30, మార్చి 2025, ఆదివారం

సప్తవర్ణాల ఉగాది

 

 కవిత శీర్షిక : సప్తవర్ణాల ఉగాది 

 వచ్చింది తెలుగు మాసం తెచ్చింది సప్తవర్ణాల సంతోషం 

 చిత్రంగా చైత్రం మళ్ళీ వచ్చింది 

 వసంతోత్సవ వర్ణాలన్నీ 

 ప్రకృతి తనలో నింపుకొని వయ్యారం వలకబోస్తున్నది 

 ఆమని ఆహ్వానం అందుకొని కోయిలమ్మ గొంతు సవరించుకుంది 

 ఇంటింటా మామిడి తోరణాలతో షడ్రుచులకమ్మదనాలతో 

 పల్లె వేపా మామిడి పూతలతో పుష్పాలతో హాయిగా మురిసింది 

 పసుపుపచ్చని చామంతి ఆకుపచ్చని చీర చుట్టి 

 నీలిరంగు సెలయేరు లాంటి కురులారబోసి 

 చెంపల కెంపుల ఎరుపు రంగులద్ది 

 చల్లని మలయ సమీరాలతో 

 నల్ల కలువ లాంటి కళ్ళలో 

 ఆశల దీపాల హారతులు ఇస్తూ 

 చిత్రంగా చైత్రం మళ్ళీ వచ్చింది 

 విచిత్రంగా ఆశల చిగురింపజేసింది చైత్రం 

 ఊదా రంగు ఊహలను నిజాలు చేస్తూ 

 మది ఊయల లూప మళ్లీ వచ్చింది తెలుగు మాస ఆది ఉగాది 

 అందరికీ విశ్వావసు నూతన సంవత్సరం శుభాకాంక్షలు

సభా సరస్వతికి నమస్కారం

 నేను అనిత రాణి కాంచనపల్లి 

అడుగడుగునా షడ్రుచులే.

 


శ్రీభారత్ వీక్షకులకు శ్రీవిశ్వావసు ఉగాది శుభాకాంక్షలు 🌹కొత్త సంవత్సరం.. కొత్త ఉగాది కొత్త ఆలోచనలకు పునాది. జీవితంలో అడుగడుగునా షడ్రుచులే. వాటిని ఆస్వాదిస్తూ ముందుకు సాగడమే కర్తవ్యం.  ఆ వివరాలన్నీ శ్రీభారత్ వీక్షకులకు ఎంతో హృద్యంగా అందించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

నవ్యశోభల యుగాది,

 ,,,,,,శీర్షిక:నవ్యశోభల యుగాది,,,,,


నవ వధువు వోలే

నవయవ్వన హొయలతో

నవవిధ శుభాలను

నవరత్న సహిత సిరులను

తీసుకొస్తోంది మోసుకొస్తోంది

నవయుగాది నవసంవత్సరాది


భవ్య భూషణ భోగాలను

భవ్య శోభిత అనురాగాలను

భవ్య భోగ భాగ్యాలను

భవ్యతర ఘనతర రాశి ఫలాలను

భవ్య శ్రావ్య కోయిల గీతాలను

తెస్తోంది వినిపిస్తోంది నవ్యయుగాది


మమతలకు మమకారాలకు

ఆప్యాయతలకు,అనురాగాలకు

ఆలోచనలకు,ఆచరణలకు

షడ్రుచులకు, అభిరుచులకు

ఆలంబనగా తానున్నానంటూ

ఆశ్రయమిస్తూ వచ్చేను నవ్యయుగాది


తెలుగు వారికి తోబుట్టువుగ

తెలుగు వాకిట తులసిమొక్కగ

తెలుగు జాతికి కంటిదివ్వెగ

తెలుగు జగతికి ఘనతగ 

వెలుగును పంచడానికి వస్తోంది నవ్యయుగాది


కవిపేరు:కూని.అంకబాబు

ఊరు:నెల్లూరు

చరవాణి:9640637991

శ్రీకారం చుట్టాలి """

 కవితా శీర్షిక:


    """ శ్రీకారం చుట్టాలి """


వనమంతా పల్లవమై ప్రకాశిస్తూ 

చిగురాకుల తరువులలో చిలకమ్మల కువకువలతో 

మావిచిగురు తిని మత్తుగా కోయిలల కుహుకుహులతో 

మధురాశల మానవ స్వప్నాలతో 

మదినిండా ఆమని అందాలను నింపుకొని 

అడవితల్లి హరివిల్లు చీరకట్టి 

చెంగావి రవిక తొడిగి 

చైత్రమాసపు చైతన్య దీప్తియై

నవతకు నాందిగా మానవతకు పునాదిగా

ఉజ్వల భవితకు వారిధి గా

నవ నవోన్మేషపు యశస్సుల ఉషస్సులతో

మా ఆ (శ) యాలను నెరవేర్చే కల్పవల్లియై

నవ్య యుగాది ఉదయించాలి

నవ సమాజ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి!

తెలుగువారి తొలి పండుగయై

యుగానికి ఆదియై

ఉత్సాహనికి వేదికయై

జనుల విశ్వాసానికి ప్రతీకయై

విశ్వావసు అరుదెంచాలి!!!


***********************

(మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది పర్వదిన 

శుభాకాంక్షలు )

***********************

డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు 

( కమల శ్రీ )

తెనాలి 

చరవాణి :7416638823

***********************

(ప్రస్తుతం ఐర్లాండ్ దేశం నుంచి....)

************************

విశ్వమెల్ల శాంతివెలయ, భేద భావ-

 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

తే.గీ.

విశ్వమెల్ల శాంతివెలయ, భేద భావ-

మింతయును లేక; సౌఖ్యులై ఇమ్మహి ప్రజ 

ధర్మ వర్తనులై మెల్గ; దయను జూపి-

రావె విశ్వావసు శుభస్కరముగ నేడు.

🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚

ప్రపంచం అంతటా శాంతి నెలకొని, మనుషుల మధ్య భేద భావాలు కొంత కూడా లేక, సుఖంగా, ధర్మం ఆచరించే వారై యుండేలా దయ చూపి, శుభం కలిగేలా నేడు రావమ్మా విశ్వావసు నామ సంవత్సరమా .... అని ప్రార్ధన చేస్తూ...

ఉగాది శుభాకాంక్షలు...

                .... ముట్నూరి శ్రీనివాస్

తరువులో తొలి చివురులా

 తరువులో తొలి చివురులా

తోటలో కోయిల పిలుపులా 

మావి పులుపున కలిసిన 

వేప చిరు చేదులా...


ముగ్గుల ముంగిలితో

తోరణాల ద్వారాలతో

అగరు పొగల మధ్య

హారతి వెలుగులలో.....


వేంచేసిన నవ వత్సరానికి 

వేడుక నిండిన సంబరాలతో 

వేయి ఆశల పూర్ణకుంభముతో 

వేద మంత్రాలతో స్వాగతం.


పండుగలా ప్రతిరోజూ 

పసిపిల్లల్లా ఆనందం పొందుతూ

ప్రతి అన్నది లేక  గెలుపొంది

పదుగురి మంచి కోరుతూ..


పరుల చిరునవ్వుకు

మనం కారణమవుతూ..

వేరొకరి వేదనకు

మనం ఓదార్పు అవుతూ..


కాసులు అవసరమే లేని

కరుణ కలిగివుండి

కలతల నలిగే వారి

కన్నీరు తుడుస్తూ..


అందరినీ కాకపోయినా

కొంతమందినైనా అభిమానిద్దాం

అవసరం కోసం కాక

అచ్చంగా ప్రేమను పంచుతూ...


మనవల్ల కన్నీరు కాక

మనకోసం కంట నీరు నింపేలా

మమతలు పంచి

మనుగడకు ఒక అర్థాన్నిద్దాం.


అందరిలో ఒకరవుదాం 

అందరికీ మనమవుదాం

లోకం వదిలినా జ్ఞాపకంగా 

మనసుల్లో మిగులుదాం...


కొత్తగా తోచే ఉదయానికి

శుభాకాంక్షలతో


🌸🌸 సుప్రభాతం🌸🌸


బృంద 🙏💐

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: శ్రీ భగవానువాచ


యే మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః 

శ్రద్ధావంతో௨నసూయంతో ముచ్యంతే తే௨పి కర్మభిః (31)


యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ 

సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః (32)


అసూయలేకుండా శ్రద్ధాభక్తులతో నిరంతరం నా ఈ అభిప్రాయం ప్రకారం ప్రవర్తించే మానవులు కర్మబంధాలనుంచి విముక్తులవుతారు. నేను ఉపదేశించిన ఈ నిష్కామకర్మయోగ విధానాన్ని నిందించి ఆచరించనివాళ్ళు అవివేకులూ, అజ్ఞానులూ, అన్నివిధాల చెడిపోయినవాళ్ళూ అని తెలుసుకో.

సీసము

 *సీసము*

శిశిరపు మోడుల చిగురులు తినిమరి

   ఆమని కోయిల లాలిపాడ

ప్రకృతిన చందన పరిమళములనిడు

   కొత్త చిగుళ్ళకు క్రొవ్విరులు

మానసమందున మధురోల్లసాదుల

   విశ్వావసువను వెలుగులగని

నూతన వత్సర భూతుల భాసము

   ఎల్లరి సుఖముల చల్లని దరి.

*ఆ.వె.*

మనసునమురిపెములు మధురానుభూతులు

జగమున వెలుగులకు మిగులు ముదము

సకల సౌఖ్యములకు స్వాగత సందడి

కొత్త వత్సరంపు కొలువు లివియె.


అందరికీ విశ్వావసు నామ నూతన ఆంధ్ర సంవత్సర శుభాకాంక్షలు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శుభోదయమ్

 *🌞  ప్రియ ఆత్మీయ బంధువులు స్నేహితులు అందరికీ నూతన తెలుగు సంవత్సరం శ్రీ విశ్వావసు నామ యుగాది - ఆదివారంతో  ప్రారంభం - ఆ ఆదిత్యుని అనుగ్రహం కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ....💐*


💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 *🌞  ప్రియ ఆత్మీయ బంధువులు స్నేహితులు అందరికీ నూతన తెలుగు సంవత్సరం శ్రీ విశ్వావసు నామ యుగాది - ఆదివారంతో  ప్రారంభం - ఆ ఆదిత్యుని అనుగ్రహం కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ....💐*


💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 

   

   𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 

*యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః!*

*ప్రణమామి తమాదిత్యం బహిరన్త స్తమోపహమ్!!*


 *తా𝕝𝕝 ఎవడు ఈ జగత్తును సృష్టించి - పోషిస్తున్నాడో, లయం కూడా చేస్తున్నాడో... (సకల చరాచర జగత్తూ సృష్టి స్థితి లయలూ ఎవరి ఆధీనంలో ఉన్నవో..) వెలుగులకే వెలుగై, జగత్ చక్షువై ప్రకాశిస్తున్నాడో, ఆ సూర్యుని ప్రార్థిస్తూ, ఆతడు నాలోపల, బయట ఉన్న అజ్ఞానమనే అంధకారాన్ని, తమోగుణాన్ని, తొలగించి అనుగ్రహహించమని  *నమస్కరించుచున్నాను* 🙏


 *పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 🙏 𝕝𝕝卐𝕝𝕝_* 

   

   𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 

*యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః!*

*ప్రణమామి తమాదిత్యం బహిరన్త స్తమోపహమ్!!*


 *తా𝕝𝕝 ఎవడు ఈ జగత్తును సృష్టించి - పోషిస్తున్నాడో, లయం కూడా చేస్తున్నాడో... (సకల చరాచర జగత్తూ సృష్టి స్థితి లయలూ ఎవరి ఆధీనంలో ఉన్నవో..) వెలుగులకే వెలుగై, జగత్ చక్షువై ప్రకాశిస్తున్నాడో, ఆ సూర్యుని ప్రార్థిస్తూ, ఆతడు నాలోపల, బయట ఉన్న అజ్ఞానమనే అంధకారాన్ని, తమోగుణాన్ని, తొలగించి అనుగ్రహహించమని  *నమస్కరించుచున్నాను* 🙏


 *పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 🙏

⚜ శ్రీ వాజపల్లి మహా శివాలయం

 🕉 మన గుడి : నెం 1065


⚜ కేరళ  : వాజాపల్లి -  కొట్టాయం


⚜ శ్రీ వాజపల్లి మహా శివాలయం



💠 వాజపల్లి మహా శివాలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలోని చంగనస్సేరి సమీపంలోని వాజాపల్లిలో ఉన్న ఒక హిందూ దేవాలయం . 

ఈ ఆలయం ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డుచే నిర్వహించబడుతుంది .

ఈ ఆలయాన్ని కొడంగల్లూర్ మొదటి చేర రాజు నిర్మించాడని నమ్ముతారు . 


💠 మహాదేవ (శివుడు) విగ్రహ ప్రతిష్ఠాపనను పరశురాముడు స్వయంగా నిర్వహించాడని పురాణాలు సూచిస్తున్నాయి . 

పరశురాముడు స్థాపించిన 108 శివాలయాలలో ఈ ఆలయం ఒకటి . కేరళలోని రెండు నాలంబలములు మరియు రెండు ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించిన కొన్ని దేవాలయాలలో ఇది ఒకటి.


💠 పల్లిబాన పెరుమాళ్ కాలంలో  నీలంపెరూర్ శివాలయాన్ని బౌద్ధ విహారంగా మార్చాలని నిర్ణయించారు. పది బ్రాహ్మణ కుటుంబాలు (తరువాత పట్టియిల్లం పొట్టిమార్ అని పిలవబడేవి) నీలంపెరూర్ దేవాలయంలోని శివలింగాన్ని కదిలించడం ద్వారా వాజాపల్లికి వచ్చి, ఆపై ప్రస్తుతం ఉన్న వాజపల్లిలోని శివాలయంలో కలిసిపోయాయని నమ్ముతారు. 


💠 నీలంపేరూర్ నుండి తెచ్చిన శివలింగాన్ని మొదట వాజపల్లి గ్రామం ఉత్తర భాగంలోని దేవలోకంలో ప్రతిష్టించారు. తరువాత, వారు శివలింగాన్ని కదిలించడానికి ప్రయత్నించారు, కానీ అది కుదరకపోవడంతో, దుఃఖంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబానికి పరశురాముడు కనిపించాడు మరియు అతను పూజించిన శివలింగాన్ని అతనికి సమర్పించాడు మరియు అర్ధనారీశ్వర భావనపై ఆలయాన్ని నిర్మించమని సలహా ఇచ్చాడు. అతను శివలింగం మరియు పార్వతి విగ్రహం కోసం ఒక భారీ మందిరాన్ని నిర్మించాడు.


💠 గర్భాలయం శివలింగానికి తూర్పున మరియు పశ్చిమాన పార్వతి విగ్రహం గుండ్రని రాతి గ్రానైట్ మందిరం యొక్క మూడు గోడల లోపల నిర్మించబడింది. 

గర్భగుడి లోపల దక్షిణామూర్తి, గణపతిని దక్షిణ దర్శనంగా ఉంచారు. నంబళానికి ఆగ్నేయ మూలలో పెద్ద తిడపల్లి నిర్మించబడింది. 

రాజా నంబాలం ఆలయం వెలుపల కన్నిమూలలో శాస్తా కోసం ఆలయాన్ని నిర్మించాడు. 


💠 అతను తరనల్లూరు శ్రేణికి మరియు రోజువారీ పూజ కోసం పూజారులుగా కాసరగోడ్‌లోని తుళు బ్రాహ్మణ కుటుంబానికి ఆలయ తాంత్రిక ఆచారాల స్థానానికి పదోన్నతి పొందాడు. 

ప్రధాన అర్చకుని గొడుగుగా నియమించి కుఠశాంతి మఠంలో వసతి కల్పించారు.


🔆 చరిత్ర 🔆


💠 ఆలయ నిర్వహణ పది బ్రాహ్మణ కుటుంబాలకు (పది ఇల్లోమ్‌లు) చెందినది. 

ఈ పది బ్రాహ్మణ కుటుంబాలు నీలంపేరూర్ గ్రామం నుండి వచ్చిన తరువాత వాజపల్లిలో స్థిరపడ్డాయి. వారి ఆలయ పరిపాలన 17వ శతాబ్దం చివరి వరకు కొనసాగింది. 

ఇవి పది బ్రాహ్మణ కుటుంబాలు "చంగాజిముట్టం, కైనిక్కర, ఇరవిమంగళం, కున్నితిదస్సేరి, అత్ర్స్సేరి, కొలంచెరి, కిజాంగేజుత్తు, కిజక్కుంభగోం, కన్నంచేరి, తలవన".


💠 ప్రసిద్ధ రాగి లిపులు (వాజపల్లి శాసనం) ఈ మట్టు "తలవన మఠం" నుండి తిరిగి పొందబడ్డాయి. 

వజాపల్లి ఆలయంలో ప్రధాన ఆచార వ్యవహారాలను చంగాజిముట్టం మఠంలోని సన్యాసులు నిర్వహించారు. 


🔆 పండుగలు


💠 ఆలయానికి అనేక పండుగలు ఉన్నాయి. ముఖ్యమైనవి:


🔅 ముడియెట్టు


💠 ముడియెట్టు అనేది భారతదేశంలోని కేరళలోని ఒక సాంప్రదాయ  మరియు జానపద నృత్య నాటకం, ఇది కాళీ దేవత మరియు దారికా అనే రాక్షసుడికి మధ్య జరిగే పౌరాణిక యుద్ధాన్ని నాటకీయంగా చూపుతుంది. 

ఈ ఆచారం భగవతి లేదా భద్రకాళి, మాతృ దేవత యొక్క ఉగ్ర రూపమైన ఆరాధనలో అంతర్భాగం. 

ప్రదర్శనలు సాధారణంగా భద్రకాళి దేవాలయాలలో ఫిబ్రవరి మరియు మే మధ్య జరుగుతాయి, పంట కాలం తరువాత, చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది మరియు సమాజం యొక్క రక్షణ మరియు శ్రేయస్సును నిర్ధారిస్తుంది.


🔅 మహా శివరాత్రి


💠 మహా శివరాత్రి, హిందూ మతం యొక్క శైవ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగ, శివుని ఆరాధనకు అంకితం చేయబడింది. అనేక హిందూ పండుగల వలె కాకుండా, ఇది రాత్రిపూట జరుపుకుంటారు, సాంస్కృతిక ఉల్లాసానికి బదులుగా ఆత్మపరిశీలన మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలను నొక్కి చెబుతుంది. 

భక్తులు శివాలయాలలో ఉపవాసం, ధ్యానం మరియు రాత్రంతా జాగారం చేస్తారు, నిజాయితీ మరియు క్షమాపణ వంటి సద్గుణాలపై దృష్టి పెడతారు. 


💠 ఈ పండుగ శివలింగానికి బిల్వ ఆకులు, పాలు మరియు తేనె సమర్పించడం వంటి ఆచారాలతో చీకటిపై కాంతి మరియు చెడుపై మంచి విజయానికి ప్రతీక.


రచన

©️ Santosh Kumar

15-14-గీతా మకరందము

 15-14-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - జీవులు భుజించు ఆహారమును తానే పచనమొనర్చుచున్నానని భగవానుడు చెప్పుచున్నారు -

 

అహంవైశ్వానరో భూత్వా 

ప్రాణినాం దేహమాశ్రితః | 

ప్రాణాపానసమాయుక్తః 

పచామ్యన్నం చతుర్విధమ్ ||


తాత్పర్యము:- నేను ‘వైశ్వానరుడ'ను జఠరాగ్నిగానయి ప్రాణులయొక్క శరీరమును ఆశ్రయించి, ప్రాణాపానవాయువులతో గూడుకొని నాలుగువిధములగు అన్నమును పచనము చేయుచున్నాను.


వ్యాఖ్య:- క్రిందటిశ్లోకములో భగవానుడు తాను సస్యములను పోషించుటద్వారా జీవులు తిను అన్నమును సృష్టించుచున్నానని పలికి, ఇపుడా యన్నమును తానే జీవుల శరీరములందు పచనమొనర్చుచున్నానని వచించుచున్నారు. శరీరము ఆహారముచే నేర్పడుచున్నది. ఆ యాహారము జఠరాగ్నిచే పక్వముకానిచో, రక్తాదులద్వారా శరీరమంతటను వ్యాపించనేరదు. కావున జఠరాగ్ని శరీరమున కీలకస్థానమాక్రమించుకొనియున్నది. భగవానుడు తానే జఠరాగ్నిరూపమున అచ్చోట వర్తించుచున్నారని చెప్పుటవలన, దేహ నిర్మాత, దేహపోషణకర్త వారేయని స్పష్టమగుచున్నది. ఈ ప్రకారముగ ఆహారమును ధాన్యాదులద్వారా సృజించి, మఱల దానిని చక్కగా పచనముచేసి శరీరమునకు పుష్టిని కలుగజేయుచు జీవులకు మహోపకృతి నొనర్చుచున్న ఆ పరమాత్మకు కృతజ్ఞత చెల్లించక, ఆ అన్నము వారికి నివేదించక భుజించువాడు ఎంతటి కృతఘ్నుడు? అట్టివాడు దొంగయే యగునని పూర్వము శ్రీకృష్ణమూర్తి చెప్పియుండుట గమనించదగినది. [యో భుఙ్క్తే స్తేన ఏవ సః (3-12)] కనుకనే ఆహారమును భుజించుటకు ముందు దేవునకు ‘నైవేద్యము’ సమర్పించు ఆచారము లోకములో నేర్పడినది. అట్లు దేవునకు నివేదింపకుండ, దైవభావనలేకుండ భుజించునది అపవిత్రమే కాగలదు. కాబట్టి ప్రతివారును తాము భోజనముచేయుటకు ముందుగా, తమ యాహారమును దైవమునకు సమర్పించి, లేక అందలి కొంతభాగమును దైవస్వరూపులేయగు భూతకోట్లకు పెట్టి, భగవద్భావనతో భుజించవలెను. అప్పుడా భోజనమను క్రియ యజ్ఞముగాను, భుజించుపదార్థము అమృతముగాను మారిపోవును. 

  ‘ప్రాణినాం దేహమాశ్రితః’ - అని చెప్పుటవలన భగవంతుడు అతిసమీపమున దేహమందే యున్నాడని నిశ్చితమగుచున్నది. కావున తమ శరీరమున దైవసన్నిధానమును అనుభవించుచు, భగవద్భక్తిగలిగి, పాపాచరణలేక జనులు పవిత్రమార్గమునే చేబట్టవలెను.

      'పచామ్యన్నం చతుర్విధమ్’ - పరమాత్మ జీవుల శరీరములో జఠరాగ్నిరూపమున వర్తించుచు, వారు తిను నాలుగు విధములైన ఆహారమును జీర్ణమొనర్చుచున్నారని తెలుపబడినది.

నాలుగు విధములైన ఆహారము - (1) భక్ష్యము (2) భోజ్యము (3) లేహ్యము (4) చోష్యము.

(1) భక్ష్యము = దంతములచే కొఱకి తినబడు కఠినపదార్థములు, పిండివంటలు, కూరగాయలు మున్నగునవి.

(2) భోజ్యము = నాలుకచే చప్పళించి మ్రింగబడు మెత్తటి వస్తువులగు అన్నము మొదలైనవి. 

(3) లేహ్యము = నాలుకచే రుచిచూడబడు పచ్చళ్లు మొదలైనవి.

(4) చోష్యము = నోటిచే జుఱ్ఱబడు పాయసము, చారు, మజ్జిగ మున్నగునవి.

 ఇట్టి యాహారమును భగవానుడే జీర్ణమొనర్చుచుండుటవలన ఇక ఆహారవిషయమై మనుజుడెంత జాగరూకుడుగా నుండవలెనో యోచించుకొనవలయును. ఆహారసంబంధముగ ఈ క్రింది జాగ్రతలను పాటించుట ఉత్తమము - (1) అమితముగా భుజించి జీర్ణకర్తయగు భగవంతునకు పనిని కల్పించరాదు. (2) సాత్త్వికాహారమునే భుజించవలెను. రాజస, తామసాహారములను వర్జించవలెను*. (3) తిను ఆహారమును భగవంతునకు ముందుగా భక్తితో నివేదించవలెను. (4) ఆ యాహారము న్యాయార్జితవిత్తముచే నేర్పడినదిగా నుండవలెను. అధర్మమార్గముద్వారా సంపాదించిన ధనముతో పంచభక్ష్యపరమాన్నములను భుజించుట కంటె, న్యాయార్జితమైన సొత్తుతో లభించిన అంబలి త్రాగి బ్రతుకుట ఉత్తమము. భగవానుడు ప్రతివాని కడుపులో దాగి అంతయు గమనించుచున్నారు. కావున ఆహారాదివిషయములలో జనులు బహుజాగరూకులై యుండవలెను.

ఈ ప్రకారముగ ఈ అధ్యాయములో ఆహారవిషయమైన ప్రస్తావన విశేషముగ వచ్చియుండుటబట్టి భోజనకాలమున ఈ అధ్యాయమును పఠించు ఆచారము లోకమున ఏర్పడినది. అనేక ఆశ్రమములందును, మఠములందును, గృహములందును ఈ అధ్యాయమును సమష్టిగా గాని, వ్యష్టిగా గాని భోజనకాలమున జనులు పఠించి తదుపరి ఆహారమును సేవించుచుందురు. ఈ ప్రకారముగ భగవద్భావనతో భుజించువానికి పెట్టబడు అన్నము సాక్షాత్ భగవంతునకు పెట్టబడినట్లేయగును. అంతటి పుణ్యమాతనికి తప్పక లభింపగలదు. మఱియు దైవధ్యానముతో భుజించుటవలన మనుజుని శరీరములోని అణువణువు దైవశక్తితో గూడియుండును.

భోజనముచేయుటకు ముందుగా 15వ అధ్యాయమంతయును చెప్పి చివఱకు చేతిలో తీర్థమును గ్రహించి " బ్రహ్మార్పణం బ్రహ్మహవిః -' అను గీత 4వ అధ్యాయములోని 24వ శ్లోకమును భక్తితో పఠించి పిదప ఆ నీటిని అన్నముపైచల్లి ఆ పిదప భుజించుట ఉత్తమము.

ప్రశ్న:- పరమాత్మ జీవుల శరీరములందు ఏ రూపమున వెలయుచున్నాడు?

తిరుమల సర్వస్వం 193*

 *తిరుమల సర్వస్వం 193*


**శ్రీవారి ఆభరణాలు -5*


 *అన్యమత భక్తుల కానుకలు* 


 శ్రీవారి పరమభక్తులైన అన్యమతస్థులు సమర్పించుకున్న మరి కొన్ని ముఖ్యమైన నగలు ఉన్నాయి.


1. గుంటూరుకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అనే మహమ్మదీయ భక్తుడు సమర్పించిన, శ్రీవారి నిత్యపూజకు వాడే *108 బంగారు పుష్పాలు.*

2 2. ప్రతి బుధవారం జరిగే - *అష్టదళ పాద పద్మారాధన* లో స్వామి వారి అర్చనకు ఉపయోగించే, సయ్యద్ మీరా అనే మరో మహమ్మదీయ భక్తుడు సమర్పించిన 108 బంగారు పద్మాలు.


3. ఆనాటి చిత్తూరు జిల్లా కలెక్టర్, శ్రీవారి భక్తుడు అయిన థామస్ మన్రో అనే క్రైస్తవ మతస్తుడు సమర్పించుకున్న *'మన్రో గంగాళం'* గా ప్రసిద్ధి చెందిన, *బంగారు గంగాళం.*


 నానాటికీ, శ్రీవారి పట్ల భక్తి-విశ్వాసాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో, తదనుగుణంగా కానుకలు కూడా వెల్లవెత్తుతున్నాయి. దాంతో శ్రీవారికి ఒకే రకమైన, 2, 3 లేదా అంతకంటే ఎక్కువ సెట్లున్న ఆభరణాలు ఎన్నో ఉన్నాయి.


 ఎనిమిది దశాబ్దాల క్రితం ఆలయ యాజమాన్యం తి.తి.దే. ఆధ్వర్యంలోకి వచ్చినప్పటి నుండి, వారు కూడా తరచుగా శ్రీవారికి అమూల్యమైన ఆభరణాలు చేయిస్తూనే ఉన్నారు. వారు తయారు చేయించిన ఆభూషణాల జాబితాలో ముఖ్యమైనవి:


1. 1940 సంవత్సరంలో వజ్రకిరీటం.


2. 1954వ సం. లో వజ్రాల హారం.

 

3. 1972వ సంవత్సరంలో వజ్రాల శంఖు చక్రాలు.


4. 1974 లో వజ్రఖచిత కటిహస్తం.


5. 1986 లో వజ్రాల కిరీటం.


 ఆనందనిలయ విమానం స్వర్ణమయమని మనకు తెలిసిందే! దాదాపుగా వెయ్యేళ్ళక్రితం నుండే, ఆనందనిలయ గోపురానికి స్వర్ణకవచాన్ని తరచూ మార్చుతూ, దానికి మరిన్ని సొబగులు దిద్దుతున్నారు. అంతే కాకుండా, ఆలయంలోని అనేక ద్వారబంధాలు, తలుపులు, తిరుమామణి మంటపం పైకప్పు, ధ్వజస్తంభం ఇవన్నీ మేలిమి బంగారం పూతపూయబడి, ఎల్లవేళలా స్వర్ణకాంతులీనుతుంటాయి. శ్రీవారికి కనకమహాలక్ష్మితో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. చివరికి అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దబడిన స్వర్ణరథం కూడా శ్రీవారి స్వంతమే!


 శ్రీవారికి స్వర్ణాభరణాలే కాకుండా, వందలకొద్దీ వెండి ఆభరణాలు, బంగారం తాపడం చేయబడ్డ ఇతర లోహపాత్రలు, వెండి వాహనాలు, ఛత్రచామరాలు, ఉయ్యాలలు, శఠగోపురాలు లాంటివెన్నో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకు అంతే లేదు. శ్రీనివాసుని కలియుగశోభ, వారి వైకుంఠవైభవానికేమాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది. ఇరులోకాల లోనూ, సర్వకాల సర్వావస్థల యందు శ్రీమహాలక్ష్మి వారినంటిపెట్టుకొనే ఉండటం వల్లనే ఆ లక్ష్మీపతి కోట్లకు పడగలెత్తుతూ ప్రపంచంలోనే సంపన్నమైన దేవునిగా విలసిల్లుతూ, భక్తుల కొంగుబంగారమై ఒప్పారుతున్నాడు. 


 *ఉత్సవమూర్తుల ఆభరణాలు* 


 శ్రీవారి ఆలయంలో మూలమూర్తికి ఉన్న లెక్కలేనన్ని ఆభరణాలు ఒక ఎత్తయితే, ఉత్సవమూర్తులను అలంకరించే ఆభరణాలు మరో ఎత్తు.


 మలయప్పస్వామి వారికి కూడా మూలవిరాట్‌కు ఏమాత్రం తీసిపోనన్ని ఆభరణాలు ఉన్నాయి. ధ్రువబేరం ఆభరణాలు చూడాలంటే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, తప్పనిసరిగా ఆనందనిలయం లోనికి ప్రవేశించి, శ్రీవారిని దర్శించుకోవలసిందే! అయితే మలయప్పస్వామి వారు మాత్రం తరచుగా మాడవీధుల్లో విహరిస్తూ, భక్తుల చెంతకే వచ్చి వారి ఆభరణ విశేషాలతో భక్తులకు కనువిందు చేస్తారు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*


*332 వ రోజు*


*భూరిశ్రవసుడి కథ*


భూరిశ్రవసుడి మరణం గురించి వన్న ధృతరాష్ట్రుడు " సంజయా! మహా బలవంతుడైన సాత్యకి భూరిశ్రవసుడి చేత ఎందుకు అవమానాల పాలైయ్యాడు " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! చంద్ర వంశపు రాజైన యయాతి మహారాజు వలన వచ్చిందే యాదవ కులము. యాదవ కులమున పుట్టి దేవమీఢుని కుమారుడు శూరుడు అతడి కొడుకు వసుదేవుడు. దేవకుడనే రాజు తన కుమార్తె దేవకికి స్వయం వరం ప్రకటించగానే యాదవకుల రాజైన శిని దేవకిని వసుదేవుడికి ఇచ్చి వివాహం జరపాలని స్వయంవరానికి వచ్చిన రాజులను ఓడించి బలవంతంగా తీసుకు పోయాడు. అప్పుడు శినిని ఎవరూ ఎదిరించి నిలువ లేకపోగా సోమదత్తుడు మాత్రం ఎదుర్కొని యుద్ధం చేసాడు. ఇరువురు ఘోరంగా పోరాడిన పిదప శిని సోమదత్తుని ఓడించి అతడి జుట్టు పట్టుకుని ఈడ్చి చంపక వదిలాడు. ఆ అవమాన భారం భరించ లేక సోమదత్తుడు రాజ్యం విడిచి అడవులకు వెళ్ళి శివుని గురించి ఘోర తపమాచరించాడు. శివుడు ప్రత్యక్షం అయ్యాడు అప్పటికి శిని, అతడి కుమారుడు చనిపోయారు కనుక శిని మనుమడైన సాత్యకిని ఓడించే కుమారుడిని ప్రసాదించమని అడుగగా శివుడు అందుకు అంగీకరించాడు. శివుని వరప్రభావంతో సోమదత్తుడికి భూరిశ్రవసుడు పుట్టాడు. కనుక భూరిశ్రవసుడి చేతిలో సాత్యకి అవమానం పొందాడు " అని చెప్పాడు.*


*సాత్యకి భీమార్జునులు కర్ణుని ఎదుర్కొనుట*


అలా సాత్యకి చేతిలో భూరిశ్రవసుడు మరణించగానే అర్జునుడు తన రధమును సైంధవుడు ఉన్న వైపుకు పోనిచ్చాడు. సుయోధనుడు, అశ్వత్థామ, కర్ణుడు మొదలైన వారు అర్జునుడిని ఎదుర్కొన్నారు. సాత్యకి కర్ణుని ఎదుర్కొన్నాడు. కృష్ణుడు పాఛజన్యం పూరించగానే ముందు రోజు కృష్ణుడు చెప్పినట్లే దారుకుడు రథం సిద్ధం చేసి తీసుకు వచ్చి వారి ముందు నిలిపాడు. ఆ రధము గరుఢ ధ్వజముతో, శైల్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము, అను హయములు కట్టి ఉన్నాయి. శ్రీకృష్ణుడు సాత్యకితో " తమ్ముడా ! ఆ రథము ఎక్కి కర్ణునితో యుద్ధము చేయి " అన్నాడు. సాత్యకి ఆ రధమును అధిరోహించి కర్ణుని ఎదుర్కొన్నాడు. ఇది ఆశ్చర్యంగా చూస్తున్న అర్జునుడి చూసి శ్రీకృష్ణుడు " ఆర్జునా! తరువాత ఆశ్చర్యపడవచ్చు ముందు సైంధవుడిని కనిపెట్టు " అన్నాడు.అర్జునుడు సాత్యకి ఎలా అని అడుగగా కృష్ణుడు " సాత్యకి కర్ణులు ఒకరికి ఒకరు తీసిపోరు. సాత్యకిని నా చక్రరక్షకులు రక్షిస్తారు. వారి సంగతి విడిచి సైంధవుని వెదుకుట మన కర్తవ్యం " అన్నాడు. రెట్టించిన ఉత్సాహంతో సాత్యకి కర్ణుని శరీరం తూట్లు పడేలా కొట్టి, రధము విరుగ కొట్టి కేతమును తుంచు, రధాశ్వములను చంపి, సారధిని చంపాడు. అది శ్రీకృష్ణుని రధము కనుక దారుకుడు దానిలో సమృద్ధిగా ఆయుధములు పెట్టాడు కనుక సాత్యకి కర్ణుని అతడి సేనను తరిమి తరిమి కొట్టాడు. నీ కుమారులు వేరొక రధమును తీసుకు వచ్చి కర్ణుడి ముందు నిలిపారు. కర్ణుడు ఆ రధము ఎక్కి సాత్యకిని ఎదుర్కొన్నాడు. కర్ణుడి చేత అవమానం పొందిన భీముడు తల వంచుకుని అర్జునుడి వద్దకు వచ్చి కర్ణుడు అన్న మాటలన్నీ చెప్పి " తమ్ముడూ ! నేను వెంటనే కర్ణుడికి తగిన గుణపాఠం చెప్పాలి " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా ! నిన్ను అనడం నన్ను అన్నట్లే కనుక నేను వెంటనే వెళ్ళి కర్ణుని మదం అణుస్తాను " అన్నాడు. శ్రీకృష్ణుడు కర్ణుడి ఎదుట రథం నిలపగానే అర్జునుడు " ఏరా కర్ణా! మా అన్నయ్య భీమసేనుడిని తూలనాడతావా! భీమసేనుడు తరిమినప్పుడు సిగ్గు లేకుండా వెనక్కు పరిగెత్తావే అప్పుడు నిన్ను ఎవరైనా తిట్టారా ! యుద్ధంలో ఒక సారి ఓడుట ఒక సారి గెలుచుట సహజము కాదా ! ఒక్క సారి భీమసేనుడి మీద పైచేయి కాగానే ఇంత గర్వమా ! ఇప్పుడు సాత్యకి చేతిలో నీవు ఓడి పోలేదా ! ఎంతటి విశారదులకైనా గెలుపోటములు సహజం నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. మా చేతులో ఎన్ని సార్లు ఓడిపోయావు నేను లేనప్పుడు నా కుమారుని అభిమన్యుని అందరు కలసి చంపారు. ఇప్పుడు నేను నీ కుమారుని వృషసేనుడిని నీ కళ్ళ ముందే చంపుతాను నిన్నే కాదు నిన్న నా కుమారుడిని అధర్మంగా చంపిన అందరినీ ఏం చేస్తానో చూస్తూ ఉండండి " అంటూ కర్ణుడిని తరిమాడు. అప్పుడు కౌరవసేన అర్జునుడిని ఎదుర్కొంది. పోరు ఘోరం అయింది. పొద్దు వాలసాగింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

పేదరాశి పెద్దమ్మకధ 🌹

 పేదరాశి పెద్దమ్మకధ 🌹

👉🏿అనగనగా ఒక ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు , కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచిగా పెళ్ళిళ్ళు చేసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చక చకా నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపించింది. నిన్ను తినేస్తాను – అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసింది.

చెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైనది. యుక్తి గలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది. పెద్ద పులీ! పెద్ద పులీ! నేను ముసలదాన్నయాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు . అక్కడ పది రోజులు ఉంటాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు చేస్తుంది. సున్ని ఉండలు చేసి పెడుతుంది. అరిసెలు చేస్తుంది. అన్నీ తింటాను. ఒళ్ళు చేస్తాను. బలిసి వస్తాను. అప్పుడు తిందువుగాని – అంది పెద్దమ్మ. పెద్దపులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలి పెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురు ఇంటికి వెళ్ళింది. పది రోజులు అయ్యింది. పదిహేను రోజులు దాటింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా! ఇదే దారి కదా. అప్పుడు పడతా పెద్దమ్మ పని – అని కాచుకొని కూచుంది పులి. పెద్దమ్మ మూడు నెలలు అచట గడిపింది. ఇక బయలుదేర వలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా.

బయలు దేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురూ తెలివైనదే. అమ్మను కాపాడాలి. బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాన తెచ్చింది. బానలో పెద్దమ్మను కూచో పెట్టింది. మూత పెట్టింది. మూతకు గుడ్డ కట్టింది. దొర్లించి వదిలి పెట్టింది. బాన దొర్లుతూ అడవినబడి పోతాఉంది. బానలోని ముసలమ్మ హుషారుగా ఉంది.

పులి నన్నేమీ చేయలేదు – అనుకుంది. “బానా బానా దొర్లు,దొర్లు” అంటూ పాడుకుంటుంది. బాన అడవి మధ్యకు చేరింది. పులి సమీపించింది. పులికి బానలో పాట వినిపించింది. పులికి ఎక్కడలేని కోపం వచ్చింది. బానను కాలితో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాన ఢాం అని పగిలిపోయింది. ముక్కలయింది. పెద్దమ్మ బయటపడింది. భయం వేసింది. నిన్ను ఇప్పుడే తింటాను – అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులీ! పెద్దపులీ!ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది.

అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అపుడు హాయిగా తిందువుగాని – అంది పెద్దమ్మ. పులి “సరే” అని వదిలి పెట్టింది.

పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయ్యింది. రెండు గంటలు అయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది. కాని పట్టించుకోలేదు. ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి చెరువులో దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా! ముందే ఆలోచించింది. రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిల తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడిచింది. మూడవ కూతురు ఇంటికి చేరుకుంది.

నీతి: మనకు కష్టాలు ఎదురైనపుడు భయపడకుండా, సమయానికి తగిన విధంగా ఆలోచించి, తెలివిగా మసలడం నేర్చుకొవాలి. అలా వుంటేనే మన జీవితం హాయిగా సాగిపోతుంది.

💥💥💥💥💥💥💥💥💥💥💥

*30, మార్చి, 2025* *దృగ్గణిత పంచాంగం:*

 🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏


*🌼శుభోదయం*🍃

     -------------------

🏵️ *మహనీయుని మాట*🏵️

        -------------------------

"నిరాడంబరత, నిర్భయత్వం, నిరహంకారం, నిర్మలత్వం, నిర్మోహం వంటి ఉదాత్త లక్షణాలు వ్యక్తులకు సహజమైన అలంకారాలుగా వర్ధిల్లుతాయి."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"అందరూ నచ్చేలా, మెచ్చేలా చేయాలంటే అసాధ్యం!! నీకు ఏది మంచిదో అదే చెయ్యి. దాని వలన ఇతరులకు కీడు జరగకుండా చూసుకో.భగవంతుడు నీతోనే ఉంటాడు."


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


             *30, మార్చి, 2025* 

           *దృగ్గణిత పంచాంగం:*

                   ➖➖➖✍️


*సూర్యోదయాస్తమయాలు:* 

ఉ 06.04 / సా 06.20

సూర్యరాశి : మీనం 

చంద్రరాశి : మీనం/మేషం

🌺ఈనాటి పర్వం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం *యుగాది* 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం*

*వసంత ఋతౌః / చైత్ర మాసం/ శుక్లపక్షం*


*తిథి       : పాడ్యమి* మ 12.49 వరకు ఉపరి విదియ

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం   : రేవతి* సా 04.35 వరకు ఉపరి అశ్విని


*యోగం  : ఐంద్ర* సా 05.54 వరకు ఉపరి వైధృతి

*కరణం   : బవ* మ 12.49 బాలువ రా 10.59 ఉపరి కౌలువ


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 09.00 - 10.30 మ 02.00  - 04.00*

అమృత కాలం  : మ 02.28 - 03.52

అభిజిత్ కాలం  : ప 11.47 - 12.36


*వర్జ్యం              : శేషం ఉ 07.25 వరకు*

*దుర్ముహూర్తం  : సా  04.42 - 05.31*

*రాహు కాలం   :  సా 04.48 - 06.20*

గుళికకాళం       : మ 03.16 - 04.48

యమగండం     : మ 12.12 - 01.44

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  ఉ 06.04 - 08.31

సంగవ కాలం         :      08.31 - 10.58

మధ్యాహ్న కాలం    :      10.58 - 01.25

అపరాహ్న కాలం    : మ 01.25 - 03.53


*ఆబ్ధికం తిధి         : చైత్ర శుద్ధ పాడ్యమి/విదియ*

సాయంకాలం        :  సా 03.53 - 06.20

ప్రదోష కాలం         :  సా 06.20 - 08.41

రాత్రి కాలం             :  రా 08.41 - 11.48

నిశీధి కాలం          :  రా 11.48 - 12.35

బ్రాహ్మీ ముహూర్తం : తె 04.29 - 05.16.


🥀 *శ్రీ విశ్వా వసు నామ ఉగాదిరోజు ఆచరణ* 🥀 


🥀 1. *తైలాభ్యంగన స్నానం* 


ఉగాది రోజున విధిగా శరీరానికి నల్ల నువ్వుల నూనెతో మర్దన చేసుకొని  బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సూర్యోదయాత్ పూర్వం కానీ స్నానం ఆచరించాలి. స్నానం చేస్తూ గంగా గంగా గంగా అని 

3 సార్లయినా ఉచ్చరించాలి. 


🥀 2. *నూతన వస్త్ర ధారణ*  : 


స్నానం చేసాక కుదిరితే నూతన వస్త్రాలు కట్టు కోవాలి. కుదరకపోతే ఉతికిన సాంప్రదాయ  వస్త్రాలు ధరించాలి. ఆడా మగ ఎవరైనా సరే  షార్టులు - చడ్డీలు ధరించి దేవుడి ముందు కూర్చోవద్దు.  


🥀 3. *దేవతార్చన* :


నిత్య పూజ విధులు పూర్తయ్యాక కుటంబ సభ్యులందరూ కలిసి బ్రహ్మ దేవుడి ప్రార్థన సంవత్సరాది స్తోత్రం ప్రార్ధన చేయాలి. 


🥀! *బ్రహ్మ స్తుతి* ! 


ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే !

నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే !!

నమస్తే బహు రూపాయ విష్ణవే పరమాత్మనే !!!  


🥀 *సంవత్సరాది స్తోత్రం* 


అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహం !

అజారూడం చతుర్హస్తం ద్వి శీర్షం *ప్లవ* సంజ్ఞకం !! 


🥀 4. *పంచాంగం పూజ* 


శ్రీ విశ్వా వసు

 నామ సం.ర పంచా౦గాన్ని పూజించాలి. 


🥀5.  *నింబ కుసుమ భక్షణం* 


పూజా మందిరంలో ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి కింది శ్లోకం చదువుకుంటూ ప్రాసన చేయాలి. 


🌱🌱🌱🧘‍♀️🧘‍♀️🧘‍♀️🌱🌱🌱


శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ |

సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం | | 


🥀6.దానం


పితృ దేవతల ఆశీస్సుల కోసం ఉగాది రోజున చల్లని నీటి పాత్రను దానం చేయాలి. అలాగే తెల్లని వస్త్రాలు, గొడుగు, విసనకర్ర, చెప్పులు కూడా అవకాశం ఉన్నవారు ఇవ్వవచ్చు


🥀 7. *పంచాంగ శ్రవణం* 


సాయంత్రం ఇంటిల్లిపాది అందరూ కలిసి దగ్గరలోని ఆలయానికి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకొని, పంచాంగ శ్రవణం చేసి తమ రాశి ఫలాలను తెలుసుకొని పంచాంగ శ్రవణం చేయించిన పండితులవారి ఆశీస్సులు తీసుకోవాలి. 



                        🌈శుభమస్తు 🙌


                🙏లోకాః సమస్తా సుఖినోభవంతు🙏


🌱🌱🌱🧘‍♀️🧘‍♀️🧘‍♀️🌱🌱🌱

ఉగాది

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 *శ్రీ విశ్వావసునామ నూతన సంవత్సర (యు)ఉగాది శుభాకాంక్షలు💐*

నేటి...

    *ఆచార్య సద్భోదన*➖✍️

ప్రాపంచిక విషయాల కోసం మనం భగవంతుణ్ణి ప్రార్థించకూడదు. ఒకవేళ వాటిని ఆయన మనకు ప్రసాదించినా, ఆ విషయాలు మనకు దుఃఖాలను కూడా తెచ్చిపెడతాయి. 

భగవంతుడు కోరికలను తీర్చే కామధేనువు. 

అయితే వ్యక్తిగతమైన విజయాల కోసం, వాంఛల కోసం ఎన్నడూ ఆయనను ప్రార్థించరాదు.

సంసార సాగరంలోనూ, మమతానురాగాల మహాసముద్రంలోనూ మునిగిపోకుండా ఉండేటట్లు రక్షించమని మాత్రమే భగవంతుణ్ణి అర్థించాలి. 

సాధారణంగా మనం దుఃఖం కలుగుతున్నప్పుడు కూడా, శాశ్వతమైన ఆనందానికి మనల్ని చేర్చే భగవన్మార్గాన్ని వెతకకుండా, అర్థంపర్థం లేని కోరికలను ఏమాత్రం విడిచి పెట్టకుండా, ఆ దుఃఖాలలో సర్దుకుపోవడానికి సాధారణంగా ప్రయత్నిస్తూ ఉంటాం. 

శారీరక సుఖాలకు అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాక వాటిని వదులుకోవడానికి ఏ మాత్రమూ అంగీకరించం. ఎదురు దెబ్బలు తప్ప మరేమీ దక్కకపోయినా రకరకాలైన ఆ సుఖాలను అంటిపెట్టుకునే ఉంటాం. 

మాయ లేదా అజ్ఞానం యొక్క ప్రభావం అంత గొప్పది.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440889636. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

శ్రీవిశ్వావసు నామ సంవత్సరం విశేషాలు*

 *శ్రీవిశ్వావసు నామ సంవత్సరం విశేషాలు*


నూతన తెలుగు సంవత్సరం శ్రీవిశ్వావసు నామ సంవత్సరం నేడు మార్చి 30 ఆదివారం ప్రారంభ మైంది.

 

ఇది కలియుగం 5,127 సంవత్సరం, 28 మహాయుగం, ఏడవ మన్వతరం , బ్రహ్మ 51 సంవత్సరం లోని మొదటి రోజు. ఇప్పటికి ఈ సృష్టి జరిగి 216 కోట్ల సంవత్సరాల పైనే అయ్యింది.


 హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఈ సంవత్సరాల పేర్లు 60 సంవత్సరాల కాల చక్రాన్ని అనుసరించి మళ్ళీ మళ్ళీ వస్తాయి.

బ్రహ్మకల్పం ప్రారంభ మైన మొదటి ఉగాది ప్రభవ.


*హిందువుల సంవత్సరాలు ఎలా పుట్టాయి?*

 

*పేర్ల వెనుక వున్న పురాణ కథనం*


తెలుగు సంవ‌త్సరాలను గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. బ్రహ్మ మానసపుత్రుడు నారదమహాముని ఓ సారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజును పెళ్లాడాడు. ఈ దంపతులకు 60 మంది సంతానం జన్మించారు. ఆ రాజు తన సంతానంతో కలిసి ఓ యుద్ధంలో పాల్గొంటే.హ, అప్పుడు ఆ 60 మందీ యుద్ధంలో మరణిస్తారు. తన పిల్లల మరణాన్ని తట్టుకోలేని స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణువును ప్రార్థించగా, విష్ణువు కరుణించి, నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరశమిచ్చాడట. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

 

*ఆధ్యాత్మిక సంబంధ కథనం*


మనం సౌరమానంలో జీవిస్తున్నాం. ఏదైనా బిందువు దగ్గర నుంచి చుట్టు తిరిగితే 360 డిగ్రీలు పూర్తి అవుతుంది. కేంద్రం నుంచి గమనిస్తే ముందు 180 డిగ్రీలు, వెనక 180 డిగ్రీలూ అన్నమాట. వెనుక వున్న గతం 180 డిగ్రీలూ గతం. నిలబడిన రేఖ వర్తమానం. ముందున్నవి భవిష్య సూచకాలు. కృత, త్రేతా, ద్వాపర యుగాల కంటే కలియుగంలో మానవుల ఆయుర్దాయం పడిపోయి కేవలం 120 సంవత్సరాలకు వచ్చిందట. అందుకే 60 ఏళ్ళు పూర్తవగానే సగం జీవితం పూర్తయ్యిం దని గుర్తు చేస్తూ లోక సంబంధ విషయాలు పూర్తి చేసుకొమ్మని, షష్టిపూర్తి ఉత్సవం చేస్తారు. అంటే మిగిలిన 60 ఏళ్లు తరువాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ ఆధ్యాత్మికచింతనలో బ్రతకాలని చెప్పకనే చెప్తున్నా రన్నమాట.


2025 విశ్వావసు నామ సంవత్సరం. హిందూ సంవత్సరాలలో ఇది 39 ది. 


*విశ్వావసు ఎవరు?*

 విశ్వావసు 6000 గంధర్వులలో ఒక డు. గంధర్వులు మంచి గాయకులు, నృత్యకారులు, సంగీతకారులు, సుందరులు. అప్సరసలతో సహజీవనం చేస్తూ ఉంటారు. విశ్వావసు తన తపస్సుతో బ్రహ్మ దేవుని నుంచి అమరత్వం సిద్ధింప చేసుకున్నాడు. ఆ తరువాత అహంకారంతో ఇంద్రుని మీద దాడి చేసి, ఇంద్రుని క్రోధానికి గురి యైనాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వాసుని చేతులను, తొడలను శరీరంలో కోసివేశాడు. దానితో విశ్వాసుడు చేతులు, తొడలు లేని వికృత రూపం పొందాడు. తన తప్పు తెలుసుకున్న విశ్వాసుడు ఇంద్రుణ్ని వేడుకున్నాడు. ఇంద్రుడు కరుణించి, అతనికి రెండు పొడవైన చేతులతో పాటు, పొట్టలోనే భుజించేందుకు వీలుగా ఒక నోటిని ఇచ్చాడు. అలా విశ్వాసుడు కబంధుడై అరణ్యంలో జీవించాడు. అతను భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే మునులను భయపెడుతూ వచ్చాడు. ఇలా చేస్తూండగా ఒకసారి స్థూలశిరు డనే మహాముని తటస్థపడి, ” నీకీ రూపమే శాశ్వతంగా ఉండిపోవు గాక !” అని శపించాడు. అప్పుడు కబంధుడు మునికి క్షమాపణ చెప్పుకుని, శాప విముక్తి ఎలాగని అడిగాడు. “ఎప్పుడు రాముడు అడవికి వచ్చి, నీ చేతులు నరికి నీకు దహనక్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం వస్తుంది” అని ముని చెప్పి వెళ్లిపోయాడు.


*విశ్వావసుడి శాప విమోచనం*


శ్రీరాముడు, లక్ష్మణుడు సీతను వెదకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా, విచిత్రరూపంలో ఉన్న ఓ రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదు రయ్యాడు. అతనికి తల, మెడ, కాళ్లు లేవు. ఉదరం అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పెద్ద నోరుంది. ఊరువుల ప్రదేశంలో రెండు ఉగ్రనేత్రా లున్నాయి. అతని బాహువులు మాత్రం ఎనిమిది యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పిట్లో బిగించాడు. దీనికే “కబంధహస్తం” అనే నానుడి ఉన్నది. భయకర మైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడం చేతిని నరికివేయడంతో ఆ రాక్షసుడు నేలకు ఒరిగాడు. తనను గాయపరిచింది రాముడు అని తెలుసుకుని కబంధుడు ఎంతో సంతోషించాడు. కబంధుడు తన వృత్తాంతం తెలిపి తనకు అంత్యక్రియలు నిర్వహించమని శ్రీరాముడిని కోరగా, రాముడి అతని కోరిక మేరకు అలానే చేస్తాడు. కబంధుడు తన పూర్వగంధర్వ రూపాన్ని సంతరించు కుంటాడు. ఆ విశ్వావసు నామమే హిందూ సంవత్సరాలలో ఒకటి.

శాస్త్రాల ప్రకారం, ‘‘ఉగ’’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అని అర్థం. అంటే విశ్వం లోని జీవకోటి రాశుల ఆయుష్షుకు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం, ‘యుగం’ అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం (ఏడాది) కాగా, ఈ యుగానికి ఆది ఉగాది అవుతుం దని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఉగాది నుంచే వసంత బుుతువు ప్రారంభ మవుతుంది.   


పురాణాల ప్రకారం, చైత్ర మాసం శుక్ల పక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభ మైనట్లు పండితులు చెబుతారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మ దేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ‘‘ఉగాది’’ఆచరణ లోకి వచ్చిం దని చాలా మంది నమ్ముతారు. ఛైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించి నట్లు పండితులు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు.


ఉగాది పండుగ వేళ శిశిర బుుతువుకు వీడ్కోలు పలికి, వసంత బుుతువుకు స్వాగతం పలుకుతాం. ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభ మవుతుంది. కోయిల రాగాలు వినిపిస్తాయి. తెలుగు వారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభ మవుతుంది. అందుకే దీన్ని తెలుగు వారి తొలి పండుగ అంటారు. 


ఈ పవిత్ర మైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని మామిడాకులతో అలంకరించి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.

 

 ఉగాది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం. తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు అనే షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, మంచి చెడుల గురించి వివరిస్తుంది. ఈ పచ్చడిలో ఉప్పు, మిరియాల పొడి, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, బెల్లం తప్పనిసరిగా వాడతారు. అదే విధంగా ఉగాది రోజునే పంచాంగ శ్రవణం, గోపూజ, ఏరువాక ఆచారాలను పాటిస్తారు.

          🙏🙏🙏🙏

*సంక్షిప్త దివ్య రామాయణ పారాయణం*

 *9 రోజులపాటు ప్రతిరోజూ*


*సంక్షిప్త దివ్య రామాయణ పారాయణం*


*1 వ  రోజు*


గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు


గురుదేవో మహేశ్వరః


గురు సాక్షాత్ పర బ్రహ్మ


తస్మై శ్రీ గురవే నమః


***


శ్రీరాఘ‌వం ద‌శ‌ర‌థాత్మ‌జ మ‌ప్ర‌మేయం


సీతాప‌తిం ర‌ఘుకులాన్వ‌య ర‌త్న‌దీపం


ఆజానుభాహుం అర‌వింద ద‌ళాయ‌తాక్షం


రామం నిశాచ‌ర వినాశ‌క‌రం న‌మామి.


****


శ్రీ‌మ‌ద్ రామాయ‌ణం ఆదికావ్యం.  వాల్మీకి మ‌హ‌ర్షి, బ్ర‌హ్మ అనుగ్ర‌హంతో మాన‌వాళిని త‌రింప‌చేయ‌డానికి ఈ మ‌హాకావ్యాన్ని మ‌న‌కు అందించారు.


వాల్మీకి మ‌హ‌ర్షి ఒక‌రోజు త‌మ‌సా న‌దికి స్నానాకి వెళ్ళాడు. అక్క‌డ ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మ‌మీద క్రీడిస్తూ ఆనంద‌సాగ‌రంలో ఉన్న ఒక ప‌క్షుల జంట‌లోని మ‌గ‌ప‌క్షిపై కిరాతుడు ఒక‌డు బాణం వేశాడు. అది విల‌విలకొట్టుకుంటూ నేల‌రాలింది. ఆ బాణం దెబ్బ‌తో ఆ మ‌గ‌ప‌క్షి ప్రాణాలు విడిచింది. ఆ మ‌గ‌ప‌క్షి చుట్టూ తిరుగుతూ  ఆడ‌ప‌క్షి విల‌పిస్తుండ‌డం చూసిన వాల్మీకి మ‌హ‌ర్షి మ‌న‌సు ద్ర‌వించింది.


ఆయ‌న హృద‌య లోని  శోకం,  శ్లోకంగా మారింది.


మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|


యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్| |


ఓ కిరాతుడా! క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపావు. అందువలన నీవు ఎక్కువకాలము జీవించియుండవు. (శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు) అని ఆ కిరాతుడిని, మహర్షి శ‌పించాడు .


అదే క్ష‌ణంలో బ్ర‌హ్మ ప్ర‌త్య‌క్ష‌మై నీ నోట స‌ర‌స్వ‌తి ప‌లికింది. క‌విత్వం జాలువారింది. నువ్వు రామాయ‌ణ మ‌హాకావ్యాన్ని ర‌చించి మాన‌వాళిని త‌రింప‌చేయి . అది భూలోకంలో శాశ్వ‌తంగా ఉంటుంది.,అని  సూచించి అక్క‌డినుంచి వెళ్లిపోయాడు.


*బాల‌కాండ*

కోసలదేశానికి రాజధాని అయోధ్య. శత్రువులు జయించడానికి వీలులేనిది కనుక దీనికి అయోధ్య అని పేరు. ఈ రాజ్యానికి అధిపతి దశరథుడు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తున్నాడు, ధర్మాత్ముడు. దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. తనకు సంతానం లేకపోవడంతో దశరథుడు పుత్రకామేష్టి యాగాన్ని తలపెట్టాడు. యాగం పరిసమాప్తమైన వెంటనే యాగ జ్వాలలనుంచి ఒక మహాపురుషుడు పాయసంతో కూడిన బంగార కలశంతో ప్రత్యక్షమై దానిని దశరథుడికి యాగఫలంగా అందించాడు. ‘ఇందులోని పాయసాన్ని నీ రాణులకు ఇవ్వు , వారి యందు నీకు సంతానం కలుగుతుంది’ అని దీవించి ఆ మహాపురుషుడు అదృశ్యమయ్యాడు. దశరథుడు పరమానందంతో ఆ పాయసంలో సగభాగాన్ని కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన సగభాగంలో సగం సుమిత్రకు ఇచ్చాడు.మిగిలిన నాలుగవ వంతులో సగభాగం కైకేయికి ఇచ్చాడు. ఇంకా మిగిలిఉన్న ఎనిమిదవ భాగాన్ని మళ్లీ సుమిత్రకు ఇచ్చాడు. వారు దానిని దివ్య ప్రసాదంగా స్వీకరించారు.

*శ్రీరామ జననం*.....

ఆ తర్వాత సంవత్సరానికి చైత్రశుద్ధ నవమినాడు పునర్వుసు నక్షత్రంలో కౌసల్యాదేవి సర్వలక్షణ సంపన్నుడైన, తేజోవిరాజమూర్తి అయిన శ్రీరాముడిని ప్రసవించింది.

వెడ ద కన్నుల వాడు,                                                                           విపులాంసముల  వాడు,                                                                                   రాకేందు బింబ వక్త్రంబు వాడు,                                                                               కంబు కంఠంబు వాడు,                                                                                           ఘన లలాటము వాడు ,                                                                                  రమణీయ మృదు కపోలముల వాడు                                                                                  పీన వక్షమువాడు , పృథు నితంబము వాడు,                                                                             సముదగ్ర చారు మస్తకము వాడు,                                                                           దివ్యదేహమువాడు, దీర్ఘబాహులవాడు,                                                              కమనీయ శుభలక్షణముల వాడు,                                                                             నీలమేఘశ్యాముడు సర్వలక్షణ సుశోభితుడు                                                                  లోక రక్షకుడు శ్రీరామచంద్ర మూర్తి జన్మించారు.                                                          సత్య పరాక్రముడైన భరతుని, కైకేయీదేవి ప్రసవించింది.                                               సకల శాస్త్ర పారంగతులైన లక్ష్మణ, శత్రుఘ్నులను సుమిత్రాదేవి ప్రసవించింది.                           లోకం పులకించి పోయింది.

*విశ్వామిత్రుడి* *ఆగమనం*.....

అయోధ్యాన‌గ‌రంలో శ్రీ రామ ల‌క్ష్మ‌ణ భ‌ర‌త శ‌త్రుఘ్నులు ధ‌నుర్ విద్య‌లో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు.మ‌హ‌ర్షుల యాగాల‌కు ఆటంకం క‌లిగిస్తున్న రాక్ష‌సుల‌ను అంతం చేయ‌డానికి ద‌శ‌ర‌థ‌మ‌హారాజు సాయం కోరి విశ్వామిత్రుడు అయోధ్యా న‌గ‌రానికి విచ్చేశాడు. రాజ‌మందిర ద్వారం వ‌ద్ద నిల‌బ‌డి త‌న రాక‌ను ద‌శ‌ర‌థ మ‌హారాజుకు తెలియ‌జేయ‌మ‌న్నాడు. విష‌యం తెలిసిన వెంట‌నే, ద‌శ‌ర‌థుడు స‌క‌ల మ‌ర్యాద‌ల‌తో విశ్వామిత్ర మ‌హ‌ర్షికి సాద‌ర స్వాగ‌తం ప‌లికాడు. ఏం కావాల‌న్నా ఇస్తాన‌న్నాడు. విశ్వామిత్రుడు తాను వ‌చ్చిన ప‌నిని వివ‌రించాడు. మారీచ సుబాహువుల‌నే రాక్ష‌సులు తమ య‌జ్ఞ‌యాగాల‌కు ఆటంకం క‌లిగిస్తున్నారని చెప్పాడు.  రాక్షసులను  శ‌పించ‌వ‌చ్చు కానీ, యజ్ఞ క్ర‌తువులో నిమ‌గ్న‌మైన‌పుడు కోపం ద‌రిచేర‌కూడ‌దు కనుక రాక్షసులను శ‌పించ‌డం లేదని చెప్పాడు.  ఇలాంటి ప‌రిస్థితుల‌లో యాగ‌ రక్ష‌ణ జ‌ర‌గాలంటే శ్రీ‌రాముడిని త‌న వెంట పంపాల‌ని విశ్వామిత్రుడు ద‌శ‌ర‌థ మ‌హారాజు ను కోరాడు. ఈ మాట వింటూనే ద‌శ‌ర‌థుడికి దిక్కుతోచ‌లేదు. లేక లేక క‌లిగిన సంతానాన్ని ఇలా రాక్ష‌స సంహారం కోసం పంప‌డ‌మా? అని బాధ‌ప‌డ్డాడు. రాముడి  బ‌దులు తాను వ‌స్తాన‌న్నాడు.

ఏం కోరినా ఇస్తాన‌ని చెప్పి, ఇప్పుడు మాట త‌ప్పుతావా? ఇది రాజ‌ధ‌ర్మ‌మా? అని విశ్వామిత్రుడు ద‌శ‌ర‌ధుడిని సూటిగా ప్ర‌శ్నించాడు . వ‌శిష్ఠుల వారు గమనించారు. లోక కల్యాణం కోసమే ఇదంతా జరుగుతున్నదని, విశ్వామిత్రుడి వెంట రాముడిని పంపడం వల్ల రాముడి కీర్తి ,యశస్సు పెరుగుతాయని దశరథుడికి సూచించాడు.వశిష్టులవారి  సూచ‌న మేర‌కు ఎట్టకేలకు విశ్వామిత్రుడి వెంట రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను పంప‌డానికి దశరథుడు నిర్ణ‌యించాడు. అలా విశ్వామిత్రుడి వెంట రామ‌ల‌క్ష్మ‌ణులు అయోధ్య దాటి,   అరణ్య మార్గంలో ముందుకు సాగుతున్నారు.  అలా త‌న‌ను అనుస‌రిస్తున్న రామ‌ల‌క్ష్మ‌ణుల‌కు   స‌రయూ న‌దీతీరంలో - ఆక‌లి, ద‌ప్పిక‌లు లేకుండా బ‌ల , అతి బ‌ల అనే విద్య‌ల‌ను విశ్వామిత్రుడు వారికి అనుగ్ర‌హించాడు. దీనివ‌ల్ల వారికి ఎన్న‌టికీ ఆక‌లి , ద‌ప్పిక‌లు ఉండ‌వు.  ఆ రాత్రి వారు అక్క‌డే విశ్ర‌మించారు. మ‌రునాడు ఉద‌యం తెల తెల వారుతుండ‌గా ....


కౌసల్యా సుప్రజా రామ                                                                                       పూర్వాసంధ్యా ప్రవర్తతే ।

ఉత్తిష్ఠ నరశార్దూల                                                                                                 కర్తవ్యం దైవమాహ్నికం ॥

కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుతోంది, దైవ సంబంధాలైన కార్య‌క్ర‌మాలు  చేయవలసి ఉంది. క‌నుక లెమ్ము, అంటూ ఆ శ్రీ‌రామ చంద్ర‌మూర్తిని, విశ్వామిత్ర మ‌హ‌ర్షి మేల్కొలిపాడు.

మ‌హ‌ర్షి మేల్కొలుపుతో లేచి, సంధ్యావంద‌నాది కార్య‌క్ర‌మాలు ముగించుకుని వారు అక్క‌డి నుంచి బ‌య‌లుదేరారు. అలా న‌డుచుకుంటూ వారు మ‌హార‌ణ్యంలో ఒక జ‌న‌ప‌దం చేరారు. అక్క‌డ తాట‌క అనే రాక్ష‌సి ఉంటున్న‌ది. దాని గురించి రాముడికి తెలిపాడు మ‌హ‌ర్షి. అగ‌స్త్యుని ఆశ్ర‌మ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తూ , జ‌నాన్ని తింటూ ఇది బ‌తుకుతున్న‌ద‌ని రాముడికి వివ‌రించాడు. దీనికి వెయ్యి ఏనుగుల బ‌లం ఉంటుంద‌ని చెప్పాడు. తాట‌క స్త్రీ క‌దా దానిని చంప‌డం ఎలా అని సంకోచించ‌కుండా , దుష్ట శ‌క్తిని సంహ‌రించ‌మ‌ని  విశ్వామిత్రుడు, రాముడికి సూచించాడు.

*తాటక వధ:*

రాముడు ధ‌నుష్ఠంకారం చేశాడు. ఆశ‌బ్దానికి తాట‌కి ఉగ్రురూపిణి అయి శ‌బ్దం వ‌చ్చిన దిక్కుగా వ‌చ్చింది. రాముడు దాని చేతులు ఖండించాడు. సాయంత్రం అయితే దాని బ‌లం ఇంకా పెరుగుతుంది క‌నుక వెంట‌నే దానిని సంహ‌రించ‌మ‌న్నాడు విశ్వామిత్రుడు. రాముడు తాట‌కిని సంహ‌రించాడు. వెంట‌నే విశ్వామిత్రుడు రాముడికి దివ్యాస్త్రాలు అనుగ్ర‌హించాడు.  దండ‌చ‌క్ర‌, ధ‌ర్మ‌చ‌క్ర‌, కాల‌చ‌క్ర‌, విష్ణు చ‌క్ర‌,బ్ర‌హ్మాస్త్ర‌, కాల‌పాశ‌,ధ‌ర్మ‌పాశ‌, వ‌రుణ‌పాశ‌, ఆగ్నేయాస్త్రం, వాయ‌వ్యాస్త్రం ఇలా స‌మ‌స్త్ర అస్త్రాల‌నూ అనుగ్ర‌హించాడు.  తాట‌కి వ‌ధ‌తో లోకం లో పుష్ప వ‌ర్షం కురిసింది. అక్క‌డి నుంచి విశ్వామిత్ర మ‌హ‌ర్షి తాము యాగం చేస్తున్న సిద్ధాశ్ర‌మానికి  వారంతా చేరుకున్నారు.

*మారీచ,సుబాహువుల వధ*:

విశ్వామిత్ర మ‌హ‌ర్షి యాగం మొద‌లు పెట్టారు. అంతే రాక్ష‌సులైన మారీచ సుబాహువుల అనుచ‌ర‌గ‌ణం అక్క‌డ‌కు చేరుకుని యాగానికి ఆటంకం కలిగిస్తోంది. రాముడు బాణాల వ‌ర్షం కురిపించి వారిని హ‌త‌మార్చాడు. తాట‌క కొడుకు మారీచుడిపై బాణం సంధించాడు. వాడు వంద‌యోజ‌నాల దూరంలో స‌ముద్రంలో పోయి ప‌డ్డాడు.

ఇక రాక్షసులు ఎవ‌రూ అటువైపు క‌న్నెత్తి చూడ‌లేదు. యాగం నిర్విఘ్నంగా సాగిపోయింది.

ఆ త‌ర్వాత వారు అక్క‌డ నుంచి మిథిలా న‌గ‌రానికి బ‌య‌లుదేరారు. మార్గ‌మ‌ధ్యంలో వారు గౌత‌మ మ‌హ‌ర్షి ఆశ్ర‌మం చేరుకున్నారు. అక్క‌డ అహ‌ల్య శాప గాథ‌ను విశ్వామిత్రుడు రాముడికి తెలిపాడు. నీ పాద స్ప‌ర్శ‌తో ఆమెకు  పూర్వ రూపం వ‌స్తుంద‌న్నాడు.  రాముడి దృష్టి ప‌డ‌గానే అహ‌ల్య పూర్వ రూపంతో లేచి నిల‌బ‌డింది. రామ‌ల‌క్ష్మ‌ణులు ఆ సాధ్వీమ‌త‌ల్లికి న‌మ‌స్క‌రించి ముందుకు సాగారు.

*సీతా స్వయంవరం:*

మిథిలా న‌గ‌రంలో సీతా స్వ‌యంవ‌రం వార్త తెలుసుకుని విశ్వామిత్ర మ‌హ‌ర్షి, రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను మిథిల‌కు తీసుకువెళ్లాడు. శివ‌ధ‌న‌స్సును విరిచి సీతమ్మ‌త‌ల్లిని స్వ‌యంవ‌రంలో రామ‌చంద్ర‌మూర్తి ద‌క్కించుకున్నాడు. అయోధ్యలో ఉన్న ద‌శ‌ర‌థుడికి క‌బురుపంపి సీతారామ క‌ల్యాణానికి ఏర్పాట్లు చేశారు.  ల‌క్ష్మ‌ణ భ‌ర‌త‌శ‌త్రుఘ్నుల‌కూ వివాహాలు జ‌రిపించారు.            ద‌శ‌ర‌థుడు కొడుకులు, కోడ‌ళ్ల‌తో అయోధ్య‌కు బ‌య‌లుదేరాడు. మార్గ మ‌ధ్యంలో ప‌ర‌శురాముడు ఎదురై, శివ‌ధ‌నుస్సు విరిచినందుకు రాముడిపై ఆగ్ర‌హించాడు.  నూత‌న వ‌ధూవ‌రుల‌పై ఆగ్ర‌హం త‌గ‌ద‌ని ద‌శ‌ర‌ధుడు ప‌ర‌శురాముడిని వేడుకున్నాడు. అయినా కుద‌ర‌ద‌న్నాడు పరశురాముడు . త‌న ద‌గ్గ‌ర  ధ‌నుస్సు తీసుకుని బాణం ఎక్కుపెట్ట‌మ‌ని రాముడికి సవాలు విసిరాడు. రాముడు బాణం సంధించి వ‌దిలాడు.  అది దూసుకువస్తుండడంతో పరశురాముడు హడలిపోయాడు. వ‌దిలిన బాణం ల‌క్ష్యాన్ని ఛేధించ‌క త‌ప్ప‌దు. నీ న‌డ‌క‌ను నిరోధించ‌నా  లేక నీవు త‌ప‌స్సుతో ఆర్జించిన పుణ్య‌లోకాల‌ను  వ‌దిలించ‌నా అని పరశురాముడిని, శ్రీరాముడు అడిగాడు. పరశురాముడు తన ఎదురుగా ఉన్నది శ్రీమహావిష్ణువని గ్రహించాడు. పుణ్య‌లోకాల‌ను వ‌దిలిస్తే మ‌ళ్లీ త‌ప‌స్సు చేసి సాధించుకుంటాన‌ని  చెప్పి పరశురాముడు పుణ్య‌లోకాల‌ను వ‌దులుకున్నాడు . రాముడి శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను కీర్తించి ప‌ర‌శురాముడు అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు.


ఇక అక్క‌డ నుంచి ర‌థాలు అయోధ్య దిశ‌గా క‌దిలాయి........

*****

యావత్ స్థాయన్తి గిరయ: సరితశ్చ మహీతలే

తావ ద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి

ఈ ప్రపంచంలో గిరులు  ,నదులు   ఉన్నంత కాలం రామాయణ కథ లోకంలో నిలిచి ఉంటుందని కవియైన వాల్మీకితో , బ్రహ్మదేవుడు అంటాడు.


శ్రీమద్రామాయణం లోని ప్రతి అక్షరం మోక్ష ప్రదమే ,పాపనాశమే.

ఇదం పవిత్రం పాపఘ్నం , పుణ్యం వేదైశ్చ సమ్మితమ్

య:పఠే ద్రామచరితం సర్వపాపై:ప్రముచ్యతే

రామకథ పవిత్రమైనది. పాపములను హరిస్తుంది. పుణ్యమైనది. వేదములతో సమానమైనది.

రామకథను పఠించువారు సర్వపాపాలనుంచి విముక్తులౌతారు అని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణ బాలకాండలో తెలుపుతారు.

****

ఆపదామపహర్తారం దాతారం                                                                                 సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం                                                                                             భూయో భూయో నమామ్యహమ్.

****

*శ్రీరామ రామ రామేతి*

*రమే రామే మనోరమే                                                              సహస్రనామ తత్తుల్యం.  రామనామ వరానే*

( బాల‌కాండ స‌మాప్తం)

కృతిపతి కాశీస్సులు!

 శు భో ద యం 🙏


శు భో ద యం🙏


కృతిపతి కాశీస్సులు!


            శా:  శ్రీవక్షోజ  కురంగనాభ  మెదపైఁ  జెన్నొంద ,విశ్వభరా


                   దేవిన్  దత్కమలా   సమీపమున  బ్రీతిన్  నిల్పినాడో యనం


                   గా ,వందారు  సనందనాది  నిజభక్తశ్రేణికిన్   దోచు   , రా


                  జీవాక్షుండుఁ   గృతార్ధుసేయు  శుభ దృష్టిన్  కృష్ణరాయాధిపున్. 


                   మనుచరిత్ర ప్రారంభ పద్యము-  అల్లసాని  పెద్దన  గారు!


                 అర్ధము:   శ్రీ-  లక్ష్మీదేవియొక్క; వక్షోజ  -స్తనముల యందలి;  కురంగ నాభము- కస్తూరి ; ఎదపై-  వక్షస్థలమందు;  చెన్నొందన్- ప్రకాశింపఁగా;  విశ్వంభరాదేవిన్ - భూదేవిని;  తత్- ఆ;  కమలాసమీపమున- లక్ష్మి సన్నిధానమునందు;  ప్రీతిన్- ప్రేమతో;

నిల్పినాడో  యనంగా- నిల్పెపెనాయని ;  వందారు- నమస్కరించు ;  సనందనాది- సనందనుడు మున్నగు; నిజభక్తశ్రేణికిన్- తన భక్త

సముదాయమునకు  తోచు- కనబడు;  రాజీవాక్షుండు- విష్ణువు;  శుభదృష్టన్- శుభములనొసగు చూపులతో; కృష్ణరాయాధిపున్-

శ్రీకృష్ణరాయ  సార్వభౌముని;  కృతార్ధు  సేయున్- కోరికలు దీర్చి గాపాడుగాక!


                   భావము: లక్ష్మీదేవి  వక్షోజములకు గల కస్తురి  విష్ణువక్షస్థలమునకు అంటగా  ,నమస్కరింప వచ్చిన  సనక సనందనాదిభక్తిలకు " శ్రీహరి  లక్ష్మిదేవితోబాటు  భూదేవిని గూడ తనహృదయమున  ధరించెనా? " యను భ్రమను కల్గించుచుండెను.

అట్టి శ్రీహరి కృష్ణరాయల కోరిక లీడేర్చి రక్షించుగాక.! యనిభావము.


              విశేషాంశములు: విష్ణువక్షాలయా"- అని కమలాదేవికి బిరుదు. శ్రీహరి వక్షస్థలమామెకు స్వంతము. అక్కడ మరెవ్వరికి తావులేదు. కానీ చూచు సనకాది భక్తులకు  భ్రమకలుగుచున్నది. యేమని?  లక్ష్మి ప్రక్కన  శ్రీదేవినిగూడ (శ్రీహరి) చేర్చెనేమోయని. సవతుల నొక్కచోటఁజేర్చుటా!అమ్మో!యెంతయాశ్చర్యము!దానికి కారణముగూడ కనిపించుచున్నది. లక్ష్మీదేవి తన స్తనమండలమున  కస్తూరీ ద్రవ్యము నలదుకొని  వచ్చినది. శ్రీహరి ప్రణయ పారవశ్యమున

కమలను కౌగిలింప  ఆకస్తురి యంతయు నతని  వక్షస్థలమున  కంటినది. కస్తురి  నల్లనిది. భూమియు నల్లనిదే  ఆకారణమున సనకాదుదులకు  అనుమానము  గలిగినది.ఆవిధముగా  యిరువురి  భార్యలను రంజింపజేయు సామర్ధ్యముగల హరి కృష్ణరాయల కాపాడుగాక !యనిపెద్దన యాశీర్వాదము..


                         దీని వెనుక  రాయల కథయు వ్యంగ్య రీతిని జోడించినాడు. రాయలకు  తిరుమలదేవి, చిన్నాదేవి యను నిరువురు

భార్యలు. నావిష్ణుః పృధివీపతిః - అన్నారుగనుక రాయలుగూడ విష్ణుతుల్యుడే! భార్యలును  శ్రీదేవి భూదేవులే.హరి భార్యలను ఏలినట్టు  గా నీవును దేవేరులను రంజింప జేయవలెననుట  యొకసందేశము. 


                   రాజ్యాధికారమునకు  మూలమైనవి భూమి ,ధనము , ఈరెంటిని  తనయధీనమున నుంచుకొన్నహరి ,ఆరెంటిని నీకొసంగి

రక్షించునుగాక! అనియాశీర్వాద ఫలితమును వెల్లడించుట. 


                              మహా కవుల  కవితల లోని మతలబు  లిట్లుండును. 


                                              స్వస్తి!🙏


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

యు(ఉ)గాది...

 యు(ఉ)గాది...


లోకమును బ్రహ్మచే సృష్టించ బడిన రోజును యుగ ఆది పిలవడం జరిగింది. తెలుగు నేల యందు ఉగాది గాను, కన్నడ ప్రాంతమందు యుగాది గాను, మహారాష్ట్ర గోవా ప్రాంతాల యందు గుడి పద్వా అని పిలవడం జరుగుతోంది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి కాల నామ సంవత్సరము చైత్ర మాసమందు మొదటి రోజును ఉగాది పర్వదినం నిర్వహించడ మైనది. పండుగ రోజు పంచాంగ శ్రవణం చేయడంతో పాటు ఉగాది పచ్చడిని సేవించడం చేయుదురు. 


ప్రతి మనిషి జీవితంలో ఉండే ఆరు రకాల భావోద్వేగాలకు ఆరు రకాల షడ్రుచులను అన్వయిస్తారు. 


సంతోషానికి మధురం అనగా తీపి, కోపమునకు కటువు అనగా కారము, ఆమ్లంనకు పులుపు, తిక్తం అనగా చేదు, వగరు, లవణం అనగా ఉప్పు,  కషాయం అనగా వగరు వంటి గుణాలు కలిగిన చెరకు తేనే/బెల్లం, మిరప/మిరియం, చింత/నిమ్మ, వేప పువ్వు, ఉప్పు, మామిడి పిందె వంటి ప్రకృతి ప్రసాదించిన పండ్లు, పువ్వు, మిశ్రమాలను కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.


శరీర గుణాలైన వాత, పిత్త, కఫములను సమతూకము చేయడమే కాకుండా శరీరంలో అనేక దుష్ప్రభావాలు రాకుండా 

షడ్రుచులు తగు పాళ్లలో సేవించడం ద్వారా శరీరం యొక్క రసాయన క్రియలలో క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఈ విషయం ఆయుర్వేదం చెబుతోంది. అందుకే ఉగాది పచ్చడికి అంత ప్రాశస్త్యం కలదు. వసంత కాలం నుండి  గ్రీష్మ కాలం వరకు వేడి పెరిగి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. 


అందుకే ఈ ఋతువులలో శరీరానికి షడ్రుచులు అందించడం మేలుకరం.


ఉగాది పండుగ సంవత్సరానికి తొలి రోజున జరపడం తెలుగు, కన్నడ ప్రాంతీయులు నిర్వహించడం చేస్తుంటారు. 


ముఖ్యంగా తెలుగు నేల యందు పంచాంగ శ్రవణం ముఖ్య కార్యక్రమంగా నిర్వహిస్తారు. 


కొత్త సంవత్సరంలో రాశులు, నక్షత్రాల గమనం ప్రకారం జాతకాలను వినడం చేస్తుంటారు. నూతన కాల పయనంలో పంటలు, వర్షాలు, ప్రమోదాలు, విపత్కరములు వంటి గురించి సంఘ, వ్యక్తిగతంగా పూజ్యం, అవమానంలతో పాటు ఆదాయం, ఖర్చు వంటి భవిష్యత్తు ఆశాజనక విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది.


*అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు.*


మన అందరికి ఈ ఉగాది పండుగ  కొత్త జవసత్వాలు కూడిన 

నూతన శక్తిని కలిగించాలని మనసారా కోరుకుంటున్నాను.


మీ,


అశోక్ చక్రవర్తి నీలకంఠం.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ప్రతిపత్ - రేవతి -‌‌ భాను వాసరే* (30.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*