*వ్యాక్సినేషన్ ప్రక్రియ*
--------------------------------------------
ప్రతి రోజు మన దేశాన్ని దుమ్మెత్తి పొసే, విషం చిమ్మే భారత వ్యతిరేక శక్తులు ' సైలెంట్ ' అయిపోయాయి. ఎందుకో ?
పాపం , కోవిడ్ దెబ్బకు భారత్ సర్వనాశనం అవుతుంది , వ్యాక్సీన్లు తయారుచేసుకోలేక , బయటినుండి కొనలేక , ముందు నుయ్యి , వెనుక గొయ్యి తరహాలో భారత కేంద్రప్రభుత్వం దారుణంగా విఫలమయ్యి , దేశంలోనూ , ప్రపంచదేశాల్లోనూ చెడ్డపేరు తెచ్చుకొంటుంది , అపుడు మనం శవాలపైకి రాబందులు వచ్చి వాలినట్టు వాలిపోయి , పీక్కుతిని సంతోషిద్దాం అనుకొన్న శక్తుల మెరుపుకలలు , పీడకలలుగా మారిపోయాయి.
మన దేశం ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి 73 , 80 , 43 , 125 మందికి వ్యాక్సీన్ వేసింది. ఈ సందర్భంగా భారత కేంద్రప్రభుత్వానికి , శాస్త్రవేత్తలకు , డాక్టర్లు , ఇతర వైద్య సిబ్బందికి , [ కేరళ , మహారాష్ట్ర మినహా ] అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హృదయపూర్వక అభినందనలు . ఎందుకంటే కేరళ , మహరాష్ట ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలే అక్కడ కోవిడ్ కేసులు , మరణాలు విపరీతంగా పెరిగేందుకు కారణమయ్యాయి కాబట్టి .
ఆ భారత వ్యతిరేక శక్తులు ఏవి ?
.ఫిబ్రవరి 26 , 2021 నాడు ' The Hindu అనే ఇంగ్లీషు దినపత్రిక ఇలా వ్రాసింది[ వ్యాసం చివర లింక్ కూడా ఇచ్చాను] : '' జూలై 2021 చివరి కల్లా దేశంలో 40 కోట్ల మందికి టీకాలు వేస్తామని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. కానీ అది అయ్యేపని కాదు.''
**కానీ జరిగిందేమిటి ? జూలై 17 కల్లా 40 కోట్ల మందికి టీకా వేయగలిగాం*. జూలై లో ఇంకా 14 రోజులు మిగిలివుండగానే లక్ష్యం చేరుకొన్నాం. పాపం ,కమ్యూనిస్టు ' ది హిందూ ' పత్రిక ఎంత బాధపడి వుంటుందో ! ఇదే పత్రిక ఈ సంవత్సరం చైనా స్వాతంత్రదినోత్సవం రోజున ఇక్కడ భారత్ లో తన పత్రికలో అత్యధిక పేజీలు కేటాయించి చైనా చేసిన ప్రగతి ని తెగ మెచ్చుకొంది. అంత పెద్ద ఎత్తున చైనా ప్రభుత్వం ' ది హిందూ ' పత్రికకే యాడ్ లు , అందుకయ్యే డబ్బులు ఇచ్చింది ? ఎందుకంటే చైనాది , ది హిందూ పత్రికది ఒకే సిద్ధాంతం కాబట్టి ! భారత - వ్యతిరేక కమ్యూనిస్టు సిద్ధాంతం .
మరో కమ్యూనిస్టు పత్రిక The Wire వ్రాసింది : '' చూడండి , న్యూజిలాండ్ ఎంత చక్కగా టికాలో వేస్తున్నదో ! అందుకే ఓ న్యూజిలాండ్ ప్రధాని అయిన Jacind Ardern గారూ , మీరు ఇండియాకు వచ్చి ఇక్కడి కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి ''
అవునా ? ఈ మూర్ఖ జర్నలిస్టులకు దిల్లీ నుండి వెళ్ళి న్యూజిలాండ్ లో వుంటున్న మన భారత మహిళ చక్కటి జవాబు ఇచ్చింది : *మీకు తెలియని విషయాలు వ్రాయకండి. నేను న్యూజిలాండ్ లో వుంటున్నాను. ఇక్కడి పరిస్థితి మీరు అంటూన్నట్టు లేదు. ఇప్పటికి మూడు మార్లు ' వచ్చి వ్యాక్సీన్ వేయించుకోండి ' అని నాకు మెసేజ్ వచ్చింది. వెళ్ళిన ప్రతి సారీ ' స్టాకు లేదు , మళ్ళీ పిలుస్తాం* '' అని చెప్పారు. నాకు ఇంకా వ్యాక్సీన్ వేయలేదు. నాలాగా ఇంకా చాలామంది వున్నారు.''
అయినా , న్యూజిలాండ్ జనాభా ఎంతండీ ? కేవలం 49.4 లక్షలు మాత్రమే. మన దేశంలో ఒక్క రోజు రైళ్ళలో ప్రయాణం చేసేవారి సంఖ్యనే 2.2 కోట్లు. ఏనుగును ఎలుకపిల్ల తో పోలుస్తారా ? వ్యాసం వ్రాసేముందు జర్నలిస్టులు home work చేయాల్సిన అవసరం లేదా ? మన దేశం జనాభా ఎంత ? వాతావరణం లో వైవిద్యతలు , ప్రతికూలతలు ఎన్ని ? విస్తీర్ణం ఎంత ? ప్రాంతాల మధ్య దూరం ఎంత ? వరదలు , వానలను అధిగమించి మన వైద్య సిబ్బంది చేస్తున్న ఈ మహా యఙ్ఞాన్ని గుర్తించి , గౌరవించాల్సిన బాధ్యత మనపై లేదా ?
*చుక్కల్లాంటి ఈ లెక్కలు చూడండి* !
రోజుకు మన ఉత్తరప్రదేశ్ వేస్తున్న టీకాలు - 11. 73 లక్షలు
వాళ్ళ అమెరికా వేస్తున్న టీకాలు - 8.07 లక్షలు
మన గుజరాత్ - 4.8 లక్షలు
వాళ్ళ మెక్సికో - 4.56 లక్షలు
మన కర్నాటక - 3.82 లక్షలు
వాళ్ళ రష్యా - 3.68 లక్షలు
మన మధ్య ప్రదేశ్ - 3.71 లక్షలు
వాళ్ళ ఫ్రాన్స్ - 2.84 లక్షలు
మన హర్యానా - 1.52 లక్షలు
వాళ్ళ కెనడా - 0.85 లక్షలు
*తిక్క కుదిర్చే మరిని లెక్కలు* !
ఇంగ్లాండు టీకా మొదలుపెట్టింది - 8 డిశెంబరు 2020
ఈరోజు దాకా వేసిన టీకాలు - 9 22 90 799
అమెరికా - 14 డిశెంబరు 2020
ఈ రోజు దాకా - 37 94 72 220
ఇటలీ - 27 డిశెంబరు 2020
ఈరోజు దాకా- 8 072 3 168
జర్మనీ - 27 డిశెంబరు 2020
ఈరోజు దాకా - 10 39 81 687
ఫ్రాన్స్ - 27 డిశెంబరు
ఈరోజు దాకా - 9 0854 758
భారత్ - 16 జనవరి 2021
ఈ రోజు దాకా - 73 80 43 125
చైనా రోజుకు సగటున వేస్తున్న టీకాలు - 61 52 286
*భారత్ రోజుకు సగటున వేస్తున్న టీకాలు - 76 58 911*
మరికొంత మంది [కేంద్ర ప్రభుత్వమంటే గిట్టని వారు ] అంటారు - 2 డోసులు తీసుకొన్న వారి శాతం అమెరికా లో చాలా ఎక్కువగా వుంది , ఇండియాలో చాలా తక్కువగా వుంది. కావచ్చు. లోపాలనే చూపాలనుకొనేవారు , మనం విజయాలు సాధించినపుడు ఎందుకు మౌనంగా వుంటారు ?
అమెరికా మరియు ఇతర దేశాల్లో వ్యాక్సీన్ ను అనుమానించి , వ్యాక్సీన్ వేయించుకోవద్దని చెపుతూ , కేంద్ర ప్రభుత్వం పంపిన వ్యాక్సీన్ ను నలభై , యాభై రోజులు వాడకుండా పెట్టుకొన్న రాష్ట్ర ప్రభుత్వాలు వున్నాయా ? *కేంద్ర ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టిన ప్రతిపక్ష పార్టీలు , నాయకులు , The Hindu , The Wire , The Print , NDTV లాంటి మీడియా సంస్థలు , అరుంధతీరాయ్ , రాణా అయూబ్ , బర్ఖా దత్ , సిద్దార్థ వరదరాజన్ , శేఖర్ గుప్తా లాంటి మేధావులు [ అట ] విదేశాల్లో వున్నారా* ?
కానీ భారత్ లో గజానికో గాంధారిపుత్రుడు !
*కీర్తి పతాకం ఎగరేసిన మన భారత శాస్త్రవేత్తలు* !
గతం
BCG టీకా ను విదేశాల్లో 1927 తీసుకువస్తే ఇండియాలో 1951 లో తయారుచేసి , 1978 లో అందుబాటులోకి తెచ్చారు. పోనీలే 1947 దాకా మనకు స్వాతంత్రం లేదు అనుకొంటే , DPT టీకా విదేశాల్లో 1948 లో వచ్చింది , ఇండియాలో 1978 లో అందుబాటు లోకొచ్చింది. OPV విదేశాల్లో 1961 లో వస్తే , ఇండియాలో 1978 దాకా రాలేదు , TT ఇంజక్షన్ విదేశాల్లో 1926 లో వస్తే ఇండియా లో 1983 లో అందుబాటు లోకొ వచ్చింది. 57 ఏళ్ళు పట్టింది ! Measles టీకా 1963 లో విదేశాల్లో ప్రవేశపెడితే , ఇండియాలో 1985 లో వచ్చింది , Hepatitis B టీకా విదేశాల్లో 1982 లో వస్తే , ఇండియా లో 2002 దాకా రాలేదు , Rotavirus టీకా విదేశాల్లో 2006 లోవస్తే , ఇండియా లో 2014-15 లో వచ్చింది. కానీ , కానీ , కానీ *COVID-19 టీకా మాత్రం విదేశాల్లో 2020 డిశెంబరు లో అందుబాటులోకి వస్తే భారత్ లో 2021 జనవరి లోనే అందుబాటులోకి వచ్చేసింది*. అంటే కేవలం 30 రోజుల తేడాతోనే !
1947 నుండీ ఈదేశాన్ని 2014 దాకా ఎక్కువ కాలం ఎవరు పరిపాలించారు ? ఆ సమయంలో సైన్సుకు , సైంటిస్టులకు ప్రోత్సాహం , ప్రేరణ ఇచ్చివుండింటే , అవసరమైన నిధులు , వసతులు ఇచ్చివుండింటే , విద్యాసంస్థలను తమ నాయకత్వాన్ని , తమ పార్టీని పొగిడేవాళ్ళతో కాక , ప్రతిభ , అంకితభావం , దేశభక్తి వున్న మేధావులతో నింపివుండింటే మన సైన్సు ఎంత గొప్పగా వుండిండేది !
మన శాస్త్రవేత్తలు ఇతర దేశాల శాస్త్రవేత్తలతో పోటీపడి ఇప్పుడు 2020-21 లో తమ ప్రతిభను చూపి , అతితక్కువ సమయంలో అద్భుతమైన టీకాను కనుక్కొని దేశాన్ని కరోనా నుండి కాపాడగలిగారు ? ఆ శాస్త్రవేత్తలకు , సంస్థలలకు ప్రేరణ , స్పూర్తి ఇచ్చి , ప్రోత్సహించి , పూర్తీ స్వేచ్చను కల్పించి, జాప్యం లేకుండా దండిగా నిధులను అందించిన దేశ నాయకత్వాన్ని - మన పార్టీలు , సిద్ధాంతాలు పక్కనపెట్టి - అభినందించకపోతే తప్పు మనదే అవుతుంది.
*ఇపుడు మనం చూస్తున్నది బానిసమనస్తత్వం కలిగిన ' ఇండియా ' కాదు , సమృద్ధ , సుధృఢ , ఆత్మనిర్భర ' భారత్. ' , వివేకానందుడు , అరవిందఘోష్ , సుభాష్ బోస్ , అంబేడ్కర్ , సివి రామన్ , హోమీబాబా ,Abdul Kalam కలలుగన్న భారతదేశం కోసం పనిచేద్దాం*🚩🚩🚩
భారత్ మాతాకీ జై.