ప్రశ్న పత్రం సంఖ్య: 31 జవాబులు కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
రామాయణ సంబంధిత ప్రెశ్నలు.
ఇతిహాసాలలో మొదటిది మరియు ఒక ఉత్తమపురుషుడు జీవనం ఎలాచేయాలి అనేది శ్రీ రాముని ద్వారా తెలుసుకోవాలని మన సాంప్రదాయాలలో శ్రీరాముని ఆదర్శ పురుషునిగా భావిస్తున్నాము. క్రింది ప్రశ్నలను పూరించటానికి ప్రయత్నించండి.
1. రామాయణాన్ని రచించింది ఎవరు. జవాబు: ఆదికవి వాల్మీకి
2.ఆదికవికి రామాయణాన్ని రచించటానికి ప్రేరేపించిన మహాముని ఎవరు. జవాబు: నారద మహాముని
3. శ్రీరాముని అక్కగారి పేరు ఏమిటి. జవాబు. శాంత (దశరథుని మిత్రుడైన రామపాదుని కుమార్తె.)
4. రామాయణంలో ఎన్ని కాండలు వున్నాయి జవాబు. 1) బాలకాండ, 2)అయోధ్యకాండ, 3)అరణ్య కాండ4) కిష్కింద కాండ, 5) సుందరా కండ 6) యుద్ధకాండ కాగా 7) ఉత్తరకాండ
ఏడు కాండములు (భాగములు) గా విభజింప బడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండలు, మొత్తం 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు). ఏడవ కాండము అయిన ఉత్తర కాండము వాల్మీకి రచన కాదంటారు. కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము.
5. రాముని సోదరులలో కవలపిల్లలు ఎవరు జవాబు. లక్ష్మణ,శత్రుఘ్నులు
6. నందిగ్రామము ఎవరి మేనమామయూరు జవాబు. భరతుని
7. దశరథమహారాజు మరణించినప్పుడు శ్రీరాముడు ఎక్కడ వున్నారు. జవాబు. అరణ్యంలో
8. కైకేయిని ప్రేరేపించింది ఎవరు ఆమె ఏదేశంనుండి వచ్చినది. జవాబు. మందార
9. ఇంటిగుట్టు లంకకు చేటు అనే సామెత ఎలా వచ్చింది. జవాబు. రావణుని మరణ రహస్యం విభిషణుడు రామునికి తెలుపుట వలన ఆ మాదిరిగా ఎవరైనా చేస్తే ఉపయోగించే వాక్యం.
10.సీతజాడతెలిపిం పక్షి ఎవరు. జవాబు.జటాయువు
11. పరమేశుని ఆత్మలింగాన్ని వరంగా పొందిన భక్తుడు ఎవరు. జవాబు. రావణబ్రహ్మ
12. సీతాదేవిని వివాహమాడటానికి శ్రీరాముడు చేసినది ఏమిటి. జవాబు. శివధనస్సు విరచటము
13. రామోవిగ్రహవాన్ ______జవాబు. ధర్మః
14. నదిదాటించింది ఎవరు, ఆ నడిపేరు ఏమిటి. జవాబు. గుహుడు, సరయు నది
15. శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు రధాన్ని నడిపిన సారధి ఎవరు. జవాబు. సుమంతుడు
16. శ్రీరాముని శరీరఛాయ ఏమిటి. జవాబు. నీలమేఘచాయ
17. శ్రీరాముడు మొదటిసారి హనుమంతుని చూసినప్పుడు ఆంజనేయులు ఏవేషంలో వున్నారు. జవాబు. బ్రాహ్మణ
18.తార ఎవరి భార్య జవాబు. వాలి భార్య
19. విశ్వామిత్రుడు రామాయణంలో ఏ కాండలో కనపడతాడు. జవాబు. బాలకాండ-
20. మధువనంను పాడుచేసింది ఎవరు జవాబు. సుగ్రీవుని సేన అయిన వానరులు.
21. ఎంగిలి పండ్లు ఎవరు ఎవరికి తినిపించారు. జవాబు. శబరి, తినిపించింది శ్రీరామచంద్రునికి.
22. శ్రీరాములవారి తల్లిగారి పేరు ఏమిటి. జవాబు. కౌసల్య
23. విశ్వామిత్రుడు దశరధుని ఏమి కోరాడు జవాబు. యాగసంరక్షణకు శ్రీరాముని పంపమని కోరారు.
24. భూమినుంచి పుట్టింది ఎవరు. జవాబు. సీతాదేవి
25. లక్ష్మణ రేఖ అంటే ఏమిటి. జవాబు. లక్ష్మణులు సీతాదేవికి రక్షణగా పర్ణశాలముందు గీసిన రేఖ
26. బంగారు లేడి రూపంలో వున్నరాక్షసుడు ఎవరు. జవాబు. మారీచుడు (తాటక అనే యక్షిణికి, సుందుని వల్ల కలిగిన కుమారుడు.)
27. పర్ణశాల అంటే ఏమిటి దీనిని నిర్మించినది ఎవరు. జవాబు. అరణ్యవాసంలో సీత,రామ లక్ష్మణులు నివసించటానికి నిర్మించుకున్న వసతి గృహం.
28. ముక్కుచెవులు కోసింది ఎవరు, ఎవరికి జవాబు. లక్ష్మణుడు, సూర్పనక్క ఈమె రావణుని సోదరి.
29. లంకను కాపలా కాసింది ఎవరు. జవాబు. లంకిణి
30. శ్రీరాముడు ఎవరి విమానంలో అయోధ్యకు చేరుకున్నారు. జవాబు. రావణుని విమానం, దానిపేరు పుష్పక విమానం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి