ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
4, మే 2026, సోమవారం
మాగాయ ఆవకాయ మధ్య
*మాగాయ ఆవకాయ మధ్య గల భేదము ఏమిటని అడిగారు*. ఇలా చెప్పా రు😌
మాగాయ:-
భార్యా బిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిలా లోపలి టెంకను, బయటి తొక్కనూ "తొక్కలే" అని వదిలించుకుని....
అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకుని లాగా ఆరుబయటకో డాబా మీదకో పోయి...
పంచాగ్నుల మధ్య తపస్సును చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి...
సిద్ధిని పొందిన ఋషిలా ముక్కలు ఎండి స్థిరత్వాన్ని పొందాక...
బయటకు నిర్లేపుడు, నిర్మోహుడులా కనిపించినా అంతరాంతరాలలో మాత్రం
నరుల పట్ల కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతలా...
బయటకు ఎండిపోయి రంగుమారి గట్టిగా ఒరుగై పోయినా లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని...
అరిషడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన యతిలా, తను విడిచి వెళ్లిన ఊటలోకి మళ్ళీ తానే దూకి,
మఠం పెట్టిన స్వామీజీ శిష్య గణాన్ని, భక్త జనులనూ కలుపుకున్నట్లు
ఉప్పూ కారం మెంతిపిండీ, ఆవపిండి తదితరాలను కలుపుకుని...
ఆ స్వామీజీ ప్రవచనాలు, మంత్రోపదేశాలూ, శక్తిపాతాలూ లాంటి విశేషాలతో విరాజిల్లినట్లుగానే...
నూనె, ఇంగువ, కరివేపాకు వంటి తిరగమోత విశేషాలతో తానూ గుబాళిస్తూ...
'మానవసేవే మాధవసేవ' అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది మాగాయ!
****
ఆవకాయ:-
"సాధన చేయటానికి ఆలుబిడ్డలను త్యజించక్కరలేదు, వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా" అనుకునే వివాహితునిలా...తొక్క టెంకె ఏవీ త్యజించకుండా.. పైగా వాటినీ తనతో పాటు పచ్చడి మార్గంలో ప్రవేశపెట్టి,
"సిద్ధిని పొందటానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు" అనుకుని పూజా మందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థులా...
ఇంట్లో నీడ పట్టునే ఉండి, ఉన్న బేసిన్లోనే ఉప్పూ కారం, నూనె, ఆవపిండి , మెంతిపిండి కలుపుకుని,
బంధు మిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తాను అందుకుంటూ, వారికీ తన సద్గుణాలు నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిలా...
తనతోపాటు శనగలు, వెల్లుల్లి వంటి వాటినీ కలుపుకుని, వాటికి తన రుచినీ తనకు వాటి రుచినీ ఆపాదించుకుంటూ ...
"నేను నేనుగానే ఉండి, ఉన్నచోట నుండే సాధన చేసి మానవసేవా, మాధవసేవ రెండూ చేయగలను" అని....
చతుర్విధ పురుషార్థాలనూ గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది ఆవకాయ.
సౌజన్యం : అజ్ఞాతవాసి
మంగళవారం🍁* *🌹05, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁మంగళవారం🍁*
*🌹05, మే, 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*సంకష్టహర చతుర్థి*
*చంద్రోదయం రా 09.43*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*వైశాఖమాసం - కృష్ణపక్షం*
*తిథి : చవితి* పూర్తిగా రోజంతా *రాత్రితో సహా*
*వారం : మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : జ్యేష్ఠ* మ 12.55 వరకు ఉపరి *మూల*
*యోగం : శివ* రా 12.17 వరకు ఉపరి *సిద్ధ*
*కరణం : బవ* సా 06.37 *బాలువ* పూర్తిగా రాత్రంతా
*సాధారణ శుభ సమయాలు*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం : *ఈరోజు లేదు*
అభిజిత్ కాలం : *ప 11.39 - 12.30*
*వర్జ్యం : రా 09.54 - 11.42*
*దుర్ముహూర్తం : ఉ 08.14 - 09.05 రా 10.57 - 11.42*
*రాహు కాలం :మ 03.16- 04.52*
గుళికకాళం : *మ 12.04 - 01.40*
యమగండం : *ఉ 08.52 - 10.28*
సూర్యరాశి : *మేషం*
చంద్రరాశి : *వృశ్చికం/ధనస్సు*
సూర్యోదయం :*ఉ 05.48*
సూర్యాస్తమయం :*సా 06.38*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.41 - 08.14*
సంగవ కాలం :*08.14 - 10.48*
మధ్యాహ్న కాలం :*10.48 - 01.21*
అపరాహ్న కాలం :*మ 01.21- 03.54*
*ఆబ్ధికం తిధి :వైశాఖ బహుళ చవితి*
సాయంకాలం :*సా 03.54- 06.28*
ప్రదోష కాలం :*సా 06.28- 08.42*
రాత్రి కాలం :*రా 08.42 - 11.42*
నిశీధి కాలం :*రా 11.42- 12.26*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.11 - 04.55*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🍁 హనుమకృత🍁*
*🍁సీతారామ స్తోత్రమ్🍁*
*సూర్య వంశ సముద్భూతమ్*
*సోమ వంశ సముద్భవాం*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
శతమానం భవతి
🌹🌷🪷🙌🛕🙌🪷🌷🌹
*శతమానం భవతి✋*
```
శుభకార్యాలలో మరియు ఆశీర్వచన సమయాలలో పఠించే ఆశీర్వాద మంత్రం
```
*శతమానం భవతి మంత్రం*```
“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి|”```
ఈ మంత్రం ఒక వ్యక్తి, సమూహం సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ చేసే ప్రార్థన.
“శతమానం భవతి” - ‘నీవు వంద సంవత్సరాల కాలం జీవించు గాక!’ (శతము అంటే వంద).
“శతాయుః పురుషః” - ‘వందేళ్ల ఆయుష్షు కలిగి ఉండు గాక!’
“శతేంద్రియ” - ‘వంద జ్ఞానేంద్రియ శక్తులు, వ్యాపారములు (చూపు, వినికిడి, శారీరక బలం … మొదలైనవి) కలిగి ఉండు గాక!’
“ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” - ‘ఇటువంటి సుదీర్ఘమైన ఆయుష్షు మరియు ఇంద్రియ శక్తిని పొంది, జీవితంలో సుస్థిరంగా నిలదొక్కుకో!’ అని భావం.
పుట్టినరోజులు, పెళ్లిళ్లు మరియు ఉపనయనాల సమయంలో పెద్దలు ఈ మంత్రాన్ని పఠిస్తూ అక్షింతలు వేసి దీవిస్తారు. కేవలం వందేళ్లు బ్రతకడమే కాకుండా, కళ్లు, చెవులు వంటి ఇంద్రియాలన్నీ వృద్ధాప్యంలో కూడా సరిగ్గా పనిచేయాలనేది ఈ మంత్రం వెనుక ఉన్న గొప్ప ఉద్దేశ్యం. ‘వందేళ్ల సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితం’ అందరికీ లభించాలని కోరుకునే అత్యంత శక్తివంతమైన వైదిక మంత్రం ఇది.
అయితే..
నూరు సంవత్సరాలు ఇంద్రియ పటుత్వం తో ఉండడమంటే దేహాభిమానమును ప్రోత్సహించటమా? ఇట్టి దేహాభిమానమును వేదం ఎందుకు చెపుతుంది? జ్యోతిశ్శాస్త్రం 120 సంవత్సరాలు ఆయుష్షు చెపుతుంది కదా! జపనీయులు మరియు అనేకులు 100, 120 సంవత్సరాలు పైగా జీవిస్తున్నారు కదా! అంటే వేద ప్రమాణమును ఏ విధంగా అర్ధం చేసుకోవాలి అన్న ప్రశ్న వస్తుంది.
దీనికి అద్వైత విచారణ సమాధానం చూపిస్తుంది. అద్వైత వేదాంత దృక్పథంలో (Non-dualism) ఏ మంత్రాన్నైనా కేవలం లౌకికమైన ఆయుష్షు లేదా ఆరోగ్యానికి పరిమితం చేయకుండా, ఆత్మ తత్వంతో ముడిపెట్టి చూస్తారు.
శతమానం (వంద సంఖ్య - పూర్ణత్వం) - అద్వైతంలో 'వంద' అనేది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, అది పూర్ణత్వానికి (Completeness) చిహ్నం. ‘శతమనంతం భవతి’ అన్నట్లు శతం అంటే అనంత వాచకం. పరి పూర్ణ వాచకం.
“ఓం పూర్ణమదః పూర్ణమిదమ్” అన్నట్లుగా, జీవుడు తనను తాను పరిమితమైన దేహంగా కాకుండా, అనంతమైన, పూర్ణమైన బ్రహ్మముగా గుర్తించడమే అసలైన 'శతమానం'.
“శతాయుః” (నిత్యత్వం) - సాధారణంగా ఆయుష్షు అంటే పుట్టుకకు, మరణానికి మధ్య ఉండే కాలం. కానీ అద్వైత పరిభాషలో ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అది 'కాలాతీతం'. కాలానికి కట్టుబడని నిత్యమైన ఆత్మ స్థితిని పొందడం. అంటే, దేహం నశించినా నేను (ఆత్మ) శాశ్వతమైనవాడిని అనే ఎరుకతో ఉండటమే నిజమైన దీర్ఘాయుష్షు.
“శతేంద్రియః” (ఇంద్రియాల ఉపసంహరణ) - మంత్రంలో 'వంద ఇంద్రియాలు' అని ఉన్నప్పటికీ, అద్వైత సాధనలో ఇంద్రియాలను బయటి ప్రపంచం వైపు బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం చేయడం ముఖ్యం. బాహ్య ప్రపంచంలోని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల పట్ల వ్యామోహం వీడి, అన్ని ఇంద్రియ శక్తులను ఏకం చేసి 'సాక్షి చైతన్యం' (Witness Consciousness) లో నిలపడమే ఇంద్రియ జయం.
“ప్రతితిష్ఠతి” (స్థితప్రజ్ఞత) - మంత్రం చివరలో 'ప్రతితిష్ఠతి' అంటే 'ప్రతిష్ఠితం కావడం' లేదా 'స్థిరపడటం' అని అర్థం. స్థితప్రజ్ఞతను సూచిస్తుంది. మాయా ప్రపంచంలోని హెచ్చుతగ్గులకు లోనుకాకుండా, “అహమ్ బ్రహ్మాస్మి” (నేనే బ్రహ్మమును) అనే నిశ్చలమైన జ్ఞానంలో స్థిరపడటమే ఈ మంత్రం యొక్క పరమార్థం.
ఈ మంత్రం ఒక వ్యక్తిని “నీవు పరిమితమైన జీవివి కాదు, నీవు అనంతుడవు" అని గుర్తుచేసే *మహావాక్య సదృశ్యం*
లౌకిక అర్థంలో ఈ మంత్రం వందేళ్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరుకుంటే, అద్వైత అర్థంలో ఇది‘జీవన్ముక్తి’ని కోరుకుంటుంది. నేను కేవలం ఈ శరీరాన్ని కాదు, సర్వవ్యాప్తమైన చైతన్యాన్ని అని తెలుసుకోవడమే ఈ మంత్రం ఇచ్చే అద్వైత ఆశీర్వచనం.```
*🌷సేకరణ🌷*
🌹🌷🙌🙌🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
పౌష్టికాహారం
పౌష్టికాహారం తీసుకునే వారి లక్షణాలు -
• శరీర నిర్మాణము -అంగసౌష్టవమగు శరీరము .
• బరువు -ఎత్తుకు తగిన బరువు .
• కండరాలు -పుష్టిగా , గట్టిగా ఉండటం.
• చర్మము -చక్కగా , కొద్ది తేమను కలిగి ఉండటం .
• వెంట్రుకలు -మృదువుగా నిగనిగలాడుతూ ఉండటం.
• కళ్లు -తేజోవంతమైన కళ్లు , కళ్ళ కింద చారలు లేకుండా ఉండటం .
• మనిషితీరు -ఛాతి ముందుకు , చదునైన భుజాలు , పొట్ట లోపలికి లాగినట్లు ఉండే సరియగు తీరు .
• నిద్ర -కలతలు లేని సుఖనిద్ర.
• జీర్ణశక్తి -జీర్ణశక్తి బాగా ఉండి , సునాయాసంగా మలవిసర్జన చేయుట .
• ఆకలి -వేళకు సరియగు ఆకలి.
. పైకి కనిపించే తీరు -చలాకీగా , ఉల్లాసముగా , అలసట లేకుండా ఉండటం . పైన చెప్పిన లక్షణాలు ఏ కొన్ని లేకుండినను మనం మన శరీరానికి అవసరం అయిన పౌష్టిక ఆహారం తీసుకోవడం లేదనే విషయాన్ని గుర్తుంచుకొని మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి .
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
శరణాగతికి మార్గం
🌹════❀🌻🌿❀══🌻══❀🌿🌻❀════🌹
*శరణాగతికి మార్గం - శ్రీ చంద్రమౌళీశ్వర స్తవము (శివ రహస్యము)*
*శివ రహస్య గ్రంథంలోని "శ్రీ చంద్రమౌళీశ్వర స్తవము" అత్యంత శక్తివంతమైన స్తుతి. సాక్షాత్తు శివగణాలే పరమేశ్వరుని కీర్తిస్తూ చేసిన గానం ఇది. ఇందులో కేవలం శివుని రూపాన్నే కాకుండా, ఆయన ఈ సృష్టిలో 'తిలేషు తైలం' (నువ్వులలో నూనె) వలె ఎలా వ్యాపించి ఉన్నారో అద్భుతంగా వర్ణించారు.*
*మనలోని అజ్ఞానాన్ని తొలగించి, సచ్చిదానంద స్థితిని పొందడానికి, ఆ చంద్రమౌళీశ్వరుని శరణు కోరడమే మార్గమని ఈ స్తోత్రం తెలియజేస్తుంది. కైలాసవాసుని కృప మనందరిపై ఉండుగాక!*
🌷 *శ్రీ చంద్రమౌళీశ్వర స్తవః* 🌷
*యస్మిన్ జగత్సర్వమిదం విభాతి యశ్చాప్యనన్యః సకలప్రపంచాత్ తిలేషు తైలోపమమాస్థితం త్వాం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః 1 *
ఎవరి యందైతే ఈ సమస్త జగత్తు ప్రకాశిస్తోందో, ఎవరు ఈ సకల ప్రపంచము కంటే వేరు కాకుండా ఉన్నారో (అనగా జగత్తు అంతా ఆయన స్వరూపమే అయి ఉన్నదో), నువ్వుల గింజలలో నూనె ఏవిధంగా అంతర్లీనంగా ఉంటుందో, అదే విధంగా సృష్టి అణువణువునా నిండి ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వరుని మేము ఆశ్రయిస్తున్నాము.
*అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః త్వం సర్వభూతస్థితమాత్మరూపం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః 2 *
అణువు కంటే చిన్నవానిగా (సూక్ష్మంగా), మహత్తు కంటే గొప్పవానిగా (విరాట్ స్వరూపునిగా) ఉంటూ, సమస్త జీవరాశుల హృదయ గుహలో ఆత్మగా నిలిచి ఉన్నావో, సర్వభూతాలలో ఆత్మరూపంగా వెలుగొందుతున్నావో, అట్టి శ్రీ చంద్రమౌళీశ్వరుని మేము ఆశ్రయిస్తున్నాము.
*యః సర్వసాక్షి తమసః పరస్తాత్ విభాతి సర్వం కిల యస్య భాసా త్వామాగమాంతైరపి దుర్నిరూపం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః 3 *
ఎవరు సమస్తానికి సాక్షిగా ఉన్నారో, ఎవరు అజ్ఞానానికి (చీకటికి) ఆవల ఉన్నారో, ఎవరి ప్రకాశం చేతనే ఈ జగత్తంతా ప్రకాశిస్తోందో, ఉపనిషత్తుల చేత కూడా నిర్వచించడానికి సాధ్యం కాని అట్టి శ్రీ చంద్రమౌళీశ్వరుని మేము ఆశ్రయిస్తున్నాము.
*పుమానవిజ్ఞాయ శివం కదాచిత్ దుఃఖస్య నాంతం సముపైతి ధీరః త్వాం సచ్చిదానందమయం ప్రశాంతం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః 4 *
మంగళకరుడైన శివుని తెలుసుకోకుండా మానవుడు (ఎంత ధీరుడైనప్పటికీ) తన దుఃఖానికి అంతం చూడలేడు. సత్ (ఉనికి), చిత్ (జ్ఞానం), ఆనంద (సంతోషం) స్వరూపుడు, పరమ శాంతమూర్తి అయిన అట్టి శ్రీ చంద్రమౌళీశ్వరుని మేము ఆశ్రయిస్తున్నాము.
*అజం పురాణం పురుషం మహాంతం అనశ్వరం వాఙ్మనసాతిదూరమ్ జ్ఞానాత్మనాం హృద్యవభాసమానం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః 5 *
పుట్టుక లేనివాడు, సనాతనుడు, మహాపురుషుడు, నాశనం లేనివాడు, వాక్కుకు మరియు మనసుకు అందనివాడు, జ్ఞానుల హృదయాలలో నిరంతరం ప్రకాశించేవాడు అయిన అట్టి శ్రీ చంద్రమౌళీశ్వరుని మేము ఆశ్రయిస్తున్నాము.
*వదంత్యమీ యత్పదమేవ వేదా జ్ఞాతే తు యాస్మిన్ సకలం విబుద్ధమ్ త్వాం ప్రత్యగాత్మనమచింత్యశక్తిం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః 6 *
వేదాలు ఎవరి స్థానాన్ని కీర్తిస్తాయో, ఎవరిని తెలుసుకుంటే ఈ సమస్తం తెలుసుకున్నట్లవుతుందో, ప్రత్యగాత్మ (అంతరాత్మ) స్వరూపుడు, ఊహించలేనంతటి శక్తి గలవాడు అయిన అట్టి శ్రీ చంద్రమౌళీశ్వరుని మేము ఆశ్రయిస్తున్నాము.
*యం నిర్వికల్పేన సమాధినైవ తపస్వినశ్చేతసి వీతరాగాః ధ్యాయంతి తేజోమయమద్భుతం త్వాం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః 7 *
రాగద్వేషాలు విడిచిన తపస్వినులు తమ చిత్తంలో నిర్వికల్ప సమాధి స్థితిలో ఎవరిని ధ్యానిస్తారో, తేజోమయమైన, అద్భుతమైన స్వరూపం గల అట్టి శ్రీ చంద్రమౌళీశ్వరుని మేము ఆశ్రయిస్తున్నాము.
*త్రిలోచనం చంద్రకలావతంసం గంగాతరంగోల్లసదుత్తమాంగమ్ స్మేరాస్యమిష్టప్రదమష్టమూర్తిం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః 8 *
మూడు కన్నులు గలవాడు, చంద్రవంకను శిరోభూషణంగా ధరించినవాడు, గంగా తరంగాలతో ప్రకాశించే శిరస్సు గలవాడు, చిరునవ్వు చిందించే ముఖం గలవాడు, భక్తులు కోరిన వరాలిచ్చేవాడు, అష్టమూర్తి స్వరూపుడైన అట్టి శ్రీ చంద్రమౌళీశ్వరుని మేము ఆశ్రయిస్తున్నాము.
*అపారసచ్చిత్సుఖరాశిమేకం అనాదిమధ్యాంతమనంతరూపమ్ త్రిలోచనం నీలగలం ప్రశాంతం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః 9 *
అంతులేని సచ్చిదానంద సుఖరాశి (ఆనంద సముద్రం), ఏకైకడు, ఆది-మధ్య-అంతము లేనివాడు, అనంత రూపాలు గలవాడు, మూడు కన్నులు గలవాడు, నీలకంఠుడు, శాంతస్వరూపుడైన అట్టి శ్రీ చంద్రమౌళీశ్వరుని మేము ఆశ్రయిస్తున్నాము.
*కైలాసశైలేంద్రశిరస్తటేషు నగేంద్రపుత్ర్యా సహ సంవసంతమ్ విభూతిరుద్రాక్షవిభూషితాంగం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః 10 *
కైలాస పర్వత శిఖరంపై పర్వతరాజ పుత్రిక అయిన పార్వతీ దేవి సమేతంగా నివసించేవాడు, విభూతి మరియు రుద్రాక్షలతో అలంకరింపబడిన దివ్యమైన శరీరం గలవాడు అయిన అట్టి శ్రీ చంద్రమౌళీశ్వరుని మేము ఆశ్రయిస్తున్నాము.
*పశ్యంతి యన్న శ్రుతయః శిరస్థం శిరఃస్థితం వస్త్వివ సర్వలోకాః త్వామాత్మభూతం జగతాం త్రయాణాం శ్రీచంద్రమౌళీశ్వరమాశ్రయామః 11 *
తలపై ఉన్న వస్తువును మనిషి ఎలాగైతే చూడలేకపోతాడో (అది తనతోనే ఉన్నా గుర్తించలేడో), అలాగే వేదాలు సైతం ఎవరిని పూర్తిగా దర్శించలేకపోతున్నాయో, మూడు లోకాలకు ఆత్మస్వరూపుడై ఉన్న అట్టి శ్రీ చంద్రమౌళీశ్వరుని మేము ఆశ్రయిస్తున్నాము.
*ఇతి శివరహస్యాంతర్గతే గణైః కృత శ్రీ చంద్రమౌళీశ్వర స్తుతిః ||*
*ఈ విధంగా "శివ రహస్యం" అనే గ్రంథం అంతర్గతంలో ఉన్న, శివగణాలచే రచింపబడిన (గానం చేయబడిన) "శ్రీ చంద్రమౌళీశ్వర స్తుతి" సమాప్తమైనది.*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మార్జాల కిశోర న్యాయం:*
*మార్జాల కిశోర న్యాయం:*
మార్జాలం అంటే పిల్లి.కిశోరం అంటే పిల్ల.పిల్లి తన పిల్లల్ని తనే రక్షించు కొంటుంది. పిల్లి కనిన తరువాత ఆపిల్లల్ని నోటితో పట్టుకొని వేరు వేరు ప్రదేశాలలో ఉంచుతూ అవి పెద్ద అయ్యేదాకా కాపాడుతూ ఉంటుంది.అలాగే మనం ముందుగ భగవంతుని ఆశ్రయించి ఉంటే ఆస్వామి ఎందరినో కాపాడినట్లు “మార్జాల కిశోర న్యాయంలా”భక్తులను కాపాడుతాడు అని ఈన్యాయం తెల్పుతుంది .
*మర్కట కిశోర న్యాయం:*
కోతి పిల్ల తల్లి పొట్టని పట్టుకొనే ఉంటుంది .తల్లి కోతి,చెట్ల మించి ఎగిరి దూకేటప్పుడు పిల్ల కోతి తన రక్షణ తనే చూసుకొంటూ ఉంటుంది.అని తెల్పేదే “మర్కట కిశోర న్యాయం” సదా ఆ స్వామినే పిల్లకోతి తల్లిని పట్టుకొని ఉన్నట్లు మనం ఆశ్రయించి ఉండాలి అనితెల్పేదే “మర్కట కిశోరన్యాయం.
*భ్రమర కీటక న్యాయం*
దీన్ని గురించి క్లుప్తంగా.... భ్రమరం (తుమ్మెద) కీటకాన్ని (ఒక రకమైన పురుగు) తనతో తెచ్చుకొని దానిచుట్టూ ఝుంకారం చేసుకుంటూ పదే పదే తిరుగుతుంది.అలా తిరిగేటప్పుడు మొదట భయంగా,తర్వాత ఏకాగ్రతగా,అటుపై తనను తానే పూర్తిగా మరచిపోతుంది కీటకం.ఆ మైమరపులో కొద్దిరోజుల తర్వాత తానే భ్రమరంగా మారిపోతుంది కీటకం. ఇదే భ్రమర కీటకన్యాయం!అదే భావనతో భక్తుడు కూడా భగవంతుని మైమరచి తలుస్తే ,భక్తుడు సగుణరూపంలో ఉన్న భగవంతుడు అవుతాడని వేదాంతం తెలుపుచున్నది.
సోమవారం,మే.4,2026
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻సోమవారం,మే.4,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం - వసంత ఋతువు
వైశాఖ మాసం - బహుళ పక్షం
తిథి:తదియ రా2.50 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:అనూరాధ ఉ8.04 వరకు
యోగం:పరిఘము రా9.40 వరకు
కరణం:వణిజ మ1.50 వరకు తదుపరి భద్ర రా2.50 వరకు
వర్జ్యం:మ2.16 - 4.03
దుర్ముహూర్తము:మ12.21 - 1.12
మరల మ2.53 - 3.44
అమృతకాలం:రా12.55 - 2.42
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి:మేషం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.38
సూర్యాస్తమయం:6.15
డొల్లు కర్తరి ప్రారంభం
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
.
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం - తృతీయ అనూరాధ - ఇందు వాసరే* (04.05.2026)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
---------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
వానప్రస్థ ధర్మం అంటే ఏమిటి
*వానప్రస్థ ధర్మం అంటే ఏమిటి?*
(Life of Retirement)
గతంలో పెద్దలు కుటుంబానికి మార్గదర్శకులు, సంస్కారాలకు ప్రతీకలు, అనుభవానికి నిలయాలుగా ఉండేవారు. కానీ నేటి పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. నా బాధ్యతలు నేను నిర్వహించాను. ఇక ఎవరి కుటుంబాల వారివి. నా శేష జీవితాన్ని నాకు అనుకూలంగా, ఎవరికీ అడ్డం లేకుండా నా అభిరుచులకు అనుగుణంగా జీవిస్తాను అన్న దృక్పథం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఆధునిక కాలంలో వానప్రస్థంగా భావించబడుతున్నప్పటికీ, శాస్త్రాలు చెప్పిన వానప్రస్థ ధర్మం ఇదికాదు. ఇది ఆధునిక కాలం తనకు అనుకూలంగా నిర్వచించుకున్న వానప్రస్థం. బాధ్యతారాహిత్యానికి వేసుకున్న ఒక చక్కని ముసుగు.
మన ధర్మశాస్త్రాలు నిర్వచించిన చతుర్వర్ణ ఆశ్రమాల్లో వానప్రస్థం ఒకటి. భౌతిక ఆసక్తుల (ధనం, కుటుంబం) నుంచి విముక్తి. అంటే ఎవరు గదిలో వారు కూర్చొని "కృష్ణా రామా" అనుకోవడం కాదు. శాస్త్రాలు అంతవరకే నిర్వచించలేదు, సమాజానికి మార్గదర్శకత్వం వహించడం, తదుపరి తరానికి విలువలను అందించడం, అనుభవాన్ని పంచుకోవడం అనే పవిత్ర కర్తవ్యం వానప్రస్థం. అంటే సమాజం పట్ల పెరిగిన మరింత బాధ్యత. అది సమాజంలో ఆధ్యాత్మిక మరియు సంస్కార చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించే బాధ్యత. మన పరిధిలో కూర్చుని ఉండటం కంటే, మనం సమాజానికి అందించిన రేపటి తరాన్ని (పిల్లలు, యువత) సరైన సంస్కార మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి. సనాతన ధర్మం ప్రకారం, కుటుంబంలో పెద్దవారు (వృద్ధులు) కుటుంబానికి, సమాజానికి ఎలా ఉపయోగపడాలో ఆలోచించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే *లోకాన్ని వదిలేయడం కాదు, లోకానికి మార్గం చూపడం వానప్రస్థం.*
Mantra - 29
Mantra - 29 ARUNAM 3 anuvaakam
కాలచక్రంతో లేదా ప్రకృతి నియమాలతో పొత్తు కుదరని ప్రాణులు క్రమంగా క్షీణిస్తాయని నిన్నటి మంత్రం చెపితే ఈ రోజు అవే జీవనాధారం అవుతున్నాయి అని అరుణం చెపుతోంది.
"యాః ప్రతితిష్ఠన్తి|
సంవథ్సరే తాః ప్రతితిష్ఠన్తి।
వర్షాభ్య ఇత్యర్థః||”
“యాః ప్రతితిష్ఠన్తి” - ఏ ప్రజా సమూహాలు లేదా జీవరాశులు అయితే ఈ భూమిపై సుస్థిరంగా నిలదొక్కుకుంటాయో,
"సంవథ్సరే తాః ప్రతితిష్ఠన్తి” - అవి ఆ 'సంవత్సర' స్వరూపమైన కాలంలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి. అంటే కాలక్రమం తప్పకుండా జరిగే ప్రకృతి మార్పులకు లోబడి ఉండటమే వాటి మనుగడకు రహస్యం.
“వర్షాభ్య ఇత్యర్థః” - ఇక్కడ 'సంవత్సరం' అంటే ‘వర్షం’ అని అర్థం. అంటే వర్షం వల్లే సర్వ ప్రాణులు ప్రతిష్ఠను (సుస్థిరతను) పొందుతున్నాయి. వేద పరిభాషలో ‘సంవత్సరము’ అనే పదానికి, ‘వర్షము’ (Rain/Monsoon) అనే పదానికి విడదీయలేని సంబంధం ఉంది. 'వర్షం' అనే మాటకు ఒక ఏడాది అని కూడా అర్థం (ఉదాహరణకు: 60 ఏళ్ళను 60 వర్షాలు అంటాం). వర్షం కురిస్తేనే ఆహారం, ఆహారం ఉంటేనే ప్రాణికి ఉనికి. అందుకే "వర్షాభ్య ఇత్యర్థః" అని స్పష్టం చేయబడింది.
అరుణప్రశ్నలోని ఈ భాగాలు సూర్యుడు ఏ విధంగా నీటిని ఆవిరిగా మార్చి, తిరిగి వర్షంగా కురిపించి, ఈ లోకంలోని జీవులన్నింటికీ "ప్రతిష్ఠ" (స్థిరత్వం) కల్పిస్తున్నాడో వివరిస్తాయి. సూర్యుడు తన కిరణాల ద్వారా (చక్షుషీ) లోకాన్ని రంజింపజేస్తూ, కాలచక్రం ద్వారా ప్రాణుల పెరుగుదలకు, స్థితికి కారకుడవుతున్నాడు. ఆ కాలచక్రమే వర్ష రూపంలో మనకు జీవనాధారాన్ని ఇస్తోంది.
తత్వాన్ని విచారిస్తే…
అద్వైత దృష్టిలో ఈ మంత్రం ఇచ్చే అంతరార్థం ఏమిటంటే - సంవత్సరమే బ్రహ్మ (Time as Brahman). ఉపనిషత్తులు "అన్నం బ్రహ్మేతి వ్యజానాత్" (అన్నమే బ్రహ్మమని తెలుసుకో) అని చెప్పినట్లుగా, ఇక్కడ కాలాన్ని లేదా సంవత్సరాన్ని బ్రహ్మగా ఉపాసించమని చెబుతున్నాయి.
లోకంలో ప్రతి వస్తువుకు ఒక ఆధారం ఉండాలి. తరంగాలకు సముద్రం, నగలకు బంగారం ఎలా ఆధారమో, ఈ చరాచర జగత్తుకు కాలము (సంవత్సరము) ఆధారము.
అద్వైత పరంగా, కాలాతీతమైన బ్రహ్మమే మనకు కాల స్వరూపంగా కనిపిస్తోంది. మనం దేనినైతే 'ఉనికి' (Existence) అని పిలుస్తున్నామో, అది ఆ పరమాత్మ యొక్క ప్రతిష్ఠయే.
ప్రతిష్ఠా తత్వం (The Foundation of Being) -
‘ప్రతితిష్ఠన్తి’ అంటే నిలబడటం. ఏ వస్తువూ శూన్యంలో నిలబడదు. ఈ ప్రాణులన్నీ కాలము అనే చైతన్య ప్రవాహంలోనే పుట్టి, పెరిగి, నిలబడుతున్నాయి.
అద్వైత సాధకులు ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే - కనిపించే ప్రాణులు (దృశ్యం) మారుతూ ఉండవచ్చు, కానీ అవి దేని మీద నిలబడ్డాయో ఆ 'సంవత్సరము' లేదా 'కాలము' (అధిష్ఠానం) సత్యమైనది. ‘సర్వం బ్రహ్మమయం’ అన్నట్లు, ప్రతి వస్తువులోనూ ఉన్న 'ఉనికి' ఆ పరమాత్మదే.
వర్షాల వల్ల ఇవన్నీ నిలబడుతున్నాయి అని చెప్పడంలో ఒక భౌతికమైన మరియు ఆధ్యాత్మికమైన అర్థం ఉంది. భౌతికంగా - వర్షం వల్ల అన్నం, అన్నం వల్ల జీవుల ఉనికి సాధ్యం. ఆధ్యాత్మికంగా - వర్షం అనేది పరమాత్మ యొక్క అనుగ్రహానికి (Grace) సంకేతం. బ్రహ్మ కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, అది సర్వవ్యాపకమై ఉండి ప్రతి ప్రాణిని పోషిస్తోంది. ఆ పోషణ (Sustenance) లేనిదే ఏదీ నిలబడదు. వర్షాభ్యః అంటే అనుగ్రహ శక్తి (The Grace of Sustenance).
అభేదత్వం (Non-duality) - ప్రాణులు వేరు, సంవత్సరం వేరు కాదు. సంవత్సరం లోపలే ప్రాణులు ఉన్నాయి. అలాగే బ్రహ్మ కంటే వేరుగా ఈ జగత్తుకు ఉనికి లేదు. ఒక కుండ మట్టిలో ఎలా ప్రతిష్ఠితమై ఉంటుందో (మట్టి లేనిదే కుండ లేదు), అలాగే ఆత్మ చైతన్యం లేనిదే ఏ ప్రాణీ ప్రతిష్ఠితం కాలేదు.
ఈ విశ్వంలో మనకు కనిపించే స్థిరత్వం (ప్రతిష్ఠ) అంతా ఆ పరమాత్మ స్వరూపమైన కాలచక్రం మీదనే ఆధారపడి ఉంది. వర్షం ఎలాగైతే ప్రాణకోటికి ఆధారమో, ఆ పరమాత్మ చైతన్యమే నీ ఉనికికి ఆధారం. ఆ మూలాన్ని (సంవత్సరాన్ని/బ్రహ్మాన్ని) గుర్తించినవారు అచంచలమైన శాంతిని పొందుతారు.
