప్పుము తెలుగు లేమ

పి.మోహన్ రెడ్డి.

తెలుగు భాష

 నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషల ను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.

    తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.


1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి  వుంది.


2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది.

మొదటి లిపిగ కొరియన్ భాష.


3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.


4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.


5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.


6.  ఇటాలియన్ భాష లాగానే   తెలుగు భాష లో కూడా  పదాలు హల్లు శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్". అని అంటారు .


7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు.

ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.


8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు నైజం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.


9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.


10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోన లేవు.


11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.


12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.


13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.


14. రామాయణ మహభారతాలు లో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.

కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.


15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగు ను  తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.


16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. 

తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.

 

పై విషయాలు అన్నీ వొక తమిళ వ్యక్తి  ఆంగ్లం లో  తెలియజేసిన విషయాల ను అనువదించారు. కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భవి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాష ను చంపేసే తరం గా మనం వుండకూడదని నా భావన. 

ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యం, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం. 

 ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాష ను బలిచేయనవసరం లేదు. 


తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం. 

H

ప్రపంచం లో ఉన్న ప్రతి తెలుగు వారికి చెరవేయండి

💐💐💐💐💐💐💐💐

గొడవలు

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


🌿🌼🙏తరచుగా గొడవలు, ఏదో ఒక గండం సమస్య అన్ని పనులు ఆటంకాలు, ఇలాంటి సమస్య ఏదో ఒక దశలో అందరికీ ఉంటుంది, అటువంటి సమస్యలకు అత్యద్భుతమైన పరిష్కారం


🌿🌼🙏ముందుగా ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు, అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే, ఏదీ ఆలస్యం కాదు, అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం, మీరంతా ఆచరిస్తారనే ఆశిస్తున్నాను, నాకు తెలిసినవి, నాకు కనిపించే మంచి విషయాలు సేకరించి పోస్ట్ చేస్తున్నాను, మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ సాయి సంకల్ప్🙏🌼🌿


🌿🌼🙏తరచుగా గొడవలు, ఏదో ఒక గండం సమస్య అన్ని పనులు ఆటంకాలు, ఇలాంటి సమస్య ఏదో ఒక దశలో అందరికీ ఉంటుంది, అటువంటి సమస్యలకు అత్యద్భుతమైన పరిష్కారం🙏🌼🌿


🌿🌼🙏అలాంటప్పుడు కాలభైరవ అష్టకం ఉదయం 11 సార్లు సాయంత్రం 11 సార్లు పఠించాలి ... మంగళవారం, ఆదివారం రోజులలో చపాతీలు నైవేద్యం గా పెట్టి అవి కుక్కకు ఆహారంగా ఇవ్వాలి, ఇలా 41 రోజులు పాటు చేస్తే అన్ని ఆటంకాలు తొలగి ప్రశాంతంగా ఉంటారు 🙏🌼🌿


🌿🌼🙏కాలభైరవాష్టకం🙏🌼🌿


దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |

నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||


భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |

కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||


శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||


భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |

నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||


ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |

స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||


రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |

మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||


అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |

అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||


భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||


కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |

శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||


#దయచేసి_అందరూ_సద్వినియోగం_చేసుకోండి  

#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి 

#సంభవామి_యుగే_యుగే


🌿🌼🙏వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి. అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ... 🙏🌼🌿


🌿🌼🙏అందరం భక్తితో " ఓం శ్రీ కాలభైరవాయ నమః " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ పరమాత్మ🙏🌼🌿


ఓం శ్రీ కాలభైరవాయ నమః

ఇంట్లో దీపం

 🪔🪔🪔🪔🪔

రోజు ఇంట్లో దీపం పెట్టెటప్పుడు.

🪔🪔🪔🪔🪔

దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.


అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి


ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి


శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.)


దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి, అనగా రెండు వత్తులని కలిపి వేయాలి, విడివిడిగా కాదు. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటికబెల్లం పలుకులు కానీ, ఏదో ఒక పండుగానీ, లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి.


ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.


ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

🪔🪔🪔🪔🪔

ఏరువాక సామెతలు


ఏరువాక సామెతలు


నక్షత్రాల పేరుమీదుగా కార్తెలను వ్యవహరిస్తారు. ఇవి వాతావరణంలో వచ్చే మార్పులను సూచిస్తాయి. తెలుగునాట వర్షాకాలం రోహిణి కార్తె తరువాత ఏరువాక పున్నమితో ప్రారంభమవుతుంది. సాధారణంగా ఆ సమయానికి మృగశిర లేదా ఆరుద్ర కార్తెలుంటాయి. ప్రధానమైన ఆ రెండుకార్తెలలో కురిసే వర్షాన్ని అంచనా వేయడానికి రైతన్న కొన్ని సామెతలను సృష్టించుకున్నాడు.


మృగశిర కార్తెలో ముంగిళ్లు చల్లబడతాయి. మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలింకా ఇస్తాయి.


మృగశిర వర్షిస్తే మఖ గర్జిస్తుంది. మృగశిర కురిస్తే ముక్కారు పంట పండుతుంది. మృగశిర చిందిస్తే అయిదు కార్తెలూ వర్షిస్తాయి


ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలూ కురుస్తాయి. ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యం లేదు. ఆరుద్రలో అడ్డెడు చల్లితే 'పుట్టెడు పండుతాయి. ఆరుద్ర వాన ఆదాయాల బాన. ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి. ఆరుద్రలో వేసిన విత్తనం అరిటాకులో అన్నం. ఆరు కార్తెలు పోతే ఆరుద్రే దిక్కు. ఆరుద్రలో వర్షం అమృతంతో సమానం,

 శ్లోకం:☝️

*సత్యస్య వచనం శ్రేయః*

   *సత్యాదఽపి హితం వదేత్ l*

*యద్భూతహిత మత్యంత*

   *మేతత్సత్యం మతం మమ ll*

    - మహాభారతం శాంతిపర్వం


భావం: సత్యము చెప్పుట శ్రేయస్కరము. సర్వభూత హితముగా పలుకుట సత్యము కంటెనూ మంచిది. ఎందుచేతనన దేనివలన సర్వభూత హితమగునో అదియే సత్యమని నా అభిప్రాయము.

సనాతన ధర్మములో

 040821160821.  070622-9.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*హిందూ సనాతన ధర్మములో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు.....*

                  ➖➖➖✍️


*1. ముక్కులు కుట్టించుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము.*


*2. చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు.*


*3. ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము.*


*4. తడి పాదములతో బోజనము చేసిన ఆయుర్వుద్ధి.*


*5. తడి పాదములతో శయనించిన ఆయుక్షీణం.*


*6. స్త్రీలకు బేసి సంఖ్య గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్యా గల అక్షారములతో పేర్లు పెట్టుట మంచిది.*


*7. సూర్య గ్రహణానికి ముందు ''12 '' గంటల కాలము, చంద్ర గ్రహణానికి ''9'' గంటల ముందు కాలము కడుపు ఖాళీగా ఉంచుకోవలెను.*


*8. శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె ఆ స్థానం వారి జన్మ రాశి . బంగారం కుజునికి , వెండి గురువునకు , రాగి రవికి ,ఇత్తడి బుధునకు, ఇనుము శని కి ఇష్టము.*


*9. రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.*


*10. బుధవారం నాడు బూడిద గుమ్మడి కాయను, గురువారం నాడు కొబ్బరి కాయను ఇంటి ముందు వ్రేలాడ కట్టుకుంటే నరఘోషలు తొలుగుతాయి.*


*11. యాత్ర సమయములందు మార్గ మధ్యమున పరుండునపుడు పాదరక్షలను తలక్రింద పెట్టుకుని పరున్నచో మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.*


*12. ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలచినపుడు(వస్త్ర యుగ్మం) రెండు వస్త్రాలను ఇవ్వవలెను.*


*13. తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు మరియు అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు, కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.*


*14. ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కుర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హోమం చేయునపుడు -రుద్రునకు అభిషేకం చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కుర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.*


*15. ఇద్దరు కూతుర్లకు ఒకేమారు వివాహం చేయవచ్చును, కాని ఇద్దరు కొడుకులకు ఒకేసారి వివాహం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి. లేదా సంవత్సర భేదం జరగాలి.*


*16. గృహ ప్రవేశ సమయములందు మంచి గుమ్మడికాయను పగలకొట్టుచుందురు. అది కేవలం పురుషులు మాత్రమే చేయవలెను. ఎట్టి పరిస్థితిలోను స్త్రీలు చేయరాదు.*


*17. వినాయకునికి తులసి దలంతోను- శివునకు మొగలిపువ్వుతోను- దుర్గ ను గరిక తోను పూజించరాదు.*


*18. తులసి దళమును-బిల్వ దళమును ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.*


*19. భోజనం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకొని, కుడివైపు తిరిగి లేవవలెను.*


*20. కొబ్బరి- మామిడి-అరటి-పనస ఉదయం పూట తినరాదు.*


*21. వేరుశనగ పప్పు-అరటిపండు తిన్న పిదప నీరు త్రాగ రాదు.*✍️



                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.🙏

సామెతల్లో ఆయుర్వేదం*

 *సామెతల్లో ఆయుర్వేదం*


"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" అని. కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికి మూలికలతో తయారు చేసే లేహ్యం, పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !


"పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! 

 ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియకపోతే అశ్వగంధ పెద్ద మందు !"


త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !


"ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు, కనీసం కందిపుల్ల"  ఇవి పళ్ళు తోముకోవడానికన్నమాట..


"వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు"


అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని సామెత ఏమంటే  "కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు "


పుండుమీదకు ఉమ్మెత్త, నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట. సామెత "పుండుమీదకు నూనెలేదంటే  గారెలొండే పెండ్లామా అన్నట్లు"..


."ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "


వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది. సామెత ఇలా . "ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "


కరక్కాయ పువ్వు , పిందె, పండు చాలా ఉపయోగకరమైనవి. శ్వాస, కాస, ఉదర, క్రిమి, గుల్మ, హృద్రోగం , గ్రహణి, కామిల, పాండు ఇన్ని రోగాలను హరిస్తుంది.. అందుకే "మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి " అని సామెత 


ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది. సామెత ఇదుగో.. "పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది "


"ఒక పూట తింటే యోగి

రెండు పూటలా తింటే భోగి

మూడు పూటలా తింటే రోగి "


అలానే శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత "కక్కిన బిడ్డ దక్కుతుంది " అని..


ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి ! 

పిల్లలు మాతృభాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ?  సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ? అందుకే మాతృ భాషను చంపితే సంస్కృతి చస్తుంది!

ఎన్ని చూశారు

 ఎన్ని చూశారు, ఎన్నింటిని  విన్నారు,ఎన్ని ధరించారు ?

..........................................................


(1) కుప్పెలు (2) రాగడిబిళ్ళ (3) కుంకుమరేఖ  (4) పాపటబొట్టు (5) కమ్మలు (6) బావిలీలు (7) సూసకము (8) చంద్రవంక , సూర్యవంక (9) కెంపురవ్వల పల్లెరు పూవు 


(10) బుగడలు (11) కుచ్చులు (12) నానుతీగ (13) మెడనూలు (14) కుతికంట్లు (15) సరిపెణలు (16) గుండ్లపేరు (17) సరిగె (18) ముక్కెర (19) బన్నసరము (20) ఉత్తాండాలు.


(21) కంకణాలు (22) తట్లు కడియాలు (21) సందిదండలు (22) ఒడ్డాణము (23) ముద్రికలు (24) హంసకాలు (25) మ్రోయుగజ్జెలు (26) బొబ్బిలికాయలు (27) గిలుకు మెట్టెలు.


అయ్యలరాజు నారాయణకవి 1800 - 1850 నాటికాలము వాడు. హంసవింశతి గ్రంథాన్ని వ్రాశాడు. అందులో నాటి సామాజిక స్థితిగతులను చక్కగా వర్ణించాడు. హంసవింశతి శృంగారనీతి కావ్యము.


చిత్రభోగుడనే రాజపాలనలో విష్ణుదాసుడనే సాతాని* హేమావతులు భార్యభర్తలు. హేమావతి అందగత్తె. విష్ణుదాసుడు దూరదేశము వెళుతూ, తను పెంచుకొన్న హంసకు ఇంటిని, ఇల్లాలును జాగ్రత్తగా చూచుకోమని చెప్పి వెళతాడు. రాజైన చిత్రభోగుడు హేమావతి అందాన్ని వలచి హేల అనే పరిచారికను దూతగా హేమావతి దగ్గరకు పంపుతాడు. రాజు గుణగణాలను ఐశ్వర్యాలను హేల పొగిడి చివరకు హేమావతిని ఒప్పిస్తుంది. ఒకరోజు హేమావతి అలంకరించుకొని రాజవాసానికి వెళుతున్న సందర్భంలో హంస ఆపి, పరపురుష పొందు ఎంతతప్పో తెలియచేస్తూ రాత్రి తొలిజాము నుండి తెల్లవారే వరకు నీతికథ చెబుతుంది. తెల్లవారిన తరువాత హేమావతి తన ప్రయత్నాన్ని విరమించుకొంటుంది. ఇలా ఇరవై రాత్రులు గడిచిన తరువాత హేమావతి, చిత్రభోగులు  తామెంతటి తప్పు చేయాలని భావించారో తెలుసుకొని బాధపడతారు. ఈలోగా దూరదేశ పర్యటనను ముగించుకొని విష్ణుదాసుడు రావడముతో కథలు సుఖాంతమైతాయి.


పైన పేర్కొన్న ఆభరణాలన్ని హేమావతి, ఇంకా నాటి సమాజములోని స్త్రీలు ధరించినవే. హంసవింశతి కావ్యరచన 1850 నాటిది కాబట్టి మన తెలుగు ఆడపడచులు 150 సంవత్సరాల కిందట ధరించి మురిసినవే ఈ ఆభరణాలు.


నేటి తరానికి పై తెలిపిన ఆభరణాలలో ఎన్ని తెలుసని ప్రశ్నించుకొంటే  మూడో నాలుగో తెలుసనే సమాధానము వస్తుంది. నేటి  పిల్లలు పూర్తిగా పాశ్చత్య నాగరికతకు లోనైనారని చెప్పకతప్పదు. అవగింజంత బొట్టును ధరిస్తున్నారు, కొందరు పిల్లలు అది కూడా భారమని మానేస్తున్నారు. మట్టిగాజులే కాదు ఏ గాజులు కూడా కొందరు అసలు వేసుకోవడము లేదు. లంగాఓణీలు నాలుగు దశాబ్దాల కిందటనే అంతరించాయి. చీరకట్టు తెలియదు. రాబోయే యాభైసంవత్సరాల కాలంలో చీరకట్టు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదముంది.


దీనికంతటికి కారణము సమాజము కాదు, ప్రధానదోషులు తల్లిదండ్రులే, ఫ్యాషన్ల పేరుతో అమాయకులైన పిల్లలు ఏది కావాలంటే దానిని కొనిస్తూ అతిగారాబము చేస్తూ వారసత్వ సంపదలను సంస్కృతులను చెడగొడుతున్నారు. ఈ దుస్సంప్రాదాయానికి పిల్లలు కాదు తల్లిదండ్రులే కారణము, వారే మారాలి. ఈ మాటన్నందుకు నన్ను ఎందరు విమర్శించినా నిర్ణయము మార్చుకోను.


చైన్ అనే చీనా పదము నుండి చైనాలనే పదము వచ్చింది. కాలి గొలుసులకే కాలిచైనాలని కూడా అంటారు. ఆంగ్లములో చైన్ అన్నా గొలుసు అనే కదా అర్థము.


(*) సాతానులు - శ్రీవైష్ణవ భక్తులు, వైష్ణవ పూజారులు. బెంగాలులో వైష్ణవాన్ని ప్రచారము చేసిన శ్రీచైతన్యుని అనుయాయులు. ఆంధ్రదేశములో శ్రీరామానుజాచార్యుల శిష్యులు. చాత్తాడ శ్రీవైష్ణవులని కూడా వీరిని అంటారు.

................................................... జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురము.

నవగ్రహాలలో

 నవగ్రహాలలో ఆర్యమన్, రూఢ, సావిత్రి, విష్ణు అనే పేర్లు ఎవరివి ?

.........................................................

హిందూదేవాలయాలలో ఉపదేవాలయాలు వుంటాయి. అంటే ప్రధానగుడి ప్రక్కన మరో గుడి లేదా గుడులు వుంటాయి. భైరవ, లక్ష్మీ, పార్వతి, కుమారస్వామి, గణేశ, హనుమ దేవాలయాలు ఉండవచ్చు. గుడిలో వెలసిన నవగ్రహాలను కూడా ఉపదేవాలయమనే అంటారు. ఖగోళ,జ్యోతిష్య శాస్త్రాలకు నవగ్రహాలే మూలము.


నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. సూర్యారాధన హిందూదేశములో వేదకాలము నుండే వుంది. ఉత్తరదేశములో 'మాగాల' నే జాతి ప్రజలు సూర్యుడిని తప్ప ఇతర దేవతలను పూజింపరు. సూర్యుడి కోసమే ప్రత్యేకంగా నిర్మించిన దేవాలయాలను ఆదిత్యగృహాలంటారు. దక్షిణ హిందూదేశములో తమిళనాడులోని తిరువాడమరదూర్ గ్రామంలో ప్రాచీన సూర్య దేవాలయముంది. ఈ ఆలయంలో సూర్యుడు ప్రధానదేవత కాగా మిగిలిన ఎనిమిది గ్రహాలకు చుట్టూ ప్రత్యేక దేవాలయాలున్నాయి. కుళోత్తుంగచోళ చక్రవర్తి కట్టించిన ఈ గుడికి మార్తాండ దేవాలయమని పేరు.


ఆంధ్రదేశములో చిత్తూరు జిల్లాలోని గుడిమల్లములో పురాతన మార్తాండ శిల్పముంది. శ్రీకాకుళము జిల్లా అరసవిల్లి కూడా పురాతన సూర్యదేవాలయముంది. 7 వ శతాబ్దములో కళింగాధిపతి దేవేంద్రవర్మ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తున్నారు. 17 వ శతాబ్దములో షేర్ మహ్మద్ ఖాన్ ఈ దేవాలయాన్ని పాడుచేసి, పాడుచేసినట్లుగా శాసనము కూడా వేయించాడు. తరువాతి కాలములో అరసవిల్లి సూర్యనారాయణ దేవాలము పునరుద్దరించబడింది. ఒడిషాలోని కోణార్క సూర్య దేవాలయము జగద్విఖ్యాతి గాంచిన పురాతన దేవాలయము.


ఆగమశాస్త్ర ప్రకారము నవగ్రహా విగ్రహాలలో సూర్యవిగ్రహం  పశ్చిమ ముఖముతో మధ్యలో వుంటుంది. సూర్యుడు ఎరుపురంగులో వుండి,ఎర్రని పూలచే అలంకరించబడి అందమైన వస్త్రాలు ధరించి రథముపై స్థానకభంగిమలో (నిలుచున్న భంగిమ ) వుంటాడు. రెండు చేతులలోనూ పద్మాలుంటాయి. సూర్య భగవానుడు క్షత్రియ వంశానికి చెందిన కశ్యపుని సంతానమని పురాణాలు తెలియ చేస్తున్నాయి. ఇతను కళింగాధిపతి, సూర్యభగవానుడి లాంఛనము సింహము.


సూర్యునికి ఇరువైపులా దండ పింగళ అనే పేర్లుగల సేవకులుంటారు. యమ, రేవంతులు సూర్యుని కుమారులు. రజని, ఛాయ, సువర్చల, స్వర్ణ అనేవారు ఇతని భార్యలని కొన్ని పురాణాలలో వుంది. సూర్యుడికి గల పన్రెండు రూపాలను ద్వాదశ ఆదిత్యరూపాలని అంటారు. అవేమంటే (1) ధాత్రి (2) మిత్ర (3) ఆర్యమన్ (4) రూఢ (5) వరుణ (6) సూర్య (7) భాగ (8) విష్ణు (9) సావిత్రి (10) వివష్వన (11) పుషాణ (12) త్వాష్త్రీ.


*నేను సేకరించిన వ్రాసిన ఆర్టికల్స్ ను కొందరు కొన్నింటిని నా పేరు తీసేసి, వారి పేరుమీదుగా ప్రచారము చేసుకొంటున్నారు, విచిత్రమేమిటంటే ఇలా వారి పేరున వ్రాసుకొన్నవి కొన్నాళ్ళకు నాకే రావడము.* *మరికొందరు ఎందుకో నా పేరు తొలగించి వాట్సాఫ్, ఫేస్ బుక్స్ లో పోస్ట్ చేస్తున్నారు. కొందరు నా ప్రస్తావన లేకుండా నేను వ్రాసిందేదో యాథాతథంగా యూట్యూబ్ లలో తమదే అన్నట్లుగా చదివేస్తున్నారు. ఎవరు ఎలాగైనా ప్రచారము సర్క్యూ లేషన్ చేసుకోండి కాని నా పేరు మాత్రం తొలగించవద్దని మనవి.*


/స్వస్తి /

.............................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురము.

సందేశము

 పరమతద్వేషం లేకుండా , ఒక హిందు మితృడు , సర్వసమాజ శ్రేయస్సుకొరకు , తన స్వంత ధర్మ విలువలను ఎలా పరిరక్షించుకోవాలో తెలిపిన సందేశము :  

==================

సందేశము :

========

"చాలా మంది సోషల్ మీడియాను తేలికగా తీసుకుంటారు, కానీ దాని బలాన్ని నేను మీకు చెప్తాను.  చదవడానికి ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది :*

 

 *1: భారతదేశంలో హిందువుల కొత్త విశ్వాసం & ఐక్యత కారణంగా, యూరప్ మొత్తం ఒత్తిడిని అనుభవిస్తోంది!*


 *3: హిందువుల ఐక్యత కారణంగా, "లవ్ జిహాద్" ఇప్పుడు 50%కి పరిమితం చేయబడింది మరియు అనేక రాష్ట్రాల్లో చట్టవిరుద్ధం చేయబడింది.*


 *4: హిందువుల ఐక్యత కారణంగా జిహాద్ వ్యాపారం చాలా చోట్ల దాడికి గురైంది!*


 *5: హిందూ ఐక్యత కారణంగా, "సనాతన ధర్మానికి" వ్యతిరేకంగా మాట్లాడిన 70% మంది నోరు మూయబడ్డారు!  చాలా మంది విదేశీయులు దీనిని స్వీకరించడం ప్రారంభించారు.*


 *6: హిందూ ఐక్యత కారణంగా, WhatsApp & Facebookలో మన పండుగలు & సంస్కృతిపై జోకులు 80% తగ్గాయి!*


 *7: హిందూ ప్రజల మధ్య ఉన్న ఐక్యత కారణంగా, ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు హిందువుగా కనిపించాలని తహతహలాడుతున్నాయి!*


 *8: హిందూ ఐక్యత కారణంగా, బాలీవుడ్ ఒత్తిడిలో ఉంది, సీతామాత పాత్రను కరీనా పోషించబోతోంది, ఇప్పుడు కంగనా!*


 *9: హిందువులు ఒకప్పటిలా మౌనంగా లేరు, ఇప్పుడు విదేశాల్లో కూడా లండన్ వంటి చోట్ల నిరసనలు చేస్తున్నారు &  హిందువులను తూలనాడుటకు సహకరిస్తుయుండే  కేంద్రాలు, దుకాణాలు & రెస్టారెంట్లను బహిష్కరిస్తున్నారు!*

 *మీకు సోషల్ మీడియాలో*

*కేవలం 10 మంది హిందూ స్నేహితులు మాత్రమే ఉన్నప్పటికీ, ఈ ఆలోచనలను వారిలో వ్యాప్తి చేయడం చివరికి లక్షలాది హిందువులను చేరుకోవడానికి సహాయపడుతుంది!*


 *తెలియకుండా మీరు వ్రాసిన / షేర్ చేసిన విషయాలు లక్షల్లో చేరుతున్నాయని గమనించండి!*


 *మీకు మీరే రాయలేకపోతే, దయచేసి వ్రాసే / మాట్లాడే వారి ఆలోచనలను ఫార్వార్డ్ చేయడం, భాగస్వామ్యం చేయడం, కాపీ చేయడం వంటివి కొనసాగించండి*


 *హిందూ ధర్మంపై అవగాహన రోజురోజుకూ పెరుగుతోంది.  "సూడో సెక్యులరిజాన్ని" సమర్ధిస్తున్న హిందువులు కూడా తమ పాత్ర గురించి ఆలోచించడం మొదలుపెట్టారు!*


 *కమ్యూనికేట్ చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించే వ్యక్తులు పనిలేకుండా ఉండాల్సిన అవసరం లేదు;  కొందరు విద్యలో ఉన్నారు, కొందరు ఉద్యోగాలలో ఉన్నారు, మరికొందరు వ్యాపారంలో ఉన్నారు లేదా స్వయం ఉపాధి లేదా వ్యాపారవేత్తలు!*


 *అయితే హిందువులను ఏకం చేయడానికి మరియు అవగాహన పెంచడానికి ప్రతి ఒక్కరూ "ధర్మ కార్యం" కోసం తమవంతు కృషి చేస్తున్నారు!*


 *ఏమీ చేయకుండా నిష్క్రమించడం కంటే లక్ష్యం కోసం జీవించడం మేలు!  నా తల్లిదండ్రులు మన సంస్కృతి & దేశం కోసం పోరాడారని కనీసం రాబోయే తరం అయినా గర్వంగా చెబుతుంది!*

          

 *మీరు ఇక్కడ ఉన్నారని గుర్తుంచుకోండి, ఇష్టాలు లేదా అయిష్టాల సంఖ్య కోసం కాకుండా మన గొప్ప సంస్కృతి యొక్క విలువలు & సంప్రదాయాల గురించి అవగాహన కల్పించడం కోసం!  అన్ని రంగాలలో గొప్ప పనిని కొనసాగించండి!  మా బలం పెరుగుతోంది!*

                       


 *హిందువుల ఐక్యతకు స్పష్టమైన శక్తి ఉంది.  కాబట్టి కుల భేదాలను క్షమించడం, మరచిపోవడం, అధిగమించడం మరియు చెత్తబుట్టలో పడేయడం ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకోండి, గొప్ప సందేశాన్ని కనెక్ట్ చేస్తూ ఉండండి!*


 *మరియు భారతదేశం మరోసారి గొప్ప దేశం మరియు సూపర్ పవర్ అవుతుంది.*🙏


 *🚩 జై శ్రీరామ్!  🚩*

 *🇮🇳 జై భారత్!  🇮🇳*


 విశ్వాసంతో ,   "సర్వే జనానో సుఖినో భవంతు" అనే సదాశయంతో , ఎవరివంతు పని వారు చేద్దాము;: ...🙏🚩