20, డిసెంబర్ 2020, ఆదివారం

తిరుప్పావై ఆరవపాశురము

 🌹🌷🌺🌸🥀🌾💐

*తిరుప్పావై ఆరవపాశురము వివరణ*


6. పుళ్ళుమ్ శిలుమ్బినకాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్ వెళ్లే విళిశజ్లిన్ పేరవమ్ కేట్టిలైయో పిళ్ళాయ్ ! ఎళున్దిరాయ్ పేయ్ ములైనజణు కళ్ళచ్చగడమ్ కలక్కళియక్కాలోచ్చి వెళ్లత్తరవిల్ తుయి లమర్న్ విత్తినై ఉళ్ళత్తు క్కొణ్ణు మునివర గళుమ్ యోగిగళుమ్ మెళ్ల వెళున్దు అరియెన్ద పేరరవమ్

ఉళ్ళమ్ వుగున్దు కుళిర్ద్నేలో రెమ్బావాయ్


ఇచటి నుండి పది పాశురములతో పదిమంది గోపికలను లేపుట చెప్పబడును. ఇచట పదిమంది గోపికలనగా పది ఇంద్రియములు, పదిమంది ఆళ్వారులు గురువాక్య పరంపర కూడా ఈ పది పాశురములచే బోధించబడును


ఈ పాశురమున - భగవదనుభవము క్రొత్తయగుట వలన ఈ వైభవము తెలియని తానొక్కతే తన భవనములో పరుండి వెలికిరాని ఒక ముగ్ధను లేపుచున్నారు. లేపుటకు తెల్లవారవలయును కదా! తెల్లవారుటకు గురుతులు చెప్పుచున్నారు

              M.s.s.k

పక్షులు అరచుచున్నవి. దేవాలయమున శంఖము చేయు పెద్ద ధ్వని విన్నారా లేదా! ఓ పిల్లా! లెమ్ము. పూతన చనుబాల విషమును ఆరగించి కపట శకటాసురుని కాలు చాచి సంహరించి పాలసముద్రముపై చల్లని తెల్లని మెత్తని శేషశయ్యపై పవళించియున్న జగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని తన హృదయమున నిలుపుకొని

మెల్లగా లేచిన మునులు.యోగులు 'హరి హరి' యను చేయు పెద్దధ్వని మా హృదయమున చొరబడి చల్లబరిచి మమ్ములను మేల్కొలిపినది. నీవు కూడా లేచి రమ్ము.'


ఇచట పక్షులనగా ఆచార్యులు. పక్షులు రెండు రెక్కలతో ఆకాశమున నెగురునట్లు ఆచార్యుడు జ్ఞానాను స్థానములతో పరమాత్మ యందు విహరించు చుండును శంఖధ్వని యనగా ఓంకార ధ్వని అనగా ' జీవుడు పరమాత్మకు దాసుడు అని, భక్తునకు దాసుడు అని ఇచట పూతన యనగా ప్రకృతి. పూతన స్తనములు అహంకార మమకారములు. విషము శబ్దస్పర్శ రూప రసగంధములను విషయములు. శకటాసురుడనగా సుఖము నంతమొందించు ఈ శరీరము


ఈ పాశురమున ఫెరియాళ్వార్లను మేల్కొలుపు చున్నారు

            M.s.s.k

ఇందులో 'పిళ్ళాయ్' అనికదా సంబోధన. ఇది అజ్ఞానమును సూచించును ఈ అజ్ఞానము జ్ఞాన విపాకము వలన ఏర్పడినది.


పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్' అనికదా శ్రుతివాక్యము. అందులో ఆండాళు తల్లి తమ జనకులను మొదట స్మరించుట ఔచిత్యము కూడా. వల్లభరాయల సభలో వీరి విజయోత్సవమున ఏనుగుపై ఊరేగింపు జరుగుచుండగా శ్రీమన్నారాయణుడు శ్రీ భూనీలా సమేతులై గరుడవాహనారూఢులై వేంచేయగా వారికి మంగళా శాసనము గావించిరి. ఇది ప్రేమదశలో చేయు కార్యము. ప్రేమదశలో జ్ఞానదశ అడుగంటును. ఇట్లు జ్ఞానపరిపాక కార్యమగు అజ్ఞాన కార్యము గావున వీరు 'పిళ్ళాయ్' అగును.


ఇక ఈ పాశురమున గురుపరంపరా వాక్యము 'అస్మద్గురుభ్యోనమః' అనునది. గురువులు కొత్తగా సిద్ధాంత ప్రచారమును ప్రారంభించిన వారగుట వలన 'పిళ్ళాయ్ అనునది సరిపడును.

      

                  M.s.s.k

ధార్మికగీత - 114*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత - 114*

                                        *****

             *శ్లో:-త్యజ దుర్జన సంసర్గం ౹*

                   *భజ సాధు సమాగమం ౹*

                   *కురు పుణ్య మహోరాత్రం ౹*

                   *స్మర  నిత్య మనిత్యతామ్ ౹౹*

                                       *****

*భా:- మానవ జన్మ మహత్తర మైనది. పశుత్వము నుండి మానవత్వానికి, మానవత్వము నుండి మాధవత్వమునకు పయనించాలంటే  ఆధ్యాత్మిక మార్గంలో నాలుగు సూత్రాలు అవలంబించాలి. 1."త్యజ":- దుర్జనులతో సాంగత్యం  విడిచిపెట్టాలి అని అర్థము. వారి నుండి సంక్రమించిన  దురాలోచన, పరుషవాక్కు,  దుష్కర్మలు పూర్తిగా విడనాడాలి. మనోవాక్కాయిక పాపాలకు దూరంగా మెలగాలి.   2. "భజ":- సత్ పురుషులను ఆశ్రయించాలి. వారి ద్వారా  సదాలోచన, సద్భాషణము, సదాచరణ అలవరచుకొని సన్మార్గంలో పయనించాలి. వారి శుశ్రూష ద్వారా ఆత్మవిద్యను ఆర్జించాలి.    3. "కురు":-"మన్  మే రామ్ - హాథ్ మే కామ్" అన్నారు పెద్దలు. దైవప్రీతితో పాటు  తరువులు, గోవులు, నదులు, మేఘాల వలన స్ఫూర్తిని పొంది, రాత్రనక, పగలనక  త్రికరణ శుద్ధితో పరోపకార పరాయణులం కావాలి.   మానవసేవయే మాధవసేవ అని గుర్తించాలి.  4. "స్మర":- దేహము అనిత్యమని, ఆత్మ నిత్యమని, సత్యమని, స్థిరమని  నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. దేహాభిమానం వల్లనే కామాది వికారాలు, అహంకార మమకారాలు విజృంభిస్తాయి.  వీటిని క్రమంగా నిగ్రహంతో  నియంత్రిస్తూ,  వైరాగ్యభావాన్ని పెంచుకొని, ఆత్మవిచారణలో నిమగ్నం కావాలి. జ్ఞాన సంపన్నతతో పరిణతి చెంది, ఆత్మ సాక్షాత్కారానికి  సాధనా తత్పరత నలవరచుకోవాలని కావాలని సారాంశము*.

                                    *****

                    *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

ఆశీర్వచనం

 *ఆశీర్వచనం* 


ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం??

పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి.


భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. 


విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, 

పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, 

పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు.


యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు గో బ్రాహ్మణో శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు……… అనే ఆశీర్వచనంతో 

దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, 

గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, 

పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు.


అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా? 

అవి ఫలిస్తాయా? 

తప్పకుండా ఫలిస్తాయి. 


సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. 

ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు.


గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు – వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి. . .


అక్షింతల సంకేతం:


సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం? అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా? 

మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? 


బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట. 


బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుబానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు. 


మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.


మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఏంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ”అక్షతాన్ సమర్పయామి” అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు.


మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. 


బియ్యంలో తగినంత పసుపు, చిటికెడు కుంకుమ, తడిచీ తడవనట్ల, నాలుగు చుక్కలు నెయ్యి వేసి అక్షతలను తయారుచేస్తారు. .


       *శుభం*

రవివర్ణనమ్

 .

             ॥ రవివర్ణనమ్ ‌॥


-100- శ్లోకము :


దేవః కిం బాంధవః స్యాత్ప్రియ సుహృదథవాచార్య ఆహోస్విదర్యో


రక్షా చక్షుర్ను దీపో గురురుత 

జనకో జీవితం బీజమోజః


ఏవం నిర్ణీయతే యః కిమితి న 

జగతాం సర్వథా సర్వదోఽసౌ


సర్వాకారోపకారీ దిశతు 

దశశతాభీషు రభ్యర్థితం వః ॥



-100- ఉత్పలమాల :


దేవుడొ , బంధువో , గురుడొ ,

దేశికుఁడో , సఖుఁడో , విభుండొ , వి


శ్వావనుఁడో , ప్రదీపమొకొ , యక్షియొ ,

తాతయొ , హేతువోజమో


జీవితమంచుఁ దీర్పిడగఁ జెల్లని

వేవెలుఁగెల్ల రూపులం


గావ సదా జగంబునుపకారి

యతండిడు మీకు భద్రముల్‌✋️🤚



టీకా : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని సకలరూప

   లోకోపకారిగా చెప్పుచున్నారు..]


దేవుడొ , బంధువో , (విద్యలను నేర్పు ..) గురుడొ , దేశికుఁడో = ఉపదేశమిచ్చు జ్ఞాన బోధకుడో , సఖుఁడో , విభుండొ = అధిపతియో , < విశ్వ(..మును) , 

+ అవనుఁడో = రక్షించువాడో > = జగద్రక్షకుడో , ప్రదీపము + ఒకొ = విశిష్ట తేజోమయమైన దీపమో , 

(య)అక్షి యొ = జగములన్నిటినీ ౘూచు నేత్రమో , తాత యొ = తండ్రియో , 

హేతువు = కారణమో , + ఓజమో =

శక్తియో , జీవితమో ,  + అంచుఁ = అని , 

(దీ)తీర్పు + ఇడగఁ = తీర్మానించు / నిర్ణయించుటకు , (జె)చెల్లని = వీలు లేని ,  వే వెలుఁగు = వేయి(అనంతమైన) కిరణములవాడు - సూర్యుడు ,  

+ ఎల్ల రూపులం(న్‌) = అన్ని రూపములుగా , సదా , జగంబును , 

(గా)కావ = కాచుటకు , 

+ ఉపకారి(..యైన) , (య)అతండు , 

+ [ఇడు] మీకు , భద్రముల్‌ = శుభములు , ఇడు = ప్రసాదించును గాక ..✋️🤚



భావము : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని సకలరూప

   లోకోపకారిగా చెప్పుచున్నారు..]


దేవుడో - బంధువో - విద్యలను నేర్పు గురుడో - దేశికుఁడో - సఖుఁడో - విభుడో - జగద్రక్షకుడో - ప్రదీపమో - జగములన్నిటినీ ౘూచు నేత్రమో - తండ్రియో - కారణమో - శక్తియో - 

జీవితమో .. అని నిర్ణయించుటకు 

వీలు లేని  వే వెలుగులవాడు - సూర్యుడు అన్ని రూపములుగా సదా జగంబును కాచుటకు ఉపకారియైన అతడు మీకు శుభములు 

ప్రసాదించును గాక ..✋️🤚

శ్రీమద్భగవద్గీత

 🙏శ్రీమద్భగవద్గీత🙏

6వ అధ్యాయము 

ధ్యాన యోగము


బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః ।

అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ।। 6 ।।


బంధుః — మిత్రుడు; ఆత్మా — మనస్సు; ఆత్మనః — వ్యక్తికి; తస్య — అతని; యేన — ఎవరి చేత నైతే; ఆత్మా — మనస్సు; ఏవ — ఖచ్చితంగా; ఆత్మనా — ఆ వ్యక్తికి; జితః — జయించి; అనాత్మనః — నిగ్రహింపబడని మనస్సు కల వారికి; తు — కానీ; శత్రుత్వే — శత్రువుకి; వర్తేత — ఉండును; ఆత్మా, ఏవ —మనస్సే ; శత్రు-వత్ — శత్రువు లాగ.


భావము 6.6: మనస్సుని జయించినవారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వాడికి, మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది.


వివరణ: మనకు శత్రువులుగా అనిపించి, మనకు హాని చేయగలరేమో అన్న వారిని ఎదుర్కోవటానికి, మన ఆలోచనా శక్తి లో చాలా భాగాన్ని వెచ్చిస్తాము. వైదిక శాస్త్రాలు, అతి పెద్ద శత్రువులైన - కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, భ్రాంతి మొదలైనవి - మనలోనే ఉంటాయి, అని చెప్తున్నాయి. ఈ అంతర్గత శత్రువులు బాహ్యమైన వాటి కన్నా ఏంతో హానికరమైనవి. బాహ్య పిశాచాలు మనను కొంత సమయం వరకు బాధించవచ్చు, కానీ, మన మనస్సు లోనే ఉన్న పిశాచాలు మనం నిరంతరం దౌర్భాగ్యస్థితిలోనే ఉండేటట్టు చేయగలవు. సర్వమూ అనుకూలంగా ఉండి కూడా, తమ స్వంత మనస్సు వలన మానసిక కుంగు, ద్వేషము, ఆందోళన, బెంగ మరియు ఒత్తిడి వంటి వాటితో దౌర్భాగ్యమైన జీవితం గడిపిన ఎందరో మనకు తెలుసు.


వైదిక తత్వ శాస్త్రం, మన తలంపుల/ఆలోచనల యొక్క పరిణామాల మీద చాల ముఖ్యంగా నొక్కిచెప్పింది. వ్యాధులు అనేవి వైరస్, బ్యాక్టీరియ వలన మాత్రమే రావు, మన మనస్సులో ఉన్న చెడు ఆలోచనలు (negativities) వలన కూడా వస్తాయి. ఎవరైనా పొరపాటుగా మీ మీద రాయి విసిరితే, అది కొద్ది సేపు మనలను బాధించవచ్చు, కానీ తరువాతి రోజు దాని గురించి నీవు మర్చి పోవచ్చు. కానీ, ఎవరైనా అప్రియమైన మాట అంటే, అది మిమ్ములను ఎన్నో సంవత్సరాల వరకు బాధించవచ్చు. ఇదే ఆలోచనల యొక్క గొప్ప శక్తి. బౌద్ధ శాస్త్రంలో, ధర్మపాద (1.3) బుద్ధుడు కూడా ఈ నిజాన్ని స్పష్టంగా తెలియపరిచాడు.


"నేను అవమానించబడ్డాను! నేను నిందింపబడ్డాను ! నేను దండింపబడ్డాను! నేను దోచుకోబడ్డాను! ఈ ఆలోచనల తో నే ఉన్నవారికి దుఃఖం అంతము కాదు."


"నేను అవమానించబడ్డాను! నేను నిందింపబడ్డాను ! నేను దండింపబడ్డాను! నేను దోచుకోబడ్డాను! ఈ ఆలోచనల తో లేని వానికి కోపం తగ్గిపోతుంది."


మనలో ద్వేషమే పెంపొందించుకుంటే, మన విపరీత (negative) ఆలోచనలు, మనం ద్వేషించే వస్తువుకి కాకుండా, మనకే ఎక్కువ నష్టం కలుగ చేస్తాయి. చాలా తెలివిగా ఇలా చెప్పబడింది : "ద్వేషం/ఆగ్రహం అనేది మనం విషం తాగి ఎదుటి వాడు చనిపోవాలని కోరుకోవటం లాంటిది". సమస్య ఏమిటంటే చాలా మంది జనులు తమ యొక్క సంస్కరింపబడని మనస్సే తమకు ఎంతో హాని కలుగ చేస్తోందని తెలుసుకోరు. కాబట్టి, జగద్గురు శ్రీ కృపాలు మహారాజ్ గారు ఇలా ఉపదేశిస్తారు.


మన కో మానో శత్రు ఉసకీ సునహు జని కఛు ప్యారే (సాధన భక్తి తత్త్వం)


"ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు."


కానీ, ఆధ్యాత్మిక సాధన ద్వారా, మనస్సుని బుద్ధి యొక్క నియంత్రణ లోనికి తెచ్చినప్పుడు, దానికి మన ఉత్తమ స్నేహితుడుగా అయ్యే సామర్ధ్యం ఉంది. ఏదేని వస్తువు శక్తి ఎక్కువున్న కొద్దీ దాని దురుపయోగ ప్రమాదం కూడా ఎక్కువుంటుంది. మనస్సు అనేది మన శరీరంలో అమర్చబడిన ఉన్న ఒక అత్యంత శక్తి వంతమైన ఉపకరణం కాబట్టి అది రెండు పక్కల పదునుగా ఉన్న కత్తి లాంటిది. ఈ విధంగా, రాక్షసత్వ స్థాయికి దిగజారిన వారు కూడా తమ మనస్సు వలననే అలా అవుతారు; అదే సమయంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారు కూడా తమ పవిత్రమైన మనస్సు వలననే అలా అవుతారు. అదే ప్రకారంగా, విన్స్టన్ చర్చిల్ , రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఉన్న విజయుడైన బ్రిటిష్ ప్రధాని, ఇలా అన్నాడు: “The price of greatness is the responsibility over your every thought.” ఈ శ్లోకం లో, శ్రీ కృష్ణుడు అర్జునుడుకి, మనస్సు యొక్క హాని కలిగించే మరియు శ్రేయస్సు కలిగించే శక్తి గురించి, జ్ఞానోపదేశం చేస్తున్నాడు. తదుపరి మూడు శ్లోకాలలో, యోగారూఢుని (యోగములో పురోగతి సాధించిన వాని) యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో శ్రీ కృష్ణుడు వివరిస్తాడు.

వైకుంఠ ఏకాదశి:

 వైకుంఠ ఏకాదశి:


ఒక సంవత్సరంలో ఇరవైనాలుగు తిథులలో వచ్చే ఏకాదశులతో ధనుర్మాసంలో మార్గశీర్ష శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు. సౌరమానములో ధనుర్మాసము వచ్చినా, చాంద్రమాన పంచాంగము ప్రకారమే వైకుంఠ ఏకాదశిని అవలంబించుతారు. పరమాత్మా శ్రీ హరి దివ్య తేజస్సు ఈ పండుగ ద్వారానే వ్యక్తమౌతోంది. ఈ రోజునే రావణ సంహారము గావిస్తానని, మహావిష్ణువు బ్రహ్మకు వరమిచ్చినట్లు ప్రతీతి. అసురులైన మధుకైటభులు మరణానంతరము దివ్య రూపములు పొంది ఈ రోజు పూజ చేసిన భక్తులకు ఉత్తర ద్వారా దర్శనము చేసికొని వైకుంఠ ప్రాప్తి కలుగునట్లుగా వరమడిగితే శ్రీహరి తథాస్తు అని అనుగ్రహించాడట. ఈ రోజున నియమనిష్టలతో పూజించిన భక్తులు మోక్షమును పొందుదురు కావున ఈ రోజును మోక్షోత్సవ దినము అని కూడా అంటారు. దీనినే మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన అంశతో ఒక యువతి ఉద్భవించి మురుడు అను రాక్షసుణ్ణి సంహరించిందిట. ఆమె పేరు ఏకాదశి అని అంటారు.ఈమె పేరున ఏకాదశి వ్రతమును చేసి సుకేతుడు అను రాజు పుత్రవంతుడయ్యాడు. రాజైన రుక్మాంగదుడు, మహాభక్తుడైన కుచేలుడు, ఈ ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధించి సఫల మనోరధుడయ్యారు. అదే విధముగా ధర్మరాజు వైఖానసుడను రాజు, విష్ణువు నారాధించి కృతార్ధులయ్యారు. చాక్షుష మన్వంతరములో వికుంఠ అనే  స్త్రీకి జన్మించుటచే హరి వైకుంఠుడయ్యాడు. ఈ రోజు నియమ నిష్ఠలతో, ఉపవాస దీక్షతో, సేవించిన భక్తులు వైకుంఠ ప్రాప్తిని జన్మరాహిత్యాన్ని పొంది పరమాత్మ స్వరూపులుగా మారిపోతారు. అందువలన ఈ మహాపర్వదినాన్ని భక్తి శ్రద్దలతో ఆచరించి తరిద్దాం.     


వి. రామలింగేశ్వర రావు:9490195303

ధార్మికగీత - 114*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత - 114*

                                        *****

             *శ్లో:-త్యజ దుర్జన సంసర్గం ౹*

                   *భజ సాధు సమాగమం ౹*

                   *కురు పుణ్య మహోరాత్రం ౹*

                   *స్మర  నిత్య మనిత్యతామ్ ౹౹*

                                       *****

*భా:- మానవ జన్మ మహత్తర మైనది. పశుత్వము నుండి మానవత్వానికి, మానవత్వము నుండి మాధవత్వమునకు పయనించాలంటే  ఆధ్యాత్మిక మార్గంలో నాలుగు సూత్రాలు అవలంబించాలి. 1."త్యజ":- దుర్జనులతో సాంగత్యం  విడిచిపెట్టాలి అని అర్థము. వారి నుండి సంక్రమించిన  దురాలోచన, పరుషవాక్కు,  దుష్కర్మలు పూర్తిగా విడనాడాలి. మనోవాక్కాయిక పాపాలకు దూరంగా మెలగాలి.   2. "భజ":- సత్ పురుషులను ఆశ్రయించాలి. వారి ద్వారా  సదాలోచన, సద్భాషణము, సదాచరణ అలవరచుకొని సన్మార్గంలో పయనించాలి. వారి శుశ్రూష ద్వారా ఆత్మవిద్యను ఆర్జించాలి.    3. "కురు":-"మన్  మే రామ్ - హాథ్ మే కామ్" అన్నారు పెద్దలు. దైవప్రీతితో పాటు  తరువులు, గోవులు, నదులు, మేఘాల వలన స్ఫూర్తిని పొంది, రాత్రనక, పగలనక  త్రికరణ శుద్ధితో పరోపకార పరాయణులం కావాలి.   మానవసేవయే మాధవసేవ అని గుర్తించాలి.  4. "స్మర":- దేహము అనిత్యమని, ఆత్మ నిత్యమని, సత్యమని, స్థిరమని  నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. దేహాభిమానం వల్లనే కామాది వికారాలు, అహంకార మమకారాలు విజృంభిస్తాయి.  వీటిని క్రమంగా నిగ్రహంతో  నియంత్రిస్తూ,  వైరాగ్యభావాన్ని పెంచుకొని, ఆత్మవిచారణలో నిమగ్నం కావాలి. జ్ఞాన సంపన్నతతో పరిణతి చెంది, ఆత్మ సాక్షాత్కారానికి  సాధనా తత్పరత నలవరచుకోవాలని కావాలని సారాంశము*.

                                    *****

                    *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

వందే సంస్కృత మాతరం

 వందే సంస్కృత మాతరం 


దానాయలక్ష్మీ స్సుకృతాయ విద్యా చింతా పరబ్రహ్మ వినిశ్చయాయ l

పరోపకారాయ వచాంసి యస్య వంద్యస్త్రిలోకీ 

తిలకః స ఏకః ll


దానము కొఱకు సంపదను, పుణ్యము కొఱకు విద్యను, పరబ్రహ్మయందు లీనమగుట కొఱకు చింతను కలిగి ఎవని వాక్కులు పరోపకారము కొరకుండునో వాడు మూడు లోకములయందు తిలకము వంటి వాడు. అనగా నమస్కరింపదగిన వాడని భావము. 


శ్రీ వేలూరు రఘుపతి గారి సుభాషిత రత్నమాల నుండి.

ఆత్మవిద్య

 ఆత్మవిద్య


ముడిపదార్ధం గురించి మనకు తెలిసినట్లైతే ఆ పదార్ధంతో తయారయిన వస్తువుల గురించి తేలికగా తెలుస్తుంది. ఉదాహరణకు మట్టిని గురించి తెలిస్తే, మట్టితో తయారుచేసే

కుండలు, బాబాసలు, చట్లు, మొదలైన వస్తువులగురించి తెలుస్తుంది. అలాగే బంగారం గురించి తెలిస్తే దానితో తయారుచేసే నగల పేర్లు వేరయినా, వాటన్నింటిలో ఉండేది

బంగారమే అని తెలుస్తుంది. అదే విధంగా ఏ విషయం తెలుసుకోవటంవల్ల సర్వమూ తెలుస్తాయో, దాన్ని తెలుసుకోవాలి. ప్రతివిషయంలోనూ అంతర్గతంగా ఉండే తత్త్వాన్ని గనక తెలుసుకుంటే మిగిలిన విషయాలన్నీ తెలుస్తాయి.

నదులు తూర్పు నుంచి పడమరకు ప్రవహించినా, పడమర నుంచి తూర్పుకు ప్రవహించినా, చివరకు అవి సముద్రంలోనే కలుస్తాయి. సూర్యరశ్మికి నీరు ఆవిరిగా మారి మేఘాలరూపం ధరిస్తుంది. ఆ మేఘాలు మళ్ళీ వర్షించి నదులుగా ప్రవహిస్తాయి. ఆ నదులు మళ్ళీ సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలిసేవరకు వాటికి గంగ, గోదావరి, కృష్ణ అని వివిధరకాల పేర్లుంటాయి. కాని సముద్రంలో కలిసిన తరువాత ఆ • నదీజలాన్ని విడదియ్యలేము. అలాగే జీవించి ఉన్నంతవరకు మనిషి, పులి, సింహము, ఆవు, మేక ఇత్యాదినామాలుంటాయి. కాని మరణించిన తరువాత జీవి తన ఉనికిని కోల్పోతాడు. అన్ని జీవాత్మలూ ఆ పరమేశ్వరునిలోని భాగాలే. సృష్టి ఆరంభంకాకముందు, కృతయుగారంభంలో పరమేశ్వరుడు నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయి ఇతరులతో సంబంధం లేకుండా, తనకు సమానమైన వారుగాని,

తనకన్న అధికులుగాని లేకుండా ఏకాకిగా ఉండేవాడు. ఈ రకంగా ఉన్న పరబ్రహ్మ బిందు స్వరూపుడు. ఆ ఏకత్వం అనేకం కావాలని సంకల్పించింది. రకరకాల వస్తువులుగా, చిత్ర విచిత్ర సమ్మేళనాలతో రూపుదాల్చింది. ఘన ద్రవ, వాయు పదార్ధాలుగా మార్పు చెంది భిన్న రూపాలతో ఈ సృష్టి ఆకారం పొందింది. జీవరాశి ఉత్పన్నమయింది. సృష్టిలో భాగంగానే హకార సంజ్ఞ గలిగిన పరమేశ్వరుడు సకార సంజ్ఞ గలిగిన ప్రకృతితో

కలిసి శబళబ్రహ్మమై బ్రహ్మరంధ్రం ద్వారా మానవ శరీరంలో ప్రవేశించి, ఇంద్రియాల ద్వారా ప్రాపంచిక సుఖాలననుభవిస్తూ పంజరంలోని పక్షిలాగా, ఈ దేహంలో బంధించబడి, బయటకు పోయే మార్గం తెలియక, కొట్టుమిట్టాడుతున్నాడు. జీవాత్మ అనబడే ఈ హంసకు అగ్ని చంద్రమండలాలే - రెక్కలు

ఓంకారము - శిరస్సు

ముఖము -  జ్ఞాననేత్రము

హకారసకారాలే - పాదాలు


ఈ రకంగా పరమాత్మ అన్ని ప్రాణులలోనూ, పాలలో ఉన్న నెయ్యిలాగా ఆవరించి ఉన్నాడు. అన్ని జీవాత్మలూ ఆ పరమాత్మలోని భాగాలే. మర్రిచెట్టు చాలా పెద్ద వృక్షం. కాని దానికి కారణమైన విత్తనంలో చూస్తే ఏమీ కనిపించదు. అంటే విత్తనంలో అంత పెద్ద వృక్షానికి కారణమైనది, మనకంటికి కనిపించనంత సూక్ష్మంగా దాగి ఉన్నది. అదేవిధంగా ఆత్మ బయటకు కనిపించకుండా సూక్ష్మ రూపంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది.

అత్మకు నాశం లేదు. ముసలితనం లేదు. ఆత్మకు పాపం అంటదు. శోకం తాకదు. ఆకలి దప్పికలు ఉండవు. స్వప్నప్రపంచంలో ప్రభువులాగా విహరించే చైతన్యమే ఆత్మ సుషుప్తిలో ఆనందాన్ని అనుభవించేదే ఆత్మ. ప్రకాశబిందువు పరబ్రహ్మస్వరూపమైన చంద్రమండలం. అకారబీజం. విమర్శ బిందువు శక్తి బీజం. అగ్నిమండలం హకార బీజం. ఈ రెండింటి సామరస్యమే అహం.

ఇదే పరబ్రహ్మ స్వరూపం. పరమేశ్వరుని ప్రతిబింబమే శక్తి. అదే మాయ. అందుచేతనే శక్తి లేకుండా శివుడుగాని, శివుడు లేకుండా శక్తిగాని ఉండవు. ఇక్కడ శివశక్తులు అంటే త్రిమూర్తి ద్వంద్వంలోని వారు కాదు. పరమేశ్వరీ పరమేశ్వరులు. వీరిద్దరి కలయిక

లేనిదే స్వరూప జ్ఞానం కలగదు. అహమనేది ఆత్మరూపం. ఇదే ఆత్మమంత్రం. ఆత్మమంత్రము, హంస మంత్రము రెండూ సమాన ధర్మాలు కలిగి ఉన్నాయి. శరీరం అశాశ్వతమైనది. శాశ్వతమైన ఆత్మకు అశాశ్వతమైన శరీరం ఆవాసంగా ఉంటుంది. శరీరం ఉన్నంతకాలము ఆత్మకు గుణదోషాలు, సుఖ దుఃఖాలు అంటినట్లు, వాటితో శతమతమవుతున్నట్లు అనిపిస్తుంది. ఆత్మ శరీరంతో సంబంధం ఏర్పరచుకోవటం వల్ల జీవులకు సుఖ దుఃఖాలతో సంబంధం ఏర్పడుతుంది. మానవుడు మాసిన వస్త్రాన్ని వదిలి నూతనవస్త్రాన్ని ధరించినట్లే ఆత్మజీర్ణమైన ఈ దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని ఆశ్రయిస్తున్నది. ఆత్మ శరీరం నుంచి విడిపోతే భౌతిక బంధనాల నుండి విముక్తి కలుగుతుంది.

శ్రీవిద్య అనేది ఆత్మవిద్య. అదే బ్రహ్మవిద్య. అందులో షోడశి మహా మంత్రము మోక్ష కారకము. ఆ మంత్రాధిదేవత సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపము.


ఆత్మవిద్యయే శ్రీవిద్య. అదే మహాషోడశి అని చెప్పి 583 నుంచి 589వ నామం వరకు ఆత్మవిద్యను వివరిస్తున్నారు.


శ్రీమాత్రే నమః


ధర్మ ప్రచారం


వెంకటేశ్వర ప్రసాదు


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

అజాతశత్రువు

 .. *అజాతశత్రువు* 

🕉️🌞🌎🏵️🌼🚩


మనిషికి తోటి మనిషే శత్రువు కావడం ఆశ్చర్యమనిపిస్తుంది. సాధారణంగా పశుపక్ష్యాదుల్లో ఒకే జాతికి చెందిన జీవుల మధ్య వైరం ఉండదు. మనిషి తీరే వేరు. ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వానికి ఆర్థిక వ్యవహారాలు, అన్య స్త్రీ సంపర్కం, భూ తగాదాలు, కులాలు, మతాలు వంటి అనేక విషయాలు కారణమవుతాయి. వ్యక్తుల మధ్య శత్రుత్వమే కొన్ని సందర్భాల్లో వర్గ సమస్యగా పరిణమిస్తుంది. వర్గాలుగా చీలిన ప్రజలతో ఊరికి ఊరే శత్రుశిబిరమవుతుంది. పగలు పెరిగి కొట్లాటలు ముదిరి ప్రజల ప్రాణాలకు ముప్పు ముంచుకొస్తుంది. చిన్న సమస్య ఒక్కొక్కసారి ఊహించని ఉత్పాతమవుతుంది.


పుట్టుకతో అందరూ సమానులే. బాల్యంలో విరోధులుండరు. చిన్నపిల్లల మనసులు ద్వేషరహితం. ఎటువంటి కల్మషం ఉండదు. మనిషి ఎదుగుతూ తనతోపాటే కామ, క్రోధ, లోభ, మోద, మద,  మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను పెంచి పోషిస్తాడు. ఈ అంతశ్శత్రువుల ప్రభావమే శత్రుత్వాన్ని పెంచుతుంది. కొందరి మధ్య శత్రుత్వం వారితో అనుబంధమున్న వారినీ బలి తీసుకుంటుంది.

సీతాదేవిని అపహరించిన రావణుడికి శ్రీరాముడు శత్రువ య్యాడు. మంచి మాటలు తలకెక్కించుకోని రావణుడు రాము డితో యుద్ధానికి తలపడ్డాడు. ఆ యుద్ధంలో రావణుడితోపాటు అతడి సోదరుడు కుంభకర్ణుడు, కుమారుడు ఇంద్రజిత్తు ప్రాణాలు కోల్పోయారు. రావణుడి అకృత్యాలకు మద్దతు తెలిపినవారూ నిహతులయ్యారు.

దాయాదులపై శత్రుత్వం పెంచుకుని వారికి సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వనన్న దుర్యోధనుడి అహంకారం కౌరవ వంశ నాశనానికి కారణమైంది.

హిరణ్యకశిపుడు శ్రీహరితో శత్రుత్వం పూనాడు. శత్రుత్వం వల్ల అతడి మనసులో రోషం చెలరేగి తామసగుణం విజృంభించింది. తన ఎదుట విష్ణువును స్తుతించిన కుమారుడినే చంపాలని ప్రయత్నిస్తాడు. చివరికి విష్ణుమూర్తి నరసింహ దేవుడిగా ఆవిర్భవించి హిరణ్యకశిపుడి గుండెలు చీలుస్తాడు. హిరణ్యకశిపుడి మూర్ఖత్వమే అతడి పతనానికి దారి తీసింది.

అనుబంధాలు ధనబంధాలుగా మారిన ఆధునిక కాలంలో ఆస్తి తగాదాలు ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల మధ్యా శత్రుత్వానికి కారణమవుతున్నాయి. అనుమానం పెనుభూతమై కుటుంబాలను విడదీస్తోంది. అసూయాద్వేషాలు బంధువుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. పదవీ లాలస, అధికార దాహం ఎవరినీ దరికి రానీయవు. అహంకారం, కోపంతో రగిలేవారికి అందరూ శత్రువులుగానే కనిపిస్తారు.

శత్రువులోని మంచి గుణాలను గుర్తించగలగడం మంచివారి లక్షణం. కాస్త సంయమనం, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి... శత్రువులను మిత్రులుగా మారుస్తాయి. విభేదించినవారిని మంచిమాటలతో ఒప్పించగలగడం విజ్ఞుల లక్షణం. కోపాన్ని శాంతంతో జయించి మనసును భగవంతుడి వైపు మళ్ళించగలిగినవారికి శత్రువులుండరు. ధ్యానంతో అహంకారం పటాపంచలవుతుంది.

మానసిక ప్రశాంతత, శాంత స్వభావం, భగవత్‌ చింతన, మనో నిగ్రహం, అంతఃకరణ శుద్ధి- ఇవి  మానసిక తపస్సులని భగవద్గీత బోధిస్తోంది. అంతఃకరణలో ఈర్ష్యాద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు, హింస ప్రతిహింసలు వంటి దుర్భావనలను తొలగించుకుని- ప్రేమ, దయ, క్షమ, ఓర్పు, దానగుణాలతో వికసితం చేసుకున్న ఉత్తములు అజాతశత్రువులై మనశ్శాంతితో మనగలుగుతారు. భగవంతుడి దయకు పాత్రులు కాగలుగుతారు!


ఇంద్రగంటి నరసింహమూర్తి


🕉️🌞🌎🏵️🌼🚩

కోరికలే గుర్రాలైతే

 *కోరికలే గుర్రాలైతే...* 

  🕉️🌞🌎🏵️🌼🚩


       మనిషి మనసు కోరికలకు పుట్టిల్లు. మనసులోని తపన, ఆరాటమే కోరిక. దైనందిన జీవితంలో ఎప్పుడూ ఏదో కావాలనే అనిపిస్తూంటుంది. అది దొరికాక మరోటి. అదీ లభించాక మరోటి. ఇలా చెలమను తోడినకొద్దీ నీరూరినట్టు కోరికలు తీరినకొద్దీ మనసులోంచి కొత్తవి ఊరుతూనే ఉంటాయి. మనసు అనే కొలిమిలో కోరిక అనే ఇంధనం వేసినకొద్దీ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పెరగడమేకాని, తరగడమంటూ ఉండదు. తృప్తి ఉండదు. ఆనందం ఉండదు. సుఖశాంతులూ ఉండవు. కళ్లెం వేయకపోతే కోరికలు గుర్రాలై పరుగెడుతూనే ఉంటాయి.                     

కోరికలు ప్రాపంచికంగా కోరుకునేవి, వృత్తిరీత్యా కోరుకునేవి, కుటుంబపరంగా, సమాజపరంగా... ఇలా చాలా విధాలుగా మనసులోంచి పుడుతుంటాయి. ఉన్నతమైనవీ, అధమమైనవీ మాత్రమే కాక- కోరికలు బలమైనవీ, బలీయమైనవీ, బలహీనమైనవీ కూడా ఉంటాయి. మానసిక శాస్త్రజ్ఞుల పరిశోధనల ప్రకారం- ప్రపంచంలో నూటికి ముగ్గురే అనుకున్నది కొంతమేరకు సాధించగలుగుతున్నారట. కోరిక అవసరాన్ని గుర్తించడం, సరైన కార్యాచరణకు పూనుకోవడమే వివేకవంతుడి లక్షణం. జీవనప్రగతికి అవసరంకాని కోరికకోసం మూర్ఖంగా ముందుకు పోవడం, అసలు లక్ష్యానికి ఉపయోగపడే ఆశయాలను, కోరికలను ఉపేక్షించడం విజ్ఞత అనిపించుకోదు. 'లోకంలో అత్యంత ప్రమాదకరమైన కోరికలు మూడే మూడు... వాటి వెంటపడ్డావంటే నీకు మూడటం ఖాయం' అని పెద్దలు చెబుతుంటారు. వీటిలో మొదటిది ధనంమీది వ్యామోహం, రెండోది పరస్త్రీ వ్యామోహం, మూడోది కీర్తి మీది వ్యామోహం


ధనార్జనమీద కోరిక మితంగా ఉండాలే కాని, ఆక్రమించి, దోచి, దాచుకోవాలనే అత్యాశ ఎంతమాత్రం వాంఛనీయం కాదు. ఆఖండ సామ్రాజ్యానికి అధిపతి కావాలనే దురాశతో దాయాదులను అడవులపాల్జేసి మహాభారత సంగ్రామానికి కారణభూతుడైన దుర్యోధనుడి చరిత్ర తెలియనిది కాదు. అంతిమశ్వాస తరవాత తనకు అవసరమైన నేల ఆరడుగులేనని తెలిసీ వేలాది ఎకరాల భూమికోసం ఆరాటపడటంలోని ఔచిత్యమేమిటి?విపరీత ధనార్జనకు దాసులై తద్వారా సామ్రాజ్య విస్తరణ, పదవీ కాంక్ష, సార్వభౌమత్వం మొదలైన అత్యాశలకు లోనై చరిత్రహీనులుగా మిగిలిపోయినవారెందరో ఉన్నారు.

ఒక బాటసారి తలపైన డబ్బు మూట పెట్టుకుని, భార్యాబిడ్డలతో నదిని దాటుతున్నాడు. అకస్మాత్తుగా నదీ ప్రవాహ వేగం పెరిగింది. ఆ వేగాన్ని తట్టుకోలేక, బిడ్డను వదిలేశాడు. కొన్ని అడుగులు వేశాక, నీటి ఉరవడిని ఎదుర్కోలేక భార్యని వదిలేశాడు. డబ్బు మూట ఉంటే ఏదైనా సాధించవచ్చనుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక నీటివరద ఉద్ధృతమై- ఆ డబ్బు మూటనూ నీటిలో వదిలేశాడు. చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా చివరకు ఖాళీ చేతులతో ఒడ్డుకుచేరి ఏడవటం మొదలెట్టాడు. సంసారసాగరం ఈదాలన్నా ఇలాంటి కష్టాలే ఎదురవుతాయి. ఈ వివేచన ముందే ఉంటే ఏ సమస్యలూ ఉత్పన్నం కావు.

రెండోది పరస్త్రీ వ్యామోహం. నేడీ కోరిక ఎన్ని ప్రమాదాలకీ, ఘోరాలకీ హేతువవుతుందో ప్రత్యక్షంగా, పరోక్షంగా చూస్తున్నాం, వింటున్నాం. సీతను చెరపట్టిన రావణుడు, ద్రౌపదిని పరాభవించిన దుర్యోధనుడు, కామాంధుడైన కీచకుడు... ఆనాడు ఒక్కొక్కరే. ఇవాళ అడుగుడుగునా వేలాది కామోన్మాదులు చట్టానికీ, న్యాయవ్యవస్థకూ చిక్కకుండా తప్పించుకుపోతున్నారు. స్త్రీ కోసం ఎన్ని కలహాలు, ఎన్ని హత్యలు, ఎన్ని కుతంత్రాలు!

మూడోది కీర్తికాంక్ష. ఏమీ కృషి చేయకుండా, సేవచేయకుండా, స్వార్థపూరిత జీవితం కొనసాగిస్తూ కీర్తికోసం వెంపర్లాడటం అంటే ఎండమావుల్లో జలాన్వేషణ చేయడమే. సహజమైన యశస్సు విరజాజిలోని సురభిలా గుబాళిస్తుంది. ధర్మబద్ధుడై, నీతిమంతుడై నిస్వార్థంగా పరహితవ్రతుడైన మనిషిని ప్రతిష్ఠ తనంత తానుగా వరించి వస్తుంది. భగవంతుడి గుర్తింపు పొందినవాడు సహజంగానే చిర యశోభూషితుడవుతాడు. విదురుడు, అంబరీషుడు, రామకృష్ణ పరమహంస మొదలైనవారెందరో ఈ కోవలో చిరస్మరణీయులు. అశోకుడు, శివాజీ, అల్లూరి, భగత్‌సింగ్‌, ఝాన్సీ వంటివారెవ్వరూ కీర్తిని కోరి త్యాగాలు చెయ్యలేదు. వ్యాసుడు, వాల్మీకి, పోతనవంటి మహానుభావులు 'విశ్వశ్రేయఃకావ్యమ్‌' అన్న సదాశయంతోనే సాహితీ సమారాధన చేశారు. త్యాగయ్య, అన్నమయ్య, గోపన్న భక్తి తత్పరతతో సప్తస్వర సమార్చన చేశారు. అవినీతితో, దొడ్డిదారిలో అధికారాలు, న్యాయకత్వాలు చేపట్టి పదిమందీ బ్రహ్మరథం పట్టాలనుకునే మనస్తత్వం పోవాలి. రుజువర్తనతో నిష్కళంక ప్రజాసేవ ద్వారా మాన్యత పొందడం సాధ్యమని గ్రహించాలి.


చిమ్మపూడి శ్రీరామమూర్తి 


🕉️🌞🌎🏵️🌼🚩

తాపత్రయాలు

 తాపత్రయాలు లేని స్థితే ముక్త స్థితి.


🍁🍁🍁🍁


తాపం అంటే దుఃఖం, త్రయం అంటే మూడు. త్రి విధ దుఃఖాలే తాపత్రయం, తాపాలు మూడు రకాలు. 


1) ఆధ్యాత్మిక తాపం:


    మనలోని కామ, క్రోధ, లోభ, మద, మోహ,మాత్సర్యాలనే అరిషడ్వర్గాల వలన కలిగే బాధలనే 'ఆధ్యాత్మిక' తాపాలంటాం. 

ప్రతి మనిషికి ఉండే బాధల మొత్తంలో 90% ఈ విధంగా ఎవరికి వారు కల్పించుకుంటున్న బాధలే.


2) ఆది భౌతిక తాపం:


     ఇతర ప్రాణికోటి వలన కలిగే తాపాలని 'ఆది భౌతిక తాపా'లంటారు.  ఇతరుల అజ్ఞాన, అక్రమ చర్యల వలన మనకు కలిగే బాధలు అన్నమాట.

 ప్రతి మనిషికి 9% బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.


3) ఆది దైవిక తాపం:


     ప్రకృతి సహజమైన మార్పుల వలన కలిగే తాపాలని 'ఆది దైవిక తాపాలు' అంటాం.

ఉదాహరణకు :  అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు మొదలైనవి.  1% బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.


తాపత్రయాలు లేని స్థితే ముక్త స్థితి.  

ఆత్మ జ్ఞానం వల్లనే ముక్తి సంప్రాప్తిస్తుంది.



🌸జై శ్రీమన్నారాయణ🌸

🍁🍁🍁🍁

ఎవరిని అడగాలి

*ఎవరిని అడగాలి? -- చందమామ కథలు*


*సూర్యం, చంద్రం బాల్యస్నేహితులు. ఇద్దరూ ధర్మవరంలోని జ్ఞానానంద విద్యాలయంలో చదువుకున్నారు. సూర్యం ఉపాధ్యాయవృత్తిని చేపట్టాడు. చంద్రం అదే ఊళ్ళోని జమీందారు దివాణంలో ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులే గాని, ఒక విషయంలో మాత్రం భిన్న ధ్రువాలుగా ఉండేవారు. సూర్యం ఏ విషయంలోనైనా నలుగురితో చర్చించిగాని, ఒక నిర్ణయానికి వచ్చేవాడు కాదు.*


*ఒకవేళ తనే స్వయంగా ఒక నిర్ణయం తీసుకున్నా, ఆ విషయం సరైనదే అని ఎదుటివారు ఒప్పుకుంటే తప్ప అతనికి తృప్తి వుండేది కాదు. అయితే, చంద్రం ఏ విషయాన్నయినా ఒకటికి నాలుగుసార్లు తనే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేవాడు. ఆ తరవాత ఎవరు ఏం చెప్పినా, చివరకు తప్పు పట్టినా ఒప్పుకునేవాడు కాదు. ఒక విషయాన్ని పదిమందితో చర్చించడం వల్ల గందరగోళం తప్ప, పెద్ద ప్రయోజనం ఒరగదని అతడి దృఢవిశ్వాసం. ఇద్దరు స్నేహితులూ కనీసం వారానికి ఒక్కసారయినా కలుసుకునేవారు.*


*ప్రతి శనివారం సాయంకాలం ఊరికి ఉత్తరంగా ఉన్న చిన్న కొండపై వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయానికి వెళ్ళి వచ్చేవారు. కొండ దిగుతూ ఆ వారంలో జరిగిన విశేషాలు, మంచిచెడ్డలు మాట్లాడుకోవడం వాళ్ళ అలవాటు. అలా ఒక శనివారం మిత్రులిద్దరూ స్వామి దర్శనం కోసం కొండ మెట్లెక్కుతూండగా ఎదురుపడ్డ ఒక పెద్దమనిషి, ‘‘ఆలయం తలుపులు మూసేశారు. పూజారి లేరు,'' అని చెబుతూ కిందికి దిగి వెళ్ళాడు. ‘‘అరరె, ఇంత… దూరం వచ్చి వృథా అయిపోయిందే,'' అంటూ కంగారుపడసాగాడు సూర్యం. ‘‘ఎవరో చెప్పిన మాటవిని అలా బెంబేలు పడతావెందుకు?'' అన్నాడు చంద్రం.*


*‘‘ఇంకెవరినైనా అడుగుదాం,'' అంటూ ఎదురుపడ్డ ఇంకో వ్యక్తిని ఆపి, ‘‘ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయా?'' అని అడిగాడు సూర్యం. ‘‘తెలియదు బాబూ,'' అంటూ వెళ్ళి పోయాడా వ్యక్తి. ‘‘ఇంతదూరం రానే వచ్చాం. వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా? వచ్చేపోయేవాళ్ళను ఆరా తీయడం దేనికి?'' అంటూ ముందుకు వెళ్ళాడు చంద్రం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే, ఆలయం తలుపులు తెరిచే ఉన్నాయి.*


*స్వామి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చారు మిత్రులు. ‘‘చూశావా సూర్యం? ఎవడో, ఎందుకు చెప్పాడో ఏమో. గుడి తలుపులు తెరిచే ఉన్నాయి కదా. అందుకే ఎదుటివాళ్ళు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మకూడదు. సొంతబుద్ధితో ఆలోచించాలి. అంతేకాదు; ఎవరిని అడగాలి? ఎవరిని అడగకూడదు అన్న విషయంలోనూ జాగ్రత్త వహించాలి,'' అన్నాడు చంద్రం. అంతలో మెట్లపై కూర్చున్న బిచ్చగాడొకడు, ‘‘ధర్మం చేయండి, బాబూ,'' అన్నాడు. సూర్యం భిక్షాపాత్రలో పావలా వేశాడు.*


*దాన్ని చూసిన బిచ్చగాడు, ‘‘ధర్మప్రభువులు లోగడ రూపాయి వేసేవారు. ఇప్పుడు పావలా వేశారేమిటి?'' అన్నాడు. ‘‘అవును, ఆ రోజుల్లో నాకు పెళ్ళికాలేదు. ఒంటరివాణ్ణి. ఖర్చుల్లేవు. రూపాయి వేసేవాణ్ణి. పెళ్ళయ్యాక ఇంటి బాధ్యతలు పెరిగాయి. అందువల్ల అర్ధరూపాయి వేసేవాణ్ణి. ఇప్పుడేమో పిల్లలు చదువుకుంటున్నారు. రేపు వాళ్ళకు పెళ్ళిళ్ళూ అవీ చేయాలి కదా? అందుకనే పావలా వేస్తున్నాను.*


*నా నిర్ణయం సరైనదే కదా?'' అని అడిగాడు సూర్యం బిచ్చగాణ్ణి. ‘‘అంటే, నాకు చెందవలసిన డబ్బుతోనే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నారా బాబూ?'' అన్నాడు బిచ్చగాడు. ఆ మాటకు సూర్యం నిర్ఘాంతపోయాడు. ‘‘చూశావా సూర్యం! ఏదైనా అభిప్రాయం అడగాలన్నా అర్హులైనవారినే అడగాలి. లేకుంటే ఇలాంటి వ్యాఖ్యలు వినక తప్పదు,'' అన్నాడు చంద్రం విరగబడి నవ్వుతూ.*

బుద్ధిబలం

 💦 *నీతి కథలు - 238*


*బుద్ధిబలం*


ఒక గ్రామంలో రాముడు, భీముడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. భీముడు పేరుకు తగ్గట్టుగానే ఎత్తుగా, బలంగా ఉండేవాడు. రాముడు పొట్టిగా, సన్నగా ఉండేవాడు. కాని తెలివైనవాడు. ఒకరికి కండబలం ఉంటే మరొకరికి బుద్ధిబలం ఉంది. ఒకరోజు వారిద్దరూ పొరుగూరి సంతకు వెళ్ళి తిరిగి రాసాగారు. ఒక అడవి పక్కనుండి నడుచుకుంటూ వస్తూంటే వారికి ఒక చిన్న చేతిసంచి దొరికింది. ఆ సంచిని తెరిచిచూస్తే అందులో ఎంతో విలువైన వజ్రాలు ఉన్నాయి. ‘‘మనం చాలా అదృష్టవంతులం. ఈ వజ్రాలతో మన దారిద్య్రం తీరిపోతుంది,’’ అన్నాడు భీముడు సంతోషంగా.


‘‘నిజమే కానీ, మనం ఊరు చేరేవరకు వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దారిలో దొంగలు దాడి చేస్తుంటారని విన్నాను’’ అన్నాడు రాముడు.


‘‘భయపడకు మిత్రమా! నా గురించి నీకు తెలియదా? ఎంతమంది వచ్చినా నా ముందు తోక ముడుచుకుని పారిపోవాల్సిందే!’’ అంటూ భీముడు మీసం దువ్వాడు.


ఆ వజ్రాలను భీముడు తన సంచిలో పెట్టుకుని దానిని జాగ్రత్తగా పట్టుకున్నాడు. కొంతదూరం వెళ్ళాక వాళ్లు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగారు. ఇద్దరికీ కాస్త కునుకు పట్టింది. అలా ఎంతసేపు నిద్రపోయారో వాళ్లకి తెలీదు. ఇంతలో ఎవరో వచ్చిన అలికిడి విని కళ్ళు తెరిచారు. ఎదురుగా ముగ్గురు దొంగలు నిలబడి ఉన్నారు.


‘‘మర్యాదగా మీ దగ్గరున్నదంతా ఇచ్చి ప్రాణాలు రక్షించుకోండి’’ కత్తి చూపిస్తూ కరకుగా అన్నాడొకడు. రాముడు వణికిపోతూ ‘‘నా దగ్గర ఏమీ లేవు. నా కూరగాయల సంచి ఉంది తీసుకోండి’’ అన్నాడు.


భీముడు ‘‘ఒరేయ్! నా దగ్గరున్న ఈ సంచిలో వజ్రాలున్నాయి. దమ్ముంటే రండిరా’’ అన్నాడు సంచిని వారికి చూపిస్తూ.


దొంగలు భీముడుతో కలబడ్డారు. భీముడు ఒంటి చేత్తోనే వారిని మట్టి కరిపించాడు. అయితే అందులో ఒక దొంగ చాలా నేర్పుగా అతని చేతిలో ఉన్న సంచి లాక్కుని పారిపోయాడు. భీముడు తేరుకునేలోపు మిగతా దొంగలు కూడా పరిగెత్తారు. వజ్రాలు పోయాయని భీముడు బాధ పడసాగాడు. అప్పుడు రాముడు ‘‘బాధపడకు, వజ్రాలు మన దగ్గరే ఉన్నాయి. నువ్వు నిద్రిస్తున్న సమయంలో నీ సంచిలోని వజ్రాలను తీసి వాటి స్థానంలో కొన్ని రాళ్లు పెట్టాను. వజ్రాలను నా కూరగాయల సంచి అడుగున దాచాను,’’ అంటూ తీసి చూపించాడు. కండబలంకంటే బుద్ధిబలం గొప్పదని భీముడు ఒప్పుకున్నాడు. తరువాత స్నేహితులిద్దరూ ఆనందగా ఇంటిదారి పట్టారు.

              💦🐋🐥🐬💦

ఆశీర్వచనం

 *ఆశీర్వచనం* 


ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం??

పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి.


భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. 


విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, 

పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, 

పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు.


యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు గో బ్రాహ్మణో శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు……… అనే ఆశీర్వచనంతో 

దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, 

గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, 

పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు.


అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా? 

అవి ఫలిస్తాయా? 

తప్పకుండా ఫలిస్తాయి. 


సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. 

ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు.


గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు – వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి. . .


అక్షింతల సంకేతం:


సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం? అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా? 

మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? 


బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట. 


బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుబానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు. 


మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.


మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఏంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ”అక్షతాన్ సమర్పయామి” అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు.


మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది.


బియ్యంలో తగినంత పసుపు, చిటికెడు కుంకుమ, తడిచీ తడవనట్లు కొన్ని నీళ్ళు, నాలుగు చుక్కలు నెయ్యి వేసి అక్షతలను తయారుచేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారుచేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి.


       *శుభం*

కథ

 *✍🏼 నేటి కథ ✍🏼*



*నిదానమే ప్రధానం:*



ఒక ఊరిలో రంగా అనే యువకుడు ఉండేవాడు. అతడు బాధ్యతలు లేకుండా, తిరిగే దుందుడుకు స్వభావం గలవాడు. రంగా భవిష్యత్తును గురించి అతని తెల్లిదండ్రులు బాధపడసాగారు.


అదే ఊరిలో ఉండే ఒక వర్తకుడు రైతుల దగ్గర కొబ్బరికాయలు కొని పట్నంలో అమ్మేవాడు. రంగా తండ్రి ఆ వర్తకుడిని బ్రతిమిలాడగా, ఆ వర్తకుడు రంగాకి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.


ఆ వర్తకుడు రంగాను పిలిచి దగ్గర్లోని పట్టణంలో కొబ్బరికాయలు అమ్ముకుని రమ్మని పంపించాడు. సరేనన్న రంగా కొబ్బరికాయలను గుర్రపుబండిలో నింపుకుని పట్టణంవైపు బయల్దేరాడు. పట్టణానికి దగ్గరి దారిలో వెళ్దామనుకున్నాడు. దారిలో అతనికి ఒక బాలుడు కలిశాడు. రంగా ఆ బాలుణ్ణి "బాబూ! ప్రధాన రహదారిని చేరుకునేందుకు ఇంకా ఎంతసేపు పడుతుంది?" అని అడిగాడు, దానికి ఆ అబ్బాయి - "నెమ్మదిగా వెళ్ళు, పదిహేను నిమిషాల్లో చేరుకుంటావు, కాని వేగంగా వెళ్తే మాత్రం కనీసం గంట పడుతుంది" అని బదులిచ్చాడు.


రంగాకి ఆ అబ్బాయి మాటలు అర్ధంకాలేదు. అతను అత్యంత వేగంగా బండిని ముందుకు దూకించాడు. కొద్ది దూరం ప్రయాణించగానే బండి చక్రం ఒకటి రాయి తగిలి ఇరుక్కుపోయింది. ఆ కుదుపుకు కొబ్బరికాయలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. అవన్నీ తీసి బండిలో ఎక్కించేందుకు రంగాకి చాలా సమయం పట్టింది. ఆ అబ్బాయి చెప్పిన మాటలు రంగాకి అప్పటిగ్గాని అర్ధంకాలేదు.


ఆ సంఘటనలో రంగా తన జీవితానికి సరిపడా గునపాఠం నేర్చుకున్నాడు. ఆ రోజు నుండి రంగా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఏ పనిచేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయసాగాడు. 



*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

జాతీయం

 *🗣నేటి జాతీయం🤔*



*రంగు పులమటం*



కల్పించి చెప్పటం, మోసం చేయటం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. సహజసిద్ధంగా ఉన్న రంగు కాక ఒక వస్తువుకు కృత్రిమంగా మరో రంగు వేస్తే అంతకుముందున్న రంగు మరుగున పడుతుంది. తెలుపు రంగు స్వచ్ఛతకు, నలుపు రంగు మురికికి ఉదాహరణలుగా చెప్పుకోవటం మానవ సమాజంలో అలవాటుగా ఉంది. స్వచ్ఛంగా నీతినిజాయితీలతో ఉన్న వ్యక్తిని తెల్లరంగుకు ఉదాహరణగా తీసుకుంటే అతడి మీద కసికొద్దీ అతడికి దుర్మార్గాలను అంటకట్టడం, చెడ్డ మనిషని ప్రచారం చేయటం అనేది నల్లరంగు పులమటానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఈ భావంతోనే రంగు పులమడమంటే మంచి వ్యక్తిని చెడువ్యక్తిగా ప్రచారం చేయడం అనే అర్థం వ్యాప్తిలోకి వచ్చింది.

ఆణిముత్యం

 *💎నేటి ఆణిముత్యం💎*



ఆపగాలి వెంట అడవుల వెంటను

కొండరాళ్ల వెంట గొడవ నేల

ఉల్లమందె శివుడటుండుట తెలియరు

విశ్వదాభిరామ వినురవేమ


*భావం :*


పుణ్య తీర్థాలంటూ క్షేత్రాలంటూ నదీ తీరాలకు తరలి వెళ్లడమెందుకు? అరణ్యాల్లో సంచరించడమెందుకు? కొండల్లో ఆయాస పడడమెందుకు? శివుడు నీ శరీరం లేదా హృదయంలోనే ఉన్నాడు కదా! బయట వెతికి గందరగోళానికి గురి కావటమెందుకు అని ప్రశ్నిస్తున్నాడు వేమన. ఒక తాత్త్విక స్థాయిలో తీర్థ యాత్రలను నిరుత్సాహపరుస్తూ వేమన అనేక పద్యాలు చెప్పాడు. వాటిలో ఇది మరొక మంచి రత్నం.


ఆపగాలి అంటే (ఆపగ+ఆలి) నదుల సమూహం అంటే వేణీ సంగమం. ఆలి (ఆళి) అంటే వరుస లేదా సమూహం. ఆపగ అంటే నది కావొచ్చు, యేరు కావొచ్చు. అప్ అంటే నీరు. ఆపగ అంటే నీటితో గమించేది, అంటే వెళ్లేది అని అర్థం, ప్రవాహమన్న మాట! ఆపగాలి అనే సమాసం నాకు తెలిసినంతవరకు ఎవరూ వాడినట్టు లేదు.


కొత్త సమాసాలు కూర్చటం మహాకవుల లక్షణం. uninvolved constructions అంటారు ఇట్లాంటి వాటిని. ‘గొడవనేల’ అంటున్నాడు వేమన. గొడవ అంటే మనకు తెలిసిందే. ఇబ్బంది, అలజడి అంటూ ఇంకా సందర్భాన్ని బట్టి ఎన్నో ఛాయలు. కన్నడంలో ‘గొడవె’ అంటే గందరగోళం.0

‘నీవు చదివింతు వనుచు నన్నియును విడిచి

బిచ్చమెత్తంగ రాదుగా బేల తపసి

కడవ నాడకు చాలు నీ గొడవయేల

వెజ్జుదనమేల యని మది లజ్జవొడమి’ అనేది ప్రయోగం.

ఉల్లమంటే హృదయం.


తీర్థాలు సాధారణంగా నదుల, యేరుల దగ్గర వెలసి ఉంటాయి. త్రివేణీ సంగమం, ఏడు పాయల దుర్గ ఇట్లాంటివి. కొండలపైన అరణ్యాల్లో వెలసిన శ్రీశైలం, తిరుమల, సింహాచలం, అహోబిలం లాంటివి క్షేత్రాలు. లోపల భక్తి లేనప్పుడు వీటి సందర్శనం వల్ల అంత ప్రయోజనం లేదంటున్నాడు వేమన. ‘చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా!’ అన్నాడు గతంలో. ఈ పద్యంలో శివుడంటే శివుడే కానక్కరలేదు. దేవుడు, పరమేశ్వరుడన్నమాట! అంతా నీలోనే ఉంది, బయట దొరికేది స్వల్పం. అంతా తిరిగి మళ్లీ నువ్వు నీలోకి రాక తప్పదు అని సారాంశం.



*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

రవిదాస్ జయంతి*

 *నేడు సంత్ రవిదాస్ జయంతి*


*వ్యక్తిని గానీ , సమాజంలో గానీ మూఢ నమ్మకాలు బలంగా ఆవరించినప్పుడు సత్యాసత్యాలను గుర్తించడం కష్టమైపోతుంది.గుడ్డి భక్తి , గుడ్డి నమ్మకాలు , దురాచారాలు సమస్తమైన చెడులకు నిలయం. సత్యం గురించి వినడం కన్న స్వయంగా అనుభవించడం శ్రేయస్కరం , వాంఛనీయం . ఎప్పుడైతే మన అంతఃకరణాలు మరియు కళ్ళు స్వయాన అనుభవిస్తాయో అప్పుడే ఆ అనుభవాన్ని నిజమైన సత్యంగా భావించాలి . స్వంత అనుభవంలోనే నిజమైన అనుభూతులు ఉంటాయి.*


*మద్యాన్ని గంగాజలంతో తయారు చేసిన దానిని స్వీకరించరాదు.*


*మనిషి సుఖంగా ఉండేది ఒకటి స్మశానం లో రెండు సొంత రాజ్యం లో...*


*సంత్ రవిదాస్*

🌹🌹💐💐💐☸☸


*భగంతునికి అందరూ సమానులే--సంత్ రవిదాస్*

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


*‘కులం కాదు గొప్పది, కులం కన్నా కర్తవ్యం ప్రధానం.. ధర్మమే సత్యం, మదిలో నింపుకోండి ధర్మాన్ని..ధర్మం- కర్మం రెండూ సమానం..’*

*‘సృష్టి జరిగింది ఒకే జ్యోతితో.. అందరూ దేవుని పుత్రులే, కులం-ప్రాంతం బేధం లేదు.. అందరూ సమానమే.. బ్రాహ్మణులైనా, చమారులైనా ఎక్కువ, తక్కువలు లేవు..’*

*‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనా వారి పవిత్ర కర్మలే శ్రేష్టత్వాన్ని నిర్ణయిస్తాయి..’*


*సంత్ రవిదాస్ బోధనలివి*

____________________________


*ఉత్తర భారత దేశంలో ఏడు శతాబ్దాల క్రితం భక్తి ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఆధ్యాత్మిక యోధుడు, కర్మయోగి సంత్ రవిదాస్.. పేదరికంలో అందులో చర్మకార (చమార్) వృత్తిని నిర్వహిస్తూ గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, మార్గదర్శకునిగా నిలిచారు.*

*భక్తికి, జ్ఞానానికి కులం ప్రధానం కాదు. పెద్దగా శాస్త్రాలు చదువాల్సిన అవసరమే లేదు.* *సన్మార్గంతో భగవంతున్ని చేరుకోవచ్చని నిరూపించారు సంత్ రవిదాస్.*

*సంత్ రవిదాస్ ఎప్పుడు జన్మించారనే విషయంలో భిన్నవాదనలున్నాయి. 1377 లేదా 1399 సంవత్సరంలో ఆయన జన్మించాడని అంటారు. మరి కొందరు 1450లో జన్మించారని చెబుతున్నారు. పవిత్ర కాశీ నగరానికి సమీపంలోని సీర్ గోవర్ధన్‌పూర్‌కుచ గ్రామంలో మాఘ పూర్ణిమ నాడు  ఖల్‌సాదేవి, సంతోస్ దాస్ దంపతులకు రవిదాస్ జన్మించారు. రవిదాస్ పేరును రైదాస్ అని కూడా చెబుతారు. చమార్ కులంలో జన్మించిన రవిదాస్ చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక జీవితం పట్ల మక్కువ పెంచుకున్నారు. గంగానదిలో స్నానం చేసి, అక్కడ సాధుసంతులు చేసే బోధనలను శ్రద్దగా ఆలకించేవారు.. తాత్విక, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన రవిదాస్ భగవంతున్ని స్థుతిస్తూ కీర్తనలు, భజనలు ఆలపిస్తూ అందరినీ ఆకట్టుకునేవారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం ఆయన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసేవి.. రవిదాస్ ధోరణి పట్ల ఆందోళన చెందాడు ఆయన తండ్రి పెళ్లి చేస్తే కానీ దారిలోకి రాడని భావించారు. అలా లోనాదేవితో చిన్న తనంలోనే వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్నా ఆధ్యాత్మిక మార్గాన్ని వీడలేదు రవిదాస్. లోనాదేవి తన భర్తను చక్కగా అర్ధం చేసకుంది. ఇద్దరూ కుల వృత్తి అయిన చెప్పులు కుట్టుకుంటూ దైవ చింతనను కొనసాగించారు..*


*రవిదాసు ఎంతో శ్రద్దగా పాదరక్షలు కుట్టేవాడు. అయితే దాన్ని ఆదాయవనరుగా భావించలేదు. తీర్థయాత్రులు చేసే సాధుసంతులకు ఉచితంగా ఇచ్చేవాడు.. దీంతో భక్తి గడవడం కష్టమైంది. దుర్భర దారిద్ర్యంలో ఉన్నదాంట్లోనే సరి పెట్టుకుంటూ భక్తి మార్గంలో పడిచేవాడు రవిదాస్. క్రమంగా రవిదాస్ కీర్తి అందరికీ తెలియడం మొదలైంది.. పేదరికంలో ఉన్న ఆయన్ని ఆదుకోవాలని భావించారు సంత్ ప్రేమానంద్.. రవిదాసుకు పరుసవేదిని బహుకరించారు. దానితో ఇనుమును తాకితే బంగారం అవుతుందని, ఆర్ధిక పరిస్థితుల నుండి గట్టెక్కవచ్చని సూచించాడు. రవిదాస్ దాన్ని తీసుకోడానికి ఇష్టపడలేదు. ప్రేమానంద్ వత్తిడితో అయిష్టంగానే తీసుకొని చూరులో పెట్టేశాడు. రవిదాస్ దృష్టి దానిపై పడనేలేదు.. తన జీవితం ఎప్పటిలాగే గడుస్తూ వచ్చింది. కొంత కాలం తర్వాత సంత్ ప్రేమేనంద్ మరోసారి రవిదాస్ పూరిపాకకు వెళ్లారు. రవిదాస్ పేదరికం నుండి గట్టెక్కి ఉంటాడని భావించారాయన. కానీ పరుసవేది పెట్టిన చూరులోనే అలాగే భద్రంగా ఉంది. రవిదాస్ నిరాడబరమై జీవితంలోనే అలౌకిక ఆనందం పొందుతున్నాడని గ్రహించి ఆయనకు సవినయంగా నమస్కరించారు ప్రేమానంద్..*


*చిత్తోడ్ గడ్ రాజపుత్ర యోధుడు రాణా సాంగా తల్లి రతన్ కువారీకి రవిదాసు గురుంచి తెలుసుకుంది. తన సైన్యంతో సహా వచ్చి రవిదాస్ పూరిపాక ముందు సవినయంగా మోకరిల్లి తనను శిష్యురాలిగా స్వీకరించమని కోరింది. రతన్ కువారీ కోరిక మేరకు రవిదాసు, ఆయన సతీమణి లోనాదేవి చిత్తోడ్ గడ్ వెళ్లారు.. అక్కడ వారిని ఘనంగా సత్కరించి ఏనుగు అంబారీపై ఊరేగించారు.. రాణా సాంగా భార్య మీరాబాయి కూడా రవిదాస్ శిష్యురాలిగా మారిపోయారు. రవిదాస్ ఖ్యాతి నలు దిశలా వ్యాపించింది.. కాశీ మహారాజ దంపతులతో సహా ఎందరో రాజులు, రాణులు, సాధుసంతులు రవిదాస్ బోధనల పట్ల ఆకర్శితులై ఆయన శిష్యులుగా మారారు. సంత్ రవిదాస్ చిత్తోడ్ లోనే తన 120వ ఏట చైత్రశుద్ద చతుర్ధశి నాడు భగవంతునిలో లీనమైపోయారు.*


*కామ్ కర్తే రహో.. నామ్ జప్తే రహో.. భుక్తి కోసం పని చేస్తుకుంటూనే ఆధ్యాత్మిక చింతనను ఎలా అనుసరించాలో ఆచరణలో చూపించారు సంత్ రవిదాస్.. రవిదాస్ బోధనలు కీర్తనల రూపంలో దోహాలుగా ప్రసిద్ది కెక్కాయి. సమాజంలో కులం, అంటరానితనం, దురాచారాలను తీవ్రంగా నిరసించారాయన. భగవంతున్ని చేర్చేది కేవలం భక్తి మార్గమే అని, కులం కన్నా గుణమే ప్రధానం అని బోధించారు. దేవునికి అందరూ సమానమే అని చాటి చెప్పారు. మొఘలుల పాలనలో దుర్భర కష్టాల్లో ఉన్న హిందూ సమాజంలో ఐక్యత సాధించడంలో రవిదాస్ బోధనలు దోహదపడ్డాయి. సంత్ రవిదాస్ బోధనలను సిక్కుల ఐదో గురువు అర్జున్ దేవ్ పవిత్ర గ్రంధం గురు గ్రంధసాహిబ్ లో చేర్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాను రాసిన "అస్పృశ్యులు ఎవరు ?" అనే గ్రంథాన్ని సంత్ రవిదాస్ కు అంకితం ఇచ్చారు. సంత్ రవిదాస్ బోధనలు ఉత్తర భారత దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆయన సందేశం నుండి స్పూర్తి పొందారు.. రవిదాస్ సూచించిన మార్గం అందరికీ, ఎప్పటికీ, అన్ని వేళలా అనుసరనీయం.*

ఆశ్చర్యకర విషయాలు

 *జపాన్ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలిసాయిట* 👇


1) కడుపులో *గేస్* సమస్య ఆహార  లోపాల వలన కంటే, మానసిక ఒత్తిడి వలన ఎక్కువ వస్తుందంట !


2) *అధికరక్తపోటు* సమస్య ఉప్పు ఎక్కువగా తినే వారికంటే ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోని వారిలో ఎక్కువట !


3) *చెడుకోలెస్టిరాల్* సమస్య కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలో ఎక్కువట !


4) *మధుమేహం* సమస్య తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే, అధికస్వార్ధం, మొండి తనం  ఉన్నవారిలో నే ఎక్కువట !


5)*ఆస్ధ్మా* సమస్య ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతివిచారం వలన  ఊపిరితిత్తుల లోవచ్చే మార్పుల వలన ఎక్కువట!


6) *గుండెజబ్బులు* ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాలు కంటే, ప్రశాంతత లోపం వలన గుండె కొట్టుకోవడం వలన వచ్చే మార్పుల వలనే ఎక్కువట!


మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ....👇

50% ఆధ్యాత్మికత లోపంవలన;

25% మానసిక కారణాల వలన;

15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపం వలన;

10% శారీరక కారణాల వలన;


*అందుచేత ఆరోగ్యంగా వుండాలంటే*👇

>స్వార్ధం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, పైగా, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం, వంటి వ్యతిరేక   భావాలను వదిలించుకోవాలని, అలాగే ...

>కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధ్ం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియుత, సంతోషము , సానుకుల దృక్పథం వంటి భావనలు అలవర్చుకోవాలంటున్నారు వారు .సర్వే జనా శుఖినోభవంతూ

భగవంతుడు

 *మనం దేవుని గురించి మాట్లాడుకునే సమయంలో భగవంతుడు అని సంభోదిస్తాం.* 


ఐతే మన పురాణముల, శాస్త్రముల ప్రకారం వారు ఈ "భగవంతుడు" కు అర్ధం చెప్పే ప్రయత్నం చేసారు. 


అది

భగవంతుడు = భగ+ వంతుడు = భగమును కలిగి ఉన్నవాడు.


మరి భగం అంటే?


ఐశ్వరస్య సమగ్రస్య వీర్యస్య యశస్యః శ్రీయః

జ్ఞాన వైరాగ్య యొస్చాపి షణ్ణాంవర్గో భగస్మృతః


భగము అనగా ఆరు గుణముల సమాహారం. ఆ ఆరు గుణములు


జ్ఞానం 

శక్తి 

బలం 

ఐశ్వర్యం 

వీర్యం 

తేజస్సు 


ఐతే మనకు కూడా  అన్ని గుణములు కొంతో గొప్పో ఉన్నాయి కదా! ఐతే మనం కూడా  భగవంతులమేనా మరి!  


నిజమే అందుకనే ప్రతి ప్రాణిలోనూ భగవత్ స్వరూపాన్ని చూసే అలవాటు చేసుకోవాలి.


ఐతే ఈ సర్వ సృష్టిలో మనకు మించిన వారు ఎవరో ఒకరు, ఎక్కడో ఒక చోట ఉంటారు. 


అలా అందరికన్నా అన్ని గుణములలో సర్వ ఉత్తముడు ఎవరో వాడే *భగవంతుడు.*

దేవుడి ఇంటికి సరైన దారి

 *దేవుడి ఇంటికి సరైన దారి* - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

〰〰〰〰〰〰〰〰

🔼 *'రామాపురం'* అనే ఊళ్ళో రైలు దిగండి.

⏺  *'నమ్మకం'* అనే రిక్షాని మాట్లాడుకోండి. 

🔼 *భక్తి* అనే పేటలోకి తీసుకెళ్ళమనండి.

 ⏺ *పాపం* అనే డెడ్‌ ఎండ్‌ వీధి వస్తుంది. 

🔼 *పుణ్యం* అనే దాని ఎదురు సందులోకి ముందుకి సాగండి.

 ⏺ *ప్రార్ధన* అనే వంతెనని దాటండి. 

🔼 *కర్మ* అనే సర్కిల్‌ వస్తుంది. 

⏺ *దుష్కర్మ* అనే రెడ్‌లైట్‌ అక్కడ వెలుగుతూండవచ్చు.

 🔼 *సుకర్మ* అనే పచ్చలైటు వెలిగాక ముందుకి సాగండి. 

⏺ *భజనమండలి* అన్న బోర్డున్న కుడి రోడ్డులోకి మళ్ళండి. 

🔼అక్కడ రోడ్డు నాలుగు రోడ్లుగా చీలుతుంది.

 ⏺మొదటి మూడిటి పేర్లు - *అసూయ స్ట్రీట్‌, ద్వేషం సందు, ప్రతీకారం వీధి.* 

🔼వాటిని వదిలి నాలుగో సందులోకి తిరగండి. దానిపేరు *సత్సంగం* వీధి. 

⏺పక్కనే కనబడే *వద0తుల* వీధిలోకి వెళ్ళకండి. అది వన్‌వే రోడ్డు. 

🔼కాస్తంత ముందుకు వెళ్ళాక ఓ జంక్షన్‌ వస్తుంది. 

అక్కడ ఎడమవైపు రోడ్డు పేరు *వ్యామోహం.* 

⏺కుడివైపు రోడ్డు పేరు *వైరాగ్యం.* వైరాగ్యం వీధిలోకి వెళ్ళండి. 

🔼ఎదురుగా మీకు *కైవల్యం* అనే మరో చౌరస్తా కనిపిస్తుంది.

 ⏺ *దయగల హృదయం -  భగవన్నిలయం* అన్న బోర్డున్న తెల్లరంగు ఇల్లు కనిపిస్తుంది. 

☯గేటు దగ్గరున్న *ముక్తి* అనే తలుపు మిమ్మల్ని చూడగానే తెరుచుకుంటుంది. 

ఇది  *దేవుడి ఇంటికి సరైన దారి.* 


మీరు మీ బంధుమిత్రులకి కూడా ఈ దారిని తెలపండి.  లేదా సరైన దారి తెలియక వారు దారి తప్పిపోవచ్చు.


ఆధ్యాత్మిక మార్గంలో భక్తి, మంత్రం, ధ్యానం  ఇలా...రకరకాల సాధన ఏదైనా గాని, చేసేవారు ఎవరైనా గాని తెలుసుకోవలసిన సూక్ష్మ విషయం ఇదే!

🙏🙏🙏🙏☯🙏🙏🙏🙏

మొగలిచెర్ల

 *గుణపాఠం..*


"నిన్న ఉదయం బస్ లో ఇక్కడికి వచ్చానండీ..స్నానం అయ్యాక స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను..శనివారం నాడు సమాధిని చూడొచ్చు కానీ సమాధిని ముట్టుకొని నమస్కారం చేసుకునే అవకాశం లేదు అని పూజారిగారు చెప్పారండీ..అందువల్ల ఆ గర్భాలయపు తలుపు ఇవతలి నుంచి శ్రీ స్వామివారి సమాధిని చూసానండీ..అక్కడినుంచే నమస్కారం చేసుకున్నాను..పల్లకీసేవ సాయంత్రం జరుగుతుంది అని చెప్పారండీ..సమయం చాలానే వుంది కదా అని మాలకొండ క్షేత్రానికి వెళ్లి, ఆ మాల్యాద్రి లక్ష్మీనృసింహ స్వామివారిని..పై కొండమీద కొలువైవున్న అమ్మవారిని, ఈ మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు తపస్సు చేసుకున్న శివాలయం, నివాసం ఉన్న పార్వతీదేవి మఠం అన్నీ దర్శించుకొని వచ్చానండీ..నిన్నరాత్రి పల్లకీసేవవలో కూడా పాల్గొన్నాను..ఈరోజు ఉదయం నుంచీ అర్చకుల ద్వారా నిర్వహించిన స్వామివారి సమాధి అభిషేకములు, ప్రత్యేక హారతులు చూసానండీ.." అంటూ ఒక్కక్షణం కూడా ఆగకుండా గబ గబా చెప్పుకుపోతున్న ఆ వ్యక్తిని ఆగండి అన్నట్టు సైగ చేసాను..తాను చెప్పడం ఆపి..నా వైపు చూసాడు..


"నిన్నటినుంచీ మీరు పాల్గొన్న అన్ని కార్యక్రమాలు చెప్పారు బాగానే ఉంది..ఇవన్నీ నాకెందుకు ఏకరువు పెడుతున్నారు..ఈ సమయం లో మీరు చూస్తున్నారు కదా..భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది..అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేసే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత నాది..మీరేమో ఆపకుండా చెప్పుకుంటూ పోతున్నారు.." అని ఒకింత అసహనంగా చెప్పాను..కొద్దిగా ముఖం చిన్నబుచ్చుకొని.."అదికాదండీ..అన్నివిధాల నాకు బాగుంది కానీ..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, ఒక్కసారి నమస్కారం చేసుకొని..స్వామివారి పాదుకులను ముట్టుకొని రావడానికి మీరు అనుమతి ఇస్తారేమోనని అడగడానికి వచ్చాను.." అన్నాడు..


"అంతేకదా..మీరు అర్చకస్వామి వద్దకు వెళ్ళండి..నేను వారికి చెపుతాను..వారు మిమ్మల్ని స్వామివారి సమాధి వద్దకు పంపుతారు.." అని చెప్పాను..నిజానికి అతనిని అతి త్వరగా వదిలించుకోవాలి అనే ధ్యాసలో వున్నాను నేను..ఆ సమయం లో భక్తులు ఎక్కువగా ఉండటం..అందరూ దర్శనానికి తొందరపడటం..వాళ్ళను సర్దుకునే క్రమం లో నేను, మా సిబ్బంది కొద్దిగా సతమతం అవుతున్నాము..అతను నాకు ధన్యవాదాలు చెప్పి, లోపలికి వెళ్లి, స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్ళిపోయాడు..


ఓ పదిరోజుల తరువాత,.."నా పేరు పార్ధసారధి అండీ..నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను..ఈ మధ్య మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్నాను..ఒక ఆదివారం ఉదయం మిమ్మల్ని స్వామివారి సమాధి దర్శనం కొఱకు నా మాటలతో విసిగించాను కదండీ..గుర్తుకు వచ్చానా అండీ.." అంటూ ఫోన్ చేసాడు.."మీరు గుర్తుకువచ్చారు..ఆరోజు మీరే చూసారు కదా..పని వత్తిడిలో వున్నాను.." అని కొద్దిగా సంజాయిషీ ఇచ్చే రీతిలో జవాబు చెప్పాను..


"అయ్యో అదేమీ లేదండీ..ఇప్పుడు నేనెందుకు మీకు ఫోన్ చేశానంటే..నేననుకున్న పని స్వామివారి దయవల్ల పూర్తయింది..అందుకు కృతజ్ఞత గా..మీరు సూచించిన శనివారం ఆదివారం రెండురోజులూ అన్నదానానికి అయ్యే ఖర్చును నేను భరిస్తాను..దాతల సహకారం తో అన్నదాన సత్రాన్ని బాగుచేయిస్తున్నారనీ..దానికి సుమారు ఐదారు లక్షల వరకూ ఖర్చు అవుతుందనీ మీ సిబ్బంది అనుకుంటుంటే విన్నాను..నేను కూడా నా వంతుగా కొద్ది మొత్తాన్ని విరాళంగా ఇస్తాను..కాదనకుండా స్వీకరించండి..అలాగే వచ్చే నెలలో మా కుటుంబం తో సహా వస్తాను..వచ్చేముందు మీకు ఫోన్ చేస్తాను..సమాధి దర్శనం ఇప్పించండి..అంతే చాలు..వుంటానండీ.." అన్నాడు..


ఇతన్ని త్వరగా వదిలించుకోవాలి అని నేను ఆరోజు అనుకున్నాను..కానీ అతని చేతనే శ్రీ స్వామివారు అన్నదానం చేయించుకుంటున్నారు..అదీకాక అన్నదాన సత్రం బాగుచేయడం లో అతనిని కూడా ఒక సాధనంగా ఏర్పాటు చేశారు..ఏ మనిషిని తక్కువగా అంచనా వేయకు అని స్వామివారు నాకు అతని ద్వారానే..నాకేమాత్రం మనసుకు కష్టం కలిగించని రీతిలో చెప్పించారు..


స్వామివారి సమాధి వద్దకు వెళ్లి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను..స్వామివారి వద్ద ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క అనుభవం పొందుతాడు..కానీ కొంతమంది భక్తుల ద్వారా స్వామివారు పాఠాలు చెపుతారు..అవే మాకు అనుభవాలు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి

 🙏🌺శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి అనగా ఏమి🌺🙏


🙏🌺 సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి🌺🙏


🌺శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామియే కుమారస్వామి,కార్తీకేయుడు,స్కందుడు,షణ్ముఖుడు, మురుగన్,గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి ,సుబ్బరాయుడు షష్టి,తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు.దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు,కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం మూడులోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న"తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు.🌺


🌺అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివున్నిఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు.ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. 🌺


🌺కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి,దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పిలుచుకుంటున్నాము, "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. 🌺


🌺ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు,పువ్వులు,వెండి పడగలు,వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజ దోషం,కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం లో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని,ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని,దానం చేయమని సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా "పరోప కారం మిధం శరీరం" అని భావించి పేదవారికి స్వేటర్లు , కంబళ్ళు, దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను,తిను బండారాలను దానం చేయాలని తెలుపుతున్నాయి🌺


🌺ఈ స్కంద షష్ఠి పర్వదినాన అత్యంత శక్తివంతమైన " శ్రీ స్కంద షష్ఠి కవచం " పారాయణ చేయడం విశేష ఫలప్రదం.🌺

🙏🙏🌹