18, సెప్టెంబర్ 2021, శనివారం

శ్రీమద్భాగవతము

 *18.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2265(౨౨౬౫)*


*10.1-1383-వ.*

*10.1-1384-*


*క. చేతులఁ దాళము లొత్తుచుఁ*

*జేతోమోదంబుతోడ సిగముడి వీడం*

*బాతర లాడుచు మింటను*

*గీతము నారదుఁడు పాడెఁ గృష్ణా! యనుచున్.* 🌺



*_భావము: అలా కంస సంహారం జరిగిన సమయంలో, నారదమహర్షి ఆకాశసంచారం చేస్తూ, చేతిలోని చిడతలతో వాయిస్తూ, మహానందభరితుడై, సిగముడి వీడిపోయినా గమనించుకోని వాడై, శ్రీకృష్ణలీలలను గానము చేస్తూ నృత్యము చేశాడు._* 🙏



*_Meaning: Sage Narada having observed the destruction of Kamsa, the evil man, from the sky, danced and sang in praise of the mystic and noble deeds of the Almighty Sri Krishna._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

కామెంట్‌లు లేవు: