1, నవంబర్ 2026, ఆదివారం

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 01.11.2026 Sunday


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాస కృష్ణ పక్ష సప్తమి తిథి భాను వాసర పుష్యమి నక్షత్రం సాధ్య యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు. 



శ్రాద్ధ కర్మ తిథి : సప్తమి మరియు అష్టమి

 


 

నమస్కారః , శుభోదయం

భానువారం*🌞 *🌹01నవంబర్26🌹* *దృగ్గణిత పంచాంగం*

*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌞 *భానువారం*🌞

 *🌹01నవంబర్26🌹*       

  *దృగ్గణిత పంచాంగం*

               

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు* 

*ఆశ్వయుజ మాసం - కృష్ణ పక్షం*


*తిథి : సప్తమి* మ 02.51 వరకు ఉపరి *అష్టమి*

*వారం   : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : పుష్యమి* రా 04.50 తె వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం : సాధ్య* మ 02.39 వరకు ఉపరి *శుభ*

*కరణం  : బవ* మ 02.51 *బాలువ* రా 01.57 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ07.00 -09.00 & 11.00- 12.00*

అమృత కాలం  : *రా 10.25 - 11.56*

అభిజిత్ కాలం  : *ఉ 11.28 - 12.14*

*వర్జ్యం   : మ 01.16 - 02.48*

*దుర్ముహూర్తం :సా04.05-04.51*

*రాహు కాలం  :సా04.10 - 05.37*

గుళికకాళం    : *మ 02.44 - 04.10*

యమగండం    : *ప 11.51 - 01.17*

సూర్యరాశి : *తుల*                          

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.15*  

సూర్యాస్తమయం :*సా 05.45*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    : *ఉ 06.05 - 08.23*

సంగవ కాలం        : *08.23 - 10.42*

మధ్యాహ్న కాలం   : *10.42 - 01.00*

అపరాహ్న కాలం: *మ 01.00 - 03.18*

*ఆబ్ధికం తిధి      : తిథి ద్వయం సప్తమి/అష్టమి*

సాయంకాలం : *సా 03.18- 05.37*

ప్రదోష కాలం    : *సా 05.37 - 08.07*

రాత్రి కాలం      : *రా 08.07 - 11.26*

నిశీధి కాలం      : *రా 11.26 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం: *తె 04.25- 05.15*

¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


          *🌞ఓం నమో🌞*

 *🙏సూర్యదేవాయ నమః🙏*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

హనుమాన్ బాహుక్*

  *🌞భానువారం 1 నవంబరు 2026🌞*


**🙏🌹*హనుమాన్ బాహుక్*🙏🌹 

             *🌷 నలభై ఒకటవ రోజు🌷*


ఆసన - బసన - హీన బిషమ - బిషాద - లీన, 

దేఖి దీన దూబరో కరై న హాయ హాయకో ।


తులసీ అనాథసో సనాథ రఘునాథ కియో, 

దియో ఫల సీలసింధు ఆపనే సుభాయకో ॥


నీచ యహి బీచ పతి పాఇ భరుహా ఇగో, 

బిహాఇ ప్రభు - భజన బచన మన కాయకో |


తాతేఁ తను పేషియత ఘోర బరతోర మిస, 

పూటి పూటి నికసత లోన రామరాయకో ॥


**వివరణ**

భోజన వస్త్రములు లేక భయంకర విషాదమున పడియున్న దీన దుర్బలులను చూచి పరిహసించక నుండువా రెవ్వరు? అట్టి అనాథదశలో నున్న తులసీదాసును మాత్రము దయాసముద్రుడగు అతనియొక్క స్వామి శ్రీరామచంద్రుడు దిక్కుకలవానిని చేసి తన సహజ పద్దతిలో ఉత్తమమగు ఫలితమును ప్రసాదించెను. ఇంతలో నీచ ప్రతిష్ఠవలన గర్వమందితిని. తను మన వచనముల రామ భజనము వీడితిని. దీనివలన శరీరమున భయంకరమగు బుడిపెలు వెలువడి ఈ కష్టములనుండి మరల రామచంద్రునియెడ కృతజ్ఞతలు మొలకలెత్తుచున్నవి.


 **ప్రతి పాదానికి అర్థం**


1. ఆసన - బసన - హీన బిషమ - బిషాద - లీన, దేఖి దీన దూబరో కరై న హాయ హాయకో ॥


* **అర్థం:** కూర్చోవడానికి సరైన ఆసనము (స్థిరత్వం), కట్టుకోవడానికి వస్త్రము (బసన) లేనివాడనై, అత్యంత కఠినమైన (బిషమ), తీవ్రమైన దుఃఖంలో (బిషాద) మునిగిపోయి... దీనుడిగా, శారీరకంగా శుష్కించిపోయి (దూబరో) ఉన్న నన్ను చూసి కూడా, ఈ లోకంలో ఎవరూ కనీసం "అయ్యో! పాపం!" అని ‘హాయ్ హాయ్’ (జాలి) కూడా ప్రకటించలేదు.


 2. తులసీ అనాథసో సనాథ రఘునాథ కియో, దియో ఫల సీలసింధు ఆపనే సుభాయకో ॥


* **అర్థం:** అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను (తులసీదాసును), అనాథగా ఉన్న నన్ను, ఆ శీల సముద్రుడైన రఘునాథుడు (శ్రీరామచంద్రుడు) చేరదీసి ‘సనాథుడిని’ (రక్షకుడు ఉన్నవాడిని) చేశాడు. తన దయా గుణమనే సహజ స్వభావం (సుభాయకో) చేత నాకు శ్రేష్ఠమైన ఫలాన్ని (భక్తిని, ఆశ్రయాన్ని) ప్రసాదించాడు.


3. నీచ యహి బీచ పతి పాఇ భరుహా ఇగో, బిహాఇ ప్రభు - భజన బచన మన కాయకో ॥


* **అర్థం:** (కానీ నేను చేసిన తప్పు ఏంటంటే...) ఇంతటి గొప్ప స్థితి దక్కిన ఈ మధ్య కాలంలో, నాచుట్టూ గౌరవ మర్యాదలు (పతి) పెరిగేసరికి, ఈ నీచుడనైన నేను అహంకారంతో కళ్ళు మూసుకుపోయాను (భరుహా ఇగో - గర్వపడ్డాను). నా మనసు, మాట (బచన), శరీరం (కాయ) ద్వారా భగవంతుడిని స్మరించడం, ఆ ప్రభువు భజన చేయడం పూర్తిగా విస్మరించాను/వదిలేశాను (బిహాఇ).


4. తాతేఁ తను పేషియత ఘోర బరతోర మిస, పూటి పూటి నికసత లోన రామరాయకో ॥


* **అర్థం:** ఆ కారణం చేతనే (భగవద్భక్తిని విస్మరించినందుకు), ఇప్పుడు నా ఈ శరీరంలో తీవ్రమైన, భయంకరమైన శారీరక వ్యాధి (ఘోర బరతోర - పెద్ద కురుపులు/వ్రణాలు) నెపంతో... నా రాముడి ఉప్పు (లోన రామరాయకో - ప్రభువు కృతజ్ఞతను మరిచినందుకు ఆయన ఋణం/ద్రోహం) చర్మం పగిలి (పూటి పూటి) బయటకు వస్తున్నట్లుగా అనిపిస్తోంది. నేను చేసిన కృతఘ్నతకు శిక్షగా ఈ బాధ అనుభవిస్తున్నాను.


**సారాంశం**


ఈ శ్లోకం లో తులసీదాస్ గారు భగవంతుని పట్ల తనకున్న ఆరాధనను, అలాగే మానవ సహజమైన పొరపాట్లను అత్యంత వినమ్రంగా ఒప్పుకుంటున్నారు.


"నేను దిక్కులేని వాడినై, దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు ఈ లోకం నన్ను పట్టించుకోలేదు. కానీ శ్రీరామచంద్రుడు నన్ను చేరదీసి ఆశ్రయం ఇచ్చాడు. అయితే, లోకంలో గౌరవమర్యాదలు దక్కేసరికి నేను అహంకారంతో త్రికరణశుద్ధిగా ఆ ప్రభువును భజించడం నిర్లక్ష్యం చేశాను. నేను చేసిన ఆ కృతఘ్నత (స్వామి ద్రోహం) వల్లే, నా శరీరంపై ఈ భయంకరమైన కురుపులు లేచాయి. నా ప్రభువు తిన్న ఉప్పు (విశ్వాసఘాతుకం) నా శరీరాన్ని చీల్చుకుంటూ బయటకు వస్తోందా అన్నట్లు ఈ బాధ ఉంది" అని ఆవేదన చెందుతూ, పశ్చాత్తాపంతో హనుమత్-రామ పాదాలకు తన్ను తాను సమర్పించుకుంటున్నారు.


🙏🌹*జై శ్రీరామ్ జై హనుమాన్*🙏🌹


   *🌹🌞సేకరణ🌞🌹*

     🙏*న్యాయపతి*🙏 

        *నరసింహారావు*