3, నవంబర్ 2023, శుక్రవారం

Angapradarshans


 

Dyanam


 

ఆరోగ్యం కోసం*

 *ఆరోగ్యం కోసం*

*🪷ధనత్రయోదశి నాడు తిరుపతిలో "లక్ష్మీ పూజ మరియు ధన్వంతరి హోమం" నిర్వహించబోతున్న "సంస్కార్ ఫౌండేషన్"🪷*


అత్యంత విశేషమైన *ధనత్రయోదశి* నాడు *"సంస్కార్ ఫౌండేషన్", శ్రీ లక్ష్మీ పూజ, మరియు ధన్వంతరి హోమం* నిర్వహించదలచింది.


*ఈనెల 10వ* తారీఖున, ధనత్రయోదశి నాడు ధన్వంతరి జయంతి సందర్భంగా *"సంస్కార్ ఫౌండేషన్", తిరుపతిలో* నిర్వహించబోతున్న *శ్రీ లక్ష్మీ పూజ మరియు ధన్వంతరి హోమం* లో పాల్గొనదలచిన భక్తులు తమ వివరాలను *(పూర్తి పేరు, మొబైల్ నెంబరు వివరాలను)* క్రింది 👇మొబైల్ నెంబర్లకు *వాట్సప్* చేసి నమోదు చేసుకోగలరు.


రాజేష్  +91 73964 47960

సతీష్ 7396447960

డాక్టర్ పార్థ సారది 98855 02632


*గమనిక:* హోమానికి ద్రవ్యాలు ఇవ్వదలచిన వారు ఇవ్వవచ్చును.

*కార్యక్రమం జరుగు వేదిక* 

*రామకృష్ణ మిషన్ ఇస్కాన్ ఎదురుగా తిరుపతి*

 ;;;;; ఆలోచనాలోచనాలు ;;;;;          ----౦ అనుబంధం- ఆత్మీయత ౦----                     ***** మీరు సాహసించినప్పుడు, మీ ధైర్యం రెట్టింపు అవుతుంది.                           ఎవరినైనా అభినందించినప్పుడు , ఐక్యత వృద్ధి పొందుతుంది.   పంచుకొన్నప్పుడు, అభిమానం పెరుగుతుంది.       దేన్నైనా పట్టించుకొన్నప్పుడు, ఆ అనుబంధం బలపడుతుంది.                   ***** ఒక గొప్ప బంధానికి రెండు విషయాలు అవసరం. అవి" పోలికల్ని" గుర్తించడం; అదే సమయంలో " తేడాల్ని" గౌరవించడం.                        ***** బాంధవ్యాన్ని బలపరచే రెండు అంశాలు.... మనది తప్పయిన ప్రతిసారి "తప్పు" ను మనస్ఫూర్తిగా అంగీకరించాలి. మనది "ఒప్పు" అయిన ప్రతిసారీ మౌనంగా నోరు మూసుకొని కూర్చోవాలి.                         ***** విజయవంతమైన సంబంధానికి గల సూత్రం చాలా తేలిక. అది ...... పెద్ద, పెద్ద సమస్యలను కూడా అల్పమైనవాటిగానే పరిగణించాలి. కానీ ఎన్నడైనా సరే, చిన్న, చిన్న విషయాలను కొంపమునిగిపోయేలాగా పరిగణించకూడదు.                ***** అతి ముఖ్యమైన అంశం. మనుష్యుల్ని ప్రేమించాలి; వస్తువులను వాడుకోవాలి. మనం ఏంచేస్తున్నామంటే మనుష్యుల్ని వాడుకొని వదిలేస్తున్నాం. వస్తువుల్నేమో ప్రాణం కంటే అధికంగా ప్రేమిస్తున్నాం. ఇదీ మనం చేస్తున్న అవకతవకల పని. ఏంచేద్దాం. ఫలితాన్ని అనుభవిస్తున్నాం.                  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~Answers to Sharpen your mind!        1* Bearing 2* A monkey and a donkey 3* In the theatre 4* A promise.                             ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~                              తెలుగు నుడికారం ( సామెతలు మరియు జాతీయాలు )                       1* పేదవాని కోపం, పెదవికి చేటు.                                  2* పేదవాని పెళ్ళాం, వాడకెల్ల వదిన.కలిగినోడి పెళ్ళాం ఊరంతటికీ అక్క.     3* పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్లు!               4* పెద్దలు లేని ఇల్లు; సిద్ధులు లేని మఠం.              5* ఊరిమీద పెత్తనానికి పోతే; దుత్త చేతికి వస్తుంది.                              6* పెట్టీ, పొయ్యనమ్మ మీదపడి కొట్టడానికి వచ్చిందట.                        7* ఎర్ర చీర కట్టిందల్లి నా పెండ్లామే అన్నాట్ట వెర్రినాకొడుకు.                         8* పూల వాసన నారకు పట్టినట్లు.                            9* పూజ కొద్దీ మొగుడు; పుణ్యం కొద్దీ బిడ్డలు.             10* పులి బక్కపడినంత మాత్రాన చారలు బక్కపడతాయా?                 తేది 3--11-2023, శుక్రవారం. శుభోదయం.

ఆత్మ విద్య

 ఆత్మ విద్య :మీ జన్మ రహస్యం. అజ్ఞానం అంటే, తిట్టు కాదు (తెలియనాతనము ) జన్మ జన్మ లు( నీ సరూపం మే భగవంతుడు బంది గా ఈ దేహంలో ఉంటావు )ఉండినా తప్పు లేదు

ఎందుకంటే పుట్టుకతో అందరూ చాలావరకు అజ్ఞానులే

కనుక అజ్ఞానం వల్ల నష్టం లేదు

కానీ మనిషికి అజ్ఞానం ఉండవచ్చు ఏమో కానీ "తప్పు జ్ఞానం" మాత్రం ఉండకూడదు.


ఈ "తప్పు జ్ఞానం" అజ్ఞానం కన్నా భయంకరమైనది.

దురదృష్టకరం ఏమిటంటే పవిత్ర గ్రంధాలు అని చెప్పబడే చాలా గ్రంధాలలో ఈ తప్పు జ్ఞానం ఎందువల్లనో వచ్చి చేరింది.

ఆయా గ్రంథాలు చెబుతున్నాయి నీ మతం వాడిని మాత్రమే ప్రేమించు అన్యులను అవిశ్వాసులను సంహరించు అని..

అలా అన్య మతాల వారిని నువ్వు ఎంత బాగా చంపేస్తావో దేవుడు నీకు అంత ఉన్నతమైన పదవిని ఇస్తాడు అని ఆయా గ్రంధాలలో లిఖించబడి ఉంది ఇది నిజం..


ఈ తప్పు జ్ఞానం వల్ల

మనిషి రాక్షసుడుగా మారుతున్నాడు.


నీవు ఒక మతస్తుడివై రాక్షసుడిగా బ్రతికే కన్నా ఒక నాస్తికుడివై ఉండు

దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు.


అజ్ఞానిగా బతకడంలో నష్టం లేదు కానీ ఈ తప్పు జ్ఞానిగా నీవు ఉండకూడదు.


నీకు దైవం ముఖ్యమా?!

లేక మతం ముఖ్యమా?!


కులం మతం కేవలం నీ యొక్క నా యొక్క కల్పితం ఇది నిజం.

భగవంతుడు కల్పించినవి కావు ఇది సత్యం.


అడుక్కొని తినే వారికి ఏ మతం ఉంది?!

వారు అందరిని సమానంగా చూస్తారు.

వారికి కులము లేదు మతము లేదు ఎవరు సహాయం చేస్తే వారే వారికి దేవుడు.


కులము మతం అని నీవు 

విర్రవీగుతుంటే

నిన్ను బికారిని చేయడానికి ఆయనకు ఎంత సమయం పడుతుంది?!


కులము మతం నీకు సహాయం చేయదు అందరిలో సమానంగా ఉన్న ఆ ఈశ్వరుడే నీకు సహాయం చేయాలి.


ఓహో!! ఆ ఈశ్వరుడు పరలోకంలో ఎక్కడో స్వర్గంలో ఉన్నాడు అని అనుకుంటున్నావా?!


ఓరి పిచ్చి మానవుడా!

నీలోపులనే ఉండి నీవు చేసే సమస్త కార్యాలకు ఆయన సాక్షిగా ఉన్నాడు తెలుసా?!


నాయనా!

ఈ కులం ఈ మతం నీకు నాకు ఇష్టం కావచ్చు ఏమో..


కానీ దైవానికి ఇష్టం లేదురా 

నా మాటను నమ్ము

Photo


















 

శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు



 🕉 తిరుమలలో శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసా !  తిరుమలలో శంఖనిధి,పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ముందు వారు ఎవరో ముందు తెలుసుకుందాం.శంఖనిధి,పద్మనిధులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షినదిక్కున ఉన్న రక్షకదేవత పేరు శంఖనిధి,ఇలాగే కుడిప్రక్కన అంటే ఉత్తరదిక్కున ఉన్న రక్షకదేవత పేరు పద్మనిధి . శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించివుంటాడు. పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి.  ఇంతకూ వీరు ఎక్కడ ఉన్నారంటారా! తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహవిగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోనికి ప్రవేశించేముందు మనం మనకాళ్ళను ప్రక్షాళనచేసుకునే దగ్గర శ్రీవారి ఆలయంగడపకు ఇరుప్రక్కలా కనిపిస్తారు. మనం సాధారణంగా కాళ్ళను కడుక్కునే ఆలోచనలో ఉంటాము.కాబట్టి వారిని గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది.దానికి తోడు ఎంతోసేపు ఎదురుచూసిన ఆలయప్రవేశం ఆనందంలో కూడా గమనించం.  ఈ నిధిదేవతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణంగల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించవచ్చు. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుతదేవరాయలది. బహుశా అచ్యుతరాయలే ఈ నిధిదేవతలను ప్రతిష్టించి ఉంటాడనవచ్చు.  ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారంవద్ద ఏర్పాటు చెయ్యడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడుప్రాకారాలు కలిగిన ఆలయమని తెలుస్తోంది.  ఇంతకు ముందు వీరిని మీరు గమనించివుండకపోతే ఈసారి శ్రీవారిదర్శనంకు వెళ్ళినప్పుడు గమనించి నమస్కరించి ఆలయంలో ప్రవేశించండి సేకరణ

మార్పుకి ఇది సంకేతమా

 రానున్న ఒక పెను మార్పుకి ఇది సంకేతమా ?

 

అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేసింది ఓ Multi-national Software Co లో service లో ఉన్న తల్లి -  

కేవలం తన ఏడేళ్ల కొడుకుని వేదవిద్యలో చేర్చటం కోసం !

'ఇలా జరుగుతుంది' అని ఎవరైనా చెబితే నమ్మగలమా?

అందులోనూ ప్రపంచం అంతా ఎగబడే  'పాశ్చాత్య విద్య' 

అవకాశాలను వదులుకొని మరీ చేస్తారా? 


"గురుకుల వేద పాఠశాలకు భారీ  విరాళాలు  ఇచ్చే దాతలున్నారు. అయితే, సనాతన ధర్మం గురించి, వేదవిద్య ఔన్నత్యం గురించి తెలిసిన విద్యావంతులు తమ పిల్లలను ఈ వేద విద్యాభ్యాసానికి పంపినప్పుడే వేదమాత పట్ల మన ధర్మాన్ని నిర్వర్తించినవాళ్ళం అవుతాం..."  

ఇది వివిధ సందర్భాలలో ప్రముఖ ప్రవచన కర్త, 'ఋషిపీఠం' పత్రిక సంపాదకులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఇస్తున్న పిలుపు. 


దీనికి తెలుగు నేల మీద స్పందన బాగా వస్తోంది. 

అయితే గత పదేళ్లుగా అమెరికాలో స్థిరపడిన ఒక యువ జంట - శ్రీ రవి, శ్రీమతి శిరీష - కూడా ఇలా స్పందించిన వాళ్లలో ఉన్నారు. 

ఆ స్పందన ఎలాంటిదో ఆ తల్లి 

మాటల్లో చెప్పాలంటే ...   

"యాంత్రిక జీవన ప్రవాహంలో కొట్టుకుపోతున్న మాకు కోవిద్ కాలం - జీవితం, సనాతన ధర్మం, మన బాధ్యత  గురించి ఆలోచించే అవకాశం ఇచ్చింది.  గత ఏడాది మేం స్వదేశానికి తిరిగి వచ్చేశాం. హైదరాబాదు నగర శివార్లలో 

చిప్పలపల్లె గ్రామంలో సువిశాల  క్షేత్రంలో 2015 నుంచి మాడుగుల  శశిభూషణ సోమయాజి గారి సారథ్యంలో  

నడుస్తున్న అధునాతన వేద విద్య గురుకులం 'విద్యారణ్యం'లో మా ఏడేళ్ల కొడుకుని చేర్చాం.  అప్పటికే ఇక్కడ వందమంది విద్యార్థులున్నారు. ఋగ్వేద, యజుర్వేదాలను, వేద విద్యతోపాటు  

పాటు 12 వ తరగతి వరకు 'నేషనల్ 

స్కూల్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్'  గుర్తింపు పొందిన ఆధునిక విద్యను కూడా బోధిస్తున్న  ఈ గురుకులంలో - ప్రతి విద్యార్థి 18 ఏళ్ల వయసు వచ్చేసరికి  వేద శాఖతో పాటు, తన అభిరుచికి తగిన ఉన్నత విద్యను కూడా అభ్యసిస్తున్నాడు. ఆసక్తి ఉన్న విద్యార్థులు  వేదాంగాలను కూడా అభ్యసించే ఏర్పాటు ఉంది. శారీరక, మానసిక వ్యాయామం వంటి 

అంశాలతో పిల్లలను తీర్చిదిద్దుతున్న  ఈ విద్య మాకు నచ్చింది. 

మా  ఏడేళ్ల వాడిని అలా వేదాధ్యయనంలో పెట్టాం. నాకు గర్వంగా ఉంది. ..."

- శిరీష చెన్నాప్రగడ


ఇప్పుడు శిరీష ఈ విద్యారణ్యం నిర్వహణలో కీలక పాత్ర కూడా స్వీకరించారు.


ఒక ఏడాది క్రితం ఇలాగే - Deloitte లో పని చేస్తున్న మరో తల్లి శ్రీమతి దివ్య , శ్రీ మురళీకృష్ణ శర్మ (Aparna Enterprises)లు తమ కొడుకుని తీసుకువచ్చి ‘విద్యారణ్యం’ లో చేర్చారు. 


కొద్ది మాసాల క్రితం హుజూరాబాదులో గణితశాస్త్రం అధ్యాపకుడు శ్రీ శ్రీకాంత్ శర్మ కూడా తన కొడుకుని తీసుకొచ్చి చేర్చారు.

Panchaag


 

శ్రీ భగవతీ దేవి ఆలయం

 🕉 మన గుడి : నెం 228





⚜ గోవా  : పెర్నెం


⚜ శ్రీ భగవతీ దేవి ఆలయం 


💠 ఈ ఆలయం పార్వతీ దేవి అవతారమైన భగవతీ దేవికి అంకితం చేయబడింది. 

శ్రీ భగవతి దేవాలయం గోవాలోని ఒక పురాతన దేవాలయం.  ఇది 500 సంవత్సరాలకు పైగా పురాతనమైనది మరియు ప్రధాన రహదారి పక్కన ఉంది.


💠 గోవాలో ఉన్న దేవాలయాలకు పోర్చుగీస్ పాలన చాలా ప్రతికూలంగా ఉండేది, ఎందుకంటే అవి విదేశీ పాలకుల చేతిలో విధ్వంసం మరియు వినాశనాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అతికొద్ది దేవాలయాలు ఆక్రమణదారుల ఆగ్రహానికి గురై బయటపడ్డాయి. 

అలాంటి  కొన్ని దేవాలయాలలో శ్రీ భగవతి ఆలయం ఒకటి. 


💠 ఆలయ ప్రధాన దేవత అష్టభుజ (ఎనిమిది చేతులు) రూపంలో ఉన్న భగవతి దేవి. ఎత్తైన పీఠంపై నిలబడి ఉన్న స్థితిలో భగవతి దేవి చాలా గంభీరమైనది. 

భగవతి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద, నల్లరాతితో చేసిన ఏనుగులు నిలుచుని రెండు జీవిత పరిమాణాల విగ్రహాలు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. 


💠 ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ దసరా. ఈ పండుగ ఇక్కడ ప్రధాన ఆకర్షణలలో ఒకటి మరియు ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద నుండి పూర్ణిమ వరకు ఘనంగా జరుపుకుంటారు.

 ఆ సమయంలో ఆలయం వద్ద 25 వేల మందికి పైగా భక్తులు గుమిగుడుతారు.


💠 శ్రీ భగవతి ఆలయ సముదాయంలో ఐదు ఆలయాలు ఉన్నాయి, 

ప్రధాన ఆలయం శ్రీ భగవతి, 

ఇతర ఆలయాలు శ్రీ సతేరి, 

శ్రీ దేవ్ రావల్నాథ్, 

శ్రీ దేవ్ భివంగి పంచాక్షరి & బ్రహ్మ (శ్రీ విష్ణు, శ్రీ గణపత్, శ్రీ శంకర్).


⚜ ఆలయ పురాణం ⚜


💠 హిందూ విశ్వాసం ప్రకారం, భగవతి దేవి అనేది దుర్గాదేవికి పెట్టబడిన మరొక పేరు, ఆమెను పార్వతి, కాళి మరియు అనేక ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఆమె చెడుపై మంచి విజయానికి దేవతగా పరిగణించబడుతుంది మరియు మహిషాసురమర్దిని రూపంలో రాక్షసులను చంపుతుంది. 


💠 భగవతి వివిధ రూపాలలో కనిపించి, దుష్ట రాక్షసులను నాశనం చేసి, శిరచ్ఛేదం చేసి, వారిని పాతాళ లోకానికి పంపిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. 


💠 నల్లరాతితో తయారు చేయబడిన ఈ విగ్రహం అందమైన చీరలు మరియు విలువైన ఆభరణాలతో అలంకరించబడుతుంది. 

భగవతి దేవాలయం యొక్క ప్రధాన మందిరానికి ఒక గోపురం పైకప్పు ఉంటుంది. ప్రధాన మందిరం చుట్టూ పరివార దేవతలు అని పిలువబడే వివిధ దేవతలకు నాలుగు వేర్వేరు దేవాలయాలు ఉన్నాయి. 


💠  శ్రీ భగవతి ఆలయం ఉత్తర గోవాలో ఉంది.

 పెర్నెం నుండి 7 కి.మీ దూరంలో ఉంది.

సుందరుడు అంటే హనుమంతుడు

 బాపు గారి ..సుందరుడు అంటే హనుమంతుడు

.

అసలు హనుమంతుని పేరు "సుందరుడు" అని,

.

ఆ కారణంగా వాల్మీకి ఈ కాండకు "సుందరకాండ"

.

అని పేరు పెట్టాడని అంటారు.

.

సుందరే సుందరో రామః

సుందరే సుందరీ కథా

సుందరే సుందరీ సీతా

సుందరే సుందరం వనం

సుందరే సుందరం కావ్యం

సుందరే సుందరం కపిః

సుందరే సుందరం మంత్రం

సుందరే కిం న సుందరం?

సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ.

.

సుందరమైన కథ ను చెబుతున్నది కావున సుందరకాండ.

.

సుందరమైన సీత కథను చెబుతున్నది కావున సుందరకాండ.

.

సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ.

.

సుందరమైన అంత్యాను ప్రాసలతో చెప్పబడినది కావున సుందరకాండ.

.

సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ.

.

అన్ని కాండలలో రాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడుగా ఉంటాడు.

కాని సుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మార్లు స్మరించబడుతుంది.

.

శ్రీరామ పాత్ర ప్రత్యక్షంగా కనిపించక పోయినా, నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపింపబడుతుంది.

.

: "హనుమంతుడు" (వజ్రాయుధం వల్ల హనుమ, అనగా దవడ, కు దెబ్బ తగిలినవాడు),

.

ఆంజనేయుడు (అంజనా దేవి కుమారుడు), మారుతి (వాయుదేవుని కొడుకు) వంటి పేర్లు

.

హనుమంతుని జీవితంలో ఘటనలు లేదా సంబంధాల కారణంగా వచ్చాయి. అసలు

.

హనుమంతుని పేరు "సుందరుడు" అని, ఆ కారణంగా వాల్మీకి ఈ కాండకు "సుందరకాండ"

.

అని పేరు పెట్టాడని అంటారు

Hongkong fruits


 

విదురనీతి

 విదురనీతి

సుధన్వోవాచ = సుధన్వుడిట్లన్నాడు.

శ్లో )పితరం తే గమిష్యావః ప్రాణయోర్విపణే కృతే పుత్రస్యాపి న హేతోర్తి ప్రహ్లాదో నానృతం వదేత్॥


అ)ప్రాణాలను పణంగా పెట్టిన మనం మీ తండ్రి యైన ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళుదాము. ఆయన తనకుమారుని కొరకైనా అబద్ధం చెప్పడు

విద్యా ధనమే

 *సుభాషితం*

---------------

🌺 *ధన్యానాముత్తమం దాక్ష్యం*

     *ధనానాముత్తమం శ్రుతం ౹*

     *లాభానాం శ్రేయ మారోగ్యం*

     *సుఖానాం తుష్టిరుత్తమా ౹౹* 🌺


   *భా.    ఉత్తమమైన గుణాలలో దక్షత అత్యుత్తమమైనది.విద్యా ధనమే అన్నింటికన్నా ఉత్తమమైన ధనం.లాభాలలో ఆరోగ్య లాభం అలాగె సుఖమనే దానిలో తృప్తి సుఖమే ఉత్తమమైనది.*

🌺✍🏽

మనలను రక్షించుగాక

 సంస్కృతసాహిత్యంలో రిపార్టీ కవితా ప్రక్రియ

                                 ( Repartee in Sanskrit Literature)

                                              డాక్తర్.చిలకమర్తి దుర్గాప్రసాదరావు


సంస్కృతసాహిత్యం ఆకాశం కంటే విశాలమై౦ది, సముద్రం కంటే లోతై౦ది . ఎ౦దుకంటే  సంస్కృతసాహిత్యం అన్ని ప్రాచీనసాహిత్య ప్రక్రియలకు నిధి అవడమే కాకుండా అన్ని ఆధునికసాహిత్యప్రక్రియలకు కూడ మాతృకగా కనిపిస్తోంది. అది ప్రాచీనంలో ప్రాచీనం ఆధునికంలో ఆధునికం . ఇక ఆంగ్ల సాహిత్యంలో Repartee అనే ఒక సాహిత్య ప్రక్రియ ఉంది . రిపార్టీ అంటే  Ready reply అని A witty reply అని Talk characterized by clever and witty replies. ‘అని నిర్వచిస్తారు .


సాధారణంగా మానవులలో ఇతరులను ఆక్షేపించే స్వభావం ఎక్కువగా కనిపిస్తుంది . ఏదో వంక పెట్టుకుని ఎక్కడో అక్కడ ఎవరో ఒకరిని ఆక్షేపిస్తూనే ఉంటారు . ఆక్షేపణలు  సహించలేని వాళ్ళు తగిన సమాధానం చెబుతూనే ఉంటారు .   

ఈ ఆక్షేపణ ముఖ్యంగా మూడు స్థాయిల్లో ఉంటుంది . కొంతమంది వేళాకోళంగా ఇతరులను ఆక్షేపిస్తూ ఉంటారు, వారి మనస్సుల్లో ఎటువంటి చెడు ఉద్దేశం ఉండదు. మరికొంత మంది మనస్సులో ఒకటి పెట్టుకుని ఇతరులను ఆక్షేపిస్తూ ఉంటారు. మరికొంతమంది సూటిగా కఠినంగా ఆక్షేపిస్తారు . ఎవరు ఏస్థాయిలో, ఎంత మోతాదులో , ఏ విధంగా ఆక్షేపిస్తే వారికి ఆ స్థాయిలో అంతే మోతాదులో ఆ విధంగా సమాధానం చెప్పడం Repartee అనుకోవచ్చు  . ఈ విధంగా మృదువు , కఠినం , అతికఠినంగా చేసే ఆక్షేపణలు దానికి తగిన సమాధానాలు సంస్కృత సాహిత్యంలో కోకొల్లలు . అవి ఎలా ఉంటాయో స్థాలీపులాక న్యాయంగా కొన్నిటిని పరిశీలిద్దాం .


                                ఆది దంపతులైన  పార్వతీ పరమేశ్వరుల చిలిపి సంభాషణలు , వేలాకోలాలు జగత్ప్రసిద్ధాలు . పార్వతి వాస్తవానికి అచలపుత్రికే అయినా చలచిత్తం కలది. చాల చిలిపిది. ఒకనాడు సరదాగా తన   భర్తను ఒక ఆటపట్టిద్దామనుకుంది . కాని ఆయన తనకంటే  తెలివైన వాడని మాత్రం ఊహించలేక పోయింది పాపం.  ఏమండి ! నాకు అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు . నాకున్నట్లుగా మీకు అమ్మానాన్నలెక్కడున్నారో చూపించండి అంది కొంటెగా. శివుడు దానికి సమాధానంగా  ఓహో అదా ! నాకు అత్తా మామ ఇద్దరూ ఉన్నారు . నాకున్నట్లుగా నీకు అత్తా మామలు ఎక్కడున్నారో చూపించు  అన్నాడు నవ్వుతూ. ఏ౦ చూపిస్తుంది ? వెంటనే ఉడుక్కుంటూ బుoగమూతి పెట్టి ఆయన ఒడిలోకి  వంగి వాలిపోయి ఉంటు౦దని ఊహిద్దాం. ఈ విధంగా పార్వతి కొంటె ప్రశ్నకు తగిన సమాధానం చెప్పిన ముక్కంటి మాటలు మనల్ని రక్షించుగాక


క్వ  తిష్ఠత: తే పితరౌ మమేవే త్యపర్ణయోక్తే పరిహాసపూర్వం

క్వ వా మమేవ శ్వశురౌ తవేతి తామీరయన్ సస్మితమీశ్వరోsవ్యాత్


ఇప్పుడు ఎంతో స్నేహం గల ఇద్దరు యువతులమధ్య వేళాకోళం (ఆక్షేపణ సమాధానం ) ఎంత అందంగా ఉంటుందో చూద్దాం.


                                                   ఒకసారి శివకేశవులిద్దరూ తమ భార్యలతో ఒక చోట సమావేశమయ్యారు. ఒక ప్రదేశంలో శివకేశవులులిద్దరూ కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నారు. మరొక ప్రదేశంలో   లక్ష్మీపార్వతులు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. పార్వతి లక్ష్మితో  ఏమమ్మా! చంచలమైనదానా! నిన్నోమాటడుగుతాను సమాధానం చెబుతావా? అంది . సరే అడగవమ్మా! శివుని పెళ్ళామా! అoది లక్ష్మి . మీనాన్న ఎవరు? అంది పార్వతి . వెంటనే లక్ష్మి సముద్రుడు అని సమాధానం చెప్పింది. వెంటనే పార్వతి ఊరుకోవమ్మా! ఎవరు నమ్ముతారు. నీళ్లకెక్కడైన పిల్లలుపుడతారా! నేను నమ్మను గాక నమ్మను అంది. ఓహో! సరేలే!  నువ్వు నమ్మకపోతేమానెయ్యి. పర్వతాలకు పిల్లలు పుట్టగాలేంది సముద్రానికి మాత్రం పిల్లలు పుట్టరా ఏంటి? అంది . అది    ఎవరు నమ్ముతారో వాళ్లే ఇది  కూడా నమ్ముతారులే అని లక్ష్మి సమాధానం చెప్పింది . నువ్వు పర్వతం కూతురవైనప్పుడు నేను సముద్రం కూతుర్ని ఎందుకు కాకూడదు అని లక్ష్మి సమాధానం లోని అంతరార్థం.

ఈ విధంగా పరస్పరం వేళాకోళాలాడుకుoటున్న లక్ష్మీపార్వతుల సరససల్లాపాలను వింటూ హరిహరులు లోలోపల ఎంతో  ఆనందిస్తున్నారట . అటువంటి ఆ శివకేశవుల ఆనందం మన విఘ్నాలు పోగొట్టి మనలను రక్షించుగాక అని ఒక కవి అందమైన శ్లోకం వ్రాశాడు.


లోలే! బ్రూహి కపాలికామిని ! పితాకస్తే? పతి: పాథసాం

క: ప్రత్యేతి జలాదపత్యజననం? ప్రత్యేతి య: ప్రస్తరాత్

ఇత్థం పార్వతిసింధురాజసుతయోరాకర్ణ్యవాక్చాతురీo

సంస్మేరస్య  హరేర్హరస్య చ ముదో నిఘ్నంతు విఘ్నం తు వ:  

    

ఇవి కేవల వేలాకోలపు మాటలు వానికి తగిన సమాధానాలు .ఇపుడు కొంచె0 మోతాదు మించిన ఆక్షేపణలు దానికి తగిన సమాధానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం


                                                                  మనం ఎంత గొప్ప వాళ్లమైనా కావొచ్చు గాని ఇతరుల్ని కించపరిస్తే అది మనకు ముప్పు తెచ్చి పెడుతుంది. ఒక్కొక్కప్పుడు మన అస్తిత్వానికే ప్రమాదం తెచ్చి పెడుతుంది. ఆత్మశ్లాఘ ఎంత ప్రమాదమో పరనింద అంతకంటే ఎక్కువ ప్రమాదం.అందువల్ల మనం ఎంత ఉన్నతంగా ఉన్నామో అంత అణకువగా కూడ ఉండడం నేర్చు కోవాలి. లేకపోతే సమాజమే మనకి గొప్ప గుణ పాఠం చెబుతుంది. ఇతరుల్ని కించపరిస్తే కల్గే నష్టాన్ని ఒక సంస్కృత కవి ఎంత చక్కగా వివరించాడో స్వయంగా చూడండి.

ఒకరోజు లక్ష్మి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న పార్వతి ఇంటికి వెళ్లింది. పార్వతి, ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. లక్శ్మి ఆ పరిసరాలన్నీ పరికించింది. పార్వతికి లక్ష్మికున్నంత ఐశ్వర్యం లేదు, డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి. లక్ష్మికి అనుకోకుందా పార్వతిని ఓ ఆట పట్టించాలనే ఆలోచన కల్గింది.

"భిక్షార్థీ స క్వ యాత:?” అని చిన్న ప్రశ్న వేసింది. మీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా అంటే బాగుండేది కాని లక్ష్మి అలా అనలేదు. ఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా? అంది.  శివుడు ఆది భిక్షువు కదా! లక్ష్మి ఆ విషయాన్ని ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది. పార్వతి కి ఈ ప్రశ్న చాల బాధ కల్గించింది . ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుందిగాని తన భర్తను నిందిస్తే ఏమాత్రం సహించలేదు కదా! కాని ఏంచేస్తుంది. ఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదు. అలాగని సరిపెట్టుకుని ఊరుకోనూలేదు. ఏదో సమాధానం చెప్పాలి. ఎంచెప్పాలి? కొంచెం ఆలోచించింది.

"సుతను బలిమఖే " అంది. 'బలి చక్రవర్తి  చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మా! అని సమాధానం. ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తలతిరిగి పోయింది. బలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు తనభర్త శ్రీమహావిష్ణువు. వామనావతారంలో ఆయన బలిచక్రవర్తిని మూడడుగులు నేల అడగడం లోకవిదితమే.  ' మా ఆయనే కాదు మీ ఆయన కూడా ముష్టివాడే, మా  ఆయనకన్నా మీ ఆయనే దారుణం. కేవలం మూడడుగుల నేలకోసం ముష్టివాడయ్యాడు ' అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది. లక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. మళ్లీ ఏదోవిధంగా పార్వతిని ఉడికించాలని సమాయత్తమయింది. రెండో ప్రశ్న వేసింది.

తాండవం క్వాద్య భద్రే! అనడిగింది. అమ్మా! మీ ఆయన ఈ రోజు నాట్యం ఎక్కడ చేస్తాడు? అని దానర్థం. మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని లక్ష్మి మాటల్లోని అంతరార్థం. అప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది.

మన్యే బృందావనాంతే అంది. బృందావనంలో అనుకుంటున్నానమ్మా! అని ఆ మాటలకర్థం. బృందావనంలో నాట్యం చేసే ప్రబుద్ధుడు కృష్ణుడు, శివుడు కాదు. ' మా ఆయనే కాదు మీఆయన కూడ నాట్యం చేస్తాడు. ఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు అంతే గాని మీ ఆయన లాగ అందరి ఆడవాళ్లను వెంటేసుకుని నాట్యం చెయ్యడు' అని సమాధానం. పార్వతి సమాధానం ఇంత పదునుగా ఉంటుందని లక్ష్మి ఊహించలేదు. ఆమెకు మతిపోయినంతపనయింది. ఏలాగో సంబాళించుకుంది. ఈ సారి తనకు ఇబ్బంది లేని విధంగా మాట్లాడాలనుకుంది.

క్వనుచ మృగ శిశు: ? అని మరో ప్రశ్న వేసింది. మీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మా? అని అర్థం. లక్ష్మి కొడుకు మన్మథుడు చాల అందగాడు. పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరంలేదు. ' మా అబ్బాయి చాల అందగాడు మీ అబ్బాయి మాత్రం కురూపి' అని లక్ష్మి ఆక్షేపణలోని అభిప్రాయం . పార్వతి చాల నొచ్చు కుంది. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లు ఎవరిపిల్లలు వాళ్లకు ముద్దు. పార్వతి మెదడులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. వెంటనే అంది.

నైవ జానే వరాహం అని .“ ఇక్కడేదో పంది తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మా! ఎక్కడున్నాడో తెలీదు" అంది. మా అబ్బాయిది ఏనుగు ముఖమేగాని మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!అని పార్వతి సమాధానం లోని చమత్కారం. ఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించింది. కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. ఈసారి జాగ్రత్త్తగా తనకు ఎదురుదెబ్బ తగలని విధంగ పార్వతికి దెబ్బకొట్టాలనుకుంది. అటు ఇటు కాసేపు చూసింది.

బాలే! కచ్చిన్న దృష్ట : జరఠ వృషపతి: ? అనడిగింది. ' మీ వాహనం, అదే ఆ ముసలి ఎద్దు ఎక్కడా కనబడడం లేదేమిటమ్మా! అని ప్రశ్న. ' మాది గరుడ వాహనం విమానాల్లో వలే ఆకాశంలో తిరుగుతాం. మీరు నేలపై తిరుగుతారు. మీ వాహనం ముసలి ఎద్దు. అది కదల్లేదు మెదల్లేదు' అని ఆక్షేపం. మేం పై స్థాయి వాళ్లం మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపు. ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతి. అందుకే వెంటనే అందుకుంది.

"గోప ఏవాస్య వేత్తా " అంది. ' ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా? పో మీఆయన్నే అడుగు' అని చిన్న చురక అంటించింది. మా ఆయన నడిపే వాహనాన్ని మీఆయన మేపుతాడు. మీకంటే మేమే ఎక్కువ అని పార్వతి ఆంతర్యం. ఈ సమాధానానికి లక్ష్మి పూర్తిగా అవాక్కయింది. తిన్నగా జారుకుంది.

నిజానికి ఇదంతా వారిద్దరి మధ్య వేళాకోళంగా జరిగిన సంభాషణ. ఇందులో నిందగాని వెక్కిరింపుగాని ఏమాత్రంలేవు. ఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని చెప్పడానికే ఒక కవి లక్ష్మీపార్వతులను పాత్రలుగా చేసుకుని ఈ సన్నివేశాన్ని కల్పించాడు. ఇందులో నీతి ముఖ్యం గాని ప్రశ్నలు సమాధానాలు ముఖ్యం కాదు. వారిరువురి మధ్య జరిగిన ఈ సరసమైన సంభాషణ మనందరిని రక్షించుగాక అని చమత్కరించాడోకవి. ఇంత సరసమైన భావాన్ని తనలో దాచుకున్న ఈ శ్లోకం చదవండి.


భిక్షార్థీ స క్వ యాత: ?సుతను బలిమఖే " తాండవం క్వాద్య భద్రే ?

మన్యే బృందావనాంతే క్వను చ మృగశిశు:? నైవ జానే వరాహం

బాలే కచ్చిన్న దృష్ట: జరఠవృష పతి:? గోప ఏవాస్య వేత్తా

లీలాసంలాపఇత్థం జలనిధిహిమవత్కన్యయో: త్రాయతాం న :



                                 పెళ్లంటే కొంతమందికి నూఱేళ్ల పంట. మరి కొంతమందికి నూఱేళ్ల వంట . ఇంకా కొంతమందికి నూఱేళ్ల  పెంట. ఒకాయన తన స్నేహితునితో ' ఒరేయ్! నేను ఇంటికి వెళ్లే దాక నా భార్యాపిల్లలు భోజనమేచెయ్యరు' అన్నాడట. ఆ స్నేహితుడు చాలసంబరపడిపోతూ ' అబ్బా! నువ్వంటే నీ భార్యాపిల్లలకు ఎంత ప్రేమరా! నువ్వు నిజంగా చాల అదృష్ట వంతుడివి' అని మెచ్చుకున్నాడట.  వెంటనే వాడు ప్రేమాకాదు దోమాకాదు. ఇంటికెళ్లి నేనే వంటచెయ్యాలి' అన్నాడట తాపీగా. నిజానికి మానవజీవితానికి వంటకి అవినాభావసంబంధం ఉంది.  కాబట్టి ఎంతటి బంగారు పళ్లేనికైనా గోడచేర్పు ఎలా అవసరమో ఎంతటి గొప్పమగాడికైనా వంట నేర్పు కూడ అంతే అవసరం

 ఒక విధంగా ఆలోచిస్తే దమయంతి  ఇంద్రాది దేవతలందర్ని త్రోసిరాజని సామాన్యుడైన నలమహారాజునే పెళ్లి చేసుకోడానికి ,  అలాగే ద్రౌపది పాండవుల్లో అందరికంటే భీముణ్ణే ఎక్కువగా ఇష్ట పడడానికి కారణం  వారికి గల  పాకశాస్త్ర ప్రావీణ్యమే అని అనిపించక మానదు.  ఏది ఏమైన she  లో he ఒదిగి నట్లుగా  woman లో  man  ఒదిగినట్లుగా వంటపనిలో  పురుషుడు భార్య వెనుక ఒదిగే ఉంటున్నాడు. వంట చెయ్యనంటే జీవితంలో మిగిలేది పెంటే.

వంట పేరుతో తమ  జీవితాల్ని పెంట పాలు చేసుకున్న ఒక జంట మధ్య  జరిగిన వాగ్వివాదం   ఇక్కడ పొందుపరచ బడింది.  సరదాగా చదువుకుని ఆనందించండి. ఇది చదివేక వంటరాని వారు కొద్దో గొప్పో వంట నేర్చుకోండి. కనీసం వంటచేసేవారికి సహాయసహకారాలు అందజెయ్యండి.


ఒకాయన  పాపం ఎప్పుడూ ఇంట్లో  ఆయనే వంట చేసేవాడు. అనుకోకుండా ఒకరోజు పొరుగూరు వెడుతూ ఆపని భార్యకు పురమాయించాడు. ఆమె అయిష్టంగానే తలూపింది

తిరిగి తిరిగి ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు. కడుపు నకనక లాడుతోంది. వంటచేశావా? అన్నాడు. వెంటనే 'నో'' అంది. అసలే ఆకలితో ఉన్నాడేమో ఒళ్లు మండి పోయింది.

పాపాత్మురాలా! వంట ఎందుకుచెయ్యలేదే ? అన్నాడు.

ఏంటి నేను పాపాత్మురాలనా! కాదు మీనాన్నే పాపాత్ముడు అంది.

ఏమే తప్పుడుదానా ఏంటి వాగుతున్నావు అన్నాడు.

ఆ పదం  మీఅమ్మకి మీచెల్లి కి వర్తిస్తుంది నాక్కాదు అంది.

వెంటనే ఈ ఇంట్లోంచి బయటికి పోవే  అన్నాడు .

 ఇది నీ ఇల్లు కాదు పొమ్మనడానికి నీకు హక్కు లేదంది.

భగవంతుడా ! నాకు కనీసం చావునైన  ప్రసాదించవయ్యా అన్నాడు .

ఆవిడ కూడ తక్కువదేమీకాదు. 'మీలో తప్పుంటే మీరు పోతారు నాలో తప్పుంటే నా మాంగళ్యం పోతుంది ' అనేంతటి  గొప్ప ఇల్లాలు .   అందుకే  ఏమీ తడుముకోకుండా  నాకంత అదృ ష్టమా అంది.   ఇంతటి భీకరమైన వాగ్వివాదం తనలో పొందుపరచుకున్న ఈ మనోహర శ్లోకం చదవండి.


ఆ : పాకం న కరోషి పాపిని? కథం పాపీ త్వదీయ: పితా

రండే జల్పసి కిం? తవైవ జననీ రండా త్వదీయా స్వసా

 నిర్గచ్ఛ త్వరితం  గృహాద్బహిరితో నేదం త్వదీయం గృహం

హాహా ! నాథ ! మమాద్య  దేహి మరణం తావన్న  భాగ్యోదయ:


కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు వారిమనస్సు నొచ్చుకోకుండా

మాట్లాడగలగడం ఒక కళ. అది అందరు నేర్చుకోవాలి .                                     ............................

భ్రమరాంబా అమ్మవారి

 #శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనక నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. 


అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.


పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.


శ్రీశైలంలో ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.


శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


సుకన్యా నాసత్య సంవాదం

ఒకరోజున - రూపయౌవన సంపన్నులూ రవిపుత్రులూ అయిన అశ్వినులు (నాసత్యులు) క్రీడా

వినోదపరాయణులై ఆ ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. సమీపసరోవరంలో స్నానంచేసి తడిబట్టలతో మడిగా

ఆశ్రమానికి నీళ్ళు తీసుకువెడుతు సుకన్యాదేవిని చూశారు. దేవకన్యలా మెరిసిపోతున్న ఆమె సౌందర్యానికి

ముగ్ధులయ్యారు. దగ్గరగావెళ్ళి గజగామినీ! ఒక్కక్షణం నిలబడు. మేమిద్దరం దేవపుత్రులం. నిజం

చెప్పు. నువ్వు ఎవరి అమ్మాయివి? నీ భర్త ఎవడు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా స్నానానికి

వచ్చావంటే ఏమిటి కథ? పద్మపత్ర విశాలాక్షీ! మరొక లక్ష్మీదేవిలాగా ఉన్నావు. నీ విషయమంతా

తెలుసుకోవాలనుకుంటున్నాం. నీ సుకుమారమైన పాదాలు ఈ కఠినమైన నేలమీద నడుస్తోంటే మాకు

గుండెలు తరుక్కుపోతున్నాయి. తన్వంగీ! నువ్వు విమానాలలో తిరగవలసినదానివి. ఇలా వట్టికాళ్ళతో

నేలమీద సంచరించవలసినదానవు కాదు. అనావిష్కృతవై ఈ అడవిలో ఇలా ఎందుకు ఉంటున్నావు?

ఎక్కడికి వెడుతున్నావు? నూరుమంది దాసీలతో కదలవలసినదానివి. రాకుమారివో? అప్పరపవో? నీ

తల్లిదండ్రులు ఎవరోకానీ పరమధన్యులు. నీ పతిదేవుడి అదృష్టాన్ని వర్ణించి చెప్పడం మావల్ల కాదు. నీ

కదలాడుతున్న పాదాలు ఈ భూమిని దేవలోకంకన్నా పావనం చేస్తున్నాయి.

దేవలోకాధికా భూమిరియం చైవ సులోచనే ॥

ప్రచలంశ్చరణస్తేఽద్య సంసావయతి భూతలమ్ ॥

సౌభాగ్యాశ్చ మృగాః కామం యే త్వాం పశ్యంతి వై వనే

యే చాన్యేపక్షిణః సర్వే భూరియం చాతిసాననా

(4-37)

ఈ అడవిలో రోజూ నిన్ను తనివితీరా చూడగలుగుతున్నాయి ఈ పక్షులూ మృగాలూ, ఎంత

అదృష్టం చేసుకున్నాయో! నిరంతరం స్పర్శను అనుభవిస్తున్న ఈ నేల ఎంత పావనమైనదో! హే

సులోచనే! పొగడ్తలకేమిగానీ సత్యం చెప్పు. నీ తల్లిదండ్రులెవరు? నీ భర్త ఎవడు? ఎక్కడ ఉన్నాడు?

అతడిని చూడాలి మేము

Karakkaaya


 

Water falls


 

Jump in water


 

Vigrahaaraadhsns


 

Drone fire fighter


 

Kutumbam baagaa vundaali


 

Jalaalabagh paneer


 

*స్థల నిర్ణయానికి ప్రయాణ సన్నాహం..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*స్థల నిర్ణయానికి ప్రయాణ సన్నాహం..*


*(పదహారవ రోజు)*


శ్రీధరరావు ప్రభావతి గార్లు మొగలిచెర్ల చేరుకున్నారు కానీ..వాళ్ళ మనసులో శ్రీ స్వామివారి ఆదేశమే సుడులు తిరుగుతూ ఉంది.."జరిగేదేదో జరగక మానదు.."అనే మాట ఇతరులతో అనునయంగా చెప్పడానికి బాగానే ఉంటుంది..తనకు అనుభవంలోకి  వచ్చినప్పుడు మాత్రం స్థిమితంగా వుండటం చాలా కష్టమైన విషయం..అదే అనుభవానికి వస్తున్నదా దంపతులకు..అటువైపు శ్రీ స్వామివారు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్లుగా వున్నారు..మాలకొండలో ఇక వుండటం కుదరదు అని కూడా చెప్పేసారు..మీదే నిర్ణయం అని చెప్పేసారు..


ఆ మరుసటి శనివారం నాడే శ్రీధరరావు దంపతులు మాలకొండ వెళ్లారు..నేరుగా శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి దర్శనం చేసుకొని ఇతర పనులు చూసుకుందామని దంపతులిద్దరూ గర్భాలయంలో ప్రవేశించారు..శ్రీ నరసింహ స్వామి వారిని చూసిన ప్రభావతి గారికి, ఆ లక్ష్మీనారసింహుడు తృళ్లి తృళ్లి నవ్వుతున్నట్లు..తాము నిలుచున్న గర్భగుడి ఊగుతున్నట్లు అనుభూతి చెందసాగారు..గట్టిగా కళ్ళుమూసుకుని..


"ఉగ్రం వీరం మహావిష్ణుం

 జ్వలంతమ్ సర్వతోముఖం

 నృసింహం భీషణం భద్రం 

మృత్యోర్మృత్యు నమామ్యహం౹౹" 


అని మనసులో చెప్పుకొని..కళ్ళుతెరచారు.. ఒక కాంతిపుంజం శ్రీ లక్ష్మీనృసింహుడి విగ్రహం లోంచి..తామిద్దరినీ తాకుతూ..గర్భాలయం దాటి వెలుపలికి వెళ్లిపోయినట్లు తోచింది..ప్రభావతి గారు భ్రమ పడలేదు..సాక్షాత్తూ అనుభూతి చెందారు..


ప్రక్కనే ఉన్న శ్రీధరరావు గారిని పట్టుకుని..మెల్లిగా.."శ్రీవారూ..ఒక కాంతిరేఖ స్వామివారిలోంచి వచ్చి మనలను తాకుతూ బైటకు వెళ్ళింది..నాకెందుకో ఆ స్వామి అంశ అనిపిస్తోంది.." అన్నారు..


"ప్రభావతీ!..మనం గుడిలో ఉన్నాం..నీకు నరసింహ స్వామిని చూసిన ఆవేశంలో ఏదో భ్రమ కలిగివుంటుంది..పిచ్చి పిచ్చిగా మాట్లాడకు!.."అని కొద్దిగా మందలింపు గా అన్నారు..కానీ ప్రభావతి గారికి ఆ అనుభూతి వదల్లేదు.."ఒక మహాద్భుత తేజోపుంజమది.. స్పష్టంగా చూసాను నేను! ఇది భ్రమ కాదు!!..ఈ సంకేతం దేనికి?.." రకరకాల ఆలోచనలతో ఆలయం నుంచి వెలుపలకు వచ్చారావిడ..


అక్కడ ప్రభావతి గారి చిన్నత్త గారు..(శ్రీధరరావు గారి తల్లీగారి చెల్లెలు..కౌశల్యమ్మ గారు..) కలిశారు..అలాగే మరో బంధువైన రమణయ్య గారూ వచ్చివున్నారు..రమణయ్య గారిది మొగలిచెర్ల కు దగ్గరలో గల పొట్టిపల్లె గ్రామం..తాను మొగలిచెర్ల సరిహద్దుల దాకా ఈ దంపతులతో కలసి వచ్చి, అక్కడినుండి పొట్టిపల్లె వెళతానని చెప్పారు.. చిన్నత్త గారైన కౌశల్యమ్మ గారు, తన అక్కయ్య గారైన శ్రీధరరావు గారి తల్లిగారిని చూడటానికి మొగలిచెర్ల వస్తామన్నారు..సరే..అందరమూ ఎద్దుల బండిలో వెళదాము..ఒకసారి శ్రీ స్వామివారిని దర్శించుకొని..అటునుంచి అటే వెళదాము అని నిర్ణయించుకొని..అందరూ శ్రీ స్వామివారున్న పార్వతీదేవి మఠం వద్దకు వచ్చారు..


సరిగ్గా అదే సమయంలో శ్రీ స్వామివారు దిగంబరంగా కూర్చుని, ఒకప్రక్క జింకచర్మం, దండ కమండలాలను పెట్టుకొని..కుడి నాసిక, ఎడమ నాసిక లను వేళ్ళతో మూస్తూ.. శ్వాస క్రమాన్ని గమనిస్తూ.. వీళ్ళను చూసి చిన్నపిల్లాడిలా సంతోషంతో..నిలబడి.."మీరొస్తున్నారని ఆదేశం వచ్చింది..మీకోసమే దిగివచ్చి ఇక్కడున్నాను..పదండి!..మీతోపాటు నేనూ మీ గ్రామానికి వస్తున్నాను.." అన్నారు..


ఒక్కసారిగా ఖంగుతున్నారు శ్రీధరరావు ప్రభావతి గార్లు..వారిద్దరూ శ్రీ స్వామివారిని తమ వెంట మొగలిచెర్ల కు తీసుకుపోవడానికి మానసికంగా సిద్ధంగా లేరు..పైగా ఇప్పటికిప్పుడు ఈ యోగికి ఏ ఏర్పాట్లు చేయాలో..తెలీదు..ఆ ప్రక్కరోజే కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ జరుగుతున్న పనుల పరిశీలనకు వస్తామని చెప్పివున్నారు..ఆ ఏర్పాట్లూ చూడాలి..తమతో పాటు ప్రస్తుతం మరో ఇద్దరు కూడా వస్తున్నారు..ఇంతమంది ఆ బండిలో ఎలా?..ఆలోచిస్తున్నారు..


శ్రీధరరావు గారు గంభీరంగా.."మాతో పాటు ఆ బండిలో మీరు రాగలరా?.." అన్నారు..ప్రభావతి గారికి చిరాకేసింది..ఏమిటీ మనిషి?..అనుకుంటూ వున్నారు..


శ్రీ స్వామివారు పెద్దగా నవ్వుతూ.."నేనూ పుట్టింది రైతు కుటుంబంలోనే..ఎద్దులూ..బండీ.. అన్నీ అలవాటే!..ఏం పర్వాలేదు..అమ్మకు సందేహంగా ఉంది శ్రీధరరావు గారూ..అది ఆలోచించండి.." అన్నారు..


ప్రభావతి గారు ఏదో చెప్పబోయేలోపలే..అప్పటిదాకా నవ్వుతూ ఉన్న శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయి.. .."అమ్మా..!." అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు..


శ్రీ స్వామివారి బోధ..ఆపై మొగలిచెర్ల ప్రయాణపు అనుభవమూ...రేపు...


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

చందమామ కథ ఆడకోతి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

చందమామ కథ 

ఆడకోతి 

డి.సుబ్రహ్మణ్యం 


పూర్వం కాంచీపురరాజ్యాన్ని కనకసేను డనే రాజు పాలిస్తూవుండేవాడు. ఆయన చాలా విలాసపురుషుడు. దూరదేశాలనుంచి కూడా అనేకరకాల పూలమొక్కలూ వృక్షజాతులూ తెచ్చి, రాజభవనంవెనక చక్కని ఉద్యానవనం పెంచాడు.


అందమైన ఆ ఉద్యానవనంలో, అతి మనోహరమైన కొలను తవ్వించాడు. కొలను చుట్టూ పెద్ద పెద్ద చెట్లూ, వాటిని అల్లుకుని రకరకాల పుష్పలతలూ ఉన్నయి.


ఒకనాడు కాంచీపురరాణి కొలనుకు స్నానానికని వెళ్లింది. కొలనులో దిగుతూ తను ధరించిన నగలన్నీ దాసీదాని చేతికి ఇచ్చింది వాటిలో ఒక అమూల్యమైన రత్నాలహారంకూడా వుంది.


రాణి యిచ్చిన నగలన్నిటినీ దాసీది కొలను ఒడ్డున పెట్టి, అక్కడ చేతికి అందిన చెట్లనుంచి పూలు కోయసాగింది. ఇంతలో అక్కడ చెట్లపైన వుండే ఒక ఆడకోతి హఠాత్తుగా కిందకు దూకి ఆరత్నాలహారాన్ని ఆందిపుచ్చుకొని, ఒక్కగంతులో మళ్లీ చెట్టు ఎక్కేసింది.


హారాన్ని కోతి ఎత్తుకుపోవటం దాసీది చూసింది. కాని ఏంచేయటానికీ తోచక చూస్తూవుండిపోయింది. ఇంతలో రాణి కొలనునుండి బయటికి వచ్చి, దుస్తులు ధరించి, నగలలో తన రత్నాలహారం కనబడకపోయేసరికి దాసీదానిని అడిగింది.


"ఏమోనమ్మా, మీరు ఇచ్చిన నగలన్నీ యిక్కడే పెట్టాను!" అన్నది దాసి, రాణి కోపగిస్తుందేమో నన్న భయంతో.


రాణి వెళ్ళి రాజుతో యీ దొంగతనం సంగతి చెప్పింది. రాజు మంత్రిని పిలిపించి సూర్యాస్తమయంలోపల దొంగను పట్టి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రి వెంటనే దండనాయకుణ్ణి పిలచి జరిగినదంతా వివరించి, సూర్యాస్త మయం లోపల రత్నాలహారంతో స హా దొంగను పట్టి ఒప్పగించకపోతే వుద్యోగానికి తిలోదకాలేనని గట్టిగా చెప్పాడు.


దండనాయకుడు యుద్ధానికి వెళుతున్నట్టుగా వందలకొలది సైనికులతో బయలుదేరాడు. పట్టణం అంతా గాలించి వేశాడు. దొంగ యెవడో, యెలా వుంటాడో యెవరికీ తెలీదు. కాని, దొంగతనం చేసిన వాడు తప్పక బీదవాడై వుంటాడనీ, బీద వాడైతే మాసిన దుస్తులతో, పెరిగిన గడ్డంతో వుంటాడనీ వారి నమ్మకం.


చివరికి పట్టణమూ, ఆ చుట్టుపట్ల వున్న అడవులూ వెదికి సూర్యాస్తమయంలోపల ఒక చింకిగుడ్డలవాణ్ణి కోటకు లాక్కొని వచ్చారు. దొంగ దొరికాడని వినగానే రాజు తక్షణం దర్బారుకు వచ్చాడు.


"రత్నాలహారం యెక్కడ దాచావు?" అని గద్దించి ప్రశ్నించారు రాజుగారు. దొంగిలించలేదంటే యెవ్వరూ నమ్మరనీ, ఆ నిమిషానే వురితీయిస్తారనీ భయపడి, ఆ బీదవాడు " రత్నాలహారం, కోశాధిపతిగారికి యిచ్చానండీ!” అన్నాడు. ఇలా అన్న వెంటనే కోశాధిపతిని రెక్కలు విరిచికట్టి  రాజుముందుకు లాక్కొని వచ్చారు. 


రాజు అదేప్రశ్న మళ్లీ అడిగాడు. కోశాధిపతికి రాజు మనస్తత్వం తెలుసు; కనుక తడుముకోకుఁడా "మన ఆస్థానజ్యోతిష్టుల వారికి యిచ్చానండీ!” అన్నాడు.


ఆస్థానజ్యోతిషుణ్ణి కాళ్లూ చేతులూ కట్టి తెచ్చి రాజుగారిముందు నిలబెట్టారు. రాజు అంతకుముందు ఇద్దరినీ ప్రశ్నించినట్టే మళ్లీ ప్రశ్నించాడు. దానికి జోతిష్కుడు తడబడ కుండా "మంత్రిగారి పెద్దకుమారుడికి యిచ్చానండి! " అన్నాడు. ఇంతవరకు విచారణ జరిగేసరికి చాలా పొద్దుపోయింది.


అందుచేత "తతిమ్మా వ్యవహారం అంతా రేపు వుదయం చూసుకుందాం. నేరస్థులను మాత్రం ఖైదులో వేయండి!'' అని చెప్పి రాజుగారు లేచిపోయారు.


ఆరాత్రి మంత్రికి నిదురపట్టలేదు. రత్నాలహారం పోవడం, ఆ దొంగతనం యెవడో బీదవాడితో ప్రారంభమై చివరకు తన కొడుకుమీదికి రావడం— —అంతా చిత్రంగా తోచింది. అర్ధరాత్రిసమయాన పడక గదినుంచి  బయలుదేరి సరాసరి నేరస్థులు బంధింపబడి ఉండే గది తలుపు దగ్గరకు వెళ్ళి చెవి ఒగ్గి వినసాగాడు. జైలు గదిలోపలనుంచి సన్నగా ఏడుపు వినబడింది. మంత్రి అలానే తలుపుదగ్గిరసా చెవివుంచి వింటున్నాడు. ఇంతలో ఆ యేడుపు ఆగిపోయింది. అదేసమయాన బీదవాడి గొంతుక యిలా అన్నది:


" కోశాధిపతిగారూ ! నన్ను క్షమించాలి. ప్రాణభయంవల్ల అలా మీ మీద అబద్దం చెప్పేశాను. నిజానికి ఆ రత్నాలహారాన్ని గురించి నాకేమీ తెలియనే తెలియదు.”


తరవాత కోశాధి పతి: "జ్యోతిషుల వారూ! నన్ను క్షమించాలి. ప్రాణభీతివల్ల మీ మీద చెప్పేశాను. జ్యోతిష్కులు గనక, నిజం తెలుసుకోగలరు కదా అని అలా అనేశాను " అన్నాడు.


ఇక జ్యోతిష్కుడు ప్రారంభించాడు: "జ్యోతిషం, నా శ్రాద్ధమును! యిలాంటి దొంగతనాలు జ్యోతిషానికి అందేవికావు.  అందుకే మంత్రికొడుక్కి వుచ్చువేశాను."


ఇంతవరకూ అందరి మాటలూ విన్న మంత్రికి రహస్యం తెలిసిపోయింది. సరాసరి అర్ధరాత్రివేళ రాజుదగ్గరకు పోయి, నిద్ర లేపి, తను విన్నదంతా చెప్పేశాడు.


మంత్రి చెప్పినదంతా విని, రాజు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. తన రాణికి ప్రాణప్రదమైన ఆ వెలలేని రత్నాలహారం యెవరు దొంగిలించినట్టు? తెల్లవార్లూ రాజుకు యిదే ఆలోచన.


తెల్లవారింది. రాజు దాసీదానిని ఎదటికి పిలిపించాడు. 'నిజం చెప్తావా, లేకపోతే నిన్ను ముక్కలుముక్కలుగా నరికించి, కాకులకూ గద్దలకూ వేయించమంటావా?' అని బెదిరించాడు.


దాసీది హడిలిపోయింది.


"మహారాజా ! నేను నిర్దోషిని. కాని కొలనుపక్షని రావిచెట్టుమీద నివసించే ఆ ఆడకోతిమీద మాత్రం నాకు అనుమాన మున్నది !” అని చెప్పింది.


"కోతిమీద ఎందుకని అనుమానం! అది నీకన్న అందంగా వుందనా ?” అన్నాడు రాజు, గుడ్లెర్రజేస్తూ.


"లేదు ప్రభూ! అది అమ్మగారిలాగే వయ్యారంగా నడవాలని ప్రయత్నించడం నేను చూశాను. అమ్మగారు కొలనులో స్నానంచేస్తున్నంతసేపూ, అదికూడా చెట్ల కొమ్మల మీద స్నానంచేస్తున్నట్టు అభినయిం చేది. అమ్మగారిలాగానే కనపడీ కనపడనట్టు చిరునవ్వు నవ్వాలని కూడా ప్రయత్నించటం నేను చూశాను!" అన్నది. 


రాజుగారికి, దాసీవాని మాటలు వినే సరికి అరికాలు మంట నెత్తికెక్కినట్టయింది. దాసీదానిని నిలువునా నరికేద్దామను కున్నాడు. కాని రత్నాలహారం సంగతి గుర్తుకొచ్చి శాంతం వహించాడు.


"ఐతే, రత్నాల హారం ఆ ఆడకోతే దొంగలించిందంటావా? బాగానే వుంది. మరి ఆ హారాన్ని అదెక్కడ దాచిందో తెలుసు కోవడం ఎలా ?" అన్నాడు రాజు.


"అదేమంత కష్టంకాదు ప్రభూ!" అని మెల్లగా అంటూ ముసిముసినవ్వులు నవ్వింది ఆ దాసీది. ఎందుకని కష్టం కాదు ?" అని గాడు రాజు ఉగ్రుడై.


తమరు భవనంలో వున్నప్పుడేగదా రాణీగారు ఆ రత్నా లహారాన్ని ధరిస్తారు ?" అని ఎదురు ప్రశ్న వేసింది దాసీది.


" కావొచ్చు!" అన్నాడు రాజు కనుబొమలు చిట్లిస్తూ.


"ప్రభూ! తమకు నా మీద కోపం రావొచ్చు కనక, అంత వివరంగా చెప్పలేను. కాని, ఆ ఆడకోతి రత్నాలహారాన్ని ఎక్కడ దాచిందో కనుక్కోవాలంటే, మనం ఒక మగకోతిని తీసుకొనివస్తే వెంటనే తెలిసిపోతుంది !" అన్నది దాసి.


దాసీదాని మాటలలోని అంతరార్థం గ్రహించి, రాజు చిరునవ్వు నవ్వుకున్నాడు. రాణీని ఆడకోతితోను, తనను మగకోతి తోనూ ఆది పోల్చుతున్నదని గ్రహించాడు. కాని, యెలా అయినా ముందు ఆ రత్నాల హారం రాబట్టుకోవాలిగదా ! రాజు ఆజ్ఞాపించగా, క్షణాలమీద ఒక మగకోతిని తెచ్చారు. రాజోచితంగా దానిని అలంకరించారు. మగకోతి  వెనుక రాజూ, మంత్రి మొదలైనవారు అందరూ సపరివారంగా ఉద్యానవనంలోకి వెళ్ళారు.


రావిచెట్టు మీద నివసిస్తున్న ఆడకోతి యిదంతా చూచింది. ఒక్కగంతులో ఆ పక్కనవున్న చెట్టుతొర్రలో జొరబడి, అక్కడ దాచివుంచిన రత్నాలహారం బయటికి తీసి, మెడలో వేసుకున్నది. తరు వాత చెట్టు దిగి , రాణీగారిలాగే వయ్యారంగా నడుస్తూ, మగకోతివేపు బయలుదేరింది.


రాజభటులు ఆడకోతిని పట్టుకుని, దాని మెడలోని రత్నాలహారం లాక్కున్నారు. ఆది కీచుకీచుమంటూ తిరిగి చెట్టుమీదకు పారిపోయింది.


రత్నాలహారం రాణికి యిచ్చి, నిర్దోషులందర్నీ వదిలేశారు. అందరితోపాటు రాజూ, దాసీదాని తెలివిని మెచ్చుకుని తగిన రీతిన  బహుమతి ప్రదానం చేశాడు .

(చందమామ - 1953, ఏప్రిల్ )


*సేకరణ:- శ్రీ శర్మద గారు*

*03-11-2023* *భృగు వాసరః* *శుక్ర వారం* *

 *03-11-2023*

*భృగు వాసరః* *శుక్ర వారం*

*రాశి ఫలితాలు*

*మేషం*

చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి.

*వృషభం*

సోదరులతో స్థిరస్తి వివాదాలు  పరిష్కరించుకుంటారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి   శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో భాగస్థులతో సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు.

*మిధునం*

అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో స్వల్పలాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు.

*కర్కాటకం*

ముఖ్యమైన వ్యవహారాలలో కీలక  నిర్ణయాలు  తీసుకుని  లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా  పూర్తవుతాయి. వృత్తి  ఉద్యోగాలు మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. 

*సింహం*

ముఖ్యమైన పనులు వ్యయ  ప్రయాసలతో కానీ  పూర్తికావు. ఆర్థిక  పరంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి  ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబసభ్యుల తో ఆకారణ వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

*కన్య*

ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగిన సకాలంలో పూర్తిచేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో  నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి  లాభాల అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

*తుల*

వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు లభించిన  అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలలో అంచనాలను   అందుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

*వృశ్చికం*

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. దైవ సేవకార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగములు  అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి కావు.

*ధనస్సు*

వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అకారణంగా ఇతరులతో వివాదాలు కలుగుతాయి.  ఋణ సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయంలో దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి.

*మకరం*

కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీర్ఘ కాలిక ఋణాల వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది. వృత్తివ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున  అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు. సామజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

*కుంభం*

సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు సద్దుమణుగుతాయి. విద్యార్థులు పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

*మీనం*

ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో స్వల్ప ఇబ్బందులయింటాయి. వ్యాపార పరంగా ఒత్తిడి తప్పదు. కుటుంబ పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. నూతన ఋణ యత్నాలు చేస్తారు.

🕉️

పరాన్నం

 *ॐ卐 _-|¦¦|సుభాషితమ్|¦¦|-_ ॐ卐* 


శ్లో𝕝𝕝 

*పరాన్నం పరవస్త్రం చ పరశయ్యా పరస్త్రియః।*

*పరవేశ్మనివాసశ్చ శక్రస్యాపి శ్రియం హరేత్॥*


తా𝕝𝕝 

పరుల అన్నం, పరులు ధరించిన వస్త్రం, పరులు శయనించిన పక్క, పరస్త్రీలయందు వ్యామోహం పరగృహంలో నివాసం - ఇవి ఇంద్రుడి ఐశ్వర్యాన్ని సహితమూ పోగొడతాయి......"


తల్లిదండ్రులు, గురువులు, ఆపదలో తనను ఆదుకొన్నవారు, అన్నదమ్ములు, పిల్లనిచ్చిన మూమగారు,  కొడుకు పుట్టిన తరువాత కుమార్తె వీరు పరులు కారు. ఇక మిగిలిన అందరూ పరులుగానే భావించవలెను.

కోటి సూర్యుల వలె ప్రకాశించు వాడు

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 


శ్లో 𝕝𝕝  *_భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం_*

*_నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్_*

*_కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం_*

*_కాశికాపురాధినాథకాలభైరవం భజే_......*


_ *_శ్రీకాలభైరవాష్టకమ్ - 02_* _


భా: 

కోటి సూర్యుల వలె ప్రకాశించు వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, జగదీశ్వరుడు, నీలకంఠుడు, కామ్యములను తీర్చేవాడు, మూడు నేత్రములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, అజేయమైన త్రిశూలము కలవాడు, నాశనము లేని వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

Nice Joke...

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

Nice Joke...

----------

కొంత మంది వివిధ సందర్భాలలో కలసినపుడు వేసే విచిత్రమైన ప్రశ్నలు..వాటికి సరదా జవాబులు.😅


 1. సినిమా హాల్లో:

 "మీరు కూడా సినిమాకే వచ్చారా?"

నేను: "లేదు పాప్ కార్న్ అమ్ముకోవటానికి వచ్చాను"


 2. సిటీ బస్సులో కాలు తొక్కి:

 "Sorry .. నొప్పిగా ఉందా ?"

 నేను: "అబ్బే లేదండీ.. anesthesia తీసుకుని వచ్చాను, కావలంటే మళ్ళీ తొక్కండి!!"


 😴😴😴😴😴😴😴😴

 3. అర్ధరాత్రి ఫోన్ చేసి: "పడుకున్నారా?"

 నేను: "లేదు ఆఫ్రికా కోతుల మీద రీసర్చ్ చేస్తున్నాను.. మీ చుట్టాల వివరాలు తెలిసాయి" 😴


 💇💇💇💇💇💇💇💇

 4. బార్బర్ షాప్ నుండి వస్తుంటే: "ఏంటి హేర్ కటింగ్ చేయించుకున్నారా?"

 నేను: "శరత్కాలం కదా రాలిపోయింది!"


☎☎☎☎☎☎☎

 5. ఇంట్లో Land-line కి ఫోన్ చేసి: "ఎక్కడున్నారు?"

నేను: "ఫోన్ మెళ్ళో వేసుకుని, మార్కెట్లో కూరగాయలు కొంటున్నా !!"


 🚘🚘🚘🚘🚘🚘🚘🚘

 6. కారు కడుగుతున్నప్పుడు ప్రక్కింటాయన: "సార్ !! కారు కడుగుతున్నారా??"

నేను: "లేదండీ, నీరు పోస్తున్నాను. ఇది పెరిగి పెద్దదై బస్సంతవ్వాలని.. 


😄😄😄😉😉😉😊😊😊😊....

మనిషి ఇరుక్కున్నాడు...*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*మనిషి ఇరుక్కున్నాడు...* 



👉 భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.!

👉 సహజీవనాన్ని సంసారమంటున్నారు.!

👉 గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నా లో...

👉 డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.!


👉 డూప్ ల పోరాటాన్ని హీరోయిజం అంటున్నారు.!

👉 పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యమంటున్నారు..

👉 అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.!


👉 ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.!

👉 దారితప్పిన సరదాలను సంస్కృతి అంటున్నారు.!

👉 భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు.!


👉 కోరిన కోర్కెలు తీరిస్తేనే... దేవుడంటున్నారు.!

👉 ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.!

👉 మందు పోయిస్తేనే...మిత్రుడు అంటున్నారు.!


👉 కట్నం తెస్తేనే...భార్య అంటున్నారు.!

👉 సొమ్ములు తెస్తేనే... సంసారం అంటున్నారు.!

👉 కాసులు తెస్తేనే... కాపురం అంటున్నారు.!


👉 నిజాయితీగా ఉంటే... అసమర్ధుడంటున్నారు.!

👉 సక్రమంగా ఉంటే... అమాయకుడంటున్నారు.!

👉 అసత్యాలు మాట్లాడితే... బ్రతక నేర్చిన వాడంటున్నారు.!


👉 నిజం పలికితే... నీ కెందుకు పోవోయ్ అంటున్నారు..!

👉 న్యాయబద్ధంగా ఉంటే... ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.!

👉 అన్యాయంగా బ్రతికినా... సక్సెస్...ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!


👉 అన్యాయాన్ని ఎదిరిస్తే... అతనికెందుకు అంటున్నారు.!

👉 నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.!

👉 మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.!


👉 మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!

👉 పరిస్థితులకు అనుగుణంగా పాత అర్ధం చెరిగిపోయి, ప్రయోజనాలకు అండగా... సరికొత్త పరమార్ధం ఆవిర్భవిస్తోంది.!


🔥 టెక్నాలజీ పెరిగింది...

🔥 సౌకర్యం పెరిగింది...

🔥 విలాసం పెరిగింది...

🔥 విజ్ఞానం పెరిగింది...

🔥 కాలుష్యం పెరుగింది...

🔥 ఖర్చు పెరిగింది...

🔥 కల్తీ పెరిగింది...

🔥 రసాయన బంధం పెరిగింది...

🔥 అన్నీ పెరిగాయి...

కానీ! పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు

మన ఆయుష్ ప్రమాణం మాత్రం 50% పైగా తగ్గింది..

రోగం తెలియని చికిత్సలు..శవాలకు రక్తపరీక్షలు...

విద్య పెద్ద వ్యాపారం...వ్యాధి ఇంకా పెద్ద వ్యాపారం

దహించనున్న గ్లోబల్ వార్మింగ్.... భావితరాలకు వార్నింగ్..

అయినా బాధ్యత లేనట్లు.. ఏమి తెలియనట్లు

నటించే మనిషి...

*సేకరణ:- వాట్సాప్ పోస్ట్.*

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం  - షష్ఠి -  పునర్వసు - భృగు వాసరే* *(03-11-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/tHejxOKi6ow?si=V-uIOfe3EOEF4h4g


🙏🙏

శుక్రవారం నియమం..*

 *శుక్రవారం నియమం..*


"సార్..నా పేరు ఖాదర్ భాషా..ఇప్పుడు అవధూత గారి మందిరం తెరచి ఉన్నదా?..అక్కడికి వచ్చి స్వామి సమాధి చూడొచ్చా?.." అని పోయిన ఆగస్ట్ లో ఫోన్ చేసాడు.."ఇరవై రోజుల క్రితం నుంచి స్వామివారి మందిరం తెరచి ఉంచాము..ప్రస్తుతానికి స్వామివారి సమాధి వద్దకు ఎవరినీ పంపటం లేదు..మరో వారం తరువాత అధికారులు అనుమతి ఇస్తే..స్వామివారి సమాధి వద్దకు భక్తులకు ప్రవేశం కల్పిస్తాము.." అని చెప్పాను.."ఓహో..అలాగా..సరే సార్..మరో వారం పది రోజుల తర్వాత ఫోన్ చేస్తాను.." అని చెప్పాడు..అంతటితో ఆ సంభాషణ ముగిసిపోయింది..


మరో 15 రోజుల తరువాత ఒక గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఓ యాభై ఏళ్ల వ్యక్తి నేను కూర్చున్న చోటుకి వచ్చి.."నమస్తే సార్..నా పేరు ఖాదర్ బాషా..మీతో కొన్నాళ్ల క్రిందట ఫోన్ లో మాట్లాడాను..మీతో 10 నిమిషాలు మాట్లాడాలి..సమయం ఉందా?" అన్నాడు.."చెప్పండి.." అని కుర్చీ చూపించాను..దగ్గరగా కూర్చున్నాడు.."చెప్పండి.." అన్నాను..


ఒక్కసారిగా కళ్ళు మూసుకొని..రెండుచేతులతో నమస్కారం చేస్తూ..అలానే రెండు నిమిషాలు వున్నాడు..ఆ తరువాత కళ్ళు తెరచి.."ఈ స్వామివారు చాలా మహిమ గలవారు సార్..పోయిన ఏడాది నవంబర్  నెలలో నేను మొదటిసారిగా ఇక్కడికి వచ్చాను సార్..నాకు ఒక మిత్రుడు ఈ ప్రదేశం గురించి..స్వామివారి గురించి చెప్పాడు..ఆ సమయం లో నేను తీవ్రమైన ఆర్ధిక బాధలో వున్నాను..నేను పుట్టినప్పటి నుంచి ఏనాడూ ఒకరివద్ద చేయి చాచి ఏమీ అడగలేదు..వ్యాపారం చేసాను..కలిసొచ్చింది.. నేనూ నా సంసారం హాయిగా ఉన్నాము..మాకు ఇద్దరు కుమార్తెలు..ఇద్దరికీ లక్షణంగా పెళ్లి చేసాను..మా బంధువర్గం లో నావల్ల సహాయం పొందని వారు ఎవ్వరూ లేరు..కొన్నాళ్ల తరువాత నా అదృష్టం తిరగబడింది..వ్యాపారము దెబ్బతిన్నది..నా నుంచి లబ్ది పొందిన ఏ ఒక్కరూ నా కష్ట కాలం లో కనీసం ముఖం కూడా చూపలేదు..అదేసమయం లో నా భార్య అనారోగ్యం పాలైంది..ఏ మందులూ పనిచేయలేదు..ఒక సంవత్సరం బాధపడి మరణించింది.. నేను ఒంటరి వాడినై పోయాను..వ్యాపారం చేద్దామన్నా ఆసక్తి లేదు..ఏదో నిరాశ..ఎటూ దిక్కుతోచలేదు.. కడప చుట్టుపక్కల ఉన్న అన్ని దర్గాలకు వెళ్ళాను..నీలకంఠరావుపేట దర్గా దగ్గిర నా మిత్రుడు కలిసి..ఈ స్వామిగురించి చెప్పాడు..అతనికి ఈ స్వామివారి భక్తురాలు అష్రాఫ్ జాన్ గారు స్వామివారి గురించి చెప్పారట..నాకు చెప్పాడు..మరో రెండురోజుల్లో ఇక్కడికి వచ్చాను సార్.." 


"ఆరోజు గురువారం సార్..ఆరోజు ఇక్కడే వున్నాను..ఆ రాత్రికి నిద్ర చేసాను..ఈ మధ్య కాలం లో అంత ప్రశాంతంగా నిద్ర పోయింది ఇక్కడే సార్..స్వామివారి సమాధి దర్శించుకున్నాను..నా బాధ చెప్పుకున్నాను..ప్రక్కరోజు శుక్రవారంనాడు స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లబోతూ ఉండగా..ఆరోజు స్వామివారి మందిరం శుభ్రం చేస్తున్నారని తెలిసింది..నేనూ పాల్గొంటాను అని పూజారి గారిని అడిగాను..ఆయన సరే అన్నారు..మీ పూజారులు అందరితో పాటు స్వామివారి సమాధిని నేనూ శుభ్రం చేసాను సార్..మీ పూజారులు అందరికీ అవకాశం ఇస్తారు సార్..నాకెందుకో చాలా బాగా అనిపించింది..అంతా అయిపోయిన తరువాత..స్వామివారి కి హారతి ఇచ్చారు..కళ్లకద్దుకొని..ఆ మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేసి..వెళ్ళిపోయాను..ప్రక్కరోజు ప్రొద్దుటూరు వెళ్ళాను..స్వామివారిని తలుచుకుంటూ  నడచిపోతున్నాను..ఇంతలో ఒకతను ఎదురువచ్చాడు..నా దగ్గరికి వచ్చి పలకరించాడు..ఐదారేళ్ల క్రితం అతనికి కొంత డబ్బు ఇచ్చి వున్నాను..ఆ సంగతి గుర్తు చేసి..నా చేతిలో కొంత డబ్బు పెట్టి.."మిగిలిన డబ్బు త్వరలో ఇస్తానని చెప్పి.." వెళ్ళిపోయాడు..నాకు ఏమీ అర్ధం కాలేదు..అతని నుంచి డబ్బు వస్తుందని ఏనాడూ అనుకోలేదు..ఆరోజంతా స్వామినే తలచుకున్నాను..ఆ డబ్బు పెట్టి మళ్లీ వ్యాపారం మొదలు పెట్టాను..నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా కొంత కొంత సర్దుబాటు చేశారు..మళ్లీ గాడిన పడ్డాను..మునుపటి వేదన లేదు..ఈరోజు ఇక్కడే ఉంటాను సార్..రేపు మీరు అనుమతి ఇస్తే..మీ పూజారులతో పాటు నేనుకూడా స్వామివారి సమాధిని శుభ్రం చేసి..ఆ నీళ్లు నెత్తిన చల్లుకుని..హారతి తీసుకొని వెళతాను.." అన్నాడు.."ఒక సహాయం చేయండి సార్..నాకు వీలున్నప్పుడల్లా ఇలా గురువారం వచ్చి ఇక్కడ నిద్రచేసి..శుక్రవారంనాడు స్వామివారి సమాధి ని తాకి శుభ్రం చేసి వెళుతుంటాను..అందుకు ఒప్పుకోండి.." అన్నాడు.


శుక్రవారంనాడు తన సమాధిని శుభ్రం చేసి పని అతనికి కేటాయించారు..అతను కూడా ఆ పనితోనే స్వామివారికి దగ్గర అవుతున్నాడు.. ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క విధంగా తనమీద విశ్వాసాన్ని వాళ్ళ మనసులో స్థిరపరుస్తారు స్వామివారు..ఆ విషయం మాకు పదే పదే ఋజువు అవుతూ ఉంటుంది..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).

కాలభైరవుని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో 𝕝𝕝  *_భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం_*

*_నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్_*

*_కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం_*

*_కాశికాపురాధినాథకాలభైరవం భజే_......*


_ *_శ్రీకాలభైరవాష్టకమ్ - 02_* _


 *భా: కోటి సూర్యుల వలె ప్రకాశించు వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, జగదీశ్వరుడు, నీలకంఠుడు, కామ్యములను తీర్చేవాడు, మూడు నేత్రములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, అజేయమైన త్రిశూలము కలవాడు, నాశనము లేని వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను*  ...... 


🧘‍♂️🙏🪷 ✍️🙏

శుక్రవారం, నవంబరు 3, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


శుక్రవారం, నవంబరు 3, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం

తిథి:షష్ఠి రా12.09 వరకు  

వారం:శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం:ఆర్ద్ర ఉ8.01 

యోగం:సిద్ధం మ3.41 

కరణం:గరజి ఉ11.42 వరకు తదుపరి వణిజ రా12.09 వరకు

వర్జ్యం:రా8.51 - 10.33

దుర్ముహూర్తము:ఉ8.19 - 9.05 &

మ12.07 - 12.52

అమృతకాలం:లేదు

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి :  తుల

చంద్రరాశి : మిథునం 

సూర్యోదయం:6.03

సూర్యాస్తమయం: 5.26


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

మంగలసూత్రమే

 సుప్రసిధ్ధ కవి చిలకమర్తిలక్ష్మీనరసిoహoగారు నవ్వులగని వంటిహాస్యకథారచనలుకూడా చేసేరు.వాటిలో ఆకలితో ఇoటికి వచ్చిన భర్త, తనగయ్యాలి భార్యవంటచెయ్యలేదని తెలిసి కోపంతో అడిగినప్పుడు వారిమధ్యసాగిన సంభాషణపరమైన శ్లోకం గుర్తూ ఉన్నంతవరకూ తెలుపుతున్నాను, తెలిసినవారెవరైనా ఆ  శ్లోకాన్ని పూరిoచవలసిoదిగా కోరుతున్నాను. 

శ్లో।। ఆ : పాకం న కరోషి పాపిని? కథం పాపీ త్వదీయ: పితా


రండే జల్పసి కిం తవైవ జననీ రండా త్వదీయా స్వసా


నిర్గచ్ఛ త్వరితం గృహాద్బహిరితో నేదం త్వదీయం గృహం


హాహా ! నాథ ! మమాద్య దేహి మరణం తావన్న భాగ్యో


దయ:

అ:పాకం న కరోషి పాపిని కథం, పాపీ త్వదీయ: పితా, రండే జల్ఫసి కిo రండా త్వదీయ:పితా....ఈవిధంగా పరస్పర నిo,దాపూరిత సంభాషణని సూత్రంమదీయంగతం  అని ఆ సాధ్వీమణి తప్పు భర్తదైతే అతడే చస్తాడు తనదైతే తన మంగలసూత్రమే పోతుoదని శలవివ్వడంతో శ్లోకం ముగుస్తుoది. శ్లోకపూరణం చెయ్యకోరుతున్నాను.

నాగ స్తుతి

 శుభోదయం🙏


నాగ స్తుతి 

          ------------------- 


                  చ:  బహువన  పాదపాబ్ధి  కులపర్వత  పూర్ణ  సరస్సరస్వతీ


                       సహిత  మహా  మహీభర  మజస్ర  సహస్ర  ఫణాళిఁ  దాల్చి, దు


                       స్సహ తర  మూర్తికిన్  జలధి శాయికిఁ  బాయక  శయ్యయైన, య


                       య్యహిపతి  దుష్కృతాంతకుఁ  డనంతుడు,మాకు  బ్రసన్నుడయ్యెడున్! 


                           ఆం:  భారతము-- ఆదిపర్వము-  నన్నయ భట్టు ; 


                                       ఈరోజు కార్తీక  శుక్ల  చతుర్ధి. నాగుల  చవితి. గావున  నాగస్మరణము  నాగపూజనము మనసంస్కృతిలో

నొకభాగము. కడుపు చలవకై  మాతృమూర్తు లీనాడు ఉపవసించి  భక్తి శ్రధ్ధలతో  పుట్టలోపాలు బోసి సకల నాగ సమాహారము నారాధింతురు.నాగారాధన సంతతి ప్రదమని  మనవారి  విశ్వాసము. అందువలన నేఁడు సర్పరాజగు ఆదిశేషుని స్తవము ఈపద్యమున చేయబడు చున్నది.


                          ఉదంకుడు పౌష్యునిదేవేరి కుండలములను  నాగులనుండి తిరిగి పొందుటకై  నాగలోకమున కేగి వారలను ప్రసన్నులను

గావించుటకై  నాగస్తుతి  యొనర్చెను. అందులో నొకపద్యమిది.


అర్ధములు: బహువనములు: అనేక మైన యడవులు; పాదప- వృక్షములు; అభ్ధి- సముద్రము; పూర్ణ- నిండిన;  సరః సరస్వతీ-నదులు సరస్సులు; సహిత- కూడిన; మహామహీభరము- గొప్పభూభారమును; అజస్ర- నిరంతరము; సహస్ర- వేయి; ఫణాళి-పడగల సముదాయము; దుస్సహతరమూర్తి- భరింప వీలుగానియాకారముగలవాడు: జలధిశాయి- సముద్రమున పరుండు; బాయక-విడువని; శయ్య-పానుపు; దుష్కృతాంతకుడు-పాపులను దునుమాడు వాడు; అనంతుడు- ఆదిశేషువు; ప్రసన్నుడగుట-దయగలవాడగుట; 


                భావము: అనేకమైన యడవులు ,(పర్వతములు) వృక్షములు , కులపర్వతములతోను నిండి, నదీనదములతోను సరస్సులతోను కూడియున్న సువిశాలమైన యీ భూభారమును  యెల్లవేళలయందునూ  తన వేయిపడగలపై  మోయుచు, సకల లోక గర్భుడై  మోయ శక్యముగాని శ్రీమహా విష్ణువునకు  పాల సముద్రమున  పానుపుగా  నుండి, లోకకంటకులను మట్టుబెట్టు  అనంతుడగు ఆదిశేషుడు  మాకు కరుణాళు వగుగాక!


                  భూమి మిగుల దొడ్డది. పర్వతాలూ వనాలూ  నదీనదాలూ యిలా సమస్త వస్తుజాలముతో  గూడినది.అట్టి భూభారమునొకవంక తన వేయి పడగలపై నిరంతరము మోయుచు. సకల లోకములను తనలోమోయుచున్న  ఆవిష్ణుదేవుని గూడ

మోయుట దుష్కరమైనదిగదా! అట్టి యనంత బలశోభితుడగు అనంతుడు మమ్ముకరుణించుగాక!  


                                సర్పరాజులలో  ఆదిశేషుడు మిన్న. తత్పూజనచే  సర్వ సర్ప సంతతులును ప్రసన్నములగును.


                  కావున నేటి  సర్పస్తవమువలన  మిత్రులకు వారికుటుంబ సభ్యులకు  సర్ప భాధయుడుగు గాక !


                                                             స్వస్తి!!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*శ్రీ అనంత్ మందిర్*

 🕉 మన గుడి : నెం 627






⚜ గోవా  : సావోయ్- వేరేం


⚜  *శ్రీ అనంత్ మందిర్*


💠 గోవా, ప్రకృతిసిద్ధమైన మరియు సుందరమైన అందాలకు నెలవుగా విస్తృతమైన సాంస్కృతిక  వారసత్వాన్ని కలిగి ఉంది. గోవాను సందర్శించే పర్యాటకులు ప్రకృతి మాత ఒడిలో ఉన్న  లోతట్టు ప్రాంతాలకు వెళ్లరు.

కొన్ని గోవా నిర్మాణ అద్భుతాలు గోవాలోని మారుమూల ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి. 


💠 దేవాలయాలకు నిలయమైన పోండా తాలూకాలో పురాతన, మధ్యయుగ మరియు ఆధునిక కాలానికి చెందిన అనేక మందిరాలు ఉన్నాయి. 

సవాయి-వెరెం జంట గ్రామాలు ఒకే తాలూకాలో ఉన్నాయి. 

వెరెం గ్రామంలోని మధ్లా వాడోలో శ్రీ అనంత్ ఆలయం ఉంది. పురాతన కాలం నాటి శిల్పకళా అద్భుతం అని చెప్పడంలో తప్పులేదు. 


💠 ఈ ఆలయాన్ని  *శ్రీ మదనంత్*.  లేదా  *శ్రీ అనంత్ మందిర్*.  అని పిలుస్తారు.

ఈ ఆలయ దైవిక శక్తి మొత్తం పోండా ప్రాంతాన్ని రక్షిస్తుందని నమ్ముతారు, అందుకే ఈ ప్రాంతాన్ని శ్రీ అనంత్ యొక్క దైవిక శక్తి భూమి అని లేదా తరతరాలుగా 'అంత్రుజ్ మహల్'గా వచ్చిన 'అనంత్ ఊర్జా మహల్' అని పిలుస్తారు.


💠 అనంత్ ఆలయం గోవా రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయం, ఇది విష్ణువుకు అంకితం చేయబడింది.  

ఇది ఉత్తర గోవాలోని సవోయి-వెరెం గ్రామం పొండా తాలూకా వద్ద ఉంది.  ఇది వందల సంవత్సరాల పురాతన దేవాలయం, అయితే ఇది ప్రస్తుతం 1923లో పునర్నిర్మించబడింది. విష్ణువు విగ్రహం నల్లరాతితో చేయబడింది.  హిందూ మతానికి సంబంధించిన ఆలయ సముదాయంలో భక్తులు అనేక పండుగలు జరుపుకుంటారు.


💠 శ్రీ అనంత్ ఆలయం 1540లో నిర్మించబడింది.

 అనంత అనేది విష్ణువు శేష పాన్పు అయిన ఆదిశేషుడికి మరోపేరు.

శ్రీ లక్ష్మీ దేవి విష్ణువు పాదాల చెంత కూర్చుని ఉంది. దేవతా విగ్రహం నల్లరాతితో చెక్కబడింది. ప్రధాన దేవత అనంత్ శేషశాయితో పాటు, కాంప్లెక్స్‌లో శాంతదుర్గ, కామిని, నారాయణ్ మరియు గ్రామపురుష్ ఆలయాలు కూడా ఉన్నాయి.


💠 పురాణాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆలయం ఒకప్పుడు  ఋషి ఆశ్రమంగా ఉండేది.  శ్రీమహావిష్ణువు ఈ మహర్షికి కలలో కనిపించి ‘నేను మీ గ్రామానికి వచ్చాను, ఇక్కడే నివాసం ఉండాలనుకుంటున్నాను’ అని చెప్పాడు.  ఋషి మొదట అంతగా ఆలోచించలేదు, కానీ కాలక్రమేణా కల పునరావృతం కావడం ప్రారంభించింది మరియు విష్ణువు ఇలా అన్నాడు: 'నేను సముద్రాల గుండా చాలా దూరం నుండి వచ్చాను'.  

ఈ కల గురించి మహర్షి గ్రామ పెద్దలకు తెలియజేశాడు.


💠 గ్రామ పెద్దలు, అయోమయంలో, మాండోవి నది ఒడ్డుకు వెళ్లి అక్కడ ఓడల వ్యాపార నౌకలను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు.  

నది ఒడ్డుకు చేరుకునే సరికి నది అవతల ఒక ముస్లిం వ్యాపారి పడవ ఒక్కటే ఉంది. 


💠 వారు అతనిని సంప్రదించి,పడవలో  విష్ణుమూర్తి విగ్రహం ఏదైనా ఉందా అని విచారించారు.  తనకు విగ్రహారాధనపై నమ్మకం లేదని, అందువల్ల తన వద్ద అలాంటి విగ్రహం లేదని వ్యాపారి వారికి తెలియజేశాడు, అయితే అతను తన పడవ చుట్టూ చూడమని గ్రామస్తులను అభ్యర్థించాడు.  

గ్రామస్తులు పడవ మొత్తం వెతికినా విగ్రహం కనిపించలేదు.  వారు దిగుతున్నప్పుడు, ఓడ యొక్క మూలలో ఒక పెద్ద చదునైన, నల్లటి గ్రానైట్ రాతి స్లాబ్ పడి ఉండటాన్ని ఎవరో గమనించారు.

అది నాలుగు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు మరియు ఆరు అంగుళాల మందం.


💠 ఆ రాతితో మలిచిన అందమైన అనుబంధ శిల్పాలతో, పడుకుని ఉన్న స్థితిలో విష్ణువు యొక్క అందమైన చెక్కడం చూసి వారు ఆశ్చర్యపోయారు.  

అయితే, విష్ణుమూర్తిని నీటిలో ఉంచాల్సిన అవసరం ఉన్నందున నది ఒడ్డున ఒక గొయ్యి తవ్వారు.  


💠 గొయ్యిని నేడు 'పిరాచి పేట' అని పిలుస్తారు.  తరువాత ఈ విగ్రహాన్ని తీసుకువెళ్లారు మరియు ప్రస్తుత ఆలయం ఉన్న ప్రదేశంలో స్థాపించారు.


💠 ఆ ముస్లిం వ్యక్తి  కారణంగా, గోవాలో మత సామరస్యం యొక్క నిజమైన నీతిని ప్రదర్శిస్తూ సావోయ్ వేరెమ్ ఒక ఆదర్శ గ్రామంగా చిత్రీకరించబడవచ్చు.  గత శతాబ్దాలుగా, ముస్లిం వ్యాపారికి కృతజ్ఞతగా, ఒక సంప్రదాయం అనుసరించబడింది.  

ప్రతి సంవత్సరం ఒక రోజు ఈ ముస్లిం వ్యాపారి వారసుడిని గౌరవప్రదంగా ఆలయంలోకి ఆహ్వానిస్తారు, అక్కడ అతనికి ఆహారం వడ్డిస్తారు మరియు బహుమతులు అందిస్తారు.  హిందువులు మరియు ముస్లింల మధ్య ఇటువంటి స్నేహ బంధాన్ని అరుదుగా చూడగలరు.


💠 ఆలయ నిర్మాణం చిన్నది.

స్తంభాల అలంకరణ చాలా సూక్ష్మమైనది మరియు క్లిష్టమైన డిజైన్‌లతో నిండి ఉంది.

ఈ ఆలయం యొక్క ప్రత్యేక నిర్మాణం రెండు అంతస్తుల ఎత్తైన దీప గోపురం. పండుగల సమయంలో గోపురం నూనె దీపాలతో అలంకరిస్తారు. ఆలయానికి సమీపంలో, పూజలకు ఉపయోగించే పవిత్ర నీటి కొలను ఉంది.


💠 ఫాల్గుణ పూర్ణిమ నాడు ప్రారంభమయ్యే మూడు రోజుల గాదె ఉత్సవం పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షిస్తుంది. 


💠 గోవాలో వెండి రేకుల స్తంభం ఉన్న ఏకైక ఆలయం ఇది. అసలు ఆలయానికి శిఖరం లేదు మరియు అందమైన ముఖమండపం ఉంది. ఇది చాలా సాంప్రదాయ రూపాన్ని సొంతం చేసుకుంది.

కానీ ఇటీవలి పునర్నిర్మాణాలలో కొత్త శిఖరం

నిర్మించడం మరియు ముఖమండపం పైకప్పును మార్చడం వంటివి ఉన్నాయి, 


💠 సమయాలు: ఉదయం 8 నుండి సాయంత్రం 5:30 వరకు.


💠 పంజిం కదంబ బస్ స్టాండ్ నుండి 27 కి.మీ దూరం

పంచాంగం 03.11.2023 Friday,

 ఈ రోజు పంచాంగం 03.11.2023  Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: షష్థి  తిధి భృగు వాసర: పునర్వసు నక్షత్రం సిద్ధ యోగ: గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం.


షష్థి రాత్రి 11:10 వరకు.

పునర్వసు  ఈ రోజు పూర్తిగా ఉంది .

సూర్యోదయం : 06:19

సూర్యాస్తమయం : 05:40

వర్జ్యం : సాయంత్రం 06:57 నుండి 08:41 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:35 నుండి 09:21 వరకు తిరిగి మధ్యాహ్నం 12:22 నుండి 01:08 వరకు.


రాహుకాలం : పగలు 10:30  నుండి 12:00 వరకు 


యమగండం : మద్యాహ్నం  03:00 నుండి 04:30 వరకు.  



శుభోదయ:, నమస్కార: