ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
3, జులై 2023, సోమవారం
శ్రీ ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్
👉 హైదరాబాద్ : బంజారాహిల్స్
👉 శ్రీ ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్
💠 Iscon హరే కృష్ణ స్వర్ణ దేవాలయం తెలంగాణలోని 1వ స్వర్ణ దేవాలయం
💠 వందల సంవత్సరాల క్రితం రోడ్డు నంబర్ 12 బంజారాహిల్స్ వద్ద భగవంతుడు స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిగా వెలిశాడు. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామితో పాటు శివుడు కూడా స్వయంభూ శ్రీ పాంచజన్యేశ్వర స్వామిగా వెలిశాడు.
అటువంటి గొప్పదైన హైదరాబాదులోని ఉన్న స్వయంభూ నృసింహ క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాము
🌀 ఆలయ చరిత్ర:
💠 7-8 శతాబ్దాలకు చెందిన ఈ ఆలయాన్ని భక్తులు నాలుగు వందల ఏళ్ల క్రితం కనుగొన్నారట. అక్కన్న, మాదన్నలు కూడా ఈ స్వామివారిని సేవించుకున్నారని చెబుతారు.
శివుడు నృసింహ స్వామిని ఉద్దేశించి మహామంత్ర రాజపద స్తోత్రాన్ని పఠిస్తూ, 'దాసభూతాః స్వతః' అంటూ చివరి శ్లోకాన్ని ఈ భావంతో చదువుతారు.
"ఈ సమస్త జీవరాశి మీ సృష్టే కనుక, మేమంతా పుట్టుకతో మీ పాద దాసులమే. ఇది తెలుసుకుని, మా ప్రభువైన మిమ్ము చేరి, నమస్కరించి, మిమ్ము శరణాగతి వేడుతున్నాను."
💠 ఈ చివరి శ్లోకంతో ప్రసన్నులైన నృసింహ స్వామి, లక్ష్మి సమేతుడై శివుని ముందున్న ఉద్భవ శిలనుంచి, ప్రత్యక్షమై తన పాంచజన్యం తో శివుని శిరస్సు స్పృశించి, దీవించారట. అందుకే ఇక్కడి శివునికి 'పాంచజన్యేశ్వర స్వామి' అన్న పేరు వచ్చింది. యాదగిరిగుట్ట ఆలయంలో లాగానే స్వామి, అమ్మవారు ఇక్కడ నిల్చున్న భంగిమలో ఉంటారు.
💠 శివకేశవులు ఇరువురూ ఒకే ఆలయంలో పూజలు అందుకోవడం ఇక్కడి విశేషం.
1907 వ సం.లో ఈ ఆలయానికి శ్రీ కృషన్ ప్రసాద్ జాగీర్దారు 47.19 ఎకరాల భూమిని దానం చేసినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. 2002లో యాదగిరిగుట్ట ఆలయం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకున్నారు.
💠 రానురాను ఈ ఆలయ భూముల ఆక్రమణలపాలు అవుతూ ఉండడంతో పురావస్తుశాఖ, ఈ ఆలయ బాధ్యతనంతా ఏదైనా ప్రతిష్టాత్మకమైన సంస్థకు అప్పగించాలని భావించింది. ఆ క్రమంలో 2011లో ఈ ఆలయాన్ని ఇస్కాన్ కు అప్పగించడం జరిగింది. అప్పటికి ఐదెకరాల భూమి మాత్రం మిగిలింది.
💠 ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని భక్తులు భావించినప్పుడు వారి చేతిలో రూపాయి లేదు. అటువంటిది, ఇప్పుడు అక్కడ తెలంగాణాలోనే మొట్టమొదటి బంగారు ఆలయమైన, 15 కోట్ల విలువైన స్వర్ణ దేవాలయం బూర్గు జువెలర్స్(బూర్గు వేంకటేశ్వర రావు, ఆయన శ్రీమతి రాధ) సహకారంతో నిర్మించబడింది. ఆలయ గోపురంపై సుదర్శన చక్రం కూడా ప్రతిష్టించ బడింది. మొత్తం ఆలయ నిర్మాణం ఎటువంటి ఆటంకాలు, ప్రమాదాలు లేకుండా జరిగింది.
ఇదంతా ఎలా సాధ్యమయింది?
💠ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్న రోజుల్లో భక్తులు ఈ ప్రాంగణంలో 'హరే కృష్ణ' మంత్రాన్ని జపిస్తూ దశకోటి మంత్ర జపాన్ని పూర్తిచేశారు. స్వామివారి దయవల్ల ఈ ఆలయ నిర్మాణానికి కావలసిన డబ్బు, శ్రామికులు, ఇంజినీర్లు, వనరులు, సామాగ్రి, ఇలా సమస్తం సమకూరాయి. పరంపర ఆచార్యులైన ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య, శ్రీల ప్రభుపాదుల దీవెనలు, సూచనలు ఈ కార్యాన్ని మరింత సుగమం చేసాయి.
💠 నూతన ఆలయ నిర్మాణానికి ఇస్కాన్ శ్రీకారం చుట్టింది. ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. కొంతమంది వాస్తు బాగా లేదు అసలు ఇక్కడ ఆలయమే రాదన్నారు, స్వామి దయతో దోషాలన్నీ తొలగి, ఆలయ నిర్మాణం మొదలైంది. కొంతమంది వేయి అడుగులు తవ్వితే కానీ బంజారాహిల్స్ ప్రాంతంలో నీరు పడదన్నారు. 200 అడుగులకే ధారాళంగా నీరు పడింది.
💠 బూర్గు జువెలర్స్ వారు ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో నేపాల్ లోని గండకీ నది నుంచి ఒక అరుదైన, అతి పెద్దదైన సాలగ్రామాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. గంగ నీరు ఈ సాలగ్రామంలో ఉండటంవల్ల (చెవి ఆనించి వింటే నీటి శబ్దం తెలుస్తుంది) దీనిని 'జలగర్భ సాలగ్రామ నారాయణ శిల' అన్న పేరుతో పిలుస్తారు. శృంగేరి శ్రీ భారతీ తీర్థ స్వామి వారి సూచనతో, ఈ సాలగ్రామాన్ని ఈ క్షేత్రానికి లభించిన అనుగ్రహంగా భావించి, గర్భాలయంలోనే ఉంచటం జరిగింది.
💠 యోగహనుమంతుడు ఈ క్షేత్రపాలకుడు. ఇదే ఆలయంలో రాధాకృష్ణ మూర్తులను కూడా ప్రతిష్టించి, వైదిక పరంపర ప్రకారం అనేక క్రతువులను ఇస్కాన్ వారు సంప్రదాయ బద్ధంగా, అద్భుతంగా నిర్వహిస్తున్నారు.
💠 ఈ ఆలయంలోనే రావి చెట్టు క్రింద స్వామివారి పాదుకలను ప్రతిష్టించారు. యాగశాల కూడా ఉంది. ప్రస్తుతం ఆలయ పరిసరాలను మరింత అభివృద్ధి చేస్తూ, మరికొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి.
💠 ఆలయానికి హరినామ మండపం ఉంది.
ధ్వజ స్తంభం తర్వాత జపమంటపం ఉంది. శ్రీకృష్ణుని దర్శనం కోసం ముందుకు సాగుతున్నప్పుడు అతని పవిత్ర నామాలను జపించడం ద్వారా ఆయనను స్మరించుకోవడానికి మరియు కీర్తించడానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గాన్ని సూచిస్తుంది..
💠 ఆలయాన్ని సందర్శించే భక్తులు సందర్శకులు హరినామ మంటపం గుండ 108 మెట్లు మరియు ప్రతి మెట్టుపై భక్తులు నిలబడి హరే కృష్ణ మహా-మంత్రాన్ని జపిస్తారు .
💠 ఇన్ని విశేషాలు ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించి స్వామి వారి అనుగ్రహానికి పాత్రులమవుదాము.
జయజయ నృసింహ!
గురుర్బ్రహ్మ
డా. దేవులపల్లి పద్మజ
విశాఖపట్టణము
ఫోను 9849692414
గురు పూర్ణిమ
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
సదాశివ సమారంభాం శంకరాచార్య మాధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం !!
తల్లి జన్మనిచ్చి చల్లగా పెంచును
తండ్రి వెంట నిలచి దన్ను నిచ్చు
గురువు విద్యనేర్పి గుణములు గరపును
ప్రకృతి పలుకునిచ్చు ప్రఙ్ఞ మనకు !!
మానవ జీవిత చరితార్థానికి, భగవదర్శనానికి బాటలు వేసేవారు గురువులు. గురుపూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, వ్యాసపూర్ణిమ ఏదైనా పవిత్రమైనదే. ఈ రోజు వ్యాసభగవానుని జన్మదినము. అష్టాదశ పురణాములను మనకు అందించిన మహనీయుని జన్మదినం కారణంగా గురుస్థానములో ఆ వ్యాసభగవానుని స్మరిస్తూ చేసుకునే పవిత్రమైన రోజు. ఆషాడ పూర్ణిమను గురు పూజతో ఉత్సవం చేయటం మన భారతీయ సంస్కృతిలో భాగమైనది. గురువుని త్రిమూర్తిస్వరూపంగా భావిస్తాము. మానవ చరిత్రలోనే అపూర్వమైన ఆధ్యాత్మిక పర్వదినంగా నిలచినది వ్యాస జన్మతిథి. ముందుగా ఈ తిథికి సంబంధించిన ఒక చక్కని కథను తెలుసుకుందాము.
ఒక శిష్యుడు తన గురువుగారిని వెదుకుతూ చివరికి ఆయనను కలుసుకుంటాడు. కొంత కాలం తరువాత శిష్యుడు సెలవు తీసుకుంటూ తిరిగి ఎప్పుడు దర్శనమిస్తారు అని గురువుగారిని అడుగుతాడు. అప్పుడు గురువుగారు యిలా చెబుతారు --
శృణు విప్ర తపేచ్చా చేత్ దర్శనార్థం తదా త్వయా
పూజనీయో విశేషేణ, కథంవాచయితా స్వయం !
బ్రాహ్మణోత్తమా! నీవు నన్ను దర్శించాలని కూతూహలంగా ఉన్నావు గనుక విను. ఎవరైనా పురాణగాథలను, వేదగాథలను వ్యాఖ్యానం చేస్తూ వాటి రహస్యాలను ఉపదేశిస్తుంటారో వారే నా నిజ స్వరూపం అని తెలుసుకుని, అతనిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలసినది. నేను ఎల్లప్పుడూ ఇటువంటి పౌరాణికులందరిలోనూ ఉంటాను అని అంటారు.
అందువలన పౌరాణికులు, కథకులు, బోధకులు గురువులుగా పిలవబడతారు. పురాణాలలో నిగాఢంగా నిహితం చేయబడిన విషయాలను మానవజాతి ఙ్ఞానం సంపాదించాలంటే వ్యాస మహర్షి అనుగ్రహం అవసరము. అందుచేత మనం వ్యాస పూర్ణిమ నాడు పౌరాణికులను, మన గురువులను ధూపదీప నైవేద్యాలతో పూజించి తగిన విధంగా సత్కరించాలి. గురువులకు గురువుగా ఖ్యాతి గడించిన మహనీయుడు వ్యాసమహర్షి. అందువలన లోకంలో అందరూ శ్రీ వ్యాసమహర్షిని పూజించి, గౌరవించాలి. హిందూమతంలో భగవంతుని తెలుసుకోవటానికి ముఖ్యమైన ఆలంబనగా గురువును భావిస్తారు. తమ జీవితాలకు సరైన మార్గ నిర్దేశనం చేయటానికి కావలసిన సాథన సంపత్తి గురువు ద్వారా లభిస్తుందని అందరి విశ్వాసం. గురువులుగా ప్రసిద్ధిగాంచిన , ఆదిశంకరులు, దత్తాత్రేయుడు, శ్రీషరిడీ సాయినాథుడుమొదలైనవారిని ఈరోజు కొలుస్తారు. ఈ గురుపూర్ణిమ ఉత్సవాన్ని శ్రీ ఆదిశంకరులే ప్రారంభించారని కూడా చెబుతారు. ఆఙ్ఞానమనే చీకటిని తొలగించి, ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించేవారు గురువు. మనం జన్మించిన తరువాత మన కన్నతల్లిదండ్రులు ప్రథమ గురువులు కాగా, మిగిలిన జీవితం మొత్తం మార్గనిర్దేశనం చేసేవారు గురువు.
గురుపూర్ణిమ నాడు ఉదయమే మేల్కాంచి, శుచియై తమ ఇంటిలోని పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముఖద్వారానికి చక్కటి మామిడి తోరణాలను అలంకరించాలి. ఒక కొత్త వస్త్రాన్ని పరచి అందులో బియ్యం పోసి, మధ్యలో తమలపాకు నుంచి, వాటి మధ్యలో గురు ప్రతిమనుంచాలి. ఉత్తరం వైపుగా కంచు దీపం వెలిగించి, తులసిమాల ధరించి పూజ నిర్వహించాలి. షోడశోపచారములతో పూజలు నిర్వహించి, తీర్థప్రసాదములను స్వీకరించాలి. ఈ విధంగా నిర్వహించటం వలన సకల ఈతి బాధలు తొలగిపోతాయని నమ్మకం.
ఈ రోజు దేవాలయాలలో కూడా విశేష పూజలు నిర్వహిస్తారు. ఉదయం పాలాభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. రోజంతా గురుప్రార్థనలు చేస్తారు. సాయంకాలం చక్కటి ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏర్పాటు చేస్తారు. భక్తులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొని ఆనంద పరవశులౌతారు. శ్రీ గురుచరిత్ర, సాయిచరిత్ర వంటి పుస్తకాలను, ఉడకబెట్టిన శెనగలను అందరికీ పంచిపెడతారు.
పూర్వకాలంలో గురుకులాలుండేవి. శిష్యులందరూ ఈ రోజు అమితమై భక్తిశ్రద్ధలతో గురువును పూజించి వారి ఆశీర్వాదాన్ని స్వీకరించేవారు. గురువులు కూడా శిష్యులను తమ కన్న పిల్లలవలె చూసుకునేవారు. అందుకే ఆనాటి గురు శిష్య పరంపర, సంబంధ బాంధవ్యాలు అవిచ్ఛిన్నంగా కొనసాగేవి. కాని నేటి తరంలో అటువంటి స్థితిగతులు కానరావటం లేదు. సాక్షాత్తు దేవదేవుడైన శ్రీరాముడు విశ్వామిత్రుని వద్ద విద్యను అభ్యసిస్తారు. శ్రీకృష్ణుడు కూడా తన చిన్నతనంలో గురు ఆశ్రమంలో విద్యనభ్యసించి, గురువుకు గురుదక్షిణ చెల్లిస్తాడు. ఆయనకు ఆసాధ్యమైనది ఏదీ లేకపోయినప్పటికి, సర్వం ఆయన సృష్టి అయినప్పటికి, ఆచారాలను పాటించాలని, అందరకూ మార్గనిర్దేశనం చేయటానికి ఆవిధంగా చేస్తాడు.
కామధేనువు మరి కల్పవృక్షము కూడ
గురువు మనసునందు కొలువుయుండు
గురువునకు సరియగు గురుదేవులే సుమా
ప్రకృతి పలుకునిచ్చు ప్రఙ్ఞ మనకు !!
సమస్త ప్రకృతిలో నిండి నిభిఢీకృతుడై ఙానానందాన్ని, ప్రేమను పంచటానికి గురువు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ మహత్తర ఙ్ఞానాన్ని అందుకోవటానికి శిష్యులకు చిత్తశుద్ధి అవసరం. మనిషిలో గుప్తంగా దాగియున్న ఙ్ఞానాన్ని, విశేష శక్తియుక్తులను వెలికితీసి మార్గనిర్దేశనం కలిగించేవారు గురువు. ‘‘గురువు లేనివాడు బరువగు నేలకు’’.
తల్లి దండ్రి గురువు ధరణిలో పూజ్యులు
మరువకున్న దైవ కరుణ కలుగు
మరచిపోవువారు పరమ హీనులు సుమా
ప్రకృతి పలుకునిచ్చు ప్రఙ్ఞమనకు !!
మనమందరమూ గురువుకు తగిన గౌరవమర్యాదలు కలిగిస్తూ, వారి అడుగుజాడలలో పయనిద్దాం. విశ్వమానవ సౌభ్రాతృత్వానికి బాటలు వేద్దాం. గురువులు కూడా సత్ప్రవర్తన కలిగి, ఉన్నత ఆశయాలతో, నిష్కల్మష ప్రేమనందిస్తూ శిష్యులద్వారా లోకోన్నతికి కృషి చేయాలి. అందరం కలసి ఈ శుభదినాన ప్రతిన చేద్దాం, విశ్వమానవ శాంతికి బంగారు బాటలు వేద్దాం.
ఓం శ్రీ గురుభ్యోనమః
గురువుv ప్రాధాన్యత
🎻🌹🙏_వ్యాస పూర్ణిమా సందర్భంగా....!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿మనం ఒకసారి పూర్వ చరిత్ర గనక తీసుకుంటే అన్ని యుగాలలోను గురువుకు చాలా ప్రాధాన్యత ఉన్నది....
🌸సమాజం గురువుకి తగు అర్హతలు ఉన్నాయా లేవా గుర్తించి గురువుగా స్వీకరించేవారు. అలాగే గురువుగా నడుచుకునేవారు కూడా చాలా నిబద్ధతతో ధర్మపరంగా సమాజ శ్రేయస్సు కోరిన వారే._
🌿వ్యాసులవారి దగ్గరనుండి ప్రతి యుగంలోనూ ధర్మ పరిరక్షణలోనూ సమాజ శ్రేయస్సు కోసం మహా పురుషులు గురువులుగా ఉంటూ ఆ సనాతన ధర్మ పరంపరను తరవాత తరాలకి అందించడం కోసం, ముక్తిమార్గాన్ని అన్వేషించడంలో శిష్యులకు బోధిస్తూనే ఉన్నారు.
🌸కాబట్టే మన హైందవ, భారతీయ, సనాతన ధర్మం, ఇతిహాస పురాణాలు, సాంస్కృతిక, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్ని పటిష్టంగా ఉన్నాయి._
🌸సత్య యుగం నుండి ఇప్పటి కలియుగం వరకు గురుపరంపర కొనసాగుతూనే ఉంది.
🌹ఆచార్యుల పరంపర: 🌹
🌿A. సత్య యుగ లేద కృత యుగంలో...
1. నారాయణుడు
2. శివ
3. బ్రహ్మ
🌸B. త్రేతా యుగంలో:
1. వశిష్ఠ మహర్షి
2. శక్తి మహర్షి
3. పరాషర మహర్షి
🌿C. ద్వాపర యుగంలో:
1. వేద వ్యాస
2. శ్రీ శుఖ ఆచార్య
🌸D. కలి యుగంలో:
1. శ్రీ గౌదపాద
2. శ్రీ గోవింద భగవత్పాద
3. శ్రీ ఆది శంకర
4. రామానుజాచార్యులు
5. మధ్వాచార్యులు
🌿ఇంతటి మహోన్నత గురు పరంపర కలిగిన ఏకైక దేశం మనదే. అట్టి పటిష్టమైన వ్యవస్థ ఉన్నది కాబట్టే సమాజం ఒక మంచి నడవడికతో ఉంటూ వచ్చింది.
🌸ఎన్నో ప్రామాణికమయిన, విలువయిన వాటిని మనం తక్షణమే గుర్తించి మన ఈ భక్తి, గురు, సాంప్రదాయ మొదలగు భారతీయ వ్యవస్థను పటిష్ఠ పరచుకోవలసిన భాద్యత ప్రతి భారతీయుడు మీద ఉంది._
🌿తల్లి తండ్రి గురువు👏
🌸"గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః"...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
వ్యాస భగవానుడు
వ్యాస భగవానుడు
ముని పరాశరునికి ముదిత సత్యవతికి
శ్రీహరి యంశతో క్షితిని బుట్టి
సుజ్ఞానమునుపొంది విజ్ఞాన ఖనియయ్యు
విమల జ్ఞానంబుతో వినుతికెక్కి
ప్రోగగు వేదముల్ బాగుగా విభజించి
వేద వ్యాసునిగను వేద్యుడయ్యు
భాసురం బైనట్టి భారత గాథను
జయ నామ ధేయాన జగతికిచ్చి
భారత మందున భగవాను విభవంబు
చింతించ లేదని చింత నొంది
భగవాను లీలలు భక్తుల కథలతో
భాగవతము జేసి పరిఢ విల్లె
అష్టాదశంబైన యఖిల పురాణముల్
భక్తుల కందించె భాసురముగ
సంతానహీనమౌ శంతను వంశమున్
కాపాడె సంతుతో కరుణ జూపి
గాంగేయు కన్నయై కడు బాధ్య తొందియు
కౌరవ వంశమున్ కాచి పెంచె
అంధుని కిప్పించె నరయ సంజయునిచే
యధ్యాత్మ గీత నత్యంత భక్తి
దుర్వార వీరుడౌ ద్రోణపుత్రుని యొక్క
గర్వంబు నణచియు కట్ట డునిచె
శ్రీకృష్ణ భగవాను చిద్విలాసంబును
వేనోళ్ళ స్తుతియించె విభవముగను
అంతకసుతు చేత యశ్వమేధంబును
జరిపించి చక్కగా జగతి వెలిగె
విశ్వమందున గురువుగా వినుతు డైన
వ్యాసభగవాను నుతియింతు వంచి శిరము
పరమ గురుడగు వ్యాసుకు భక్తితోడ
చేతు శతకోటి నతులను చిత్త మలర
గోపాలుని మధుసూదన రావు
సోరియాసిస్
సోరియాసిస్ వ్యాధి గురించి సంపూర్ణ వివరణ -
మనుష్యులకు వచ్చు అత్యంత తీవ్రమైన మరియు అంత సులభముగా లొంగని ఒక వ్యాధి గురించి మీకు వివరిస్తాను. దాని పేరు "సిద్మ కుష్టు" దీనిని " సోరియాసిస్ " అంటారు. ఇది ఒక రకమైన కుష్టు వ్యాథిగా ఆయుర్వేదం పరిగణించినది . 18 రకాల కుష్టు వ్యాధులలో ఇది ఒకటి. ముఖ్యంగా దీని లక్షణాలు చర్మం పైన పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడి పొట్టు రాలడం . అదే విధముగా కీళ్ల భాగములో సోరియాసిస్ వచ్చినపుడు "సోరియాసిస్ ఆర్థరైటిస్ "
వచ్చును. ఇది అత్యంత మొండి వ్యాధి .
సోరియాసిస్ రావడానికి గల కారణాలు -
* ఒకదానితో ఒకటి పడని విరుద్దమైన ఆహార పదార్దాలు సేవించడం . అనగా పాలు చేపలు , పాలు పెరుగు, మాంసం పాలు వంటి విరుద్దమైన ఆహారాలు తీసుకొవడం .
* మలము, మూత్రము , వాంతి , అపానవాయువు మొదలయిన సహజవేగాలు ని నియంత్రించడం . బలవంతంగా ఆపడం.
* బాగా ఆహారాన్ని తిన్న వెంటనే కొంతసేపైనా విశ్రాంతి తీసుకోకుండా ఎండలో నడవడం. తిన్న వెంటనే వ్యాయామం చేయడం .
* చల్లని నీరు , పానీయాలు తాగి వెంటనే టీ మరియు కాఫీ వంటి వేడి పదార్దాలు సేవించడం . లేదా చల్లని గాలులు వీచే ప్రదేశంలో పనిచేసి ఒకేసారి ఎండ లోకి వచ్చి సమయం గడపడం.
* ఎక్కువరోజులు ఉపవాసం చేయడం , లేదా ఆలాపమైన భోజనాన్ని ఎక్కువరోజులు చేయడం .
* కొత్త ధాన్యాలు , పెరుగు , చేపలు , ఉప్పు , పులుపు వీటిని ఎక్కువుగా తినే అలవాటు ఉండటం .
* మినుములు , ముల్లంగి , పిండిపదార్ధాలు , నువ్వులు , పాలు , బెల్లం వీటిని అమితంగా తినడం
* తిన్న ఆహారం జీర్ణం కాక ముందే వెంటనే రతిక్రీడలో పాల్గొనడం .
ఇటువంటి ప్రధాన కారణాల వలన వాతం , పిత్తం , కఫం అనే మూడు దోషాలు ప్రకోపించబడి ఆహారం నుంచి పుట్టిన రసధాతువు ను , రక్తధాతువును , మాంసధాతువును , మేధోధాతువు ని కూడా దూషింప చేయడం వలన 18 రకాల కుష్ఠు వ్యాధులు కలుగుతాయి.
సోరియాసిస్ ఉన్నవారు తీసుకోవలసిన ఆహార పదార్దాలు -
* పాతబియ్యంతో వండిన అన్నం మాత్రమే తినాలి
* పాత గొధుమలు రవ్వలా , పిండిలా చేసుకొని జావ , రొట్టె తినవచ్చు.
* పెసరపప్పు కట్టు, కందిపప్పు కట్టు తినవచ్చు.
* బీరకాయ , పొట్లకాయ , ఆనపకాయ , దోసకాయ , వేపపువ్వుతో చేసిన కారంపొడి , కాకరకాయలు , పెరుగుతోటకూర , పొన్నగంటి కూర మెంతికూర , గలిజేరుకూర , ఆవుమజ్జిగ , ఆవునెయ్యి , తేనె , నీరుల్లి , సుగంధపాల వేళ్ళ కషాయం , పాతనిమ్మ , దబ్బ , ఉశిరిక , చింతపచ్చళ్ళు తినవచ్చు.
తినకూడని ఆహార పదార్దాలు -
* కొత్తబియ్యం అన్నం .
* చిక్కటి పులుసు .
* ఎక్కువ కారము .
* ఆవకాయ.
* గుమ్మడికాయ.
* వెల్లుల్లి .
* దుంప కూరలు.
* మద్యపానము .
* నువ్వులు .
* మినుములు .
* చెరుకు రసం.
* బెల్లం పానకం .
* చేపలు .
* మాంసము .
* కోడి మాంసము .
* వ్యాయామము .
* అతిగా సంభోగం .
పైన తెలిపినటువంటి నియమాలు పాటిస్తే మీరు అతి తొందరలో సొరియాసిస్ నుంచి విముక్తి అవ్వగలరు.
గమనిక - ముఖ్యంగా మాంసం మరియు కొడి గుడ్డు , మినుములు మొదలయిన వేడి చేసే పదార్దాలు వ్యాధి తగ్గాక ఒక 6 నెలలు వరకు తినకుండా ఉంటే వ్యాధి ఇక జీవితంలో మళ్లి రాదు .
ఇది రావడానికి ప్రధానమైన కారణం . విరుద్దమైన ఆహారాలు భుజించటం వలన శరీరం నందలి రక్తం దోషం పొందటం వలన , తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన ఈ వ్యాధి సంప్రాప్తించును. దీనికి చికిత్స చేయడం అత్యంత సవాలుతో కూడుకుని ఉన్నది. అల్లోపతి వైద్యవిధానము నందు దీనికి సంపూర్ణమైన చికిత్స లేదు . ఒక్క ఆయుర్వేదం మాత్రమే దీనికి సంపూర్ణ పరిష్కారం చూపించగలదు. ఈ సమస్యని నేను నయం చేయుటకు ఎంతో పరిశోధించి కొన్ని ఔషధ మిశ్రమాలను తయారుచేశాను . వీటితో అత్యంత సులభముగా " సోరియాసిస్ " సమస్యను నిర్మూలించవచ్చు. మొదటి 2 నుంచి 3 నెలలలో మీకు మార్పు వస్తుంది . 6 నెలలపాటు ఆపకుండా వాడవలెను .
నేను చెప్పిన విధముగా ఆహార నియమాలు పాటిస్తూ ఔషధాలు తీసుకొనుటకు ఇష్టపడువారు మాత్రమే నన్ను ఫోన్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు. మీరు సంప్రదించవలసిన నెంబర్ " 9885030034 "
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
ఈ రోజు పదమ:
209వ రోజు: (ఇందు వారము) 03-07-2023
మన మాతృ భాష సేవలో
ఈ రోజు పదమ:
పెంపుడు కొడుకు: పరిష్కంద్రుడు, పరిష్కణ్ణుడు.
ఆడబిడ్డ కొడుకు: నానాంద్రుడు, దహోత్రుడు.
తల్లి సోదరి కొడుకు: మాతృష్యసేయుడు, మాతృష్యస్రీయుఠు.
సవతి తల్లి కొడుకు: అన్యమాతృజుడు, వైమాత్రుడు, వైమాత్రేయుడు.
ఈ రోజు పద్యము:
అడిగినయట్టి యాచకుల ఆశ లెరుంగక లోభవర్తియై/
కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వానికె/
య్యడల; అదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్/
కుడువగ నీనిచో కెరలి గోవులు తన్నును గాక భాస్కరా!
ఓ భాస్కరా! దూడలను తాగనియ్యక పాలు తీసుకోవాలని సిద్దపడితే ఆవులు పాలియ్యవు సరికదా తంతాయి. అలాగే ఏదో ఇస్తారని ఆశతో వచ్చి చేయిచాపి అడిగే వారికి లోభితనముతో లేదు పొమ్మంటే ధర్మదేవత ఆ లోభికి ధనం ఎప్పటికీ రాకుండా చేస్తుంది.అడిగిన వారికి ఎంతోకొంత ఇస్తూ ఉంటే ధనం ఎదోవిధంగా వస్తూ ఉంటుంది. కావున యాచించే వారిని చులకనగా చూచి "లేదు పో" అని అనరాదు.
గురుమహిమ
🌿 *_-గురుమహిమ-_*🌿
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
గంగాపాపం శశీతాపం
దైన్యం కల్పతరుస్తథా
పాపం తాపంచ దైన్యంచ
గురుర్హరతి దర్శనాత్....!!
*గంగాస్నానం వలనపాపం నశిస్తుంది*....
*చంద్రుని శీతల కిరణాల ప్రసరణం వలన తాపం తొలగి ఆహ్లాదం కలుగుతుంది*.....
*కల్ప వృక్ష స్మరణ-సేవనాదుల వలన అన్నిరకములుగనున్న దీనస్థితి తొలగుతుంది*.....
*శుధ్ధాంతఃకరణముతో శిష్యుడు కనుక సర్వదేవతా స్వరూపమైన గురుచరణములను దర్శించి....ఆశ్రయించి.... సేవనాదులు జరిగించినయడల*....ఆపుణ్యఫలంవలన..... పైనచెప్పబడిన మూడుపవిత్రమైన పదార్థములను సేవించి పొందిన ఫలములు ఏవైతేఉన్నవో అట్టి *మూడు ఫలములును కూడా శిష్యునికి ఒక్కగురువే అనుగ్రహం చేయగలుతారు*.
మన సంప్రదాయంలో గురువు యొక్క
వైశిష్ట్యం ఇంతగొప్పగా చెప్పబడినది.....
*అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా*
*చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవేనమః!!*
[ 'గు' కారశ్చాంధ కారస్తు 'రు' కారస్తన్నిరోధకృత్
‘గు’ అంటే చీకటి.. ‘రు’ అంటే దానిని అడ్డగించువాడు. *అజ్ఞానమనే చీకటిని తొలిగించే శక్తే గురువు*.!!]
🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻
అందరికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు.....🙏
గురుపూర్ణిమ
నేడు గురుపూర్ణిమ.
*గుకారోంఽధకారస్తు రుకాస్తన్నిరోధకః౹*
*గుణరూపవిహీనత్వాత్ గురురిత్యభిధీయతే॥*
సద్గురవేనమః
_*సుభాషితమ్*_
🌿 *_-గురుమహిమ-_*🌿
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*గంగాపాపం శశీతాపం*
*దైన్యం కల్పతరుస్తథా*
*పాపం తాపంచ దైన్యంచ*
*గురుర్హరతి దర్శనాత్*....!!
*గంగాస్నానం వలనపాపం నశిస్తుంది*....
*చంద్రుని శీతల కిరణాల ప్రసరణం వలన తాపం తొలగి ఆహ్లాదం కలుగుతుంది*.....
*కల్ప వృక్ష స్మరణ- సేవనాదుల వలన అన్ని రకములుగనున్న దీనస్థితి తొలగుతుంది* .....
*శుధ్ధాంతఃకరణముతో శిష్యుడు కనుక సర్వదేవతా స్వరూపమైన గురుచరణములను దర్శించి....ఆశ్రయించి.... సేవనాదులు జరిగించినయడల....ఆపుణ్యఫలంవలన..... పైనచెప్పబడిన మూడుపవిత్రమైన పదార్థములను సేవించి పొందిన ఫలములు ఏవైతేఉన్నవో అట్టి* *మూడు ఫలములును కూడా శిష్యునికి ఒక్కగురువే అనుగ్రహం చేయగలుతారు*.
*మన సంప్రదాయంలో గురువు యొక్క వైశిష్ట్యం ఇంతగొప్పగా చెప్పబడినది.* ....
*అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా*
*చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవేనమః!!*
. *గు' కారశ్చాంధ కారస్తు*
*'రు' కారస్తన్నిరోధకృత్*
*‘గు’ అంటే చీకటి..*
*‘రు’ అంటే దానిని అడ్డగించువాడు . అజ్ఞానమనే చీకటిని తొలిగించే శక్తే గురువు*
: 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*గురువు ఆవశ్యకత*
➖➖➖
*అనేక జన్మలలో చేసిన మంచి పనుల ఫలితం, భగవంతుని దయ పొందటానికి మనకు మార్గాన్ని చూపించగల గొప్ప గురువుతో మనం ఆశీర్వదించబడ్డాము.*
*ప్రతి మానవునికి తన జీవితంలో గురువు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సద్గురువు లేకుండా భగవంతుని దయ పొందడం అనేది అసాధ్యం, దుర్లభం. ఎందుకంటే ఆయన మనకు మార్గం చూపిస్తాడు, కాబట్టి మనందరికీ అవసరమైన మొదటి విషయం గురు దయ. మనకు గురు దయ ఉంటే, మనకు ఆయన మార్గదర్శకత్వం ఉంటే, మార్గదర్శకత్వానికి అనుగుణంగా మనం వ్యవహరిస్తే, మనం భగవంతుని వద్దకు చేరుకుని ఆయన కృపను పొందుతాము.*
*లేకపోతే, మనం సాధించగలిగేది ఏమీ లేదు. అందువల్ల, గురు దయ మొదట అవసరం.*
*గురు దయ పొందడం మన కర్తవ్యం. మనమందరం ఆశీర్వదించబడ్డాము కాబట్టి అలాంటి గురువుల దయను అనుభవిస్తున్నాము.*
*ఇకపై మన అందరి కర్తవ్యం మన గురువు బోధించినదానిని, సాధ్యమైనంతవరకు అనుసరించడం.*
*గురు నోటి నుండి వచ్చే పదాల గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. ఆయన చెప్పిన దానిని తిన్నగా పాటించాలి, ఎందుకంటే ఒక గురువు అప్పటికే మనతో చెప్పే ప్రతిదాని యొక్క పరిణామాలను చవిచూసి, అనుభవపూర్వకంగా తెలుసుకొని, ఆచరించి మనకు చెబుతారు. అందువల్ల మరలా దాని గురించి పునరాలోచించాల్సిన అవసరం లేదు మరియు విధేయతతో కళ్లుమూసుకొని ఆయన ఆదేశాలను పాటించడం మన కర్తవ్యం అయివున్నది.*
*అనేక జన్మలలో మనం చేసుకున్న పూర్వ కర్మల పుణ్య ఫలితమే, ఇంత మంచి గొప్ప గురువులు, వారి ఆశీర్వాదం లభించడం.*
*శ్రీ గురోః పాహిమాం..*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
_ఆశయా బద్ధః
శ్లోకం:☝️
*ఆశాపిశాచికావిష్టః*
*పురతో యస్య కస్యచిత్ ।*
*వందతే నిందతి స్థౌతి*
*రోదితి ప్రహసత్యపి॥*
- నరాభరణం
అన్వయం: _ఆశయా బద్ధః జనః కస్యాపి జనస్య పురతః తస్య ప్రశంసాం కరోతి అవనమతి తస్య పూజనం కరోతి హసతి రోదతి అథవా నిన్దనం కరోతి l అతః ఆశయా ముక్తాః భవితుం ప్రయాసాః కర్తవ్యాః ।_
భావం: ఆశ అనే దెయ్యం పట్టినవాడు అందరి ముందు వంగి వంగి దండాలు పెడతాడు, నిందిస్తాడు, ప్రశంసిస్తాడు, ఏడుస్తాడు మరియు నవ్వుతాడు.
మూడు నియమాలు
మూడు నియమాలు
ప్రపంచంలో ఒక్కో దేశం ఒక్కొక్క నియాలను అంటే చట్టాలను చేసుకొని వాటిని అమలు చేస్తాయి. ఆ చట్టాలను ఉల్లంగిస్తే ఆ దేశ చట్టాల ప్రకారం శిక్షలు విధించటం మనకు తెలుసు. ఉదాహరణకు మన దేశంలో రోడ్డుకు ఎడమవైపున వెళ్ళాలి అనే నియమము వున్నది అదే అమెరికా వంటి దేశాలలో కుడి వైపుకు వెళ్ళాలి అని ఉంటుంది ఈ నియమాలకు తగ్గట్టుగానే వాహనాల స్టీరింగుని అమరుస్తారు. మనదేశంలో వాహనానికి కుడివైపు అదే అమెరికాలో అయితే వాహనానికి ఎడమవైపు. ఇలా అమర్చటం వలన డ్రైవరు వెనుక వచ్చే వాహనాలకు చేతితో సౌజ్ఞ (SIGNAL) ఇవ్వగలడు. అదే విధంగా ఒక్కో దేశం ఒక్కొక్క చట్టాన్ని ఏర్పరచుకుంటుంది. ఇలా ఏర్పడిన చట్టాలను స్థానిక లేక లోకల్ లా ఇంకా లా అఫ్ ది ల్యాండు అని అంటారు. విదేశాలకు వెళ్లేవారు తప్పకుండ అక్కడి చట్టాలను తెలుసుకుంటే వారి జీవనం సుగమంగా నడుస్తుంది. ఇదంతా సామాజికమైనది ఇక విషయానికి వస్తే
భగవంతుడు తన సామ్రాజ్యం మొత్తంలో ఒక మూడు నియమాలను ఏర్పాటు చేసాడు. అంటే ఈ మూడు నియమాలు ప్రపంచంలో నీవు ఎక్కడ వున్నా లేక ఎక్కడ మనుషులు వున్నా కూడా తప్పకుండా తెలుసుకొని ఆచరించవలసినవి. వీటికి ఎటువంటి మినహాయింపులు (exemptions) వుండవు. అదే భగవంతుని చట్టం అంటే ఇప్పుడు ఆ నియమాలు ఏమిటో ఏ నియమాన్ని మనం ఎలా ఆచరించాలి తెలుసుకుందాము.
ఒకటవది ఈ నియమం తెలుసుకొని దీనిని తప్పకుండా ఆచరించకుండా ఉండటం ఉత్తమం. ఈ నియమం ఏమిటంటే పాపం చేస్తే దాని పర్యవసానంగా లభించేది దుఃఖం. ఈ రోజు మనం ఏదైనా దుఃఖం అనుభవిస్తున్నాం అంటే దాని అర్ధం గతంలో మనం పాపం చేశామని అర్ధం. ప్రతి జీవి గతంలో చేసిన పాపం దుఃఖంగా దాని ఫలితాన్ని అనుభవించాలసిందే. దీనికి ఎవరికి అంటే ఏ జీవికి కూడా ఎటువంటి వ్యత్యాసము ఉండదు. భగవంతుని దృష్టిలో ఈ పాపం చేస్తే ఈ దుఃఖం అని ఉంటే అది అన్ని జీవులకు సమంగా అంటే ఒకే విధంగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకొని ప్రతి మనిషి తన జీవితంలో సాధ్యమైనంతవరకు పాపపు కృత్యాలను చేయకుండా ఉండటం మంచిది. అప్పుడే మనిషి దుఃఖంకు దూరంగా ఉండగలడు. మనం చూస్తూవుంటాం సమాజంలో కొందరు అంధులుగా, అంగవైకల్యులుగా వున్నారు. దానికి కారణం వారు గతంలో చేసుకున్న పాప ఫలితం ఆ యా రూపాలలో అనుభవిస్తూవున్నారని. కొందరు పేదవారుగా వుంటారు అది కూడా గత పాప ఫలితమే.
రెండవది ఈ నియమం తెలుసుకొని దీనిని తప్పకుండా ఆచరించటం సదా ఉత్తమం. ఈ నియమం ఏమిటంటే పుణ్యం చేస్తే దాని ఫలితంగా సుఖం, సంతోషం కలుగుతుంది. కాబట్టి ప్రతి మనిషి తన దైనందిక జీవితంలో సాధ్యమైనంతవరకు పుణ్యకార్యాలు చేయాలి, ఇతరులను పుణ్యకార్యాలు చేయటానికి ప్రోత్సహించాలి. పుణ్య ఫలం యెంత గొప్పగా ఉంటుందో తెలియచేసే ఒక పురాణ కథను చూద్దాం.
పూర్వము ఒక మహారాజు ఉండేవారట. అయన తన జీవితంలో అన్నీ పుణ్యకార్యాలే చేసాడట. కాగా ఒకసారి తన భార్య మనస్సు నొప్పించేటట్లు గట్టిగ మాట్టాడట. కొంతకాలానికి అతనికి ఆయుర్దాయం పూర్తి అయి మరణించాడు. అయితే అతనిని తీసుకొని పోవటానికి దైవ దూతలు వచ్చారట కాగా వారిని వారిస్తూ యమదూతలు వచ్చారట. అప్పుడు దైవదూతలు ఈయన తన జీవితకాలంలో పూర్తిగా పుణ్యకార్యాలే చేసి అనంత పుణ్యవంతుడు కాబట్టి ఈయనను మేము బ్రహ్మలోకానికి తీసుకొని పోతామన్నారట. దానికి యమదూతలు మీరు చెప్పింది నిజమే కానీ ఈయన తన జీవితంలో ఒక చిన్న పాపాన్ని చేసాడు. కాబట్టి ముందుగా ఆ పాప శిక్షగా ఈయనకు యమలోక దర్శనం విధించాడు యమధర్మ రాజు కాబట్టి యమలోకాన్ని ఒకసారి చుస్తే అయన శిక్ష పూర్తి అవుతుంది తరువాత ఈయనను మేము మీకు వప్పచెప్పుతాము అని అని యమలోకానికి తీసుకొని వెళ్లారు.
ఆ మహారాజు నరక లోకాన్ని చూస్తూ ముందుకు వెళుతున్నాడు. ఒక చోట ఆగి యమలోక శిక్షలను తిలకిస్తూ ఉంటే అక్కడి పాపులు ఇలా అన్నారు. మహానుభావా తమరు ఎవరు మీరు ఇక్కడ ఉంటే మేము అనుభవించే శిక్షల బాధలు మాకు తెలియక ఉపశమనంగా వున్నాయి. దయచేసి ఇంకా కొంతసేపు ఇక్కడే ఉండగలరు అని వేడుకున్నారట. వారి ప్రార్ధనను విన్న మహారాజు యమా దూతలతో నేను ఏమిచేస్తే వారి నరక యాతన నివారించబడుతుందో తెలియచేస్తే నేను ఆ పని చేయగలను అని అన్నారట. అప్పుడు యమదూతలు మహానుభావా మీ వద్ద అపారమైన పుణ్యఫలం వున్నది మీరు ఆ పుణ్యఫలాన్ని వారికి దార పోస్తే అప్పుడు వారి కస్టాలు తొలగుతాయి. కానీ పుణ్యఫలం వదులుకున్న తరువాత మీరు కూడా పుణ్యహీనులు అవుతారు కాబట్టి స్వర్గలోకం వెళ్ళలేరు. ఈ నరకంలోనే నరక యాతనలు అనుభవిస్తూ వుండవలసి ఉంటుంది అని అన్నారట. దానికి ఆ మహారాజు ఇంతమందికి మేలుచేసి పని నేను చేసి నేను ఒక్కడిని నరక యాతన పడిన నాకు ఇష్టమే అని వేరే ఏది ఆలోచించకుండా తన పుణ్యపాహలాన్ని పూర్తిగా వారికి దారాదత్తం (దానం) చేసాడు. ఆ దాన ఫలంగా అక్కడి పాపులకు ఉపశమనం కలిగి వారు మహారాజుకు కృతజ్ఞ్యతలు తెలిపారు.
పూర్తి పుణ్యఫలం దానం వలన కోల్పోయిన మహారాజు ఇక నరకంలోనే ఉండటానికి నిర్ణయించుకున్నాడు. ఇంతలో వేగంగా ఒక దూత అక్కడికి వచ్చి ఇక్కడి దూతతో నీవు ఈ మహారాజును వెంటనే యమధర్మ రాజుగారి వద్దకు తీసుకొని రమ్మని ఆజ్ఞపించారని తెలిపాడు. ఈయనకు ఇంకా పూర్తిగా నరకలోకాన్ని నేను చూపించలేదు అంతే కాక ఈ మహారాజు తన పూర్తి పుణ్యఫలాన్ని దానం చేశారు కాబట్టి ఈయన ఇక ఎట్లాగో ఇక్కడే వుండవలసి ఉంటుంది కాబట్టి ఇతనిని అంత తొందరగా యమరాజావారి వద్ద ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఏమిటి అని అన్నాడు దానికి ఆ భటుడు నాకు ఏమి తెలియవు రాజాజ్ఞను నీకు తెలిపాను అని అన్నాడు.
యమరాజావారి ఆజ్ఞనుసారం దూత యమధర్మరాజు వారి వద్దకు ఈ మహారాజును తీసుకొని వెళ్ళాడు. ఆశ్చర్యం అక్కడ దైవదూత మన మహారాజు కోసం ఎదురుచూస్తూ వున్నాడు. అప్పుడు యమధర్మరాజు మహారాజుతో మీ శిక్ష సగంలోనే రద్దయింది ఇప్పుడు మీరు వెంటనే స్వర్గలోకానికి వెళ్ళాలి మీకోసం దూత ఎదురుచూస్తున్నాడు అందుకే మిమ్ములను త్వరగా రమ్మని కబురు పంపాను అని అన్నారు.
అప్పుడు మన మహారాజు రాజా నేను నా పుణ్య ఫలం పూర్తిగా ఇక్కడి పాపులకు దారాదత్తం చేసాను కాబట్టి ఇప్పుడు పున్యరహితుడిని అందువలన నాకు స్వర్గ లోక ప్రాప్తి ఎలా కలుగుతుంది అని అన్నారు. దానికి యమ ధర్మ రాజు గారు మహారాజా మీరు చెప్పింది మీ లెక్క ప్రకారం నిజమే కానీ ఇక్కడి లెక్కలు వేరే విధంగా ఉంటాయి అదేమిటంటే మీరు ఎప్పుడైతే పుణ్య ఫలితాన్ని దానం చేశారో అప్పుడు మీకు ఆ దాన ఫలితం లభిస్తుంది. ఆ దాన ఫలితంగా మీకు ఏమి లభించిందంటే మీరు గతంలో చేసుకొని దానం చేసి పుణ్యఫలం ఎంత వుందో దానికి రెట్టింపుగా వున్నది. కాబట్టి మీకు గతంలో పాప ఫలితంగా విధించిన శిక్షగా లభించిన యమలోక దర్శనము కూడా రద్దు చేయబడి మీకు స్వర్గలోక ప్రాప్తి లభించిందని యమరాజు తెలుపగా ఆ మహారాజు ఆశ్చర్యచకితుడు అయ్యాడు. కాబట్టి సాధక నీవు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేసిన కర్మ కూడా దానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది.
ఈ కథతో ప్రేరణ పొంది ప్రతి సాధకుడు నిస్వార్ధంతో పరోపకారార్ధం ఈశ్వరార్పణగా నిష్కామ కర్మలు చేస్తే ఆ ఈశ్వరుడు సదా మనలను రక్షిస్తాడు. భగవత్ గీతలో శ్రీ కృష్ణ భగవానులు మనకు ఇదే తెలిపారు. అందుకేనేమో " పరోపకారార్ధం ఇదం శరీరం" అని అన్నారు. ఇతరులకు ఉపకారం చేయటానికే మన శరీరాన్ని ఉపయోగించాలనే ఆర్యోక్తి మనకు సదా ఆచరణీయం.
ఇక మూడవది అత్యంత ప్రముఖమైనది ఆయిన నియమము ఏమిటంటే "జ్ఞ్యానం వలన మోక్షము సిద్ధిస్తుంది". ప్రతి సాధకుడు తెలుసుకోవలసిన ముఖ్యమైన నియమము. చాలా మంది ప్రస్తుతం సమాజంలో ఏమని తలుస్తున్నారంటే భక్తి వలన మోక్షం వస్తుంది అనే భావనతో అనేక శ్రమ దమాలకు ఓర్చి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకొని వారికి వారు పుణ్యప్తులుగా భవిస్తూ తమకు తాముగా మోక్షం పొందగలం అనే భ్రాంతిలో వుంటున్నారు. దీనికి తోడు సమాజంలో అనేక ప్రవచనకారులు ఈ విషయాన్నే మరల మరల ఉటంకిస్తూ ఆ దేవాలయంలో దేవుడి దర్శనం మోక్షదాయకం ఈ దేవాలయంలో దేవుని దర్శించుకోవటం అనేక జన్మల పుణ్యం అనే వృధా ప్రసంగాలు చేస్తూ సాధకులను తప్పుడు దోవలో నడుపుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇంకొకటి మనకు ప్రబలంగా వినపడుతుంది అదేమిటంటే
"కలిన్ స్మరణాన్ ముక్తిహః " దీని భావము ఏమిటంటే కలి యుగంలో భగవాన్ నామ స్మరణ చేస్తేనే ముక్తి లభిస్తుందని. ఈ వాక్యాన్ని చాలామంది నమ్మి తాము రోజు కొంతసమయం చేసే భగవన్నామముతో ముక్తి లభిస్తుందని భావిస్తున్నారు. నిజానికి ఇతర యుగాల మనుషులతో పోలిస్తే కలియుగంలో వుండే మనుష్యులు చాలా బద్దకస్తులు అంటే తామస ప్రవ్రుత్తి కలిగినవారు. ఇక అటువంటి వారికి ఇటువంటి మాటలు ఎంతో రుచిస్తాయి. అది యెట్లా అంటే పని ఎగవేసే ఉద్యోగస్తునికి నీవు పని చేయకపోయినా జీతం ఇస్తారు అనే మాటలు ఎలా రుచిస్తాయో అలాగే. కానీ సాధక మిత్రమా ఎట్టి పరిస్థితిలోను ఇటువంటి మాటలను నమ్మి నీ సాధనను మధ్యలో ఆపు చేయకు. నిజానికి ఇటువంటి విషయాలే నిజమైతే హిమాలయాలల్లో సాధువులు, సన్యాసులు, జ్ఞ్యానులు నిరంతరం నిద్రాహారాలు మాని ఎముకలు కొరికే చలిలో ఎందుకు సాధన చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించు. కఠినమైన తపమొనరిస్తేనే మనకు జ్ఞ్యానం కలుగుతుంది. అప్పుడే మోక్షసిద్ది. జన్మ రాహిత్యానికి ప్రయత్నించే చక్కటి అవకాశం మనకు కేవలం ఈ మనుష్య జన్మలోనే వున్నది. ఈ అవకాశాన్ని చేయిజార్చకూడదు. మిత్రమా ఇప్పుడే మోక్షసిద్దికి ఉద్యుక్తుడవు కమ్ము.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
ఇట్లు
మీ భార్గవ శర్మ