4, నవంబర్ 2021, గురువారం

మొగలిచెర్ల

 *శ్రీ మెంటా మస్తాన్ రావు గారు..*


మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, మా తల్లిదండ్రులకు (శ్రీ పవని శ్రీధర రావు, నిర్మల ప్రభావతి దంపతులు) పరిచయమయ్యే నాటికే, విజయవాడ వాస్తవ్యులు శ్రీ చక్కగా కేశవులు గారు స్వామి వారిని పరిపూర్ణంగా నమ్మి, భక్తి తో సేవిస్తున్నారు..స్వామి వారు మాలకొండలో తపస్సు చేసుకునే పార్వతీ అమ్మవారి మఠం లో ఓ స్టీలు మంచం ఏర్పాటు చేశారు..తరువాతి కాలంలో శ్రీ కేశవులు గారు, మా అమ్మా నాన్న గార్లకు పరిచయం కావడం , ఆ అనుబంధం చివరి వరకూ కొనసాగడం, ఇప్పుడుకూడా శ్రీకేశవులు గారి అబ్బాయి కృష్ణ , మేమూ సత్సంబంధాలు కలిగి వుండటం ఆ దత్తుడి కృపే..


ఆ కేశవులు గారి తోడల్లుడు శ్రీ మెంటా మస్తాన్ రావు గారికి కూడా 1973 ప్రాంతంలో శ్రీ స్వామి వారు కేశవులు గారి ద్వారానే పరిచయం అయ్యారు..వారూ స్వామి వారికి పరమ భక్తులుగా మారిపోయారు..శ్రీ కేశవులు గారు, తమ కూతురు వివాహానికి రమ్మని స్వామి వారిని మరీ మరీ కోరి, మొత్తానికి స్వామి వారు విజయవాడ వచ్చేటట్లు ఒప్పించగలిగారు..


శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఉండాటానికి శ్రీ మెంటా మస్తాన్ రావు గారి ఇంట్లో బస ఏర్పాటు చేశారు..ఇది మస్తాన్ రావుగారికి ఊహించని వరం..ఆ దంపతులిద్దరూ పొంగిపోయారు..స్వామి వారు మాత్రం ఎక్కడఉన్నా ఒకేవిధంగా ఉండగలిగే వారు..వారి తపోసాధన కానీ.. ఆహారపుటలవాట్లు కానీ.. ఎటువంటి మార్పు లేకుండా ఉండేవి..శ్రీ మస్తాన్ రావు గారికి ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువ..శ్రీ స్వామివారి సాహచర్యంతో అది మరికొంచెం ఎక్కువ అయింది..సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడు తన ఇంటికొచ్చి తనకు ఉపదేశం ఇచ్చినట్లు గా భావించేవారు..శ్రీ మస్తాన్ రావు గారు మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడల్లా..శ్రీ స్వామివారు తమతో గడిపిన కాలం తాలూకు జ్ఞాపకాలను పదే పదే మాతో చెప్పుకొని తన్మయత్వం చెందేవారు..


"ఇప్పటికీ శ్రీ స్వామివారు మా ఇంట్లో తిరుగుతున్న అనుభూతి కలుగుతుందయ్యా.. మహానుభావుడు..దాదాపు పది రోజులపాటు వున్నాడు..ఎంతో బోధ చేసాడు..మా జన్మ తరించింది!.." అని మా దంపతులతో చెప్పేవారు..


శ్రీ మస్తాన్ రావు గారికి వాస్తు శాస్త్రం మీద అవగాహన ఉంది..తన సందేహాలను స్వామి వారిని అడిగారు..స్వామి వారు తమ ధ్యానం అయిపోయిన తరువాత వారి సందేహాలను నివృత్తి చేసేవారు..శ్రీ స్వామివారి మందిరం లో ఏవైనా మార్పులు చేర్పులు చేసే ముందు మేము కూడా శ్రీ మస్తాన్ రావు గారిని సంప్రదించడం ఒక ఆనవాయితీ..

ఈరోజు మేము మందిరం లో ఉంచిన స్వామి వారి ఫోటో...శ్రీ మస్తాన్ రావు గారి ఇంటిలో తీసినదే..స్వామి వారి అసలు రూపం లో లభ్యమవుతున్న ఒకేఒక్క ఫోటో అదే..


ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు..అదేవిధంగా శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి శ్రీ మెంటా మస్తాన్ రావు గారి దంపతులు మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దర్శిస్తూ ఉన్నారు..మొగలిచెర్ల స్వామి వారిని దర్శించే ఆర్యవైస్యుల సౌకర్యార్థం ఓ అన్నదాన సత్రాన్ని, వసతి గృహాన్ని ఏర్పరచే పధకం లో..స్వామి వారి ఆశ్రమ నిర్మాణ దాత శ్రీ మీరాశెట్టి, చెక్కా కేశవులు గారితో కలిసి చురుకుగా పాల్గొని దానిని పూర్తి చేశారు...


ఎనభై ఏళ్ళు పైబడినా.. ఓపిక చేసుకుని శ్రీ స్వామి వారి మందిరం దర్శించడానికి మళ్లీ ఈమధ్య మొగలిచెర్ల కు వచ్చారు..స్వామి వారి సమాధిని దర్శించుకుని, ఆనాటి అనుభవాలు గుర్తు చేసుకొని, మా దంపతులను ఆశీర్వదించి వెళ్లారు..తమకు ఓపిక ఉన్నంతవరకూ దర్శనానికి వస్తుంటామనీ..ఆ శక్తి శ్రీ స్వామివారు తమకు ఇస్తాడనీ నమ్మకంగా చెప్పి మరీ వెళ్లారు..


శ్రీ స్వామివారి కృపను పరిపూర్ణంగా పొందిన శ్రీ మస్తాన్ రావు గారు మూడు సంవత్సరాల క్రితం విజయవాడ లోని వారి స్వగృహం లో పరమపదించారు..మాకందరికీ పెద్ద దిక్కుగా ఉన్న శ్రీ మస్తాన్ రావు గారి మరణం మాకు తీరని లోటు..కానీ దైవ నిర్ణయాలను ధిక్కరించలేము కదా..


ఈమధ్యనే శ్రీ మస్తాన్ రావు గారి కుటుంబసభ్యులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, ఆ శనివారం సాయంత్రం జరిగిన పల్లకీసేవ లోనూ..ఆ ప్రక్కరోజు ఆదివారం ప్రభాత సేవ లోనూ పాల్గొన్నారు.."మాకు వీలున్నప్పుడల్లా ఈ మహానుభావుడి సమాధి దర్శనం చేసుకుంటామండీ.." అని మస్తాన్ రావు గారి సతీమణి చెప్పారు..వారి కుటుంబానికి ఆ దత్తాత్రేయుడి ఆశీస్సులే రక్ష..!!


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699)

దీపావళి ముచ్చట్లు:*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*40 -50 సంవత్సరాల క్రితం దీపావళి ముచ్చట్లు:*

                    🌷🌷🌷

ఒక వారం ముందు నుంచే వీధిలో ఠపా, ఠుపీ సౌండ్లు మొదలవుతాయి. ఆ వీధి చివరి ఇంట్లో పిల్లాడు శెట్టిగారి అంగట్లో దొరికే పది పైసల తుపాకీ బిళ్లలు కొని, ఆ బిళ్లల డబ్బీ జాగ్రత్తగా దాచుకుని, అందులో ఒకో బిళ్లను గచ్చు నేల మీద పెట్టి, గుండ్రాయితో ఠాప్‌మని పేల్చుతుంటాడు. డబ్బీ అయిపోతే మళ్లీ ఇంకో డబ్బీకి అమ్మ పదిపైసలు గ్యారంటీగా ఇస్తుంది.


ఆ పది పైసలూ లేనివాడు ఎలాగో చేసి చిన్న ఇనుపగుంట, గూటం సంపాదిస్తాడు. ఎక్కడ దొరుకుతుందో దొరుకుతుంది గంధకం పొడి. ఆ పొడి సీసాను దగ్గర పెట్టుకుని, కొంచెం గంధకం పొడి ఇనుప గుంటలో పెట్టి, గూటం బిగించి, ఆ గూటానికి ఉండే పాలజాటీని పట్టుకుని గట్టిగా గోడకు కొడితే ఠాప్‌ అని సౌండ్‌ వస్తుంది. ఇక గంధకం పొడి అయిపోయేంత కాలం వాడి దీపావళికి దిగుల్లేదు.


పోయిన దీపావళికి కొన్న గన్ను కనిపించదు. లేదా పాడై ఉంటుంది. కొత్త గన్‌ కొన్న పిలకాయలు వాటిని పట్టుకుని దొంగ పోలీస్‌ ఆట ఆడుతుంటారు. మనకూ కావాలనిపిస్తుంది. బజారుకు వెళ్లి టపాకాయల అంగడిలో అడిగితే రూపాయిన్నరది ఒకటి, మూడు రూపాయలది, ఐదు రూపాయలది చూపిస్తాడు. నల్లటి రంగు వేసిన రేకు తుపాకీలు, స్టీలు తుపాకీలు... కొనాలంటే డబ్బులెక్కడివి.


వచ్చిన అమ్మను అడిగితే వీపు మీద ఒక టపాకాయల పేలుతుంది. నాన్నను అడిగితే 'కొందాం లేరా.. దీపావళి చాలా రోజులు ఉందిగా' అంటాడు. ఈలోపు అన్నయ్య వాళ్లను వీళ్లను అడిగి, బంధువుల దగ్గర చిల్లర సంపాదించి ఒకటి సొంతానికి కొనుక్కుంటాడు. వాడు వాడిది మనకు చచ్చినా ఇవ్వడు. ఇంకేంటి? అలక... నిరాహార దీక్ష... హర్తాళ్‌.. రాస్తారోకో... చివరకు నిరసన దీక్షకు ఇంట్లో ఉన్న నానమ్మ ముక్కు చీది 'పిల్లాడు ఏమడిగాడని' అని ఏడుపు.


ఆఖరకు తుపాకీ శాంక్షన్‌ అవుతుంది. ఇంకేంటి. నానమ్మ తన ముక్కుపొడుం డబ్బులు త్యాగం చేసి రీల్స్‌ ప్యాకెట్‌ కొనిస్తుంది. ఒక ప్యాకెట్‌లో పది రీల్స్‌ డబ్బీలు ఉంటాయి. ఒక్కో డబ్బీలో ఒక్కో రీలు. తుపాకీ విప్పి రీలు చుట్టి మళ్లీ కచ్చితంగా బిగించడం ఒక ఆర్టు. ఆ పని చేశాక ట్రిగర్‌ నొక్కిన ప్రతిసారీ రీల్‌ రన్‌ అవుతూ ఠాప్‌ ఠాప్‌ సౌండ్‌ వస్తుంటే సూపర్‌స్టార్‌ కృష్ణ కూడా నిలువలేడు ఆ స్టయిల్‌కి.


డబ్బులు పెద్దగా ఉండని రోజులు అవి. పిల్లలు తమ కోర్కెలను కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టే రోజులు. ఒక తండ్రి ఒక కొడుక్కి నేల టపాకాయల సంచి కొనిస్తాడు. పది రూపాయలకు చాలా నేల టపాకాయలు ఉంటాయి దానిలో చిన్నవి. ఆ పిల్లవాడికి బుద్ధి పుట్టినప్పుడల్లా ఒక నేల టపాకాయ తీసి నేలన గట్టిగా బాదితే ఢమ్మని సౌండు. మరో బీద తండ్రి తన కొడుక్కి తాటాకు టపాకాయలు కొనిస్తాడు. తాటాకులో మందు కూర్చి వొత్తి బయటకు వచ్చేలా ఉండే ఆ చీప్‌ టపాకాయలు సౌండ్‌లో మేటి. క్యాండిల్‌ వెలిగించి ఒక్కో తాటాకు టపాకాయ అంటించి విసురుతూ ఉంటే ఠపాఠపా అంటాయి.


పీర్‌ ప్రెజర్‌ ఉండేది ఆ రోజుల్లో. మీ నాన్న ఎంతకు కొని తెచ్చాడు అనంటే మీ నాన్న ఎంతకు కొని తెచ్చాడు అని. పిల్లలు తమ దగ్గర ఉన్న అన్ని డబ్బాల కాకర పువ్వొత్తులను లెక్క వేసి పక్క కుర్రాడితో పోల్చుకునేవారు. చిచ్చుబుడ్లు ఫ్యాషన్‌వి కొనేవాళ్లు డబ్బున్నవాళ్లు. మట్టి చిచ్చుబుడ్లు కొనేవాళ్లు మధ్యతరగతి వారు. ఆ మట్టి చిచ్చుబుడ్లు మూడ్‌ బాగుంటే బుజ్‌మని వెలిగేవి.


లేకుంటే తుస్‌మనేవి. విష్ణుచక్రం, భూచక్రం అందరూ కొనలేరు. లక్ష్మీ ఔట్‌లు క్వాలిటీ ఔట్లు. ఆరు ఔట్లు ఒక ప్యాకెట్‌. కొంటే చెవులు చిల్లులు పడేలా పేలడం గ్యారంటీ. పురికొస బాంబులు కూడా మానం గల్లవి. తుస్‌మనడం వాటి చరిత్రలో లేవు. ఇక పిల్లిపిసర సరం ప్రమాద రహితమైనది. 500 వాలా, 1000 వాలా కొనేది శ్రీమంతులు. వాళ్లు అందరూ టపాకాయలు కాల్చేక ఏ అర్ధరాత్రో 1000 వాలా వెలిగించి పది నిమిషాలు ఢమఢమలాడించి తమ దర్జా చూపించుకుంటారు.


పిల్లలు దీపావళికి కొత్తబట్టలు అడగరు. కాని టపాకాయలు మాత్రం తప్పక అడుగుతారు. పాముబిళ్లలు, వెన్నముద్దలు, మెగ్నీషియం రిబ్బన్లు, కలర్‌ అగ్గిపెట్టెలు... ఇవి ఉంటే పెన్నిధి ఉన్నట్టే. ఇంతా చేసి దీపావళి ముందు రోజు నుంచి ముసురు పట్టుకుంటే వాళ్లు బెంగ పడతారు. చీటికి మాటికి ఆకాశం వైపు చూస్తుంటారు. అయ్యో.. వీటిని కాల్చడం ఎలా అనుకుంటారు. దీపావళి రోజు వాన రావడం ఆనవాయితీ. పిల్లలతో ఆడుకోవడానికే వచ్చి కాసేపు అల్లరి చేసి వెళ్లేది అది.


దీపావళికి చుట్టుపక్కల పిల్లలను గమనించుకోవడం పెద్దలు తప్పక చేసేవారు. కొన్ని టపాకాయల్ని కొనుక్కోలేని పిల్లలకు ఇచ్చేవారు. తమ పిల్లల చేత ఇప్పించేవారు. తమ ఇంటి ముంగిట్లో టపాకాయలు కాలుస్తున్నప్పుడు పక్కింటి పిల్లలు తెల్లముఖం వేసుకు చూస్తుంటే పిలిచి వారి చేత కూడా కాల్పించేవారు. ప్రేమ, స్నేహం ఉన్నది కాస్త పంచితే పెరుగుతుంది.


దీపం అంటే తాను వెలిగేది మాత్రమే కాదు.. వెలుతురు పంచేది. ఒక దీపం నుంచి వేయి దీపాలు వెలుగుతాయి.

ఈ దీపావళిని ప్రేమను పెంచుతూ జరుపుకోండి. చిన్నప్పటి రోజులను పిల్లలకు చెప్పండి. పిల్లలకు సురక్షితమైన దీపావళి సరంజామా ఇచ్చి దగ్గరుండి వారి చేత కాల్పించండి.

_*హ్యాపీ దీపావళి*_ సేకరణ...

శ్రీమద్భాగవతము

 *03.11.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2311(౨౩౧౧)*


*10.1-1451-*

*10.1-1452*


*శా. "రాజీవాక్షుఁడు సుందరాస్యుఁడు మహోరస్కుండు పీతాంబరుం*

*డాజానుస్థిత బాహుఁ డంబురుహ మాలాలంకృతుం డుల్లస*

*ద్రాజత్కుండలుఁ డొక్క వీరుఁ డిచటన్ రాజిల్లుచున్నాఁడు మా*

*రాజీవాక్షుని భంగి" నంచుఁ గనిరా రాజాన్వయున్ గోపికల్.* 🌺



*_భావము: ఉద్ధవుడు బలరామకృష్ణుల మరి కొన్ని మహిమలను, లీలలను నందుడు మొదలగు యాదవ ప్రముఖులకు తెలియజెప్పాడు. మరుసటి ఉదయకాలమున గోపికా స్త్రీల మజ్జిగ చిలుకుతున్న శబ్దములను వింటూ లేచి, ప్రాతఃకాల అనుష్టానములను పూర్తిచేసుకొని, ఒక రహస్య సంకేత స్థలమున ఉండగా, గోపికలు అతనిని చూచి", ఏమిటి మా కృష్ణునిలాగా సుందరవదనారవిందముతో, విశాల వక్షస్థలము కలిగి, పట్టు వస్త్రములు ధరించి, పద్మమాలాలంకృతుడై, కుండలములతో ఆజానుబాహుడుగా ప్రకాశిస్తున్నాడు!", అని అనుకున్నారు._* 🙏



*_Meaning: Uddhava narrated some more episodes of the mystic deeds of Balarama and Sri Krishna to Nanda and other yadava elders. Next morning he woke up to the sounds of churning of buttermilk, completed his ablutions and waited at the appointed place. Yadava womenfolk assembled there were pleasantly surprised to see Uddhava who looked like Sri Krishna and thought: "He is longimanous (a person with long hands) and glowing like our Sri Krishna with beautiful lotus like face, broad chest, wearing silk vestures, adorned with lotus garland and nice earrings."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

*ఇదీ దీపావళి

 *ఇదీ దీపావళి*

          


దీపావళి 5 రోజుల పండగ. ఆశ్వయుజ త్రయోదశినుండి మొదలుకొని కార్తిక శుద్ధ ద్వితీయ వరకూ. 

అవే ... 1. ధనత్రయోదశి >ఆశ్వయుజ బహుళ త్రయోదశి

            2. నరక చతుర్దశి> ఆశ్వయుజ బహుళ చతుర్దశి

            3. దీపావళి > ఆశ్వయుజ అమావాస్య

            4. బలి పాడ్యమి > కార్తిక శుద్ధ పాడ్యమి

            5. యమ ద్వితీయ > కార్తిక శుద్ధ ద్వితీయ


*ఈ అయిదు రోజులలో ఏం చెయ్యాలి?* 

ఆశ్వయుజ బహు ళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్యలలోనూ మరియు కార్తిక శుద్ధ పాడ్యమి, విదియలలోనూ  ... ఈ అయిదు రోజులలోనూ సాయంత్రం తొలి నక్షత్రం కనబడే వేళకు పూజగదిలోనూ, తులసికోట వద్ద, ఇంటి గుమ్మాలవద్ద దీపాలనువెలిగించాలి.

ఇకరోజువారీగా చేయవలసిన విధులు:


*1.ధనత్రయోదశి*

ధనత్రయోదశి నాడు: ఆయుర్వేదానికి అధిదైవతమైన ధన్వంతరి ఆవిర్భవించిన రోజు. కనుక ఈరోజు ధన్వంతరిని పూజించినవారికి పూర్ణాయుర్దాయం, పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తాయి. అలాగే ధనపతి అయిన కుబేర పూజనం, శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాచరణం ... చేయాలి. దానివల్ల ధన, కనక, వస్తువాహనసమృద్ధి కలుగుతాయి.


*2. నరకచతుర్దశి*

రెండవరోజు నరకచతుర్దశి నాడు ...

*సూర్యోదయానికిముందే అభ్యంగస్నానం,

(అంటే తలనుంచి పాదాలవరకూ నువ్వులనూనె పట్టించుకుని ఆపైన నలుగుపిండితో రుద్దుకుని కుంకుడు కాయలు/షికాకాయ పొడితో తలంటు  స్నానం చేయటానికి అభ్యంగస్నానం అని పేరు)

* యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ।

వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ।।

ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమాత్మనే।

వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః।।

అని యమనామములను పఠించి తర్పణములనీయాలి. దీనివలన అకాల మృత్యుదోషములు తొలగి పోతాయి.


*ఉల్కాదానం (గోగుకొమ్మ లేక ఆముదపు కొమ్మ కు నూనెలో తడిపిన నూలు వస్త్రంలో నల్లనువ్వుల ను చిిన్న చిన్న మూటలుగా కట్టి వెలిగించి ఉత్తరం నుంచి దక్షిణంవైపు పడవేయటం.)దీనికే దివిటీలను వెలిగించటమని పేరు.


* సంధ్యాదీపాన్ని వెలిగించవలె.

ఈ విధులవల్ల మనపితరులు జ్యోతిరాది మార్గంలో బ్రహ్మ లోకానికి చేరుకుంటారని ధర్మశాస్త్రం. మానవులకు నరకబాధ ఉండదు కనుక దానికి *నరకచతుర్దశి* అని పేరు.


*3. దీపావళి*

మూడవ రోజున సాయంకాలం *ధనలక్ష్మీ పూజను* చేసి దీపములను వెలిగించి ఇంటినంతటినీ దీపములతో అలంకరించాలి.  ఈదీపములవరుసలతో అలంకరించకుంటాము కనుక ఈరోజు ను దీపావళి అంటారు.

అలాగే సత్యభామాదేవి నరకుని సంహరించినరోజు నరకచతుర్దశి అని, ఆఆనందపు పండగే దీపావళి అని అందుకే మనం బాణసంచా వెలిగిస్తామని అనాదిగా వస్తున్న సంప్రదాయం. 


ఇక్కడితో ఆశ్వయుజంలో చివరి మూడు రోజుల పండుగ సంరంభం జరుపుకోవాలి.

ఇలా ఈమూడు రోజుల పండగ వల్ల మనపితరులకు ఉత్తమలోక ప్రాప్తి, మనకు ధనలక్ష్మీ అనుగ్రహం లభిస్తాయన్నమాట. 

ఆపైన - 

*4. బలిపాడ్యమి* 

ఇది కార్తిక మాసంలో శుక్లపక్షం లో తొలి తిథి. ఈరోజు వామనుని అనుమతితో బలిచక్రవర్తి భూలోక సంచారం ప్రతియింటికీ వస్తాడట. ఆయన రాకను స్వాగతిస్తూ లక్ష్మీ నిలయములైన దీపములతో వారికి స్వాగతం పలుకుతారు. ఈ స్వాగతదీపములను ఇలా.. రాజద్వారములలో, దేవాలయాల్లో, నదీతీరాలలో, తమ తమ గృహాల్లో నెలపొడుగునా వెలిగించాలి. ముఖ్యంగా శివ, విష్ణు ఆలయాల్లో ధ్వజస్తంభం పై గగన తలంలో వెలిగించాలి. దీనికే ఆకాశదీపారంభం అని కూడా పేరు. వాడ వాడలా దీన్ని ఒక మహోత్సవంగా జరుపుతారు. 


*5. యమద్వితీయ*

ఇది కార్తిక శుక్ల ద్వితీయ (విదియ) నాడు జరుపవలసిన పండుగ. తొలికృతయుగంలో యముడీ తిథినాడు  తన సోదరి అయిన యమున యింటికి అతిథిగా వెళ్ళినాడట. అందుకని నాటినుంచి ఈతిథినాడు నరలోకమున సోదరులందరూ తమసోదరి చేతిభోజనముచేసి వారికి విలువైన కానుకలనిచ్చుట సంప్రదాయమైనది. 


ఇలా ఈ అయిదూ లక్ష్మీ ప్రదాయకములైన అయిదు వరుస పండుగలైనవి. 


   

శ్రీమదాంధ్ర భాగవతం - 6

 శ్రీమదాంధ్ర భాగవతం - 6


భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు! శూలికైన దమ్మిచూలికైన!

విబుధజనుల వలన విన్నంత కన్నంత, దెలియవచ్చినంత తేతపరతు!!

ఎంతవినయంగా చెప్పుకున్నారో చూడండి! భాగవతము ఎవరు చెప్పగలరు? భాగవతమును చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేరు. జ్ఞానమునకు ఆలవాలమయిన పరమశివుడు చెప్పలేడు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తూ వుంటుంది. కానీ ’మహాపండితులయిన వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏది ఉన్నదో దానిని నాకు అర్థమయిన దానిని, నాకు శారదాదేవి ఏది కృపచేసిందో దానిని నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు. ఆయన అంటారు – 

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె

ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను బో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా 

యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!

విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సద్యఃఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కని గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం. కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.

’అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు.

’అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు ఎన్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికి దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. 

’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.

’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యే అని ఏడిచేటటుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.

’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకొని శక్తితో తిరుగుతున్న వారెవరు?

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి

చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి

మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.

ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

’రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’

అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.

’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చెయ్యాలి.

అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. బీజాక్షరము అంటే “Letter Pregnant with sound” అంటారు చంద్రశేఖర పరమాచార్య స్వామివారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.

ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’

మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు. మీరు అస్తమానూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.

ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు. కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఏమిటి? ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి ఆంధ్రదేశమునకు ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును ఇచ్చారు.



ఇంకా ఉంది.


సాంఖ్యాయనాచంట

మాల్_జిహాద్

 #మాల్_జిహాద్ !!!!

మొదటిసారి ఒళ్ళు గగుర్పొడిచే పోస్ట్

చదివితే తెలుసుకుంటారు లేకపోతే.....


 ప్రసిద్ధ మలయాళీకి చెందిన మెగా మాల్స్ ఇప్పుడు కేరళలో ప్రసిద్ధి చెందాయి మరియు కర్ణాటకకు వ్యాపించాయి. కన్నూర్, కాసరగోడ్, కోజికోడ్ మరియు మలప్పురంలో యజమాని ఇటువంటి మాల్స్‌ను ఏర్పాటు చేయలేదు కాదు కాదు చేయడు. దానికి బదులుగా, ఇది ఎర్నాకులం, తిరువనంతపురం, కొట్టాయం మరియు ఇప్పుడు పాలక్కాడ్‌కు లలో ఏర్పాటు చేస్తాడు.


 కానీ అలా ఎందుకో తెలుసా??


1)అతను ఆ ప్రాంతంలో ముస్లింలు నిర్వహించే చిన్న దుకాణాలకు భంగం కలిగించడు.

ఖాఫీర్ల భూమిలో మాల్ ఏర్పాటు చేసి.. ఖాఫీర్ల చిరు వ్యాపారాలను ఎదగకుండా చేస్తారు.


2)ఓ మాల్‌లో 20 వేల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాడు. వీరిలో 

15,000 మంది మలప్పురానికి చెందిన ముస్లిం యువకులు.  

5000 మంది ఖాఫిర్‌లకు చెందిన (హిందూ, సిఖ్,క్రిస్టియన్....) మహిళలు.  

ఈ విధంగా 15,000 మంది పురుషులు 

5000 మంది యువ కెఫీన్ బాలికలతో సంభాషిస్తారు.  

లవ్ జిహాద్ జోరుగా సాగుతోంది. బాధితురాలి ఉద్యోగానికి ముప్పు వాటిల్లుతుంది అని చాలా మంది మౌనంగా ఉండాల్సి వస్తుంది.

3)మూడవది,దీనివల్ల 15,000 మంది విధేయులైన యువత కుటుంబ సమేతంగా ఖాఫీర్ల భూమికి వలస వెళ్లే అవకాశం లభిస్తుంది.కనీసం ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి అయినా అభ్యర్థి గెలుపును నిర్ణయించేందుకు 30,000 మంది సరిపోతుంది.  


అందుకే మెగా మాల్స్ ఎప్పుడూ ఖాఫీర్ల గడ్డపైకి వెళ్తుంటాయి.ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ ఫండింగ్‌లో పేరెన్నికగన్న అరబ్ దేశం నుంచి యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తోంది.

ఈ రకమైన నిశ్శబ్ద మాల్ జిహాద్ ఇతరుల నిశ్శబ్ద బహిష్కరణతో మాత్రమే ముగుస్తుంది. నేను ఇంతకు ముందు కొంతమందికి దాని గురించి చెప్పినప్పుడు, వారి ప్రతిస్పందన, 'అతను అలాంటివాడు కాదు. ఇంత మందికి ఉద్యోగాలు ఇవ్వొద్ద' అని ప్రశ్నించారు. ఇప్పుడు అందరికీ అర్థమైంది. తాలిబాన్‌లకు ఖతార్ అత్యంత మద్దతుగా నిలుస్తోందంటే ఆ దేశంతో వాళ్ళ వ్యాపార సంబంధాలను అర్థం చేసుకోవచ్చు. అతను కూడా చాలా కాలంగా జిహాదీలకు మద్దతు ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ #రిలయన్స్, #సెంట్రల్, 

#బిగ్_బజార్ మరియు మాల్ ఆఫ్ జాయ్‌కు మద్దతు ఇవ్వడం మంచిది.


 ఈ కంపెనీ ఎడపల్లికి వచ్చిన తర్వాత అక్కడ వ్యాపారం చేసే క్రిస్టియన్ మరియు హిందువులు దాదాపు 50 చిన్న వ్యాపారాలకు మూసివేశారు. కంపెనీ వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత, అనేక కొత్త హోటళ్ళు, జ్యూస్ సెంటర్లు, బ్యాగ్ షాపులు మరియు ఆప్టికల్ షాపులు వచ్చాయి, ఇవన్నీ ముస్లిం వర్గానికి చెందినవి. ఒక ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ ఎలా మారిందో చూడండి.


దీని ప్రతిబింబమే ఇప్పుడు ఎడపల్లి నుంచి పూకట్టుపడి వరకు కనిపిస్తోంది. త్రిక్కాకర మున్సిపల్ కార్పొరేషన్ మార్పు అందరికీ స్పష్టంగా కనిపించింది.


ఈ కొత్త జిహాద్ గురించి తెలుసుకుందాం. కేరళ ఇప్పుడు ఒక కేసు ఉదాహరణ గా చూడొచ్చు..

నితీష్ సహాయ

సంతోష్ పరశు రామ్

జ్యోతి

 జ్యోతి...


అమావాస్య చీకటి రేయి జ్యోతుల వెలుగులతో నింపడం అంటే అజ్ఞాన అంధకారమును దూరం చేయడమే. 


వెలుగు రేఖలనే జ్యోతులను ప్రజల్వింప చేయడం.


కాంతివంతమయమైన జీవనాన్ని గడపాలంటే వెలుగులనే ఆశాదృక్పదం వైపు పయనించాలి.


నిరాశ, నిస్పృహలనే అంధకారాలను జీవితంలోంచి తీసివేయాలి. 


ఆ సమయంలో‌ లభించిన అవకాశాలను అంది పుచ్చుకోవాలి.  


అలానే సదిశలో పయనం చేయడం జీవితంను మంచి దారిలో నడిపించ గలవు. 


గమ్యం లేని ప్రయాణంనకు అర్ధం లేదు. అందుకు నీకు నీవే దిశానిర్దేశం చేసుకో.


అది ఖచ్చితంగా నిన్ను విజేతగా మారుస్తుంది. 


జీవితంలో తడబాట్లు సహజమే!, కాని అంత మాత్రాన జీవితంమే ముగిసి పోలేదు.


ఆశాదృక్పదంతో అనంత విశ్వాన్ని జయించవచ్చు.


ఒక్క విషయం మరువకు, నీ పయనంలో మనకు తోడ్పాటునిచ్చే ఎంతో మంది నీకు అండగా ఉన్నారు. 


వారందరిని మరువకు. ఎందుకంటే వారే నీ జీవితంలోని వెలుగులకు చమురులా తోడ్పాటు ఇచ్చారు. 


కేవలం నీవు జ్యోతిలా వెలిగే వత్తి మాత్రమే. 


నీ వెలుగులను ఈ ప్రపంచంలో ప్రసరింపజేయి, తద్వార మరింత మందిలో జ్యోతిర్గమయం అవగలవు.


అప్పుడు 

ప్రతిరోజు దీపావళినే...


పండుగ శుభాకాంక్షలతో.


మీ

అశోక్ చక్రవర్తి.నీలకంఠం.